సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్)లో దూసుకుపోతోంది. తాజాగా 3 ట్రిలియన్లు దాటిన 4వ అదానీ గ్రూప్ కంపెనీగా అవతరించింది. మంగళవారం నాటి ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బీఎస్‌ఇలోసెన్సెక్స్‌లో 1 శాతం పెరిగి రూ.2,693.30 వద్ద తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది. గత ఒక్క నెలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ధర 20 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఈ స్టాక్ 52 శాతం పుంజుకోవడం విశేషం.
ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీలలో మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో రూ. 3.07 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో 18వ స్థానంలో నిలిచింది అదానీ ఎంటర్‌ప్రైజెస్ , చూపించింది. ప్రస్తుతం, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ. 3.77 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉంది, అదానీ గ్రీన్ ఎనర్జీ (రూ. 3.62 ట్రిలియన్), అదానీ టోటల్ గ్యాస్ (రూ. 3.54 ట్రిలియన్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రవాణా, లాజిస్టిక్స్ ,ఇంధనం యుటిలిటీ రంగాలలో కొత్త వ్యాపారాలతోపాటు వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులు విమానాశ్రయ నిర్వహణ, రోడ్లు, డేటా సెంటర్, వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ అదానీ బిజినెస్ కేంద్రీకృతమై ఉంది.
కాగా జూన్ 30, 2022 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాల ఆమోదం, డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ఆమోదాలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గురువారం (ఆగస్టు, 4 2022) సమావేశం కానున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం 84 శాతం పెరిగి రూ.25,142 కోట్లు, రూ. 304 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment