గంట ఆలస్యంగా ఎంటెక్‌ పరీక్షలు | Hour late MTech Tests | Sakshi
Sakshi News home page

గంట ఆలస్యంగా ఎంటెక్‌ పరీక్షలు

Published Wed, Aug 17 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

జేఎ¯Œæటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంటెక్, ఎంఫార్మసీ మిడ్‌ టర్మ్‌ పరీక్షల సందర్భంగా మంగళవారం అవాంతరం ఎదురైంది. నర్సంపేట మండలంలోని బిట్స్‌ కళాశాలకు చెందిన విద్యార్థులకు చెన్నారావుపేట మండలం జయముఖి ఇంజనీరింగ్‌ కళాశాలలో, జయముఖి కళాశాల విద్యార్థులు బిట్స్‌లో పరీక్ష కేంద్రంగా ఏర్పాటుచేశా రు.

 
నర్సంపేట/మామునూరు : జేఎ¯Œæటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంటెక్, ఎంఫార్మసీ మిడ్‌ టర్మ్‌ పరీక్షల సందర్భంగా మంగళవారం అవాంతరం ఎదురైంది. నర్సంపేట మండలంలోని బిట్స్‌ కళాశాలకు చెందిన విద్యార్థులకు చెన్నారావుపేట మండలం జయముఖి ఇంజనీరింగ్‌ కళాశాలలో, జయముఖి కళాశాల విద్యార్థులు బిట్స్‌లో పరీక్ష కేంద్రంగా ఏర్పాటుచేశా రు. ఇక వరంగల్‌ 5వ డివిజన్‌ పరిధిలోని బొల్లికుంట వాగ్ధేవి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో కూడా పరీక్ష కేంద్రం ఉంది. అయితే, ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు పేపర్ల పరీక్షలు జరగాలి. కానీ ఉదయం పది గంటల పరీక్ష కోసం ఐదు నిముషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఆ¯Œæలై¯Œæలో డౌ¯Œæలోడ్‌ చేసేందుకు ఆయా కేంద్రాల అధ్యాపకులు యత్నించగా సర్వర్‌ సమస్య ఎదురైంది. ఇదే సమస్య మధ్యాహ్నం కూడా ఎదురుకాగా రెండు పేపర్ల పరీక్షలు గంట పాటు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే, జేఎ¯Œæటీయూ అధికారుల అనుమతి మేరకు చివరలో అదనం గా గంట కేటాయించడంతో వారు ప్రశాంతంగా పరీక్ష రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement