world cup
-
అటు అర్జెంటీనా ఇటు ఇరాన్
బ్యూనస్ ఎయిర్స్: తమ కెప్టెన్... దిగ్గజ ప్లేయర్ లయోనల్ మెస్సీ లేకపోయినా... అర్జెంటీనా జోరు తగ్గించలేదు. ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టును అలవోకగా ఓడించిన అర్జెంటీనా దర్జాగా ప్రపంచకప్ టోర్నమెంట్‌కు 19వసారి అర్హత సాధించింది. దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్ టోర్నీకి ఆరు జట్లకు నేరుగా అర్హత పొందే అవకాశం ఉంది. తొలి బెర్త్‌ను డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు సొంతం చేసుకుంది. వాస్తవానికి బ్రెజిల్ జట్టుతో మ్యాచ్‌కు ముందే అర్జెంటీనాకు వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైంది. ఉరుగ్వే జట్టుతో మ్యాచ్‌ను బొలీవియా జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకోవడంతో అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఫలితంతో సంబంధం లేకుండా వరల్డ్‌కప్ బెర్త్ దక్కడంతో... బ్రెజిల్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా అదరగొట్టింది. మెస్సీ గైర్హాజరీలో నికోలస్ ఒటామెండీ సారథ్యంలో బరిలోకి దిగిన అర్జెంటీనా 4–1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున జూలియన్ అల్వారెజ్ (4వ నిమిషంలో), ఎంజో ఫెర్నాండెజ్ (12వ నిమిషంలో), అలెక్సిస్ మాక్ అలిస్టర్ (37వ నిమిషంలో), గిలియానో సిమోన్ (71వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బ్రెజిల్ జట్టుకు మాథ్యూస్ కున్హా (26వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. దక్షిణ అమెరికా జోన్ నుంచి మొత్తం 10 జట్లు (అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వే, బ్రెజిల్, పరాగ్వే, కొలంబియా, వెనిజులా, బొలీవియా, పెరూ, చిలీ) డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అర్జెంటీనా 31 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో ఐదు బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టుకు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందే అవకాశం లభిస్తుంది. ఇరాన్ వరుసగా నాలుగోసారి... మరోవైపు ఆసియా జోన్ నుంచి ఇరాన్ జట్టు వరుసగా నాలుగోసారి ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను ఇరాన్ జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. 1978లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ ఆ తర్వాత 1998లో రెండోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడింది. 2006లో మూడోసారి ప్రపంచకప్‌లో ఆడిన ఇరాన్ 2010లో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 2014లో నాలుగోసారి వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఇరాన్ ఆ తర్వాత 2018లో, 2022లోనూ పోటీపడింది. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఓవరాల్‌గా ఏడోసారి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 2026 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్‌లో ఆడనున్నాయి. ఆసియా నుంచి 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్ టోర్నీ ద్వారా మరో జట్టుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు (అమెరికా, కెనడా, మెక్సికో) ఆతిథ్య దేశాలతోపాటు జపాన్, ఇరాన్, న్యూజిలాండ్, అర్జెంటీనా జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత పొందాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో క్వాలిఫయింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.19 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్జెంటీనా 19 సార్లు అర్హత సాధించింది. మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు (1930, 1990, 2014) ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్లో... నాలుగుసార్లు గ్రూప్ దశలో... మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్ –19 టీ–20 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్లో మిథాలిరాజ్ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి. టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్లోకి వెళతా. ఓవర్ కవర్ షాట్ నా ఫేవరెట్. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు. లక్ష్యంతో పనిచేస్తేనే.. కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని ఏఆర్కే ఫౌండర్ ఛైర్మన్ రామ్‌రెడ్డి అన్నారు. 2028లో లోకేష్ , వెన్నెల మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్ రామ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించాను. మెరుగైన కోచింగ్ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎంఎస్కే ప్రసాద్, మాజీ ఐఏఎస్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. -
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
మన ఐకాన్.. త్రిష!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్ అండర్ – 19, టీ 20 వరల్డ్ కప్ పోటీలకు జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 2022లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలోనూ ఆమె తనదైన ప్రతిభ చాటింది.ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ..ఈనెల 15న పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒత్తిడికి గురైన త్రిష ఓపెనర్‌గా దిగి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచి క్రీజులో లయను అందుకుంది. తర్వాత జరిగిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌లలో వరుసగా 58 నాటౌట్, 32 పరుగులతో రాణించింది. చివరగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విలువైన 52 పరుగులు జోడించి, భారత్ గెలుపులో కీలకంగా మారింది. దీంతో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.శిక్షణలో రాటుదేలి..సికింద్రాబాద్‌లో ఇప్పించిన ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన త్రిష 12 ఏళ్ల వయసులోనే అండర్ – 19 హైదరాబాద్ జట్టుకు ఎంపికై ంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్ –19 ఇండియా జట్టుకు ఎంపికై దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్రను సమర్థంగా పోషించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు భారత ఏ జట్టులో ఆడుతూ సీనియర్ జట్టులో చోటు కోసం శ్రమిస్తోంది.భద్రాచలం టు సికింద్రాబాద్..భద్రాచలానికి చెందిన గొంగడి రామిరెడ్డి ఫిట్నెస్ ట్రైనర్‌గా ఐటీసీలో పని చేస్తూనే పట్టణంలో సొంతంగా రామ్స్ జిమ్ నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు అన్నట్టుగా కూతురు త్రిష చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపించింది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా మలచాలని భావించిన రామిరెడ్డి ఉత్తమ శిక్షణ కోసం సికింద్రాబాద్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా త్రిషకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఐటీసీలో ఫిట్‌నెన్ ట్రైనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పట్టణంలో ఉన్న జిమ్ సెంటర్‌ను అమ్మేసి 2013లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ మొదలైంది.ఐపీఎల్ లెగ్ బ్రేక్..భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లింది మొదలు రెండేళ్ల క్రితం వరకు క్రికెట్లో త్రిష ప్రయాణం ఎదురులేకుండా సాగింది. హైదరాబాద్ అండర్ – 19 నుంచి భారత ఏ జట్టు వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అయితే క్రికెట్ వరల్డ్‌లో క్రేజీ టోర్నమెంట్‌గా పేరున్న ఉమెన్ ఐపీఎల్ త్రిషకు కలిసి రాలేదు. ఈ టోర్నీ కోసం జరిగిన వేలంలో త్రిషను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో టోర్నమెంట్ గెలుపులో తాను ఒకరిగా ఉండడం కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. కఠోర సాధన చేసింది. దాని తాలూకూ ఫలితాలు ఈ డిసెంబర్లో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో కనిపించాయి.ఎన్నికల ప్రచారకర్తగా..తెలంగాణ ఎన్నికల సంఘం గొంగడి త్రిషను ఐకాన్‌గా గుర్తించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్ ఐకాన్‌గా, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఐకాన్‌గా పని చేసింది. 2023లో తెలంగాణ ఉమెన్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించింది. ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ త్వరలోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్లో సీనియర్ జట్టుకు ఆడాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.ఇండియా జట్టుకు ఆడాలిఅండర్ –19 విభాగంలో మూడేళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నా. ఇటీవల భారత ఏ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఆడాను. ఏషియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రావడం, ఆ కప్ దేశానికి అందించడం సంతోషాన్ని ఇచ్చింది. ఇండియా మహిళల జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం.– గొంగడి త్రిష -
భారత్ ‘ఖో ఖో’ కూత పాక్‌తో షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం జవహర్లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
దేశం కోసం క్యాన్సర్‌ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్‌డే యువీ (ఫోటోలు)
-
Younus Farhan: క్లౌడ్ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం
ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్షిప్ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్‌పై నేచర్ చేసిన సిగ్నేచర్‌ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్‌మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్‌మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్ ఫర్హాన్ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? మేఘంతో నా సాన్నిహిత్యంచిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్‌తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్ ఫొటోగ్రఫీ కెరీర్‌గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. ముఖ్యంగా 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్ కప్ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్‌మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను. నార్కోటిక్స్ డే ప్రచారంగా.. నేను మొదటిసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్ షేప్‌ను కూడా ఫొటో తీశాను. వరల్డ్ నార్కోటిక్స్ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్ భగత్ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం సోషల్ మీడియాలో నా క్లౌడ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చేరాలి2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్ లేదా థియరీలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. – యూనస్ ఫర్హాన్ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ -
ఖో ఖో తొలి ప్రపంచకప్.. ఆరంభం ఆరోజే!
న్యూఢిల్లీ: మన మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ఇప్పుడు ప్రపంచకప్‌గా ప్రసిద్ధికెక్కెందుకు సిద్ధమైంది. ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ టోర్నమెంట్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు జరిగే పోటీలను ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక లోగోను ‘ది వరల్డ్ గోస్ ఖో ఖో’ ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఆవిష్కరించారు.మొత్తం 24 దేశాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఖోఖో ఆట మన మట్టిలో పుట్టింది. ఇప్పుడు ‘మ్యాట్’ మీదికి మారి మరో స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామీణ క్రీడను అంతర్జాతీయ క్రీడగా ఎదిగేందుకు కృషి చేసిన మన సమాఖ్యను అభినందించాల్సిందే.ముందుగా మన దేశంలో ఈ ఆటను అల్టిమేట్ ఖోఖో లీగ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రపంచకప్ మెగాఈవెంట్గా తీసుకొస్తున్నాం’ అని అన్నారు. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఖోఖో మన చరిత్రలో భాగమైందని, భారత ప్రభుత్వం ఇలాంటి క్రీడలకు విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తోందని, ఈ వరుసలోనే తొలి ఖోఖో ప్రపంచకప్ ఆతిథ్యమిస్తోందని చెప్పారు. ఈ విషయంలో కేకేఎఫ్ఐ పోషించిన పాత్రను ఆమె అభినందించారు. -
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం
ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్లో పదహారు పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. ‘ఖోఖో మూలాలు భారత్‌లో ఉన్నాయి. ప్రాచీన క్రీడలో ప్రపంచకప్ నిర్వహించడం ద్వారా ఘన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో 54 దేశాలు ఆడుతున్నాయి. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం. అందులో ప్రపంచకప్ తొలి అడుగు’ అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ పేర్కొన్నాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్నాన్చాంగ్ (చైనా): ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 110–99 పాయింట్లతో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా రిలే స్కోరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరుగుతుండగా... తొలుత 110 పాయింట్లు చేరిన జట్టు విజేతగా నిలుస్తుంది. టర్కీకంటే ముందు పెరూ, అజర్బైజాన్, మారిషస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది. -
మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ
దుబాయ్: యూఏఈలో త్వరలోనే జరగబోయే మహిళల టి20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించింది. కేవలం 5 యూఏఈ దిర్హామ్ (రూ. 114)లకే ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 18 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అందరు వెచి్చంచగలిగే స్థితిలో టికెట్లను అందుబాటు ధరలో ఉంచాం. ప్రారంభ టికెట్ ఐదు దిర్హామ్‌లకే కొనుగోలు చేయొచ్చు. అత్యధికంగా ప్రీమియం సీట్ల ధర 40 దిర్హామ్ (రూ. 910)లుగా ఉంది. ఒక వేదికపై ఒకే రోజు రెండు మ్యాచ్‌లుంటే ఒక టికెట్‌తోనే ఆ రెండు మ్యాచ్‌ల్ని వీక్షించవచ్చు’ అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆఫ్లైన్లోనూ టికెట్లను విక్రయించేందుకు దుబాయ్, షార్జా క్రికెట్ స్టేడియాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. భారత్ సహా 10 దేశాల జట్లు పోటీపడే ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 3 నుంచి యూఏఈలోని రెండు వేదిక (దుబాయ్, షార్జా)ల్లో జరుగుతుంది. -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్‌లో కాదు. ప్రపంచకప్‌లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్‌లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్‌గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న తనను పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
భారత్ విక్టరీ.. వాహనదారుల కోసం పోలీసుల సరికొత్త ఐడియా..
ఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో విజేత నిలిచిన భారత జట్టును ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. టీమిండియా విజయం పట్ల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదే సమయంలో టీమిండియా విజయంపై ఢిల్లీ పోలీసులు సరికొత్తగా ట్వీట్ చేశారు. టీమ్ విజయానికి ట్రాఫిక్ సిగ్నల్స్‌కు లింక్ పెడుతూ ప్రతీ ఒక్కరిని ఆలోచించే విధంగా పోస్ట్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCupLet's be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say? Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA— Delhi Police (@DelhiPolice) June 29, 2024కాగా, ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. ‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Dream Come True Number Plate!#UnStoppables#IndVsSA#WorldChampions pic.twitter.com/xMHfQjsnCc— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 29, 2024 -
T20 World Cup 2024: 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ప్రపంచకప్ టోర్నీల్లో ప్రొటీస్ ప్రస్తానం 1992 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్ గండం దాటింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది. సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్‌కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో ఆరంభ ఎడిషన్ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్‌కు చేరింది.బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ (వరల్డ్‌కప్) గెలవలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్ మార్క్రమ్ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్‌కప్ (టీ20) ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా మార్క్రమ్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్కు అండర్-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గానూ రికార్ంది. మార్క్రమ్ సెంటిమెంట్ తమకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 World Cup 2024: ‘సూపర్–8’కు దక్షిణాఫ్రికా
న్యూయార్క్: దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ టి20ల్లో ఏనాడూ గెలవలేదు. కానీ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కు విజయం సాధించే అవకాశం వచి్చంది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహ్ముదుల్లా (27 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహరాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరులిచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి ఉండగా మహ్ముదుల్లా భారీషాట్ బాదాడు. కానీ సిక్సర్‌గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా కెపె్టన్ మార్క్రమ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కని క్యాచ్ అందుకోవడంతోనే బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి సిక్స్ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయంతో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తంజిమ్ హసన్ సకిబ్ 3, టస్కిన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమై ఓడింది. తౌహిద్ హృదయ్ (34 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. కేశవ్ మహరాజ్ 3, రబడ, నోర్జే చెరో 2 వికెట్లు తీశారు. సఫారీ విలవిల బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై పరుగులు క్లిష్టంగా, వికెట్లు సులభంగా వచ్చాయి. ముందుగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హెండ్రిక్స్ (0) డకౌటయ్యాడు. డికాక్ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు మూడో ఓవర్ ముగియకముందే ముగిసింది. ఇద్దర్ని తంజిమ్ పెవిలియన్ చేర్చగా, మార్క్రమ్ (4)ను టస్కిన్ క్లీన్»ౌల్డ్ చేశాడు. స్టబ్స్ (0)ను కూడా తంజిమ్ ఖాతా తెరువనివ్వలేదు. దీంతో 4.2 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్, మిల్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించి జట్టు స్కోరు ను 100 దాటించారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఆశించినన్ని పరుగులు రాలేదు. లక్ష్యం సులువుగానే ఉంది. ఇన్నింగ్స్ మొదలయ్యాక... 8 ఓవర్లు ముగియక ముందే ఓపెనర్ తంజిద్ (9), లిటన్ దాస్ (9), షకీబుల్ హసన్ (3) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 37/3. పదో ఓవర్లో 50 పరుగులకు చేరగానే నజు్మల్ (14) కూడా వికెట్ పారేసుకున్నాడు. తౌహిద్ హృదయ్ చేసిన ఆ కాస్త పోరాటంతో జట్టు వంద పరుగులకు సమీపించింది. కానీ 94 పరుగుల స్కోరు వద్ద తౌహిద్ వికెట్ పడటంతో బంగ్లా విజయానికి దూరమైంది. టి20 ప్రపంచకప్‌లో నేడుపాకిస్తాన్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు
కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్, అర్ష్‌దీప్ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న రింకూ సింగ్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపియ్యాడు. శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ కూడా ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపియ్యారు.టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ -
ఫైనల్ లో బోల్తా పడ్డ కుర్రోళ్ళు
-
ప్రపంచ క్రికెట్‌పై కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యం
ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ జట్టు ఫార్మాట్లకతీతంగా వరుస టైటిల్స్ సాధిస్తూ ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తుంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా హవా పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్లోనూ ఈ జట్టు డామినేషనే నడుస్తుంది. తాజాగా ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ సత్తా చాటారు. ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తు చేసి ఈ విభాగంలో నాలుగోసారి జగజ్జేతగా అవతరించింది. అండర్ 19 టైటిల్‌తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో (పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్) వరల్డ్ ఛాంపియన్‌గా (వన్డే ఫార్మాట్లో) అవతరించింది. వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్-ఆస్ట్రేలియా మహిళల టీ20 ఛాంపియన్-ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్-ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
ఆహా.. ఏం ఆడార్రా మన కుర్రోళ్లు..!
-
2024 ఆటలు...ఆశలు...
ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్‌లో ఈ సారి భారత్ పతకాల సంఖ్య రెండంకెలకు చేరుతుందా...టి20 ప్రపంచకప్ టైటిల్‌తో టీమిండియా ఈ సారైనా పదిహేడేళ్ల కరువు తీరుస్తుందా...మన మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకునే స్థాయికి ఎదిగిందా...అండర్–19 స్థాయిలో ప్రపంచ కప్ డిఫెండింగ్ చాంపియన్‌గా దిగుతున్న మన కుర్రాళ్లు మళ్లీ సత్తా చాటుతారా... క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఈ ప్రశ్నలకు కొత్త ఏడాదిలో సమాధానం లభిస్తుంది... బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరోసారి మన షట్లర్ల హవా సాగుతుందా...ఫార్ములా వన్ 23 రేస్‌లలో ఎవరికి పైచేయి అవుతుంది... హాకీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి... ఫుట్‌బాల్‌లో ఆసియా ఖండంలో మన బలం పెరిగిందా...ఇవన్నీ చూడాల్సిందే. టెన్నిస్‌లో ఎప్పటిలాగే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల వేట...ప్రతీ ఏటా అలరించేందుకు వచ్చే ఐపీఎల్ ఎలాగూ ఉన్నాయి. వీటికి తోడు ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్, రెజ్లింగ్, షూటింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్‌లాంటి క్రీడల్లో పలు ఆసక్తికర టోర్నీలకు ఈ ఏడాది వేదిక కానుంది. 2024లో క్రీడాభిమానులను అలరించేందుకు సిద్ధమైన ప్రధాన ఈవెంట్ల క్యాలెండర్ మీ కోసం... భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ జనవరి 11–17: అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో 3 టి20 మ్యాచ్‌లు జనవరి 25–మార్చి 11: ఇంగ్లండ్‌తో స్వదేశంలో 5 టెస్టులు ఐపీఎల్: మార్చి 22 నుంచి మే 26 వరకు జూలై: శ్రీలంకలో భారత్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) సెప్టెంబర్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ (2 టెస్టులు, 3 టి20లు) అక్టోబర్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ (3 టెస్టులు) నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (5 టెస్టులు) పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వేదిక: వెస్టిండీస్, అమెరికా ఫుట్‌బాల్ ఆసియా కప్ (ఖతర్) జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు యూరో–2024 (జర్మనీ) జూన్ 14 నుంచి జూలై 14 వరకు కోపా అమెరికా టోర్నీ (అమెరికా) జూన్ 20 నుంచి జూలై 14 వరకు బ్యాడ్మింటన్ జనవరి 9–14: మలేసియా ఓపెన్–1000 టోర్నీ (కౌలాలంపూర్) జనవరి 16–21: ఇండియా ఓపెన్–750 టోర్నీ (న్యూఢిల్లీ) మార్చి 5–10: ఫ్రెంచ్ ఓపెన్–750 టోర్నీ (పారిస్) మార్చి 12–17: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్–1000 టోర్నీ (బర్మింగ్హమ్) ఏప్రిల్ 28–మే 5: థామస్ కప్–ఉబెర్ కప్ ఫైనల్స్ (చెంగ్డూ, చైనా) మే 28–జూన్ 2: సింగపూర్ ఓపెన్–750 టోర్నీ జూన్ 4–9: ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీ (జకార్తా) ఆగస్టు 20–25: జపాన్ ఓపెన్–750 టోర్నీ (టోక్యో) సెప్టెంబర్17–22: చైనా ఓపెన్–1000 టోర్నీ (చాంగ్జౌ) అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్–750 టోర్నీ (ఒడెన్స్) నవంబర్ 19–24: చైనా మాస్టర్స్–750 టోర్నీ (షెన్జెన్) నవంబర్ 26–డిసెంబర్ 1: సయ్యద్ మోడి ఓపెన్–300 టోర్నీ (లక్నో) డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (హాంగ్జౌ, చైనా) టెన్నిస్ జనవరి 15–28: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (మెల్బోర్న్) మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (పారిస్) జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (లండన్) ఆగస్టు 26–సెప్టెంబర్8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ (న్యూయార్క్) నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ టోర్నీ (టురిన్, ఇటలీ) ఫార్ములావన్ మార్చి 2: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మార్చి 9: సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 24: ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7: జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 21: చైనా గ్రాండ్‌ప్రి మే 5: మయామి గ్రాండ్‌ప్రి మే 19: ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి జూన్ 9: కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 23: స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 7: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి జూలై 21: హంగేరి గ్రాండ్‌ప్రి జూలై 28: బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 25: డచ్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1: ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్15: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 20: యూఎస్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబర్ 3: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నవంబర్ 23: లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1: ఖతర్ గ్రాండ్‌ప్రి హాకీ జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (వాలెన్సియా, స్పెయిన్) జనవరి 13–19: ఒలింపిక్ క్వాలిఫయింగ్ మహిళల టోర్నీ (రాంచీ, భారత్) జనవరి 15–21: ఒలింపిక్ క్వాలిఫయింగ్ పురుషుల టోర్నీ (మస్కట్, ఒమన్) షూటింగ్ జనవరి 5–18: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (జకార్తా) జనవరి 12–22: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (కువైట్ సిటీ) జనవరి 24–ఫిబ్రవరి 1: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (కైరో, ఈజిప్ట్) ఫిబ్రవరి 4–13: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (రబాట్, మొరాకో) ఏప్రిల్ 11–19: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్) ఏప్రిల్ 22–30: ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ షాట్‌గన్ టోర్నీ (దోహా, ఖతర్) మే 1–12: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బకూ, అజర్బైజాన్) మే 31–జూన్ 7: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిక్, జర్మనీ) జూన్ 10–19: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (లొనాటో, ఇటలీ) అండర్–19 పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ సెప్టెంబర్–అక్టోబర్ వేదిక: బంగ్లాదేశ్ పారిస్ ఒలింపిక్స్ – 26 జూలై – 11 ఆగస్టు అథ్లెటిక్స్ జనవరి 21: ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ (హాంకాంగ్) ఫిబ్రవరి 21–23: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (టెహ్రాన్) మార్చి 1–3: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (స్కాట్లాండ్) ఆగస్టు 26–31: ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ (పెరూ) చెస్ ఏప్రిల్ 3–25: క్యాండిడేట్స్ టోర్నమెంట్ (టొరంటో, కెనడా) జూన్ 1–14: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ, భారత్) సెప్టెంబర్10–23: చెస్ ఒలింపియాడ్ (బుడాపెస్ట్, హంగేరి) అక్టోబర్ 22–నవంబర్ 2: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (బ్రెజిల్) రెజ్లింగ్ ఏప్రిల్ 11–16: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) ఏప్రిల్ 19–21: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (బిష్కెక్, కిర్గిజ్స్తాన్) మే 9–12: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇస్తాంబుల్, తుర్కియే) బాక్సింగ్ ఫిబ్రవరి 29–మార్చి 12: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (ఇటలీ) ఏప్రిల్: ఆసియా చాంపియన్‌షిప్ మే 23–జూన్ 3: పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ (థాయ్‌లాండ్) అక్టోబర్ 20–నవంబర్ 6: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (క్రొయేషియా) టేబుల్ టెన్నిస్ ఫిబ్రవరి 16–25: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (బుసాన్, కొరియా) డిసెంబర్ 1–8: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (స్వీడన్) ఆర్చరీ ఏప్రిల్ 23–28: ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ (షాంఘై, చైనా) మే 21–26: ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ (యెచోన్, కొరియా) జూన్ 18–23: ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ (అంటాల్యా, తుర్కియే) -
‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ గెలిచి వారం రోజులు దాటినా ఆ్రస్టేలియా జట్టు తమ విజయాన్ని ఇంకా వేడుకలా జరుపుకుంటూనే ఉంది. మంగళవారం సిడ్నీ మైదానంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ మిచెల్ స్టార్క్ కలిసి వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కమిన్స్ తన ఫైనల్ మ్యాచ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా కోహ్లి వికెట్ తీయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అతను అన్నాడు. కమిన్స్ బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఆ క్షణం మైదానంలో ఆవరించిన నిశ్శబ్దం మరచిపోలేనని కమిన్స్ అన్నాడు. ‘కోహ్లి వికెట్ పడిన తర్వాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్మిత్ ఒక మాట అన్నాడు. మైదానంలో ఏదైనా శబ్దం వినిపిస్తోందా అని అడిగాడు. మేం ఒక క్షణం ఆగి గమనించాం. స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది. లక్ష మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటా’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఒకే సమయంలో భిన్న ఫార్మాట్లలో తాము ప్రపంచ చాంపియన్లుగా ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు ముందుగానే... భారత్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో పాల్గొంటున్న ఆ్రస్టేలియా జట్టులోని ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు సిరీస్ ముగియడానికి ముందే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నవారిలో ఏడుగురు టి20 సిరీస్ కోసం ఇక్కడే ఆగిపోయారు. వీరిలో హెడ్ ఒక్కడే సిరీస్ ముగిసే వరకు ఉండనున్నారు. స్మిత్, జంపా ఇప్పటికే బయల్దేరిపోగా...మరో నలుగురు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇన్‌గ్లిస్, అబాట్ మూడో మ్యాచ్ ముగియగానే వెళ్లిపోతారు. చివరి రెండు మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానాల్లో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, బెన్ డ్వార్షియస్, క్రిస్ గ్రీన్‌లను ఆ్రస్టేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు. -
సల్మాన్ ఖాన్ కు సీక్వెల్ ఫీవర్.. టైగర్ 4 ప్లాన్!
-
"పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రంచకప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ రావడం వల్లే భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీ మోదీని 'దురదృష్టం'తో పోలుస్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే "పనౌటీ మోదీ" అని అన్నారంటూ దూమారం రేగింది. అంతేగాదు ఆ బహిరంగ ర్యాలీలో మోదీని అదాని పారశ్రామికవేత్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనౌటి అనే పదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌గా అవుతోంది. ఐతే ఈ పనైటి పదానిక అర్థం.. ఏవ్యక్తి మన వద్దకు వస్తే అవ్వాల్సిన పనులు ఆగిపోవడం లేదా జరగకపోవడం వంటివి జరిగినప్పుడూ ప్రయోగిస్తారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై "పనౌటి" అనే పదాన్ని ప్రయోగించడంతో రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది బీజేపి. పైగా రాహుల్ ఆ ప్రచార ర్యాలీలో మోదీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి హిందూ-ముస్లీం అని జపిస్తుంటారు. ఆయన మిలినియర్ల రుణాలను మాఫీ చేసి మంచి ప్రయోజనాలు అందిస్తుంటారని విమర్శలు గుప్పించారు. पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs — Congress (@INCIndia) November 21, 2023 దీంతో ఒక్కసారిగా రాహుల్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ మేరకు బీజేపీ లోక్‌సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..రాహుల్‌గాంధీ ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి పదాన్ని ఎలా ప్రయోగించగలిగారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మీనాకాశి లేఖి కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ప్రధానిపై అలాంటి పదాన్ని ఉపయోగించగలిగారంటే.. రాహుల్ ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. VIDEO | "If Rahul Gandhi has used a word like 'panauti', then it reflects what kind of person he is. Using such words for PM, who is working continuously for the country, is not acceptable and the entire country is watching this," says Union MoS @M_Lekhi on Rahul Gandhi's remark… pic.twitter.com/SfI8ASwtrt — Press Trust of India (@PTI_News) November 21, 2023 ఇలాంటి పదాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. యావత్తు దేశం మిమ్మల్ని చూస్తోంది. నిరంతరం దేశం కోసం పనిచేసే ఓ వ్యక్తిపై ఇలా నిందలు వేయడం సబబు కాదని హితవు పలికారు. అలాగే లోక్‌సభ ఎంపీ రవి శకంర్ ప్రసాద్ కూడా రాహుల్ మీకు ఏమైంది? ఆ రోజు క్రీడాకారులను కలిసి వారిలో స్థైర్యాన్ని పెంచే యత్నం చేసిన అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదాన్ని ప్రయోగిస్తారా? అంటూ తిట్టిపోశారు. మీరు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని రాహుల్‌కి చురకలంటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆరోపణల స్ట్రాటజీ వర్సెస్ గ్యారంటీల గేమ్? రాష్ట్ర ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే! -
టీమిండియా ఓటమికి ఉద్యోగులకు సెలవు
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్‌లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. Boss ne sach me leave de di aaj😭 Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3 — Diksha Gupta (@thedikshagupta) November 20, 2023 -
డిప్రెషన్‌కు వాడే టాబ్లెట్ పేరేంటి?.. నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్!
ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అభిమానులను అలరించిన హీరో నవీన్ పొలిశెట్టి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ','జాతి రత్నాలు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం 'జాతి రత్నాలు' డైరెక్టర్‌తోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలో నవీన్ మాట్లాడుతూ..' అరే వంశీ.. అదేదో డిప్రెషన్ కోసం ఏదో టాబ్లెట్ ఉందన్నావ్ కదరా.. ఆ టాబ్లెట్ పేరేంట్రా?.. ఒక ఫ్రెండ్ కోసం అడుగుతున్నారా? నాకోసం నేనేందుకు అడుగుతారా?.. ఇప్పుడు నా లైఫ్‌లో జాయ్‌ఫుల్ ఫేజ్‌లో ఉన్నా.. డోలో 650 నా.. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేక పేమేంట్ సీటా? అని అన్నారు. అయితే ఈ వీడియోకు వరల్డ్ కప్ ఫైనల్-2023 అంటూ ట్యాగ్ చేశారు. అయితే మ్యాచ్‌లో ఇండియా ఓటమిని ఇంకా మర్చిపోలేక ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Inkenni rojulo 💔 Asking for a friend . Dolo 650 daily #CWC2023Final pic.twitter.com/ssd0Je5DO5 — Naveen Polishetty (@NaveenPolishety) November 21, 2023 -
భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రధాని
అహ్మదాబాద్: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఉరకలెత్తే ఉత్సాహంతో ముందంజ వేసిన భారత జట్టు ఫైనల్ పరాభవంతో షాక్‌కు గురైంది. నిశ్శబ్దం ఆవహించి... నిరాశలో కూరుకుపోయిన రోహిత్ శర్మ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ఆదివారం రాత్రి బహుమతి ప్రదానోత్సవం ముగిశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి మోదీ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ప్రతీ ఒక్క ఆటగాడిని సముదాయించారు. ఈ నిరాశ నుంచి కోలుకునేందుకు ఓదార్పు మాటలు చెప్పారు. ‘ప్రియమైన టీమిండియా... మీ ప్రతిభ, ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంకితభావంతో ప్రపంచకప్ గెలిచేందుకు టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడారు. మీ కృషి వెలకట్టలేనిది. ప్రపంచకప్‌లో మీరు కనబరిచిన క్రీడాస్ఫూర్తిని చూసి జాతి గర్విస్తోంది. యావత్ దేశం మీ వెన్నంటే ఉంది. ఇకపై కూడా ఉంటుంది’ అని ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు. దీన్ని పలువురు క్రికెట్ అభిమానులు షమీని ప్రధాని ఓదారుస్తున్న ఫోటోను జతచేసి రీ ట్వీట్లతో అనుసరించారు. ‘టోర్నీలో గొప్పగా ఆడాం. ఆఖరి పోరులోనే ఓడిపోయాం. ఈ చేదు ఫలితం అందరి గుండెల్ని బద్దలు చేసింది. ఇలాంటి సమయంలో ప్రధాని మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి కొండంత బలాన్నిచ్చేలా ఓదార్పు పలికారు. మోదీకి కృతజ్ఞతలు’ అని ఆల్‌రౌండర్ జడేజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
CWC 2023:‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్
వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్‌వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ఎయిర్‌లైన్స్‌కు కలిసొచ్చిన వరల్డ్‌కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్‌కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్‌కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్‌కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్‌లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్‌ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్‌లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
అబ్బుర పరిచిన వాయుసేన విన్యాసాలు
అహ్మదాబాద్: అనుకున్నట్లుగానే చక్కని ప్రణాళికతో, స్వల్పకాల రిహార్సల్స్‌తో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ చేసిన ఏయిర్ షో లక్షమందికి పైగా ప్రేక్షకుల్ని కన్నార్పకుండా చేసింది. తొమ్మిది హాక్ ఎంకే–132 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడా బృందం నరేంద్ర మోదీ స్టేడియంపై చరిత్ర సృష్టించింది. లక్షా 32 వేల మంది జేజేలతో విన్యాసాలను ఆస్వాదించారు. సూర్యకిరణ్ టీమ్ వైమానిక విన్యాసాలు కొత్త కాకపోయినా... ఓ క్రికెట్ స్టేడియంపై ఎయిర్‌షో చేయడమే కొత్త. గతంలో క్రికెట్ అనే కాదు... ఏ ఆటకు అంతెందుకు భారత్ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ (2010)లోనూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. తద్వారా ఈ ప్రపంచకప్‌కు ఎయిర్ షో కొత్త శోభ తెచ్చినట్లయింది. -
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్‌కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
విరాట్ కోహ్లీ మా పొరుగింటి వ్యక్తే: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే టైగర్-3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. టైగర్ సిరీస్‌లో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మెరిసింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ప్రస్తుతం అందరిదృష్టి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష) ఫైనల్ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లీ విరాట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన ఇన్‌స్టాలో 'ఆస్క్ మీ ఏ క్వశ్చన్' అనే సెషన్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ గురించి చెప్పండి? అని ప్రశ్నించారు. దీనికి కత్రినా బదులిస్తూ.. 'సూపర్ స్టార్, ఆదర్శవంతుడు, అంతే కాకుండా మా పొరుగు వ్యక్తి' అంటూ విరాట్ ఫోటోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా టైగర్ సినిమా గురించి నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కత్రినా తెలిపారు. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీని కత్రినా ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు.. ఆమె పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీని ప్రశంసించారు. కాగా.. అనుష్క శర్మ, కోహ్లి చాలా ఏళ్లుగా ముంబయిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. కత్రినా తన వివాహానంతరం భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అదే భవనంలో ఉంటోంది. (ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!) -
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
ఇండియా టీం కి ఆల్ ది బెస్ట్ చెబుతున్న హీరో వెంకటేష్
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
రివేంజ్ పక్కా అంటున్న భారత్..!
-
ఫైనల్‌కు 13 భారీ స్క్రీన్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్), స్టేడియాల్లో సదుపాయాలు, క్రీడాకారులకు పౌష్టికాహారం, విశాఖలో నూతన స్టేడియం నిర్మాణం, స్కూల్ విద్యార్థులకు లీగ్ టోర్నమెంట్స్.. ఇలా ఏసీఏ ప్రణాళికలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు. ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్స్, ఫుడ్ కోర్టులూ ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో రూ. 300 కోట్లతో కొత్త స్టేడియం విశాఖలో బీసీసీఐతో కలిసి రూ.300 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తాం. ఈ స్టేడియం సామర్థ్యం 50 వేల పైనే ఉంటుంది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల సంక్షేమం, శిక్షణపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోంది. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయి. అన్నింట్లోనూ మెషినరీ, నెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్‌లను శిక్షణ కోసం ఎన్సీఏకు పంపిస్తున్నాం. ఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే రెండు సీజన్లు విశాఖలో నిర్వహించాం. పదేళ్లుగా ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్ వచ్చింది. త్వరలో స్కూల్ లీగ్స్ ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్రా క్రికెట్లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిలో ముఖ్యమైనది పాఠశాలల స్థాయిలో లీగ్స్. 12 నుంచి 16 ఏళ్లలోపు వారికి ప్రతి నియోజకవర్గం పరిధిలో టోర్నమెంట్స్ నిర్వహిస్తాం. వీటిలో ప్రతిభ చూపిన వారిని సబ్‌సెంటర్లకు, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి.. ఇలా ఉన్నత స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంచేందుకు జోనల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్రికెటర్‌కు నెలకు రూ.3 వేలు పౌష్టికాహారం కోసం అందజేస్తున్నాం. ఇందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతోంది. దేశంలో మరే అసోసియేషన్ ఇవ్వని విధంగా రిటైర్డ్ రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలని ఏసీఏ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకస్తుందని ప్రకటించింది. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో శిక్షణ ఇచ్చే వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. సీజన్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లను పంపిస్తాం. -
ఇండియా వరల్డ్ కప్.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరల్డ్ కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వేయండి. అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం. కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్ధన్‌రెడ్డి కొడుకు విష్ణు బీఆర్ఎస్లో చేరి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇదీచదవండి.. బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్‌లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్‌ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరులో భారత్‌తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్‌తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్‌తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్‌లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్‌కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్‌కతా: ఐదుసార్లు వరల్డ్‌కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్‌కు చేరింది. ఆదివారం భారత్‌తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్‌వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్‌లోనే భారత్‌తో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్‌టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్‌కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్‌తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్‌లోనే వార్నర్ 3 సిక్స్‌లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్‌లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్‌పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్‌ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్‌లో లబుõÙన్ (18), మ్యాక్స్‌వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్‌గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్‌తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 3; బవుమా (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్‌వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్‌వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్‌వెల్ (బి) షమ్సీ 1; ఇన్‌గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్‌లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహతంగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్‌లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్‌ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్‌గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్‌కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్‌తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్‌లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్‌మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, శ్రేయాస్‌లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్‌లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్‌ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో మొదటి 4 మ్యాచ్‌ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్‌బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్‌తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
‘షమీ’ఫైనల్ వండర్
భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్‌లో ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాలుగోసారి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్‌కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, అయ్యర్ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (7/57) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఒకరితో మరొకరు పోటీ పడి... ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్‌లోనే రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. గిల్ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్ 70 పరుగులు చేసింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్ పెవిలియన్‌కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్ మెరుపు బ్యాటింగ్‌తో కివీస్ పని పట్టాడు. 29వ ఓవర్ తొలి బంతికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్‌ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 40వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో అయ్యర్ సత్తా చాటాడు. సౌతీ ఓవర్లో భారీ సిక్స్ బాదిన అయ్యర్ తర్వాతి బంతికి సింగిల్ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 110 పరుగులు సాధించింది. భయపెట్టిన భాగస్వామ్యాలు... దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్లు, బైస్, ఓవర్‌త్రోలు, ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా మిచెల్ ప్రతీ బౌలర్‌పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు వికెట్ దక్కింది. విలియమ్సన్‌ను అవుట్ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్ (0)ను వెనక్కి పంపడంతో కివీస్ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్‌లో కివీస్ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరాజయం ఖాయమైంది. 4 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్ 1983 (విజేత), 2003 (రన్నరప్), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది. 1 ఒకే ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్ (ఇంగ్లండ్; 1975లో), అషంత డి మెల్ (శ్రీలంక; 1983లో), వాస్బెర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్; 2003లో), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్; 2011లో), ముస్తఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్; 2019లో), మిచెల్ స్టార్క్ (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 51 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అవతరించాడు. రోహిత్ ఇప్పటి వరకు 51 సిక్స్‌లు కొట్టాడు. 49 సిక్స్‌లతో క్రిస్ గేల్ (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ 28 సిక్స్‌లు కొట్టాడు. క్రిస్ గేల్ (2015లో 26 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. 397 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. ‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ ఎదురుగా... సచిన్ సొంత మైదానంలో... సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన తేదీన... సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఖరి సారిగా బ్యాటింగ్ చేసిన తేదీన... ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సచిన్ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్ చూస్తే మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్ (2011, 2015, 2019) సెమీఫైనల్స్‌లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్‌లో చూడచక్కటి సిక్సర్ కొట్టాక ఫిలిప్స్ ఓవర్లో తీసిన సింగిల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది. 49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు పంపిన కింగ్... సచిన్‌ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది. 711 ఈ ప్రపంచకప్‌లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించాడు. 24 భారత్‌లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్ 20 సెంచరీలు (భారత్‌లో), పాంటింగ్ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా. –విరాట్ కోహ్లి విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్‌తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం. -షమీ ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్‌లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాప్–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 47; గిల్ (నాటౌట్) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 105; రాహుల్ (నాటౌట్) 39; సూర్యకుమార్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్: బౌల్ట్ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్‌ట్నర్ 10–1–51–0, ఫెర్గూసన్ 8–0–65–0, రచిన్ 7–0–60–0, ఫిలిప్స్ 5–0–33–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రాహుల్ (బి) షమీ 13; రచిన్ (సి) రాహుల్ (బి) షమీ 13; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 69; మిచెల్ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్మన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 2; సాన్‌ట్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 9; సౌతీ (సి) రాహుల్ (బి) షమీ 9; బౌల్ట్ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) రాహుల్ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్: బుమ్రా 10–1–64–1, సిరాజ్ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్ 10–0–56–1. -
ప్రపంచకప్‌లో నేడు రెండో సెమీఫైనల్.. ఆసీస్‌తో సౌతాఫ్రికా 'ఢీ'
కోల్‌కతా: ఫైనల్‌ను తలపించే సెమీఫైనల్ పోరుకు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సిద్ధమయ్యాయి. రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ రెండో సెమీఫైనల్ కడదాకా ఆసక్తికరంగా జరగడం ఖాయం. తరాలు మారినా హేమాహేమీలతో సరితూగిన సఫారీ జట్టు ప్రపంచకప్‌లో మాత్రం చోకర్స్గానే మిగిలింది. గతంలో దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్లో నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీఫైనల్లోకి ప్రవేశించి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఐదో ప్రయత్నంలోనైనా తొలిసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగుతోంది. జట్టు కూడా జోరుమీదుంది. ఓపెనింగ్, మిడిలార్డర్ అందరూ భారీ స్కోర్లలో భాగమవుతున్నారు. పైగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థులపై ఐదుసార్లు 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసిన జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే! ఒక్క భారత్ తప్ప సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలపై తమ భారీస్కోర్ల తడాఖా చూపింది. డికాక్, డసెన్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్ అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో రబడ కంటే కొయెట్జీ ప్రమాదకరంగా మారాడు. ఎన్గిడి, కేశవ్ మహరాజ్‌లతో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. మరోవైపు ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను ఆరంభించిన తీరు, తర్వాత మారిన విధానం, దూసుకొచ్చి న వైనం ఈ ఈవెంట్లో ఏ జట్టుకు సాధ్యం కాదేమో! ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆసీస్ టోర్నీ సాగేకొద్దీ దుర్బేధ్యంగా మారింది. వార్నర్, మార్‡్ష, లబుషేన్, స్మిత్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అఫ్గానిస్తాన్‌తో వీరోచిత డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్ గాయంతో తదుపరి బంగ్లాదేశ్‌లో ఆడలేకపోయాడు. అయితే కీలకమైన ఈ సెమీస్‌లో అతను బరిలోకి దిగుతాడని, ఫిట్నెస్తో ఉన్నాడని కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. గురువారం మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే శుక్రవారం కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఫలితం రాకపోతే టోర్నీ లీగ్దశలో మెరుగైన స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
CWC 2023: నేడు భారత్‌తో న్యూజిలాండ్ సెమీస్ సమయం
9 మంది ప్రత్యర్థులు... 9 విజయాలు... అదిరిపోయే బ్యాటింగ్ బలగం... పేసర్ల అద్భుత ప్రదర్శన... స్పిన్నర్ల జోరు... ఫీల్డింగ్ మెరుపులు... వెరసి ఇప్పటివరకు టీమిండియా అజేయ యాత్ర సాగిపోయింది. ఏమాత్రం పోటీ, ఎదురన్నదే లేకుండా దూసుకుపోయి ప్రపంచకప్ లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ జట్టు అసలైన సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో చూపించిన జోరును మరో రెండు మ్యాచ్‌లలో కొనసాగిస్తే చాలు... భారత్ మూడోసారి వరల్డ్ కప్ సగర్వంగా గెలిచి కోట్లాది అభిమానుల కోరిక నెరవేరడం ఖాయం. అయితే ఇప్పుడు గత 9 మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. తీవ్ర ఒత్తిడి, ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించినా కోలుకునే అవకాశం ఉండని నాకౌట్ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో సత్తా చాటాల్సిందే. ఎదురుగా ఉన్నది అణువణువూ పోరాటతత్వం నింపుకున్న న్యూజిలాండ్ జట్టు. ప్రత్యర్థి ఎవరైనా ఆఖరి బంతి వరకు పట్టు వీడని కివీస్‌తో పోరు అంత సులువు కాదు. నాలుగేళ్ల క్రితం సెమీఫైనల్లోనే కివీస్ కొట్టిన దెబ్బను సగటు భారత క్రికెట్ అభిమాని మరచిపోలేదు... ప్రత్యరి్థతో పోలిస్తే మన జట్టుదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తున్నా కీలక సమయంలో పట్టుదలగా నిలవడమే ప్రధానం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వరుసగా గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కే పరిమితమైన భారత్ ఈసారి ఈ అడ్డంకి దాటి ఫైనల్ చేరుతుందా లేక గత రెండు టోరీ్నల్లో ఫైనల్లోనే ఓడిన న్యూజిలాండ్ మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన 9 మ్యాచ్‌లలో కాస్త ఇబ్బంది పడిన, తడబాటుకు గురైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్‌తోనే. 274 పరుగుల లక్ష్యఛేదనలో చివరికి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి టీమిండియా గట్టెక్కింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌తోనే రోహిత్ బృందం సెమీఫైనల్లో అమీతుమీకి సై అంటోంది. వాంఖెడే మైదానంలో నేడు జరిగే తొలి సెమీస్ పోరులో కివీస్‌తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ఆరంభంలో అద్భుతంగా ఆడి ఆ తర్వాత వెనుకబడినా చివర్లో రాణించి టాప్–4లో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్ మరోసారి సెమీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా నాకౌట్ మ్యాచ్ కావడంతో అంచనాలకు భిన్నంగానూ సాగే అవకాశం ఉంది. మార్పుల్లేకుండా... వరల్డ్‌కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత ధర్మశాలలో న్యూజిలాండ్ జరిగిన ఐదో మ్యాచ్ కోసం టీమిండియా స్వల్ప మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచి ఎలాంటి మార్పు లేకుండా అదే తుది జట్టును కొనసాగిస్తోంది. జట్టు ఫామ్‌ను బట్టి చూస్తే ఇప్పుడూ అదే కొనసాగించడం ఖాయం. టీమ్ మొత్తం తమదైన రీతిలో సత్తా చాటి జట్టును నడిపిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విషయంలోనూ లోపాలు లేకుండా జట్టు గొప్పగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి టోర్నీలో టాప్ స్కోరర్‌గా (594 పరుగులు) కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 503, శ్రేయస్ 421 పరుగులతో జట్టు బ్యాటింగ్‌ను నడిపిస్తున్నారు. గిల్, రాహుల్‌లకు కూడా విజయాల్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, జడేజాల బ్యాటింగ్ భారత్‌కు అదనపు బలంగా మారింది. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు దాదాపు అసాధ్యంగా మారగా... కుల్దీప్, జడేజా స్పిన్‌ను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో భారత్‌ను నిలువరించాలంటే ఏ జట్టయినా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో... న్యూజిలాండ్ కూడా అంచనాలకు మించి రాణించి భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర వరుసగా జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. రచిన్ 565 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మిడిలార్డర్ బ్యాటర్ డరైల్ మిచెల్ కూడా 418 పరుగులు సాధించాడు. 359 పరుగులు చేసిన కాన్వే దూకుడుగా ఆడటంలో మేటి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించగలడు. టామ్ లాథమ్ కూడా చక్కటి బ్యాటర్ కాగా... మెరుపు బ్యాటింగ్ చేయగల ఫిలిప్స్, చాప్మన్ ఆ జట్టు మిడిలార్డర్లో ఉండటం అదనపు బలం. స్పిన్నర్ సాన్‌ట్నర్‌పై భారత్‌పై మంచి రికార్డు ఉండగా... కివీస్ కూడా తమ పేస్ బలాన్ని నమ్ముకుంటోంది. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఫెర్గూసన్ కూడా ఫామ్‌లో ఉండగా సౌతీ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. 4 నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగుసార్లు (2011, 2015, 2019, 2023) వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడారు. 8 వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిది ఎనిమిదో సెమీఫైనల్ కానుంది. మూడుసార్లు (1983లో ఇంగ్లండ్‌పై; 2003లో కెన్యాపై; 2011లో పాకిస్తాన్‌పై) సెమీఫైనల్స్‌లో నెగ్గిన భారత్.... నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో; 1996లో శ్రీలంక చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2019లో న్యూజిలాండ్ చేతిలో) సెమీఫైనల్లో ఓటమి పాలైంది. 11 మూడు వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. 2011 పాక్‌తో సెమీస్‌లో 9 పరుగులు... 2015 ఆ్రస్టేలియాతో సెమీస్‌లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్‌తో సెమీస్‌లో 1 పరుగు చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్‌లో ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే కోహ్లి అవుట్ కావడం గమనార్హం. 9 వన్డే ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టుకిది తొమ్మిదో సెమీఫైనల్ కానుంది. రెండుసార్లు (2015లో దక్షిణాఫ్రికాపై, 2019లో భారత్‌పై) నెగ్గిన న్యూజిలాండ్... ఆరుసార్లు (1975లో వెస్టిండీస్ చేతిలో; 1979లో ఇంగ్లండ్ చేతిలో; 1992లో పాకిస్తాన్ చేతిలో; 1999లో పాకిస్తాన్ చేతిలో; 2007లో శ్రీలంక చేతిలో; 2011లో శ్రీలంక చేతిలో) పరాజయం పాలైంది. 117 భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్... 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 7 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 5 వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. 3 మ్యాచ్‌ల్లో (1987లో జింబాబ్వేపై, 2011లో శ్రీలంకపై, 2023లో శ్రీలంకపై) నెగ్గి, 2 మ్యాచ్‌ల్లో (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో ఆ్రస్టేలియా చేతిలో) ఓటమి పాలైంది. 9 వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 9 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్... 5 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించాయి. 1 వాంఖెడె స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో (2017లో) న్యూజిలాండ్ గెలిచింది. 21 వాంఖెడే స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పిచ్, వాతావరణం ఈ వరల్డ్ కప్‌లో వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలిస్తోంది. సెమీస్ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్మన్, సాన్‌ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్. -
CWC: న్యూజిలాండ్‌తో సెమీస్.. భారత అభిమాని గుండె పగిలిన క్షణం..!
2019 జూన్ 9–10... మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం... భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో తర్వాతి రోజు ఆట కొనసాగగా, చివరకు 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులతో న్యూజిలాండ్ ముగించింది. ఎలా చూసినా ఇది టీమిండియా ఛేదించదగ్గ స్కోరే. అయితే 5 పరుగులకే రోహిత్, కోహ్లి, రాహుల్ వెనుదిరగడంతో పేలవ ఆరంభం లభించగా... ఒకదశలో జట్టు 92/6తో ఓటమికి చేరువైంది. జడేజా 59 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఎదురుదాడి చేయడంతో గెలుపుపై ఆశలు రేగాయి. అయితే కివీస్ తమ బౌలింగ్‌తో మళ్లీ మ్యాచ్‌ను అదుపులోకి తెచ్చుకుంది. 14 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా వెనుదిరగ్గా... మరో మూడు బంతుల తర్వాత ధోని రనౌట్ భారత అభిమానుల గుండె పగిలేలా చేసింది. అయితే ఏ దశలోనూ దూకుడు చూపించని, అభిమానులు కూడా నివ్వెరపోయేలా సాగిన ధోని ఇన్నింగ్సే (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) ఓటమికి కారణాల్లో ఒకటనేది వాస్తవం! ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. ప్రపంచకప్‌లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్థిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరం. –మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోvలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్‌లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్ కప్‌లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. – కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్ -
పరుగుల ధమాకాకు భారత్ సిద్ధం
ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన...ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతూ విజయాల్లో తమ భాగస్వామ్యం...ఎదురు లేని ఆటతో దూసుకుపోతున్న భారత జట్టు ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించేందుకు సిద్ధమైంది. ఎనిమిది వరుస విజయాల తర్వాత చివరి పోరులోనూ నెగ్గి స్కోరును 9/9కు చేర్చాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పెద్ద పెద్ద జట్లే రోహిత్ సేన ముందు నిలవలేకపోగా...బలహీనమైన నెదర్లాండ్స్ ఇప్పుడు ఎదురుగా ఉంది. బెంగళూరు: వరల్డ్ కప్‌లో ఎప్పుడో సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్న టీమిండియా వరుసగా తొమ్మిదో విజయాన్ని ఆశిస్తోంది. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గింది. ఇప్పుడు మరో మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. ఈ ప్రపంచకప్‌లోనే ఆఖరి లీగ్ మ్యాచ్ (45వ)లో నేడు నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. బలాబలాలు, అంచనాల ప్రకారం టీమిండియా డచ్కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఈ వరల్డ్ కప్‌లో కూడా భారీ స్కోర్లే నమోదు కాగా, మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. ప్రసిద్‌కు అవకాశం... భారత జట్టు జైత్రయాత్ర చూస్తే తుది జట్టులో నిజానికి ఎలాంటి మార్పులు అవసరం లేదు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ పోరు గురించే ప్రస్తుతం భారత జట్టు ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుత ప్రత్యర్థిని బట్టి చూస్తే ఒకటి రెండు మార్పులతో బరిలోకి దిగవచ్చు. పేసర్లలో ఒకరిని పక్కన పెట్టిన కొత్తగా జట్టులోకి చేరిన ప్రసిధ్ కృష్ణకు అవకాశం కల్పించవచ్చు. కర్నాటకకే చెందిన ప్రసిధ్ బరిలోకి దిగితే అతనికి ఇదే తొలి వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుంది. చెన్నైలో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత మిగిలిన 7 మ్యాచ్‌లలో స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఇక్కడ కుల్దీప్ స్థానంలో అతడిని ఆడించేందుకు అవకాశం ఉంది. మరో వైపు ఐపీఎల్లో విరాట్ కోహ్లి సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో అతని ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలో 49వ సెంచరీతో సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లి ఇక్కడ 50వ శతకం బాదుతాడా అనేది ఆసక్తికరం. పోటీనిచ్చేనా... అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా ఓవరాల్‌గా నెదర్లాండ్స్ ఆటతీరు సాధారణంగా ఉంది. పటిష్టమైన భారత్‌కు ఈ టీమ్ ఏమాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి. ఓపెనర్లు డౌడ్, బరెసి శుభారంభంతో పాటు కెప్టెన్ ఎడ్వర్డ్స్, అకెర్మన్, డి లీడ్ బ్యాటింగ్‌లో... మీకెరెన్, వాన్ బీక్ బౌలింగ్‌లో అంచనాలకు తగినట్లుగా రాణిస్తే కొంత పోరాడవచ్చు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి ఆపై న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజ నిడమనూరు తొలిసారి స్వదేశంలో భారత జట్టుపై ఆడనున్నాడు. ఈ క్షణం కోసం తాను ఉద్వేగభరితంగా ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ x న్యూజిలాండ్ నవంబర్ 15 (ముంబై) ఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికా నవంబర్ 16 (కోల్‌కతా) -
మిచెల్ మార్ష్ వీరవిహారం
పుణే: ఐదు సార్లు విజేత ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో లీగ్ దశను ఘనంగా ముగించింది. ఆరంభంలో తడబడి రెండు మ్యాచ్‌లు ఓడినా...ఆ తర్వాత ప్రతీ మ్యాచ్‌కు తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైన తర్వాతా అదే దూకుడును కనబర్చి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్ హ్రిదయ్ (79 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజు్మల్ హొస్సేన్ (57 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించగా...తన్జిద్ (36), లిటన్ దాస్ (36), మహ్ముదుల్లా (32), మెహదీ హసన్ మిరాజ్ (29) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 22.3 ఓవర్లలోనే అభేద్యంగా 175 పరుగులు జోడించారు. డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జిద్ (సి) అండ్ (బి) అబాట్ 36; లిటన్ (సి) లబుషేన్ (బి) జంపా 36; నజు్మల్ రనౌట్ 45; తౌహిద్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 74; మహ్ముదుల్లా రనౌట్ 32; ముషి్ఫకర్ (సి) కమిన్స్ (బి) జంపా 21; మెహిదీ హసన్ మిరాజ్ (సి) కమిన్స్ (బి) అబాట్ 29; నజుమ్ రనౌట్ 7; మెహదీ హసన్ నాటౌట్ 2; తస్కిన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–76, 2–106, 3–170, 4–214, 5–251, 6–286, 7–303, 8–304. బౌలింగ్: హాజల్‌వుడ్ 7–1–21–0, కమిన్స్ 8–0–56–0, అబాట్ 10–0–61–2, మార్ష్ 4–0–48–0, జంపా 10–0–32–2, హెడ్ 6–0–33–0, స్టొయినిస్ 5–0–45–1. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) తస్కిన్ 10; వార్నర్ (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 53; మార్ష్ నాటౌట్ 177; స్మిత్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (44.4 ఓవర్లలో 2 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–12, 2–132. బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 10–0–61–1, మెహిదీ హసన్ 9–0–38–0, నజుమ్ అహ్మద్ 10–0–85–0, మెహిదీహసన్ మిరాజ్ 6–0–47–0, ముస్తఫిజుర్ 9.4–1–76–1. -
ఘన విజయంతో ఇంగ్లండ్ ఇంటికి
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ వరల్డ్ కప్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ టోర్నీలో చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైంది. వరుస ఓటముులతో ఎప్పుడో సెమీస్ అవకాశాలు కోల్పోయిన ఆ జట్టు చివరకు విజయంతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి లీగ్‌లో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 84; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు), బెయిర్ స్టో (61 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే పాకిస్తాన్ సెమీస్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ‘నామ్‌కే వాస్తే’ తరహాలో లక్ష్యాన్ని లెక్క కట్టి చూస్తే... సెమీస్‌కు అర్హత సాధించాలంటే 6.4 ఓవర్లలో 338 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కావడంతో పాక్ ఊరట విజయంపై దృష్టి పెట్టింది. కానీ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 43.3 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆగా సల్మాన్ (45 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (45 బంతుల్లో 38; 6 ఫోర్లు), రిజ్వాన్ (51 బంతుల్లో 36; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రవూఫ్ (23 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరిపించాడు. వన్డే కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన డేవిడ్ విల్లీ 3 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్ 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: మలాన్ (సి) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 31; బెయిర్‌స్టో (సి) సల్మాన్ (బి) రవూఫ్ 59; రూట్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 60; స్టోక్స్ (బి) షాహిన్ 84; బట్లర్ రనౌట్ 27; బ్రూక్ (సి) షాహిన్ (బి) రవూఫ్ 30; అలీ (బి) రవూఫ్ 8; వోక్స్ నాటౌట్ 4; విల్లీ (సి) ఇఫ్తికార్ (బి) వసీమ్ 15; అట్కిన్సన్ (బి) వసీమ్ 0; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–82, 2–108, 3–240, 4–257, 5–302, 6–308, 7–317, 8–336, 9–336. బౌలింగ్: షాహిన్ 10–1–72–2, రవూఫ్ 10–0–64–3, ఇఫ్తికార్ 7–0–38–1, వసీమ్ 10–0–74–2, షాదాబ్ 10–0–57–0, సల్మాన్ 3–0–25–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) విల్లీ 0; ఫఖర్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 1; బాబర్ (సి) రషీద్ (బి) అట్కిన్సన్ 38; రిజ్వాన్ (బి) అలీ 36; షకీల్ (బి) రషీద్ 29; సల్మాన్ (సి) స్టోక్స్ (బి) విల్లీ 51; ఇఫ్తికార్ (సి) మలాన్ (బి) అలీ 3; షాదాబ్ (బి) రషీద్ 4; షాహిన్ (ఎల్బీ) (బి) అట్కిన్సన్ 25; వసీమ్ నాటౌట్ 16; రవూఫ్ (సి) స్టోక్స్ (బి) వోక్స్ 35; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–61, 4–100, 5–126, 6–145, 7–150, 8–186, 9–191, 10–244. బౌలింగ్: విల్లీ 10–0–56–3, వోక్స్ 5.3–0–27–1, రషీద్ 10–0–55–2, అట్కిన్సన్ 8–0–45–2, అలీ 10–0–60–2. -
దర్జాగా దక్షిణాఫ్రికా గెలుపు
అహ్మదాబాద్: ఈ వన్డే వరల్డ్‌కప్‌లో అందరినీ ఆకట్టుకున్న అఫ్గానిస్తాన్ పోరాటం చివరకు పరాజయంతో ముగిసింది. ఇది వరకే సెమీఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఈనెల 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియాతో జరిగే రెండో సెమీఫైనల్ పోరులో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనుంది. నిర్ణీత తొమ్మిది లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న దక్షిణాఫ్రికా ఏడో విజయంతో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అసాధ్యమైన సమీకరణంతో సెమీఫైనల్ ఆశలు వదులుకున్న అఫ్గానిస్తాన్ ఈ మెగా ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తోపాటు మాజీ విశ్వవిజేతలు పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించామన్న సంతృప్తితో స్వదేశానికి వెళ్లనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (107 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4, ఎన్గిడి, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్‌డర్ డసెన్ (95 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి గెలిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ చెరో 2 వికెట్లు తీశారు. ఒమర్జాయ్ ఒంటరిగా... ఓపెనర్లు ఇబ్రహీమ్ జద్రాన్ (15), రహ్మానుల్లా గుర్బాజ్ (22 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా రాణించలేదు. కెప్టెన్ హష్మతుల్లా (2) కూడా నిరాశపరచడంతో 45 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్‌ను మిడిలార్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవతలివైపు రహ్మత్ షా (46 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఇక్రామ్ (12), రషీద్ ఖాన్ (14), నూర్ అహ్మద్ (32 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఇలా ఏ ఒక్కరు బాధ్యతగా క్రీజులో నిలువలేకపోయినా... అజ్మతుల్లా మాత్రం కడదాకా నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. శతకానికి 3 పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. అతని పోరాటం వల్లే అఫ్గాన్ ఆ మాత్రం స్కోరు చేసింది. ఆదుకున్న డసెన్ సునాయాస లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు డికాక్ (47 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ బవుమా (28 బంతుల్లో 23; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. అయితే మార్క్రమ్ (32 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), క్లాసెన్ (10) లాంటి కీలక బ్యాటర్లు విఫలమవడంతో 139 పరుగులకే 4 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన డసెన్... మిల్లర్ (33 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి పరిస్థితి చక్కదిద్దాడు. తర్వాత ఫెలుక్వాయో (37 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా సంచలనానికి తావివ్వకుండా గెలిచింది. అబేధ్యమైన ఆరో వికెట్‌కు డసెన్, ఫెలుక్వాయో 65 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) క్లాసెన్ (బి) కేశవ్ 25; జద్రాన్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 15; రహ్మత్ షా (సి) మిల్లర్ (బి) ఎన్గిడి 26; హష్మతుల్లా (సి) డికాక్ (బి) కేశవ్ 2; అజ్మతుల్లా ఒమర్జాయ్ (నాటౌట్) 97; ఇక్రామ్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 12; నబీ (సి) డికాక్ (బి) ఎన్గిడి 2; రషీద్ ఖాన్ (సి) డికాక్ (బి) ఫెలుక్వాయో 14; నూర్ అహ్మద్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 26; ముజీబ్ (సి) మార్క్రమ్ (బి) కొయెట్జీ 8; నవీనుల్ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–45, 4–94, 5–112, 6–116, 7–160, 8–204, 9–226, 10–244. బౌలింగ్: రబడ 10–0–40–0, ఎన్గిడి 8.3–0–69–2, మార్క్రమ్ 4.3–0–25–0, కొయెట్జీ 10–1–44–4, కేశవ్ మహరాజ్ 10–1–25–2, ఫెలుక్వాయో 7–0–36–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 41; బవుమా (సి) గుర్బాజ్ (బి) ముజీబ్ 23; డసెన్ (నాటౌట్) 76; మార్క్రమ్ (సి) నవీనుల్ (బి) రషీద్ 25; క్లాసెన్ (బి) రషీద్ ఖాన్ 10; మిల్లర్ (సి అండ్ బి) నబీ 24; ఫెలుక్వాయో (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (47.3 ఓవర్లలో 5 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–116, 4–139, 5–182. బౌలింగ్: ముజీబ్ 10–0–51–1, నవీనుల్ 6.3–0–52–0, నబీ 10–1–35–2, ఒమర్జాయ్ 1–0–8–0, రషీద్ ఖాన్ 10–1–37–2, నూర్ అహ్మద్ 9–0–49–0, రహ్మత్ షా 1–0–12–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X బంగ్లాదేశ్ వేదిక: పుణే ఉదయం గం. 10:30 నుంచి ఇంగ్లండ్ X పాకిస్తాన్ వేదిక: కోల్‌కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి...
సాక్షి, బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన వాడని తెలిసిందే. రచిన్ కన్నడిగుడు. ఇప్పటికీ అతని మూలాలు బెంగళూరుతో ముడిపడే ఉన్నాయి. అందుకే శ్రీలంకతో మ్యాచ్ ముగియగానే రచిన్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మనవడు పుట్టింది విదేశంలో అయినా స్వదేశీ అలవాట్లు, సంప్రదాయాలు బాగా తెలిసిన పెద్దావిడ (అమ్మమ్మ) తన ఇంటికి రాగానే రచిన్‌ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కివీస్‌లో స్థిరపడిన రచిన్ తల్లిదండ్రులు దీప, రవి కృష్ణమూర్తి బెంగళూరు వాసులు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన రవి వృత్తిరీత్యా 1990లో కివీస్‌కు వలస వెళ్లగా... 1999లో వెల్లింగ్టన్లో రచిన్ జన్మించాడు. రవి కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఇష్టం. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లంటే అభిమానం. అందువల్లే తన కుమారుడికి వారిద్దరి పేర్లు కలిపి పెట్టారు. తనకిష్టమైన క్రికెట్లో బ్యాటర్‌ను చేశాడు. రచిన్‌కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దుబాయ్: రచిన్ రవీంద్ర ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రచిన్ అత్యధిక పరుగులు (565) చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లాడిన ఈ కివీస్ ఓపెనర్ 3 శతకాలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ సెమీస్ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతనికి ఐసీసీ అవార్డుకు ఎంపిక చేసింది. రేసులో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ (591), భారత సీమర్ బుమ్రా (15 వికెట్లు) ఉన్నప్పటికీ అవార్డు మాత్రం రచిన్‌నే వరించింది. 2021 జనవరి నుంచి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు ఇస్తోంది. రచిన్కంటే ముందు న్యూజిలాండ్ నుంచి డెవాన్ కాన్వే (2021–జూన్), ఎజాజ్ పటేల్ (2021–డిసెంబర్) ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు గెల్చుకున్నారు. -
కివీస్‌కు సెమీస్ పిలుపు!
గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ కీలక సమరంలో తమ సత్తా చాటింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాల తర్వాత నాలుగు పరాజయాలతో తమ పరిస్థితిని క్లిష్టంగా మార్చుకున్న కివీస్ ఆఖరి ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చి దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు మరే జట్టుపై ఆధారపడకుండా తమ సెమీస్ అవకాశాలను తానే సృష్టించుకుంది. కివీస్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు చేజారాయి. సాంకేతికంగా, అంకెల ప్రకారం పాక్ పూర్తిగా, అధికారికంగా నిష్క్రమించకపోయినా... అసాధ్యమైన, ఊహకు కూడా అందని తరహాలో ఆ జట్టు తర్వాతి మ్యాచ్‌లో గెలవాల్సిన నేపథ్యంలో వాస్తవికంగా చూస్తే పాక్ ఆట ముగిసినట్లే! బెంగళూరు: పదునైన బౌలింగ్, ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ లీగ్ దశను ఘనంగా ముగించింది. సెమీస్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన ఆ జట్టు తమ లక్ష్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. 10 ఓవర్లలోపే 70/5 స్కోరుతో కుప్పకూలేందుకు సిద్ధమైన లంక... చివర్లో మహీశ్ తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/37)తో పాటు ఇతర కివీస్ బౌలర్లూ సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. కాన్వే (42 బంతుల్లో 45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 86 పరుగులు జోడించి విజయానికి పునాది వేయగా, మిచెల్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేర డం దాదాపుగా ఖాయం కాగా... కివీస్ ఓటమిపై ఆశలు పెట్టుకున్న పాక్, అఫ్గానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) లాథమ్ (బి) సౌతీ 2; పెరీరా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 51; మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) (బి) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 19; కరుణరత్నే (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మదుషంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–3, 2–30, 3–32, 4–70, 5–70, 6–104, 7–105, 8–113, 9–128, 10–171. బౌలింగ్: బౌల్ట్ 10–3–37–3, సౌతీ 8–0–52–1, ఫెర్గూసన్ 10–2–35–2, సాన్‌ట్నర్ 10–2–22–2, రచిన్ 7.4–0–21–2, ఫిలిప్స్ 1–0–3–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–86, 2–88, 3–130, 4–145, 5–162. బౌలింగ్: మదుషంక 6.2–0–58–0, తీక్షణ 7–0–43–1, ధనంజయ 2–0–22–0, చమీర 4–1–20–1, మాథ్యూస్ 4–0–29–2. ప్రపంచకప్‌లో నేడు దక్షిణాఫ్రికా x అఫ్గానిస్తాన్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బెన్ స్టోక్స్ సెంచరీ
పుణే: వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడి సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి, అనంతరం బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఇంగ్లండ్... ఆపై వరుసగా అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియా జట్ల చేతిలో చిత్తయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... డేవిడ్ మలాన్ (74 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో 133/1తో మెరుగైన స్థితిలో కనిపించిన ఇంగ్లండ్... తర్వాతి 15 ఓవర్లలో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 192/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్, వోక్స్ ఏడో వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. తేజ నిడమనూరు (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్లీ బరేసి (37), సైబ్రాండ్ (33) ఫర్వాలేదనిపించారు. తాజా విజయంతో ఏడో స్థానానికి చేరిన ఇంగ్లండ్ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ప్రస్తుతానికి సజీవంగా ఉంచుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) మీకెరెన్ (బి) దత్ 15; మలాన్ (రనౌట్) 87; రూట్ (బి) వాన్ బీక్ 28; స్టోక్స్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బీక్ 108; బ్రూక్ (సి) అకెర్మన్ (బి) డి లీడ్ 11; బట్లర్ (సి) తేజ (బి) మీకెరెన్ 5; అలీ (సి) డి లీడ్ (బి) దత్ 4; వోక్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 51; విల్లీ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 6; అట్కిన్సన్ (నాటౌట్) 2; రషీద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–48, 2–133, 3–139, 4–164, 5–178, 6–192, 7–321, 8–327, 9–334. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–67–2, వాన్ బీక్ 10–0–88–2, మీకెరెన్ 10–0–57–1, డి లీడ్ 10–0–74–3, వాన్‌డర్ మెర్వ్ 3–0–22–0, అకెర్మన్ 7–0–31–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ బరేసి (రనౌట్) 37; మ్యాక్స్ ఒ డౌడ్ (సి) అలీ (బి) వోక్స్ 5; అకెర్మన్ (సి) బట్లర్ (బి) విల్లీ 0; సైబ్రాండ్ (సి) వోక్స్ (బి) విల్లీ 33; ఎడ్వర్డ్స్ (సి) మలాన్ (బి) అలీ 38; డి లీడ్ (బి) రషీద్ 10; తేజ నిడమనూరు (నాటౌట్) 41; వాన్ బీక్ (సి) మలాన్ (బి) రషీద్ 2; వాన్‌డర్ మెర్వ్ (సి) రషీద్ (బి) అలీ 0; దత్ (బి) రషీద్ 1; మీకెరెన్ (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–12, 2–13, 3–68, 4–90, 5–104, 6–163, 7–166, 8–167, 9–174, 10–179. బౌలింగ్: వోక్స్ 7–0–19–1, విల్లీ 7–2–19–2, అట్కిన్సన్ 7–0–41–0, మొయిన్ అలీ 8.2–0–42–3, ఆదిల్ రషీద్ 8–0–54–3. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ x శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో?
ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలి యా జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. లీగ్ దశలో 40 మ్యాచ్‌లు ముగియగా... మరో 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో భారత్–నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా–బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదు. దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లు మాత్రమే రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఒక సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్న భారత్ నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో మరో సెమీఫైనల్లో తలపడతుంది. ఒకవేళ పాకిస్తాన్ ముందంజ వేస్తే మాత్రం భారత్ 16న కోల్‌కతాలో పాక్‌తో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లలో ఒక జట్టు సెమీస్‌కు చేరితే భారత్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది. ప్రస్తుతం నాలుగో సెమీఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ ఉంది. మూడు జట్లకు ప్రస్తుతం సమాన పాయింట్లు (8) ఉన్నా... తక్కువ రన్‌రేట్‌తో (–0.338) అఫ్గానిస్తాన్ వెనుకబడి ఉంది. రేసులో కనీసం నిలవాలంటే శుక్రవారం తమ ఆఖరి పోరులో ఆ జట్టు భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. దానికి ముందు నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. పాకిస్తాన్ (0.036)కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం న్యూజిలాండ్ (0.398)కు సానుకూలాంశం. లంకపై గెలిస్తే చాలు కివీస్ ముందంజ వేసినట్లే. పాక్ శనివారం తమ చివరి పోరులో ఇంగ్లండ్‌పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బలహీనంగా కనిపిస్తున్నా సరే... ఇది పాక్‌కు అంత సులువు కాదు. అయితే అందరికంటే చివరగా మ్యాచ్ ఆడనుండటంతో పాక్‌కు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. నేడు లంక చేతిలో కివీస్ ఓడినా...వర్షంతో మ్యాచ్ రద్దయినా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే చాలు సెమీఫైనల్ చేరుతుంది. -
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్‌లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్‌కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్‌కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్‌వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్‌వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్‌కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్‌కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్‌లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్‌ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్‌లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్‌లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్‌కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్‌కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్‌తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్‌తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్‌వెల్ భారీ హిట్టింగ్‌కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్‌తో కలిసి జట్టు రాతను తన బ్యాట్‌తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్‌పై 8వ వికెట్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్‌రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్‌వుడ్ (బి) మ్యాక్స్‌వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్‌వుడ్ 9–0–39–2, మ్యాక్స్‌వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మాక్స్వెల్ డబుల్ సెంచరీ.. సెమీస్‌కు ఆస్ట్రేలియా
ఆఫ్ఝనిస్తాన్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మాక్స్వెల్ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 128 బంతుల్లో 201 పరుగులు సాధించాడు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.అజేయ శతకంతో ఆఖరి వరకు క్రీజులో ఉండి మొత్తంగా 129 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో రహ్మత్ షా 30, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 26, అజ్మతుల్లా 22 చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అయితే, చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 35 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి వారెవ్వా అనిపించాడు.జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు రషీద్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 291 పరుగులు చేసింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 292 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 24 పరుగులు చేసి నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లోనే రెండో వికెట్‌గా అవుట్ అయ్యాడు . తరువాత వచ్చిన మిగతా బ్యాట్స్‌మెన్ కూడా తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవుతారు అనుకున్న తరుణంలో మాక్స్వెల్ అఫ్గనిస్తాన్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగి అద్భుతమైన స్ట్రోక్ ప్లే తో డబుల్ సెంచరీతో( 201 ) ఆస్ట్రేలియా టీం ను గెలిపించాడు. అయితే లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో దెబ్బ కొట్టినప్పటికి మ్యాక్సి సంచలన ఇన్నింగ్స్ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియాను సెమీస్ చేర్చి డబుల్ ధమాకా అందించాడు. -
World Cup 2023: గట్టెక్కిన బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో అద్భుతం సాధిద్దామనే లక్ష్యంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. ఆ తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. వరుసగా ఆరు పరాజయాలను చవిచూసి సెమీఫైనల్ రేసు నుంచి ని్రష్కమించింది. ఈ ప్రపంచకప్‌లో టాప్–7లో నిలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్‌కు ఎనిమిదో మ్యాచ్ కీలకంగా మారింది. మాజీ విశ్వవిజేత శ్రీలంకతో జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో నెగ్గి మళ్లీ గెలుపుబాట పట్టింది. గెలుపుదారిలో వికెట్లను చేజార్చుకోవడం కలవరపెట్టినా... చివరకు బంగ్లాదేశ్ నుంచి విజయం మాత్రం చేజారలేదు. ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాదేశ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. 280 పరుగుల లక్ష్య ఛేదనలో నజ్ముల్ హొస్సేన్ షాంతో (101 బంతుల్లో 90; 12 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (65 బంతుల్లో 82; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించారు. చివర్లో తౌహిద్ హ్రిదయ్ (7 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) నిలబడి బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. చరిత్ అసలంక (105 బంతుల్లో 108; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు తంజిమ్ హసన్ (3/80), షోరిఫుల్ (2/51), షకీబుల్ హసన్ (2/57) సమష్టిగా వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 41 పరుగులకే ఓపెనర్లు తంజిద్ హసన్ (9), లిటన్ దాస్ (23) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నజ్ముల్, షకీబ్ అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. 210 వద్ద షకీబ్, మరో పరుగు తర్వాత నజ్ముల్ నిష్క్రమించారు. మహ్ముదుల్లా (22), ముషి్ఫకర్ (10), మిరాజ్ (3) స్వల్ప వ్యవధిలో అవుటవ్వడంతో బంగ్లాదేశ్‌కు ఇబ్బంది ఎదురైంది. అయితే తౌహిద్, తంజిమ్ జట్టును విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) తంజిమ్ 41; పెరీరా (సి) ముష్ఫికర్ (బి) షోరిఫుల్ 4; మెండిస్ (సి) షోరిఫుల్ (బి) షకీబ్ 19; సమరవిక్రమ (సి) మహ్ముదుల్లా (బి) షకీబ్ 41; అసలంక (సి) లిటన్ (బి) తంజిమ్ 108; మాథ్యూస్ (టైమ్డ్ అవుట్) 0; ధనంజయ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) మిరాజ్ 34; తీక్షణ (సి) సబ్–అహ్మద్ (బి) షోరిఫుల్ 21; చమీర (రనౌట్) 4; రజిత (సి) లిటన్ (బి) తంజిమ్ 0; మదుషంక (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 279. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–135, 5–135, 6–213, 7–258, 8–278, 9–278, 10–279. బౌలింగ్: షోరిఫుల్ 9.3–0–51–2, టస్కిన్ 10–1–39–0, తంజిమ్ హసన్ 10–0–80–3, షకీబ్ 10–0–57–2, మిరాజ్ 10–0–49–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తంజిద్ (సి) నిసాంక (బి) మదుషంక 9; లిటన్ దాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 23; నజ్ముల్ (బి) మాథ్యూస్ 90; షకీబ్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 82; మహ్ముదుల్లా (బి) తీక్షణ 22; ముష్ఫికర్ (బి) మదుషంక 10; తౌహిద్ (నాటౌట్) 15; మిరాజ్ (సి) అసలంక (బి) తీక్షణ 3; తంజిమ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (41.1 ఓవర్లలో 7 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–17, 2–41, 3–210, 4–211, 5–249, 6–255, 7– 269. బౌలింగ్: మదుషంక 10–1–69–3, తీక్షణ 9–0–44–2, కసున్ రజిత 4–0–47–0, చమీర 8–0–54–0, మాథ్యూస్ 7.1–1–35–2, ధనంజయ డిసిల్వా 3–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X అఫ్గానిస్తాన్ వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
భారత్ ప్రతాపం.. దక్షిణాఫ్రికా దాసోహం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ కష్టపెట్టింది. ఆరంభంలో రో‘హిట్స్’తో పరుగులు సులువైనా... తర్వాత గగనమైంది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ కనిపెట్టుకొని పరుగులు పేర్చితే జట్టు స్కోరు 300 మార్కు దాటింది. ‘బర్త్‌డే బాయ్’ విరాట్ సెంచరీ పర్వాన్ని చూపిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల కూల్చివేతల్లో త్వరపడ్డారు. దీంతో వార్ వన్‌సైడ్ అయిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయంతో రోహిత్ శర్మ బృందం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ‘టాప్ ర్యాంక్’ను ఖరారు చేసుకుంది. కోల్‌కతా: అదేంటో ఈ ప్రపంచకప్‌లో యుద్ధం తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనే భారత్ సులువుగా దండయాత్ర చేసి గెలుస్తోంది. ఆ్రస్టేలియాతో మొదలైన టీమిండియా తొలి మ్యాచ్, క్రికెట్ ప్రపంచం గుడ్లప్పగించి చూసిన పాక్‌తో సమరం... భారీస్కోర్లతో చేలరేగుతున్న దక్షిణాఫ్రికాతో తాజా పోరు... ఇవన్నీ కూడా పోటాపోటీగా సాగుతాయనుకుంటే భారత్ వీరంగంతో ఏకపక్షమయ్యాయి. దీంతో ఆతిథ్య జట్టు కాస్తా అజేయ శక్తిగా మారిపోయింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తర్వాత జోరుమీదున్న దక్షిణాఫ్రికా టీమిండియా దూకుడుకు దాసోహమైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. కోహ్లి పుట్టినరోజు (నవంబర్ 5) ఉదయం శుభాకాంక్షలతో మొదలైతే... సాయంత్రం వచ్చేసరికి శతక ప్రదర్శనతో ప్రశంసలు వెల్లువెత్తాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సచిన్‌కు సరిసమానమైన 49వ వన్డే సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్‌స్కోరర్! రవీంద్ర జడేజా (5/33) తన స్పిన్‌తో దక్షిణాఫ్రికాను చుట్టేశాడు. కుల్దీప్ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్ జట్టుతో ఆడుతుంది. రో‘హిట్స్’తో మొదలై... కెప్టెన్ , హిట్‌మ్యాన్ రోహిత్ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎదురుదాడికి దిగడంతో స్కోరు సగటున 10 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. 6వ ఓవర్లోనే రబడ అతని వేగానికి కళ్లెం వేయగా... కోహ్లి, శుబ్‌మన్ గిల్ (24 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగానే ఆడటంతో 10 ఓవర్లలో భారత్ 91/1 స్కోరు చేసింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ‘స్విచ్చాఫ్’ చేసినట్లు మారింది. గిల్‌ను అవుట్ చేసి... సహకరించే పిచ్‌పై స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కట్టడి చేయడంతో తర్వాతి 16 ఓవర్లలో భారత్ 60 పరుగులే చేయగలిగింది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ 151/1 స్కోరుతో వేగంలో వెనుకబడింది. ‘శత’క్కొట్టిన కోహ్లి పిచ్ సంగతి అర్థమైన కోహ్లి... కేశవ్ బౌలింగ్ ప్రమాదకరమని గుర్తించాడు. అవతలివైపు అయ్యర్‌నూ అలర్ట్ చేసి సింగిల్స్, డబుల్స్‌తోనే స్కోరును ముందుకు సాగనిచ్చాడు. కానీ షమ్సీని మాత్రం వదల్లేదు. చక్కగా బౌండరీలు బాదారు. కోహ్లి 67 బంతుల్లో, అయ్యర్ 64 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. ఈ జోడి మూడో వికెట్‌కు 134 పరుగులు జతచేశాక అయ్యర్ ఆటను ఎన్గిడి ముగించాడు. రాహుల్ (8) వచ్చివెళ్లాడు. ఆఖరి దశలో సూర్యకుమార్ (14 బంతుల్లో 22; 5 ఫోర్లు) జోరును షమ్సీ అడ్డుకోగా... జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాకే భారత్ పుంజుకొని 300 దాటింది. కోహ్లి (119 బంతుల్లో) శతకం సాధించాడు. ఈ మేటి బ్యాటర్ క్రీజులో ఉన్నా కూడా... కేశవ్ పూర్తి కోటా వేసినా... ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం. సఫారీ పేకమేడలా... ఈ టోర్నీలోనే బాగా సెంచరీలు, భారీగా స్కోర్లు చేస్తున్న జట్టు... రన్‌రేట్‌లో ముందున్న జట్టు దక్షిణాఫ్రికానే! కానీ ఈ జట్టు కూడా భారత బౌలింగ్‌కు కుదేలైంది. ఇంకా చెప్పాలంటే వికెట్లు రాలిన ఉదంతాన్ని చూస్తే ఓ క్రికెట్ కూననే తలపించింది. సిరాజ్ డెలివరీకి డికాక్ (5) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. జడేజా ముందుగానే రంగంలోకి దించితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమం తప్పకుండా సఫారీ మేటి బ్యాటర్లను పడగొట్టేశాడు. బవుమా (11), క్లాసెన్ (1), మిల్లర్ (11)లను స్పిన్ ఉచ్చులో ఉక్కిరి బిక్కిరి చేయగా... మరోవైపు షమీ పేస్‌తో డసెన్ (13), మార్క్రమ్ (9)లను పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ కూడా తనవంతు మ్యాజిక్ చూపడంతో 40 పరుగులకే 5 వికెట్లను... 83 పరుగులకే దక్షిణాఫ్రికా మొత్తం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బవుమా (బి) రబడ 40; గిల్ (బి) కేశవ్ 23; కోహ్లి (నాటౌట్) 101; అయ్యర్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 77; రాహుల్ (సి) డసెన్ (బి) జాన్సెన్ 8; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) షమ్సీ 22; జడేజా (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–62, 2–93, 3–227, 4–249, 5–285. బౌలింగ్: ఎన్గిడి 8.2–0–63–1, జాన్సెన్ 9.4–0–94–1, రబడ 10–1–48–1, కేశవ్ మహరాజ్ 10–0–30–1, షమ్సీ 10–0–72–1, మార్క్రమ్ 2–0–17–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; బవుమా (బి) జడేజా 11; డసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 13; మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమీ 9; క్లాసెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 1; మిల్లర్ (బి) జడేజా 11; జాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 14; కేశవ్ (బి) జడేజా 7; రబడ (సి అండ్ బి) జడేజా 6; ఎన్గిడి (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్) 83. వికెట్ల పతనం: 1–6, 2–22, 3–35, 4–40, 5–40, 6–59, 7–67, 8–79, 9–79, 10–83. బౌలింగ్: బుమ్రా 5–0–14–0, సిరాజ్ 4–1–11–1, జడేజా 9–1–33–5, షమ్సీ 4–0–18–2, కుల్దీప్ 5.1–1–7–2. ప్రపంచకప్‌లో నేడు శ్రీలంక Xబంగ్లాదేశ్ వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘టాప్’ సమరానికి సమయం
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ల చివరి దశలో ఒక ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు బలమైన ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు సన్నద్ధమయ్యాయి. ఒక్క ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న టీమిండియా ఒక వైపు...అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడినా మిగతా అన్ని మ్యాచ్‌లలో తమ బలాన్ని చూపించిన సఫారీ బృందం సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. ఈడెన్‌గార్డెన్స్ పోరులో భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది చూడాలి. కోల్‌కతా: ఎదురు లేని ఆటతో వరుసగా ఏడు విజయాలు సాధించిన రోహిత్ సేన ఇప్పుడు ఎనిమిదో మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. టోర్నీలో ఉన్న ఇతర బలమైన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్లనుంచి ఎలాంటి పోటీ లేకుండా అలవోక విజయాలు అందుకున్న టీమిండియాకు సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికా రూపంలో మరో పెద్ద జట్టు నిలబడింది. మరో వైపు అసాధారణ ఆట కనబరుస్తున్న సఫారీ కూడా అంతే స్థాయిలో గట్టి పోటీకి సవాల్ విసురుతోంది. నేడు విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు. ఈ రోజున వన్డేల్లో తన 49వ సెంచరీ సాధించి దిగ్గజం సచిన్ రికార్డును సమం చేస్తాడా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్పుల్లేకుండా... భారత జట్టుకు సంబంధించి కించిత్ కూడా ఆందోళన కలిగించే అంశం లేదు. ఏడు విజయాల్లోనూ జట్టు సభ్యులంతా తమ వంతు పాత్ర పోషించారు. గత మ్యాచ్‌కు ముందు వరకు అయ్యర్ బ్యాటింగ్, సిరాజ్ వికెట్లు తీయకపోవడం కొంత సమస్య అనిపించినా...శ్రీలంకతో పోరులో ఆ బెంగా తీరింది. టాప్–3లో రోహిత్, గిల్, కోహ్లి చెలరేగుతుండగా....మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్, సూర్యల జోరుతో భారత్ దూకుడు సాగుతోంది. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీ ఒకరితో మరొకరు పోటీ పడి బౌలింగ్ చేస్తుండగా...కుల్దీప్, జడేజా స్పిన్‌ను సఫారీ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది చూడాలి. అంతా ఫామ్‌లో... టోర్నీలో ఆరు మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా పాక్‌తో చివరి వరకు కాస్త తడబడగా, అనూహ్యంగా డచ్ చేతిలో ఓడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఐదు సార్లు ఆ జట్టు సాధించిన స్కోర్లు వారి బ్యాటింగ్ బలమేంటో చూపించాయి. 428, 311, 399, 382, 357...ఇలా నమోదు చేసి అన్నింటిలో కనీసం వంద పరుగుల తేడాతో సఫారీ టీమ్ నెగ్గింది. ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన డికాక్ ఒకే టోర్నీలో అత్యధిక శతకాల (5) రోహిత్ రికార్డు కోసం సన్నద్ధమయ్యాడు. బవుమా మినహా డసెన్, మార్క్రమ్, మిల్లర్, క్లాసెన్ చెలరేగిపోతున్నారు. ఇక రబడ, ఎన్గిడి, కొయెట్జీ, జాన్సెన్లతో కూడిన పేస్ దళంకు ఈడెన్ గార్డెన్స్ బౌన్సీ పిచ్‌పై కాస్త అవకాశం దొరికితే తిరుగుండదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), డికాక్, డసెన్, మార్క్రమ్, మిల్లర్, క్లాసెన్, జాన్సెన్, రబడ, మహరాజ్, ఎన్గిడి, కొయెట్జీ పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమతుల్యత ఉన్న పిచ్. ఇద్దరికీ మంచి అవకాశం ఉంది. వర్షసూచన లేదు కానీ మంచు ప్రభావం చూపించవచ్చు. -
ఫఖర్ మెరుపుల ‘వాన’లో...
బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్‌ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్‌వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్‌పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది. చెలరేగిన రచిన్, విలియమ్సన్ ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్‌కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్‌ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు. ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాప్మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. ఫఖర్ విధ్వంసం వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్‌లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్‌కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్‌తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు. 4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది. అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది! స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్‌ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్‌ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0. -
ఇంగ్లండ్ ఖేల్ ఖతం
అహ్మదాబాద్: డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్ ప్రపంచకప్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. వరుసగా ఐదో ఓటమితో... మొత్తం 6 పరాజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరో వైపు ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఆరంభ దశలో తడబడినప్పటికీ తర్వాత జూలు విదిల్చింది. క్రమంగా గెలుపుబాట పట్టి ప్రత్యర్థుల ఆట కటిస్తూ సెమీస్‌కు మరింత చేరువైంది. శనివారం జరిగిన పోరులో ఆసీస్ 33 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌటైంది. లబుషేన్ (83 బంతుల్లో 71; 7 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (52 బంతుల్లో 47; 5 ఫోర్లు), స్మిత్ (52 బంతుల్లో 44; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (90 బంతుల్లో 64; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. మొయిన్ అలీ (43 బంతుల్లో 42; 6 ఫోర్లు), వోక్స్ (33 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆ్రస్టేలియా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (3/21), స్టార్క్(2/66), హాజల్‌వుడ్ (2/49), కమిన్స్ (2/49) సమష్టిగా ప్రత్యర్థిని దెబ్బ తీశారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో గత ఫైనలిస్ట్ న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్... తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మాత్రమే 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియాల చేతిలో ఓడింది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. 2015 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ ఆ జట్టు వన్డేల్లో ఒక్కసారిగా స్వరూపం మార్చుకుంది. భీకర ఆటతో తర్వాతి నాలుగేళ్ల పాటు వన్డే క్రికెట్‌ను శాసించి 2019లో జగజ్జేతగా నిలిచిన టీమ్ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పతనావస్థకు చేరి మరో సారి 2015కు ముందు రోజులను గుర్తుకు తెచ్చింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) రూట్ (బి) వోక్స్ 11; వార్నర్ (సి) విల్లీ (బి) వోక్స్ 15; స్మిత్ (సి) అలీ (బి) రషీద్ 44; లబుషేన్ (ఎల్బీ) (బి) వుడ్ 71; ఇంగ్లిస్ (సి) అలీ (బి) రషీద్ 3; గ్రీన్ (బి) విల్లీ 47; స్టొయినిస్ (సి) బెయిర్‌స్టో (బి) లివింగ్‌స్టోన్ 35; కమిన్స్ (సి) మలాన్ (బి) వుడ్ 10; స్టార్క్ (సి) అలీ (బి) వోక్స్ 10; జంపా (సి) బట్లర్ (బి) వోక్స్ 29; హాజల్‌వుడ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–11, 2–38, 3–113, 4–117, 5–178, 6–223, 7–241, 8–247, 9–285, 10–286. బౌలింగ్: విల్లీ 10–1–48–1, వోక్స్ 9.3–0–54–4, వుడ్ 10–0–70–2, లివింగ్‌స్టోన్ 6–0–42–1, మొయిన్ అలీ 4–0–28–0, రషీద్ 10–0–38–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 0; మలాన్ (సి) హెడ్ (బి) కమిన్స్ 50; రూట్ (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 13; స్టోక్స్ (సి) స్టొయినిస్ (బి) జంపా 64; బట్లర్ (సి) గ్రీన్ (బి) జంపా 1; మొయిన్ అలీ (సి) వార్నర్ (బి) జంపా 42; లివింగ్‌స్టోన్ (సి) సబ్–అబాట్ (బి) కమిన్స్ 2; వోక్స్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 32; విల్లే (సి) జంపా (బి) హాజల్‌వుడ్ 15; రషీద్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 20; వుడ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–103, 4–106, 5–169, 6–174, 7–186, 8–216, 9–253, 10–253. బౌలింగ్: స్టార్క్ 10–0–66–2, హాజల్‌వుడ్ 9.1–1–49–2, కమిన్స్ 10–1–49–2, జంపా 10–0–21–3, హెడ్ 5–0–28–0, స్టొయినిస్ 4–0–34–1. -
భారత్ కు షాక్..హార్దిక్ పాండ్య ఔట్..
-
WC 2023: అఫ్గాన్... అదే జోరు.. సెమీఫైనల్ ఆశలు సజీవం
లక్నో: సమష్టి ప్రదర్శనతో అదరగొడుతూ... అంచనాలకు మించి రాణిస్తూ... వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అఫ్గానిస్తాన్ నాలుగో విజయం నమోదు చేసింది. ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన మూడు జట్లపై సంచలన విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్ తాజాగా నెదర్లాండ్స్ జట్టును ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ (86 బంతు ల్లో 58; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మ్యాక్స్ ఓ డౌడ్ (40 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలిచింది. రహ్మత్ షా (54 బంతుల్లో 52; 8 ఫోర్లు), కెపె్టన్ హష్మతుల్లా (64 బంతు ల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. డచ్ రనౌట్... నెదర్లాండ్స్ జట్టులో టాప్–5లో ఒక్క ఓపెనర్ వెస్లీ (1) మినహా... తర్వాత వరుసగా నలుగురు బ్యాటర్లు మ్యాక్స్ ఓ డౌడ్, అకెర్మన్ (35 బంతుల్లో 29; 4 ఫోర్లు), సైబ్రాండ్, కెపె్టన్ ఎడ్వర్డ్స్ (0) రనౌట్ కావడమే డచ్ కొంపముంచింది. వన్డేల్లో ఒక జట్టు తరఫున టాప్–5లో నలుగురు రనౌట్ కావ డం ఇదే ప్రథమం. సమన్వయలోపం, పరుగేలేని చోట ప్రయత్నించి భంగపడటంతో నెదర్లాండ్స్ కష్టాలు కొనితెచ్చుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. గెలిపించిన రహ్మత్, హష్మతుల్లా సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్ల వైఫల్యం కంగారుపెట్టింది. రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) నిరాశపరిచారు. ఈ దశలో రహ్మత్ షా, కెపె్టన్ హష్మతుల్లా ఇన్నింగ్స్ నడిపించి, గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో రహ్మత్ షా (47 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 74 పరుగులు జోడించాక జుల్ఫికర్ బౌలింగ్‌లో రహ్మత్‌షా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా (31 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేసిన హష్మతుల్లా జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అఫ్గాన్ ఏదో గాలివాటం గెలుపులేమీ గెలవలేదు. చక్కని బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్‌తో మాజీ చాంపియన్లను ఓడించి 8 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఇప్పటివరకైతే బానే ఉంది. కానీ హష్మతుల్లా జట్టుకు మిగిలినవి రెండు మ్యాచ్‌లే! అవి కూడా గట్టి ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా (7న ముంబైలో), దక్షిణాఫ్రికా (10న అహ్మదాబాద్‌లో)లతో కావడంతో... సెమీస్ చేరడం, కల సాకారమవడం మాత్రం అంత సులభమైతే కాదు. అయితే సంచలనాల మజా ఆఖరి దశను రసవత్తరం చేస్తే మాత్రం... 2003లో కెన్యా సెమీస్ చేరినట్లే... అఫ్గాన్‌కు ఆ అవకాశం దక్కినా దక్కొచ్చు! స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 1; మ్యాక్స్ ఓ డౌడ్ (రనౌట్) 42; అకెర్మన్ (రనౌట్) 29; సైబ్రాండ్ (రనౌట్) 58; ఎడ్వర్డ్స్ (రనౌట్) 0; బస్ డి లీడే (సి) ఇక్రామ్ (బి) నబీ 3; జుల్ఫీకర్ (సి) ఇక్రామ్ (బి) నూర్ అహ్మద్ 3; వాన్ బిక్ (స్టంప్డ్) ఇక్రామ్ (బి) నబీ 2; వాన్‌డెర్ మెర్వ్ (సి) జద్రాన్ (బి) నూర్ అహ్మద్ 11; ఆర్యన్ దత్ (నాటౌట్) 10; మీకెరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–3, 2–73, 3–92, 4–92, 5–97, 6–113, 7–134, 8–152, 9–169, 10–179. బౌలింగ్: ముజీబ్ 10–0–40–1, ఫరూఖీ 5–0–36–0, ఒమర్జాయ్ 3–0–11–0, నబీ 9.3–1–28–3, రషీద్ ఖాన్ 10–0–31–0, నూర్ అహ్మద్ 9–0–31–2. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 10; జద్రాన్ (బి) వాన్‌డెర్ మెర్వ్ 20; రహ్మత్ షా (సి అండ్ బి) జుల్ఫికర్ 52; హష్మతుల్లా (నాటౌట్) 56; అజ్మతుల్లా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (31.3 ఓవర్లలో 3 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–27, 2–55, 3–129. బౌలింగ్: ఆర్యన్ దత్ 8.3–0–49–0, వాన్ బిక్ 7–0–30–1, మీకెరన్ 5–0–35–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–27–1, జుల్ఫికర్ 3–0–25–1, అకెర్మన్ 3–0–12–0. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు ఉదయం గం. 10:30 నుంచి ఆ్రస్టేలియా Xఇంగ్లండ్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: సెమీఫైనల్ లక్ష్యంగా...
ముంబై: ఎదురులేని ఆటతో వరల్డ్‌కప్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి దూసుకుపోతున్న భారత జట్టు ఇప్పుడు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే పోరులో మాజీ విశ్వవిజేత శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఒకవైపు భారత్ అజేయంగా చెలరేగుతుండగా, మరోవైపు శ్రీలంక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. మూడు పరాజయాల తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడటం వారిని తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా ఏకపక్షంగా ముగియవచ్చు. మార్పుల్లేకుండా... భారత జట్టు విషయంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం, అవసరం కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. ఇంగ్లండ్‌తో పోరులో జట్టు బ్యాటింగ్ కాస్త తడబడినట్లుగా కనిపించినా... అది పూర్తిగా భిన్నమైన, కఠినమైన పిచ్ కావడం మన బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. కానీ అది పునరావృతం కాకుండా మన ఆటగాళ్లు చెలరేగిపోగలరు. అయితే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ మాత్రమే కాస్త సమస్యగా కనిపిస్తోంది. బుమ్రా, షమీల ప్రమాదకరమైన బౌలింగ్... స్పిన్‌లో జడేజా, కుల్దీప్ల జోరు భారత్‌ను దుర్బేధ్యంగా మారుస్తున్నాయి. మాథ్యూస్‌పై ఆశలు... ఒకవైపు ఆట పేలవంగా ఉండటంతో పాటు మరోవైపు కీలక ఆటగాళ్లకు వరుస గాయాలు శ్రీలంకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో తుది జట్టులో వరుసగా మార్పులు చేయాల్సి ఉంది. అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సీనియర్ ఎంజెలో మాథ్యూస్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. 54 సగటుతో అతను మూడు సెంచరీలు కూడా సాధించాడు. అదే ఆటను మళ్లీ చూపించాలని లంక కోరుకుంటోంది. బౌలింగ్‌లో అందరూ అంతంతమాత్రమే. రజిత, తీక్షణ, మదుషంకలాంటి జూనియర్లు భారత బ్యాటింగ్ బలగాన్ని నిలువరించడం చాలా కష్టం. మొదటి నుంచి వాంఖెడే మైదానం పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఈ టోర్నీలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 399, 382 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షసూచన లేదు. -
కివీస్ నెత్తిన సఫారీ పిడుగు!
పుణే: ప్రపంచకప్‌లో అమితాసక్తి రేపిన మ్యాచ్‌లలో ఇదొకటి... ఇరు జట్ల తాజా ప్రదర్శన, బలాబలాలు, గత రికార్డులను బట్టి చూస్తే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపించింది. కానీ చివరకు వచ్చేసరికి అంతా సఫారీల హవానే సాగి ఏకపక్ష విజయం దక్కింది. పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులిచ్చిన కివీస్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ కుప్పకూలింది. దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయంతో అగ్రస్థానానికి చేరగా... టోర్నీ ఆరంభంలో అద్భుతంగా అనిపించిన న్యూజిలాండ్ ఖాతాలో ఇప్పుడు వరుసగా మూడో ఓటమి చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన కివీస్ ఊహించని విధంగా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ముందుగా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డసెన్ (118 బంతుల్లో 133; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), డికాక్ (116 బంతుల్లో 114; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించగా, ఆఖరి 10 ఓవర్లలో సఫారీ జట్టు 119 పరుగులు సాధించింది. డికాక్‌కు ఈ మెగా టోర్నీలో ఇది నాలుగో శతకం. అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 114; బవుమా (సి) మిచెల్ (బి) బౌల్ట్ 24; డసెన్ (బి) సౌతీ 133; మిల్లర్ (సి) మిచెల్ (బి) నీషమ్ 53; క్లాసెన్ (నాటౌట్) 15; మార్క్రమ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–38, 2–238, 3–316, 4–351. బౌలింగ్: బౌల్ట్ 10–1–49–1, హెన్రీ 5.3–0–31–0, సౌతీ 10–0–77–2, సాన్‌ట్నర్ 10–0–58–0, ఫిలిప్స్ 7–0–52–0, రచిన్ 2–0–17–0, నీషమ్ 5.3–0–69–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 2; యంగ్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 33; రచిన్ (సి) కొయెట్జీ (బి) జాన్సెన్ 9; మిచెల్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 24; లాథమ్ (సి) మహరాజ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (సి) రబడ (బి) కొయెట్జీ 60, సాన్‌ట్నర్ (బి) మహరాజ్ 7; సౌతీ (ఎల్బీ) (బి) జాన్సెన్ 7; నీషమ్ (బి) మహరాజ్ 0; బౌల్ట్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 9; హెన్రీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (35.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–56, 4–67, 5–90, 6–100, 7–109, 8–110, 9–133, 10–167. బౌలింగ్: జాన్సెన్ 8–1–31–3, ఎన్గిడి 6–1–28–0, రబడ 6–2–16–1, కొయెట్జీ 6.3–0–41–2, కేశవ్ మహరాజ్ 9–0–46–4. -
పాకిస్తాన్ విజయం
కోల్‌కతా: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆ జట్టు ఖాతాలో గెలుపు చేరింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. బంగ్లాకు ఇది ఆరో పరాజయం కాగా...తాజా ఫలితంతో సెమీస్ అవకాశాలు కోల్పోయి టోర్నీనుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా బంగ్లా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (70 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), లిటన్ దాస్ (64 బంతుల్లో 45; 6 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. షాహిన్ అఫ్రిది 3 కీలక వికెట్లతో బంగ్లాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (74 బంతుల్లో 81; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 21.1 ఓవర్లలో 160 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో 17.3 ఓవర్లు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యం చేరిన పాక్ టోర్నీలో తమ ఆశలు నిలబెట్టుకుంది. వరుసగా భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్తాన్‌కు ఈ విజయం దక్కింది. స్కోరు వివరాలు: బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (ఎల్బీ) (బి) షాహిన్ 0; దాస్ (సి) సల్మాన్ (బి) ఇఫ్తికార్ 45; నజు్మల్ (సి) ఉసామా (బి) షాహిన్ 4; ముష్ఫికర్ (సి) రిజ్వాన్ (బి) రవూఫ్ 5; మహ్ముదుల్లా (బి) షాహిన్ 56; షకీబ్ (సి) సల్మాన్ (బి) రవూఫ్ 43; తౌహీద్ (సి) ఇఫ్తికార్ (బి) ఉసామా 7; మిరాజ్ (బి) వసీమ్ 25; తస్కీన్ (బి) వసీమ్ 6; ముస్తఫిజుర్ (బి) వసీమ్ 3; షరీఫుల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 204. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–23, 4–102, 5–130, 6–140, 7–185, 8–200, 9–201, 10–204. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 9–1–23–3, ఇఫ్తికార్ 10–0–44–1, రవూఫ్ 8–0–36–2, వసీమ్ 8.1–1–31–3, ఉసామా 10–0–66–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) మిరాజ్ 68; ఫఖర్ (సి) తౌహీద్ (బి) మిరాజ్ 81; బాబర్ (సి) మహ్మదుల్లా (బి) మిరాజ్ 9; రిజ్వాన్ (నాటౌట్) 26; ఇఫ్తికార్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.3 ఓవర్లలో 3 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–128, 2–160, 3–169. బౌలింగ్: తస్కీన్ 6–1–36–0, షరీఫుల్ 4–1–25–0, మిరాజ్ 9–0–60–3, ముస్తఫిజుర్ 7–0–47–0, షకీబ్ 5.3–0–30–0, నజు్మల్ 1–0–5–0. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X దక్షిణాఫ్రికా వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘నేనెప్పుడూ అనుకోలేదు’
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడు అనుకోలేదని భారత స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో 48వ సెంచరీతో భారత గ్రేటెస్ట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ (49) సరసన నిలిచేందుకు చేరువైన కోహ్లి తన తారాస్థాయి బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందిస్తూ... ‘క్రికెట్ గురించే మాట్లాడితే... ఇంతలా రాణిస్తానని, ఇన్ని మైలురాళ్లు అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోనే లేదు. దేవుడి కృప వల్లే ఎక్కడో ఉన్న నేను ఇక్కడిదాకా వచ్చాను. నా ఆటతీరు, నిలకడ కొనసాగుతున్నాయి. సెంచరీలు చేయాలని, వేల కొద్దీ పరుగులు సాధించాలని కలలైతే కనేవాణ్ని. కానీ అవన్నీ ఇలా ఒక్కొక్కటిగా సాకారమవుతాయని అనుకోలేదు. నిజం చెప్పాలంటే క్రికెట్లో ఇవి ఇలా జరుగుతాయని, పయనం ఇలా సాగుతుందని ఎవరూ ప్రణాళికలు వేసుకోరు’ అని అన్నాడు. ఈ 12 ఏళ్లలో టన్నుల కొద్దీ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఒక దశలో తన ప్రొఫెషనల్ క్రికెట్లోని లోపాల్ని గుర్తించడం... వెంటనే ఆటకు తగిన జీవనశైలి, క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్లే అంతా మంచి జరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘నా దృష్టంతా జట్టుపైనే ఉంటుంది. టీమిండియా విజయాల కోసం నా ప్రదర్శన బాగుండాలని, క్లిష్ట సమయంలోనూ జట్టును గట్టెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే జీవనశైలి (సంపూర్ణ ఫిట్నెస్ కోసం)ని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ తప్పదని భావించాను. ఆట ఎప్పుడు మన కృషినే గుర్తిస్తుంది. నిజాయితీగా చెబుతున్నా... నా కెరీర్లో నేను బాగా నేర్చుకుంది ఇదే! ఫీల్డులో వంద శాతం అంకితభావంతో ఆడేందుకే కృషి చేస్తా. ఇదంతా కూడా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తా’ అని కోహ్లి వివరించాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ కింగ్... సచిన్ తర్వాత అంతటి క్రేజ్‌ను సంపాదించుకోవడమే కాదు... ఆ మాస్టర్ బ్లాస్టర్ వేర్వేరు ఘనతలను తిరగరాశాడు. ఈ ప్రపంచకప్‌లో ఒక శతకం, మూడు అర్ధసెంచరీలతో అతను ఇప్పటికే 354 పరుగులు చేశాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నవంబర్ 5న కోహ్లి పుట్టినరోజు. అదే రోజు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉండటంతో శతకోటి భారతీయులంతా ఆ రోజు కింగ్ కోహ్లి శతకం కొట్టాలని కోరుకుంటున్నారు. మరో వైపు కోహ్లి కోసం ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు ఐసీసీ అనుమతితో అందరి ముందు భారీ కేక్‌ను కట్ చేయించాలనేది ప్రతిపాదన. దీంతో పాటు మైదానానికి వచ్చే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులకు లోపలికి వెళ్లే సమయంలో ‘కోహ్లి మాస్్క’లను అందజేస్తారు. దాంతో స్టేడియమంతా కోహ్లిమయమయ్యే అవకాశం ఉంది. -
శ్రేయస్‌పైనే దృష్టి
ముంబై: వరల్డ్‌కప్‌లో వరుసగా ఏడో విజయంపై దృష్టి పెట్టిన భారత జట్టు తమ సన్నాహకాలకు పదును పెట్టింది. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సోమవా రం టీమ్ సాధన కొనసాగింది. ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ కావడంతో రోహిత్, కోహ్లి, గిల్ దీనికి హాజరు కాలేదు. అయితే జట్టులోని ఇతర ప్రధాన ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమించారు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా... జడేజా, అశ్విన్, శార్దుల్ కూడా తమ బౌలింగ్‌కు పదును పెట్టారు. అయితే అన్నింటికంటే కీలక సెషన్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌దే. ఆశించిన స్థాయిలో ఈ టోర్నీలో రాణించలేకపోతున్న అయ్యర్ పదే పదే షార్ట్ పిచ్ బంతులకు అవుటవుతూ తన బలహీనతను బయట పెట్టుకుంటున్నాడు. దీనిని సరిదిద్దే క్రమంలో అయ్యర్ ప్రాక్టీస్ సాగింది. ఆరంభంలో స్థానిక నెట్ బౌలర్లు అతనికి బౌలింగ్ చేయగా... ఆ తర్వాత టీమ్ త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అతనికి పెద్ద సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరాడు. అయ్యర్ సాధనను పర్యవేక్షించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి తగిన సూచనలిస్తూ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేశారు. ముంబైకే చెందిన శ్రేయస్ సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. -
ధర్మశాలలో ధమాకా
ఆ్రస్టేలియాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయలక్ష్యం 389... ఇంత భారీ స్కోరు చూడగానే సాధారణంగా ఛేదన చేసే జట్టు మానసికంగా ముందే ఓటమికి సిద్ధమవుతుంది. కానీ న్యూజిలాండ్ తలవంచకుండా చివరి వరకు పోరాడింది... ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు జోరు తగ్గించలేదు. చివరకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన స్థితి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చింది. ఇక్కడా అవకాశం ఉన్నా... ఆ్రస్టేలియా అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను నిలువరించడంలో సఫలమైంది. బౌండరీని దాటగలిగే రెండు బంతులను మెరుపు వేగంతో దూసుకెళ్లి ఆపడంతో పాటు రెండో పరుగు కోసం చేసిన ప్రయత్నాన్ని రనౌట్‌తో పడగొట్టింది! దాంతో ఆఖరికి 5 పరుగుల తేడాతో గెలిచి ఆ్రస్టేలియా ఊపిరి పీల్చుకుంది. రచిన్, నీషమ్‌ల పోరాటం చివరకు వృథా అయింది. అంతకు ముందు తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లో హెడ్ మెరుపు సెంచరీ, వార్నర్ దూకుడు వెరసి ఆసీస్‌కు భారీ స్కోరును అందించాయి. వరల్డ్ కప్‌లో వరుసగా రెండో రోజు అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసే అవకాశం దక్కగా... ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన 771 పరుగులు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మొత్తం కావడం విశేషం. ధర్మశాల: మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత పదునెక్కుతున్న ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో మరో కీలక విజయాన్ని అందుకుంది. ఐదు సార్లు విజేత అయిన ఆసీస్‌కు ఈ టోర్నీలో ఇది వరుసగా నాలుగో విజయం కాగా, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు 350 పరుగుల స్కోరు దాటగలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) వన్డేల్లో నాలుగో శతకం సాధించగా, డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 115 బంతుల్లోనే 175 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) టోర్నీ రెండో సెంచరీ సాధించగా... జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), డరైల్ మిచెల్ (51 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వరల్డ్ కప్ కోసం ఆసీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ట్రవిస్ హెడ్ ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతని చేతికి గాయమైంది. అయినా సరే అతని స్థానంలో మరొకరిని తీసుకోకుండా 14 మందితోనే ఆసీస్ జట్టును కొనసాగించింది. తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చీ రాగానే తన విలువేంటో చూపించాడు. హెడ్, వార్నర్ కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో తొలి 10 ఓవర్లలోనే ఆసీస్ ఏకంగా 118 పరుగులు చేసింది. ఈ క్రమంలో వార్నర్ 28 బంతుల్లో, హెడ్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 175/0 కాగా, ఈ స్కోరు వద్ద జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. అనంతరం 59 బంతుల్లోనే హెడ్ శతకాన్ని అందుకున్నాడు. ఈ దశలో ఆసీస్ మిడిలార్డర్ తడబాటుకు లోనై తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇన్‌గ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఛేదనను కివీస్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు యంగ్ (28), కాన్వే (28) సరైన ఆరంభాన్ని ఇవ్వగా, రచిన్ ఆ జోరును కొనసాగించాడు. రచిన్, మిచెల్ కలిసి 96 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 77 బంతుల్లోనే రచిన్ సెంచరీ పూర్తయింది. 59 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో రచిన్ వెనుదిరగ్గా... ఆ తర్వాత నీషమ్ బాధ్యతను తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతని రనౌట్ జట్టు ఓటమిని ఖాయం చేసింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) అండ్ (బి) ఫిలిప్స్ 81; హెడ్ (బి) ఫిలిప్స్ 109; మార్ష్ (బి) సాన్‌ట్నర్ 36; స్మిత్ (సి) బౌల్ట్ (బి) ఫిలిప్స్ 18; లబుషేన్ (సి) రవీంద్ర (బి) సాన్‌ట్నర్ 18; మ్యాక్స్‌వెల్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 41; ఇన్‌గ్లిస్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 38; కమిన్స్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 37; స్టార్క్ (సి) నీషమ్ (బి) హెన్రీ 1; జంపా (బి) బౌల్ట్ 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 388. వికెట్ల పతనం: 1–175, 2–200, 3–228, 4–264, 5–274, 6–325, 7–387, 8–388, 9–388, 10–388. బౌలింగ్: హెన్రీ 6.2–0–67–1, బౌల్ట్ 10–0–77–3, ఫెర్గూసన్ 3–0–38–0, సాన్‌ట్నర్ 10–0–80–2, ఫిలిప్స్ 10–0–37–3, రచిన్ 8–0–56–0, నీషమ్ 2–0–32–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 28; యంగ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 32; రచిన్ (సి) లబుషేన్ (బి) కమిన్స్ 116; మిచెల్ (సి) స్టార్క్ (బి) జంపా 54; లాథమ్ (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 21; ఫిలిప్స్ (సి)లబుషేన్ (బి) మ్యాక్స్‌వెల్ 12; నీషమ్ (రనౌట్) 58; సాన్‌ట్నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 17; హెన్రీ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 9; బౌల్ట్ (నాటౌట్) 10; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 383. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–168, 4–222, 5–265, 6–293, 7–320, 8–346, 9–383. బౌలింగ్: స్టార్క్ 9–0–89–0, హాజల్‌వుడ్ 9–0–70–2, కమిన్స్ 10–0–66–2, మ్యాక్స్‌వెల్ 10–0–62–1, జంపా 10–0–74–3, మార్ష్ 2–0–18–0. -
ఉత్కంఠను దాటి... పాకిస్తాన్‌పై ఒక వికెట్ తేడాతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా
చెన్నై: ఒక్కో బంతి, ఒక్కో పరుగుకు గుండెచప్పుడు పెరుగుతుంటే... మరోసారి ‘చోకర్స్’ అనిపించుకోరాదని దక్షిణాఫ్రికా ఒకవైపు... ఈ అవకాశం పోతే వన్డే వరల్డ్‌కప్‌లో తమ ఖేల్ ఖతమ్ అని తెలుసు కాబట్టి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాకిస్తాన్ మరోవైపు... వరల్డ్ కప్ 26వ మ్యాచ్ అభిమానులకు అత్యంత ఉత్కంఠను పెంచి ఆసక్తికరంగా ముగిసింది. విజయానికి చేరువైన దశలో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం సఫారీ టీమ్‌లో ఆందోళన పెంచగా... ఆఖరి వికెట్ తీసేందుకు 11 బంతులు పోరాడిన పాక్ చివరకు తలవంచింది. 17 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా ఒత్తిడిని అధిగమించి కేశవ్ మహరాజ్ కొట్టిన బౌండరీతో ఆట ముగిసింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బంతుల్లో 52; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ (65 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ప్రదర్శన చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీకి 4 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి గెలిచింది. మార్క్రమ్ (93 బంతుల్లో 91; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. కీలక భాగస్వామ్యం... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు మరోసారి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అబ్దుల్లా (9), ఇమామ్ (12) సమష్టిగా విఫలమయ్యారు. తొలి బంతికే జాన్సెన్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రిజ్వాన్ (27 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే రిజ్వాన్, ఇఫ్తికార్ (21)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మరోవైపు తడబడుతూనే ఆడిన బాబర్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని అదే స్కోరు వద్ద వెనుదిరిగాడు. 141/5 స్కోరుతో పాక్ కుప్పకూలడం ఖాయమనిపించింది. ఈ దశలో షాదాబ్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో పాటు వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆరో వికెట్‌కు షకీల్‌తో కలిసి 84 పరుగులు (71 బంతుల్లో) జోడించిన అనంతరం షాదాబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 50 బంతుల్లో షకీల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. కానీ అతను అవుటైన తర్వాత పరుగులు జోడించడంలో పాక్ విఫలమైంది. 30 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 4 వికెట్లు కోల్పోగా మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన మార్క్రమ్... ఛేదనను దక్షిణాఫ్రికా దూకుడుగా మొదలు పెట్టింది. షాహిన్ వేసిన రెండో ఓవర్లో డికాక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు) నాలుగు ఫోర్లు బాదగా, బవుమా (27 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరితో పాటు వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి డసెన్ (21), ఫామ్‌లో ఉన్న క్లాసెన్ (12) కూడా వెనుదిరగడంతో పాక్ జట్టులో ఆశలు రేగాయి. అయితే మార్క్రమ్, మిల్లర్ (29) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ సహజశైలిలో వీరు ధాటిగా ఆడటంతో సఫారీ జట్టు గెలుపు దిశగా దూసుకుపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 70 పరుగులు జత చేశారు. అయితే లక్ష్యానికి చేరువవుతున్న దశలో పాక్ బౌలర్లు చెలరేగడంతో టీమ్ తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 59 బంతుల్లో కేవలం 21 పరుగులు చేయాల్సిన దశలో మార్క్రమ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరిత ముగింపు వైపు సాగింది. ఫీల్డింగ్‌లో తలకు గాయం కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పాక్ బౌలర్ షాదాబ్ మైదానం వీడగా... ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా ఉసామా మీర్ బరిలోకి దిగాడు. వరల్డ్ కప్‌లో ఇదే తొలి ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ ఘటన కావడం విశేషం. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: అబ్దుల్లా (సి) ఎన్గిడి (బి) జాన్సెన్ 9; ఇమామ్ (సి) క్లాసెన్ (బి) జాన్సెన్ 12; బాబర్ (సి) డికాక్ (బి) షమ్సీ 50; రిజ్వాన్ (సి) డికాక్ (బి) కొయెట్జి 31; ఇఫ్తికార్ (సి) క్లాసెన్ (బి) షమ్సీ 21; షకీల్ (సి) డికాక్ (బి) షమ్సీ 52; షాదాబ్ (సి) మహరాజ్ (బి) కోయెట్జి 43; నవాజ్ (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 24; షాహిన్ (సి) మహరాజ్ (బి) షమ్సీ 2; వసీమ్ (సి) డికాక్ (బి) ఎన్గిడి 7; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–20, 2–38, 3–86, 4–129, 5–141, 6–225, 7–240, 8–259, 9–268, 10–270. బౌలింగ్: జాన్సెన్ 9–1–43–3, ఎన్గిడి 7.4–0–45–1, మార్క్ రమ్ 4–0–20–0, మహరాజ్ 9–0–56–0, కోయెట్జి 7–0–42–2, షమ్సీ 10–0–60–4. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) షకీల్ (బి) వసీమ్ 28; డికాక్ (సి) వసీమ్ (బి) షాహిన్ 24; డసెన్ (ఎల్బీ) (బి) ఉసామా 21; మార్క్రమ్ (సి) బాబర్ (బి) ఉసామా 91; క్లాసెన్ (సి) ఉసామా (బి) వసీమ్ 12; మిల్లర్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 29; జాన్సెన్ (సి) బాబర్ (బి) రవూఫ్ 20; కోయెట్జి (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 10; మహరాజ్ (నాటౌట్) 7; ఎన్గిడి (సి) అండ్ (బి) రవూఫ్ 4; షమ్సీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (47.2 ఓవర్లలో 9 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–34, 2–67, 3–121, 4–136, 5–206, 6–235, 7–250, 8–250, 9–260. బౌలింగ్: ఇఫ్తికార్ 3–0–23–0, షాహిన్ అఫ్రిది 10–0–45–3, నవాజ్ 6.2–0–40–0, రవూఫ్ 10–0–62–2, వసీమ్ 10–1–50–2, ఉసామా 8–0–45–2. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X న్యూజిలాండ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి బంగ్లాదేశ్ X నెదర్లాండ్స్ వేదిక: కోల్‌కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా విజయం
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో విజయం సాధించింది. చెన్నై వేదికగా పాకిస్తాన్‌తో చివరి వరకు నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు . ఈ ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో సాతాఫ్రికా విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో మార్క్రమ్(91) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్ల లో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా ,రవూఫ్ , వసీం , ఉసామ మీర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు . టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలలో బాబర్ ఆజం(50), సౌధ్ షకీల్(52) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆఖరిలో షదాబ్ ఖాన్(43), నవాజ్(24) పర్వాలేదనపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ షంసీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జానెసన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, లుంగీ ఎంగిడి ఒక్క వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్ మళ్లీ బోల్తా
బెంగళూరు: గత మెగా ఈవెంట్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో సూపర్ ఓవర్‌దాకా పోరాడి మరీ పుట్టింటికి ప్రపంచకప్‌ను పట్టుకెళ్లిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం లీగ్ దశలోనే ఇంటికెళ్లే ప్రమాదంలో పడింది. సగం మ్యాచ్‌లు పూర్తయినా ఒక్కటి మాత్రమే గెలిచి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇకపై ఆడాల్సిన నాలుగు వరుసబెట్టి గెలిచినా... రేసులో నిలవడమైతే అసాధ్యమే! ఇప్పటికే అఫ్గానిస్తాన్ జట్టు చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్ జట్టును గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో బోల్తా కొట్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్ బృందం 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరులాంటి చిన్నస్వామి స్టేడియంలో ఇది టి20లకు సైతం చిన్నస్కోరు. అలాంటిది వన్డేలకు ఏం సరిపోతుంది. బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 43; 6 ఫోర్లు) చేసిందే టాప్ స్కోర్! ఇంకో ఇద్దరు ఓపెనర్లు బెయిర్‌స్టో (31 బంతుల్లో 30; 3 ఫోర్లు), మలాన్ (25 బంతుల్లో 28; 6 ఫోర్లు)లవి చెప్పుకోదగ్గ స్కోర్లే తప్ప జట్టుకు ఉపయోగపడే పరుగులేమీ కావు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లహిరు కుమార 3, మాథ్యూస్, కసున్ రజిత చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ నిసాంక ( 83 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమరవిక్రమ (54 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించారు. నిసాంక 54 బంతుల్లో, సమరవిక్రమ 44 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తిచేశారు. శ్రీలంక 23 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కుదురుగా ఆడి అబేధ్యమైన మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించి జట్టును విజయతీరానికి చేర్చారు. నిర్లక్ష్యమే నిండా ముంచింది! ఈ మెగా టోర్నీ లో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్, శ్రీలంకలాంటి గట్టి జట్లు 400, 350 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసేస్తుంటే చిన్న స్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కనీసం 160 పరుగులైనా చేయలేకపోయింది. ఓపెనర్ బెయిర్‌స్టో నుంచి లోయర్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వోక్స్ (0) దాకా బ్యాటింగ్ సామర్థ్యమున్న జట్టు... మేం ఆడేది వరల్డ్‌కప్ మ్యాచ్ కాదన్నట్లు, మాకేం పట్టనట్లు ఆద్యంతం నిర్లక్ష్యం కనబరిచింది. స్టోక్స్ ముందు, తర్వాత ఇంకెవరూ అసలు చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. రూట్ (3), కెపె్టన్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్ (1), మొయిన్ అలీ (15) అంతా లంక బౌలింగ్‌కు దాసోహమయ్యారు. ఆదిల్ ఆదమరుపు కీపర్ డైరెక్ట్ త్రో మెరుపు ఇంగ్లండ్ ప్లేయర్ ఆదిల్ రషీద్ తన నిర్లక్ష్యంతో నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో వికెట్‌ను పారేసుకున్నాడు. 32వ ఓవర్లో తీక్షణ వేసిన ఐదో బంతి లెగ్‌సైడ్ దిశగా నేరుగా కీపర్ కుశాల్ మెండిస్ చేతుల్లో పడింది. అవతలి వైపున్న రషీద్ క్రీజు వెలుపల ఉన్నాడు. ఇది గమనించిన మెండిస్ గ్లౌజ్ తీసి బుల్లెట్ వేగంతో నాన్‌స్ట్రయిక్ ఎండ్ వికెట్లను గిరాటే వేయడంతో రషీద్ రనౌటయ్యాడు. రషీద్ అవుటయ్యాక మరో తొమ్మిది బంతులకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) ధనంజయ (బి) రజిత 30; మలాన్ (సి) కుశాల్ మెండిస్ (బి) మాథ్యూస్ 28; జో రూట్ (రనౌట్) 3; స్టోక్స్ (సి) హేమంత (సబ్) (బి) లహిరు 43; బట్లర్ (సి) కుశాల్ మెండిస్ (బి) లహిరు 8; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లహిరు 1; అలీ (సి) పెరీరా (బి) మాథ్యూస్ 15; వోక్స్ (సి) సమరవిక్రమ (బి) రజిత 0; విల్లే (నాటౌట్) 14; ఆదిల్ రషీద్ (రనౌట్) 2; వుడ్ (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) తీక్షణ 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (33.2 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–45, 2–57, 3–68, 4–77, 5–85, 6–122, 7–123, 8–137, 9–147, 10–156. బౌలింగ్: మదుషంక 5–0–37–0, కసున్ రజిత 7–0–36–2, తీక్షణ 8.2–1–21–1, మాథ్యూస్ 5–1–14–2, లహిరు కుమార 7–0–35–3, ధనంజయ 1–0–10–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (నాటౌట్) 77; కుశాల్ పెరీరా (సి) స్టోక్స్ (బి) విల్లే 4; కుశాల్ మెండిస్ (సి) బట్లర్ (బి) విల్లే 11; సమరవిక్రమ (నాటౌట్) 65; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (25.4 ఓవర్లలో 2 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–9, 2–23. బౌలింగ్: వోక్స్ 6–0–30–0, డేవిడ్ విల్లే 5–0–30–2, ఆదిల్ రషీద్ 4.4–0–39–0, మార్క్ వుడ్ 4–0–23–0, లివింగ్‌స్టోన్ 3–0–17–0, మొయిన్ అలీ 3–0–21–0. ప్రపంచకప్‌లో నేడు పాకిస్తాన్ X దక్షిణాఫ్రికా వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మ్యాక్స్‌వెల్ విధ్వంసం
న్యూఢిల్లీ: ప్రత్యర్థులు బహు పరాక్! వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా ఫామ్‌లోకి వచ్చేసింది. క్రికెట్ కూన నెదర్లాండ్స్‌ను హడలెత్తించింది. ఏకంగా 309 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా... వన్డే ఫార్మాట్ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. తన ఫామ్ కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ చేయగా... స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) నెదర్లాండ్స్ బౌలర్ల భరతం పట్టి... వీర విధ్వంసం సృష్టించి... ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. 40 బంతుల్లో మ్యాక్స్‌వెల్ 100 పరుగులు పూర్తి చేసి ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ (49 బంతుల్లో) సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా (3–0–8–4) మూడు ఓవర్లతోనే స్పిన్ ఉచ్చు బిగించాడు. దంచుడు వార్నర్‌తో మొదలైతే... నాలుగో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ (9) అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో డచ్ శిబిరానికి కలిగిన ఆనందం ఇదొక్కటే! తర్వాతంతా అలసిపోవడమే! ఎందుకంటే అప్పటికే క్రీజులో ఉన్న వార్నర్గానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లబు షేన్‌లు గానీ నెదర్లాండ్స్‌పై కనీస దయ చూపలేదు. బంతిని వదల్లేదు. ఫీల్డర్లను విడిచిపెట్టలేదు. బంతిని, బౌలర్లు, ఫీల్డర్లను కలిపి బలిపీఠం ఎక్కించినట్లుగా వీరబాదుడు బాదేశారు. స్మిత్ 53 బంతుల్లో, వార్నర్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్మిత్ వెనుదిరిగాడు. తర్వాత లబుõÙన్ (42 బంతుల్లో) ఫిఫ్టీ కొడితే... వార్నర్ (91 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 84 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో వచ్చి... 40 బంతుల్లో శతక్కొట్టి... ఓ సెంచరీ, ఇద్దరి ఫిఫ్టీలతోనే ఆసీస్ కథ ముగియలేదు. 39వ ఓవర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్‌లో తన బ్యాట్‌తో కొత్త రాత (రికార్డు) రాశాడు. 48 ఓవర్లలో ఆసీస్ స్కోరు 361/6. మ్యాక్సీ (75 పరుగులతో) సెంచరీకి దూరంగానే ఉన్నాడు. కానీ లీడే వేసిన 49 ఓవర్లో 4, 4, 6, 6, నోబ్ 6, 1, 0లతో ఏకంగా 28 పరుగులు పిండుకోవడంతో 40 బంతుల్లోనే ఎవరి ఊహకందని విధంగా శతకం పూర్తయ్యింది. 115 వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నెదర్లాండ్స్ ప్లేయర్ లీడే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో లీడే 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిక్ లూయిస్ (0/113; 2006లో దక్షిణాఫ్రికాపై), ఆడమ్ జంపా (0/113; 2023లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న రికార్డును లీడే అధిగమించాడు. 6 ప్రపంచకప్‌లో ఆరో సెంచరీతో వార్నర్ ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. రోహిత్ శర్మ (7) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 9; వార్నర్ (సి) ఆర్యన్ (బి) వాన్ బిక్ 104; స్మిత్ (సి) మెర్వ్ (బి) ఆర్యన్ 71; లబుషేన్ (సి) ఆర్యన్ (బి) లీడే 62; ఇంగ్లిస్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 14; మ్యాక్స్‌వెల్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బిక్ 106; గ్రీన్ (రనౌట్) 8; కమిన్స్ (నాటౌట్) 12; స్టార్క్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–28, 2–160, 3–244, 4–266, 5–267, 6–290, 7–393, 8–393. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–59–1, అకెర్మన్ 3–0–19–0, వాన్ బిక్ 10–0–74–4, మికెరన్ 10–0–64–0, విక్రమ్‌జీత్ 4–0–27–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–41–0, బస్ డి లీడే 10–0–115–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (రనౌట్) 25; మ్యాక్స్ ఓ డౌడ్ (బి) స్టార్క్ 6; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హాజల్‌వుడ్ 10; సైబ్రాండ్ (సి) వార్నర్ (బి) మార్ష్ 11; లీడే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 4; ఎడ్వర్డ్స్ (నాటౌట్) 12; తేజ (సి) ఇంగ్లిస్ (బి) మార్ష్ 14; వాన్ బిక్ (సి) ఇంగ్లిస్ (బి) జంపా 0; వాన్‌డెర్ మెర్వ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; ఆర్యన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 1; మికెరన్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (21 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–28, 2–37, 3–47, 4–53, 5–62, 6–84, 7–86, 8–86, 9–90, 10–90. బౌలింగ్: స్టార్క్ 4–0–22–1, హాజల్‌వుడ్ 6–0–27–1, కమిన్స్ 4–0–14–1, మార్ష్ 4–0–19–2, జంపా 3–0–8–4. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కూ హార్దిక్ పాండ్యా దూరం
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈనెల 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా చీలమండ గాయానికి గురైన పాండ్యా 22న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేకపోయాడు. ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కూ హార్దిక్ దూరమయ్యాడు. నేడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పాండ్యా ఫిట్నెస్ పరీక్షలో పాల్గొంటాడు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా పాండ్యా జాతీయ జట్టుకు మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలుస్తుంది. -
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్‌తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్‌కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్‌స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా భారీ విజయం
ముంబై: వరల్డ్‌కప్-2023లో సౌతాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్ సఫారీలు 149 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిపోయిన సౌతాఫ్రికా.. ఆపై బౌలింగ్‌లో కూడా విశ్వరూపం ప్రదర్శించింది. సఫారీల బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ 233 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఆటగాళ్లలో మహ్మదుల్లా(111) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా బంగ్లాకు ఘోర పరాజయం ఎదురైంది.ఇది బంగ్లాదేశ్‌కు నాల్గో ఓటమి కాగా, దక్షిణాఫ్రికాకు నాల్గో విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. -
షమీ 5 కోహ్లి 95 భారత్ 5
1, 2, 3, 4, 5... ఐదు మ్యాచ్‌లు మనవే! మైదానంలోకి దిగిన ప్రతీసారి విజయం మన జట్టునే వరించింది... ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ లెక్క కూడా తేల్చేశాం... ఐదుసార్లూ ప్రత్యర్థి లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్నింటినీ ఛేదించేశాం... ఫలితంగా వరల్డ్ కప్‌లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో మళ్లీ పైచేయి సాధించింది... టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సమరంలో రోహిత్ బృందానికే గెలుపు దక్కింది. ప్రపంచకప్‌లో 20 మ్యాచ్‌లు జరిగినా హోరాహోరీ సమరం కనిపించలేదనేవారికి ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చింది. పలు మలుపులతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 బంతుల ముందు భారత్ గట్టెక్కింది. 19/2 నుంచి 243/4కు చేరిన కివీస్‌ను 273కే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది. గత మ్యాచ్‌లకు భిన్నంగా కొంత తడబడి ఆరు వికెట్లు చేజార్చుకున్నా... చివరకు ఫలితం దక్కింది. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో షమీ 5 వికెట్లతో చెలరేగగా... కోహ్లి తనదైన శైలిలో నిలబడి పరుగులను వేటాడినా త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ గెలుపు బావుటా ఎగరేసిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రచిన్ రవీంద్ర (87 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని నిలువరించాడు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగగా, రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (44 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. భారీ భాగస్వామ్యం... ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాన్వే (0)ను సిరాజ్ అవుట్ చేయగా, ఈ ప్రపంచకప్‌లో తాను వేసిన తొలి బంతికే యంగ్ (17)ను షమీ అవుట్ చేశాడు. అయితే రచిన్, మిచెల్ మూడో వికెట్ భాగస్వామ్యం కివీస్‌ను కోలుకునేలా చేసింది. మరో 25 ఓవర్లపాటు వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లందరినీ కట్టడి చేసిన కుల్దీప్ బౌలింగ్‌లో వీరు వేగంగా పరుగులు రాబట్టారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రచిన్ ఇచ్చిన (షమీ బౌలింగ్‌లో) సునాయాస క్యాచ్‌ను జడేజా వదిలేశాడు! దీనిని రచిన్ సమర్థంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 60 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. 69 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు. ఎట్టకేలకు రచిన్‌ను వెనక్కి పంపి షమీ ఈ జోడీని విడదీశాడు. లాథమ్ (5) విఫలం కాగా 100 బంతుల్లో మిచెల్ శతకాన్ని అందుకొని ప్రపంచకప్‌లో భారత్‌పై సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. 243/4తో మెరుగైన స్థితిలో కనిపించిన జట్టు భారత బౌలర్ల ధాటికి చివరి 6 ఓవర్లలో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. జడేజా అండగా... భారత్‌కు ఛేదనలో రోహిత్ మరోసారి అద్భుత ఆరంభాన్ని అందించాడు. బౌల్ట్, హెన్రీల బౌలింగ్‌లో చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో దూసుకుపోయాడు. అతనికి శుబ్‌మన్ గిల్ (31 బంతుల్లో 26; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే ఫెర్గూసన్ 7 బంతుల వ్యవధిలో వీరిద్దరిని వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి పట్టుదలగా నిలబడిన తీరు భారత్‌కు గెలుపు అవకాశాలు సృష్టించింది. శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)లతో పాటు చివర్లో జడేజాతో కోహ్లి మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఒకదశలో 47 బంతుల్లో 28 పరుగులే చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. సమన్వయలోపంతో సూర్యకుమార్ (2) రనౌటైన తర్వాత కోహ్లి, టోర్నీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన జడేజా జత కలిశారు. ఆ సమయంలో 16.1 ఓవర్లలో మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ జట్టును లక్ష్యంవైపు నడిపించారు. కివీస్ బౌలర్లు అప్పుడప్పుడు కొన్ని మంచి బంతులతో ఒత్తిడి పెంచగలిగినా... భారత్ గెలుపును ఆపలేకపోయారు. పాండ్యా, శార్దుల్ స్థానాల్లో షమీ, సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చారు. ఈసారి సెంచరీ దక్కలేదు! మ్యాచ్‌లో ఒకవైపు భారత్ గెలుపు అవకాశాలు మెరుగవుతూ రాగా, మరోవైపు కోహ్లి సెంచరీ చేసి సచిన్‌ను సమం చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో రాహుల్‌లాగే ఈసారి జడేజా కూడా సహకరించడంతో ఆఖర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కోహ్లి ఒక్కడే చేసి శతకానికి చేరువయ్యాడు. జట్టుకు 35, కోహ్లికి 25 పరుగులు అవసరమైనప్పుడు ఉత్కంఠ పెరిగింది. ఆపై ఈ సమీకరణం 19 పరుగులు, 18 పరుగులకు మారింది. అయితే బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కోహ్లి 6, 4 సహా 11 పరుగులు రాబట్టి 93కు చేరుకున్నాడు. ఇప్పుడు 7 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. అయితే మూడో బంతిని భారీ సిక్సర్‌గా మలచి ముగించే ప్రయత్నంలో బౌండరీ లైన్‌కు చాలా ముందే క్యాచ్ ఇచ్చాడు. దాంతో అతను ప్రస్తుతానికి 48 సెంచరీల వద్దే నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; యంగ్ (బి) షమీ 17; రచిన్ (సి) గిల్ (బి) షమీ 75; మిచెల్ (సి) కోహ్లి (బి) షమీ 130; లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 5; ఫిలిప్స్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 23; చాప్మన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; సాన్‌ట్నర్ (బి) షమీ 1; హెన్రీ (బి) షమీ 0; ఫెర్గూసన్ (రనౌట్) 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 273. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–178, 4–205, 5–243, 6–257, 7–260, 8–260, 9–273, 10–273. బౌలింగ్: బుమ్రా 10–1–45–1, సిరాజ్ 10–1– 45–1, షమీ 10–0–54–5, జడేజా 10–0– 48–0, కుల్దీప్ 10–0–73–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఫెర్గూసన్ 46; గిల్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 26; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 95; అయ్యర్ (సి) కాన్వే (బి) బౌల్ట్ 33; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాన్‌ట్నర్ 27; సూర్యకుమార్ (రనౌట్) 2; జడేజా (నాటౌట్) 39; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (48 ఓవర్లలో 6 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–71, 2–76, 3–128, 4–182, 5–191, 6–269. బౌలింగ్: బౌల్ట్ 10–0–60–1, హెన్రీ 9–0–55–1, సాన్‌ట్నర్ 10–0–37–1, ఫెర్గూసన్ 8–0–63–2, రచిన్ 9–0–46–0, ఫిలిప్స్ 2–0–12–0. ప్రపంచకప్‌లో నేడు పాకిస్తాన్ Xఅఫ్గానిస్తాన్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అఫ్గాన్ స్పిన్‌కు పాక్ ఎదురునిలిచేనా?
చెన్నై: ప్రపంచకప్‌లో మళ్లీ గెలుపుబాట పట్టాలని పాకిస్తాన్... మరో సంచలనంపై కన్నేసిన అఫ్గానిస్తాన్ సమరానికి సై అంటున్నాయి. బాబర్ ఆజమ్ బృందంతో పోల్చితే ఏ రకంగా చూసినా కూడా అఫ్గాన్ కూనే! అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లపై 270 పైచిలుకు పరుగులు చేయడం, మ్యాచ్‌ను పలుపు తిప్పే స్పిన్నర్లు ఉండటంతో హష్మతుల్లా షాహిది జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక పాక్ విషయానికే వస్తే వరుసగా భారత్, ఆ్రస్టేలియా చేతుల్లో ఓడిన జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. గెలిస్తే సెమీఫైనల్ రేసులో నిలుస్తుంది. లేదంటే మరింత ఒత్తిడిలో కూరుకుపోతుంది. వరుసబెట్టి గెలవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవొచ్చు. కాబట్టి అబ్దుల్లా షఫీక్, ఇమాముల్లతో కూడిన టాపార్డర్, రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్లతో ఉన్న మిడిలార్డర్ బాధ్యతగా ఆడాలి. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిదికి మిగతా సీమ్ సహచరులు కూడా తోడైతే అఫ్గాన్‌ను ఆదిలోనే కట్టడి చేయొచ్చు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గానిస్తాన్ తర్వాత రన్నరప్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ ఫలితం పక్కన బెడితే మ్యాచ్‌కు వేదికైన ఇక్కడి చెపాక్ పిచ్ స్పిన్‌కు కలిసొచ్చేది. అఫ్గాన్ జట్టులోని స్పిన్ వనరులకు (రషీద్, నబీ, ముజీబ్) ఈ పిచ్ సహకరిస్తే పాక్‌పై సంచలనం తప్పకుండా ఆశించవచ్చు. బ్యాటింగ్ దళం కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ హష్మతుల్లాసహా గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మ త్ షాలు నిలకడగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఏమాత్రం ఆదమరిచినా కష్టాలు తప్పవు. జట్లు (అంచనా) పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్ ), షఫీక్, ఇమాముల్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, నవాజ్, ఉసామ మీర్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, రవూఫ్. అఫ్గానిస్తాన్: హష్మతుల్లా (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, రహ్మత్ షా, ఒమర్జాయ్, ఇక్రామ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నవీనుల్, ఫరూఖీ. 7 వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఏడు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టే గెలిచింది. ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో (2019) ఒకసారి తలపడ్డాయి. పాకిస్తాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
భారత్ Vs కివీస్: హార్ధిక్ స్థానంలో ఎవరు?
ధర్మశాల: క్రికెట్ అభిమానుల కోసం మరో ఆదివారం అసలైన వినోదానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న జట్లు నేడు జరిగే పోరులో ముఖాముఖీ తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో టీమిండియా చెలరేగిపోతుండగా...ఫేవరెట్లుగా భావించిన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను వెనక్కి నెట్టి గత రన్నరప్ న్యూజిలాండ్ ముందుకు దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకునేందుకు జరిగే ఈ పోరులో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. పాండ్యా స్థానంలో ఎవరు? జోరు మీదున్న భారత్‌కు గత మ్యాచ్ తర్వాత అనూహ్య సమస్య వచ్చింది. గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఎవరిని ఎంచుకుంటారనేది కీలకంగా మారింది. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే నేరుగా షమీకి అవకాశం దక్కవచ్చు. అయితే బ్యాటింగ్ బలహీనంగా మారే అవకాశం ఉంది. దాంతో సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. అలా చేస్తే శార్దుల్ ఠాకూర్ పూర్తి స్థాయిలో ఐదో బౌలర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాశం. రోహిత్, కోహ్లి, గిల్, రాహుల్ అద్భుత ఆటతో కొనసాగిపోతున్నారు. రోహిత్, కోహ్లి దూకుడు భారత్‌కు మరో సారి గెలుపు అవకాశాలు సృష్టించగలదు. ఇప్పటి వరకు టీమిండియాకు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు పరీక్షించే అవకాశం రాలేదు. కానీ కివీస్ బౌలర్లు చెలరేగితే వారు కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. బుమ్రా, సిరాజ్‌లతో పేస్ బౌలింగ్ పదునుగా ఉంది. కుల్దీప్ను ఒక్క ప్రత్యర్థి కూడా సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. జడేజా స్పిన్ కూడా కివీస్‌ను కట్టడి చేయగలదు. అదే జట్టుతో... మొదటినుంచీ కివీస్ నమ్ముకున్న సమష్టితత్వమే ఆ జట్టును గెలిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌లలో కూడా అది కనిపించింది. ఒకరు విఫలమైతే మరొకరు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. అందుకే న్యూజిలాండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. విలియమ్సన్, సౌతీ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు. కాన్వే, యంగ్ శుభారంభాలు అందిస్తుండగా రచిన్, లాథమ్ దానిని కొనసాగిస్తున్నారు. ఫిలిప్స్, చాప్మన్ మెరుపులు జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నాయి. ఇక పేస్ బౌలింగ్ దళం చాలా పదునుగా ఉంది. బౌల్ట్, హెన్రీలను ఎదుర్కోవడం భారత్‌కు అంత సులువు కాదు. వీరితో పాటు ఫెర్గూసన్, సాన్‌ట్నర్ కూడా సత్తా చాటగలరు. పిచ్, వాతావరణం పిచ్‌పై కాస్త పచ్చిక ఉంటుంది. స్వింగ్, బౌన్స్‌కు మంచి అనుకూలం. పేసర్లకు సానుకూలాంశం. బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగులు రావచ్చు. మ్యాచ్ రోజు చల్లటి వాతావరణం ఉంటుంది. వర్షసూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్, సాన్‌ట్నర్, హెన్రీ, ఫెర్గూసన్, బౌల్ట్ -
క్లాసెన్ కమాల్ ఇంగ్లండ్ ఢమాల్
డిఫెండింగ్ చాంపియన్ ఆట ఇంతేనా అనిపించేలా... అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో చెత్త ప్రదర్శన చూపిస్తూ... ఇంగ్లండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కొత్త వ్యూహం, కీలక మార్పులతో బరిలోకి దిగి టాస్ నెగ్గిన అనుకూలతను కూడా సొమ్ము చేసుకోలేక చేతులెత్తేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడానికి వచ్చిన జట్టు టి20లా 22 ఓవర్లకే ఆలౌట్ కావడమేంటి... కూన అఫ్గాన్ చేతిలో ఓడిన జట్టు ఇక ఆదమరిస్తే కురదని అన్నీ అస్త్ర శస్త్రాలకు పదునుపెట్టి బలమైన ప్రత్య ర్థితో సై అంటుంది. కానీ ఇంగ్లండ్ తీరు చూస్తే అస్త్ర శస్త్రాలన్నీ అటకమీద పెట్టి మైదానంలో ఏదోలా ఆడేందుకు వచ్చినట్లుగా అనిపించింది. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం నెదర్లాండ్స్ చేతిలో ఓడిన చేదు అనుభవాన్ని మరచి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. బ్యాటర్ల బాధ్యత, అందరి బౌలర్ల సమష్టి కృషి వరల్డ్‌కప్‌లో సఫారీలకు అసాధారణ విజయాన్నిచ్చింది. ఈ గెలుపులోక్లాసెన్, జాన్సెన్ జట్టు హీరోలుగా నిలిచారు. ముంబై: ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్‌లా ఆడలేదు. దక్షిణాఫ్రికాలాంటి పటిష్టమైన జట్టు చేతిలో సాదాసీదా క్రికెట్ కూనలా ఓడింది. బౌలింగ్‌లో విలాపం, బ్యాటింగ్‌లో వైఫల్యంతో ఇంగ్లండ్ చిత్తయింది. శనివారం జరిగిన ప్రపంచకప్‌లో పోరులో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ని ర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (67 బంతుల్లో 109; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సునామీ ఆటతో సెంచరీ సాధించగా, రీజా హెండ్రిక్స్ (75 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో జాన్సెన్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), వాన్‌డర్ డసెన్ (61 బంతుల్లో 60; 8 ఫోర్లు) చెలరేగారు. హెండ్రిక్, డసెన్ 116 బంతుల్లో 121 పరుగులు జోడించగా... క్లాసెన్, జాన్సెన్ ఓవర్‌కు 12 పరుగుల రన్‌రేట్‌తో 12.5 ఓవర్లలోనే 151 పరుగులు జత చేయడం విశేషం. 61 బంతుల్లోనే క్లాసెన్ సెంచరీ పూర్తయింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 22 ఓవర్లు మాత్రమే ఆడి 170 పరుగుకే కుప్పకూలింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్ వుడ్ (17 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తప్ప ఇంకెవరూ చెప్పుకునేంత స్కోరు, జట్టు పరువు నిలిపే పోరాటమైనా చేయలేకపోయారు. ప్రధాన బ్యాటర్లంతా విఫలం కాగా, చివర్లో వుడ్ పోరాటం ఆ జట్టు అట్టడుగునకు చేరకుండా ఆపింది. 400 పరుగుల లక్షాన్ని చూడగానే భీతిల్లినట్లుగా ఇంగ్లండ్ బ్యాటింగ్ వరుస కునారిల్లింది. టాపార్డర్‌లో బెయిర్ స్టో (10), మలాన్ (6), రూట్ (2) కలిపి చేసిన స్కోరు 18 దాటలేదు. మిడిలార్డర్లో బ్రూక్ (17), బట్లర్ (15), విల్లీ (12) రెండంకెల స్కోర్లు చేశారంతే. టెయిలెండర్ అట్కిన్సన్ (21 బంతుల్లో 35; 7 ఫోర్లు) కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచాడు. తాజా ఫలితంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) బట్లర్ (బి) టాప్లీ 4; హెండ్రిక్స్ (బి) రషీద్ 85; డసెన్ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్ 60; మార్క్రమ్ (సి) బెయిర్‌స్టో (బి) టాప్లీ 42; క్లాసెన్ (బి) అట్కిన్సన్ 109; మిల్లర్ (సి) స్టోక్స్ (బి) టాప్లీ 5; జాన్సెన్ నాటౌట్ 75; కోయెట్జీ (సి) సబ్–లివింగ్‌స్టోన్ (బి) అట్కిన్సన్ 3; కేశవ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–4, 2–125, 3–164, 4–233, 5–243, 6–394, 7–398. వికెట్ల పతనం: 1–4, 2–125, 3–164, 4–233, 5–243, 6–394, 7–398. బౌలింగ్: టాప్లీ 8.5–0–88–3, విల్లీ 9–1–61–0, రూట్ 6.1–0–48–0, అట్కిన్సన్ 9–0–60–2, వుడ్ 7–0–76–0, ఆదిల్ రషీద్ 10–0–61–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్ స్టో (సి) డసెన్ (బి) ఇన్‌గిడి 10; మలాన్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 6; జో రూట్ (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 2; స్టోక్స్ (సి) అండ్ (బి) రబడ 5; బ్రూక్ (ఎల్బీ) (బి) కోయెట్జీ 17; బట్లర్ (సి) డికాక్ (బి) కోయెట్జీ 15; విల్లీ (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; ఆదిల్ రషీద్ (సి) హెండ్రిక్స్ (బి) కోయెట్జీ 10; అట్కిన్సన్ (బి) కేశవ్ 35; వుడ్ నాటౌట్ 43; టోప్లీ ఆబ్సెంట్హర్ట్ ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (22 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–18, 2–23, 3–24, 4–38, 5–67, 6–68, 7–84, 8–100, 9–170. బౌలింగ్: ఇన్‌గిడి 5–1–26–2, జాన్సెన్ 5–0–35–2, రబడ 6–1–38–1, కోయెట్జీ 4–0–35–3, కేశవ్ 2–0–27–1. -
‘బౌల్ట్ నవ్వును చూసి మోసపోవద్దు’
(గౌతం గంభీర్) : భారత జట్టుకు సంబంధించి అసలు పరీక్ష ఇప్పుడే మొదలు కానుందని నా భావన. ఫామ్‌లో లేని ఆసీస్‌ను, పసికూన అఫ్గన్‌ను, అనిశ్చితితో ఆడే పాక్‌ను, బలహీన బంగ్లాను ఓడించి మనల్ని మనం అభినందించుకున్నాం. సమష్టితత్వంతో ఆడే కివీస్‌తో నేడు తలపడనుండగా, ఆ తర్వాత పదునైన ఇంగ్లండ్, జోరు మీదున్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రత్యర్థి జట్లు గానీ, పరిస్థితులు గానీ మనల్ని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి సవాల్ ఈ రోజు ఎదురు కావచ్చు. ముఖ్యంగా పాండ్యా లేని లోటుతో జట్టు కూర్పు కూడా కీలకం కానుంది. వరల్డ్ కప్ ముందు ఆసీస్‌తో సిరీస్‌లో పాండ్యా ఆడలేదు. అప్పుడు సూర్యకుమార్ ఆరో స్థానంలో ఆడగా, శార్దుల్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లలో ఒకడిగా బరిలో నిలిచాడు. ఇప్పుడు కూడా దానినే అమలు చేయవచ్చు. సూర్య ప్రత్యేకమైన ఆటగాడు కాగా ధర్మశాల పిచ్ సీమర్లను అనుకూలిస్తే శార్దుల్ కీలకం కాగలడు. ధర్మశాల పిచ్‌కు స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే నేరుగా పాండ్యా స్థానంలో అశ్విన్‌ను తీసుకోవడం సరైంది. నేటి పోరు భారత బ్యాటింగ్, కివీస్ బౌలింగ్ మధ్య జరగనుంది. రోహిత్ మరోసారి పదునైన లెఫ్టార్మ్ పేసర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. స్టార్క్, షాహిన్, ముస్తఫిజుర్లతో పోలిస్తే బౌల్ట్ చాలా ప్రమాదకారి. అతను చిరునవ్వు మొహాన్ని చూసి మోసపోవద్దు. ఆ ముగ్గురికంటే ఇతని బౌలింగ్‌లో పదును చాలా ఎక్కువ. దూకుడైన ఆటతో రోహిత్ ఈ ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేశాడు. అన్ని ఇన్నింగ్స్‌లలోనూ చివరి వరకు అతను జోరు కొనసాగించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గిల్‌కు కూడా అతను ఇదే విషయం చెప్పాలి. ఆరంభంలో పరుగులు రాకపోతే విసుగు చెందవద్దు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడం ముఖ్యం. పవర్‌ప్లేలోనే భారత్‌ను దెబ్బ తీసేందుకు కివీస్ ప్రయత్నిస్తుంది. -
చెలరేగిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్‌పై గెలిచిన ఆస్ట్రేలియా
బెంగళూరు: వరుస ఓటమిల నుంచి తేరుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పుంజుకుంది. వార్నర్, మార్ష్ ల మెరుపులతో పాటు స్టొయినిస్ సూపర్ స్పెల్, ఆడమ్ జంపా స్పిన్ ఆసీస్‌ను గెలిపించాయి. శుక్రవారం జరిగిన ప్రపంచకప్ పోరులో ఆ్రస్టేలియా 62 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (108 బంతుల్లో 121; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతక్కొట్టారు. షాహిన్ అఫ్రిదికి 5 వికెట్లు దక్కాయి. తర్వాత పాకిస్తాన్ 45.3 ఓవర్లలో 305 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (71 బంతుల్లో 70; 10 ఫోర్లు), అబ్దుల్లా షఫిక్ (61 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. జంపా 4, స్టొయినిస్ 2 వికెట్లు తీశారు. సిక్సర్ల హోరు వార్నర్ లాంటి డాషింగ్ ఓపెనర్‌కు 10, 105 స్కోర్ల వద్ద ఏకంగా రెండుసార్లు లైఫ్‌లు వస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో పాక్‌కు తెలిసొచ్చేలా చేశాడు. మరోవైపు మార్ష్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మైదానం సిక్సర్లతో హోరెత్తింది. వార్నర్ 85 బంతుల్లో వన్డేల్లో 21 సెంచరీని పూర్తి చేసుకోగా, మార్ష్ 100 బంతుల్లో రెండో శతకం సాధించాడు. 259 స్కోరు వద్ద మార్ష్ ను షాహిన్ అవుట్ చేయడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. మ్యాక్స్‌వెల్ (0), స్మిత్ (7)లు నిరాశపరిచినా... వార్నర్ ధాటి కొనసాగింది. 325 స్కోరు వద్ద రవూఫ్ అతని జోరుకు బ్రేకులేయడంతో 38 పరుగుల స్వల్ప వ్యవధిలో ఆసీస్ 6 వికెట్లను కోల్పోయింది. అప్పుడు... ఇప్పుడు... 12 ఏళ్ల క్రితం భారత ఉపఖండంలో జరిగిన 2011 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై పల్లెకెలెలో లంక ఓపెనర్లు దిల్షాన్, తరంగ 282 పరుగులతో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు భారత్‌లో రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని ఆసీస్ ఓపెనర్లు వార్నర్, మార్ష్ లు సాధించారు. తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించారు. మొత్తం 13 వరల్డ్‌కప్‌ల చరిత్రలో ఓపెనర్లు శతక్కొట్టడం ఇది నాలుగోసారి మాత్రమే! పాక్ జోడీదీ అదే బాట పాకిస్తాన్‌తో పోల్చితే ఆ్రస్టేలియా బౌలింగ్ దళం పదునైంది. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ అంతా నిప్పులు చెరిగే సమర్థులే! కానీ ఈ త్రయం పాక్ ఓపెనింగ్ జోడీని 21 ఓవర్లదాకా ప్రభావమే చూపలేకపోయింది. స్పిన్నర్లు జంపా, మ్యాక్స్‌వెల్‌లను బరిలోకి దించినా... షఫిక్–ఇమాముల్ జోడీ యథేచ్చగా తమ పరుగుల జోరు కొనసాగించడంతో వీరి ఇన్నింగ్స్ కూడా ఆసీస్ ఇన్నింగ్స్‌లా పరుగుల పట్టాలెక్కింది. షఫీక్ 52 బంతుల్లో, ఇమాముల్ 54 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. అయితే స్టొయినిస్‌కు బంతిని అప్పగించాక పరిస్థితి మారింది. 134 స్కోరు వద్ద ఓపెనింగ్ జోడీని స్టొయినిస్ తొలి బంతికే విడగొట్టాడు. తన వరుస ఓవర్లలో షఫిక్, ఇమాముల్లను పెవిలియన్ చేర్చడంతో ఆట రూటు మారింది. జంపా స్పిన్ తిరగడంతో కెపె్టన్ బాబర్ ఆజమ్ (18), రిజ్వాన్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు), ఇఫ్తికార్ (20 బంతుల్లో 26; 3 సిక్సర్లు) ఎంతో సేపు నిలువలేదు. దీంతో పాక్ పరాజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) షాదాబ్ (సబ్) (బి) రవూఫ్ 163; మార్ష్ (సి) ఉసామ మీర్ (బి) షాహిన్ 121; మ్యాక్స్‌వెల్ (సి) బాబర్ (బి) షాహిన్ 0; స్మిత్ (సి అండ్ బి) ఉసామ మీర్ 7; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షాహిన్ 21; ఇంగ్లిస్ (సి) రిజ్వాన్ (బి) రవూఫ్ 13; లబుషేన్ (సి) షాదాబ్ (సబ్) (బి) రవూఫ్ 8; కమిన్స్ (నాటౌట్) 6; స్టార్క్ (సి) షకీల్ (బి) షాహిన్ 2; హాజల్‌వుడ్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 367. వికెట్ల పతనం: 1–259, 2–259, 3–284, 4–325, 5–339, 6–354, 7–360, 8–363, 9–363. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–1–54–5, హసన్ అలీ 8–0–57–0, ఇఫ్తికార్ 8–0–37–0, రవూఫ్ 8–0–83–3, ఉసామ మీర్ 9–0–82–1, నవాజ్ 7–0–43–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టొయినిస్ 64; ఇమాముల్ (సి) స్టార్క్ (బి) స్టొయినిస్ 70; బాబర్ (సి) కమిన్స్ (బి) జంపా 18; రిజ్వాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 46; షకీల్ (సి) స్టొయినిస్ (బి) కమిన్స్ 30; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 26; నవాజ్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 14; ఉసామ మీర్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 0; షాహిన్ అఫ్రిది (సి) లబుషేన్ (బి) కమిన్స్ 10; హసన్ అలీ (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 8; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 305. వికెట్ల పతనం: 1–134, 2–154, 3–175, 4–232, 5–269, 6–274, 7–277, 8–287, 9–301, 10–305. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–0–65–1, హాజల్‌వుడ్ 10–1–37–1, ప్యాట్ కమిన్స్ 7.3–0–62–2, ఆడమ్ జంపా 10–0–53–4, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5–0–40–0, స్టొయినిస్ 5–0–40–2. ప్రపంచకప్‌లో నేడు శ్రీలంక X నెదర్లాండ్స్ వేదిక: లక్నో ఉదయం గం. 10:30 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నాలుగోసారీ ఛేదించాం
మళ్లీ అదే వ్యూహం... అదే ఫలితం... పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం... ఆపై మెరుపు బ్యాటింగ్‌తో వేగంగా విజయాన్నందుకోవడం... 199, 272, 191, 256... ఇలా ప్రత్యర్థి స్కోర్లు మారడమే తప్ప భారత జట్టు ఆట మారలేదు... సమష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది... వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా తమ విజయాల స్కోరును 4/4గా మార్చుకుంది... బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌పై సులువైన విజయంతో రోహిత్ బృందం సత్తా చాటింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ నామమాత్రపు స్కోరుకు పరిమితం కాగా... రోహిత్, గిల్, కోహ్లి బ్యాటింగ్‌తో అలవోకగా భారత జట్టు లక్ష్యం చేరింది... చిన్నపాటి లక్ష్యంలో కూడా చివర్లో చెలరేగి కోహ్లి 48వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడం మ్యాచ్‌లో హైలైట్. పుణే: తిరుగులేని ప్రదర్శనతో భారత్ వరల్డ్‌కప్‌లో మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (82 బంతుల్లో 66; 7 ఫోర్లు), తన్జీద్ హసన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహ్ముదుల్లా (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ సాధించగా... గిల్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (40 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. భారత్ ఆదివారం జరిగే తమ తర్వాతి పోరులో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఓపెనర్ల జోరు... బంగ్లాకు ఓపెనర్లు తన్జీద్, దాస్ శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. శార్దుల్ తొలి ఓవర్లో తన్జీద్ వరుసగా 6, 4, 6 బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 41 బంతుల్లో తన్జీద్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని కుల్దీప్ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. అంతే...ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా విఫలమయ్యారు. 93/0తో ఒకదశలో పటిష్ట స్థితిలో కనిపించిన జట్టు వేగంగా వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (8), మిరాజ్ (3) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... 62 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న దాస్ వీరిని అనుసరించాడు. తౌహీద్ (16) బంతులు వృథా చేయగా, ముషి్ఫకర్ రహీమ్ (46 బంతుల్లో 38; 1 ఫోర్, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మన పటిష్ట బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. చివర్లో మహ్ముదుల్లా ధాటిగా ఆడటంతో బంగ్లా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గాయం కారణంగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ప్రధాన పేసర్ తస్కీన్ అహ్మద్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆట ఆరంభానికి ముందే బంగ్లా బలహీన పడింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో దూకుడు చూపిస్తూ వరుస బౌండరీలతో దూసుకుపోయాడు. మరోవైపు నసుమ్ ఓవర్లో 2 సిక్స్‌లతో జోరు పెంచిన గిల్... ముస్తఫిజుర్ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే హసన్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన రోహిత్ తర్వాతి బంతికి అదే తరహా షాట్ ఆడబోయి వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి బాధ్యత తీసుకోగా... 52 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత గిల్ నిష్క్రమించాడు. చూడచక్కటి షాట్లు ఆడిన కోహ్లి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... కోహ్లి, కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగా, వీరిని నిలువరించలేక బంగ్లా బౌలర్లు చేతులెత్తేశారు. 48 వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు కోహ్లి మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. రోహిత్ (31) మూడో స్థానంలో ఉన్నాడు. 4 వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో భారత జట్టుపై ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు/సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి మాత్రమే. ప్రత్యర్థి జట్టు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు/సెంచరీలు చేసిన మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓటమి చెందగా... నాలుగోసారి మాత్రం భారత్ గెలిచింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 51; లిటన్ దాస్ (సి) గిల్ (బి) జడేజా 66; నజ్ముల్ (ఎల్బీ) (బి) జడేజా 8; మిరాజ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 3; తౌహీద్ (సి) గిల్ (బి) శార్దుల్ 16; ముష్ఫికర్ (సి) జడేజా (బి) బుమ్రా 38; మహ్ముదుల్లా (బి) బుమ్రా 46; నసుమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 14; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; షరీఫుల్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–93, 2–110, 3–129, 4–137, 5–179, 6–201, 7–233, 8–248. బౌలింగ్: బుమ్రా 10–1–41–2, సిరాజ్ 10–0–60–2, పాండ్యా 0.3–0–8–0, కోహ్లి 0.3–0–2–0, శార్దుల్ 9–0–59–1, కుల్దీప్ 10–0–47–1, జడేజా 10–0–38–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) తౌహీద్ (బి) హసన్ 48; గిల్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 53; కోహ్లి (నాటౌట్) 103; అయ్యర్ (సి) మహ్ముదుల్లా (బి) మిరాజ్ 19; రాహుల్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (41.3 ఓవర్లలో 3 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–88, 2–132, 3–178. బౌలింగ్: షరీఫుల్ 8–0–54–0, ముస్తఫిజుర్ 5–0–29–0, నసుమ్ 9.3–0–60–0, హసన్ 8–0–65–1, మిరాజ్ 10–0–47–2, మహ్మదుల్లా 1–0–6–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఇక ఆసీస్‌తో ప్రమాదం
వరుస పరాజయాల అనంతరం ఆ్రస్టేలియా జట్టు ఎట్టకేలకు శ్రీలంకపై చక్కని విజయంతో ప్రపంచకప్‌లో బోణీ చేసింది. పట్టికలో చేరిన 2 పాయింట్లు ఆసీస్ శిబిరాన్ని సంబరంలో ముంచింది. ఓ కెప్టెన్ ముందుండి నడిపిస్తే దాని ప్రభావం జట్టుపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం రోహిత్ శర్మ భారత్‌ను ఎలా విజయవంతగా నడిపిస్తున్నాడో చూస్తే అర్థమవుతుంది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ లయ అందుకోవడం, స్పిన్నర్ జంపా తిప్పేయడంతో ‘కంగారూ జట్టు’ ఇకపై ప్రమాదకర శక్తిగా మారుతుంది. ఇదే విషయం వారి గత ఐదు ప్రపంచకప్ టైటిళ్ల ఘనమైన రికార్డు సూచిస్తుంది. మార్ష్ , లబుషేన్‌లతో పాటు స్మిత్ కూడా నిలకడగా ఆడితే బ్యాటింగ్ దళానికి తిరుగుండదు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు అఫ్గాన్, దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. ఇలా రోజుల వ్యవధిలోనే రెండు సంచలనాలు సెమీఫైనల్ బెర్త్‌ల రేసును రసవత్తరం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఆఖరి పది ఓవర్లలో డచ్ బ్యాటర్లు చెలరేగిన వైనం, బౌలింగ్‌లో సఫారీపై విసిరిన పంజా అద్భుతం. ఇలాంటి పరాజయం నుంచి దక్షిణాఫ్రికా ఎలా పుంజుకుంటుందో చూడాలి. నేడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగడం ఖాయం. ఎందుకంటే రెండు మ్యాచ్‌లు ఓడిన ఆసీస్ గెలుపుబాట పట్టగా, రెండు విజయాలు సాధించిన పాక్ ఓటమితో ఉంది. ఇలాంటి జట్ల మధ్య శుక్రవారం ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. యువ బ్యాటర్లు షఫిక్, ఇమాముల్, షకీల్‌లతో పాటు సీనియర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లు బ్యాట్ ఝుళిపిస్తే విజయం ఏమంత కష్టం కాదు. ఇక వేదిక గురించి చెప్పుకోవాల్సి వస్తే... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయం. ఇది ఎన్నోసార్లు పరుగుల మజా పంచింది. అలాగే నాణ్యమైన బౌలింగ్ రుచి చూపిస్తే... కట్టడి చేయొచ్చని కూడా ఐపీఎల్లో యజువేంద్ర చహల్ నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఎవరు మెరిపిస్తారో, ఎవరు కట్టడి చేస్తారో చూడాలి. -
హార్దిక్ పాండ్యాకు గాయం
ప్రపంచకప్ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్ మూడో బంతిని బ్యాటర్ దాస్ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేయడని బీసీసీఐ ప్రకటించింది. అతని కాలికి స్కాన్ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్ తర్వాత రోహిత్ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్ చేశాడు. -
భారత్ జోరుకు ఎదురుందా!
ఎప్పుడో 2007లో ప్రపంచకప్‌లో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడింది... ఆపై మూడు వరల్డ్ కప్‌లలో కూడా బంగ్లాను టీమిండియా చిత్తుగా ఓడించింది...ఇప్పుడు తాజా ఫామ్, బలాబలాలను బట్టి చూస్తే రోహిత్ సేనకు టోర్నీలో వరుసగా నాలుగో విజయం అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. తమ మొదటి పోరులో అఫ్గన్‌ను ఓడించినా... ఆపై రెండు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిన బంగ్లా మళ్లీ కోలుకునే ప్రయత్నంలో ఉంది. అయితే అన్ని రంగాల్లో అత్యంత పటిష్టంగా ఉన్న టీమిండియాను ఆ జట్టు నిలువరించడం దాదాపు అసాధ్యం కావచ్చు. పుణే: వరల్డ్ కప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మరో సమరానికి సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో మరో ఆసియా జట్టు బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ఇటీవలి ఆసియా కప్ సహా గత ఏడాది కాలంలో భారత్‌పై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 3–1తో బంగ్లాదేశ్‌కు మెరుగైన రికార్డు ఉంది. అయితే ప్రస్తుతానికి వచ్చే సరికి ఆ లెక్క ఇక్కడ పని చేయకపోవచ్చు. ఆసీస్, అఫ్గన్, పాక్‌లను అలవోకగా ఓడించిన టీమిండియాకు బంగ్లాపై కూడా అదే జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన ఆటగాళ్లెవరూ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న బంగ్లా ఎంత వరకు పోటీనిస్తుందనేది చూడాలి. 1998 తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. మార్పుల్లేకుండా... ఫామ్‌ను బట్టి చూస్తే సహజంగానే ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. గత రెండు మ్యాచ్‌లలో 131, 86 స్కోర్లతో సత్తా చాటిన రోహిత్ మళ్లీ చెలరేగితే బంగ్లాకు చుక్కలు చూపించగలడు. పాక్‌తో విఫలమైనా టోరీ్నలో ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేసిన కోహ్లి కూడా తన ధాటిని ప్రదర్శించగలడు. బంగ్లాదేశ్‌పై ఆడిన 15 వన్డేల్లో ఏకంగా 67.25 సగటుతో చెలరేగిన కోహ్లి 4 సెంచరీలూ బాదాడు. టాప్–5లో ఇతర బ్యాటర్లు గిల్, అయ్యర్, రాహుల్ కూడా చెలరేగిపోగలరు. రాహుల్ ప్రతీ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తుండగా, అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. పాండ్యా, జడేజా తమ ఆల్‌రౌండ్ పాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నారు. శార్దుల్ స్థానంలో కాస్త చర్చ కొనసాగుతున్నా...పిచ్‌ను బట్టి చూస్తే అతడినే కొనసాగించవచ్చు. పేస్ విభాగంలో కూడా బుమ్రా, సిరాజ్ జోరు మీదుండటంతో సీనియర్ షమీకి అవకాశం దక్కడం కష్టమే. మరో వైపు కుల్దీప్ ఇప్పటి వరకు కేవలం 3.9 ఎకానమీ నమోదు చేయడం చూస్తే అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. మూడు మ్యాచ్‌లలో కలిపి 28 ప్రత్యర్థి వికెట్లు తీసిన భారత్...మొత్తంగా 9 వికెట్లే కోల్పోయింది. ఆదుకునేదెవరు... భారత్‌పై పదహారేళ్ల క్రితం విజయంలో భాగమైన షకీబ్, ముషి్ఫకర్ బహుశా చివరి సారి వరల్డ్‌కప్‌లో భారత్‌తో కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చాలని పట్టుదలగా ఉన్నారు. ముషి్ఫకర్ రెండు అర్ధ సెంచరీలు సాధించినా షకీబ్ విఫలం కావడంతో జట్టుపై భారం పడుతోంది. మూడు మ్యాచ్‌లు ముగిసినా అతడినుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. నజు్మల్, దాస్ ఒకే మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించారు. కొత్త బ్యాటర్ తన్జీద్ కూడా ప్రభావం చూపలేకపోగా, ప్రపంచకప్‌కు ముందు అద్భుతంగా ఆడి అంచనాలు పెంచిన తౌహీద్ వరుసగా విఫలమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ మిరాజ్‌లోనూ నిలకడ లోపించింది. బౌలింగ్‌లో ముస్తఫిజుర్ మినహా అంతా విఫలమయ్యారు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, శార్దుల్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. బంగ్లాదేశ్: షకీబ్ (కెప్టెన్ ), తన్జీద్, దాస్, నజ్ముల్, తౌహీద్, ముష్ఫికర్, మిరాజ్, మహ్ముదుల్లా, తస్కీన్, షరీఫుల్, ముస్తఫిజుర్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. గతంలోనూ భారీగా పరుగులు వచ్చాయి. బుధవారం నగరంలో జల్లులు కురిసినా...మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. రోహిత్‌కు 3 జరిమానాలు... వరల్డ్ కప్‌లో 142 స్ట్రైక్‌రేట్‌తో దూసుకుపోతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రోడ్డుపై అంతకు మించిన వేగాన్ని ప్రదర్శించాడు. ముంబై–పుణే హైవేపై తన కారులో పరిమితికి మించిన వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ అధికారులు అతనిపై మూడు చలాన్లు విధించారు. భారత జట్టుతో చేరేందుకు ముంబైనుంచి తన కారులో పుణేకు వెళ్లిన రోహిత్ చాలా ప్రమాదకరంగా కారు నడిపాడని అధికారులు వెల్లడించారు. అతని అత్యధిక స్కోరు 264 నంబర్ ప్లేటుతో ఉన్న రోహిత్ ‘లాంబోర్గిని’ ఒక దశలో గంటకు 200–215 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయిందని సమాచారం. -
న్యూజిలాండ్ 4/4
చెన్నై: టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ ఎంచుకొని చేసిన తప్పుడు వ్యూహంతో పాటు ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేసిన వైఫల్యం చివరకు అఫ్గనిస్తాన్ భారీ ఓటమికి కారణంగా మారింది. తడబడుతూ ఇన్నింగ్స్ కొనసాగించి చివర్లో చెలరేగిన న్యూజిలాండ్, ఆపై బౌలింగ్‌లో సత్తా చాటగా...పేలవ బ్యాటింగ్‌లో అఫ్గన్ కుప్పకూలింది. దాంతో కివీస్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది. బుధవారం జరిగిన పోరులో కివీస్ 149 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ ఫిలిప్స్ (80 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెపె్టన్ లాథమ్ (74 బంతుల్లో 68; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్ యంగ్ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆరంభంలో 109/1తో పటిష్టంగా ఉన్న కివీస్ పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయి 110/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయినా సరే టీమ్ ఒక దశలో 44 ఓవర్లలో 210 పరుగులే చేసింది. కానీ చివరి 6 ఓవర్లలో బ్యాటర్లు చెలరేగడంతో ఏకంగా 78 పరుగులు సాధించగలిగింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా (62 బంతుల్లో 36; 1 ఫోర్) టాప్ స్కోరర్. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం రేపిన అఫ్గన్ గత వరల్డ్ కప్ రన్నరప్ ముందు అదే స్థాయి పోరాటపటిమ కనబర్చలేక చేతులెత్తేసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 20; విల్ యంగ్ (సి) ఇక్రామ్ (బి) ఒమర్జాయ్ 54; రచిన్ (బి) ఒమర్జాయ్ 32; మిచెల్ (సి) ఇబ్రహీమ్ (బి) రషీద్ 1; లాథమ్ (బి) నవీనుల్ 68; ఫిలిప్స్ (సి) రషీద్‌ఖాన్ (బి) నవీనుల్ 71; చాప్మన్ నాటౌట్ 25; సాన్‌ట్నర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–30, 2–109, 3–110, 4–110, 5–254, 6–255. బౌలింగ్: ముజీబ్ 10–0–57–1, ఫరూఖీ 7–1–39–0, నవీనుల్ 8–0–48–2, నబి 8–1–41–0, రషీద్ ఖాన్ 10–0–43–1, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–56–2. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) హెన్రీ 11; ఇబ్రహీమ్ (సి) సాన్‌ట్నర్ (బి) బౌల్ట్ 14, రహ్మత్ షా (సి) అండ్ (బి) రచిన్ 36; హష్మతుల్లా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 8; ఒమర్జాయ్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 27; ఇక్రామ్ నాటౌట్ 19; నబి (బి) సాన్‌ట్నర్ 7; రషీద్‌ఖాన్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 8; ముజీబ్ (సి) యంగ్ (బి) ఫెర్గూసన్ 4; నవీనుల్ (సి) చాప్మన్ (బి) సాన్‌ట్నర్ 0; ఫరూఖీ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో ఆలౌట్) 139. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–43, 4–97, 5–107, 6–125, 7–134, 8–138, 9–139, 10–139. బౌలింగ్: బౌల్ట్ 7–1–18–2, హెన్రీ 5–2–16–1, సాన్‌ట్నర్ 7.4–0–39–3, ఫెర్గూసన్ 7–1–19–3, ఫిలిప్స్ 3–0–13–0, రచిన్ రవీంద్ర 5–0–34–1. -
‘సఫారీ’కి డచ్ దెబ్బ
దాదాపు ఏడాది క్రితం...టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే మ్యాచ్...అనూహ్య ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ కంగుతినిపించింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొన్నప్పటికీ దక్షిణాఫ్రికా సూపర్ ఫామ్‌తో వార్ వన్‌సైడ్‌గా భావించారు.. నెదర్లాండ్స్ 27 ఓవర్లలో 112/6 స్కోరు చేయడం చూస్తే అందరూ అనుకున్నట్లే జరుగుతున్నట్లే అనిపించింది. అయితే ఇక్కడే సీన్ మారింది. మరో సంచలనానికి నాంది పలికే ఇన్నింగ్స్‌తో నాయకుడు ఎడ్వర్డ్స్ నడిపించాడు. తర్వాతి 16 ఓవర్లలో మరో 133 పరుగులు జోడించాడు. సారథి పడిన కష్టానికి, చేసిన పోరాటానికి న్యాయం చేసేందుకు బౌలర్లంతా శ్రమించడం పెను సంచలనానికి దారి తీసింది. ధర్మశాల: ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (69 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (52 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్), కేశవ్ మహరాజ్ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ రబడ, జాన్సెన్, ఇన్‌గిడిల బౌలింగ్‌కు నెదర్లాండ్స్ టాపార్డర్ బదులివ్వలేకపోయింది. విక్రమ్‌జీత్ (2), ఒడౌడ్ (18), అకెర్మన్ (12), బస్ డి లీడ్ (2), సై బ్రాండ్ (19), తేజ (20)... ఇలా ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే కెప్టెన్ ఎడ్వర్డ్స్ కనబరిచిన పోరాటం సంచలనానికి ఓ మెట్టు వేసింది. వాన్‌డెర్ మెర్వ్ (29)తో 8వ వికెట్‌కు 64 పరుగులు, ఆర్యన్ దత్ (23 నాటౌట్)తో అబేధ్యమైన 9వ వికెట్‌కు 41 పరుగులు ఎడ్వర్డ్స్ జతచేశాడు. సఫారీ విలవిల ఆడేది సులువైన ప్రత్యర్థి తో, ఎదురుగా ఉన్నది స్వల్ప లక్ష్యమే కానీ సఫారీ వల్ల అసాధ్యమైంది. నెదర్లాండ్ బౌలర్లు వాన్ డెర్ మెర్వ్, అకెర్మన్, మెకెరన్, వాన్ బీక్, డి లీడే కలిసికట్టుగా పిడికిలి బిగించడంతో...డి కాక్ (20), కెప్టెన్ బవుమా (16), హిట్టర్లు డసెన్ (4), మార్క్రమ్ (1) చేతులెత్తేశారు. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాక మిల్లర్ కొద్దిగా పోరాడాడు. చివర్లో కేశవ్ దూకుడుగా ఆడినా అప్పటికే ఆలస్యమైంది. స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (సి) క్లాసెన్ (బి) రబడ 2; మ్యాక్స్ ఒడౌడ్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 18; అకెర్మన్ (బి) కొయెట్జీ 12; బస్ డి లీడ్ (ఎల్బీ) (బి) రబడ 2; సైబ్రాండ్ (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 19; తేజ (ఎల్బీ) (బి) జాన్సెన్ 20; ఎడ్వర్డ్స్ నాటౌట్ 78; వాన్ బీక్ (స్టంప్డ్) డికాక్ (బి) కేశవ్ 10; వాన్‌డర్ మెర్వ్ (సి) డికాక్ (బి) ఎన్గిడి 29; ఆర్యన్ దత్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (43 ఓవర్లలో 8 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–40, 4–50, 5–82, 6–112, 7–140, 8–204. బౌలింగ్: ఎన్గిడి 9–1–57–2, జాన్సెన్ 8–1–27–2, రబడ 9–1–56–2, కొయెట్జీ 8–0–57–1, కేశవ్ 9–0–38–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (బి) వాన్ డెర్ మెర్వ్ 16; డికాక్ (సి) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 20; వాన్‌డెర్ డసెన్ (సి) ఆర్యన్ (బి) వాన్ డెర్ మెర్వ్ 4; మార్క్రమ్ (బి) వాన్ మెకెరన్ 1; క్లాసెన్ (సి) విక్రమ్‌జీత్ (బి) వాన్ బీక్ 28; మిల్లర్ (బి) వాన్ బీక్ 43; జాన్సెన్ (బి) వాన్ మెకెరన్ 9; కొయెట్జీ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 22; కేశవ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బీక్ 40; రబడ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 9; ఎన్గిడి నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 207. వికెట్ల పతనం: 1–36, 2–39, 3–42, 4–44, 5–89, 6–109, 7–145, 8–147, 9–166, 10–207. బౌలింగ్: ఆర్యన్ దత్ 5–1–19–0, వాన్ బీక్ 8.5–0–60–3, అకెర్మన్ 3–0–16–1, పాల్ మెకెరన్ 9–0–40–2, వాన్ డెర్ మెర్వ్ 9–0–34–2, బాస్ డి లీడ్ 8–0–36–2. -
World Cup 2023: అఫ్గాన్ అద్భుతం...
అడపాదడపా మెరిపించడమే కాదు తమదైన రోజున చిరస్మరణీయ ప్రదర్శనతో పెద్ద జట్లను బోల్తా కొట్టించే ప్రావీణ్యం తమలో ఉందని అఫ్గానిస్తాన్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది. వరుసగా మూడో వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న అఫ్గానిస్తాన్ ఎట్టకేలకు ఈ మెగా ఈవెంట్లో 14 వరుస పరాజయాలకు తెరదించింది. సంచలన ఆటతీరుతో ఏకంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టునే మట్టికరిపించింది. ఇక నుంచి తమను కూన జట్టుగా పరిగణించకూడదని మిగతా జట్లకు హెచ్చరికలు పంపించింది. 2015 ప్రపంచకప్ లో ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం స్కాట్లాండ్పై గెలిచిన అఫ్గానిస్తాన్... ఆ తర్వాత 2019 ప్రపంచకప్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తాజా ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, భారత్ చేతిలో ఓడిన అఫ్గానిస్తాన్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొంది పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్! అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. ఆదివారం జరిగిన పోరులో హష్మతుల్లా కెపె్టన్సీలోని అఫ్గానిస్తాన్ 69 పరుగుల తేడాతో బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టుపై జయభేరి మోగించింది. ముందుగా అఫ్గానిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ రహా్మనుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆదిల్ రషీద్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (61 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రషీద్ ఖాన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ చెరో 3 వికెట్లు తీయగా, నబీకి 2 వికెట్లు దక్కాయి. నడిపించిన గుర్బాజ్ జద్రాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రహ్మానుల్లా గుర్బాజ్ చెలరేగాడు. మూడో ఓవర్ నుంచి భారీ సిక్సర్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. వోక్స్, టోప్లీ, స్యామ్ కరన్‌ల పేస్... గుర్బాజ్ బౌండరీలు, సిక్సర్లతో విలవిలాడింది. 11వ ఓవర్లో ఆదిల్ రషీద్‌ను దించితే బౌండరీ బాది 33 బంతుల్లో గుర్బాజ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12.4వ ఓవర్లోనే అఫ్గాన్ స్కోరు వందకు చేరింది. 114 స్కోరువద్ద జద్రాన్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను అవుట్ చేసిన రషీద్ ఇంగ్లండ్ శిబిరాన్ని కాస్త ఊపిరి తీసుకోనిచ్చాడు. స్వల్ప వ్యవధిలో రహ్మత్ షా (3), గుర్బాజ్ అవుటైనప్పటిపీ ఇక్రమ్ అలీఖిల్ అర్ధసెంచరీ, లోయర్ ఆర్డర్లో రషీద్ ఖాన్ (22 బంతుల్లో 23; 3 ఫోర్లు), ముజీబ్ ఉర్ రెహా్మన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన విలువైన పరుగులు అఫ్గాన్ పటిష్టమైన స్కోరుకు బాట వేసింది. బాధ్యతలేని బ్యాటింగ్‌తో... స్కోరు పెద్దదే. కానీ అఫ్గాన్ బౌలింగ్‌పై ఈ లక్ష్యం ఇంగ్లండ్‌కు అసాధ్యమైందేమీ కాదు. బ్యాటర్లకు కష్టమైందీ కాదు. కానీ బాధ్యత లేని బ్యాటింగ్, చెత్త షాట్లతో జట్టు ఓటమినే మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. రెండో ఓవర్లోనే బెయిర్‌స్టో (2) లాంటి ఓపెనర్ అవుటైతే... రూట్ (11), కెపె్టన్ బట్లర్ (9)లాంటి అనుభవజు్ఞలు క్రీజును అంటిపెట్టుకోవాల్సింది పోయి... సులువుగా క్లీన్‌బౌల్డయ్యారు. దీంతో మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశాల్ని అఫ్గాన్ అన్ని వైపులా ముమ్మరం చేసింది. మలాన్ (39 బంతుల్లో 32; 4 ఫోర్లు) చేసిన మోస్తరు పరుగులు, హ్యారీ బ్రూక్ అర్ధసెంచరీ ఇంగ్లండ్‌ను కాపాడలేకపోయాయి. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (రనౌట్) 80; ఇబ్రహీమ్ (సి) రూట్ (బి) రషీద్ 28; రహ్మత్ షా (స్టంప్డ్) బట్లర్ (బి) ఆదిల్ రషీద్ 3; హష్మతుల్లా (బి) రూట్ 14; అజ్మతుల్లా (సి) వోక్స్ (బి) లివింగ్‌స్టోన్ 19; ఇక్రమ్ (సి) స్యామ్ కరన్ (బి) టోప్లీ 58; నబీ (సి) రూట్ (బి) వుడ్ 9; రషీద్ (సి) రూట్ (బి) రషీద్ 23; ముజీబ్ (సి) రూట్ (బి) వుడ్ 28; నవీనుల్ హక్ (రనౌట్) 5; ఫరూఖీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1–114, 2–122, 3–122, 4–152, 5–174, 6–190, 7–233, 8–277, 9–277, 10–284. బౌలింగ్: వోక్స్ 4–0–41–0, టోప్లీ 8.5–1–52–1, కరన్ 4–0–46–0, ఆదిల్ రషీద్ 10–1–42–3, వుడ్ 9–0–50–2, లివింగ్‌స్టోన్ 10– 0–33–1, రూట్ 4–0–19–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫరూఖీ 2; మలాన్ (సి) ఇబ్రహీమ్ (బి) నబీ 32, రూట్ (బి) ముజీబ్ 11; బ్రూక్ (సి) ఇక్రమ్ (బి) ముజీబ్ 66; బట్లర్ (బి) నవీనుల్ 9; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 10; స్యామ్ కరన్ (సి) రహ్మత్ (బి) నబీ 10; వోక్స్ (బి) ముజీబ్ 9; ఆదిల్ రషీద్ (సి) నబీ (బి) రషీద్ 20; వుడ్ (బి) రషీద్ 18; టోప్లీ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–3, 2–33, 3–68, 4–91, 5–117, 6– 138, 7–160, 8–169, 9–198, 10–215. బౌలింగ్: ముజీబ్ 10–1–51–3, çఫరూఖీ 7–0–50–1, నవీనుల్ హక్ 6–1–44–1, నబీ 6–0–16–2, రషీద్ ఖాన్ 9.3–1–37–3, అజ్మతుల్లా 2–0–13–0. ప్రపంచకప్‌లో నేడు ఆ్రస్టేలియా X శ్రీలంక వేదిక: లక్నో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
కోహ్లి ‘జెర్సీ’ మారింది!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి కాస్త గందరగోళానికి కేంద్రంగా మారాడు. మైదానంలోకి దిగినప్పుడు అతను వేసుకున్న జెర్సీ సహచరుల జెర్సీకంటే భిన్నంగా ఉండటంతో సమస్య మొదలైంది. సాధారణంగా టీమ్ కిట్ స్పాన్సర్ ‘అడిడాస్’కు సంబంధించిన మూడు అడ్డగీతలు మన ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి. కానీ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన జెర్సీపై త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులతో ఈ గీతలు కనిపిస్తాయి. అయితే కోహ్లి తెలుపు గీతల టీ షర్ట్‌తోనే వచ్చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత విషయం తెలియడంతో కోహ్లి ఏడో ఓవర్లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి జెర్సీని మార్చుకొని తర్వాతి ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చాడు. -
విలియమ్సన్కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం
చెన్నై: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ! అనుభవజు్ఞడైన కెపె్టన్ కేన్ విలియమ్సన్ బొటన వేలి గాయంతో ఏకంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్‌లో పరుగు తీస్తున్న సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో 78 పరుగుల వద్ద కేన్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తదనంతరం ఎక్స్‌రే తీయగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు (18న అఫ్గానిస్తాన్‌తో; 22న భారత్‌తో; 28న దక్షిణాఫ్రికాతో) అతను దూరం కానున్నాడు. అతను గాయం నుంచి కోలుకున్న తర్వాతే వచ్చే నెల మ్యాచ్‌లకు అందుబాటు లో ఉండేది లేనిది తెలుస్తుంది. -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్‌లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్‌పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్‌లోనూ కొనసాగింది. ఫేవరెట్‌గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్‌ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్‌లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం పుణేలో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్‌ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్‌లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్‌పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్‌కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్‌కు భారత్‌లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్‌లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
IND Vs PAK: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్‌ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్
ప్రపంచకప్‌లో 51 మ్యాచ్‌లు ఉన్నా, అందరూ ఎదురు చూసేది ‘ఈ’ మ్యాచ్ కోసమే... ఈ మ్యాచ్ కోసమే ప్రసారకర్తలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేస్తారు... ఈ మ్యాచ్ కోసమే ఫ్లయిట్ టికెట్లు, ప్రకటనల రేట్లు ఆకాశానికి అంటుతాయి... ఈ మ్యాచ్ కోసమే అభిమానులు ఎన్ని కష్టాలకోర్చి అయినా మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశపడతారు... ఈ మ్యాచ్ కోసమే ఆస్పత్రి మంచాలు కూడా హోటల్ బెడ్లుగా మారిపోతాయి... ఈ మ్యాచ్ కోసమే సినీ తారలతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది... ఈ మ్యాచ్ అంటే బీసీసీఐ, ఐసీసీ దృష్టిలో ‘నవరాత్రి’ సంబరం... చరిత్ర అంతా ఒక వైపే ఉండవచ్చు... వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్‌నే విజయం వరించి ఉండవచ్చు... ప్రస్తుత బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూస్తే మరో మాటకు తావు లేకుండా టీమిండియానే ఫేవరెట్ అనవచ్చు... అయినా సరే ఈ పోరుకు ఎక్కడ లేని ఆకర్షణ... సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయాల కారణంగా ఇది ఆట మాత్రమే కాకుండా అంతకు మించిన భావోద్వేగ సమరం... ఆటగాళ్లు మాకు అన్ని మ్యాచ్‌లాగే ఇదీ ఒకటి అని పైకి చెప్పవచ్చు కానీ వారికీ తెలుసు... మైదానంలో దిగాక తమ గుండె చప్పుడు ఎలా ఉంటుందో... దాదాపు ఏడాది క్రితం అక్టోబర్ 23, 2022న టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి బాదిన రెండు వరుస సిక్సర్లు గుర్తుకొచ్చాయా... నాడు 90 వేల మంది సామర్థ్యం గల మెల్బోర్న్ స్టేడియం దద్దరిల్లింది. ఇప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులతో నరేంద్ర మోదీ మైదానం మోతెక్కడం ఖాయం. ఈ రెండింటి మధ్య ఆసియా కప్‌లో తలపడినా వరల్డ్‌కప్ లెక్క వేరు... మన అభిమానులతో స్టాండ్లు ‘నీలి సముద్రం’గా మారబోతుండగా, ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై భారత్‌ను ఎదుర్కొంటూ తమకు మద్దతిచ్చే ఒక్క అభిమానీ లేని పాక్ తట్టుకోగలదా అనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: వరల్డ్‌కప్‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌పై వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని పాక్ భావిస్తోంది. టోర్నీలో తమ తొలి రెండు మ్యాచ్‌లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్‌లపై భారత్ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గిల్ బరిలో దిగుతాడా... భారత్ తుది జట్టు విషయంలో మామాలుగానైతే ఎలాంటి సమస్య లేదు. కానీ డెంగీ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడని శుబ్‌మన్ గిల్ బరిలోకి దిగడంపైనే ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం నుంచి కోలుకున్న అతను గురువారం స్వల్ప సమయం పాటు సాధన చేసినా... శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోహిత్ ‘గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడు’ అని చెప్పడం అతను ఆడే అవకాశాలను మెరుగుపర్చింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉండటంతో పాటు ఐపీఎల్లో ఇది అతని సొంత మైదానం కావడం కూడా మరో కారణం. అయితే ఆ ఒక్క శాతం పూర్తిగా కోలుకోకపోతేనే సమస్య. గిల్ లేకపోతే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్‌ల బ్యాటింగ్ ఫామ్ భారత్‌కు పెద్ద బలం. అఫ్గాన్‌పై సెంచరీతో రోహిత్ తన స్థాయిని చూపిస్తే కోహ్లి ప్రశాంతంగా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లి, 2019లో రోహిత్ పాక్‌పై సెంచరీలతో చెలరేగారు. రాహుల్ కూడా తన విలువను ప్రదర్శిస్తుండగా, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు సిద్ధం కాగా, కుల్దీప్, సొంతగడ్డపై ఆడనున్న బుమ్రా బౌలింగ్‌ను పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనిమిదో స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తప్పించి అశ్విన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చు. అయితే రెండు సీజన్లుగా ఈ మైదానంలో ఉత్తమ రికార్డు ఉన్న షమీ కూడా పరిశీలనలో ఉన్నాడు. జోరు కొనసాగేనా... శ్రీలంక బౌలింగ్ బలమైనది కాకపోయినా సరే వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యఛేదన అంత సులువు కాదు. కానీ దీనిని సాధించడం కచ్చితంగా పాకిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో తడబడిన తీరుతో పోలిస్తే ఆ జట్టు పరిస్థితి మారింది. హైదరాబాద్‌లో ఆడిన తుది జట్టునే పాక్ ఇక్కడా కొనసాగించవచ్చు. రిజ్వాన్ ఫామ్‌లో ఉండగా, అబ్దుల్లా షఫీక్ రూపంలో దూకుడైన ఓపెనర్ వెలుగులోకి రావడం సానుకూలాంశం. మిడిలార్డర్లో షకీల్, ఇఫ్తికార్ తమ వంతు పాత్ర పోషించగలరు. అయితే ఇమామ్ పేలవ ఆటతో పాటు జట్టు నంబర్‌వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ విఫలం కావడమే టీమ్‌ను ఆందోళన పరుస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి బాబర్ 71 పరుగులే చేశాడు. అతను తన స్థాయికి తగినట్లుగా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. బౌలింగ్‌లో ఇప్పటికీ ప్రధాన అస్త్రం షాహిన్ అఫ్రిదినే. తన పదునైన లెఫ్టార్మ్ పేస్‌తో ఆరంభ ఓవర్లలో అతను భారత బ్యాటర్లను నిలువరించాలని జట్టు కోరుకుంటోంది. ఆపై రవూఫ్ కూడా కీలకం కానున్నాడు. భారీగా పరుగులిచ్చే హసన్ అలీ స్థానంలో వసీమ్ ఆడే అవకాశం ఉంది. టీమ్‌లో ఒక ప్రధాన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టు పెద్ద బలహీనత. షాదాబ్, నవాజ్‌లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కోగలరు. పిచ్, వాతావరణం గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ ప్రభావం చూపించారు. అయితే ఈ మ్యాచ్ కోసం నల్లరేగడి మట్టి ఉన్న పిచ్‌ను ఎంచుకున్నారు. అంటే పిచ్ నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రేక్షకుల కోణంలో పరుగుల వరద కోసమే నిర్వాహకులు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వేడి వాతావరణం, వర్ష సూచన లేదు. మూడో స్పిన్నర్‌ను ఆడించే విషయంపై ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టులో అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేస్తాం. గత నాలుగేళ్లలో నేనేమీ పెద్దగా మారలేదు. బ్యాటర్‌గా చూస్తే ప్రతీ మ్యాచ్‌కు ముందు నా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నద్ధతలో లోటు ఉండదు. ప్రతీ రోజు కొత్త సవాలే. అన్నింటికీ సిద్ధంగా ఉంటా. నా ఆటేంటో, జట్టుకు నా అవసరం ఏమిటో బాగా తెలుసు. కెప్టెన్‌గా ఈ మ్యాచ్ కోసం సహచరులకు ప్రత్యేక సూచనలేమీ చేయను. వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సారథిగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒక్క మ్యాచ్ వల్ల నాకు కెప్టెన్సీ రాలేదు. ఈ ఒక్క మ్యాచ్ వల్ల అది పోదు. దేవుడు ఎంత ఇస్తే అంతే దక్కుతుంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య గతంలో ఎన్నోసార్లు ఆడాం కాబట్టి ఇదేమీ కొత్త కాదు. పాక్ అభిమానులను అనుమతిస్తే బాగుండేది. కానీ మద్దతు లేకపోయినా మేం దీనికి సిద్ధమయ్యే ఉన్నాం. చరిత్ర గురించి నేను పట్టించుకోను. రికార్డులు ఏదో ఒక రోజు బద్దలవుతాయి. 2021 టి20 ప్రపంచకప్‌లో మేం భారత్‌ను ఓడించాం. అంతకుముందు అదీ లేదు కదా. కాబట్టి దేనికైనా ఎక్కడో ఒక చోట ముగింపు తప్పదు. –బాబర్ ఆజమ్, పాకిస్తాన్ కెప్టెన్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమా మ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్/వసీమ్, రవూఫ్. -
IND Vs PAK: వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని భారత్..
వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా ఏడింటిలోనూ భారతే నెగ్గింది. 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ లీగ్ దశలోనే నిష్క్ర మించడంతో రెండు జట్లు ముఖాముఖిగా తలపడే అవకాశం రాలేదు. 1992 ప్రపంచకప్ (మార్చి 4; సిడ్నీ) భారత్ ఇన్నింగ్స్: 216/7 (49 ఓవర్లలో) (సచిన్ 54 నాటౌట్); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 173 ఆలౌట్ (48.1 ఓవర్లలో). ఫలితం: భారత్ 43 పరుగులతో గెలుపు 1996 ప్రపంచకప్ (మార్చి 9; బెంగళూరు) భారత్ ఇన్నింగ్స్: 287/8 (50 ఓవర్లలో) (సిద్ధూ 93); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 248/9 (49 ఓవర్లలో). ఫలితం: భారత్ 39 పరుగుల తేడాతో విజయం 1999 ప్రపంచకప్ (జూన్ 8; మాంచెస్టర్) భారత్ ఇన్నింగ్స్: 227/6 (50 ఓవర్లలో) (ద్రవిడ్ 61, అజహరుద్దీన్ 59); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 180 ఆలౌట్ (45.3 ఓవర్లలో) (వెంకటేశ్ ప్రసాద్ 5/27). ఫలితం: భారత్ 47 పరుగులతో గెలుపు 2003 ప్రపంచకప్ (మార్చి 1; సెంచూరియన్) పాకిస్తాన్ ఇన్నింగ్స్: 273/7 (50 ఓవర్లలో) (అన్వర్ 101); భారత్ ఇన్నింగ్స్: 276/4 (45.4 ఓవర్లలో) (సచిన్ 98,యువరాజ్ 50 నాటౌట్). ఫలితం: భారత్ 6 వికెట్ల తేడాతో విజయం 2011 ప్రపంచకప్ (మార్చి 30; మొహాలీ) భారత్ ఇన్నింగ్స్: 260/9 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 85, వహాబ్ రియాజ్ 5/46); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (49.5 ఓవర్లలో). ఫలితం: భారత్ 29 పరుగులతో విజయం 2015 ప్రపంచకప్ (ఫిబ్రవరి 15; అడిలైడ్) భారత్ ఇన్నింగ్స్: 300/7 (50 ఓవర్లలో) (ధావన్ 73, కోహ్లి 107, రైనా 74); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 224 ఆలౌట్ (47 ఓవర్లలో) (మిస్బా 76, షమీ 4/35). ఫలితం: భారత్ 76 పరుగులతో విజయం 2019 ప్రపంచకప్ (జూన్ 16; మాంచెస్టర్) భారత్ ఇన్నింగ్స్: 336/5 (50 ఓవర్లలో) (రోహిత్ శర్మ 140, కోహ్లి 77, ఆమిర్ 3/47); పాకిస్తాన్ ఇన్నింగ్స్: 212/6 (40 ఓవర్లలో). ఫలితం: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 89 పరుగులతో విజయం -
సఫారీ దెబ్బకు ‘కంగారు’
లక్నో: మళ్లీ కంగారే! వన్డే వరల్డ్‌కప్‌లో ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ఆ్రస్టేలియా ఈ కప్‌లో ఓ కూనలా విలవిలలాడుతోంది. పసలేని బౌలింగ్, బాధ్యతలేని బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియాకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బవూమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 134 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (106 బంతుల్లో 109; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కాడు. మార్క్రమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబుõÙన్ (74 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, స్టార్క్ (27; 3 ఫోర్లు), కెపె్టన్ కమిన్స్ (22; 4 ఫోర్లు) 20 పరుగులు మించారంతే! రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ జోరు... దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ టాపార్డర్‌తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. జట్టు భారీస్కోరుకు బాటవేశాడు. బవుమా (55 బంతుల్లో 35; 2 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 108 పరుగులు, డసెన్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. 90 బంతుల్లో సెంచరీ పూర్తయ్యాక డికాక్ జట్టు స్కోరు 197 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం మార్క్రమ్ అర్ధసెంచరీ సాధించడం, క్లాసెన్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు), జాన్సెన్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇలా క్రీజులో వచ్చిన వారంత స్కోరు పెరిగేందుకు దోహదం చేయడంతో సఫారీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 300 పైచిలుకు స్కోరు చేసింది. లంకపై తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసిన సంగతి తెలిసిందే! కంగారూ... కంగారూ... జోరు మీదున్న ప్రత్యర్థి, కొండంత లక్ష్యం ముందరుంటే ... మిచెల్ మార్ష్ (7), వార్నర్ (13), స్మిత్ (19)...ఆస్ట్రేలియా టాపార్డర్ స్కోరిది! ఇదికాస్తా 10 ఓవర్లలోపే కంగారూ, బేజారు కలగలిసి ఆసీస్ పరాజయానికి బీజం పడేలా చేసింది. రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అప్పటికే అనుభవజ్జుడైన స్మిత్‌ను అవుట్ చేసి తర్వాత జోష్ ఇంగ్లిస్ (5), స్టొయినిస్ (5)లను పట్టుమని పది పరుగులైనా చేయనివ్వలేదు. దీంతో ఆ్రస్టేలియా 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ నిలబడటంతో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోరు చేసింది. అంతేగానీ గెలిచేందుకు ఏ దశలో ఆడలేదు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిన ఆ్రస్టేలియా తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం శ్రీలంకతో ఆడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) మ్యాక్స్‌వెల్ 109; బవుమా (సి) వార్నర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; డసెన్ (సి) సబ్–అబాట్ (బి) జంపా 26; మార్క్రమ్ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 56; క్లాసెన్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 29; మిల్లర్ (బి) స్టార్క్ 17; జాన్సెన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 26; రబడ (నాటౌట్) 0; కేశవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 311. వికెట్ల పతనం: 1–108, 2–158, 3–197, 4–263, 5–267, 6–310, 7–311. బౌలింగ్: స్టార్క్ 9–1– 53–2, హాజల్‌వుడ్ 9–0–60–1, మ్యాక్స్‌వెల్ 10–1 –34–2, కమిన్స్ 9–0–71–1, జంపా 10–0– 70–1, మార్ష్ 1–0–6–0, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) బవుమా (బి) జాన్సెన్ 7; వార్నర్ (సి) డసెన్ (బి) ఇన్‌గిడి 13; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రబడ 19; లబుõÙన్ (సి) బవుమా (బి) కేశవ్ 46; ఇంగ్లిస్ (బి) రబడ 5; మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) కేశవ్ 3; స్టొయినిస్ (సి) డికాక్ (బి) రబడ 5; స్టార్క్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 27; కమిన్స్ (సి) మిల్లర్ (బి) షమ్సీ 22; జంపా (నాటౌట్) 11; హాజల్‌వుడ్ (సి) రబడ (బి) షమ్సీ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–50, 4–56, 5–65, 6–70, 7–139, 8–143, 9–175, 10–177. బౌలింగ్: ఇన్‌గిడి 8–2–18–1, జాన్సెన్ 7–0–54–2, రబడ 8–1–33–3, కేశవ్ 10–0–30–2, షమ్సీ 7.5–0–38–2. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X బంగ్లాదేశ్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అదరగొట్టిన రోహిత్
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఇప్పటికే తన పేరును లిఖించుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు మరో మెట్టు ఎక్కాడు. టోరీ్నలో ఏడో శతకం సాధించిన తొలి ఆటగాడిగా శిఖరాన నిలుస్తూ మెరుపు ప్రదర్శనతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కసినంతా చూపిస్తూ అఫ్గానిస్తాన్‌పై అతను చెలరేగాడు. ఈ క్రమంలో తన స్థాయిని ప్రదర్శిస్తూ పలు రికార్డులను అధిగమించాడు. దాంతో రోహిత్ ధాటికి అఫ్గాన్ విలవిల్లాడింది. మెరుగైన స్కోరు సాధించామన్న ఆ జట్టు సంబరం కాస్తా రోహిత్ ఆట ముందు ఆవిరైంది. రోహిత్ ఆటతో సులువుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ లక్ష్యం చేరింది. ఇక శనివారం జరిగే అసలు పోరులో పాకిస్తాన్‌ను పడగొట్టేందుకు టీమిండియా సిద్ధమైంది. న్యూఢిల్లీ: ప్రపంచకప్ తొలి పోరులో పటిష్ట ఆ్రస్టేలియాను ఓడించిన భారత్ రెండో పోరులో చిన్న టీమ్ అఫ్గానిస్తాన్‌పై చెలరేగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను ఏకంగా 15 ఓవర్లు మిగిలి ఉండగానే ముగించి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెపె్టన్ హష్మతుల్లా షాహిది (88 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (69 బంతుల్లో 62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా నాలుగు వికెట్లతో, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. అనంతరం భారత్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లి (56 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) మరో అర్ధ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లూ గెలిచిన టీమిండియా శనివారం అహ్మదాబాద్‌లో జరిగే తమ తర్వాతి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. సెంచరీ భాగస్వామ్యం... బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై అఫ్గానిస్తాన్ చెప్పుకోదగ్గ స్కోరే సాధించగలిగినా... కీలక సమయాల్లో భారత బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు ఆశించినన్ని పరుగులు రాబట్టడంలో విఫలమైంది. 31 పరుగుల వ్యవధిలో ఆ జట్టు తొలి 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే హష్మతుల్లా, అజ్మతుల్లా కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. 21.2 ఓవర్లపాటు భారత్‌కు వికెట్ ఇవ్వకుండా నిలువరించడంలో సఫలమైన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 121 పరుగులు జత చేశారు. అయితే రన్‌రేట్ పేలవంగా సాగడంతో అది చివర్లో జట్టు స్కోరుపై ప్రభావం చూపించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ మినహా అంతా మెరుగైన ప్రదర్శనే చేశారు. ఓవర్‌కు 8.44 చొప్పున పరుగులిచ్చిన సిరాజ్ బౌలింగ్‌లో అఫ్గాన్ బ్యాటర్లు 12 ఫోర్లు, 1 సిక్స్ రాబట్టారు. ఎదురులేని బ్యాటింగ్‌తో... తనదైన శైలిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన రోహిత్ సునాయాసంగా అఫ్గాన్ నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఫజల్ ఓవర్లో సిక్సర్‌తో వరల్డ్ కప్‌లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్, అతని తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, 6 బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. తర్వాతి రెండు ఓవర్లలో రోహిత్ మరో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 94 పరుగులకు చేరింది. ముజీబ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతనికి సెంచరీ పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 18వ ఓవర్ రెండో బంతికే రోహిత్ శతకం పూర్తి కావడం విశేషం. మరో ఎండ్‌లో రోహిత్‌కు సహకరించిన ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్ తీసి భారీ భాగస్వామ్యం తర్వాత అఫ్గాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. తొలి వికెట్‌కు రోహిత్, కిషన్ 156 పరుగులు జత చేశారు. ఆ తర్వాత జత కలిసిన కోహ్లి ప్రశాంతంగా ఆడుకుంటూ పోయాడు. రషీద్ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన భారత కెపె్టన్ అతని తర్వాతి ఓవర్లో స్వీప్ షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ కావడంతో ఒక గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. విజయానికి 64 పరుగులు కావాల్సిన ఈ దశలో జత కలిసిన కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) చివరి వరకు నిలిచి ఆట ముగించారు. 7 వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీల సంఖ్య. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచిన అతను సచిన్ టెండూల్కర్ (6) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. 2015 ప్రపంచకప్‌లో ఒక సెంచరీ చేసిన రోహిత్, 2019 వరల్డ్‌కప్‌లో 5 శతకాలు బాదాడు. 556 అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) రోహిత్ సిక్సర్ల సంఖ్య. గేల్ (553) రికార్డు అధిగమించాడు. 63 సెంచరీకి రోహిత్ తీసుకున్న బంతుల సంఖ్య. వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా గతంలో కపిల్ దేవ్ (72 బంతులు; 1983లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 31 వన్డేల్లో రోహిత్ సెంచరీల సంఖ్య. రికీ పాంటింగ్ (30)ను అతను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ (49), కోహ్లి (47) మాత్రమే ముందున్నారు. 19 వరల్డ్‌కప్‌లో 19 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు పూర్తి చేసిన డేవిడ్ వార్నర్ (19) రికార్డును రోహిత్ సమం చేశాడు. 16 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అఫ్గానిస్తాన్ ఓడిన మ్యాచ్‌ల సంఖ్య. మూడో ప్రపంచకప్ ఆడుతున్న అఫ్గానిస్తాన్ 17 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది. 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై అఫ్గానిస్తాన్ ఒక వికెట్ తేడాతో నెగ్గింది. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) శార్దుల్ (బి) పాండ్యా 21; ఇబ్రహీమ్ (సి) రాహుల్ (బి) బుమ్రా 22; రహమత్ (ఎల్బీ) (బి) శార్దుల్ 16; హష్మతుల్లా (ఎల్బీ) (బి) కుల్దీప్ 80; అజ్మతుల్లా (బి) పాండ్యా 62; నబీ (ఎల్బీ) (బి) బుమ్రా 19; నజీబుల్లా (సి) కోహ్లి (బి) బుమ్రా 2; రషీద్ ఖాన్ (సి) కుల్దీప్ (బి) బుమ్రా 16; ముజీబ్ (నాటౌట్) 10; నవీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–32, 2–63, 3–63, 4–184, 5–225, 6–229, 7–235, 8–261. బౌలింగ్: బుమ్రా 10–0–39–4, సిరాజ్ 9–0–76–0, హార్దిక్ పాండ్యా 7–0–43–2, శార్దుల్ ఠాకూర్ 6–0–31–1, కుల్దీప్ యాదవ్ 10–0–40–1, రవీంద్ర జడేజా 8–0–38–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) రషీద్ 131; ఇషాన్ కిషన్ (సి) ఇబ్రహీమ్ (బి) రషీద్ ఖాన్ 47; కోహ్లి (నాటౌట్) 55; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (35 ఓవర్లలో 2 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–156, 2–205. బౌలింగ్: ఫారుఖీ 6–0–50–0, ముజీబ్ 8–0–64–0, నవీన్ ఉల్ హక్ 5–0–31–0, అజ్మతుల్లా 4–0–34–0, నబీ 4–0–32–0, రషీద్ 8–0–57–2. ప్రపంచకప్‌లో నేడు ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా వేదిక: లక్నో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్ అదరగొట్టింది
345 పరుగులు... వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోలేదు... శ్రీలంకతో మ్యాచ్‌లో 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్‌కు ఇది దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ రిజ్వాన్, షఫీక్ కలిసి దానిని చేసి చూపించారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో గేర్లు మారుస్తూ చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా పాక్‌కు విజయాన్నందించారు. అంతకుముందు మెరుపు బ్యాటింగ్‌తో కుశాల్ మెండిస్, సమరవిక్రమ చేసిన శతకాలు చివరకు జట్టుకు ఉపయోగపడలేదు. మొత్తం 689 పరుగుల ఈ పోరుతో హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిశాయి. సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లనూ సంతృప్తిగా ముగించింది. మంగళవారం జరిగిన పోరులో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా, పతుమ్ నిసాంక (61 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మెండిస్ రెండో వికెట్‌కు నిసాంకతో 102 పరుగులు, మూడో వికెట్‌కు సమరవిక్రమతో 111 పరుగులు జోడించాడు. 65 బంతుల్లో సెంచరీ సాధించిన మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిజ్వాన్ (121 బంతుల్లో 131 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (103 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు బాది జట్టును గెలిపించారు. కండరాల నొప్పితో బాధపడుతూనే రిజ్వాన్ తన జట్టును విజయతీరానికి చేర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 176 పరుగులు జత చేశారు. ఆరంభంలో శ్రీలంక చెలరేగినా... చివరి పది ఓవర్లలో 61 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) షఫీక్ (బి) షాదాబ్ 51; పెరీరా (సి) రిజ్వాన్ (బి) హసన్ 0; మెండిస్ (సి) ఇమామ్ (బి) హసన్ 122; సమరవిక్రమ (సి) రిజ్వాన్ (బి) హసన్ 108; అసలంక (సి) రిజ్వాన్ (బి) హసన్ 1; ధనంజయ (సి) షాహిన్ (బి) నవాజ్ 25; షనక (సి) బాబర్ (బి) షాహిన్ 12; వెలలాగె (సి) షఫీక్ (బి) రవూఫ్ 10; తీక్షణ (బి) రవూఫ్ 0; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 344. వికెట్ల పతనం: 1–5, 2–107, 3–218, 4–229, 5–294, 6–324, 7–335, 8–343, 9–344. బౌలింగ్: షాహిన్ 9–0–66–1, హసన్ అలీ 10–0–71–4, నవాజ్ 9–0–62–1, రవూఫ్ 10–0–64–2, షాదాబ్ 8–0–55–1, ఇఫ్తికార్ 4–0–22–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) (సబ్) హేమంత (బి) పతిరణ 113; ఇమామ్ (సి) పెరీరా (బి) మదుషంక 12; బాబర్ ఆజమ్ (సి) సమరవిక్రమ (బి) మదుషంక 10; మొహమ్మద్ రిజ్వాన్ (నాటౌట్) 131; షకీల్ (సి) వెలలాగె (బి) తీక్షణ 31; ఇఫ్తికార్ అహ్మద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.2 ఓవర్లలో 4 వికెట్లకు) 345. వికెట్ల పతనం: 1–16, 2–37, 3–213, 4–308. బౌలింగ్: తీక్షణ 10–0–59–1, మదుషంక 9.2– 0–60–2, షనక 5–0–28–0, పతిరణ 9–0– 90–1, వెలలాగె 10–0–62–0, ధనంజయ డిసిల్వా 4–0– 36–0, అసలంక 1–0–10–0. 3 ఒక వన్డే మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే కాగా, వరల్డ్ కప్‌లో మొదటిసారి. 1998లో లాహోర్‌లో ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ యూసుఫ్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్...2013లో నాగపూర్‌లో కోహ్లి, ధావన్, బెయిలీ, వాట్సన్ సెంచరీలు చేశారు. -
మరో విజయం లక్ష్యంగా...
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్ గట్టి ప్రత్యర్థి ఆ్రస్టేలియాను ఢీకొట్టి మరీ శుభారంభం చేసింది. ఇప్పుడు సులువైన జట్టు అఫ్గానిస్తాన్‌తో పోరుకు సై అంటోంది. పదునెక్కిన బౌలింగ్‌తో ‘కంగారు’ పెట్టించిన భారత్ ఇప్పుడు టాపార్డర్ ఫామ్‌పై దృష్టి పెట్టింది. అనుభవజ్ఞుడైన కెపె్టన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల డకౌట్లు జట్టు మేనేజ్మెంట్ను కాస్త కలవరపెట్టినా... ఇప్పుడు అఫ్గాన్‌తో పరుగుల వరద పారించి ఫామ్‌లోకి వచ్చే అవకాశం లభించింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోకు విలవిలలాడిన అఫ్గానిస్తాన్ పటిష్టమైన రోహిత్ సేనకు ఏ మేరకు బదులిస్తుందో చూడాలి. ఆసీస్‌తో టాపార్డర్ మాత్రమే తడబడింది. కేఎల్ రాహుల్, కోహ్లిల సూపర్ ఇన్నింగ్స్‌లతో మాజీ చాంపియన్‌ను మట్టికరిపించింది. అది చెపాక్ పిచ్ అయితే... ప్రత్యర్థి ఆ్రస్టేలియా. కానీ ఇప్పుడు ఎదురవుతోంది మాత్రం అఫ్గాన్, తలపడుతోంది ఢిల్లీలో... కాబట్టి పరుగుల వరద గ్యారంటీ! ఇందులో సందేహమే లేదు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 400 పైచిలుకు పరుగులు చేస్తే లక్ష్యఛేదనలో శ్రీలంక 300 పైచిలుకు చేసింది. ఇప్పుడు రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యాలాంటి మేటి బ్యాటర్లున్న భారత్ ప్రేక్షకులను భారీ షాట్లతో అలరించడం ఖాయం. డెంగీ జ్వరం నుంచి శుబ్‌మన్ గిల్ కోలుకోకపోవడంతో తుది జట్టులో ఏమార్పు ఉండకపోవచ్చు. మరోవైపు అఫ్గానిస్తాన్ రాటుదేలినా... మెగా ఈవెంట్ ఒత్తిడిని తట్టుకొని భారత్‌ను కంగుతినిపించే సత్తా అయితే లేదనే చెప్పాలి. ఇలా ఏ రకంగా చూసినా కూడా ఢిల్లీలో ఏకపక్షమయ్యే మ్యాచే జరుగుతుందనడంలో సందేహమే లేదు. -
భారీ విజయంతో ఇంగ్లండ్ బోణీ
ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ భారీ విజయంతో బోణీకొట్టింది. వన్డే ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బట్లర్ బృందం 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మలాన్ (107 బంతుల్లో 140; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన కెరీర్లో ఆరో సెంచరీతో చెలరేగాడు. బెయిర్‌స్టో (59 బంతుల్లో 52; 8 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించిన మలాన్... రెండో వికెట్‌కు రూట్ (68 బంతుల్లో 82; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మరో 151 పరుగులు జతచేశాడు. కెప్టెన్ బట్లర్ (20), బ్రూక్ (20) రెండంకెల స్కోరు చేశారు. మెహదీ హసన్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లిటన్ దాస్ (66 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించారు. టోప్లే 4, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (బి) షకీబ్ 52; మలాన్ (బి) మెహదీ హసన్ 140; రూట్ (సి) రహీమ్ (బి) షోరిఫుల్ 82; బట్లర్ (బి) షోరిఫుల్ 20, బ్రూక్ (సి) లిటన్‌దాస్ (బి) మెహదీ హసన్ 20; లివింగ్‌స్టోన్ (బి) షోరిఫుల్ 0; కరన్ (సి) నజు్మల్ (బి) మెహదీ హసన్ 11; వోక్స్ (సి) మెహదీ హసన్ (బి) అహ్మద్ 14; ఆదిల్ (సి) నజు్మల్ (బి) మెహదీ హసన్ 11; మార్క్ వుడ్ (నాటౌట్) 6; టోప్లే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 364. వికెట్ల పతనం: 1–115, 2–266, 3–296, 4–307, 5–307, 6–327, 7–334, 8–352, 9–362. బౌలింగ్: ముస్తఫిజుర్ 10–0– 70–0, అహ్మద్ 6–0–38–1, షోరిఫుల్ 10–0–75–3, హసన్ 8–0–71– 4, షకీబ్ 10–0–52–1, మిరాజ్ 6–0– 55–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) బట్లర్ (బి) వోక్స్ 76; తంజిద్ (సి) బెయిర్‌స్టో (బి) టోప్లే 1; నజు్మల్ (సి) లివింగ్‌స్టోన్ (బి) టోప్లే 0; షకీబ్ (బి) టోప్లే 1; మిరాజ్ (సి) బట్లర్ (బి) వోక్స్ 8; ముష్ఫికర్ (సి) ఆదిల్ (బి) టోప్లే 51; తౌహిద్ (సి) బట్లర్ (బి) లివింగ్‌స్టోన్ 39; మెహదీ హసన్ (బి) ఆదిల్ 14; అహ్మద్ (బి) కరన్ 15; షోరిఫుల్ (బి) వుడ్ 12; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–49, 5–121, 6–164, 7–189, 8–195, 9–221, 10–227. బౌలింగ్: వోక్స్ 8–0–49–2, టోప్లే 10–1–43–4, సామ్ కరన్ 7.2–0–47–1, వుడ్ 10–0–29–1, ఆదిల్ రషీద్ 10–0–42–1, లివింగ్‌స్టోన్ 3–0–13–1. -
PAK vs SL: వన్డే ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన పాకిస్థాన్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది. Tons from Abdullah Shafique and Mohammed Rizwan guide Pakistan to the most successful chase in ICC Men's Cricket World Cup history 🔥#CWC23 #PAKvSL 📝: https://t.co/oVVBdMbGPN pic.twitter.com/Y9xq0o3WOj — ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023 అయితే 345 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్కోర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్ 345-4(48.2) -
‘ధర్మశాల’ అవుట్ ఫీల్డ్‌పై బట్లర్ అసంతృప్తి
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఇంగ్లండ్ సారథి బట్లర్ ధర్మశాల స్టేడియంపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మైదానం పేలవంగా ఉంది. అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లకు ప్రమాదకరం. క్యాచ్‌లు పట్టేటపుడు, డైవింగ్ చేసేటపుడు ఫీల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పరుగు ఆపేందుకు డైవ్ చేస్తే గాయాల బారిన పడొచ్చు. ఐపీఎల్లో ఆడినప్పటిలా ఈ అవుట్‌ఫీల్డ్ లేదు. ఇది క్రికెటర్లకు ఇబ్బందికరం’ అని బట్లర్ అన్నాడు. బౌలర్లకు ప్రత్యేకించి పేసర్లు రనప్ ఏరియాను ఓ కంట కనిపెడుతూనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వేదికపై అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు బంతిని అందుకునే క్రమంలో పదేపదే జారి పడ్డారు. దీంతో అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ అవుట్‌ఫీల్డ్ చెత్తగా ఉందన్నాడు. -
తడబడినా... గెలుపు దక్కింది
1/2, 2/2, 3/2... 2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు... ఆ్రస్టేలియాపై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు లభించిన ఆరంభమిది... చేపాక్ మైదానంలో అంతా నిశ్శబ్దం... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ప్రమాద ఘంటిక వినిపించింది. అయితే ఎప్పటిలాగే కోహ్లి బాధ్యతను తనపై వేసుకోగా కేఎల్ రాహుల్ కూడా తగిన విధంగా సహకరించాడు. ఆసీస్ బౌలర్లకు ఆపై అవకాశం ఇవ్వకుండా సాగిపోయిన ఈ జోడీ చివరకు భారత్‌ను విజయతీరం చేర్చింది. అంతకుముందు పటిష్ట ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి భారత బౌలర్లు పైచేయి సాధించారు. నెమ్మదైన చెన్నై పిచ్‌పై మన స్పిన్నర్లను ఆడలేక ప్రత్యర్థి చేతులెత్తేయడంతో టీమిండియా గెలిచేందుకు పునాది పడింది. చెన్నై: సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ వేటలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71 బంతుల్లో 46; 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 41; 6 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 35.4 ఓవర్లలో 165 పరుగులు జోడించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం ఢిల్లీలో అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. సమష్టి వైఫల్యం... ఓపెనర్ మిచెల్ మార్ష్ (0)ను తన రెండో ఓవర్లోనే వెనక్కి పంపి బుమ్రా భారత్‌కు శుభారంభం అందించగా... వార్నర్, స్మిత్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నారు. 10 ఓవర్లలో స్కోరు 43 పరుగులకు చేరింది. రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం తర్వాత భారత స్పిన్నర్ల జోరు మొదలైంది. వికెట్లు తీయడంతో పాటు పరుగులు కూడా ఇవ్వకుండా ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కుల్దీప్ చక్కటి బంతితో వార్నర్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, తర్వాతి 3 వికెట్లు జడేజా ఖాతాలో చేరాయి. స్మిత్‌ను బౌల్డ్ చేసిన జడేజా... ఒకే ఓవర్లో లబుషేన్ (27), క్యారీ (0)లను వెనక్కి పంపాడు. ఒకదశలో 73 బంతుల పాటు ఆసీస్ బౌండరీ కొట్టలేకపోయింది! కీలక బ్యాటర్ మ్యాక్స్‌వెల్ (15)ను కుల్దీప్ బౌల్డ్ చేయగా, అదే స్కోరు వద్ద గ్రీన్ (8) వికెట్ అశ్విన్ ఖాతాలో చేరింది. అయితే మిచెల్ స్టార్క్ (35 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ ఆసీస్‌ను 200 పరుగులకు చేరువగా తీసుకొచ్చింది. కమిన్స్ (15), జంపా (6), హాజల్‌వుడ్ (1 నాటౌట్)లతో చివరి మూడు వికెట్లకు కలిపి స్టార్క్ 59 పరుగులు జోడించడం విశేషం. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత జట్టు అనూహ్య రీతిలో తడబడింది. ‘డెంగీ’తో శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (0) దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి అవుట్ కాగా, హాజల్‌వుడ్ వేసిన చక్కటి బంతికి రోహిత్ శర్మ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (0) నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు. 19 ఏళ్ల తర్వాత వన్డేల్లో భారత ఓపెనర్లిద్దరు డకౌట్ కాగా, టాప్–4లో ముగ్గురు డకౌట్ కావడం వన్డేల్లో భారత్‌కు ఇదే మొదటిసారి. వీరిద్దరి భాగస్వామ్యంలో జట్టు కోలుకుంది. 10 ఓవర్లలో భారత్ స్కోరు 27/3. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో కోహ్లి, రాహుల్ ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో నెమ్మదిగా పరుగులు రాబడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 75 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భారత్ స్కోరు కూడా 25.3 ఓవర్లలో సరిగ్గా వంద పరుగులకు చేరింది. ఆ తర్వాత 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. సెంచరీ దిశగా వెళుతున్న కోహ్లి చివరకు విజయానికి 33 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అయితే హార్దిక్ పాండ్యా (11 నాటౌట్)తో కలిసి రాహుల్ ఆట ముగించాడు. గెలిచేందుకు ఐదు పరుగులు అవసరం కాగా, సిక్సర్ కొట్టిన రాహుల్‌కు కూడా సెంచరీ చేసే అవకాశం చేజారింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే... భారత్ స్కోరు 20/3... ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. హాజల్‌వుడ్ వేసిన బంతిని కోహ్లి పుల్ చేయబోగా బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేచింది. కీపర్ క్యారీ, మిడ్ వికెట్ నుంచి మార్ష్ ముందుకు దూసుకొచ్చారు. క్యారీ వెనక్కి తగ్గగా, క్యాచ్‌ను అందుకోగలిగే స్థితిలో ఉండి కూడా మార్ష్ చేతుల్లో పడిన బంతిని వదిలేశాడు. ఆ సమయంలో కోహ్లి స్కోరు 12. ఆ క్యాచ్ మార్ష్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి అండ్ బి) కుల్దీప్ 41; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; స్మిత్ (బి) జడేజా 46; లబుషేన్ (సి) రాహుల్ (బి) జడేజా 27; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 15; క్యారీ (ఎల్బీ) (బి) జడేజా 0; గ్రీన్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 8; కమిన్స్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 15; స్టార్క్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 28; జంపా (సి) కోహ్లి (బి) పాండ్యా 6; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 199. వికెట్ల పతనం: 1–5, 2–74, 3–110, 4–119, 5–119, 6–140, 7–140, 8–165, 9–189, 10–199. బౌలింగ్: బుమ్రా 10–0–35–2, సిరాజ్ 6.3–1–26–1, పాండ్యా 3–0–28–1, అశ్విన్ 10–1–34–1, కుల్దీప్ 10–0–42–2, జడేజా 10–2–28–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 0; ఇషాన్ కిషన్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 0; కోహ్లి (సి) లబుషేన్ (బి) హాజల్‌వుడ్ 85; అయ్యర్ (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 0; రాహుల్ (నాటౌట్) 97; పాండ్యా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (41.2 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–2, 4–167. బౌలింగ్: స్టార్క్ 8–0–31–1, హాజల్‌వుడ్ 9–1–38–3, కమిన్స్ 6.2–0–33–0, మ్యాక్స్‌వెల్ 8–0–33–0, గ్రీన్ 2–0–11–0, జంపా 8–0–53–0. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సఫారీ... రికార్డుల సవారీ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ తొలి మూడు మ్యాచ్‌లలో అంతంతమాత్రం ప్రదర్శనతో నిరాశ చెందిన అభిమానులకు నాలుగో మ్యాచ్ అసలైన వినోదాన్ని అందించింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన పోరు కొత్త రికార్డులకు వేదికగా నిలిచింది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయిన దక్షిణాఫ్రికా అసాధారణ స్కోరు సాధిస్తే... ఓటమి ఎదురైనా పూర్తిగా చేతులెత్తేయకుండా లంక కూడా ఆఖరి వరకు పోరాడింది. చివరకు 102 పరుగుల తేడాతో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. అనంతరం శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 428/5 వరల్డ్ కప్‌లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోరు. 1 ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా వన్డేల్లో ఇది నాలుగో సారి. ఇందులో మూడు దక్షిణాఫ్రికావే. 49 బంతులు మార్క్రమ్ ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్ ఓబ్రైన్ (50 బంతులు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. -
అసలు సమరానికి సై!
