
రాయుడికి దక్కిన చోటు, సెహ్వాగ్, యువీలకు నిరాశ
ముంబయి : ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే డిపెండింగ్ చాంపియన్ టీమిండియా ప్రాబబుల్స్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడికి ప్రాబబుల్స్లో చోటు దక్కింది. ఇక 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, యువరాజ్, హర్భజన్ సింగ్లకు చోటు దక్కలేదు. అలాగే జహీర్ ఖాన్లకు నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచకప్ జరుగుతుంది.