market cap
-
భారత్‌లో తొలి కంపెనీగా రిలయన్స్ - రూ.20 లక్షల కోట్లు..
ఫిబ్రవరి 13న ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 14 శాతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 20 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. 2024లో షేర్ విలువ ఇంత పెరగటం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ బిఎస్ఇలో ఫిబ్రవరి 13న రూ. 2,957కు చేరింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 1.7 శాతం పెరిగి రూ. 2953వద్ద ట్రేడ్ అయింది. దీంతో మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్లు దాటేసింది. 2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్ కొత్త సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ పెరుగుదల వైపు అడుగులు వేసింది. జనవరిలో 10.4 శాతం పెరిగిన షేర్ ఇప్పటికి (ఫిబ్రవరి) మరో నాలుగు శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకోగలిగింది. (మార్కెట్లో ఒడుదుడుకులు ఏర్పడితే విలువలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వ్యాల్యూలో తేడాలు రావొచ్చు.. గమనించగలరు.) -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
హెరిటేజ్ విలువెంత? భువనేశ్వరి మాటల్లో నిజమెంత?
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’ అంటూ హెరిటేజ్ కంపెనీని ఉద్దేశిస్తూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తాజాగా పేర్కొన్నారు. ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు. ఇదీ.. హెరిటేజ్ అసలు విలువ 1992లో పెట్టిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి నారా భువనేశ్వరి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్ 21 నాటికి హెరిటేజ్ కంపెనీ విలువ (మార్కెట్ క్యాప్) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్ చూసుకుంటే రూ.756 కోట్లు. నోటికొచ్చిన లెక్కలు హెరిటేజ్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2,181 కోట్లు. అందులో 1 శాతం అంటే రూ. 21 కోట్లు. 2 శాతం అంటే రూ. 42 కోట్లు. వాస్తవ విలువ ఇలా ఉంటే తమ కంపెనీలో కేవలం 2 శాతం అమ్ముకుంటే చాలు రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
తెలుగు కాఫీ కంపెనీ కొత్త రికార్డు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్క ప్లాంటు ఉంది. ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్‌లో భారత్‌లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు. కాఫీ రుచులు 1,000కిపైగా.. సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్‌ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్‌బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు. ఏపీలో మరో ప్లాంటు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్‌కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
అదానీ షేర్ల పతనం, లక్షల కోట్లు ఢమాల్, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన
సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్‌లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL — Hindenburg Research (@HindenburgRes) January 26, 2023 హిండెన్‌బర్గ్ ప్రతి సవాల్ మరోవైపు హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది. అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్విటర్లో తెలిపింది. అటు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఆర్బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ చేసిందంటూ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అదానీ దూకుడు: మూడు లక్షల కోట్లు దాటేసిన నాలుగో కంపెనీ
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్)లో దూసుకుపోతోంది. తాజాగా 3 ట్రిలియన్లు దాటిన 4వ అదానీ గ్రూప్ కంపెనీగా అవతరించింది. మంగళవారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బీఎస్ఇలోసెన్సెక్స్లో 1 శాతం పెరిగి రూ.2,693.30 వద్ద తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. గత ఒక్క నెలలో అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ధర 20 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఈ స్టాక్ 52 శాతం పుంజుకోవడం విశేషం. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలలో మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో రూ. 3.07 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో 18వ స్థానంలో నిలిచింది అదానీ ఎంటర్ప్రైజెస్ , చూపించింది. ప్రస్తుతం, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 3.77 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉంది, అదానీ గ్రీన్ ఎనర్జీ (రూ. 3.62 ట్రిలియన్), అదానీ టోటల్ గ్యాస్ (రూ. 3.54 ట్రిలియన్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రవాణా, లాజిస్టిక్స్ ,ఇంధనం యుటిలిటీ రంగాలలో కొత్త వ్యాపారాలతోపాటు వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులు విమానాశ్రయ నిర్వహణ, రోడ్లు, డేటా సెంటర్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ అదానీ బిజినెస్ కేంద్రీకృతమై ఉంది. కాగా జూన్ 30, 2022 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాల ఆమోదం, డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ఆమోదాలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గురువారం (ఆగస్టు, 4 2022) సమావేశం కానున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం 84 శాతం పెరిగి రూ.25,142 కోట్లు, రూ. 304 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
బిట్ కాయిన్ క్రాష్: మార్కెట్ క్యాప్ ఢమాల్!
సాక్షి, న్యూఢిల్లీ: క్రిప్టో మార్కెట్ మరోసారి ఘోరంగా కుప్పకూలింది. గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ క్యాప్ 5.54 శాతం క్రాష్ అయ్యి 1.24 ట్రిలియన్ల డాలర్లకు పరిమితమైంది. బిట్‌కాయిన్, ఎథరమ్ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. కాయిన్ మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ 6.14 శాతం తగ్గి 29,823 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథరమ్ కూడా మేజర్ డౌన్ట్రెండ్ని నమోదు చేసింది. 5.63 శాతం కుప్పకూలి 1,826 డాలర్ల వద్ద ఉంది. బీఎన్బీ టోకెన్ 5.59 శాతం క్షీణించింది. సోలానా గణనీయంగా 12.73 శాతం పడిపోయింది. ఫలితంగా సోలానా బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసి, 4 గంటల తర్వాత పునరుద్ధరించారు. అటు ఎక్స్ఆర్పీ కూడా గత 24 గంటల్లో 5.98 శాతం పడిపోయింది. ఏడీఏ టోకెన్ 7.47 శాతం తగ్గింది. డాజీకాయిన్ 5.95 శాతం క్రాష్ అయింది. మొత్తంమీద, ప్రధాన టాప్ టోకెన్లు గత 24 గంటల్లో భారీగా పతనాన్ని నమోదు చేయడం గమనార్హం అయితే యూఎస్డీటీ టెథర్ గత 24 గంటల్లో దాని విలువలో 0.02 శాతం అప్‌ట్రెండ్‌ని, యూఎస్డీసీ స్టేబుల్కాయిన్లు 0.01 శాతం అప్‌ట్రెండ్‌ని కనబర్చాయి. కాగా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇపుడు అందరిపైనా కనిపిస్తోందినీ, ఇది క్రిప్టోల కదలికలపై కూడా ఉంటుందని ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ సూచించారు. -
కలిసొచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు...లక్ష 91 వేల కోట్లను ఇట్టే సంపాదించారు..!
దేశీయ మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అస్థిరత్వం కలిగి ఉన్నప్పటికీ, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భారతీయ ఈక్విటీలు చివరి వారంలో భారీ లాభాలను గడించాయి. దాంతో పాటుగా ఉక్రెయిన్ నాటోలో చేరమనే సంకేతాలు, అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో స్టాక్ మార్కెట్స్ మళ్లీ రంకెవేస్తూ లాభాల్లోకి వచ్చాయి. గత వారం స్టాక్ మార్కెట్స్లోని టాప్-10 కంపెనీలు భారీ లాభాలను గడించాయి. ఆయా కంపెనీలు మార్కెట్ క్యాప్‌కు సుమారు లక్ష 91 కోట్లను యాడ్ చేసుకున్నాయి. అత్యంత విలువైన పది షేర్లలో 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,91,434.41 కోట్లను అందించడంతో చివరి వారం మార్కెట్లు సహాయపడ్డాయి. లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ టాప్ ప్లేస్‌లో నిలిచాయి. కాగా గత వారం ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు కొంత మేర నష్టాలను చవిచూసింది. మార్చి 11 శుక్రవారం రోజున సెన్సెక్స్ 55,550 పాయింట్ల వద్ద , నిఫ్టీ 16,630 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ► బీఎస్ఈలో మార్కెట్ క్యాప్‌లో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.49,492.7 కోట్ల లాభాలను గడించి, అతిపెద్ద కంట్రిబ్యూటర్‌గా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 16,22,543.06 కోట్లకు చేరుకుంది. ► ఐటి దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్ మర్కెట్ క్యాప్ వాల్యుయేషన్‌కు వరుసగా రూ.41,533.59 కోట్లు, రూ 27,927.84 కోట్లు పెరిగింది. ► అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ రూ. 22,956.67 కోట్లను జోడించి దాని మార్కెట్ క్యాప్ రూ.3,81,586.05 కోట్లకు చేరుకుంది. ► ఇక ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.17,610.19 కోట్లను జోడించి రూ.4,92,204.13 కోట్లకు చేరుకుంది . ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువలో రూ.16,853.02 కోట్లను జోడించి రూ. 7,74,463.18 కోట్లకు చేరుకుంది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేరెంట్ సంస్థ, హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రూ.2,210.49 కోట్లు పెరిగి రూ.4,04,421.20 కోట్లకు పెరిగింది. ► ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్‌లో రూ.7,541.3 కోట్లను జోడించి రూ. 4,19,813.73 కోట్లకు చేరుకుంది. ► బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.5,308.61 కోట్లు పెరిగి రూ.4,00,014.04 కోట్లకు చేరుకుంది. ► ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్కెట్ క్యాప్‌లో రూ. 7,023.32 కోట్లు తగ్గి రూ. 4,71,047.52 కోట్లకు పడిపోయింది . చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
మార్కెట్ క్యాప్.. ఆవిరి..
-
అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్స్‌కు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ సరికొత్త రికార్డును సృష్టించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. రాకెట్ వేగంతో...! అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజల నుంచి రాకెట్ వేగంతో షేర్ విలువ పెరిగింది. అదానీ గ్రూప్స్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో రూ. 2 లక్షల కోట్లను దాటిన నాల్గవ కంపెనీగా అదానీ ఎంటర్ప్రైజెస్ అవతరించింది. గతంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ మైలురాయిని సాధించాయి. దీంతో నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10 లక్షల కోట్లు దాటింది. జనవరి 11న బీఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 5.16 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,844.50కు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.2.02 లక్షల కోట్లకు చేరింది. 2021లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు మూడు రెట్లు పెరిగి 8 శాతానికి పైగా లాభాలను గడించింది. టాటా గ్రూప్స్ టాప్..! టాటా గ్రూప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారత్‌లోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. టాటా గ్రూప్స్ మార్కెట్ క్యాప్ రూ. 24.27 లక్షల కోట్లుగా ఉంది. ఇక ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 16.65 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కల్గి ఉంది. చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
కరోనా ఉన్నప్పటికీ.. రూ. 228 లక్షల కోట్లకు చేరిన కంపెనీలు..!
కరోనా రాకతో భారత ఆర్థిక వ్యవస్ధ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సామాన్యులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్‌వేవ్‌లతో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ అగ్రశ్రేణి భారతీయ కంపెనీలకు కాసుల వర్షం కురిసినట్లు హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. 2021లో అగ్రశ్రేణి భారతీయ కంపెనీల నికర విలువ 68 శాతం పెరిగిందని హురున్ పేర్కొంది. మూడు ట్రిలియన్ డాలర్లకు...! బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500 కంపెనీల జాబితా ప్రకారం...2021లో ఆయా కంపెనీల మొత్తం నికర విలువ రూ. 228 లక్షల కోట్లకు (3 ట్రిలియన్) డాలర్లకు చేరింది. 16.7 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 13.1 లక్షల కోట్లు) ,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 9.1లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హురున్ ఇండియా అన్‌లిస్టెడ్ స్పేస్‌లో, వ్యాక్సిన్-మేకర్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అత్యధికంగా రూ. 1.8 లక్షల కోట్లుగా ఉంది. కరోనా రాకతో పూణేకు చెందిన కంపెనీ వాల్యుయేషన్ 127 శాతం పెరిగింది. ఈ కంపెనీల మొత్తం విక్రయాలు రూ. 58 లక్షల కోట్లకు చేరగా, భారత జీడీపీలో 26 శాతం వాటాను పొందాయి. ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించగా ఈ జాబితాలోని మొత్తం 69 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు పేర్కొంది. చదవండి: వాట్సాప్‌లో మరో ఫీచర్.. ఇకపై క్రిప్టో కరెన్సీ కూడా -
సత్యనాదెల్లా రాకతో..! నెంబర్ 1 స్థానం మైక్రోసాఫ్ట్ సొంతం..!
అనుకున్నట్లుగానే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా శుక్రవారం రోజున అవతరించింది. యాపిల్‌ను వెనక్కినెట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో నెంబర్ 1 స్థానాన్ని మైక్రోసాఫ్ట్ సాధించింది. మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ విలువ 2.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ 2.489 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.476 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ రికార్డును క్రియోట్ చేసింది. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ సంబంధింత సేవలు కరోనా సమయంలో బాగా కలిసి వచ్చాయి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో మైక్రోసాఫ్ట్ స్టాక్ 1 శాతం పెరిగి, 327.50 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో యాపిల్ షేర్ విలువ సుమారు 4 శాతం మేర పడిపోయి, 146.41 డాలర్లకు చేరుకుంది. యాపిల్‌ను సెమీ కండక్టర్ల కొరత, సప్లై చైన్ రంగాలు దెబ్బతీశాయి. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! సత్యనాదెల్లా రాకతో మైక్రోసాఫ్ట్ రయ్రయ్..! భారత సంతతికి చెందిన సత్యనాదెల్లా రాకతో మైక్రోసాఫ్ట్ రయ్రయ్ మంటూ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మార్కెట్ క్యాప్ విషయంలో మైక్రోసాఫ్ట్ నెంబర్ 1 స్థానం సాధించడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. 2014 ఫిబ్రవరి 4 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో నియామకం జరిగినప్పటినుంచి సత్యనాదెల్లా కంపెనీలో పలు కీలక మార్పులను, ఇతర కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. నోకియా హ్యండ్‌సెట్ వ్యాపారంలో భాగంగా సుమారు 7 బిలియన్ డాలర్ల కొనుగోలును రద్దుచేశారు. ఈ మొత్తాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వ్యాపారాల్లో భారీ మొత్తంలో ఇన్సెస్ట్ చేసేలా నిర్ణయాలను తీసుకున్నారు. అంతేకాకుండా లింక్డ్ ఇన్, న్యూయాన్స్, గిట్‌హబ్ వంటి కంపెనీలను సముపార్జన చేయడంలో సత్య నాదెల్లా పాత్ర లేకపోలేదు. ఒక విధంగా సత్య నాదెల్లా తన కఠిన నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్‌ను పూర్తిగా పునర్నిర్మించారు. యాపిల్ మళ్లీ వస్తోంది..! తాజాగా యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ తగ్గిపోవడం కొద్ది రోజులపాటే ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. యాపిల్ తిరిగి ప్రపంచం నెంబర్ 1 మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వచ్చే మూడు సంవత్సరాల్లో యాపిల్ మార్కెట్ క్యాప్ విలువ మూడు ట్రిలియన్స్ కల్గి ఉన్న కంపెనీ అవతరించే అవకాశం ఉందని ఇంటరాక్టివ్ ఇన్వెస్టర్ నిపుణులు విక్టోరియా స్కాలర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: భారత్ దెబ్బ.. చైనాకు ఏకంగా 50వేల కోట్లు నష్టం -
యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!
మైక్రోసాఫ్ట్ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్ నెంబర్ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్ చతికిలపడిపోయింది. దీంతో మైక్రోసాప్ట్ మార్కెట్ క్యాప్ విలువ దాదాపు యాపిల్ క్యాప్ విలువకు చేరుకుంది. రిఫినిటివ్ డేటా ప్రకారం...మైక్రోసాఫ్ట్ షేర్లు 4.2శాతం పెరిగి రికార్డు స్థాయిలో 323.17 డాలర్ల వద్దకు చేరాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారం బలమైన త్రైమాసిక వృద్ధికి ఆజ్యం పోసింది. దీందో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.426 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. మైక్రోసాఫ్ట్ షేర్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది షేర్లు సుమారు 45 శాతం మేర లాభాలను గడించాయి. కరోనా మహామ్మారి ఒక్కింతా మైక్రోసాఫ్ట్‌కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్ ఆధారిత సేవలు భారీగా డిమాండ్ ఏర్పడడంతో భారీ లాభాలను సొంతం చేసుకుంది. చదవండి: టైటాన్ డబుల్ ధమాకా..! సప్లై చైన్ గండం..! రెండో త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన మైక్రోసాఫ్ట్‌ను సప్లై చైన్ విభాగం కలవరపెడుతోంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు, ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్‌లను ఉత్పత్తి చేసే యూనిట్లకు సరఫరా-గొలుసు సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. యాపిల్ అంతంతే..! యాపిల్ తన త్రైమాసిక ఫలితాలను మంగళవారం రోజున ప్రకటించింది. యాపిల్ ఆశించిన మేర ఫలితాలు రాలేదు. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన వెంటనే యాపిల్ షేర్లు గురువారం రోజున సుమారు 0.3 శాతం మేర క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ సంక్షోభం ఐఫోన్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాపిల్‌ను చిప్స్ కొరత కూడా వెంటాడుతుంది. 2021లో యాపిల్ షేర్లు సుమారు 12 శాతం మేర పెరిగాయి. యాపిల్ స్టాక్ మార్కెట్ విలువ 2010లో మైక్రోసాఫ్ట్‌ను అధిగమించింది. రెఫినిటివ్ ప్రకారం... సగటున యాపిల్ క్యూ2లో 31 శాతం పెరిగి 84.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ రెండు కంపెనీలు ఇటీవలి సంవత్సరాలలో వాల్ స్ట్రీట్ అత్యంత విలువైన కంపెనీగా మారాయి. చదవండి: 2008లో టెస్లా కార్లపై ఎలన్ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్ -
ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...!
ముంబై: రిటైల్ చైన్ సూపర్ మార్కెట్స్ డీ-మార్ట్స్ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సోమవారం రోజున సరికొత్త రికార్డును నమోదుచేసింది. డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు (3 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో డీమార్ట్ షేర్లు ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో సోమవారం రోజున డీమార్ట్ షేర్ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డీ మార్ట్ షేర్ విలువ 7 శాతం వృద్ధి చెంది రూ. 4716.50 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇతర కంపెనీల సరసన..! రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్‌జిసి, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న క్లబ్లో ఇప్పుడు డీమార్ట్ కూడా చేరింది. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! -
ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..!
2 Trillion Company Is Making A Fortune Out Of Soaring Oil Prices : ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నీ తాకుతున్నాయి.ఇంధన ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూంటే సౌదీ కంపెనీకి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలకే పోటీగా... సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్కో బుధవారం రోజున ట్రేడింగ్ సమయంలో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. ఆరామ్కో కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలుగా నిలిచిన మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలకు పోటీగా ఆరామ్కో అడుగులు వేస్తోంది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాప్ కల్గిన మూడో కంపెనీగా ఆరామ్కో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏడు సంవత్సరాల్లో గరిష్టంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. ముడిచమురుకు భారీ డిమాండ్..! ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురుపై భారీ డిమాండ్ నెలకొంది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆరామ్‌కోలో అధిక వాటాలను కల్గి ఉంది. సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బహిరంగంగా జాబితా చేయబడిన కంపెనీలో కేవలం 2% కంటే తక్కువ వాటాలను ఆరామ్కో కల్గిఉంది. 2019 చివరలో ఆరామ్‌కోలో కొంత భాగాన్ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్టాక్ఎక్సేఛేంజ్లో లిస్ట్ చేసేలా చేశారు.ఆయిల్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా గణనీయమైన లాభాలను పొందుతున్నారు. చదవండి: నిన్న ప్రధానితో నేడు ఆర్థిక మంత్రితో ఝున్‌ఝున్‌వాలా భేటీ, నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? -
బజాజ్ గ్రూప్ @ రూ. 7.5 లక్షల కోట్లు..
ముంబై: వ్యాపార దిగ్గజం బజాజ్ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించింది. దీంతో కుటుంబాల సారథ్యంలో నడుస్తూ, ఈ ఘనత సాధించిన దిగ్గజ గ్రూప్‌లలో నాలుగోదిగా నిల్చింది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌లు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నాయి. జూన్ 25న బజాజ్ గ్రూప్ కొంత సేపు ఈ మైలురాయి దాటినప్పటికీ.. మార్కెట్ క్షీణించడంతో నిలబెట్టుకోలేకపోయింది. అయితే జూలై 6న తిరిగి సాధించింది. డాలరుతో పోలిస్తే 74.55 రూపాయి మారకం ప్రకారం గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సింహభాగం వాటా బజాజ్ ఫైనాన్స్‌దే (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) ఉంది. వివిధ రంగాల్లోకి విస్తరించిన బజాజ్ గ్రూప్‌లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫిన్సర్వ్), బజాజ్ ఆటో వంటివి కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా బజాజ్ గ్రూప్ స్టాక్స్ గణనీయంగా ర్యాలీ చేశాయి. బజాజ్ హిందుస్తాన్ షుగర్, ముకంద్ వంటివి 279, 118 శాతం మేర ఎగిశాయి. -
చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..!
వాషింగ్టన్: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మంగళవారం రోజున చరిత్ర సృష్టించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,48,50,100 కోట్లు)కు చేరింది. దీంతో అమెరికాలో ఆపిల్ కంపెనీ తరువాత రెండు ట్రిలియన్ క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. మంగళవారం రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్లు 1.2 శాతాన్ని ఎగబాకాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుత షేర్ విలువ 266.34 డాలర్ల వద్ద స్థిరపడింది. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టినప్పటినుంచి మైక్రోసాఫ్ట్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఏడు సంవత్సరాల నుంచి సత్య నాదెళ్ల రాకతో కంపెనీ షేర్ వాల్యూను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగాల్లో ప్రముఖ దిగ్గజ కంపెనీలతో పోటి పడేలా చేశారు. తాజాగా మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. అమెరికన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ల బిల్లుల నుంచి తప్పించుకున్న అతిపెద్ద యుఎస్ టెక్నాలజీ కంపెనీలలో మైక్రోసాఫ్ట్ మాత్రమే ఒకటిగా నిలిచింది. దీంతో కంపెనీకి సముపార్జన విషయంలో, ఉత్పత్తి విస్తరణ రెండింటిలోనూ స్వేచ్ఛాను కల్గిస్తుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త విస్తరణలో భాగంగా కొత్త డేటా సెంటర్‌ను ను స్పెయిన్‌లో ఏర్పాటుచేయనుంది. టెలిఫోనికా కంపెనీ భాగస్వామ్యంతో ఈ డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. చదవండి: ఇక్కడ మొబైల్లో చూస్తే.... అక్కడ కాసులు వర్షం -
మార్కెట్ క్యాప్‌లో నెం.1గా యాపిల్
ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది. కరోనా కల్లోల సమయంలోనూ కంపెనీ అదిపోయే క్యూ2 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేరు 10శాతానికి పైగా లాభపడి 425.04 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సౌదీ ఆరామ్కో మార్కెట్ క్యాప్‌ను అధిగమించి 1.82 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాదిలో స్టాక్ మార్కెట్లో లిస్టైన సౌదీ ఆరాంకో మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటికి 1.76ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో టెక్నాలజీ షేర్లకు భారీగా డిమాండ్ నెలకొంది. యాపిల్ షేరు ఏడాది మొత్తం మీద 45శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికం సందర్భంగా దాదాపు 6తర్వాత యాపిల్ కంపెనీ షేర్ల విభజనకు ఆమోదం తెలిపింది. ఈ ఆగస్ట్ 31 తరువాత 1:4 విభజిస్తారు. ఈ జూన్ కార్వర్ట్‌లో యాపిల్ కంపెనీ 16బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి 4.33బిలియన్ల అవుట్‌స్టాడింగ్ షేర్లు ఉన్నట్లు నాస్డాక్ ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. -
రికార్డుల మోత మోగిస్తున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం ఇందుకు కారణమైంది. క్వాల్కామ్ వెంచర్స్ సంస్థ జియోలో 0.15శాతం వాటాను రూ.730 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఆదివారం రిలయన్స్ ప్రకటించింది. ఫలితంగా నేడు బీఎస్ఈ రియలన్స్ షేరు రూ.1908.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేరు 3.64శాతం పెరిగి రూ.1947 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1878.50)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.1935 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ మార్చి మార్కెట్ పతనం నుంచి రిలయన్స్ షేరు ఏకంగా 120శాతం ర్యాలీ చేసింది. ఈ వారంలో బుధవారం (ఈ నెల 15న) జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం) కోసం ఇన్వెస్టర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. రూ.12లక్షల కోట్లకు చేరిన మార్కెట్క్యాప్: రిలయన్స్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ రికార్డుకెక్కింది. షేరు టార్గెట్ ధరను పెంచిన బ్రోకరేజ్‌లు: ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ షేరు టార్గెట్ ధరను పెంచింది. గతంలో బ్రోకరేజ్ సంస్థ కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.1950 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిజిటల్ వ్యాపారంలో కంపెనీ వ్యూహాత్మక అడుగులు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, క్వాల్కామ్లతో ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లు జియోలో వాటాను కొనుగోలు చేయడం షేరు ర్యాలీకి మరింత ఉత్సాహానిస్తున్నాయి. -
ఎస్బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించిన బజాజ్ ఫైనాన్స్
ఎన్బీఎఫ్సీ రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ మంగవారం దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. మార్కెట్ ముగింపు తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ క్యాప్‌లను పరిశీలిస్తే..., బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1.76లక్షల కోట్లుగా నమోదవగా, ఎస్బీ మార్కెట్ క్యాప్ రూ.1.71లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన టాప్-100 కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ 12వ స్థానానికి చేరుకోగా, ఎస్బీఐ 13వ స్థానానికి దిగివచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ కంపెనీలు టాప్-10లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ షేరు 2016లో లిస్ట్ అయ్యి అదే ఏడాది 40శాతం పెరిగింది. 2017లో 109శాతం, 2018లో 51శాతం, 2019లో 60శాతం ర్యాలీ చేసింది. మొత్తం మీద లిస్ట్ అయిన నాటి నుంచి షేరు ఏకంగా 712శాతం లాభపడింది. అయితే కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మారిటోరియం విధింపు తర్వాత ఎన్పీఏల మరింత పెరగవచ్చనే అందోళనలతో ఈ షేరు ఏడాది ప్రారంభం నుంచి 33శాతం నష్టాన్ని చవిచూసింది. మరింత అప్‌ట్రెండ్‌కు అవకాశం: బ్రోకరేజ్‌లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బీసీ ఈ షేరు ఇటీవల ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే టార్గెట్ ధరను రూ.3700గా నిర్ణయించింది. నిన్నటి ముగింపు ధర(రూ.2841.85)తో పోలిస్తే నిర్ణయించిన టార్గెట్ ధర 30శాతం అప్‌సైడ్ పోటెన్షియల్ను కలిగి ఉంది. మరో బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా బజాజ్ ఫైనాన్స్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. -
రిలయన్స్ @ రూ.11లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ క్యాప్ గురువారం రూ.11లక్షల కోట్లను తాకింది. మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. మార్కెట్ నష్టాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ కంపెనీ షేరు అరశాతానికి పైగా నష్టంతో రూ.1605.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మిడ్ సెషన్ అనంతరం లభించిన అపూర్వ కొనుగోళ్లతో షేరు ఇంట్రాడే కనిష్టం నుంచి 3.70శాతం లాభపడి రూ.1665.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 2.50 శాతం లాభంతో రూ.1656.25 వద్ద స్థిరపడింది. షేరు సరికొత్త గరిష్టాన్ని నమోదు చేయడంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.11లక్షల కోట్లను అందుకుంది. ఈ ఘనత సాధించిన భారతీయ తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రూ. 3.5 లక్షల కోట్లు మటాష్!
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మళ్లీ పంజా విసురనుందన్న అంచనాతో అమెరికా మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేశాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చన్న వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా మార్కెట్టు కుప్పకూలాయి. కరోనా వైరస్, లాక్డౌన్ అనంతరం మార్చి తరువాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,800 పాయింట్లకు, ఎస్ అండ్ పి 500 5.9 శాతానికి పైగా పడిపోయింది. ఆసియా మార్కెట్లు ఇదే బాటపట్టాయి. జపాన్ నిక్కి 1.52 శాతం చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, దక్షిణ కొరియాకు కోస్పి వరుసగా 0.51 శాతం, 1.03 శాతం, 2.48 శాతం పతనమయ్యాయి. దీంతో నేడు (శుక్రవారం) దేశీయంగా మన స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ ఆరంభంలోనే ఏకంగా 1100 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టోయింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 264,315 పాయింట్లు కోల్పోయాయి. ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తం ఆవిరై పోయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. (స్టాక్ మార్కెట్ భారీ పతనం) పెట్టుబడిదారులు రూ .3.51 లక్షల కోట్లు నష్టపోయారు. అలాగే మార్కెట్ క్యాప్ నిన్నటి (జూన్ 11) 133.14 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే జూన్ 12 న శుక్రవారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .129.63 లక్షల కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్లో గురువారం 805.14 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మారు. దేశీయ పెట్టుబడిదారులు కూడా 874.35 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇండస్ఇండ్ బ్యాంక్, ఒఎన్జీసీ, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న సెన్సెక్స్ ప్రస్తుతం 635 పాయింట్లు క్షీణించి 32,908 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు కోల్పోయి 9723 వద్ద కొనసాగుతుండటం విశేషం. చదవండి: ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం! వామ్మో! పెట్రో బాదుడు -
పెట్టుబడుల జోష్: రికార్డు గరిష్టానికి రిలయన్స్ షేరు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రియలన్స్ ఇండస్ట్రీస్ షేరు గురువారం రికార్డు గరిష్టానికి తాకింది. అబుదాభి ఆధారిత ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ముమబదలా జియో ఫ్లాట్‌ఫామ్‌లో రూ.9,093 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం రియలన్స్ షేరు రికార్డు గరిష్టాన్ని అందుకునేందుకు కారణమైంది. జియోలో వరుస పెట్టుబడులు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు నిన్నటి ముగింపు(రూ.1579.95)తో పోలిస్తే 1.38శాతం లాభంతో రూ.1601.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.38శాతం లాభపడి రూ.1617.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు ఏడాది గరిష్ట స్థాయి కావడం విశేషం. ఉదయం 10గంటలకు షేరు క్రితం మునపటి ముగింపుతో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.1603.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.867.45, రూ.1617.70గా ఉన్నాయి రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ రూ.10లక్షల కోట్లకు.... రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో కేవలం 6వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్‌లో మొత్తం రూ.87,655.35 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు కంపెనీ తెలిపంది. ఈ నేపథ్యంలో నేడు రియలన్స్ రికార్డు గరిష్టాన్ని తాకింది. అలాగే కంపెనీ నిర్వహించిన రైట్ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ మరోసారి రూ.10లక్షల కోట్లకు చేరుకుంది. -
మోదీ 2.0 ఏడాది పాలన: రూ.27లక్షల కోట్లను కోల్పోయిన ఇన్వెస్టర్లు
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో దలాల్ స్ట్రీట్ ఏకంగా రూ.27లక్షల కోట్ల సంపదను కోల్పోయినట్లు గణాంకాలు చెబుతాయి. హరించుకుపోయిన ఈ మొత్తం ధనం దేశ జీడీపీలో 13.5శాతంగా ఉంది. కోవిడ్ సంక్షోంభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఇటీవల కేంద్ర ప్రకటించిన రూ.20లక్షల కోట్ల పోలిస్తే 35శాతం ఈ మొత్తం విలువ అధికం. ఇదే ఏడాదిలో ప్రతి 10స్టాకుల్లో 9 స్టాకులు నెగిటివ్ రిటర్న్‌లను ఇచ్చాయి. ఇదే సమయంలో బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల్లో కేవలం 10శాతం కంపెనీల షేర్లు మాత్రం రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. మోదీ ఏడాది పాలనకు 10మార్కులకు 7 మార్కులిచ్చిన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ దీపక్ జైసనీ మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ పనితీరు నిర్ధారణకు మార్కెట్-క్యాపిటలైజేషన్ ప్రమాణికం కాదు. మార్కెట్ల పనితీరు కేవలం ప్రభుత్వ పాలసీ మీద మాత్రమే ఆధాపడి ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు, నిబంధనలు, అంతరాయాలతో పాటు ఇతర అనేక అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’’అని అన్నారు. -
కరోనా : టాప్-10 నుంచి స్టాక్ మార్కెట్ ఔట్
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి పుణ్యమా అని భారతీయ స్టాక్ మార్కెట్ టాప్-10 స్టాక్ మార్కెట్ల జాబితా నుంచి పడిపోయింది. కరోనా వైరస్, లాక్ డౌన్ ఆందోళన నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనంతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ టాప్ 10 జాబితానుంచి, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ క్లబ్ నుంచి తప్పుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్టానికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం ఈక్విటీ మార్కెట్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్, సంవత్సరం ప్రారంభం నుండి డాలర్ పరంగా 27.31శాతం పడిపోయింది. 1.57 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కాప్ తో 11 వ స్థానానికి పడిపోయింది. 2019 జనవరిలో 2.08 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఏడవ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా గత జనవరిలో 2.16 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశం 10 వ స్థానానికి చేరింది. తాజాగా కోవిడ్ -19 విలయంతో 10 స్థానాన్ని కూడా కోల్పోయింది. (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్) బెంచ్‌మార్క్ సూచికలు అతిపెద్ద వన్డే క్షీణతను నమోదు చేసిన మార్చి 23 న భారత్ టాప్ 10 జాబితాలో పడిపోయింది, ఈ రోజు భారతదేశం మొత్తం మార్కెట్ క్యాప్ డాలర్ పరంగా 31 1.31 ట్రిలియన్లు . రూపాయి పరంగా రూ.101.87 ట్రిలియన్లు. అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 21.74 శాత తగ్గి 121.73 ట్రిలియన్ చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 155.54 ట్రిలియన్లు. (‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్) సిఎల్ఎస్ఎ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత 30 ఏళ్లలో భారతీయ మార్కెట్లలో 40శాతం నమోదు చేయడం ఇది ఐదవ సారి. భారతదేశంలో రికార్డు స్థాయిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. భారతదేశం బెంచ్మార్క్ఇండెక్స్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 29.10శాతం(డాలర్ల పరంగా) కోల్పోయింది ఈ సంవత్సరం ప్రారంభంనుండి 24 శాతం కుప్ప కూలడంతో మొత్తం మార్కెట్ క్యాప్ నష్టానికి దారితీసింది. 2019 లో 11.91 శాతం పెరిగింది. మొత్తం ప్రపంచ మార్కెట్ క్యాప్‌లో భారతదేశం2.18శాతంఉండగా, 2019 ప్రారంభంలో ఇది 2.97శాతం గా ఉంది. 2020లో ఇప్పటివరకు, ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం విలువలో 17.15 శాతం క్షీణించాయి. 86.99 ట్రిలియన్ నుండి 72.07 ట్రిలియన్లకు చేరాయి. అయితే కోవిడ్ -19 కు కేంద్రంగా ఉన్న చైనా 2020లో ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.36 శాతం లేదా 7.24 ట్రిలియన్ల డాలర్లు నష్టపోయింది. 29.34 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అమెరికా తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. 2020లో 30.09 శాతం కోల్పోయిన యుకె, 2.44 ట్రిలియన్ డాలర్ల (మార్కెట్ క్యాప్)తో ఐదవ స్థానంలో ఉంది. (కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం) రూపాయి పతనం : ఆసియాలో భారతీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. వరుస రికార్డు కనిష్టాలతో ఈ ఏడాది ఇప్పటివరకు డాలర్‌తో పోలిస్తే 6.64 శాతం బలహీనపడింది. ఏప్రిల్ మాసంలో భారత కరెన్సీ 76.92 కనిష్ట స్థాయిని తాకింది. ఇదే సమయంలో డాలర్ 4.14 శాతం లాభపడడం గమనార్హం. (కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు) అంబిట్ క్యాపిటల్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల ఉద్దాన పతనాలు సాధారణమే అనేది 100 సంవత్సరాల చరిత్ర చెబుతోంది. దశాబ్దంలో ఏదో ఒక సంఘటన 35 శాతం పతనానికి దారి తీస్తుంది. నష్టాల్లో మార్కెట్లో పెట్టుబడిదారుల సెంటిమెంటు దెబ్బతింటుంది. ఆందోళనతో అమ్మకాలకు పాల్పడతారు. ఫలితంగా ఆర్థిక మాంద్యం, ఉద్యోగ మాంద్యం, వేతనాల కోతలు అనివార్యమవుతాయి. అయితే ఇలాంటి సంక్షోభాలనుంచి భారత మార్కెట్లు అమెరికా లేదా ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే వేగంగా కోలుకుంటాయి. సగటున 12-14 నెలల్లో కోలుకుంటాయి. సగటున 16 -18 నెలల్లో గరిష్టాలను తాకుతాయి. భారతీయ మార్కెట్లు ఎంత వేగంగా పడిపోతాయో, అంతే వేగంగా పుంజు కుంటాయని అంచనా. -
కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు
సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ మంగళవారం దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. ఈ వరుసలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా అవతరించింది. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ మెగా ఒప్పందం ప్రకటించిన దాదాపు 15 నెలల విలీనాన్ని మంగళవారం ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించింది. రూ. 3,045 కోట్ల విలువైన హార్లిక్స్ బ్రాండ్‌ను కొనుగోలుకు బోర్డు అనుమతి లభించందని సంస్థ ప్రకటించింది. దీంతో హిందూస్థాన్ యూనిలీవర్ షేర్ ధర 11.41 శాతం పెరిగి రూ .2,399 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. (దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు) కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి ఎఫ్ ఎంసీజీ ఫార్మా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి నెలకొన్నాయి. ఇవి వరుసగా 10.4 శాతం, 20 శాతం ఎగిసాయి. అయితే ఈ సమయంలో నిఫ్టీ 6.45 శాతం క్షీణించింది. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాటం నేపథ్యంలో ఈ ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఏర్పడిందని, దీంతో షేర్లు పెరుగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. మంగళవారం నాటి మార్కెట్ లో ఐటీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, డాబర్, ఇమామి, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, కోల్గేట్ పామోలివ్ లాంటి ఇతర ఇతర ఎఫ్ఎంసిజి షేర్లు కూడా ఒక్కొక్కటి 5-10 శాతం మధ్య ట్రేడవుతుండటం విశేషం. కీలక సూచీల్లో సెన్సెక్స్ 2289 పాయింట్లకు పైగా లాభపడుతుండగా, నిఫ్టీ 657 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. చదవండి: బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే -
రిలయన్స్ @10,00,000
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్ ముకేశ్ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలోని 250 కంపెనీల మార్కెట్ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు. ఆ రెండు విభాగాల జోరు.... అతి తక్కువ కాలంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు. 25 సెషన్లలోనే లక్ష కోట్లు అప్.... ఈ ఏడాది అక్టోబర్ నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్ సెషన్లలోనే మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 14 శాతం పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తుండటం, టెలికం టారిఫ్‌లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. వచ్చే నెల నుంచి మొబైల్ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ పెరుగుతూనే ఉంది. కాగా ఈ క్యూ2లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రికార్డ్ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనే ట్యాగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు, రిలయన్స్‌కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం. రుణ భారం పెరుగుతూ ఉన్నా... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్లో కదలాడింది. రిలయన్స్ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్ ఘనతకు కారణం. నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్‌పై విశ్వాసాన్ని కోల్పోలేదు. ‘టార్గెట్’ పైపైకి... రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్ కంపెనీ లక్ష్యం వచ్చే ఆరి్థక సంవత్సరంలో సాకారం కావచ్చని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తాఫా నదీమ్ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు వాటా విక్రయం, రిలయన్స్ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను ఇచ్చాయి. టార్గెట్ ధరలను పెంచాయి. -
మరోసారి దూసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మార్కెట్క్యాప్ పరంగా దేశంలో అతిపెద్ద మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. మంగళవారం నాటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు ఇంట్రా-డే 3 శాతానికి పైగా లాభపడి బీఎస్ఇలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి (రూ.1,508.45)ని తాకింది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .9.50 ట్రిలియన్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌ను సాధించే దిశగా సాగుతోంది. అర్ధ శతాబ్దం క్రితం 1966లో ఒక ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) రిలయన్స్‌ను స్థాపించారని, రిలయన్స్‌ను ప్రపంచ స్థాయి భారతీయ వ్యాపార సంస్థగా నిర్మించాలన్నది తన తండ్రి కల అని, అది తన జీవితకాలంలో సాకారం కావడం తన అదృష్టమని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గత ఏడాది మార్చిలో గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మొదటి సంస్థగా ఆర్ఐఎల్ నిలిచింది. 2019 క్యాలెండర్ సంవత్సరంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర 34 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పటివరకు రూ .2.3 ట్రిలియన్లు పెరిగింది. కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ కాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటి 3 వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
జియో దెబ్బ : ఎగిసిన ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మళ్లీ ఫాం లోకి వస్తోంది. టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో టారిప్ వార్‌లో భారీగా కుదేలైన భారతీ ఎయిర్టెల్ షేర్లు బిఎస్ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్ రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్కెట్ వాల్యుయేషన్ మార్క్‌ను తిరిగి దక్కించుకుంది. రిలయన్స్ జియో 6 పైసల వడ్డన ప్రకటించిన తరువాత నుంచి భారతి ఎయర్‌టెల్ వరుసగా ఐదవరోజు కూడా లాభపడింది. దీంతో షేరు ధర మార్చి 2018 నుండి అత్యధిక స్థాయిని తాకింది. గత ఒక వారంలో 2 శాతం లాభంతో పోలిస్తే, 16 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ 27,662 కోట్ల రూపాయల మార్కెట్ అదనంగా చేకూరింది. గత వారం, రిలయన్స్ జియో ఆఫ్-నెట్ కాల్లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. వినియోగదారుల నుండి ఇంటర్ కనెక్షన్ వినియోగ ఛార్జీలను (ఐయుసీ) ప్రకటించడంతో రిలయన్స్ జియో వినియోగదారుల ఆగ్రహానికి గురవుతోంది. తద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందించిన వాయిస్ కాల్ సేవపై ఇపుడు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ చర్య ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. -
భారీగా పతనమైన యస్ బ్యాంక్ షేరు
సాక్షి,ముంబై : ప్రయివేటు బ్యాంకు యస్ బ్యాంక్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో యస్ బ్యాంకు షేరు ఏకంగా 20శాతం కుప్పకూలింది. తద్వారా ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతేకాదు తాజా పతనంతో యస్ బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 20,615 కోట్లకు క్షీణించింది. నిఫ్టీలో ఇదే అతి తక్కువ మార్కెట్ క్యాప్ అని గణాంకాలు ఆధారంగా తెలుస్తోంది. క్యూ1 ఫలితాలు బుధవారం ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో యస్ బ్యాంక్ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడిన సంగతి తెలిసిందే. బుధవారం యస్ బ్యాంక్ షేరు ఆరంభంలో భారీగా పుంజుకున్నా.. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. -
ఆ విభేదాల ప్రభావం వుండదు - ఇండిగో సీఈవో
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో కంపెనీ సీఈవో రనుంజాయ్ దత్తా స్పందించారు. బుధవారం ఆయన ఇండిగో ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీనికి ఇండిగోకు ఎలాంటి సంబంధ లేదనీ, ఇండిగో కార్యకలాపాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని వివరణ ఇచ్చారు. అలాగే ఎయిర్‌లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటిమార్పు ఉండదని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ప్రస్తుతం ముఖ్యమన్నారు. ప్రమోటర్ల మధ్య విభేదాలుతో ఉద్యోగులకు, ఎయిర్‌లైన్స్‌కు ఏమీ నష్టం జరగదని సీఈవో ప్రకటించారు. శక్తిసామర్థ్యాల మేరకు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. ఈ సదర్భంగా టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు అన్నారు. మరోవైపు ఇండిగోలో సంక్షోభంముదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇండిగో షర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా పతనమమ్యాయి. అమ్మకాల సెగతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 6423 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒక దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి ఇంత భారీ నష్టాలను మూటగట్టకుంది. ముగింపులో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇదే అతి పెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ప్రమోటర్లు రాకేష్ గాంగ్వాల్, రాహుల్‌భాటియా మధ్య విభేదాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గాంగ్వాల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీనికోరిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండిగో సంస్థను సెబీ కోరింది. -
ఆపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్ వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్ క్యాప్‌కు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్‌కు మైక్రోసాఫ్ట్ గట్టి షాక్ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం ఆపిల్ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచి ఆపిల్ కొత్త రికార్డులను సాధించడం ప్రారంభించింది. ఏడు వారాల క్రితం 231 డాలర్ల షేర్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఆపిల్ షేర్లు బిజినెస్ ఎనలిస్ట్లకు కూడా అర్థం కాని స్థితిలో నిలకడలేమితో కొనసాగుతున్నాయి. ఊహించని పరిణామాలు జరుగుతుండడంతో ఆపిల్‌లో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడుదారులు సైతం వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తీసుకొచ్చిన ఐఫోన్ ఎక్స్ఆర్ సేల్స్‌లో బోల్తా పడ్డాయి. ఈ పరిణామామే ఆపిల్ పతనానికి కారణమని ట్రేడ్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆపిల్ షేర్లు 172.29 డాలర్లకు దిగజారాయి. కొద్ది వారాల సమయంలోనే ఆపిల్ షేర్లు 25 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. దీంతో ఆపిల్ ట్రిలియన్ డాలర్ల కంపెనీ అనేది చేదు కలగానే మిగిలిపోయింది. అంతేకాదదు ఆపిల్ మూలధనం (మార్కెట్ క్యాపిటల్) కూడా భారీ మార్పు చవిచూసింది. ఆపిల్ మూలధనం 746 బిలియన్ డాలర్లకు దిగి రాగా, 753 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అతిపెద్ద (మార్కెట్ క్యాప్‌లో)సంస్థగా నిలిచింది. అమెజాన్, గూగుల్ సంస్థలు ఆపిల్ కంటే కిందే ఉన్నప్పటికీ, ఆపిల్ షేర్లు ఇప్పటిలాగే పడిపోతుంటే రానున్న రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉంది. -
టీసీఎస్ మళ్లీ టాప్
సాక్షి, ముంబై: మార్కెట్ క్యాప్‌పరంగా ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మళ్లీ టాప్కు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మరో మైల్‌స్టోన్‌నుకు చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలికాలంలో ఈ టాప్ ర్యాంక్కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మధ్య తీవ్రమైనపోటీ నెలకొంది. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా భారత్‌లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని వెనక్కి నెట్టి ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.8 లక్షల కోట్లను అధిగమించింది. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లల కొనుగోళ్ల హవా నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు టిసిఎస్ స షేరు 54.6 శాతం పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబరు 6 వ తేదీన జరగనున బై బ్యాక్ ఆఫర్ కారణంగా రోజువారీ లాభాలనే నమోదు చేస్తోంది. టీసీఎస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ రూ.8 లక్షల కోట్ల (రూ.8,00,478 కోట్లు) కంపెనీగా అవతరించింది. కాగా ఈ మార్క్‌ను తొలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిగమించింది. అయితే రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ 3.05 శాతం, మైండ్‌ట్రీ 2.45 శాతం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85 శాతం లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్ సాధించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,86,943 కోట్లుగా ఉంది. ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,329ని తాకిన షేరు ప్రస్తుతం రూ.1,242 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది. -
దూసుకొచ్చిన ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస రికార్డు గరిష్టాలతో దూసుకుపోతోంది. మరోవైపు కొర్పొరేట్ దిగ్గజం, ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. మార్కెట్‌క్యాప్‌లో 8లక్షలకోట్లనుదాటి ఆకర్షణీయంగా నిలిచింది. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆర్ఐఎల్ షేరు 1.28శాతం పుంజుకుని 52వారాల గరిష్టాన్ని టచ్ చేసింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలేజేషన్ 8,00,128 కోట్ల రూపాయలను అధిగమించింది. ఈ క్రమంలో ఈ రేసులో ముందున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. . టీసీఎస్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 7,77,870కోట్లుగా ఉంది. -
క్యూ1 లాభాల కిక్: నెంబర్ వన్‌గా రిలయన్స్
సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ సొంతమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి ఆగ్ర భాగాన నిలిచింది. క్యూ1ల సాధించిన ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐల్ కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డేలో 2 శాతానికి పైగా లాభపడింది. మంగళవారం షేరు ధర పెరగడంతో రిలయన్స్ మొత్తం విలువ 7 లక్షల 46 వేల 472 కోట్లకు పెరిగింది. తాజా లాభాలతో దాదాపు 2.7 లక్షల కోట్లను మార్కెట్ క్యాప్‌లో జత చేసుకుంది. జులై 13న తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 7.39 లక్షల కోట్లగా ఉంది. కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.9459 కోట్లకు చేరింది. గతేడాది కంటే 17.9 శాతం లాభాలు పెరిగాయి. సంస్థ ఆదాయం 56.5 శాతం పెరిగి 1,41,699 కోట్లకు చేరింది. -
హెచ్‌యూఎల్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ను వెనక్కి నెట్టింది. హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది. కాగా మార్కెట్వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో నిలిచాయి. -
ఎం అండ్ ఎం సరికొత్త రికార్డు
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డును సాధించింది. మంగళవారం నాటి లాభాలతో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్లో చేరింది. వాతావరణ శాఖ అందించిన సాధారణ వర్షపాత అంచనాలు ( 97 శాతం వర్షపాతం) ఎం అండ్ ఎండ్ షేర్‌కు పాజిటివ్ సంకేతాలను అందించాయి. దీంతో ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడింది. ట్రాక్టర్ల దిగ్గజం ఎం అండ్ ఎం కౌంటర్లో కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. వెరసి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) నిన్నటి రూ .99,605 కోట్ల నుంచి ,225.32 కోట్ల రూపాయల మేర పెరిగి రూ .1,01,829.91 కోట్లకు చేరింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా కంపెనీ తాజాగా 30వ ర్యాంకును అందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ. 812 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 819 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు సైతం చేరువైంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ డీవీఆర్లతో కలిపి రూ. 1.08 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్చిలో వాహన విక్రయాలు 10 శాతం పుంజుకున్న నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఈ నెలలో 9 శాతం లాభపడింది. -
ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన టెన్సెంట్
అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చైనా సోషల్ మీడియాదిగ్గజం షాక్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా చైనాకు చెందిన టెన్సెంట్ ఫేస్‌బుక్‌ను బీట్ చేసింది. మంగళవారం ఇన్వెస్టర్ల కోనుగోళ్లతో ప్రపంచ దిగ్గ సంస్థల టాప్ 5లో చోటు దక్కించుకుంది. చైనా సోషల్ మీడియా, వీడియో గేమ్ దిగ్గజం టెన్సెంట్ మార్కెట్ విలువలో ఫేస్‌బుక్‌ను అధిగమించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి టెన్సెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.15 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు ( 531 బిలియన్ డాలర్లు)డాలర్లుగా నమోదైంది. దీంతో ప్రపంచంలోని ఐదు అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా టెన్సెంట్ నిలిచింది. కాగా ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ 519 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మరో దిగ్గజ సంస్థ ఆపిల్ మార్కెట్ క్యాప్ 873 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఆపిల్ సరికొత్త రికార్డ్
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఆపిల్ అరుదైన రికార్డును సొంతంచేసుకుంది. భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో తొలిసారి అమెరికాలో టాప్ కంపెనీగా అవతరించింది. మంగళవారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు 800 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 53.22 లక్షల కోట్లు) మార్కును తాకి మొట్టమొదటి అమెరికా కంపెనీగా ఆపిల్ ఇంక్ నిలిచింది. రెండేళ్ల కిత్రం నాటి 700 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 46.56 లక్షల కోట్లు) స్థాయిని స్వల్పంగా అధిగమించి ఈ ఘనతను సాధించింది.దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సంస్థగా ఆపిల్ నిలిచిందిక్లోజింగ్ మార్కెట్ క్యాప్ 802.8 బిలియన్డాలర్ల వద్ద ముగిసింది. కాగా అమెరికాలో 50 రాష్ట్రాల్లో 45 లో దూసుకుపోతోంది. ప్రధానంగా ఇల్లినాయిస్, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా అగ్రస్థానంలో ఉంది.ఇందులో ఐ ఫోన్ వాటా 33 శాతం పుంజుకుంది. ముఖ్యంగా నవంబర్‌లో అమెరికా ఎన్నికల తర్వాత 50 శాతం లాభాలుపుంచుకున్నాయి. 2012 సెప్టెంబరులో ఆపిల్ అనంతరం ఎస్అండ్పి 500 యొక్క 4.9శాతం వాటాను కలిగి ఉంది, అయితే ఇండెక్స్ 7శాతం కన్నా ఎక్కువ సాధించింది. ఆపిల్ ఎంత శక్తివంతైన సంస్థ నిరూపితమైందనీ, దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ సంస్థగా నిలిచిందనీ న్యూజెర్సీలోని లిబర్టీవ్యూ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ ప్రెసిడెంట్ రిక్ మెక్లర్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో బలమైన ప్రత్యర్థులు ఉన్నా, పరిమిత సంఖ్యలో ఉత్పత్తులను కలిగి ఉన్నప్పటికీ మార్కెట్లో నిజంగా ఆధిపత్యాన్ని చాటుకుందన్నారు. కాగా బిలియనీర్ వారెన్ బఫ్ఫెట్ ఆపిల్ సంస్థపై తన ఇష్టాన్ని ఇటీవల మరోసారి ప్రకటించారు. సంస్థలో సుమారు 20 బిలియన్ డాలర్ల వాటా ఉన్నట్టు వెల్లడించారు. ఐఫోన్ మేకర్ల కాంపిటీటివ్ స్థితితోపాటు, వారిని ఫాలో అవుతున్న ఇతర కంపెనీలను చాలా సులభంగా గుర్తించవచ్చని వ్యాఖ్యానించడం విశేషం. -
షేర్ మార్కెట్ కింగ్... ఎస్బీఐ!
⇔ ప్రభుత్వ రంగ సంస్థల్లో నెంబర్–1 స్థానానికి ⇔ మార్కెట్ విలువ పరంగా ఓఎన్జీసీని వెనక్కి నెట్టిన ఎస్బీఐ ⇔ ప్రయివేటు సంస్థలనూ కలిపిచూస్తే... ఎస్బీఐకి 5వ స్థానం ⇔ మొదటి స్థానంలో టీసీఎస్; నువ్వానేనా అంటున్న రిలయన్స్ ⇔ ఓఎన్జీసీని తోసిరాజని అగ్రస్థానంలోకి ముంబై: స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత విలువైన సంస్థేదో తెలుసా? ఇప్పటివరకూ ఓఎన్జీసీ. కానీ మంగళవారం ఈ స్థానాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆక్రమించింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓఎన్జీసీ మార్కెట్ క్యాప్ (మొత్తం షేర్ల విలువ) రూ.2,32,346 కోట్లుగా ఉండగా, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ దీనికంటే రూ.2,962 కోట్లు అధికంగా రూ.2,35,308 కోట్ల స్థాయికి చేరింది. ఇక ప్రయివేటు సంస్థల్ని కూడా కలుపుకొంటే... స్టాక్ మార్కెట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్ర స్థానంలో ఉన్న తొలి పది కంపెనీల్లో ఎస్బీఐ ఐదో స్థానంలో, ఓఎన్జీసీ ఏడో స్థానంలో నిలిచాయి. ఒకప్పుడు అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఓఎన్‌జీసీయే ఉండేది. ఎస్బీఐ 0.1 శాతం లాభపడి రూ.290 వద్ద, ఓఎన్జీసీ 1.1 శాతం క్షీణించి రూ.181 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎస్బీఐ 16 శాతం పెరగ్గా, ఓఎన్జీసీ 4 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో అగ్రస్థానంలోకి రిలయన్స్.. కాగా ఇంట్రాడేలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న భారత కంపెనీగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) నిలిచింది. కానీ ట్రేడింగ్ చివరవరకూ దీనిని నిలుపుకోలేకపోయింది. చివరికి 1.5% క్షీణించి రూ.1,370 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,45,579 కోట్లకు పరిమితమైంది. టీసీఎస్ 0.5% నష్టపోయి రూ.2,309 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,54,903 కోట్లుగా ఉంది. నాలుగేళ్ల క్రితం అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న భారత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తోసిరాజని టీసీఎస్ ముందుకెళ్లింది. అప్పటి నుంచీ అది తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. టెలికం సంస్థ జియో కారణంగా రిలయన్స్ ఇటీవల బాగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఆర్ఐఎల్ 27% పెరగ్గా, టీసీఎస్ 2% నష్టపోయింది. ఒక కంపెనీ షేర్ ప్రస్తుత మార్కెట్ ధరను, అ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాప్‌గా పరిగణిస్తారు. -
25 నిమిషాల ఆ స్పీచ్‌కు రూ.3000 కోట్లు ఆవిరి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 25 నిమిషాల స్పీచ్‌కు మేజర్ టెలికాం స్టాక్స్ అన్నీ గజగజలాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే దిగ్గజ టెలికాం స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో టెలికాం దిగ్గజాల మార్కెట్ విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. ఒకటిన్నర మధ్యలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా 76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్ స్పీచ్‌తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. సంచలమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు(సెప్టెంబర్1న) కూడా ఎయిర్టెల్, ఐడియా షేర్ల మార్కెట్ విలువ భారీగా కోల్పోయినట్టు, రూ.16,000కోట్లు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించారు. మరోసారి హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో సేవలను పొడిగించనున్నట్టు సంచలనమైన ప్రకటనను వాటాదారుల సమావేశంలో గురువారం రిలయన్స్ అధినేత వెల్లడించడంతో ఈ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రూ.3000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. -
పోకిమాన్ గేమ్ తో నింటెండో షేర్లు రికార్డు
వీడియో గేమ్ దిగ్గజం నింటెండో మార్కెట్ విలువలో దూసుకెళ్తూ మరో దిగ్గజ కంపెనీ సోనీని వెనక్కు నెట్టేసింది. పోకీమాన్ గో గేమ్ విడుదలతో, మార్కెట్లో ఈ గేమింగ్ దిగ్గజం దూసుకుపోతోంది. పోకిమాన్ గో గేమ్ రిలీజ్ అనంతరం నింటెండో తన స్టాక్ ను రెండింతలు పెంచుకుంది. నింటెండో కంపెనీ షేర్లు మంగళవారం రోజు దాదాపు 11శాతం జంప్ అయి, 290 డాలర్లుగా(రూ.19,472) నమోదయ్యాయి. జూలై6 ముగింపు అనంతరం ఇప్పటివరకూ ఈ షేర్లు 100 శాతంకు పైగా దూసుకెళ్లాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.36 ట్రిలియన్ యెన్(రూ.2,75,658 కోట్లకు పైగా)తో, జపాన్ లోని ఉత్తమ ప్రసిద్ధ కంపెనీల జాబితాలో ఒకటిగా నింటెండో చేరిపోయింది. శుక్రవారం ఒక్క రోజే జపాన్ లో అత్యధిక వాటాలు ట్రేడ్ అయి, రోజు వారీ వర్తకంలో నింటెండో రికార్డు సృష్టించింది. రెండు వారాల క్రితమే ఈ గేమ్ ను లాంచ్ చేశారు. ఈ గేమ్ ప్రవేశంతో, మొబైల్ గాడ్జెట్స్ లో, స్మార్ట్ ఫోన్లలో దీనికి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది. పోకిమాన్ క్రేజ్ కేవలం నింటెండో కంపెనీకి మాత్రమే కాదంట. టోక్యోలో ట్రేడ్ అయ్యే ఇతర షేర్లకు ఇది లాభాలను పండిస్తోంది. ఆహార భద్రతా కుంభకోణాలతో ముప్పుతిప్పలు పడుతున్న జపాన్ మెక్ డొనాల్డ్ కు, భారీ ఊరట కలిగిస్తోంది. పీకాచు వంటి గేమ్ క్యారెక్టర్లతో హ్యాపీ మీల్స్ ను శుక్రవారం నుంచి మెక్ డొనాల్డ్స్ ఆఫర్ చేస్తోంది. దీంతో కంపెనీ షేర్లు 23శాతం పెరిగాయి. ఈ గేమ్ ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మొదట లాంచ్ చేశారు. వారం నుంచి దాదాపు రెండు డజన్ల దేశాల్లో దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం జపాన్ లో ఈ గేమ్ రిలీజ్ కావాల్సి ఉంది. -
3వ అత్యంత విలువైన కంపెనీగా ఐటీసీ
ముంబై: ఐటీసీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి. -
ద్వితీయశ్రేణి షేర్లవైపు చూడండి
♦ బాగా పెరిగినవాటికి దూరంగా ఉండటం మంచిదే ♦ ఈ సారి మీ వ్యూహం మార్చాల్సి రావచ్చు సాధారణంగా అధిక వృద్ధి అవకాశాలున్న, నాణ్యమైన కంపెనీల షేర్ల కొనుగోలుకే ప్రాధాన్యమిస్తుంటాం. ఈ వ్యూహం ఇప్పటిదాకా సత్ఫలితాలనే ఇచ్చి ఉండవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఇదే వ్యూహం సరి కాకపోవచ్చు. అధిక వృద్ధి కనపర్చిన స్టాక్స్‌లో చాలా మటుకు ప్రస్తుతం అధిక వేల్యుయేషన్లతోనే ఉన్నాయి. ఎంపిక చేసిన 50 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు గత నాలుగేళ్లలో వృద్ధి చెందిన తీరు, వాటి వేల్యుయేషన్లు దీనికి నిదర్శనం. నిఫ్టీతో పోలిస్తే ఈ అధిక వృద్ధి స్టాక్స్ గత నాలుగేళ్లలో గణనీయంగా రాబడులిచ్చాయి. 2010 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి లాభాలు రూ.89,385 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.2,00,088 కోట్లకు చేరాయి. అలాగే వీటి మార్కెట్ క్యాప్ సైతం 33 శాతం వార్షిక ప్రాతిపదికన ఎగిసి రూ.23,86,095 కోట్ల నుంచి ఏకంగా రూ.77,45,173 కోట్లకు చేరింది. పీఈ నిష్పత్తి 26.7 రెట్లు నుంచి 38.7 రెట్లకు చేరింది. మరోవైపు నిఫ్టీ ఆదాయాలు 9 శాతం స్థాయిలోనే ఉన్నాయి. అయితే, ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ల లాభాలు మెరుగుపడే కొద్దీ .. ఇప్పటిదాకా భారీ రాబడులు ఇచ్చిన స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెట్టే వ్యూహం ఆశించిన స్థాయిలో పనితీరు కనపర్చకపోవచ్చు. ఆర్థిక వృద్ధి మళ్లీ కోలుకుంటుందని, కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడుతుందనే రెండే ఆశలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణమవుతున్నాయి. కానీ, కార్పొరేట్ల లాభాలు ఒకవేళ మెరుగుపడితే.. గత నాలుగేళ్లుగా జరగని విధంగా ఆ వృద్ధి అన్ని రంగాల్లోనూ కనిపించాలి. అలాంటప్పుడు.. వృద్ధి కేవలం కొన్నింటికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం అన్నింటింలోనూ ప్రతిఫలించాలి. నిజంగానే అలా జరిగితే.. ప్రస్తుతం వృద్ధి కోసం చెల్లిస్తున్న అధిక ప్రీమియం.. నిజంగానే అధిక రాబడులు అందించగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ తరహా ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్‌లో పెట్టుబడుల వ్యూహం ఎలా పనిచేసే అవకాశాలున్నాయో ఒకసారి చూద్దాం. ఈ కోవకి చెందిన అనేక స్టాక్స్ గత నాలుగేళ్లలో చాలా తక్కువ స్థాయి హెచ్చుతగ్గులనే చూశాయి. కాబట్టి రాబోయే రోజుల్లో.. ముఖ్యంగా ఆర్థిక పలితాల సమయంలో ఇవి భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. మిగతా మార్కెట్‌తో పోలిస్తే ఈ స్టాక్స్ పనితీరు దిగువ స్థాయిలోనే ఉండవచ్చు. అప్పుడు ద్వితీయ శ్రేణి స్టాక్స్ కోలుకుని పరుగు మొదలుపెట్టొచ్చు. నాలుగేళ్లుగా సరైన పనితీరు కనపర్చని ‘నాణ్యమైన, అధిక డివిడెండ్ ఇచ్చే’ స్టాక్స్‌లో పెట్టుబడుల వ్యూహం ఇకపై మెరుగ్గా పనిచేయవచ్చు. ‘నాణ్యమైన, వృద్ధి ఆధారిత’ స్టాక్స్ మన పోర్ట్‌ఫోలియో విలువ తరిగిపోకుండా కొంత మేర కాపాడవచ్చేమో గానీ.. ఎల్లకాలం అత్యధిక రాబడులు ఇస్తాయని చెప్పలేం. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని ముందుకు అడుగేయాలి. -
సుజ్లాన్ షేర్ల కోసం ఓపెన్ ఆఫర్
- ప్రమోటర్ల నుంచి 23 శాతం వాటా కొన్న సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి - మరో 26 శాతం వాటాకు షేరుకు రూ. 18 ధరపై ఆఫర్ - 20 శాతం ఎగసిన షేరు ధర న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తిలో ఉపయోగపడే విండ్ టర్బైన్లు తయారు చేసే సుజ్లాన్ ఎనర్జీ షేర్ల కోసం డీఎస్ఏ(దిలిప్ సంఘ్వి ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్) ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒక్కో షేర్‌ను రూ.18 చొప్పున 26 శాతం వాటాను(157.64 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనున్నామని డీఎస్ఏ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం రూ.2,838 కోట్లు కేటాయించింది. సుజ్లాన్ ఎనర్జీలో 23 శాతం వాటా కొనుగోలు (రూ.1,800 కోట్లతో) కోసం సుజ్లాన్ ఎనర్జీ, సన్ ఫార్మాకు ప్రమోటర్ అయిన దిలిప్ సంఘ్వి, కుటుంబ సభ్యులు(డీఎస్ఏ) మధ్య గత వారంలో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీలో డీఎస్ఏ వాటా 23 శాతంగా, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి కుటుంబానికి 24 శాతం చొప్పున వాటాలుంటాయి. ఒప్పందం ప్రకారం యాజమా న్య నియంత్రణ తంతి కుటుంబానికే ఉంటుంది. వెయ్యి కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్ ఈ పరిణామాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 23 వద్ద ముగిసింది. ఒక్క సోమవారం రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,089 కోట్లు పెరిగి రూ.7,606 కోట్లకు చేరింది. -
మార్కెట్ క్యాప్ పదేళ్లలో పది రెట్లు..!
అంతర్జాతీయంగా భారత్ సరైనస్థాయిని అందుకుంటే వచ్చే 10-15 ఏళ్లలో స్టాక్ మార్కెట్ విలువ పది రెట్లు పెరిగి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ అశీష్ చౌహాన్ అన్నారు. అలా వృద్ధిచెందాలంటే మార్కెట్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులకు వేదికగా మారాల్సిన అవసరం వుందన్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ 1.6 ట్రిలియన్ డాలర్లు (రూ.100 లక్షల కోట్లకుపైగా) ఉంది. మంచి మార్కెట్లలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయంగా 40 ట్రిలియన్ డాలర్ల సంపద వేచిచూస్తున్నదని, అందులో తగిన వాటాను భారత్ పొందడానికి ప్రయత్నించాలని చౌహాన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం భారత్‌లో 2.7 కోట్ల మంది ఇన్వెస్టర్లు వున్నారని, ఈ సంఖ్యను 2030కల్లా 27 కోట్లకు పెంచడానికి చాలా చర్యలు అవసరమన్నారు.