కోహ్లీ హోల్డర్‌, స్మిత్‌ ట్యూబ్‌లైట్‌ ..సెహ్వాగ్‌ ట్వీట్‌ | Virender Sehwag Calls Steve Smith 'Tubelight' and Virat Kohli 'Holder' | Sakshi
Sakshi News home page

కోహ్లీ హోల్డర్‌, స్మిత్‌ ట్యూబ్‌లైట్‌ ..సెహ్వాగ్‌ ట్వీట్‌

Published Tue, Mar 28 2017 7:04 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

కోహ్లీ హోల్డర్‌, స్మిత్‌ ట్యూబ్‌లైట్‌ ..సెహ్వాగ్‌ ట్వీట్‌

కోహ్లీ హోల్డర్‌, స్మిత్‌ ట్యూబ్‌లైట్‌ ..సెహ్వాగ్‌ ట్వీట్‌

ఢిల్లీ: భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన దూకుడైన బ్యాటింగ్‌ శైలితో అభిమానులు అలరించేవాడు. అంతార్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం వీరు తన వ్యంగ్యమైన ట్వీట్‌లతో క్రికెట్‌ అభిమానులును అలరిస్తున్నాడు. గత కొద్ది కాలంగా ప్రతి విషయంపై వ్యంగ్యమైన ట్వీట్‌లతో  స్సందించిన వీరు. తాజాగా ధర్మశాల టెస్టులో భారత్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిడంతో టీంఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ  ట్వీట్‌ చేశాడు.  ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. సీరీస్‌లో ప్రతిభ చూపించిన క్రికెటర్లకు తన ఇంట్లో వాడే  వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు.
 
భారత కెప్టెన్‌ కోహ్లీకి హోల్డర్‌, టీం సభ్యులు ఉమేశ్‌ యాదవ్‌కు పట్టుకారు( సాన్సీ)  అశ్విన్‌, రహనేలకు డిసర్ట్ కూలర్‌, కుల్‌దీప్‌కు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌‌,  పుజారాకు ఇన్వర్టర్‌, జడేజాకు నీటి పంపు మోటారు (టుల్లు పంపు), రాహుల్‌కు స్టెబ్‌లైజర్ వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. వీరు తన ఇంటి అవార్డులను ఆసీస్‌ ఆటగాళ్లకు సైతం కేటాయించాడు. సీరీస్‌లో సెంచరీలతో చెలరేగి 499 పరుగులు చేసిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు ట్యూబ్‌లైట్‌, రాంచీ టెస్టు డ్రాగా మార్చిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌కోంబ్‌కు దువ్వెన (జూన్‌ కంగీ), అవార్డులు దక్కాయి.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement