ఉద్యోగులు సమయాన్ని కచ్చతంగా పాటించాలనే ఉద్దేశంతో ఒక బ్యూటీ కంపెనీ బాస్ కఠినమైన నియమం తీసుకొచ్చాడు. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులెవరైనా రూ. 200 ఫైన్ చెల్లించాల్సిందే అంటూ రూల్ పెట్టాడు. అది తిరిగి తిరిగి బాస్‌కే చుట్టుకుంది. దీంతో ఆయన ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్‌గా మారింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.
ముంబైలోని ఈవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఉద్యోగులకు సమయానికి రావాలని రూల్ విధించాడు. కంపెనీ ఉత్పాదక పెరగాలని, క్రమశిక్షణ అండాలంటూ ఉద్యోగులు ఉదయం 9:30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆలస్యంగా వచ్చిన వారికి రూ. 200 జరిమానా విధించారు. ఈ రూల్ అలా పెట్టాడో లేదో ఆయనే అయిదుసార్లు లేట్ వచ్చినందుకు స్వయంగా షా వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్ చేశాడు.
ఈ రూల్‌తో తనకే ఎదురుదెబ్బ తగిలిందని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగేవిష సంస్కృతి అని కొందరు, “ఉద్యోగులందరికీ మీకున్నంత జీతం ఉందా?, మరి ఎక్కువ పనిగంటలకి అదనంగా చెల్లిస్తున్నారా?. ఇలా రక రకాల కమెంట్స్ వచ్చాయి. ‘‘ఇది చాలా దారుణం. మీ నుండి ఇది ఊహించలేదు బ్రో రూ. 200 కోసం వారు తొందరపడితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగదే ఎలా?’’ అంటూ మరికొందరు ఇంకొంచె ఘాటుగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన పోస్ట్‌కు వచ్చిన స్పందన నేపథ్యంలో షా, తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాడు.
ఇదీ సంగతి!
తన పోస్ట్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని షా కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశాడు. కంపెనీ ఒక రూల్ పెట్టినపుడు, ఫౌండర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి దాకా అన్ని స్థాయిల్లో అందరూ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాలనే సూత్రాన్ని నొక్కిచెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నాడు.
అంతేకాదు లేటు ఫీజు ద్వారా సేకరించిన డబ్బును తన సొంత యూపీఐ వాలెట్‌కు చెల్లించడం గురించి కూడా వివరణ ఇచ్చాడు. దీన్ని ప్రత్యేక టీమ్ ఫండ్‌గా చేసి టీమ్ ఈవెంట్‌లకు, లంచ్‌కు ఉపయోగిస్తామని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment