Sehwag
-
టీమిండియాకు మరో ధోని దొరికేశాడు
-
ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్..!
-
Vijay Merchant Trophy: అండర్–16 టోర్నీలో ద్రవిడ్ vs సెహ్వాగ్
సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు. ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్ ద్రవిడ్ (ద్రవిడ్ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్ (సెహ్వాగ్ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు. దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెపె్టన్ అన్వయ్ (0) డకౌటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ (98 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్ ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు. -
టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కరబరిచిన భారత జట్టు ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. టీమిండియా కనీస పోటీ కూడా ఇవ్వకుండా టైటిల్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఇక ఈ కీలక మ్యాచ్‌కు రవిచంద్రన్ అశ్విన్ పక్కన పెట్టిన భారత జట్టు మెనెజ్మెంట్పై మొదటి రోజు నుంచే విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తవించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పిదాలను సెహ్వాగ్ ఎత్తి చూపాడు. "డబ్ల్యూటీసీ విజేతగా నిలిచినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు చాంపియన్స్‌గా నిలవడానికి అర్హులు. అయితే ఆసీస్ జట్టులో ఎడమచేతి బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అశ్విన్ జట్టులో ఉండాల్సింది. అతడు లెఫ్ట్హ్యండర్స్కు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. ఎప్పుడైతే అశ్విన్‌ను పక్కన పెట్టి జట్టు మెనెజ్‌మెంట్ పెద్ద తప్పుచేసింది. అది వాళ్ల ఓటమికి ఒక కారణం. అదేవిధంగా భారత టాపర్డర్ కూడా చాలా నిరాశపరిచింది. వారు కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఛాంపియన్షిప్లను గెలుచుకోవాలంటే ఇటువంటి ఆటతీరు పనికిరాదు. ఇంకా బెటర్ మైండ్ సెట్‌తో ముందుకు పోవాలని" ట్విటర్లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్‌కప్ మ్యాచ్! పాక్- భారత్ మ్యాచ్ అక్కడే Congratulations to Australia on winning the #WTCFinal. They are the deserved winners. India lost it in their minds when they decided to exclude Ashwin against a left-handed heavy attack. Plus the top order needed to bat better. Need to have better mindset and approach to win… — Virender Sehwag (@virendersehwag) June 11, 2023 -
ఈ కుర్రాడిని ఫ్రీగా వదిలేయండి.. పంత్‌పై సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్
Sehwag Lauds Rishabh Pant: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో వీరోచిత శతకంతో చెలరేగిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. గవాస్కర్, సచిన్ వంటి దిగ్గజాలు పంత్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తుతున్నారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పంత్‌ను కొనియాడాడు. ఎక్కడ రాణించామా అన్నది కాదు.. కీలక సమయాల్లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడామా అన్నదే ముఖ్యమని పంత్ అభిమానులు సోషల్‌మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. Is ladke ko free hi chhod do. One of the biggest match winners in Test Cricket round the world #RishabhPant — Virender Sehwag (@virendersehwag) January 13, 2022 ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం పంత్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ కుర్రాడిని వదిలేయండి. ప్రపంచ క్రికెట్లో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్లలో ఒకడు అంటూ కితాబునిచ్చాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించాడు. కాగా, పంత్(139 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకం సాయంతో దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా పంత్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(10), కోహ్లి(29), పంత్ మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. సఫారీ బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పంత్ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు -
మరోసారి కలిసి బరిలోకి దిగనున్న సెహ్వాగ్, యువీ, భజ్జీ..
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టుకు వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. ఈ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..! -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్‌గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్‌గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్‌లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్.. -
శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని(31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు. Shardul counter-attacks England in style and races to his 50 with a pull over square leg for 6. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Shardul pic.twitter.com/pzGbUPnUI8 — Sony Sports (@SonySportsIndia) September 2, 2021 ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బోథమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక, 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన సుడిగాలి ఇన్నంగ్స్తో గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. రాబిన్సన్ వేసిన 60వ ఓవర్లో వరుసగా 4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్లో రెండో అర్థశతకం పూర్తి చేశాడు. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం టీమిండియా బౌలర్లు కూడా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి ఎదురీదుతోంది. బుమ్రా(2/15), ఉమేశ్(1/15) ఇంగ్లండ్ టపార్డర్ పతనాన్ని శాసించారు. చదవండి: అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం -
అండర్సన్ బౌలింగ్ ఎదుర్కునే ముందు ఈ మంత్రం జపించండి..
లండన్: ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో స్వింగ్ కింగ్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు నానా తిప్పలు పడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌కు మన వీరేంద్రుడు ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటిస్తే ఆండర్సన్ బౌలింగ్‌లో ఎవరూ అవుట్ కారని భరోసా ఇస్తున్నాడు. ఇంతకీ ఆ మంత్రం ఏంటని అనుకుంటున్నారా..? అండర్సన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న వారంతా అతను బంతి పట్టుకొని పరుగెడుతూ క్రీజ్ వద్దకు రాగానే ఒకడుగు ముందుకు వేసి గట్టిగా 'జై భజరంగ్ బలి' అనే మంత్రం పఠించాలని, అప్పుడు పరుగులు రాకపోయినా ఔట్ అయితే కాకుండా బతికిపోతారని చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ ఇచ్చిన ఈ సలహాను ఆధారాలతో సహా సమర్ధించుకోవడం విశేషం. క్రీజ్ వదిలి ముందు కొచ్చి ఆడటం వల్ల క్లీన్ బౌల్డ్ కావడం గానీ.. లోపలికి వచ్చే బంతుల వల్ల ఎల్బీడబ్ల్యూ కావడం కానీ జరగదని చెప్పుకొచ్చాడు. గతంలో పుజారా, కోహ్లీలు మాత్రమే అండర్సన్ బౌలింగ్‌లో అవుటయ్యే వారని.. ఇప్పుడు రహానే కూడా ఆండర్సన్ రెగ్యులర్ కస్టమర్ల జాబితాలో చేరాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాబట్టి ఈ ముగ్గురు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆడేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. అయితే, సెహ్వాగ్ సలహా విని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కొందరైతే ఇది లగాన్ సినిమా నుంచి కాపీ చేసినట్లుందని కామెంట్లు చేస్తున్నారు. అందులో కూడా బ్రిటిష్ బౌలర్‌ను ఎదుర్కొనే ముందు పూజారి క్యారెక్టర్ వేసిన నటుడు 'జై భజరంగ్ బలి' అని అరుస్తాడు. అనంతరం బౌండరీలు కూడా బాదేస్తాడు. ఆ సీన్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, 39 ఏళ్ల వయసులో కూడా ఆండర్సన్ అదరగొడుతున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. కీలక ఆటగాళ్లైన రోహిత్, పుజారా, రహానేల వికెట్లు తీసి టీమిండియాను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరగులు చేసి ఆలౌటైంది. -
సెహ్వాగ్ టీ20 జట్టు.. ఆ యువ ఆల్‌రౌండర్‌కు అనూహ్యంగా చోటు
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు తుది జట్టు ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు విశ్లేషకులు, మాజీలు సైతం తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్లపై తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేశాడు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించిన వీరూ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్‌లను విస్మరించాడు. తన జట్టులో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన వీరేంద్రుడు.. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు. అయితే ఆల్‌రౌండర్ల ఎంపిక విషయంలో వీరూ తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను స్థానం కల్పించిన ఆయన.. అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఎంపిక చేశాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని తెలిపాడు. ఇక జడ్డూ అసలుసిసలైన ఆల్‌రౌండరని, సుందర్ కారణంగా బౌలింగ్ డెప్త్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు. కాగా, స్పెషెలిస్ట్ స్పిన్నర్ కోటాలో వీరూ.. కేవలం చహల్‌కు మాత్రమే చోటు దక్కుతుందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ప్రధాన పేసర్లుగా ఉంటారని అంచనా వేశాడు. ఇటీవలకాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న దీపక్ చాహర్‌ను సైతం వీరేంద్రుడు విస్మరించడం విశేషం. సెహ్వాగ్ టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్ -
సెహ్వాగ్, రోహిత్‌లతో కానిది పృథ్వీ షా చేసి చూపించాడు..
కొలొంబో: శ్రీలంకతో ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బౌండరీల మోత మోగించాడు. సీనియర్ ఓపెనర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) వరుస ఫోర్లతో శ్రీలంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. క్రీజులో ఉన్నంతసేపు ఓవర్‌కు రెండు లేదా మూడు ఫోర్ల చొప్పున బాదాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే, ఇందులో ధవన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా, ఎక్స్‌ట్రాలు పోను మిగతా పరుగులన్నీ షానే చేశాడు. ఈ క్రమంలోనే అతను ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో మొదటి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2002 నుంచి ఇన్నింగ్స్ మొదటి ఐదు ఓవర్లలో ఇన్ని పరుగులు ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా చేయలేదు. అంతకుముందు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ తొలి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా, ఆ మ్యాచ్‌లో శతక్కొట్టేలా కనిపించిన షా.. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో స్పిన్నర్ ధనంజయ బౌలింగ్‌లో ఏకాగ్రతను కోల్పోయి పెవిలియన్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, 263 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), ధవన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్నందించారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ ( 20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) ధాటిగా ఆడి టీమిండియాకు సునాయాస విజయాన్ని అందించారు. దాంతో భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో బోణి కొట్టింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ఇదే వేదికగా జరుగనుంది. -
బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా..? అక్తర్ స్లెడ్జింగ్‌కు సెహ్వాగ్ కౌంటర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దాయాది పాక్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమైందో వివరించి చెప్పాల్సిన పని లేదు. నాటి మ్యాచ్‌లో సెహ్వాగ్ (375 బంతుల్లో 309; 39 ఫోర్లు, 6 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ టెస్ట్‌లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అక్తర్ అతనిపైకి షార్ట్ పిచ్ బంతులతో దాడి చేశాడు. పదే పదే బౌన్సర్లు సంధించాడు. ఇక సెహ్వాగ్ ప్రతి షార్ట్ బాల్‌ను డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ తెలివైన వ్యూహానికి చిర్రెత్తుకుపోయిన అక్తర్ అతని దగ్గరకు వెళ్లి.. ఒక్క పుల్ షాట్ ఆడే ప్రయత్నమైనా చేయొచ్చుగా అని కోరాడు. దానికి సెహ్వాగ్.. అరే అక్తర్.. నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా అని దిమ్మతిరిగే బదులిచ్చాడని నాటి మ్యాచ్ విశేషాలను మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముల్తాన్ టెస్ట్‌లో భారత్ రెండే రోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండు రోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లేర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో ప్రస్తావించాడు. -
రసెల్, డీకేలలో గెలవాలన్న కసి కనబడలేదు: సెహ్వాగ్
చెన్నై: ముంబైతో మ్యాచ్‌ను చేజేతులా జారవిడిచిన కేకేఆర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు దినేశ్ కార్తీక్(11 బంతుల్లో 8 నాటౌట్), ఆండ్రీ రసెల్(15 బంతుల్లో 9)లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రసెల్, డీకేలు అలసత్వం ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించాడు. సరిపడా బంతులు, చేతిలో వికెట్లున్నా ఎదురుదాడి చేయకపోవడం ఏంటని నిలదీశాడు. రసెల్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు 27 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. సునాయాసంగా గెలవాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారిలో జట్టును గెలిపించాలన్న కసి కనిపించలేదని విమర్శించాడు. తొలి మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ మోర్గాన్ చెప్పిన సానుకూల దృక్పథం అన్నది వీరిద్దరిలో ఏ కోశానా కనపడలేదని ఎద్దేవా చేశాడు. వారు మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లి గెలిపిద్దామనుకుని విఫలంమయ్యారని ఆరోపించారు. రసెల్, డీకేల కంటే ముందు బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్, నితీశ్ రాణా, షకిబ్, మోర్గాన్‌లు జట్టును గెలిపించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ చేశారని, ఈ క్రమంలో వారు వికెట్లు కోల్పోయారని, కానీ రసెల్, డీకేల పరిస్థితి అలా కనిపించలేదని విమర్శించాడు. ఈ ఓటమితో కేకేఆర్ సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. కేకేఆర్ ఓటమిపై ఆ జట్టు సహా యజామని షారుక్ ఖాన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడినందుకుగాను ఆయన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. కాగా, రోహిత్ సేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మోర్గాన్ బృందం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
ఈ రూల్స్ అప్పుడుంటే సచిన్, గంగూలీలకు అవకాశాలు వచ్చేవి కావు..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్నెస్ టెస్ట్) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రికటర్ల ఎంపిక అనేది నైపుణ్యం ఆధారంగా జరగాలని, ఫిట్నెస్ టెస్ట్ కొలమానంగా కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్ట్ తప్పనిసరి అన్న విధానంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్టుగా బీసీసీఐ గత నెలలో యోయో టెస్ట్ నియమాలను మరింత కఠినతరం చేయడంపై ఆయన మండిపడ్డాడు. కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడం, నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం వంటి సరికొత్త నిబంధనలపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్నెస్ టెస్ట్ వల్ల అంబటి రాయుడు, సంజు సాంసన్, మహ్మద్ షమీ, తాజాగా రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను తృటిలో చేజార్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆయన బీసీసీఐకి సూచించారు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి నైపుణ్యం లేకపోతే, అది జట్టుకు ఏమాత్రం ఉపయోగకరం కాదని ఆయన వాదించాడు. కాగా, ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే యోయో టెస్ట్ తప్పనిసరిగా క్లియర్ చేయాలన్న నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్ -
మొన్న అలా, నేడు ఇలా.. కోహ్లిపై సెహ్వాగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్‌లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్‌కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. -
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్ దిగ్గజాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు మరో సారి బరిలోకి దిగి పేక్షకులకు కనువిందు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్‌లీ, తిలకరత్నె దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు పాల్గొనున్నారు. ఈ టోర్నీ మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది ఈ సిరీస్(నాలుగు మ్యాచ్‌ల అనంతరం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో ఆటగాళ్లు తమ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ పేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. -
నాకిష్టం లేకున్నా... మంత్రి రాథోడ్ వల్లే చేరా!
