
కొద్ది రోజుల క్రితం జూహీ చావ్లా జైపూర్‌లో పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ రాజమాతాజీని కలిసింది. ఆమె మాటలు జూహీని చాలా ప్రభావితం చేశాయి. ‘మనలో ఎంత మంది పుస్తకాలు చదువుతారు? ఎంతమందికి చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది? మనకు తెలిసిన చరిత్ర చాలా వరకు సినిమాల్లో చూసిన చరిత్రే’... ఇవీ రాజమాత జూహీ చావ్లాతో అన్న మాటలు.
‘నిజమే. సినిమా తీసేటప్పుడు సినిమాలో చూపించే విషయాల గురించి సెన్సిటివ్‌గా ఉండాలి.
కాని సినిమా తీసేది హీరో హీరోయిన్ కాదు కదా. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, ఆలోచించి తీసేవే సినిమాలు. ఆ తర్వాత పాత్రల కోసం మంచి పెర్ఫార్మర్స్‌ను ఎంచుకుంటారు. దీపికా పదుకొనె అలాంటి ఒక పర్ఫార్మర్. పాత్రకు అనుగుణంగా నటించడం ఆమె బాధ్యత. ఆమె ఎన్నో సినిమాలు చేశారు. ఆ సినిమాలను చూసి ఆ పాత్రలను ప్రేమించారు. ఎంతోమంది ఫ్యాన్లుగా మారిపోయారు. అన్ని సినిమాల్లో పద్మావతి ఒక సినిమా.
అన్ని పాత్రల్లో దీపికా పదుకొనె వేసినది ఒక పాత్ర. మరీ మహిళ అని కూడా చూడకుండా చంపేస్తామని అనడం సబబు కాదనిపిస్తుంది. నేను ఒక్క పద్మావతి సినిమా గురించే మాట్లాడటం లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరక్కుండా ఉండాలి అంటున్నాను’... అని వ్యాఖ్యానించారు జూహీ చావ్లా. కయామత్ సే కయామత్ తక్ అంటే అనాది నుంచి అనాది వరకు అని అర్థం. సినిమా వివాదాలు కూడా అనాది నుంచి అనాది వరకు కొనసాగుతుంటాయి. ఇవాళ్టి ఫ్లాష్ న్యూస్ రేపటికి సద్దివార్త కాకమానదు కదా.
Comments
Please login to add a commentAdd a comment