న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి.
► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది.
► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం.
► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది.
► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌్రస్కిప్షన్‌తో వస్తుంది.
► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది.
► భారతీ ఎయిర్‌టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది.
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
Published Sat, Oct 7 2023 6:38 AM | Last Updated on Sat, Oct 7 2023 6:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment