Ranchi Test
-
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా రాజ్‌కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. రాజ్‌కోట్‌లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్‌పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
Ind vs Eng: గోల్డెన్ డకౌట్.. ఇదేంటి సర్ఫరాజ్? నువ్విలా..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. ‘‘నిన్ను పొగిడితేనే బ్యాట్ ఝులిపించగలవా ఏంటి? అయినా ఇప్పటికే నీకు రావాల్సిన దానికంటే.. చాలా ఎక్కువ క్రెడిట్ వచ్చేసింది భయ్యా! ఇంకా పొగడటం మా వల్ల కాదు’’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ధ్రువ్ జురెల్ పేరును ప్రస్తావిస్తూ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు(62, 68 నాటౌట్) బాదాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. తద్వారా తొలి టెస్టులోనే ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా దిలావర్ హుసేన్, సునిల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అయితే, తన రెండో మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ పూర్తిగా తేలిపోవడం గమనార్హం. రాంచి టెస్టులో రెండుసార్లూ ఇంగ్లండ్ స్పిన్నర్ల చేతికే చిక్కాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ వికెట్‌ను.. టామ్ హార్లే, షోయబ్ బషీర్ దక్కించుకున్నారు. కాగా రాంచి మ్యాచ్‌లో విజయానికి టీమిండియా 52 పరుగుల దూరంలో ఉన్న సమయంలో సర్ఫరాజ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే, సర్ఫరాజ్ మాత్రం డగౌట్లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ మధ్య కూర్చుని చిల్ అవుతూ కనిపించాడు. "Mauj masti rukni nahi chahiye" vibes. pic.twitter.com/C2jRAfcrql — Silly Point (@FarziCricketer) February 26, 2024 ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. మొత్తంగా 129 పరుగులు చేసిన జురెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
Rohit Sharma: స్టోక్స్‌కు ఇదే తొలిసారి.. రోహిత్ రికార్డులివే!
విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ.. కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకున్నా యువ జట్టుతో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. విరాట్, షమీ సిరీస్ మొత్తానికి.. గాయం కారణంగా రాహుల్ రెండో టెస్టు నుంచి జట్టుకు దూరం కాగా... నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మినహా అంతగా అనుభవంలేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ రసవత్తర మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌లో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో గెలిచింది. సొంతగడ్డపై వరుసగా పదిహేడవ సిరీస్ విజయం సాధించింది. బజ్‌బాల్ యుగంలో తొలి కెప్టెన్‌గా ఘనత దీనికంతటికి రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బజ్‌బాల్’ యుగంలో ఇంగ్లండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించిన కెప్టెన్, బెన్ స్టోక్స్‌కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథి(ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA)గా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసి ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మ్యాచ్ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అర్ధ శతకం(55) బాదాడు రోహిత్. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో నాలుగు వేల రన్స్‌కు పైగా స్కోరు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఇంగ్లండ్‌పై వెయ్యి పరుగుల మార్కును కూడా దాటేశాడు హిట్‌మ్యాన్. చదవండి: Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్ వైరల్ -
Ind Vs Eng: టీమిండియా గెలుపుపై కోహ్లి స్పందన.. పోస్ట్ వైరల్
టీమిండియా సిరీస్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఇంగ్లండ్‌పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని కోహ్లి కొనియాడాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అతడు తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లి లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ బరిలో దిగింది. మరోవైపు.. కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సమస్యలతో అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో రజత్ పాటిదార్, మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేశారు. ఇక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వీళ్లలో రజత్ పాటిదార్ మినహా మిగతా ముగ్గురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విరాట్ కోహ్లి స్పందిస్తూ.. ‘‘అవును.. టీమిండియా గెలిచింది. అద్భుతమైన సిరీస్‌లో యువ జట్టు దేశాన్ని గెలిపించింది. పట్టుదల, అంకిత భావం.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం’’ అని పేర్కొన్నాడు. YES!!! 🇮🇳 Phenomenal series win by our young team. Showed grit, determination and resilience.@BCCI — Virat Kohli (@imVkohli) February 26, 2024 కాగా హైదరాబాద్ టెస్టులో ఓడి పరాజయంతో సిరీస్ ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్.. తాజాగా రాంచి టెస్టులో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి రాక గురించి తెలియజేసే పోస్ట్ తర్వాత.. కోహ్లి తాజాగా టీమిండియా విజయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చదవండి: #Rohit Sharma: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం.. వాళ్లు లేకపోయినా గెలిచాం! -
#IndvsEng: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం: రోహిత్ శర్మ
India vs England, 4th Test- Rohit Sharma Comments After Series Win: భారత గడ్డపై కూడా తగ్గేదేలేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా కళ్లెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ ‘బజ్‌బాల్’ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది. నాలుగో మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు గురైనా.. హ్యాట్రిక్ విజయాలతో సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్లు ఆ లోటును తీర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తమదైన ముద్ర వేయగలిగారు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ సిరీస్ ఆసాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా.. నాలుగో టెస్టులోనే సిరీస్ ఫలితం తేల్చగలిగాం. కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. మేము సాధించిన విజయాల పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్థానిక, దేశవాళీ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చేయగలరో చూపించారు టెస్టు క్రికెట్లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లు అవన్నీ దాటుకుని ఇక్కడి దాకా వచ్చి తమను తాము నిరూపించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత పరిణతితో ఆడాడు. కూల్‌గా, కామ్‌గా తన పని పూర్తి చేశాడు’’ అని రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇది సమిష్టి విజయమని.. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ఇలాంటి గెలుపు రుచి చూడటం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్‌రూం వాతావరణం బాగానే ఉన్నా.. బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు, చేసే వ్యాఖ్యలు కుర్రాళ్లపై కాస్త ఒత్తిడి పెంచాయని తెలిపాడు. అయితే, ఒత్తిడిని జయించి అద్బుత ప్రదర్శనలతో వారు తమను నిరూపించుక్ను తీరు అమోఘమని రోహిత్ శర్మ ఈ సందర్భంగా కొనియాడాడు. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది 4-1తో ట్రోఫీని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు జరుగనుంది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
#Ind vs Eng: టీమిండియాదే సిరీస్.. రసవత్తర మ్యాచ్‌లో ఆ ఇద్దరు ‘హీరోల’ వల్లే!
India vs England, 4th Test- India Beat England By 5 Wickets: రసవత్తరంగా సాగిన రాంచి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. గిల్, జురెల్ హీరోచిత ఇన్నింగ్స్ వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అద్భుత అజేయ అర్ధ శతకం(52)తో మెరవగా.. ధ్రువ్ జురెల్(39 నాటౌట్) మరో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయాలకు చేర్చాడు. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది భారత్. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లోనే తిరిగి పుంజుకున్న టీమిండియా.. వరుసగా విజయాలు సాధించింది. విశాఖపట్నం తర్వాత రాజ్‌కోట్.. తాజాగా రాంచి టెస్టులో గెలుపొంది ఇంగ్లండ్‌పై ఆధిపత్యాన్ని చాటుకుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్లో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ లేకున్నా యువ ఆటగాళ్లతోనే సిరీస్ గెలిచి సత్తా చాటింది రోహిత్ సేన. రాంచి టెస్టు రసవత్తరంగా సాగిందిలా.. రాంచి వేదికగా శుక్రవారం ఇంగ్లండ్‌తో మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. తొలిరోజు ఆట ఆరంభంలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వరుసగా వికెట్లు పడగొట్టడంతో మొదటి సెషన్లో పైచేయి సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఓ చెయ్యి వేయగా.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను జో రూట్ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల చేసి పైచేయి సాధించింది. జురెల్ ‘జువెల్’ ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో భాగంగా ఇంకో 51 పరుగులు జతచేసి.. 353 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 2 పరుగులకే అవుట్ కాగా.. రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్ ఖాన్(14) విఫలమయ్యారు. వన్‌డౌన్‌బ్యాటర్ శుబ్‌మన్ గిల్(38) ఫర్వాలేదనపించాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో జట్టును ఆదుకోగా.. మూడో రోజు ఆటలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. వికెట్లు పడుతున్నా కుల్దీప్ యాదవ్(28) సహకారంతో పట్టుదలగా నిలబడి 90 పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆదివారం నాటి ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు పూర్తి చేయగలిగింది. అశూ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలు ఇక అదే రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అయితే, నాలుగో రోజు ఆరంభంలోనే సీన్ రివర్స్ అయింది. ఇంగ్లండ్ పేసర్ యశస్వి జైస్వాల్(37)ను పెవిలియన్‌కు పంపగా.. స్పిన్నర్ టామ్ హార్లే రోహిత్ శర్మ(55)ను అవుట్ చేశాడు. బషీర్ భయపెట్టాడు.. గిల్, జురెల్ పూర్తి చేశారు ఇక రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్‌ను యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అతడి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌నూ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇలా షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియాను వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కలిసి గట్టెక్కించారు. ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి టీమిండియాను గెలిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో గిల్ అర్ధ శతకం(52), జురెల్ 39 పరుగులతో అజేయంగా నిలిచి హీరోలయ్యారు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు ఇంగ్లండ్ - 353 & 145 ఇండియా- 307 & 192/5 ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్ -
అరెరే రోహిత్..! అలా ఔట్ అయిపోయావు ఏంటి? వీడియో వైరల్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. భారత విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి. నాలుగో రోజు లంచ్ విరామానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(18),రవీంద్ర జడేజా(3) పరుగులతో ఉన్నారు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మంచి టచ్‌లో కన్పించిన హిట్‌మ్యాన్ ఊహించని విధంగా ఔటయ్యాడు. ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్ ఫుట్కు వచ్చి ఆడిన రోహిత్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ క్యాచ్ బంతిని అందుకున్న వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకున్నట్లు రిప్లేలో తేలడంతో క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకకపోయినా రోహిత్ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా 81 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు. చదవండి: IND vs ENG: వారెవ్వా.. 41 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్ pic.twitter.com/sqkKNjB7NC — Sitaraman (@Sitaraman112971) February 26, 2024 -
Ind Vs Eng: ‘అక్కడ పులి.. ఇక్కడ పిల్లి’?.. ఖేల్ ఖతమే ఇక!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో కూడా పూర్తిగా నిరాశపరిచి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్ పాటిదార్.. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ ఎట్టకేలకు 2023లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముప్పై ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక్క వన్డే. సాధించిన స్కోరు 22. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న పాటిదార్.. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 32, 9 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులోనూ ఆడే అవకాశం దక్కించుకున్న అతడు రాజ్‌కోట్(5,0)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ రాంచి టెస్టులో కూడా పాటిదార్‌కు ఛాన్స్ ఇచ్చింది మేనేజ్మెంట్. అయితే, ఇక్కడా పాత కథనే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేయగలిగిన పాటిదార్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి పాటిదార్ ఈ మేరకు విఫలమయ్యాడు. ఈ మూడు మ్యాచ్‌లలోనూ రజత్ పాటిదార్ స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకుని వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘ఆర్సీబీలో పులి.. టీమిండియాలో పిల్లి’’ అన్న చందంగా పాటిదార్ ఆట తీరు ఉందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పాటిదార్‌ను తప్పించి అతడి స్థానంలో అర్హుడైన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. Againnnnn😭😭 Patidar is promoting his edits more than anyone🤣pic.twitter.com/DY3x5d0yVO — unapologetic_analyst (@arham412003) February 26, 2024 Thank You Rajat Patidar 🦆 You will not be remembered #RajatPatidar #INDvENG pic.twitter.com/JNHOyYFkMF — sarcastic (@Sarcastic_broo) February 26, 2024 -
నా సహోదరుడా.. అంటూ రింకూ సింగ్ భావోద్వేగం
India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం. అలా తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్.. జురెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. జురెల్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధ్రువ్ జురెల్ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. రాంచి మ్యాచ్‌లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్‌గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. చదవండి: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! View this post on Instagram A post shared by Rinku 🧿🇮🇳 (@rinkukumar12) -
రాంఛీ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ సొంతం
India vs England 4th Test Day 4 Live Updates: భారత్ ఘన విజయం.. సిరీస్ సొంతం రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. టీమిండియా విజయంలో శుబ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. తద్వారా మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. నిలకడగా ఆడుతున్న జురెల్, గిల్.. రాంఛీ టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. భారత విజయానికి ఇంకా 23 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్ జురెల్(31), శుబ్‌మన్ గిల్(37) పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి చేరువలో భారత్.. టీమిండియా విజయానికి ఇంకా 37 పరుగులు కావాలి. స్కోరు: 155/5 (50). గిల్, జురెల్ నిలబడితే టీమిండియా ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంతో కష్టాల్లో పడ్డ భారత జట్టును ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్ గట్టెక్కించే పనిలో పడ్డారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. 49వ ఓవర్ ముగిసే సరికి గిల్ 30, జురెల్ 21 పరుగులు చేశారు. బషీర్ స్పిన్ మ్యాజిక్.. కష్టాల్లో టీమిండియా లంచ్ విరామం తర్వాత టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 39 ఓవర్ వేసిన బషీర్ వరుస బంతుల్లో జడేజా, సర్ఫరాజ్ ఖాన్‌ను ఔట్ చేశాడు. భారత విజయానికి ఇంకా 71 పరుగులు కావాలి. క్రీజులో గిల్(19), ధ్రువ్ జురెల్(1) ఉన్నారు. 39 ఓవర్లకు భారత స్కోర్: 121/5 లంచ్ బ్రేక్‌కు టీమిండియా స్కోర్: 118/3 లంచ్ బ్రేక్‌కు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్ గిల్(18), జడేజా(3) పరుగులతో ఉన్నారు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. రజిత్ పాటిదార్ మరోసారి నిరాశ పరిచాడు. బషీర్ బౌలింగ్‌లో పోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్(7) పరుగుతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి. రెండో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్.. రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారత విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. రోహిత్ శర్మ ఫిప్టీ.. రాంఛీ టెస్టులో విజయం దిశంగా భారత్ అడుగులు వేస్తోంది. 22 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 99 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం రోహిత్ శర్మ(52), శుబ్‌మన్ గిల్(4) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైశ్వాల్ ఔట్ 192 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. రూట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత స్కోర్: 85/1. టీమిండియా విజయానికి ఇంకా 107 పరుగులు కావాలి. విజయం దిశగా భారత్.. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(42), యశస్వీ జైశ్వాల్(25) ఉన్నారు. భారత విజయానికి ఇంకా 125 పరుగులు కావాలి. రాంఛీ వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత పట్టు బిగించింది. టీమిండియా సిరీస్ విజయానికి ఇంకా ఇంకా 152 పరుగుల దూరంలో నిలిచింది. 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు. -
'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ జురెల్‌కు తీవ్ర అన్యాయం'
ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్ను కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్‌ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్‌కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు. "ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్‌కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్‌కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్‌కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. "ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి బౌలర్‌గా
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్ గడ్డపై టెస్టుల్లో 351 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(350) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. చదవండి: IND vs ENG: పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే -
పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే
అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటిన టీమిండియా యువ వికెట్ కీపర్ దృవ్ జురల్.. తన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్ జురల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ, జడేజా, గిల్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట జురల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జురల్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తన విరోచిత పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి భారత జట్టును ఈ యూపీ ఆటగాడు అదుకున్నాడు. కుల్దీప్తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని దృవ్ నెలకొల్పాడు. అయితే జురల్ దురదృష్టవశాత్తూ తృటిలో తన తొలి సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో దృవ్ 90 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ చేయకపోయనప్పటికీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసును ఈ యువ వికెట్ కీపర్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దృవ్ జురల్ విరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు భారత్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 149 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: PSL 2024: పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్ -
మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జడేజా, గిల్, సర్ఫరాజ్ వంటి స్టార్ బ్యాటర్లు ఇంగ్లండ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న చోట.. కుల్దీప్ తన క్లాస్‌ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్ కేవలం 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్.. ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తన డిఫెన్స్‌తో ఇంగ్లండ్ స్పిన్నర్లకు విసుగు తెప్పించాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దృవ్ జురల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 131 బంతులు ఎదుర్కొన్న యాదవ్ 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఆఖరికి జేమ్స్ ఆండర్స్ బౌలింగ్‌లో కుల్దీప్ ఔటయ్యాడు. కాగా భారత తొలి ఇన్నింగ్స్‌లో అందరి కంటే ఎక్కువ బంతులు కుల్దీప్ యాదవే ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కుల్దీప్ అద్భుత ఇన్నింగ్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసింది 28 పరుగులే కానీ సెంచరీ కంటే ఎక్కువంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది అయితే "మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నాండంటూ" ఇంగ్లండ్‌ను ఉద్దేశించి పోస్టులు చేస్తున్నారు. కాగా రూట్ కూడా తన అద్బుత సెంచరీతో ఇంగ్లండ్‌ను అదుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 94 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. దృవ్ జురల్(59) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు వెనుకంజలో ఉంది. If You Have Joe Root Then We Have Sir Kuldeep Yadav .#INDvENG pic.twitter.com/spUiB8299a — ShivX #ExMIFan (@ShivX45) February 25, 2024 Meanwhile Rahul Dravid to Rajat Patidar after Kuldeep Yadav faced the maximum ball in the Indian inning 😅#INDvENG pic.twitter.com/Q2VWu4WhoP — Sujeet Suman (@sujeetsuman1991) February 25, 2024 -
IND vs ENG 4th Test: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
India vs England 4th Test Day 3 Live Updates: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..? భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగలు చేసింది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్ కలుపుకుని ఇంగ్లండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 4 వికెట్లతో రాణించగా.. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60), బెయిర్‌స్టో (30) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టీమిండియా లక్ష్యం 192 పరుగులు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 133 పరుగుల వద్ద ఇంగ్లండ్ మరో (ఎనిమిది) వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్ (0) ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. బెన్ ఫోక్స్‌కు జతగా షోయబ్ బషీర్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 133 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి టామ్ హార్ట్లీ (7) ఔటయ్యాడు. బెన్ ఫోక్స్‌కు జతగా ఓలీ రాబిన్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 120 పరుగుల వద్ద ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో (30) ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ, బెన్ ఫోక్స్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 120 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ (4) క్లీన్ బౌల్డయ్యాడు. జానీ బెయిర్‌స్టోకు (30) జతగా బెన్ ఫోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలే.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. 29 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 112/4. ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రూట్.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 17 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 66/3 16 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 64/2 ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ తిరిగి కోలుకునే ప్రయత్నం చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(38), రూట్(11) పరుగులతో ఉన్నారు. అశ్విన్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను అశ్విన్ దెబ్బ తీశాడు. 5 ఓవర్ వేసిన అశ్విన్.. వరుస బంతుల్లో బెన్ డకెట్(15), పోప్(0) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 19/2. క్రీజులో జాక్ క్రాలే, జో రూట్ ఉన్నారు. భారత్ ఆలౌట్.. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో దృవ్ జురల్ అద్బుతమైన పోరాట పటిమను కనబరిచాడు. తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జైశ్వాల్(73), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్ హార్ట్లీ 3 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. తొమ్మిదో వికెట్ డౌన్.. టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఆకాష్ దీప్.. బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. బషీర్ ఆకాష్ వికెట్‌తో తన తొలి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 102 ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్: 303/9 దృవ్ జురల్ పోరాటం.. దృవ్ జురల్ తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 98 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. క్రీజులో దృవ్ జురల్(78)తో పాటు ఆకాష్ దీప్(3) పరుగులతో ఉన్నారు. దృవ్ హాఫ్ సెంచరీ.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దృవ్ జురల్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్ హాఫ్ సెంచరీ చేశాడు. 89 ఓవర్లకు భారత స్కోర్: 256/8. క్రీజులో దృవ్ జురల్(50), ఆకాష్ దీప్ ఉన్నారు. ఎనిమిదో వికెట్ డౌన్.. కుల్దీప్ యాదవ్ ఔట్ టీమిండియా ఎట్టకేలకు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 76 పరుగుల భాగస్వామ్యాన్ని ఆండర్సన్ బ్రేక్ చేశాడు. 28 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్.. జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 89 ఓవర్లకు భారత స్కోర్: 253/8. క్రీజులో దృవ్ జురల్(49), ఆకాష్ దీప్ ఉన్నారు. 82 ఓవర్లకు భారత్ స్కోర్: 240/7 82 ఓవర్లు ముగిసే సరికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రీజులో దృవ్ జురల్(39), కుల్దీప్ యాదవ్(25) పరుగులతో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న దృవ్ జురల్ కుల్దీప్ యాదవ్(19), దృవ్ జురల్ నిలకడగా ఆడుతున్నారు. 75 ఓవర్ల ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను షోయబ్ బషీర్ ప్రారంభించాడు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో దృవ్ జురల్(30), కుల్దీప్ యాదవ్(17) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనకబడి ఉంది. -
సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్
India vs England, 4th Test Day 2- Yashasvi Jaiswal: వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఏమాత్రం బెదురు లేకుండా బ్యాట్ ఝులిపించడమే తనకు తెలిసిన విద్య అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్. అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు జైస్వాల్. తొలి మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 15, 209, 17, 10, 214(నాటౌట్). తాజాగా రాంచి మ్యాచ్ సందర్భంగానూ కూడా విలువైన అర్ధ శతకం బాదాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఈ ఓపెనింగ్ బ్యాటర్ పట్టుదలగా నిలబడ్డాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 117 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా అద్భుత రీతిలో బాదాడు ఆ సిక్స్‌ను జైస్వాల్. తద్వారా టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్‌గా అవతరించాడు. సెహ్వాగ్ 14 మ్యాచ్‌లు ఆడి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ నమోదు చేస్తే.. జైస్వాల్ ఐదో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు ►యశస్వి జైస్వాల్- 23* సిక్సర్లు- 2024లో ►వీరేంద్ర సెహ్వాగ్- 22 సిక్సర్లు- 2008లో ►రిషభ్ పంత్- 21 సిక్సర్లు- 2022లో ►రోహిత్ శర్మ- 20 సిక్సర్లు- 2019లో ►మయాంక్ అగర్వాల్- 18 సిక్సర్లు- 2019లో. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్‌క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
Day 2: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్
India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, జో రూట్ రాకతో సీన్ మారిపోయింది. ‘బజ్‌బాల్’ కాన్సెప్ట్నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄 Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C — JioCinema (@JioCinema) February 24, 2024 ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సర్ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్ షోయబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. పాక్ మూలాలున్న ఈ రైటార్మ్ స్పిన్నర్ దెబ్బకు శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17) లెగ్ బిఫోర్ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్ అద్బుత రీతిలో అతడి బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 ఇక సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లను మరో స్పిన్నర్ టామ్ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: బంతితో చెలరేగిన బషీర్.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా! Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x — JioCinema (@JioCinema) February 24, 2024 -
సర్ఫరాజ్‌కు షాకిచ్చిన బషీర్.. ఊహించలేదు కదా!
టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్. సర్రేలో జన్మించిన 20 ఏళ్ల ఈ రైటార్మ్ స్పిన్నర్ మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చే క్రమంలో వీసా సమస్యలు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల ఖాతా తెరిచిన బషీర్.. తన తొలి మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, మూడో టెస్టులో మార్క్‌వుట్ ఎంట్రీ కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. రాంచి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బషీర్.. రవీంద్ర జడేజా(12) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బషీర్ బౌలింగ్ నైపుణ్యాలకు ఫిదా అయిన క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇదిలా ఉంటే.. బౌలింగ్ కంటే ముందు రెండో రోజు ఆటలో బ్యాట్‌తో బరిలోకి దిగాడు బషీర్. జడేజా బౌలింగ్‌లో ఒలీ రాబిన్సన్(58) అవుట్ కాగానే అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ బషీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో కామెంట్ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చే సరికి సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. సహచర ఆటగాళ్లతో.. ‘‘అతడికి హిందీ రాదు కదా’’ అని వ్యాఖ్యానించాడు. Sarfaraz - isko to Hindi nahi aati hain Shoaib - Aati hai thodi thodipic.twitter.com/DJ7ZWGS5Jf — Vector Bhai (@Vectorism_) February 24, 2024 టీమిండియా ఫీల్డింగ్ సెట్ చేసుకుంటున్న సమయంలో సర్ఫరాజ్ అన్న ఈ మాటలకు బదులిస్తూ.. ‘‘నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు’’ అని బషీర్ బదులిచ్చాడు. దీంతో అవాక్కవడం సర్ఫరాజ్ వంతైంది. నెటిజన్లు ఈ సరదా సంభాషణ గురించి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా.. రెండో రోజు ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. -
Ind Vs Eng: ఐదుసార్లూ వాళ్లకే చిక్కాడు.. ఇంకెన్ని అవకాశాలు?
