company
-
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్‌కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్‌లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్‌లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్‌లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్‌కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్‌ని అందించే స్టడీ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్‌కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి?
సాక్షి, టాస్క్ పోర్సు: ‘మీరు కొత్త యూనిట్లు పెడితే మాకేంటి ఉపయోగం...? స్థానికంగా ఉన్న మా నేతలకు ఏమిటి ప్రయోజనం..?’ అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధి ఒకరు ప్రముఖ కంపెనీ ప్రతినిధులను నిలదీయడంతో వారు కంగుతిన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెక్స్ బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. సుమారు 1,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ కంపెనీ సూళ్లూరుపేటలోని అపాచీకి అనుబంధంగా ఉంది. కంపెనీ పనితీరు బాగుండటంతో యాజమాన్యం అక్కడే రెండవ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కిందట ‘తుడా’ వద్ద అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. పనులన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం కొత్త యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి... పరిశ్రమ యాజమాన్యం నుంచి తనుకు ఎలాంటి పిలుపు రాలేదని ఆగ్రహించారు. ఆ పంచాయతీ సర్పంచ్‌తోపాటు స్థానిక అధికార పార్టీ నాయకులను కంపెనీ వద్దకు పంపి నానాయాగీ చేయించారు. పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమను ఎలా ప్రారంభిస్తారని వాగ్వాదానికి దిగారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వారిని బయటకు వెళ్లాలని రచ్చరచ్చ చేశారు. దీంతో కంపెనీ హెచ్ఆర్ శరవణ్ వారికి నచ్చ చెప్పి తమకు తుడా అనుమతులు ఉన్నాయని, ఒక రోజు సమయం ఇస్తే వాటిని తీసుకువచ్చి పంచాయతీకి అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత యూనిట్‌ను ప్రారంభించుకున్నారు. మీరు పని చేసుకుంటూ వెళితే స్థానిక నాయకుల పరిస్థితి ఏమిటి? అనంతరం అపెక్స్ బూట్ల కంపెనీ ప్రతినిధులు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి వెళ్లి సర్పంచ్, స్థానిక నాయకులు చేసిన గొడవ గురించి వివరించారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్పందిస్తూ... ‘కంపెనీ పెట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏమిటీ..?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విదేశాలకు చెందిన కంపెనీ కావడంతో తాము ఏమి చేయగలమని వారు చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి గట్టిగానే స్పందించినట్లు తెలిసింది. -
చాక్లెట్‌పై ఆ గుర్తులు లేవన్న వ్యక్తి.. పరిహారం చెల్లించిన కంపెనీ
ఏ వస్తువుకైనా దాని బ్రాండ్ గుర్తు చేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులే లేకపోతే.. దానిని ఎవరు తయారు చేసారో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి కంపెనీ తమ వస్తువులకు తప్పకుండా కొన్ని గుర్తులను ముద్రిస్తుంది. ఇటీవల ఒక మార్స్ చాక్లెట్ బార్.. సాధారణ చాక్లెట్ మాదిరిగా కాకుండా, స్మూత్‌గా ఉన్నట్లు ఓ వ్యక్తి కనిపెట్టాడు.బకింగ్‌హామ్ షైర్లోని ఐల్స్బరీకి చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్.. తన ఫేస్బుక్లో స్మూత్ చాక్లెట్ బార్ ఫోటో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది. అంతే కాకుండా దీనిని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా పెంపించాడు. కంపెనీ దీనికి చింతిస్తూ.. క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి పరిహారంగా రూ. 215 చెల్లించింది.నిజానికి సీగర్ స్నేహితులతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఒక క్లాసిక్ కార్ షోకు వెళుతుండగా.. ఆక్స్ఫర్డ్షైర్లోని సర్వీస్ స్టేషన్లో ఆగి చాక్లెట్ బార్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ చాక్లెట్ మీద అలలు లాంటి గుర్తులు ఏమి లేకుండా మృదువుగా కనిపించింది. ఇది అతన్ని చాలా ఆకర్శించింది. దానినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా కంపెనీకి మెయిల్ కూడా చేసాడు.కంపెనీ స్పందించి అతని పరిహారం అందించిన తరువాత, అతడు స్పందిస్తూ.. నేను పరిహారం కోసం కంపెనీకి మెయిల్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్ ఎందుకు తయారు చేసారు? కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇలా చేసాను అని అన్నాడు. అయితే నాకు పరిహారం లభించింది. దీంతో నేను రెండు మార్స్ బార్లు కొనేయొచ్చు అని పేర్కొన్నాడు. -
రాజీనామా అంటూ డ్రామా.. కంపెనీ డబ్బుతో పార్టీ: బాస్ ఏం చేశారంటే?
చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆఫీసులో తాము ఎదుర్కుంటున్న పని ఒత్తిడి, బాస్ టార్చర్ వంటి సమస్యలను గురించి పేర్కొంటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఒక ఉద్యోగి ఆఫీసులో సృష్టించిన అల్లకల్లోలం గురించి.. కంపెనీ ఓనర్ వెల్లడించారు.ఇటీవల ఉద్యోగంలో చేరిన లిలీ అనే 26ఏళ్ల ఉద్యోగి.. ప్రారంభంలో చాలా చురుగ్గా ఉండేది. అయితే కొన్ని సార్లు ఆఫీసులో పాటించాల్సిన నియమాలను పాటించేది కాదు. అయితే ఓ పనిమీద నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో లిలీ ఆఫీసులోని అందరికీ పార్టీ ఇచ్చింది. దీనికోసం కంపెనీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 2000 డాలర్లు (దాదాపు రూ. 1.70 లక్షలు) ఖర్చు చేసింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను, అందుకే అందరికీ ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాను, అందరూ తప్పకుండా రావాలని లిలీ మెయిల్ చేసి.. అందరికీ పార్టీ ఇచ్చిందని ఆ కంపెనీ మహిళా ఓనర్ రెడ్డిట్ వేదికగా వెల్లడించింది.ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని పార్టీ ఇచ్చిన లిలీ.. జాబ్‌కు రిజైన్ చేయలేదు. నేను విదేశాల నుంచి తిరిగి వచ్చాక.. ఆఫీసులో జరిగిన అల్లకల్లోలం గురించి తెలుసుకున్నాను. దీనికి కారణమైన లిలీని పిలిచి.. ఆఫీసులో పార్టీ ఏంటి? దీనికి కంపెనీ డబ్బును ఎందుకు ఉపయోగించావని అడిగాను. దీనికి ఆమె బదులిస్తూ ఇదొక 'సోషల్ ఎక్స్పర్మెంట్' అని చెప్పింది.ఆఫీసులో ఎక్స్పర్మెంట్ ఏమిటి? అని అడిగితే.. నేను రాజీనామా చేసి వెళ్లే సమయంలో పార్టీ ఇస్తే ఎంతమంది వస్తారో అని తెలుసుకోవడానికి అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలతో చిర్రెత్తిపోయిన బాస్.. ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేసింది.నేను లిలీను తొలగించడం కరెక్టేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లను అడిగింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. లిలీపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టమని కొందరు చెబుతున్నారు. ఆమె నమ్మక ద్రోహం చేసిందని మరికొందరు పేర్కొన్నారు. కంపెనీ డబ్బుతో లిలీ ఎంజాయ్ చేసింది.. మీరు కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరో కంపెనీలో అయితే ఆమెపై కఠినమైన చర్యలు తీసుకుని ఉండేవారని ఇంకొందరు పేర్కొన్నారు. -
150 గంటల్లో ఫ్యాక్టరీ భవనం: ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఘనత
భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల సమయంలో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం.మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా లేటెస్ట్ ప్రిఫ్యాబ్రికేషన్ అండ్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తయింది. మొత్తం మీద ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్మాణం పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.150 గంటల సమయంలో ఒక నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈప్యాక్ ప్రిఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. పీఈబీ అనేది నిర్మాణం భవిష్యత్తు. పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన నిర్మాణం పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీష్ విష్ణోయి.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిరంతర అన్వేషణను అభినందించారు. -
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో ఇండిజీన్ కొత్త సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ సైన్సెస్ కమర్షియలైజేషన్ కంపెనీ ఇండిజీన్ తమ అంతర్జాతీయ డెలివరీ కార్యకలాపాలను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించింది.నూతన ఉత్పత్తులను ఆవిష్కరించడం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సంబంధించి ఫార్మా పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సహాయం అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించగలదని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా తమకు 6 హబ్‌లు, 18 కార్యాలయాలు ఉన్నట్లు వివరించింది. -
యూకే కంపెనీ కొనుగోలు చేసిన హైదరాబాద్ సంస్థ
హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.పీఎంసీ గ్రూపు.. తన ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్‌ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్‌సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్పత్తి బలాలను, సునిశిత మెషీనింగ్‌లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివల్ల మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్పత్తుల విస్తృత విభాగాన్ని రూపొందించడానికి సాయపడుతుందని మేము సంతోషిస్తున్నామన్నారు. -
గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్‌లో చేరిన మొదట్లో కేఫ్‌లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.గూగుల్‌లో జాబ్ కోసం..ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్‌ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు. -
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
దయచూపని సీఈఓ.. ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే..
అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగిని కంపెనీ బాస్ తొలగించడమే కాకుండా.. మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా వెల్లడించారు. నేను ఎనిమిది నెలలకు పైగా సంస్థలో పనిచేసాను. కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది. అయితే క్రమంగా పని భారం పెరిగింది. ఒత్తిడి తీవ్రమైంది. ఒక నెల క్రితం ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది. ఆ తరువాత చికెన్‌పాక్స్ సోకింది.అనారోగ్యంతో బాధపడుతున్న నేను మూడు రోజులు సెలవు కావాలని సీఈఓకు మెయిల్ చేశాను. కానీ సీఈఓ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని వెల్లడించారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ చేయలేనని చెప్పాను. ఆరోగ్యం కుదుటపడాలంటే కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి రాజీనామా చేయాలనీ నిర్ణయించున్నాను. ఆ తరువాత నా రాజీనామాను సీఈఓకు అందించాను. ఒక నెల రోజులు ముందుగా రిలీవ్ చేయాలని అభ్యర్థించాను.సీఈఓ నా రాజీనామాను తిరస్కరించమే కాకుండా.. తప్పకుండా కంపెనీలో పనిచేయాలని చెప్పారు. ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో నాకు ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది. ఆ తరువాత మళ్ళీ ఒకసారి నా రాజీనామా గురించి సీఈఓకు గుర్తుచేశాను. అయినా నా మీద సీఈఓ సానుభూతి చూపలేదు. ఆ తరువాత రెండు రోజులు సెలవు తీసుకున్నాను. అయితే నాకు వారు టెర్మినేషన్ ఇమెయిల్‌ను పంపారు.ఇదీ చదవండి: అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..వారు టెర్మినేషన్ ఇమెయిల్ పంపిన తరువాత.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV)లో తప్పుగా రిపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్పీరియన్స్ లెటర్ అడిగితే.. మూడు నెలల జీతం డిమాండ్ చేశారని, ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగారు. దీనికి చాలామంది స్పందిస్తూ మంచి న్యాయవాదిని సంప్రదించాలని, కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని తమదైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఉన్నారు. -
దివాలా అంచున దిగ్గజ కంపెనీ!
గృహోపకరణాలు, ఆహార నిల్వ కోసం ఉపయోగించే వస్తువులను విక్రయించే అమెరికన్ కంపెనీ 'టప్పర్‌వేర్' (Tupperware) దివాలా అంచున ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్లాసిక్ బాక్సుల తయారీలో విప్లవం సృష్టించిన కంపెనీ నేడు కష్టకాలంలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.ఈ విషయం తెలిసిన తరువాత న్యూయార్క్‌లో మధ్యాహ్నం కంపెనీ షేర్లు 50 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 1946లో రసాయన శాస్త్రవేత్త ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా మంచి అమ్మకాలను పొందిన ఈ సంస్థ అమ్మకాలు 2024 త్రైమాసికంలో క్షీణించాయి.టప్పర్‌వేర్ దాని రుణ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత కోర్టు రక్షణలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అంతే కాకుండా 700 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణాలను ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుగత కొంత కాలం నుంచి ఆశించిన స్థాయిలో అమ్మకాలతో ముందుకు సాగకపోవడంతో.. కంపెనీ ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని జూన్‌లో 150 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతే కాకుండా కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిగ్యుల్ ఫెర్నాండెజ్, పలువురు బోర్డు సభ్యులను భర్తీ చేసింది. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి. దివాళాకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు. -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా?
రోజూ కనీసం అర్థగంట సేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఖర్చులేనిది. అనువైంది కూడా క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చు. సాధారణంగా, గుంపులుగా, జంటలుగా, స్నేహితులతో వాకింగ్ చేస్తూ ఉండటం, పార్కింగ్ల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం. అయితే వాకింగ్ ఎలా చేయాలి. ఎపుడు చేయాలి? ఒంటరిగాచేయాలా? లేక తోడు ఉంటే మంచిదా? ఇలాంటి విషయాల గురించి ఎపుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి!ఏ సమయంలో చేయాలి? వ్యాయామం ఎపుడు చేసినా దాని ప్రయోజనాలు దానికుంటాయి. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిదని చెబుతారు. ఉదయం ట్రాఫిక్ బెడద ఉండదు, కాలుష్యం తక్కువ. వీటిన్నింటికంటే ఉదయం వాతావరణం ప్రశాంగంగా ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలు, శరీరానికి, మనసుకు ఉత్తేజానిస్తాయి.రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున రోజులో గంట చేసినట్టువుతుంది. వాకింగ్‌ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. అటవాటైన కొద్దీ క్రమంగా వేగం పెంచాలి. షుగర్ పేషెంట్లే, గుండె జబ్బులున్నవారు ఏదైనా కాస్త తిన్నాక చేయడం మంచిది. వాకింగ్ కోసం సౌకర్యవంతంగా ఉండే షూస్ ధరించడం, పార్క్‌ల్లో కాకుండా ఆరుబయట నడిచే వారు కుక్కల నుంచి తప్పించుకునేందుకు చేతి కర్ర ఉంటే మంచిది.ఒంటరిగా చేయాలా? తోడు ఉండాలా?ఒంటరిగా నడవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది, నడకచురుగ్గా ఉంటుందిమాట్లాడుకుంటూ నడిస్తే తొందరంగా ఆయాసం వస్తుంది. ఏకాగ్రత ఉండదు. ఏదైనా వ్యాయామంద్వారా ప్రయోజనం పొందాలంటే కాన్సెంట్రేషన్ ముఖ్యం. ఇద్దరు లేదా ముగ్గురుఉంటే ఇది సాధ్యపడకపోవచ్చు. సరైన వేగంతో నడిస్తేనే ఫలితం బావుంటుంది. కనుక ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఒంటరిగా నడవడం ఉత్తమ మార్గం.అయితే భర్త లేదా భార్యతోనో, స్నేహితులతోనో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. ఎలా అంటే..పార్టనర్ ఉంటే నడక బోర్ కొట్టదు. ఉత్సాహంగా ఉంటుంది. జంటగా అయితే మీ వేగాన్ని అందుకోగల వారైతే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. పోటీ తత్వం ఉంటుంది.వృద్ధులు తమతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు మరింత సురక్షితంగా భావిస్తారు. పెద్దవాళ్లు గుంపులుగా నడవడం ఖచ్చితంగా సురక్షితం.వాకింగ్ ఎపుడు, ఎలా అనేది మనకున్న వెసులుబాటు, మనం అనుకున్న లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో చేసినపుడు మాత్రమే చక్కటి ఫలితం లభిస్తుంది.ఇదీ చదవండి: గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో! -
హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ. 700 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగుచూసింది. రూ.700 కోట్ల రూపాయలు కాజేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. DKZ టెక్నాలజీస్ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపి పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది.మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉండగా.. హైదారాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో మీడియాకు తమ గోడు వెల్లబుచ్చేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వందలాది బాధితులు చేరుకుంటున్నారు.కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్లో డబ్బులు జమ చేశారు కేటుగాళ్లు.సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. -
బెంగళూరు కంపెనీలో ఉద్యోగాల కోత.. ఇక మిగిలింది 50 మందే!
బెంగళూరు ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీ సంస్థ డంజో (Dunzo) భారీగా ఉద్యోగాల కోత విధించింది. రిలయన్స్ మద్దతు ఉన్న ఈ సంస్థ తమ వర్క్‌ఫోర్స్‌లో 75% మందిని తొలగించిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రధాన సరఫరా, మార్కెట్‌ప్లేస్ టీమ్‌లలో ఇక మిగిలింది కేవలం 50 మంది ఉద్యోగులేనని నివేదిక తెలిపింది.ఖర్చుల నియంత్రణ, పెరిగిపోతున్న అప్పులు, ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిలు, విక్రేత చెల్లింపుల సమస్యలతో పాటు నగదు లభ్యతను పెంచుకోవడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఉద్యోగాల కోతకు పూనుకున్నట్లు తెలుస్తోంది. డంజో ఆగస్టు 31న ఉద్యోగాల కోత విధించినట్లు తొలగింపులకు సంబంధించిన ఆన్లైన్ ట్రాకర్ లేఆఫ్స్.ఫై (Layoffs.fyi) పేర్కొంది.ఉద్యోగులకు ఈ-మెయిల్స్తొలగింపుల గురించి తెలియజేస్తూ తమ ఉద్యోగులకు డంజో ఈ-మెయిల్స్ పంపింది. నివేదిక ప్రకారం.. అవసరమైన నిధులను పొందిన వెంటనే బాధిత సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు, సీవెరెన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిలు చెల్లిస్తామని లేఖలో డంజో హామీ ఇచ్చింది. ఒకప్పుడు 775 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీ, ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటూ కష్టపడుతోంది. కొత్త ఇన్వెస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ,రుణాల మిశ్రమం ద్వారా 22-25 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు దాదాపు దగ్గరికి వచ్చినట్లు ఈ ఏడాది మేలో వార్తలు వచ్చాయి. డీల్ ముగింపు దశలో ఉందని, 10-15 రోజులలోపు బకాయిలను చెల్లించేస్తామని గత జూలై మధ్యలో ఉద్యోగులకు తెలియజేసింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. -
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
ఈ అమ్మాయి జీనియస్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ
సాధారణంగా 16 ఏళ్ల వయస్సులో పిల్లలు పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఏం చదవాలో నిర్ణయించుకునే పరిస్థితిల ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు.. అప్పటికే కోట్లాది రూపాయల కంపెనీని స్థాపించింది. చిన్న వయసులోనూ అద్భుత విజయాలు సాధించవచ్చిన నిరూపించింది. స్ఫూర్తిదాయకమైన ఆ జీనియస్ అమ్మాయి విజయగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ప్రాంజలి అవస్తీ అమెరికాలో ఉంటుంది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఙానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె 16 సంవత్సరాల వయస్సులోనే 2022లో తన ఏఐ స్టార్టప్, డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI)ని స్థాపించింది. ఆమె వినూత్న ఆలోచనలు, అంకితభావం తన స్టార్టప్‌ను అతి తక్కువ సమయంలోనే అస్థిరమైన ఎత్తులకు చేర్చాయి. ప్రస్తుత దీని విలువ రూ. 100 కోట్లు.రెండేళ్లు కంప్యూటర్ సైన్స్, గణితాన్ని అభ్యసించిన తరువాత, అవస్తి 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మనసులో డెల్వ్ డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది. మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది. అనేక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ కీలకమని గ్రహించింది.డెల్వ్ డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్ట్రాక్షన్ మెరుగుపరచడం, డేటా సిలోస్‌ను తొలగించడం చేస్తుంది. ఆన్లైన్ కంటెంట్ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చర్లకు సహాయం చేస్తుంది. గతేడాది ప్రాంజలి స్టార్టప్‌కు రూ.3.7 కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. 10 మంది ఉద్యోగులు దాకా ఇక్కడ పనిచేస్తున్నారు. -
అమీర్‌పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్‌పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్‌పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్‌కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్‌పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా సంస్థలో ఈ రాశి వారికి ఉద్యోగం లేదు! చైనా కంపెనీ ప్రకటన
చైనాలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే కాకుండా.. రంగులు, తేదీలు ఇతరత్రా అన్నింటికీ ఇక్కడి ప్రజలు జాతకాలను విశ్వసిస్తారు. ఆఖరికి ఉద్యోగాల్లో చేరాలంటే కూడా రాశి చక్రం తప్పనిసరి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇటీవల దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని 'శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్' అనే సంస్థ ఓ ప్రకటన చేసింది. డాగ్ సంవత్సరంలో (చైనా జాతక చక్రంలోని ఓ సంవత్సరం) జన్మించినవారు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు, అలాంటి వారు ఉద్యోగానికి అప్లై చేసుకోవద్దు అని స్పష్టంగా వెల్లడించారు. ఇది చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటంటే.. కుక్క రాశిచక్రం కింద జన్మించిన వారు డ్రాగన్ సంస్థ అధిపతి దురదృష్టానికి మూలం కావొచ్చని భావిస్తారు. డ్రాగన్ & కుక్కల మధ్య 12 సంవత్సరాల రాశిచక్ర చక్రంలో వైరుధ్యం చైనీస్ జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్నారు. ఈ కారణంగానే శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే చైనాలో మూఢనమ్మకాలను ఎంతగా విశ్వసిస్తారో స్పష్టంగా అర్థమవుతోంది. డ్రాగన్‌లో నీటి మూలకం ఉందని, కుక్కలో అగ్ని మూలకం ఉందని జ్యోతిష్యులు చెబుతారు. -
జాతకాలు చూసి ఉద్యోగాలిస్తున్న కంపెనీ!
చైనాలో మూఢనమ్మకాల పిచ్చి ముదిరింది. మూఢనమ్మకం చైనీస్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి, కార్పొరేట్ ప్రపంచంలోకి కూడా విస్తరించింది. ఇప్పటికీ కొన్ని వ్యాపార నిర్ణయాలు మూఢనమ్మకాల ఆధారంగానే తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. అదృష్ట సంఖ్యలు, రంగులు, తేదీల వరకు ఫెంగ్ షుయ్ సంప్రదాయాలను కార్పొరేట్ నిర్ణయాలలో పాటిస్తున్నారు.అయితే మూఢనమ్మకానికి పరాకాష్ట అనిపించేలా ఓ కంపెనీ అవలంభించిన అసాధారణ నియామక విధానం తాజాగా చర్చకు వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే సంస్థ ‘డాగ్’ సంవత్సరంలో జన్మించిన అభ్యర్థులను తమ కంపెనీలో ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోకుండా నిషేధించింది.3,000 నుంచి 4,000 యువాన్లు (సుమారు రూ. 35,140 నుంచి రూ. 46,853) నెలవారీ జీతం అందించే క్లర్క్ ఉద్యోగానికి శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. అయితే డాగ్ రాశిచక్రంలో జన్మించినవారు మాత్రం ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవద్దంటూ కోరింది.ఈ వ్యవహారం చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న వారి కారణం ఏమిటంటే, డాగ్ రాశిచక్రంలో జన్మించిన వారు డ్రాగన్ రాశిచక్రంలో పుట్టిన సంస్థ అధిపతికి దురదృష్టానికి కారణం కావచ్చు. చైనీస్ జ్యోతిషశాస్త్రంలో డ్రాగన్, డాగ్ రాశిచక్రాల మధ్య 12 సంవత్సరాల వైరుధ్యం ఉంది. -
ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్ తెలిస్తే..
దేశ వజ్రాల పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో దని పేర్కొంటూ సూరత్‌కు చెందిన ఒక ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజులపాటు 'సెలవు' ప్రకటించింది.ప్రపంచంలో అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారైన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆగస్టు 17 నుంచి 27 వరకు 10 రోజులు 'సెలవు' ప్రకటించింది. "మా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించాం. దీని కోసం కొంత మొత్తం కోత విధించినప్పటికీ, ఉద్యోగులందరికీ ఈ కాలానికి జీతం చెల్లిస్తాం. మాంద్యం కారణంగా ఈ సెలవులను ప్రకటించవలసి వచ్చింది'' అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభాయ్ లఖానీ వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.ప్రపంచంలోని దాదాపు 90 శాతం వజ్రాలను ప్రాసెస్ చేసే స్థానిక వజ్రాల పరిశ్రమను మాంద్యం దెబ్బతీసిందన్న లఖానీ అభిప్రాయాలతో సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ ఏకీభవించారు. "కిరణ్ జెమ్స్ ఇలా సెలవు ప్రకటించడం (ఉద్యోగులకు) ఇదే మొదటిసారి. ఇంతవరకు మరే ఇతర సంస్థ కూడా ఇటువంటి చర్య తీసుకోనప్పటికీ, మాంద్యం పాలిష్ చేసిన వజ్రాల అమ్మకాలను తగ్గించింది" అని ఖుంట్ అన్నారు.పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికం ఎగుమతి చేస్తున్నందున అంతర్జాతీయ కారకాలు వజ్రాల అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలను కొన్ని కారకాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కారకాలతో 2022లో దాదాపు రూ. 2,25,000 కోట్లున్న వజ్రాల పరిశ్రమ టర్నోవర్ నేడు రూ. 1,50,000 కోట్లకు తగ్గిందన్నారు. సూరత్‌లో దాదాపు 4,000 డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.