కరోనా రాకతో భారత ఆర్థిక వ్యవస్ధ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సామాన్యులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్‌లతో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ అగ్రశ్రేణి భారతీయ కంపెనీలకు కాసుల వర్షం కురిసినట్లు హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. 2021లో అగ్రశ్రేణి భారతీయ కంపెనీల నికర విలువ 68 శాతం పెరిగిందని హురున్ పేర్కొంది.
మూడు ట్రిలియన్ డాలర్లకు...!
బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 కంపెనీల జాబితా ప్రకారం...2021లో ఆయా కంపెనీల మొత్తం నికర విలువ రూ. 228 లక్షల కోట్లకు (3 ట్రిలియన్) డాలర్లకు చేరింది. 16.7 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 13.1 లక్షల కోట్లు) ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ. 9.1లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
హురున్ ఇండియా అన్‌లిస్టెడ్ స్పేస్‌లో, వ్యాక్సిన్-మేకర్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అత్యధికంగా రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. కరోనా రాకతో పూణేకు చెందిన కంపెనీ వాల్యుయేషన్ 127 శాతం పెరిగింది. ఈ కంపెనీల మొత్తం విక్రయాలు రూ. 58 లక్షల కోట్లకు చేరగా, భారత జీడీపీలో 26 శాతం వాటాను పొందాయి. ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించగా ఈ జాబితాలోని మొత్తం 69 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు పేర్కొంది.
చదవండి: వాట్సాప్‌లో మరో ఫీచర్.. ఇకపై క్రిప్టో కరెన్సీ కూడా
Comments
Please login to add a commentAdd a comment