Hurun report
-
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్‌లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్‌ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్‌ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్‌హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. -
దానగుణంలో వీరే టాప్: మొదటిస్థానంలో నాడార్.. రెండో స్థానంలో
-
దానగుణంలో హెచ్‌సీఎల్ నాడార్ టాప్..
ముంబై: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్‌గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్‌కేర్‌కి రూ. 626 కోట్లు లభించాయి. రిచ్ లిస్ట్‌లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు ▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లుWho are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024 -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్‌లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
Juhi Chawla: సిరిలో బెస్ట్
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.తాజాగా విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ ప్రకారం మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి. పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్‌కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్‌కు చెందిన ఫాల్గుణి నాయక్ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.సినిమా రంగంలో 2వ స్థానం‘హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ (1200 కోట్లు), కరణ్ జోహార్ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ కూతురుజూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ మోడల్‌గా పని చేసింది. 1984లో ‘మిస్ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.షారూక్ ఖాన్‌తో ్ర΄÷డక్షన్ హౌస్‘రాజూ బన్‌గయా జంటిల్మెన్’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్ అన్లిమిటెడ్’ అనే ్ర΄÷డక్షన్ సంస్థ స్థాపించి ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్ స్థాపించిన రెడ్ చిల్లిస్ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్ మొదలయ్యాక షారూక్‌తో కలిసి కోల్కటా నైట్‌రైడర్స్‌కు సహ భాగస్వామి అయ్యింది.వ్యా΄ారవేత్తతో వివాహంజూహీ చావ్లా ‘మెహతా గ్రూప్’ అధినేత జయ్ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్ మెహత్ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్ తదితర పరిశ్రమలు ఉన్న జయ్ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.మన దేశ మహిళా శ్రీమంతులురాధా వెంబు (మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.ఫాల్గుణి నాయర్ (రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్లైన్ బ్యూటీ బ్రాండ్‌కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్‌లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.జయశ్రీ ఉల్లాల్ (మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్ ఇం/టనీరింగ్‌లో ఎం.ఎస్ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీని స్థాపించి బిలియనీర్‌గా ఎదిగింది.కిరణ్ మజుందార్ (నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్ ఇండియా సంస్థ కిరణ్ మజుందార్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్’లో పి.జి చేసిన కిరణ్ తొలత ఎంజైమ్స్ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్ ఎప్పుడూ అపర కుబేరుల టాప్ లిస్ట్‌లో ఉంటూనే ఉంటుంది.నేహా నార్ఖెడె (ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీకి కో ఫౌండర్‌గా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్‌ఫ్లుయెంట్‌ను స్థాపించింది. -
Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. మరిన్ని విశేషాలు.. ⇒ హురున్ టాప్–5 జాబితాలో హెచ్‌సీఎల్ అధిపతి శివ్ నాడార్ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు. ⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.టాప్–3లో హైదరాబాద్.. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్స్ట్రక్షన్స్), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్స్ట్రక్షన్స్), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్), ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్), పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. -
అంబానీను దాటేసిన అదానీ.. హురున్ రిచ్ లిస్ట్ విడుదల
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్‌లో బాలివుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్‌కు తొలిసారి చోటు దక్కింది.ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్‌లో నిలిచింది. గత ఏడాది భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్‌లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు 3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.9. అజిమ్ ప్రేమ్‌జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.షారుఖ్ ఖాన్‌కు చోటుమొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. -
30 ఏళ్ల వయసున్న టాప్ వ్యాపారస్థులు వీరే..
ముప్పై ఏళ్లలోపు యువతకు ఎక్కువగా స్నేహితులతో గడపాలని, మంచి బైక్‌పై చక్కర్లు కొట్టాలని, మంచి దుస్తులు కొనాలని.. ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రం సమయం వృథా చేయకుండా జీవితంలో స్థిరపడాలనుకుంటారు. అయితే అది అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ, ఆ వయసులోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతూ వందల కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యమైన విజయం. తాజాగా హురున్ ఇండియా అలాంటి 100 మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు. ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ముంబయికి చెందిన జెప్టో క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా (21 ఏళ్లు), ఆదిత్ పలిఛ (22 ఏళ్లు)లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్టెక్ సంస్థ, భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం అయిదుగురు మహిళలు ఉండగా.. ‘స్కిల్‌మ్యాటిక్స్’కు చెందిన దేవాన్షి కేజ్రీవాల్ (27 ఏళ్లు) అందరి కంటే చిన్నవారు. 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్‌టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో అధికంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉన్నారు. ఫిన్‌టెక్, ఎడ్టెక్ రంగాలకు చెందిన 11 కంపెనీల ప్రతినిధులకు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీలు/ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబయి, దిల్లీకి చెందిన వారు ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబయి నుంచి 9 మంది, దిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన యువ వ్యాపారవేత్తల్లో ఐఐటీ-రూర్కీ పట్టభద్రులైన 8 మంది ఉండటం గమనార్హం. ఐఐటీ- కాన్పూర్ నుంచి ఏడుగురు, ఐఐటీ- దిల్లీ నుంచి ఆరుగురు, ఐఐటీ- బాంబే, మద్రాస్ నుంచి అయిదుగురు చొప్పున ఉన్నారు. మనదేశంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తి, సామర్థ్యాలను ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ ప్రతిబింబిస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రహమాన్ జునాయిద్ వివరించారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యాపార వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించగల సామర్థ్యం ఉన్న యువ వ్యాపారవేత్తల అవసరాలు ఎంతో అధికంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, బహుళజాతి వ్యాపార సంస్థలు ఇటువంటి సత్తా ఉన్న యువ వ్యాపారవేత్తలు, సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిన్న వయసు లోనే మంచి విజయాలు నమోదు చేసి హురున్ జాబితాలో స్థానం సంపాదించారు. హైదరాబాద్ నుంచి నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు, భాంజు, ఎడ్యుటెక్ కంపెనీ)తో పాటు, శశాంక్ రెడ్డి గుజ్జుల (27 సంవత్సరాలు, నెక్ట్స్‌వేవ్, ఎడ్యుటెక్ కంపెనీ), రాకేష్ మున్ననూరు (29 ఏళ్లు, విజిల్‌డ్రైవ్, సాస్ కంపెనీ), అనురాగ్ మాలెంపాటి (30 ఏళ్లు, లీప్ ఇండియా ఫుడ్, లాజిస్టిక్స్ సేవల కంపెనీ) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన అనుపమ్ పెడర్ల (29 ఏళ్లు, నెక్ట్స్‌వేవ్, ఎడ్టెక్ కంపెనీ)కు సైతం ఈ జాబితాలో స్థానం దక్కింది. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
ఆనంద్ మహీంద్రను దాటేసి మరీ టాప్‌లోకి రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్‌లో ప్లేస్ కొట్టేశారు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు. ( కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) ఈ జాబితాలో టాప్ టెన్‌లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు. దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్‌ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్‌లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. -
కుబేరుల్లో ఒకే ఒక్కడు అంబానీ! 23వ స్థానానికి అదానీ
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్ సంస్థ హురున్, రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్ రిచ్ లిస్ట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. క్షీణతలో బెజోస్ టాప్.. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్ డాలర్లు పడిపోయి 118 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్ రిపోర్ట్ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్ డాలర్ల మేర (రోజుకు రూ. 3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 2023 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. ► గతేడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ► భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. -
రోజుకు 3 కోట్లు విరాళాలు, టాప్‌లో ఎవరు? అంబానీ, అదానీ ఎక్కడ?
సాక్షి, ముంబై: ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త, పరోపకారి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, 77 ఏళ్ల శివ్ నాడార్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించారు.. రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఎడెల్ గివ్ హురున్ ఇండియా విడుదల చేసిన తాజా లిస్ట్‌లో రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశీయ అత్యంత ఉదారమైన వ్యక్తిగా శివ నాడార్ నిలిచారు. 484 కోట్ల రూపాయల వార్షిక విరాళాలతో విప్రో 77 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. దాతృత్వంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ విరాళాలు 95 శాతం తగ్గిపోవడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఆసియా, భారతదేశపు అత్యంత సంపన్నుడు, గౌతమ్ అదానీ విరాళాలు 46 శాతం పెరగడంతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. గత మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ 1446 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2022 ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో భారతదేశంలో 15 మంది దాతలు రూ. 100 కోట్లకు పైగా వార్షిక విరాళాలివ్వగా, 20 మంది రూ. 50 కోట్లకు పైగా విరాళాలను అందించగా, 20 కోట్లకు పైగా విరాళాలిచ్చిన వారి సంఖ్య 43 మంది అని నివేదిక తెలిపింది. ఇంకా 142 కోట్ల రూపాయల విరాళం అందించిన లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్, దేశీయ అత్యంత ఉదారమైన ప్రొఫెషనల్ మేనేజర్. జెరోధా వ్యవస్థాపకులు నితిన్ ,నిఖిల్ కామత్ తమ విరాళాన్ని 300శాతం పెంచి రూ.100 కోట్లకు చేరుకున్నారు. వీరితోపాటు మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రొతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి జాబితాలో ఒక్కొక్కరు రూ. 213 కోట్ల విరాళాలత టాప్ 10లోకి ప్రవేశించడం విశేషం. -
4 ఏళ్లలో 122 యూనికార్న్‌లు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఆవిరౌతున్న(ఫండింగ్ వింటర్) నేపథ్యంలోనూ దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ బలపడే వీలున్నట్లు హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. రానున్న నాలుగేళ్లలో బిలియన్ డాలర్ల విలువ అందుకోగల స్టార్టప్‌ల సంఖ్య పెరగనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. దీంతో కొత్తగా 122 సంస్థలు యూనికార్న్‌లుగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 200ను మించనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను సాధించే స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఏడాది క్రితం 51గా నమోదైన యూనికార్న్‌ల సంఖ్య ప్రస్తుతం 84కు చేరినట్లు ప్రస్తావించింది. ఇప్పటికే 20 కోట్ల డాలర్లకుపైగా విలువ సాధించిన స్టార్టప్‌లు మరో 122 ఉన్నట్లు వెల్లడించింది. ఇవి రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే వీలున్నట్లు పేర్కొంది. 36 శాతం అప్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై ‘ఫండింగ్ వింటర్’ ప్రభావం చూపగలదని ఏఎస్కే ప్రయివేట్ వెల్త్‌తో జత కట్టిన హురూన్ ఇండియా.. ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 పేరుతో రూపొందించిన నివేదికలో అభిప్రాయపడింది. కఠిన పరపతి విధానాలతో ఇటీవల అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 36 శాతం విలువను పెంచుకున్న 122 స్టార్టప్‌ల విలువ 49 బిలియన్ డాలర్లకు చేరిన ట్లు వెల్లడించింది. ఈ సంస్థలు బిలియన్ డాలర్ల విలువను అందుకోగలవని అభిప్రాయపడింది. ఈ సంస్థలు ప్రస్తుతం 82,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తున్న సంస్థలలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సీక్వోయా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేÆ ö్కంది. భవిష్యత్ యూనికార్న్‌లు 122లో 39 సంస్థలకు సీక్వోయా నిధులు అందించినట్లు వెల్లడించింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ 27 సంస్థలలో పెట్టుబడుల ద్వారా తదుపరి నిలిచినట్లు తెలియజేసింది. రెండేళ్లలో... తాజాగా రూపొందించిన జాబితాలోని 122 స్టార్టప్‌లలో 51 సంస్థలు రెండేళ్లలోనే బిలియన్ డాలర్ల విలువను సాధించే వీలున్నట్లు నివేదిక అంచనా వేసింది. తదుపరి మరో రెండేళ్లలో మిగిలిన 71 స్టా ర్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించవచ్చని తెలి యజేసింది. 2017లో ఏర్పాటైన లాజిస్టిక్స్ టెక్ స్టార్టప్ షిప్‌రాకెట్ ముందుగా ఈ హోదాకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఈకామర్స్ సంస్థ టర్టిల్‌మింట్ వేగ వంత వృద్ధి సాధించనున్నట్లు అభిప్రాయపడింది. -
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ,అదానీ స్థానమేంటో తెలుసా ??
-
పేటీఎం విజయ్‌శేఖర్ శర్మని క్రాస్ చేసిన నైకా ఫాల్గుని నాయర్
బ్యాంకింగ్ సెక్టార్‌పై బ్యూటీ పైచేయి సాధించింది. ఆర్థిక రంగంలో సేవలు అందించే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మని సౌందర్య ఉత్పత్తులు అందించే నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ వెనక్కి నెట్టారు. తాజాగా హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 ఫలితాల్లో ఇది చోటు చేసుకుంది. పేఈఎం, నైకా సంస్థలు గతేడాది నవంబరులో మార్కెట్లో ఐపీవోకి వచ్చాయి. స్థిరంగా ఫాల్గుని నాయర్ హురూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022 జాబితాలో నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ సంపదన 4.9 బిలియన్ డాలర్లుగా తేలింది. ప్రపంచ సంపాదనపరుల లిస్టులో ఆమెకు 579వ స్థానం దక్కింది. సౌందర్య ఉత్పత్తులు అందించే కంపెనీగా నైకాను 2012లో ఫాల్గుని నాయర్ స్థాపించారు. నైకా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభించారు. చాపకింద నీరులా ఈ కంపెనీ కస్టమర్ల మనసును గెలుచుకుంది. గతేడాది ఐపీవోలో నైకా బంపర్‌హిట్ అయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఫాల్గుని నాయర్ సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా మారింది. ఆది నుంచి ఇబ్బందులే ఐఐటీ విద్యార్థిగా విజయ్‌శేఖర్ శర్మ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎంను ప్రారంభించారు. ఆరంభం నుంచి నిధుల సమన్యు ఎదుర్కొన్నా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. 2016 పెద్ద నోట్ల రద్దుతో పేటీఎం దశాదిశా మారిపోయింది. దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే టెక్‌ఫిన్ రంగంలో అనేక కంపెనీలు వచ్చాయి. గతేడాది నవంబరులో ఐపీవోలో పేటీఎం షేరు రూ.2150 దగ్గర ట్రేడ్ అయ్యింది. దీంతో 2.35 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో పేటీఎం శేఖర్ శర్మ సైతం బిలియనీర్‌గా మారిపోయాడు. పోయిన బిలియనీర్ హోదా గడిచిన మూడు నెలల కాలంలో పేటీఎం షేర్లు వరుసగా కోతకు గురవుతూ వస్తున్నాయి. దాదాపు షేరు ధర 70 శాతానికి పైగా పడిపోయింది. దీంతో మూడు నెలలుగా ప్రతీ రోజు విజయ్‌శేఖర్‌శర్మ ఆదాయానికి రోజుకు 88 కోట్ల కోత పడుతూ వచ్చింది. బుధవారం ఏకంగా రూ.630కి పడిపోవడంతో విజయ్‌శేఖర్ శర్మ మార్కెట్ క్యాప్ 999 మిలియన్లను పడిపోయింది. ఆఖరికి ఆయన బిలియనీర్ హోదాను కూడా కోల్పోయారు. గురువారం షేరు ధర సుమారు 18 శాతం క్షీణించి రూ. 616 దగ్గర ట్రేడవుతోంది. కోత పడినా గత నవంబరు నుంచి మార్కెట్లో కరెక్షన్ నెలకొంది. అనేక కంపెనీల షేర్ల విలువకు కోత పడింది. కానీ నైకా షేర్లకు ఈ ఇబ్బంది తప్పకపోయినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. ఐపీవో ఆరంభంలో నైకా షేరు రూ.2,205లు ఉండగా ప్రస్తుతం రూ.1522గా ఉంది. మొత్తంగా ఫాల్గుని నాయర్ సంపదకు కోత పడినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే! -
బ్రిటన్‌ని వెనక్కి నెట్టిన భారత్.. నెక్ట్స్ టార్గెట్ చైనానే
ముంబై: అత్యధిక సంఖ్యలో యూనికార్న్ సంస్థలున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి ఎగబాకింది. ఈ విషయంలో బ్రిటన్ను అధిగమించింది. ఈ ఏడాదే కొత్తగా మరో 33 అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదగడంతో ఇది సాధ్యపడింది. 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) వేల్యుయేషన్ దక్కించుకున్న సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. గతేడాది ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 54కి చేరింది. బ్రిటన్‌లో కొత్తగా 15 సంస్థలు యూనికార్న్‌లుగా మారడంతో.. అక్కడ మొత్తం సంఖ్య 39కి చేరింది. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అమెరికా, చైనా టాప్‌లో కొనసాగుతున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్ట్స్ టార్గెట్ చైనాను అధిగమించడమే అవుతుంది. అమెరికా నంబర్ 1 ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్‌లు పుట్టుకురాగా మొత్తం 487 కంపెనీలతో అమెరికా నంబర్ వన్‌గా నిల్చింది. ఇక చైనాలో మరో 74 సంస్థల రాకతో యూనికార్న్ హోదా దక్కించుకున్న స్టార్టప్‌ల సంఖ్య 301కి చేరింది. తద్వారా చైనా రెండో స్థానంలో నిల్చింది. మొత్తం యూనికార్న్ ప్రపంచంలో ఈ రెండు దేశాల వాటా ఏకంగా 74 శాతంగా ఉంది. 673 కొత్త సంస్థలు ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకోగా, 201 సంస్థలు చోటు కోల్పోయాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కావడం లేదా ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. అగ్రస్థానంలో బైజూస్.. దేశీ యూనికార్న్‌ల జాబితాలో 21 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇన్‌మొబి (12 బిలియన్ డాలర్లు), ఓయో (9.5 బిలియన్ డాలర్లు), రేజర్‌పే (7.5 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక నగరాలవారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్‌లు ఉన్నాయి. ‘భారత్ ప్రస్తుతం స్టార్టప్ బూమ్ మధ్యలో ఉంది. అధికారికంగా యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపైంది‘ అని హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. ఈ శతాబ్దంలో ప్రారంభమై యూనికార్న్‌లుగా ఎదిగిన సంస్థలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. చదవండి: -
సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! యూకేను వెనక్కి నెట్టి...!
India Overtakes UK To Third Spot With 54 Unicorns Hurun Index: భారత్‌లో స్టార్టప్స్ దూసుకెళ్తున్నాయి. తక్కువ సమయంలోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన యూనికార్న్ స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం....యూనికార్న్ స్టార్టప్స్ విషయంలో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. యూకేను వెనక్కి నెట్టి..మూడోస్థానంలో.. 2021లో భారత స్టార్టప్స్ అదరగొట్టాయి. హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం...భారత్ 54 యునికార్న్‌లను కలిగి ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్‌ను కల్గిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే భారత్‌లో యునికార్న్‌ల సంఖ్య అధికంగా పెరిగింది. యూనికార్న్ స్టార్టప్ విషయంలో యూకేను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే విదేశాలలో భారతీయులు స్థాపించిన మరో 65 యునికార్న్‌లు ఉన్నాయి. ప్రధానంగా సిలికాన్ వ్యాలీలో, స్వదేశీ యునికార్న్‌ల శాతం మూడింట ఒక వంతు నుండి 45 శాతానికి పెరిగిందని హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. ప్రపంచంలోనే 15వ యూనికార్న్‌గా బైజూస్... హురున్ ఇండియా ప్రకారం...భారత యునికార్న్‌ల జాబితాలో ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ బైజూస్ 21 బిలియన్ డాలర్లతో భారత్‌లో తొలిస్ధానంలో ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద 15వ యూనికార్న్ స్టార్టప్‌గా బైజూస్ అవతరించింది. భారత్‌లో 12 బిలియన్ డాలర్లతో యాడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ ఇన్మొబీ రెండో స్థానంలో, 9.5 బిలియన్ డాలర్లతో ఓయో మూడో స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ రంగంలో 122 యునికార్న్‌లు ఉన్నాయని, వాటిలో 15 భారత్‌లో ఉన్నాయని హురున్ నివేదిక పేర్కొంది. ఈ-కామర్స్ రంగంలో భారత్ మూడో అతి పెద్ద మార్కెట్ కల్గి ఉంది. చదవండి: కాలేజ్ డ్రాప్‌అవుట్స్..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..! -
టాటా గ్రూప్స్..! ఎప్పటికీ రారాజే...!
2021గాను భారత్‌లో టాప్‌లో నిలిచిన బిజినెస్ గ్రూప్స్ వివరాలను బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 వెల్లడించింది. భారత్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్ హౌజేస్గా ఈ కంపెనీలు నిలిచాయి. టాటా గ్రూప్స్...ఎప్పటికీ రారాజే..! 14 అనుబంధ సంస్థలతో టాటా గ్రూప్స్ టాప్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ రెండో స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్స్ ఏడు అనుబంధ సంస్థలను కల్గి ఉంది. తరువాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్స్, మురుగప్ప గ్రూప్స్, బజాజ్గ్రూప్స్ నిలిచాయి. టాప్ 5 బిజినెస్ గ్రూప్స్ భారత్‌లో సాఫ్ట్వేర్, మెటల్స్ అండ్ మైనింగ్, ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అనేక రంగాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ గ్రూప్స్ సుమారు రూ. 4.6 మిలియన్ కోట్ల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంది. చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు! -
దివీస్ లాబోరేటరీస్.. తెలంగాణలో నంబర్ వన్.. మరీ జాతీయ స్థాయిలో ?
కొత్త రాష్ట్రమైనా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో దేశానికే హబ్‌గా మారింది. తెలంగాణలో నెలక్పొలిన పరిశ్రమలు, తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ లాభార్జనలోనూ ముందుంటున్నాయి. తాజాగా బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా ఐదో ఎడిషన్ టాప్ 500 ఇండియన్ కంపెనీల జాబితాలో ఏకంగా 29 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్ నంబర్ వన్ దేశంలోనే అత్యంత విలువైన ఐదు వందల కంపెనీల జాబితాను బర్గండీ ప్రైవేట్ హురున్ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ జాబితా ప్రకారం రూ.1.36 లక్షల కోట్ల విలువతో దివీస్ లాబోరేటరీస్ తెలంగాణలోనే అత్యంత విలువైన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 33వ స్థానంలో ఉంది. టాప్ 5 కంపెనీలు దివీస్ ల్యాబరేటరీస్ తర్వాత స్థానంలో హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ చోటు దక్కించుకుంది. రూ. 1.31 లక్షల కోట్ల విలువతో తెలంగాణలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలబడింది. ఆలిండియా స్థాయిలో ఈ కంపెనీ 35వ స్థానంలో ఉంది. దివీస్, హిందూస్థాన్ జింక్ తర్వాత డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్‌లు నిలిచాయి. టాప్ 5 కంపెనీల్లో నాలుగు ఫార్మా రంగానికి సంబంధించినవే కావడం విశేషం. రాష్ట్ర జీడీపీలో 18 శాతం వాటా బర్గండి ప్రైవేట్ హురున్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న తెలంగాణకు చెందిన 29 కంపెనీల విలువ 6.9 లక్షల కోట్లు ఉండగా ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీల విలువనే రూ. 3.45 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఈ 29 కంపెనీలు సుమారు రెండు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ రాష్ట్ర జీఎస్డీపీలో 18 శాతం వాటాను దక్కించుకున్నాయి. బర్గండి లిస్టులో మరిన్ని ఆసక్తికర అంశాలు - టాప్ 500 కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన బ్రైట్‌కామ్ గ్రూపు 2,791 శాతం వృద్ధిరేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కంపెనీగా ప్రథమ స్థానంలో నిలిచింది. - రూ. 2010 కోట్ల కార్పోరేట్ ట్యాక్స్‌తో హెల్త్‌కేర్ (న్యుమరో యూనో) సెక్టార్లో అధిక పన్ను చెల్లించిన కంపెనీగా గుర్తింపు పొందింది. - నెట్ ప్రాఫిట్ విషయంలో టాప్ 20 కంపెనీల్లో తెలంగాణ కంపెనీలు రెండు చోటు దక్కించుకున్నాయి. హిందుస్థాన్ జింక్ రూ.7980 కోట్లతో 13వ స్థానం, అరబిందో ఫార్మా రూ.5389 కోట్లతో 19వ స్థానం దక్కించుకున్నాయి. - రూ. 28,900 కోట్ల విలువతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ టాప్ 10 బూట్స్ట్రాప్డ్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. కంపెనీ విలువ దివీస్ లాబ్యరేటరీస్ రూ.1.36 లక్షల కోట్లు హిందూస్థాన్ జింక్ రూ.1.31 లక్షల కోట్లు డాక్టర్ రెడ్డీస్ రూ. 77 వేల కోట్లు అరబిందో ఫార్మా రూ. 41 వేల కోట్లు లారస్ ల్యాబ్స్ రూ.30 వేల కోట్లు చదవండి: కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..! -
కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..!
కరోనా రాకతో భారత ఆర్థిక వ్యవస్ధ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సామాన్యులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్‌లతో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ అగ్రశ్రేణి భారతీయ కంపెనీలకు కాసుల వర్షం కురిసినట్లు హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. 2021లో అగ్రశ్రేణి భారతీయ కంపెనీల నికర విలువ 68 శాతం పెరిగిందని హురున్ పేర్కొంది. మూడు ట్రిలియన్ డాలర్లకు...! బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 కంపెనీల జాబితా ప్రకారం...2021లో ఆయా కంపెనీల మొత్తం నికర విలువ రూ. 228 లక్షల కోట్లకు (3 ట్రిలియన్) డాలర్లకు చేరింది. 16.7 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 13.1 లక్షల కోట్లు) ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 9.1లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హురున్ ఇండియా అన్‌లిస్టెడ్ స్పేస్‌లో, వ్యాక్సిన్-మేకర్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అత్యధికంగా రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. కరోనా రాకతో పూణేకు చెందిన కంపెనీ వాల్యుయేషన్ 127 శాతం పెరిగింది. ఈ కంపెనీల మొత్తం విక్రయాలు రూ. 58 లక్షల కోట్లకు చేరగా, భారత జీడీపీలో 26 శాతం వాటాను పొందాయి. ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించగా ఈ జాబితాలోని మొత్తం 69 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: వాట్సాప్‌లో మరో ఫీచర్.. ఇకపై క్రిప్టో కరెన్సీ కూడా -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్‌కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
కుబేరులు డబ్బుల్!
దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. తిరుగులేని ఫార్మా... దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది.. ‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది. 2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు. -
భారీగా పెరిగిన అదానీ, అంబానీల సంపద
ముంబై: కరోనా విపత్తు సమయంలోనూ 2020లో దేశంలో కొత్తగా 40 మంది సంపన్నులు (బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద) అవతరించారు. దీంతో 209 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లను కలిగిన మూడో దేశంగా ‘హరూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2021’లో భారత్ నిలిచింది. ముకేశ్ అంబానీ దేశంలో ధనాగ్రజుడిగా తన స్థానాన్ని కొనసాగించారు. ఆయన నికర విలువ 83 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో ఎనిమిదో సంపన్నుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ గతేడాది 24 శాతం వృద్ధి చెందడం ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఇక గౌతమ్ అదానీ సంపద అయితే గతేడాది ఏకంగా రెట్టింపు అయ్యి 32 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అంతర్జాతీయంగా 20 స్థానాలు పైకి ఎగబాకి ప్రపంచ సంపన్నుల్లో 48వ స్థానాన్ని అదానీ కైవసం చేసుకున్నారు. ముకేశ్ తర్వాత దేశంలో రెండో కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సోదరుడు వినోద్ అదానీ సంపద 128 శాతం పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 15 వరకూ ఉన్న ఆయా పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబ సంపదను కూడా హరూన్ పరిగణనలోకి తీసుకుంది. భారత్‌లో కరోనానియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు పేదలపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు పేర్కొంది. మూడో స్థానంలో శివ్‌నాడార్.. ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ ప్రమోటర్ శివ్‌నాడార్ 27 బిలియన్ డాలర్లతో దేశంలో మూడో సంపదపరుడిగా హరూన్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఆర్సెలర్ మిట్టల్‌కు చెందిన లక్ష్మీ నివాస్ మిట్టల్, సిరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనవాలా తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. జయ్ చౌదరి (జెడ్‌స్కాలర్ వ్యవస్థాపకుడు) సంపద 2020లో ఏకంగా 274 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. బైజు రవీంద్రన్, ఆయన కుటుంబ విలువ కూడా నూరు శాతం వృద్ధి చెంది 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబం విలువ సైతం 100% పెరిగి 2.4 బిలియన్ డాలర్లుగా ఉంది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా నికర విలువ 41% పెరిగి 4.8 బిలియన్ డాలర్లుగా ఉంటే, గోద్రేజ్‌కు చెందిన స్మితా వి సృష్ణ సంపద 4.7 బిలియన్ డాలర్లుగాను, లుపిన్కు చెందిన మంజూ గుప్తా 3.3 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో ఉన్నారు. వీరి సంపదలో క్షీణత... పతంజలి ఆయుర్వేద్ ప్రమోటర్ అయిన ఆచార్య బాలకృష్ట సంపద 2020లో 32 శాతం తరిగిపోయి 3.6 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. భారత్‌లో ఉన్న 177 బిలియనీర్లలో 60 మంది ముంబై కేంద్రంగానే ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఢిల్లీలో 40 మంది, బెంగళూరులో 22 మంది కుబేరులు ఉన్నారు. 1,058 బిలియనీర్లతో సంఖ్యా పరంగా చైనా మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో మొత్తం 3,228 బిలియనీర్లు ఉన్నారు. టెస్లా ఎలాన్ మస్క్ సంపద 197 బిలియన్ డాలర్లు, అమెజాన్ జెఫ్ బెజోస్ సంపద 189 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ ఆర్నాల్డ్ సంపద 114 బిలియన్ డాలర్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. భాగ్యగనగరం నుంచి 10 మంది హైదరాబాద్ నుంచి 10 మంది కుబేరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఏడుగురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం విశేషం. మిగతా ముగ్గురు నిర్మాణ, మౌలిక రంగానికి చెందిన వారు. -
ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ
-
ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ధనవంతుల జాబితా నేడు విడుదల చేశారు. ముఖేష్ అంబానీ మొత్తం సంపద గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు(సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇటీవల, చైనా జాంగ్ షాన్షాన్ ఈ వారంలో 22 బిలియన్ డాలర్లను కోల్పోయిన తర్వాత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ముకేష్ అంబానీతో పాటు అనేక ఇతర భారతీయ బిలియనీర్లు కూడా ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు గౌతమ్ అదానీ కుటుంబం రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానం, శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58వ స్థానం, లక్ష్మి ఎన్ మిట్టల్ రూ.1.40 లక్షల కోట్ల సంపదతో 104వ స్థానం, సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్లతో సంపదతో 113వ స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్నారు. ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అమెజాన్.కామ్ ఇంక్ అధినేత జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ-వస్తువుల తయారీ సంస్థ ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల నికర విలువతో 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 110 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 101 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానంలో ఉన్నారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 10వ ఎడిషన్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద పోగేసిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్ మస్క్(151 బిలియన్ డాలర్లు) కాగా.. జెఫ్ బెజోస్(50 బిలియన్ డాలర్లు), పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్(50 బిలియన్ డాలర్లు) ఉన్నారు. "బిలియనీర్లు గత సంవత్సరంలో జర్మనీ యొక్క స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానంగా 3.5 ట్రిలియన్ డాలర్ల సంపదను" సృష్టించారు. గత ఏడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్ నుంచి ఆ సంఖ్య 40గా నమోదైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 జాబితాను ప్రపంచంలో 68దేశాలలో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణలోకి తీసుకోని విడుదల చేశారు. చదవండి: భారీగా పడిపోయిన బంగారం ధరలు కోవిన్ 2.0 రెడీ.. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!