
క్రికెట్ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులను మాత్రమే కాకుండా.. అన్ని రంగలవారిని ఆకర్షిస్తోంది. ఆటకు అందం తోడైతే.. ఆ కిక్కే వేరు. ఐపీఎల్ అంటే ప్రీతి జింటా, కావ్య మారన్ పేర్లు మాత్రమే కాదు.. ఇప్పుడు 'జాహ్నవి మెహతా' (Jahnavi Mehta) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె నెట్‍వర్త్ ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఎవరీ జాహ్నవి మెహతా?
జాహ్నవి మెహతా తల్లి ప్రముఖ నటి 'జూహి చావ్లా', తండ్రి ఫేమస్ బిజినెస్ మ్యాన్ 'జయ్ మెహతా'. అయితే 24 ఏళ్ల వయసులోనే జాహ్నవి ఐపీఎల్ వేలంపాటలతో సహా ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటూ సుపరిచితురాలుగా మారింది. ముఖ్యంగా ఈమె తన తండ్రి సహ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఎక్కువగా పాల్గొంటోంది. 2025 వేలానికి హాజరై, జట్టుతో తన సంబంధాన్ని.. కేకేఆర్ కార్యకలాపాల నిర్వహణలో ఆమె పాత్రను మరింత పటిష్టం చేసుకుంది.

క్రికెట్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, జాహ్నవికి ఇష్టం కూడా. ఈ కారణంగానే ఈమె కేకేఆర్ జట్టును ఫాలో అవుతూ వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా ఉన్న షారుఖ్ ఖాన్ పిల్లలు సుహాన్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇప్పటికి కూడా కేకేఆర్ జట్టు బాధ్యతలలోకి నేరుగా ప్రవేశించలేదు. కానీ జాహ్నవి మాత్రం తన తెలివితేటలతో.. కేకేఆర్ జట్టుకు సంబంధించిన కీలక వ్యవహారాలను చూసుకుంటోంది.

నెట్‍వర్త్ ఎంతంటే?
జాహ్నవి స్కూల్ చదువు ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి జాహ్నవి మెహతా.. వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు. ఈమె ఆస్తి ఏకంగా రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె తండ్రి జయ్ మెహతా.. తన మామ నాంజీ కాళిదాస్ మెహతా స్థాపించిన బహుళజాతి సమ్మేళన సంస్థ అయిన మెహతా గ్రూప్ చైర్మన్. ఈ సంస్థ ప్యాకేజింగ్, హార్టికల్చర్, సిమెంట్, నిర్మాణ సామగ్రి వంటి విభిన్న రంగాల కలయిక.

మెహతా గ్రూప్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. కెనడా, ఉగాండా, కెన్యా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా విస్తరించి ఉంది. ఈ కంపెనీ గత కొంత కాలంగా గణనీయమైన అభివృద్ధి చెందుతూనే ఉంది. జూహి చావ్లా ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్.
ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి
Comments
Please login to add a commentAdd a comment