late
-
11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
న్యూఢిల్లీ: ఉత్తరాదిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పొగమంచు ప్రధాన కారణంగా నిలిచింది. తాజాగా భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 11 గంటలు ఆలస్యమైంది. ఇలా రైలు ఆలస్యంగా నడవడానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి సాంకేతిక లోపం కారణంగా సుమారు 11 గంటల ఆలస్యంగా బయలుదేరింది.ఈ రైలు సాధారణంగా రాణి కమలాపతి స్టేషన్ నుండి ఉదయం 5.40 గంటలకు బయలుదేరుతుంది. అయితే సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు రైలు పట్టాలపై నిరసన తెలిపారు. రైలు ఆలస్యం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.ఈ సెమీ-హై స్పీడ్ రైలు ఉదయం నిర్ణీత సమయానికి బదులుగా సాయంత్రం గమ్యస్థానానికి చేరేందుకు బయలుదేరిందని పశ్చిమ మధ్య రైల్వే తాత్కాలిక ప్రజా సంబంధాల అధికారి (భోపాల్ డివిజన్) నావల్ అగర్వాల్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల రైలు ఆలస్యమైందన్నారు. అయితే రైలు సంబంధిత యాప్‌లతో సహా పలు మార్గాల ద్వారా ఆలస్యంపై ప్రయాణికులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు.ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు బయలుదేరాల్సిన రైలు రాకపోవడంతో రాణి కమలపాటి స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు నిరసన తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో కొంతమంది ప్రయాణికులు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (న్యూఢిల్లీకి వెళ్లేది)లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు బ్యాగులు పట్టుకుని పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. ఆదివారం రాత్రి 10.20 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి రాణి కమలాపతి స్టేషన్‌కు రావాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20172)లో సాంకేతిక లోపం తలెత్తిందని, సీ11 కోచ్ స్ప్రింగ్ పాడైందని అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం రైలును యార్డుకు తరలించామని, అయితే లోపాన్ని సకాలంలో సరిదిద్దలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున రైలు బయలుదేరలేదన్నారు.ఇది కూడా చదవండి: దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా -
పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఉత్తరాదిని పొగమంచు కమ్ముకుంటోంది. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటానికి తోడు ఇతరత్రా కారణాలతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.రైళ్ల రాకపోకల్లో ఆలస్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలు ఫిర్యాదులు చేస్తున్నారు. రైలు నంబర్ 06071 కొచ్చువేలి నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 గంటల 47 నిమిషాలు ఆలస్యంగా నడిచి, నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటలకు చేరుకుంది. ఇదే మాదిరిగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Gede(3.50)-Sealdah (6.25) . Delay by more than 1 hours, I am going to give blood to a patient, in Kolkata, he needs blood before 8 am, I don't know how to reach before 8 am. Why was no notice given in advance of the train delay?? @drmsdah @RailMinIndia @AshwiniVaishnaw sir. pic.twitter.com/B4hSZUEhC3— Suranjan Paul (@suranjanPaul23) November 18, 2024సురంజన్ పాల్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ‘నేను ప్రయాణించాల్సిన రైలు గంటకు మించిన ఆలస్యంతో సడుస్తోంది. నేను కోల్‌కతాలో ఉన్న ఒక రోగికి రక్తం ఇవ్వాల్సివుంది. అతనికి ఉదయం 8 గంటలలోపు రక్తం ఇవ్వాలి. ఈ లోపున నేను అక్కడికి ఎలా చేరుకోవాలో నాకు తెలియడంలేదు. రైలు ఆలస్యం గురించి ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని’ ప్రశ్నించారు. Train number - 02569. This train is 7 hour late. Passengers are facing problems due to train delay. Children and elderly are very worried. I might miss office tomorrow too. #trainlate @RailMinIndia @AshwiniVaishnaw @PMOIndia— Alok Kumar Thakur (@aalokthakur) November 17, 2024మరొక ప్రయాణికుడు ‘రైలు నంబర్ - 02569.. ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేను. రేపు ఆఫీసుకి తప్పకుండా వెళ్లాలి’ అని రాశాడు. అంజలి ఝా అనే ప్రయాణికురాలు 23:55కి చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, రన్నింగ్ స్టేటస్ కొద్ది నిమిషాల క్రితమే నవీకరించారని తెలిపారు. నాకు 23:44కి ఈ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల పాటు ఎలా వేచి ఉండాలి’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
‘ఇంకో నెల తర్వాతే మాకు దీపావళి’
దేశం మొత్తం దీపావళి సంబురాల్లో మునిగిపోయింది. పెద్దలు పిల్లలతో చేరి సరదాగా బాణాసంచాలు కాలుస్తూ అల్లరి చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లకు పని చెప్తూ.. కోట్ల మంది సోషల్ మీడియాలో ‘ఫెస్టివ్ వైబ్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాకపోతే ఈ పండుగను మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నెల తర్వాతే.. అదీ కాస్త భిన్నంగా జరుపుకుంటారు.దీపావళి అంటే పూలు.. వాటి మధ్య ప్రమిధలు.. బాణాసంచాల మోత.. స్వీ ట్లు కచ్చితంగా ఉండాలి. కానీ, దీపావళి పండుగ జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో బుద్ధి దీపావళి budhi diwali చేస్తారు. ఇది మామూలు దీపావళిలాగా ఉండదు. పెద్ద తాడుతో మానవ హారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు చేస్తారు. వీధుల్లో వాయిద్యాలు వాయిస్తూ.. తిరుగుతారు. రాత్రి కాగానే పెద్ద కాగడాలకు మంటలు అంటించి.. జానపద పాటలతో చిందులేస్తారు. ప్రత్యేక పిండి వంటలను తోటి వాళ్లతో పంచుకుంటారు. అయితే ఈ కోలాహలంలో బయటివాళ్లకు అనుమతి ఉండదు.ఆడామగా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇంతకు ముందు.. జంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే న్యాయ స్థానాల జోక్యంతో ఆ ఆచారానికి బ్రేకులు పడ్డాయి. గతంలో కొందరు మద్యం సేవించి ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు దానికి దూరంగానే ఉంటున్నారు వాళ్లు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. ఆ సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట. అప్పటి నుంచి తరతరాలుగా ఆలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని జరుపుకుంటున్నారు. నెల తర్వాత.. మార్గశిర అమవాస్య సమయంలో మూడు నుంచి వారం బుద్ధి దీపావళి వేడుక ఘనంగా జరుగుతుంది. అయితే రాక్షస సంహారం వల్లే తాము ఈ సంబురం చేసుకుంటున్నామని.. వ్యవసాయంతో తీరిక లేకుండా దీపావళికి దూరమైన తమ కోసమే బుద్ధి దీపావళి పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, షిమ్లా, సిర్మౌర్ జిల్లాలో, ఉత్తరాఖండ్ జౌన్సర్ రీజియన్‌లోని కొన్ని చోట్ల బుద్ధి దీపావళి తరతరాలుగా వేడుకగా జరుగుతోంది. కొందరు దీపావళితో పాటు బుద్ధి దీపావళిని జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి. అలాగే బుద్ధి దీపావళి ద్వారా తాము వెలిగించిన కాగడాల వెలుతురులో దుష్ట శక్తుల్ని పారదోలడంతో పాటు.. తమకు మంచి బుద్ధి ప్రసాదించమని దేవుళ్లను అక్కడి ప్రజలు వేడుకుంటారు. -
ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్‌కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్‌ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
వందే భారత్ రీషెడ్యూల్.. నాలుగు గంటల ఆలస్యం!
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ట్రైన్ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకోనుంది.Train RescheduleTrain No.20833 Visakhapatnam - Secunderabad Vande Bharat express is rescheduled to leave at *10:00 hrs* on 23.06.2024 instead of its scheduled departure at 05:45 hrs. (Rescheduled by 4 hrs 15 Minutes) @RailMinIndia@EastCoastRail@SCRailwayIndia @drmvijayawada pic.twitter.com/fJjRmKUV5z— DRMWALTAIR (@DRMWaltairECoR) June 21, 2024 అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్‌ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది. -
ఉద్యోగులు లేట్‌గా వస్తే ఫైన్ : పాపం బాస్కే చుట్టుకుంది! ట్విస్ట్ ఏంటంటే!
ఉద్యోగులు సమయాన్ని కచ్చతంగా పాటించాలనే ఉద్దేశంతో ఒక బ్యూటీ కంపెనీ బాస్ కఠినమైన నియమం తీసుకొచ్చాడు. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులెవరైనా రూ. 200 ఫైన్ చెల్లించాల్సిందే అంటూ రూల్ పెట్టాడు. అది తిరిగి తిరిగి బాస్కే చుట్టుకుంది. దీంతో ఆయన ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్‌గా మారింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. ముంబైలోని ఈవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఉద్యోగులకు సమయానికి రావాలని రూల్ విధించాడు. కంపెనీ ఉత్పాదక పెరగాలని, క్రమశిక్షణ అండాలంటూ ఉద్యోగులు ఉదయం 9:30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆలస్యంగా వచ్చిన వారికి రూ. 200 జరిమానా విధించారు. ఈ రూల్ అలా పెట్టాడో లేదో ఆయనే అయిదుసార్లు లేట్ వచ్చినందుకు స్వయంగా షా వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ రూల్‌తో తనకే ఎదురుదెబ్బ తగిలిందని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగేవిష సంస్కృతి అని కొందరు, “ఉద్యోగులందరికీ మీకున్నంత జీతం ఉందా?, మరి ఎక్కువ పనిగంటలకి అదనంగా చెల్లిస్తున్నారా?. ఇలా రక రకాల కమెంట్స్ వచ్చాయి. ‘‘ఇది చాలా దారుణం. మీ నుండి ఇది ఊహించలేదు బ్రో రూ. 200 కోసం వారు తొందరపడితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగదే ఎలా?’’ అంటూ మరికొందరు ఇంకొంచె ఘాటుగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. తన పోస్ట్‌కు వచ్చిన స్పందన నేపథ్యంలో షా, తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాడు.ఇదీ సంగతి!తన పోస్ట్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని షా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేశాడు. కంపెనీ ఒక రూల్ పెట్టినపుడు, ఫౌండర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి దాకా అన్ని స్థాయిల్లో అందరూ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాలనే సూత్రాన్ని నొక్కిచెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నాడు. అంతేకాదు లేటు ఫీజు ద్వారా సేకరించిన డబ్బును తన సొంత యూపీఐ వాలెట్‌కు చెల్లించడం గురించి కూడా వివరణ ఇచ్చాడు. దీన్ని ప్రత్యేక టీమ్ ఫండ్‌గా చేసి టీమ్ ఈవెంట్లకు, లంచ్‌కు ఉపయోగిస్తామని వెల్లడించాడు. -
లేటుగా వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
ఢిల్లీ: కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి అనుగుణమైన ఆదేశాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందాయి. కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)లో హాజరు నమోదు చేయకపోవడం, మరికొందరు ఉద్యోగులు నిత్యం ఆఫీసుకు ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీనిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వ ఈ విధమైన ఆదేశాలు జారీచేసింది.సిబ్బంది మంత్రిత్వ శాఖ తాజాగా మొబైల్ ఫోన్ ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను ఉపయోగించాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఏఈబీఏఎస్ అమలు తీరును సమీక్షించిన ప్రభుత్వానికి దీని అమలులో అలసత్వం కనిపించింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది హాజరు నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ణయించింది. కొందరు ఉద్యోగులకు కార్యాలయానికి ఆలస్యంగా రావడం, త్వరగా బయలుదేరడం అలవాటుగా మారిందని, దీనిని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది.ఈ నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అప్పుడే ఏఈబీఏఎస్‌లో రిజిస్టర్డ్, యాక్టివ్ ఉద్యోగుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, డిఫాల్టర్లను గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయానికి సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వస్తే, దానిని హాఫ్-డే క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని సూచించింది. నెలలో ఒకటి లేదా రెండుసార్లు, న్యాయమైన కారణాలతో ఆలస్యంగా కార్యాలయానికి ఎవరైనా సిబ్బంది వస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. -
‘క్షమించు నాన్నా..’ ఆదిలాబాద్‌లో విషాద ఘటన
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల వేళ.. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా..’’ అని నోట్లో ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం నిబంధన వల్లే.. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్షకు వెళ్లాడు శివ. అయితే.. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించరాదనే నిబంధన ఉందని అధికారులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శివ అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మనోవేదనతో.. తండ్రికి లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్టపడి చదివి.. ఆందోళనగా పరీక్షకు వెళ్లిన కొడుకు శవమై తిరిగొచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డబుల్ కల నెరవేరేది ఎప్పుడు..?
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ వస్తే మరింత జాప్యం అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 360 నిర్మాణాలు పూర్తి.. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 5 వేల దరఖాస్తులు.. ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు. మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు. -
మొదటి భార్య గురించి సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర విషయాలు..
బెంగళూరు: న్యాయవాద వృత్తిలో సవాళ్లపై ప్రసంగంలో సీజేఐ డీవే చంద్రచూడ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. లాయర్ వృత్తికి సమయం గురించి చెప్పే క్రమంలో చనిపోయిన తన మొదటి భార్య గురించిన విషయాలను వెల్లడించారు. ఉపన్యాసంలో భాగం కాకపోయినప్పటికీ బుక్ నాలెడ్జ్ కంటే తన వ్యక్తిగత అనుభవ పాఠాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో 31వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 'చనిపోయిన నా మొదటి భార్య లాయర్‌గా పనిచేశారు. వృత్తి జీవితంలో ఓ న్యాయవాద సంస్థకు వెళ్లినప్పుడు ఆమె పని గంటల గురించి అడిగారు. అందుకు వారు ఆమెకు 365 రోజులు 24x7 అని సమాధానమిచ్చారు. కుటుంబానికి సమయం లేదని చెప్పారు. భార్యాపిల్లలు ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినప్పుడు.. ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోండని చెప్పారు' అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని తెలిపారు. నేడు మహిళా క్లర్కులు బుుతుసమస్యల సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలుగుతున్నారని చెప్పారు. సమాన అవకాశాలు ఉన్నచోట అన్ని అవసరాలను బహిరంగంగా అడగగలిగే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు డిక్షనరీని కూడా మార్చినట్లు చెప్పారు. వేశ్య, పతిత, హౌజ్‌వైఫ్ వంటి పదాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతను సాధించే దిశగా సీజేఐ చంద్రచూడ్ ఎన్నో తీర్పులను ఇచ్చారు. ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్, శబరిమలకు మహిళల ప్రవేశంతో పాటు అబార్షన్ చట్టాలను కూడా చక్కదిద్దారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారణలు జరుపుతోంది. ఇదీ చదవండి: అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది? -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్‌లో 2, వరంగల్‌లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను ఏ–4 సైజు పేపర్‌పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!
కొందరూ ఎక్కడకి వెళ్లలన్నా.. 'లేటే'. టైంకి రావడం అన్నది వారి డిక్షనరీలోనే లేదు అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక వాళ్లకి లేట్ కామర్స్ అనే ముద్ర కూడా ఉంటుంది. పాపం వాళ్లు రావాలనుకున్నా.. రాలేరు. ఎందువల్లో గానీ వాళ్లకు తెలియకుండానే 'ఆలస్యం' అనేది వారి వెనుకే ఉందన్నట్లు ఉంటుంది వారి స్థితి. చూసేవాళ్లకు కూడా వాళ్లకి ఏమైనా జబ్బా? ఎందికిలా ప్రతిసారి లేటు అని విసుక్కుంటారు. అసలు ఇదేమైన వ్యాధా? మరేదైనానా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..ఇలాంటి స్థితిని 'సమయ అంధత్వం' అంటున్నారు. దీన్ని సమయపాలన లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు. అంతేగాదు దీన్ని వైద్య పరిభాషలో 'శ్రద్ధ లేకపోవడం' లేదా 'హైపర్ యాక్టివిటీ' డిజార్డర్‌గా పేర్కొన్నారు. ఒకరకంగా మానసిక ఆరోగ్య సమస్యలాంటిదేనని చెబుతున్నారు. వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం, దీనికి శ్రద్ధ అనేది అస్సలు ఉండకపోవడం కారణంగానే వాళ్లు ఇలా దేనికైనా..లేటుగానే వస్తారని అన్నారు. ఆఫీస్ దగ్గర నుంచి వారు నిత్యం చేసే ప్రతిపనికి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగానే వెళ్తుంటారని పేర్కొన్నారు. దీంతో వీరు తరుచుగా వ్యక్తుల నిర్లక్ష్యానికి గురవ్వుతారు. స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇంటా, బయట వీరికి గౌరవం అనేదే ఉండదు. పాపం దీంతో వారు కూడా కాస్త అసహనానికి గురవ్వుతారు. అందుకోసం అని ఎంతలా ప్రయత్నించినా..చివరికి ఆలస్యమే అవ్వుతుంది. ఇలాంటి వ్యక్తులను ముందుగా 'లేటు' అనే పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి. అన్నిట్లకంటే ముందు ఆరోగ్య పరంగా హెల్తీగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ అవ్వాలి. ఇందకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవడం, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్లోని రిమైండర్స్‌లో పొందుపరుచుకోవాలి. రోజు ఉదయం లేవగానే చేయాల్సినవి ఆ బుక్‌లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి. యోగా వంటి వాటితో మనసుని ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఏ పని పెండింగ్‌లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించొచ్చు. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని, వాటిని వైద్యుని పర్యవేక్షలో..వారి సలహాలు సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్! అదోక మానసిక సమస్య) -
ఇంకా 23 శాతం రైళ్లు ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రైల్వేను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ.. కొన్ని రైళ్లు సకాలంలో గమ్యం చేరే విషయంలో మాత్రం మరింత దృస్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్ప టికీ ఇంకా 23 శాతంమేర రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. అయితే, గతంలో ఈ శాతం ఎక్కు వగా ఉండగా, ఇప్పుడు వీలైనంతమేర తగ్గించటంలో రైల్వే శాఖ విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు 76 శాతం రైళ్లు సకాలంలో గమ్యం చేరుతుండటమే దీనికి తార్కాణం. తాజాగా ఎన్ని రైళ్లు సకాలంలో చేరుతున్నాయి, ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న విషయంలో దేశవ్యాప్త వివరాలను రైల్వే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ కోరిన సమాచారాన్ని రైల్వే తాజాగా అందజేసింది. ఆ వివరాల ప్రకారం.. 2016 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా రాజధాని, దురొంతో, శతాబ్ది, జనశ తాబ్ది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు.. ఇలా కేటగిరీలు కలిపి 7689535 సర్వీసులు ఉండగా, 58,59,631 రైళ్లు సకాలంలో గమ్యం చేరాయి. 18,29,904 రైళ్లు మాత్రం ఆలస్యంగా గమ్యం చేరాయి. ప్యాసింజర్ రైళ్లే ఆలస్యం పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లలో 25.76 శాతం జాప్యం నమోదు కాగా, ధనికులు ఎక్కువగా ప్రయాణించే శతాబ్ది రైళ్లలో అతి తక్కువగా 12.45 శాతం మాత్రమే జాప్యం నమోదైంది. విచిత్రమేంటంటే రైల్వే శాఖ ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజధాని సర్వీసుల్లో కూడా 25.65 శాతం జాప్యం నమోదైంది. దురొంతోలో 28.10 శాతం , జన శతాబ్దిలో 14.74 శాతం, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 19.05 శాతం మేర ఆలస్యంగా నడిచాయి. -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
దారుణం: భార్య ప్రాణం తీసిన సలాడ్..
లక్నో: భోజనంలో సలాడ్ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్ జలాల్పూర్లో చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళి (45), సుదేశ్ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య -
కోడి కూర కోసం కొట్లాట.. దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో కోడి కూర కారణంగా రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొట్లాటలో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. చార్మినార్ హుస్సాయినీ అలమ్‌లోని ఓ పంక్షన్ హాల్లో సోమవారం ఓ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో చికెన్ కర్రీ కోసం అతిథుల్లో కొందరు గొడవ చేశారు. ఆలస్యంగా కూరను వడ్డించారంటూ పెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు బయటకు వెళ్లి మరో 15 మందిని వెంటపెట్టుకొచ్చి కత్తులతో పంక్షన్హాల్లో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన మరో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
‘చుక్కలు’ చూపిస్తున్నారు..!
ఫై ఫోటోలోని రైతు పేరు కొల్లుబోయిన బాలమునెయ్య. ప్రొద్దుటూరు మండలం ఎర్రగుండ్లపల్లె. చాపాడు మండలంలోని తుమ్మలపాడులో 2.66 ఎకరాల పొలం ఉంది. 35ఏళ్ల క్రితం కొనుక్కున్న ఈ రైతుకు అప్పటినుంచి పాసుపుస్తకాలు ఉన్నాయి. గతేడాదిలో పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసమని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, నీ భూమి చుక్కల భూమి అని అనుమతివ్వటం కుదరదని చెప్పారు. తర్వాత చుక్కల భూములకు కూడా ప్రభుత్వం పాసుపుస్తకాలు ఇస్తారని చెప్పగా అర్జీ ఇచ్చి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నానని బాలమునెయ్య వాపోతున్నాడు. ఫై ఫోటోలోని రైతు పేరు మొగిలి రామ్మోహన్. చాపాడు మండలం పల్లవోలు గ్రామ సర్పంచ్. 3.58 ఎకరాల పొలం ఉంది. ఏడాది క్రితం వరకూ పాసుపుస్తకం ఉండేది. బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. అయితే తర్వాత అది చుక్కల భూమి అని పాసుబుక్ చెల్లకుండా చేశారు. రుణం ఇవ్వలేదు. తర్వాత అధికారులు దరఖాస్తు చేసుకోండి పాసుపుస్తకం ఇస్తామని చెప్పగా, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతీగతీ లేదు. అధికారులు తీరుపై సర్పంచ్ రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ జిల్లాలో చుక్కల భూముల క్రమబద్ధీకరణ తీరు. వీరిద్దరే కాదు జిల్లావ్యాప్తంగా 3,910 మంది రైతులు అర్జీలు సమర్పిం చి, పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల తీరుతో అలసిపోతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న రెవెన్యూ అధికారులు సేవాధర్మాన్ని మరిచి అన్నదాతలను తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. కడప సెవెన్‌రోడ్స్/చాపాడు: ప్రభుత్వ చుక్కల భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేరిట వాటిని బదలాయించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు జిల్లా అంతటా దుమారం రేపుతున్నాయి. పైసలు ముట్టనిదే తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫైళ్లు కదలడం లేదు. కాసులు ముట్టజెప్పకపోతే ఏదోఒక కొర్రీ వేసి ఫైళ్లను వెనక్కి పంపుతున్నారు. జిల్లాలో మొత్తం 38వేల ఎకరాల వరకు చుక్కల భూములున్నట్లు అధికారక అంచనా. అయితే ప్రభుత్వ వద్ద సరైన లెక్కలు లేవు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం చట్టాన్ని తీసుకొచ్చి 8 నెలలైంది. ఇప్పటివరకూ జిల్లాలో కేవలం ఒకే ఒక్క క్లైయిమ్ పరిష్కారం అయ్యిందంటే రెవె న్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ(డీఎల్సీ) చైర్మన్ అయిన కలెక్టర్, జేసీ ఈ విషయంపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ నేపథ్యం.. 1916లో రీసర్వే అండ్ సెటిల్మెంట్ ఆపరేషన్స్ జరిగాయి. కరువులు, భూమి శిస్తు అధికంగా ఉండటం వంటి పలు కారణాల వల్ల రైతులు భూములను బీళ్లుగా పెట్టుకోవాల్సి వచ్చింది. అనేకమంది గ్రామాల్లో లేకుండా వలసలు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో భూములు ఎవరి అనుభవంలో ఉన్నాయో సెటిల్మెంట్ అధికారులకు సమాచారం లభించలేదు. దీంతో ఆయా సర్వేనంబర్లలో ఉన్న భూముల వద్ద రీసెటిల్మెంట్ రిజిస్టర్లలో డాట్స్ పెట్టారు. అంటే డాట్స్ ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఆ వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపారు. అప్పటినుంచి వీటిని కొనడం, అమ్మడం చెల్లకుండా పోయింది. సెటిల్మెంట్ అధికారులకు ఆ తర్వాత తామే సాగుదారులమని పలువురు రైతులు ఆధారాలను సమర్పించారు. అప్పటికే ఆర్ఎస్ఆర్ ముద్రణ జరిగిపోయింది కనుక ఆ వివరాలను రిజిస్టర్ ఆఫ్ హోల్డిం గ్స్(ఆర్‌హెచ్)లలో నమోదు చేసి సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలకు పంపారు. చుక్కల భూములపై చాలా ఏళ్లుగా ప్రభుత్వాలకు, రైతులకు మధ్య న్యా యపోరాటం సాగింది. ఎట్టకేలకు ‘ది ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్(అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్టర్) యాక్టు 2017’ వచ్చింది. గత సంవత్స రం జూలై 17న ఇందుకు సంబంధించిన జీఓ 298 కూడా విడుదలైంది. క్లైయిమ్స్ పరిష్కారం ఇలా.. చుక్కల భూములను పన్నెండేళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులు వాటిపై హక్కుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆర్ఎస్ఆర్, ఆర్‌హెచ్ నకలు, 1బీ రిజిస్టర్, అడంగళ్, రిజిస్ట్రేషన్ లింకు డాక్యుమెంట్లు వంటివి జత పరచాలి. మీసేవా ద్వారా క్లైయిమ్స్ అన్నీ నేరుగా సంబంధిత తహసీల్దార్ల లాగిన్లకు వెళ్తాయి. తహసీల్దార్ నోటీసులు జారీ చేసి ఆయా గ్రామాల్లో విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. తహసీల్దార్లు తమ నివేదికను కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా స్థాయి కమిటీకి పంపాలి. రికార్డులన్నీ సక్రమంగా ఉంటే ఆ భూమిపై సంబంధిత రైతులకు డీఎల్సీ హక్కును కల్పిస్తుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించాలంటూ కలెక్టర్ ఆదేశాలు పంపుతారు. ఈ మొత్తం ప్రక్రియ ఆరునెలల్లో పూర్తిచేయాలని చట్టం స్పష్టం చేస్తోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ! డాటెడ్ ల్యాండ్స్ చట్టం రావడంతో ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం అయ్యిం దని రైతులు ఎంతగానో సంబరపడ్డారు. మీసేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులు సమర్పించారు. 2017 జూలై 17 నుంచి ఇప్పటివరకూ కడప రెవెన్యూ డివిజన్లో 1,839, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో 1,630, రాజంపేట డివిజన్లో 442 వెరసి 3,911 క్లైయిమ్స్ వచ్చాయి. ఇందులో పులివెందుల మండలం కె. వెలమవారిపల్లెకు చెందిన బోరెడ్డి కాంతమ్మ అనే మహిళా రైతు క్లైయిమ్ మాత్రమే పరిష్కారమైంది. పరిష్కారానికి గడువు మీరని క్లైయిమ్స్ 3,743 ఉన్నాయి. గడువు మీరిన క్లైయిమ్స్ 5కాగా, 168 క్లైయిమ్స్ను కలెక్టర్ లాగిన్‌కు పంపారు. ఈ క్లైయిమ్స్ వివిధ దశల్లో ఉన్నప్పుడు ఆయా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఆ రైతు సాగుబడిలోనే ఉంద ని ధ్రువీకరణ ఇచ్చేందుకు వీఆర్వోలు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు తహసీల్దార్ కార్యాలయ గడ ప దాటి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా, ఆర్డీఓ రెకమెండేషన్స్ కావాలంటూ తిరిగి వాటిని వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు మళ్లీ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరి పరిష్కారం ఎప్పుడో? ఆర్డీఓల నివేదికల ఆధారంగా చర్యలు చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయంలో ఆర్డీఓలు ఇచ్చే నివేదికల ఆధారంగానే జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రైతులు సమర్పించే అర్జీలపై తహసీల్లార్లు నివేదికలు ఇవ్వాలి. వాటిపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రాస్థాయి పరిశీలన నిర్వహించి డీఎల్‌సీకి నివేదిక ఇస్తే అలాంటి క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తాం. ఇంతవరకు డీఎల్సీ వద్ద ఎలాంటి క్లెయిమ్స్ పెండింగ్‌లో లేవు. – బాబయ్య, జిల్లా రెవెన్యూ అధికారి, కడప -
ఇదీ చింతలపూడి..!
భూమంతా కోల్పోయారు ఈ రైతు పేరు అనపర్తి కృష్ణారావు. స్వగ్రామం పోచవరం. గోదావరికి చెంతనే ఈయనకి పొలం ఉంది. గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 1.10 ఎకరాల భూమి కోల్పోయారు. గూటాల ఎత్తిపోతల పథకంలో 15 సెంట్లు భూమి పోయింది. ఇంకా ఈ రైతుకు 2.54 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు చింతలపూడి పథకం వచ్చింది. మొదటి ఫేజ్‌లో ఇతని నుంచి 54 సెంట్ల భూమిని సేకరించారు. మళ్లీ ఇప్పుడు 2 ఎకరాల భూమి సర్వే చేసి రాళ్లు వేశారు. ఈయనకు ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటోంది. గతంలో ఇదే భూమిని కుమార్తెకి కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు భూమి పోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కృష్ణారావు ఒక్కరే కాదు, ఎంతో మంది రైతులు భూసేకరణలో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల వివరాలు కాలువ పొడవు 106 కిలోమీటర్లు పథకం లక్ష్యం 4.08 లక్షల ఎకరాలకు సాగునీరు ఖర్చు వివరాలు (రూ. కోట్లలో) ప్రాథమిక అంచనా వ్యయం : 1,701 సవరించిన అంచనాలతో : 4909.80 ఇప్పటివరకు చేసిన ఖర్చు : 804.82 భూసేకరణ వివరాలు (ఎకరాల్లో) అవసరమైన భూమి 22,962 రైతుల భూమి 13,403 సేకరించింది 8,815 అటవీ భూమి 9,559 సేకరించింది 1,282 కొవ్వూరు: మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. రూ. 4,909.80 కోట్ల వ్యయం తో చేపట్టాల్సిన పథకానికి 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు వచ్చే నవంబర్ నాటికి ఈ పథకం పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కాలంలో పూర్తి కావాలని నిర్దేశించిన పథకం ఇప్పటికి ఎనిమిదేళ్లు పూర్తయినా నేటికీ ఓ కోలిక్కి రాలేదు. క్షేత్రస్థాయిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు చూపుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. భూసేకరణలో భాగంగా ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకం పరిహారం చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించిన ఈ పథకం సామర్థ్యాన్ని 4.80 లక్షలకు పెంచారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.1,701 కోట్లు నుంచి రూ.4909. 80 కోట్లకి పెరిగింది. భూసేకరణ కూడా 17,122 ఎకరాల నుంచి ఇప్పుడు 22,962 ఎకరాలకు పెరిగింది. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియతో కలిపి రూ.804.82 కోట్లు విలువైన పనులు చేపట్టారు. భూసేకరణ నిమిత్తం రూ.209.86 కోట్లు, పనుల నిమిత్తం రూ.594.96 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రూ.344 కోట్లు ఖర్చు చేయగా టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.467.82 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి పనులు అక్కడే ప్రస్తుతం ఈ పథకం పనులు నాలుగు ప్యాకేజీలుగా నడుస్తున్నాయి. మొదటి ప్యాకేజీలో మూడు పంపుహౌస్‌లు, లీడింగ్ ఛానల్ 0 నుంచి 13.22 కిలోమీటరు వరకు, మెయిన్ కెనాల్ 0–36 కిలోమీటరు వరకు డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు చేపడతారు. దీనిలో లీడింగ్ ఛానల్ 13.2 కిలో మీటర్లకి 8.3 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ 36 కి.మీ.లకు గాను 27.6 కి.మీ. మేరకు పనులు చేశారు. ఈ పనులను నాలుగు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్నాయి. మొదటి అంచనా ప్రకారం 110 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా 24 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తయ్యాయి. మరో మూడు స్ట్రక్చర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం విస్తరిస్తున్న కాలువ సామర్ధ్యం మేరకు పెంచాల్సి ఉంది. ఇప్పుడు సామర్ధ్యం పెంచిన దృష్ట్యా లీడింగ్ ఛానల్లో 26, మొయిన్ కెనాల్లో 121 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో 36 కిలోమీటర్ నుంచి 68 కిలోమీటరు వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి తవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో 32 కిలోమీటర్లకి గాను 28.875 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. దీనిలో 83 స్ట్రక్చర్లకు గాను మూడు పురోగతిలో ఉన్నాయి. మూడో ప్యాకేజీ రూ.681.21 కోట్లతో పంప్ హౌస్‌లోను పెరిగిన సామర్థ్యం మేరకు డిస్చార్జీలను నిర్మించాల్సి ఉంది. నాలుగో ప్యాకేజీలో 68వ కిలోమీటరు నుంచి 106 కిలో మీటరు వరకు మెయిన్ కెనాల్, కొవ్వాడ, తమ్మిలేరు స్థిరీకరణ పనులు ఉన్నాయి. దీనిలో 85 స్ట్రక్చర్ల నిర్మించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. రానున్న రోజుల్లో జల్లేరు జలశయం సామర్ధ్యం 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారు. దీన్ని ఐదో ప్యాకేజీగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా భూసేకరణ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మారిన అంచనా ప్రకారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 22,962 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిలో అటవీశాఖకు చెందిన భూమి ఏకంగా 9,559 ఎకరాలుంది. ఇంత వరకు రైతుల నుంచి 8,815 ఎకరాల సేకరణ పూర్తికాగా ఇంకా 4,588 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరేచోట భూమి సూచించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో 1,282 ఎకరాల (859 హెక్టార్లు) భూమిని అటవీ భూమిగా అభివృద్ధి పరచడానికి అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫేజ్–1 క్లియరెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ అటవీ ప్రాంతంగా అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఇంకా 8,277 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే తప్ప అటవీ భూముల్లో పనులు చేయడానికి వీలు ఉండదు. ఆరెకరాలకు తొంభై సెంట్లు మిగిలింది ఈయన పేరు కాకర్ల వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం. ఈయన ఒకప్పుడు 6.30 ఎకరాల రైతు. ఉన్న భూమంతా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేవలం ముప్పై సెంట్లు మాత్రం మిగిలింది. తాడిపూడి పథకంలో ఎకరం పోయింది. చింతపూడి పథకం పేజ్–1లో 1.30 సెంట్లు, ఫేజ్–2 లో తాజాగా 3.10 ఎకరాలు పోతోంది. ఇక మిగిలింది కేవలం 90 సెంట్లు మాత్రమే. చింతలపూడి పథకం పేరుతో ఈ రైతు జీవితం తారుమారైంది. చింతలపూడి మొదటి విడతలో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని నమ్మించి అధికారులు రూ.8.35 లక్షలు చొప్పున ఇచ్చారు. రెండో విడతలో ఎకరాకి రూ.26.50 లక్షలు అన్నారు. మంత్రి రూ.28 లక్షలు ఇప్పిస్తామన్నారు. చివరికి ఎకరానికి రూ.23.74 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సొమ్ముతో మళ్లీ భూమి కొందా మంటే ఆ రేటుకు మార్కెట్లో పొలం అందుబాటులో లేదని ఆయన వాపోతున్నారు. 20 శాతం పనులు పూర్తి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇరవై శాతం పూర్తయ్యాయి. పథకం విస్తరణ కారణంగా నీటి సామరŠాధ్యన్ని 15.5 టీఎంసీల నంచి 53.5 టీఎంసీలకు పెంచుతున్నారు. నీటి విడుదల రెండు వేల క్యూసెక్కుల నుంచి 6,875 క్యూసెక్కులకు పెరుగుతుంది. మొదటి విడతలో నిర్మించిన స్ట్రక్చర్లు సర్దుబాటు చేయడానికి వీలులేనివి ఉంటే తొలగిస్తాం. అటవీ భూములు ముందుగా కాలువ తవ్వకాలకు అవసరమైనవి ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం సమయంలో మరికొన్ని భూములు అవసరమవుతాయి. వాటిని కూడా సేకరిస్తాం. – డీఎస్ఎస్ శ్రీనివాసయాదవ్, ఎస్ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం -
అందని సాయం..మానని గాయం
దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్ బ్రోకర్ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. రాజాం: ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్ మార్కెట్ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నవంబర్ 10న.. 2017, నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్ అనే పేరు ఓవర్ నైట్‌లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్ స్టేషన్లో బ్రోకర్ హామీల రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్ 10న ట్రేడ్ బ్రోకర్ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. ఏదీ పురోగతి? కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్ శ్రీరామ్‌తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్ బ్రోకర్ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట సీఐడీ ఏం చేస్తోంది? నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్ బ్రోకర్ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు. నీరు గారుతోందా? ప్రధాన నిందితునికి బెయిల్ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందా? ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్‌ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డబ్బు ఏమైనట్టు? బ్రోకర్ శ్రీరామ్ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి. ముమ్మర దర్యాప్తు ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
ఆలస్యంగా.. ఆఖరిచూపులు
పొట్టకూటికోసం దేశంకాని దేశానికి వెళ్లిన వలసజీవులు విగతజీవులుగా మారి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. సౌదీ అరేబియాలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలు ఆలస్యంగా రావడంతో వారి కుటుంబసభ్యులు కడసారిగా చూసి తల్లడిల్లిపోయారు. కష్టపడి నాలుగురాళ్లు సంపాదించుకుని వస్తారనుకుంటే ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారా.. అంటూ వారు రోదించిన తీరు ప్రజలను కలిచివేసింది. హన్వాడ/గుండేడ్ (మహబూబ్‌నగర్): హన్వాడ మండలం నాగంబాయితండాకు చెందిన ఆంగోత్ శంకర్‌నాయక్(45) బతుకుదె రువు నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లాడు. వెళ్లిన కొన్ని నెలలకు శంకర్ అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యాడు. తోటి మిత్రులు సౌదీలోని రియాద్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా అదే ఆస్పత్రిలో గత జనవరి 13న ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి నేటి వరకు భార్యాపిల్లలు, బంధువులు కడసారి చూపుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. మృతదేహం కోసం భార్య గంగమ్మ పలుమార్లు కలెక్టర్ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ప్రాధేయపడింది. ఫలితం దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాసటగా నిలిచారు. శంకర్ మృతదేహాన్ని రప్పించేందుకు జీబీడబ్ల్యూఎస్ వారిని ఆశ్రయించారు. ఇందుకోసం రూ.1.25లక్షల ఖర్చు అవుతుండగా వారే భరించి సౌదీ నుంచి ముంబాయికి, అటునుంచి హైదరాబాద్‌కు తెప్పిం చారు. మృతదేహాన్ని చూ సిన వెంటనే కుటుంబసభ్యులు ఒక్కసారిగా బోరుమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాధిత కుటుంబానికి రూ.62వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకోవాలని వెల్ఫేర్ ఇన్చార్జ్ డాక్టర్ ఎం.రవినాథ్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర నూతన కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, చిలకమర్రి నర్సింహులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వలసకూలికి అంత్యక్రియలు గండేడ్ మండలం షేక్‌పల్లి తండాకు చెందిన దేవిజానాయక్ (48) సౌదీ అరేబియాకు వలస వెళ్లి ఈనెల 13న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం 14 రోజుల అనంతరం స్వగ్రామానికి రాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శాంతీబాయి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం కుటంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.