న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్స్ ప్యానెల్ (ఏడీఏపీ)లో ఇష్టం లేకపోయినా క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కోరిక మేరకే చేరానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ‘నాడా’ గతేడాది నవంబర్‌లో ఏడీఏపీ సభ్యుడిగా సెహ్వాగ్‌ను నియమించింది. ఆటగాళ్ల నిషేధంపై చేసుకున్న అప్పీల్‌ను ఈ ప్యానెల్ విచారిస్తుంది. ఇప్పటివరకు పలువురి అప్పీళ్లను విచారించినప్పటికీ ఏ ఒక్క విచారణకు సెహ్వాగ్ హాజరు కాలేదు. దీనిపై వచ్చిన వార్తలపై అతను వివరణ ఇచ్చాడు. ‘నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్ల కంటే ఒలింపియన్లనే ‘నాడా’ కమిటీల్లో నియమించాలి. వాళ్లకైతేనే ‘నాడా’ వ్యవహారాలు తెలుస్తాయి. డోపింగ్ నిరోధక అంశాలు నాకంటే ఒలింపియన్లకే బాగా తెలుసు. వారే ఈ ప్యానెల్ సభ్యులుగా అర్హులు. నాకు ఈ పదవిపై ఇష్టమే లేదు. కానీ... మంత్రి రాథోడ్ కోరికను కాదనలేకే సరేనన్నా’ అని సెహ్వాగ్ వివరించాడు. -
ఈ విజయం అసామాన్యమైనది : సెహ్వాగ్
ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి హిమ దాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిమ దాస్‌ను ప్రశంసిస్తూ.. ‘వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన హిమకు శుభాకాంక్షలు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఇక ఒలంపిక్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలి’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా.. ‘మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశావంటూ’ హిమను ప్రశసించారు. ఇక ట్విటర్ ఫన్నీమ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్... ‘చాలా గర్వంగా ఉంది. నీ విజయం అసామాన్యమైనది. స్వర్ణ పతకం సాధించి మాకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలందరికీ హిమ దాస్ ధన్యవాదాలు తెలిపారు. కాగా అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఫిన్లాండ్లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. తద్వారా ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ చరిత్ర సృష్టించారు. Congratulations to our sensational sprint star Hima Das for winning the 400m gold in the World Under-20 Championship. This is India’s first ever track gold in a World Championship. A very proud moment for Assam and India, Hima; now the Olympic podium beckons! #PresidentKovind — President of India (@rashtrapatibhvn) July 12, 2018 Wow! So proud of you Hima Das. Incredible, historic achievement on becoming the first Indian track athlete to win a medal at any global event winning Gold at women's 400m World U-20 Championships clocking a time of 51.47 seconds. Thank you for the happiness. pic.twitter.com/Cs5wY8sDuM — Virender Sehwag (@virendersehwag) July 12, 2018 T 2865 - CONGRATULATIONS .. #HimaDas , the first Indian Women to win a GOLD in World Athletic track event EVER ! INDIA is proud of you .. you have given us reason to hold up our heads HIGH ! JAI HIND !! 🇮🇳🇮🇳 pic.twitter.com/Q0YVCx6FSf — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2018 -
హైతీ ప్రజలు ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను..
-
హైతీ ప్రజలు మట్టి రొట్టెలు తింటున్నారా!
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను లేదా పెంకులను ఆవురావురుమని ఎలా తింటున్నారో చూడండి! అంటూ గత రెండు రోజులుగా ఓ వీడియో వివిధ ‘వాట్సాప్’ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ‘మనం వదిలేసే తిండి కూడా దక్కని దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న ఇలాంటి ప్రజలను చూసైనా మీరు వృథాచేసే తిండిని సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అనే సందేశంతో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కూడా ఆ వీడియోతో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వీడియో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. మొదటి సారి 2009, ఫిబ్రవరిలో, రెండోసారి 2013, జూలైలో, మూడవ సారి 2016లో వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. అంత దీనావస్థలో ఉన్నారా? ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను తింటున్నారా? చారిత్రకంగా హైతీని ఆఫ్రికా దేశం అనేకంటే ఆఫ్రో–కరీబియన్ దేశమంటే బాగుంటుంది. స్విడ్జర్లాండ్ కన్నా ఈ దేశంలో కొండలు ఎక్కువ. అందుకే దీనికి హైతీ అనే పేరు వచ్చింది. హైతీ అంటే స్థానిక భాషలో ఎత్తయిన కొండలని అర్థం. దీన్ని అన్ని విధాల అష్టకష్టాల కూడలి అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలకు ప్రకృతి అనుకూలించకపోగా అనూహ్యంగా ఉంటుంది. ఎప్పుడు తుపానులు విరుచుకుపడతాయో, ఎప్పుడు భూప్రకంపనలు ప్రకోపిస్తాయో ఎవరికీ తెలియవు. ఇక్కడి ప్రజల ప్రధాన వత్తి వ్యవసాయమైనా, వ్యయసాయానికి దేశంలోని 12 శాతం భూమే అనుకూలమైనది. మరో 31 శాతం భూమి కాస్త వ్యవసాయానికి అనుకూలమైనా పంట చేతికొచ్చేవరకు నమ్మకం ఉండదు. చుట్టూ ఆక్రమించిన సముద్రపు అలల కోతలు ఎక్కువ. 54 శాతం భూమి ఎత్తయిన పండ్ల తోటలకు అనుకూలమని గతంలో అమెరికా వ్యవసాయ శాఖ ఓ సర్వేలో తేల్చింది. ఏయే పండ్ల తోటలను వేసుకోవచ్చో కూడా సూచించింది. అయితే వాటిని హైతీ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తున్నదో తెలియదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు. సముద్రం ఆటుపోట్లు లాగానే రాజకీయ సంక్షోభాలు ఎక్కువ. అందుకని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం హైతీలో జాతీయ దారిద్య్రం శాతం 58.6. పోషక ఆహార లోపాల వల్ల ఏటా వెయ్యి మందికి 53 మంది పిల్లలు మరణిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి పరంగా 230 దేశాల్లో దీని స్థానం 146. 2010లో వచ్చిన ‘మాథ్యూ హరికేన్’, దాని వెన్నంటి వచ్చిన భూకంపం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది మరణించారు. ఇప్పటికీ బాధితులు టార్పోలిన్ టెంట్లలోనే తలదాచుకుంటున్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో బతకలేక దేశ రాజధాని ‘పోర్ట్ ఔ ప్రిన్స్’ నగరానికి ఎక్కువగా వలసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మట్టి రొట్టెలను తినే అలవాటు ఉంది. వీటిని స్థానిక భాషలో ‘గలెట్టి’ అని, ఇంగ్లీషులో మడ్ కేక్స్ అని మడ్ కుకీస్ అని పిలుస్తున్నారు. సముద్రపు ఒడ్డున దొరికే గోధుమ వర్ణపు మెత్తటి బంక మట్టిని తీసుకొచ్చి దానికి కొంత ఉప్పు కలిపి రొట్టెల్లా చేసి ఎండ పెడతారు. వాటిని పిల్లలు, పెద్దలు మన గారెల్లా కొర్కుక్కు తింటారు. ఆ మట్టిలో వివిధ ఖనిజాలు ఉండడం వల్ల వాటిని ఇలా తిన్నట్లయితే కడుపు పేగుల్లోని క్రిములన్నీ చనిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని వారి నమ్మకం. మొదట్లో గర్భవతులు, ముసలి వాళ్లు వాటిని తినేవారు. డబ్బున్న వారు కూడా మన ఆయుర్వేద వైద్యంలా అప్పుడప్పుడు వాటిని తినేవారు. ఇప్పుడు పేద ప్రజలందరు వాటినే తింటున్నారు. కేవలం వారు బతకడం కోసమే తింటున్నారు. మట్టి రొట్టెల్లో పోషక పదార్థాలు ఉన్నాయనుకోవడం వారి ఆత్మ సంతప్తి కోసమే. ఆ మట్టిలో వివిధ రకాల ఖనిజాలు ఉన్నప్పటికీ పిల్లలకు, పెద్దలకు అవసరమైనన్ని పోషక పదార్థాలు లేవని ఐక్యరాజ్య సమితి ఇదివరకే తేల్చింది. ఉంటే 52 శాతం హైతీ పిల్లల్లో పోషక పదార్థాల లోపం ఎందుకుంటుందని కూడా ప్రశ్నించింది. -
ఓపెనింగ్ చెయ్... లేదంటే కూర్చో
కోల్‌కతా: టెస్టుల్లో తను ఓపెనింగ్ చేయాల్సిందేనని అప్పటి కెప్టెన్ ఖరాఖండిగా చెప్పినట్లు మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వీరూ... 2002లో ఇంగ్లండ్ టూర్లో తనకెదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ‘లార్డ్స్ టెస్టులో ఓపెన్ చేయాలని గంగూలీ చెప్పాడు. నేనెందుకు అని కోచ్ (జాన్‌రైట్), కెప్టెన్లను ప్రశ్నించా. అప్పుడు వాళ్లిద్దరు... ఇప్పటికే వన్డేల్లో ఓపెనర్‌గా రాణించావు కాబట్టి టెస్టుల్లో నీవు ఓపెనింగ్ చేసేందుకు ఈ అనుభవం చాలని బదులిచ్చారు. అప్పుడు మళ్లీ నేను వారితో సచిన్ దశాబ్దంపైగా ఓపెనర్. మీరు (గంగూలీ) కూడా 1998 నుంచి ఓపెనింగ్ చేస్తున్నారు కదా. మీరే ఓపెన్ చేయండి. నేను మిడిలార్డర్లో దిగుతానని చెప్పా. వెంటనే గంగూలీ... టెస్టులాడాలంటే ఓపెనింగ్ స్థానమే ఖాళీగా ఉంది. ప్రశ్నలు వేయకుండా ఓపెనింగ్ చెయ్ లేదంటే బెంచ్‌పై కూర్చోమని తెగేసి చెప్పాడు’ అని సెహ్వాగ్ నాటి సంగతుల్ని వివరించాడు. చివరకు తప్పకపోవడంతో ఒకవేళ ఓపెనర్‌గా విఫలమైతే జట్టు నుంచి తీసేయకుండా మిడిలార్డర్లో చాన్స్ ఇవ్వాలని గంగూలీతో వాగ్ధానం కోరగా... ‘దాదా’ సరేననడంతో ఓపెనర్‌గా లార్డ్స్‌లో ఆడిన తొలి టెస్టులో 84 పరుగులు చేశాడు సెహ్వాగ్. అయితే లార్డ్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ ఆటగాడు సెంచరీ చేయలేదని ఆ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నందుకు సచిన్, గంగూలీ, ద్రవిడ్‌లు తనను తిట్టారని సెహ్వాగ్ చెప్పాడు. నాట్‌వెస్ట్ ఫైనల్లో ఇంగ్లండ్ తమ ముందుంచిన 325 పరుగుల లక్ష్యంపై కంగారు వద్దని, తక్కువ వన్డేలాడిన వాళ్లే అంత స్కోరు చేసినపుడు... ఏడాదికి 30–35 వన్డేలాడే తామెందుకు చేయలేమని గంగూలీతో చెప్పినట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు. కైఫ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో నాట్‌వెస్ట్ ట్రోఫీ భారత్ వశమైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్లో గేల్‌పై నమ్మకంతోనే రెండో రోజు వేలంలో అతన్ని కనీస ధరకు తీసుకున్నట్లు చెప్పాడు. -
అభిమానికి సెహ్వాగ్ పాదాభివందనం
చండీఘడ్ : ఇంత వరకు అభిమానులు వారి అభిమాన తారల, క్రీడాకారుల కాళ్లకు దండం పెట్టడం చూశాం. కానీ మన వీర బాదుడు వీరేంద్రుడు మాత్రం అందుకు భిన్నంగా తన అభిమాని పాదాలకు వందనం చేశాడు. 93 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే తాత సెహ్వాగ్‌కు వీరాభిమాని. పటియాలకు చెందిన ఆయన మంగళవారం చండీఘడ్‌లో తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఓం ప్రకాశ్ కాళ్లు మొక్కి ఆయన దీవెనలు పొందారు సెహ్వాగ్. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో ఫోస్ట్ చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సెహ్వాగ్ కూడా తన 93 ఏళ్ల సీనియర్ అభిమానితో దిగిన సెల్ఫీని ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘దాదా కో ప్రణామ్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Felt extremely touched on meeting Om Prakash ji, who is 93 years old and came from Patiala to meet me in Chandigarh and expressed his love for me. Dada ko Pranam. pic.twitter.com/8AHHqNl753 — Virender Sehwag (@virendersehwag) 17 April 2018 It was a special moment for @virendersehwag as he met Mr. Om Prakash, one of his oldest fans at 93 years old. Both had a big smile on their faces all along 😄#LivePunjabiPlayPunjabi #KXIP #KingsXIPunjab #VIVOIPL pic.twitter.com/rsPjqdxPKq — Kings XI Punjab (@lionsdenkxip) 18 April 2018 -
చల చల్లగా... సరదా సరదాగా...
స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్‌లో ఐస్ క్రికెట్ సరదాగా సాగింది. గడ్డకట్టిన సరస్సుపై ఏర్పాటు చేసిన మ్యాటింగ్ వికెట్‌పై మైనస్ 12 డిగ్రీల హిమతాపంలో క్రికెట్ దిగ్గజాలు టి20 మెరుపులతో అలరించారు. డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ (31 బంతుల్లో 62) ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెట్టాడు. అయితే వీరూ జట్టుపై ఆఫ్రిది జట్టు గెలుపొందడం విశేషం. మొదట సెహ్వాగ్ ప్రాతినిధ్యం వహించిన డైమండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రజాక్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆఫ్రిది, అక్తర్లున్న రాయల్స్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓవైస్ షా (34 బంతుల్లో 74), కలిస్ (26 బంతుల్లో 36) ధాటిగా ఆడారు. శుక్రవారం రెండో టి20 జరుగుతుంది. -
సంస్కృతిని మించింది ఏదీ లేదు : సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ ఆలోచింపజేసే ట్వీట్లు చేస్తూ మనం ట్విట్టర్ కింగ్ గా ముద్దుగా పిలుచుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరొకసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ అందరిని ఆలోచనలో పడేసింది. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఒకవైపు వ్యాఖ్యాతగా, మరొకవైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టులతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. దీనిలో భాగంగానే ఓ ఆసక్తికరమై ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచం ఓవైపు ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతోంది. రోజు రోజుకు కొత్త కొత్త మోడల్‌లతో వస్త్రరంగం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అయితే మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో తెలిపే ఓ సంఘటనకు సంబంధించి ఓ ఫోటోను వీరేంద్రసెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఓ కామెంట్ పెట్టారు. ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన వేదికపై పూర్తి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో హాజరయిన వ్యక్తి ఫోటోను పోస్ట్ చేసి.. సంస్కృతిని మించిది ఏదీ లేదు అంటూ ఓ కామెంట్ పెట్టారు. Culture se badhkar kuch nahi A post shared by Virender Sehwag (@virendersehwag) on Nov 12, 2017 at 8:24am PST దీనిపై స్పందించిన నెటిజన్లు.. వేసుకున్న దుస్తులనుబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయలేం... ఆ వ్యక్తి వస్త్రాధరణ మనకు చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నా వారి దేశంలో అది సర్వసాధారణం..అంటూ స్పందించారు. 21వ శతాబ్ధంలోనూ వెస్టర్న్ కల్చర్‌ను ఫాలో కాకుండా ఉన్నారంటే ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి అంటూ మరో నెటిజన్ పొగడ్తలతో ముంచెత్తారు. న్యూయార్క్‌లోని యూనైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్‌లో 'గ్లోబల్ వార్మింగ్' పై ఈ ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో వెస్టర్న్ గునియా(పపువా)కు చెందిన ఓ అధికారి పూర్తి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అప్పుడు ఆయన వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. వివిధ దేశాల నుంచి హాజరైన అధికారుల మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తి న్యూ గునియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. -
టి20 చేజింగ్‌లో ధోని మారాలి: సెహ్వాగ్
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోని ఆటతీరు టి20ల్లో మారా లని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ అతనికి చెప్పాలని వీరూ సూచించాడు. కివీస్‌తో జరిగిన రెండో టి20లో ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసినప్పటికీ అతని సామర్థ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ ‘పొట్టి ఫార్మాట్లో ధోని తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. భారీ స్కోర్లు ఛేదించేటపుడు... ధోని తొలి బంతి నుంచే పరుగులు తీయాలి. టి20ల్లోనూ టీమిండియాకు అతని అవసరం ఉంది. ఆటకు ఎప్పుడు టాటా చెప్పాలో అతనికి బాగా తెలుసు. ఏ ఒక్క యువ ప్రతిభావంతుడి అవకాశాల్ని అతను దెబ్బతీయడు’ అని సెహ్వాగ్ అన్నాడు. -
ఆఖరి ఆటకు నెహ్రా
భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు నేటి మ్యాచ్‌తో శుభం కార్డు పడనుంది. 1999లో నెహ్రా భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సొంతగడ్డపై అతనికి విన్నింగ్ ఫేర్వెల్ ఇచ్చేందుకు ఢిల్లీ సహచరుడు భారత కెప్టెన్ కోహ్లి తన సేనతో సిద్ధమయ్యాడు. సెహ్వాగ్ ద్వారం... భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌కు సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టారు. దీనిపై అతను స్పందిస్తూ ‘దీన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యువ క్రికెటర్లకు ప్రేరణ ఇచ్చేలా ఢిల్లీ సంఘం (డీడీసీఏ) తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. గేట్‌పై ఉన్న పేరును చూస్తే కుర్రాళ్లు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా’ అని అన్నారు. -
ధోని హెలికాఫ్టర్ షాట్.. ఎవరు బాగా ఆడారంటే...
-
ధోని హెలికాఫ్టర్ షాట్.. ఎవరు బాగా ఆడారంటే...
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది హెలికాఫ్టర్ షాట్. ఈ షాట్‌ని క్రికెట్‌కు పరిచయం చేసింది ధోనియేనని వేరే చెప్పక్కర్లేదు. దోని తన బ్యాట్‌ను అచ్చం హెలికాఫ్టర్లాగే తిప్పుతూ బాల్ని బౌండరీ దాటించి మొదట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే ఈ షాట్ ఆడటానికి చాలా మంది ప్రయత్నించిన ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా శనివారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 అనంతరం కామెంటర్లు ధోని హెలికాఫ్టర్ షాట్‌ని చాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ చాలెంజ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతోపాటు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డీన్ జోన్స్, బ్రెట్ లీలు పాల్గొని ధోనిని అనుకరించే ప్రయత్నం చేశారు. ఈ నలుగురు ధోనిలాగే షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. కాగా వీరందరితో పోలిస్తే కాస్త వీరేంద్ర సెహ్వాగ్ హెలికాఫ్టర్ షాట్ బాగా కొట్టాడు. ధోని స్వస్థలం రాంచీలోనే ఈ ప్రయోగం చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోని స్టార్ స్సోర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఐపీఎల్ డబ్బుల కోసమే స్లెడ్జింగ్ చేయడంలేదు...
వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమను దూరంగా ఉంచుతాయనే భయంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌లు జరిగే సమయంలో స్లెడ్జింగ్‌కు పాల్పడటం లేదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. దుర్భాషలు చేస్తే ఐపీఎల్ యాజమాన్యాలు వారితో ఒప్పందం చేసుకునేందుకు వెనుకాడతాయనే విషయం కంగారూలకు బాగా తెలుసని వీరూ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌లో స్మిత్, వార్నర్, ఫించ్‌లపై అతిగా ఆధార పడటమే ఆ జట్టు పరాజయాలకు కారణమని అతను విశ్లేషించాడు. -
జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్, పీటీ ఉష
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక కోసం కమిటీని ప్రకటించారు. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉషలకు చోటు కల్పించారు. రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ముకుంద్ (బాక్సింగ్), సునీల్ దబాస్ (కబడ్డీ), ఎం.ఆర్.మిశ్రా, ఎస్. కన్నన్, సంజీవ్ కుమార్ (జర్నలిస్ట్స్), లతా మాధవి (పారాథ్లెట్), అనిల్ ఖన్నా (క్రీడాధికారి), ఇంజేటి శ్రీనివాస్ (డీజీ, సాయ్), రాజ్వీర్ సింగ్ (సంయుక్త కార్యదర్శి, క్రీడా శాఖ) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 3న ఈ కమిటీ సమావేశమై అవార్డీలను ఎంపిక చేస్తుంది. -
అందుకే సెహ్వాగ్ ను కాదన్నారా!
న్యూఢిల్లీ: ఇంట గెలిచాకే.. రచ్చ గెలవాలి కదా.. ఈ విషయం మన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు తెలిసినట్లు లేదు. టీమిండియా కోచ్ గా దరఖాస్తు చేసినప్పుడు సెహ్వాగ్ కు ఆ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడింది. అయితే చివరికొచ్చేసరికి కోచ్ రేసులో అనూహ్యంగా వెనుబడిపోయాడు సెహ్వాగ్. ప్రధాన కోచ్ గా ఏమి చేయాలనుకుంటున్నాడనే దానిపై ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)కి బాగా నచ్చింది. అదే సమయంలో కోహ్లి కూడా సెహ్వాగ్ నియామకంపై పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఒకవేళ సీఏసీ సెహ్వాగ్ ను నియమిస్తే అందుకు ఓకే అనే సంకేతాలు కూడా ఇచ్చాడు. అయితే సెహ్వాగ్ చేసిన ఒక ప్రతిపాదన అతని పదవికి ఎసరు తెచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా కోచ్ అంశంలో తన పదవి ఖాయం కాకముందే సహాయక సిబ్బంది విషయంలో పట్టుపట్టి అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నడనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా సేవలందించిన సెహ్వాగ్.. ఆ జట్టుకు సహాయక సిబ్బందిగా పనిచేసిన ఫిజియో అమిత్ త్యాగి, అసిస్టెంట్ కోచ్ మిథున్ మన్షాస్ లను తెచ్చుకుంటానని అడిగినట్లు సమాచారం. ఈ విషయంలో సీఏసీ ఆలోచనలో పడటంతో సెహ్వాగ్ ఒక్కసారిగా వెనుకబడిపోయాడు. అదే సమయంలో కోహ్లి సూచించిన రవిశాస్త్రి ముందువరుసలోకి వచ్చేశాడు. ఇక్కడ రవిశాస్త్రి జట్టుకు సంబంధించి మాత్రమే ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ సమయంలో సహాయక సిబ్బంది విషయంలో రవిశాస్త్రి నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. దాంతోనే జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ ల పేర్లను సీఏసీ తెరపైకి తీసుకొచ్చింది. అయితే, రవిశాస్త్రి కోచ్ గా నియమించబడిన తరువాత తన సహాయక సిబ్బంది విషయంలో యాక్టివ్ గా ఉన్నాడు. జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టుకుని కూర్చొన్నాడు. అతని స్థానంలో భరత్ అరుణ్ ను నియమించాల్సిందేనంటూ సీఏసీని ఛాలెంజ్ చేశాడు. మరి, ముందుకు సహాయక సిబ్బందిని అడిగి సెహ్వాగ్ పొరపాటు చేశాడా? అనేది మాత్రం అతనికే తెలియాలి. -
వార్న్, గంగూలీలనూ వదల్లేదు..!
లండన్: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ది సెపరేట్ స్టైల్. ఏ విషయంలోనైనా తన ముద్ర కచ్చితంగా ఉండాలనే ఆసక్తి సెహ్వాగ్ కు చాలా ఎక్కువ. ప్రధానంగా హాస్యాన్ని పండించడంలో వీరూకు అతనే సాటి. గత కొంతకాలంగా అతను ట్విట్టర్లో స్పందిస్తున్న తీరే అతని హాస్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ అవతలి వ్యక్తులు ఎవరనేది మనోడికి అనవసరం. పాయింట్ దొరికిందంటే చాలు దాన్ని సరికొత్త కోణంలో విశ్లేషించడంలో సెహ్వాగ్ కు అలవాటు. అయితే ఈసారి సెహ్వాగ్ కు క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్- గంగూలీలు దొరికేశారు. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా పలుమార్లు వర్షం పడిన క్రమంలో అక్కడ కామెంటేటర్లుగా వ్యవరిస్తున్న గంగూలీ-వార్న్ ఓ కునుకు తీశారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్.. గంగూలీ, వార్న్ నిద్రిస్తున్న ఫోటోలను తీసి ట్విట్టర్ లో పెట్టేశాడు. దానికి తనదైన శైలిలో వ్యాఖ్యలు కూడా జోడించాడు. 'జీవితం అనేది ఎప్పుడూ కలలోనే రూపాంతరం చెందుతుంది. ఈ లెజెండ్లను చూడండి అస్సలు సమయాన్ని వృథా చేయకుండా ఎలా నిద్రపోతున్నారో. అందుకే వారు లెజెండ్స్ అయ్యారు' అంటూ చమత్కరించాడు. దీన్ని చూసిన వార్న్ నవ్వు ఆపులేకపోకపోయాడు. వర్షం బ్రేక్ లోమమ్మల్ని ఇలా ఫోటోలో బంధించి ట్విట్టర్ లో పెడతావా అంటూ వీరూ అంటూ వార్న్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. -
కోచ్ రేసులో నిలిచిన సెహ్వాగ్
-
కోచ్ రేసులో నిలిచిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. గత కొద్దీ రోజులుగా సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ఉన్నాడంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ వీరు నేడు ( గురువారం) కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫితో ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే పదవికాలం ముగుస్తుండటంతో బీసీసీఐ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే కుంబ్లే పదవి కాలాన్ని పొడిగిస్తారని భావించినా.. కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లేకు పడటం లేదని వార్తలు రావడంతో బీసీసీఐ అనిల్ కుంబ్లేకు ఉద్వాసన పలకే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ నుంచి ఓ అధికారి సెహ్వాగ్‌ను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. తాజాగా కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసీజన్ ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్‌కు కోచ్‌గా మినహా గతంలో పనిచేసిన అనుభవం సెహ్వాగ్ కు లేదు. ఇప్పటికే అనిల్ కుంబ్లే డైరెక్ట్‌గా కోచ్ పదవి రేసులో ఉండగా, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్ పైబస్లు కూడా కోచ్ పదవి రేసులో పోటిపడుతున్నారు. గతంలో టామ్ మూడీ శ్రీలంక కోచ్‌గా, రిచర్డ్ పైబస్ పాక్ కోచ్‌గా వ్యవహరించారు. ఇక మరో ఇద్దరు భారత మాజీ ఆటగాళ్లు కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. మాజీ బౌలర్ దొడ్డ గణేష్, భారత మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో పోటిపడుతున్నారు. టామ్ మూడీ, రాజ్ పుత్‌లు గత సంవత్సరం కూడా కోచ్ పదవికి పోటిపడ్డారు. ఇక కోచ్ నియామకంలో బీసీసీఐ సలహా కమిటీ, గంగూలి, లక్ష్మణ్‌లు ఇంటర్వ్యూలు చేయనున్నారు. గతేడాది రవిశాస్త్రి, కుంబ్లేకు పోటి నెలకొనగా సలహా కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. అయితే ఈ సారి మాత్రం బీసీసీఐ సెహ్వాగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తుంది.. -
సందీప్ శర్మదే ఆ రికార్డు : సెహ్వాగ్
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచి విజయాన్ని అందించిన కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ పై ఆ జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ శుక్రవారం చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరుపై కింగ్స్ పంజాబ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ బెంగళూరు కీలక బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ల వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో ఒకే మ్యాచ్ లో ఈ ముగ్గురిని అవుట్ చేసిన తొలి బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. తొలి ఓవర్లో గేల్ ను డక్ అవుట్ చేయగా, తరువాతి ఓవర్ లో విరాట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన డివిలియర్స్ వరుస బౌండరీలతో దూకుడు గా ఆడాడు. ఇక సందీప్ శర్మ తన మూడో ఓవర్ లో డివిలియర్స్ ను పెవిలియన్ కు పంపించాడు. బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో పంజాబ్ సునాయసంగా గెలవగలిగింది. ప్రతి విషయంపై ట్వీటర్ లో తన ట్వీట్ లతో వ్యంగ్యంగా స్పందించే వీరేంద్ర సేహ్వాగ్ తమ జట్టు బౌలర్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో అతన్నిపొగడ్తలతో ముంచెత్తాడు. ' గొప్ప ప్రదర్శనతో సందీప్ ఒకే మ్యాచ్ లో కోహ్లీ, గేల్, ఏబీడిలను అవుట్ చేసిన తొలి బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇక అక్సర్ పటేల్ బ్రిలియంట్ అని పంజాబ్ జట్టుకు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Great performance by Sandeep to become the 1st man to get all Gayle,Virat,ABD in a match .Axar Patel was brilliant. Congratulations Team ! — Virender Sehwag (@virendersehwag) 5 May 2017 -
ధోనిపై విమర్శలా?: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పుణె ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు. ఏదో కొన్ని మ్యాచ్ ఆధారంగా ధోని ఫామ్ పై అంచనాకు వచ్చి విమర్శలు గుప్పిస్తారా అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. మహీ వంటి స్టార్ క్రికెటర్ ఆటకు ఐపీఎల్ ఎంత మాత్రం ప్రామాణికం కాదనే విషయం విమర్శకులు తెలుసుకుంటే మంచిదన్నాడు. ఈ సందర్భంగా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ధోని ఆటను సెహ్వాగ్ ప్రస్తావించాడు. ధోని తిరిగి తన ఫామ్ ను అందిపుచ్చుకుంటాడన్నాడు. అందుకు మరికొంత సమయం అవసరమన్న సెహ్వాగ్... ధోని వచ్చే బ్యాటింగ్ ఆర్డర్ లో పరుగులు చేయడం అంత సులభం కాదన్నాడు. సాధారణంగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే ధోని ఒత్తిడి అధికంగా ఉంటుందన్నాడు. ఆ స్థానాల్లో కుదురుకుని పరుగులు చేయడమంటే అంత తేలిక కాదని విమర్శకులకు చురకలంటించాడు సెహ్వాగ్. ప్రస్తుతం ధోని ఫామ్ కోల్పోయాడని అనడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. త్వరలోనే ధోని సత్తా చాటుకుంటాడని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. అసలు త్వరలో ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ధోని లేని భారత జట్టును ఊహించడం కష్టమని ఈ డాషింగ్ ఆటగాడు పేర్కొన్నాడు. -
గంభీర్‌పై సెహ్వాగ్ విమర్శలు
దిల్లీ: ఆ ఇద్దరు.. ఒకప్పడు భారత క్రికెట్ జట్టుకు డాషింగ్ ఓపెనింగ్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుందంటే.. భారత విజయం ఖరారైనట్లే! వారెవరో కాదు. ఢిల్లీ ఆటగాళ్లు.. గంభీర్, సెహ్వాగ్! ఇంతకాలం మిత్రుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు విమర్శల వాగ్బాణాలకు దిగుతున్నారు. సోషల్‌మీడియాలో ట్వీట్ షాట్లతో అలరించే సెహ్వాగ్ మీడియా ముందు కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్–10వ సీజన్ కోసం బెంగళూరులో జరిగిన వేలంలో ఇషాంత్ అమ్ముడుపోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు గంభీర్ ‘నాలుగు ఓవర్లు వేసే ఆటగాడి కోసం ఏ జట్టైనా రూ.2కోట్లు ఖర్చు భరించలేదు’ అని అన్నాడు. రూ.2కోట్ల కనీస ధరతో ఇషాంత్ వేలంలో పాల్గొన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్‌గా ఉన్న సెహ్వాగ్ సూచనతో ఇషాంత్‌ను పంజాబ్ ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది. ఇటీవల పంజాబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సెహ్వాగ్ ముందుంచారు. దీనికి సెహ్వాగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘60 బంతులు కూడా ఆడని నీకోసం రూ.12కోట్లు ఎవరు వెచ్చిస్తున్నారు’ అంటూ ఎత్తి పొడిచాడు. తోటి ఆటగాడి విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ బాగానే చురకలంటించాడు. -
వీరు వర్సెస్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ దిగ్గజ ఒపెనర్లు, ఢిల్లీ సహచర ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు మంచి స్నేహితులు. కానీ ఐపీఎల్-10లో వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఆసక్తి చూపని ఇషాంత్ శర్మను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అత్యధిక ధరకు ఎంచుకోవడమే ఈ వివాదానికి కారణం. ఇషాంత్‌ను రూ.2 కోట్లకు పంజాబ్ జట్టు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎంపికలో కీలకపాత్ర పోషించిన పంజాబ్ కోచ్ సెహ్వాగ్‌ను కొల్‌కత కెప్టెన్ గంభీర్ తప్పుబట్టాడు. ఇషాంత్ ఎంపికకు కుదుర్చుకున్న ఒప్పందం ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్ల బేస్ ప్రైజ్ కన్న చాలా ఎక్కువని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 4 ఓవర్లు వేసే బౌలర్లకు రూ.2 కోట్ల ఎవరు చెల్లించరని, ఈ ఒప్పందం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని గంభీర్ వ్యాఖ్యానించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయం పై సెహ్వాగ్ స్పందించాడు. 60 బంతులు ఎదుర్కునేవారికి రూ.12 కోట్లు అవసరమా అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. 2011లో కొల్కతా నైట్‌రైడర్స్ గంభీర్‌కు రూ.12 కోట్లు చెల్లించిది. ఐపీఎల్ తొలి సీజన్లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాళ్ల మధ్య ఐపీఎల్-10లో మాటల యుద్దం జరగడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దిగ్గజ ఆటగాళ్ల జట్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కొల్కతా నైట్‌రైడర్స్ ఏప్రిల్ 13న తలపడనున్నాయి. -
కోహ్లీ హోల్డర్, స్మిత్ ట్యూబ్‌లైట్ ..సెహ్వాగ్ ట్వీట్
ఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్ శైలితో అభిమానులు అలరించేవాడు. అంతార్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం వీరు తన వ్యంగ్యమైన ట్వీట్లతో క్రికెట్ అభిమానులును అలరిస్తున్నాడు. గత కొద్ది కాలంగా ప్రతి విషయంపై వ్యంగ్యమైన ట్వీట్లతో స్సందించిన వీరు. తాజాగా ధర్మశాల టెస్టులో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిడంతో టీంఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సీరీస్‌లో ప్రతిభ చూపించిన క్రికెటర్లకు తన ఇంట్లో వాడే వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి హోల్డర్, టీం సభ్యులు ఉమేశ్ యాదవ్‌కు పట్టుకారు( సాన్సీ) అశ్విన్, రహనేలకు డిసర్ట్ కూలర్, కుల్దీప్కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, పుజారాకు ఇన్వర్టర్, జడేజాకు నీటి పంపు మోటారు (టుల్లు పంపు), రాహుల్‌కు స్టెబ్లైజర్ వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. వీరు తన ఇంటి అవార్డులను ఆసీస్ ఆటగాళ్లకు సైతం కేటాయించాడు. సీరీస్‌లో సెంచరీలతో చెలరేగి 499 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ట్యూబ్‌లైట్, రాంచీ టెస్టు డ్రాగా మార్చిన ఆసీస్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్కోంబ్కు దువ్వెన (జూన్ కంగీ), అవార్డులు దక్కాయి. Congratulations Bharat on a wonderful season. Only Chuna in Puna. Great effort @anilkumble1074 in ensuring no complacency. — Virender Sehwag (@virendersehwag) 28 March 2017 -
గుర్మెహర్కు గంభీర్ మద్దతు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో రామ్జాస్ కళాశాల పరిస్ధితులపై ఫోటోను పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన గుర్మెహర్ కౌర్‌కు క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతు తెలిపాడు. భావ ప్రకటన ప్రతి ఒక్కరి హక్కు అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో స్వేచ్చా, స్వతంత్రాల విస్తృతిని ఎదిగే కొద్ది తెలుసుకుంటారని అన్నాడు. కాగా, గుర్మెహర్పై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్ వ్యంగ్యంగా స్పందించారు. ఫోగట్ సిస్టర్స్ బబితా, గీతలు కూడా ఈ వ్యాఖ్యలను సమర్ధించిన విషయం తెలిసిందే. -
గుర్మెహర్ కౌర్ ట్వీట్ పై దుమారం
న్యూఢిల్లీ:తన తండ్రి మణ్ దీప్ సింగ్ కు చావుకు పాకిస్తాన్ కారణం కాదని, ఆనాటి కార్గిల్ యుద్ధమే కారణమని ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆ ట్వీట్ పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించగా, తాజాగా రెజ్లర్ యోగశ్వర్ దత్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఆల్ ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదని, బాంబులే ఆ పని చేశాయని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. ఒకనాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా తనను వ్యతిరేకించిన జ్యూస్‌కు చావుకు కారణం కాలేదని, అతను ప్రయోగించిన గ్యాసే ఆ పని చేసిందని చమత్కరించాడు. ఈ మేరకు ఫోటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసి గుర్మెహర్ కు కౌంటర్ ఇచ్చాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహాలో గుర్మెహర్ ట్వీట్ ను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది తాను కాదని, అవి చేసింది బ్యాట్ అని రిప్లే ఇచ్చాడు. ఇప్పడు సెహ్వాగ్ సరసన యోగేశ్వర్ దత్ కూడా చేరిపోయాడు. గుర్మెహర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన యోగేశ్వర్.. ఫ్లకార్డుతో ఉన్న ఆమె ఫోటోకు మరో మూడు ఫోటోల్ని జోడించి మరీ విమర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ గా పని చేసిన మణ్‌దీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దానిపై అతని కుమార్తె గుర్మెహర్ ఇటీవల ట్వీట్ చేసింది. తన తండ్రి అమరుడు కావడానికి పాకిస్తాన్ కాదని పేర్కొంది. యుద్ధమే తన తండ్రిని చంపిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. దాంతో పాటు ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ తీవ్రంగా ఖండించింది. ఆ క్రమంలోనే తర్వాత గుర్మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. దీనిలో భాగంగా తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది.దాంతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై కూడా గుర్మెహర్ స్పందించింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని ఆవేదన వ్యక్తం చేసింది. 🙈🙈🙈 pic.twitter.com/SiH90ouWee — Yogeshwar Dutt (@DuttYogi) 28 February 2017 -
సెహ్వాగ్‌తో ధోని ఇలా..!
బజ్జార్(హరియాణా):టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో విభేదాల కారణంగానే తన క్రికెట్ కెరీర్‌కు వీరేంద్ర సెహ్వాగ్ బలవంతంగా వీడ్కోలు చెప్పాడనేది గతంలో వినిపించిన మాట. అయితే తాజాగా తమ మధ్య అలాంటిది ఏమీ లేదనే సంకేతాలు పంపారు వీరిద్దరూ. దీనిలో భాగంగా శుక్రవారం వీరిద్దరూ కలిసిన ఒక ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కూడా. ఇంతకీ అసలు విషయమేమిటంటే..హర్యానాలోని బజ్జార్లో ఉన్న సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని ధోని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చావేదికలో విద్యార్థులతో కలిసి ఆనాటి తన స్కూల్ డేస్ జ్ఞాపకాల్ని ధోని పంచుకున్నాడు. 'మనం చక్కగా చదువుకోవడానికి, ఆటలతో ఎంజాయ్ చేయడానికి స్కూల్ అనేది ఒక చక్కటి వేదిక. ఇక్కడ టీచర్లదే కీలక పాత్ర. నా జీవితంలో స్కూల్ లైఫ్ అనేది అద్భుతంగా సాగింది. అదే నా జీవితంలో అత్యుత్తమ పిరియడ్. బాల్యం చాలా అందంగా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి మనమీద ఉండదు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఒత్తిడి అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతీ ఒక్కరూ పరుగుల జీవితానికి అలవాటు పడిపోయారు. స్కూల్ లైఫ్‌లో అటువంటి ఉండదు. కావాల్సినంతం ఆనందం.. అందం ఉంటుంది. బాల్యాన్ని చక్కగా ఆస్వాదించడండి' అని ధోని తన అనుభవాల్ని విద్యార్థులతో పంచుకున్నాడు. -
పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్
పుణె:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన కేదర్ జాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ యువ క్రికెటర్‌పై పలువురు మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపించగా, మన ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కేదర్ జాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ గెలవడం ఒకేసారి పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుందని సెహ్వాగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. భారత్ విజయం తరువాత తొలి ట్వీట్ లో జై జాదవ్ అని పేర్కొన్న సెహ్వాగ్.. ఆ తరువాత 'దస్ గుణ లగాన్ వసూల్' అంటూ మరో ట్వీట్ చేశాడు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి(122;105 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు), జాదవ్(120;76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ప్రధాన పాత్ర పోషించి భారత్ కు గెలుపు అందించారు. ఈ ఏడాదిని భారత క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించడంపై సచిన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారత జైత్రయాత్రకు తొలి అడుగు అంటూ వారు కొనియాడారు. Jai Kedar ! — Virender Sehwag (@virendersehwag) 15 January 2017 Hahahahahaha ! Dus Guna Lagaan Vasool.#INDvENG — Virender Sehwag (@virendersehwag) 15 January 2017 -
సెహ్వాగ్ రికార్డును మిస్సయ్యాడు!
సిడ్నీ:పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పలు రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన వార్నర్.. 40 ఏళ్ల తరువాత ఓపెనింగ్ సెషన్లోనే ఆ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఇదే క్రమంలో 87 ఏళ్ల తరువాత ఆసీస్ తరపున ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రోజు ఆటలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వార్నర్ కెరీర్లో ఇది 18వ టెస్టు సెంచరీ కాగా, పాక్‌పై మూడో సెంచరీ. టెస్టులో తొలిరోజు లంచ్ సమయానికి ముందే సెంచరీ చేసి ఐదో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. అంతకుముందు ట్రంపర్(1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనత వహించారు. అయితే భారత విధ్వంసక మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం వార్నర్ దాటలేకపోయాడు. 2006లో వెస్టిండీస్‌తో సెయింట్ లూసియాలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ 25.3 ఓవర్లలో సెంచరీ మార్కును చేరగా, తాజా టెస్టులో వార్నర్ మాత్రం మొదటి ఇన్నింగ్స్ 26.2 ఓవర్లలో శతకం సాధించాడు. ఇన్నింగ్స్ ఓవర్లు పరంగా సెహ్వాగ్ 'ఫాస్టెస్' రికార్డుకు వార్నర్ ఐదు బంతులు ముందు నిలిచిపోయి మరో ఘనతను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ రోజు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో వార్నర్ లంచ్ సమయానికి సెంచరీ చేస్తే, ఆనాటి విండీస్ తో మ్యాచ్‌లో సెహ్వాగ్ లంచ్ సమయానికి 99 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో నిలిచాడు. ఇదిలాఉంచితే పాక్ తో మ్యాచ్‌లో లంచ్ తరువాత వార్నర్(113) అవుటైతే, అప్పటి మ్యాచ్‌లో సెహ్వాగ్(180) టీ బ్రేక్ తరువాత అవుటయ్యాడు. -
బంగర్ స్థానంలో సెహ్వాగ్?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ఆరంభమైన నాటి నుంచి పేలవమైన ఫామ్‌తో ఇప్పటివరకూ టైటిల్ సాధించలేకపోయిన కింగ్స్ పంజాబ్ తమ ప్రదర్శనను మెరుగు పరుచుకోవాలనే యోచనలోఉంది. ఈ మేరకు వచ్చే సీజన్లో కింగ్స్ పంజాబ్ కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. ప్రధానంగా కింగ్స్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. గత రెండు ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలోనే పోరును ముగించిన పంజాబ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగానే గతంలో కింగ్స్ పంజాబ్ సభ్యుడిగా ఉన్న సెహ్వాగ్‌ను కోచ్‌గా నియమించడానికి కసరత్తులు చేస్తోంది. ఐపీఎల్ తొలి ఎడిషన్(2008)లో సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన కింగ్స్ పంజాబ్.. ఆ తరువాత 2014లో మాత్రమే ఫైనల్ వరకూ వెళ్లింది. మిగతా సీజన్లలో కింగ్స్ ఘోరంగా విఫలమై లీగ్ స్టేజ్‌ను దాటలేకపోయింది. దాంతో కనీసం కొన్నిమార్పులు చేసి, తమ తలరాతను మార్చుకోవాలని కింగ్స్ పంజాబ్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే కొత్త కోచ్ గా సెహ్వాగ్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. -
'ఇది విరాట్ కోహ్లి శకం'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ లో విరాట్ శకం ప్రారంభమైందంటూ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. 'గతేడాది భారత క్రికెట్ జట్టు టెస్టు బాధ్యతలు చేపట్టిన విరాట్ అద్భుతమైన ఆట తీరుతో విజయాలు సాధించి పెడుతున్నాడు. విరాట్ ది భిన్నమైన శైలి. ప్రస్తుత టీమిండియా క్రికెట్ శకం అత్యంత వినోదాత్మకంగా సాగుతుంది. విరాట్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కాకపోయినప్పటికీ, ఇది కచ్చితంగా విరాట్ కోహ్లి శకమే' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ మరో అడుగు ముందుకేసి విరాట్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు. టీమిండియాకు దొరికిన కొత్త టెండూల్కర్ ఎవరైనా ఉంటే కోహ్లియే అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'లక్ష్య ఛేదనలో మేటి ఆటగాళ్ల రికార్డులను పరిశీలిస్తే విరాట్ యావరేజ్ అమోఘం. అదే అతన్ని వరల్డ్ నంబర్ వన్ ఆటగాడిగా నిరూపిస్తుంది. విరాట్ కు పరుగుల ఆకలి ఎక్కువ. ఎప్పుడూ భారత జట్టు గెలవాలనే తపనతోనే క్రికెట్ ఆడతాడు' అని సెహ్వాగ్ పొగడ్తల వర్షం కురిపించాడు. -
ప్రతిసారీ పైచేయే!
భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటివరకూ ఏడు టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఆరుసార్లు గెలిస్తే పాక్ ఒక్కటి నెగ్గింది. అయితే వన్డే ప్రపంచకప్ తరహాలోనే టి20 ప్రపంచకప్‌లలోనూ భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ దాయాదిని చిత్తుచేసింది. మరోసారి ఈ రెండు దేశాల మధ్య రేపు (శనివారం) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... టి20 ప్రపంచకప్‌లలో భారత్, పాక్ పోరులను ఒకసారి గుర్తు చేసుకుందాం. బౌల్ ‘అవుట్’ - 13 సెప్టెంబర్, 2007 (డర్బన్) మొదటి టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉతప్ప (50), ధోని (33) రాణించడంతో భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. అనంతరం పాక్ 7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులే చేసింది. దీంతో ఫలితం కోసం బౌల్ అవుట్ పద్దతిని అనుసరించారు. దీనిని ఆటగాళ్లకు వివరించడం కూడా అప్పట్లో అంపైర్లకు పెద్ద పరీక్షలా మారింది. ముగ్గురు భారత బౌలర్లు హర్భజన్, సెహ్వాగ్, ఉతప్ప నేరుగా బౌలింగ్ చేసి స్టంప్స్‌ను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలమయ్యారు. దాంతో 3-0తో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. కెప్టెన్‌గా ధోని కెరీర్లో ఇదే మొదటి విజయం కావడం విశేషం. టి20ల్లో కొత్త అధ్యాయం -24 సెప్టెంబర్, 2007 (జొహన్నెస్‌బర్గ్) భారత్, పాక్ ఓ ప్రపంచకప్ మ్యాచ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. గంభీర్ (75)కి రోహిత్ (30 నాటౌట్) అండగా నిలిచాడు. 2 వికెట్లు కోల్పోయినా 33 బంతుల్లో 53 పరుగులు చేసి పాక్ జోరుగా దూసుకుపోయింది. ఈ దశలో నజీర్‌ను ఉతప్ప అద్భుతంగా రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఒత్తిడిలో పడి పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా (43) జట్టును గెలిపించేలా కనిపించాడు. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో జోగీందర్ బౌలింగ్‌లో మిస్బా కొట్టిన స్కూప్ షాట్ టి20 క్రికెట్‌కు కొత్త అధ్యాయం సృష్టించింది. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌తో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. పూర్తిగా ఏకపక్షం - 30 సెప్టెంబర్, 2012 (కొలంబో) శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో భారత్ పూర్తి సాధికారతతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 2 బంతులు మిగిలి ఉండగా 128 పరుగులకే ఆలౌటైంది. బాలాజీ 3 వికెట్లు తీశాడు. అనంతరం విరాట్ కోహ్లి (78 నాటౌట్) దూకుడుతో మూడు ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లకు 129 పరుగులు చేసి భారత్ ఏకపక్ష విజయం సాధించింది. మరోసారీ అలవోకగా... -21 మార్చి, 2014 (మిర్పూర్) బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఎక్కడా కనీస పోటీ కూడా కనిపించకుండా పాక్‌పై భారత్ మరోసారి అలవోకగా గెలిచింది. ముందుగా పాక్ 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం భారత్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. 2 కీలక వికెట్లు తీసిన అమిత్ మిశ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. -
గంగూలీ వర్సెస్ సెహ్వాగ్!
దుబాయ్: మరోసారి మాజీ క్రికెటర్లు తమ ఆటతో అలరించేందకు సిద్ధమవుతున్నారు.ఇటీవల అమెరికాలో జరిగిన క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్ ను వీక్షించిన ప్రేక్షకులు అదేస్థాయిలో కనువిందు చేసేందుకు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్(ఎంసీఎల్) వేదిక కాబోతుంది. వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న ఎంసీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకూ యూఏఈలోని పలుచోట్ల జరిగే మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైన్స్, విర్గో సూపర్ కింగ్స్ , సాగిటారియస్ స్ట్రైకర్స్ లు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. తొలి గేమ్ లో వీరేంద్ర సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్న జెమినీ అరేబియన్స్ జట్టు.. సౌరవ్ గంగూలీకి నేతృత్వం వహించే లిబ్రా లెజెండ్స్ జట్టు తలపడనుంది. ఈ లీగ్ కు సంబంధించి ఎంసీఎల్ -ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుల మధ్య 10 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. తొలి ఎడిషన్ లో ఓవరాల్ గా సెమీ ఫైనల్ , ఫైనల్ మ్యాచ్ లతో కలుపుకుని మొత్తం 18 మ్యాచ్ లు జరగనున్నాయి. -
అరుణ్ జైట్లీకి క్రికెటర్ల మద్దతు
న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి క్రికెటర్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. గతంలో డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అవతవకలు జరిగాయనే ఆరోపణలను మాజీ క్రికెటర్ల్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఇషాంత్ శర్మలు ఖండించారు.డీడీసీఏకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటగాళ్లకు ఆయన అండగా నిలిచేవారే తప్ప ఎటువంటి అవతవకలకు పాల్పడలేదని వారు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీ క్రికెట్ లో ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఏమైనా చెప్పాల్సి ఉంటే ఆయన వద్దకు నేరుగా వెళ్లి తెలియజేసే వాళ్లమని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కొంతమంది ఆయన్ను ఏదో భూతంలా చూపెడుతూ అనవసర రాద్దాంత చేస్తున్నారని సెహ్వాగ్ విమర్శించాడు. ఇదిలా ఉండగా, అరుణ్ జైట్లీ అసందర్భంగా తప్పుబడుతున్నారని మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. ఆయన హయాంలోనే ఢిల్లీ స్టేడియానికి ట్యాక్స్ మినహాయింపు లభించడంతో పాటు ఒక గుర్తింపు లభించిందన్నాడు. ఢిల్లీ ఆటగాళ్లకు ఏ సాయం కావాల్సి వచ్చినా ఆయన చాలా సాయంగా ఉండేవారని టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ఆయన(సర్) ను తాను ఎప్పుడూ కలిసినా ఆటగాళ్ల మధ్య ఎటువంటి తారతమ్యాలు చూపెట్టకుండా ఎంతో హుందాగా వ్యహరించేవారన్నాడు. అరుణ్ జైట్లీ డీడీసీఏ 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత కేజ్రీవాల్ సర్కార్ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఆయన వెంటనే కేంద్ర మంత్రికి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. డీడీసీఏ ఫైళ్లను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే తమపై కేంద్రం సీబీఐ దాడులకు ఉసిగొల్పిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. -
సెహ్వాగ్‌ను సన్మానించనున్న బీసీసీఐ
ఢిల్లీ: వీరేందర్ సెహ్వాగ్ పరిచయం అవసరం లేని క్రికెటర్. భారత క్రికెట్‌కు వన్డేలు, టెస్టులలో ఎన్నో మరపురాని విజయాలను అందించిన సెహ్వాగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సేహ్వాగ్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికా-భారత్‌ల మధ్య డిసెంబర్ 3 నుండి ఢిల్లీలో జరగనున్న నాల్గవ టెస్ట్ చివరిరోజున సేహ్వాగ్ను తన హోం గ్రౌండ్లో సన్మానించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్‌కు సేహ్వాగ్ అందించిన సేవలకు గాను గౌరవంగా ఆయన్ను సన్మానించనుంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను వాంఖడే స్టేడియంలో ఐదో వన్డే సందర్భంగా బీసీసీఐ సన్మానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేహ్వాగ్ హర్యానా తరపున రంజీలో ఆడుతున్నారు. అనంతరం అమెరికాలో జరిగే ఆల్ స్టార్ సిరీస్‌లో పాల్గొంటారు. -
సలామ్ సెహ్వాగ్!
‘‘వివ్ రిచర్డ్స్ ఆడగా నేను ఎప్పుడూ చూడలేదు. కానీ సెహ్వాగ్ నాకు అలాంటి ఆటను చూపించాడు. నేరుగా ఆ విధ్వంసాన్ని చూడగలిగిన నేను అదృష్టవంతుడిని...’’- భారత కెప్టెన్ ధోని చేసిన ప్రశంస ఇది. ఆధునిక క్రికెట్లో ఇప్పుడు ఎంతో మంది బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటాన్ని చూస్తున్నాం. కానీ ఆటకు ఈ దూకుడు నేర్పింది సెహ్వాగ్. తర్వాతి వారందరూ అతడిని అనుసరించినవారే. టెస్టు మ్యాచ్ డ్రా కావడం ఖాయమనిపించిన చోట ‘జీతేంగే భాయ్’... అంటూ కెప్టెన్‌కు ధైర్యం ఇవ్వగల ఆటగాడు వీరేంద్రుడు ఒక్కడే. తొలి అంతర్జాతీయ వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన సెహ్వాగ్ తన ముద్ర చూపించడానికి రెండేళ్లు పట్టింది. దమ్మున్నవారికే అదృష్టం కలిసొస్తుంది అన్నట్లుగా సచిన్ గాయం కారణంగా ఓపెనింగ్ చేసే అవకాశం రావడంతో 69 బంతుల్లోనే చేసిన సెంచరీ... వీరూ కెరీర్‌నే కాదు, భారత క్రికెట్ రాతను కూడా మార్చింది. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా మారిన సెహ్వాగ్ మంచినీళ్లప్రాయంలా పరుగులు సాధిస్తూ రికార్డులు కొల్లగొట్టాడు. సంప్రదాయానికి భిన్నమైన సెహ్వాగ్ బ్యాటింగ్ శైలి, ఆటను అతను చూసే తీరు టెస్టు క్రికెట్‌కు కూడా కొత్త ఆకర్షణను తెచ్చింది. టెస్టులు అంటే నిస్సత్తువగా సాగే బోరింగ్ మ్యాచ్‌లు... ఓపెనర్లు అంటే బంతులు వదిలేయడమే కానీ పరుగులు రావనే పాత కాలపు మాటల కోటలను సెహ్వాగ్ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో కూడా వినోదం లభిస్తుందనేది సెహ్వాగ్ మాత్రమే చూపించగల ప్రదర్శన. ఒక్క రోజులో 284 పరుగులు చేసినా... రెండు సెషన్లలోనే ఆసీస్ గడ్డపై 195 పరుగులు బాదినా, అది అతనికే చెల్లింది. సున్నితమైన విధ్వంసం ఎలా ఉంటుందో సెహ్వాగ్ బ్యాటింగ్‌ను చూస్తే తెలుస్తుంది. ఆకాశమే హద్దుగా ఒక వైపు చెలరేగడం మాత్రమే కాదు... ఆఫ్ సైడ్‌లో స్లిప్ లేదంటే థర్డ్ మ్యాన్ మీదుగా అలవోకగా బంతిని కట్ చేస్తూ అతను సాధించిన పరుగులు చూస్తే క్రికెట్లోని అందం ఏమిటో కనిపిస్తుంది. మరే క్రికెటర్ ఊహకు కూడా అందని ఘనతలు సెహ్వాగ్ కెరీర్లో ఎన్నో ఉన్నాయి. భారత్ జట్టు టెస్టులు ఆడటం మొదలు పెట్టిన 72 ఏళ్ల తర్వాత కూడా ఏ ఆటగాడూ ట్రిపుల్ సెంచరీ చేయలేదు. కానీ నాలుగేళ్ల వ్యవధిలో రెండు సార్లు ఆ ఘనతను సాధించిన ఈ ఢిల్లీ సంచలనం, మరో ఏడాది త్రుటిలో మూడో ట్రిపుల్ సెంచరీని కోల్పోయాడు. కెరీర్లో ఆరు టెస్టు సెంచరీలు వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో ఉండటం, అందులో మూడు సార్లు 250 పరుగులు దాటడం, టాప్-10 ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలలో ఐదు అతని పేరిటే ఉండటం సెహ్వాగ్ విధ్వంసాన్ని చూపిస్తుంది. ‘నువ్వు కేవలం బంతిపైనే దృష్టి పెట్టు. దానిని చితక్కొట్టడం నీ పని. అది టెస్టు మ్యాచ్‌నా... వన్డేనా...టి20నా అనేది అనవసరం. బంతిని బలంగా బాదాక వచ్చే శబ్దం ఎంత వీనులవిందుగా అనిపిస్తుందో తెలుసా. బంతిని వదిలిస్తే అది నువ్వు వినలేవు’ అని సెహ్వాగ్ మాత్రమే అనగలడు. తన తరంలోని దిగ్గజ టెస్టు క్రికెటర్లతో పోలిస్తే సాంకేతికపరంగా అతను వెనుకబడి ఉండవచ్చు. కానీ భారత జట్టు టెస్టుల్లో సాధించిన అత్యుత్తమ విజయాల్లో సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు నంబర్‌వన్ కావడంలో, ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లే ఊతంగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. టెస్టు క్రికెట్ దశ, దిశను మార్చిన ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్న వీరేంద్రుడు వన్డేల్లోనూ డబుల్ సెంచరీతో తన ఘనతను పరిపుష్టం చేసుకున్నాడు. భారత్‌లోని చాలా మంది కుర్రాళ్లలాగే సచిన్ టెండూల్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆటలోకి అడుగు పెట్టిన సెహ్వాగ్, అనేక సందర్భాల్లో అతడిని మించిన ప్రదర్శనతో తన విలువను ప్రదర్శించాడు. కొన్ని సార్లు వైఫల్యాలు ఎదురైనా, తాను నమ్మిన శైలిలోనే, తాను అనుకున్నట్లుగా ఆడిన సెహ్వాగ్ అలాగే కెరీర్‌ను ముగించాడు. అతడిలోని వీరత్వం చూసి చాన్నాళ్లే అయినా... ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ అందరి మదిలో నిలిచిపోయాయి. ప్రపంచ క్రికెట్లో సెహ్వాగ్‌లాంటి ఆటగాడిని ఇకపై కూడా మనం చూడలేకపోవచ్చు. దాదాపు వారం క్రితమే భారత క్రికెట్ అభిమానులు మరో దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ వార్త విన్నారు. దశాబ్ద కాలానికి పైగా భారత పేస్ బౌలింగ్ భారం మోసిన జహీర్, కొత్త మిలీనియంలో అరుదైన విజయాలు అందించిన ఘనాపాటి. జహీర్ తాను వ్యక్తిగతంగా ఒక బౌలర్ మాత్రమే కాదు... ఈ తరం పేస్ బౌలింగ్‌కు అతను ప్రతినిధి. జహీర్ మార్గదర్శనంలో తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నవారు ఎంతో మంది ఉంటే, అతడి స్ఫూర్తితో అనుసరించినవారు కోకొల్లలు. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిలో బౌలర్‌గా భారత క్రికెట్ భాగ్యరేఖలు మార్చిన జహీర్ నిష్ర్కమణ కూడా అభిమానులను నిరాశ పరిచేదే. కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్లిపోవడం సహజం. ఏడాది విరామంతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన జహీర్, సెహ్వాగ్ తప్పుకున్నారు. దాదాపు అదే సమయంలో వచ్చిన యువరాజ్ సింగ్, ఆ తర్వాత మూడేళ్లకు అరంగేట్రం చేసిన గంభీర్... ఇప్పుడు జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్నేళ్లలో తమ శక్తియుక్తులంతా ధారబోసి వీరంతా దేశం తరఫున తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. వారికి ఇంకా ఆడాలనే కోరిక, ఆశ ఉండవచ్చు. కానీ ఈతరం కుర్రాళ్లతో పోటీ పడలేక కావచ్చు లేదా వయసు ప్రభావం కావచ్చు... ఈ స్టార్లు కూడా నాటి ప్రదర్శనను చూపించలేకపోతున్నారు. ఆటను ముగించడం అంత సులభం కాదు. ఇది భావోద్వేగాలకు కూడా సంబంధించిన విషయం. అయితే మార్పు నిరంతర ప్రక్రియ కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో వీరినుంచి కూడా వీడ్కోలు మాటలు వినాల్సి రావచ్చేమో! -
ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు సెహ్వాగ్ వీడ్కోలు
-
బరిలో ధోని, సెహ్వాగ్
నేడు ‘క్రికెట్ ఫర్ హీరోస్’ మ్యాచ్ లండన్: బ్రిటన్ సైనికుల సంక్షేమార్ధం నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఫర్ హీరోస్’ చారిటీ టి20 మ్యాచ్‌కు పలువురు స్టార్ ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఓవల్ మైదానంలో నేడు (గురువారం) జరిగే ఈ మ్యాచ్‌లో హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్‌తో రెస్టాఫ్ ది వరల్డ్ ఎలెవన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్రిటన్ తరఫున యుద్ధంలో పోరాడుతూ గాయాల పాలైన సైనికుల చికి త్స, వారి కుటుంబాల సహాయం కోసం అందజేస్తారు. ఆండ్రూ స్ట్రాస్ కెప్టెన్‌గా ఉన్న హీరోస్ ఎలెవన్ జట్టులో ధోనితోపాటు సెహ్వాగ్, గి బ్స్, ఆఫ్రిది తదితరులున్నారు. గోవర్, హో ల్డింగ్ కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తారు. రె స్టాఫ్ వరల్డ్ జట్టు తరఫున బ్రెండన్ మెకల్లమ్, హేడెన్, జయవర్ధనే, గ్రేమ్ స్మిత్, వెటోరి, లారా, సౌతీ బరిలోకి దిగనున్నారు. గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న ఈ టీమ్ మేనేజర్‌గా సునీల్ గవాస్కర్ వ్యవహరిస్తుండడం విశేషం. -
సెహ్వాగ్‌లాగే శిఖర్!
గతంలో సెహ్వాగ్ భారత జట్టుకు ఎలా ఆడాడో ఇకపై ఆ పాత్రను ధావన్ పోషించగలడు. ఒక్క సెషన్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. టెస్టుల్లోనూ రిజర్వ్ డేను ప్రయత్నించవచ్చు. ఫలితం వస్తుందనుకుంటే మరో రోజు ఆటను పొడిగించాలనే ఆలోచన మంచిదే. వర్షం వల్ల మాకు ఎక్కువ సమయం లేదని తెలుసు. స్వార్థం లేకుండా వేగంగా ఆడేందుకు మా బ్యాట్స్‌మెన్ ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం. ఐదు రోజులూ మొత్తం మ్యాచ్ జరిగితే బాగుండేది. అయితే మైదానంలో ఉన్నంత సేపు కుర్రాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడారు. ఇన్ని విరామాల తర్వాత అదే జోరు కొనసాగించడం అంత సులువు కాదు. హర్భజన్, అశ్విన్‌ల ప్రదర్శన కూడా కెప్టెన్‌గా సంతృప్తినిచ్చింది. వీరిద్దరు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. నా దృష్టిలో సరైన జట్టునే ఎంపిక చేసుకున్నాం. వాతావరణం బాగుంటే మా వ్యూహాలు బాగా పని చేసేవి. -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ బాగా ఆడాల్సింది... మా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండాల్సింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లాగే మేం కూడా భారీ స్కోర్లు చేయాలనే కోరుకున్నాం. కానీ అశ్విన్ బౌలింగ్ వల్ల అది సాధ్యం కాలేదు. పిచ్ పేసర్లకు పెద్దగా అనుకూలంగా లేదు. పైగా కనీసం 140 కి.మీ.కు పైగా వేగంతో బంతులు విసిరే బౌలర్ మా జట్టులో లేకపోవడం వల్లే ఒకే పేసర్‌తో బరిలోకి దిగాం. దీనిపై చర్చ అనవసరం. వన్డేల్లో రాణించాలని పట్టుదలగా ఉన్నాం. -ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ కెప్టెన్ భజ్జీతో పోటీ లేదు... నా కెరీర్లో ఇదో అత్యుత్తమ దశ. చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాను. అయితే నేర్చుకోవడం నిరంతరం కొనసాగుతుంది. వచ్చేసారి ఇంతకంటే బాగా ఆడతానేమో. గతంతో పోలిస్తే కూకాబుర్రా బంతితో నేను మరింత మెరుగ్గా బంతులు విసరగలుగుతున్నాను. భజ్జీతో పోటీ గురించి ఆలోచించను. మ్యాచ్‌లో నేను బాగా బౌలింగ్ చేయడంపై నే దృష్టి. -అశ్విన్ (5/87) ఏకాగ్రత కోల్పోకుండా... నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. వికెట్ చాలా అనుకూలంగా అనిపించింది. మరో ఎండ్‌లో విజయ్‌లాంటి బ్యాట్స్‌మన్ ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఆడవచ్చు. వర్షం ఆగిన తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు కొన్ని బంతులు అవసరమయ్యాయి. అయితే వానపై అతిగా దృష్టి పెట్టి ఏకాగ్రత కోల్పోలేదు. -శిఖర్ ధావన్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ -
వీరూతో ఆడటం అదృష్టం
సెహ్వాగ్‌లాంటి దిగ్గజ క్రికెటర్‌తో కలిసి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్టార్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని గతంలో సచిన్తోనూ ఆడానని ఈ ఆస్ట్రేలియన్ సంబరపడ్డాడు. -
సెహ్వాగ్ డకౌట్
పుణే: ఐపీఎల్-8లో భాగంగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌటయ్యాడు. సౌతీ బౌలింగ్ లో కీపర్ శామ్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 32 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. వృద్ధిమాన్ సాహా(7) రనౌటయ్యాడు. పంజాబ్ 4 ఓవర్లలో 39/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మురళీ విజయ్(25), మ్యాక్స్ వెల్(5) క్రీజ్ లో ఉన్నారు. -
ఐదుగురు పెద్ద ఆటగాళ్లకు నో ప్లేస్
ముంబయి : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా మొదలు కానున్న వరల్డ్‌కప్-2015లో ఆడనున్న భారత క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ కు 30మంది ఎంపికయ్యారు. అంచనాలకు అనుగుణంగా యువతకే పెద్ద పీట వేశారు. గత ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లను సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఇక శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఊతప్ప, మురళీవిజయ్, పాండే, పుజారా, ఉన్ముక్ చంద్ తదితర 11 మంది బ్యాట్స్‌మెన్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు వికెట్ కీపర్లలో ధోని, సాహా, శాంసన్ వున్నారు. 10 మంది మీడియం పేసర్లలో భువనేశ్వర్, ఆరాన్, ఇశాంత్, ఉమేష్‌లు వున్నారు. నలుగురు స్పిన్నర్లలో అశ్విన్‌తో పాటు అమిత్ మిశ్ర చోటు దక్కించుకున్నాడు. ఇద్దరు ఆల్ రౌండర్లు టీమ్‌లో వున్నారు. ప్రాబబుల్స్‌కు ఎన్నికైంది వీరే: * మహేంద్ర సింగ్ ధోనీ * విరాట్ కోహ్లీ *శిఖర్ ధావన్ *అజింక్య రహానే *రోహిత్ శర్మ *రవీంద్ర జడేజా *రవిచంద్రన్ అశ్వీన్ *అంబంటి రాయుడు *సురేశ్ రైనా *రాబిన్ ఉతప్ప *మురళీ విజయ్ *పర్వేజ్ రసూల్ *అమిత్ మిశ్రా *ఇషాంత్ శర్మ *భువనేశ్వర్ కుమార్ *మహ్మద్ షమీ *ఉమేశ్ యాదవ్ *వరుణ్ ఆరోన్ *ధవళ్ కులకర్ణి *స్టువర్ట్ బిన్నీ *కుల్ దీప్ యాదవ్ *మోహిత్ శర్మ *అశోక్ దిండా *అక్షర్ పటేల్ *కేదార్ జాదవ్ *మనోజ్ తివారీ *మనీష్ పాండే *వృద్ధిమాన్ సాహా *సంజు శాంసన్ *కరణ్ శర్మ -
రాయుడికి దక్కిన చోటు, సెహ్వాగ్, యువీలకు నిరాశ
ముంబయి : ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే డిపెండింగ్ చాంపియన్ టీమిండియా ప్రాబబుల్స్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడికి ప్రాబబుల్స్‌లో చోటు దక్కింది. ఇక 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్ సింగ్‌లకు చోటు దక్కలేదు. అలాగే జహీర్ ఖాన్లకు నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచకప్ జరుగుతుంది. -
దుమ్మురేపిన సెహ్వాగ్, గంభీర్
ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చండీగఢ్: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ దేశవాళీ టోర్నీలో సత్తా చాటుకుంటున్నారు. ఈ త్రయం ప్రతిభతో సయ్యద్ ముస్తాక్ అలీ (నార్త్‌జోన్) టి20 టోర్నీలో ఢిల్లీ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌతమ్ గంభీర్ (53 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), వీరేంద్ర సెహ్వాగ్ (50 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్సర్)... బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ (4/9) చెలరేగారు. ఫలితంగా హర్యానాతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హర్యానా 20 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఇషాంత్ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ఢిల్లీ 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసింది. గంభీర్, వీరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. -
గ్రేట్‌బ్యాచ్ ఆపిల్...
జయసూర్యలు, ఆఫ్రిదిలు, సెహ్వాగ్‌లు రాక ముందే పవర్ ప్లేలో మెరుపు బ్యాటింగ్ ఏమిటో చూపించిన మార్క్ గ్రేట్‌బ్యాచ్ గుర్తున్నాడా...పించ్ హిట్టర్ పదానికి తొలి సారి గుర్తింపు తెచ్చిన ఈ న్యూజిలాండ్ క్రికెటర్ 1992 వరల్డ్ కప్‌లో చెలరేగిన తీరు ఎవరు మరచిపోగలరు. కివీస్ తరఫున 41 టెస్టులు, 84 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్ ఆ తర్వాత తనకిష్టమైన వ్యాపారంలోకి దిగిపోయాడు. ఆటగాళ్లు వ్యాపారం చేయడం కొత్త కాదు కానీ గ్రేట్‌బ్యాచ్ ఇందులోనూ తన ప్రత్యేకత చూపించాడు. అతనికి ఆపిల్ పళ్లంటే మహా ఇష్టం. ఆ ఇష్టంలోనే అతను తన బిజినెస్‌నూ చూసుకున్నాడు. అందుకే పెద్ద సంఖ్యలో ఆపిల్ తోటలు కొనేశాడు. అక్కడ స్వయంగా ఆపిల్స్ పండిస్తూ తన వ్యాపారం కొనసాగించాడు. ఫెర్న్ రిడ్జ్ అనే కంపెనీతో కలసి దీనిని విస్తరించాడు. క్రికెటర్ల ఫొటోలతో... గ్రేట్‌బ్యాచ్ కంపెనీ మొత్తం 12 రకాల ఆపిల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే వీటిలో రాయల్ గాలా ఆపిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడే గ్రేట్‌బ్యాచ్ తన క్రికెట్ తెలివి చూపించాడు. ఈ ఆపిల్స్కు ప్రచారం కల్పించేందుకు క్రికెటర్లనే వాడుకున్నాడు. ఈ బ్రాండ్ ఆపిల్స్‌పై స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి కదా. 1992 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ల ఫొటోలతోనే ఈ స్టిక్కర్లు తయారు చేయించాడు. ఆ టోర్నీ జెర్సీలోనే స్వయంగా గ్రేట్బ్యాచ్తో పాటు కెప్టెన్ మార్టిన్ క్రో, దీపక్ పటేల్, ఇయాన్ స్మిత్ తదితర ఆటగాళ్లు మనకు కనిపిస్తారు. అన్నట్లు భారత్‌లో కూడా రాయల్ గాలాకు మంచి గిరాకీ ఉంది ‘భారతీయులు క్రికెట్‌ను ప్రేమించినంతగా మా ఆపిల్స్‌ను కూడా ప్రేమిస్తారు‘ అనే క్యాప్షన్‌తో ఇక్కడికి ఎగుమతి చేస్తున్నాడు గ్రేట్‌బ్యాచ్. మీరెప్పుడైనా ఈ రకం ఆపిల్స్ తింటుంటే 1992 ప్రపంచకప్‌లో కివీస్ జోరు గుర్తుకొస్తుందేమో చూడండి. -
ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోని ఐదింటిలో సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన రెండు స్థానాల నుంచి ఎవరిని నిలబెట్టాలనేదానిపై నిర్ణయానికి రాలేకపోతోంది. న్యూఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల పేర్లను ఇది వరకే ప్రకటించింది. కాంగ్రెస్ సౌత్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను గురువారం సాయంత్రం వరకు ప్రకటించలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో పార్టీ చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో ఢీలాపడ్డ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో ఎవరి తరపున ప్రచారం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ దెబ్బతో కుదేలయిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలనుకుంటోంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలో కూడా మంత్రి కృష్ణాతీరథ్‌కు టికెట్ ఇవ్వకుండా, సౌత్ ఢిల్లీ నుంచి గానీ వెస్ట్ ఢిల్లీ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ మొదట భావించినట్టు సమాచారం. ఈ వ్యూహం ఆచరణ సాధ్యం కాదని తేలడంతో కృష్ణాతీరథ్కే టికెట్ ఇచ్చింది. సౌత్ ఢిల్లీ లేదా వెస్ట్ ఢిల్లీ నుంచి తమ పార్టీ తరపున పోటీచేయాలని కాంగ్రెస్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని అంటున్నారు. జాట్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సౌత్ ఢిల్లీలో సెహ్వాగ్‌కు టికెట్ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. ఈ సీటు నుంచి పోటీ కోసం విద్యార్థినేత రోహిత్ చౌదరి పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉందని అంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పది అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎంపీ మహాబల్ మిశ్రా తనయుడు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని పార్టీ భావించిందని సమాచారం. వెస్ట్ ఢిల్ల్లీ నుంచి పూర్వాంచలీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్టీ బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయ్, శేఖర్ సుమన్, భోజ్‌పురి నటుడు కునాల్ సింగ్ తదితర పేర్లను కూడా పరిశీలించిందని చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ పూర్వాంచలీ ఓటర్లను మెప్పించేందుకు భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చింది. తివారీకి దీటుగా మరో పూర్వాంచలీ ప్రముఖుడిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి ఢిల్లీలో పార్టీకి గడ్డుకాలమేనని, ఇక్కడ బాగా బలహీనపడినట్టు వార్తలు రావడంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రచారంలో ఏ విధంగానూ వెనుకబడకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ మార్గాన్ని కూడా ఎంచుకుంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా వివరించేందుకు సిద్ధమయింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్న ఐటీ సెంటర్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానుంది. దూకుడుగా ప్రత్యర్థి పార్టీల ప్రచారం భారతీయ జనతా పార్టీ సైతం ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం వల్ల కలిగిన ఆత్మవిశ్వాసంతో పాటు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుకూల పవనాలు ఉండడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోంది. నమో టీ పార్టీ, నమో చౌపాల్, ఏక్ నోట్ కమల్ పర్ ఓట్, మోడీ ఫర్ పీఎం, ఓట్ ఫర్ మోడీ వంటి కార్యక్రమాలతోపాటు ఇంటింటికీ ప్రచారం, చిన్న చిన్న సమావేశాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అందరికంటే ముందున్న ఆప్ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ‘ఆప్’ సర్కారు 49 రోజుల పాలనలో కరెంటు చార్జీలను సగానికి తగ్గించడం, ఉచిత నీటి సరఫరా వంటి అనేక ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంది. అయితే జన్‌లోక్‌పాల్ బిల్లుపై హఠాత్తుగా రాజీనామా చేసిన తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పేదలకు ఆప్‌పై పేదలకు ఆసక్తి పెద్దగా తగ్గనప్పటికీ మధ్యతరగతి ఓటర్లకు మాత్రం మోజు తగ్గింది. దీనిని గుర్తించిన ఆప్ ఢిల్లీ విభాగం ఇంటింటికీ ప్రచారంతో ప్రజల సందేహాలను తీర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. -
సెహ్వాగ్, గంభీర్‌లపైనే దృష్టి
షిమోగా: బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన భారత్ ‘ఎ’ జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేటి నుంచి వెస్టిండీస్ ‘ఎ’తో జరగనున్న అనధికార టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి వారిపైనే నెలకొంది. మేటి ఆటగాళ్లు ఉన్న జట్టును చతేశ్వర్ పుజారా ఎలా నడిపిస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరం. గత 30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయని వీరూ ఈ మ్యాచ్‌తోనైనా గాడిలో పడాలని భావిస్తుండగా... గంభీర్ కూడా సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో ఈ ఇద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరి భవిష్యత్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన జహీర్ కూడా సరైన ఫామ్‌లో లేడు. 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఏడు టెస్టులు ఆడిన అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఈ ముగ్గురిపై ఒత్తిడి నెలకొంది. అయితే అంతర్జాతీయ వేదికలపై విశేష అనుభవం ఉన్న ఈ ముగ్గురు ఆకట్టుకుంటే రాబోయే విండీస్ సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు కత్తిమీద సామే. మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ వేలికి గాయమైంది. అయితే వీరూ అందుబాటులో ఉండేదీ లేనిదీ మ్యాచ్‌కు ముందే తెలుస్తుందని కెప్టెన్ పుజారా చెప్పాడు. షెల్డన్ జాక్సన్, నాయర్, డోగ్రా, ఉదయ్ కౌల్, కైఫ్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే భారీ స్కోరు ఖాయం. తొలి టెస్టులో పుజారాతో పాటు బౌలింగ్‌లో ఈశ్వర్ పాండే, మహ్మద్ షమీలు విఫలం కావడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. మరోవైపు తొలి మ్యాచ్ విజయంతో విండీస్ జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్, గంభీర్, జహీర్‌లను ఎదుర్కోవడంపైనే ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ కిర్క్ ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, పుదాదిన్లతో పాటు పావెల్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. భారత పరిస్థితుల్లో విండీస్ స్సిన్నర్లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్నారు. మిల్లర్, పెరుమాల్ల నిలకడ వాళ్లకు లాభిస్తోంది.