కోహ్లి- పుజారా
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు.
అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించాడు.
ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్‌తో ముందుకు వచ్చాడు.
స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్‌క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా?
లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు.
చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ!
With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️
— Stuart Broad (@StuartBroad8) February 24, 2024
Comments
Please login to add a commentAdd a comment