Juhi Chawla: సిరిలో బెస్ట్‌ | Hurun India Rich List 2024: Juhi Chawla ranks among top self-made women in 2024 Hurun India Rich List | Sakshi
Sakshi News home page

Juhi Chawla: సిరిలో బెస్ట్‌

Published Sat, Aug 31 2024 3:48 AM | Last Updated on Sat, Aug 31 2024 4:05 PM

Hurun India Rich List 2024: Juhi Chawla ranks among top self-made women in 2024 Hurun India Rich List

జూహి 4,600 కోట్ల సంపద

న్యూస్‌మేకర్‌

‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.
తాజాగా విడుదలైన ‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2024’  ప్రకారం  మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్‌ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.

సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్‌ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి.

 పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్‌కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్‌కు చెందిన ఫాల్గుణి నాయక్‌ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే  స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.

సినిమా రంగంలో 2వ స్థానం
‘హురున్‌ ఇండియా రిచ్‌లిస్ట్‌ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్‌ ఖాన్‌ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్‌ రోషన్‌ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ (1200 కోట్లు), కరణ్‌ జోహార్‌ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్‌లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.

ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ కూతురు
జూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్‌కంటాక్స్‌ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ  మోడల్‌గా పని చేసింది. 1984లో ‘మిస్‌ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్‌ గుర్తించింది.  అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్‌’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.

షారూక్‌ ఖాన్‌తో ్ర΄÷డక్షన్‌ హౌస్‌
‘రాజూ బన్‌గయా జంటిల్‌మెన్‌’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్‌ అన్‌లిమిటెడ్‌’ అనే ్ర΄÷డక్షన్‌ సంస్థ స్థాపించి ‘ఫిర్‌ భీ దిల్‌ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్‌ స్థాపించిన రెడ్‌ చిల్లిస్‌ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్‌ మొదలయ్యాక షారూక్‌తో కలిసి కోల్‌కటా నైట్‌రైడర్స్‌కు సహ భాగస్వామి అయ్యింది.

వ్యా΄ారవేత్తతో వివాహం
జూహీ చావ్లా ‘మెహతా గ్రూప్‌’ అధినేత జయ్‌ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్‌ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్‌ మెహత్‌ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్‌ తదితర పరిశ్రమలు ఉన్న జయ్‌ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్‌ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.

మన దేశ మహిళా శ్రీమంతులు
రాధా వెంబు 
(మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్‌ వెంబు, శేఖర్‌ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.

ఫాల్గుణి నాయర్‌ 
(రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్‌లైన్‌ బ్యూటీ బ్రాండ్‌కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్‌. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్‌లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.

జయశ్రీ ఉల్లాల్‌ 
(మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్‌ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్‌ ఇం/టనీరింగ్‌లో ఎం.ఎస్‌ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీని స్థాపించి బిలియనీర్‌గా ఎదిగింది.

కిరణ్‌ మజుందార్‌ 
(నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్‌ ఇండియా సంస్థ కిరణ్‌ మజుందార్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్‌’లో పి.జి చేసిన కిరణ్‌ తొలత ఎంజైమ్స్‌ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్‌ ఎప్పుడూ అపర కుబేరుల టాప్‌ లిస్ట్‌లో ఉంటూనే ఉంటుంది.

నేహా నార్ఖెడె 
(ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్‌ఫ్లుయెంట్‌ అనే క్లౌడ్‌ కంపెనీకి కో ఫౌండర్‌గా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్‌ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్‌ఫ్లుయెంట్‌ను స్థాపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement