
పుల్కల్ (అందోల్): ఫోన్ మాట్లాడుతూ హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సూల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు అఖిల్ కుమార్ సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అఖిల్ మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో బ్రేష్ చేసుకుంటూ హాస్టల్ భవనంపై ఫోన్ మాట్లాడుతున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే మంగళవారం కాలేజీకి సెలవు కావడంతో కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అఖిల్ మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉండాల్సిన కాలేజీ వైద్య సిబ్బంది లేకపోవడంతో అఖిల్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించాలని విద్యార్థులు రిజి్రస్టార్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment