కుబేరులు తగ్గారు.. సంపద పెరిగింది..
♦ మళ్లీ టాప్‌లో ముకేశ్ అంబానీ
♦ సంపద విలువ 26 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలోని కుబేరుల సంఖ్య తగ్గింది. చైనా సంస్థ ‘హురుణ్ రిపోర్ట్’ తాజాగా రూపొందించిన అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే ముకేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో 1 బిలియన్ డాలర్లు/అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గింది.
♦ కుబేరుల సంఖ్య తగ్గినా కూడా వీరి మొత్తం సంపద మాత్రం 16 శాతంమేర ఎగసింది.
♦ అంబానీ తర్వాత 14 బిలియన్ డాలర్ల సంపదతో ఎస్‌పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు.
♦ సన్‌ఫార్మా ప్రమోటరు దిలీప్ సంఘ్వీ కూడా 14 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.
♦ 12 బిలియన్ డాలర్ల సంపదతో పల్లోంజీ మిస్త్రీ, లక్ష్మీ మిట్టల్, శివ్ నాడార్ వరుసగా నాల్గవ, ఐదవ, ఆరవ స్థానాల్లో ఉన్నారు.
♦ సైరస్ పూనావాలా (11 బిలియన్ డాలర్లు) ఏడో స్థానంలో, అజీమ్ ప్రేమ్‌జీ (9.7 బిలియన్ డాలర్లు) 8వ స్థానంలో, ఉదయ్ కొటక్ (7.2 బిలియన్ డాలర్లు) 9వ స్థానంలో నిలిచారు.
♦ ఇక డేవిడ్ రూబెన్, సైమన్ రూబెన్ (6.7 బిలియన్ డాలర్లు) పదవ స్థానంలో ఉన్నారు.
♦ ముంబై కుబేరులకు పుట్టినిల్లు. ఇక్కడ 42 మంది బిలియనీర్లు ఉన్నారు. తర్వాత ఢిల్లీలో 21 మంది, అహ్మదాబాద్‌లో 9 మంది బిలియనీర్లు ఉన్నారు.
♦ రాష్ట్రాల వారీగా చూస్తే బిలియనీర్ల సంఖ్య మçహా రాష్ట్రలో 51గా, ఢిల్లీలో 22గా, గుజరాత్‌లో 10గా, కర్ణాటకలో 9గా ఉంది.
♦ స్వశక్తితో బిలియనీర్‌గా ఎదిగిన ఒకే ఒక మహిళగా కిరణ్ మజుందార్ షా నిలిచారు.