Smith
-
వందేళ్లకు కల నిజమైంది.. ఏడు ఖండాలూ చుట్టేసిన బామ్మ
‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు. కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. డెస్టినేషన్ ఎన్ఎస్డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు. వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్ర సృష్టించిన స్మిత్.. 94 ఏళ్ల రికార్డు బద్దలు
మాంచెస్టర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 148 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 111 పరుగులు చేశాడు.జీమీ స్మిత్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సెంచరీ నమోదు చేసిన యంగెస్ట్ ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా స్మిత్ రికార్డులకెక్కాడు. ఈ ఘనతను స్మిత్ 24 సంవత్సరాల 42 రోజుల వయస్సులో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీపర్ లెస్ అమెస్ పేరిట ఉండేది. అమెస్ 24 సంవత్సరాల 63 రోజుల వయస్సులో ఈ రికార్డును నమోదు చేశాడు. 1930లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెస్ ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో 94 ఏళ్ల అమెస్ అల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
నాలుగేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్‌పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్‌లలో వార్నర్ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం. చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్ ఘనవిజయం -
టీమిండియాపై అదరగొట్టాడు.. వేలంలో జాక్ పాట్!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కి ఐపీఎల్-2022 మెగా వేలంలో భారీ ధర దక్కింది. స్మిత్ కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 6కోట్లకు కొనుగోలు చేసింది. కాగా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్మిత్ అద్భుతంగా రాణించాడు. టీమిండియాతో రెండు వన్డేలు ఆడిన స్మిత్ 60 పరుగలతో పాటు, మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2021లో కూడా స్మిత్ రాణించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా స్మిత్ నిలిచాడు. స్మిత్ బ్యాట్‌తోను, బాల్‌తోను విద్వంసం సృష్టించగలడు. అందుకే పంజాబ్ అతడిని పోటీ పడి మరి దక్కించుకుంది. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు భారీ ధర దక్కింది. వేలంలో లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Mega Auction: టీమిండియా కెప్టెన్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ధర ఎంతంటే! -
పుజారాకు అశ్విన్ సవాల్..!
చెన్నై: అగ్రశ్రేణి స్పిన్నర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించినా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సత్తాపై అనేక మార్లు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. తాజా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా గడ్డపై అతను విఫలమైన విషయాన్ని పదే పదే అందరూ గుర్తు చేశారు. విదేశాల్లో రాణించలేడనే అపవాదూ అతనిపై ఉండేది. ఒక దశలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్, ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీలు కూడా అతనికంటే మెరుగైన వారని కథనాలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో 28.83 సగటుతో 12 వికెట్లు తీసిన అశ్విన్ జట్టు సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పోరులో టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌ను అవుట్ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు. ‘ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్ వర్క్ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్ పైన్‌ను మెల్బోర్న్లో అలాగే అవుట్ చేశా. స్మిత్‌ను ఎవరు అవుట్ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్ గడ్డపై స్మిత్ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని కోరుకుంటా. కోహ్లితో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ ‘మైక్రోస్కోప్’ కింద ఉంచి పరీక్షించారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘లయన్గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ నుంచి వార్న్ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదు. వారు భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. నేను ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌కు బౌలింగ్ చేస్తున్నాను. గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్ ముగిశాక నాకంటే లయన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా’ అని అశ్విన్ వివరించాడు. అర మీసంతో ఆడతా! సహచరుడు పుజారాకు అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొయిన్ అలీతో పాటు మరే స్పిన్నర్ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలో మ్యాచ్ ఆడతానని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
స్మిత్, కోహ్లి ర్యాంక్‌లు యథాతథం
దుబాయ్: తొలి డే–నైట్ టెస్టులో భారత్‌కు పరాభవం ఎదురైనప్పటికీ ర్యాంకుల పరంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అతను 888 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అడిలైడ్ టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ (74) ఆడిన కోహ్లి రెండు రేటింగ్ పాయింట్లను మెరుగు పర్చుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విఫలమైన టాప్ ర్యాంకర్ స్మిత్ (911) పది రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న స్మిత్‌కు రెండో స్థానంలో ఉన్న కోహ్లికి వ్యత్యాసం తగ్గింది. అయితే తన భార్య ప్రసవం కోసం తదుపరి టెస్టులకు గైర్హాజరీ కానున్న నేపథ్యంలో కోహ్లి రేటింగ్ మారే అవకాశం ఉండదు. బౌలర్ల విభాగంలో భారత స్పిన్నర్ అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 3వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
ఆసీస్‌తో సిరీస్ అప్పటిలా ఉండదు: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు స్మిత్, వార్నర్ ఉండటంతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. 2018–19లో వాళ్లిద్దరిపై నిషేధం ఉండటంతో ఆడలేకపోయారు. భారత్ 2–1తో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్‌ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా ఉందని ఇలాంటి జట్టు తమకు దీటైన జట్టే ఎదురుపడాలనుకుంటుందని... స్మిత్, వార్నర్‌లు ఉన్న ఆసీస్ జట్టుతో తప్పకుండా రోమాంచకరమైన సిరీస్ జరుగుతుందని స్టార్ ఓపెనర్ వివరించాడు. అక్టోబర్‌లో మొదలయ్యే కంగారూ పర్యటన జనవరి దాకా సాగుతుంది. అయితే మధ్యలో టి20 ప్రపంచకప్ కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కోవిడ్–19పైనే ఆధారపడ్డాయి. -
అసలు సమరానికి సై
సొంతగడ్డపై బలహీన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా ఏమాత్రం ఆసక్తి రేపని మ్యాచ్‌లతో మొహం వాచిన భారత క్రికెట్ అభిమానులు అసలైన సమరం చూసే సమయం ఆసన్నమైంది. ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత చెప్పుకోదగ్గ ప్రత్యర్థితో తలపడని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సన్నద్ధమైంది. మరోవైపు సెమీస్‌లోనే ఓడిన ఆసీస్ ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వన్డే బరిలోకి దిగుతోంది. పూర్తి స్థాయి జట్టుతో కంగారూలు పటిష్టంగా కనిపిస్తుండగా, స్వదేశంలో కోహ్లి సేన ఏ రకంగా చూసినా బలమైనదే. అయితే దాదాపు ఏడాది క్రితం ఇక్కడే జరిగిన సిరీస్‌ను ఆసీస్ 3–2తో గెలుచుకున్న విషయాన్ని హెచ్చరికగా తీసుకుంటే కోహ్లి సేన గెలుపు కోసం మరింతగా శ్రమించాల్సిందే. ముంబై: ప్రపంచ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇది మూడు మ్యాచ్‌లకే పరిమితం కావడం కొంత నిరాశపరుస్తున్నా... ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదం లభించేందుకు పూర్తి అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా నెగ్గగా... చివరి మూడు గెలిచిన ఆసీస్ సిరీస్ సొంతం చేసుకుంది. ముగ్గురికీ చోటు! విశ్రాంతి అనంతరం రోహిత్ శర్మ పునరాగమనం చేయడంతో అతనితో పాటు రెండో ఓపెనర్ స్థానం విషయంలో ఆసక్తికర చర్చ నడిచింది. రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో, ధావన్ వరుస వైఫల్యాల వల్ల తుది జట్టులో రాహుల్‌కే అవకాశం వస్తుందనిపించింది. అయితే శ్రీలంకతో చివరి టి20లో రాణించిన తర్వాత ధావన్ కూడా తానూ రేసులో ఉన్నానని ప్రకటించాడు. కెప్టెన్ కోహ్లి కూడా ఇదే ఆలోచించినట్లున్నాడు. జట్టు కోసం అవసరమైతే తాను నాలుగో స్థానంలో ఆడతానని ప్రకటించాడు. దాంతో టాప్–3పై స్పష్టత వచ్చేసింది. రోహిత్, ధావన్‌లతో పాటు రాహుల్ మూడో స్థానంలో బరిలోకి దిగడం ఖాయమైంది. ఇందు కోసం పంత్‌ను పక్కన పెట్టి రాహుల్‌తోనే కీపింగ్ చేయించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆసీస్‌పై ఘనమైన రికార్డు ఉన్న (24 మ్యాచ్‌లలో 4 సెంచరీలు సహా 975 పరుగులు) ధావన్ ప్రపంచ కప్‌లో కూడా అదే జట్టుపై సెంచరీ చేసిన తర్వాతే టోర్నీకి దూరమయ్యాడు. ఇక్కడా అతను చెలరేగిపోతే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. రోహిత్, కోహ్లి ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వన్డే జట్టులో తన స్థానం దాదాపుగా సుస్థిరం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో ఆడతాడు. కేదార్ జాదవ్ వన్డే కెరీర్ ఈ సిరీస్ తర్వాత తేలిపోవచ్చు. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని జాదవ్ ఇక్కడా ఆడకపోతే భారత్ మరో ప్రత్యామ్నాయం చూసుకోవడం ఖాయం. ఆల్‌రౌండర్‌గా జడేజా, ఏకైక స్పిన్నర్‌గా కుల్దీప్ కూడా చోటు నిలబెట్టుకున్నారు. బుమ్రా కూడా వరల్డ్ కప్ ఇప్పుడే వన్డే ఆడబోతున్నాడు. అతనికి తోడుగా షమీ, నవదీప్ సైనీలలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో శార్దుల్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. స్మిత్, వార్నర్ రెడీ... టీమ్ ఫొటో సెషన్లో లబ్‌షేన్, స్మిత్, వార్నర్, జంపా (ఎడమ నుంచి) గత భారత్–ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు, ఈసారి సమరానికి ప్రధాన తేడా వారిద్దరే. ఏడాది క్రితం నిషేధం కారణంగా అందుబాటులో లేని వార్నర్, స్మిత్ ఈసారి భారత గడ్డపై తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్ కారణంగా ఇక్కడ సహచరులందరికంటే వీరిద్దరికే ఎక్కువ అనుభవం ఉంది. వార్నర్, ఫించ్ ఓపెనింగ్ జోడి ఆసీస్‌కు శుభారంభం అందిస్తే మూడో స్థానంలో స్మిత్ దానిని కొనసాగించగలడు. 2019లో టెస్టు క్రికెట్లో పలు ఘనతలు నమోదు చేసిన లబ్‌షేన్ తొలిసారి వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. నాలుగో స్థానంలో ఆడబోతున్న అతను ఈ ఫార్మాట్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనేది ఆసక్తికరం. మిడిలార్డర్లో హ్యాండ్స్కోంబ్, అలెక్స్ క్యారీ బ్యాటింగ్ భారం మోస్తారు. క్యారీ ఇటీవల బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్లకంటే పూర్తి స్థాయి బౌలర్లనే ఈ సిరీస్‌లో నమ్ముకుంది. అందుకే మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మిషెల్ మార్‡్షలాంటి వాళ్లను పక్కన పెట్టేసింది. ఆసీస్ టెస్టు క్రికెట్ స్టార్ పేసర్లు అయిన స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కలిసి సుదీర్ఘ కాలం తర్వాత ఒకేసారి కలిసి ఆడబోతున్నారు. 2010లో విశాఖపట్నంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత స్టార్క్ ఇప్పటి వరకు భారత్‌లో మరో మ్యాచ్ ఆడకపోగా, హాజల్‌వుడ్ అయితే ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే స్పిన్నర్‌గా ఆడమ్ జంపా జట్టులో ఉండగా, ఆల్‌రౌండర్ స్థానంలో అగర్ ఆడవచ్చు. ఓవరాల్‌గా చూస్తే అన్ని రంగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చనుంది. ►మరో సెంచరీ చేస్తే స్వదేశంలో 20 వన్డే సెంచరీల సచిన్ రికార్డును కోహ్లి (ప్రస్తుతం 19) సమం చేస్తాడు. ►మరో వికెట్ తీస్తే వన్డేల్లో కుల్దీప్ యాదవ్ 100 వికెట్లు పూర్తవుతాయి. ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు శుభసూచకం. ఇలాంటి స్థితిలో నా బ్యాటింగ్ స్థానాన్ని సంతోషంగా మార్చుకుంటా. స్థానం గురించి అభద్రతాభావం నాలో లేదు. మ్యాచ్‌లో రోహిత్, రాహుల్, ధావన్ ముగ్గురూ ఆడే అవకాశం ఉంది. కెప్టెన్‌గా ప్రస్తుత జట్టు బాగోగులు చూసుకోవడంతో పాటు దూరదృష్టితో ఆలోచించడం కూడా ముఖ్యం. ఇతరులకు అవకాశాలు ఇవ్వడం కూడా నా బాధ్యత. నా వ్యక్తిగత ఘనతలు చూసుకుంటూ నేను పరుగులు చేస్తే చాలనుకోవడం సరైంది కాదు. గత ఏడాది వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకంటే ఈ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఉందా లేదా అనేది జనం నిర్ణయించాలి. మా దృష్టిలో మాత్రం రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరుగుతున్న పోరు. అలాంటి పటిష్ట జట్టుతో తలపడటం ఎప్పుడైనా ఆసక్తికరమే. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ బుమ్రాకు ఎవరైనా ఒకటే... భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం ఎంత కష్టమో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బాగా తెలుసు. అయితే నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా ఎలాంటి బౌలింగ్ చేస్తాడనేదానికి కెప్టెన్ కోహ్లి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. సోమవారం అతను బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. సాధన సమయంలో బుమ్రాకు ఎవరైనా ఒకటేనని, తన పూర్తి సామర్థ్యంతో అతను బౌలింగ్ చేస్తాడని విరాట్ అన్నాడు. ‘నా దృష్టిలో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనైనా బుమ్రా అత్యుత్తమ బౌలర్. ప్రాక్టీస్ సెషన్లో కూడా అతను మ్యాచ్ ఆడినప్పుడు ఎలా ఉంటాడో అంతే తీవ్రతతో బౌలింగ్ చేస్తాడు. మా తల, పక్కటెముకలు లక్ష్యంగా బౌలింగ్ చేసేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. అతడిని ఎదుర్కోవడాన్ని నేను సవాల్‌గా భావిస్తాను. నెట్స్‌లో అతని బౌలింగ్‌లో బౌండరీలు బాదడం కూడా చాలా కష్టం. అయితే అతని బౌలింగ్‌లో నేను అవుట్ కావడం నాలుగేళ్లలో ఇది రెండో సారి మాత్రమే’ అని కోహ్లి వివరించాడు. హార్దిక్ పాండ్యా సాధన... గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత ‘ఎ’ జట్టుకు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా సోమవారం భారత జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో అతను నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. బోర్డు నుంచి ఎలాంటి ప్రత్యేక సూచనలు లేవని, తన ఫిట్నెస్ స్థాయిని పరీక్షించుకునేందుకే అతను సాధన చేసినట్లు సమాచారం. వెన్నుకు గాయంతో ఆటకు దూరమైన అనంతరం పాండ్యాకు శస్త్రచికిత్స కూడా జరిగింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, జాదవ్, జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ/సైనీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, హ్యాండ్స్కోంబ్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్. పిచ్, వాతావరణం వాంఖడే పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇటీవల విండీస్‌తో జరిగిన టి20లోనే భారత్ 240 పరుగులు చేసింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే మంచు కారణంగా టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. -
టెస్టుల్లో కోహ్లి ‘టాప్’ ర్యాంకు పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన టాప్ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు. అతను 928 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతుండగా... 911 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ బ్యాట్స్‌మన్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్ తాజా బ్యాటింగ్ సంచలనం మార్నస్ లబ్‌షేన్ తొలిసారిగా మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 549 పరుగులు చేయడం అతనికి కలిసొచి్చంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో రాణించి ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 10వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాట్స్మెన్లలో పుజారా ఒక స్థానం దిగువకు పడిపోయి ఆరో స్థానంలో, రహనే రెండు స్థానాలు దిగజారి 9వ స్థానంలో నిలిచారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా (794) తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. -
కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే
దుబాయ్: సంవత్సరం పాటు ఆటకు దూరమైనా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ మళ్లీ దూసుకొచ్చాడు. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ రెండో స్థానానికి (913 రేటింగ్ పాయింట్లు) చేరుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 378 పరుగులు చేసిన స్మిత్... కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వెనక్కి తోసి కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (922) ఈ జాబితాలో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. యాషెస్‌లో స్మిత్‌కు మరో మూడు టెస్టులు మిగిలి ఉండగా, కోహ్లి విండీస్‌తో రెండు టెస్టులు ఆడనున్నాడు. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా 9 మాత్రమే కావడంతో అగ్రస్థానానికి ఇప్పుడు హోరాహోరీ పోటీ తప్పదు. కోహ్లితో పాటు టాప్–10లో భారత్ నుంచి పుజారా (4వ స్థానంలో) ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా (5వ ర్యాంక్), అశ్విన్ (10వ ర్యాంక్) టాప్–10లో ఉండగా... ప్యాట్ కమిన్స్ (914 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన కరుణరత్నే (8వ ర్యాంక్) నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్–10లోకి అడుగు పెట్టగా...వరుసగా విఫలమవుతున్న జో రూట్ 6 నుంచి 9వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ నంబర్‌వన్‌గా నిలిచాడు. -
విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ హీటర్ల తయారీలో ఉన్న యూఎస్ దిగ్గజం ఏ.ఓ.స్మిత్ తాజాగా హీట్‌బోట్ పేరుతో ఎనిమిది నూతన మోడల్స్‌ను బుధవారమిక్కడ విడుదల చేసింది. రిమోట్‌తో పనిచేసే ఈ హీటర్‌లో ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఏ సమయానికి వేడి నీళ్లు కావాలో టైమర్‌తో నిర్దేశించవచ్చు. ధరల శ్రేణి రూ.10–15 వేలుంది. అలాగే ఎక్స్–7 ప్లస్ పేరుతో ఆర్వో వాటర్ ప్యూరిఫయర్‌ను సైతం ప్రవేశపెట్టింది. టీడీఎస్ స్థాయి 3,000 వరకు ఉన్న నీటిని కూడా ఇది శుద్ధిచేస్తుందని ఏ.ఓ.స్మిత్ ఇండియా వాటర్ ప్రొడక్ట్స్ ఎండీ పరాగ్ కులకర్ణి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ఇతర ఆర్వోలతో పోలిస్తే నీటి వృధా గణనీయంగా తగ్గిస్తుంది. ధర రూ.18,000గా నిర్ణయించాం. ఇక స్టోరేజ్ వాటర్ హీటర్ల విభాగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎక్కువ కాలం మన్నేలా పేటెంటెడ్ టెక్నాలజీ అయిన బ్లూ డైమండ్ గ్లాస్ లైనింగ్‌ను హీటర్ల తయారీలో వాడుతున్నాం. ఏటా నాలుగైదు వాటర్ ప్యూరిఫయర్లు, 7–10 వాటర్ హీటర్లను ప్రవేశపెడతాం. నాణ్యత, టెక్నాలజీ పరంగా విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం’ అని వివరించారు. -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
వార్నర్, స్మిత్ పునరాగమనం
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా సంవత్సర కాలం నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు గొప్ప అవకాశం దక్కింది. మే 30 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ చివరి రెండు మ్యాచ్‌ల నాటికే వీరిద్దరిపై నిషేధం ముగిసింది. అయినప్పటికీ సెలక్టర్లు వీరిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా... ఐపీఎల్లో ఆడాలని సూచించారు. మరోవైపు పీటర్ హ్యాండ్స్కోంబ్, జోష్ హాజల్‌వుడ్‌లకు ఆసీస్ జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ ప్రపంచ కప్ జట్టు: ఫించ్ (కెప్టెన్), ఖాజా, వార్నర్, స్మిత్, షాన్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, కూల్టర్ నీల్, బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ లయన్, ఆడమ్ జంపా. -
కోల్‌కతా మెరుపు విజయం
జైపూర్: కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముం దుగా రాజస్తాన్‌ను కట్టేసింది. వికెట్లున్నా పరుగుల్ని నిరోధించింది. తర్వాత సులభ లక్ష్యాన్ని వేగంగా ఛేదించింది. మందకొడి పిచ్‌పై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. లీగ్‌లో నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మొదట రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. స్మిత్ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ గర్నీ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 13.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది. లిన్ (32 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నరైన్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వికెట్లున్నా... పరుగులేవి? రాజస్తాన్ సొంతగడ్డపై ముందుగా టాస్‌తో ఓడింది. తర్వాత పిచ్‌తో ఓడింది. ఆఖరికి ప్రత్యర్థి చేతిలో ఓడింది. నిజమే..! ఎందుకంటే సొంతపిచ్‌పై చేతిలో గంపెడు వికెట్లున్నా... గుప్పెడు పరుగుల్ని ఎక్కువగా చేయలేకపోయింది. అసలు పరుగుపెట్టేందుకే ఆపసోపాలు పడింది. ఓపెనర్ రహానే (5) వికెట్‌ను రెండో ఓవర్లో కోల్పోయింది. తర్వాత రెండో ఓపెనర్ బట్లర్ (34 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) 12వ ఓవర్లో ఔటయ్యాడు. అంటే రెండో వికెట్ భాగస్వామ్యం 10.4 ఓవర్లదాకా సాగింది. అప్పటిదాకా ఒకే వికెట్ కోల్పోయినా...ఈ 12 ఓవర్లలో చేసిందెంతో తెలుసా... 77 పరుగులు. పిచ్ పరిస్థితుల నుంచి లబ్ది పొందిన కోల్‌కతా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలబెట్టే పరుగులకు అడ్డుకట్ట వేయడం ఈ మ్యాచ్‌లోని గొప్ప విశేషం. దీంతో రాయల్స్ 15వ ఓవర్లో 100 పరుగులు చేసింది. అనుభవజ్ఞుడైన ఆసీస్ స్టార్ స్మిత్ నిలబడటంతో ఆ మాత్రమైన స్కోరు వచ్చింది. అతను 44 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. త్రిపాఠి (6) ఔటయ్యాక వచ్చిన స్టోక్స్ హిట్టరే అయినా కిందా మీదా పడుతూ 14 బంతుల్లో 7 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కొడితే ఒట్టు! చెలరేగిన ఓపెనర్లు ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లే సుమారు వంద పరుగులదాకా నడిపించారు. ఐపీఎల్‌తో గతంలోనే ఓపెనర్ అవతారమెత్తిన నరైన్, లిన్ ధాటిగా ఆడారు. గౌతమ్ వేసిన రెండో ఓవర్‌ను పూర్తిగా ఆడిన నరైన్ 4, 0, 6, 4, 4, 4లతో 22 పరుగులు చేశాడు. 2 ఓవర్లకే 32 పరుగులు చేసిన కోల్‌కతా 4.1 ఓవర్లలోనే 50 పరుగులను అధిగమించింది. ఇద్దరు కలిసి ఇక సిక్సర్ల మోత మోగించడంతో జట్టు 8.1 ఓవర్లలోనే 90 పరుగులకు చేరింది. మరో పరుగు జతయ్యాక 91 స్కోరు వద్ద నరైన్ ఔటయ్యాడు. అయినాసరే 10వ ఓవర్ పూర్తికాక ముందే (9.3) జట్టు స్కోరు వందకు చేరింది. లిన్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత బంతికే అతనూ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా 13.5 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చారు. గోపాల్‌కు 2 వికెట్లు దక్కాయి. -
స్మిత్ చూసీ చూడనట్లున్నాడు
మెల్బోర్న్: కేప్‌టౌన్ టెస్టులో సహచరులు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసినా కెప్టెన్ స్మిత్ చూసీచూడనట్లు వ్యవహరించాడని అప్పటి కోచ్ లీమన్ వ్యాఖ్యానించారు. ఇందులో కోచ్ పాత్ర లేకపోయినా... నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లీమన్ మాట్లాడుతూ ‘నాయకుడిగా బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి స్మిత్ మిన్నకుండిపోయాడు. ఆ తతంగమంతా చూసినా చూడనట్లు కళ్లు మూసుకున్నాడు. ఆ తప్పే పెను వివాదానికి దారితీసింది. జట్టుకు, బోర్డుకు తలవంపులు తెచ్చింది’ అని లీమన్ తెలిపారు. కెప్టెన్ ఎలాంటి ఒత్తిళ్లనయినా తట్టుకోగలగాలని, ఎలాగైనా గెలవాలనే కసితో తప్పు చేయకూడదని చెప్పారు. ‘బాన్‌క్రాఫ్ట్‌కు బాల్ ట్యాంపరింగ్ చేయాలని వార్నర్ చెప్పినపుడు అతను నాకు లేదంటే సహాయ సిబ్బందికైనా తెలపాల్సింది. అపుడే వారించే వాళ్లం. అలా కాకుండా వాళ్లంతా (ముగ్గురు) పెద్ద తప్పే చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇబ్బందికరమైన అంశం’ అని లీమన్ అన్నారు. 1998 నుంచి 2004 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన లీమన్ 27 టెస్టులు ఆడాడు. -
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నంబర్‌వన్
-
శిఖరాన విరాట్
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తన అద్భుత కెరీర్లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి చిరస్మరణీయ బ్యాటింగ్ తర్వాత కూడా భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 149, 51 పరుగుల ప్రదర్శన కోహ్లిని అగ్రస్థానానికి చేర్చింది. 934 రేటింగ్ పాయింట్లతో విరాట్ శిఖరాన నిలబడగా, 929 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) రెండో స్థానానికి పడిపోయాడు. 2015 డిసెంబర్ నుంచి నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్... బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో గత మార్చి నుంచి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగలేదు. గతంలో భారత్ తరఫున సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2011 జూన్‌లో సచిన్ చివరిసారిగా అగ్రస్థానం సాధించిన తర్వాత ఒక భారత బ్యాట్స్‌మన్ ఈ మైలురాయిని చేరడం ఇదే మొదటిసారి. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను చూస్తే కోహ్లి (934) ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. ఇందులో డాన్ బ్రాడ్‌మన్ 1948లో సాధించిన 961 పాయింట్లు అత్యుత్తమం కాగా... స్మిత్ (947)ది రెండో స్థానం. కోహ్లి ఇప్పటికే వన్డేల్లో కూడా ఎవరికీ అందనంత ఎత్తులో 911 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. -
విష వలయం
ధరలు పెరిగిపోతున్నాయి. అసలు వస్తువులు, కూరగాయల ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి! ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెంపుదలకు కారణాలు కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రిచార్డో, జాన్ కినెస్ వంటివారు ఆర్థిక పరిస్థితుల మీద రచించిన గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. రాబడి, పన్నులు, నిరుద్యోగం వంటి వాటి మీద పరిశోధనలు చేసినా ధరల పెరుగుదల రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాడు! ఇక ఈ విషయమ్మీద విసుగుపుట్టి వదిలివేయాలనుకున్న తరుణంలో పొరుగున ఒక పెద్దావిడ మాటల మధ్యలో సర్ మాంటోతో ‘‘ఈ విషయమ్మీద ఇంత మథనపడటమెందుకు? అసలు ఈ ధరలు పెంచి అమ్ముతున్న వారినే కలిసి అడిగితే సరిపోతుంది కదా!’’ అని ఒక సలహా ఇచ్చింది.సర్ మాంటోకు ఆ సలహా నచ్చింది. తన ప్రశ్నలకు, అనుమానాలకు త్వరలోనే ఊహించిన దానికన్నా మంచి సమాధానం దొరకబోతున్నదని ఆనందపడిపోయాడు.వెంటనే రియో డిజనైరోలో తన వీధి చివరనున్న మార్కెట్‌కు వెళ్లి ఉల్లిపాయలు అమ్మే అతన్ని, ‘‘ఎందుకు ఉల్లిపాయల ధరను పెంచేసి అమ్ముతున్నావు, ఎదుటివాడి ఆర్థిక పరిస్థితి అర్థం చేస్కోవా?’’ అని అడిగాడు. ‘‘అయ్యా! నేను కూడా బతకాలి కదా. ఎక్కువ ధర పెట్టి కొని, మరలా నా లాభం వేసుకుని అమ్మాలి కదా ఆలోచించండి’’ అన్నాడు. ‘‘నీకు ఎక్కువ ధరకు ఎవరు అమ్ముతున్నారు?’’‘‘సెంట్రల్ మార్కెట్లో ఉన్న డీలరు దగ్గర కొంటున్నాను’’ అని చెప్పాడు.వెంటనే సర్ మాంటో సెంట్రల్ మార్కెట్‌కి వెళ్లి, ‘‘ఉల్లిపాయలు ధర పెంచి మార్కెట్ వాళ్లకి ఎందుకు అమ్ముతున్నావు?’’ కర్కశంగా మొహం పెట్టి అడిగాడు.‘‘అయ్యా! నన్ను నమ్మండి. నేను తక్కువ ధరకే అమ్మాలనుకుంటున్నాను. లారీ వాడే ధర పెంచి లారీ లోడు ఉల్లిపాయలు నాకు అమ్మాడు. నేనేం చేసేది?’’ బేలగా చెప్పాడు.రెండోరోజు వేకువజామున మార్కెట్ దగ్గర కాపు కాచి ఉల్లిపాయల లోడుతో వచ్చిన లారీ వాణ్ని పట్టుకొని, ‘‘తెల్లవారి ఎవరూ చూడటం లేదని ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నావా?’’ అడిగాడు. ‘‘అయ్యా! నేనేం చేసేది? ఉల్లిపాయలు పండించే రైతే ధర పెంచి అమ్ముతున్నాడు. దానిమీద కొద్ది లాభంతో సెంట్రల్ మార్కెట్లో డీలర్‌కు అమ్ముకుంటున్నాను’’ చెప్పాడు.వెంటనే బస్సెక్కి సర్ మాంటో ఉల్లిపాయలు పండిచే రైతు వద్దకు వెళ్లి ‘‘నీవే ఉల్లిపాయల ధరలు పెంచి అమ్ముతున్నట్టు లారీ డ్రైవర్ చెప్పాడు. నీ విషయం ప్రభుత్వానికి చెప్పి నీ ఆటలు కట్టిస్తాను.’’ కోపంగా చెప్పాడు సర్ మాంటో. ‘‘దీనికంతా కారణం వానలు లేని వాతావరణం. వాన పడినపుడు తగినవిధంగా ఎరువులు వెయ్యాలి కదా! ఎరువులు 85 శాతం పెరిగిపోయాయి. మరి అంత ఖరీదు పెట్టి కొన్న ఎరువులతో పండించిన ఉల్లిపాయలు ధరలు పెంచి అమ్మక ఏం చేస్తాం?’’ బేలగా చెప్పాడు రైతు. సర్ మాంటో ఇక ఆలస్యం చేయకుండా ఎరువులు అమ్మే దుకాణానికి వెళ్లాడు. ఎరువులు అమ్మే దుకాణదారుడిని ఉల్లిపాయల ధరలకి కారణం నీవే అన్నట్టు కోపంగా వాడి కళ్లలో కళ్లు పెట్టి అడిగాడు.‘‘సార్! ధరలు పెంచి అమ్మడం నాకు సరదానా? నేను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పొటాషియం కలిగిన ఎరువును కొద్దిలాభంతో అమ్మి నా కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాను’’ చెప్పాడు ఎరువుల దుకాణదారుడు. సర్ మాంటో ఏది ఏమైనా ధరల పెరుగుదల విషయం అంతు చూడదలుచుకున్నాడు.రెండో రోజే విమానంలో ఫ్రాన్సుకు వెళ్లి ఎరువుల ఫ్యాక్టరీ సెక్రటరీని కలిసి బ్రెజిల్లో ధర పెరిగిపోతున్న ఉల్లిపాయల్ని గురించి అడిగాడు.‘‘దీనికి కారణం ఎరువుల తయారీకి కావలసిన రసాయనాలు తెచ్చే ఓడలు రవాణా ఖర్చు విపరీతంగా పెంచడమే..’’ చెప్పాడు ఫ్యాక్టరీ సెక్రటరీ. ఆ ఓడల నౌకాశ్రయం జర్మనీలోని హోంబర్గ్లో ఉంది. సర్ మాంటో సరాసరి అక్కడికి వెళ్లి ‘‘ఎందుకు మీరు రవాణా ఖర్చులను పెంచుతున్నారు. మీ వల్ల ఉల్లిపాయలకు బ్రెజిల్లో అధిక ధరలను మేం చెల్లిస్తున్నాం’’ గట్టిగా అడిగాడు.‘‘మేం ఓడలను తయారు చేయడానికి ఇనుముకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసా? గ్రీసు దేశంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలు ఉక్కును అతి ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. అందుకే మేం రవాణా ధరలు పెంచాం.’’ చెప్పాడు.‘‘దీనికంతా కారణం ఉక్కు పరిశ్రమా?’’ అనుకుంటూ మరలా విమానంలో గ్రీసులోని ఏథెన్స్కు వెళ్లాడు. అక్కడి పరిశ్రమలోని పెద్దను కలిసి, ‘‘మీరు ఉక్కు ధరను ఎందుకు పెంచారు? మీ వల్ల ఓడలు తయారుచేయడం ఖరీదు. దాని వల్ల వారు రసాయనాలను ఎక్కువ ధరకు రవాణా చేస్తున్నారు. అందువల్ల ఎరువులు ఖరీదైపోతున్నాయి. రైతులు ఉల్లిపాయల ధరలు పెంచుతున్నారు. అందుకే మా బ్రెజిల్లో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి.ఇది మీకు న్యాయంగా ఉందా?’’ అడిగాడు సర్ మాంటో.‘‘అయ్యా! మీకు ఉక్కు ఏవిధంగా తయారవుతుందో తెలుసా? బొగ్గుతో ఇనుప ఖనిజాన్ని కరిగించి ఇనుముని తయారు చేస్తాం. సౌత్ ఆఫ్రికాలోని బొగ్గు గనులకు వెళ్లండి. బొగ్గుకు ఎంత ధర మేం చెల్లిస్తున్నామో మీకు తెలుస్తుంది’’ నమ్రతగా చెప్పాడు పరిశ్రమ పెద్ద. సర్ మాంటో సౌతాఫ్రికాకు విమానంలో వెళ్లాడు. బొగ్గు గనుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని కలిసి ఉల్లి ధరల గురించి చెప్పాడు. ‘‘బొగ్గు గనులు తవ్వే పరికరాలకు, బొగ్గు రవాణా చేసే రైలుకు మేం కొంత చెల్లించాలి కదా, చెల్లించిన దానిమీద కొంత లాభం వేసుకుని అమ్ముతున్నాము. ఈ పరికరాలు, రైలు పెట్టెలు మాకు జపాన్‌లోని టోక్యో నుండి వస్తాయి. అందుకే బొగ్గును ఎక్కువ ధరకు వారికి అమ్ముతున్నాం’’ తాపీగా చెప్పాడు ఎగ్జిక్యూటివ్. సర్ మాంటో ఇక ఆలోచించలేదు. అందుబాటులో ఉండే విమానంలో వెంటనే టోక్యోకు వెళ్లాడు.ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్ని కలిశాడు.‘‘తమరు బొగ్గు తవ్వే యంత్రాలు, రైలు వ్యాగన్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు? దీని వల్ల మా బ్రెజిల్లో ధరలు పెరిగిపోతున్నాయి’’ చెప్పాడు సర్ మాంటో. చీఫ్ ఇంజనీర్ తొణకకుండా ‘‘దీన్నే ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. మా యంత్ర పరికరాల్ని మీ బ్రెజీలియన్ ఉల్లిపాయలకు బదులుగా వారికి ఇస్తాం. పెరిగిపోయిన ఉల్లిపాయల ధరలతో మా పరికరాలు కూడా ధరలు పెరిగిపోయాయి. తమరు బ్రెజిల్ నుండి వచ్చారుగనక అడుగుతున్నాను – మీ బ్రెజిల్లో ఉల్లిపాయలు ఎందుకు అంత ఖరీదు?’’ చిరునవ్వుతో అడిగాడు చీఫ్ ఇంజనీర్.సర్ మాంటో ఏం చెప్పాలో తెలియక తలపట్టుకొని కూర్చున్నాడు! పోర్చుగీస్ మూలం : కార్లోస్ ఎడ్యురాడో నోవెస్ అనువాదం: కంచనపల్లి వేంకట కృష్ణారావు -
మీ నమ్మకాన్ని నిలబెడతా: స్టీవ్ స్మిత్
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి దేశప్రజల నమ్మకం పొందడానికి కృషి చేస్తానంటున్నాడు. నిషేధం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన స్మిత్ స్వదేశానికి చేరుకున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ‘స్వదేశం చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. బయట కొంత సమయం విశ్రాంతి తీసుకున్నా. ఆ సమయంలో నాకోసం ఎన్నో ఈ–మెయిల్స్, లెటర్స్ వచ్చాయి. మీరు నాపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. తిరిగి మీ నమ్మకాన్ని గెలిచేందుకు కృషిచేస్తాను’ అని స్మిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు రుజువవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన భవిష్యత్ గురించి స్మిత్ పెదవి విప్పాడు. -
స్మిత్, వార్నర్‌లపై సర్రే కౌంటీ ఆసక్తి
లండన్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్‌లపై ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే ఆసక్తి కనబరుస్తోంది. సర్రే హెడ్ కోచ్ మైకేల్ డి వెనుటో వాళ్లిద్దరిని ఆడించాలని ఆశిస్తున్నారు. ఆయన 2013 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. అయితే వీళ్లిద్దరు కౌంటీల్లో ఆడాలంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదం తప్పనిసరి. డి వెనుటో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల్లోనే వాళ్లపై నిషేధం విధించిందని, ఆసీస్‌లో క్లబ్, ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడేందుకు అవకాశముందని చెప్పారు. ‘స్మిత్, వార్నర్‌లకు ఆడాలని ఉంటే కౌంటీల్లో ఆడించవచ్చు. ఈసీబీ కూడా అనుమతించవచ్చు. అలా కాకుండా... ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లయిన వారిని నిరోధించడం తలతిక్క పనే అవుతుంది’ అని ఆయన అన్నారు. -
శిక్ష అనుభవిస్తాం
మెల్బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమపై విధించిన నిషేధాన్ని సవాలు చేయబోమని స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ స్పష్టం చేశారు. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌పై ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షపై ఆటగాళ్లు స్వతంత్ర కమిషనర్ ముందు సవాలు చేసుకునే హక్కు ఉంది. ఇందుకు గడువు (ఏప్రిల్ 11) సమీపిస్తుండటంతో ఈ అంశంపై వీరిద్దరు స్పందించారు. ‘తిరిగి దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. కెప్టెన్‌గా ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత నాదే. సీఏ విధించిన నిషేధాన్ని సవాలు చేయను. ఈ నిర్ణయం ద్వారా సీఏ బలమైన సందేశాన్ని ఇవ్వదలచింది. దాన్ని నేను శిరసావహిస్తాను’ అని స్మిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాన్‌క్రాఫ్ట్ కూడా స్మిత్‌ను అనుసరిస్తూ... తాను కూడా నిషేధంపై అప్పీలుకు వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశాడు. ‘నిషేధంపై అప్పీలు చేయదలుచుకోలేదు. నిషేధం పూర్తయిన తర్వాతే తిరిగి మైదానంలో దిగుతాను. అప్పటి వరకు ఆసీస్ ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తాను’ అని అన్నాడు. మరోవైపు శిక్షలు మరీ ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేస్తోంది. నిషేధానికి గురైన మరో క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఓ ఆసీస్ మీడియా సంస్థతో పది లక్షల డాలర్ల మొత్తానికి ఒప్పందం చేసుకున్న ప్రత్యేక ఇంటర్వ్యూలో వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టనున్నాడని సమాచారం. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే దోషులు
-
మరో 24 గంటలు!
ఇప్పటివరకు క్రికెట్లో ఉత్కంఠఅంటే మనకు తెలిసింది మ్యాచ్ చివరి ఓవర్ వరకు పోటాపోటీగా సాగడం... ఆఖరి బంతికి సిక్స్ కొట్టో... వికెట్ తీసో జట్టును గెలిపించడం! అచ్చంగా వీటిని తలపించేలా ‘బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఫలితం’ సాగుతోంది! ఇటు ట్యాంపరింగ్ మోసంపై కొనసాగిన విమర్శలు! అటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఆటగాళ్లతో పాటు కోచ్‌పై ఆ తరహా చర్యలుంటాయి... ఈ తరహా చర్యలుంటాయంటూ రోజంతా ఊహాగానాలు! వీటన్నిటికీ జవాబు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వైపు అందరి చూపు! ‘విషయం తేల్చేశాం’ అన్నట్లు మంగళవారం రాత్రి ఆయన గంభీరంగా మీడియా సమావేశానికి వచ్చారు. కానీ... సగం తీర్పే చెప్పారు. తదుపరి వివరాలను 24 గంటల్లో వెల్లడిస్తామని ప్రకటించి ముగించారు. మొత్తానికిదోషులెవరో స్పష్టమైంది. మిగిలింది వారి క్రీడా భవితవ్యంపై కీలకనిర్ణయమే! బుధవారంతో ఈ సస్పెన్స్ కూడా వీడిపోనుంది. జొహన్నెస్‌బర్గ్: తమ దేశ క్రికెట్‌ను కుదిపేస్తూ... అవమానాల పాల్జేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’ ఘటన వెనుక ఉన్నదెవరో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అధికారికంగా వెల్లడించారు. తమ బోర్డు అధికారుల విచారణ వివరాలతో మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంపరింగ్ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లు దోషులుగా తేలినట్లు ప్రకటించారు. కోచ్ డారెన్ లీమన్ సహా మిగతా ఆటగాళ్లెవరికీ ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక, ముగ్గురు ఆటగాళ్లపై తాము తీసుకునే చర్యలను 24 గంటల తర్వాత తెలియజేస్తామన్నారు. వేటుపడినవారు తక్షణమే స్వదేశానికి పయనమవుతారని వారి స్థానాలను మాథ్యూ రెన్షా, జో బర్న్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో భర్తీ చేయనున్నట్లు.... వికెట్ కీపర్ టిమ్ పైన్ నాలుగో టెస్టుకు సారథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. లీమన్ రాజీనామా చేశాడన్న వార్తలు నిజం కాదని... ప్రస్తుత కాంట్రాక్ట్‌తోనే అతడు కొనసాగుతాడని వివరించారు. ‘కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నాం. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే ట్యాంపరింగ్‌లో భాగస్వాములని సీఏ విచారణలో తేలింది. విస్తృత స్థాయి పేరు ప్రఖ్యాతులు ముడిపడి ఉన్న ఈ ఘటనలో తీసుకునే చర్యలు కూడా అంతే కఠినమైనవి. విచారణలో స్పష్టమైన అంశాలతో ఇది ముందుకు సాగుతుంది. ఈ ఉదంతంతో మా పురుషుల జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై నిపుణుల బృందంతో స్వీయ సమీక్ష చేసుకుంటాం’ అని సదర్లాండ్ అన్నారు. కలుపు మొక్క వార్నర్! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో ముగ్గురు ఆటగాళ్లు దోషులుగా తేలినా జట్టు గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం ట్యాంపరింగ్‌కు అసలు సూత్రధారి డేవిడ్ వార్నరే అని వినిపిస్తోంది. బంతిని టేపుతో ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచన తనదే అని, ఓపెనింగ్ సహచరుడు బాన్‌క్రాఫ్ట్‌తో ఆ పని చేయించాలని కూడా అతనే చెప్పాడని తెలిసింది. దీనికి ఊ కొట్టడం వరకే స్మిత్ పరిమితమయ్యాడు. ట్యాంపరింగ్కంటే కూడా ‘అసలు సమస్య వార్నర్’ అని ఒక సీనియర్ ఆసీస్ బోర్డు అధికారి చెప్పడం పరిస్థితిని సూచిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్ జట్టులోని ఆటగాళ్లంతా వార్నర్‌ను వెంటనే జట్టు నుంచి బయటకు పంపించాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోయినా ట్యాంపరింగ్‌కు సంబంధించి తమ పేర్లను చేర్చడంపై పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లయన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన దగ్గరి నుంచి అతను సహచరులతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. టీమ్ వాట్సప్ గ్రూప్ నుంచి వార్నర్ తనంతట తానుగా తప్పుకోవడం కూడా జట్టుతో అతనికి ప్రస్తుతం ఉన్న సంబంధాల పరిస్థితి గురించి చెబుతోంది! 2013లో బార్లో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను కొట్టిన నాటి నుంచి తమ బోర్డుతో వార్నర్‌కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గత ఏడాది ఆటగాళ్ల జీతాల పెంపు విషయంలో అతను గట్టిగా పోరాడాడు. ఇప్పుడు సరిగ్గా అదను చూసి బోర్డు కూడా వార్నర్‌ను బద్నామ్ చేసే కార్యక్రమంలో చేరింది. 2014లో యాషెస్‌తో 0–5తో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిన తర్వాత కెవిన్ పీటర్సన్పై వేటు పడింది. నిజానికి జట్టు మొత్తం విఫలమైనా... వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడనే సాకుతో అతనిపై బోర్డు చర్య తీసుకుంది. ఆసీస్ జట్టులో తాజా పరిణామాలు కూడా సరిగ్గా అదే తరహాలో సహచరులతో సమస్యలు చూపిస్తూ వార్నర్ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు! లీమన్‌కు ఏమీ తెలీదా! బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి సదర్లాండ్ చేసిన ప్రకటనలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది కోచ్ డారెన్ లీమన్‌కు క్లీన్చిట్ ఇవ్వడం. అతను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాంట్రాక్ట్ ప్రకారం కోచ్‌గా కొనసాగుతాడని సదర్లాండ్ చెప్పారు. కానీ ఘటన జరిగిన రోజు వీడియోను చూస్తే లీమన్ పాత్ర ఏమిటో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. టీవీ స్క్రీన్‌పై బాన్‌క్రాఫ్ట్ టేపు దృశ్యాలు కనిపించగానే వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్కు సమాచారం ఇవ్వడం... అతడు దానిని బాన్‌క్రాఫ్ట్‌కు చేరవేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు కోచ్‌గా అతని ప్రమేయం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందనడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి లీమన్‌ను కావాలనే రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నైపుణ్యం పరంగా గొప్ప కోచ్ కాకపోయినా కేవలం బోర్డులో తనకు ఉన్న సంబంధాలతో ‘సిఫారసు’ వ్యక్తిగా లీమన్ కోచ్‌గా కొనసాగుతున్నాడనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణే. ఐదేళ్ల క్రితం మికీ ఆర్థర్‌తో ఆస్ట్రేలియా బోర్డుకు గొడవ జరిగిన సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేయబడిన లీమన్, ఆ తర్వాత ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వేటు పడకుండా తప్పించుకోగలగడం అతనికి ఉన్న పట్టును సూచిస్తోంది. మరోవైపు తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యను కూడా సదర్లాండ్ ‘అబద్ధం’గా మార్చేశారు. లంచ్ సమయంలో తమ మధ్య చర్చ జరిగిందని, ‘లీడర్షిప్ గ్రూప్’ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమని ఆ రోజు స్మిత్ చెప్పాడు. కానీ కేవలం ముగ్గురే దోషులంటూ తాజా విచారణలో తేల్చారు. జట్టులో అందరికంటే తక్కువగా ఏడు టెస్టుల అనుభవం ఉన్న బాన్‌క్రాఫ్ట్ లీడర్షిప్ గ్రూప్‌లో ఏ రకంగా చూసినా భాగం కాదు. అంటే కేవలం వార్నర్, స్మిత్ మాత్రమే కలిసి వ్యూహం రచించారా! అన్నింటికి మించి ఒక్క బౌలర్‌కు కూడా ట్యాంపరింగ్‌లో పాత్ర లేదనేని మరింత ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా బాల్ ట్యాంపరింగ్ చేస్తే దానిని సమర్థంగా వాడుకోగలిగేది బౌలర్ మాత్రమే. అప్పటి వరకు బంతి ఏ మేరకు స్వింగ్ అయింది? అసలు రివర్స్ స్వింగ్ అవుతోందా లేదా? ఒక వేళ బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో ఒక బౌలర్ మాత్రమే అంచనా వేయగలడు. కానీ సదర్లాండ్ చెప్పిన దాని ప్రకారం ఆ జట్టు బౌలర్లకు పనికొచ్చేలా ముగ్గురు బ్యాట్స్‌మెన్ కలిసి కుట్ర పన్నారు! మొత్తం సదర్లాండ్ ప్రకటన చూస్తే ఈ ఘటన పట్ల తామంతా బాధపడిపోతున్నట్లు, జాతికి క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించినా... మొత్తం మీడియా సమావేశంలో ఒక్కసారి ‘చీటింగ్’ పదం వాడకపోవడం గానీ చూస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం నిజాయితీ లేదనేది వాస్తవం. బుధవారం ముగ్గురు క్రికెటర్లపై శిక్షలు ఖరారయ్యాక గానీ ఆసీస్ బోర్డు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది. -
స్మిత్ బుద్ధి తక్కువ పని చేశాడు
ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా ఆలోచనలో అర్థం లేదు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అలా చేయకుండా ఉండాల్సింది. బాల్ ట్యాంపరింగ్ తెలివి తక్కువ పని. భారత్‌తో రివ్యూ వివాదం సమయంలో తన బుర్ర పని చేయలేదని అతను అంటే ఏదో మాట వరసకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజంగా స్మిత్‌కు బుర్ర లేదని నాకర్థమైంది. 1981 నుంచి ఆస్ట్రేలియా ఇదే తరహాలో క్రికెట్ ఆడుతోంది. –సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ -
విచారణ ప్రారంభం
కేప్‌టౌన్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఇందుకోసం నియమితులైన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్ కేప్‌టౌన్ చేరుకున్నారు. అసలీ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను వారు విచారిస్తారు. ప్రధాన కోచ్ డారెన్ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలడగనున్నారు. బుధవారం నాటికి ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా వచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్... రాయ్‌తో జొహన్నెస్‌బర్గ్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విచారణ అంశాలను తెలుసుకుని తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే... పరిణామాలపై కొంత ఓపిక పట్టాలని సీఏ చైర్మన్ డేవిడ్ పీవర్ అభ్యర్థించాడు. మరో 48 గంటల్లో ప్రజలకు పూర్తి వివరాలు చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం స్మిత్, వార్నర్‌లను కనీసం ఏడాది పాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ పట్ల కూడా సీఏ కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టులో మార్పులు? దక్షిణాఫ్రికాతో ఈ నెల 30 నుంచి జరిగే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు ఉంటాయని సమాచారం. బాల్ ట్యాంపరింగ్‌తో స్మిత్ దూరమవడం, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ పైనా చర్యలుంటాయని వార్తలు వస్తుండటంతో వీరి స్థానాలను ఓపెనర్లు రెన్షా, జో బర్న్స్, వెటరన్ బెయిలీలతో భర్తీ చేసే అవకాశముంది. దీంతో పాటు ట్యాంపరింగ్‌ను సారథ్య బృంద ఆలోచనగా స్మిత్ చెప్పడం పట్ల... అందులోని సభ్యులైన పేసర్లు హాజల్‌వుడ్, స్టార్క్‌లు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు స్మిత్ వ్యక్తిగత స్పాన్సర్ అయిన శానిటేరియం సంస్థ అతడితో ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు తెలిపింది. -
ఇది నిలువెల్లా మోసం
సిడ్నీ: సహజంగా తమ ఆటగాళ్లను బాగా వెనకేసుకొచ్చే ఆస్ట్రేలియా మీడియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ ఘటన కంపరం పుట్టించినట్లుంది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి అంటూ స్థానిక ప్రసార మాధ్యమాలు ధ్వజమెత్తుతుండటమే దీనికి నిదర్శనం. ‘స్మిత్స్ షేమ్’ అంటూ మొదటి పేజీలో కథనం ఇచ్చిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక... ‘ఇది హెల్మెట్ నుంచి బూటు వరకు చేసిన నిలువెత్తు మోసం’గా అభివర్ణించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ‘రెండు దశాబ్దాలుగా సీఏను నడిపిస్తున్న సదర్లాండ్ జాతీయ జట్టు సంస్కృతిని మార్చలేకపోయారు. స్మిత్ చర్య పరిస్థితులరీత్యా చేసింది కాదని సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ పేర్కొనగా, ఈ ఉదంతం స్మిత్, జట్టు పేరు ప్రఖ్యాతులకు కోలుకోలేని దెబ్బని, తీవ్ర మూల్యం చెల్లించారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అభివర్ణించింది. పునరాలోచనలో జట్టు స్పాన్సర్లు... ట్యాంపరింగ్ ఆస్ట్రేలియా జట్టు స్పాన్సర్షిప్పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 600 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల టీవీ ప్రసార హక్కుల ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. తాజా పరిణామాలతో స్పాన్సర్లు బేరానికి దిగనున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద స్పాన్సర్ అయిన మాజిలాన్ సంస్థ... ట్యాంపరింగ్‌ను తీవ్ర మోసంగా పేర్కొంది. ‘మేం చాలా అసంతృప్తికి గురయ్యాం. మా జాతీయ జట్టు నుంచి ఇలాంటిది ఆశించలేదు’ అని ఎయిర్‌లైన్ క్వాంటాస్ స్పష్టం చేసింది. ఈ సంస్థ పేరున్న జెర్సీనే ప్రస్తుత సిరీస్‌లో ఆటగాళ్లు ధరిస్తున్నారు. ఆ దేశ మహిళా జట్టు స్పాన్సర్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ కూడా దీనిపై సీఏ నుంచి వివరణ కోరింది. -
బాటిల్ మూత... దగ్గు బిళ్ల...!
ట్యాంపరింగ్ చేయాలంటే కాస్త కొత్తగా ఏదైనా ఆలోచించాలమ్మా అనుకున్నారేమో... స్మిత్, బాన్‌క్రాఫ్ట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అడ్హెసివ్ టేపును వాడుకున్నారు. అయితే ఇన్నేళ్లలో బంతిని దెబ్బ తీసేందుకు ‘రొటీన్‌కు భిన్నం’గా ప్రయత్నించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూస్తే ఇలా కూడా బంతి ఆకారాన్ని మార్చవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. ట్యాంపరింగ్ చరిత్రలో కొన్ని ఆసక్తికర అంశాలను చూస్తే... –సాక్షి క్రీడావిభాగం ►జాన్ లేవర్ (వ్యాజ్‌లీన్): భారత గడ్డపై 1976–77లో జరిగిన సిరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను కూడా ఇంగ్లండ్ గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ లేవర్ వ్యాజ్‌లీన్ ద్వారా ఒక వైపు బంతి మెరుపును పెంచేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. లేవర్ పదే పదే బంతిని తన నుదుటికి రాయడాన్ని భారత జట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. తాను చెమట మాత్రమే తుడుచుకున్నానని అతను చెప్పినా... బంతిని పరిశీలించగా దానికి వ్యాజ్‌లీన్ రాసి ఉన్నట్లుగా బయటపడింది. అయితే లేవర్ కావాలని చేశాడా... లేక అంతకు ముందు చెమట నుంచి తప్పించుకునేందుకు ఫిజియో ఇచ్చిన వ్యాజ్‌లీన్ టేప్‌లను నుదుటిపై పెట్టుకోవడం వల్ల జరిగిందా అనేది తేలలేదు. ►షాహిద్ ఆఫ్రిది (దంతాలు): ట్యాంపరింగ్‌లో ఇదో సంచలనం. 2010లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన వన్డేలో కెప్టెన్‌గా ఉన్న ఆఫ్రిది బంతిని పళ్లతో గట్టిగా కొరుకుతూ కనిపించాడు. ముందుగా తప్పు అంగీకరించని ఆఫ్రిది... ఆ తర్వాత మ్యాచ్ గెలిచేందుకు చేసిన పనని ఒప్పుకున్నాడు. అతనిపై రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల నిషేధం పడింది. ►రాహుల్ ద్రవిడ్ (దగ్గు బిళ్ల): 2004లో బ్రిస్బేన్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే హాల్స్, స్ట్రెప్సిల్స్ తరహా ట్యాబ్లెట్‌తో బంతిని రుద్దడం కెమెరాల్లో కనిపించింది. దాంతో మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ ద్రవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ►క్రిస్ ప్రింగిల్ (బాటిల్ మూత): పాకిస్తాన్లో 1990లో పర్యటించిన న్యూజిలాండ్ జట్టు పేసర్ ప్రింగిల్ తనదైన శైలిలో ట్యాంపరింగ్ చేశాడు. ఒక బాటిల్ మూతను నాలుగు భాగాలుగా కోసి మొన మాత్రమే బయటికి కనిపించేలా వాటికి టేపులు చుట్టి జేబులో పెట్టుకున్నాడు. మ్యాచ్‌లో అనేక సార్లు దాంతో బంతిని గీకి తాను అనుకున్న విధంగా రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడు. ఇది బాగా పని చేసి తొలి ఇన్నింగ్స్‌లో ప్రింగిల్ 7 వికెట్లు తీయడంతో పాక్ 102కే కుప్పకూలింది. సిరీస్‌లో పాక్ బౌలర్లు ఇదే తరహాలో ఎన్నో సార్లు చేసినా అంపైర్లు పట్టించుకోకపోవడంతో తాము అలాగే చేయాల్సి వచ్చిందని ప్రింగిల్, కెప్టెన్ మార్టిన్ క్రో ఆ తర్వాత చెప్పుకున్నారు. రిఫరీలు లేని జమానా కావడంతో ప్రింగిల్కు ఎలాంటి శిక్ష పడలేదు. సచిన్ వివాదం... భారత క్రికెట్–బాల్ ట్యాంపరింగ్‌కు సంబంధించి తీవ్ర వివాదంలో నిలిచిన ఘటన 2001లో జరిగింది. దక్షిణాఫ్రికాతో పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టులో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడని సచిన్ టెండూల్కర్‌పై రిఫరీ మైక్ డెన్నిస్ ఒక టెస్టు నిషేధం, జరిమానా విధించాడు. జట్టును అదుపులో ఉంచనందుకు కెప్టెన్ గంగూలీ, అతిగా అప్పీల్ చేసినందుకు మరో నలుగురు భారత క్రికెటర్లు సెహ్వాగ్, హర్భజన్, శివ్‌సుందర్ దాస్, దీప్ దాస్గుప్తాలపై కూడా నిషేధం పడింది. అయితే దీనిపై భారత జట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. చివరకు సచిన్ తప్పు లేదని తేలడం, ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం తర్వాతి టెస్టుకు అనధికారిక గుర్తింపు ఇవ్వడంతో భారత్ బరిలోకి దిగింది. టెస్టు మూడో రోజు సచిన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగా... ఇతర భారత బౌలర్లకంటే సచిన్ అద్భుతంగా స్వింగ్ చేశాడు. అతని గ్రిప్‌ను చూసేందుకు కెమెరా ఫోకస్ చేయగా రెండు సార్లు బొటన వేలితో బంతితో సచిన్ ఏదో చేస్తున్నట్లుగా సందేహాస్పదంగా కనిపించింది. దీని ఆధారంగా శిక్ష విధించానని డెన్నిస్ చెప్పగా... తాను బంతిపై మట్టిని మాత్రమే తొలగించానని సచిన్ వివరణ ఇచ్చాడు. ► కొత్త పద్ధతుల కోసం ప్రయత్నించకుండా తమ చేతితో, వేలితో బంతిని దెబ్బ తీసిన క్రికెటర్లు కూడా ఉన్నారు. 2000లో దక్షిణాఫ్రికాతో వన్డేలో గోళ్లతో వకార్ యూనిస్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ట్యాంపరింగ్ చేసి శిక్షకు గురైన తొలి క్రికెటర్ వకార్ కావడం విశేషం. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం, 50 శాతం జరిమానా పడింది. 2014లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టులో చేతి వేళ్ళతో బంతి ఆకారాన్ని మార్చిన దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్‌పై 75 శాతం జరిమానా పడింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ షూ స్పైక్స్‌తో తొక్కి బంతిని దెబ్బ తీశాడని ఆరోపణలు వచ్చినా అవి రుజువు కాలేదు. బంతిని ఆపడంతో బద్ధకించి తాను కాలు పెట్టానని అతను చెప్పుకున్నాడు. ►మైక్ అథర్టన్ (జేబులో మట్టి): దక్షిణాఫ్రికాతో 2004లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో అథర్టన్ అనుమానాస్పద రీతిలో బంతిపై దేనితోనో రుద్దడం బయట పడింది. అయితే ఆ తర్వాత అథర్టన్ జేబులో మట్టి ఉన్నట్లుగా తేలింది. తాను బంతి ఆకారాన్ని దెబ్బ తీయలేదని, అర చేతులకు చెమట పట్టినప్పుడు తుడుచుకునేందుకు మాత్రమే మట్టిని ఉపయోగించానని బుకాయించాడు. రిఫరీ ముందు కూడా తప్పు ఒప్పుకోకపోయినా...అతనిపై 2 వేల పౌండ్ల జరిమానా పడింది. ►డు ప్లెసిస్ (ప్యాంట్ జిప్): 2013లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తూ దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్ పట్టుబడ్డాడు. బంతిని తన ప్యాంట్ సైడ్ జిప్కు బలంగా రాస్తూ దొరికిపోయాడు. 2016లో కూడా ప్లెసిస్ మరో తప్పు చేశాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో నోట్లో మింట్ చప్పరించి దానితో బంతి మెరుపును పెంచే ప్రయత్నం చేశాడు. తొలిసారి ఫీజులో 50 శాతం, రెండోసారి అతనిపై 100 శాతం జరిమానా పడింది. -
దాచినా దాగదులే!
కేప్‌టౌన్: అద్భుతమైన ఆట, అదే స్థాయి రచ్చతో పోటాపోటీగా సాగుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను మరో కొత్త వివాదం ముంచెత్తింది. ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర వివాదాన్ని రేపింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో అతను చేసిన పనులు వీడియోలో బయట పడ్డాయి. ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్‌క్రాఫ్ట్ తన కుడి చేతి వేళ్ల మధ్య టేపును ఉంచి బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను దానిని తన జేబులో వేసుకున్నాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. వెంటనే ఆసీస్ కోచ్ లీమన్ అదనపు ఆటగాడు హ్యాండ్స్కోంబ్కు వాకీటాకీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో ఓవర్ల మధ్య మైదానంలోకి వెళ్లిన హ్యాండ్స్కోంబ్, బెన్‌క్రాఫ్ట్‌కు ఈ సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఫీల్డ్ అంపైర్లు నైజేల్ లాంజ్, ఇల్లింగ్‌వర్త్ ఈ విషయంపై బెన్క్రాఫ్ట్ను వివరణ అడిగారు. అయితే అప్పటికే ఆ వస్తువును జేబులోంచి తీసిన ఆసీస్ క్రికెటర్ దానిని అండర్వేర్లో వేసుకున్నాడు. అంపైర్లు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జేబులోంచి సన్‌గ్లాసెస్ క్లాత్‌ను తీసి చూపించాడు! ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు. ఇదీ ప్లాన్... మనం సాధారణంగా వాడే టేపులో జిగురు భాగంతో పిచ్ సమీపంలో నేలపై రాయాలని బెన్‌క్రాఫ్ట్ భావించాడు. అప్పుడు అక్కడ ఉండే తేలికపాటి కంకర రాళ్లు టేపుకు అంటుకుంటాయి. అప్పుడు ఆ గరుకుతనంతో బంతిని రుద్దితే ఆకారం దెబ్బ తిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మారుతుంది. అయితే అతను అనుకున్న రీతిలో అది ప్రభావవంతంగా పని చేయకపోగా... వీడియోలో మాత్రం పట్టుబడిపోయాడు. -
తప్పుడు నాయకుడు
అనూహ్యం... అసాధారణం... ఒక అగ్రశ్రేణి జట్టు కెప్టెన్ తాము కావాలనే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని, ఇదంతా వ్యూహంలో భాగంగా తాము తీసుకున్న సమష్టి నిర్ణయమని ప్రకటించడం! క్రీడాస్ఫూర్తి అనే పదానికి ఎప్పుడూ మైళ్ల దూరంలో ఉండే ఆస్ట్రేలియా మరోసారి తన అథమ స్థాయి తెలివితేటలను బయట పెట్టుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు తప్పుడు పని చేయాలనుకోవడమే నేరం కాగా... ఒక యువ ఆటగాడిని అందుకోసం బలి పెట్టే ప్రయత్నం చేయడం నిజంగా క్షమించరానిది. పైగా తాను బాధ్యత తీసుకుంటున్నానని, అయితే కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోనంటూ మళ్లీ బుకాయింపు కూడా. సరిగ్గా ఏడాది క్రితం భారత్‌తో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్ నుంచి రివ్యూ విషయంలో రచ్చ చేసి ‘తన బుర్ర పని చేయలేదని’ అంగీకరించిన స్మిత్, కోచ్ లీమన్ మార్గనిర్దేశనంలోనే ఇప్పుడు అలాంటి సీక్వెల్ తయారు కావడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద సంచలనం. కేప్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ వివాదాలు కొత్త కాదు. రివర్స్ స్వింగ్‌ను రాబట్టేందుకు ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఘటనలు అనేకం. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాము కావాలని చేయలేదనే వివరణ ఇస్తూ ఒక క్షమాపణతో, చిన్నపాటి శిక్షతో వారంతా బయటపడిపోయారు. కానీ తాజా ఘటనకు ఆ పాపాల జాబితాలో అగ్రస్థానం దక్కుతుంది. క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మన్వంటి ఆటగాళ్ల ఆత్మలు కూడా సిగ్గుతో తలదించుకునే స్థితి ఇది. ప్రత్యర్థిని అడ్డుకోలేక ఒక కెప్టెన్ అంత పచ్చిగా ట్యాంపరింగ్‌ను ఆశ్రయించడం ఊహకు అందనిది. పైగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడమంటూ తన సహచరుల్లో ఒకరిని పురమాయించాడు. ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్ ఒప్పుకున్నాడు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను’ అని స్మిత్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. అతని ప్రతీ మాటలో అపరాధ భావం కనిపించింది. వీడియో ఫుటేజీలో తాము పట్టుబడకపోయినా జరిగిన సంఘటన పట్ల తాను బాధ పడేవాడినని అతను చెప్పాడు. ‘మేమందరం కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమిది. ఇందులో కోచ్‌ల పాత్ర ఏమీ లేదు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. నా నాయకత్వంలో ఇలాంటిది మొదటిసారి జరిగింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్ అని తెలుసు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బంతి బాగా రివర్స్ అయింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేశాం. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటిది జరగనివ్వను’ అని స్మిత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా తన అవసరం ఆసీస్ జట్టుకు ఉందని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను చేసింది చాలా పెద్ద తప్పని, అయితే మున్ముందు దీని నుంచి తాను నేర్చుకుంటానన్న స్మిత్... ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు. లంచ్ సమయంలో మేం దీనిపై చర్చించాం. ట్యాంపరింగ్ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు. – బెన్‌క్రాఫ్ట్ -
ఆస్ట్రేలియా 225/5
డర్బన్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఇరు జట్లు సమంగా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (56), డేవిడ్ వార్నర్ (51) అర్ధసెంచరీలు సాధించగా, షాన్ మార్‡్ష (40) ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తక్కువ వ్యవధిలో బెన్‌క్రాఫ్ట్ (5), ఉస్మాన్ ఖాజా (14) వికెట్లు కోల్పోయింది. అయితే మూడో వికెట్‌కు వార్నర్‌తో 56 పరుగులు, నాలుగో వికెట్‌కు మార్‡్షతో 56 పరుగులు జోడించి స్మిత్ జట్టును ఆదుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో చెలరేగిన స్మిత్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో తాను ఆడిన 20 టెస్టు సిరీస్‌లలో ప్రతీదాంట్లో కనీసం ఒక అర్ధ సెంచరీ అయినా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్, మార్‡్షలను 26 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పట్టు బిగించే ప్రయత్నం చేసింది. అయితే మిషెల్ మార్‡్ష (32), టిమ్ పైన్ (21) ఆరో వికెట్‌కు అభేద్యంగా 48 పరుగులు జత చేసి ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా కాపాడారు. ఫిలాండర్, మహరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. వెలుతురు లేమి కారణంగా 17 ఓవర్ల ముందుగానే ఆట ముగిసింది. -
కోహ్లిని చూసే నేర్చుకున్నా...
విరాట్ కోహ్లిని చూసే స్పిన్‌ను ఎలా ఆడాలో తాను నేర్చుకున్నానని ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. కోహ్లి ఆఫ్‌సైడ్ బంతిని కొట్టే పద్ధతిని తాను అనుసరించినట్లు వివరించాడు. భారత పర్యటనలో కీపర్, స్లిప్ క్యాచ్‌లతో అవుట్ కాకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. బ్యాట్‌ను పట్టుకునే తీరు మార్చుకోవడం వల్ల మైదానంలో అన్నివైపులా షాట్లు కొట్టగలిగానన్న స్మిత్... కోహ్లితో పాటు డివిలియర్స్, విలియమ్సన్లను కూడా వేర్వేరు అంశాల్లో అనుకరించినట్లు వెల్లడించాడు. -
స్మిత్ అడ్డుగోడలా...
మెల్బోర్న్: మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (275 బంతుల్లో 102 నాటౌట్; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్మిత్‌కు జతగా వార్నర్ (227 బంతుల్లో 87; 8 ఫోర్లు), మిచెల్ మార్‡్ష (166 బంతుల్లో 29 నాటౌట్) కూడా పట్టుదలగా ఆడటంతో ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 103/2తో శనివారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 124.2 ఓవర్లలో 263/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితం రాదని ముందే తేలడంతో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. దాదాపు రోజంతా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి మరో 160 పరుగులు మాత్రమే జతచేసింది. చివరి టెస్టు గురువారం సిడ్నీలో ప్రారంభం కానుంది. -
బ్రాడ్‌మన్ తర్వాత స్మిత్!
దుబాయ్: డాన్ బ్రాడ్‌మన్. దివంగత ఆస్ట్రేలియన్ దిగ్గజం. బ్యాటింగ్‌లో అయినా... రేటింగ్స్‌లో అయినా ఆయన తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు మాత్రం ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ రేటింగ్స్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటిం గ్ పాయింట్ల జాబితాలో అలనాటి దిగ్గజం తర్వాతి స్థానం స్మిత్‌దే కావడం విశేషం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిన స్మిత్ ఆసీస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే విజేతగా నిలిపాడు. తాజా రేటింగ్ పాయింట్లతో అతను ఆల్‌టైమ్ గ్రే‘టెస్ట్’ బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరిపోయాడు. ఇంగ్లండ్ గ్రేట్ లెన్ హటన్ (945) రికార్డును సమం చేసిన 28 ఏళ్ల స్మిత్... ఆస్ట్రేలియన్ ‘డాన్’కు కేవలం 16 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఎవరూ చేరనంత ఎత్తులో ఉండగా... ఇప్పుడు స్మిత్ సెంచరీ, డబుల్ సెంచరీలతో ఆ పీఠం చేరేందుకు అడుగులు వేస్తున్నాడు. సగటుల్లోనూ స్మిత్ (62.32) బ్రాడ్‌మన్ (99.94) తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ నూటికి చేరువగా ఉన్న ఆ దిగ్గజాన్ని అందుకోవడం కష్టమే! అయితే సెంచరీల్లో మాత్రం యథేచ్చగా దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 59 టెస్టుల్లో 22 సెంచరీలు చేసిన స్మిత్... ఇందులో కెప్టెనయ్యాక చేసినవే 14 ఉన్నాయి. సారథిగా 29 టెస్టుల్లోనే ఈ 14 సెంచరీలు చేయడం విశేషం. -
స్మిత్ అజేయ ద్విశతకం
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు హవా కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 203/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రోజంతా బ్యాటింగ్ చేసి కేవలం ఒక్క వికెటే కోల్పోయి 346 పరుగులు చేయడంతో... జట్టు స్కోరు 549/4 కు చేరింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (390 బంతుల్లో 229 బ్యాటింగ్; 28 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (234 బంతుల్లో 181 బ్యాటింగ్; 29 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 301 పరుగులు జతచేశారు. ఇంగ్లండ్‌పై పెర్త్‌లో ఆస్ట్రేలియాకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మూడో రోజు పడిన ఏకైక వికెట్ షాన్ మార్ష్ (28)ను మొయిన్ అలీ అవుట్ చేశాడు. 92 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో స్మిత్‌కు ఇది 22వ సెంచరీ. 58వ టెస్టు ఆడుతున్న స్మిత్ 107వ ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. గతంలో... బ్రాడ్‌మన్ (58 ఇన్నింగ్స్‌లు), గావస్కర్ (101 ఇన్నింగ్స్‌లు) మాత్రమే అతనికన్నా వేగంగా ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 403 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన స్మిత్
ఆసీస్ కెప్టెన్ స్మిత్ మరో అరుదైన జాబితాలో చేరిపోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు పూర్తిచేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సచిన్ 110 మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు చేయగా, స్మిత్ 105 మ్యాచ్‌ల్లోనే పూర్తి చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టులో స్మిత్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఇప్పటి వరకూ ఈ జాబితాలో నలుగురు మాత్రమే ఉండగా తాజాగా స్మిత్ ఈ జాబితాలో చేరకున్నాడు, గతంలో బ్రాడ్‌మన్ 21 టెస్టు సెంచరీలను 56 మ్యాచ్‌ల్లో పూర్తి చేయగా, గవాస్కర్ 98 ఇన్నింగ్స్‌ల్లో పూర్తిచేశాడు. తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా ఇప్పుడు స్మిత్ ఆస్థానానికి వచ్చాడు. ఐదోస్థానంలో పాకిస్తాన్‌కు చెందిన యూసఫ్ యుహానా ఉన్నాడు. -
వివాదం లేకపోతే మజా ఏముంటుంది?
భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్... ఏదో ఒక రూపంలో వ్యాఖ్యనో, వివాదమో వెంట రావడం చాలా సహజం. అందులోనూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాత్ర లేకుండా ఏదీ జరగదేమో! రెండో వన్డేలో మరోసారి అలాంటి ఘటన జరిగింది. రిచర్డ్సన్ వేసిన 48వ ఓవర్లో నాలుగో బంతిని పాండ్యా గాల్లోకి ఆడగా కవర్స్‌లో స్మిత్ దానిని క్యాచ్ పట్టాడు. అయితే బంతి ఎత్తుపై అనుమానం ఉన్న స్మిత్ ముందు జాగ్రత్తగా రనౌట్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బౌలర్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను పడగొట్టాడు. మరోవైపు ఎలాగూ క్యాచ్ ఇచ్చానని భావించిన పాండ్యా దీన్నంతా గమనించకుండా పెవిలియన్ వైపు నడిచాడు. అదే సమయంలో వర్షం రావడం వల్ల ఫీల్డ్ అంపైర్లు కూడా ఆ పరిణామాలపై దృష్టి పెట్టకుండా మైదానం వదిలారు. అయితే విరామం అనంతరం మూడో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో పాండ్యా నాటౌట్ అని తేలింది. అలా అయితే రనౌట్‌ను ఎలా కాదంటారంటూ స్మిత్ అంపైర్లతో వాదనకు దిగాడు. తాము రనౌట్ చేసినప్పుడు బంతి ఇంకా ‘డెడ్’ కాలేదని అతను చెప్పాడు. అయితే ఐసీసీ నిబంధనల (27.7) ప్రకారం... అంపైర్ అవుట్‌గా ప్రకటించక ముందే బ్యాట్స్‌మన్ తనకు తాను అవుటైనట్లు భావించి మైదానం వీడినప్పుడు, ఈ విషయంలో అంపైర్ సంతృప్తి చెందితే... తాను జోక్యం చేసుకొని తర్వాతి పరిణామాలను చెల్లనివిగా పరిగణిస్తూ బ్యాట్స్‌మన్‌ను తిరిగి క్రీజ్‌లోకి పిలవవచ్చు. అంపైర్ నిర్ణయం స్మిత్‌లో మళ్లీ అసహనం పెంచిందనడంలో సందేహం లేదు. -
చావో రేవో తేల్చుకుంటాం: స్మిత్
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో జరిగే చావో రేవో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. టోర్నీలో ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దవ్వడంతో ఆసీస్‌కు క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. గ్రూప్-ఏ లో మిగిలిన ఇంగ్లండ్ మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది.రెండు పాయింట్లతో ఉన్న ఆసీస్ టోర్నీ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పని సరిగా గెలవాల్సిందే. ఆడిన రెండు మ్యాచుల్లో ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. శనివారం ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు రాణిస్తారని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ను ఎదుర్కోనేందుకు తమ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని, బౌలింగ్, బ్యాటింగ్ విభాగం బలంగా ఉందని స్మిత్ నొక్కి చెప్పాడు. మా జట్టు ఆటగాళ్లు గత కొద్ది రోజులుగా మంచి క్రికెట్ ఆడారని, ఐపీఎల్ లాంటి టోర్నిలతో ఫామ్‌లోకి వచ్చారని, ఇదే మా జట్టును ముందుకు తీసుకువెళ్తుందని స్మిత్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు రాణించారని, ఇదే ఊపుతో ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తామన్నాడు.బంగ్లాపై 4 వికెట్లు తీసిన స్టార్క్‌ను స్మిత్ కొనియాడాడు. -
మూడో టైటిల్ లక్ష్యంగా...
►ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా ►పేస్ బౌలర్లే బలం ►బ్యాటింగ్ భారం స్మిత్‌పైనే నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇంగ్లండ్, శ్రీలంక చేతిలో ఆ జట్టు ఓడగా... కివీస్‌తో మ్యాచ్ రద్దయింది. అంతకు ముందు వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన కంగారూలు, ఇంగ్లండ్‌లో స్వింగ్‌కు అనుకూలించిన పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆ జట్టు సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గినా... టోర్నీలో ఆ జట్టు ఓడిన ఏకైక మ్యాచ్ కూడా స్వింగ్‌కు అనుకూలించిన ఆక్లాండ్‌లోనే జరిగింది. ఈ సారి అలాంటి పరిస్థితుల్లోనే గ్రూప్ దశలో న్యూజిలాండ్, ఇంగ్లండ్లతోనే ఆసీస్ తలపడాల్సి ఉంది. మరి ఆ సవాల్‌ను ఆస్ట్రేలియా అధిగమించగలదా... ఆ దశను దాటి ముచ్చటగా మూడో సారి చాంపియన్‌గా నిలవగలదా అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా (2006, 2009) రెండు సార్లు నెగ్గింది. భారత్ ఒకసారి సంయుక్త విజేతగా నిలవడాన్ని మినహాయిస్తే పూర్తి ఆధిపత్యంతో రెండు టైటిల్స్ తమ ఖాతాలో వేసుకున్న ఏకైక జట్టు ఆసీస్. 2013 టోర్నీలో ఆడిన ఆసీస్ ఆటగాళ్లలో నలుగురు మాత్రమే ప్రస్తుత జట్టుతో ఉన్నారు. ఆ టోర్నీలో జట్టులోనే లేని స్టీవ్ స్మిత్, ఈ సారి తన నాయకత్వంతో కంగారూలకు తొలి టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే చాంపియన్‌గా నిలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆ జట్టు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతుల్లో ఓడినా... అందులో ద్వితీయ శ్రేణి జట్టునే బరిలోకి దించింది. ఆ నలుగురు... చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ గెలుపోటములు ప్రధానంగా నలుగురు పేసర్లపై ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒకరితో పోలిస్తే మరొకరు వైవిధ్యాన్ని ప్రదర్శించే మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, ప్యాటిన్సన్ టీమ్‌లో ఉన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ నలుగురు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లోని సీమ్, స్వింగ్ పరిస్థితులను వీరు ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటారనేదే కీలకం. ప్రతీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీయగల సత్తా వీరికుంది. 2015 నుంచి చూస్తే టాప్–8 జట్లపై 67 వికెట్లు తీసిన స్టార్క్ ఈసారి మరింత ప్రమాదకారి కాగలడు. గాయం నుంచి కోలుకొని అతను పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడు. ఇక ఐపీఎల్లో భారత్ తరహా పిచ్‌లపైనే కనీసం 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన కమిన్స్ కూడా అమితోత్సాహంతో ఉన్నాడు. ‘మేం నలుగురం కలిసి ఆడుతూ కలిసి పెరిగాం. ఒకేసారి కలిసి ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. దాని కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాం. మా ప్రదర్శనతో జట్టును గెలిపించడమే లక్ష్యం’ అని స్టార్క్ చెబుతున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా జట్టులో ఉన్నా, ఐదో బౌలర్‌గా అతనికి అవకాశాలు ఇవ్వడం సందేహమే. వార్నర్ చెలరేగుతాడా... ప్రపంచంలోని ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్‌పైనా కూడా ప్రస్తుతం చెలరేగిపోగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. కెప్టెన్‌గా వ్యూహరచనతో పాటు ఆటగాడిగా అతను ఇప్పుడు ఆసీస్‌కు అమూల్యమైన ఆస్తి. నిజానికి ఇంగ్లండ్‌లో అతని రికార్డు ఏమీ గొప్పగా లేదు. 11 మ్యాచ్‌లలో అతను కేవలం ఒకే అర్ధసెంచరీతో 279 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అదంతా గతం. గత రెండేళ్లలో రాటుదేలిన స్మిత్ అద్భుతంగా చెలరేగిపోతున్నాడు. అటు దూకుడుతో పాటు ఇటు మధ్య ఓవర్లలో నియంత్రణతో అతను బ్యాటింగ్ చేయగలడు. మిగతా ఇతర కీలక బ్యాట్స్‌మెన్ వార్నర్, క్రిస్ లిన్, ఫించ్, మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఆటగాళ్లే. అయితే టి20 శైలిని కాస్త పక్కన పెట్టి వీరు అసలైన వన్డే ఇన్నింగ్స్‌లు ఆడితే ఆసీస్‌కు టోర్నీలో మంచి అవకాశాలు ఉన్నాయి. లిన్ కూడా వన్డేల్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. 2015 తర్వాత ఆసీస్ తరఫున వార్నర్ అత్యధికంగా 2,021 పరుగులు చేశాడు. గత ఏడాది కాలంలోనే వార్నర్ 8 సెంచరీలు సాధించినా... ఇంగ్లండ్‌లో అతనికీ పేలవమైన రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై అతను ఏ ఫార్మాట్లో కూడా సెంచరీ సాధించలేకపోయాడు. స్వింగ్ పరిస్థితుల్లో తమ బౌలింగ్‌ను నమ్ముకుంటున్న ఆ జట్టు బ్యాటింగ్ కూడా అలాంటి స్థితినే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందే. ►చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మొత్తం 21 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 12 గెలిచి, 7 ఓడగా మరో 2 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. జట్టు వివరాలు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, హెడ్, స్టొయినిస్, హెన్రిక్స్, వేడ్ (వికెట్ కీపర్), జంపా, ప్యాటిన్సన్, హేస్టింగ్స్, హాజల్‌వుడ్, స్టార్క్, కమిన్స్. -
గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ: స్టీవ్ స్మిత్
ఇంగ్లండ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిని గెలిచే అవకాశాలు తమకే ఉన్నాయని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌తో గత రెండు నెలలుగా భారత్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ టోర్నమెంట్‌ను అస్వాదించామని స్మిత్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అనువైన ప్రదేశమని, ఇక్కడ ఆటగాళ్ల సత్తా బయటకు వస్తుందని చెప్పాడు. గత కొద్ది రోజులుగా మేము తీరిక లేకుండా గడిపామని అయినా శారీరకంగా, మానసికంగా దృడంగా ఉన్నామని పేర్కొన్నాడు. రెండు సంత్సరాలకోసారి జరిగే ఈ ట్రోఫి మాకు చాల ముఖ్యమైనదని, మా విజయాలకు కొంత బ్రేక్ వచ్చినా.. ఇప్పుడు టైటిల్ లక్ష్యంగా ఆడుతామని స్మిత్ చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్ లో ఆస్ట్రేలియా గట్టి పోటినిచ్చిందని గుర్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫిలో మాకు మంచి రికార్డు ఉంది. దీన్ని ఇలానే కోనగిస్తామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గెలుపే మాకు కావలి దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని దాని పైనే మా దృష్టంతా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ సీరిస్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ మినహా వన్డేలు ఆడలేదని, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరిదన్నాడు. ఈ సిరీస్ లో 2-0 ఓడిపోయిన దీని ప్రభావం మా పై ఉండదని, చాంపియన్స్ ట్రోఫికి ముందే జరిగే వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటామన్నాడు. ఆస్ట్రేలియాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, ఇక్కడ ఇంతకు ముందు రాణించిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని, కచ్చితంగా టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నిలో పాల్గొనె జట్లు అన్ని బలంగా ఉన్నాయని, మంచి క్రికెట్ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. -
నేడే చూడండి... మహా సంగ్రామం
-
నేడే చూడండి... మహా సంగ్రామం
♦ నేడు హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ ♦ ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పుణే ఢీ ♦ మూడో టైటిల్‌పై రోహిత్ సేన దృష్టి ♦ తొలి ట్రోఫీపై స్మిత్ బృందం గురి తొమ్మిదేళ్లలో రెండు సార్లు విజేతగా నిలిచి, మరోసారి ఫైనల్లో ఓడిన జట్టు ఒకవైపు... లీగ్‌లోకి అడుగు పెట్టిన రెండో ఏడాదే టైటిల్‌పై గురి పెట్టిన జట్టు మరోవైపు... అభిమానుల అంచనాలకు తగినట్లుగా రాణించి అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఒకవైపు... ఏడాది క్రితం పరాభవం నుంచి కోలుకొని, ఆపై అనూహ్యంగా దూసుకుపోయి పోటాపోటీగా రెండో స్థానంలో నిలిచిన టీమ్ మరోవైపు... ఐపీఎల్–10లో నిలకడగా రాణించిన రెండు జట్ల మ«ధ్యే అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్లో రెండు మరాఠా జట్ల మధ్య పోరులో 3–0తో పుణేదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే ఈ మహా సంగ్రామంలో అంతిమ విజేత ఎవరో? సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ వినోదానికి రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా, తొలి క్వాలిఫయర్‌లో ముంబైనే చిత్తు చేసి పుణే ఫైనల్లోకి అడుగు పెట్టగా... టేబుల్ టాపర్ ముంబై రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో పాటు తాజా ప్రదర్శన అనంతరం మానసికంగా కూడా ఇరు జట్లు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా మూడు నాకౌట్ మ్యాచ్‌ల తరహాలో కాకుండా ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగాలని అంతా కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు... ఎమ్మెస్ ధోనిని పుణే యాజమాన్యం కెప్టెన్‌గా తొలగించిందేమో గానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించలేకపోయింది! ఈ సీజన్లో పుణే అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణేకు తిరుగుండదు. వీరిద్దరు బ్యాటింగ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. తొలి క్వాలిఫయర్‌లో ధోని బ్యాటింగ్ అతని సత్తాను మళ్లీ చూపించగా, స్మిత్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఓపెనింగ్‌కు తోడు రహానే కూడా వేగంగా ఆడటం అవసరం. ఈ సీజన్లో మధ్య ఓవర్లలో (7–15) పుణే బ్యాటింగ్ వేగం మరీ మందకొడిగా ఉంది. దీనిని సరిదిద్దాలంటే మిడిలార్డర్ రాణించాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లోనూ స్టోక్స్ అందుబాటులో లేకపోయినా గట్టెక్కిన పుణే, ఈ సారి ముంబైపై మరింత పదునైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. గత మ్యాచ్ నెగ్గిన జట్టులో పుణే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విదేశీ ఆటగాళ్లలో క్రిస్టియాన్ చివరి ఓవర్లలో కీలకం కానున్నాడు. లీగ్ దశలో తమ చివరి పది మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి సూపర్ ఫామ్ కనబర్చిన పుణే, ఆ తర్వాత క్వాలిఫయర్‌లో కూడా చెలరేగింది. తమ టైటిల్ కలను నిజం చేసే మరో విజయం కోసం ఆ జట్టు ఎంతగా శ్రమిస్తుందో చూడాలి. అంతా బాగుంది... పవర్‌ప్లేలో ప్రత్యర్థికి అతి తక్కువ పరుగులు ఇచ్చి బ్యాటింగ్ సమయంలో మాత్రం చివరి 5 ఓవర్లలో చితక్కొట్టడంలో ఈ సీజన్లో ముంబై విజయమంత్రం దాగి ఉంది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 43 ఫోర్లు బాదితే, సిక్సర్లే 45 కొట్టడం విశేషం. ఇక బౌలింగ్‌లో ముఖ్యంగా మెక్లీనగన్, బుమ్రా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు రాణించడంతో మలింగ వైఫల్యం పెద్దగా కనపడలేదు. తన ఐపీఎల్ కెరీర్లో మలింగ ఇంతగా ఎప్పుడూ విఫలం కాలేదు. మెక్లీనగన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా లేక జాన్సన్‌ను కొనసాగిస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో చెలరేగిన కరణ్ శర్మకు ఉప్పల్ మైదానంలో అందరికంటే ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. సిమన్స్ విఫలమవుతున్నా, ఫైనల్ పోరులో మాత్రం జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ ఫామ్‌లోకి రాగా.. రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌ల మెరుపులు ముంబైకి భారీ స్కోరు అందించగలవు. అన్నింటికీ మించి వీరిలో తొమ్మిది మందికి ఐపీఎల్ ఫైనల్లో ఆడి ఒత్తిడిని తట్టుకున్న అనుభవం ఉండటం కూడా ముంబైకి అదనపు బలంగా మారనుంది. పదేళ్ల ఐపీఎల్లో అటు ఆటతో పాటు ఇటు భారీ బలగంతో కూడా అందరినీ ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్, మిగతా జట్లను వెనక్కి తోస్తూ ముచ్చటగా మూడో టైటిల్ గెలిస్తే అది సరైన ముగింపు అవుతుంది. ♦ గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. ఫైనల్ అంటే ఫైనలే. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారు. –స్మిత్ ♦ పుణేపై మాకు రికార్డు బాగా లేదు. అయితే ఏ ఒక్కరి పైనో ఆధారపడకుండా సమష్టిగా ఆడి ఫైనల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంది. –రోహిత్ శర్మ రాత్రి గం. 8 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం సాధారణ టి20 తరహా బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ సీజన్లో అటు పెద్ద స్కోర్లు, ఇటు తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. ఆటగాళ్ల ప్రతిభ మినహా మ్యాచ్ ఫలితాలపై అసాధారణంగా పిచ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం నగరంలో తీవ్రమైన ఎండ. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం లేదు. ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే కొద్దిసేపు వాన అడ్డు పడినా, ఓవర్ల కోత లేకుండా పూర్తి మ్యాచ్ సాగింది. ⇔ ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. గతంలో 2010లో చెన్నై చేతిలో ఓడిన జట్టు... 2013, 2015లలో చెన్నైనే ఓడించి విజేతగా నిలిచింది. ⇔ ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడటం ఇది ఏడో సారి. రెండు సార్లు (2010, 2011) టైటిల్ గెలిచిన జట్టుకు అతను కెప్టెన్. ⇔ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న అతి పిన్న వయస్కుడు వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 228 రోజులు) తుది జట్ల వివరాలు (అంచనా) రైజింగ్ పుణే సూపర్ జెయింట్: స్మిత్ (కెప్టెన్), రహానే, త్రిపాఠి, మనోజ్ తివారి, ధోని, క్రిస్టియాన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గూసన్, జంపా, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జాన్సన్/మెక్లీనగన్, కరణ్ శర్మ, బుమ్రా, మలింగ. -
ధోనిని పొగడ్తలతో ముంచిన స్మిత్
ముంబై: రైజింగ్ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోని ధనాధన్ షాట్ లతో ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పుణె 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ధోని 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో జట్టు 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్ మహీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. వాంఖేడే పిచ్ ను బౌలింగ్ పిచ్ గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో మనోజ్, మహీ రాబట్టారన్నాడు. పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న కూడా మహీ పరుగుల రాబట్టడాని స్మిత్ కొనియాడాడు. అజింక్యా రహానే జట్టుకు శుభారంబాన్ని అందించడం కూడా జట్టు విజయానికి కలిసొచ్చిందని స్మిత్ తెలిపాడు. అయితే పుణె 18 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలింది. మెక్లిన్ గన్ వేసిన19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్ ను బౌండరీకి బాది, ఆతరువాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్ చివరి బంతికి మనోజ్ తివారీ రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్ లు బాదడంతో పుణెకు 15 పరుగులు చేరాయి. -
రూ.14 కోట్లకు న్యాయం చేశాడు: స్మిత్
పుణే: బెన్ స్టోక్స్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అతని ప్రైజ్ టాగ్ కు తగిన న్యాయం చేశాడని రైజింగ్ పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్-10 వేలంలో అత్యధికంగా రూ. 14.5 కోట్లు పలికిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రైజింగ్ పుణే దక్కించుకున్న విషయం తెలిసిందే. సోమవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెన్ స్టోక్స్ శతకం బాది ఒంటి చెత్తో మ్యాచ్ గెలిపించాడు. 162 పరుగుల లక్ష్య చేదనలో పుణే టాపర్డర్ చేతులెత్తయడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. చివర్లో రెచ్చిపోయి ఆడిన స్టోక్స్ జట్టుకు విజయానందించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంచాడు. మ్యాచ్ అనంతరం స్టోక్స్ పదర్శన పై స్సందించిన పుణే కెప్టెన్ స్మిత్ ' మేము చక్కని ఆరంభాన్ని అందించకున్నా ఎంఎస్, స్టోక్స్ రాణించారు. ఈ గ్రౌండ్ లో సిక్స్ లను సులభంగా కొట్టవచ్చు దీన్ని స్టోక్స్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. స్టోక్స్ దాటిగా ఆడటమే మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. గుజరాత్ ను సాధారణ లక్ష్యం (161) కట్టడి చేయడంలో బౌలర్లు కృషి ఎంతో ఉంది. మా స్పిన్ బౌలింగ్ విభాగం బలంగా లేకున్నా పేసర్లు రాణించారని, తొలి ఆరు ఓవర్లో పరుగులను కట్టడి చేశామని' స్మిత్ తెలిపాడు. మేము సరైన సమయంలో పుంజుకున్నామని భావిస్తున్నట్లు స్మిత్ పేర్కొన్నాడు. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఉన్నాయని, వీటిలో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
ధోని హీరో.. విలన్.. స్మిత్: స్టోక్స్
పుణే: భారత క్రికెటర్, రైజింగ్ పుణే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని బాలీవుడ్ హీరో అని, పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ విలన్ అని సరదాగా చమత్కరించాడు బెన్ స్టోక్స్. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న రైజింగ్ పుణే బుధవారం కోల్ కతా తో జరిగే మ్యాచ్ గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. మహేంద్ర సింగ్ ధోని విరోచిత బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పై, రూ.13 కోట్ల ఆటగాడు బెన్ స్టోక్స్ బౌలింగ్ తో ముంబై పై స్టన్నింగ్ విక్టరీలు అందుకున్న పుణే అదే ఊపు ను కోల్ కతా పై కొనసాగించాలనుకుంటుంది. ఈ సందర్భంగా పుణే ఆటగాళ్లు కోన్ని లాకర్ రూం ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సరదాగా గడిపిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. దీనిలో కొన్ని సరదా ప్రశ్నలకు పుణే ఆటగాళ్లు చమత్కారమైన సమాధానాలు ఇచ్చారు. ఈ జట్టులో రహ్యాసాన్ని కాపాడే వ్యక్తి ఏవరని ధోనిని ప్రశ్నించగా తన ఫోటో ప్లకార్డునే చూపించాడు. ఇదే ప్రశ్నకు అజింక్యా రహేనా కూడా ధోని ప్లకార్డు చూపించాడు. బెన్ స్టోక్స్ మాత్రం డుప్లెసిస్ ను చూపించాడు. ముగ్గురు ఏకగ్రీవంగా రహస్యాన్ని కాపాడే వ్యక్తి అశోక్ దిండా అని ఒప్పుకున్నారు. ఈ జట్టులో అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కవగా ఉన్న క్రికెటర్ ఏవరు అన్న ప్రశ్నకు బెన్ స్టోక్స్, రహానే 'ధోని' అని చెప్పగా ధోని కూడా తనకే ఉంటారన్నాడు. ఐపీఎల్ జట్లలో బాలీవుడ్ హీరోలా ఉండే క్రికెటర్ ఎవరని అడగ్గా స్టోక్స్ వెంటనే ధోని ప్లకార్డు చూపించాడు. ఇక విలన్ ఎవరనగా నవ్వుతూ పుణే కెప్టెన్ స్మిత్ ప్లకార్డును చూపించాడు ఈ ఇంగ్లండ్ ఆటగాడు. -
స్మిత్ అద్భుత బ్యాట్స్‌మన్ : గంగూలీ
కొల్కతా: రైజింగ్ పుణే సూపర్‌గెయింట్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన జీవితాంతం ఫామ్ కలిగి ఉంటాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే 7 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్ 84 (54 బంతులు)ను గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు. స్మిత్ అధ్భుతంగా ఆడాడని, కెప్టెన్‌గా పుణేకు విజయం అందించాడని అభిప్రాయపడ్డాడు. స్మిత్ నాణ్యమైన ఆటగాడని, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని గంగూలీ పేర్కొన్నాడు. 27 ఏళ్ల స్మిత్ తన టెస్టు కెరీర్‌ను లెగ్‌స్పిన్నర్‌గా ఆరంభించాడు. బ్యాటింగ్ ఎనిమిదో స్ధానంలో చేసేవాడు. బోర్డర్- గవాస్కర్ సిరీస్‌లో 3 సెంచరీలతో 499 పరుగుల చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
నాకు మాత్రం దోనీ మంచి కెప్టెన్
-
పుణే ‘సూపర్’
-
పుణే ‘సూపర్’
⇒ ముంబై ఇండియన్స్‌పై విజయం ⇒రహానే, స్మిత్ అర్ధ సెంచరీలు ⇒హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ వృథా గత సీజన్లో ఎదురైన పరాభవాన్ని మరచిపోయేందుకు సరి‘కొత్త’గా తయారైన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తొలి మ్యాచ్‌లోనే జోరు చూపింది. ఆరంభంలో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్పిన్నర్ తాహిర్, పేసర్ రజత్ భాటియా కట్టడి చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్, రహానే అదరగొట్టే ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపించారు. పుణే: కొత్త కెప్టెన్ రాకతో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఆటతీరు కూడా మారింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన జట్టు ఐపీఎల్ పదో సీజన్లో బోణీ కొట్టింది. చివరి ఓవర్లో 13 పరుగులు రావాల్సి ఉండగా తొలి మూడు బంతులు సింగిల్స్ రావడంతో ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతులను కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్లుగా మలచడంతో పుణే గట్టెక్కింది. అజింక్యా రహానే (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నితిష్ రాణా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడగా చివర్లో హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసింది. ఐపీఎల్లో అతి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన స్టోక్స్ బౌలింగ్‌లో ఓ వికెట్ తీయగా బ్యాటింగ్‌లో 21 (14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మిత్‌కి దక్కింది. చివర్లో ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 11 పరుగులు రాబట్టింది. అయితే దిండా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పార్థివ్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను థర్డ్ మ్యాన్‌లో ఉన్న రజత్ భాటియా జారవిడిచాడు. బెన్ స్టోక్స్ తను వేసిన తొలి ఓవర్లోనే బట్లర్ రెండు సిక్సర్లు బాది జోరు చూపాడు. ఇమ్రాన్ తాహిర్ వేసిన తొలి ఓవర్లోనే పార్థివ్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్లో బట్లర్ మరోసారి విరుచుకుపడి వరుస బంతుల్లో 4,6 తో రెచ్చిపోయాడు. అయితే తాహిర్ తన రెండో ఓవర్ మూడు బంతుల్లో కెప్టెన్ రోహిత్ (3), ధాటిగా ఆడుతున్న బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత రాణా, పొలార్డ్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా 6,6,6,4,6 బాదడంతో జట్టు స్కోరు అమాంతం 154 పరుగుల నుంచి 184 పరుగులకు చేరింది. రహానే, స్మిత్ అదుర్స్: పుణే ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ నుంచి అజింక్యా రహానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిచాడు. హార్ధిక్ వేసిన ఆ ఓవర్లో మూడు ఫోర్లు బాదగా మూడో ఓవర్లో వరుసగా 6,4తో చెలరేగాడు. కానీ మూడో ఓవర్లో మయాంక్ (6) వికెట్‌ను మెక్లీనగన్ తీశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ దశలో రహానేకు సహకారం అందించాడు. మెక్లీనగన్ మరుసటి ఓవర్లో స్మిత్ ఫోర్‌తో పాటు రహానే వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో పుణే 59 పరుగులు చేసింది. 9వ ఓవర్లో రహానే బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సౌతీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రహానే సూపర్ ఇన్నింగ్స్ నితిష్ రాణా అద్భుత డైవ్ క్యాచ్‌తో ముగిసింది. అయితే అటు స్మిత్ జోరు మాత్రం ఆగలేదు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రాణా మిస్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 37 బంతుల్లో తను అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ఇచ్చిన క్యాచ్‌ను సౌతీ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్లో స్మిత్ జోరుతో పుణే నెగ్గింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (బి) తాహిర్ 19; బట్లర్ ఎల్బీడబ్లు్య (బి) తాహిర్ 38; రోహిత్ (బి) తాహిర్ 3; రాణా (సి) భాటియా (బి) జంపా 34; రాయుడు (సి అండ్ బి) భాటియా 10; కృనాల్ పాండ్యా (సి) ధోని (బి) భాటియా 3; పొలార్డ్ (సి) మయాంక్ (బి) స్టోక్స్ 27; హార్దిక్ పాండ్యా నాటౌట్ 35; సౌతీ రనౌట్ 7; మెక్లీనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–45, 2–61, 3–62, 4–92, 5–107, 6–125, 7–146, 8–183 బౌలింగ్: దిండా 4–0–57–0 ; దీపక్ చహర్ 2–0–21–0; స్టోక్స్ 4–0–36–1; తాహిర్ 4–0–28–3; జంపా 3–0–26–1; భాటియా 3–0–14–2 రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) రాణా (బి) సౌతీ 60; మయాంక్ అగర్వాల్ (సి) రోహిత్ శర్మ (బి) మెక్లీనగన్ 6; స్మిత్ నాటౌట్ 84; స్టోక్స్ (సి) సౌతీ (బి) హార్దిక్ పాండ్యా 21; ధోని నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 4; (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 187 వికెట్ల పతనం: 1–35, 2–93, 3–143 బౌలింగ్: సౌతీ 4–0–34–1, హార్దిక్ పాండ్యా 4–0–36–1; మెక్లీనగన్ 4–0–36–1; బుమ్రా 4–0–29–0; కృనాల్ పాండ్యా 2–0–21–0, పొలార్డ్ 1.5–0–30–0 ►ఐపీఎల్లో నేటి మ్యాచ్ గుజరాత్ లయన్స్ & కోల్‌కతా నైట్ రైడర్స్ ►వేదిక: రాజ్‌కోట్; రాత్రి. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లీ హోల్డర్, స్మిత్ ట్యూబ్‌లైట్ ..సెహ్వాగ్ ట్వీట్
ఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్ శైలితో అభిమానులు అలరించేవాడు. అంతార్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం వీరు తన వ్యంగ్యమైన ట్వీట్లతో క్రికెట్ అభిమానులును అలరిస్తున్నాడు. గత కొద్ది కాలంగా ప్రతి విషయంపై వ్యంగ్యమైన ట్వీట్లతో స్సందించిన వీరు. తాజాగా ధర్మశాల టెస్టులో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిడంతో టీంఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సీరీస్‌లో ప్రతిభ చూపించిన క్రికెటర్లకు తన ఇంట్లో వాడే వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి హోల్డర్, టీం సభ్యులు ఉమేశ్ యాదవ్‌కు పట్టుకారు( సాన్సీ) అశ్విన్, రహనేలకు డిసర్ట్ కూలర్, కుల్దీప్కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, పుజారాకు ఇన్వర్టర్, జడేజాకు నీటి పంపు మోటారు (టుల్లు పంపు), రాహుల్‌కు స్టెబ్లైజర్ వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. వీరు తన ఇంటి అవార్డులను ఆసీస్ ఆటగాళ్లకు సైతం కేటాయించాడు. సీరీస్‌లో సెంచరీలతో చెలరేగి 499 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ట్యూబ్‌లైట్, రాంచీ టెస్టు డ్రాగా మార్చిన ఆసీస్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్కోంబ్కు దువ్వెన (జూన్ కంగీ), అవార్డులు దక్కాయి. Congratulations Bharat on a wonderful season. Only Chuna in Puna. Great effort @anilkumble1074 in ensuring no complacency. — Virender Sehwag (@virendersehwag) 28 March 2017 -
'ధర్మశాల' దక్కేదెవరికో?
-
'ధర్మశాల' దక్కేదెవరికో?
నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ నిర్ణయాత్మక టెస్టు ►ఒత్తిడిలో ఆతిథ్య జట్టు ►కోహ్లి ఆడేది అనుమానమే ►ఇషాంత్ స్థానంలో షమీ! నిజానికి సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఇలాంటి ‘కష్టం’ ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. 4–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. అయితే అంచనాలు తారుమారై ఇప్పుడు భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా నుంచి లాగేసుకునేందుకు ధర్మశాలలో నేటి నుంచి జరిగే చివరి టెస్టును నెగ్గడం తప్పనిసరి. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి భుజం నొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతను ఆడేది అనుమానంగా మారింది. ఇదే జరిగితే బరిలోకి దిగకముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.. ఏదేమైనా ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ నెగ్గి సొంతగడ్డపై సాగిన సుదీర్ఘ టెస్టు సీజన్‌ను విజయవంతంగా ముగించాలని భారత్ కోరుకుంటోంది. ఇక మూడో టెస్టులో భారత్ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్ దూకుడుకు ఇక్కడి బౌన్సీ పిచ్ సహకారం అందిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. వార్నర్ మినహా అంతా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే్చ అంశం. దీంతో 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. ధర్మశాల: ఆటకన్నా వివాదాలతో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుత బోర్డర్–గావస్కర్ టెస్టు సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం స్టేడియం ‘తొలిసారి’గా వేదిక కానుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో విజయయాత్ర కొనసాగించింది. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్ సేన ఉంది. అయితే 1–1తో సిరీస్ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడేది అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను మ్యాచ్ ఫిట్నెస్ కలిగి ఉన్నాడా? అనేది సంశయాత్మకంగా ఉంది. ధర్మశాలలో గురువారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు అతను వచ్చినా బ్యాటింగ్ చేయలేదు. ఇప్పటికే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను బ్యాకప్‌గా తీసుకున్నారు. మరోవైపు ఆసీస్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిరీస్ గెల్చుకోవాలనే ఆలోచనలో ఉంది. తొలి టెస్టులో ఘనవిజయం తర్వాత రెండో టెస్టులో ఆజట్టు చతికిలపడినా రాంచీ మ్యాచ్‌లో పుంజుకుంది. చివరి రోజు అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయాన్ని అడ్డుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే కీలక పోరు అభిమానులను ఆకట్టుకోనుంది. కోహ్లి పరిస్థితేమిటి? కీలకమైన చివరి టెస్టులో కోహ్లి ఆడతాడా.. లేదా? అనే విషయంలో ఇప్పటిదాకా స్పష్టత కనిపించడం లేదు. తాను మాత్రం పూర్తి ఫిట్నెస్ లేకుండా బరిలోకి దిగనని తేల్చాడు. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఈ విషయం తేలే అవకాశం ఉంది. శుక్రవారం కొద్దిసేపు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినా ఫిజియో నిర్ణయం మేరకు నడుచుకుంటానని తేల్చాడు. అయితే ప్రత్యర్థికి మానసికంగా ఎలాంటి పైచేయి ఇవ్వకూడదనే ఆలోచనలో టీమిండియా మేనేజిమెంట్ ఉంది. అందుకే అతను మీడియా సమావేశానికి కూడా హాజరయ్యాడు. ఒకవేళ కోహ్లి ఆడలేకపోతే రహానే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బ్యాటింగ్‌లో మురళీ విజయ్ ఓపెనర్‌గా విజయవంతమవుతున్నాడు. అయితే తను శుక్రవారం ప్రాక్టీస్‌కు హాజరుకాకపోగా, అభినవ్ ముకుంద్ ఎక్కువసేపు శిక్షణ సాగించాడు. అలాగే రహానే, కరుణ్ నాయర్ కూడా కీలక సమయంలో బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. చతేశ్వర్ పుజారా ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాంచీలో డబుల్ సెంచరీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అటు కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో చెలరేగడం అనుకూలాంశం. బ్యాకప్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. తుది జట్టులో బరిలోకి దిగితే తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదిలావుండగా జట్టు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే కరుణ్ నాయర్ తప్పుకోవాల్సి వస్తుంది. ఉమేశ్ పేస్ బాధ్యతలు మోస్తున్నాడు. ఇషాంత్ ఇప్పటిదాకా మూడు వికెట్లు మాత్రమే తీయగా తన స్థానంలో జట్టులో చేరిన మొహమ్మద్ షమీ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా జట్టుకు ఉపయోగపడుతున్నారు. జోష్‌లో ఆస్ట్రేలియా... ఆసీస్ జట్టులో ఆందోళన ఏదైనా ఉందంటే అది ఓపెనర్ డేవిడ్ వార్నర్ వైఫల్యమే. మిగతా అన్ని అంశాల్లోనూ ఈ జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. కెప్టెన్ స్మిత్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి ఊపు మీదున్నాడు. మ్యాట్ రెన్షా చక్కటి ఆటతీరుతో ప్రశంసలందుకుంటున్నాడు. హ్యాండ్స్కోంబ్ మూడో టెస్టులో జట్టును ఆదుకున్న తీరు అపూర్వం. ఇక వార్నర్ ఒక్కడు ఫామ్‌లోకి వస్తే కీలక టెస్టులో భారత్‌కు ఇబ్బంది తప్పదు. మ్యాక్స్‌వెల్ తాను నిదానంగా కూడా ఆడగలనని సెంచరీతో నిరూపించుకున్నాడు. అయితే పిచ్‌ను బట్టి బౌలింగ్‌లో స్పిన్నర్ ఒకీఫ్‌ను తప్పించి అతడి స్థానంలో పేసర్ జాక్సన్ బర్డ్‌ను తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బౌన్సీ వికెట్ సిద్ధమైతే ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్, బర్డ్ భారత బ్యాటింగ్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే రాంచీలో ఆడిన జట్టునే కొనసాగించేందుకు ఆసీస్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. ‘తొలి’ ఓటమిని చెరిపేస్తారా..? అసలే సిరీస్‌ను నిర్ణయించే కీలక టెస్టు మ్యాచ్ ఆడబోతున్న భారత్‌కు ఇక్కడి ధర్మశాల స్టేడియంలో తమ రికార్డు భయపెడుతోంది. ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన తొలి అంతర్జాతీయ వన్డే, టి20ల్లోనూ భారత జట్టుకు ఓటమి ఎదురుకావడం ఇందుకు కారణం. 2013 ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో... 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్ పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ జరగబోయే అరంగేట్రం టెస్టులో భారత్ మెరుగ్గా ఆడి గత చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్, వాతావరణం గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పిచ్ ఎక్కువగా పేసర్లకు అనుకూలించింది. అయితే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో స్పిన్నర్లు విశేషంగా రాణించారు. ప్రస్తుతానికైతే పిచ్‌పై పచ్చిక ఎక్కువగానే కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం కట్ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్పిన్నర్లు కూడా కీలకంగా మారతారు. రెండు రోజుల అనంతరం వర్ష సూచనలున్నాయి. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్)/అయ్యర్, విజయ్/అభినవ్ ముకుంద్, రాహుల్, రహానే, పుజారా, కరుణ్ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్/షమీ, ఉమేశ్ యాదవ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రెన్షా, షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, వేడ్, ఒకీఫ్, కమిన్స్, లయన్, హేజల్‌వుడ్. ⇒ ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి ఆట కావాలి!
►వరుసగా విఫలమవుతున్న భారత కెప్టెన్ ►చివరి టెస్టులోనైనా రాణించేనా! మాటకు మాట జవాబు... ప్రత్యర్థికి పోటీగా ఎదురుదాడి... మీడియా సమావేశాల్లో కూడా దూకుడు... ఆస్ట్రేలియాలాంటి జట్టుతో తలపడుతున్న సమయంలో ఒక కెప్టెన్‌గా ఎలా ఉండాలో విరాట్ కోహ్లి అన్నీ చేసి చూపించాడు. స్మిత్ దొంగతనాన్ని పట్టుకోవడంనుంచి వార్నర్‌ను ఆటపట్టించడం వరకు అన్నీ అయిపోయాయి. కానీ కోహ్లినుంచి జట్టు, అభిమానులు ఆశించే ఆట మాత్రం మూడు టెస్టులు ముగిసినా కనిపించలేదు. ఆసీస్‌తో పోరుకు ముందు వరకు వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్ సెంచరీలతో చెలరేగిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కనీసం అర్ధ సెంచరీ కూడా పూర్తి చేయలేదు! అటు వైపు తీవ్ర ఒత్తిడిలో కూడా ప్రత్యర్థి కెప్టెన్ పరుగుల వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం పూర్తిగా వెనుకబడిపోయాడు. ఇతర బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా కోహ్లి వైఫల్యం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. అద్భుతంలా సాగిన ఈ సీజన్లో చివరి టెస్టులోనైనా తన అసలు సత్తా ప్రదర్శించే కోహ్లి ఈ టెస్టును బ్యాటింగ్‌తోనూ చిరస్మరణీయం చేసుకుంటాడా అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం : బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టుల ఫలితాలు, వివాదల సంగతి పక్కన పెడితే ఆస్ట్రేలియా జట్టు ఒక విషయంలో మాత్రం పూర్తిగా సఫలమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడైన విరాట్ కోహ్లిని పరుగులు చేయకుండా ఆ జట్టు నిరోధించగలిగింది. 0, 13, 12, 15, 6... ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన స్కోర్లు ఇవి. ఈ సిరీస్‌కు ముందు అద్భుతమైన ఆటతో రికార్డులు తిరగరాసిన కోహ్లి అనూహ్య ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2014లో ఇంగ్లండ్‌లో ఘోర వైఫల్యంనుంచి కోలుకొని తన ఆటలో మార్పులు చేసుకున్న అనంతరం కోహ్లి కెరీర్లో ఇంత గడ్డు దశ ఎప్పుడూ రాలేదు. బ్యాట్స్‌మెన్ అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం సాధారణమే అని సర్ది చెప్పుకున్నా... కోహ్లి స్థాయి క్రికెటర్ అదీ సొంత గడ్డపై ఇలా ఇబ్బంది పడటం మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అతనికంటే ఎక్కువగా జట్టు భారాన్ని మోస్తున్న స్మిత్ అలవోకగా పరుగులు సాధిస్తుండగా, కోహ్లి మాత్రం తడబడ్డాడు. క్రీజ్‌లోనే తడబాటు... పుణే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఒక్కసారిగా మూడేళ్ల క్రితంనాటి కోహ్లిని గుర్తుకు తెచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంతి వదిలేసి బౌల్డ్ కావడంపై క్రికెట్ విశ్లేషకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బెంగళూరు టెస్టులో రెండు సార్లూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం అయితే అతని ఫుట్‌వర్క్ లోపాలను చూపించింది. గతంలో ఇదే తరహా సమస్య వచ్చినప్పుడు అతను సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేయడంతో పాటు తన లోపాన్ని సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కోహ్లి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే రాంచీ టెస్టుకు ముందు చాలా విరామం లభించినా కోహ్లి దీనిపై దృష్టి పెట్టినట్లు లేదు. తన స్థాయికి ఫామ్‌లోకి తిరిగి రావడం పెద్ద సమస్య కాకపోవచ్చని అతను భావించి ఉంటాడు. మూడో టెస్టులో కూడా కొత్త బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్‌లోనే క్యాచ్ ఇవ్వడం కోహ్లి సన్నాహకాల లోపాలను బయట పెట్టింది. ఒక సిరీస్ వైఫల్యం గొప్ప ఆటగాడి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ జట్టు బ్యాటింగ్‌కు మూలస్థంభంలాంటి ఆటగాడు మంచి ప్రదర్శన ఇవ్వాలని ఆశించడంలో తప్పు లేదు. ఒత్తిడి పెంచుకున్నాడా... రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో కోహ్లి... ఆసీస్ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో నాలుగు టెస్టులలో నాలుగు సెంచరీలు సాధించడంతో పాటు మాటల యుద్ధంలో కూడా కంగారూలతో సమానంగా బదులిచ్చాడు. ఈ సారి ఆ జట్టు భారత్‌కు వచ్చినప్పుడు కూడా తన దూకుడును ఎక్కడా తగ్గించవద్దని, పెద్దగా బలంగా లేని ఆసీస్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలని కూడా భావించి ఉంటాడు. మాటల దాడికి కూడా కోహ్లి ముందే సన్నద్ధమైనట్లున్నాడు. అదే మైండ్‌సెట్‌తో కోహ్లి తన బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడేమో అనిపిస్తోంది. మీడియాలో ఏం రాసినా పట్టించుకోను, అది వారి ఉద్యోగం అంటూ ఒక వైపు చెబుతున్నా... పుణే ఫలితం కోహ్లిపై ప్రతికూల ప్రభావం చూపించింది. రివ్యూ వివాదం విషయం, రాంచీ టెస్టు తర్వాత ఫిజియోపై వ్యాఖ్యల విషయంలో కూడా కోహ్లి అవసరానికి మించిన దూకుడు కనబర్చాడని, ఇది అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని వ్యాఖ్యలు వినిపించాయి. ఒక కెప్టెన్‌గా ఉంటూ వికెట్ తీసినప్పుడు వార్నర్‌కు భుజం చూపిస్తూ చేసిన సంజ్ఞను వీవీఎస్ లక్ష్మణ్ కూడా తప్పుపట్టారు.ఇక అర్థం పర్థం లేనివే అయినా... ఆస్ట్రేలియా మీడియా వార్తలు కూడా కోహ్లి దాకా చేరి అతని ఏకాగ్రతను దెబ్బ తీసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలోనైనా కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని అంతా కోరుకుంటున్నారు. గాయం తగ్గలేదా..! రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గురువారం భారత జట్టు నెట్ సెషన్‌కు అతను వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అతని భుజానికి ఇంకా బ్యాండేజీ కనిపిస్తోంది. కొద్ది సేపు వార్మప్‌లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్‌లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అయితే ముందు జాగ్రత్త కోసమే అతను బ్యాటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నాలుగో టెస్టుకు ముందు రోజు శుక్రవారం జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై మరింత స్పష్టత రావచ్చు. అయితే రాంచీలోనూ తన గాయంపై ఉన్న సందేహాలను తొలగిస్తూ బ్యాటింగ్‌కు దిగిన విరాట్ స్వభావం గురించిన తెలిసినవారు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టుకు అతను దూరంగా ఉండే అవకాశమే లేదని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అయ్యర్... కోహ్లి గాయం నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్తగా మరో బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేసింది. ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శుక్రవారం జట్టుతో చేరతాడు. ధర్మశాలలాంటి చోటుకు చివరి నిమిషంలో చేరుకోవడం కష్టం కాబట్టి, మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావించి అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో 1321 పరుగులతో టాపర్‌గా నిలిచిన అయ్యర్, ఈ సీజన్లో కూడా ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అయ్యర్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. -
ఆసీస్ కవ్వింపులకు కోహ్లీ చురక..
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో కవ్వింపులకు పాల్పడ్డ ఆసీస్ ఆటగాళ్లకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చురక అంటించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో జడేజా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆసీస్ ఆటగాళ్ల వెటకారాలకు కొంచెం కారం అద్ది కోహ్లీ రుచి చూపించాడు. తొలిరోజు ఫీల్డీంగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ , భుజం నొప్పి బాధతో కుడి చేతిని పట్టకుంటూ మైదానం వీడాడు. అయితే కోహ్లి రెండోరోజు మైదానంలోకి అడుగుపెట్టలేదు. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భుజం నొప్పిలా చేతిని పట్టుకొని కోహ్లీ గాయపడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎగతాళి చేశాడు. మరో ఆటగాడు మూడో టెస్టులోనే ఆరంగ్రేటం చేసిన మ్యాక్స్‌వెల్ సైతం పుజారా కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపి భుజం పట్టుకొని కోహ్లీని ఎగతాళి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకున్న కెప్టెన్ కోహ్లీ అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. వార్నర్(14) పరుగుల వద్ద ఔటవ్వడంతో తన భుజాన్ని తడుముతూ మరికొంచె ఎక్కువగా ఎటకారం చూపించాడు. అయితే ఈ వీడియోని కోహ్లీ అభిమానులు ట్వీట్టర్, ఫేస్బుక్లో షేర్చేస్తూ కోహ్లీకి మద్దతు తెలిపారు. ఇక మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలా ఎగతాళి చేస్తాడో చూడాలి.. -
సాహాహ్హహ్హహ్హ...
తొలి రోజు సీరియస్‌గా సాగుతున్న రాంచీ టెస్టులో భారత కీపర్ వృద్ధిమాన్ సాహా కాస్త వినోదం పంచాడు! స్మిత్‌ను ఎలాగైనా అవుట్ చేసేందుకు అతను పడిన కష్టం మైదానంలో నవ్వులు పూయించింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్లో జడేజా వేసిన బంతిని స్మిత్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగలకుండా స్మిత్ కాళ్ల మధ్యలోకి చేరింది. అప్పటికే బంతి ‘డెడ్‌బాల్’గా మారిపోయినా సాహా మాత్రం పట్టు వదల్లేదు. స్మిత్ కాళ్ల మధ్య నుంచి బంతిని లాగి మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు! ఈ క్రమంలో అతను స్మిత్ వైపు వెళ్ళగా, సాహా ఏం చేస్తున్నాడో అర్థం కాక స్మిత్ కూడా వెనక్కి జరిగిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు నియంత్రించుకోలేక స్మిత్ కిందపడిపోయాడు కూడా. అయినా సరే, అతని మీద పడి బంతిని చేజిక్కించుకున్న తర్వాత సాహా క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. ఇదంతా చూసిన అంపైర్ ఇయాన్ గౌల్డ్కు నవ్వు ఆగలేదు. భారత జట్టు సభ్యులందరూ కూడా బిగ్గరగా నవ్వేశారు. ఇంత జరిగినా సాహా మాత్రం ఇంకా సీరియస్‌గానే అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడటం మరింత హాస్యాన్ని పండించింది. మరోవైపు 97 పరుగుల వద్ద ఉన్న స్మిత్ మాత్రం ఈ మొత్తం ప్రహసనంలో గంభీరంగానే ఉండి ఎక్కడా తన ఏకాగ్రతను కోల్పోలేదు. -
రాంచీ టెస్టులో నవ్వుల్.. నవ్వుల్!
రాంచీ: భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ వివాదం, స్లెడ్జింగ్లతో ఇరు జట్ల మధ్య వాతావరణం వేడిక్కింది. కానీ రాంచీలోజరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాస్యపూరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా ఇది జరిగింది. జడేజా 80వ ఓవర్లో వేసిన బంతిని స్మిత్ ఢిఫెన్స్ ఆడగా బంతి బ్యాట్‌కు తగిలి అతని ప్యాడ్లల్లో ఇరుక్కుంది. దీనిని అందుకోవాలని ప్రయత్నించిన భారత కీపర్ వృద్దిమాన్ సాహా స్మిత్‌తో కుస్తీ పడ్డాడు. అయితే స్మిత్ మాత్రం చాకచక్యంగా ప్రవర్తించి కింద కూర్చున్నాడు. సాహా వెంటనే అప్పీల్ చేయగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ లోలోపల నవ్వుకున్నారు. దీంతో స్టేడియం అంతా నవ్వులు పూసాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్టర్లో ‘క్యాచ్ అండ్ అప్పీల్’ అని ట్వీట్ చేసింది. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
70 ఏళ్ల వయసులో 'వెల్ రన్'
యుక్త వయసులో ఉన్న వాళ్లే పట్టుమని పదిమైళ్లు పరుగెత్తాలంటే ఆపసోపాలు పడతారు. మరి అటువంటింది 70 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా వరుసగా ఏడు రోజుల పాటు ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడు సుదీర్ఘ మారథాన్ కార్యక్రమాల్లో పాల్గొని శభాష్ అనిపించింది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా 25 మైళ్లకు పైగా దూరం పరుగెడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిస్సోరికి చెందిన చావ్ స్మిత్ వయసు ఏడు పదులు పైనే. కాకపోతే ఆమెకు మారథాన్ పై మక్కువ ఎక్కువ. ఐదు వారల్లో నాలుగు మారథాన్లు, ఒక ఏడాదిలో 10 మారథాన్లు, జీవితం మొత్తంలో కలుపుకుని 70 మారథాన్లు చేసిన ఘనత ఆమె సొంతం. అయితే ఇవేవీ ఆమెకు పెద్దగా కనబడలేదు. దాంతో లేటు వయసులో ఒకేసారి వరుసగా ఏడు మారథాన్లు పాల్గొనాలని నిశ్చయించుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా కఠోర సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ ఘనతను సాధించేందుకు దాదాపు ఎనిమిది నెలలు విపరీతంగా శ్రమించింది. చివరి నాలుగు నెలలు సుదీర్ఘమైన లక్ష్యాలను ఎంచుకుంది. ఈ శిక్షణలో ప్రతీ వారం 15 మైళ్ల దూరం మొదలుకొని 130 మైళ్ల వరకూ పైగా పరుగు తీసేది. కఠోరమైన శిక్షణ ముగిసిన తరువాత ఈ ఏడాది జనవరి 25వ తేదీ నుంచి 31 తేదీ వరకూ ఏడు వేర్వేరు దేశాల్లోని ప్రధాన నగరాల్లో స్మిత్ తన రికార్డు మారథాన్ కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెర్త్, సింగపూర్, కైరో, అమెస్టర్‌డామ్, న్యూయార్క్, చీలి, కింగ్ జార్జ్, అంటార్కిటికా ప్రాంతాల్లో మారథాన్ పూర్తి చేసి అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకుంది. వరుసగా ఏడు రోజుల్లో తన అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన యొక్క శ్రమతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. వీటిని పూర్తి చేసే క్రమంలో ప్రొద్దున్నే లేవడంతో పాటు దాదాపు 26 మైళ్లు దూరం పరుగెత్తినట్లు ఆమె తెలిపింది. ఒక నగరంలో మారథాన్ కార్యక్రమం ముగిసిన వెంటనే విమాన ప్రయాణంతో వేరే ప్రాంతానికి చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ సుదీర్ఘ లక్ష్యాలను చేరడంలో తాను ఎటువంటి అలసటకు లోనుకాలేదని తెలిపింది. -
దూకుడు తగ్గించాల్సిన అవసరం లేదు!
►ఆటగాళ్లకు తమ గురించి బాగా తెలుసు ►భారత కోచ్ కుంబ్లే వ్యాఖ్య రాంచీ: మైదానంలో సహజసిద్ధమైన దూకుడు ప్రదర్శించే భారత ఆటగాళ్లను తాను నిరోధించే ప్రయత్నం చేయనని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. అలాంటి అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ‘ఆటగాళ్ల నుంచి మేం ఏం ఆశిస్తున్నామో వారు అలాంటి ప్రదర్శన ఇస్తున్నంత కాలం వారిలోని సహజమైన దూకుడును తగ్గించాలని నేను కోరుకోను. ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని అలవాట్లు, శైలి ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. అయినా ఇప్పుడు సిరీస్ 1–1తో సమంగా ఉంది. ఇరు జట్లు తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి కాస్త దూకుడు ప్రదర్శించడంలో తప్పు లేదు’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్‌రూమ్ రివ్యూ వివాదం విషయంలో భారత్ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయంగా కుంబ్లే అభివర్ణించారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పరిణతితో కూడుకుంది. ఆటకు సంరక్షకులుగా ఇరు జట్ల బోర్డులు కూడా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం ముఖ్యమని భావించాయి. ఆటగాళ్లకు కూడా తమ బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు’ అని ‘జంబో’ చెప్పారు. డీఆర్ఎస్ వివాదం తమ ఆటపై ఎలాంటి ప్రభావం చూపించదన్న కుంబ్లే... మూడో టెస్టుకు ముందు కోహ్లి, స్మిత్ కూర్చొని పలు అంశాలు చర్చిస్తారనే విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు తనకు డైరెక్టర్ పదవి, ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలను తాను కూడా మీడియాలోనే చూశానని, తన వద్దకు అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కుంబ్లే వివరణ ఇచ్చారు. -
ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను!
డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వివాదంలో స్మిత్‌కు సహ భాగస్వామిగా ఉన్న హ్యాండ్స్కోంబ్ మరో సారి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ‘నేను నా అంతర్జాతీయ కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను. డీఆర్ఎస్తో ఇప్పటి వరకు పెద్దగా పని పడలేదు. దానిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అలా చేయకూడదని నాకు అస్సలు తెలీదు. ఈ ఘటనతో తెలిసొచ్చింది. దీనిని ఇక్కడితో ముగించి ముందుకు సాగాలని కోరుకుంటున్నా’ అని అతను ట్వీట్ చేశాడు. మరో వైపు మైదానంలోనుంచి స్మిత్ చేసిన సైగ స్వయంగా తాము కూడా నిర్ఘాంతపోయేలా చేసిందని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకెర్ వ్యాఖ్యానించారు. ‘స్మిత్ అలా అడిగినప్పుడు మేమందరం షాక్‌కు గురయ్యాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. అందుకే చాలా ఆశ్చర్యం కూడా కలిగింది. అయితే అంతకు ముందు కూడా మేం ఇలా చేశామనే ఆరోపణను మాత్రం ఖండిస్తున్నా’ అని సాకెర్ అన్నారు. మరో వైపు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా స్మిత్‌పై చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ఐసీసీ ఒక్కో దేశం పట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘మూడో టెస్టులో ఒక వేళ కోహ్లి కూడా అవుటై రివ్యూ కోరాల్సి వస్తే... అదే తరహాలో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగ చేయాలని కోరుకుంటున్నా. ఒక భారత ఆటగాడు అలా చేస్తే ఇప్పుడు స్మిత్‌కు మద్దతిస్తున్నవారి స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. అప్పుడు ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఏం చేస్తారో చూడాలి’ అని సన్నీ అన్నారు. -
స్మిత్‌ది కాదు.. తప్పునాదే : హ్యాండ్స్కాంబ్
బెంగళూరు: రెండో టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుటైన తీరు.. అనంతరం చెలరేగిన వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ అన్నాడు. స్మిత్ రివ్యూ కోసం సలహా అడిగినప్పుడు తనే డ్రెస్సింగ్ గది వైపు చూడాలని చెప్పానన్నాడు. డీఆర్ఎస్ నిబందనలు తెలియకపోవడం వల్లే అలా చేశానని, మంచి ఆటకు పెడర్ధాలు తీయవద్దని ఈ వివాదంపై ట్వీట్ చేశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే మైదానం నుంచి వెళ్లకుండా హ్యాండ్స్ కాంబ్తో చర్చించిన తర్వాత డ్రెస్సింగ్ గది వైపు చేతులతో సైగ చేశాడు. ఈ విషయంలో స్మిత్ పై సర్వత్రా విమర్శలు రావడంతో తన వల్ల తప్పిదం జరిగిందని హ్యాండ్స్ కాంబ్ వెల్లడించాడు. స్మిత్ హద్దులు దాటాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీకి, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయంపై స్మిత్ తన తప్పును అంగీకరించిన విషయం తెలిసిందే. I referred smudga to look at the box... my fault and was unaware of the rule. Shouldn't take anything away from what was an amazing game! — Peter Handscomb (@phandscomb54) 7 March 2017 -
దెబ్బకు దెబ్బ
►రెండో టెస్టులో భారత్ ఘన విజయం ►75 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు ►112 పరుగులకే కుప్పకూలిన కంగారూలు ►అశ్విన్ కు 6 వికెట్లు భారత్ కంగారూలను వెంటాడి వేటాడింది. పుణే పరాభవ భారంతో పెరిగిన కసిని కోహ్లి సేన బెంగళూరులో ప్రదర్శించింది. దుర్భేద్యంగా కనిపించిన తమ జట్టును దెబ్బ తీసిన ప్రత్యర్థిపై ఈసారి నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఊపిరి పీల్చుకోలేని విధంగా నలుగురు బౌలర్లతో దిగ్బంధనం చేసి ఆస్ట్రేలియాను కేవలం 35.4 ఓవర్లలో మడతెట్టేసింది. క్షణక్షణానికి మారుతున్న పిచ్‌పై ప్రతీ బంతిని ప్రాణ సంకటంలా ఎదుర్కొన్న స్మిత్ బృందం 188 పరుగులు చేయడం కూడా తమ వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసి మ్యాచ్‌ను అప్పగించేసింది. ఛేదనలో ఒక దశలో ఆసీస్ స్కోరు 42/1. అంతా వారికి అనుకూలంగానే సాగుతుందనిపించింది. అప్పుడొచ్చాడు అశ్విన్... ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న తన ‘ప్రియమైన శత్రువు’ వార్నర్‌ను దెబ్బ తీసి దారి చూపించాడు. అంతే... ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అలా ఆడటం, ఇలా అవుట్ కావడం ఆగకుండా సాగిపోయింది. సమీక్షలకు పునస్సమీక్షలకు కూడా ఎలాంటి అవకాశం లేకుండా మనోళ్లు కట్టి పడేశారు. 11 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ బేలగా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో తమను దెబ్బ తీసిన నాథన్ లయన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకొని అశ్విన్ ఆకాశపు అంచుల్లోకి బంతిని విసిరిన అపురూప క్షణాన... ఎన్నో అరుదైన దృశ్యాలు... ఒక్కో ఆటగాడిలో ఎన్నో భావోద్వేగాలు... నాలుగు రోజులుగా మాటల తూటాలు... వివాదాలు, వ్యాఖ్యలు, విభిన్న హావభావాలు... ఈ టెస్టు గురించి ఏమని చెప్పగలం... తొలిరోజు 189 పరుగులకే ఆలౌటైన స్థితి నుంచి చివరకు ఆసీస్‌ను భారత్ చావుదెబ్బ కొట్టే వరకు ఎన్నో మలుపులు... చిన్నస్వామి మైదానం హోరెత్తుతుండగా, చివరకు టీమిండియానే ఈ పోటీలో సగర్వంగా నిలబడింది. బెంగళూరు: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. సమష్టి వైఫల్యంతో ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో చిత్తయిన భారత్, అదే సమష్టి ఆటతో రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో భారత్ 75 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (6/41) మరోసారి చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (221 బంతుల్లో 92; 7 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా... హాజల్‌వుడ్ (6/67) తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కీలక అర్ధసెంచరీలు చేసిన కేఎల్ రాహుల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు ఈ నెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది. సెషన్–1: చెలరేగిన ఆసీస్ పేసర్లు ఓవర్‌నైట్ స్కోరు 213/4తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ను స్టార్క్, హాజల్‌వుడ్ ఇబ్బంది పెట్టారు. పుజారా, రహానే ఐదో వికెట్‌కు 118 పరుగులు జోడించిన తర్వాత స్టార్క్ దెబ్బ తీశాడు. 128 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రహానే (134 బంతుల్లో 52; 4 ఫోర్లు)ను అవుట్ చేసిన స్టార్క్, తర్వాతి బంతికే కరుణ్ నాయర్ (0)ను బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే పుజారాను, అశ్విన్ (4)ను హాజల్‌వుడ్ పెవిలియన్ పంపించాడు. ఉమేశ్ (1) అవుటైన తర్వాత చివర్లో ఇషాంత్ (6) సహకారంతో సాహా (37 బంతుల్లో 20 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని కీలక పరుగులు జత చేశాడు. 36 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్లు: 25.1, పరుగులు: 61, వికెట్లు: 6 సెషన్–2: కుప్పకూలిన ఆసీస్ ఇషాంత్ తన మూడో ఓవర్లో చక్కటి బంతితో రెన్షా (5)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అశ్విన్ బౌలింగ్‌లో దాదాపు ప్రతీ బంతికి ఇబ్బంది పడిన వార్నర్ (17) కాస్త సాహసం చేసి అతని బౌలింగ్‌లోనే ఒక భారీ సిక్స్ బాదాడు. కానీ అశ్విన్ తన తర్వాతి బంతికే వార్నర్‌ను ఎల్బీగా వెనక్కి పంపి కంగారూల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత షాన్ మార్ష్(9) పని పట్టిన ఉమేశ్, రెండు ఓవర్ల తర్వాత స్మిత్‌ను దెబ్బ తీయడంతో ఆసీస్ కష్టాలు పెరిగాయి. మరోవైపు అసలే మాత్రం పరుగులు ఇవ్వకుండా జడేజా ప్రత్యర్థిని మరింత చికాకు పరిచాడు. అనంతరం అశ్విన్ వరుస ఓవర్లలో మిషెల్ మార్ష్ (13), వేడ్ (0)లను అవుట్ చేశాడు. ఓవర్లు: 27.5, పరుగులు: 101, వికెట్లు: 6 సెషన్–3: ఖేల్ ఖతం విరామం తర్వాత పది నిమిషాలకే ఆస్ట్రేలియా ఆట ముగిసింది. ముందుగా స్టార్క్ (1)ను అశ్విన్ బౌల్డ్ చేయగా, జడేజా బౌలింగ్‌లో ఒకీఫ్ (2) అవుటయ్యాడు. అప్పటి వరకు పోరాడుతూ వచ్చిన హ్యాండ్స్కోంబ్ (67 బంతుల్లో 24; 2 ఫోర్లు) అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి సాహాకు చిక్కగా... తన బౌలింగ్‌లోనే నాథన్ లయన్ (2) ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకొని అశ్విన్ విజయనాదం చేశాడు. ఓవర్లు: 7.5, పరుగులు: 11,వికెట్లు: 4 ఇదో తీపి విజయం. కచ్చితంగా కెప్టెన్‌గా నాకు ఇదే అత్యుత్తమ మ్యాచ్. భావోద్వేగాల పరంగా కూడా జట్టులో అందరికీ ఈ టెస్టు గుర్తుండిపోతుంది. నన్ను ఒక్కడినే పడగొడితే చాలు గెలుస్తామని అనుకోవద్దు. ఇదంతా సమష్టి కృషి. రెండో రోజు తొలి సెషన్లో కేవలం 47 పరుగులు ఇవ్వడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. మేం వారికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. 150కు పైగా పరుగుల లక్ష్యం ఉంటే చాలు మాకు అవకాశం ఉంటుందని తెలుసు. కానీ ఇంత సునాయాసంగా అదీ 75 పరుగుల తేడాతో గెలుస్తామని అనుకోలేదు. ఎవరి కోసమో కాకుండా మా కోసం గెలిచి చూపించాలనుకున్నాం. ఎలాంటి స్థితి నుంచైనా గెలవగలమని నిరూపించాం. రాంచీలో కూడా జోరు కొనసాగిస్తాం. ఎప్పుడెప్పుడు ఆడాలా అని ఉన్న నాకు ఎనిమిది రోజులు విరామం ఉండటం కష్టంగా అనిపిస్తోంది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ ► 25 అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 25వసారి. అందరికంటే వేగంగా (47 టెస్టులు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రిచర్డ్ హ్యాడ్లీ (62 టెస్టుల్లో)ని అశ్విన్ అధిగమించాడు. ► 1 ఒకే టెస్టులో నాలుగు ఇన్నింగ్స్‌లలో నలుగురు వేర్వేరు బౌలర్లు కనీసం 6 వికెట్లు పడగొట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో లయన్, జడేజా, హాజల్‌వుడ్, అశ్విన్ దీనిని నమోదు చేశారు. ► 5 భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బిషన్ సింగ్ బేడి (266)ని దాటి అశ్విన్ (269) ఐదో స్థానానికి చేరుకున్నాడు. కుంబ్లే, కపిల్, హర్భజన్, జహీర్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత గడ్డపైనే కేవలం 30 టెస్టుల్లో అతను 202 వికెట్లు తీయడం విశేషం. ►1 భారత్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న విదేశీ జట్టుగా ఆస్ట్రేలియా(20) నిలిచింది. ఇంగ్లండ్ 19 మ్యాచ్‌లు ఓడింది. -
ఆసీస్... అతి జాగ్రత్తగా!
► ఇబ్బంది పెట్టిన భారత బౌలర్లు ► ఆదుకున్న రెన్షా, షాన్ మార్ష్ ► ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 237/6 ప్రస్తుత ఆధిక్యం 48 తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేసినా రెండో రోజు ఆటలో మన బౌలర్లు ఆస్ట్రేలియాను కాస్త కట్టడి చేయగలిగారు. కచ్చితమైన బౌలింగ్‌తో వారి దూకుడును తగ్గించి ఆత్మరక్షణలో పడేశారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రెచ్చిపోగా... పేసర్లు ఉమేశ్, ఇషాంత్ శర్మ పరుగులను నియంత్రించారు. మొత్తంగా రెండో రోజు 197 పరుగులు మాత్రమే ఇవ్వగలిగిన భారత్‌కు మిగిలిన రోజుల్లో వరుణుడు కరుణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ టెస్టు వారి చేతుల్లో నుంచి జారే పరిస్థితి ఉండదేమో! అటు తొలి రెండు సెషన్లు జాగ్రత్తగా ఆడిన ఆస్ట్రేలియా చివరి సెషన్లో మాత్రం కొంచెం పుంజుకోగలిగింది. యువ బ్యాట్స్‌మన్ రెన్షా మరోసారి తన ప్రతిభను చాటుకోగా షాన్ మార్ష్ నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలబడ్డాడు. అయితే దూకుడైన ఆటతో కనీసం వంద పరుగుల ఆధిక్యాన్ని సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచుదామనుకున్న స్మిత్ సేనకు ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం 48 పరుగుల స్వల్ప ఆధిక్యంతో ఉన్న ఆసీస్‌కు మూడో రోజు ఆట కీలకం కానుంది. బెంగళూరు: రెండో రోజు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ స్కోరుతో ఒత్తిడి పెంచాలనుకున్న ఆస్ట్రేలియా... పూర్తిగా రక్షణాత్మక ఆటతీరుకే పరిమితమైంది. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ అంతగా సహకరించకపోవడంతో ఆసీస్ ఆచితూచి ఆడింది. ఓపిగ్గా క్రీజులో నిలిచిన షాన్ మార్ష్ (197 బంతుల్లో 66; 4 ఫోర్లు), యువ ఓపెనర్ మ్యాట్ రెన్షా (196 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా రెండో టెస్టులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 6 వికెట్లకు 237 పరుగులు చేసింది. వార్నర్ (67 బంతుల్లో 33; 3 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. క్రీజులో వేడ్ (68 బంతుల్లో 25 బ్యాటింగ్; 2 ఫోర్లు), మిషెల్ స్టార్క్ (19 బంతుల్లో 14 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్, పేసర్లు ఉమేశ్, ఇషాంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. సెషన్–1: భారత్ ఆధిపత్యం రెండో రోజు తొలి బంతినే ఓపెనర్ డేవిడ్ వార్నర్ బౌండరీగా మలిచి తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఆట జరుగుతున్నకొద్దీ భారత బౌలర్లు పైచేయి సాధించారు. 22వ ఓవర్లో అశ్విన్ వేసిన అద్భుత బంతి సుడులు తిరుగుతూ ఆఫ్‌స్టంప్‌ను పడగొట్టడంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్ వార్నర్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత బంతికే స్మిత్ (8) ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రెన్షా పక్కకు వెళ్లింది. దీన్ని అందుకోవడానికి అశ్విన్ వెళ్లగా రెన్షా అడ్డుగా నిలబడ్డాడు. దీంతో స్మిత్‌తో అశ్విన్.. బ్యాటింగ్ వైపు వెళ్లిన రెన్షాతో కోహ్లి వాగ్వాదానికి దిగారు. అయితే అంపైర్ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచారు. ఇక 30వ ఓవర్లో స్మిత్ ఎల్బీ కోసం భారత్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. 38వ ఓవర్లో బరిలోకి దిగిన స్పిన్నర్ జడేజా కొద్దిసేపట్లోనే కీలకమైన స్మిత్ వికెట్ తీశాడు. బ్యాట్, ప్యాడ్‌కు తాకుతూ వెళ్లిన బంతిని కీపర్ సాహా తన ఎడమ వైపునకు పరిగెత్తుతూ సూపర్ డైవ్ క్యాచ్ తీసుకున్నాడు. పేసర్లు ఇషాంత్, ఉమేశ్ యాదవ్ తమ బౌన్స్‌తో ఇబ్బంది పెట్టినా వికెట్లు తీయలేకపోయారు. ఓవర్లు: 29, పరుగులు: 47, వికెట్లు: 2 సెషన్–2: రెన్షా, మార్ష్ నిలకడ లంచ్ బ్రేక్ అనంతరం టర్నింగ్ ట్రాక్‌పై అశ్విన్, జడేజా తమ బంతులతో మరింత ఇబ్బంది పెట్టారు. దీంతో రెన్షా, షాన్ మార్‡్ష భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. 59వ ఓవర్లో ఉమేశ్ వేసిన బంతి మార్‡్ష బొటన వేలికి తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా... భారత్ రివ్యూ కోరలేదు. అటు అద్భుత డిఫెన్స్‌తో భారత బౌలర్లను విసిగించిన రెన్షా 183 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా వేసిన 67వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన తను మూడో బంతిని అంచనా వేయడంలో బోల్తా పడ్డాడు. కచ్చితంగా ముందుకు వస్తాడని ఊహించిన జడేజా బంతిని లెగ్ సైడ్ వేశాడు. అలాగే వచ్చిన రెన్షా చివరి నిమిషంలో ప్యాడ్‌తో అడ్డుకుందామని భావించినా బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లగా మెరుపు వేగంతో స్పందించిన అతను వికెట్లను గిరాటేశాడు. రెన్షా, మార్‡్ష మధ్య మూడో వికెట్‌కు 53 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత హ్యాండ్స్కోంబ్ (16) ఫోర్లతో చెలరేగినా జడేజా బౌలింగ్‌లో తను ఆడిన షాట్‌ను మిడ్ వికెట్లో అశ్విన్ సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. కింద పడే క్రమంలో బంతి చేజారినా తిరిగి తన భుజాలకు తాకి చేతుల్లోకి వచ్చింది. టీ విరామానికి ముందు చివరి బంతికి మిషెల్ మార్‡్షను ఇషాంత్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఓవర్లు: 35, పరుగులు: 76, వికెట్లు: 3 సెషన్–3: స్వల్ప జోరు టీ బ్రేక్ అనంతరం షాన్ మార్ష్ రివ్యూ రూపంలో బతికిపోయాడు. 85వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ బంతికి మార్‡్షను ఎల్బీగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే మార్ష్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. బంతి ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వెళ్లడంతో మార్ష్ ను నాటౌట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఓవర్లో మార్ష్ వికెట్ కోసమే ఇషాంత్ ఎల్బీ అప్పీల్ చేసినా అది నోబాల్‌గా తేలింది. ఇదే క్రమంలో మార్ష్ 162 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 94వ ఓవర్లో వేడ్ ఎల్బీ అవుట్‌పై రివ్యూకు వెళ్లినా భారత్‌కు ఫలితం దక్కలేదు. నిలకడగా ఆడుతున్న మార్ష్ ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో స్టార్క్ ఇచ్చిన క్యాచ్‌ను సాహా మిస్ చేశాడు. మరో వికెట్ పడకుండా ఆసీస్ తమ రెండో రోజును ముగించింది. ఓవర్లు: 26, పరుగులు: 74, వికెట్: 1 స్మిత్... ఇషాంత్ ‘సయ్యాట’ తొలి టెస్టు సెంచరీ హీరో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రెచ్చగొడుతూ పేసర్ ఇషాంత్ తన విచిత్ర హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 27వ ఓవర్లో ఇషాంత్ వేసిన నాలుగో బంతిని స్మిత్ ఆడేందుకు ప్రయత్నించగా అది బ్యాట్ కింది నుంచి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఇషాంత్ తన కళ్లను, నోటిని పెద్దగా చేస్తూ తల ఊపుతూ స్మిత్‌ను వెక్కిరించాడు. వెంటనే ఐదో బంతిని ఎదుర్కొనేందుకు స్మిత్ వికెట్లకు కుడి వైపు జరిగి డిఫెన్స్ ఆడిన అనంతరం బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఇషాంత్ వైపు రెండడుగులు వేస్తూ అరిచాడు. దీనికి దీటుగా స్పందించిన ఇషాంత్ మరోసారి తన విచిత్ర హావభావాలతో ఆట పట్టించాడు. ఈ రెండు సందర్భాల్లో వికెట్ల వెనకాల ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా గమనిస్తున్న కోహ్లి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అటు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ►8 టెస్టుల్లో వార్నర్ వికెట్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు తీసిన బౌలర్ అశ్విన్. అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి వార్నర్ వికెట్‌ను అశ్విన్ పది సార్లు పడగొట్టాడు. -
మ్యాచ్ ఓడిన ర్యాంకులు పదిలం
దుబాయి: తొలి టెస్టు విజయంతో ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కెరీర్లోనే అత్యుత్తమ (939) పాయింట్లు సాధించి టెస్టు ర్యాంకుల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో అత్యదిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించడంతో స్మిత్‌కు ఆరు పాయింట్లు కలిసాయి. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల లిస్టులో స్మిత్ ఆరోవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో బ్రాడ్‌మన్ (961), లెన్ హట్టన్ (945), జాక్ హబ్స్, రికీపాటింగ్‌లు (942), పీటర్ మే (941) పాయింట్లతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. వివి రిచర్డ్స్, సంగాక్కరల (938)ల స్థానాన్ని స్మిత్ అధిగమించాడు. భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 33 స్థానాలు అధగమించి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు 29 సాధించాడు. ఈ ర్యాంకుల్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అశ్విన్, జడేజాలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కోహ్లి 873 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ బౌలర్, ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా బౌలింగ్‌లో రెండవ ర్యాంకు, ఆల్రౌండర్లో మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్‌లు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాహుల్ 11 ర్యాంకులు ఎగబాకి 46వ ర్యాంకు పొందాడు. యాదవ్ నాలుగు స్థానాలు అధగమించి 30వ ర్యాంకు సాధించాడు. -
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
-
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
- ఆస్ట్రేలియా ఆటగాళ్ల సుదీర్ఘ సాధన - కోహ్లీ, అశ్విన్‌లను ఉద్దేశించి వార్నర్ ఆసక్తికర కామెంట్స్ ముంబై: భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్‌వెల్ నెట్స్‌లోని వేర్వేరు వికెట్లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది. అశ్విన్‌తో పోరుకు సిద్ధం...: భారత్‌తో సిరీస్ అంటే ఆసీస్‌కు అశ్విన్ రూపంలోనే అగ్నిపరీక్ష ఎదురవుతోంది. నాలుగేళ్ల క్రితం 0–4తో కంగారూలు చిత్తుగా ఓడిన సిరీస్‌లో అశ్విన్ 29 వికెట్లతో చెలరేగాడు. ఈసారి భారత ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ వార్నర్ అన్నాడు.‘ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మనసును చదివి బౌలింగ్ చేసే అశ్విన్ లాంటి బౌలర్నునేను గౌరవిస్తా. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అయితే అశ్విన్ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని వార్నర్ చెప్పాడు. కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న వార్నర్... మాటల యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో గొప్ప ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో వార్నర్‌తో అతని సహచరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఏకీభవించాడు. అందుకే కోహ్లితో స్లెడ్జింగ్‌కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు. ‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ కూడా మంచి ప్రభావం చూపించగలడని, అతని పదునైన బౌలింగ్ విరాట్ కోహ్లిని కూడా ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆస్ట్రేలియా అద్భుతం
రెండో టెస్టులో పాక్‌పై ఇన్నింగ్స్, 17 పరుగుల తేడాతో గెలుపు మెల్బోర్న్: తొలి నాలుగు రోజులూ వర్షం, వెలుతురులేమి కారణంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో పూర్తి ఆట సాధ్యమే కాలేదు. దీంతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా కేవలం 22 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో చివరిరోజు ఈ మ్యాచ్‌లో ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆఖరి రోజు అద్భుతమే జరిగింది. అనిశ్చితికి మారుపేరుగా నిలిచే పాకిస్తాన్ జట్టు మరోసారి ఆ పేరును ‘నిలబెట్టుకుంది’. చివరి రోజు 181 పరుగులు వెనకబడిన దశలో లంచ్‌కు కొద్దిగా ముందు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు.... మిషెల్ స్టార్క్ (4/36) ధాటికి అనూహ్యంగా 53.2 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. రెండో ఓవర్లో ప్రారంభమైన పాక్ వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. స్టార్క్‌కు తోడు స్పిన్నర్ లియోన్ (3/33), హాజెల్‌వుడ్ (2/39) చెలరేగడంతో పాక్ కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 465/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 8 వికెట్లకు 624 పరుగులకు వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్ (165 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలవగా... స్టార్క్ (91 బంతుల్లో 84; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఏడో వికెట్‌కు ఈ జోడి 154 పరుగులు జతచేసింది. చివరి టెస్టు 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. -
ఆస్ట్రేలియా అధమ స్థాయికి...
► రెండో టెస్టులోనూ ఘోర పరాభవం ► ఇన్నింగ్స్ 80 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం ► 2-0తో టెస్టు సిరీస్ సొంతం హోబర్ట్: దశాబ్దాలపాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు పరాజయాలను అలవాటుగా మార్చుకుంది. పాతతరం వెస్టిండీస్‌ను గుర్తుకు తెచ్చేలా అద్భుతమైన జట్టు నుంచి మ్యాచ్ మ్యాచ్‌కూ దిగజారుతున్న ఆటతో పరాభవానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది! సొంతగడ్డపై కూడా కనీస స్థారుు ప్రదర్శనను ఇవ్వలేక కంగారూలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్టు సిరీస్‌ను ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకు అప్పగించేశారు. ఈ క్రమంలో ఒకదాన్ని మించి మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ అవమానకర రీతిలో ఇన్నింగ్స్, 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 121/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు 32 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోవడం విశేషం. ఉస్మాన్ ఖాజా (64) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ స్మిత్ (31) జట్టును రక్షించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లలో ఒక్కరూ నిలవలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కైల్ అబాట్ (6/77), రబడ (4/34) ఆసీస్‌ను కుప్పకూల్చారు. రెండో రోజు ఆట రద్దును మినహారుుస్తే కేవలం రెండున్నర రోజుల్లోనే ఆసీస్ కథ ముగిసిపోరుునట్లరుుంది. సఫారీ పేసర్ల సీమ్, స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆఖరి రోజు ఆసీస్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడి చేతులెత్తేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు ఈ నెల 24 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక చేతిలో 0-3తో ఓడిన ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా మూడో సిరీస్ (2008-09, 2012-13)ను గెలుచుకోగా, ఆస్ట్రేలియాలో సఫారీలు తొలిసారి ఇన్నింగ్స్ తేడాతో టెస్టు నెగ్గడం విశేషం. ఆస్ట్రేలియా సొంతగడ్డపై 88 ఏళ్ల తర్వాత మ్యాచ్‌లో ఇంత తక్కువ బంతులకే (93 ఓవర్లు) ఓటమిపాలు కాగా, రెండు ఇన్నింగ్సలు కలిపి 16 మంది ఒకే అంకె స్కోరుకే పరిమితం కావడం 104 ఏళ్లలో మొదటిసారి కావడం ఆ జట్టు ఆటతీరుకు నిదర్శనం. -
కంగారూలదే టైటిల్
ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం ముక్కోణపు వన్డే సిరీస్ బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ వేడ్ (52 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆసీస్‌కు మెరుగైన స్కోరు అందించగా... బౌలర్ మార్ష్ (3/32) కీలక వికెట్లు పడగొట్టడంతో 58 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కెన్సింగ్టన్లోని ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్), స్మిత్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్... ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ (61 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హాజెల్ వుడ్ 5 వికెట్లు తీశాడు. మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... హాజెల్‌వుడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. -
స్మిత్ మాయాజాలం
► గుజరాత్‌కు కీలక విజయం ► 6 వికెట్లతో కోల్‌కతా ఓటమి నాలుగు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులిచ్చి నాలుగు వికెట్లు... ఇదీ డ్వేన్ స్మిత్ బౌలింగ్ జోరు. బ్యాటింగ్‌లో భారీ హిట్టింగ్‌కు పేరున్న స్మిత్ ఈ సారి అత్యుత్తమ బౌలింగ్‌తో సత్తా చాటి గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టాడు. పేరుకు తగినట్లుగా గ్రీన్‌పార్క్ బౌలింగ్‌కు అనుకూలించడంతో కోల్‌కతా కుదేలైంది. కాన్పూర్: సురేశ్ రైనా (36 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సారథ్యంలో గుజరాత్ లయన్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో గురువారం తొలి సారి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లయన్స్ 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, డ్వేన్ స్మిత్ (4-0-8-4) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. అనంతరం లయన్స్ 13.3 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. సురేశ్ రైనా అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి మరో 39 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. నాలుగు ఓవర్లలో 4 వికెట్లు: యూసుఫ్ పఠాన్ కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఏ దశలోనూ కోల్‌కతా ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి గంభీర్ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. ఆ తర్వాత స్మిత్ తన ఒక్కో ఓవర్లో ఒక్కో వికెట్‌తో నైట్‌రైడర్స్‌ను చావుదెబ్బ తీశాడు. తన టి20 కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన స్మిత్... ఏకంగా 18 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఉతప్ప (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఒక దశలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 50 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! లోయర్ ఆర్డర్లో కూడా ఎవరూ నిలబడలేకపోవడంతో కోల్‌కతా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కీలక భాగస్వామ్యం: స్వల్ప లక్ష్యఛేదనలో గుజరాత్ కూడా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ (0)ను అవుట్ చేసి రాజ్‌పుత్, కోల్‌కతాకు శుభారంభం అందించాడు. తర్వాతి ఓవర్లో మెకల్లమ్ (6) వెనుదిరగ్గా, దినేశ్ కార్తీక్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే ఈ దశలో కెప్టెన్ రైనా, ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు దూకుడుగా ఆడటంతో చకచకా పరుగులు వచ్చాయి. 36 బంతుల్లోనే ఈ జోడి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించింది. ఫించ్ వెనుదిరిగినా, రైనా చివరి వరకు నిలబడటంతో జట్టుకు విజయం దక్కింది. స్కోరు వివరాలు: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కార్తీక్ (బి) స్మిత్ 25; గంభీర్ (రనౌట్) 8; పాండే (సి) రైనా (బి) స్మిత్ 1; చావ్లా (బి) స్మిత్ 11; పఠాన్ (సి) రైనా (బి) కులకర్ణి 36; షకీబ్ (సి) ద్వివేది (బి) స్మిత్ 3; సూర్య కుమార్ (సి) కులకర్ణి (బి) జకాతి 17; హోల్డర్ (సి) ఫించ్ (బి) బ్రేవో 13; నరైన్ (నాటౌట్) 2; మోర్కెల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1-23; 2-34; 3-44; 4-55; 5-61; 6-102; 7-120; 8-122. బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; కులకర్ణి 4-0-34-1; స్మిత్ 4-0-8-4; బ్రేవో 4-0-29-1; జకాతి 4-0-22-1; జడేజా 2-0-17-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) ఉతప్ప (బి) రాజ్‌పుత్ 0; మెకల్లమ్ (ఎల్బీ) (బి) నరైన్ 6; రైనా (నాటౌట్) 53; కార్తీక్ (బి) మోర్కెల్ 12; ఫించ్ (రనౌట్) 26; జడేజా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (13.3 ఓవర్లలో 4 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1-0; 2-18; 3-38; 4-97. బౌలింగ్: రాజ్‌పుత్ 3-0-35-1; నరైన్ 4-0-30-1; మోర్కెల్ 3.3-0-39-1; హోల్డర్ 2-0-14-0; పఠాన్ 1-0-6-0. -
బౌలింగ్‌తో భారత్‌ది పైచేయి
సంజయ్ మంజ్రేకర్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ రోజు ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఇంటికి వెళుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఉన్న ఒత్తిడిని ఒక్కసారి ఊహించుకోండి. సొంత గడ్డపై ప్రతిష్టాత్మక టోర్నీని ఆడుతున్న ధోనిసేన నుంచి దేశంలోని అభిమానులు టైటిల్ మాత్రమే ఆశిస్తున్నారు. ఇప్పుడు జట్టుకు ధోని అత్యంత విలువైన నాయకుడయ్యాడు. కానీ అతడు కూడా మనలాంటి మనిషే. ఒత్తిడిని కూడా అలాగే అనుభవించినా కూడా మనకన్నా ఉత్తమంగా దాన్ని అధిగమించగల నేర్పు ఉంది. అందుకే తోటి ఆటగాళ్లు, ప్రత్యర్థులు అతడిని మిస్టర్ కూల్‌గా పేర్కొంటారు. అయితే అవతలి జట్టుకు మాత్రం ఈ లక్షణమే వణుకుపుట్టిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీలో మంచి బ్యాటింగ్ పిచ్ ఎదురుకానుంది. ఇక్కడే జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. అయితే ఇలాంటి పిచ్‌పై ఆసీస్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే వాట్సన్, మ్యాక్స్‌వెల్, వార్నర్, స్మిత్‌లతో కూడిన లైనప్ 150కి పైగా పరుగులను సునాయాసంగా ఛేదించగలరు. అయితే భారత్‌కు కూడా ధావన్, రోహిత్ రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నారు. ఫ్లాట్ పిచ్‌లపై ఆసీస్‌కన్నా భారత జట్టు బౌలింగ్ దాడి సమర్థవంతంగా ఉంటుంది. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రత్యర్థిది కాస్త పైచేయిగా కనిపించినా... బౌలింగ్ బలం కారణంగా భారత్‌దే పైచేయి అనిపిస్తోంది. -
స్మిత్, బర్న్స్ బాదుడు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా స్పందిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. కివీస్ కంటే 7 పరుగులు వెనుకబడి ఉంది. 57/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 3 వికెట్లు నష్టపోయి 306 పరుగులు జోడించింది. ఓపెనర్ బర్న్స్(170), కెప్టెన్ స్మిత్(138) సెంచరీలతో చెలరేగారు. వార్నర్ 12, ఉస్మాన్ ఖాజా 24 పరుగులు చేసి అవుటయ్యారు. వోజెస్(2), లియన్(4) క్రీజ్ లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో వాగ్నర్, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 370 పరుగులు చేసింది. మెకల్లమ్ సెంచరీతో (79 బంతుల్లో 145; 21 ఫోర్లు, 6 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు. -
ఒక్కటైనా గెలుస్తారా..!
ఎప్పుడో 27 ఏళ్ల క్రితం భారత్ చివరిసారిగా 0-5తో వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. ఈ మధ్యలో ఎన్ని సిరీస్‌లు ఓడినా అంతటి పరాభవం మళ్లీ చవిచూడలేదు. కానీ ఇప్పుడు ధోని సేన ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆసీస్‌తో సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత పరువు నిలబెట్టుకోవడం అనే మాట కూడా చిన్నగానే కనిపిస్తున్న చోట... కనీసం క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకోగలదా? స్పిన్‌కు అనుకూలమైన సిడ్నీ మైదానంలో టీమిండియా ఏమైనా ప్రభావం చూపించగలదా? * నేడు ఐదో వన్డే * దోని సేనకు అగ్ని పరీక్ష * క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ గురి * మ్యాచ్‌కు వర్ష సూచన సిడ్నీ: తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు ఇప్పటికే 0-4తో సిరీస్ ఓడిపోయింది. కొన్ని సందర్భాల్లో విజయావకాశాలు వచ్చినా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ముఖ్యంగా కచ్చితంగా గెలుస్తారనుకున్న గత మ్యాచ్‌ను కూడా అప్పగించింది. భారీ స్కోర్లు నమోదు చేయగలిగినా... గెలుపు మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సిరీస్‌లో చివరి వన్డేలో నెగ్గాలంటే టీమిండియా రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ నేడు (శనివారం) జరిగే ఐదో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు. అశ్విన్‌కు అవకాశం... పరుగుల వరద పారిన గత మ్యాచ్‌లతో పోలిస్తే సిడ్నీ సాంప్రదాయకంగా స్పిన్ పిచ్ కావడం భారత్‌కు కాస్త అనుకూలాంశం. ఈ నేపథ్యంలో ఒక పేసర్ స్థానంలో అశ్విన్ బరిలోకి దిగడం దాదాపు ఖాయం. భువనేశ్వర్ లేదా రిషి ధావన్‌లలో ఒకరిపై వేటు పడవచ్చు. నాలుగు మ్యాచ్‌లలోనూ నిరాశపర్చిన బౌలింగ్ ఈసారైనా మెరుగ్గా ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయవచ్చు. ఇక బ్యాటింగ్‌లో టాప్-3 మొత్తం భారాన్ని మోస్తున్నారు. రోహిత్, కోహ్లి రెండేసి సెంచరీలు చేయగా, శిఖర్ ధావన్ మరో శతకం బాదాడు. లోయర్ ఆర్డర్లో ఆల్‌రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేస్తే మళ్లీ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తన వైఫల్యంతో కాన్బెర్రా మ్యాచ్‌ను అప్పగించిన ధోనిపై చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత ఉంది. రహానే పూర్తిగా కోలుకోకపోతే రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా మనీశ్ పాండే బరిలోకి దిగుతాడు. అంతా ఫామ్‌లో... మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రతీ ఒక్కరు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఫించ్, వార్నర్, స్మిత్, బెయిలీ, మ్యాక్స్‌వెల్... అంతా సిరీస్‌లో ప్రభావం చూపించారు. దాంతో ప్రతీసారి జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. దాంతో ఆ జట్టుకు బ్యాటింగ్ బెంగ లేదు. మిషెల్ మార్ష్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఒక రకంగా భారత్‌తో పోలిస్తే ఆసీస్ బౌలింగ్‌లోనే అనుభవలేమి కనిపిస్తోంది. హేస్టింగ్స్, రిచర్డ్సన్ ఆ జట్టుకు సంబంధించి ద్వితీయ శ్రేణి బౌలర్లు మాత్రమే. దాంతో వారు పెద్దగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేదు కానీ భారత్ స్వయంకృతం కారణంగానే మ్యాచ్‌లు ఓడింది. మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా ఆడలేకపోతే అతని స్థానంలో షాన్ మార్ష్ లేదా బోలండ్కు అవకాశం దక్కవచ్చు. ఈ మ్యాచ్ ఓడితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. ఉదయం గం. 8. 50 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం టర్నింగ్ వికెట్. స్పిన్నర్లకు అనుకూలం. మ్యాచ్ రోజున భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. వాతావరణం బాగా లేకపోవడంతో శుక్రవారం భారత్ ప్రాక్టీస్ రద్దయింది. ‘పరాజయాలు ఎదురైనా జట్టులో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు. ఈ మ్యాచ్‌తో పాటు వరుసగా మూడు టి20లూ గెలవగలమనే నమ్మకముంది. సొంతగడ్డపై ఆసీస్‌ను ఓడించాలంటే అంత సులువు కాదు. మాలో చాలా మందికి అనుభవం లేకపోవడం కూడా సమస్య.’ - విరాట్ కోహ్లి ‘5-0తో గెలవడమే మా లక్ష్యం. విజయంతో ముగించాలని కోరుకుంటున్నా. కాబట్టి ఉదాసీనతకు చోటు లేదు. గత మ్యాచ్‌లో మేం కోలుకొని గెలిచిన తీరు పట్ల సంతోషంగా ఉన్నా. వ్యక్తిగత మైలురాయిని చేరువగా ఉన్నప్పుడు ఆటగాళ్లు నెమ్మదించడం చాలా సహజం. ప్రపంచ వ్యాప్తంగా అందరు క్రికెటర్లు ఇలాగే చేస్తారు. కోహ్లి, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. వారు అలా ఆడటం తప్పేమీ కాదు. దానిని స్వార్థం అనలేం. ఆస్ట్రేలియాలో గతంలోలాగే పేస్, బౌన్స్ పిచ్‌లు రావాలని కోరుకుంటున్నా.’ -స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ -
స్మిత్, వోజెస్ శతకాలు
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 258/2 పెర్త్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో శతకాల మోత మోగుతోంది. సోమవారం తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (170 బంతుల్లో 131 బ్యాటింగ్; 17 ఫోర్లు), వోజెస్ (180 బంతుల్లో 101 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకాలు సాధించారు. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 63 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 193 పరుగుల ఆధిక్యంతో ఉంది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 153.5 ఓవర్లలో 624 పరుగుల వద్ద ముగించింది. రాస్ టేలర్ (374 బంతుల్లో 290; 43 ఫోర్లు) కొద్దిలో ట్రిపుల్ శతకం మిస్ అయ్యాడు. అయితే ఆసీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పర్యాటక జట్టు ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్‌కు నాలుగు, లియోన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. -
స్టార్క్‌పై కెప్టెన్ స్మిత్ సీరియస్
ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రవర్తనపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజీలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా స్టార్క్ ప్రవర్తన తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు. గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరిరోజున స్టార్క్ తన సహనాన్ని కోల్పోయి న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ మార్క్ క్రేగ్‌కు సమీపంగా బంతిని విసిరాడు. 84 వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్‌లో క్రేగ్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సహనాన్ని కోల్పోయిన స్టార్క్ తరువాత తనవైపు వచ్చిన బంతిని పట్టుకొని బలంగా క్రేగ్ వైపు విసిరాడు. స్టార్క్ ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదన్న స్మిత్ తనకు కలిగిన అసహనాన్ని మరో విధంగా ఆట ద్వారా చూపాలి తప్ప ఇలా బంతిని బ్యాట్స్‌మెన్ పైకి విసరడం కరెక్ట్ కాదన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజీలాండ్‌పై విజయం సాధించింది. తరువాత మ్యాచ్‌లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని సహచర ఆటగాన్ని స్మిత్ హెచ్చరించాడు. -
పాపం బెంగళూరు!
రాజస్థాన్ సూపర్ ఛేజింగ్ 5 వికెట్లతో ఆర్సీబీ చిత్తు యువరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా రాయల్స్‌ను గెలిపించిన స్మిత్, ఫాల్క్‌నర్ మ్యాచుకో కోటి రూపాయల భారాన్ని మోస్తూ వచ్చిన యువరాజ్ సింగ్ ఎట్టకేలకు తన విలువను ప్రదర్శించినా ఫలితం దక్కలేదు. భీకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు బౌలింగ్‌లోనూ రాణించినా బెంగళూరు ఓటమి పాలైంది.భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువీ బౌలింగ్ ధాటికి చివరి 39 బంతుల్లో 85 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ నిలిచింది. అయితే ఇదే మైదానంలో ఆసీస్ తరఫున ఆడి రికార్డు సెంచరీ సాధించిన ఫాల్క్‌నర్ ఈసారీ చిన్నస్వామి స్టేడియాన్ని సొంతం చేసుకున్నాడు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి భారీ షాట్లతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. భారీ స్కోర్ల ఈ మ్యాచ్‌లో చివరకు రాజస్థాన్‌కు అద్భుత విజయం దక్కగా...రాయల్ చాలెంజర్స్‌కు నిరాశే మిగిలింది. బెంగళూరు: యువరాజ్ చాన్నాళ్ల తరువాత అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా...అది బెంగళూరు విజయానికి సరిపోలేదు. భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రాజస్థాన్ ప్రత్యర్థికి నిరాశను మిగిల్చింది. భారీస్కోరును సాధించినా దాన్ని కాపాడుకోవడంలో చాలెంజర్స్ విఫలమైంది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ తొలుత బ్యాట్‌తో (38 బంతుల్లో 83; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఆపై బంతితో (4/35) చెలరేగి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. డివిలియర్స్ (32 బంతుల్లో 58; 1 ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం రాజస్థాన్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కరుణ్ నాయర్ (39 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... చివర్లో స్టీవెన్ స్మిత్ (21 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (17 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో చెలరేగి కోహ్లి సేనను చిత్తు చేశారు. వీరిద్దరు చివరి 17 బంతుల్లో 65 పరుగులు చేయడం విశేషం. ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. యువీ వీరంగం... బెంగళూరు ఇన్నింగ్స్ నిరాశాజనక రీతిలో ఆరంభమైంది. పార్థివ్‌ను కాదని గేల్‌తో కలిసి స్వయంగా ఓపెనింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లి (4) పేలవఫామ్‌ను కొనసాగిస్తూ మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. ఈ క్రమంలో గేల్ మూడు, విజయ్ జోల్ రెండు చొప్పున ఫోర్లు కొట్టినా.. పవర్ ప్లే ముగిసేటప్పటికి బెంగళూరుకు వికెట్ నష్టానికి 31 పరుగులు మాత్రమే లభించాయి. అయితే డివిలియర్స్‌కు జత కలిసిన యువరాజ్ చాన్నాళ్ల తరువాత తన విశ్వరూపం ప్రదర్శించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. తెవాటియా బౌలింగ్‌లో ఫోర్‌తో మొదలైన యువీ విజృంభణ.. ఆపై తీవ్రరూపం దాల్చి పరుగుల సునామీని సృష్టించింది. రజత్ భాటియా వేసిన 13వ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌తోపాటు మొత్తం 14 పరుగులు రాబట్టాడు. ఆపై తాంబే, రిచర్డ్సన్ల ఓవర్లలో మరో రెండు సిక్స్‌లతో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ కూడా చివరి ఓవర్లో మరో రెండు భారీ సిక్స్‌లతో అర్ధసెంచరీ మైలురాయిని దాటాడు. యువీ, డివిలియర్స్‌ల విజృంభణతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు నమోదయ్యాయి. చివర్లో మెరుపులు... లక్ష్యఛేదనను రాజస్థాన్ దూకుడుగా ఆరంభించింది. రహానే, కరుణ్ నాయర్లు ప్రతి ఓవర్లోనూ కనీసం ఓ ఫోర్ కొట్టడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు నమోదయ్యాయి. అయితే రహానే (24)ను చహల్ ఔట్ చేశాక యువీ మాయ ప్రారంభమైంది. తన రెండో ఓవర్లో వాట్సన్ (1), బిన్నీ (1)లను, తరువాతి ఓవర్లో శామ్సన్ (13)ను వెనక్కి పంపాడు. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఇక్కట్లలో పడినా.. మరోవైపు కరుణ్ నాయర్ దూకుడు మాత్రం తగ్గించలేదు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నాయర్‌నూ యువరాజే ఔట్ చేశాడు. విజయానికి 36 బంతుల్లో 83 పరుగులు చేయాల్సివుండడంతో బెంగళూరు విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ, అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌లు బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి దొరికిన బంతినల్లా బౌండరీ లైన్ దాటించారు. పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశారు. స్టార్క్ వేసిన 17వ ఓవర్లో 21 పరుగులు, దిండా వేసిన 18వ ఓవర్లో 23 పరుగులు రాబట్టారు. దీంతో చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన దశకు మ్యాచ్ చేరింది. అయితే ఫాల్క్‌నర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) భాటియా (బి) రిచర్డ్సన్ 4, గేల్ (సి) శామ్సన్ (బి) తాంబే 19, జోల్ (సి) వాట్సన్ (బి) తెవాటియా 16, డివిలియర్స్ (సి) రహానే (బి) ఫాల్క్‌నర్ 58, యువరాజ్ ఎల్బీడబ్ల్యూ (బి) రిచర్డ్సన్ 83, ఆల్బీ మోర్కెల్ (నాటౌట్) 1, పార్థివ్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1-6, 2-38, 3-40, 4-172, 5-186. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-43-2, వాట్సన్ 4-0-35-0, ఫాల్క్‌నర్ 4-0-42-1, తాంబే 4-0-38-1, తెవాటియా 3-0-17-1, భాటియా 1-0-13-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పార్థివ్ (బి) చహల్ 24, కరుణ్ (బి) యువరాజ్ 56, వాట్సన్ (బి) యువరాజ్ 1, బిన్నీ (సి) సబ్-రోసో (బి) యువరాజ్ 1, శామ్సన్ (సి అండ్ బి) యువరాజ్ 13, స్మిత్ (నాటౌట్) 48, ఫాల్క్‌నర్ (నాటౌట్) 41, ఎక్స్‌ట్రాలు, 7, మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1-54, 2-61, 3-63, 4-82, 5-106. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-20-0, స్టార్క్ 3-0-33-0, దిండా 3-0-37-0, ఆరోన్ 2.5-0-41-0, యువరాజ్ 4-0-35-4, చహల్ 4-0-24-1. -
చెన్నై సూపర్ ‘సిక్స్’
మళ్లీ అదే పునరావృతం... ఓపెనర్ స్మిత్ అద్భుత ఇన్నింగ్స్...సూపర్ కింగ్స్ గెలుపు...ఐపీఎల్లో తమకు అలవాటైన రీతిలో ధోని బృందం మరో అలవోక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఆ జట్టు ముందు అది చిన్నదైపోయింది. ఫలితంగా సొంత గడ్డపై డేర్‌డెవిల్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా ఆరో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై కూడా ఇది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. - ధోనిసేన ఖాతాలో మరో విజయం - 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపు - చెలరేగిన స్మిత్, రైనా న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 79; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రైనా (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైని గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 86 పరుగులు జోడించడం విశేషం. స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన కార్తీక్ ఓపెనర్లు విజయ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఢిల్లీ జట్టుకు శుభారంభం అందించారు. అయితే అనవసరపు పరుగుకు ప్రయత్నించి డి కాక్ రనౌట్ కాగా, మోహిత్ బౌలింగ్‌లో కెప్టెన్ పీటర్సన్ (0) తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే దినేశ్ కార్తీక్ ఆరంభంనుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ వేగం పెంచాడు. ముఖ్యంగా మోహిత్, జడేజాల బౌలింగ్‌లో చెలరేగిన అతను 35 బంతుల్లో టోర్నీలో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలోనే కార్తీక్‌తో పాటు శుక్లా, విజయ్ వెనుదిరిగారు. ఈ దశలో డుమిని (17 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (18 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో డుమిని వరుసగా 4 ఫోర్లు కొట్టగా, 20వ ఓవర్లో జాదవ్ వరుసగా 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విరుచుకు పడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ 56 పరుగులు చేసింది. మెరుపు ఆరంభం... ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ (35 బంతుల్లో 32; 5 ఫోర్లు) మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఉనాద్కట్ వేసిన నాలుగో ఓవర్లో స్మిత్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో చెన్నై పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం మెకల్లమ్ వెనుదిరిగాడు.మరో వైపు స్మిత్ జోరు మాత్రం తగ్గలేదు. భారీ సిక్సర్లతో చెలరేగిన అతను 38 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో అతనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌కు రైనా జత కలిసిన తర్వాత సూపర్ కింగ్స్ మరింత వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. చివర్లో స్మిత్ అవుటైనా, ధోని (12 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (రనౌట్) 24; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 35; పీటర్సన్ (బి) మోహిత్ 0; కార్తీక్ (సి) మోహిత్ (బి) హిల్ఫెన్హాస్ 51; శుక్లా (సి) పాండే (బి) అశ్విన్ 0; డుమిని (నాటౌట్) 28; జాదవ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-36; 2-37; 3-108; 4-119; 5-120. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-34-1; పాండే 3-1-26-0; మోహిత్ 4-0-51-1; జడేజా 4-0-23-1; అశ్విన్ 4-0-29-1; స్మిత్ 1-0-9-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) విజయ్ (బి) పార్నెల్ 79; మెకల్లమ్ (సి) విజయ్ (బి) శుక్లా 32; రైనా (నాటౌట్) 47; ధోని (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1-82; 2-168. బౌలింగ్: షమీ 4-0-42-0; పార్నెల్ 4-0-25-1; ఉనాద్కట్ 3.4-0- 47-0; నదీమ్ 4-0-27-0; శుక్లా 4-0-31-1. -
‘కంగారు’పడ్డా గెలిచారు
కేప్‌టౌన్: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ స్మిత్ కెరీర్ ఓటమితో ముగిసింది. ఆస్ట్రేలియాతో నిర్ణాయక టెస్టులో దక్షిణాఫ్రికా 245 పరుగుల తేడాతో ఓడి మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. మూడో టెస్టును కనీసం డ్రా చేయడం ద్వారానైనా సిరీస్‌లో ఓడకుండా ఉండాలని, తమ కెప్టెన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన సఫారీ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో శక్తివంచన లేకుండా పోరాడారు. కానీ చివరి రోజు హారిస్ (4/32) ధాటికి తలవంచి 265 పరుగులకు ఆలౌటయ్యారు. ‘డ్రా’ లక్ష్యంగా పోరాటం..: ఓవర్‌నైట్ స్కోరు 71/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి రోజు చివరి వరకూ పోరాడింది. డివిలియర్స్ (228 బంతుల్లో 43), డుఫ్లెసిస్ (109 బంతుల్లో 47), డుమిని (99 బంతుల్లో 43), ఫిలాండర్ (105 బంతుల్లో 51 నాటౌట్), స్టెయిన్ (44 బంతుల్లో 1) ఇలా ప్రతి ఆటగాడూభారీగా బంతులు ఆడి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. టెయిలెండర్లు స్టెయిన్, ఫిలాండర్ కలిసి 15 ఓవర్లు ఆడటంతో డ్రా కావడం ఖాయమనిపించింది. మరో ఐదు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా హారిస్... ఒకే ఓవర్లో స్టెయిన్, మోర్కెల్‌లను అవుట్ చేసి ఆసీస్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి. రెండో ర్యాంక్‌కు ఆసీస్ ప్రపంచ నంబర్‌వన్ దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలవడంతో ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరింది. దీంతో భారత్ మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఏప్రిల్ 1 కటాఫ్ తేదీ నాటికి ఇక టెస్టులు లేవు. కాబట్టి ఇవే ఈ ఏడాదికి తుది ర్యాంకులు. దక్షిణాఫ్రికాకు నంబర్‌వన్ గదతో పాటు రూ. 2 కోట్ల 85 లక్షలు నగదు బహుమతి లభిస్తుంది. ఆస్ట్రేలియాకు రూ. 2 కోట్ల 22 లక్షలు, భారత్‌కు రూ.1 కోటి 59 లక్షలు లభించనున్నాయి. -
ఐ యామ్ ఎ లెజెండ్!
నటన మాత్రమే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. ‘ఐ యామ్ ఎ లెజెండ్’ అంటుంది స్మిత్. అపార్థం చేసుకోకండి...అది ఆ అమ్మాయి సినిమా పేరు. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందరూ పుణికి పుచ్చుకుంటారని గ్యారెంటీ ఏమీ లేదు. ‘ ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది అన్ని సందర్భాలలోనూ నిజమవుతుందనే నమ్మకం కూడా లేదు. పదమూడు సంవత్సరాల అమెరికన్ అమ్మాయి విల్లో స్మిత్ అక్షరాల తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుంది. స్మిత్ తండ్రి విల్ స్మిత్ సంగీతకారుడు, నటుడు. తల్లి జడా పింకెట్ స్మిత్ నటి. ‘ఐయామ్ ఎ లెజెండ్’ సినిమా ద్వారా హాలివుడ్‌లోకి అరంగేట్రం చేసింది స్మిత్. ఆతరువాత ‘యాన్ అమెరికన్ గర్ల్’ మొదలైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్లు అందుకుంది. నటన మాత్రే కాదు గాత్రప్రతిభ కూడా తనలో ఉందని స్మిత్ నిరూపించింది. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఆల్బమ్ ‘విప్ మై హేర్’ స్మిత్‌కు ఎంతో పేరు తీసుకువచ్చింది. ‘బిల్బోర్డ్ హాట్ 100’ లీస్ట్‌లో టాప్ టెన్‌లో నిలిచింది. అవార్డ్లు కూడా గెలుచుకుంది. ఇటీవల వచ్చిన ‘రాక్ నేషన్’ ‘ఫైర్‌బాల్’ ‘ఐయామ్ మీ’ ‘డ్రౌనింగ్’ ‘5’ ఆల్బమ్‌లు స్మిత్ ప్రతిభను ప్రపంచానికి చాటాయి. తాజాగా ‘వి’ మ్యాగజైన్ కోసం స్మిత్ చేసిన షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఆ అమ్మాయి ‘ప్యాషన్స్ సెన్స్’ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తనను తాను ప్రత్యేకంగా నిలపుకోవడానికి ‘ఫ్యాషన్’ ఉపకరిస్తుంది అంటుంది స్మిత్. ‘‘ఎవరూ ఊహించిన భిన్నత్వం నా ఫ్యాషన్‌లో కనబడాలి’’ అనేది స్మిత్ కోరిక. ‘వి’ మ్యాగజైన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది!