jntu
-
కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ నెల 12న కలికిరి జెన్టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు. -
జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఘటనపై అనుమానాలు!
హైదరాబాద్, సాక్షి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్‌లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు. ‘‘నిజానికి హాస్టల్లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు. జేఎన్టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే.. వంటగది, నిత్యావసరాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవు. కేర్టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అనుమానం వద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం. ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్‌టైమ్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్‌పైనే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా.. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. -
చట్నీలో చిట్టెలుక
సంగారెడ్డి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ వంట గదిలోని చట్నీ పాత్రలో చిట్టెలుక ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తా¯Œన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ మెస్ పనితీరు వారం రోజులుగా బాగా లేదని విద్యార్థులు పలుమార్లు ప్రి¯Œన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విద్యార్థులు తినే చట్నీలో చిట్టెలుక ప్రత్యక్షమైంది. దాన్ని విద్యార్థులు వీడియో తీసి మంగళవారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరంగా మారింది. విషయం తెలియగానే కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ మంగళవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. చట్నీలో ఎలుక పడటం వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలోనే ఎలుక ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని సూచించారు. అపరిశుభ్రతపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం అడిషనల్ కలెక్టర్ మాధురి హాస్టల్‌ను సందర్శించి అక్కడి అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. బాధ్యులను వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు ఉన్నారు. -
సాంబార్ లో ఎలుక
-
‘చట్నీలో చిట్టెలుక’.. సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్‌యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఘటనతో అలర్ట్.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. -
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
అనంతపురం: ‘మా ప్రభుత్వం వ చ్చింది. మావాళ్లే పాలిస్తారు. మీరంతా రాజీనామా చేసి వెళ్లిపోవాలి. అలాగే యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం ఐదు గంటల్లోపు తొలగించాలి. లేకపోతే మీ ఇష్టం..’ అంటూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నాయకులు, టీడీపీ కార్యకర్తలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ) వీసీ కె.హుస్సేన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్యలకు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య చాంబర్‌కు వెళ్లి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ‘ప్రభుత్వం మారింది. మాకు అనుకూలమైన అధికారిని నియమించుకుంటాం. వెంటనే వెళ్లిపోండి..’ అని హెచ్చరించారు. అనంతరం వీసీ హుస్సేన్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలన్నారు. ఇందుకోసం యూనివర్సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్‌ను పిలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన వీసీ యూనివర్సిటీ ఎస్ఈని పిలిపించారు. యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఆయన్ను కూడా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి సీఐ, ఎస్ఐ చేరుకుని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వర్సిటీ ఉద్యోగి తిమ్మప్ప కూడా వీసీని బెదిరించడం మంచి పద్ధతి కాదని, క్రమశిక్షణగా ఉండాలని కోరారు. దీంతో వారంతా వైఎస్సార్ విగ్రహాన్ని ఎప్పటిలోగా తొలగిస్తారో చెబితే తాము వెళ్లిపోతామన్నారు. ఆరో తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్ విగ్రహం తొలగిస్తామని అధికారులు తెలిపారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులు వెళ్లిపోయారు. అప్పటికప్పుడు పాలకమండలి సమావేశం ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహాన్ని పాలకమండలి అనుమతితో ఏర్పాటుచేసినందున విగ్రహం తొలగించేందుకు కూడా పాలకమండలి అనుమతి కావాలి. దీంతో వీసీ, రిజిస్ట్రార్ గురువారం సాయంత్రం అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు డిమాండ్ గురించి ప్రభుత్వానికి లేఖ రాసి, ప్రభుత్వ సూచన మేరకు వ్యవహరించాలని పాలకమండలి నిర్ణయించింది. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జేఎన్టీయూ(ఏ)లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించలేదు. ఆడిటోరియం పేరును మార్చలేదని, టీడీపీ ఇంకా అధికారం చేపట్టకమునుపే ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని విద్యార్థులు, అధ్యాపకులు తప్పుపడుతున్నారు. -
అనంతపురం: మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్య.. అంతలోనే మరో విషాదం
అనంతపురం: వ్యక్తిగత కక్షతో సొంత మేనమామను గొంతుకోసి హత్య చేసిన ఘటన అనంతపురం పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మేనల్లుడి చేతిలో హతమైన మూర్తిరావు (58) గురించి తెలిసేలోపే భర్త వియోగాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభ కూడా గుండెపోటుతో మరణించడంతో స్థానిక జేఎన్టీయూ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె. కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు. భార్య కళ్లెదుటే దారుణం.. మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. వీటిని అద్దెకు ఇచ్చేసి ఆయన నగరంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబసభ్యులతో ఉంటున్నారు. ఇంట్లో అద్దెకున్న మణికంఠ అనే వ్యక్తి ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఫోన్ చేశారు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో తన భార్య శోభతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా... నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు. హతుడి పక్కనే కూర్చొని.. మూర్తిరావును హతమార్చిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. వివాదరహితుడు మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. -
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం: వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు. -
Hyderabad: గూబ గుయ్‌మంటోంది.. నిద్రపోని మహానగరం
అర్ధరాత్రి ఒంటి గంట.. రెండు గంటలు.. ఎప్పుడైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మెయిన్‌రోడ్లు చూశారా.. బంపర్ లైట్లు వేసుకుంటూ.. గట్టిగా హారన్లు కొట్టుకుంటూ కార్లు, టూవీలర్లు లెక్కకు మించి అతివేగంగా వెళ్తుంటాయి. ఏదో ఒక్క రోజు.. రెండు రోజులో కాదు.. ప్రతిరోజూ ఇదే వరస.. వాస్తవానికి సగటున పగటిపూట కంటే కూడా ఆయా రోడ్లపై రాత్రి పూట తిరిగే వాహనాలే ఎక్కువని ఓ అంచనా. హైదరాబాద్ మహానగరంలో రాత్రిళ్ల ఉద్యోగాలు, ప్రజల జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పులకు పగలు, రాత్రి అనే తేడాలు చెరిగిపోయాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే విపరీతమైన శబ్దకాలుష్యం. చెవులకు చిల్లులు పడే ధ్వనుల మోత. పెరిగిన వాహనాలతోపాటు పెద్దఎత్తున సాగుతున్న గృహనిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు, పరిశ్రమలు.. డీజే సౌండ్లు, హడావుడితో అర్ధరాత్రి ఫంక్షన్లు తదితర రూపాల్లో పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్ : తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణబోర్డు (పీసీబీ) గణాంకాలను పరిశీలిస్తే... పగలు కంటే కూడా రాత్రి సమయాల్లోనే మోతాదుకు మించి శబ్దాలు వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఎప్పటి లెక్కో కాదు...తాజాగా ఈ నెల 1 నుంచి 14వ తేదీల మధ్య వెలువడిన శబ్దాలకు సంబంధించిన సమాచారం గమనిస్తే... జూబ్లీహిల్స్, జేఎన్టీయూ, తార్నాక, జూ పార్కు, గచ్చిబౌలిలలో పగటిపూట కంటే కూడా రాత్రిళ్లు ధ్వనులు ఎక్కువగా వెలువడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు దాదాపుగా ఇదే ట్రెండ్ కొనసాగిందంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మారిన జీవనశైలి అలవాట్లతో... పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాలు, ఇతర రూపాల్లో అంతకంతకూ పెరుగుతున్న విపరీతమైన ధ్వనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత పరిమితులకు మించి వెలువడుతున్న శబ్దాలతో చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రభావితమవుతున్నారు. జీవనశైలి అలవాట్లలో వచ్చిన మార్పు చేర్పులతో పగటి కంటే కూడా రాత్రిపూట పొద్దుపోయే దాకా వాహనాల రాకపోకలు, పెద్దశబ్దంతో హారన్లు మొగించడం, ఫంక్షన్లు, ఇతర కార్యకలాపాలు శబ్దాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 లోపు నిర్ణీత ఆఫీస్ పనివేళల్లో పనిచేసే వారితోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్ వేళలను బట్టి పనిచేసేవారు కూడా ఉంటున్నారు. రోజుకు మూడు, నాలుగు షిఫ్టుల్లో ఉద్యోగ విధులు, బాధ్యతల నిర్వహణలో నిమగ్నమవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు, ఇతర విధులు, బాధ్యతల్లో నిమగ్నమైనవారు పనిచేసే సమయాలు కూడా మారిపోతున్నాయి. అధిక ధ్వనులతో ఆరోగ్యంపై దుష్ప్రభావం రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో వాహనాలు, ఇతర రూపాల్లో ధ్వనులు పెరగడం వంటివి వివిధ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి అధికంగా వెలువడే ధ్వనులతో ఆరోగ్యం, మానసికస్థితి తదితరాలపై తమకు ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయన్న దానిపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన ఏర్పడలేదు. వాయుకాలుష్యం కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసినంతగా శబ్దకాలుష్యం గురించి అంత అవగాహన కలగకపోవడంతో వివిధ రూపాల్లో రోజువారీ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సోషల్లైఫ్లోనూ ఎంటర్టైన్మెంట్ పేరుతో బర్త్‌డేలు, ఇతర ఫంక్షన్లను పెద్ద శబ్దాలతో డీజేలు వంటివి నిర్వహిస్తున్నారు. 80 డెసిబుల్స్‌కు మించి వెలువడే శబ్దాలకు 8 గంటలపాటు ఎక్సోపోజ్ అయితే వినికిడి శక్తిపై ప్రభావం పడుతుంది. చెవుల్లో గింగురమనే శబ్దాల(టినిటస్)తో మానసిక ఒత్తిళ్లు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఏకాగ్రత దెబ్బతింటోంది. ఉదయం నుంచి రాత్రి దాకా పరిమితులకు మించి వెలువడే శబ్దాలు మనుషుల ‘హ్యుమో డైనమిక్స్’ పైనా ప్రభావం చూపి రక్తపోటు రావొచ్చు. గుండె సంబంధిత సమస్యలకు దారి తీయొచ్చు. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో వెలువడే శబ్దాలు వృద్ధులు, పిల్లలు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రజల జీవనశైలి అలవాట్లు మారినందున దానికి తగ్గట్టుగా ప్రభుత్వం అధిక«శబ్దాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.మోహన్‌రెడ్డి -
జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయితే పరీక్ష పేపర్‌ను మాత్రం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇటీవల టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ నేపథ్యంలో స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షను నిర్వహించడంపై అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీగా కసరత్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ లీకేజీని దృష్టిలో పెట్టుకొని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. భారీ డిమాండ్... స్టాఫ్ నర్స్ పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిని తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. మొత్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఒక్కో స్టాఫ్ నర్స్ పోస్టుకు ఎనిమిది మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990 మధ్య ఉంటుంది. దాంతో అభ్యర్థుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. కాగా వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్నారు. కాగా, రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. రాతపరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలలో 14 అంశాలు, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సై కాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్ నర్సింగ్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులు తయారు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
జేఎన్టీయూ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ వద్ద శనివారం రాత్రి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జేఎన్టీయూ మెట్రోస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. స్థానికులు సమాచారంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ
జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం. విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్ చదువులకు నిలయంగా మారింది. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆనర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తోపాటు 10 నెలల ఇంటెర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్ సబ్జెక్టు బీటెక్ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని ఆనర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. 1,075 మందికి ప్లేస్మెంట్ కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్ చేయిస్తారు. నైపుణ్యం సాధించేలా బోధన అమెజాన్ సుపోర్టు ఇంజినీరింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్ బాగుంది. – పి.సాహితి జ్యోత్స్న, సీఎస్ఈ విద్యార్థిని, జేఎన్టీయూ విజయనగరం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా... ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. – ప్రొఫెసర్ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం చక్కని శిక్షణ టీసీఎప్ డిజిటల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను. – ఎం.జాహ్నవి, సీఎస్ఈ, జేఎన్టీయూ, విజయనగరం -
జేఎన్టీయూ ముంగిలి..ఆనంద లోగిలి
అనంతపురం విద్య: రాయలసీమకే తలమానికంగా మారి, వజ్రోత్సవాల కీర్తి సొంతం చేసుకుని, ఇంజినీరింగ్ నిపుణుల ఖిల్లాగా పేరొందిన జేఎన్టీయూ అనంతపురం శనివారం ఆనంద లోగిలైంది. దేశం గర్వించదగ్గ ఎందరో శాస్త్రవేత్తలను అందించిన విద్యాలయంలో 12వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చాన్సలర్ హోదాలో హాజరుకావడం కొత్తకళను తెచ్చిపెట్టింది. గవర్నర్ హాజరైనప్పటి నుంచి ముగిసేవరకు విద్యార్థులు, అధికారులు క్రమశిక్షణతో మెలిగారు. గవర్నర్ ప్రసంగానికి యువత ముగ్దులయ్యారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష విజయ ప్రస్థానం కలిగిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కి చైర్మన్, వర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్ జి. సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడంతో వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కీలకోపన్యాసం చేస్తూ.. నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతికి పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ఏడాదికి 10 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం భారత రక్షణ రంగంలో ఏడాదికి 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో డిఫెన్స్ టెక్నాలజీ బ్రాంచ్‌లు ప్రవేశపెడతామన్నారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థిగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కర్తలకు ప్రోత్సాహం నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ఇస్రో తరఫున ప్రోత్సహిస్తామని సంస్థ చైర్మన్ సోమనాథ్ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మరణాన్ని జయించడం, జీవిత కాలాన్ని పెంపొందించడంపై ఇప్పటికే ప్రయోగాలు సాగుతున్నా యన్నారు. సైన్స్ మద్దతుతో ఆకలి, వ్యాధులను జయించేందుకు చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందన్నారు. ‘రాకెట్‌ను ఒక శిశువుగా పరిగణిస్తా, రూప కల్పన నుంచి ప్రయోగం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విఫలమవుతుంటాం. జీవితంలో కూడా అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోవాలి’ అని వివరించారు. అత్యుత్తమ సాంకేతికత గతల దేశాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతరిక్షంలోకి రోబోలను పంపి సమాచార సేక రణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో వర్సిటీకి రూ.1,296 కోట్లు జేఎన్టీయూ (ఏ)కు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ (మెరూ) గుర్తింపు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన అన్నారు. వర్సిటీ ప్రగతి నివేదికను ఆయన వివరించారు. మెరూతో వచ్చే ఐదేళ్లలో రూ.1,296 కోట్ల నిధులు రానున్నాయన్నారు. వర్సిటీలో రూ.98 కోట్లతో పాలనా భవనం, ఫార్మసీ బ్లాక్, జిమ్ హాల్, యోగా, మెడిటేషన్ భవనాల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.23 కోట్లతో ధ్యాన్‌చంద్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల కళాశాలకు చెందిన ఎం. హర్షిత అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుందన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో వర్సిటీ కాలేజీల్లో 565 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా, అనుబంధ కళాశాలల్లో 5,904 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. జయంత్‌కుమార్ రెడ్డి, గీతాచరణ్ గేట్– 2022లో టాప్–10 ర్యాంకులు సాధించారన్నారు. హాజరైన ప్రముఖులు స్నాతకోత్సవానికి పలువురు ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ వై. వెంక ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రామకృష్ణా రెడ్డి, రెక్టార్ మల్లికార్జున రెడ్డి, రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జేసీ కేతన్‌గార్గ్, జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్, రిజిస్ట్రార్ శశిధర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ కేశవ రెడ్డి, తదితరులున్నారు. ‘బంగారు’ కొండలు జేఎన్టీయూ (ఏ) స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 22 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలను ప్రకటించారు. వీరిలో 19 మంది స్నాతకోత్సవ వేదికపై పతకాలు అందుకోగా..వివిధ కారణాలతో ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం పతకాలలో డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు అందుకోగా.. ఎం.సతీష్‌కుమార్ రెడ్డి (అనంతపురం), కె.మైథిలి (అనంతపురం) మూడేసి చొప్పున, టి.అనూష (అనంతపురం), బి.సరయూ (అనంతపురం), బి.వీరవంశీ కుమార్ (అనంతపురం), సి.భావన రెడ్డి ( జేఎన్టీయూ కాలేజీ, పులివెందుల) రెండేసి బంగారు పతకాలు, వి.మౌనిక (అనంతపురం), జి.శ్రేయారెడ్డి (అనంతపురం), ఏ.సుధీర్ (పులివెందుల), కె.దేవహర్ష (పులివెందుల), బి.షేక్ షబీహా (పులివెందుల), కే. గురుతేజస్విని (పులివెందుల), యు.విష్ణువర్ధన్ రెడ్డి (అనంతపురం) ఒక్కొక్క బంగారు పతకం అందుకున్నారు. అలాగే వర్సిటీ అనుబంధ ప్రైవేటు కాలేజీల విభాగంలో ఎ.కిశోర్ ( విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీ, కావలి), కె.సుప్రియ (ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్, తిరుపతి), టి.శ్రీకాంత్ ( శ్రీవెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పుత్తూరు), ఆర్.విష్ణుశ్రీ (శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొడవలూరు, నెల్లూరు జిల్లా), టి.హరిత (పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలి), నాగరోహిణి (నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు), కె.మనోజ (ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, తిరుపతి), బి.పెంచల కుమారి (అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాజంపేట) ఒక్కొక్క పతకం కైవసం చేసుకున్నారు. తండ్రి మరణించినా.. : నెల్లూరుకు చెందిన డి.సుప్రజ (జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎలక్ట్రికల్ విభాగంలో విశేష ప్రతిభ చూపి ‘బంగారు కొండ’గా నిలిచారు. సుప్రజ తల్లిదండ్రులు శివప్రసాద్, సరోజ. రెండేళ్ల క్రితం శివప్రసాద్ గుండెపోటుతో మరణించారు. తల్లి సరోజ ప్రోత్సాహంతో బీటెక్‌ను విజయవంతగా పూర్తి చేశారు. కళాశాల టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్ అకడమిక్ ఫెర్ఫార్మర్ అమాంగ్ గర్ల్స్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, టీఎస్ రాఘవన్ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, చందుపల్లె వెంకట్రాయులు, సరోజమ్మ ఎండోమెంట్ గోల్డ్‌మెడల్‌ను సుప్రజ సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పబ్లిక్ రంగ కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా సుప్రజ చెప్పారు. -
కౌన్సెలింగ్‌కు ముందే కాలేజీల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూ యోచిస్తోంది. తనిఖీల కోసం ఈ ఏడాది కూడా అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు అవసరం. గుర్తింపు ఇవ్వాలంటే విశ్వవిద్యాలయం అధికారులు కాలేజీల్లోని వసతులను పరిశీలించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు., మౌలిక వసతులు లేని కాలేజీలను గుర్తించినా, ఆఖరి నిమిషంలో అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈసారి మాత్రం ఈ అవకాశం ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌పై గురి గత కొన్నాళ్లుగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతేడాది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సుల్లో దాదాపు 5 వేల సీట్లు పెరిగాయి. మెకానికల్, సివిల్‌లో సీట్లు తగ్గించుకుని కొత్త కోర్సులకు అనుమతులు పొందాయి. అయితే, చాలా కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల బోధన ఆశించినస్థాయిలో లేదని జేఎన్టీయూహెచ్ గుర్తించింది అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీ లేదని, లోతుగా అధ్యయనం జరగడంలేదనే నిర్ణయానికి వచ్చింది. అధ్యాపకుల అటెండెన్స్ కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ కూడా సరిగా అమలవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా బోధించేది వేరొకరనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు అధ్యాపకుల పాన్ నంబర్ ఆధారంగానూ వాస్తవాలు తెలుసుకుంటామని జేఎన్టీయూహెచ్ తెలిపింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఇలాంటి సమస్యలన్నీ ఈసారి పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌కు ముందే.. జేఈఈ మెయిన్స్, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు కారణంగా ఈసారి ఎంసెట్ పరీక్ష కూడా ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ వరకూ కొనసాగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీల తనిఖీలు కౌన్సెలింగ్‌కు ముందే చేపట్టి, వాస్తవ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
JNTU లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతం
-
విద్యల నగరానికి సాంకేతిక విద్యాహారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యల నగరంగా పేరొందిన విజయనగరం వాసులకు ఇన్నాళ్లకు యూనివర్సిటీ లేని లోటు తీరింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విజయనగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తిస్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గురజాడకు గౌరవం.. విజయనగరంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఇన్నాళ్లూ జేఎన్టీయూ–కాకినాడకు అనుబంధంగా కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఇప్పుడు జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జేఎన్టీయూ–జీవీ) యూనివర్సిటీగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర యూనివర్సిటీల చట్టాన్ని సవరించగా తాజాగా అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్పు చేశారు. అంతేకాదు సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో వర్సిటీని నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. వైఎస్సార్ హయాంలో ఏర్పాటు.. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని నాడు దివంగత వైఎస్సార్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను 2007లో 80 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పారు. ఎప్పటికైనా యూనివర్సిటీగా విస్తరించాలని భావించారు. ఐదు గ్రూప్‌లతో ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమైంది. తొలుత స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులను నిర్వహించారు. మూడేళ్లలోనే రెండు వసతి గృహాలను నిర్మించారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తి కావడంతో 2010 నుంచి సొంత స్థలంలోనే కళాశాల ప్రారంభమైంది. ఐదు కోర్సులకు సంబంధించి ఫ్యాకల్టీ పోస్టులను మంజూరు చేస్తూ వైఎస్సార్ హయాంలోనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఏడు ఇంజనీరింగ్ కోర్సులతో ఏడాదికి 420 మంది బీటెక్ విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. ఆరు కోర్సుల్లో ఎంటెక్ నిర్వహిస్తున్నారు. ఎంసీఏ కూడా ఉంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా విస్తరించడం ఉత్తరాంధ్ర విద్యార్థులకు వరం లాంటిది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 40 ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ జేఎన్టీయూ–కాకినాడ పర్యవేక్షణలో జరుగుతోంది. విద్యార్థులు ఎలాంటి సమస్య తలెత్తినా, మార్కుల జాబితాలు, ఇతరత్రా ధ్రువపత్రాల కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు కావడం వల్ల ఆ సమస్యలు ఉండవు. మరింత నాణ్యమైన బోధన అందుతుంది. – ప్రొఫెసర్ జి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ విజయనగరం పెరిగిన ప్లేస్‌మెంట్స్, నాణ్యత.. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం జేఎన్టీయూ కళాశాలపై పాలకులు నిర్లక్ష్యం వహించారు. నిధులు కేటాయించక పోవడంతో పూర్తి స్థాయిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీగా సీఎం జగన్ మార్పు చేశారు. రెండేళ్లుగా ఏటా 150 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్మెంట్లు లభించడంతో నాణ్యత పెరిగింది. కొండవాలున సుందర ప్రాంగణం విజయనగరం శివారులోని కొండవాలున జేఎన్టీయూ ఏర్పాటైంది. దాదాపు 15,265 చదరపు మీటర్ల స్థలంలో మూడు అకడమిక్ బ్లాక్ భవనాలు, 2,865 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళాశాల కేంద్ర గ్రంథాలయ భవనం ఇక్కడి ప్రత్యేకత. విద్యార్థులకు వైద్య సదుపాయాల కోసం 354 చదరపు మీటర్ల స్థలంలో డిస్పెన్సరీకి పక్కా భవనం ఉంది. శాఖల వారీగా వర్క్‌షాప్ షెడ్స్, ల్యాబ్‌లు, క్యాంటీన్లకు పక్కా భవనాలున్నాయి. చెరో రెండు చొప్పున విద్యార్థులు, విద్యార్థినులకు వసతి గృహాలను కేటాయించారు. క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం సదుపాయాలు కూడా ఉన్నాయి. -
అగ్రదేశాల్లో.. మనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్టీయూ–అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ.. అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే.. అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్ టాప్–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్ శుభవార్త అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది. యువ ఇంజనీర్లకు డీఆర్డీవో చేయూత అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్ (డిఫెన్స్ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్(డిఫెన్స్ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ(ఏ)లో డీఆర్డీవో ఎక్స్‌లెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ పి.సుజాత పాల్గొన్నారు. -
కొత్త కోర్సులకు ఎన్వోసీ అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలన్న జేఎన్టీయూ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మార్గదర్శకాల మేరకు కోర్సుల నిర్వహణ ఉంటుందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జేఎన్టీయూ అఫిలియేషన్ నిబంధనల మేరకు కొత్త కోర్సుల ప్రారంభానికి, తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరి అంటూ జారీచేసిన మార్గదర్శకాలను నిలిపివేసింది. హైకోర్టును ఆశ్రయించిన 11 ఇంజనీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, సీఎంఆర్, వీఎన్ఆర్, వర్ధమాన్‌తోపాటు మరో ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు నడుచుకుంటాయని, కొత్త కోర్సుల ప్రారం భానికి సంబంధించి నిబంధనల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి, జేఎన్టీయూకు ఎటువంటి అధికారం లేదని ఇంజనీరింగ్ కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్వోసీ తప్పనిసరన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. తెలంగాణ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్వోసీ ఉండాలన్న నిబంధనను పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
పేర్లు మార్చి.. ప్రేమ పేరుతో నమ్మించి..
కర్నూలు (టౌన్): వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పేర్లు మార్చుకుంటూ.. యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసగిస్తున్న బీటెక్ విద్యార్థిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తున్నాడు. అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహం కాగా, ఆమె ఫొటోలను వాట్సాప్‌లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిందితుడు అన్వేష్‌ను కర్నూలు కలెక్టరేట్ వద్ద గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ హెచ్చరించారు. -
వెయిటేజీ రద్దుతో నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలతో ఎంసెట్ నిర్వహించేందుకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4, 5, 6, 9, 10వ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం, సిలబస్ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్‌ను నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తీరు, చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఇంటర్ పరీక్షల రద్దుతో వెయిటేజీ రద్దు గతేడాది వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారి వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంతో, వెయిటేజీని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా వెయిటేజీ రద్దు చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి నష్టం జరగదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా సెకండ్ ఇయర్ పరీక్షలు లేకపోవడంతో చాలామంది వెయిటేజీ రద్దును ఆహ్వానించారు. ఎక్కువ ఆప్షన్లు ఉండవు కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. అందుకు అనుగుణంగానే ఎంసెట్‌లోనూ సిలబస్ తగ్గించి, ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నాం. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్‌ను తీసుకున్నాం. ప్రశ్నలను మొదటి, రెండో ఏడాదికి సంబంధించిన సిలబస్‌ను బట్టి సాపేక్షికంగా ఇస్తాం. దీనివల్ల మొదటి ఏడాది ప్రశ్నలు సహజంగానే ఎక్కువ వస్తాయి. సిలబస్‌ను కుదించడం వల్ల జేఈఈ మాదిరిగా ఎక్కువ ఆప్షన్లను ఇవ్వడం లేదు. గతేడాది కంటే తక్కువగా సెషన్లు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుంది. ఈసారి తక్కువ సెషన్లు పెట్టాం. గతేడాది ఇంజనీరింగ్‌కు 8 సెషన్లు పెడితే, ఈసారి 6 సెషన్లు పెడుతున్నాం. వ్యవసాయ, మెడికల్ కోర్సులకు గతేడాది నాలుగు సెషన్లు పెడితే, ఈసారి మూడు సెషన్లలోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. గతేడాది కంటే 27 వేల మంది ఎక్కువగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ ఇంటర్ పాస్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. మాస్క్ ధరించాలి.. శానిటైజర్ తెచ్చుకోవాలి గతేడాది కంటే ఈసారి కరోనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్, 500 ఎంఎల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేష¯Œన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు ఉందా లేదా అనేది డిక్లరేషన్‌లో స్పష్టం చేయాలి. జ్వర పరీక్ష చేస్తాం. ఒకవేళ జ్వరం, జలుబు వంటివి ఉంటే ప్రత్యేక ఏర్పాటు చేస్తాం. పరీక్ష సమయానికి కోవిడ్ నిర్ధారణ అయినవాళ్లు ముందుగా ఈ–మెయిల్ ద్వారా తెలియ జేయాలి. కరోనా పాజిటివ్ అని ఉన్న రిపోర్ట్‌ను జత చేయాలి. ఇలాంటి వారికి తర్వాత పరీక్షలు పెట్టే అవకాశముంది. ఇలా ఎవరైనా నిర్ధారించిన తేదీల్లో పరీక్షకు హాజరుకాలేకపోతే, వారు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వారిని కూడా తదుపరి తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తాం. మొత్తం 160 మార్కులకు పరీక్ష మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. వారికి సున్నా మార్కు వచ్చినా సీటు పొందొచ్చు. పరీక్ష పేపర్ ఇంగ్లీషు–తెలుగు, ఇంగ్లీషు–ఉర్దూ, ఇంగ్లీష్లలో ఉంటుంది. అత్యధికంగా 1,96,500 మంది ఇంగ్లీషు పేపర్ ఒక్కటే ఆప్షన్‌గా ఇచ్చారు. 2018 నుంచి జేఈఈ పరీక్ష మాదిరి నార్మలైజేష¯Œన్ ప్రాసెస్ అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇది శాస్త్రీయంగా జరుగుతుంది. పేపర్‌కు స్కేలింగ్ ఉంటుంది. స్టాటిస్టికల్ ఫార్ములా ఉంటుంది. ఆ ప్రకారం మార్కులను లెక్కగట్టి ర్యాంకులను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు. రెండు గంటలు ముందు నుంచే అనుమతి ఈసారి హాల్ టికెట్‌తో పాటు పరీక్ష జరిగే కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తాం. 1.15 గంటల ముందు హాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు అనుమతించరు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. దరఖాస్తుకు నేడే చివరి తేదీ ఫైన్‌తో కలిపి ఎంసెట్‌కు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీ నుంచి 50 వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,400 మంది ఉన్నారు. -
సెమిస్టర్ పరీక్షలకు ‘వసతి’ గండం!
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన జి.సౌజన్య కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదివరకు ఇక్కడే ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకోగా, కోవిడ్–19 నేపథ్యంలో ఏడాదిగా ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ తరగతులకే పరిమితమైంది. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావడానికి రోజు తప్పించి రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. దీంతో రోజుకు సగటున రూ. వెయ్యి ఖర్చవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, సంక్షేమ, కాలేజీ హాస్టళ్లు ఇంకా తెరచుకోకపోవడం, నగరంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వసతి పొందే పరిస్థితి లేకపోవడంతో సౌజన్య తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సాక్షి, హైదరాబాద్: ఆయా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్న అనేకమంది విద్యార్థులు వసతిలేక సౌజన్య మాదిరిగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు (ఫస్టియర్ మినహా) సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బీటెక్, జనరల్ డిగ్రీ విద్యార్థులకు ఈనెలాఖరు వరకు, పీజీ జనరల్, టెక్నికల్ కోర్సులు, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆగస్టు రెండోవారం వరకు రోజు తప్పించి రోజు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే వసతిగృహాల్లో ఉండి చదువు కొనసాగించిన విద్యార్థులు ప్రస్తుతం వసతిలేక ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలతోపాటు మూతపడిన సంక్షేమ, ప్రైవేటు హాస్టళ్లు ఇంకా తెరచుకోలేదు. దీంతో దూరప్రాంతాల్లో ఉండే మెజార్టీ విద్యార్థులు నిత్యం ఇంటి వద్ద నుంచి కాలేజీలకు వచ్చి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఆయా సెమిస్టర్ పరీక్షలకు దాదాపు 4.72 లక్షలమంది హాజరవుతున్నారు. వీరిలో సంక్షేమ వసతిగృహాలు, ప్రైవేటు హాస్టళ్లలో, ప్రత్యేకంగా అద్దె గదుల్లో ఉండి చదువుకున్నవారి సంఖ్య 3 లక్షలు ఉన్నట్లు అంచనా. ఒకవైపు చార్జీలు, మరోవైపు తిండి ఖర్చులు విద్యార్థులకు భారంగా మారాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ... దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. యూనివర్సిటీ హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్లు తెరిస్తే మేలు జరుగుతుందని విద్యార్థులు సూచించినా అధికార యంత్రాంగం స్పందించలేదు. హైదరాబాద్‌కు రెండ్రోజులకోసారి పరీక్షల కోసం వస్తున్నానని, దీంతో పరీక్షలపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నానని కోదాడకు చెందిన ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి కె.అవినాశ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో 5 వేల విద్యార్థి వసతిగృహాలు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు వసతి పొందుతున్న హాస్టళ్లు 5 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,750 వసతిగృహాలున్నాయి. వీటిల్లో పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం వెయ్యి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో 2 లక్షలకుపైగా విద్యార్థులున్నారు. ప్రైవేటు హాస్టళ్లు దాదాపు మూడువేలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందేవారు. -
పాత విధానంలోనే ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్–2021ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త నిబంధనలను పేర్కొంటూ 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్ విద్యార్థులకూ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది. ఇందుకు 14 ఆప్షనల్ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోనే ఎంసెట్–2021 ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో ఏఐసీటీఈ పొందుపరిచిన వివిధ సబ్జెక్టుల కాంబినేషన్లు రాష్ట్రంలో లేకపోవడంతో పాత పద్ధతిలోనే అంటే.. ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)తోనే ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇవ్వనుంది. ఏపీ ఎంసెట్–2021లో కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థులు ఇంటర్లో 45 శాతం (రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ–కాకినాడకే.. ఏపీ ఎంసెట్–2021 నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా కాకినాడ జేఎన్టీయూకే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సెట్ల నిర్వహణ సంస్థలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్–2021 నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ వి.రవీంద్ర ఉంటారు. ఎంసెట్‌ను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఐటీ సంస్థ ఎంపికపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఎంసెట్ సహా ఇతర సెట్ల షెడ్యూళ్లపై తదుపరి చర్యలు ప్రారంభించనుంది. కరోనా వల్ల గతేడాది ప్రవేశాలు ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి కొంతముందుగానే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. పాత విధానంలోనే ఎంసెట్ – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఇంజనీరింగ్ కోర్సులపై ఏఐసీటీఈ.. 2021–22 విద్యా సంవత్సరపు అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో కొన్ని కొత్త నిబంధనలు చేర్చినా వాటి అమలుపై రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. కాబట్టి ఏపీ ఎంసెట్‌ను పాత విధానంలోనే నిర్వహిస్తాం. ఏఐసీటీఈ 14 సబ్జెక్టులతో ఆప్షన్లు పెట్టినా ఆ సబ్జెక్టులతో స్పెషల్ బ్రాంచ్‌ల కాంబినేషన్లు మన రాష్ట్రంలో లేవు. బీటెక్ బయోటెక్నాలజీలోకి ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులను అనుమతిస్తున్నాం. ఆ విద్యార్థులకు మ్యాథ్స్‌లో బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెట్టాం. కోవిడ్‌తో ఇంటర్ సిలబస్‌ను తగ్గించినందున ఎంసెట్‌ను కుదించిన సిలబస్ మేరకే నిర్వహిస్తాం. -
త్వరలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంజనీరింగ్ విద్య త్వరలో ఏజెన్సీ ప్రాంతంలోనే గిరిజనులకు అందుబాటులోకి రాబోతోంది. గిరిజనులు కూడా తమ ప్రాంతంలోనే మెరుగైన ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాలేజీ భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే 105.32 ఎకరాల భూమిని, రూ.153 కోట్లను కేటాయించారు. వీలైనంత వేగంగా పనులు జరిగేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గిరిజన కాలేజీని జేఎన్టీయూ కాకినాడకు అనుబంధం చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ నెలలోనే మంత్రుల చేతుల మీదుగా ఈ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణాలకు ఇప్పటికే ప్లానింగ్ పూర్తి చేశామని జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్‌లలో తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఇంట్లో నుంచే నచ్చిన చదువులు
సాక్షి, అమరావతి : ఇంట్లో ఉంటూనో.. ఉద్యోగం చేసుకుంటూనో డిగ్రీ పట్టాలను అందిపుచ్చుకునే అవకాశం ఆన్లైన్ కోర్సుల వేదికలు కల్పిస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ విద్యా వేదికలకు ఎంతో ప్రాధాన్యం పెరగ్గా.. విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్లో డిగ్రీ కోర్సులు అమలు చేసేందుకు యూనివర్సిటీలకు, వివిధ అంతర్జాతీయ సంస్థల కోర్సులకు అవకాశమిచ్చింది. ‘కోర్సెరా’, ‘ఎడెక్స్’ వంటి సంస్థల ద్వారా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని 100 యూనివర్సిటీల ద్వారా ఆన్లైన్ కోర్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ఆయా కోర్సులకు గుర్తింపునిస్తూ క్రెడిట్ల కేటాయింపు, వాటి బదిలీకి అవకాశం కల్పించింది. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థలు అందించే కోర్సులకు కూడా గుర్తింపునివ్వడంతో విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతోనే.. తరగతి గదిలో ముఖాముఖి నిర్వహించే డిగ్రీ కోర్సులకు అయ్యే ఫీజుల కన్నా తక్కువ ఖర్చుతో ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్ పాయింట్ల ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండటంతో క్రమేణా ఆన్లైన్ కోర్సుల వైపు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ఆన్లైన్ విద్యావేదికలైన కోర్సెరా, ఎడెక్స్ æ లక్షలాది మందికి ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఖాన్ అకాడమీ, ఉడెమీ, స్టాన్ఫోర్డ్ ఆన్లైన్, ఎంఐటీ ఓపెన్ కోర్సు వేర్, కోడ్ అకాడమీ, టెడ్-ఎడ్, ఓపెన్ కల్చర్ ఆన్లైన్ కోర్సెస్ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. యూజీసీ ఉచిత ఆన్లైన్ కోర్సులు మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు ఆన్లైన్ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ‘స్వయం’ ఆన్లైన్ కోర్సులు ఇందులో ప్రముఖంగా చెప్పదగ్గవి. విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వేదిక ద్వారా పలు కోర్సులను అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. స్వయం వేదిక ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) సాంకేతికేతర యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్నారు. ‘ఈ-పీజీ పాఠశాల’ అనేది అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంటరాక్టివ్ ఈ-కంటెంట్‌తో 23వేల మాడ్యూళ్లతో వివిధ కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఫైన్ఆర్ట్స్, హ్యుమానిటీస్, నేచురల్, మేథమెటికల్ సైన్సు అంశాల్లో 70 పీజీ కోర్సులు అందిస్తోంది. ఇదే కాకుండా ‘ఈ-కంటెంట్ కోర్స్ వేర్’ ద్వారా వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను యూజీసీ అందుబాటులో ఉంచింది. 24,110 మాడ్యూళ్లలో 87 యూజీ కోర్సులు విద్యార్థులు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. వీఎల్ఎస్ఐ ఇండస్ట్రియల్ కోర్సు నేర్పారు లాక్డౌన్ సమయంలో జేఎన్టీయూ అనంతపురంలో తరగతులు నిర్వహించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీఈ విభాగంలో ప్రత్యేకంగా వీఎల్ఎస్ఐ ఇండస్ట్రియల్ కోర్సును ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. కరోనా, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యా వేదికల ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు పూర్తిచేసే అవకాశం కలుగుతోంది. అదనపు క్రెడిట్లతో లాభం చేకూరుతుంది. - సాయికుమార్, బీటెక్ ఫైనలియర్, ఈసీఈ విభాగం, జేఎన్టీయూ అనంతపురం (ఏ) ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే. ఆన్లైన్ కోర్సులు విద్యార్థులతో పాటు అధ్యాపకులకూ ఉపయోగపడుతున్నాయి. - డాక్టర్ జి.మమత, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల -
విషమ పరీక్ష
-
రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రవేశాల కమిటీ పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించిన సమయంలో కరోనా బారిన విద్యార్థుల నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. వారికి ఈనెల 8వ తేదీన పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఎంసెట్–2020 ప్రాథమికకీ శనివారం విడుదల చేసినట్లు ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్– మెడికల్ విభాగాలకు జరిగిన పరీక్షలకు సంబంధించి మొత్తం 14 పేపర్ల ప్రాథమిక ‘కీ’ రెస్పాన్స్ షీట్లను ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్ సైట్లో పొందుపర్చారు. ప్రాథమిక కీ లోని అభ్యంతరాలకు సంబంధించి ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఎంసీఈటీ’ వెబ్సైట్లో అభ్యంతరాల స్వీకరణకు నమూనా ఫారం పొందుపరిచారు. కీ పై అభ్యంతరాలు ఉంటే నమూనా ఫారం పూర్తిచేసి ఈ నెల 28 సాయంత్రం 5లోగా ‘ఏపీఈఏఎంసీఈటీ 2020ఓబీజేఈసీటీఐఓఎన్ఎస్ ఎట్దరేట్ జీమెయిల్.కామ్’ మెయిల్ ఐడీకి పంపించాలి. -
ఎంసెట్ షెడ్యూల్ విడుదల!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కి సోమవారం జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 102 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణలో 79, ఏపీ 23 కేంద్రాలలో పరీక్షను నిర్వహించన్నారు. మొత్తం 1,43,165 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. గురువారం నుంచి సెప్టెంబర్ 7 వ తేదీ వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూ కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ శానిటైజర్ వాడాలని ఆయన సూచించారు. చదవండి: 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.. -
పేపర్ బొమ్మ
అందమైన బొమ్మలు.. సందేశాన్ని ఇచ్చే బొమ్మలు.. సందర్భానికి తగ్గ బొమ్మలు.. నాజూకైన బొమ్మలు.. లావణ్య నల్లమిల్లి చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. అదీ క్విలింగ్ పేపర్‌తో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సృజనాత్మక ఆలోచనలతో పేపర్ బొమ్మల తయారీలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగులమయం చేసుకోండి’ అనే థీమ్‌తో ఐదు అడుగుల బొమ్మను పేపర్‌తో తయారుచేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు సంపాదించుకున్నారు. స్టిచింగ్ ట్యూటోరియల్తో ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఉన్న దారిలో ప్రయాణించడం కుదరకపోతే మరో దారిని తనకు తానుగా వేసుకుంటూ ముందుకు వెళుతున్న లావణ్య చెబుతున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘పుట్టి పెరిగింది నెల్లూరులో. హైదరాబాద్ జెఎన్‌టియూలో బీటెక్ చేశాను. ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. పెళ్లయి బాబు పుట్టాక ఉద్యోగం మానేశాను. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. చిన్ననాటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఎక్కువ. డెలివరీ టైమ్‌లో ఇంట్లోనే ఉండటంతో బాబుకి కావల్సిన క్రోషెట్స్ అల్లకం వంటివి ఆన్లైన్ లో చూసి నేర్చుకున్నాను. పాప పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల పనులతోనే రోజంతా సరిపోయేది. దీనితో ఇక ఉద్యోగం చేయాలనే ఆలోచనను పూర్తిగా మానుకున్నాను. అయితే, కాస్త తీరిక టైమ్ దొరికినా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అభిరుచిని ముందేసుకునేదాన్ని. పిల్లలు కాస్త పెద్దవుతుంటే టైమ్‌ను ప్లాన్ చేసుకుంటూ నా హాబీని పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టాను. ఇంట్లోనే ఉండి యూ ట్యూబ్ చానెల్లో స్టిచింగ్ ట్యుటోరియల్ ప్రారంభించాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు స్టిచింగ్‌తో పాటు క్విల్లింగ్ డాల్స్ రెండూ చేస్తున్నాను. క్విలింగ్ డాల్స్ తయారీలో చేసిన ప్రయోగాలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. గాంధీ టు గణేష గాంధీజీ చరఖా తిప్పుతున్నట్టు ఉన్న డిజైన్ చేయాలనుకున్నప్పుడు కొంత టెన్షన్‌కి లోనయ్యాను. గాంధీ ముఖ కవళికలను బొమ్మలో సరిగ్గా తీసుకురాగలనా అని. బొమ్మ పూర్తయ్యాక వచ్చిన సంతృప్తి మాటల్లో చెప్పలేను. అలాగే స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనికుడు, జెండా బొమ్మలను తయారు చేశాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మినియేచర్ ఫ్లాగ్‌లో మిళితం చేశాను. మంచి ప్రశంసలు వచ్చాయి.కరోనా మహమ్మారి మీద పోరాటం చేస్తున్న డాక్టర్లను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బొమ్మను డిజైన్ చేశాను. గణేష్ చవితిని పురస్కరించుకొని గణేష బొమ్మలను చేస్తున్నాను. గణేష టీమ్ పేరుతో ఒక మినియేచర్గ్రౌండ్నే సృష్టించాను. ఎలాంటి వర్క్‌షాప్స్, క్లాసులు లేకుండానే ఈ వర్క్‌ని నేర్చుకొని చేస్తున్నాను. ప్రస్తుతం ఆర్డర్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో క్లాసులు ఇస్తున్నాను. ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడు 40 బొమ్మలు తయారుచేసే పనిలో ఉన్నాను. ఈ బొమ్మలన్నీ ఎక్కువగా కానుకలుగా తమ ఆప్తులకు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. కిందటేడాది గణేషుడి బొమ్మలను నేరుగా సేల్ చేశాను. ప్రస్తుతం వీటిని ఆన్లైన్లోనే విక్రయిస్తున్నాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కుట్టడం, అల్లడం వంటివి ఎలాగూ వచ్చు. ఇవి కాకుండా ఇంకేం చేయచ్చు అని ఆలోచించినప్పుడు పేపర్ క్విల్లింగ్ ఆకట్టుకుంది. ముందు పేపర్‌తో ఆభరణాలు తయారుచేయడం, వాటిని ఆన్లైన్లో పెట్టడం, ఆర్డర్స్ మీద ఎవరైనా అడిగితే చేసి ఇవ్వడం చేసేదాన్ని. దీంట్లోనే త్రీడీ క్రియేషన్స్ కూడా చేశాను. మా ఫ్రెండ్‌తో దీని గురించి చర్చ వచ్చినప్పుడు ఏదైనా వినూత్నంగా ట్రై చేద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్ ‘వన్మయి’ పేరుతో నేను 5 అడుగుల పొడవున మోడ్రన్ బొమ్మను తయారు చేశాను. కాగితపు గుజ్జు, ఫాబ్రిక్ గ్లూ వంటి వాటిని ఉపయోగించి ‘వర్నిక’ పేరుతో నిలువెత్తు కళారూపాన్ని ఒక మంచి థీమ్‌తో తయారుచేశాం. ‘ఆకుపచ్చని లోకంలోకి వెళ్లండి, జీవితాన్ని రంగుల మయం చేసుకోండి’ అనేది ఆ థీమ్. కిందటేడాది ‘వన్మయి’ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యింది. చాలా ప్రశంసలూ వచ్చాయి. దీంతో పూర్తిగా పేపర్ డాల్స్ మీద దృష్టిపెట్టాను. గంటల నుంచి రోజులు క్విలింగ్లో ఒక నీడిల్ ఉపయోగించి బొమ్మలు తయారుచేస్తాం. దీనికి కావల్సిన చిన్న చిన్న వస్తువులు స్టేషనరీ షాపుల నుంచి సేకరిస్తాను. త్రీడీ డాల్ వర్క్ అయితే సాధారణ బొమ్మ తయారు కావడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది. అదే కొత్త కాన్సెప్ట్.. కాస్త ఎక్కువ వర్క్ ఉన్నదయితే 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది’’ అని లావణ్య తను ఎంచుకున్న మార్గాన్ని పరిచయం చేసింది. – నిర్మలారెడ్డి -
‘పేట’ జేఎన్టీయూకు శాశ్వత భవనాలు
సాక్షి, అమరావతి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... వెనుకబడ్డ పల్నాడుకు మేలు.. ► నరసరావుపేట జేఎన్టీయూలో 2016లో ఫస్ట్ బ్యాచ్‌లో చేరిన విద్యార్థులు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు, ల్యాబుల్లో నడుపుతూ వచ్చారు. ఈ పరిస్థితిని మారుస్తాం. ► వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలన్నది మా సంకల్పం. చిత్తశుద్ధితో చేపట్టిన ఈ కార్యక్రమమే అందుకు ఉదాహరణ. ► మొన్ననే 1,100 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ఆ పోస్టుల్లో నరసరావుపేట జేఎన్టీయూకు చెందినవీ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ల్యాబులు కూడా అందుబాటులోకి తెస్తాం. గత సర్కారు ఐదేళ్లు కాలయాపన గత సర్కారు జేఎన్టీయూ భవనాలు కట్టకుండా ఐదేళ్లు కాలయాపన చేస్తే మీరు (సీఎం జగన్) వచ్చి నిధులిచ్చారు. పీజీ కళాశాల కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాకాని వద్ద నిర్మాణం ► పల్నాడు రోడ్డులో ప్రస్తుతం జేఎన్టీయూను నిర్వహిస్తుండగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. ► స్థానిక లింగంగుంట్ల కాలనీ ఎన్ఎస్పీ స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ► సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శామ్యూల్, కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కళాశాల భవనాలకు సీఎం జగన్ శంకుస్థాపన
-
నరసరావుపేటలో జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.80 కోట్లతో వ్యయంతో పరిపాలనా,బోధన,హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలని తమ ప్రయత్నం అని, ఈ కాలేజీ శంకుస్థాపనే దీనికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. (వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి) ‘‘2016లో ఫస్ట్‌బ్యాచ్ పిల్లలను తీసుకున్నారు. మనం శంకుస్థాన చేసేసరికి అప్పుడు చేరిన పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చేశారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన ఇప్పటివరకూ చేయలేదు ఇప్పటివరకూ ప్రైవేటు కాలేజీలు, ల్యాబుల్లో నడుపుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులను మార్చాలని మనం ప్రయత్నంచేస్తున్నాం. వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతోంది. రూ.80 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్ చేశాం. వచ్చే సంవత్సరం మరోరూ.40 కోట్లు శాంక్షన్ చేస్తాం. మొత్తంగా రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నామని’ సీఎం జగన్ తెలిపారు. -
తెలంగాణలో ఎంట్రన్స్‌లన్నీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్పీసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లను వాయిదా వేస్తున్నట్లు వెల్లడిం చింది. అలాగే ఇతర డిప్లొమా, టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్ కోర్సుల పరీక్షలను కూడా వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బి.ఎస్. ప్రసాద్ నివేదించారు. అయితే డిగ్రీ, పీజీ పరీక్షల వ్యవహారంపై జేఎన్టీయూ చేసిన ప్రతిపాదనల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నదీ జూలై 9న జరిగే విచారణలోగా తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలెలా? కరోనా తీవ్రత కారణంగా ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నారాయణగూడకు చెందిన బి.వెంకట నర్సింగ్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తరహాలోనే ప్రవేశపరీక్షల విషయంలోనూ నిర్ణయం తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారని పత్రికల్లో వార్తలు చదివామని, అదే జరిగితే పరీక్షలను నిర్వహించడం ఎలా వీలవుతుందని ప్రశ్నించింది. పదో తరగతి పరీక్షలను రెండుసార్లు నిర్వహించాలని తాము ఆదేశిస్తే వీలుకాదని పరీక్షలనే రద్దు చేసిందని, ఈ పరీక్షల విషయంలో ఏం చేసేదీ స్పష్టం చేయాలని పేర్కొంది. అలాగే లాక్డౌన్ విధిస్తారో లేదో కూడా చెప్పాలని సూచించింది. ఇందుకు ఏజీ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొనేందుకు వీలుగా విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. తిరిగి మధ్యాహ్నం జరిగిన విచారణలో ఏజీ వాదనలు వినిపిస్తూ అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కరోనాపై ప్రభుత్వం సమీక్షించి పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే తిరిగి వాటిని నిర్వహిస్తుందని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం జరగవచ్చని, ఆ భేటీలో ప్రభుత్వం లాక్‌డౌన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. డిగ్రీ, పీజీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.. జేఎన్టీయూ తరఫు న్యాయవాది వాదిస్తూ డిగ్రీ, పీజీ పరీక్షలపై తాము పంపిన ప్రతిపాదనల విషయమై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. డిగ్రీలో మొదటి, రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహించకుండా మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయాలని, ఫైనల్ ఇయర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. యూజీలో ఏడు సెమిస్టర్ మార్కులు, ఎనిమిదో సెమిష్టర్ను కలిపి సగటు మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్ కేటాయించాలని సూచించామని కోర్టుకు తెలిపారు. ఇందుకు సమ్మతించని విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో స్పందించిన ధర్మాసనం... ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఏ నిర్ణయం తీసుకున్నదీ జూలై 9న జరిగే విచారణలో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఆగస్టులోనైనా సాధ్యమయ్యేనా? రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో కనీసం ఆగస్టులోనైనా ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేదానిపై సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 2న ఈసెట్, 4వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది. జూలై ఒకటో తేదీ నుంచి తిరిగి నిర్వహించేలా షెడ్యూల్ జారీచేసింది. ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాని నేపథ్యంలో మరోసారి వాయిదా తప్పలేదు. దీంతో ఆగస్టులోనైనా జరుగుతాయో లేదోనని ఈ ప్రవేశ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న 4.68 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను చూస్తే ఆగస్టు 10 వరకు వీటిని నిర్వహించే అవకాశం లేదు. ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే టీసీఎస్ షెడ్యూల్ ఆగస్టు 10 వరకు ఫిక్స్ అయి ఉండటమే ఇందుకు కారణం. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్, అదే నెల 26న నీట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, ఇతర పరీక్షలు ఉన్నాయి. వీటన్నింటినీ టీసీఎస్ సంస్థే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ వరకు ఉమ్మడి ప్రవేశపరీక్షలు నిర్వహించే అవకాశం లేదని ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పటికీ కరోనా అదుపులోకి వస్తేనే పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నెల రోజుల్లో కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏమిటనే విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్ష లేకుండా ప్రవేశాలు కష్టమే.. ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రవేశ పరీక్షల ద్వారానే వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు వీటిని నిర్వహిస్తామనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత టీసీఎస్తోనూ మాట్లాడి షెడ్యూల్ సిద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేల కరోనా కేసులు అదుపులోకి రాకపోతే ఆ షెడ్యూల్ ప్రకారమైనా పరీక్షలు జరుగుతాయా.. లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం అని స్పష్టంచేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమే.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతుల ప్రారంభం అసాధ్యమే. ఆగస్టు పదో తేదీ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే వాటి ఫలితాలు వెల్లడించి, ప్రవేశాలు పూర్తి చేసేందుకు కనీసం నెల రోజల సమయం పట్టనుంది. దీంతో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటో తేదీన కాకుండా అక్టోబర్‌లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అది కూడా కరోనా కేసులు అదుపులోకి వచ్చి ప్రవేశ పరీక్షలు నిర్వహించినప్పుడే సాధ్యమవుతుంది. లేకుంటే మరింత ఆలస్యం తప్పదు. ఈసెట్ విద్యార్థులకు ఇబ్బందే.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయి ఈసెట్ ద్వారా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరే (ల్యాటరల్ ఎంట్రీ) విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం వివిధ కోర్సుల్లో చేరే కొత్త విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి, ద్వితీయ సంవత్సరం, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 4న జరగాల్సిన ఈసెట్ కూడా వాయిదా పడింది. దీంతో ఆ విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరడం, ఆగస్టులో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే అవకాశం కనిపించడంలేదు. డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు? కరోనా కారణంగా రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తదితర ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఇక పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపే ఆలోచనలో ఉంది. దీనిపై నేడో, రేపో తుది నిర్ణయం వెలువరిం చనుంది. ఇప్పటికే ఆయా కోర్సుల్లో గత సెమిస్టర్ గ్రేడ్స్ ఆధారంగా ఫైనల్ సెమిస్టర్లో గ్రేడింగ్ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేసినా, వారికి భవిష్యత్‌లో పరీక్షలు నిర్వహిస్తారా లేక గ్రేడింగ్ ఇస్తారా అనేది ప్రకటించనుంది. ఇంటర్ సప్లిమెంటరీపైనా స్పష్టత వచ్చే అవకాశముంది. ఆవేదనలో విద్యార్థులు.. ప్రవేశ పరీక్షల వాయిదాతో దాదాపు 4.68 లక్షల మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో ఈ పరీక్షలకు ఇంకా ఎన్నాళ్లు సిద్ధం కావాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. జూలై 1వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్ర విద్యార్థులు మొత్తంగా 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌కు 2,21,546 లక్షల దరఖాస్తులు రాగా, ఈనెల 6 నుంచి మూడు రోజులపాటు ఐదు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి సెషన్లో 25వేల మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రవేశాల కమిటీ ఏర్పాట్లు చేసింది. కానీ చివరి క్షణంలో పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు నిరాశలో పడ్డారు. -
జేఎన్టీయూలో డిటెన్షన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్–డిలో డిటెన్షన్‌ను జేఎన్టీయూ రద్దు చేసింది. వివిధ సెమిస్టర్లలో విద్యార్థులు పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను జేఎన్టీయూ గురువారం జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలివే.. 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్ విధానం ఉండదు. నిర్దేశిత సబ్జెక్టులు పాస్ కాకున్నా విద్యార్థులంతా తర్వాతి సెమిస్టర్‌కు అనుమతి. ముందుగా ఫైనల్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటలే. గరిష్ట మార్కుల్లో తేడా ఉండదు. పరీక్షల్లో 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. తప్పనిసరి పార్ట్ అనేది లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. లాక్డౌన్ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి. అయితే హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్సైట్లో నమోదు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే నిర్వహణ. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు. బీటెక్ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలు. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలు, ఫార్మ్–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్–డి (పీబీ) సెకండియర్ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభం. ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రథమ బీటెక్, బీపార్మసీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్, నాలుగో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు 3వ తేదీ నుంచే ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, ఎంటెక్, ఎంఫార్మసీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్–డి ఫస్టియర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలూ అప్పుడే ఉంటాయి. జూలై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్ ఎక్స్పరిమెంట్స్, ల్యాబ్ పరీక్షల నిర్వహణ. బీటెక్, బీఫార్మసీ సెకండ్ సెమిస్టర్ (రెగ్యులర్), ఫస్ట్ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్) ఈనెల 6లోగా పూర్తి చేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి... ► విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లో ఉన్నప్పుడు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలి. మాస్క్‌లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించాలి. ► ప్రతి భవనం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి. ► తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. ► థర్మల్ స్కానింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి. ► ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్ చేసి చికిత్స అందించాలి. ► పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్‌కు ఒకరే.. అదీ జిగ్‌జాగ్‌లో కూర్చోబెట్టాలి. -
పదును రెక్కలు
ఆరు దాటితే లోపలికి నో ఎంట్రీ! అమ్మాయిలకు హాస్టల్ నిబంధన. బాధితులకు మాత్రమే దేశం లోపలికి ఎంట్రీ! పౌరసత్వ సవరణ నిబంధన. నిబంధనలు ఈ అమ్మాయిలకు నచ్చలేదు. హాస్టల్ గేటు తాళాలు బద్దలు కొట్టారు. సవరణ చట్టాన్ని నడి వీధిలో తప్పు పట్టారు. చట్టం వీరినిప్పుడు పట్టి బంధించింది. పంజరాలనే రెక్కలతో తెంపుకున్న పక్షులను.. ఏ బందిఖానా ఆపగలుగుతుంది?! దేవాంగన, నటాషా.. ‘పింజ్రా తోఢ్’ సభ్యులు. పింజ్రా తోఢ్ అంటే.. పంజరాన్ని బ్రేక్ చేయమని! పంజరం అంటే.. రూల్!! ‘బ్రేక్ ద రూల్.. బ్రేక్ ద రూల్..’ అనే నినాదం సినిమాల్లో పాటగా అలరిస్తుంది. ప్రభుత్వంపై పోరాటంగా మాత్రం ప్రాణాలనే చిందించవలసి వస్తుంది. అయితే.. స్వేచ్ఛలేని ప్రాణాలెందుకు అనుకునే పక్షిజాతికి ప్రతినిధులు దేవాంగన, నటాషా! మే 23 శనివారం. న్యూఢిల్లీలోని ఈ ఇద్దరి ఇళ్లకు పోలీసులు వెళ్లారు. ఇంట్లోని వాళ్లు.. ఏమిటి? ఎందుకు? ఎక్కడికి? అని అడుగుతున్నా జవాబు ఇవ్వకుండా దేవాంగన, నటాషాలను జీప్‌లో ఎక్కించుకుని వెళ్లారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జఫ్రాబాద్ పోలీస్‌లో ఈ యువతులిద్దరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదై ఉంది. ఆ సంగతి కూడా వాళ్ల తల్లిదండ్రులకు చెప్పలేదు. వచ్చిన వాళ్లు స్పెషల్ సెల్ పోలీసులు. స్పెషల్ వర్క్‌పై వచ్చినవాళ్లు. ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి వీళ్లిద్దరి కోసం వెతుకుతున్నారు. ఫిబ్రవరి 22 శనివారం. అప్పటికింకా కరోనా భయాలు మొదలవలేదు. పౌరసత్వం చట్టం (సి.ఎ.ఎ.) పై అపోహలు వ్యాపించి ఉన్నాయి. అపోహలు భయాలకన్నా ప్రమాదకరమైనవి. పాలనను స్తంభింపజేస్తాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో సి.ఎ.ఎ. వ్యతిరేక ప్రదర్శనకారులు రహదారులు మూసేశారు. జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర సాయంత్రం మొదలైన చిన్నపాటి నిరసన రాత్రి పదికల్లా పెద్ద సమూహం అయింది. సి.ఎ.ఎ.ను వ్యతిరేకిస్తున్నవారికి, సి.ఎ.ఎ.ను వ్యతిరేకిస్తున్న వారిని వ్యతిరేకిస్తున్న వారికి మధ్య ఘర్షణ! పిడికిళ్లు వర్సెస్ ముఖాలపై పిడిగుద్దులు. హింస చెలరేగింది. నినాదాలు రక్తాన్ని చిందించాయి. కొందర్ని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావాళ్లను ఈ మూడు నెలలలుగా ఒక్కొక్కరినీ అరెస్టు చేసుకుంటూ వస్తున్నారు. శనివారం దేవాంగన, నటాషాల వంతు వచ్చింది. అల్లర్లను ప్రేరేపించడం (సెక్షన్ 147), చట్టవిరుద్ధ సమావేశం (సెక్షన్ 149), విధులలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దౌర్జన్యం, దాడి (సెక్షన్ 353), ప్రజలు నడిచే దారిని మూసివేయడం, ప్రమాదస్థలిగా మార్చేయడం (సెక్షన్ 283), హత్యాయత్యం (సెక్షన్ 307), నేరపూరిత కుట్ర (సెక్షన్ 427, 120–బి), ప్రజా విధుల నిర్వహణలో ఉన్న ఆధికారి ఆదేశాలను ధిక్కరించడం (సెక్షన్ 188).. ఇన్ని కేసులు పెట్టారు దేవాంగన, నటాషాల మీద!! మే 23న అరెస్ట్ చేశారు. 24న బెయిల్ వచ్చింది. ఆ వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. ఈసారి హత్య కేసు (సెక్షన్ 302). ఆనాటి అల్లర్లతో సంబంధం ఉన్న ఒక హత్యకు వీళ్లను బాధ్యులను చేస్తూ ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. పద్నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తే హత్య వెనుక కుట్రను వెలికి తీయగలుగుతాం అని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు అధికారి కోర్టును అడిగారు. అన్ని రోజుల కస్టడీ అక్కర్లేదు. రెండు రోజులు చాలు అంది కోర్టు. తర్వాతి వాదనల్లో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. దేవాంగన, నటాషాల అరెస్టు, పోలీసు కస్టడీలపై దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆన్లైన్లో సంఘటితం అవడం అప్పుడే మొదలైంది. దేవాంగన కాళిత (30), నటాషా నర్వాల్ (32) ఢిల్లీలోని జె.ఎన్.యు. విద్యార్థినులు. దేవాంగన ‘సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్’లో ఎం.ఫిల్ స్టూడెంట్. నటాషా ‘సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్’లో పీహెచ్.డీ చేస్తున్నారు. దేవాంగన.. యూనివర్సిటీలోని మిరాండా హౌస్‌లో, నటాషా.. హిందూ కాలేజ్‌లో డిగ్రీ చేశారు. దేవాంగన గౌహతి అమ్మాయి. ఆమె తండ్రి గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పేరున్న వైద్యుడు. నటాషా హర్యానా అమ్మాయి. ఎంపిక చేసుకున్న కొన్ని వెబ్సైట్లకు తన పేరు తప్ప వ్యక్తిగత వివరాలేవీ లేకుండా వ్యాసాలు రాస్తుంటారు. పింజ్రా తోఢ్ సాయంత్రం ఆరు లోపే విద్యార్థినులు హాస్టల్ లోపలికి వచ్చేయాలని, ఉదయం ఏడు వరకు హాస్టల్ నుంచి బయటికి వెళ్లకూడదని ఢిల్లీలోని విశ్వవిద్యాలయాలలో ఉన్న నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ తాళాలు బద్దలు కొడుతున్న ‘పింజ్రా తోఢ్’ (బ్రేక్ ద కేజ్) ఉద్యమ కార్యకర్తలు. పింజ్రాతోఢ్ను దేవాంగన, నటాషా 2015లో స్థాపించారు. -
‘త్రీడీ’ ఫేస్ షీల్డ్, మాస్క్‌లు
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడేలా త్రీడీ ప్రింటింగ్ పరిజ్ఞానంతో ఫేస్ షీల్డ్స్, మాస్కులను హైదరాబాద్ జేఎన్టీయూ రూపొందించింది. యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీ విభాగం వీటిని తయారు చేసింది. మెడికల్ సిబ్బందికి, పోలీసులకు అత్యంత రక్షణగా ఉండేలా వీటిని రూపొందించారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో వైద్యులు ఉపయోగిస్తున్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్స్ ముఖం మొత్తం కవర్ అయ్యేలా లేవని, త్రీడీ ప్రింటింగ్ పరిజ్ఞానంతో పూర్తి రక్షణ కలిగేలా వీటిని రూపొందించామని చెబుతున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ టెక్విప్ ఆర్అండ్డీ సహకారంతో వీటిని తయారు చేశారు. పూర్తి స్థాయిలో వైరస్‌ను అడ్డుకునేలా.. రోగి దగ్గినపుడు, తుమ్మినప్పుడు తుంపర్లు, వైరస్ గాలిలోకి వ్యాపించకుండా ఆపేందుకు ఆక్రిలిక్ షీట్‌తో ఈ షీల్డ్స్‌ను రూపొందించారు. పైగా ఇవి రీయూజబుల్. ఒకసారి ఉపయోగించిన షీట్‌ను సబ్బు లేదా కెమికల్‌తో క్లీన్ చేసుకొని మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. మాస్క్‌లను కూడా మళ్లీ ఉపయోగించుకునేలా రూపొందించారు. మాస్క్‌లో ఉండే ఫిల్టర్‌ను మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుంది. సాధారణ సర్జికల్ ఫైబర్‌ను మాస్క్‌లో ఫిల్టర్‌గా వినియోగించారు. ఇప్పటికే వివిధ విభాగాలకు అందజేత జేఎన్టీయూ నానో టెక్నాలజీ విభాగం రూపొందించిన ఈ షీల్డ్స్‌ను ఇప్పటికే పలు విభాగాలకు అందజేసినట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 500, ఉస్మానియా ఆసుపత్రికి 170, డీఆర్బీఆర్కేఆర్ఆర్ ఆయుర్వేద ఆసుపత్రికి 20, మరో 150 వరకు ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు అందజేసినట్లు వెల్లడించారు. జింక్, కాపర్ అయాన్స్‌తో ఫిల్టర్స్ రూపకల్పన మాస్క్‌లలో ఉండే ఫిల్టర్లు మరింత మెరుగైనవిగా, వైరస్‌లను నిర్మూలించేవిగా తయారు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. జింక్, కాపర్ అయాన్స్‌తో కూడిన ఫిల్టర్స్ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. అవి వైరస్ వ్యాపించకుండా, శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. త్వరలోనే వాటిని అందుబాటులోకి తెస్తాం. మా ల్యాబ్‌లో రోజుకు 20 షీల్డ్స్‌ను రూపొందిస్తున్నాం. – డాక్టర్ శిల్పాచక్ర, జేఎన్టీయూ నానో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ -
డిజిటల్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడిన నేపథ్యంలో సిలబస్ పూర్తికి పక్కాగా ముందుకు సాగాలని జేఎన్టీయూ తన అనుబంధ కాలేజీలకు ఆదేశాలిచ్చింది. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులు చదివే విద్యార్థులకు వెబ్సైట్, వాట్సాప్, గూగుల్ డ్రైవ్ వంటి ఆన్లైన్ సేవల ద్వారా పాఠ్యాంశాలను బోధించాలని సూచించింది. కాలేజీల ఫ్యాకల్టీ వీడియో పాఠాలను రికార్డు చేసి విద్యార్థులకు పంపి చదివించాలని, తద్వారా సిలబస్ పూర్తిచేయాలని పేర్కొంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలోనూ పాఠ్యాంశాలను రూపొందించి విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలంది. ఈ ఆదేశాలను వర్సిటీ పరిధిలోని అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలన్నీ విధిగా పాటించాలని స్పష్టంచేసింది. సిలబస్ పూర్తికి ఆన్లైన్ బోధన నిర్వహించాలని ఇటీవల అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించిన నేపథ్యంలో జేఎన్టీయూ ఈ చర్యలు చేపట్టింది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలూ ఈ దిశగా చర్యలు చేపట్టాయి. ఇవీ ఆదేశాల్లోని ప్రధాన అంశాలు లాక్డౌన్లో విద్యార్థులకు బోధనను అందించేందుకు అందుబాటులో ఉన్న ఆన్లైన్ సేవలన్నింటినీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు సద్వినియోగపర్చు కోవాలి. పరీక్షలకు సంబంధించి వర్సిటీ జారీచేసే ఆదేశాలను పాటించాలి. ఈ–మెయిల్ గ్రూప్స్: విద్యార్థుల ఈ–మెయిల్ ఐడీలతో గ్రూప్‌ను ఏర్పాటు చేయాలి. ఫ్యాకల్టీ తమ సబ్జెక్టుల మెటీరియల్స్ ఈ గ్రూపునకు పంపించాలి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలోనూ పాఠాలను పంపించాలి. వీడియో లెక్చర్స్: ఫ్యాకల్టీ, లెక్చరర్లు తమ పాఠాలను వీడియో రూపంలో రికార్డు చేసి గూగుల్ డ్రైవ్, ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపించాలి. వెబ్సైట్లోనూ అప్‌లోడ్‌చేసి విద్యార్థులకు తెలపాలి. స్కైప్: లెక్చరర్లు స్కైప్ ద్వారా, గూగుల్ డ్యూయో, జూమ్ ద్వారా పాఠాలను బోధించాలి. ఎన్పీటీఈఎల్, స్వయం పోర్టల్, మూక్స్‌లలో అందుబాటులో ఉన్న వీడియోపాఠాలు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ గురించి విద్యార్థులకు తెలపాలి. వీటికి సంబంధించి కాలేజీల వారీగా చేపట్టిన చర్యలపై ఈనెల 10లోగా యూనివర్సిటీకి తెలియజేయాలి. యూజీసీ ఆదేశాలు..: ఆన్లైన్లో ఉన్న వీడియో పాఠాలు, స్టడీమెటీరియల్ పోర్టల్స్ గురించి ఇప్పటికే యూజీసీ, ఏఐసీటీఈ ప్రకటించాయి. తాజాగా హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండే విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, నిపుణుల సూచనలతో కూడిన వీడియో సందేశాలను యూట్యూబ్‌లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆ లింక్స్‌ను విద్యార్థులకు ఈ–మెయిల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా యూనివర్సిటీలు, కాలేజీలు పంపించాలని పేర్కొంది. ప్రవర్తనపరంగా సమస్యలు గుర్తిస్తే సైకో సోషల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 08046110007కు తెలపాలని సూచించింది. -
బీటెక్ కొత్త కోర్సుల్లో 21 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్ వంటి కొత్త కోర్సుల్లో ఈసారి 21 వేల వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త కోర్సుల్లో 20,700 వరకు సీట్లు నింపుకొనేందుకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వాలని యాజమాన్యాలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకోగా, మరో 1,500 సీట్ల కోసం దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 800 వరకు సీట్లలో కొత్త కోర్సులు నిర్వహించేందుకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సుల్లో 23 వేల సీట్లకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులు రానున్నాయి. అయితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) కాలేజీల్లో తనిఖీలు చేపట్టి, లోపాల మేరకు కోతపెట్టినా కనీసం 21 వేల వరకు కొత్త కోర్సుల్లో సీట్లకు అనుబంధ గర్తింపు లభించే అవకాశం ఉంది. న్యాక్, ఎన్బీఏ ఉంటేనే.. యూనివర్సిటీలు విధించిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 100కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు రానున్నాయి. జేఎన్టీయూ పరిధిలో ఇప్పటికే 90 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో మరో 10కి పైగా కాలేజీల్లో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అయ్యాయి. దీంతో 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను ఆఫర్ చేసే కాలేజీల సంఖ్య వందకు పైనే ఉండనుంది. కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యూనివర్సిటీలు పలు నిబంధనలు విధించాయి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీతో పాటు నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు, కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) కలిగిన కోర్సులు ఉన్న కాలేజీల్లోనే కొత్త కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా ఉన్న సమయం.. జేఎన్టీయూ పరిధిలో అనుబంధ గుర్తింపు కోసం ముందుగా ఇచ్చిన దరఖాస్తుల గడువు ఈనెల 12తో ముగిసినా, యూనివర్సిటీ 16 వరకు పొడిగించింది. ఉస్మానియా యూనివర్సిటీ దరఖాస్తుల గడువు మరో 20 రోజుల వరకు ఉంది. జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో ఎంటెక్ కోర్సులోనూ సైబర్ సెక్యురిటీ, డేటా సైన్స్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. ఇప్పటికే 618 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేయగా, ఎం.ఫార్మసీలోనూ 45 సీట్లలో, ఫార్మ్–డీలోనూ 10 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇలా మొత్తం జేఎన్టీయూ పరిధిలో ఇప్పటి వరకు 21,373 సీట్లలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. -
‘ఆ రూట్లో.. ట్రామ్ లేదా బీఆర్టీఎస్ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలివేటెడ్ పద్ధతిలో బీఆర్టీఎస్ కారిడార్ గాని ట్రామ్ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో కారిడార్ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్నైనా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్టీయూ నుంచి హైటెక్‌సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్ మార్గాన్ని గాని ఎలివేటెడ్ కారిడార్ ద్వారా బీఆర్టీఎస్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో పాస్‌ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
ఏఐసీటీఈకి ఇంజనీరింగ్ కాలేజీల నివేదికలు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్, 111జీవో పరిధిలో ఉన్న 238 ఇంజనీరింగ్ కాలేజీల్లో శుక్రవారం వరకు లోపాల సవరణకు చేపట్టిన చర్యలపై యాజమాన్యాలు ఇచ్చిన నివేదికలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో లోపాలున్న ఈ కాలేజీలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలనుంచి నివేదికలను తీసుకోవాలని జేఎన్టీయూ ను ఆదేశించింది. దీంతో జేఎన్టీయూ యాజమాన్యాల నుంచి నివేదికలు కోరగా, 86 కాలేజీలే లోపాల సవరణకు చేపట్టిన నివేదికలను అందజేశాయి. అందులో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలు 82 ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కాలేజీలు 4 ఉన్నాయి. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటిపై చర్చించారు. కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఇచ్చిన దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 5 వరకు ఉంది. దీంతో ఆలోగా లోపాల సవరణ నివేదికలను ఏఐసీటీఈకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. -
పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్‌టేక్) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది. ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్‌పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మూడు రోజుల్లో గవర్నింగ్ బాడీల నామినీలు ప్రతి కాలేజీ గవర్నింగ్ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్టీయూ స్పష్టం చేసింది. జేఎన్టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది. కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్ రూపొందించి జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు. -
మార్చి రెండో వారంలో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకాలు త్వరలోనే జరగనున్నాయి. వీసీల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను ఆదేశించడంతో వీసీల నియామకంపై కదలిక మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయితే 10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలు ఉండగా, జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు ఇన్చార్జి వీసీని కూడా నియమించలేదు. గతేడాది జూన్ 23 నాటికి జేఎన్ఏఎఫ్ఏయూ, బాసర ఆర్జీయూకేటీకి వీసీలు ఉన్నందున, అప్పట్లో జారీ చేసిన వీసీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో వాటిని పేర్కొనలేదు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు, 984 దరఖాస్తు ఫారాలు అందజేశారు. ఒక్కొక్కరు రెండు మూడింటికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు యూనివర్సిటీల నామినీలను, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిందే తప్ప కమిటీల సమావేశాలు జరగలేదు. సెర్చ్ కమిటీల్లో యూనివర్సిటీ నామినీగా నియమించిన వారి నియామకం చెల్లదని, యూనివర్సిటీల పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు (ఈసీ) లేకుండా, ఆ ఈసీలు సిఫారసు చేయకుండా పెట్టిన నామినీల నియామకం కుదరదన్న వాదనలు వచ్చాయి. దాంతో సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి.. ఈసీల నియామకం కోసం ప్రతిపాదలను ప్రభుత్వానికి గత నెలలోనే పంపింది. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. బుధవారం సీఎం ఆదేశాలు జారీ చేసినందున ఈ వారం రోజుల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆయా యూనివర్సిటీల నుంచి సెర్చ్ కమిటీల్లో ఉండే యూనివర్సిటీల నామినీల పేర్లను ప్రభుత్వం తెప్పించుకోనుంది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనున్నాయి. మొత్తానికి వచ్చే వారంలో సెర్చ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీలు ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం యూనివర్సిటీల ఛాన్స్లర్ అయిన గవర్నర్ ఆమోదానికి పంపనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గవర్నర్ ఆమోదంతో మార్చి రెండో వారంలో కొత్త వీసీలు రానున్నారు. దరఖాస్తు చేసుకోకున్నా.. యూనివర్సిటీల వీసీలుగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు దరఖాస్తు చేసుకోని వారిని కూడా సెర్చ్ కమిటీ ఎంపిక చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి ప్రొఫెసర్‌గా పదేళ్ల అర్హత లేని వారు కూడా 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించారు. ప్రస్తుతం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే వారిని సెర్చ్ కమిటీలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్న విషయంలో చర్చ జరుగుతోంది. అయితే సెర్చ్ కమిటీలు వారి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మూడు వారాల్లోగా నియామకం: సీఎం రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్) నియామక ప్రక్రియను రెండు మూడు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. వీసీల నియామకానికి వీలుగా వెంటనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెర్చ్ కమిటీ ద్వారా వీరి పేర్లను తెప్పించుకోవాలని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లపై స్పష్టత వస్తే వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందన్నారు. -
నకిలీలతో జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే యాజమాన్యాలపై చర్యలు చేపడతామని జేఎన్టీయూ పేర్కొంది. తమ కాలేజీల్లో చేరే ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. నకిలీ/ఇన్వ్యాలిడ్ సర్టిఫికెట్లు, నకిలీ పీహెచ్‌డీలు చూపించి ఏయే కోర్సులకు అనుబంధ గుర్తింపు పొందుతారో కాలేజీల్లో ఆయా కోర్సు లను రద్దు చేస్తామని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు చూపించే ఫ్యాకల్టీకి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలను ఏడాది పొడవునా పరిశీలిస్తామని, ఏ దశలోనైనా హాజరు లేకపోయినా వారు, కాలేజీలో లేకపోయినా ఆయా కోర్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అఫీలియేషన్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను జేఎన్టీయూ సోమవారం ప్రకటించింది. దానిపై యాజమాన్యాలు మెయిల్ ద్వారా (feedbackaac@jntuh.ac.in) అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలపాలని స్పష్టం చేసింది. ఏటా పరిగణనలోకి తీసుకునే నిబంధనలతో పాటు ఈసారి కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ వెల్ఫేర్, కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అంశాలను పొందుపరిచింది. మరోవైపు ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే గడిచిన మూడేళ్లలో కాలేజీల్లో ప్రవేశాలు 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గతంలో అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో లేని విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు వివిధ కారణాలతో తమ వద్దే పెట్టుకోవద్దనే నిబంధనను ఈసారి రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌లోని ప్రధాన అంశాలు.. ►కాలేజీల గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ సమావేశాల మినిట్స్‌ను కచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ►ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరును ఏడాది కాలంలో ఎప్పుడైనా పరిశీలిస్తారు. ఫ్యాకల్టీ లేకపోతే ఆ కోర్సుల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారు. ►కాలేజీల్లో తమ ఉద్యోగులు, ఫ్యాకల్టీకి వర్తింపజేస్తున్న సర్వీసు రూల్స్‌ను కూడా యూనివర్సిటీకి అన్లైన్ అందజేయాలి. -
కొత్త కోర్సులు వస్తున్నాయ్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉంటే 2020–21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కాలేజీలకు గుర్తింపి వ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5 కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ప్రవేశపెట్టగా, 2020–21 విద్యా సంవత్సరంలో సదుపాయాలు ఉన్న అన్ని కాలేజీలు ఆ కోర్సును ప్రారంభించేందుకు అనుమతులను ఇవ్వనుంది. ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ బిజి నెస్ సిస్టమ్స్ (సీఎస్బీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐటీ ఈ) కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుబంధ గుర్తింపివ్వాలని నిర్ణయిం చింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజీలతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తు తం జేఎన్టీయూ పరిధిలో 170 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిలో లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. అయితే ఏటా జేఎన్టీయూ 85 వేల వరకు సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ప్రస్తుతం కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అదనంగా మరో 10 వేల సీట్లలో ప్రవేశాలకు అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు 100 ఫార్మసీ కాలేజీలు, 10 పీజీ కాలేజీ లున్నాయి. వాటిలో 50 వేల వరకు సీట్లు ఉన్నాయి. వాటిలోనూ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండి, ఆయా కోర్సులను ప్రారంభించాలనుకునే యాజమాన్యాల నుంచి జేఎన్టీయూ దరఖాస్తులు స్వీకరించి అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని డ్రాఫ్ట్ అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. ఎం.ఫార్మసీలో నాలుగు కొత్త కోర్సులు.. ఎం.ఫార్మసీలోనూ 4 కొత్త కోర్సులకు అనుమతివ్వనుంది. మార్కెట్ అవసరాల మేరకు కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇతర సబ్జెక్టులతో కాంబినేషన్‌గా ఉన్న సబ్జెక్టులను ప్రత్యేక సబ్జెక్టులు గా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను నిర్వహించేందుకు కాలేజీ లకు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. డిమాండ్ లేని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాసూ్యటికల్ అనాలిసిస్, క్వాలిటీ అషూరెన్స్, ఫార్మాసూ్యటికల్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అషూరెన్స్ కోర్సులు తొలగించింది. కొత్త కోర్సులతోపాటు కొత్త కాలేజీలు.. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులతో పాటు అదనపు సీట్లకు ఓకే చెప్పనుంది. మరోవైపు కొత్త కాలేజీలకూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటేనే వాటికి ఓకే చెప్పాలని, ఎన్వోసీ అందజేయాలని నిర్ణయించింది. కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వర్సిటీ ఎన్వోసీ ఇవ్వాలి. అది ఉంటేనే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కాలేజీల ఏర్పాటుకు, ఇంటేక్ పెంపునకు అనుమతి ఇవ్వనుంది. 2020–21 విద్యాసంవత్సరంలో కాలేజీల అనుమతులకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ ను ఇంకా విడుదల కాలేదు. అది విడుదలయ్యాక ఏఐసీటీఈ అందులో విధాన నిర్ణయానిన్న ప్రకటిం చనుంది. కొత్త కోర్సులకు అనుమతించాలని కిందటేడాదే ఏఐసీటీఈ విధానపర నిర్ణయం తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, డాటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఏఐసీటీఈ వ్యతిరేకించేది ఉండదు కాబట్టి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. -
వికేంద్రీకరణతోనే ప్రగతి పరుగులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు కావాలని విద్యార్థి లోకం నినదించింది. ఆ దిశగా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర అసెంబ్లీకి జేజేలు పలికింది. మరోవైపు పాలన వికేంద్రీకరణతోనే ప్రగతి పరుగులు పెడుతుందని ప్రొఫెసర్లు గళమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థుల ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి పాలన వికేంద్రీకరణకు మద్దతు పలకగా.. సదస్సులు నిర్వహించి ప్రొఫెసర్లు వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను ఎలుగెత్తి చాటారు. – సాక్షి నెట్వర్క్ అభివృద్ధి విస్తరిస్తేనే సమన్యాయం పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలల్లో మంగళవారం సదస్సులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని సంహిత కళాశాలలో ‘రాష్ట్రాభివృద్ధి–వికేంద్రీకరణ–పాలన’ అంశాలపై నిర్వహించిన సదస్సులో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా అధికార వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్)లో యువజన విభాగం ఆధ్వర్యంలో ‘పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుతో కలిగే అభివృద్ధి, ఒనగూరే ప్రయోజనాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తదితరులు పాల్గొన్నారు. మేధావుల నోట అదే మాట అనంతపురంలోని జేఎన్టీయూలో నిర్వహించిన సదస్సుకు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు హాజరై వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ పీడబ్ల్యూ పురుషోత్తం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి విద్యార్థులకు వివరించారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాయలసీమతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మేధావులు పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో మంగళవారం ‘నిధులు, నీళ్లు, నియామకాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ప్రకటిస్తూ.. పాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ఎస్వీయూ రిటైర్ట్ ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్యణ్యంరెడ్డి, ఎ.రంగారెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం కార్యదర్శి రెడ్డి భాస్కర్‌రెడ్డి, మేనేజ్మెంట్ ప్రొఫెసర్ సర్దార్ గూగ్లోత్ పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సెనెట్ హాల్లో మూడు రాజధానుల ఏర్పాటు, పాలన వికేంద్రీకణ వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చించారు. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ ఎం.పురుషోత్తం రెడ్డి, సొదుం రమణ, నర్మద, ఆదిమూలం శేఖర్, అధ్యాపకులు వైఎస్ శారద, ఉమామహేశ్వరి, కళారాణి, సంధ్యా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆప్స్ అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి పాల్గొన్నారు. ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అని కడప విద్యార్థులు నినదించారు. పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. వికేంద్రీకరణతోనే సర్వతోముఖాభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయని ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ టీఎల్ఎన్ మీటింగ్ హాల్లో ‘వికేంద్రీకరణ–అభివృద్ధి’ అనే అంశంపై మంగళవారం సదస్సు జరిగింది. ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. తరతరాలుగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె.రవి, ప్రొఫెసర్లు కె.వెంకటరావు, కె.షారోన్‌రాజు, కె.జాన్, పేటేటి ప్రేమానందం, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ అనే అంశంపై విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో వక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ స్వార్థ ప్రయోజనాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, యువజన నాయకులు అల్లు చాణక్య, జీవీ రంగారావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ–మూడు రాజధానులు’ అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఎచ్చెర్ల పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కైలాసరావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెంటాడ వెంకట స్వరూప్, జిల్లా ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం పాల్గొన్నారు. పల్లెలకూ పాకిన ప్రదర్శనలు పాలన వికేంద్రీకరణను సమర్ధిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలోని బంగారుగూడెం, వీరంపాలెం, పట్టెంపాలెం మీదుగా తాడేపల్లిగూడెం వరకు యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలంటే మూడు రాజధానులు ఏర్పాటు కావాలని నినదించారు. -
కాలగర్భంలో తొలి దేవదాయ శాఖ కళాశాల!
సాక్షి, జేఎన్టీయూ(అనంతపురం): నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ప్రధాన ఆశయంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో నెలకొల్పిన శ్రీకాళహస్తీశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) ఇంజినీరింగ్ కళాశాల కాలగర్భంలో కలిసిపోనుంది. కళాశాలను బాగు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు ఏ కారణంగానో నిద్రావస్థలో ఉన్నారు. ఫలితంగా కళాశాల భవిత ప్రశ్నార్థకంగా మారింది. స్కిట్ కళాశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి కూడా రాలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందిస్తేగానీ కళాశాలకు పూర్వవైభవం రాదు. 2014 తర్వాతనే పతనం ఒకనాడు ఎంతో కీర్తిని ఆర్జించిన స్కిట్‌కు 2014 తర్వాత పతనం మొదలయింది. ప్రిన్సిపాళ్లను తరచూ మార్చడం, ఆలయ ఈవోలు పట్టించుకోకపోవడం, అధ్యాపకులు గ్రూపులుగా విడిపోవడం, బోధన పట్టించుకోకపోవడంం తదితర కారణాలతో స్కిట్ నిర్వహణ అస్థవ్యస్థంగా మారింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చదువులు పూర్తిగా కుంటుపడ్డాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. దీంతో ఈ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతూ వచ్చింది. రెండేళ్లుగా ఒకరు కూడా చేరలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. గతంలో పని చేసిన ఓ ప్రిన్సిపల్ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంతో 2019–2020 విద్యా సంసవత్సరానికి ఏఐసీటీఈ నుంచి అనుమతులు కూడా మంజూరు కాలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. కాగా, స్కిట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తే.. ఈ కళాశాలలో విద్యార్థులకు నిర్ధేశించిన ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రీయింబర్స్మెంట్ భారం తగ్గుతుంది. కేవలం బోధన, బోధనేతర సిబ్బందిని నియామకం చేసుకుని బ్లాక్‌గ్రాంట్ నుంచి జీతాలు చెల్లిస్తారు. మేము అసమర్థులం! మరో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగ్గ శక్తిసామర్థ్యాలు, ప్రతిభాపాటవాలు, సమర్థత తమకు లేదని పరోక్షంగా జేఎన్టీయూ(ఏ) డెరెక్టర్లు అంగీకరిస్తున్నట్లుగా ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న స్కిట్‌ను ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటును ఆమోదిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రూ. 10 కోట్లు నిధులు మంజూరుకు ఉన్నత విద్యాశాఖ అంగీకారం తెలిపింది. అయితే తమ పరిధిలో అవసరం లేదని, స్కిట్‌ను కానిస్టిట్యూట్ కళాశాలగా మార్పు చేయలేమంటూ జేఎన్టీయూ(ఏ) డైరెక్టర్లు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు. తమకు తామే సుప్రీంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉచిత సాంకేతిక విద్యకు విఘాతం స్కిట్‌ను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే రాయలసీమలో నాలుగో కళాశాలగా గుర్తింపు దక్కుతుంది. అంతేకాక విద్యార్థులకు ఉచిత సాంకేతిక విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తే ఉద్యోగాల కల్పనకు బహుళజాతి కంపెనీలు సైతం ఆసక్తి చూపుతాయి. జేఎన్టీయూ(ఏ), దీని అనుబంధ కలికిరి, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఇటీవల అత్యున్నత బహుళజాతి సంస్థల్లో గణనీయంగా కొలువులు సాధించడమే ఇందుకు నిదర్శనం. మరో వైపు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నూతనంగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నూతన పరిశోధనలకు ఆస్కారం కలుగుతుంది. నాణ్యమైన బోధన, పరిశోధనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయి. అయితే వీటన్నింటినీ కాదంటూ జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం, డైరెక్టర్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల స్కిట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉచిత ఉన్నత సాంకేతిక విద్యకు విఘాతం కలుగుతోంది. తొలి దేవదాయ శాఖ కళాశాల శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో 1997లో స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఏకైక ఇంజినీరింగ్ కాలేజీ ఇదే కావడం విశేషం. అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతో మొదట కాసాగార్డెన్‌లోని భవనాల్లో కళాశాలను నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తి పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కనే సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించారు. మొదట్లో బీటెక్ కోర్సులకే అనుమతి ఉండేది. ఆ తరువాత ఎంటెక్ కోర్సులకూ అనుమతి లభించింది. డైరెక్టర్లను ఒప్పించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం ఉన్న కానిస్టిట్యూట్ కళాశాలల్లో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను మరో కానిస్టిట్యూట్ కళాశాలగా మార్చేందుకు మాకూ ఆసక్తి ఉంది. అయితే డైరెక్టర్లు ఇందుకు సమ్మతించడం లేదు. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియామకం చేయాలి. అప్పుడే ఉన్నతవిద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలను కానిస్టిట్యూట్ కళాశాలగా తీసుకోవాలని ఆదేశిస్తే తప్పదు. డైరెక్టర్లతో మరో దఫా సమావేశం నిర్వహించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం. – ప్రొఫెసర్ ఎస్ .శ్రీనివాసకుమార్, వీసీ, జేఎన్టీయూ(ఏ) -
హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
పుల్కల్ (అందోల్): ఫోన్ మాట్లాడుతూ హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సూల్తాన్‌పూర్ జేఎన్టీయూలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు అఖిల్ కుమార్ సుల్తాన్పూర్ జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అఖిల్ మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో బ్రేష్ చేసుకుంటూ హాస్టల్ భవనంపై ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే మంగళవారం కాలేజీకి సెలవు కావడంతో కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అఖిల్ మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ పెంటయ్య తెలిపారు. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉండాల్సిన కాలేజీ వైద్య సిబ్బంది లేకపోవడంతో అఖిల్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించాలని విద్యార్థులు రిజి్రస్టార్‌ను కోరారు. -
నకిలీ పట్టేస్తా!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం మన దేశం నుంచి ఏటా లక్షల మంది అమెరికాకు బారులు తీరుతున్నారు. అక్కడి కాలేజీల్లో ప్రవేశాలు, సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కొందరు విద్యార్థులు, యువత నకిలీ సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. దరఖాస్తుల వివరాలపై లోతుగా ఆరా తీసే క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూస్తుండటంతో, ఈ అంశంపై దృష్టి సారించాలని అమెరికా రాయబార కార్యాలయం భారత్‌కు సూచించింది. పైగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఏపీల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందుకు తెలంగాణ ఐటీ శాఖ నడుం బిగించింది. నకిలీ సర్టిఫికెట్ల నివారణకు ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత పరిష్కారమని ఐటీ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డుతో పాటు, బాసర ట్రిపుల్ ఐటీలోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఐటీ శాఖ.. హైదరాబాద్ జేఎన్టీయూ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్ల వివరాలను కూడా త్వరలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ జేఎన్టీయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో జేఎన్టీయూను ఎంపిక చేసినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ‘బ్లాక్‌చెయిన్’సాంకేతికత ఆచరణలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్ ఇటీవలే ప్రకటించింది. ఇతర రంగాలకూ విస్తరణ నకిలీ సర్టిఫికెట్లను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, ఇతర నియామక కంపెనీల వద్ద కూడా లేదు. నకిలీల బెడద ఎదుర్కోవడంలో బ్లాక్‌చెయిన్ సాంకేతికత సమర్థంగా ఉపయోగపడుతుందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగంలో భారత్ ముందంజలో ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ బ్లాక్‌చెయిన్ స్టాండర్డ్స్ కాన్ఫరెన్స్’వెల్లడించింది. దేశంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించడమే కాకుండా ఇతర రంగాల్లోనూ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. విద్యుత్ శాఖ లావాదేవీల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచడంతో పాటు, వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తగ్గించడం లక్ష్యంగా ‘బ్లాక్‌చెయిన్’ను వేదికగా చేసుకుని పీ2పీ (పీర్ టు పీర్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పీ2పీ బ్లాక్‌చెయిన్ వేదికను రూపొందించేందుకు అహ్మదాబాద్ ఐఐఎంతో రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల జీవిత కాలానికి సంబంధించిన సమాచారం (వెహికల్ లైఫ్‌టైమ్ మేనేజ్మెంట్), ఔషధాల్లో నకిలీల నివారణలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్లాక్‌చెయిన్ అంటే.. ఇంటర్నెట్ రంగానికి ఇటీవల వెన్నెముకగా మారుతున్న నూతన ఐటీ సాంకేతికత పేరు ‘బ్లాక్‌చెయిన్’. ఈ నూతన సాంకేతికత ద్వారా డిజిటల్ సమాచారాన్ని పంపిణీ చేయొచ్చు కానీ కాపీ చేయలేం. ఒక సంస్థ తన సమాచారాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందుబాటులో పెడుతుంది. కానీ ఆ సంస్థ అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని తస్కరించడం లేదా కాపీ చేయడానికి అవకాశం లేకుండా, డేటా నిర్వహణ పూర్తిగా సదరు సంస్థ అధీనంలోనే ఉంటుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్లాట్ఫారంలోని భాగస్వామి ఏదైనా సమాచారాన్ని కోరితే.. ఆ సమాచారాన్ని కలిగి ఉన్న భాగస్వామి తన డేటా బేస్‌ను పరిశీలించి సమాధానం ఇవ్వొచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ఏదైనా కొత్త సాంకేతికతకు ఉన్నట్లే బ్లాక్‌చెయిన్‌కు కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయని, అయితే రాబోయే రోజుల్లో వాటిని అధిగమిస్తామని ఐటీ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. -
నరకానికి కేరాఫ్..
సాక్షి ప్రతినిధి విజయనగరం: విజయనగరంలోని జేఎన్టీయూకే క్యాంపస్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వందల మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటూ కాలేజ్ మెస్‌లోనే తింటున్నారు. కానీ కొన్ని నెలలుగా ఈ మెస్ సరిగ్గా నడవడం లేదు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి వచ్చి భోజనం చేయాల్సి వస్తోంది. లేదా పస్తులుండాలి. మరో వైపు కళాశాలలో పరిశోధన శాల అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రెండు రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విద్యార్థులు ఆందోళనల చేపడుతున్నారు. ప్రిన్సిపల్ ఆధిపత్యం.. కళాశాలలో మొత్తం 1670 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 1430 మంది వసతి గృహంలోనే ఉంటున్నారు. స్టూడెంట్ మెస్‌లు నడుపుతూ విద్యార్ధులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ నిర్వహణలో భోజన వసతి వ్యవహారంలో స్టూడెంట్స్‌కి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రిన్సిపల్ ఆధిపత్యం వల్ల మెస్ చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతి మెస్ నిర్వహణలో రూ.3 వేలు వరకు వచ్చిన బిల్లును స్టూడెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ ద్వారా రూ.1400 కి తీసుకొచ్చారు. కానీ ప్రిన్సిపాల్ ఆధిపత్యంలో మెస్ నిర్వహణ వచ్చినప్పటి నుంచి రూ.1900 కి మెస్ బిల్లు చేరింది. దాదాపు నెలన్నరగా విద్యార్ధుల చేత నడిపించే మెస్‌లకు నీటి సౌకర్యం ఆగిపోయింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. రెండేళ్లుగా కళాశాల ప్రాంగణానికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రయోగశాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ రెండేళ్లుగా వాటి ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను పిలిచి డిపార్ట్మెంట్లకు అందజేయడం లేదు. నిధులున్నా విద్యార్థులకు ప్రయోగశాల నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయలేదు. హాస్టల్లో మౌలిక సౌకర్యాల కొరత ఉంది. క్రీడాప్రాంగణం కళాశాల క్రీడలు ఆడుకునే స్థాయిలో లేదు. వీటిపై విద్యార్థులెవరైనా వ్యక్తిగతంగా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా రు. మార్కులు తగ్గించేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. ఈ నేప థ్యంలో మూకుమ్మడిగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మిడ్ ఎగ్జామ్స్‌కి దూరమైనా కూడా నిరసనలో పాల్గొంటున్నారు. దిగివచ్చిన రిజిస్ట్రార్.. జేఎన్టీయూ వీసీ వస్తేగానీ నిరసన విరమించేది లేదంటూ మంగళ వారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విద్యార్థులు ఆందో ళన కొనసాగించారు. రాత్రి వేళ చీకట్లోనూ కళాశాల గేటు వద్ద బైఠాయించారు. చేసేది లేక జేఎన్టీయూ కాకినాడ యూనివర్శిటీ రిజస్ట్రార్ సుబ్బారావు బుధవారం విజయనగరం వచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలతో సమస్యలపై సమీక్షించారు. అనంత రం విద్యార్థుల వద్దకు వచ్చివారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల నిర్వహణలో లోపాలున్నట్లు ఆయన గుర్తించారు. అకడమిక్కి నష్టం కలగకుండా వాటిని సరిదిద్దుకుందామని వారికి హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పే వారిపై పరోక్షంగా ఫ్యాకల్టీ శిక్షలు వేస్తున్నారని విద్యార్థులు రిజిస్ట్రార్ ముందు ఏకరుపు పెట్టడంతో అక్కడున్న కళాశాల ఫ్యాకలీ, ఇతర సిబ్బందిని రిజస్ట్రార్ కళాశాల లోపలికి పంపారు. అనంతరం విద్యార్థులు చెప్పిన సమస్యల్లో ప్రధానంగా కళాశాల గ్రంథాలయ సౌకర్యాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.లక్షలోపు నిధులను విడుదల చేసే అర్హత తనకు ఉందని ప్రస్తుతం సెమిస్టర్‌కి అవసరమైన తక్షణ మెటీరియల్‌ని తెప్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో కంప్యూటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలన్న డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిస్తాన్నారు. ఎప్పటిలాగే మెస్‌బిల్లును తగ్గించుకోవడానికి మెస్ నిర్వాహణలో ఫ్యాకల్టీ ఆధిపత్యం లేకుండా చేయాలని విద్యార్థులు కోరారు. స్టూడెంట్ మేనేజ్ మెంట్ పద్ధతిలో జరుగుతున్న మెస్ నిర్వహణలో పూర్తిగా విద్యార్థులకే స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు. వీసీ రావాల్సిందే... రిజిస్ట్రార్ ఇచ్చిన హామీలపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. రిజస్ట్రార్ సుబ్బారావు విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా వింటూ పరిష్కార మార్గాలు చెపుతూ విద్యార్థులకు హామీలిచ్చారు. దాదాపు నాలుగు అంశాల తరువాత బాలికల హాస్టల్ సమస్యలు చర్చలోకి వచ్చాయి. ఫ్యాకల్టీ, హాస్టల్ ఇతర సిబ్బంది వారిపై చేస్తున్న అసభ్యకర చర్యలను బాలికలు చెపుతున్న సమయంలో పరిష్కార మార్గాలు చెప్పకుండా మధ్యలో రిజిస్ట్రార్ కళాశాలలోపలికి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ బయటకు రాకపోవడంతో విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. రాత్రి 9.30 గంటల సమయంలో రిజిస్ట్రార్ మరలా విద్యార్థుల దగ్గరకు వచ్చారు. వీసీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు, సర్దాపూర్, వెంకటాపూర్ శివారుల్లో 88 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి మాట్లాడారు. కళాశాల స్థాపనకు అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయని వివరించారు. పట్టణానికి అతి సమీపంలో స్థలం ఎంపిక చేయడం బాగుందని, సిరిసిల్లలో ఏర్పాటు చేయడం వల్ల సిద్ధిపేట, కామారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైన్ రానున్న నేపథ్యంలో రవాణా పరంగా ఇబ్బందులుండవని పేర్కొన్నారు. ఏర్పాటుకు సానుకూల నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో సాధ్యమైనంత త్వరలో మోడల్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే తారకరామారావు ప్రత్యేక చొరవతో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిటీ సభ్యులు, రాష్ట్ర విద్య మండలి వైస్‌చైర్మన్ ఆచార్య వి.వెంకటరమణ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సాయిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.కృష్ణయ్య, డీఆర్వో ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, తహసీల్దార్ అంజన్న పాల్గొన్నారు. -
అక్కడా.. ఇక్కడా కుదరదు
సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది వివరాలను జేఎన్టీయూహెచ్కు ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం అనుబంధ కళాశాలలు ఆయా పోర్టల్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల వివరాలను జేఎన్టీయూహెచ్కు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. తరగతులు ప్రారంభమై 20 రోజులకు పైగా గడుస్తుండటంతో ఇప్పటికీ వివరాలను ఇవ్వని కళాశాలలకు ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరి.. ప్రతి కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బంది తమ అర్హతలు, అనుభవం, పనిచేసే కాలేజీ, అందులో చేరిన రోజు, లేటెస్ట్ ఫొటో తదితర అన్ని విషయాలను వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్యాకల్టీకి ఒక ఐడీ నెంబర్‌ను ఇస్తారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలు దరఖాస్తుచేసుకునే సమయంలోనే జేఎన్టీయూహెచ్కు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ ఐడీని అందజేయాల్సి ఉంటుంది. శుక్రవారం వరకు జేఎన్టీయూహెచ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 83, 543 మంది ఉన్నారు. గతంలో ఈ విధానం లేకపోవడంతో.. 2015 సంవత్సరానికి ముందు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ విధానం లేకపోవడంతో చాలా వరకు ఇంజినీరింగ్ కళాశాలలు వేల రూపాయల ఫీజులు చెల్లించడం ఇష్టం లేక మొక్కుబడిగా అధ్యాపకులను నియమించుకునే వారు. ఒక్కరే అధ్యాపకులు ఐదు, ఆరు కళాశాలల్లో కూడా పనిచేసే వారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు జేఎన్టీయూహెచ్ ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి అధ్యాపకుడి నుంచి పాన్‌కార్డు, ఆధార్ కార్డును ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కరే అధ్యాపకులు పలు కళాశాలల్లో పనిచేసే విధానం పోయింది. దీనికి తోడు బీటెక్ స్థాయి విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు ఎంటెక్ విద్యార్హత తప్పనిసరి అయినా బీటెక్లతోనే నెట్టుకు వస్తుండటంతో ఈ పోర్టల్‌లో ఎంటెక్ డిగ్రీ సర్టిఫికెట్‌ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఎంటెక్ పూర్తి చేసిన వారినే కళాశాలలు అధ్యాపకులుగా నియమించుకుంటున్నారు. అంతేగాకుండా బోధనా సిబ్బంది తాము పనిచేస్తున్న కళాశాలను మారాల్సి వచ్చినా ముందుగానే సంబంధిత కళాశాలకు తెలిపి రిలీవింగ్ లెటర్ తీసుకుని ఇతర కళాశాలకు మారాల్సి ఉంది. అవకతవకలకుఅవకాశమే లేదు ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించాక అవకతవకలకు అవకాశమే లేదు. ప్రతి సంవత్సరం జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు అప్లియేషన్ పోర్టల్‌లో ప్రస్తుత ఫ్యాకల్టీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎంత మంది ఫ్యాకల్టీని చేర్చుకున్నారు, ఎంత మందిని తొలగించారు అనే వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంది. – ఎన్.యాదయ్య,జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ -
'ర్యాగింగ్ చేస్తే ఇంటికే’
సాక్షి, సిటీబ్యూరో: ‘ర్యాగింగ్ చేస్తే ఇక ఇంటికే’ అనే నినాదంతో జేఎన్టీయూ హైదరాబాద్ ప్రచారం చేస్తోంది. ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ‘యాంటీ ర్యాగింగ్’ కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక కమిటీల నియామకం, నూతన విద్యార్థులకు ప్రత్యేక వసతులు కల్పించడం, యాంటీ ర్యాగింగ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం తదితర చేపడుతోంది. జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా రాష్ట్రంలో 423 కళాశాలలు ఉండగా... వాటిలో 3.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతిఏటా కొత్తగా వీటిలో చేరుతున్న విద్యార్థులు ర్యాగింగ్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో జేఎన్టీయూహెచ్ ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది. ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వం కఠిన చట్టాలనూ అమల్లోకి తెచ్చింది. యాజమాన్యందే బాధ్యత ఎవరైనా విద్యార్థి ర్యాగింగ్ బారినపడినప్పుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలనే వివరాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు కరపత్రాలు, బ్యానర్ల రూపంలో క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలి. అడ్మిషన్ సమయంలో వాట్సాప్ ద్వారా విద్యార్థులకూ పంపించాలి. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్, హెచ్ఓడీలు, స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ల ఫోన్ నంబర్లను విద్యార్ధులకు అందుబాటులో ఉంచాలి. అధ్యాపకులు తరచూ నూతన విద్యార్థులతో మాట్లాడుతూ వారిలో భయాందోళనను తొలగించాలి. కళాశాలల్లో ర్యాగింగ్ జరిగినట్లయితే సంబంధిత యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు హాస్టల్ లొకేషన్ కమిటీ, క్యాంటీన్ కమిటీ, డిపార్ట్మెంట్ కమిటీ, స్పోర్ట్స్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయాలి. శిక్షలివీ... ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాగింగ్ వ్యతిరేక చట్టం–1997లో యాంటీ ర్యాగింగ్‌కు సంబంధించి యాక్ట్ 26ను తీసుకొచ్చింది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ 2002లో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2009లో మరిన్ని శిక్షలను పెంచింది. ♦ ర్యాగింగ్ చేసినా, సహకరించినా, ఇతరులను రెచ్చగొట్టినా చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ చేసి అవమానించినా, బాధించినా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.1000 జరిమానా. ♦ ర్యాగింగ్‌లో భాగంగా విద్యార్థులపై దాడి చేస్తే ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా. ♦ అక్రమంగా నిర్భందించడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా. ♦ విద్యార్థులను బలవంతంగా ఎత్తుకెళ్లడం, గాయపర్చడం, లైంగిక దాడికి పాల్పడడం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా. ♦ ర్యాగింగ్ సందర్భంలో విద్యార్ధి మరణించిన, బాధిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినా నిందితుడికి పదేళ్ల జీవిత ఖైదు, రూ.50 వేల జరిమానా. భయం పోగొట్టాలి కళాశాల, హాస్టల్ వాతావరణంలోకి రావడంతో విద్యార్థుల్లో భయం అనేది ఉంటుంది. ప్రతి చిన్న దానికీ భయపడడం, చదువు అర్థం కాకపోవడం, పరీక్షలు తదితర విషయాల వల్ల విద్యార్థులు ఆందోళన పడుతుంటారు. వారిలో నెలకొన్న భయాన్ని తొలగించి, కళాశాల వాతావరణం అలవాటు చేయాలి. అందుకే మొదటి మూడు వారాలు సిలబస్ ప్రారంభించకుండా... ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే భయపడకుండా వెంటనే ప్రిన్సిపాల్/అధ్యాపకులకు సమాచారం అందించాలి.– సాయిబాబారెడ్డి, జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ భవిష్యత్ అంధకారమే... విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారు. జైలు శిక్ష ఆరు నెలలకు మించి పడితే ఏ విద్యాసంస్థలోనూ ప్రవేశం ఉండదు. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు కూడా రాదు. కళాశాలలు అందించే ఉపకార వేతనాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడు. దీంతో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి భవిష్యత్ అవకాశాలను పూర్తిగా కోల్పోతాడు. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలితే కళాశాల యాజమాన్యం సదరు విద్యార్థిని ఎన్ని రోజులైనా సస్పెండ్ చేయొచ్చు. ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుడు, చైర్మన్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వరద వదలదు.. ట్రాఫిక్ కదలదు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వానొస్తే రోడ్డు చెరువులవుతున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన నీటితో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్యలున్నా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోలేకపోయారు. ఈ సీజన్లో కురిసిన తొలి వర్షాలతోనే తీవ్ర ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడటంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు పరిష్కార చర్యలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు జేఎన్టీయూ నిపుణులతో అధ్యయనం చేయించి పరిష్కారాలు కోరారు. ప్రస్తుతం నగరంలో 123 మేజర్ లాగింగ్ ఏరియాలున్నాయి. వీటిల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 82 ఉండగా, వాటికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది. మిగతా రెండు కార్పొరేషన్ల పరిధిలో ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణ పనులతో రోడ్డు ఇరుగ్గామారి, రోడ్డు లోలెవెల్ ఉండి, వరదపోయే మార్గాల్లేక ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఇవి కాక ఇతరత్రా కారణలతోనూ రోడ్లపై నీరు నిల్వ ఉంటోంది. -
ఆపరేషన్ గ్రేటర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వానొస్తే రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. వాహనాలు ముందుకు వెళ్లలేక తీవ్ర ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. నగరంలో అలాంటి ముంపు ప్రాంతాలు 160 ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. సదరు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ఈనెల 2వ తేదీన జేఎన్టీయూ నిపుణులు తదితరులతో సమావేశం నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్.. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగుచూపాల్సిందిగా నిపుణులను కోరారు. తొలుత మేజర్ వాటర్‌లాగింగ్ ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతోనూ పరిష్కారాలుండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్ గిరిధర్, లక్ష్మణరావు జీహెచ్ఎంసీ ఎస్ఈలు, ఈఈలు, ఏఈఈలతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలతో నివేదికనందజేశారు. ఆయా ప్రాంతాల్లోని ముంపు స్థలాలను గుర్తించిన ప్రొఫెసర్లు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, ఇంజెక్షన్ వెల్స్ తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతానికి నీటినిల్వ ప్రాంతాల్లో ఉపశమన చర్యలకు సూచనలివ్వగా, శాశ్వత పరిష్కారానికి సహజ డ్రైనేజీలో డీవియేషన్లు, సమగ్ర హైడ్రాలాజికల్ స్టడీ, లాండ్‌యూజ్, లాండ్కవర్ చేంజ్ అనాలిసిస్ వంటివి అవసరమని స్పష్టం చేశారు. మూడు జోన్ల పరిధిలో మేజర్ నీటినిల్వ ప్రాంతాల్లో 19 ప్రాంతాలకు పరిష్కారాలు సూచించారు. మరికొన్ని ప్రాంతాల్లో నిల్వనీటిని బయటకు పంపించేందుకు తాత్కాలిక పరిష్కారాలు చూపారు. తాత్కాలిక పరిష్కార చర్యల్లో భాగంగా క్రాస్ ఫ్లో పైపులు , ప్రభుత్వ స్థలాల్లో వాటర్‌ట్యాంకుల నిర్మాణం, తాత్కాలిక హోస్‌పైప్‌ల ఏర్పాటు తదితరమైనవి ఉన్నాయి. మేజర్ నీటి నిల్వల సమస్య పరిష్కారానికి ప్రొఫెసర్లు సూచనలిచ్చిన ప్రాంతాల్లో కొన్ని.. ♦ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ముంపు సమస్య పరిష్కారానికి రెండు ఇంజెక్షన్ బోర్లతోపాటు ఇంకుడుగుంత నిర్మాణం అవసరం. వీటితోపాటు గెస్ట్‌హౌస్ ప్రవేశ మార్గం ముందు నీరునిల్వలేకుండా తగిన చర్యలు చేపట్టాలి. గెస్ట్‌హౌస్ ఎడమ, లేదా కుడివైపున గెస్ట్‌హౌస్, రోడ్డుకు మధ్య ఇంకుడుగుంత, రెండు ఇంజెక్షన్ బోర్లు అవసరం. గెస్ట్‌హౌస్ ముందరి నాలాలోని పూడికను, వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ♦ రాజ్‌భవన్–సోమాజిగూడ మార్గంలోని విల్లామేరీ కాలేజీ దగ్గరి బస్టాప్ వద్ద ఇంజెక్షన్బోరుతోపాటు ఇంకుడుగుంత నిర్మించాలి. వరదనీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. ♦ బేగంబజార్ పోలీస్‌స్టేషన్ వద్ద కల్వర్టుపై ప్రస్తుతానికి రెండు అడుగుల ఎత్తుతో సైడ్‌వాల్ నిర్మించాలి. పరిస్థితులను బట్టి దీన్ని నాలుగు అడుగుల వరకు ఎత్తు పెంచాలి. నాలాలో చెత్త చెదారాలు వేయకుండా నాలా పై భాగంలో వైర్ ఫెన్సింగ్ వేయాలి. వర్షాకాలం ముగిసేంతవరకు నీటిలో తేలియాడే, ఘనవ్యర్థాలను ప్రతిరోజూ తొలగించాలి. ♦ అంబర్‌పేట చేనెంబర్ జంక్షన్ వద్ద కూడా ఇతరత్రా చర్యలతోపాటు రెండు ఇంజెక్షన్ బోర్‌వెల్స్, ఇంకుడుగుంత నిర్మాణం అవసరం. వరదప్రవాహం ఇంకుడుగుంతలోకి వెళ్లేలా ఉండాలి. ♦ మలక్‌పేట పీఎస్ వద్ద రెండు ఇంకుడుగుంతలతోపాటు ఒక ఇంజెక్షన్ వెల్, మరో బాక్స్‌డ్రెయిన్ కూడా నిర్మించాలి. మెట్రోస్టేషన్ వద్ద రూఫ్‌టాప్ నుంచి వచ్చే నీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా చేయాలి. ♦ కార్వాన్ హెచ్ఎస్ రాయల్ రెసిడెన్సీ ఎదుట, బతుకుమ్మ కుంట దగ్గరి వైభవ్కాలనీ, స్పోర్ట్స్‌క్లబ్ క్రాస్‌రోడ్స్, చార్మినార్ జోన్‌లోని ఖాదీభండార్, అక్షయ్హోటల్, సిటీలైఫ్ ఫర్నిచర్, తదితర ప్రాంతాల్లోనూ ఇంకుడుగుంతలు, ఇంజెక్షన్వెల్లు, క్యారేజ్‌వే ఎత్తుపెంపు వంటివి చేపట్టాలని సూచించారు. ♦ దుర్గం చెరువు వద్ద వాన నీటి నిల్వకు పైప్‌లైన్, నీటి కుంటలు వంటివి అవసరమని సూచించారు. ♦ గ్రేటర్ పరిధిలో వరద, నీటిముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి జేఎన్టీయూ నిపుణులు దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చయ్యే ప్రణాళికతో ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని ఆమోదించిన స్టాండింగ్ కమిటీ.. ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సత్వర ఉపశమన చర్యల కోసం జేఎన్టీయూ నిపుణులు ఈ సూచనలు చేశారు. -
బీటెక్‌లో ఆన్లైన్ వ్యాల్యుయేషన్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ పరిధిలో ఇకపై ఆన్లైన్లో వ్యాల్యుయేషన్ చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఎంటెక్‌లో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ వ్యాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన జేఎన్టీయూహెచ్.. ఇకపై బీటెక్‌లోనూ దానిని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎంటెక్ పరీక్షల్లో ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరే విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల మూల్యాంకనాన్ని ఆన్లైన్లో చేపట్టాలని భావిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు పరీక్షల మూల్యాంకన విధానంలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక లెక్చరర్ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసిన తరువాత అతనికి తెలియకుండానే దానిని మళ్లీ మరో లెక్చరర్‌తో మూల్యాంకనం చేయిస్తున్నామని, తద్వారా మూల్యాంకనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఇద్దరు చేసిన మూల్యాంకనంలో భారీ తేడాలు ఉంటే మొదట మూల్యాంకనం చేసిన లెక్చరర్‌ను పిలిపించి మళ్లీ మూల్యాంకనం చేయిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు జేఎన్టీయూలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతేడాది ఎంటెక్‌లో ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టిన తాము ఈసారి ఎంటెక్‌లో 80 సీట్లతో డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలు.. ఈసారి రాష్ట్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు, కొన్ని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రారంభించేందుకు అనుబంధ గుర్తింపు కోసం పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. వాటి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. గతంలోనే ప్రభుత్వం రాష్ట్రంలో అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు వద్దని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు. మరోవైపు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ పరిశీలన తరువాత ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు. నెలాఖరులో ఇంటర్వ్యూలు.. ఈ నెలాఖరులో 36 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికోసం 340 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో 154 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
తెలంగాణలో 27 కాలేజీల్లో ప్రవేశాలకు నో
సాక్షి, హైదరాబాద్: ఈ సారి 27 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుమతి నిరాకరించింది. దీంతో వాటిల్లోని దాదాపు 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. జేఎన్టీయూ ఇటీవల కాలేజీలకు జారీ చేసిన అనుబంధ గుర్తింపు లెక్కలు తేలాయి. రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా జేఎన్టీయూ 156 కాలేజీలకు గుర్తింపును జారీ చేసింది. దీంతో 27 కాలేజీలకు ఈసారి బీటెక్‌లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే వాటిల్లో ఎక్కువ శాతం కాలేజీల్లో వసతులు లేని కారణంగా అనుబంధ గుర్తింపును జేఎన్టీయూ నిరాకరించింది. మరికొన్ని కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గతంలో ప్రవేశాలు లేని కారణంగా చివరలో విరమించుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలతోపాటు ఇతర కాలేజీల్లో 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. గతేడాది రాష్ట్రంలోని 202 కాలేజీల్లో ప్రవేశాల కోసం యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లోని 174 కాలేజీల్లో 793 కోర్సులకు సంబంధించిన 86,176 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 183 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 156 కాలేజీల్లోని 686 కోర్సులకు సంబంధించి 77,500 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. వీటితోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు, కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపును జారీ చేసింది. ఫార్మసీలో గతేడాది 76 కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, 73 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 73 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, అందులో 67 కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. గతేడాది 17 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 16 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 13 కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 11 కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చింది. -
27 కాలేజీలు.. 8,887 సీట్లు కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు జారీ చేసింది. కొన్ని కాలేజీలు స్వచ్ఛందంగా పూర్తిగా కోర్సులను రద్దు చేసుకోవడం, మరికొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా కోర్సులను ఏఐసీటీఈ రద్దు చేయడంతో గతేడాది కంటే ఈసారి కాలేజీలు, సీట్లకు భారీగా కోత పడింది. దీంతో మొత్తంగా 8,887 సీట్లు రద్దయ్యాయి. గతేడాదితో పొల్చితే రాష్ట్రంలోని 27 కాలేజీల్లో బీటెక్ మొదటి ఏడాది ప్రవేశాలు చేపట్టే వీలు లేకుండాపోయింది. కొన్ని కాలేజీలు కొన్ని బ్రాంచీలను రద్దు చేసుకోగా, మరికొన్ని కాలేజీలు బ్రాంచీల్లో సీట్లను పెంచుకున్నాయి. ఎక్కువ కాలేజీలు పలు బ్రాంచీల్లో సీట్లను ఏకంగా రద్దు చేసుకున్నాయి. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని 201 కాలేజీల్లో 1,05,360 బీటెక్ సీట్లకు అనుమతులు జారీ చేసిన ఏఐసీటీఈ గతేడాది కంటే 8,887 సీట్లను తగ్గించింది. ఈసారి యూనివర్సిటీలు ఇచ్చేవెన్నో.. గత విద్యా సంవత్సరం (2018–19)లో రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,14,247 సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. అందులో లోపాల కారణంగా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు లోపాల కారణంగా భారీగా సీట్లకు కోత పెట్టాయి. కేవలం 95,235 వేల సీట్లకు అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. దీంతో వాటిల్లోనే ప్రవేశాలు చేపట్టగా, అందులోనూ 67,937 వేల సీట్లే భర్తీ అయ్యాయి. ఇక 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏఐసీటీఈ 201 కాలేజీల్లోని 1,05,360 సీట్ల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్ని సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును ఇస్తాయో తేలాల్సి ఉంది. గతేడాది 95,235 సీట్లకు పరిమితం చేసిన యూనివర్సిటీలు ఈసారి వాటిని 90 వేలకే పరిమితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. లోపాల సవరణకు ముగిసిన గడువు రాష్ట్రంలోని దాదాపు 250 కాలేజీల్లో తనిఖీలు చేసిన జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) వాటిని సవరించుకోవాలంటూ లేఖలు రాసింది. ఆ లోపాలను సవరించుకునే గడువు శనివారంతో ముగిసిపోవడంతో వాటిపై మరోసారి కాలేజీలతో చర్చించి అనుబంధ గుర్తింపును జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కూడా ఇదే పనిలో ఉన్నాయి. ఈనెల 9వ తేదీతో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. శుక్రవారం వాటికి సంబంధించి కీలను ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. ఈనెల 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. వీలైతే వచ్చే వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను కూడా ఈనెల 15 నాటికి విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈలోగా ఎంసెట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్న ఆలోచన చేస్తోంది. వీలైతే వచ్చే వారం, లేదా ఈనెల 25 నాటికి ఎంసెట్ ఫలితాలను వెల్లడించనుంది. అలాగే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను కూడా ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే జూన్ మొదటి వారం/రెండో వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కొత్త కోర్సులకు ఓకే చెప్పిన ఏఐసీటీఈ మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులకు ఈసారి ఏఐసీటీఈ అనుమతులను ఇచ్చింది. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సు లకు అనుమతులు ఇస్తామని ఏఐసీటీఈ తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్లోనే స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఏఐసీటీఈ వాటికి అనుమతి ఇచ్చింది. అయితే యూనివర్సిటీలు ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. వాటి నిర్వహణకు అవసరమైన సిలబస్, స్కీం, ఫ్యాకల్టీ సరిపడ ఉన్నారా? లేదా? ఎలా నిర్వహిస్తారు? అన్న అంశాలను యూనివర్సిటీలు పరిశీలించాకే తమ బోర్డ్ స్టడీస్ సమావేశంలో చర్చించాక నిర్వహణకు ఓకే చెప్పాలా? వద్దా? అన్నది తేల్చనున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ సీట్లకు కోత పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ఈసారి కాలేజీలకు, సీట్లకు ఏఐసీటీఈ కోత పెట్టింది. ఈనెల 14వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏఐసీటీఈ అనుమతుల జాబితాలను క్రోడీకరించింది. 2019–20 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 162 కాలేజీలకు, వాటిల్లోని 42,100 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్లకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ ఈసారి 25 కాలేజీలకు, 5164 సీట్లకు కోత విధించింది. -
ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు
సాక్షి, రామారావుపేట (కాకినాడ లీగల్): ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికలో ఏఐసీటీఈ నిర్దేశ నియమాలను అనుసరించి రెండు ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టామని జేఎన్టీయూకే ఉపకులపతి ఎం.రామలింగరాజు తెలిపారు. వర్సిటీ ప్రాంగణం సెనేట్ హాలులో ‘ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికాభివృద్ధి, బోర్డ్ ఆఫ్ స్టడీస్’ సమావేశం డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్, ప్లానింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే వీసీ ఎం.రామలింగరాజు, ప్రత్యేక అతిథులుగా ఏపీ ఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ టి.కోటేశ్వరరావు, కార్యదర్శి ఎస్.వరదరాజన్, ఏపీ ఎస్ఎస్డీసీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ గంటా సుబ్బారావు, గీతం వర్సిటీ వీసీ ఎన్.శివప్రసాద్, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కృష్ణయ్య, గౌరవ అతిథులుగా రెక్టార్ ఐ.శాంతిప్రభ వేదికనలంకరించగా రిజిస్ట్రార్ వీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ రామలింగరాజు మాట్లాడుతూ అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, బ్లూమ్స్ టాగ్జానమీ ప్రకారం బోధన జరుగుతుందని, దీనిని మరింత బలోపేతం చేయడానికి ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఇంటర్న్షిప్స్ ప్రాజెక్టŠస్ తదితర వాటిని పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టదలిచామన్నారు. ప్రస్తుతం 2019 రెగ్యులేషన్స్ ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో కనీసం నాలుగు ప్రాజెక్టులు చేసేలా రూపొందిస్తామన్నారు. ప్రొఫెసర్ టి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్యప్రణాళిక అన్ని యూనివర్సిటీలకు ఒకేలా ఉండేలా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఎస్.వరదరాజన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్పీ టెల్ ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవాలని, ఫీల్డ్ వర్క్ చేయాలని, అలానే పాఠ్యప్రణాళికలో వర్చ్యువల్ రియాల్టీని ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. ఎన్.కృష్ణయ్య మాట్లాడుతూ తరగతి గదిలో అధ్యాపకుడు గంటలో 15 నిమిషాలకు మించి మాట్లాడకూడదని, విద్యార్థులను ప్రయోగ పద్ధతిలో మిగిలిన 45 నిమిషాలు కార్యాచరణలో నిమగ్నమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు. గంజా సుబ్బారావు మాట్లాడుతూ లక్ష్యానికి చేరువయ్యేలా పలు శిక్షణలను కల్పించాలని, పాఠ్యాంశం నుంచి నేర్చుకుని మార్కులు పొందేలా కాకుండా సృజనాత్మకతను జోడించి పరిశోధనను అభివృద్ధి పరిచి ఆవిష్కరణలకు పెద్దపీట వేసేలా ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్యప్రణాళిక పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించనున్నామన్నారు. కార్యక్రమానికి డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, బీవోఎస్ చైర్పర్సన్లు, సభ్యులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, యుసీఈకే యుసీఈవీ, యుసీఈఎన్ ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అటానమస్, అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను జేఎన్టీయూ శనివారం విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన టీఎస్ ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కానుంది. 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుండి 9వ తేదీ వరకు దరఖాస్తులలో సవరణ చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదువేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, పదివేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ పరీక్ష మే 3 నుంచి మే 6 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1వరకు పరీక్ష ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ మే 8వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా మధ్యాహ్నం 3గంటల నుంచి 6 గంటల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. నిమిషం ఆలస్యం అయిన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
ఏపీ ఎంసెట్–19 నోటిఫికేషన్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ)/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, యానిమల్ హజ్ బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ–డీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను జేఎన్టీయూనే వరుసగా ఐదోసారి నిర్వహిస్తోందన్నారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో వరుసగా మూడోసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుం లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 4 వరకూ, రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 9 వరకూ, రూ.5 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 14 వరకూ, రూ.10 వేల అపరాధ రుసుంతో ఏప్రిల్ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. http://sche.ap.gov.in/eamcet వెబ్సైట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులో విద్యార్థి మూడు కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, విద్యార్థి ప్రాధాన్యాన్నిబట్టి ఈ మూడింటిలో ఒకచోట మాత్రమే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారని తెలిపారు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 16 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షను ఏప్రిల్ 20, 21, 22, 23 తేదీల్లోను, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 23, 24 తేదీల్లోను నిర్వహిస్తామన్నారు. ఉర్దూ మాధ్యమం కావాలనుకునే వారికి కర్నూలులో మాత్రమే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీసీ విద్యార్థులకు గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బోటనీ 40, జువాలజీ 40 కలిపి మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ర్యాంకును నిర్ధారించేందుకు ఎంసెట్ మార్కులను 75శాతం, 25శాతం ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతా మార్కులు లేవు. ఇతర అభ్యర్థులకు 40 మార్కులను అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష వల్ల పారదర్శకంగా, త్వరితగతిన ర్యాంకులు కేటాయించడానికి వీలవుతుందని, విద్యార్థి తమ జవాబులను ఎన్ని సార్లయినా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని సాయిబాబు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు, ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే ఎంసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నాపత్రాలు కష్టంగాను, సులభంగాను ఉన్నాయని ఒకరితోనొకరు పోల్చుకుని ఆందోళన చెందనవసరం లేదన్నారు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం సాధారణీకరణ (నార్మలైజేషన్) పద్ధతిలో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు విద్యార్థికి హాల్‌టికెట్‌లో కేటాయించిన రోజు అదే శ్లాట్‌లో పరీక్షకు హాజరు కావాలి. లేదంటే గైర్హాజరైనట్లుగా పరిగణిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థిని పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థికి రఫ్‌వర్కు చేసుకునే నిమిత్తం తెల్లకాగితాలను తామే అందిస్తామని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు ఈ ప్రవేశ పరీక్ష శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం సిటీ, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, కంచికచర్ల, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసారావుపేట, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, పుట్టపర్తి, గుత్తి, హిందూపూర్, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్‌లో ఎల్బీ నగర్, నాచారం, సికింద్రాబాద్‌లలో ఎంపిక చేసిన కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884 – 2340535, 0884 – 2356255 ఫోన్ నెంబర్ల ద్వారా, లేదా ఈమెయిల్ ఐడి 2019apeamcet@gmail.com ద్వారా సంప్రదించాలని కన్వీనర్ సాయిబాబు సూచించారు. -
‘అవంతి’ని అప్రోచ్ అయ్యారు!
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్ చేసిన గ్యాంగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానం అవలంభిస్తోంది. క్లోనింగ్ చేశారిలా... రామకృష్ణ సూచనతో శ్రీరామ్ ఓ ప్లాస్టిక్ కోటింగున్న కాగితంపై గ్లూ గన్‌తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదయ్యేలా చేసేవారు. కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్ప్రసాద్తో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎన్రోల్ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేసేవాడు. రీయింబర్స్మెంట్ ‘సృష్టించారా’? ఈ గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్‌తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. సుదర్శన్ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్ కాలేజీలను అప్రోచ్ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్‌మెంట్ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. -
‘కలికిరి’లో గోల్మాల్
చిత్తూరు, జేఎన్టీయూ(ఏ) పరిధిలోని కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూతన ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల ఏర్పాటుకు సంబంధించి అధికార దుర్వినియోగం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు, ఫర్నిచర్‌కు సంబంధించి ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్‌కు కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ వ్యవహారంలో యూనివర్సిటీ ఖజానాకు భారీగా గండి పడింది. జేఎన్టీయూ: జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి జేఎన్టీయూ అనంతపురం–జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీల మధ్య 2014 ఫిబ్రవరి 5న అవగాహన ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణ పనులకు సంబంధించి ప్లానింగ్, ఎక్స్కూషన్, టెండర్ సెలెక్షన్ ఆఫ్ ఏజెన్సీ, క్వాలిటీ కంట్రోల్, సూపర్విజన్, ల్యాబొరేటరీస్, సెమినార్ హాల్స్ తదితర అంశాల్లో జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇందుకు నాలుగు శాతం కమీషన్‌ను జేఎన్టీయూ, అనంతపురం చెల్లిస్తుంది. అంటే జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. తిరిగి భవన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ను పిలిచారు. ఇందుకు సంబంధించి మరో ప్రైవేటు భవన నిర్మాణ సంస్థ నాలుగు శాతం ఎక్సెస్ టెండర్ కోట్ చేయడంతో పనులను అప్పగించారు. తొలుత రూ.295 కోట్లకు టెండర్లు ఖరారు చేయగా, సెమినార్ హాల్స్, ఇండోర్ స్టేడియం నిర్మాణం, ప్రాజెక్ట్ వ్యయం అంచనాల పెంపు తదితర కారణాలతో నిర్మాణ వ్యయం రూ.349 కోట్లకు చేరింది. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఫర్నిచర్, ల్యాబ్ పరికాల ఏర్పాటుకు రూ.13 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల ఏర్పాటును ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించాల్సి ఉంది. కానీ నిబంధలకు విరుద్ధంగా రూ.13 కోట్లకు ఎలాంటి టెండర్లు లేకుండా భవన నిర్మాణ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారు. దీంతో ఎలాంటి బేరం లేకుండానే ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలను అమర్చారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచి ఉంటే పోటీ పడి తక్కువ ధరకే విలువైన ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలు కళాశాలకు అందేవి. తద్వారా వర్సిటీకి డబ్బు ఆదా అయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోడల్ కమిటీలో సభ్యులుగా ఉన్నా.. నూతన కళాశాల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, నియమ నిబంధనల అమలు పర్యవేక్షణకు నోడల్ కమిటీని నియమించారు. ఇందులో జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, చీఫ్ ఇంజినీర్, మరో సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యులుగా ఉన్నారు. జేఎన్టీయూ అనంతపురం.. భవన నిర్మాణ బిల్లులకు సంబంధించి నిధుల జారీ(ఫండ్స్ ట్రాన్స్ఫర్)ని జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ వర్సిటీకి ఇస్తారు. వీరు సంబంధిత కాంట్రాక్టరు లేదా భవన నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు, పనుల అంచనాల పెంపు, ఒప్పందంలో లేని నూతన అంశాలను ప్రస్తావించే క్రమంలో నోడల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించిన రూ.13 కోట్ల చెల్లింపులోనూ ఎలాంటి టెండర్లు లేకుండా అప్పటికే నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణ సంస్థకు అప్పగించారు. అంటే నోడల్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. నోడల్ కమిటీలో ఉన్న జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఈ ముగ్గురూ ఆమోదించినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా కోట్లాది రూపాయల పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అప్పగించడం వివాదాస్పదమవుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడే నిర్ణయాలు తీసుకోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల కొనుగోలులో తమకు ఎలాంటి సంబంధం లేదని నోడల్ కమిటీలో ఉన్న జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్ పేర్కొనడం కొసమెరుపు. -
మారనున్న పలు సెట్ల కన్వీనర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)పై ఉన్నత విద్యామండలి కసరత్తు వేగవంతం చేసింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలను ప్రారంభించాలంటే మొదటివారంలోనే సెట్లు నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్లు, షెడ్యూలును ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా కన్వీనర్లను ఖరారు చేసేందుకు జనవరి 2న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అందులో అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. 2018–19 విద్యాసంవత్సరంలో సెట్లు నిర్వహించిన కన్వీనర్లలో నలుగురు ఈసారి మారనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ(కాకతీయ వర్సిటీ), పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ షమీమ్ ఫాతిమా(ఉస్మానియా వర్సిటీ), పదవీ విరమణ పొందారు. గత ఏడాది లాసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ద్వారకనాథ్, ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొఫెసర్ మధుమతి త్వరలో పదవీవిరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆ 4 సెట్లకు కన్వీనర్లుగా కొత్తవారిని నియమించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పాతవారికే మూడు సెట్ల బాధ్యత ఎంసెట్, ఈసెట్, పీఈసెట్ నిర్వహణ బాధ్యతలను గతేడాది నిర్వహించిన వర్సిటీలకే అప్పగించి, పాతవారినే కన్వీనర్లుగా కొనసాగించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో ఎంసెట్‌కు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఈసెట్‌కు అదే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గోవర్ధన్, పీఈసెట్‌కు ప్రొఫెసర్ సత్యనారాయణ కన్వీనర్లుగా కొనసాగే అవకాశముంది. దానిపై జనవరి 2న జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం ప్రకటించనుంది. సమావేశంలో కన్వీనర్ల పేర్లు, సెట్ల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహిస్తామని ఉస్మానియా వర్సిటీ ముందుకు వచ్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి లేఖ అందలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని తెలంగాణ వర్సిటీ లేఖ రాసిందని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. -
ఇంజనీరింగ్‌లో ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అమలు కోసం కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓపెన్ బుక్స్ పరీక్షల విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నట్లు కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల్లో ఎంత మందికి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయన్న అంశంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో ముఖ్యంగా ఇంజనీరింగ్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం విధానాల్లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆలోచన, తార్కిక శక్తిని పెంపొందించడంతోపాటు విశ్లేషణాత్మక పరీక్షలు రాసేలా ప్రశ్నపత్రాల రూపకల్పన ఉండాలని భావిస్తోంది. అందుకోసం ఓపెన్ బుక్స్ పరీక్షల విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీటీఈ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.పి.పుణ్య రాష్ట్రానికి వచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశమై అదే అంశాన్ని వివరించారు. అందుకు అనుగుణంగా కాలేజీలు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కాలేజీల్లో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏఐసీటీఈ ఇకపై కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులు, వారికి లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు (క్యాంపస్ ప్లేస్‌మెంట్స్), అందుకు కాలేజీలు చేపడుతున్న చర్యలపైనే ప్రధాన దృష్టి సారించనున్నట్లు పుణ్య వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం అనేక కాలేజీల్లో ఆ స్థాయిలో ప్రొఫెసర్లు లేరని, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం కనీస సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విధానం అమలు చేయాలంటే ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో 20 నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన వారిని ప్రొఫెసర్లుగా నేరుగా నియమించుకునే అధికారం రాష్ట్ర యూనివర్సిటీలకు ఇవ్వాలని కోరారు. అప్పుడే ఇండస్ట్రీకి ఏం అవసరం అన్నది సమగ్రంగా తెలుస్తుందని, దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ కృష్ణారావు, విద్యాభారతి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గౌతంరావు పేర్కొన్నారు. కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురండి.. నియామకాల సంగతి తరువాత చర్చిద్దామని, ముందు ఇండస్ట్రీ వర్గాలతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, ప్రైవేటు యాజమాన్యాలు సమావేశమై పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావాలని పుణ్య వివరించినట్లు తెలిసింది. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరంలో ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఓపెన్ బుక్ పరీక్షల విధానానికి యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో హైదరాబాద్ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ వైస్చాన్స్లర్లు, వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మనిషి లేకున్నా వేలిముద్ర! ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్
సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థేనే ఏమార్చారు. ఓ మనిషికి సంబంధించిన వేలిముద్రలను క్లోనింగ్ చేసి, అతడు అక్కడ లేకున్నా అటెండెన్స్ పడేలా చేశారు. మరో ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు అదే కాలేజీలో ఉన్నట్లు చూపించి భారీ స్థాయిలో ఫీజు రీ–ఎంబర్స్మెంట్ చేసుకునేందుకు సహకరించారు. నగర శివార్లలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కేంద్రంగా జరిగిన క్లోనింగ్ దందాను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో బీటెక్ గ్రాడ్యుయేట్ ఉండటం గమనార్హం. మరికొన్ని కళాశాలల్లోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని, జేఎన్టీయూ సహకారంతో వాటిని గుర్తిస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ ప్రస్తుతం అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజినీరింగ్ కాలేజీలో ఏఓగా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేయడంతో వీరిరి పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలి. అయితే పలు కాలేజీలో దీనిని పాటించలేకపోతున్నాయి. ఫలితంగా బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. అఫిలియేటెడ్ కాలేజీల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరు మొత్తం బయోమెట్రిక్ ఆధారంగానే జరుగుతుంది. ఆయా కాలేజీల్లోని బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో మేనేజ్మెంట్లు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన రామకృష్ణ ఇంటర్నెట్లో వేలిముద్రలను క్లోనింగ్ విధానంపై అవగాహన పెంచుకున్నాడు. శ్రీరామ్‌ప్రసాద్ ఇతడితో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లో ఉన్న కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపిస్తాడు. గ్లూ, ఈవీఏ వినియోగించి క్లోనింగ్... ఆయా కాలేజీలు తమకు అవసరమైన విద్యార్థులు, అధ్యాపకుల డిమాండ్‌ను తట్టుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నాయి. ఎంటెక్ పూర్తి చేసి, వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించి తమ వద్ద అసోసియేట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నట్లు ఎన్రోల్ చేస్తున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.5 వేల వరకు ‘గౌరవ వేతనం’ ఇస్తున్నాయి. ఈ ‘అసోసియేట్ ప్రొఫెసర్లు’ కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కాలేజీకి వస్తారు. ఆ సందర్భంలో శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేస్తాడు. దీంతో పాటు ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న చిన్న కాగితంపై గ్లూ గన్ ద్వారా సదరు ప్రొఫెసర్‌తో వేలిముద్ర వేయిస్తాడు. దీనిని అందుకుంటున్న రామకృష్ణ ఆ గ్లూ వేలిముద్రపై ఇథనైల్ వినైల్ ఎసిటేట్ (ఈవీఏ) అనే కెమికల్ వేసి, కొద్ది సేపటి తర్వాత చాకచక్యంగా ఆ అచ్చు తీస్తాడు. దీంతో గ్లూ పై ఉన్న వేలిముద్ర ఈ అచ్చు మీదికి చేరుకుంటుంది. వీటిపై నిర్ణీత నెంబర్లు వేసి శ్రీరామ్‌కు పంపిస్తాడు. ఒక్కో బోగస్ అధ్యాపకుడి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేస్తారు. వీటిని అందుకుంటున్న ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రతి రోజూ ఈ అచ్చులను బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెడుతున్నాయి. దీంతో ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదు అవుతోంది. అలాగే ఇతర యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వీరి వేలిముద్రలనూ ఇలానే తయారు చేసి, హాజరు చూపిస్తూ ఫీజు రీ–ఎంబర్స్మెంట్ పొందుతున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఆయా విద్యా సంస్థల్లోని కీలక వ్యక్తుల పర్యవేక్షణలో జరుగుతోంది. నిందితులు ఒక్కో వేలిముద్ర తయారు చేసి ఇచ్చినందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. 29 మందివి సృష్టించినవివేకానంద సంస్థ... బాటసింగారంలోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ప్రిన్సిపల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డి ఈ క్లోనింగ్ విషయాన్ని తమ కార్యదర్శి గోపాల్‌రెడ్డికి తెలిపారు. ఆయన సమ్మతించడంతో శ్రీరామ్ ద్వారా రామకృష్ణను సంప్రదించారు. తమ కళాశాల కోసం ‘ఏర్పాటు చేసుకున్న’ 29 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల వేలిముద్రలను క్లోనింగ్ చేయించారు. ఏడాదిగా వీటి ద్వారానే తమ సిబ్బంది హాజరు చూపించేస్తున్నారు. తాజాగా మరో ఐదుగురు ప్రొఫెసర్ల వేలిముద్రల క్లోనింగ్ కోసం ఆర్డర్ ఇచ్చారు. వీటిని సైతం తయారు చేసిన రామకృష్ణ నేరుగా సిటీకి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎస్సైలు గోవింద్ స్వామి, పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌లతో కూడిన ఈ టీమ్ బుధవారం సైదాబాద్ ప్రాంతంలో రామకృష్ణ, శ్రీరామ్‌లను పట్టుకుంది. వీరిచ్చిన సమాచారంతో సుదర్శన్రెడ్డినీ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.3 లక్షల నగదు, రెండు బయోమెట్రిక్ మిషన్లు, 29 క్లోన్డ్ వేలిముద్రలు, మరో 20 మందికి చెందిన ‘గ్లూ వేలిముద్రలు’ తదితరాలు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం ఈ కేసును సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. లోతుగా దర్యాప్తు ‘ఈ నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని యోచిస్తున్నాం. వీరి సహకారంతో ఇలాంటి వ్యవహారాలు మరికొన్ని కాలేజీల్లోనూ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే కేవలం వివేకానంద సంస్థకు సంబంధించి మాత్రమే ఆధారాలు లభించాయి. ఈ కేసులో జేఎన్టీయూ సహకారం తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తాం. పాత్ర ఉన్న అన్ని కళాశాలల వివరాలుగుర్తిస్తాం’ –అంజనీకుమార్,నగర పోలీస్ కమిషనర్ -
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే మా అబ్బాయి ప్రాణం తీసింది
తూర్పుగోదావరి,రాయవరం (మండపేట): తమ కుమారుడు ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడని భావిస్తే.. తమకు మృతదేహాన్ని అప్పగించారని విజయనగరం జేఎన్టీయూ విద్యార్థి సాయివికాస్ తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుమారుడు సాయివికాస్ మృతికి విజయనగరం జేఎన్టీయూ కళాశాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడి మృతికి దారితీసిన పరిస్థితులను ఆమె విలపిస్తూ తెలిపారు. జూన్ 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు మృతి చెందినట్టు కళాశాల విద్యార్థి సమాచారం అందించారన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మిస్టరీగా ఉందన్నారు. ఇందులో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కన్పిస్తోందని ఆమె ఆరోపించారు. జిల్లాలోని ఎటపాక జవహర్ నవోదయ స్కూల్లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఫొతేదార్ భాస్కరాచారి, రమాదేవిల కుమారుడు సాయి వికాస్ 2015లో విజయనగరం జేఎన్టీయూ కళాశాలలో బీటెక్(ఐటీ)లో చేరాడు. కళాశాలలోనే ఉంటూ ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులే తీసుకుని వెళ్లారు... జూన్ 29న రాత్రి కళాశాలలోని ఇద్దరు స్నేహితులు రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌పై బయటకు తీసుకుని వెళ్లారని రమాదేవి తెలిపారు. బైక్ ప్రమాదంలో సాయివికాస్ మృతి చెందినట్టుగా కళాశాలలోని సహచర విద్యార్థులు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రిన్సిపాల్ రాములు కనీసం తమకు సమాచారం అందించలేదని ఆమె ఆరోపించారు. కళాశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తమ కుమారుడి మృతితో డిప్రెషన్‌కు లోనైన తాము దానుంచి కోలుకున్న అనంతరం కుమారుడి మృతి విషయమై తెలుసుకునేందుకు ఈ నెల 6, 20న రెండు పర్యాయాలు కళాశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 20న ప్రిన్సిపాల్‌ను కలుసుకునేందుకు వెళ్లగా అందుబాటులో లేరని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? ప్రమాదానికి గురైన సాయివికాస్ ఆ రోజు రాత్రి 10.30 గంటలకు స్నేహితులు బయటకు తీసుకువెళ్లినట్టు చెబుతుంటే, సెక్యూరిటీ గార్డు బుక్‌లో రాత్రి 9.30 గంటలకు వెళ్లినట్టు రాసి ఉందన్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లినట్టు పేజీ చివర ఇరికించి ఎందుకు రాశారన్న ప్రశ్నకు సమాధానం లేదని వాపోయారు. ఆగస్టు 6న వెళ్లేసరికి రిజిస్టర్లో లేని పేరు 20న ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ‘రాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగితే ఉదయం వరకు తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కళాశాలకు వెళ్తే ప్రిన్సిపాల్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారన్నారు? రాత్రి 10.30 గంటలకు విద్యార్థులు బయటకు వెళ్తుంటే సెంట్రీ ఎందుకు అడ్డుకోలేదు? గేట్లు ఎందుకు మూసి ఉంచలేదు? అసలు ప్రిన్సిపాల్, వార్డెన్ల పర్యవేక్షణ ఉంటే వారు రాత్రి సమయంలో ఎలా బయటకు వెళ్తారు? తన గదిలో చదువుకుంటున్న సాయివికాస్‌ను బలవంతంగా ఆ విద్యార్థులు ఎందుకు తీసుకుని వెళ్లినట్టు?’ ఈ ప్రశ్నలకు తమకు ఎక్కడా సమాధానం దొరకడం లేదని ఆమె వాపోయారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్టు రమాదేవి తెలిపారు. -
కార్పొరేట్ గుప్పిట్లో కన్వీనర్ ఆఫీసు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: విద్యను వ్యాపారమయం చేసిన కార్పొరేట్ కాలేజీలు.. ఆ దందాను విస్తృతం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాయి. ఎంసెట్ మెడికల్ ర్యాంకుల కోసం దొడ్డిదారిలో ప్రశ్నపత్రాలను సంపాదించేందు కు ఆరాటపడ్డాయి. ఇందుకు కార్పొరేట్ శక్తులు చేసిన లాబీయింగ్ అంతా ఇంతా కాదు. 2 దశాబ్దాలకు పైగా ఎంసెట్ నిర్వహించిన చరిత్ర ఉన్న జేఎన్టీయూ, ఆ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే కన్వీనర్ కార్యాలయాన్నీ వదల్లేదు. ఈ ఆఫీసులో సీనియర్ అధికారి మొదలు నాలుగో తరగతి ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికీ లంచాల ఎర చూపారు. సంవత్సరాల తరబడి సొమ్ము ముట్టజెప్పి సమాచారం కాజేసే యత్నాలకు ఒడిగట్టారు. దరఖాస్తులు స్వీకరించడం మొదలు, ఫలితాలు ప్రకటించేదాకా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తెలిసేది కార్పొరేట్ కాలేజీలకే! పేపర్ సెట్టింగ్ నుంచి మొదలు.. వేలాది మంది పోటీ పడే ఎంసెట్‌లో ప్రశ్నపత్రాల రూపకల్పన అత్యంత కీలకం. ప్రశ్నపత్రాలకు ఎవరు రూపకల్పన చేయాలన్నది కన్వీనర్‌కు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అందుకే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు కన్వీనర్ కార్యాలయంలోనే తిష్ట వేసేవారు. కన్వీనర్ ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ఎంత? ఆయన ఏ మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు? వంటి విషయాలకు అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. కన్వీనర్ ఆఫీసులో మామూలుగా విశ్వసనీయత కలిగిన వారినే నియమిస్తారు. అయినా భారీ స్థాయిలో సొమ్ము ఆశ జూపి వారిని ప్రలోభపెట్టేందుకు యత్నించేవారు. కన్వీనర్ అనేక విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా కొన్నిసార్లు ఇతర సిబ్బందికి కొన్ని పనులు అప్పగించేవారు. కార్పొరేట్ శక్తులు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకునేవి. మొదట ప్రశ్నపత్రాలను సెట్ చేసేవారిని గుర్తించి, తర్వాత వారి నుంచి ప్రశ్నలు సేకరించడానికి కోట్లలో ఖర్చు చేసేవారని జేఎన్టీయూలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన జేఎన్టీయూలో పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను సీనియర్ పోలీసు అధికారి ఒకరికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్యానల్ నుంచి ప్రశ్నలు బయటకు.. ప్రశ్నపత్రం రూపొందించేందుకు జేఎన్టీయూకు ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో ఉన్న వారు రూపొందించే ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుంటారు. అయితే ప్యానల్ తయారు చేసే వెయ్యి ప్రశ్నలు లీక్ అయితే చాలు కొంచెం తెలివైన విద్యార్థి 160కి 150కి పైగా మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. దీన్ని కార్పొరేట్ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. ‘‘నాకు తెలిసి ఈ కాలేజీలు పేపర్ సెట్టింగ్ ప్యానల్ నుంచే ప్రశ్నలు సంపాదించేవి. అందుకు కోట్లు ఖర్చు చేసేవారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినా బయటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే భారీగా డబ్బు ముట్టజేప్పేవారు’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. ‘‘ఇదేం మామూలు స్కాం కాదు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోవడం కూడా పొరపాటే. ప్యానల్ నుంచి ప్రశ్నలు సేకరించడం ఇబ్బంది అనుకున్న ప్రతీసారి వారు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం సంపాదించేవారు. మెడికల్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఇంజనీరింగ్ కోసం తక్కువ ఖర్చుతో ప్యానల్ నుంచి ప్రశ్నలు అందేవి’’ అని ఆ రిటైర్డ్ ప్రొఫెసర్ వివరించారు. తెలివైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉంటారు. కానీ రెండు కాలేజీలకే ర్యాంక్‌లు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని, పట్టించుకొని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వారంతా ఆ రెండు కాలేజీల విద్యార్థులే..! లీకైన ఎంసెట్ ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు ఆ రెండు కాలేజీలకు చెందినవారేనని సీఐడీ విచారణలో బయటపడింది. పేపర్ లీకేజీలో అరెస్టయిన శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను విచారిస్తున్న సీఐడీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు 136 మంది విద్యార్థులను విచారించారు. వీరిలో 86 మంది ఒక కార్పొరేట్ కాలేజీకి చెందిన వారు కాగా, ఇంకో 28 మంది మరో కార్పొరేట్ కాలేజీకి చెందిన వారే! దీంతో స్కాం పూర్తిగా ఈ రెండు కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందా అన్న కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బ్రోకర్లు సైతం ఇదే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకొని ప్రస్తుతం మెడిసిన్ చేస్తుండటం గమనార్హం. తెరపైకి మరో 13 మంది బ్రోకర్లు ఎంసెట్ కేసులో అరెస్టయిన వాసుబాబు, శివ నారాయణ, శ్రీచైతన్య మాజీ విద్యార్థి గణేశ్ ప్రసాద్‌ల విచారణలో తెరపైకి మరికొన్ని కొత్త ముఖాలు వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మందిని నిందితులుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మరో 13 మంది బ్రోకర్లు కూడా స్కాంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరు రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులను బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె క్యాంపులకు తరలించి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. అటు డాక్టర్ ధనుంజయ్, సందీప్‌లకు ప్రశ్నపత్రం ఇచ్చిన బ్రోకర్ల లింకుపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 13 మంది బ్రోకర్లలో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, మిగిలిన ఐదుగురిలో ఇద్దరు యూపీ, ఒకరు ఢిల్లీ, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన వారున్నారని సీఐడీ అనుమానిస్తోంది. వీరిలో కొందరు స్కాం ప్రధాన సూత్రధారి కమిలేష్‌కుమార్ సింగ్‌తో పదేపదే టచ్‌లో ఉన్నారని, అక్కడ్నుంచి వీరి ద్వారానే కార్పొరేట్ కాలేజీలకు ప్రశ్నపత్రం అందినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో వాసుబాబు, శివనారాయణ, గణేష్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లిలోని సీఐడీ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ పిటీషన్‌పై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. మొత్తంగా చార్జిషీట్ దాఖలుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. -
జేఎన్టీయూలో సెక్యురిటీపై ప్రొఫెసర్ దాడి..
-
జేఎన్టీయూలో రెచ్చిపోయిన ప్రొఫెసర్..
సాక్షి, హైదరాబాద్: కుకట్పల్లి జేఎన్టీయూలో ఓ ప్రొఫెసర్ రెచ్చిపోయారు. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెట్టొదని చెప్పినందుకు సెక్యురిటీపై ప్రొఫెసర్ దాడి చేశారు. నాకే అడ్డు చెబుతావా అంటూ ప్రొఫెసర్‌తో సహా అతని భార్యా సెక్యురిటీపై దూర్భాషలాడారు. క్షమించండని చెప్పినా వినకుండా అతన్ని చితకబాదాడు. అతని దెబ్బలకి తట్టుకోలేక సెక్యురిటీ పక్కనే ఉన్న ఆఫీసు రూమ్‌లోకి పరిగెత్తాడు. అయినా ప్రొఫెసర్ అక్కడికెళ్లి నీ అంతు చూస్తానని చేయిచేసుకున్నారు. తప్పుచేశానని చెప్పినా, కన్నీరు పెట్టుకొని కాళ్లు పట్టుకున్నా.. ప్రొఫెసర్ కనికరించలేదు. -
ఏటా స్నాతకోత్సవాలు
న్యూఢిల్లీ/ధన్‌బాద్: ఇకపై ప్రతి సంవత్సరం స్నాతకోత్సవాలను నిర్వహించాలని అన్ని విశ్వవిద్యాలయాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. కొన్ని వర్సిటీలు స్నాతకోత్సవాలను వాయిదా వేయడంపై కేంద్రం ఈ మేరకు స్పందించింది. పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి వర్సిటీ గత ఐదేళ్లలో ఓసారి, త్రిపురలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం గత నాలుగేళ్లలో ఓసారి స్నాతకోత్సవాలను నిర్వహించాయి. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఏకంగా 46 ఏళ్ల తర్వాత ఈఏడాది రెండో స్నాతకోత్సవాన్ని నిర్వహించింది. కాగా, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. స్నాతకోత్సవానికి విద్యార్థులంతా ప్రత్యేకమైన గౌనుకు బదులుగా కుర్తా పైజామా, విద్యార్థినులు సల్వార్‌కమీజ్ లేదా తెలుపు రంగు చీర ధరించాలని ఆదేశించింది. అలాగే స్నాతకోత్సవం సమయంలో చేసే ప్రతిజ్ఞను ఇంగ్లిష్తో పాటు సంస్కృతంలో చేసే వెసులుబాటు కల్పించింది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నత విద్యామం డలి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని జేఎన్టీయూను ఆదేశించింది. అనేక కాలేజీల్లో పనిచేయని కంప్యూటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు, పటిష్టమైన నెట్వర్క్ ఉండేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణ యానికి వచ్చింది. ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వ హించడానికి కాలేజీల్లో ల్యాబ్‌లను పరిశీలించగా లోపాలు బయట పడ్డాయి. చాలా కాలేజీల్లో ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సరిపడ సామర్థ్యం లేనట్టు తేలింది. ఓ వైపు దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంటే రాష్ట్రంలోని కాలేజీ ల్యాబ్‌ల్లో లోపాలు ఉండటం సరికాదన్న భావనకు మండలి వచ్చింది. ల్యాబ్‌లు పక్కాగా ఉండాలి.. 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు పక్కాగా ఉండాలని, యాజమాన్యాలు పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూడాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో లోపాలపై ప్రభుత్వం, జేఎన్టీయూ, తామూ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితం గానే ప్రస్తుతం లోపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్లు, నెట్వర్క్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు కేవలం 6 నుంచి 7వేల మంది విద్యార్థులకే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేదని, ప్రస్తుతం అది 28 వేలకు చేరిందన్నారు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
పరిధుల ప్రభావం ప్రజలపై వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనప్పటికీ ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్ ఉండాలి’అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో తొలిసారిగా డీజీపీ మూడు కమిషనరేట్ల అధికారులతో భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో బుధవారం ‘యూనిఫాం సర్వీస్ డెలివరీ.. వన్ సిటీ–వన్ సర్వీస్–వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది సిటిజన్’పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేయడంతో పాటు అనేక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేరరహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవల్ని కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ప్రతి పోలీసునూ మార్చాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లదని డీజీపీ స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్లలోని ఏ ఠాణాకు వెళ్లినా ప్రజలకు ఒకే రకమైన స్పందన కనిపించాలని, బాధితుల సామాజిక–ఆర్థిక–వ్యక్తిగత హోదాల ఆధారంగా ఈ స్పందన మారకూడదని సూచించారు. సహయం కోరుతూ వచ్చిన బాధితులు/ప్రజలతో పోలీసుల వ్యవహారశైలి సక్రమంగా లేకుంటే ఆ ప్రభావం పోలీసు విభాగం మొత్తమ్మీద ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మాదిరిగా మిగిలిన రెండింటిలోనూ టెక్నాలజీ వినియోగం పెరగాలని, ఫలితంగా నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు మిగిలిన చోట్లా అమలు కావాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల్ని డీజీపీ అభినందించారు. ప్రభుత్వం పోలీసు విభాగానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తోందని, ప్రజలకు మేలైన సేవలు అందిస్తేనే సార్థకత ఉంటుందని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ప్రజల మన్నన పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన ప్రతిని డీజీపీ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ ఇన్చార్జ్ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ ఎం.భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
19 నుంచి ఎంసెట్ ప్రాక్టీస్ టెస్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో తొలిసారిగా జరిగే ఎంసెట్– 2018 ఆన్లైన్ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు జేఎన్టీయూ సరికొత్త అవకాశం కల్పించింది. పరీక్షపై అవగాహనకు ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. ఈనెల 19, 20 తేదీల్లో ప్రాక్టీస్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శనివారం జేఎన్టీయూలో రిజిస్ట్రార్ యాదయ్యతో కలిసి ఆయన మీడియాకు వివరిం చారు. ప్రాక్టీస్ టెస్టులకు హాజరుకావాలనుకున్న విద్యార్థులు ముందుగా www.eamcet. tsche.ac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జోన్లలో 70 వేల మంది టెస్ట్‌కు హాజరయ్యేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వెబ్సైట్లో మాక్‌టెస్టులు రాసే అవకాశమూ కల్పించింది. ఒక విద్యార్థి ఎన్నిసార్లయినా మాక్‌టెస్ట్ రాయొచ్చని, దీంతో తుది పరీక్షలో ఎలాంటి ఆందోళనకు గురికారని అధికారులు చెబుతున్నారు. 2,17,166 దరఖాస్తులు.. ఎంసెట్–2018కు 2,17,166 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,45,549 మంది ఇంజనీరింగ్, 71,617 మంది అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు 2 రాష్ట్రాల్లో 168 కేంద్రాల ను ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 7 వరకు ఎంసెట్ జరుగనుంది. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. రోజూ 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. ఈ నెల 20 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు ఉంచుతారు. నిమిషం ఆలస్యమైనా.. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రం లోనికి విద్యార్థులను అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థి ఎలాంటి గందరగోళానికి గురికాకుండా కంప్యూటర్లో వివరాలను సరి చూసుకునే వీలుంటుంది. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని యంత్రాంగం స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించింది. గోరింటాకు పెట్టుకోవద్దని, గోరింటాకు వల్ల వేలిముద్రలు సరిపోలకపోవచ్చని, ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. మొబైల్ యాప్ కూడా ఎంసెట్‌కు సంబంధించి యంత్రాంగం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో TSCHE myCET అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో నోటిఫికేషన్‌తోపాటు సీబీటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. హాల్‌టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి మే 1 లోపు హాల్‌టికెట్‌ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ఆన్లైన్ దరఖాస్తు, బాల్‌పాయింట్ పెన్ను తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. రఫ్ వర్క్ కోసం పరీక్ష కేంద్రంలోనే బుక్లెట్ ఇస్తారు. జవాబు మార్చుకోవచ్చు! ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సరికాదని విద్యార్థికి అనిపిస్తే మార్చుకునే వీలుంది. చివరి నిమిషంలో సరైన సమాధానం ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో మాన్యువల్ పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో ఈ అవకాశం లేకపోవడంతో తప్పుడు సమాధానం గుర్తించిన విద్యార్థులు నష్టపోయేవారు. తాజాగా సర్దుబాటుకు అవకాశం ఉండటంతో విద్యార్థులకు మార్కులు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక యూజర్ ఐడీ విద్యార్థి హాల్‌టికెట్‌పైనే ఉంటుంది. పాస్వర్డ్ మాత్రం పరీక్ష హాలుకి చేరుకున్న తర్వాత ఇస్తారు. పరీక్ష తీరుపై వీడియో పరీక్ష హాలులోకి ప్రవేశించినప్పటి నుంచి వివరాలు సరిచూసుకోవడం, ప్రశ్నలు చదవడం, జవాబులు ఎంపిక చేసుకోవడం, పరీక్ష ముగింపు తీరుపై యంత్రాంగం ప్రత్యేక వీడియో రూపొందించింది. విద్యార్థుల్లో ఆందోళన తొలగించేందుకోసం ఎంసెట్ వెబ్సైట్లో ఈ వీడియోను అందుబాటులో ఉంచింది. యూట్యూబ్‌లో కూడా వీడియో అందుబాటులో ఉంచామని, ఈనెల 8 నుంచి ఆన్లైన్ ఎంసెట్‌పై అవగాహన తరగతులు నిర్వహించనున్నామని జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పది శాతం కంప్యూటర్లను అదనంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. -
సెయింట్ మార్టిన్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సెంట్రల్ జోన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజి విజేతగా నిలిచింది. సీఎంఆర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్ మార్టిన్స్ 1–0తో ఆతిథ్య సీఎంఆర్ జట్టుపైనే విజయం సాధించింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను కైలాష్శర్మ సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో సెయింట్ మార్టిన్స్ 4–1తో బీవీఆర్ఐటీపై గెలుపొందింది. విజేత జట్టు చేసిన నాలుగు గోల్స్‌నూ కెప్టెన్ శరత్చంద్ర సాధించడం విశేషం. మరో సెమీస్‌లో సీఎంఆర్ 1–0తో వీఎన్ఆర్ వీజేఐఈటీపై గెలుపొంది ఫైనల్ చేరింది. -
రాష్ట్రంలో మిగిలే ఇంజనీరింగ్ సీట్లు 80 వేలే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మరోసారి భారీగా తగ్గనుంది. ఈ ఏడాది ఏకంగా 25 వేల సీట్లకు కోతపడనుంది. ఈసారి మొత్తంగా అందుబాటులో ఉండే ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 75 వేల నుంచి 80 వేల వరకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని జేఎన్టీయూ ఇటీవలే స్పష్టం చేయడం, యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వివరించిన నేపథ్యంలో సీట్ల కోత కచ్చితమేనని స్పష్టమవుతోంది. సీట్లు నిండకపోవడంతో.. ప్రస్తుత విద్యా సంవత్సరం (2017–18)లో రాష్ట్రంలోని 212 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. కానీ జేఎన్టీయూ సహా యూనివర్సిటీలు 97,961 సీట్లకు మాత్రమే అనుబంధ గుర్తింçపు ఇచ్చాయి. అయితే అనుమతించిన వాటిల్లోనూ పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 25 శాతం కన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తాజాగా అలాంటి బ్రాంచీలను రద్దు చేయనున్నారు. 112 కాలేజీల్లోని సీట్లు.. గతేడాది రాష్ట్రంలోని 112 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న పలు బ్రాంచీల్లో అతి తక్కువగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీల్లో 41,628 సీట్లు అందుబాటులో ఉండగా.. 2,874 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 109 కాలేజీల్లోని పలు బ్రాంచీల్లో 47,640 సీట్లుండగా.. 5,687 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ బ్రాంచీలన్నీ 30శాతం లోపు సీట్ల భర్తీ ఉన్నవే. ఏఐసీటీఈ కూడా.. వరుసగా మూడేళ్ల పాటు 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ఏఐసీటీఈ ఇప్పటికే కాలేజీలకు స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో 41,628 ఇంజనీరింగ్ సీట్లు రద్దవుతాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి బ్రాంచీల్లోని 50శాతం సీట్లకు కోత వేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. కానీ రాష్ట్రంలో జేఎన్టీయూ మాత్రం 30 శాతం కాకుండా 25 శాతంలోపు సీట్ల భర్తీని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన బ్రాంచీలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 41,628 సీట్లు కాకపోయినా 25వేల సీట్ల వరకు కోత తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోనే కాదు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ సీట్లకు కోత పడనుంది. మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాలతో చాలా కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా ఉండడం లేదు. అలాంటి కాలేజీల్లో చదివితే ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో విద్యార్థులు మంచి విద్యాసంస్థల వైపే మొగ్గుతున్నారు. దీంతో చాలా కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. ఫలితంగా గత మూడేళ్లలో 242 కాలేజీలు రద్దు కాగా.. 53,163 సీట్లకు కోత పడింది. ► 2015లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల్లో 2,05,640 సీట్లు అందుబాటులో ఉండగా.. 2017 ప్రవేశాల నాటికి ఈ సంఖ్య 1,52,476కు తగ్గింది. ఇందులోనూ భర్తీ అయిన సీట్లు 1,15,420 మాత్రమే. ► ప్రధానంగా ఇంజనీరింగ్‌లోనే అత్యధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. గతేడాది కూడా ప్రవేశాలకు ఆమోదం పొందిన సీట్లలో 29,367 సీట్లు మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో 25 శాతం భర్తీ నిబంధనతో 25 వేల సీట్లకు కోతపడే అవకాశముంది. ► ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 3,325 ఇంజనీరింగ్ కాలేజీల్లో 16.3 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ఏటా 8.5 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలి ‘‘బ్రాంచీల రద్దు విషయంలో గడిచిన మూడేళ్ల ప్రవేశాలను కాకుండా వచ్చే మూడేళ్లలో ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించాం. ఆ నిబంధనపై పునః పరిశీలన చేయాలని కోరాం. అనుబంధ గుర్తింపు కోసం ఈ నెల 19వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆ తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుంది..’’ – గౌతంరావు, కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
అన్నీ ఉన్నాయి.. అధ్యాపకులు తప్ప
‘పేరుకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అర్హులైన అధ్యాపకులే లేరు. 12,333 మంది పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరమైతే ప్రస్తుతం కేవలం 1,500 మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందేదెలా? అందుకే ఐదేళ్ల వరకు మాకు కొత్త సీట్లు వద్దు’ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పరిస్థితులపై ఏఐసీటీఈకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొన్న అంశాలివీ. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే సీట్లకు కోత విధిస్తున్న ప్రభుత్వం ఇకపై కొత్త సీట్లను మంజూరు చేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)కి స్పష్టం చేసింది. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఈ మేరకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే కాకుండా ప్రొఫెసర్ల కొరతతో సబ్జెక్టు పరమైన నాలెడ్జి విద్యార్థులకు అందడం లేదని వివరించింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న విద్యార్థుల సంఖ్య 18 శాతానికి మించడం లేదని వివిధ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లోని లోపాలను పేర్కొనడంతోపాటు భవిష్యత్ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఏఐసీటీఈ సగానికి..జేఎన్టీయూ మొత్తానికే కోత ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించే చర్యల్లో భాగంగా కాలేజీలను కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు గడిచిన మూడేళ్లలో వరుసగా 30 శాతం లోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల ఇంటేక్‌లో సగం సీట్లకు కోత విధిస్తామని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. తమ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లోనూ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. జేఎన్టీయూ మాత్రం అనుబంధ గుర్తింపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. వరుసగా మూడేళ్లలో 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. గత మూడేళ్లను కాకుండా వచ్చే మూడేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే చర్యలు.. 2017–18 విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన అన్ని కాలేజీలకు యూనివర్సిటీలు అనుమతి ఇవ్వలేదు. అన్ని సీట్లను భర్తీ చేసేందుకు ఓకే చెప్పలేదు. 28,961 సీట్లకు కోత పెట్టాయి. మరోవైపు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లలోనూ 29,367 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. 20 మందికో అధ్యాపకుడు ఉండాలి.. 2017–18 నిబంధనల ప్రకారం ప్రతి 15 మందికి ఒక అధ్యాపకుడు అవసరం. తాజాగా ఏఐసీటీఈ ఆ నిబంధనలో మార్పు చేసింది. 2018–19 నిబంధనల ప్రకారం ప్రతి 20 మందికి ఒక అధ్యాపకుడు ఉంటే సరిపోతుంది. మొత్తం విద్యార్థులకు అనుగుణంగా అధ్యాపకులు 1:2:6 రేషియోలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. 2017–18 లెక్కలు ఇలా పీహెచ్డీ అర్హతతో ఉండాల్సిన అధ్యాపకులు12,333 మంది ప్రస్తుతం పీహెచ్డీ అర్హతతో ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 1,500 మంది 2020 నాటికి అయ్యే విద్యార్థుల సంఖ్య 5 లక్షలపైనే అందుకు అవసరమైన అధ్యాపకులు 34 వేల మంది ఎంటెక్ అర్హతతో అవసరమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 22,667 మంది పీహెచ్డీ అర్హత అవసరమైన మిగతా అధ్యాపకులు 11,333 మంది అవసరమైన ప్రొఫెసర్లు 3,778 మంది అవసరమైన అసోసియేట్ ప్రొఫెసర్లు 7,555 మంది -
ప్రతి కళాశాల ప్రమాణాలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాల్సిందేనని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో కళాశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు పొందాలంటే గత మూడేళ్లుగా 25 శాతానికి పైగా అడ్మిషన్లు ఉండాలని, ఉత్తీర్ణత శాతం కూడా మెరుగైన రీతిలో ఉండాలని స్పష్టం చేశారు. కళాశాలల్లో కనీస వసతులు ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. అయితే అనుబంధ గుర్తింపునకు గత మూడేళ్ల ప్రవేశాలకు బదులుగా ఇప్పటినుంచి మూడేళ్ల ప్రవేశాల తీరును పరిగణలోకి తీసుకోవాలని పలు కాలేజీల యాజమాన్యాలు సూచించినట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపునకు, ఉత్తీర్ణతకు ముడిపెట్టొదని యాజమాన్యాలు కోరినట్లు సమాచారం.