juhi chawla
-
ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే!
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్లకు పది సినిమాలు చేసిన రాదు. అలాగే వాళ్ల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 ఏళ్లు దాటితే సినిమా చాన్స్‌లు కూడా రావు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తుంటారు. అయితే ఎంత సంపాదించిన హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు మాత్రం స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోలు కూడా ఆస్తుల విషయం ఈ హీరోయిన్ వెనుకే ఉన్నారు. ఆమే జూహి చావ్లా. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన సినీనటిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది.అమితాబ్‌కు కంటే ఎక్కువమన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో జుహి చావ్లానే ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్(2000 కోట్లు), నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్(1200 కోట్లు) ఉన్నారు.పలు వ్యాపారాల్లో పెట్టుబడులుజూహి చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నా.. ఆస్తుల విషయంలో మాత్రం జుహినే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్కటా నైట్‌రైడర్స్‌లో ఆమె కూడా పార్ట్నర్గా ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహి చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి. -
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు. ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్‌కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే! గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్‌లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్‌లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్‌లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్‌కతా నైట్ రైడర్స్. (చదవండి: -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటి ఎవరో చెప్పగలరా? మీరు ఊహించినట్టు టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్ అయితే కాదు. ఎందుకంటే ఈ ముగ్గురి మొత్తం సంపద కలిపినా కూడా ఆ నటి సంపదకు సరితూగదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అంతేకాదు అందరి కంటే ఎక్కువ సంపద కలిగివున్నప్పటికీ ఆమె ఏమీ పాపులర్ నటి కాదు. ఆమె ఖాతాలో ఒక్క బాక్సాఫీస్ విజయం కూడా లేదు. మరి ఆమెకు అంత సంపద ఎలా వచ్చింది?ఫోర్బ్స్ ప్రకారం.. అత్యంత సంపన్న నటుడు టైలర్ పెర్రీ. అమెరికాకు చెందిన ఆయన నటుడిగా, నిర్మాతగా, నాటక రచయితగా ప్రసిద్ధుడు. ఆయనకు సొంత స్టూడియోతో పాటు, మాడియా హిట్ ఫ్రాంచైజీ ఉండడంతో అతడు 1.4 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్నాడు. అత్యంత సంపన్న నటిగా ఈ జాబితాలో ముందున్న అమెరికన్ యాక్ట్రస్-ఆంట్రప్రెన్యూర్ జామీ గెర్టజ్.. ఆస్తుల ఎంతో తెలిస్తే అవాక్కవడం పక్కా. టైలర్ పెర్రీ సంపద కంటే 5 రెట్లు కంటే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. జామీ గెర్టజ్ ఆస్తుల నికర విలువ 8 బిలియన్ డాలర్లు. అంటే 66 వేల కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోని సెలబ్రిటీలందరిలోనూ ఆమె అత్యంత సంపన్నురాలు. టేలర్ స్విఫ్ట్ (1.6 బిలియన్ డాలర్లు), రిహన్న (1.4 బిలియన్ డాలర్లు), సెలీనా గోమెజ్ (1.3 బిలియన్ డార్లు) తరువాతి స్థానంలో ఉన్నారు. మడోన్నా.. నాన్-బిలియనీర్‌గా టాప్-5లో చోటు దక్కించుకుంది.టాప్ 10లో జూహీ చావ్లాటాప్-5లో మిగిలిన నలుగురి మొత్తం సంపద కంటే కూడా జామీ గెర్టజ్ సంపదే ఎక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. టాప్-5లో నిలిచిన ఐదుగురు నటీమణులు నటనతో పాటు ఇతర వ్యాపకాలతో ఆస్తులు కూడబెట్టారు. టేలర్ స్విఫ్ట్, రిహన్న, సెలీనా గోమెజ్, మడోన్నా.. యాక్టింగ్‌తో పాటు మ్యూజిక్ కెరీర్, మేకప్ బ్రాండ్లతో సంపద పోగేశారు. జామీ గెర్టజ్ విషయానికి వస్తే ఆమె వ్యాపార పెట్టుబడులతో అందరి కంటే ఎక్కువగా సంపాదించారు. మెయిన్ స్ట్రీమ్ నటి రీస్ విథర్స్పూన్ ఏడవ స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి జూహీ చావ్లా మాత్రమే. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆమె సంపద సుమారు రూ.4600 కోట్లు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూఎవరీ జామీ గెర్టజ్?జామీ గెర్టజ్.. అమెరికాలోని షికాగోలో 1965లో జన్మించారు. 80వ దశకంలో నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1981లో ఎండ్లెస్ లవ్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1987లో లెస్ దేన్ జీరో సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌కి జోడీగా నటించడంతో ఆమెకు గుర్తింపు దక్కింది. అదే సంవత్సరం ది లాస్ట్ బాయ్స్ సినిమాలో ప్రముఖ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 90 దశకంలో ట్విస్టర్ వంటి సినిమాల్లో నటించారు. ప్రధాన నటిగా విజయాలు దక్కకపోవడంతో తర్వాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. అల్లీ మెక్‌బీల్ టీవీ షోతో ప్రేక్షుకులకు దగ్గరయి ఎమ్మీ నామినేషన్ సాధించారు. చివరిసారిగా 2022 చిత్రం ఐ వాంట్ యు బ్యాక్ సినిమాలో అతిథి పాత్రలో ఆమె కనిపించారు.చదవండి: ఓటీటీలో హాలీవుడ్ రొమాంటిక్ మూవీ.. 20 భాషల్లో స్ట్రీమింగ్అంత సంపద ఎలా వచ్చింది?జామీ గెర్టజ్ నటనా జీవితంలో పెద్దగా విజయాలు లేకపోయినా ఆమె అత్యంత సంపన్న నటిగా ఎలా ఎదిగారనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త టోనీ రెస్లర్ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరిగింది. భర్తతో కలిసి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఆమె సంపద బాగా పెరిగింది. వీరిద్దరూ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)లో అట్లాంటా హాక్స్, మేజర్ లీగ్ బేస్‌బాల్‌లో మిల్వాకీ బ్రూవర్స్ జట్లకు సహ-యజమానులుగా ఉన్నారు. వీటితో పాటు ఇతర వ్యాపారాల్లోనూ జామీ గెర్టజ్ పెట్టుబడులు కలిగివుండడంతో రిచెస్ట్ యాక్ట్రస్‌గా ఆమె టాప్‌లో ఉన్నారు. -
Juhi Chawla: సిరిలో బెస్ట్
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.తాజాగా విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ ప్రకారం మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి. పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్‌కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్‌కు చెందిన ఫాల్గుణి నాయక్ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.సినిమా రంగంలో 2వ స్థానం‘హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ (1200 కోట్లు), కరణ్ జోహార్ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ కూతురుజూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ మోడల్‌గా పని చేసింది. 1984లో ‘మిస్ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.షారూక్ ఖాన్‌తో ్ర΄÷డక్షన్ హౌస్‘రాజూ బన్‌గయా జంటిల్మెన్’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్ అన్లిమిటెడ్’ అనే ్ర΄÷డక్షన్ సంస్థ స్థాపించి ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్ స్థాపించిన రెడ్ చిల్లిస్ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్ మొదలయ్యాక షారూక్‌తో కలిసి కోల్కటా నైట్‌రైడర్స్‌కు సహ భాగస్వామి అయ్యింది.వ్యా΄ారవేత్తతో వివాహంజూహీ చావ్లా ‘మెహతా గ్రూప్’ అధినేత జయ్ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్ మెహత్ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్ తదితర పరిశ్రమలు ఉన్న జయ్ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.మన దేశ మహిళా శ్రీమంతులురాధా వెంబు (మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.ఫాల్గుణి నాయర్ (రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్లైన్ బ్యూటీ బ్రాండ్‌కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్‌లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.జయశ్రీ ఉల్లాల్ (మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్ ఇం/టనీరింగ్‌లో ఎం.ఎస్ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీని స్థాపించి బిలియనీర్‌గా ఎదిగింది.కిరణ్ మజుందార్ (నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్ ఇండియా సంస్థ కిరణ్ మజుందార్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్’లో పి.జి చేసిన కిరణ్ తొలత ఎంజైమ్స్ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్ ఎప్పుడూ అపర కుబేరుల టాప్ లిస్ట్‌లో ఉంటూనే ఉంటుంది.నేహా నార్ఖెడె (ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీకి కో ఫౌండర్‌గా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్‌ఫ్లుయెంట్‌ను స్థాపించింది. -
ఈఎమ్ఐ కట్టకపోవడంతో షారూఖ్ కారు తీసుకెళ్లారు: హీరోయిన్
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షారూఖ్ ఖాన్. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ, పంటి కింద బాధల్ని భరిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. సినిమాల్లోకి రావాలనుకునే చాలామందికి ఆయనొక ఇన్స్పిరేషన్. ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదని, తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడంటోంది హీరోయిన్ జుహీ చావ్లా.నాకు ఇప్పటికీ గుర్తు..ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షారూఖ్ ఇబ్బంది పడ్డ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. తనకు ముంబైలో ఇల్లు లేదు. ఢిల్లీ నుంచి వచ్చేవాడు. తనకు వంట చేసేవారు లేరు. ఎక్కడ ఉండేవాడో తెలీదు. సెట్లో అందరి కోసం చేసిన వంటను ఆరగించేవాడు. సెట్లోని వారితో కలివిడిగా ఉండేవాడు. ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండేవాడు.గడియారంతో పోటీపడుతూ..అప్పట్లో తనకు జిప్సీ కారుండేది. అందులోనే వచ్చేవాడు. మూడు షిఫ్టుల్లోనూ పని చేసేవాడు. మేమిద్దరం రాజు బన్‌గయా జెంటిల్మెన్, దిల్ ఆష్నా హై సినిమాల్లో కలిసి పని చేశాం. అప్పుడే దివ్య భారతితో మరో మూవీ చేశాడు. గడియారంతో పోటీపడి వర్క్ చేసేవాడు. ఏదో కారణాల వల్ల తన కారు ఈఎమ్ఐ కట్టలేకపోయాడు. ఇప్పుడీ స్థాయిలో..దీంతో అతడి కారును తీసుకెళ్లిపోయారు. అప్పుడు దిగాలుగా సెట్‌కు వచ్చాడు. నువ్వేం బాధపడకు.. భవిష్యత్తులో ఎన్నో కార్లు కొనే స్థాయికి ఎదుగుతావు.. చూస్తూ ఉండు అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో మీరూ చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా షారూఖ్ కారును తీసుకెళ్లిన సమయంలో జుహీ చావ్లా తన కారును వాడుకోమని ఇచ్చింది.చదవండి: అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్ -
ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా..: ప్రముఖ హీరో
స్టార్ హీరో ఆర్. మాధవన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే హీరోయిన్ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి కూడా చెప్పాడట. 1988లో వచ్చిన 'ఖయామత్ సే ఖయామత్ టక్' అనే సినిమా చూశాక ఆమెకు ఫిదా అయిపోయానంటున్నాడు మాధవన్. జూహీ చావ్లా ఆ సినిమా చూసి ఫిదా ప్రస్తుతం ఈ హీరో 'ద రైల్వే మెన్' వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా కూడా యాక్ట్ చేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో మాధవన్ మాట్లాడుతూ.. 'అదృష్టం బాగుండి ఈ సిరీస్‌కు జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా చూసినప్పుడు అమ్మ.. నేను ఈ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లాడటమే!' అని చెప్పుకొచ్చాడు. కాగా ద రైల్వే మెన్ సిరీస్‌లో ముందుగా మాధవన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత జూహీ చావ్లాను ఈ సిరీస్‌లో భాగం చేశారు. భార్య సరితాతో మాధవన్ ఇండస్ట్రీకి పరిచయం ఇకపోతే 'ఖయామత్ సే ఖయామత్ టక్' సినిమా 1988లో రిలీజైంది. అప్పటికి మాధవన్ తన కెరీర్ ప్రారంభించనేలేదు. అతడు 1993లో 'బనేగి అప్నీ బాత్' అనే టీవీ షో ద్వారా తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు. బుల్లితెరపై పలు షోలలో పార్టిసిపేట్ చేసిన అనంతరం 1997లో 'ఇన్ఫెర్నో' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు ఓ బాలీవుడ్ సినిమాలో ఒక పాటలో క్లబ్ సింగర్‌గా కనిపించాడు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో నటించాడు. ఇతడు 1999లో సరితా బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్ నటించిన పలు సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరో టార్చర్ పెట్టాడు.. అతడి వల్లే 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరం: నటి -
అందుకే సల్మాన్‌ని పెళ్లి చేసుకోలేదు : హీరోయిన్
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి మ్యాటర్ ఇప్పటికీ ఒక వార్తే. అయన పెళ్లి గురించి ఏదైనా మాట్లాడితే చాలు.. ఆ మాటలు వైరల్ కావాల్సిందే. 56 ఏళ్లు దాటిన ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉండడంతో సల్మాన్ పెళ్లిపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ సల్మాన్ భాయ్ మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడంలేదు. అయితే గతంలో ఓ హీరోయిన్ని మాత్రం బాగా ఇష్టపడ్డాడట. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో వాళ్లను ఆడిగాడట. అయితే ఆ హీరోయిన్ తండ్రి మాత్రం నో చెప్పడంతో పెళ్లి చేసుకోలేకపోయాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదో..ఒకప్పుడు బాలీవుడ్ స్టార్‌గా రాణించిన జూహీ చావ్లా. ఆమె వ్యక్తిత్వం అంటే సల్మాన్‌కి చాలా ఇష్టం. ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ‘జూహీ చావ్లా వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రతిపాదనను జూహీ వాళ్ల నాన్న దగ్గరకు తీసుకెళ్లాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను వాళ్లకి సరిపోనని అనుకున్నారేమో(నవ్వుతూ)’అని సల్మాన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అయితే ఆ మాటలు తాజాగా అన్నవి కాదు.. కొన్నాళ్ల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పాడు. తాజాగా ఓ నెటిజన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఇక వీడియోపై తాజాగా జూహీ చావ్లా స్పందించారు. పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ తన తండ్రితో మాట్లాడిన విషయం నిజమేనని ఒప్పకుంది. తన కెరీర్ అప్పుడే మొదలవ్వడం.. అప్పటికీ సల్మాన్ ఖాన్ హీరోగా నిలదొక్కుకోకపోవడంతో పెళ్లిని నో చెప్పారని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ.. సల్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఓ సినిమాలో అవకాశం వచ్చినా.. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చేయలేకపోయానని వాపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికీ సల్మాన్ గుర్తు చేస్తాడని తెలిపింది. అయితే కెరీర్ కోసం ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డామని చెప్పింది. ఇద్దరం కలిసి చాలా స్టేజ్ షోలు కూడా చేశామని చెప్పుకొచ్చింది. 1995 లో జుహీ వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. ఇక సల్మాన్ ఖాన్, జుహీ కలసి ‘దీవానా మస్తానా’(1997) లో కలసి పనిచేశారు. తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో కూడా జుహీ అతిథిగా కనిపించింది. -
రింకూ సింగ్ విధ్వంసం కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
-
నరాలు తెగే ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ.. తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి రింకూ సిక్స్ బాదగానే.. కేకేఆర్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కేకేఆర్ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందిచారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించిన కేకేఆర్ కో ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు విజయం సాధించగానే భావోద్వేగానికి లోనైంది. ఆమె తన భర్త జే మెహతా, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్‌తో విన్నింగ్ సెలబ్రేషన్స్ జరపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ ఒక్క ఫోర్, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 14న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. చదవండి: IPL 2023: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? VENKY & RINKU WERE PHENOMENAL!!! we (@juhisquad & myself) were just as shocked as you @iam_juhi 😭💜 we screamed out loud!!! #KKRvsGT 🔥 pic.twitter.com/OKqRRpgmpX — juhiloops (@juhiloops) April 9, 2023 -
శర్మాజీ నమ్కీన్... ఓ రిటైరైన నాన్న కథ
‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్‌కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా. ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్బన్’లోని క్లయిమాక్స్‌ను ఫోన్లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్‌గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్బన్లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది. కథ ఏమిటి? ఢిల్లీలో మిడిల్‌క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు. 58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్. వారి మనసులో ఏముంది? ‘శర్మాజీ నమ్కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్‌కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలుస్తారు. అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్‌లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు. రిషి చివరి సినిమా రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్‌బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్‌బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది. తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో మార్చి 31న విడుదలైంది. చూడండి. -
స్టార్ హీరోయిన్ను 'ఆంటీ' అంటున్న కియరా అద్వానీ
Kiara Advani Reveals She Calls Juhi Chawla As Aunty: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్నబ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కియరా ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్న కియరా 'షేర్ షా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ పాపులర్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది. చదవండి: నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కియరా అద్వానీ. ఇందులో స్టార్ హీరోయిన్ జూహీ చావ్లాపై ప్రశంసలు కురిపించింది. తన తండ్రి జగ్దీప్ అద్వానీకి హీరోయిన్ చిన్ననాటి స్నేహితురాలని చెప్పుకొచ్చింది. 'జూహీ ఆంటీ మా నాన్న చిన్ననాటి స్నేహితులు. ఆమె చాలా మంచింది. జూహీ ఆంటీ అంటున్నందుకు ఆమె నన్ను చంపేస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెను పెద్ద నటిగా నేను ఎప్పుడూ చూడలేదు. నా పేరెంట్స్‌కు ఫ్రెండ్‌గా మాత్రమే తెలుసు. ఆమె పిల్లలతో కూడా నేను ఆడుకున్నాను.' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అలనాటి నటుడు అశోక్ కుమార్ తనకు బంధువు అవుతాడని తెలిపింది కియరా. 'మా తాతయ్య పెళ్లి చేసుకున్న మా నాన్నమ్మ అశోక్ కుమార్ కుమార్తె. కాబట్టి వీరి పెళ్లి ద్వారా నాకు అశోక్ కుమార్ బంధువు అవుతారు. కానీ నేను ఎప్పుడూ వారిని కలవలేదు.' అని కియరా పేర్కొంది. చదవండి: లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే? -
IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్‌తో కలిసి.. ఇప్పుడు ఇలా: జూహీ చావ్లా భావోద్వేగం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సీఈఓ కావ్య మారన్ సహా కేకేఆర్ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్‌తో పాటు ఇతర క్రికెట్ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆ బుక్ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్ విరామ సమయంలో పూల్ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది. ఆర్యన్‌తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్‌కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్ రాశారు. చదవండి: IPL 2022- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్...సైమన్ కటిచ్ రాజీనామా!? ఐపీఎల్ 2022: గతేడాది మిస్ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్ పూర్తి జట్టు ఇదే.. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
ఐపీఎల్ వేలంలో అందాల భామ.. ఎవరా బ్యూటీ గర్ల్ ?
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతమైంది. కొందరు ఆటగాళ్లు జాక్‌పాట్ దక్కించుకుంటే.. మరికొందరికి నిరాశే మిగిలింది. ఎక్కువ మొత్తం దక్కించుకుంటారనుకున్న ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి వేలంలో ఆటగాళ్లతో పాటు ఒక 19 ఏళ్ల అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చురుకుదనంతో చూపు తిప్పుకోకుండా చేసింది. తన చార్మింగ్ లుక్‌తో వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. ఎవరా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చటపడ్డారు. కొందరు గుర్తుపట్టారు కూడా. ఆమే.. జాహ్నవి మెహతా. కోల్‌కతా టీం సహా యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూతురు. కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానాలతో కలిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా తనయురాలు జాహ్నవి మెహతా. ఆమె ఆకర్షణీయ రూపం... ఆ కళ్లలో మేజిక్ అందరినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంకడ్ టైమ్. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివచ్చి.. ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆరేళ్ల వయసులో జూహీకి ప్రపోజ్ చేసిన హీరో..
Juhi Chawla Reveals Imran Khan Proposed To Her At Age Of 6: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో నటించి అనేక హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల 5జీ నెట్‌వర్క్‌పై పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జూహీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముద్దుల మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ పుట్టినరోజు గురువారం (జనవరి 13) జరిగింది. ఈ సందర్భంగా బీటౌన్ ప్రముఖులంతా ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జూహీ కూడా బర్త్‌డే బాయ్‌కు ఆసక్తికరంగా విష్ చేసింది. 1988లో అమీర్ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంలోని ఒక బాబు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బాబు ఎవరో కాదు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. ఆ ఫొటో షేర్ చేస్తూ 'ఆరేళ్ల వయసులో ఇమ్రాన్ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచే ఈ వజ్రాన్ని గుర్తు పెట్టుకున్నాను. నా చిన్నప్పటి భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్ నిండు నూరేళ్లు జీవించాలి.' అని జూహీ రాసుకొచ్చింది. అయితే 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో ఇమ్రాన్ కూడా నటించాడు. 2008లో జెనీలియా దేశ్‌ముఖ్ సరసన ఇమ్రాన్ 'జానే తు యా జానే నా' సినిమాలో తొలిసారిగా నటించాడు. 2015లో కంగనా రనౌత్‌తో కలిసి నటించిన 'కత్తి బట్టి' చిత్రంలో చివరిసారిగా కనిపించాడు ఇమ్రాన్ ఖాన్. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) ఇదీ చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం రూ. లక్ష బాండ్‌పై సంతకం -
ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి
What Does It Mean for Juhi Chawla and Aryan Khan?: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో బాలీవుడ్ నటి జూహీ చావ్లా కీలక పాత్ర పోషించారు. ఆర్యన్‌కు బెయిల్ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్ పేపర్లపై సంతకం చేశారు. బాండ్‌పై సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన జూహీ చావ్లా మీడియాతో మాట్లాడారు. చదవండి: బెయిల్ వచ్చినా జైలులోనే ఆర్యన్ ఖాన్.. ఈ మేరకు ఆమె మీడియాతో ‘ఇప్పడు ఆర్యన్ బయటకు రావడం ముఖ్యం. అదే పదివేలు’ అని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆర్యన్ డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా షారుక్ ఖాన్, జూహ్లీ చావ్లా కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కలయికలో బి-టౌన్‌కు పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. అంతేగాక వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ ఈ కేసులో గురువారం ఆర్యన్ బెయిల్ పటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ పత్రాలు ఆర్యన్ ఉన్న ఆర్థర్ రోడ్ జైలుకు పంపించాలంటే షూరిటీ సంతకాలు కీలకం. ఎందుకంటే ఆర్యన్ తరపున చట్టపరమైన బాధ్యత తీసుకుంటూ ప్రముఖులైన బయటి వ్యక్తులు ఇద్దరూ పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆర్యన్ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. -
ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్.. స్పందించిన నటి
హిందీ టీవీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ ఉన్న షో ‘ది కపిల్ శర్మ షో’. ఇందులో షోకి గెస్ట్‌గా వచ్చిన సెలబ్రిటీలను రకరకాల ప్రశ్నలు వేస్తూ నవ్విస్తుంటాడు హోస్ట్ కపిల్ శర్మ. 'పోస్ట్ కా పోస్ట్‌మార్టం' విభాగంలో హోస్ట్ పోస్ట్‌లపై కామెంట్లను చదివి వినిపించగా.. ఫన్నీ రిప్లై ఇచ్చింది నటి ఆయేశా జుల్కా. ఇంతకుముందు ఓ సారి తన పెంపుడు పిల్లిని ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఆయేశా. దానికి..‘నేను మియావ్ అంటా. మీ ఒడిలో కూర్చోబెట్టుకుంటారా?’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘రండి, మీరు కనుగొంటారు’ అంటూ కపిల్ షోలో ఫన్నీ రిప్లై ఇచ్చింది ఈ సీనియర్ నటి. అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే ఈ కామెంట్‌కి మరో నెటిజన్ ‘ఆమెకు పిల్లులు ఇష్టం, గాడిదలు కాదు’ అంటూ ఇంకా ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దానికి ఆయేషా నవ్వుతూ.. ‘అవును, ఆయనకి నిజం చెప్పారు’ అంటూ ఆ వ్యక్తికి సపోర్టు చేసింది. కాగా ఈ కపిల్ షోకి 90'లో కో స్టార్స్ అయిన జుహీ చావ్లా, మధుతో వచ్చింది ఈ సీనియర్ నటి. చదవండి: బూసన్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న అపర్ణ సేన్ ‘ది రేపిస్ట్’ View this post on Instagram A post shared by Ayesha Jhulka (official) (@ayesha.jhulka) -
అవునా కాదో మీరే తేల్చండి! మౌనం వీడిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇటీవల కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఎట్టకేలకు మౌనం వీడారు. కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పబ్లిసిటీ స్టంట్, కోర్టు సమయం వృధా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటిషన్ తిరస్కరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని తన పోరాటం ప్రచారం, ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు. ఇండియాలో 5 జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి సోమవారం ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. మనుషులకు, జంతువులు 5జీ టెక్నాలజీ మొబైల్ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమో తెలియజేయాలని ఆర్‌టీఐతోపాటు, వివిధ ఏజెన్సీలను కోరామని, ఆ వివరాలను మీరూ పరిశాలించాలని, ఓపికగా తను షేర్ చేసిన వీడియోలోని అంశాలని గమనించాలంటూ తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు. దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు, పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నాననీ, 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జుహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) -
5జీ టెక్నాలజీ: జూహీచావ్లాకు షాక్
-
5జీ టెక్నాలజీ: జూహీచావ్లాకు షాక్.. 20లక్షల జరిమానా
న్యూఢిల్లీ : 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 5జీ టెక్నాలజీ వద్దన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కావాల్సిందేనని స్పష్టీకరించింది. అయితే, కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కోర్టు ఆమెపై సీరియస్ అయింది. రూ.20లక్షల పెనాల్టీ వేసింది. కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా దాఖలు చేశారని పేర్కొంది. కాగా, 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరుతూ జూహీచావ్లాతో సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని, ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది. చదవండి : నటి వీరాభిమాని బిత్తిరిచర్య.. జడ్జి ఆగ్రహం -
నటి వీరాభిమాని బిత్తిరిచర్య.. జడ్జి ఆగ్రహం
5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె వీరాభిమాని ఒకరు చేసిన పని జడ్జికి కోపం తెప్పించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని గుర్తించి.. కోర్టు ధిక్కార నోటీసులు అందించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ: నటి జూహీ చావ్లాతోపాటూ వీరేష్ మలిక్, టీనా వాచ్ఛానీ అనే మరో ఇద్దరు ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు. అయితే ఆమె విదేశాల్లో ఉండడం వల్ల కోర్టు విచారణకు స్వయంగా హాజరుకాలేకపోయింది. దీంతో బుధవారం వర్చువల్ విచారణ జరిగింది. అయితే అంతకంటే ముందే ఆమె కోర్టు వర్చువల్ విచారణ లింక్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. తగ్గినట్లే తగ్గి.. జూహీ తరఫున న్యాయవాది దీపక్ ఖోస్లా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా మధ్యలో ఓ వ్యక్తి కల్పించుకున్నాడు. ‘‘లాల్ లాల్ హోటోం పర్ గోరీ కిస్కా నామ్ హై”..అంటూ ఆ వ్యక్తి పాడాడు. సైలెంట్‌గా ఉండాలని లేకుండా విచారణ నుంచి బైటికి వెళ్లాలని న్యాయమూర్తి కోరారు. కాసేపటి తర్వాత ‘‘మేరీ బన్నో కి ఆయేగీ బారాత్”మరో పాట వినిపించింది. దీంతో విచారణకు అంతరాయం కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ మిధా, అంతరాయానికి కారణమైన వ్యక్తి గురించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అతన్ని గుర్తించి కోర్టు ధిక్కారం నోటీసులు అందించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విచారణలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ లాంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం. అయితే ఆ వ్యక్తి మొదటి నుంచే విచారణకు అంతరాయం కలిగించినట్లు తెలుస్తోంది. ‘‘జూహీ మేడమ్ ఎక్కడ? నేను ఆమె డైహార్డ్ ఫ్యాన్‌ని. ఆమె నాకు కనిపించడం లేదు” అంటూ పదే పదే కామెంట్లతో విసిగించినట్లు ఢిల్లీ బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ వెల్లడించింది. So this happened. Actress Juhi chawla appeared in the court wrt her petition on 5g and then some attendees started singing leading to the court asking Delhi police to trace the singers. You can see a visibly upset Kapil Sibal too in the frame. #JuhiChawla #DelhiHighCourt #song pic.twitter.com/vmSH5iAU6A — Vipul jain (@vipuljain69) June 2, 2021 కాగా, వర్చువల్ విచారణలో పాట పాడిన జూహీ అభిమాని వ్యవహారంపై మరో నటి స్వరభాస్కర్ వెటకారంగా స్పందించింది. ‘ఇది నాదేశం. ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నా. ఈ విచారణను ఆద్యాంతం ఆస్వాదించా’ అంటూ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించింది స్వరభాస్కర్. OMG there is a video! I cannot describe adequately the kinda joy I am experiencing watching this!!!!!! 😹😹😹😹🤣🤣🤣 https://t.co/ecPVVIuWlM — Swara Bhasker (@ReallySwara) June 2, 2021 అసలు ఎందుకీ కేసు? 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని మేం కోరుతున్నాం అని జూహీచావ్లాతో సహా మిగతా ఇద్దరు పిటిషనర్లు కోరారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని, ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది. చదవండి: ఫ్యాన్స్‌కి జూమీ వింత రిక్వెస్ట్ -
5జీ నెట్‌వర్క్‌తో పర్యావరణానికి పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంపై బాలీవుట్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5జీ నెట్‌వర్క్‌తో విపరీతమైన రేడియేషన్ వెలువడుతుందని, తద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుందని చెప్పారు. ఇది మనుషుల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విలువైన జంతుజాలం, పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను వ్యతిరేకిస్తూ జుహీ చావ్లా సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సి.హరిశంకర్ ముందుకు విచారణకు రాగా, ఆయన దాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జుహీ చావ్లా పిటిషన్‌పై జూన్ 2న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 5జీ నెట్‌వర్క్‌తో రేడియేషన్ ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు పెరిగిపోతుందని జుహీ చావ్లా పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ ఒక్క మనిషి, జంతువు, పక్షి, కీటకం, చెట్టు ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోలేవని తెలియజేశారు. అంతేకాకుండా మన పర్యావరణానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుందన్నారు. -
5జీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నటి
ముంబై: దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. సాంకేతికతకు తాను వ్యతిరేకం కాదని.. అయితే దాని వల్ల తలెత్తే పర్యావరణానికి హానీ కలిగించే సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ పిటీషన్‌పై తొలి విచారణ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జూహీ చావ్లా మాట్లాడుతూ.. ‘‘సాంకేతికపరమైన ఆవిష్కరణల అమలును మేం వ్యతిరేకించడంలేదు. వైర్ లెస్ కమ్యూనికేషన్ సహా సాంకేతిక ప్రపంచం నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలను అందరం ఆస్వాదిస్తున్నాం. అయితే, తదుపరితరం పరికరాల వినియోగంలోనే సందిగ్ధత ఏర్పడుతోంది. వైర్ లెస్ గాడ్జెట్ల నుంచి, సెల్ టవర్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ధార్మికత విడుదలవుతుందని మన సొంత అధ్యయనాలే చెబుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై రేడియేషన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని నమ్మడానికి ఇదే ప్రధాన కారణం’’ అన్నారు జూహీ చావ్లా. 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ 5జీప్లాన్స్ మానవులపై తీవ్రమైన, కోలుకోలేని ప్రభావం చూపడమే కాక భూమీ మీద ఉన్న అన్ని పర్యావరణ వ్యవస్థలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి అని జూహీ చావ్లా ఆరోపించారు. మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా ఈ కొత్త టెక్నాలజీ హానికరం కాదని సంబంధిత విభాగం ధ్రువీకరించాలని జూహీ చావ్లా తన పిటిషన్లో డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలోనే కాకుండా, రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీ సురక్షితమా కాదా అనే అధ్యయనం చేయాలని కోరారు. ఇందులో ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉండరాదని జూహీ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
'మేం ఓడిపోయుండొచ్చు.. కానీ మనుసులు గెలిచాం'
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 18 పరుగులతో ఓడిపోయినా ఆకట్టుకుంది. చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దినేష్ కార్తిక్, ఆండ్రీ రసెల్‌లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రసెల్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోగా.. కార్తిక్ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రసెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్.. సిక్సర్లతో సీఎస్కే బౌలర్లను ఉతికారేస్తూ చుక్కలు చూపించాడు. ఆఖరి 2 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో టెయింలెండర్లు వికెట్లు సమర్పించుకోవడంతో కమిన్స్ పోరాటం వృథాగా మారింది. అలా మొత్తం ఓవర్లు కూడా ఆడకుండానే 19.1 ఓవరల్లో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగులతో పరాజయం పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినా నెటిజన్ల మనుసులు మాత్రం గెలుచుకుంది. రసెల్, కార్తీక్, కమిన్స్‌ల ప్రదర్శనపై నెటిజన్లు తమ ప్రేమను ప్రదర్శిస్తూ కామెంట్లు చేశారు. కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్.. ''కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా కేకేఆర్ మ్యాచ్ ఓటమిపై ఆ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా ట్విటర్ వేదికగా స్పందించారు. ' కేకేఆర్ టీమ్‌ను చూస్తే గర్వంగా ఉంది. మా కుర్రాళ్ల ప్రదర్శన నిజంగా అద్బుతం. ఈరోజు మ్యాచ్ ఓడిపోయిండొచ్చు.. కానీ మనసులు గెలవడంతో పాటు కొండంత ఆత్శవిశ్వాసాన్ని సాధించాం. థ్యాంక్యూ.. రసెల్, కార్తిక్ , కమిన్స్.. మీ హార్డ్‌వర్క్ సూపర్.. మీ ఆటకు ఫిదా' అంటూ కామెంట్ చేశారు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఓటమితో.. కేకేఆర్ వరుసగా హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసింది. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 24న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్: షారుక్ రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! Proud of our team KKR .. after such a shaky start where we looked like we had collapsed 🙈🙈🙈🙈 ..!.!!!! our boys played strong and hard , and brought it to a close match ..!! Thank you Russell, DK, Pat ..!!! 💜💜💜💜💜💜 @Russell12A @DineshKarthik @patcummins30 @KKRiders — Juhi Chawla (@iam_juhi) April 22, 2021 -
వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు!
చెన్నై: ‘‘కేకేఆర్ కిడ్స్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా వేలంపాటలో పాల్గొన్నారు’’ అంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా ఆనందంలో తేలిపోయారు. తన కూతురు జాహ్నవి, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షారుఖ్, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా గురువారం జరిగిన ఈ క్యాష్ రిచ్‌లీగ్ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు. తద్వారా వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలి(19)గా నిలిచారు. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్ వేలం చరిత్రలో యంగెస్ట్ బిడ్డర్‌గా మా జాహ్నవి మెహతా. చెన్నై పర్యటన, ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు ఆమె అందిస్తున్నారు’’ అంటూ కేకేఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ విషయంపై స్పందించిన జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో.. ‘‘వీళ్లిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసింది’’ అంటూ కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా జూహీ- జై మెహతా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్ మెహతా. ఇక పర్స్‌లో రూ.10.75 కోట్లతో కేకేఆర్ వేలానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మినీ వేలం-2021లో కేకేఆర్ దక్కించుకున్న ఆటగాళ్లు: ►షకీబ్ అల్ హసన్- రూ. 3.2 కోట్లు ►హర్భజన్ సింగ్- రూ. 2 కోట్లు ►కరుణ్ నాయర్- రూ. 50 లక్షలు ►బెన్ కటింగ్- రూ.75లక్షలు ►వెంకటేస్ అయ్యర్- రూ.20లక్షలు ►పవన్ నేగి- రూ.50లక్షలు చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు So happy to see both the KKR kids, Aryan and Jahnavi at the Auction table .. 🙏😇💜💜💜 @iamsrk @KKRiders pic.twitter.com/Hb2G7ZLqeF — Juhi Chawla (@iam_juhi) February 18, 2021 View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
‘ప్లీజ్ నా చెవిరింగు వెతికివ్వండి’
బాలీవుడ్ నటి జూహీ చావ్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకు దేనికి సంబంధించి ఆ రిక్వెస్ట్ అంటే జూహీ చావ్లా డైమండ్ ఇయర్ రింగ్ పొగొట్టుకున్నారు. దయచేసి తనకు సాయం చేయమని.. మంచి రివార్డు కూడా ఇస్తానంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ఆదివారం సాయంత్రం చేసిన ఆ ట్వీట్లో ఇలా ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 2లోని గేట్ నంబర్ 8వైపు ప్రణామ్ బగ్గీలో నడుచుకుంటూ వెళ్లాను. ఎమిరెట్స్ కౌంటర్లో చెక్ చేశారు. సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో నా డైమండ్ ఇయర్ రింగ్ ఒకటి ఎక్కడో జారి కింద పడిపోయింది. దాన్ని వెతకడంలో నాకు ఎవరైనా సాయం చేస్తే.. ఎంతో ఆనందిస్తాను. నా చెవి రింగు ఎవరికైనా కనిపిస్తే.. పోలీసులకు అందించండి. మీకు రివార్డు కూడా ఇస్తాను అన్నారు. అంతేకాక పోయిన దాని జత ఇయర్ రింగ్ ఫోటోని షేర్ చేశారు జూహీ చావ్లా. ఇక దానితో పాటు గత పదిహేనేళ్లుగా ప్రతి రోజు నేను ఈ చెవి దుద్దులను ధరిస్తూ ఉన్నాను. దయచేసి దీన్ని వెతకడంలో నాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ప్రస్తుతం ఈ ట్వీట్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (చదవండి: మీ టూ వల్ల తప్పించుకున్నాను!) Kindly help 🙏 pic.twitter.com/bNTNYIBaZ2 — Juhi Chawla (@iam_juhi) December 13, 2020 ఇక సినిమాల విషయానికి వస్తే.. జూహీ చివరి సారిగా 2019లో వచ్చిన ‘ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆమెతో సల్మాన్ పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ అయింది..
ప్రముఖ బాలీవుడ్ నటి ‘జూహీ చావ్లా’ పుట్టిన రోజు నేడు. శుక్రవారం 53వ పడిలోకి అడుగుపెట్టారామె. 1986 వచ్చిన ‘సుల్తానాత్’ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు జూహీ. ఇప్పటివరకు 80కి పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగా పలు చిత్రాలను కూడా నిర్మించారు. టెలివిజన్ షోలలో కూడా నటించారు. అప్పటి అగ్ర నటులందరి సరసనా ఆమె హీరోయిన్గా చేశారు.. ఒక్క సల్మాన్ ఖాన్‌తో తప్ప. జూహీ హీరోయిన్గా నటించిన ‘దివానా మాస్తానా’ సినిమాలో సల్మాన్.. సల్మాన్ హీరోగా చేసిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమా జూహీ గెస్ట్ రోల్స్ చేశారు తప్ప పూర్తి స్థాయి సినిమా అయితే తీయలేదు. ( హద్దులు చెరిపిన ఆకాశం ) దానికి గల బలమైన కారణాలు తెలియకపోయినా గతంలో సల్మాన్ ఆమెపై మనసు పారేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఓ పాత ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ జూహీ అందమైన పిల్ల. ఎంతో మంచిది. తనను నాకిచ్చి పెళ్లి చేయమని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దానికి కారణం తెలీదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఆమె కెరీర్ ఉచ్చ స్థితిలో ఉండగా 1995లో జై మెహతా అనే వ్యాపార వేత్తను రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జాహ్నవి, అర్జున్ ఉన్నారు. -
‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’
ముంబై: తన కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్ ప్రముఖ నటి జూహీ చావ్లా తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన స్నేహితుడు, వ్యాపారవేత్త జై మెహతాను రహస్యంగా వివాహమాడిన సంగతి తెలిసిందే. జై మెహతా మొదటి భార్య మరణించిన దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. కాగా ఇటీవల రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూహీ చావ్లా తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. సర్వం కోల్పోయినట్లు అనిపించింది.. ‘‘సినిమాల్లో ప్రవేశించకముందే నాకు జైతో పరిచయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలాకాలం పాటు కలుసుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మా ఇద్దరి స్నేహితుడు ఒకరు ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీలో మరోసారి తనను చూశాను. అప్పటికే ఆయన సుజాత బిర్లా(జై మొదటి భార్య)ను కోల్పోయారు. విమాన ప్రమాదంలో 1990లో ఆమె మరణించారు. తర్వాత కొన్నేళ్లకు నేను షూటింగ్లో ఉన్న సమయంలో మా అమ్మ మోనా చావ్లా యాక్సిడెంట్లో చనిపోయారనే దుర్వార్త విన్నాను. నా జీవితంలో అతి అత్యంత కఠిన సమయం. సర్వం కోల్పోయినట్లు అనిపించింది. అలాంటి విపత్కర సమయంలో జై నాకు అండగా నిలిచాడు. నేను ఎక్కడ ఉన్నా ప్రతిరోజూ పువ్వులు, లేఖలు, బహుమతులతో ముంచెత్తేవాడు. నా పుట్టినరోజున ట్రక్కు నిండా గులాబీలు పంపించాడు. వీటన్నింటినీ ఏం చేసుకోవాలని ప్రశ్నించాను. నన్ను సంతోషంగా ఉంచడానికి తను చేయని ప్రయత్నం లేదు. అలా ఏడాది గడిచిన తర్వాత నాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 1996లో మేం పెళ్లి చేసుకున్నాం. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న కారణంగా నేను పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాను’’ అని జూహీ చెప్పుకొచ్చారు. కాగా జూహీ చావ్లా- జై మెహతాకు ఇద్దరు పిల్లలు జాహ్నవి(19), అర్జున్(16) ఉన్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు షారూక్ ఖాన్‌తో కలిసి జూహీ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.(అప్పుడు చాలా బాధ కలిగింది : సమంత) -
హిట్ పెయిర్.. ఏడేళ్లు మాట్లాడుకోలేదట..!
ఒకప్పుడు బాలీవుడ్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా. ఖయామత్ సే ఖయామత్ తక్, లవ్ లవ్ లవ్, ఇష్క్ లాంటి సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఓ చిన్న గొడవ కారణంగా ఏకంగా ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇష్క్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమిర్, జూహీల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో దూరమైన ఆమిర్, జూహీలు ఏడేళ్ల పాటు మాట్లాడుకోలేదట. అయితే ఆమిర్, రీనాలు విడాకులు తీసుకుంటున్నట్టుగా తెలియటంతో జూహీచావ్లానే గొడవ పక్కన పెట్టి ఆమిర్, రీనాలను వారించే ప్రయత్నం చేసిందట. దీంతో ఆమిర్, జూహీల మధ్య తిరిగి స్నేహం చిగురించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమిర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. -
డేట్ గుర్తు పెట్టుకుంటారా?
నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్ కపూర్. అనిల్ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్. -
‘మా ఇద్దరికి పెళ్లి చేయమని అడిగాను’
సాక్షి, ముంబై : బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగించిన సల్మాన్ పెళ్లి విషయంలో ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. బాలీవుడ్ మాజీ హీరోయిన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా గురించి మాట్లాడిన సల్మాన్ పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు. ‘తను చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తి. తన వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చింది. అందుకే వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి జూహితో నా పెళ్లి జరిపిస్తారా అని అడిగాను. కానీ ఆయన కుదరదంటూ నా ముఖం మీదే చెప్పేశారని’ సల్మాన్ వ్యాఖ్యానించాడు. మరి జూహి వాళ్ల నాన్న ఎందుకు అంగీకరించలేదని అడగగా.. ‘తనకి నేను సరిపోనని భావించారేమో’ అంటూ సల్మాన్ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సల్మాన్ ఖాన్, జూహి చావ్లాలు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. -
వర్క్ మోడ్
పెళ్లి తర్వాత ఇన్ని రోజులు ఫ్యామిలీ మోడ్‌లో టైమ్ స్పెండ్ చేసిన సోనమ్ కపూర్ తిరిగి వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు. హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఏసా లగా’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్, రెజీనా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు సోనమ్. ప్రస్తుతం జూహీ చావ్లా, సోనమ్ కపూర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
మాధురి–ఐశ్వర్య–జూహి.. ఓ అనిల్
భలే కుదిరింది జోడి. కెమిస్ట్రీ అదిరింది... ఇదిగో ఇలాంటి మాటలే అనిల్‌కపూర్–మాధురి దీక్షిత్‌లను తెరపై చూసి బీటౌన్ ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఆల్మోస్ట్ అరడజను సినిమాలకు పైగా కలిసి నటించిన అనిల్ –మాధురి కాంబో చివరిసారిగా 2000లో ‘పుకార్’ సినిమాలో కనిపించింది. ఈ ఇద్దరూ మళ్లీ నటించడానికి 17ఏళ్ల టైమ్ పట్టింది. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ‘ధమాల్’ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో పార్ట్ ‘టోటల్ ధమాల్’ చిత్రంలో అనిల్–మాధురి మళ్లీ జోడీగా నటిస్తున్నారు. సేమ్ టైమ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్తోనూ ఇదే సీన్ రీపీట్ అయ్యింది అనిల్‌కపూర్‌కు. 2000లో ‘హామారా దిల్ ఆప్కే పాస్ హై’ చిత్రంలో జంటగా నటించిన అనిల్ కపూర్, ఐశ్వర్యారాయ్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి 17 ఏళ్ల టైమ్ పట్టింది. రాకేష్ ఓం ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యానీఖాన్’ చిత్రంలో అనిల్‌కపూర్–ఐశ్వర్యారాయ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మాధురి–ఐశ్వర్య మాత్రమే కాదండోయ్.. జూహీతో కూడా అనిల్ రీ–యూనియన్ అయ్యారు. ఆల్మోస్ట్ 11ఏళ్ల తర్వాత జూహీ చావ్లాతో కలిసి నటిస్తున్నారు అనిల్‌కపూర్. ఆయన నటించిన ‘1942: ఎ లవ్‌స్టోరీ’ మూవీలోని ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ చిత్రంలోని పాట గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి ఆ టైటిల్‌నే పెట్టారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్ తనయ సోనమ్ కపూర్ నటిస్తున్నారు. ఇలా ఈ ఏడాది అనిల్‌కపూర్, ఐశ్యర్యారాయ్, మాధురి దీక్షిత్, జూహీ చావ్లాలకు మెమొరబుల్ ఇయర్ అని చెప్పాలి. ఈ కాంబినేషన్లే కాకుండా బాలీవుడ్లో పదేళ్ల తర్వాత ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించనున్నారని, ఆల్మోస్ట్ 23 ఏళ్ల తర్వాత సంజయ్‌దత్, శ్రీదేవి సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేయనున్నారని బాలీవుడ్ టాక్. -
ఇప్పుడు రీల్ డాడ్ అండ్ డాటర్
‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా....’ అంటూ ‘1942 ఎ లవ్ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్ కపూర్ పాడిన లవ్ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన 24 ఏళ్లకు అనిల్ కపూర్ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా’ పేరుతో సినిమా చేయడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఇందులో ఆయన ముద్దుల కూతురు సోనమ్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఇంకో విశేషం కూడా ఉంది. ఈ సినిమాలో అనిల్ కపూర్‌కు జోడిగా జూహీ చావ్లా నటిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ క్లాప్ బోర్డ్‌ను పోస్ట్ చేసి, ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్ టైమ్ మా నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను. మీకు ‘ఆన్ స్క్రీన్ డాటర్’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. థాంక్యూ షెల్లీ చోప్రధర్ (చిత్రదర్శకుడు). ఇంత ఇంట్రెస్టింగ్ స్టొరీ రాసినందుకు. ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు విధు వినోద్ చోప్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు సోనమ్. దానికి అనిల్ కపూర్ ‘‘మనిద్దరం కలిసి యాక్ట్ చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూడు.. ఎక్కడున్నామో? నీకు ఎగై్జటెడ్‌గా ఉందేమో.. నాకు మాత్రం చాలా నెర్వస్‌గా ఉంది’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. రియల్ లైఫ్‌లో తండ్రీ కూతురైన అనిల్, సోనమ్‌లను రీల్‌పై డాడ్ అండ్ డాటర్‌గా చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. -
ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిపై అందరి దృష్టి!
సాక్షి, బెంగళూరు: దేశంలో అత్యంత సంపన్న లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంపాట ఇటీవల అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. టాప్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లే కాదు.. వేలంపాటలో పాల్గొన్న సంపన్నుల పిల్లలు కూడా పలువురి దృష్టిని ఆకర్షించారు. ఈ వేలంపాటలో ముంబై ఇండియన్స్ టేబుల్ వద్ద ఆ జట్టు యాజమాని ముఖేశ్ అంబానీ సతీమణి నీతతోపాటు వారి తనయుడు ఆకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషిస్తూ.. పెడెల్ను రైజ్ చేయడంలో ఆకాశ్ ముందంజలో కనిపించాడు. ఇక, 17 ఏళ్ల ఝాన్వీ కూడా ఆటగాళ్ల వేలంపాటలో అందరి దృష్టి ఆకర్షించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు సహ యాజమానులైన నటి జుహీ చావ్లా, నిర్మాత జయ్ మెహతాల కూతురు ఝాన్వీ. కేకేఆర్ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది. -
దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం
జూబ్లీహిల్స్: విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా జూహీచావ్లా అన్నారు. ఫిక్కీ యంగ్‌లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్పర్సన్ సంద్యారాజు, మోడల్ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
కయామత్ సే కయామత్ తక్
కొద్ది రోజుల క్రితం జూహీ చావ్లా జైపూర్‌లో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ రాజమాతాజీని కలిసింది. ఆమె మాటలు జూహీని చాలా ప్రభావితం చేశాయి. ‘మనలో ఎంత మంది పుస్తకాలు చదువుతారు? ఎంతమందికి చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది? మనకు తెలిసిన చరిత్ర చాలా వరకు సినిమాల్లో చూసిన చరిత్రే’... ఇవీ రాజమాత జూహీ చావ్లాతో అన్న మాటలు. ‘నిజమే. సినిమా తీసేటప్పుడు సినిమాలో చూపించే విషయాల గురించి సెన్సిటివ్‌గా ఉండాలి. కాని సినిమా తీసేది హీరో హీరోయిన్ కాదు కదా. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, ఆలోచించి తీసేవే సినిమాలు. ఆ తర్వాత పాత్రల కోసం మంచి పెర్ఫార్మర్స్ను ఎంచుకుంటారు. దీపికా పదుకొనె అలాంటి ఒక పర్ఫార్మర్. పాత్రకు అనుగుణంగా నటించడం ఆమె బాధ్యత. ఆమె ఎన్నో సినిమాలు చేశారు. ఆ సినిమాలను చూసి ఆ పాత్రలను ప్రేమించారు. ఎంతోమంది ఫ్యాన్లుగా మారిపోయారు. అన్ని సినిమాల్లో పద్మావతి ఒక సినిమా. అన్ని పాత్రల్లో దీపికా పదుకొనె వేసినది ఒక పాత్ర. మరీ మహిళ అని కూడా చూడకుండా చంపేస్తామని అనడం సబబు కాదనిపిస్తుంది. నేను ఒక్క పద్మావతి సినిమా గురించే మాట్లాడటం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరక్కుండా ఉండాలి అంటున్నాను’... అని వ్యాఖ్యానించారు జూహీ చావ్లా. కయామత్ సే కయామత్ తక్ అంటే అనాది నుంచి అనాది వరకు అని అర్థం. సినిమా వివాదాలు కూడా అనాది నుంచి అనాది వరకు కొనసాగుతుంటాయి. ఇవాళ్టి ఫ్లాష్ న్యూస్ రేపటికి సద్దివార్త కాకమానదు కదా. -
తప్పులో కాలేసిన జూహి చావ్లా
ప్రముఖ హీరోయిన్ జూహి చావ్లా తప్పులో కాలేశారు. టపాసుల నిషేధంపై ఆమె చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో పంచ్ పటాకులు పేలుస్తోంది. టపాసుల నిషేధాన్ని సమర్థిస్తూ... నవంబర్ 1 వరకు ఫైర్‌క్రాకర్స్ నిషేధిస్తూ 'ఢిల్లీ సుప్రీంకోర్టు' అద్భుత నిర్ణయం తీసుకుందని, ప్రేమ, దీపాలుతో ఈ సారి దివాలిని సెలబ్రేట్ చేసుకుందామంటూ జూహి చావ్లా ట్వీట్ చేశారు. ఆమె సుప్రీంకోర్టును కేవలం ఢిల్లీదే అనడంపై ట్విట్టరియన్లు జోకులు పేలుతున్నారు. ముంబై సుప్రీంకోర్టు కూడా టపాసులను బ్యాన్ చేసిందా? లేదా? అంటూ ఒక ట్విట్టరియన్ జూహిని అడిగాడు. దేశంలో ఎన్ని సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇది ఢిల్లీ సుప్రీంకోర్టు నిర్ణయమైతే, మరోకటి ఎక్కడ? అని, ఇది దేశానికి సుప్రీంకోర్టు అని, ఢిల్లీకి కాదు అని మరోకరు ఇలా... జూహికి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దేశానికి ఒకటే సుప్రీంకోర్టు ఉంటుంది మేడమ్ అంటూ మరికొందరు జనరల్ నాలెడ్జ్ నేర్పుతున్నారు. టపాసుల నిషేధంతో ప్రతి రాష్ట్రానికి ఒక సుప్రీంకోర్టు వచ్చిందని, థ్యాంక్యూ బ్యాన్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా జూహి చావ్లా ట్వీట్‌కు పెద్ద ఎత్తునే ప్రతి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది నవంబర్ 11నే సుప్రీంకోర్టు, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో టపాసుల విక్రయాలు, హోల్‌సేల్, రిటైల్ వంటి వాటి లైసెన్సుల రద్దును సమర్థించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో నవంబర్1 వరకు ఎలాంటి టపాసులు అమ్మకూడదని గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. Brilliant move by Delhi supreme Court, firecrackers banned till November 1! Celebrate this Diwali with Diyas & love 😬😬 — Juhi Chawla (@iam_juhi) October 9, 2017 -
కోల్‌కతా మ్యాచ్‌లో సందడి చేసిన జుహీ చావ్లా
-
షారూక్, జుహీ చావ్లాలకు నోటీసులు
ముంబై: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీకి సంబంధించి బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరి, నటి జుహీ చావ్లాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం షోకాజ్ నోటీసులిచ్చింది. ఫెమా చట్టం నిబంధనలు ఉల్లంఘించి రూ.73.6 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేందుకు వారు కారణమయ్యారంటూ నోటీసులు పంపింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలంది. ఈ కేసు 2008–09 కాలానికి చెందినది. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాతృసంస్థ అయిన కేఆర్‌ఎస్‌పీఎల్‌కు చెందిన 90 లక్షల షేర్లను మారిషస్‌కు చెందిన మరో సంస్థకు వీరు షేరు రూ.10కే ఇచ్చారు. కానీ అప్పటికి కేఆర్ఎస్పీఎల్ ఒక్కో షేర్ విలువ రూ.86 నుంచి రూ.99 మధ్య ఉంది. -
బాలీవుడ్ హీరో హీరోయిన్లకు ఈడీ నోటీసులు
ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజి మేనేజ్మెంట్) నిబంధనల ఉల్లంఘన కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్‌లతో పాటు హీరోయిన్ జూహీ చావ్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. షారుక్, జూహీ చావ్లాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ జట్టు యజమానులన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు వీళ్లు ముగ్గురికీ నోటీసులు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టంలోని 4(1) నిబంధన కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. -
'ఆ సినిమాను తిట్టడం ఏం బాలేదు'
ముంబై: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా కిడ్నాప్ మిస్టరీ వీడటంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షారుఖ్‌ఖాన్, జూహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్' (1993) సినిమా ఈ కిడ్నాప్ కు ప్రేరణ అని తేలడం కొత్త చర్చకు దారితీసింది. 'డర్' సినిమాలో షారుఖ్ తరహాలోనే దాదాపు ఏడాదిపాటు దీప్తిని రహస్యంగా వెంటాడిన కిడ్నాపర్.. ఆ సినిమా ప్రేరణతోనే ఆమెను కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాలపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 'డర్' సినిమాలో నటించిన హీరోయిన్ జూహ్లీ చావ్లా మాత్రం సమాజంలో జరిగే తప్పులకు సినిమాలను నిందించడం సరికాదు అంటున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో 'డర్' చిత్రాన్ని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. 'సినిమా ముగింపులో సత్యమే విజయం సాధించినట్టు మేం ఎప్పుడూ చూపిస్తాం. సినిమాను మధ్యలోనే వదిలేసి మీకు నచ్చింది ఎంచుకోమని, చెడు చేయమని ఎప్పుడూ ప్రేక్షకులకు బోధించం. ప్రజల జీవితాలపై బాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు వ్యక్తిగత, కుటుంబ ప్రభావాలు కూడా ఉంటాయి' అని జూహ్లిలీచావ్లా అన్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కూడా ఈ విషయంలో స్పందించారు. 'నిజజీవితంలోని ఘట్టాలే సినిమాలకు ప్రేరణ అవుతాయి. సినిమాలోని దృశ్యాలు నిజజీవితంలోనూ ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో చర్చ ఎప్పుడూ ఉన్నదే. సినిమాలు, పుస్తకాలు సమాజాన్ని మార్చి ఉంటే ఈపాటికే ప్రపంచం స్వర్గధామం అయ్యేది' అని ఆయన అన్నారు. -
'ఎక్కడికి వెళుతున్నామో అర్థం కావడం లేదు'
ముంబయి: ప్రస్తుత రోజుల్లో విద్య వ్యాపారంగా మారడం దురదృష్టకరమని ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా పేర్కొంది. తాను ఇలాంటి రోజులు చూస్తాననుకోలేదని చెప్పింది. ఆమె నటించిన చాక్ అండ్ డస్టర్ అనే చిత్ర విశేషాలు చెప్తున్న సందర్భంగా ఆమె ఈ మాటలు అన్నారు. 'గతంలో నేనొకచోట చదివాను.. రానున్న రోజుల్లో ఆస్పత్రులు, విద్య మంచి వ్యాపార రంగంగా మారనున్నాయని. అప్పుడు నేను చాలా తికమకపడ్డాను. అది ఎలా సాధ్యం అని? కానీ, ఇప్పుడు ఆ ఆర్టికల్ నిజమేనని నమ్ముతున్నాను. విద్య వ్యాపారంగా మారడం నిజంగా ఓ దురదృష్టమే. ఈ పరిస్థితి మారాలని నేను కోరుకుంటాను. విద్యను అందించడమనేది ఆదర్శవంతంగా ఉండాలని నేను భావిస్తాను. వేదాల్లో కూడా ఉపాధ్యాయులకు సముచిత స్థానం, మంచి గౌరవం ఉంది. అలాంటి గౌరవం ఎక్కడ పోగుట్టుకున్నామో, మనం ఎక్కడి వెళుతున్నామో నాకు తెలియడం లేదు' అంటూ జూహీ తన మనసులో మాట చెప్పింది. -
నవంబర్ 13న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: జుహీ చావ్లా (బాలీవుడ్ నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. న్యూమరాలజీలో సంవత్సర సంఖ్య 4 కు చాలా ప్రాధాన్యముంది. చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ సంబంధమైన వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. అందువల్ల ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. పుట్టిన తేదీ 12 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,4, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: దక్షిణామూర్తిని, అమ్మవారిని ఆరాధించడం,అనాథలను ఆదుకోవడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్
యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు అని అడిగితే చాలామంది హీరోయిన్లు డాక్టర్ అన్న సమాధానమే చెబుతారు. కానీ, అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ ఇప్పుడు నిజంగానే డాక్టర్ అవతారం ఎత్తారు. విషయం ఏమిటంటే.. మరో సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గత ఐదారు రోజులుగా విపరీతంగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. దాంతో పసుపు నీళ్లు తాగాలని ఆమెకు షబానా అజ్మీ చెప్పారు. అది మ్యాజిక్‌లా పనిచేసిందని జూహీ సంబరపడిపోయింది. ప్రస్తుతం షబానాతో కలిసి 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో నటిస్తున్న జూహీ చావ్లా.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. పసుపు నీళ్లు తయారుచేసుకోవడం కూడా చాలా సులభమేనని, నీళ్లు బాగా మరిగించి.. అందులో మంచి నాణ్యమైన ఆర్గానిక్ పసుపు వేయాలని చెప్పింది. ఆర్గానిక్ పసుపును షబానా తనకు బహుమతిగా కూడా ఇచ్చారంటూ ఆ ప్యాకెట్ ఫొటోను ట్వీట్ చేసింది. మరోవైపు షబానా అజ్మీ కూడా జూహీ చావ్లాకు థాంక్స్ చెప్పారు. ఇదెందుకు అనుకుంటున్నారా? షూటింగ్ సెట్ దగ్గరకు ఆమె గుజరాతీ వంటకాలు తెచ్చిందట. ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయని, తాను ఇప్పటికీ తాను పెదాలు నాక్కుంటూనే ఉన్నానని షబానా చెప్పారు. జయంత్ గిలాటర్ దర్శకత్వం వహిస్తున్న 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో వీళ్లిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సమీర్ సోనీ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. Was sick .. Wheezing and coughing for the past 5 days .. Shabanaji advised me to sip haldi paani ... And it's worked like magic .. — Juhi Chawla (@iam_juhi) October 24, 2015 To make haldi paani .. Simply boil water with good quality organic haldi .. And Shabanaji sweetly gifted me that too !! :) :) — Juhi Chawla (@iam_juhi) October 24, 2015 Thanku so much @iam_juhi for the yummy Gujju food that u brot 2day on sets of Amin Suranis #Chalk And Duster. Am still licking my lips. Maju — Azmi Shabana (@AzmiShabana) October 24, 2015 -
'ఆనాటి నా ఆలోచనే ఓ అద్భుతం'
ముంబై: జూహీచావ్లా.. ఒకనాటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. తన అందంతోపాటు డ్యాన్సులతో కుర్రకారు మనసు దోచుకున్న జూహీ.. తన యుక్త వయసులోని మధురానుభూతులను మరోసారి తలుచుకుంటూ మురిసిపోతుంది. తాను 'మిస్ ఇండియా' గా కిరీటం గెలుచుకున్న నాటి జ్ఞాపకాలు నిజంగా అద్భుతమని తెలిపింది. తన 47 ఏళ్ల జీవితంలో మరిచిపోలేనిది ఏదైనా ఉంటే అది యుక్త వయసేనని పేర్కొంది. 'నేను 18 సంవత్సరాల ప్రాయంలో మిస్ ఇండియా పోటీకి వెళ్లాను. ఆ పోటీలో విజయం సాధించి మిస్ ఇండియా కిరీటాన్ని చేజిక్కించుకున్నా. మళ్లీ ఒకసారి వెనక్కు చూసుకుంటే.. పోటీకి వెళ్లాలని నాకు వచ్చిన ఆలోచన చాలా గొప్పది. ప్రీతిదాయకమైన జ్ఞాపకాలను ఆనాటి నా వయసు నాకిచ్చింది' అని జూహీ తెలిపింది. యుక్త వయసులో తీసుకునే నిర్ణయాలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని జూహీ అభిప్రాయపడింది. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తరువాత జూహీకి బాలీవుడ్ ఆఫర్లు ఒకదాని వెంట వచ్చిపడ్డాయి. వరసుగా హిట్ లు సాధించిన జూహీ బాలీవుడ్ లో ఓ వెలుగువెలిగింది. -
మేకప్‌మ్యాన్ కోసం ఫ్రీగా సినిమా!
సినీ తారలు తమ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సిబ్బంది కోసం సినిమాలు చేయడం లేదా వారి సినీ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందాల తార అనుష్క తన మేకప్ మ్యాన్ కోసం ‘పంచాక్షరి’ సినిమాలో నటిస్తే, తమిళ సూపర్‌స్టార్ అజిత్ ఓ అడుగు ముందుకు వేసి తన సిబ్బంది కోసం ఇళ్లు కట్టించే పనిలో ఉన్నారు. ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి జుహీచావ్లా కూడా చేరిపోయారు. జుహీ చావ్లా దగ్గర 18 ఏళ్ల నుంచి మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న సుభాష్ సింగ్ త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో జుహీదీ కీలక పాత్ర. దాంతో పాటు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట జుహీ. ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో, పారితోషికం కూడా తీసుకోకుండానే నటిస్తానని హామీ ఇచ్చారట. ఈ సినిమాలో జాకీష్రాఫ్, సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఏ పారితోషికం తీసుకోకుండానే నటి ంచడానికి ఒప్పుకున్నారని సుభాష్ సింగ్ చాలా సంబరపడిపోతూ చెప్పారు. -
నీతా అంబానీ తదితరులకు 'మనం' ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్: భారత దేశంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థల అధినేత్రిలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను శనివారం సందర్శించారు. అన్నపూర్ణ స్టూడియోలో సందర్శించిన వారిలో బాలీవుడ్ నటి జుహీ చావ్లా, రిలయన్స్ అధినేత్రి నీతా అంబానీ, స్వాతి పిరమిల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయోంకాలు, లీనా తివారీ, రాధిక సేథ్, అనుప షెహ్నయ్ లున్నారు. అధినేత అక్కినేని నాగార్జున వారికి స్వాగతం పలికి.. అన్నపూర్ణ స్టూడియోలోని వివిధ విభాగాలను చూపించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం'ను మినీ థియేటర్ లో వారికి నాగార్జున ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హుదూద్ బాధితులకు వారు 11 కోట్ల రూపాయల సహాయం అందించారు. -
బాబుతో నీతూ, జుహీచావ్లా భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుతో ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్తలు నీతూ అంబానీ, పింకీ రెడ్డిలతోపాటు బాలీవుడ్ నటి జూహీచావ్లా శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.11,11,11,111 (11 కోట్లు 11 లక్షల 11 వేల 11 వందల 111 రూపాయిలు) చెక్కును అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని హుదూద్ తుపాన్‌తో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాల పునర్ నిర్మాణానికి వినియోగించాలని వారు చంద్రబాబును కోరారు. హుదూద్ తుపాన్ వల్ల జరిగిన నష్టంతోపాటు జరుగుతున్న సహాయక చర్యలను వారు చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. -
రియాలిటీ షోలే బెటర్
న్యూఢిల్లీ: రియాలిటీ షోలు చేస్తేనే మజా అనిపిస్తుందని బాలీవుడ్ సీనియర్ నటి జూహి చావ్లా చెప్పింది. రియాలిటీ షోలలో తమను తాము ఆవిష్కరించుకునేందుకు సినీ తారలకు ఎక్కువ అవకాశముంటుందని ఆమె అభిప్రాయపడింది. నిజానికి సినిమా రంగం నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది కాల్పనిక కథల్లో నటించలేరు..’ అని ఆమె అంది.‘ నా వరకు నేను రియాలిటీ షోలో నటించేందుకే ఇష్టపడతాను. కాల్పనిక కథలో అయితే ఒక కథలో పాత్రగా మాత్రమే కనిపిస్తాం.. అదే రియాలిటీలో కొత్తగా కనిపించేందుకు అవకాశముంటుంద’ని పేర్కొంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న మెగా టీవీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సిరీస్‌లో ఆమె కూడా కనిపించనుంది. ఇదిలా ఉండగా, జూహిచావ్లా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, ‘ఐనా’, ‘హమ్‌హై రాహి ప్యార్ కే’, ‘డర్’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాక టీవీలో వచ్చినరియాలిటీ షో ‘జలక్ ధిక్లా జా 3’ కి జడ్జిగా వ్యవహరించింది. అలాగే గతంలో చిన్న పిల్లలతో నిర్వహించిన టీవీ రియాలిటీ షో ‘బద్మాష్ కంపెనీ’కి వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరించింది. అలాగే కొత్తగా వచ్చిన హిందీ ఎంటర్టైన్మెంట్ చానల్ ‘సోనీ పాల్’లో కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ అవును.. నేను సోనీ పాల్ చానల్‌తో పాటు పనిచేస్తున్నా.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడాన్ని నేను ఆస్వాదిస్తా.. వారిని నా నటనతో నవ్వించగలను.. ఏడిపించగలను.. అనే నమ్మకం నాకుంది.. అది ఎటువంటి షో అయినా సరే....’ అని ఆమె పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినీ తారకు ఒక టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే తన సోదరుడు అకాల మృతితో ఆ అవకాశాన్ని తాను అంగీకరించలేదని జూహీ చెప్పింది. ఒక ప్రేక్షకురాలిగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ తన కెంతో ఇష్టమైన కార్యక్రమమని జూహీ తెలిపింది. అలాగే డ్యాన్స్ షోలు, మ్యూజిక్ ఆధారిత షోలు చూడటానికి ఇష్టపడతానని వ్యాఖ్యానించింది. -
రియాలిటీ షోలే బెటర్
రియాలిటీ షోలు చేస్తేనే మజా అనిపిస్తుందని బాలీవుడ్ సీనియర్ నటి జూహి చావ్లా చెప్పింది. రియాలిటీ షోలలో తమను తాము ఆవిష్కరించుకునేందుకు సినీ తారలకు ఎక్కువ అవకాశముంటుందని ఆమె అభిప్రాయపడింది. నిజానికి సినిమా రంగం నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది కాల్పనిక కథల్లో నటించలేరు..’ అని ఆమె అంది.‘ నా వరకు నేను రియాలిటీ షోలో నటించేందుకే ఇష్టపడతాను. కాల్పనిక కథలో అయితే ఒక కథలో పాత్రగా మాత్రమే కనిపిస్తాం.. అదే రియాలిటీలో కొత్తగా కనిపించేందుకు అవకాశముంటుంద’ని పేర్కొంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న మెగా టీవీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సిరీస్‌లో ఆమె కూడా కనిపించనుంది. ఇదిలా ఉండగా, జూహిచావ్లా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’, ‘ఐనా’, ‘హమ్‌హై రాహి ప్యార్ కే’, ‘డర్’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాక టీవీలో వచ్చినరియాలిటీ షో ‘జలక్ ధిక్లా జా 3’ కి జడ్జిగా వ్యవహరించింది. అలాగే గతంలో చిన్న పిల్లలతో నిర్వహించిన టీవీ రియాలిటీ షో ‘బద్మాష్ కంపెనీ’కి వ్యాఖ్యాతగా ప్రేక్షకులను అలరించింది. అలాగే కొత్తగా వచ్చిన హిందీ ఎంటర్టైన్మెంట్ చానల్ ‘సోనీ పాల్’లో కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ అవును.. నేను సోనీ పాల్ చానల్‌తో పాటు పనిచేస్తున్నా.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడాన్ని నేను ఆస్వాదిస్తా.. వారిని నా నటనతో నవ్వించగలను.. ఏడిపించగలను.. అనే నమ్మకం నాకుంది.. అది ఎటువంటి షో అయినా సరే....’ అని ఆమె పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినీ తారకు ఒక టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే తన సోదరుడు అకాల మృతితో ఆ అవకాశాన్ని తాను అంగీకరించలేదని జూహీ చెప్పింది. ఒక ప్రేక్షకురాలిగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ తన కెంతో ఇష్టమైన కార్యక్రమమని జూహీ తెలిపింది. అలాగే డ్యాన్స్ షోలు, మ్యూజిక్ ఆధారిత షోలు చూడటానికి ఇష్టపడతానని వ్యాఖ్యానించింది. -
అది అతిథి పాత్ర మాత్రమే..
ముంబై: ‘ద హండ్రెడ్ ఫూట్ జర్నీ’లో తనది కేవలం అతిథి పాత్ర మాత్రమేనని నటి జుహీ చావ్లా పేర్కొంది. సినిమాలో ఓం పురి, హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, తాను కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తానని చెబుతోంది. ఈ సినిమాతో జుహీ హాలీవుడ్ తెరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. సినిమా మొత్తంలో తాను కేవలం రెండుమూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తానని, అదీ ప్రారంభ సన్నివేశంలో మాత్రమేనని స్పష్టం చేసింది. హాలీవుడ్ చిత్రంలో ఈ చిన్న పాత్రలో నటించడం ఏమంత గొప్ప విషయంగా తాను భావించడంలేదని చెప్పింది. అయితే కనిపించేది కొద్దిసేపయినా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లు ముందు తనకు కూడా తెలియదని, అకస్మాత్తుగా అవకాశం వచ్చిందని, అంతే వేగంగా తాను నిర్ణయం తీసుకొని అంగీకరించేశానని, నటించేశానని చెప్పింది. కమల్ హాసన్, ఓం పురి వంటివారి స్థాయికి సరిపడిన పాత్రలు సినిమాల్లో ఉండడంలేదన్న విషయాన్ని జుహీ అంగీకరించింది. ఇప్పట్లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన ‘ఎ వెడ్నస్ డే’ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, అందులో నటీనటుల స్థాయికి సరిపడే పాత్రలు దొరికాయనిపించిందని చెప్పింది. అయితే అటువంటి పాత్రలు ఎప్పుడూ లభిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడింది. ప్రేక్షకులకు ఎంతసేపూ డ్యాన్సులు, పాటలు, శృంగార సన్నివేశాలు, ఫైట్లు, ప్రేమ కథలే కావాలని, దీంతో మంచి కథలున్న చిత్రాలు తెరకెక్కడం లేదని, అయితే హాలీవుడ్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుందని చెప్పింది. ద హండ్రెడ్ ఫూట్ జర్నీలో ఓం పురి పాత్ర అద్భుతమని, ఈ సినిమాతో ఓం పురికి హాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని జోస్యం చెప్పింది. -
అది అతిథి పాత్ర మాత్రమే..
జుహీ చావ్లా ముంబై: ‘ద హండ్రెడ్ ఫూట్ జర్నీ’లో తనది కేవలం అతిథి పాత్ర మాత్రమేనని నటి జుహీ చావ్లా పేర్కొంది. సినిమాలో ఓం పురి, హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, తాను కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తానని చెబుతోంది. ఈ సినిమాతో జుహీ హాలీవుడ్ తెరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. సినిమా మొత్తంలో తాను కేవలం రెండుమూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తానని, అదీ ప్రారంభ సన్నివేశంలో మాత్రమేనని స్పష్టం చేసింది. హాలీవుడ్ చిత్రంలో ఈ చిన్న పాత్రలో నటించడం ఏమంత గొప్ప విషయంగా తాను భావించడంలేదని చెప్పింది. అయితే కనిపించేది కొద్దిసేపయినా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లు ముందు తనకు కూడా తెలియదని, అకస్మాత్తుగా అవకాశం వచ్చిందని, అంతే వేగంగా తాను నిర్ణయం తీసుకొని అంగీకరించేశానని, నటించేశానని చెప్పింది. కమల్ హాసన్, ఓం పురి వంటివారి స్థాయికి సరిపడిన పాత్రలు సినిమాల్లో ఉండడంలేదన్న విషయాన్ని జుహీ అంగీకరించింది. ఇప్పట్లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన ‘ఎ వెడ్నస్ డే’ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, అందులో నటీనటుల స్థాయికి సరిపడే పాత్రలు దొరికాయనిపించిందని చెప్పింది. అయితే అటువంటి పాత్రలు ఎప్పుడూ లభిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడింది. ప్రేక్షకులకు ఎంతసేపూ డ్యాన్సులు, పాటలు, శృంగార సన్నివేశాలు, ఫైట్లు, ప్రేమ కథలే కావాలని, దీంతో మంచి కథలున్న చిత్రాలు తెరకెక్కడం లేదని, అయితే హాలీవుడ్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుందని చెప్పింది. ద హండ్రెడ్ ఫూట్ జర్నీలో ఓం పురి పాత్ర అద్భుతమని, ఈ సినిమాతో ఓం పురికి హాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని జోస్యం చెప్పింది. -
కన్నడంలో సన్నీ ఐటం సాంగ్!
బాలీవుడ్‌ను కిర్రెక్కిస్తున్న సన్నీ లియోన్ తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఐటం సాంగ్‌లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె కన్నడ రంగంలోనూ కాలు మోపుతోంది. కన్నడ చిత్రం ‘డీకే’ కోసం ‘శేషమ్మ శేషమ్మ’ అనే ఐటం సాంగ్‌లో అందాలను ఆరబోస్తోంది. మూడు రోజులుగా ఈ ఐటం సాంగ్ షూటింగ్లో సన్నీ బిజీబిజీగా ఉంటోంది. ఒకటి రెండు రోజుల్లో ఐటం సాంగ్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ‘డీకే’ చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ చాన్స్ కొట్టేసిన జూహీ జూహీ చావ్లా హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. లాసే హాల్స్ట్రోమ్ దర్శకత్వంలో స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మించనున్న చిత్రంలో జూహీ వృద్ధ మహిళ పాత్ర పోషించనుంది. ఇందులో జూహీ భర్తగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి నటించనున్నాడు. స్పీల్బర్గ్ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా, కీలకమైనదని జూహీ చెప్పింది. ‘ముంబై సాగా’లో హుమా ఖురేషీ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హుమా ఖురేషీకి తాజాగా ‘ముంబై సాగా’లో హీరోయిన్ పాత్ర లభించింది. సంజయ్ గుప్తా రూపొందిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం హీరోగా నటించనున్నాడు. మాఫియా ముఠాలకు, రాజకీయ నేతలకు, పోలీసులకు గల పరస్పర సంబంధాల ఆధారంగా రూపొందించుకున్న కథతో సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
శ్రీవారిని దర్శించుకున్న జూహీచావ్ల
-
జీవితాంతం నాతో ఉంటాడనుకున్నా..!
‘‘నా మనసు నిండా జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అవి ఎప్పటికీ ప్రశ్నలగానే మిగిలిపోతాయని నాకు తెలుసు. ఒక్కోసారి జీవితం అంటే భయమేస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం. అది కాసేపే. నా భర్త, పిల్లలను చూడగానే ఆ భయం పోతుంది’’ అంటున్నారు జుహీ చావ్లా. ఆమె అంత ఉద్వేగంగా మాట్లాడటానికి కారణం ఉంది. దాదాపు నాలుగేళ్లుగా కోమాలో ఉన్న జుహీ అన్నయ్య బాబీ చావ్లా గత ఆదివారం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణాన్ని అంత తేలికగా తీసుకోలేకపోతున్నారు జుహీ. ఈ సందర్భంగా తన మనోభావాలను వ్యక్తపరుస్తూ -‘‘నేను బాధల్లో ఉన్నప్పుడు నాకు కొండంత అండగా నిలిచేది మా అమ్మ. నా పెళ్లయిన ఏడాదికి తను చనిపోయింది. అప్పుడు ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు నాన్నగారు అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన కూడా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా అన్నయ్య బాబీ చావ్లా నాకన్నా ఎనిమిదేళ్లు పెద్ద. చిన్నప్పుడు మేమిద్దరం బాగా గొడవపడేవాళ్లం. నన్ను తోసేవాడు. అమాంతం కిందపడిపోయేదాన్ని. అప్పుడు బాబీ మీద నాకు బాగా కోపం వచ్చేది. పెద్దయిన తర్వాత మా ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అమ్మ చనిపోయిన తర్వాత బాబీ నా అండ అయ్యాడు. జీవితాంతం తను నాకు అండగా ఉంటాడనుకున్నా. కానీ, మధ్యలోనే వదిలేశాడు. నా జీవిత భాగస్వామి జై ఇప్పుడు నాకు పెద్ద అండ. తను, నేను, మా ఇద్దరి పిల్లలు... ఇప్పుడు నా జీవితం ఇదే. అమ్మ, నాన్న పోయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు అన్నయ్య కూడా దూరం కావడంతో ఆ ఆలోచనలను ఎక్కువయ్యాయి. అలాగని, నా భర్త, పిల్లల పట్ల నా బాధ్యతను విస్మరించను. వాళ్లు లేని జీవితాన్ని ఊహించలేను’’ అంటూ జుహీ చావ్లా కన్నీటి పర్యంతమయ్యారు. -
అతడు వెర్రోడేమో అనుకున్నా..
గులాబీగ్యాంగ్‌లో విలన్ తరహా పాత్ర పోషించాలని చెప్పగానే దర్శకుడు సౌమిక్ సేన్ వెర్రివాడేమో అనుకున్నానంటూ నవ్వేసింది జుహీచావ్లా. ‘మొదటిసారి ఈ పాత్ర గురించి విన్నప్పుడు సేన్‌కు ఏదో అయిందనిపించింది. అయితే ఆయన పూర్తిగా కథ వినిపించగానే పాత్ర గొప్పదనం అర్థమయింది’ అని వివరించింది. గులాబ్‌గ్యాంగ్ ప్రచారం కోసం ఢిల్లీలో మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. ఈ ఈ పాత్రకు జుహీని ఒప్పించడానికి ఎన్నో తిప్పలు పడ్డానని దర్శకుడు సౌమిక్ సేన్ అన్నాడు. అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ సినిమాలో మాధురి దీక్షిత్ దూకుడు స్వభావమున్న నాయకురాలిగా కనిపిస్తుంది. అధికారదాహం కోసం తహతహలాడే రాజకీయ నాయకురాలి పాత్ర జుహీది. ‘సినిమా కొత్త తరహాలో ఉండాలనే ఆలోచనతోనే ఆమెకు విలన్ పాత్ర ఇచ్చాం. నాయకురాలిగా మాధురినే చూపించాలని మొదటి నుంచి అనుకున్నాం. విలన్ కూడా పెద్ద నటి అయి ఉండాలని కోరుకున్నాం’ అని సేన్ వివరించాడు. సంపత్ పాల్ అనే మహిళ నిజజీవితం అధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. సినిమా టైటిళ్లలో ఆమె పేరు ఎందుకు వేయలేదన్న ప్రశ్నకు దర్శకుడు బదులిస్తూ తాము రాసుకున్నది పూర్తిగా కాల్పనిక కథ అని, పాల్ జీవితంతో ఎలాంటి సంబంధమూ లేదని వివరించాడు. మహిళా సాధికారత ప్రాధాన్యం గురించి గులాబ్‌గ్యాంగ్ గొప్ప సందేశం ఇస్తుందని మాధురి ఈ సందర్భంగా చెప్పింది. ప్రతి ఒక్క మహిళ చదువుకొని, సమాజంలో తగిన గౌరవం పొందాలన్నదే సినిమా సారాంశమని తెలిపింది. తన సాటి స్త్రీల బాగు కోసం పోరాడే రజ్జోగా మాధురి ఇందులో కనిపిస్తుంది. గులాబ్‌గ్యాంగ్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా, హైకోర్టు స్టే విధించింది. సంపత్‌పాల్ పిటిషన్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారని, కొన్ని సన్నివేశాలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నందున విడుదలపై స్టే విధించాలని సంపత్ కోర్టును కోరింది. -
'గులాబ్ గ్యాంగ్' విడుదలపై ఢిల్లీ కోర్టు స్టే విధింపు
మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా నటించిన గులాబ్ గ్యాంగ్ చిత్ర విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా విడుదల కాకుండా ఆపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే8 తేది లోపు సెన్సార్ పూర్తి అయినా.. కాకున్నా చిత్రాన్ని ప్రదర్శించడానికి వీలులేదని కోర్టు ఆదేశించింది. -
'ఇండియన్ ప్రిన్సెస్'కు గోవిందా జుహీచావ్లా
-
సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ
ఒకప్పుడు వాళ్లిద్దరూ ప్రొఫెషనల్‌గా బద్ధశత్రువులు. నీవెన్ని సినిమాలు, నావెన్ని సినిమాలు హిట్టయ్యాయి అంటూ పోటీలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లేటు వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కలిసి నటించడమే కాదు, ఏకంగా మంచి జోష్ ఉన్న సీన్లను కూడా పరస్పరం పంచుకుంటున్నారు!! ఈ విషయాన్ని స్వయంగా మాధురీ దీక్షితే చెప్పింది. తాజాగా తామిద్దరం కలిసి నటిస్తున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో మంచి అద్భుతమైన జోష్ ఉన్న సీన్లు చాలా ఉన్నాయని, అలాంటివాటిని తాము ఇద్దరం పంచుకుంటున్నామని ఆమె చెప్పింది. మంచి కరెంటు ఉన్న సీన్లను తాము ఇద్దరం పంచుకుంటున్నట్లు 46 ఏళ్ల మాధురీ దీక్షిత్ వివరించింది. ఇక ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ స్వయంగా కొన్ని ఫైటింగ్ సీన్లు చేసింది. ఎలాంటి డూప్‌ను పెట్టుకోకుండా తాను తొలిసారి చాలా శక్తిమంతమైన, అసలైన యాక్షన్ సన్నివేశాలు చేశానని మాధురీ చెప్పింది. ఫైటింగ్ సీన్లను తాను చాలా ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులు కూడా వాటిని ఎంజాయ్ చేస్తారనే భావిస్తున్ననని ఆమె అంది. తన ఫైటింగ్ సీన్లు కావాలని పెట్టినట్లుగా కనిపించవని, సినిమాలో సహజంగానే వచ్చేస్తాయని, పాటలు కూడా అలాగే వస్తాయని ఆమె చెప్పింది. సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ 'గులాబ్ గ్యాంగ్' మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విలన్ ను చితకబాదేసిన మాధురీ దీక్షిత్
ముంబై: మాధురీ దీక్షిత్ పేరు వినగానే ఆమె చేసిన అద్భుతమైన నృత్యాలు గుర్తుకొస్తాయి. 1990ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. అలాంటి మాధురీ నెల రోజుల పాటు కుంగ్ ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కర్ర తిప్పడం, కత్తిపట్టడం తదితర విన్యాసాలను నేర్చుకుంది. ఇంకేం విలన్ ను చితకబాదేసింది. త్వరలో విడుదల కానున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రం కోసమే ఈ కసరత్తంతా. ఈ చిత్రంలో మాధురీ పోరాట సన్నివేశాల్లో ఇరగదీసిందట. ఒకప్పుడు నెంబర్ వన్ స్థానం కోసం తనతో పోటీపడ్డ మరో అందాల నటి జూహిచావ్లాతో కలసి ఈ సినిమా ద్వారా తొలిసారి వెండితెరను పంచుకోవడం మరో విశేషం. గులాబ్ గ్యాంగ్ చిత్రంలో మాధురీ ఫైటింగ్ సీన్ల కోసం ట్రైనర్ కనిష్క శర్మను పెట్టుకుని శిక్షణ తీసుకుంది. అనుభవ్ సిన్హా నిర్మించిన ఈ చిత్రం మార్చి ఏడున విడుదలకానుంది. ఈ చిత్రంలో జూహీచావ్లా నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉండే కొంతమంది మహిళల స్ఫూర్తితో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. -
నా డిక్షనరీలో కష్టమనే పదం లేదు
తన కెరీర్ డిక్షనరీలోనే కష్టసాధ్యమైన అనే పదం లేనేలేదని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే జయించేందుకే ఇష్టపడతానని ఆమె తెలిపారు. రాబోయే సినిమా గులాబ్ గ్యాంగ్‌లో సొంతంగా మాధురి స్టంట్లు చేశారు. కొత్తవ్యక్తి సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన గులాబ్ గ్యాంగ్ సినిమా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖాండ్‌లోని సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ రంగు చీరల్లో ఇండియన్ ఉమెన్ విజిలెంట్స్ బృందం చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్, నటనలో ఎలాంటి ఇబ్బంది పడలేదని మాధురి దీక్షిత్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే తైక్వాండోలో శిక్షణ తీసుకోవడం వల్ల యాక్షన్ చేయడం మరింత సులభమైందని చెప్పారు. ఈ సినిమాల్లో ఫైట్లు, నటనలు సొంతంగానే చేశానని వివరించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గాయపడిన ఘటనలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. తన డిక్షనరీలో కష్టసాధ్యమైన అనే పదం లేదన్న మాధురి సమస్యను గెలిచేందుకు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ వద్ద గులాబ్ గ్యాంగ్ సినిమా మంచి వ్యాపారం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో తొలిసారిగా జుహి చావ్లా, మాధురి స్క్రీన్‌పై కనపడనున్నారు. గతంలో వీరిద్దరి కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినా ఆ సమయంలో జుహీ తిరస్కరించారు. ‘ఈ సినిమాలో మాధురితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కలిసి పనిచేయనందుకు పశ్చాత్తాపం లేదు. మళ్లీ ఒకసారి ఆమెతో కలిసి పనిచేస్తానని భావిస్తున్నా. సినిమాలో ఇద్దరు కలిసి వేర్వేరు పాత్రలు పోషిస్తున్నప్పుడు ఒకరితో మరొకరిని పోల్చుకోలేమ’ని జుహీ చావ్లా అన్నారు. ఈ సినిమాలో తాను హీరోగా, ఆమె విలాన్గా నటిస్తోందని తెలిపారు. విలన్‌గా మాధురి అద్భుత నటనతో ఆకట్టుకుందన్నారు. వివిధ విషయాల్లో మహిళలలో అవగాహన పెంచాల్సిన అవసరముందని, ఈ సినిమా అదే ప్రయత్నం చేస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి ఏడున గులాబ్ గ్యాంగ్ సినిమా విడుదల కానుంది. -
నా డిక్షనరీలో కష్టమనే పదం లేదు:మాధురీ దీక్షిత్
న్యూఢిల్లీ: తన కెరీర్ లో కష్టసాధ్యమైన అనే పదం లేనే లేదని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ అన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే జయించేందుకే ఇష్టపడతానని ఆమె తెలిపారు. రాబోయే సినిమా గులాబ్ గ్యాంగ్‌లో సొంతంగా మాధురీ స్టంట్లు చేశారు. కొత్తవ్యక్తి సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన గులాబ్ గ్యాంగ్ సినిమా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖాండ్‌లోని సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ రంగు చీరల్లో ఇండియన్ ఉమెన్ విజిలెంట్స్ బృందం చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్, నటనలో ఎలాంటి ఇబ్బంది పడలేదని మధురి దీక్షిత్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే తైక్వాండోలో శిక్షణ తీసుకోవడం వల్ల యాక్షన్ చేయడం మరింత సులభమైందని చెప్పారు. ఈ సినిమాల్లో ఫైట్లు, నటనలు సొంతంగానే చేశానని వివరించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గాయపడిన ఘటనలు ఉన్నా పట్టించుకోలేదన్నారు. తన డిక్షనరీలో కష్టసాధ్యమైన అనే పదం లేదన్న మధురి సమస్యను గెలిచేందుకు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ వద్ద గులాబ్ గ్యాంగ్ సినిమా మంచి వ్యాపారం చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాతో తొలిసారిగా జుహి చావ్లా, మధురి స్క్రీన్‌పై కనపడనున్నారు. గతంలో వీరిద్దరి కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినా ఆ సమయంలో జుహీ తిరస్కరించారు. ‘ఈ సినిమాలో మధురితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో కలిసి పనిచేయనందుకు పశ్చాత్తం లేదు. మళ్లీ ఒకసారి ఆమెతో కలిసి పనిచేస్తానని భావిస్తున్నా. సినిమాలో ఇద్దరు కలిసి వేర్వేరు పాత్రలు పోషిస్తున్నప్పుడు ఒకరితో మరొకరిని పొల్చుకోలేమ’ని జుహీ చావ్లా అన్నారు. -
మాధురీ.. జూహీలను కలిపిన సినిమా
'గులాబ్ గంగ్' చిత్రంలో తనకు నెగెటివ్ పాత్ర ఇవ్వగానే మొదట చాలా భయపడినట్లు అలనాటి అందాల హీరోయిన్ జూహీ చావ్లా తెలిపింది. తనను అలాంటి పాత్రలో అసలు ప్రేక్షకులు ఆమోదిస్తారా లేదా అనే అనుమానం తనకు వచ్చిందంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉండే కొంతమంది మహిళల స్ఫూర్తితో ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. ఈ పాత్ర మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంది. డైరెక్టర్ ఈ కథ చెప్పగానే బాగుందనిపించినా, తన పాత్ర గురించే భయపడ్డానని జూహీ తెలిపింది. వేరే ఎవరినైనా అడగబోయి తనను అడిగారా అని కూడా అనుమానపడ్డానంది. చాలా భయపడినా చివరకు ఆ పాత్ర చేశానని, ఇప్పటికీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందోనన్న భయం మాత్రం తనకుందని ఈ ఉంగరాల జుట్టు సుందరి చెప్పింది. దీనికి ముందు అసలు తనకెప్పుడూ నెగెటివ్ పాత్రలు రాలేదని, ఇప్పుడు ఇన్నాళ్లకు ఇలాంటి పాత్ర రావడంతో తనకు ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఒకప్పటి తన ప్రధాన ప్రత్యర్థి మాధురీ దీక్షిత్‌తో కలిసి జూహీ చావ్లా నటించడం మరో విశేషం. 1990లలో వీరిద్దరూ ఒకే సమయంలో బాలీవుడ్‌ను ఏలారు. అయితే ఎప్పుడూ కలిసి మాత్రం నటించలేదు. ఇప్పుడు గులాబ్ గంగ్ సినిమా అంగీకరించడానికి మాత్రం, అందులో మాధురి ఉండటం, స్క్రిప్టు బాగుండటమే కారణాలని జూహీ తెలిపింది. ఆమె అద్భుతమైన నటి అని, చాలా అందంగా ఉంటుందని అంది. వీరిద్దరి మధ్య ఇన్నాళ్లూ ఉన్న అడ్డుగోడలను తొలగించిన ఘనత మాత్రం తొలిసారి మెగాఫోన్ పట్టుకుంటున్న దర్శకుడు సౌమిక్ సేన్‌కే దక్కింది. -
మాధురీ దీక్షిత్‌తో ఇదే చివరిసారి
అందాల భామలు మాధురీ దీక్షిత్, జూహిచావ్లా 1990ల్లో బాలీవుడ్‌ను ఊపేశారు. ఓ దశలో వీరిద్దరూ నెంబర్ వన్ స్థానం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. కాగా రేసులో మాధురీనే దూసుకెళ్లారు. అయితే, అప్పట్లో మాధురీ, జూహి ఇద్దరూ కలసి తెరను పంచుకోలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చాక తొలిసారిగా కలిసి నటించడం విశేషం. 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో ఈ భామలు అభిమానులను అలరించనున్నారు. అయితే భవిష్యత్‌లో తామిద్దరూ కలసి మళ్లీ నటించే అవకాశం వస్తుందని భావించడం లేదని జుహి అన్నారు. 'మాధురితో కలసి నటించే చివరి చిత్రం (గులాబ్ గ్యాంగ్) ఇదే కావచ్చు. మరో అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. ఇలాంటి స్క్రిప్ట్, పాత్రలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అప్పడు అంకితభావంతో నటించగలం. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులతో మేమూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం' అని జుహి చెప్పారు. గతంలో మాధురితో కలసి నటించే అవకాశం వచ్చినా అప్పట్లో ఉన్న పోటీ దృష్య్టా అంగీకరించలేదని గతాన్ని గుర్తుచేసుకుంది. -
హాలీవుడ్లో వందడుగుల ప్రయాణం
జూహీ చావ్లా పేరు చెప్పగానే... ఖయామత్ సే ఖయామత్, ప్రతిబంధ్, డర్, ప్రేమలోకం, విక్కీదాదాలాంటి సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళం, పంజాబీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జూహి చావ్లా ప్రస్తుతం ఓ హాలీవుడ్లో చిత్రంలో ఓంపురి భార్యగా నటిస్తున్నారు. గతంలో ఓమ్పురి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. జూహీకి మాత్రం ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రిచర్డ్ సి మారిస్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లాస్సె హాల్స్టామ్ తెరకెక్కిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని ఓ గ్రామంలో స్థిరపడటం కోసం ఓ ఇండియన్ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా ఓమ్పురి, జూహి నటిస్తున్నారు. ఫ్రాన్స్‌లో రెస్టారెంట్ నిర్వహించే వీరికి ఫ్రెంచ్ రెస్టారెంట్ నిర్వహించే మరో కుటుంబానికీ జరిగే ఘర్షణ, పోటీయే ఈ చిత్రం ప్రధానాంశం. ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన పాత్రల్లో ఓ పాత్రను మేడమ్ మల్లొరి పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
శంకర్ దీక్షిత్ మృతికి ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ తండ్రి శంకర్ దీక్షిత్ మృతికి పలువురు ప్రముఖులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. -
ముంబైలోని ర్యాంప్ షోలో బాలీవుడ్ తారలు
అధితిరావు జూహీ చావ్లా సుస్మితా సేన్