India vs England, 4th Test- Rajat Patidar: టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అతడు మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెంది టీమిండియా అభిమానుల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 32, 9. రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో పాటిదార్ అవుట్ కావడం విశేషం. ఏదేమైనా.. తొలి మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా రాజ్‌కోట్ టెస్టులో మాత్రం పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదుసార్లూ వాళ్ల చేతికే చిక్కాడు తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే చేతికే చిక్కడం గమనార్హం. తాజాగా నాలుగో టెస్టులోనూ 17 పరుగులకే అవుటయ్యాడు పాటిదార్. ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన బలహీనతను మరోసారి బయటపెడుతూ 30 ఏళ్ల పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో రజత్ పాటిదార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘టీమిండియాలో అరంగేట్రం తర్వాత వరుసగా విఫలమైనా.. తుదిజట్టులో అతడికి చోటు ఇస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు.. సంజూ శాంసన్ వంటి ఆటగాడికి 2015లో టీ20లో టీమిండియా తరఫున.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించారు. మళ్లీ అతడు మరో అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఐదేళ్లు(2020) పట్టింది. ఎందుకింత వివక్ష? కేవలం ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. కనీసం టెస్టు జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లనైనా.. రంజీ ట్రోఫీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శన ఆధారంగా ఎంచుకోండి’’ అని సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. చదవండి: IPL 2024- MI: అడ్జస్ట్ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్ -
దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ఆకాష్ దీప్‌ను దురదృష్టం వెంటాడింది. తృటిలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఏం జరిగిందంటే? ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆకాష్ ఐదో బంతిని క్రాలేకు అద్బుతమైన ఇన్ స్వింగర్‌గా సంధించాడు. ఆకాష్ వేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునే లేపే ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. వెంటనే బౌలర్ ఆకాష్ సంబరాల్లో మునిగి తేలిపోయాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్ ఫ్రంట్ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. What a no ball Akash deep 😫 pic.twitter.com/rObjmSFkJn — Rishi (@EpicVirat) February 23, 2024 -
IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England, 4th Test Ranchi Day 1 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ తరఫున బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే చుక్కలు చూపించాడు. ఓపెనర్లు జాక్ క్రాలే(42), బెన్ డకెట్(11), ఒలీ పోప్(0)లను పెవిలియన్‌కు పంపి టాపార్డర్‌ను కుదేలు చేశాడు. ఆకాశ్ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జో రూట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి అజేయ సెంచరీతో మెరిశాడు. మిగతా వాళ్లలో జానీ బెయిర్‌స్టో(38), బెన్ ఫోక్స్(47) మాత్రమే రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూ రూట్ 106(226 బంతుల్లో), ఓలీ రాబిన్సన్ 31(60 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, మహ్మద్ సిరాజ్ రెండు, అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తానికి.. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలో తడబడ్డా రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. 83.6: సెంచరీ కొట్టిన జో రూట్ బజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడకుండా తనదైన సహజ శైలిలో ఆడిన జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రూట్.. ఆచితూచి నిలకడగా ఆడుతూ 219 బంతుల్లో 103 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 279-7(84) ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 245 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీని (13) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రూట్‌తో (82) పాటు రాబిన్సన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి బెన్ ఫోక్స్ (47) ఔటయ్యాడు. జో రూట్ (75), టామ్ హార్ట్లీ క్రీజ్‌లో ఉన్నారు. 62.2: 200 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 198/5 (61) జో రూట్ 67, ఫోక్స్ 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 184/5 (54) ఎట్టకేలకు రూట్ ఫిఫ్టీ 48.5: టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. నిలకడగా రూట్ ఇన్నింగ్స్ రూట్ 86 బంతుల్లో 40, ఫోక్స్ 56 బంతుల్లో 14 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 150-5(41) ఇంగ్లండ్ స్కోరు: 137/5 (36) రూట్ 32, ఫోక్స్ 9 పరుగులతో ఆడుతున్నారు. లంచ్ తర్వాత ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. స్కోరు: 129-5. రూట్ 27, ఫోక్స్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ విరామానికి స్కోర్: 112/5 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. అశ్విన్ బౌలింగ్‌లలో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 111/4 19 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 89/3 తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(23), జో రూట్(11) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 11.5: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన ఈ బెంగాల్ బౌలర్.. జాక్ క్రాలే(42) రూపంలో మూడో వికెట్ దక్కించుకున్నాడు. తొలుత నో బాల్ కారణంగా మిస్సయిన క్రాలేను ఈసారి బౌల్డ్ చేయడంలో ఆకాశ్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంగ్లండ్ స్కోరు: 57-3. బెయిర్ స్టో, జో రూట్ క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో ఆకాశ్ దీప్‌నకు రెండు వికెట్లు 9.4: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ డకౌట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 47/2 (9.4) తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(11) వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ స్కోరు: 47/1 (9.2). జాక్ క్రాలే 35 పరుగులతో ఆడుతున్నాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 31/0 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(32), బెన్ డకెట్(4) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ రాంచి వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పేసర్ ఆకాష్ దీప్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్ధానంలో పేసర్ ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి రాగా.. రెహాన్ ఆహ్మద్ స్ధానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
రాంఛీ వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి23) నుంచి ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని స్టోక్స్ సేన భావిస్తుంది. ఈ క్రమంలో రాంఛీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఇంగ్లండ్ ప్రకటించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడో టెస్టులో దారుణంగా విఫలమైన మార్క్ వుడ్, రెహన్ ఆహ్మద్‌పై మెనెజ్‌మెంట్ వేటు వేసింది. వుడ్ స్ధానంలో స్టార్ పేసర్ ఓలీ రాబిన్సన్, ఆహ్మద్ ప్లేస్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్ స్టోకు మరో అవకాశమిచ్చారు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్ -
ముందెన్నడూ చూడలేదు: రాంచి పిచ్‌పై స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
Ind vs Eng Test series 2024: భారత గడ్డపై కూడా ‘బజ్‌బాల్’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు రెండో టెస్టులోనే తత్వం బోధపడింది. హైదరాబాద్ టెస్టులో విజయం తర్వాత అదే జోరును కొనసాగిద్దామని భావించిన స్టోక్స్ బృందానికి దిమ్మతిరిగే షాకిచ్చింది రోహిత్ సేన. విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకున్నా ఆ లోటు కనబడనివ్వకుండా వరుస విజయాలతో జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి జార్ఖండ్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాంచి పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తానెన్నడూ ఇలాంటి పిచ్ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టు కోసం ఎలాంటి ట్రాక్ రూపొందించారో అర్థం చేసుకోలేకపోతున్నానని.. ఆ పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా ఉందని స్టోక్స్ పేర్కొన్నాడు. బీబీసీ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పిచ్ ముందెన్నడూ చూడలేదు. అసలు అక్కడ మ్యాచ్ ఎలా సాగనుందో అంచనా వేయలేకపోతున్నా. ఒకవైపు నుంచి పచ్చగా.. గ్రాసీగా కనిపిస్తోంది. మరోవైపు ఎండ్ నుంచి చూస్తే.. అదీ నిశితంగా గమనిస్తే.. చిన్న చిన్న పగుళ్లు కనిపిస్తున్నాయి. ఆ పిచ్‌పై ఎలా ఆడాలో నాకైతే అర్థం కావడం లేదు’’ అని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్‌లో కాస్త స్పిన్‌కు అనుకూలించిన పిచ్.. విశాఖ, రాజ్‌కోట్‌లో జరిగిన తదుపరి రెండు మ్యాచ్‌లలో స్పిన్నర్లతో పాటు పేసర్లకూ మేలు చేకూర్చింది. తొలి టెస్టులో ఇరు జట్ల స్పిన్నర్లు కలిపి 32 వికెట్లు తీస్తే.. పేసర్లకు ఆరు వికెట్లు మాత్రమే దక్కాయి. ఇక రెండో టెస్టులో స్పిన్ బౌలర్లకు 21 వికెట్లు దక్కితే.. ఫాస్ట్‌బౌలర్లు 15 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో మ్యాచ్‌లో స్పిన్నర్లు 24, పేసర్లు 11 వికెట్లు పడగొట్టారు. చదవండి: వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్ -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ..?
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. సిరాజ్‌కు జతగా బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో ఉంటాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముకేశ్ కుమార్ కంటే ఆకాశ్‌దీపే బెటర్ అని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఆకాశ్ దీప్ మెరుగైన ప్రదర్శన చేయడమే అభిమానుల ఛాయిస్‌కు కారణంగా తెలుస్తుంది. ఆకాశ్ దీప్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున, దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశ్‌దీప్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో ఆకాశ్ ఆడిన 30 మ్యాచ్‌ల్లోనే 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత రంజీ సీజన్లోనూ ఆకాశ్ అదరగొట్టాడు. ఇటీవల బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆకాశ్ 10 వికెట్ల ప్రదర్శనతో విజృంభించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. దీనికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ ఆకాశ్ సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో ఆకాశ్ 16.75 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలకు తోడు ముకేశ్‌తో పోలిస్తే ఆకాశ్ వేగవంతమైన బౌలర్ కావడంతో అతనికే అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ముకేశ్ కుమార్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నాలుగో టెస్ట్ రేసులో వెనుకపడ్డాడు. ముకేశ్ విశాఖ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడంతో మేనేజ్మెంట్కు సెకెండ్ ఛాయిస్‌గా మారాడు. పై పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆకాశ్ దీప్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖయమనే అనిపిస్తుంది. ఆకాశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇది తొలిసారి కాదు. తాజా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్లు విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుండగా.. ఐదో టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్‌మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్‌కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్‌పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్‌ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు అయిపోయాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
Ind vs Eng: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్!
Ind vs Eng Test Series 2024- 4th debutant in 4th match?: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ఇద్దరు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు జహీర్ ఖాన్, రాజ్‌కోట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే, జురెల్‌కు దినేశ్ కార్తిక్ టీమిండియా క్యాప్‌లు అందించారు. తాజాగా నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో.. ‘నాలుగో ఆటగాడి’ అరంగేట్రం? బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో అదరగొట్టిన టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫాస్ట్‌బౌలర్‌కు పనిభారం తగ్గించే దృష్ట్యా నాలుగో టెస్టు జట్టు నుంచి అతడిని రిలీజ్ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అదే విధంగా.. అతడి స్థానంలో ముకేశ్ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి వైపే మొగ్గు అయితే, తుదిజట్టులో మాత్రం ముకేశ్‌ను కాకుండా ఆకాశ్ దీప్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ ఇద్దరు బెంగాల్ పేసర్లలో ఆకాశ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్‌గా వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన ముకేశ్ కుమార్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. తండ్రి ప్రోత్సాహం కరువైనా ఇక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన రైటార్మ్ పేసర్ ఆకాశ్ దీప్.. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్(ఇంగ్లండ్-ఏ)తో ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా బిహార్‌లోని దెహ్రీలో 1996లో జన్మించిన ఆకాశ్ దీప్ క్రికెటర్‌గా ఎదిగేందుకు బెంగాల్‌కు మకాం మార్చాడు. తండ్రి నుంచి ప్రోత్సాహం కరువైనప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. బెంగాల్ తరఫున 2019లో అరంగేట్రం చేసిన అతడు.. 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 104 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్. చదవండి: SRH: చిక్కుల్లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ.. ఆమె ఆత్మహత్య కేసులో.. -
నవ్వు ఆపుకోలేక పోయిన కోహ్లి
రాంచి : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటికే పేవలమైన ఆటతీరుతో రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకున్న సఫారీ జట్టుకు టాస్ కూడా కలిసి రావడం లేదు. రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా భారీ విజయాలు సొంతం చేసుకుంది. మరోవైపు డుప్లెసిస్ వరుసగా ఆరుసార్లు టాస్ ఓడి పోయాడు. దీంతో టాస్ గెలిస్తే మూడో టెస్టులో బ్యాటింగ్ చేపడతామని డుప్లెసిస్ గురువారమే స్పష్టం చేశాడు. అయితే, ప్రోక్సీ కెప్టెన్‌గా సఫారీ జట్టులోని మరొక ఆటగాడు టాస్ చెబుతాడని వెల్లడించాడు. కానీ, అతని ఆశలు ఆవిరయ్యాయి. మూడో టెస్టులో భాగంగా కోహ్లియే మరోసారి టాస్ నెగ్గాడు. ప్రోక్సీ కెప్టెన్‌గా వచ్చిన టెంబె బవుమా కూడా టాస్ విషయంలో తమ జట్టు అదృష్టాన్ని మార్చలేక పోయాడు. కోహ్లి టాస్ వేయగా.. బవుమా టేల్స్ ఎంచుకున్నాడు. దీంతో కాయిన్ కాస్తా హెడ్స్ పడటంతో టీమిండియా టాస్ గెలిచింది. ఇక అక్కడ నుంచి వెళ్లిపోతున్న బవుమా భుజం తట్టిన కోహ్లి ఓ చిరునవ్వు నవ్వాడు. కామెంటేటర్ మురళీ కార్తీక్‌తో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా ఈసారైనా టాస్ గెలవాలనే ప్రయత్నం గుర్తుకు వచ్చి.. ‘హో మ్యాన్’ అంటూ కోహ్లి నవ్వు ఆపుకోలేక పోయాడు. టీమిండియా బ్యాటింగ్ చేపడుతున్నట్టు ప్రకటించాడు. ‘మరో మాట లేకుండా విరాట్ బ్యాటింగ్ ఎంచుకుంటాడు కదా..!’ అని బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. Virat Kohli called it a no-brainer to bat first at the Toss #TeamIndia #INDvSA @Paytm 🇮🇳🇮🇳 pic.twitter.com/3V4fKvcVWr — BCCI (@BCCI) October 19, 2019 -
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన రోహిత్
-
రాంచీ టెస్టుకు ధోని!
రాంచీ: గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. జట్టు సభ్యుల్ని కలిసే అవకాశం దొరికింది. రాంచీలో రేపు(శనివారం) దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న చివరిదైన మూడో టెస్టుకు ధోని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన సొంత మైదానంలో టెస్టు జరుగనున్న తరుణంలో ధోని హాజరు కావాలని నిర్ణయించుకున్నాడట. దీనిపై అధికారికి సమాచారం లేకపోయినా ధోని మ్యాచ్‌ను వీక్షేందుకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జార్ఖండ్ మాజీ కెప్టెన్, ధోని చిన్ననాటి మిత్రుడు మహీర్ దివాకర్‌తో కలిసి మ్యాచ్‌కు ధోని రానున్నాడట. శనివారం ఉదయమే అక్కడికి చేరుకుంటాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.(ఇక్కడ చదవండి: కొత్త చరిత్రపై టీమిండియా గురి) కొన్ని నెలలుగా తన వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్న ధోని.. టీమిండియాతో మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతను రిటైర్మెంట్ తీసుకునే క్రమంలోనే సుదీర్ఘ విశ్రాంతికి మొగ్గుచూపాడని అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న గంగూలీ సైతం ధోని మనసులో ఏముందో చెప్పాలని అంటున్నాడు. భారత క్రికెట్ మేనేజ్మెంట్కు ధోని స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. మరి రాంచీ టెస్టుకు ధోని హాజరైతే అతని రిటైర్మెంట్కు సంబంధించి స్పష్టత వస్తుందా లేదో చూడాలి. ఇప్పటికే భారత్ జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. -
నువ్వు రాంచీ టెస్టులో ఆడొచ్చు కదా!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్‌ను మళ్లీ క్రికెట్ ఆడొచ్చు కదా అంటూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోరాడు. అదేంటి ఎప్పుడో రిటైర్ అయిన జాంటీని మళ్లీ క్రికెట్ ఆడమని కోరడం ఏంటా అనుకుంటున్నారా.. అందుకు జాంటీ రోడ్స్ మళ్లీ సఫారీ జెర్సీలో కనిపించడమే. సఫారీ జెర్సీ ధరించి రోడ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందుకు ఒక క్యాప్టన్ కూడా జత చేశాడు. ‘గ్రీన్ అండ్ గోల్డ్ జెర్సీని వేసుకోవడం గొప్ప అనుభూతిని తీసుకొచ్చింది. ఇది కేవలం ఫొటోషూట్ కోసం మాత్రమే. ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఇలా ఫోజిచ్చా’ అని పోస్ట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించాడు భజ్జీ. ‘ జాంటీ...ఇప్పుడు మీ దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ అవసరం ఉంది. నువ్వు మళ్లీ బరిలోకి దిగొచ్చుకదా. భారత్‌తో రాంచీలో జరుగనున్న చివరి టెస్టులో ఆడొచ్చు కదా’ అని హర్భజన్ సింగ్ సరదాగా చమత్కరించాడు. ఇప్పటికే భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోంది. వరుస రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ను ఇంకా టెస్టు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. విశాఖపట్టణం, పుణేల్లో జరిగిన టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా తిరుగులేని విజయాల్ని ఖాతాలో వేసుకుంది. దాంతో టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లలో రెండొందల పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టును భారత్ గెలిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభించిన తర్వాత భారత్ జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ సాధించింది. దాంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇది మూడు టెస్టుల సిరీస్ కావడంతో రెండు టెస్టుల్లో విజయాల ద్వారా 80 పాయింట్లను సాధించింది. -
ఆసీస్ కవ్వింపులకు కోహ్లీ చురక..
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో కవ్వింపులకు పాల్పడ్డ ఆసీస్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చురక అంటించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఆటగాళ్ల వెటకారాలకు కొంచెం కారం అద్ది కోహ్లీ రుచి చూపించాడు. తొలిరోజు ఫీల్డీంగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ , భుజం నొప్పి బాధతో కుడి చేతిని పట్టకుంటూ మైదానం వీడాడు. అయితే కోహ్లి రెండోరోజు మైదానంలోకి అడుగుపెట్టలేదు. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజం నొప్పిలా చేతిని పట్టుకొని కోహ్లీ గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు. మరో ఆటగాడు మూడో టెస్టులోనే ఆరంగ్రేటం చేసిన మ్యాక్స్‌వెల్ సైతం పుజారా కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపి భుజం పట్టుకొని కోహ్లీని ఎగతాళి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న కెప్టెన్ కోహ్లీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. వార్నర్(14) పరుగుల వద్ద ఔటవ్వడంతో తన భుజాన్ని తడుముతూ మరికొంచె ఎక్కువగా ఎటకారం చూపించాడు. అయితే ఈ వీడియోని కోహ్లీ అభిమానులు ట్వీట్టర్, ఫేస్బుక్లో షేర్చేస్తూ కోహ్లీకి మద్దతు తెలిపారు. ఇక మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలా ఎగతాళి చేస్తాడో చూడాలి.. -
కోహ్లీని కవ్విస్తున్న మాక్స్వెల్
రాంచీ: బెంగళూరు టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు తేలికగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తొలిరోజు గాయపడ్డ సందర్భంగా కోహ్లీ బాధపడ్డట్లుగా మూడోరోజు ఏ గాయం అవకుండా అదే రీతిన భుజాన్ని పట్టుకుని మాక్స్వెల్ కనిపించాడు. దీంతో స్డేడియంలో ఒక్కసారిగా అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే.. మూడో టెస్టు రాంచీలో తొలిరోజు ఆటలో రవీంద్ర జడేజా వేసిన బాల్‌ను పీటర్ హాండ్స్కూంబ్ వైడ్ మిడాన్వైపు పుష్ చేయగా, కోహ్లీ దాన్ని వెంబడించాడు. బంతిని ఆపేందుకు డైవ్ చేయగా, ఆ సమయంలో కోహ్లీ కుడివైపు భుజం నేలకు తాకింది. దాంతో బాధతో విలవిల్లాడిపోయాడు. కొంత సమయం భుజాన్ని అలాగే పట్టుకుని మైదానంలో ఉండిపోయాడు. ఆపై ఫీల్డ్ నుంచి విశ్రాంతి కోసం వెళ్లిపోయాడు. సరిగ్గా మూడో రోజు ఆటలో ఆసీస్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ విరాట్ కోహ్లీని అనుకరిస్తూ ఎగతాళి చేశాడు. పుజారా ఆడిన బంతిని ఆపే ప్రయత్నంలో మాక్స్వెల్.. కోహ్లీ డైవ్ చేసిన ప్రదేశంలోనే డైవ్ చేసి బంతిని ఆపాడు. లేచిన తర్వాత ఈ టెస్టు తొలిరోజు కోహ్లీ పట్టుకున్నట్లుగా భుజాన్ని పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ప్రేక్షకులు 'మాక్స్వెల్ దిస్ ఈజ్ నాట్ వెల్' అంటూ గట్టిగా అరవడం గమనార్హం. -
పుజారా ప్రత్యేకత అదే
రాంచీ: టీమిండియా బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా కీలక సమయంలో ఒత్తిడిని ఎదుర్కొని రాణించి, ఇతర బాట్స్మెన్పై భారం పడకుండా వాళ్లు సహజశైలిలో ఆడేలా చేస్తాడని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో రాంచీ టెస్టులో మూడో రోజు శనివారం పుజారా సెంచరీతో రాణించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడని ప్రశంసించాడు. ఆటలో ఒత్తిడి ఎదురైనపుడు ఆ భారం పుజారాపై వేసి, మరో ఆటగాడు సహజశైలిలో ఆడవచ్చని విజయ్ అన్నాడు. తామిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నామని, ఇది జట్టు పటిష్ట స్థితిలో నిలవడానికి ఉపయోగపడిందని చెప్పాడు. రాంచీ టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేయగా.. భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 360/6 స్కోరు చేసింది. సెంచరీ వీరుడు పుజారా (130 బ్యాటింగ్), సాహా (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుజరా, విజయ్ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం సాధిస్తే మ్యాచ్ చేతిలోకి వస్తుందని విజయ్ చెప్పాడు. -
కోహ్లీపై ఆసీస్ వెటరన్ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: బోర్డర్-గవాస్కర్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తీరును ఏమాత్రం మార్చుకోలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ మాజీ క్రికెటర్ రోడ్నీ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుణేలో దారుణంగా విఫలమైన కోహ్లీ బెంగళూరు టెస్టులోనూ పూర్తిగా విఫలమై తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అంటున్నాడు. బ్యాటింగ్ సగటు 50 కంగే దిగువకు రావడంతో భారత కెప్టెన్ కోహ్లీలో భయం పెరిగిపోయిందన్నాడు. ఫాక్స్స్పోర్ట్ మీడియా ఇంటర్వ్యూలో ఆసీస్ వెటరన్ పేసర్ హాగ్ ఈ వ్యాఖ్యలుచేశాడు. ఒత్తిడిలో ఉన్న కోహ్లీ పరుగుల వేటలో వెనకంజ వేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. 'రాంచీ పిచ్ కొన్నిసార్లు పూర్‌గా ఉంటుంది. ఇందుకోసం కోహ్లీ కచ్చితంగా రాంచీ పిచ్ క్యూరేటర్‌ను బ్యాట్స్మన్లకు అనుకూలమైన పిచ్ తయారు చేయాలని డిమాండ్ చేస్తాడు. కోహ్లీ బ్యాటింగ్ మెగాస్టార్.. అమితు సగటు 50కంటే దిగువకు వచ్చినందున అతడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సిరీస్‌లో 0, 13, 12, 15 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీలో భయం పెరిగిందన్నది వాస్తవం. అందుకే రాంచీలో బ్యాటింగ్ పిచ్ తయారు చేయించే అవకాశం ఉంది' అని ఆసీస్ మాజీ క్రికెటర్ రోడ్నీ హాగ్ చెప్పుకొచ్చాడు. సిరీస్ లో 1-1తో సమంగా ఉన్న భారత్-ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్టు రాంచీలో రేపు (గురువారం) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.