
వివరాలు తెలుసుకుంటున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి
నెల్లూరు , కోవూరు: మండలంలోని చిన్న పడుగుపాడు ప్రాంతానికి చెందిన ఒరువూరు కార్తికేయ (18) అనే ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్తికేయ కోవూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అతను ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. కాసేపటి తర్వాత చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మంగళవారం మృతదేహానికి నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అందరితో బాగుండే కార్తికేయ మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సహచర విద్యార్థులు, అధ్యాపకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment