new data packages
-
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది. -
రెండున్నర రూపాయలకే 1జీబీ డేటా
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు భలే షాకిచ్చింది. తాజాగా ‘డేటా సునామి’ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 98 రూపాయలకే రోజుకు 1.5 జీబీ డేటాను 26 రోజుల పాటు ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎస్ఎన్ఎల్ సర్కిల్స్‌లో వెంటనే అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ప్యాక్‌ను 118 రూపాయల రీఛార్జ్ ప్యాక్ లాంచ్ చేసిన ఒక్కరోజులోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన 118 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, 1 జీబీ డేటా 28 రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. కేరళ మినహాయించి బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం అన్ని సర్కిల్స్‌లో 3 జీ స్పీడ్ డేటాను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్యాక్ కింద ఒక్క జీబీ డేటా ధర 2.51 రూపాయలే. ఇది జియో 149 రూపాయల ప్యాక్‌పై అందించే డేటా రేటు కంటే తక్కువ. జియో కూడా 149 రూపాయలకు రోజుకు 1.5 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. కానీ జియో ఒక్క జీబీ డేటా ఖరీదు 3.5 రూపాయలు. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా 149 రూపాయల ప్యాక్‌ను తన వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌లు రెండూ వాటి ప్యాక్‌లపై అపరిమిత వాయిస్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం తన 98 రూపాయల ప్యాక్‌పై కేవలం డేటానే ఆఫర్ చేస్తోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ తక్కువ రేట్లలో తన సర్వీసులను అందిస్తుందని, ఎకానమిక్ రేటులో 1 జీబీ డేటాను రూ.2.51కే తాము ఆఫర్ చేయనున్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆర్కే మిట్టల్ వెల్లడించారు. రిలయన్స్ జియోకు సైతం 98 రూపాయల ప్యాక్‌ను అందిస్తుంది. జియో ఆఫర్ చేసే ఈ ప్యాక్‌లో 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు, 300 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందనున్నాయి. -
ఎయిర్‌సెల్ నుంచి కొత్త డేటా ప్యాకేజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ ధరకే అందుబాటు శ్రేణిలో అపరిమిత 3జీ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లను ఎయిర్‌సెల్ ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్లతో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా డేటా ప్యాక్‌లను రూపొందించినట్లు ఎయిర్‌సెల్ నేషనల్ హెడ్ (డేటా) సునీల్ కుట్టమ్ తెలియజేశారు. రూ.9 నుంచి రూ.403 శ్రేణిలో అపరిమిత డేటా ప్యాకేజీలను ప్రవేశపెట్టిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.9 ప్యాకేజీతో రోజుకు 100 ఎంబీ 3జీ సర్వీసులను వినియోగించుకోవచ్చని, ఈ పరిమితి తర్వాత తక్కువ ఇంటర్నెట్ వేగంతో సర్వీసులు నిరాటంకంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజాలు మార్టినా హింగిస్, విజయ్ అమృతరాజ్ చేతులు మీదుగా కొత్త డేటా ప్యాకేజీలను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సం దర్భంగా సునీల్ మాట్లాడుతూ ఇప్పటికీ దేశంలో 80 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదని, వారంతా కొత్త వినియోగదారులుగా చేరుతుండటంతో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతోందని తెలియజేశారు. ప్రస్తుతం 40 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తూ అమెరికాను అధిగమించినట్లు తెలిపారు. ఎయిర్‌సెల్ ఆదాయం లో 18% డేటా నుంచి సమకూరుతోందన్నారు.