ఆసీస్ కవ్వింపులకు కోహ్లీ చురక..
ఆసీస్ కవ్వింపులకు కోహ్లీ చురక..
Published Sun, Mar 19 2017 9:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో కవ్వింపులకు పాల్పడ్డ ఆసీస్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చురక అంటించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఆటగాళ్ల వెటకారాలకు కొంచెం కారం అద్ది కోహ్లీ రుచి చూపించాడు. తొలిరోజు ఫీల్డీంగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ , భుజం నొప్పి బాధతో కుడి చేతిని పట్టకుంటూ మైదానం వీడాడు. అయితే కోహ్లి రెండోరోజు మైదానంలోకి అడుగుపెట్టలేదు. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజం నొప్పిలా చేతిని పట్టుకొని కోహ్లీ గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు.
మరో ఆటగాడు మూడో టెస్టులోనే ఆరంగ్రేటం చేసిన మ్యాక్స్‌వెల్ సైతం పుజారా కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపి భుజం పట్టుకొని కోహ్లీని ఎగతాళి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న కెప్టెన్ కోహ్లీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. వార్నర్(14) పరుగుల వద్ద ఔటవ్వడంతో తన భుజాన్ని తడుముతూ మరికొంచె ఎక్కువగా ఎటకారం చూపించాడు. అయితే ఈ వీడియోని కోహ్లీ అభిమానులు ట్వీట్టర్, ఫేస్‌బుక్‌లో షేర్‌చేస్తూ కోహ్లీకి మద్దతు తెలిపారు. ఇక మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలా ఎగతాళి చేస్తాడో చూడాలి..
Advertisement
Advertisement