Engineering student suicide
-
నారాయణ ఇంజినీరింగ్ కాలేజిలో విద్యార్థి ఆత్మహత్య
గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): గూడూరు సమీపంలో ఉన్న నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఒకే రోజు రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలియడంతో షాక్‌కు గురైన వార్డెన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనలతో కళాశాల విద్యార్థులు, సిబ్బంది హతాశులయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వరరెడ్డి (21) నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం కళాశాలకు వెళ్ళి వచ్చిన విద్యార్థి గదిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ఈ విషయాన్ని సహచర విద్యార్థులు గుర్తించి వార్డెన్ శ్రీనివాసులునాయుడు (57)కు చెప్పారు. దీంతో వార్డెన్ షాక్‌కు గురయ్యారు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ని హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యార్థి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిపై ఒత్తిడి? విద్యార్థిని కళాశాల యాజమాన్యం ఒత్తిడికి గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు రోజులుగా కళాశాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) ఇన్స్పెక్షన్ జరుగుతోందని, ఈ కారణంగా విద్యార్థులను రికార్డుల కోసం, ఇతరత్రా తీవ్రంగా ఒత్తిడికి గురి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు అతని కుటుంబంలో కలహాలే కారణమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే విద్యార్థి బ్యాగులో ఓ కత్తి ఉండడాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
సాక్షి, హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి హాస్టల్లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్ గదికి చేరుకున్న హర్షిత్ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్‌గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్ ఓపెన్ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన గజ్జెల కృష్ణ విజయ భాస్కర్‌రాజు(20) బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో విద్యార్థులంతా తరగతులకు వెళ్లాక హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు అతడు ఉరేసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులెవరూ రాక ముందే మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయం త్రం 6.30 గంటలకు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. కళాశాల యాజమాన్యం వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జేబీఐటీ కళాశాల ఆవరణలో తోటి విద్యార్థులు ఆందో ళనకు దిగారు. కళాశాల చైర్మన్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ విద్యార్థులకు నచ్చజెప్పేందుకు విఫలప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతోందని భావించి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించారు. ఫీజు కోసం కళాశాల యాజమాన్యం వేధించిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. మూడురోజుల క్రితం కృష్ణ విజయభాస్కరరాజు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యాడని, వైద్యం చేయించుకున్న తరువాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో శుక్రవారం రాత్రి వార్డెన్, యాజమాన్యం కృష్ణను మందలించారని విద్యార్థులు ఆరోపించారు. -
హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
పుల్కల్ (అందోల్): ఫోన్ మాట్లాడుతూ హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సూల్తాన్‌పూర్ జేఎన్టీయూలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు అఖిల్ కుమార్ సుల్తాన్పూర్ జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అఖిల్ మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో బ్రేష్ చేసుకుంటూ హాస్టల్ భవనంపై ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే మంగళవారం కాలేజీకి సెలవు కావడంతో కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అఖిల్ మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ పెంటయ్య తెలిపారు. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉండాల్సిన కాలేజీ వైద్య సిబ్బంది లేకపోవడంతో అఖిల్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించాలని విద్యార్థులు రిజి్రస్టార్‌ను కోరారు. -
‘బై గాయ్స్’ అంటూ ఇంజనీరింగ్ విద్యార్థి మెసేజ్..
ఖమ్మంక్రైం: తమలాగే కుమారుడు కూలి పనులు చేయకూడదని ఆ తల్లిదండ్రులు బావించారు.. స్తోమతకు మించి కుమారుడిని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు.. అప్పటివరకు చదువులో రాణించిన ఆవిద్యార్థి ఒత్తిడికి గురయ్యాడో.. ఏమో తెలియదు కాని తమ బిడ్డకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండుతాయని ఊహించని ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. విషాదకరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన అల్లు ఆశీర్వాదం, నాగమణి దంపతుల కుమారుడు పవన్ ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాడు. చదువులో కొంతమేరకు రాణిస్తుండటంతో హైదరాబాద్‌లోని సీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపథ్యంలో అతను మానసిక ఒత్తిడికి గురయ్యాడో, మరే ఇతర కారణాలతో కాని ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. ముభావంగా ఉన్నావు.. ఏమిటని స్నేహితులు అడుగగా ఏమీలేదని చెప్పాడు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనం పక్కన ఉన్న భవంతిపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు ఒకరు గదిలోనే చదువుకొంటున్నాడు. బయటకు వెళ్లిన పవన్ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని వారు ఊహించలేదు. పవన్ భవనంపై నుంచి కిందకు దూకటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కేకలు వేయటంతో గదిలో చదువుకుంటున్న స్నేహితుడు పుల్లారావు, మరికొంత మందితో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్థానిక కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు అయిన పవన్ కొద్దిసేపు బాగానే మాట్లాడాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొన్న అతడిని బతికించటానికి కిమ్స్ డాక్టర్ గంగ రాజు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ .. తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకొన్న పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్ఫుల్ లైఫ్’ .. అంటూ స్నేహితులకు మెసేజ్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ తన స్నేహితులకు కూడా అనుమానం కలగకుండా ఇంగ్లిష్‌లో లేఖ రాసుకుని జేబులో పెట్టుకొన్నాడు. ఆ లేఖలో తాను చదవలేకపోతున్నానని, తనను ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారని, తాను తన కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టి వెళుతున్నానని రాసుకున్న లేఖను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే పవన్ బాగానే చదివేవాడని.. ఎందుకు ఒత్తిడికి గురయ్యాడో తెలియటంలేదని.. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడుకాదని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. పవన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పవన్ తండ్రి ఆశీర్వాదం ఫిర్యాదు మేరకు వనటౌన్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. లింగాలలో విషాదచాయలు.. కల్లూరురూరల్: ఖమ్మంలో ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ ఆత్మహత్యకు పాల్పడటంతో కల్లూరు మండలం లింగాల గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న తల్లిదండ్రలు వెంటనే ఖమ్మం చేరుకుని కొనఊపిరితో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావని అడగగా ఏమీ లేదని చెప్పి మృతి చెందాడు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు , కోవూరు: మండలంలోని చిన్న పడుగుపాడు ప్రాంతానికి చెందిన ఒరువూరు కార్తికేయ (18) అనే ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్తికేయ కోవూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అతను ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. కాసేపటి తర్వాత చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మంగళవారం మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అందరితో బాగుండే కార్తికేయ మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సహచర విద్యార్థులు, అధ్యాపకులు తెలిపారు. -
కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..!
సాక్షి, కడప: జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మహబూబ్ బాషా (20) శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఉండగానే విషం తాగినట్లు తెలుస్తోంది. అయితే, సత్వరమే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదనీ, వైద్యుల నిర్లక్ష్యమే బాషా ప్రాణాలు తీసిందని అతని స్నేహితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్ : మానసిక ఒత్తిడికి లోనైనా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు .. ఎమ్మిగనూరు గాంధీనగర్‌కు చెందిన గోవిందు, ఉమా దంపతులు తమ కుమారుడు ఈశ్వర్(23)ను గత ఏడాది ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజిలో చేర్పించారు. అయితే చదువు విషయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఇబ్బంది పడుతుండడంతో కాలేజీ మాన్పించారు. మానసిక స్థితి సరిగా లేనట్లు గుర్తించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి మానసిక వైద్యుల వద్ద చూపించారు. పరిస్థితి కొద్దిగా కుదుట పడడంతో ఈ ఏడాది కాలేజీలో చేర్పించారు. గురువారం కాలేజికి వెళ్లిన ఈశ్వర్ ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో కాలేజీ సిబ్బంది బైక్‌పై తెచ్చి ఇంటి వద్ద వదిలివెళ్లారు. ఇంట్లో బ్యాగ్ పెట్టి బయటకు వెళ్లిన ఈశ్వర్ రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పట్టణమంతా గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం లక్ష్మణ్ థియేటర్ వెనక భాగంలోని బావిలో శవంగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకరయ్య తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం : అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అధ్యా పకుడి వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆగ్రహించి కళాశాలలో విధ్వంసానికి పాల్పడ్డారు. కళాశాలలో సివిల్ బ్రాంచి రెండో ఏడాది విద్యార్థి అమరా నవ్య క్రాంతికుమార్(20) శనివారం తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విద్యార్థి మృతికి ప్రిన్సిపాల్, అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. కళాశాల ఆవరణలో ఉన్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన క్రాంతికుమార్ ఓడలరేవు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదే మండలంలోని కొమరగిరిపట్నంలో కొంతమంది విద్యార్థులతో కలిసి ఉంటున్న వసతి గదిలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కళాశాలలో శుక్రవారం క్రాంతికుమార్ కు, ఓ అధ్యాపకుడికి మధ్య నోట్సు విషయ మై శుక్రవారం వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో క్రాంతికుమార్ తన పెన్నును ఆయన పైకి విసిరాడు. శనివారం ఉదయం కళాశాలకు వచ్చి తరగతికి హాజరయ్యాడు. అయితే అధ్యాపకుడు ‘నీకు హాజరు ఇవ్వం, ప్రిన్సిపాల్‌ను కలవ’మని సూచించారు. దీనితో క్రాం తికుమార్ ప్రిన్సిపాల్‌ను కలి శాడు. ‘నీ చదువు, హాజరు సంతృప్తికరం గా లేవు, పెపైచ్చు అధ్యాపకునితో వివాదానికి దిగావు, నీ తల్లిదండ్రులను తీసుకువస్తేనే కళాశాలకు అనుమతిస్తా’మని ప్రిన్సిపాల్ తెగేసి చెప్పారు. దీంతో క్రాంతికుమార్ ‘నేను మా రూమ్‌కు వెళిపోతాను, నా ఫోను ప్రిన్సిపాల్ తీసుకున్నారు. మా ఇంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్‌గారు రమ్మన్నారని చెప్పండి’ అని తన రూంమేట్లకు చెప్పి గది తాళం తీసుకుని కొమరగిరిపట్నంలోని రూమ్‌కు వెళ్లిపోయాడు. ఓ గంట తర్వాత భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు రూమ్‌కు వచ్చారు. తాళం తీసి చూడగా అప్పటికే క్రాంతికుమార్ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. 108కు సమాచారం అందించగా, అప్పటికే క్రాంతికుమార్ మరణించినట్టు సిబ్బంది తెలిపారు. అయి నా అతడి మిత్రులు బీవీసీకి చెందిన అంబులెన్సులో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి క్రాంతికుమార్‌ను తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. తమ కళాశాల విద్యార్థి మరణాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఓడలరేవు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహోద్రిక్తులై కళాశాలకు చెందిన బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో క్రాంతికుమార్ మృతదేహానికి పోలీసులు శనివారం రాత్రి శవపంచనామా నిర్వహించారు. అమలాపురం రూరల్ సీఐ డి.శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్ వివరణ ‘క్రాంతికుమార్ చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు. హాజరు శాతం కూడా తక్కువగా ఉంది. తరగతి గదిలో నోట్సు రాయమన్న అధ్యాపకుడిపై పెన్ను విసిరాడని ఫిర్యాదు అందింది. దీనిపై శనివారం అధ్యాపకుల సమక్షంలో పిలిపించి మాట్లాడాను. దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడాలి తీసుకురమ్మని అతడితో చెప్పి పంపించాను. తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అంబులెన్సు పంపాం. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా చనిపోయాడు. ఇందులో అధ్యాపకులు కానీ, తాను కానీ అతన్ని వేధించలేదు’ అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీ ప్రసాద్ వివరణ ఇచ్చారు.