ప్రపంచకప్ గెలిచే వరకు మన పని పూర్తి కాదని గొప్పవాళ్లు తరచుగా చెబుతుంటారు. అది వాస్తవం కూడా. అందుకే మేమూ దానిని గెలవాలని కోరుకుంటున్నాం. అయితే దానికో పద్ధతి ఉంది. దానిని పాటించాలి. ఎలాగైనా గెలవాలని మొండిగా వెళితే తప్పులు జరగవచ్చు. వరల్డ్ కప్ గెలవాలనే కోరిక, ఆశ ఉండటంతో తప్పు లేదు. కానీ అన్నీ కలిసి రావాలి. 99 శాతం మన శ్రమ తర్వాత ఆ ఒక్క శాతం అదృష్టం దేవుడి చేతుల్లో ఉంటుంది. భారత క్రికెటర్లపై ఒత్తిడి ఎప్పుడైనా ఉండేదే. అది సహజం. అయితే దానిని అధిగమించగల అనుభవం జట్టులో చాలా మందికి వచ్చేసింది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ చెన్నై: వన్డే క్రికెట్లో మరోసారి జగజ్జేతగా నిలిచే లక్ష్యంతో భారత జట్టు తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది. అభిమానుల భారీ అంచనాలను మోస్తూ ఈ మెగా ఈవెంట్లో టీమిండియా నేడు మొదటి మ్యాచ్‌లో మరో మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. టోర్నీ ప్రారంభమైన తర్వాత తొలి నాలుగు రోజుల్లో అంతంతమాత్రమంగా ఉన్న అభిమాన ప్రదర్శన ఈ మ్యాచ్‌తో ఆకాశాన్ని తాకనుంది. ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత ప్రత్యర్థి గురించి ఇరు జట్లకూ తగిన అవగాహన ఉండటంతో ఆసక్తికర పోరు ఖాయం. రెండు పెద్ద జట్ల మధ్య జరిగే ఈ సమరం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. బరిలో ఇషాన్ కిషన్... వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచ క్రికెట్లో తనకు ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాలని కోరుకుంటున్న రోహిత్ శర్మకు ఇది కీలక మ్యాచ్. పటిష్ట జట్టును తొలి పోరులో ఓడిస్తే టోర్నీ తర్వాతి మ్యాచుల్లో ఆ ఆత్మవిశ్వాసం కొనసాగడం ఖాయం. అయితే రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్ చేసే గిల్ ‘డెంగీ’ కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం కాస్త నిరాశపర్చే అంశం. కానీ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉండటం సానుకూలాంశం. రోహిత్, కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఫామ్ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. వీరంతా కలిసి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. బౌలింగ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని రోహిత్ ఇప్పటికే చెప్పాడు. కుల్దీప్తో పాటు సొంతగడ్డపై అశ్విన్ బరిలోకి దిగడం ఖాయం. మూడో స్పిన్నర్‌గా జడేజా తనవంతు పాత్ర పోషిస్తాడు. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు ఆరంభంలో ప్రభావం చూపిస్తే జట్టుకు తిరుగుండదు. ఆత్మవిశ్వాసంతో ఆసీస్... ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఓడి వన్డే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో గెలుపు జట్టుకు ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో మ్యాక్స్‌వెల్ ప్రదర్శన జట్టు బలం పెంచింది. రెగ్యులర్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా రాణించాల్సి ఉంది. అటు అనుభవం, ఇటు రికార్డులపరంగా కూడా ఆసీస్ పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ ఏ పిచ్‌పైనైనా ప్రభావం చూపగలరు. స్టొయినిస్, గ్రీన్ రూపంలో జట్టులో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్టొయినిస్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఆ్రస్టేలియా బ్యాటింగ్ బృందం కూడా చాలా పటిష్టంగా ఉంది. భారత గడ్డపై అపార అనుభవం ఉన్న వార్నర్‌కు దూకుడైన మిచెల్ మార్ష్ జత కలిస్తే శుభారంభాలు ఖాయం. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు స్మిత్, లబుషేన్ ఉన్నారు. లోయర్ ఆర్డర్లో క్యారీ, మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడగల సమర్థులు. భారత్‌లాగే ఆసీస్ కూడా వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటి. ఆ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే భారత్‌కు గెలుపు అంత సులువు కాదు. 12 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్‌ల్లో... ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చెన్నైలో ఈ రెండు జట్లు మూడుసార్లు పోటీపడ్డాయి. భారత్ ఒక మ్యాచ్‌లో, ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. అయితే మరీ భారీ స్కోర్లకు అవకాశం లేదు. మ్యాచ్‌కు వాడబోయే పిచ్ నల్లరేగడి మట్టిది కావడంతో కాస్త నెమ్మదిగా ఉంటుంది. స్పిన్‌కు అనుకూలిస్తుంది కూడా. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ఆసాంతం కాకపోయినా కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించవచ్చు. శనివారం సాయంత్రం చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, గ్రీన్, క్యారీ, మ్యాక్స్‌వెల్, స్టార్క్, హాజల్‌వుడ్, జంపా. -
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది. -
‘డచ్’ పని పట్టిన పాక్
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు, అసాధారణ బౌలింగ్ లేకపోయినా సమష్టి తత్వంతో ఆ జట్టు తొలి అడుగును విజయవంతంగా వేసింది. అసోసియేటెడ్ టీమ్ నెదర్లాండ్స్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తమ ఆటతో మ్యాచ్‌లో అక్కడక్కడ పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు నెదర్లాండ్స్ సులువుగానే తలవంచింది. ‘ఆరెంజ్’ జట్టు సంచలన విజయానికి ఈ ఆట సరిపోలేదు. సాక్షి, హైదరాబాద్: రెండు వామప్ మ్యాచ్‌లతో ఉప్పల్ స్టేడియంపై అంచనాకు వచ్చిన పాకిస్తాన్ ఈ వారం రోజుల అనుభవాన్ని అసలు మ్యాచ్‌లో సమర్థంగా వాడుకుంది. శుక్రవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ పోరులో పాక్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సౌద్ షకీల్ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 68; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బాస్ డి లీడ్ (68 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), విక్రమ్‌జిత్ సింగ్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. సెంచరీ భాగస్వామ్యం... కనీసం 300 పరుగులు నమోదు చేస్తాం. టాస్ సమయంలో పాక్ కెపె్టన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. అయితే దానికి చేరువగా వెళ్లడంలో పాక్ సఫలమైంది. ఆరంభ ఓవర్లలో ప్రదర్శన చూస్తే అది కష్టంగానే అనిపించినా రెండు కీలక భాగస్వామ్యాలు జట్టును ఆదుకున్నాయి. తొలి పవర్‌ప్లేలో 9.1 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫఖర్ (12), ఇమామ్ (15)లతో పాటు కెపె్టన్ బాబర్ ఆజమ్ (5) కూడా తొందరగా వెనుదిరిగారు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత చక్కటి షాట్లతో దూకుడు పెంచారు. ఈ క్రమంలో షకీల్ 32 బంతుల్లో, రిజ్వాన్ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి శతక భాగస్వామ్యం తర్వాత తక్కువ వ్యవధిలో పాక్ 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నవాజ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు), షాదాబ్ (34 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 70 బంతుల్లో 64 పరుగులు జత చేశారు. చివరి 2 వికెట్లకు కలిపి మరో 34 పరుగులు రావడం కూడా పాక్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. ఆ ఇద్దరు మినహా... ఛేదనలో నెదర్లాండ్స్‌కు విక్రమ్‌జిత్ చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. అయితే తక్కువ వ్యవధిలో జట్టు డౌడ్ (5), అకెర్మన్ (17) వికెట్లు కోల్పోయింది. దాంతో విక్రమ్‌జిత్‌కు డి లీడ్ జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 76 బంతుల్లో 70 పరుగులు జత చేసింది. అయితే 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విక్రమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తేజ నిడమనూరు (5) విఫలం కాగా, డచ్ ఆ వెంటనే మరో 2 చేజార్చుకుంది. అయితే డి లీడ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు టీమ్‌కు కాస్త ఆశలు ఉన్నాయి. 50 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. నవాజ్ చక్కటి బంతిని లీడ్ బౌల్డ్ కావడంతో ‘డచ్’ జట్టు ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ (సి అండ్ బి) వాన్ బీక్ 12; ఇమామ్ (సి) దత్ (బి) మీకెరెన్ 15; బాబర్ (సి) సాఖిబ్ (బి) అకెర్మన్ 5; రిజ్వాన్ (బి) డి లీడ్ 68; షకీల్ (సి) సాఖిబ్ (బి) దత్ 68; ఇఫ్తికార్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 9; నవాజ్ (రనౌట్) 39; షాదాబ్ ఖాన్ (బి) డి లీడ్ 32; హసన్ అలీ (ఎల్బీ) (బి) డి లీడ్ 0; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 13; రవూఫ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–15, 2–34, 3–38, 4–158, 5–182, 6–188, 7–252, 8–252, 9–267, 10–286. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–48–1, వాన్ బీక్ 6–0–30–1, అకెర్మన్ 8–1–39–2, మీకెరెన్ 6–0–40–1, డి లీడ్ 9–0–62–4, మెర్వ్ 6–0– 36– 0, విక్ర మ్జిత్ 2–0–16–0, సాఖిబ్ 2–0– 15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (సి) ఫఖర్ (బి) షాదాబ్ 52; మ్యాక్స్ డౌడ్ (సి) షాహిన్ (బి) హసన్ 5; అకెర్మన్ (బి) ఇఫ్తికార్ 17; డి లీడ్ (బి) నవాజ్ 67; తేజ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 5; ఎడ్వర్డ్స్ (ఎల్బీ) (బి) రవూఫ్ 0; సాఖిబ్ (ఎల్బీ) (బి) షాహిన్ 10; వాన్‌డర్ మెర్వ్ (రనౌట్) 4; వాన్ బీక్ (నాటౌట్) 28; దత్ (బి) హసన్ 1; మీకెరెన్ (బి) రవూఫ్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–28, 2–50, 3–120, 4–133, 5–133, 6–158, 7–164, 8–176, 9–184, 10–205. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 7–0–37–1, హసన్ అలీ 7–1–33–2, రవూఫ్ 9–0–43–3, ఇఫ్తికార్ అహ్మద్ 3–0–16–1, మొహమ్మద్ నవాజ్ 7–0– 31–1, షాదాబ్ ఖాన్ 8–0–45–1. ప్రపంచకప్‌లో నేడు అఫ్గానిస్తాన్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వరల్డ్ కప్ టెన్నికాయిట్ పోటీల్లో మెరిసిన హేమమాధురి
ఏలూరు రూరల్: సౌతాఫ్రికాలో జరిగిన టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారిణి జి.హేమమాధురి కాంస్య పతకం సాధించిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి సంపంగి తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు సౌతాఫ్రికాలో 5వ టెన్నికాయిట్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయని, శుక్రవారం జరిగిన జూనియర్ డబుల్స్ విభాగంలో విశాఖపట్టణం క్రీడాకారిణి ఆర్.మౌనికతో కలిసి హేమమాధురి తృతీయస్థానంలో నిలిచిందని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఈ క్రీడాకారిణి పలుసార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి బాలికల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. విజేతలను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్ యు.రాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.రవీంద్ర అభినందించారు. -
స్పందన కరువైంది...
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ అంటే సహజంగా క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. టాస్ వేసేసరికే స్టేడియాలు నిండిపోతాయి. కానీ ఈ మ్యాచ్‌పై అహ్మదాబాద్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించినట్లుగా లేదు. మ్యాచ్ ఆరంభమైన చాలాసేపటి వరకు కూడా స్టేడియంలో చాలా భాగం ఖాళీగా కనిపించింది. భారత్ లేని మ్యాచ్‌కు లక్షకు పైగా సామర్థ్యం ఉన్న స్టేడియం ఫ్యాన్స్‌తో హౌస్‌ఫుల్ అవుతుందని కోరుకోవడం అత్యాశే అయినా మరీ నామమాత్రంగా కూడా జనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చివరి వరకు వేర్వేరు కారణాలతో టికెట్లు అమ్మకానికి ఉంచకపోవడం, నగరంలో తీవ్రమైన ఎండ, వారాంతం కాకపోవడం కూడా అందుకు కారణాలు కావచ్చు. 40 వేల టికెట్లను స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలకు పంచి పెట్టారు. టికెట్లు తీసుకున్న వారంతా వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదని తెలిసింది. నిజానికి ఇలాంటి మెగా ఈవెంట్లు ఆతిథ్య జట్టు మ్యాచ్‌తో ప్రారంభం కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి ‘ఫైనలిస్ట్’లతో పోరు ఖరారు చేశారు. మ్యాచ్ సాగినకొద్దీ సాయంత్రానికి స్టేడియంలో ప్రేక్షకులు సంఖ్య పెరగడం కాస్త ఊరట. -
కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్’చాడు
గత ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్‌కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్‌ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్‌కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ బ్యాటింగ్ ఆపై పసలేని బౌలింగ్‌తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది. కివీస్ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి కాన్వే, రచిన్ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్+సచిన్ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్ అటు క్లాస్, ఇటు మాస్ ఆటను కూడా చూపించడం విశేషం. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, జోస్ బట్లర్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్ 36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్‌కు న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్ –విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్ సవరించారు. కీలక భాగస్వామ్యం... బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్‌ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్ రెండో బంతినే బెయిర్‌స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్‌గా మలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ‘సిక్స్’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో రూట్, బట్లర్ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్‌కు ఫలితం దక్కలేదు. ఆడుతూ పాడుతూ... స్యామ్ కరన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే యంగ్ (0) అవుట్! దాంతో కివీస్ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83 బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 33; మలాన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; రూట్ (బి) ఫిలిప్స్ 77; బ్రూక్ (సి) కాన్వే (బి) రవీంద్ర 25; మొయిన్ అలీ (బి) ఫిలిప్స్ 11; బట్లర్ (సి) లాథమ్ (బి) హెన్రీ 43; లివింగ్‌స్టోన్ (సి) హెన్రీ (బి) బౌల్ట్ 20; కరన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; వోక్స్ (సి) యంగ్ (బి) సాన్‌ట్నర్ 11; ఆదిల్ రషీద్ (నాటౌట్) 15; వుడ్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. బౌలింగ్: బౌల్ట్ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్‌ట్నర్ 10–0–37–2, నీషమ్ 7–0–56–0, రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్ 3–0–17–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (నాటౌట్) 152; యంగ్ (సి) బట్లర్ (బి) కరన్ 0; రచిన్ రవీంద్ర (నాటౌట్) 123; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్: వోక్స్ 6–0–45–0, స్యామ్ కరన్ 6–2–47–1, వుడ్ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్ 7–0–47–0, లివింగ్‌స్టోన్ 3–0–24–0. ప్రపంచకప్‌లో నేడు పాకిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నలభయ్యారు రోజుల పండుగ!
నలభై ఆరు రోజులు... 48 మ్యాచ్‌లు... దేశంలోని 10 వేర్వేరు నగరాలు... 10 అంతర్జాతీయ క్రికెట్ జట్లు. ఒక క్రీడా సంరంభానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? అక్టోబర్ 5న ఆరంభమైన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్–2023 కచ్చితంగా మరో పెద్ద ఆటల పండుగ. ఒక పక్కన చైనాలో ఆసియా క్రీడోత్సవాల హంగామా సాగుతుండగానే మన గడ్డపై మరో సందడి మొదలైపోయింది. నాలుగేళ్ళకు ఓసారి సాగే అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ షురూ అయింది. నిరుటి ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారీ బలమైన జట్టుగా ముందుకు వస్తుంటే, సొంతగడ్డపై సాగుతున్న పోటీలో కప్పు కొట్టాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సైతం బలమైన పోటీదార్లుగా నిలుస్తుంటే, ఆఖరు నిమిషంలో తడబడతారనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు ‘అనూహ్యమైన గెలుపుగుర్రం’ కావచ్చని ఓ అంచనా. గత వరల్డ్ కప్‌లో లానే పోటీలో పాల్గొనే పది జట్లూ లీగ్ దశలో పరస్పరం తలపడే ఈ ప్రపంచపోటీ రానున్న నెలన్నర కాలంలో విస్తృత చర్చనీయాంశం కానుంది. యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్‌ల వరల్డ్ కప్‌కు గతంలో 1987, 1996, 2011ల్లో భారత్ ఆతిథ్యమిచ్చింది. అయితే, అప్పుడు ఉపఖండంలోని ఇతర దేశాల సహ ఆతిథ్యంలో అవి సాగాయి. కానీ, ఈసారి పూర్తిగా మనమే ఆతిథ్యమిస్తున్నాం. సరిగ్గా దసరా, దీపావళి పండుగ సీజన్లోనే వరల్డ్ కప్ రావడంతో తమకు కలిసొస్తుందని ప్రకటనకర్తలు భావిస్తున్నారు. తమ ఉత్పత్తుల కొనుగోళ్ళు పెరుగుతాయని బ్రాండ్లన్నీ ఉత్సాహపడుతున్నాయి. దానికి తోడు ఆతిథ్య దేశం భారత్ కావడంతో ఉత్పత్తుల ప్రచారం మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాయి. ఈ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో సింహభాగం తాజా వరల్డ్ కప్‌కు అధికారిక మీడియా హక్కులున్న డిస్నీ స్టార్‌కు చేరుతుంది. పలు బ్రాండ్లు టీవీ, డిజిటల్ వేదికల్లో స్పాన్సర్షిప్ కోసం డిస్నీస్టార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాకౌట్ మ్యాచ్‌ల వేళ టీవీలో 10 సెకన్ల ప్రకటన ఇప్పుడు రూ. 30 లక్షల పైనే అని వార్త. ఈ వరల్డ్ కప్‌తో ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య, ఆహార రంగాలు ప్రధానంగా లబ్ధి పొందుతాయని నిపుణుల విశ్లేషణ. మ్యాచ్‌ల పుణ్యమా అని ఇప్పటికే విమాన టికెట్ల రేట్లు, హోటల్ బస రేట్లు భారీగా పెరిగాయి. దేశ స్టాక్ మార్కెట్‌పైనా గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. సినిమా, క్రికెట్‌లంటే ప్రాణాలిచ్చే భారత్‌లో మామూలుగా అయితే, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే చంద్రమండల యాత్ర అంత సంబరం ఉండాలి. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఆ క్రేజు వ్యాపారంలోనే తప్ప వ్యవహారంలో కనిపించట్లేదు. మన దేశమే పూర్తిగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ, తాజా కప్‌కు ముందస్తు హంగామా అంతగా లేదు. దాదాపు లక్షా 30 వేల మంది కూర్చొనే సౌకర్యంతో ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియమ్గా పేరొందిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియమ్లో గురువారం అంతా కలిపి 20 వేల మంది కూడా లేరు. ఆది నుంచీ ఆన్లైన్లో కొనడానికి టికెట్లు దొరకలేదు గానీ, తీరా మ్యాచ్ రోజున మైదానమంతా ఖాళీగా ఉంది. లార్డ్స్‌లో గత 2019 వరల్డ్ కప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ తాజా ప్రపంచ కప్‌ను ప్రారంభించారు. కానీ లాభం లేకపోయింది. భారత జట్టుతో తొలి మ్యాచ్ మొదలుపెడితే ఊపు వచ్చేదేమో! నిజానికి, 1999 నుంచి ఐసీసీ వరల్డ్ కప్‌గా పేరుబడ్డ ఈ పోటీల్లో ఆతిథ్యదేశం ఆరంభమ్యాచ్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అదెందుకు మార్చారో తెలియదు. ఈసారి మ్యాచ్ టికెట్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఆఖరి నిమిషంలో మ్యాచ్‌ల తేదీలు, వేదికలు మారిపోయాయి. ఇవి చాలదన్నట్టు 2000లల్లో టీ20 మ్యాచ్‌లకు అలవాటు పడ్డ కొత్త తరానికి ఐపీఎల్ సరికొత్త నంబర్ వన్ టోర్నమెంట్‌గా అవతరించింది. వెరసి, 2011లో భారత్ ఆతిథ్యమిచ్చినప్పటితో పోలిస్తే పన్నెండేళ్ళ తర్వాతి ఈ వరల్డ్ కప్ ఆ స్థాయి హడావిడి సృష్టించట్లేదు. అలాగే, గతంలో వరల్డ్ థీమ్సాంగ్ ప్రతి ఛానల్లో మోత మోగేది. ఈసారి రణ్‌బీర్ సింగ్‌తో చేసిన ‘దిల్ జష్న్ బోలే...’ పాట విఫలమైంది. ఇక, మైదానం వెలుపల అవలక్షణాలకు కొదవ లేదు. ఐసీసీ వార్షిక ఆదాయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వాటా 72 శాతానికి పెరిగింది. మిగతా దేశాల క్రికెట్ బోర్డులు బాగా వెనకబడ్డాయి. దాంతో, ఎప్పటిలానే బీసీసీఐ తన హజం చూపిస్తోంది. బీసీసీఐ అక్రమాలకు నెలవంటూ సుప్రీమ్ కోర్ట్ వేసిన ముగ్గురు సభ్యుల సంఘం నివేదిక లోపాలెత్తిచూపినా అది తన పంథా మార్చుకోలేదు. చిత్రంగా అధికారిక అమ్మకాలు మొదలైనా కాక ముందే టికెట్లు ‘అమ్ముడైపోయాయి’ అని బోర్డులు వెలిశాయి. మచ్చుకు, అహ్మదాబాద్‌లోని అదే భారీ స్టేడియమ్లో జరిగే భారత – పాకిస్తాన్ మ్యాచ్‌కు 8500 టికెట్లే అమ్మకానికి పెట్టారంటే ఏమనాలి? భారీ క్రికెట్ వేదికలైన ముంబయ్, కోలకతాలను వెనక్కినెట్టి, ఈసారి అహ్మదాబాద్ ముందుకు రావడంలోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆటకు సంబంధం లేని ఇతర ప్రయోజనాలను పక్కనపెట్టి, భారత్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఇది మరో అవకాశం. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరోసారి మన పేరు మోగడానికి మంచి సందర్భం. దాన్ని చేజార్చుకోకూడదు. 1975లో మొదలైనప్పటి నుంచి ఆతిథ్య దేశాలేవీ కప్ గెల్చుకోలేదన్న వాదనను 2011 ఏప్రిల్‌లో మన ధోనీ సేన సమర్థంగా తిప్పికొట్టింది. తర్వాత 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లు అదే బాటలో నడిచాయి. కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మన్లు, బుమ్రా, షమీ, షిరాజ్ లాంటి పేసర్లు, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లతో పటిష్ఠమైన రోహిత్ సేన ఆ కథ పునరావృతం చేయాలని ఆశ. రాజకీయాల కన్నా ఆట, వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం గొప్పదని గ్రహిస్తే, నిర్వాహకులైనా, ఆటగాళ్ళైనా అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు! -
నేటి నుంచే వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభం
-
ICC World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌లకు స్పాన్సర్ల క్యూ..
న్యూఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లను స్పాన్సర్ చేసేందుకు కంపెనీలు భారీ ఎత్తున క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26 స్పాన్సర్లు, 500 ప్రకటనకర్తలు నమోదు చేసుకున్నట్లు టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ స్టార్ స్పోర్ట్స్ విభాగం హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. వీటిలో చాలా స్పాన్సర్లు టీవీ, డిజిటల్ ఫార్మాట్లను ఎంచుకోగా, కొన్ని కంపెనీలు కేవలం డిజిటల్ లేదా టీవీని మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించే 48 మ్యాచ్‌లను డిస్నీ స్టార్ తమ టీవీ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు తొమ్మిది భాషల్లో 100 పైచిలుకు కామెంటేటర్స్‌తో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు, తమిళం తదితర భాషలు కూడా ఉన్నాయి. పన్నెండేళ్ల తర్వా త వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌పై అంచనాలు.. పండుగ సీజన్ దన్ను ఆసియా కప్‌లో భారత మెరుగైన పనితీరు, పండుగ సీజన్, భారత్ టీమ్‌పై భారీ అంచనాలు తదితర సానుకూలాంశాల కారణంగా అడ్వరై్టజర్లు భారీగా ఆసక్తి చూపుతున్నట్లు గుప్తా చెప్పారు. అన్ని కేటగిరీల కంపెనీలూ స్పాన్సర్ చేసేందుకు లేదా ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. సాధారణంగా పండుగ సీజన్లో కంపెనీలు ప్రకటనలపై భారీగా వెచ్చిస్తుంటాయని తెలిపారు. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్‌పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్11, హెచ్‌యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్‌డాట్‌కామ్, పీటర్ ఇంగ్లాండ్, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్‌కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు న్నాయి. కోకా–కోలా, ఫోన్‌పే, హెచ్‌యూఎల్ వంటి పలు కంపెనీలు ఇటు టీవీ, అటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్పాన్సర్ చేస్తున్నాయి. అనువైన ప్యాకేజీలు.. ప్రకటనకర్తల బడ్జెట్, అవసరాలను బట్టి వారికి అనువైన ప్యాకేజీలను రూపొందించినట్లు గుప్తా చెప్పారు. ‘పండుగ సీజన్ సందర్భంగా.. ఎవరైనా అడ్వరై్టజరు దీపావళి సమయంలో ఎక్కువ మంది కస్టమర్లు తమ ఉత్పత్తులపై మక్కువ చూపుతారనే ఉద్దేశంతో పండుగకి ముందు ఓ రెండు వారాలపాటు ప్రకటనలు ఇవ్వదల్చుకున్నారనుకుందాం. కాస్త ప్రీమియం చెల్లించి ఆ వ్యవధిలో మాత్రమే తమ ప్రకటనలను ప్రసారం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా వారికోసం కస్టమైజ్డ్ ప్యాకేజీని అందిస్తున్నాం’ అని తెలిపారు. వరల్డ్ కప్‌లో మరింత మంది ప్రకటనకర్తలు భాగమయ్యేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘‘సెల్ఫ్–సర్వ్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రవేశపెట్టినట్లు గుప్తా తెలిపారు. ఏజెన్సీలు, అడ్వరై్టజర్లు సేల్స్ టీమ్స్ జోక్యం లేకుండా, తమకు అవసరమైన వాటిని స్వయంగా బుక్ చేసుకునే వీలుంటుందని వివరించారు. -
వరల్డ్‌కప్ ఫైట్.. మెగా టోర్నీకి సర్వం సిద్దం
ఒక్కరోజు చాలు... చరిత్ర మారిపోవడానికి... రికార్డులు బద్దలు కావడానికి... ఒక్కరోజు చాలు... అనామకులు అసాధ్యులుగా మారి అద్భుతాలు చేయడానికి... ఒక్కరోజు చాలు... హీరోలుగా కీర్తించబడినవారు జీరోలుగా మారిపోవడానికి... అభిమానులకు అంతులేని ఆనందం పంచేందుకు, ఎప్పటికీ మరచిపోలేని విషాదం మిగిల్చేందుకు కూడా ఆ ఒక్కరోజు చాలు... యాభై రెండేళ్ల క్రితం బుడిబుడి అడుగులు వేసిన ఒక్కరోజు ఆట 4657 సమరాల తర్వాత కాస్త అలసటకు లోనైనట్లుగా కనిపిస్తోంది. తనకంటే 146 ఏళ్ల క్రితం పుట్టిన ఆట తన పెద్దరికపు హోదాను నిలబెట్టుకుంటూ ఇంకా సజీవంగా సాగిపోతుంటే... తనకంటే 34 ఏళ్లు చిన్నదైన ఆట కూడా రోజురోజుకీ ఎదిగిపోతూ ధూమ్‌ధామ్‌గా వెలిగిపోతుంటే ఒక్కరోజు ఆటకే కొంత కాలంగా చిక్కొచ్చి పడింది. ఇప్పుడు దానికి కొత్త ఊపిరి కావాలి... వినోదాన్ని అందించడంలో నేనూ ఎక్కడా వెనుకబడిపోను అన్నట్లుగా ఒక ఊపు రావాలి... అందుకే సరైన సమయం, వేదిక కావాలి. అలాంటి సమయం వచ్చేసింది... వన్డే క్రికెట్ గొప్పతనాన్ని చూపించేందుకు, ఈ ఫార్మాట్ ముద్ర చూపించేందుకు ప్రపంచకప్‌కంటే సరైన వేదిక లేదు... అవును, ఇట్ టేక్స్ వన్ డే! నరాలు తెగే ఉత్కంఠతో ఫలితాన్ని అందించిన గత ప్రపంచకప్ తుది సమరం గుర్తుందా? నాలుగేళ్ల క్రితంనాటి ఆ జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరచిపోలేరు. ఆపై రెండు పొట్టి ప్రపంచకప్‌లు, రెండు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ సమరాల తర్వాత నేనున్నానంటూ మళ్లీ వన్డే విశ్వక్రీడా సంబరం వచ్చేసింది... ఈ నాలుగేళ్ల వ్యవధిలో జట్లు మారాయి, ఆటగాళ్లు మారారు, నిబంధనలూ మారాయి... కానీ విశ్వవ్యాప్తంగా అభిమానుల ఆశలు, అంచనాలు మాత్రం మారలేదు. మరోసారి వారి వినోదానికి భరోసానిస్తూ, గత పన్నెండు మెగా టోర్నీలకు ఏమాత్రం తగ్గకుండా ఈ వరల్డ్‌కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పుష్కర కాలం తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్ సొంతగడ్డపై 12 ఏళ్ల క్రితం నాటి ప్రదర్శనను పునరావృతం చేసే లక్ష్యంతో అమితోత్సాహంతో సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ ఆ్రస్టేలియా ఖాతాలో ఆరో టైటిల్ చేరుతుందా? ఇంగ్లండ్ తమ జోరును ఇక్కడా నిలబెట్టుకుంటుందా? మూడు దశాబ్దాలుగా దక్కని ద్రాక్ష పాక్‌కు అందుతుందా అనేది ఆసక్తికరం. ఎప్పటిలాగే కివీస్, దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలు నిజమవుతాయా లేక ఇతర సంచలనాలు ఉంటాయా అనేది 46 రోజులు చర్చనీయాంశమే! అహ్మదాబాద్: ఐసీసీ 13వ వన్డే వరల్డ్ కప్ సమరానికి సమయం వచ్చేసింది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నేడు అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19న ఇదే అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో 48 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. 2011 తర్వాత భారత్ మరోసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ చేరిన టీమిండియా స్వదేశంలో ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత టోర్నీ ఫార్మాట్ తరహాలోనే బరిలో 10 జట్లు నిలిచాయి. ప్రతీ టీమ్ ఇతర తొమ్మిది జట్లతో తలపడుతుంది. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్ చేరతాయి. వరల్డ్ కప్ తొలి రెండు టోర్నీల్లో జగజ్జేతగా నిలిచి సుదీర్ఘ కాలం క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే. ఈసారి ర్యాంకింగ్ ద్వారా ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా... క్వాలిఫయింగ్ టోర్నీ ఆడి మాజీ విజేత శ్రీలంక, నెదర్లాండ్స్ అవకాశం దక్కించుకున్నాయి. 10 మ్యాచ్‌లు జరిగే వేదికల సంఖ్య. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, పుణే, హైదరాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీస్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదిక కానుండగా, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లో మినహా మిగతా 9 వేదికల్లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. 1 భారత్ తొలిసారి ఈ టోర్నీని పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. 1987లో పాక్‌తో, 1996లో పాక్, శ్రీలంకలతో, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి సంయుక్తంగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. రూ. 83 కోట్లు టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ. ఇందులో విజేతకు రూ. 33 కోట్లు, రన్నరప్‌కు రూ.16.50 కోట్లు అందిస్తారు. 51 టోర్నీలో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య. 1 గత వరల్డ్‌కప్‌లోనూ, ఈసారి జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరిస్తున్న ఏకైక ఆటగాడు కేన్ విలియమ్సన్. మిగతా అన్న జట్లకూ సారథులు మారారు. ఇంగ్లండ్ X న్యూజిలాండ్ 2019 ఫైనలిస్ట్‌ల మధ్య టోర్నీ తొలి మ్యాచ్ జరుగుతుంది. 1996లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఇదే అహ్మదాబాద్‌లో టోర్నీ తొలి మ్యాచ్ జరిగింది. గత విజేతలు ఆస్ట్రేలియా (5 సార్లు; 1987, 1999, 2003, 2007, 2015). భారత్ (2 సార్లు; 1983, 2011). వెస్టిండీస్ (2 సార్లు; 1975, 1979). పాకిస్తాన్ (1992). శ్రీలంక (1996). ఇంగ్లండ్ (2019). -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
AUS vs PAK: ఉప్పల్ స్టేడియంలో ఆసీస్ , పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
రాహుల్‌కు మొదటి అవకాశం
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయ పడ్డారు. ఇషాన్ కిషన్కంటే మిడిలార్డర్లో రాహుల్ ఎంతో విలువైన ఆటగాడని ఆయన అన్నారు. తన ప్రదర్శనతో దీనిని అతను రుజువు చేసుకున్నాడని, మరో చర్చకు ఆస్కారం లేద ని ప్రసాద్ చెప్పారు. రాహుల్‌కు గాయం కావడం లేదా సుదీర్ఘ టోర్నీ కాబట్టి కొన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా విశ్రాంతినివ్వాల్సి వస్తేనే ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎమ్మెస్కే వివరించారు. -
విశాఖలో వెలుగుచూసిన రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా
-
అక్షర్ స్థానంలో అశ్విన్
న్యూఢిల్లీ: తొడ కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వన్డే ప్రపంచకప్ టోరీ్నకి దూరమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ కోసం ఈనెల 5న బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అక్షర్ పటేల్ ఉన్నాడు. అయితే ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్–4 మ్యాచ్‌లో గాయపడ్డ అక్షర్ పటేల్ ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అక్షర్ పటేల్ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాలు పట్టే అవకాశం ఉండటంతో వన్డే ప్రపంచకప్ కోసం అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్, తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడిన అశ్విన్ తన వైవిధ్యభరిత బౌలింగ్‌తో ఆకట్టుకొని నాలుగు వికెట్లు తీశాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగే వామప్ మ్యాచ్ కోసం గువాహటి బయలుదేరిన భారత జట్టుతో అశ్విన్ కూడా ఉన్నాడు. అశ్విన్‌కిది మూడో వన్డే ప్రపంచకప్ కానుంది. స్వదేశంలో ధోని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులో అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లోనూ అశ్విన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు అశ్విన్ 115 వన్డేలు ఆడి 155 వికెట్లు తీయడంతోపాటు 707 పరుగులు సాధించాడు. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే ప్రపంచకప్ కోసం తుది జట్లలో మార్పులు చేర్పులకు గురువారంతో గడువు ముగిసింది. మరోవైపు ఆ్రస్టేలియా వరల్డ్ కప్ జట్టులోనూ ఒక మార్పు చోటు చేసుకుంది. పిక్క కండరాల గాయం నుంచి ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో లబుషేన్ 283 పరుగులు... భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 138 పరుగులు సాధించాడు. చేతి వేలి గాయంతో బాధపడుతున్నప్పటికీ ట్రావిస్ హెడ్‌ను వరల్డ్ కప్ జట్టులో కొనసాగించాలని క్రికెట్ ఆ్రస్టేలియా నిర్ణయం తీసుకుంది. -
ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టిన పాక్ జట్టు
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులు రెండు వారాల పాటు హైదరాబాద్ నగరంలో అతిథులుగా ఉండబోతున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో రెండు వామప్ మ్యాచ్‌లతో పాటు రెండు ప్రధాన మ్యాచ్‌లను కూడా పాకిస్తాన్ ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. మెగా టోర్నీలో పాల్గొనేందుకు బాబర్ ఆజమ్ నాయకత్వంలోని 15 మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో హెచ్‌సీఏ ప్రతినిధులు పాక్ జట్టుకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో జట్టుకు నగర పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పాక్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టడం విశేషం. 2016లో ఇక్కడే టి20 ప్రపంచకప్ ఆడిన ఆ టీమ్ మళ్లీ ఇప్పుడే మరో వరల్డ్ కప్ కోసం ఇక్కడకు వచ్చింది. టీమ్‌లోని మొహమ్మద్ నవాజ్, సల్మాన్ ఆగాలకు మాత్రమే గతంలో భారత్‌లో ఆడిన అనుభవం (జూనియర్ స్థాయిలో) ఉండగా... టీమ్ కెప్టెన్, ఇప్పటి అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్ తొలిసారి భారత్‌లో ఆడబోతున్నాడు. భారత్ బయల్దేరే ముందు లాహోర్‌లో మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజమ్ తమ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ‘గతంలో భారత్‌లో ఆడకపోయినా మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. దాదాపు ఆసియా ఖండంలోనే ఇతర దేశాల్లాగే ఉండే ఇక్కడి పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. అందుకే మేం తగిన విధంగా సన్నద్ధమై వచ్చాం. హౌస్‌ఫుల్‌గా ఉండబోయే అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. నా సొంత రికార్డుల గురించి ఆలోచన లేదు. ఎంత స్కోరు చేసినా జట్టు విజయానికి ఉపయోగపడటం ముఖ్యం’ అని బాబర్ అన్నాడు. ఉప్పల్ స్టేడియంలో రేపు న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 3న ఆ్రస్టేలియాతో పాకిస్తాన్ రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ప్రధాన టోర్నీలో అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 10న శ్రీలంకతో ఆ జట్టు తలపడుతుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ నేతృత్వంలో క్రైస్ట్‌చర్చ్ నుంచి వచ్చిన న్యూజిలాండ్ టీమ్ రెండో బృందం కూడా బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకుంది. -
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
IND vs AUS: పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సింది.. సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో ఆడాల్సిందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ , కోహ్లిలకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. "మరో పక్షం రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ్రస్టేలియాతో జరిగే పోరును ఒక ద్వైపాక్షిక సిరీస్‌లా కాకుండా వామప్ మ్యాచ్‌ల తరహాలోనే భారత్ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. భారత జట్టు ఎంపికను చూస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రోహిత్, కోహ్లి, పాండ్యాలాంటి వారిని పక్కన పెట్టడంతో బ్యాటింగ్ బాగా బలహీనంగా మారిపోయింది. వరల్డ్‌కప్‌కు ముందు జాగ్రత్త కోసం బౌలర్లకు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో గత రెండు వన్డే సిరీస్‌లను కూడా ఆ్రస్టేలియానే గెలుచుకుంది. అలాంటప్పుడు ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌లో గెలిస్తే టీమిండియా మరింత ఉత్సాహంతో ప్రపంచకప్ బరిలోకి దిగేది. సీనియర్లు లేకపోవడం వల్ల ఆ అవకాశం తగ్గిందనేది వాస్తవం. ఇలాంటి సిరీస్‌ను తక్కువ చేసి చూడటం భారత అభిమానులను నిర్ఘాంతపరిచేదే. ఆ్రస్టేలియా జట్టు ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటని అంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆసియా కప్ గెలిచిన జోరులో అలాంటి జట్టును భారత్ ఓడిస్తే ఎంతో బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ఆసీస్ గెలిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సీనియర్లకు విశ్రాంతినిస్తే ఏం జరిగిందో చూశాం. వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అక్షర్ పటేల్ సమయానికి కోలుకోకపోతే అశి్వన్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఈ సిరీస్‌లో బాగా ఆడితే తుది జట్టులో తమ స్థానం కోసం షమీ, శార్దుల్ కూడా పోటీ పడవచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకోవాలి. వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ కోసం జట్టును సెలక్టర్లు ఎంపిక చేసి ఉండవచ్చు. వచ్చే సోమవారం జరిగే బీసీసీఐ ఏజీఎం సమయానికి ఆసీస్ సిరీస్ గెలవరాదని వారు కోరుకోవాలని గావస్కర్ పేర్కొన్నాడు. -
ప్రపంచకప్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. హెచ్‌సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్‌కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్‌లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉన్నాయి. -
ప్రపంచకప్‌కు నసీమ్ షా దూరం!
వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్ బౌలర్ నసీమ్ షా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నసీమ్ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్ పాక్ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు. -
సచిన్‌కు ‘గోల్డెన్ టికెట్’
ముంబై: భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్ టికెట్’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఈ టికెట్ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. కొత్త టికెట్లూ హుష్ కాకి! వరల్డ్ కప్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లకు ‘సోల్డ్ అవుట్’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్‌లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్ మై షో’ చెబుతోంది. గతంతో పోలిస్తే టికెట్ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్‌కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది. -
WC 2023: టికెట్ దొరకలేదా? పర్లేదు.. బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఏకంగా..
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకొని టికెట్లు దక్కని అభిమానులకు ఊరట కలిగించే ప్రకటన బీసీసీఐ నుంచి వచ్చింది. అభిమానుల కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.com లో టికెట్లు కొనుక్కోవచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల్లోనే ‘సోల్డ్ అవుట్’ అని రావడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర సంఘాలతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయో, అందులో భారత్ ఆడే మ్యాచ్‌లకు ఎంత శాతం టికెట్లు కేటాయించారనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్ ఫైర్ -
అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’
భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను నట దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు. ఈ టికెట్ ద్వారా ప్రత్యేక అతిథి హోదాలో అన్ని వేదికల్లో అన్ని మ్యాచ్‌లనూ చూసే అవకాశం ఉంటుంది. మహానటుడే కాకుండా క్రికెట్ వీరాభిమాని అయిన అమితాబ్‌కు ‘గోల్డెన్ టికెట్’ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు, ఎప్పటిలాగే టీమిండియాకు ఆయన మద్దతు కొనసాగాలని జై షా వ్యాఖ్యానించారు. -
ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్
బెంగళూరు: నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ హవా సాగింది. ఈ టోర్నీలో 5 సెంచరీలతో 648 పరుగులు సాధించి అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఆ సమయంలో తాను మానసికంగా ఎంతో ప్రశాంత స్థితిలో ఉన్నానని, ఇప్పుడు కూడా అదే తరహాలో ఉండాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. గత టోర్నీతో పోలిస్తే ఈసారి అతను కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు. ‘సానుకూలమైనా, ప్రతికూలమైనా ఎలాంటి బయటి అంశాలు నాపై ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడుతున్నా. ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే 2019 ప్రపంచకప్‌కు ముందు ఎలా ఉన్నానో అలాంటి మానసిక దృక్పథం ఇప్పుడు కావాలి. ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అప్పటి నా పరిస్థితిని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అలాగే ఉండాలని భావిస్తున్నా. అప్పుడు అన్నీ చక్కగా కుదిరాయి. అంతా కలిసిరావడంతో ఎంతో బాగా సన్నద్ధమయ్యా’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్‌పై తన ముద్ర ఏమిటనేది తాను చెప్పనని, అది అభిమానులు నిర్ణయిస్తారన్న రోహిత్... జట్టు సెలక్షన్ విషయంలో మాత్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. ‘వరల్డ్ కప్ టీమ్‌లో స్థానం దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసు. 2011లో చోటు కోల్పోయినప్పుడు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చి ఏం పర్లేదు, భవిష్యత్తు బాగుంటుందని భరోసా ఇచ్చాడు. నిజంగానే ఆ తర్వాత నేను గొప్పగా రాణించాను. ఇప్పుడు కూడా ఎవరినైనా తప్పిస్తే అందుకు బలమైన కారణం ఉంటుందే తప్ప వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఉండవు’ అని రోహిత్ స్పష్టం చేశాడు. -
Chess World Cup 2023: రాజూ బంటూ అమ్మే
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది. అజర్బైజాన్లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్‌లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్‌లో ఇంత చిన్న వయసులో రన్నరప్‌గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్‌లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు. టీవీ అలవాటు మాన్పించడానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్‌లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అనుక్షణం వెన్నంటే ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్‌లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్‌వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్‌వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు. చెస్ తెలియని అమ్మ కొడుకు చెస్‌లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్‌లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను. మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో అమెరికా దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్‌కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి. కార్ పార్కింగ్‌లో బంధువులు కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే. -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్‌లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్‌ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్‌ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్
దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రధాన పోరుకు ముందు సన్నాహకంగా జరిగే వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. మూడు వేదికలు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లూ సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. సెప్టెంబర్ 30న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో గువహటిలో తలపడే భారత్... అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది. మూడు ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో రెండు వామప్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్...అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో వామప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టికెటింగ్ పార్ట్నర్గా బుక్ మై షో... వరల్డ్ కప్ కోసం ‘బుక్ మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బీసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్‌లు, వామప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 25 నుంచి, భారత్ ఆడే వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే (నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29 సాయంత్రం 6 గంటల నుంచి) టికెట్లు లభిస్తాయి. -
వరుసగా 2 మ్యాచ్‌లు కష్టమన్న హెచ్‌సీఏ.. షెడ్యూల్ మార్పు కుదరదన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మార్పు కుదరదని స్పష్టం చేశారు. నిజానికి మెగా ఈవెంట్ షెడ్యూల్ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్‌లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది. లాజిస్టిక్ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. అసలేం జరిగింది? తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 9న ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్‌లు జరగాలి. అయితే మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలువనున్న భారత్, పాక్ పోరు అహ్మదాబాద్‌లో ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 నుంచి 14కు) జరిపారు. దీంతో పాకిస్తాన్‌కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్‌ను 10న నిర్వహించడమే హెచ్‌సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్‌లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్తో నడుస్తున్న హెచ్‌సీఏ తెలిపింది. నేను హైదరాబాద్ వేదిక ఇన్చార్జ్గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా -
ఇవే ప్రపంచకప్ మస్కట్లు!
దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉధృతం చేసింది. ఇందులో భాగంగా టోర్నీ ‘మస్కట్’లను ప్రకటించింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్లు షఫాలీ వర్మ, యశ్ ధుల్ పాల్గొన్నారు. పురుష క్యారెక్టర్‌ను బ్యాటర్‌గా, మహిళా క్యారెక్టర్‌ను బౌలర్‌గా చూపిస్తూ ఐసీసీ ఒక వీడియో విడుదల చేసింది. అయితే వీటికి అధికారికంగా ఐసీసీ పేర్లు పెట్టలేదు. ఇందుకు అభిమానులు ఆగస్టు 27లోగా ఓటింగ్ చేయాలని కోరుతూ ఒక్కో క్యారెక్టర్‌కు 3 ఆప్షన్లను ఇచ్చింది. బ్యాటర్ మస్క ట్ కోసం టాంక్, బాష్, బ్లిట్జ్‌లలో ఒకదానిని, బౌలర్ మస్కట్ కోసం బ్లేజ్, విక్స్, పైరా అనే పేర్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 5నుంచి భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది. -
పసిడి పోరుకు భారత జట్లు
పారిస్: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్ విభాగం టీమ్ ఈవెంట్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్ కార్పెంటర్లతో కూడిన బ్రిటన్ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ బృందం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచ చాంపియన్ ఓజస్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది. భారత్, టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్‌ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్ ఓజస్ దేవ్‌తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్‌పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్లో ధీరజ్ బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో ధీరజ్ 6–2తో ఇమాదిద్దీన్ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్ 6–0తో ఎలైన్ వాన్ స్టీన్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత్‌కే చెందిన మృణాల్ చౌహాన్ 3–7తో ఫ్లోరియన్ ఫాబెర్ (స్విట్జర్లాండ్) చేతిలో, తుషార్ ప్రభాకర్ 2–6తో పీటర్ బుకువాలస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ క్వాలిఫయింగ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
చదరంగ విప్లవం ముంగిట్లో భారత్!
దశాబ్ద కాలంలోనే భారత్‌లో యాభై మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు అవతరించారు. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. ఎంతోమంది యువకులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. చెస్‌కు ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. అయితే దేశంలో చదరంగ విప్లవానికి ఇది నాంది మాత్రమే. మున్ముందు జరగాల్సింది చాలా మిగిలి ఉంది. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఇంకో భారతీయుడు ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడా? ఏమైనా, భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందని మాత్రం తప్పక చెప్పవచ్చు. బిందువు బిందువు సింధువైనట్లు... ముందు కొంతమంది యువ ప్రతిభావంతులు చెస్ గ్రాండ్ మాస్టర్లుగా ఎదిగారు. ఆ తరువాత పరిపక్వత లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు శక్తిమంతమైన స్థానాల్లో నిలిచారు. తాజాగా భారత చదరంగ క్రీడాకారుల హవా చెస్ వరల్డ్ కప్‌లోనూ కొనసాగుతోంది. భారతీయ చదరంగ చరిత్రలో డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద నేతృత్వంలో సువర్ణ అధ్యాయం మొదలైంది. వీరితోపాటు ఎంతోమంది యువ కులు ప్రపంచ యవనికపై తమదైన ముద్ర వేస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులను అధిరోహిస్తున్నారు. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ సందర్భంగా భారతీయ క్రీడా కారుల ఆటతీరును గమనించినప్పుడు ఇలాంటిది ఏదో జరగాలని మనం ఆశించాము. ఆ పోటీల్లో ఇండియా–బి బృందం ఓపెన్ కేటగి రిలో కాంస్య పతకం సాధించింది. మహిళా క్రీడాకారులు కూడా కాంస్య పతకం గెలుచుకున్నారు. అయితే ఫైడ్ చెస్ ర్యాంకింగ్‌లో గుకేశ్ టాప్–10లో ఒకడిగా ఎదగడంతో మిగిలిన వారు కూడా ఇప్పుడు మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదరంగంలో అతితక్కువ కాలంలో వచ్చిన ఈ గుణాత్మక మార్పునకు కారణాలు ఎన్నో. చెస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రాయోజకత్వమూ లభిస్తోంది. ఆటగాళ్లకూ, ఆటకూ ఎక్స్ పోజర్ కూడా బాగుంది. అత్యున్నతస్థాయి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యానికి కొరతే లేదు. దేశంలో చదరంగం మరింత ఎదిగేందుకు ఈ నైపుణ్యమే కీలకం. విస్తృతస్థాయిలో నైపుణ్యం ఉండటం పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కాస్తా ఆటగాళ్లు మరింత రాటుదేలేందుకు ఉపయోగ పడుతుంది. భారత్ తరఫున ఇప్పుడు చెస్ ఒలింపియాడ్ లేదా వరల్కప్ పోటీల్లో పాల్గొనాలంటే అత్యున్నత స్థాయి ఆట ఆడాల్సి ఉంటుంది. మనకేం ఫర్వాలేదు అనుకునే అవకాశం ఏ ఆటగాడికీ ఉండదు. అందరూ ముంగాళ్లపై నుంచోవాల్సిందే. నిజాయితీగా ఉండాల్సిందే. ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూంటారు. మంచి మిత్రులే కానీ, ఆట విషయానికి వస్తే మాత్రం ఎవరి గుట్లు వారి వద్దే ఉంటాయి. ఎందుకంటే ఆ రహస్యాలే వారికి ఏదో ఒక రోజు విజయాన్ని సంపాదించి పెట్టవచ్చు. ఇక్కడ చాలామంది టాప్ ర్యాంకింగ్ ఆటగాళ్లను మాత్రమే చూస్తున్నారు. కానీ కింది స్థాయిలోనూ చాలా మంది ఆటగాళ్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నేను భారతదేశంలో నంబర్ వన్ (1986 జూలై ఒకటవ తేదీన 2405 ఎలో రేటింగ్‌తో ప్రవీణ్ థిప్సే కంటే ముందుకు వెళ్లినప్పుడు)గా మారినప్పుడు దరిదాపుల్లో ఇంకో ఆటగాడు కనిపించలేదు. 1988లో ఇరవై ఏళ్ల వయసులో నేను గ్రాండ్‌మాస్టర్ అయినప్పుడు పోటీల గురించి కాకుండా, రానున్న మూడేళ్లలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎలా అని ఆలోచించాను. నేనేం చేయాలో నేనే నిర్ణయించుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి! 1988లో నేను గ్రాండ్ మాస్టర్‌గా అవతరిస్తే, మూడేళ్ల తరువాత 1991లో దివ్యేందు బారువా ఆ ఘనత సాధించాడు. ప్రవీణ్ థిప్సే 1997 నాటికి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడు పరిస్థితిలో చాలామార్పు వచ్చింది. 2013 నుంచి ఇప్పటివరకూ సుమారు 50 మంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగారు. ఎలో రేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉన్న భారతీయ గ్రాండ్ మాస్టర్లు (పాక్షికంగా రిటైరైన నాతో కలిపి) ఆరుగురు ఉన్నారిప్పుడు. గ్రాండ్ మాస్టర్ కావడం చాలా గొప్పవిషయమే అయినప్పటికీ ప్రస్తుతం సాధారణమైపోయింది. మారుతున్న కాలానికి నిదర్శనం ఇది. ఈ తరానికి ఇంకో సానుకూల అంశమూ ఉంది. నాకున్న దశాబ్దాల అనుభవంపై వారు ఆధారపడవచ్చు. అలాగే ఎందరో చెస్ గురు వుల ప్రస్థానాల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చాలా కీలకం. కానీ మాలాంటివాళ్లం ఈ తరం ఆటగాళ్లకు మార్గ దర్శనం మాత్రమే చేయించగలం. టాప్ లెవల్ ఆటగాళ్లందరికీ ఇప్పుడు దాదాపు అన్ని రకాల పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే మంచి ఆటగాళ్లను వేరు చేసే అంశాలు వారి ప్రవర్తన, నిత్యం ఉన్నతస్థాయి ఆటను కొనసాగించగలగడం, శారీరక దారుఢ్యం, ఒత్తిడికి లోనుకాకపోవడం. అంతేకాదు... ఆట విషయంలో సమగ్రత కూడా చాలా అవసరం. ప్రత్యర్థి ఎప్పుడు ఏ రకమైన సవాలు విసురుతాడో మనకు తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండటం అవసరం. కొంతమంది ప్రత్యర్థులు మీరు తయారైన దానికంటే భిన్నమైన రీతిలో దాడికి దిగవచ్చు. అప్పుడు మీరెలా స్పందిస్తారు? దేనిపై ఆధారపడతారు? మీ లెక్కకు చిక్కని విషయమని భావిస్తారా? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటేనే బాగా శ్రమించడం అన్నదానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎలో రేటింగ్ 2700కు చేరుకోవడం కూడా ఈ శ్రమలో భాగమే. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. భారతీయ చదరంగం కేవలం పురుషులకు మాత్రమే చెందింది కాదు. దేశంలో చదరంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే మహిళా క్రీడాకారులు కూడా బాగా రాణించాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్యలో చాలా అంతరం ఉంది. భారత్‌లోనే కాదు... ప్రపంచం మొత్తమ్మీద ఇదే పరిస్థితి. ఈ అంత రాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాడమీ ఏర్పాటు ద్వారా మేమీ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తామన్న నమ్మ కమూ ఉంది. కోనేరు హంపి, డి.హారిక, ఇతరుల స్థాయుల మధ్య చాలా అంతరం ఉంది. ఉన్నత స్థానంలో ఏళ్ల తరబడి కొనసాగేందుకు తగిన జ్ఞానం హారిక, హంపికి ఉంది. అయితే మిగిలిన వారు సమీప భవిష్యత్తులోనే వీరికి సవాలు విసరగలరని ఆశిస్తున్నా. ఒకే ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు కదా! అసలైన విప్లవం అందరినీ తోడుతీసుకునే మొదలవుతుంది. గుకేశ్, ప్రజ్ఞానంద్ ఇద్దరూ చదరంగంలో మారుతున్న తరానికి ప్రతినిధులు. నా అనుభవం వారికి ఉపయోగపడుతుంది కానీ, వారు తమ సొంత మార్గంలో మరింత దూరం ప్రయాణించడం అలవర్చు కోవాలి. తమ సమస్యలకు వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. కొత్త హోదా, హంగు ఆర్భాటాలకు వారిప్పుడిప్పుడే అలవాటు పడుతు న్నారు. ఎదురుదెబ్బలూ వారికి ఎదురు కావచ్చు. ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. కాకపోతే వీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం సరైందనే చెప్పాలి. మిగిలినవి ఎలా ఉన్నా ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత దేశ చదరంగం ఒక్కో అడుగే ముందుకేయాలి. ఎదుగుతున్నప్పటికీ అందుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది. విçస్తృతమైన, లోతైన వ్యవస్థ అక్కరకొచ్చే అంశం. కాలం గడుస్తున్న కొద్దీ ఒకదానికి ఒకటి పూరకంగా వ్యవహరిస్తాయి. దశాబ్ద కాలంలో ప్రపంచ చదరంగంలో భారత్ తిరుగులేని శక్తి అవుతుందా? ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తారా? ఇంకో భారతీ యుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఒకే మాట చెప్పవచ్చు. భారతీయ చదరంగం పక్వానికి వచ్చిందీ అని! విశ్వనాథన్ ఆనంద్ వ్యాసకర్త ప్రపంచ ఛాంపియన్ షిప్ ఐదుసార్లు నెగ్గిన చదరంగ క్రీడాకారుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
WC 2023: నాలుగో స్థానంపై అనిశ్చితి ఉంది: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
ముంబై: నాలుగేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ విషయంలో పెద్ద సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. మిడిలార్డర్లో కీలకమైన ఈ స్థానం విషయంలో నెలకొన్న అనిశ్చితి వాస్తవమేనని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్ సమయానికి అంతా సర్దుకుంటుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టులో నాలుగో స్థానం విషయంలో చాలా కాలంగా సమస్య ఉంది. యువరాజ్ రిటైరయ్యాక ఎవరూ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. అయితే గత కొంత కాలంగా ఆ స్థానంలో ఆడుతున్న శ్రేయస్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతని గణాంకాలూ బాగున్నాయి. అయితే అతను గాయపడటంతో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయత్నించాల్సి వచ్చింది. కీలక స్థానంలో ఆడే ఆటగాడు గాయపడినప్పుడు మళ్లీ కొత్తగా ప్రయత్నించాల్సి వస్తుంది. నేను కెప్టెన్ కాక ముందు కూడా ఇలాంటి పరిస్థితిని చూశాను’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జట్టులో ఎవరి స్థానానికీ హామీ ఉండదని... గాయాల నుంచి కోలుకొని వచ్చిన తర్వాత కూడా ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు. ‘రాహుల్, శ్రేయస్ నాలుగు నెలలుగా క్రికెట్ ఆడలేదు. గాయాలు, శస్త్రచికిత్సలు కొనసాగాయి. కోలుకొని వచ్చిన తర్వాత ఎవరికైనా అంత సులువు కాదు. అయితే మీ కోసం స్థానం సిద్ధంగా ఉందని ఎవరికీ చెప్పలేం. చోటు దక్కించుకునేందుకు అందరూ పోటీ పడాల్సిందే. త్వరలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశం కూర్పు విషయంలో చర్చిస్తాం’ అని కెప్టెన్ అన్నాడు. -
వరల్డ్‌కప్‌కు టీమిండియా ఇదే.. సంజూతో పాటు మరో అనూహ్య ఎంపిక..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు భారత ప్రాథమిక జట్టు ఇదే అంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది. కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా తమ కోర్ టీమ్‌ను ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఇదే భారత కోర్ టీమ్ అంటూ సోషల్‌మీడియాలో 19 మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైరలవుతున్న జట్టులో పెద్దగా సంచలనాలు ఏవీ లేనప్పటికీ.. ఒక్క పేరు మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గాయాల కారణంగా చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, ముకేశ్ కుమార్‌లతో పాటు జయదేవ్ ఉనద్కత్ అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక అందరూ ఊహించిన విధంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చహల్ జట్టులో ఉండనే ఉన్నారు. బీసీసీఐ ఇదే జట్టును ఆసియా కప్ బరిలో కూడా దించనున్నట్లు తెలుస్తుంది. కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని జట్లు సెప్టెంబర్ 27లోగా తమతమ పూర్తి జట్లను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్, వరల్డ్ కప్‌లకు భారత కోర్ టీమ్ ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కత్, ముకేశ్ కుమార్, యుజ్వేద్ర చహల్ -
గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ కోసం భారత్‌కు పాక్
కరాచీ: కొన్నాళ్లుగా... భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌కు రాం రాం, భారత్‌లో ఆడబోం అంటూ మేకపోతు గాంభీర్యానికి పోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు ఆడేందుకు రెడీ అయ్యింది. క్రికెట్ లోకం కంటపడేందుకు, ఎక్కడలేని సస్పెన్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించిన పీసీబీ ఇంకో మాట మాట్లాడకుండా వచ్చేందుకు సై అంటోంది. ఈ మేరకు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌లో ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టబోమని పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో తమ జట్టు ఎప్పటిలాగే పాల్గొంటుందని, తమ దేశం నిర్మాణాత్మక, బాధ్యతాయుత విధానాన్ని అవలంభిస్తుందనేదానికి తమ నిర్ణయమే నిదర్శనమని అందులో పేర్కొంది. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు ఢోకా ఉండబోదనే ఆశిస్తున్నట్లు తెలిపింది. -
అభిమానులకు షాక్!
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పోరు... అభిమానుల కోణంలో అయితే మరీ భావోద్వేగాల సమరం... అందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూశారు. విమాన టికెట్లతో పాటు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీగా పెరిగిన రేట్లతో హోటల్ గదులు కూడా బుక్ చేసుకున్నారు. ఎన్ని వ్యయప్రయాసలెదురైనా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అక్టోబర్ 15 కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఇప్పుడు వీరందరి ప్లాన్ తలకిందులయ్యే అవకాశమూ కనిపిస్తోంది! అహ్మదాబాద్‌లో అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గుజరాత్లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు మ్యాచ్ జరపడం చాలా సమస్యగా మారుతుందని అక్కడి భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ రోజు సెక్యూరిటీ కలి్పంచడం తమ వల్ల సాధ్యం కాదని చేతులెత్తేసిన పోలీసులు, మ్యాచ్‌ను మరో రోజుకు మార్చాలని బీసీసీఐ అధికారులకు సూచించారు. ప్రకటించిన తేదీకంటే ఒక రోజు ముందు అక్టోబర్ 14కు మ్యాచ్ మారే అవకాశం ఉంది. అయితే ఒక రోజు మారినా ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సమస్యగా మారడం మాత్రం ఖాయం. అసలు షెడ్యూల్ ప్రకటించడమే చాలా ఆలస్యం కాగా... గుజరాత్లో నవరాత్రి గురించి బోర్డు కార్యదర్శి జై షాకు తెలియకపోవడం ఆశ్చర్యకరం! దీనిపై నేడు జరిగే బీసీసీఐ సమావేశం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి నేడు వివిధ సబ్ కమిటీలతో నేడు బోర్డు చర్చించనుంది. -
వరల్డ్ కప్ కి బుమ్రా రెడీ...ఆ ముగ్గురు కూడా...
-
అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్!
వన్డే ప్రపంచకప్‌కు మరో 100 రోజుల సమయం ఉంది. భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోరీ్నపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నం చేశాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది. అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరింది. నేటినుంచి జరిగే వరల్డ్ టూర్లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ఇందులో ప్రపంచ కప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. -
1983 World Cup: ఆ అపురూప విజయానికి 40 ఏళ్లు
-
చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ సెలబ్రేషన్స్
టీమిండియా తొలి ప్రపంచకప్‌ను సాధించి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1983 వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఫైనల్లో పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్స్‌గా నిలిచింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కపిల్ డేవిల్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క విజయంతో ప్రపంచక్రికెట్లో తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు భారత జట్టు ఏర్పరుచుకుంది. స్పెషల్ సెలబ్రేషన్స్.. ఇక తొలి ప్రపంచకప్ సాధించి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని 1983 భారత హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలు జరపుకున్నారు. వరల్డ్‌కప్ జట్టులో భాగమైన లెజెండ్స్ ఓ మినీ ఎయిర్ క్రాప్ట్‌లో స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోస్లో ఒకడైన కీర్తి ఆజాద్ సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇందులో కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, శ్రీకాంత్, సందీప్ పాటిల్, మొహిందర్ అమర్నాథ్, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సింగ్, రోజర్ బిన్నీలు ఉన్నారు. "35,000 వేల అడుగుల ఎత్తులో 1983 వరల్డ్‌కప్ ఛాంపియన్ టీమ్ 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోంది. భారతీయుడుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. లవ్ ఇండియా, భారత్ మాతాకీ జై "అంటూ కీర్తి ఆజాద్ ట్విటర్లో పేర్కొన్నాడు. మరోవైపు అదానీ గ్రూప్ తమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1983 ప్రపంచకప్ విజేత ఆటగాళ్లను సత్కరించింది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ‘జీతేంగే హమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచకప్ విన్నింగ్ హీరోస్ తమ సెలబ్రేషన్స్‌ను జరపుకున్నారు. చదవండి: #1983WorldCup: రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది The World Cup champion 1983 team travelling together to celebrate our 40th anniversary victory on 25th June, 35,000 feet up in the air. We are proud Indians and love India Bharat Mata Ki Jai @therealkapildev @RaviShastriOfc @BCCI @JayShah pic.twitter.com/xR1VxFSbys — Kirti Azad (@KirtiAzaad) June 25, 2023 -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
భారత్ లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ పై పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిన నజమ్ సేథీ
-
World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు!
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చే పరిణామం...వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఖాయమై రూ. 117 కోట్లతో ఆధునీకరణకు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోందని, మెగా ఈవెంట్లో టీమిండియా మ్యాచ్‌ను వీక్షించవచ్చని భావించిన ఫ్యాన్స్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఆడే అవకాశం లేదని తేలింది. మ్యాచ్ వేదికలు, తేదీలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి బీసీసీఐ షెడ్యూల్ డ్రాఫ్ట్ సమర్పించింది. ఇందులో టీమిండియా లీగ్ దశలో ఆడే 9 మ్యాచ్‌ల వేదికల్లో హైదరాబాద్ పేరు లేదు. ఉప్పల్ స్టేడియాన్ని భారత మ్యాచ్ కోసం పరిగణలోకి తీసుకోలేదు. బోర్డు పంపిన జాబితాను వరల్డ్ కప్ ఆడే అన్ని జట్లకూ పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఐసీసీ అధికారిక ప్రకటన చేస్తుంది. అయితే... సాధారణంగా ఆతిథ్య దేశం ఇచ్చిన డ్రాఫ్ట్‌లో మార్పులు లేకుండానే ఐసీసీ ఆమోదిస్తుంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకటన లాంఛనమే. భారత జట్టు ఆడకపోయినా... 2011 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అభిమానులకు కాస్త ఊరట. డ్రాఫ్ట్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్, ఫైనల్ అహ్మదాబాద్‌లోనే... లక్షకు పైగా సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియం సహజంగానే వరల్డ్‌కప్‌కు ప్రధాన వేదిక కానుంది. 2019 వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే మ్యాచ్‌లో ఈ విశ్వ సమరం మొదలవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్లో లీగ్ దశకే పరిమితం కాగా... నవంబర్ 15, 16న జరిగే సెమీ ఫైనల్ వేదికల గురించి ఇంకా పేర్కొనలేదు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి పోరుతో భారత్ వరల్డ్ కప్ వేట మొదలవుతుంది. నిజానికి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఎప్పుడో ప్రకటించాల్సింది. అయితే భారత గడ్డపై తమ మ్యాచ్‌ల వేదికల విషయంలో పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆసియా కప్‌లో తాము పాల్గొనే అంశంతో ముడిపెట్టడంతో ఇంత ఆలస్యమైంది. పాక్ విజ్ఞప్తిని బట్టి ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల విషయంలో బోర్డు కాస్త సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాకౌట్ దశకు వెళ్లి తప్పనిసరైతే తప్ప అహ్మదాబాద్‌లో ఆడమని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోనే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మినహా తమ 8 మ్యాచ్‌లలో పాకిస్తాన్ తాము సూచించిన నాలుగు వేదికలు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనే ఆడనుంది. భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను దాదాపు ఏడాది క్రితమే ఐసీసీ ప్రకటించింది. దీని ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్ కాకుండా భారత్‌లో 8 వేదికల్లో 29 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ఖరారు చేసింది. అప్పట్లోనే అన్ని రకాలుగా సిద్ధమైన హైదరాబాద్ స్టేడియం 3 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది కూడా. అయితే వరల్డ్ కప్ మైదానాల్లో మాత్రం ఉప్పల్‌కు చోటు దక్కలేదు. ‘టెస్టు హోదా ఉన్న స్టేడియాలను మాత్రం బోర్డు పరిశీలించింది’ అంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు దక్కాయన్న ఆనందంలో అభిమానులు ఉండగా, ఇప్పుడు భారత్ మ్యాచ్ లేకపోవడం సహజంగానే నిరాశపర్చే అంశం. క్రికెట్ పట్ల చూపించిన ఆదరణను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియం ఎప్పుడూ నిరాశపర్చలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు...ఐపీఎల్ హోం టీమ్ సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన ఇచ్చినా సరే, స్టేడియంలో వారి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా చూస్తే చక్కటి అవుట్‌ఫీల్డ్, ఫిర్యాదులు లేని పిచ్‌తో సహా సౌకర్యాలపరంగా చూస్తే ఇతర అన్ని స్టేడియాలతో పోలిస్తే మేలైన వసతులు ఉన్నాయి. అయితే ఇదంతా బోర్డు పట్టించుకున్నట్లుగా లేదు. వరల్డ్ కప్‌లో వేదికల ఖరారు గురించి గత నెలలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. కార్యదర్శి జై షా నేతృత్వంలో ఇది పని చేసింది. భారత మ్యాచ్‌లకు కేటాయించిన 9 వేదికలను చూస్తే వేర్వేరు కారణాలతో వీటిని ఖాయం చేసినట్లుగా అర్థమవుతుంది. భారత క్రికెట్లో మొదటినుంచి ‘ప్రధాన’ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సహజంగానే పెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మ్యాచ్ (పాక్‌తో) నిర్వహించాలని బోర్డు భావించింది. మిగతా మూడు వేదికల విషయంలో బోర్డు అంతర్గత రాజకీయాలు పని చేశాయి. బోర్డు ఉపాధ్యక్షుడైన రాజీవ్ శుక్లా తన సొంత మైదానమైన లక్నోలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తమ అసోసియేషన్‌కు చెందిన ధర్మశాలలో మ్యాచ్‌లను తీసుకున్నారు. పుణేకు కూడా మ్యాచ్ కేటాయించుకోవడంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం గట్టిగా ప్రయత్నం చేసి సఫలమైంది. నిజానికి ముందుగా షార్ట్ లిస్ట్ చేసిన 12 వేదికల్లో పుణే పేరు లేదు. ఆ తర్వాత దానిని అదనంగా చేర్చడంలోనే పరిస్థితి అర్థమైంది. బహుశా ఈ మ్యాచ్ ఉప్పల్‌కు దక్కేదేమో. కానీ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎలాంటి ప్రాతినిధ్యమే లేదు. నిత్య కలహాలతోనే అసోసియేషనే లేకుండా మాజీ న్యాయమూర్తి చేతుల్లో ఉన్న వ్యవస్థ మ్యాచ్‌పై పట్టుబట్టే పరిస్థితిలో అసలే లేదు!