warangal district
-
19 కిలోల బంగారం చోరీ
సాక్షి, వరంగల్/ రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐలో మంగళవారం తెల్లవారుజా మున భారీ దోపిడీ జరిగింది. భవనం కిటికీని తొలగించి లోపలికి వెళ్లిన దుండగులు బ్యాంకులోని మూడు లాకర్లలో ఒకదానిని గ్యాస్‌కట్టర్‌తో పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకులోని అలారం సిస్టంను ధ్వంసం చేశారు. లాకర్లోని 19 కిలోలకుపైగా బంగారం చోరీచేసినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14.82 కోట్లు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సీసీ కెమెరా పుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ను కూడా అపహరించారు.దోపిడీకి గురైన బ్యాంకు రాయపర్తి పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే ఉన్నా నిందితులు పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం విధులకు హాజరైన మేనేజర్ సత్యనారాయణ బ్యాంకులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రవణ్‌కుమార్, రాజు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ మంగళవారం రాత్రి సందర్శించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు దొంగల పనే? ఈ దోపిడీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన దొంగల ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో తమిళ భాషలో ఉన్న ‘జోకర్’ అగ్గిపెట్టె లభించడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకు లాకర్‌ను కట్ చేసిన గ్యాస్ కట్టర్‌ను కూడా దొంగలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో అది కీలకం కానుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాస్‌కట్టర్‌ను అమెజాన్ వెబ్సైట్లో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. అది డెలివరీ అయిన చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.25 రోజల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచిలో దొంగలు రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం అదే తరహాలో ఇక్కడ కూడా దోపిడీ జరగటంతో రెండు దోపిడీలు చేసింది ఒకటే ముఠా అని అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారుల అలసత్వంవల్లే: ఖాతాదారులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయటంలేదు. దీంతో దొంగలకు చోరీలు చేసి తప్పించుకోవటం తేలికైందని ఖాతాదారులు మండిపడుతున్నారు. మండల కేంద్రానికి బ్యాంకు దూరంగా ఉండటం.. గతంలో సెక్యూరిటీగార్డును నియమించినా ప్రస్తుతం తొలగించటం వల్లే దోపిడీ జరిగిందని చెప్తున్నారు. బ్యాంకులో బంగారం చోరీ అయినట్లు తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.ఎంతో నమ్మకంతో బ్యాంకులో సొమ్ము దాచుకుంటే ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మూడేళ్ల క్రితం ఇప్పుడు పగులకొట్టిన కిటికీ నుంచి కాకుండా మరో కిటికీని పగులగొట్టి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. కానీ, లాకర్‌ను ఓపెన్ చేయలేక తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించకపోవటం కూడా దోపిడీలకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. -
తెలంగాణ నెక్కొండ వాసికి అరుదైన అవకాశం..
వరంగల్: అత్యంత ప్రతిష్టాత్మకంగా పారిస్‌లో జరగనున్న 33వ పారా ఒలింపిక్స్ క్రీడా సమరంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించే అరుదైన అవకాశం ఉమ్మడి వరంగల్ బిడ్డకు దక్కింది. షటిల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్‌గా భారతదేశం నుంచి ఇద్దరికి అవకాశం రాగా.. అందులో వరంగల్ వ్యక్తి ఒకరు కావడం విశేషం.ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (మలేషియా) పారా ఒలింపిక్స్‌లో న్యాయ నిర్ణేతలుగా పాల్గొనేందుకు భారత్ నుంచి పూణేకు చెందిన ఒకరిని నియమించగా.. ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ ఒలింపిక్స్ కొనసాగుతుండగానే.. రెండో దశలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.ఈ ఒలింపిక్స్‌లో కొమ్ము రాజేందర్ టెక్నికల్ అఫీషియల్స్‌గా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి తనకు అందిన ఈఅవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెబుతున్నారు ఫిజికల్ డైరెక్టర్ కొమ్ము రాజేందర్.గురువుల ప్రోత్సాహంతోనే..పాఠశాల స్థాయిలో ఆటల్లో నా ప్రతిభను గుర్తించి నాటి నుంచి ఒలింపిక్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికవడం వరకు అడుగడుగునా గురువులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. క్రీడా గురువులు రాజశేఖర్, చెన్న కృష్ణ, సాంబయ్య, నిమ్మ మోహన్‌రావు, పి.కుమారస్వామి ఆట నేర్పిస్తే, అంపైర్‌గా రాణించేలా షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎస్.రమేశ్‌కుమార్, డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి, రాష్ట్రస్థాయిలో కేసీహెచ్ పున్నయ్య చౌదరి, సుధాకర్ వేమూరి భుజం తట్టారు. – కొమ్ము రాజేందర్, ఒలింపిక్స్ టెక్నికల్ అఫీషియల్ -
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం
-
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
అమ్మానాన్న.. నన్ను క్షమించండి..!
చెన్నారావుపేట: అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనకు సంబంధించి, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన చీర మల్లేశం– కళావతిలకు కుమార్తె, కుమారుడు రంజిత్(25) ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిపించారు. కుమారుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఓ పోటీ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉద్యోగం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్నేహితుడు ప్రశాంత్ అక్క వివాహానికి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పట్టణంలోని ఎర్రముక్కలపల్లి రోడ్డు వద్ద ఓ ప్రముఖ లాడ్జీని అద్దెకు తీసుకున్నారు. గురువారం తన స్నేహితులు టిఫిన్ చేయడానికి వెళ్లారు. రంజిత్ రాకపోవడంతో స్నేహితులు గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు తెలియజేసి, రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం రంజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది. -
ప్రవళిక కుటుంబానికి భరోసా ఏదీ?
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.ప్రియాంక గాంధీ దూత వచ్చినా..అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.కూలీ పనులకు వెళ్తున్నా..నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రినిందమోపిండ్లు.. రుజువు చేయలే.. నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.– మర్రి విజయ, ప్రవళిక తల్లి -
ఏ పాము కరిచిందని అడుగుతారని..
రాయపర్తి(వరంగల్): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వృద్ధురాలు మేరుగు ఎల్లమ్మ వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.దీంతో ఆమె కేకలువేయడంతో రమేశ్ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. -
తన కొడుకుని బస్సులో ఎక్కించుకోలేదని మహిళ ఏం చేసిందంటే ?
-
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్.. కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్
వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్నల్లగొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున లెక్కింపునల్లగొండప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియమధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభంఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియసాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభంపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటననేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు. -
రాష్ట్రంలో వడదెబ్బకు 8 మంది మృతి
చిట్యాల/ హాలియా/కాసిపేట/చొప్పదండి/ములుగు/మహబూబాబాద్/వరంగల్/మునుగోడు: రాష్ట్రంలో వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో శుక్ర వారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలంలోని కొత్తపల్లికి చెందిన బచ్చు ముకుందరెడ్డి(55) బైక్‌పై వ్యవసాయ పనిముట్ల కోసం ఉదయం నల్ల గొండ పట్టణానికి వెళ్లి పనిచూసుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యాడు.చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఇదే జిల్లాలో ఏపీలోని పశి్చమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన కర్రి రాజు(40), భార్య దీనమ్మ తమ ముగ్గురు పిల్లలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా చిట్యాల బస్టాండ్‌లో రామన్నపేటకు వెళ్లేందుకు రాజు బస్సుకోసం ఎదురుచూస్తుండగా వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఇదే జిల్లాకు చెందిన మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన కమ్మలపల్లి మమత (28) ఉపాధి పనుల నిమిత్తం కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మంచినీళ్ల కోసమని కిందికి దిగి... కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని బసంత్ నగర్లో నివాసం ఉండే మధ్యప్రదేశ్‌కు చెందిన జాకీర్ హు స్సేన్(60) అనే లారీ డ్రైవర్ చొప్పదండికి సిమెంట్ లోడ్‌తో వచ్చాడు. ప్రధాన రహదారిపై ఓ హోటల్ సమీపంలో లారీని ఆపి మంచినీళ్ల కోసమని కిందికి దిగాడు. ఈ క్రమంలో అతడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించగా వారు వచ్చి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీ దుర్గం భీమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన జన్ను ఎల్లమ్మ (50), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన దామెర రాంబాబు(48) వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(74) రోజువారీగా పందులు మేపడానికి వెళ్లి ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతిచెందాడు. -
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్‌లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్‌లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీమంత్రి దయాకర్‌రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్‌సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్‌సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్‌కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
వరంగల్: బైక్‌పై నలుగురు.. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి
సాక్షి, వరంగల్: నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ హృదయ విదారకఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది.వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతులు వరుణ్ తేజ(18), సిద్దు(18),గణేష్(18), రనిల్ కుమార్(18) లుగా పోలీసులు గుర్తించారు.నలుగురు యువకులు స్నేహితులు, ప్రమాద సమయంలో ఒక్క ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. -
వరంగల్ జిల్లాలో కలకలం రేపిన సబ్ రిజిస్ట్రార్ తస్లిమా వ్యవహారం
-
పెళ్లి ఇష్టం లేక వరుడి ఆత్మహత్య?
హసన్‌పర్తి/వర్ధన్నపేట: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ శవమై లభించాడు. వర్ధన్నపేట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పోలీసులు.. వరుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరంలోని గోకుల నగర్‌కు చెందిన భూక్యా కృష్ణ తేజ(29) వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో జరగనుంది. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికల పంపిణీ చేయడం ప్రారంభించారు. పెళ్లి ఇష్టం లేకనే? కృష్ణతేజకు పెళ్లి ఇష్టం లేకనే ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ బైక్ పార్క్ చేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని బైక్‌ను పరిశీలించారు. అందులో పెళ్లి పత్రికలు లభ్యంకాగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు కృష్ణతేజ తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక పెళ్లి ఇష్టం లేక పారిపోయాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం వర్ధన్నపేట మండలంలోని శ్రీ రామోజీ కుమ్మరిగూడెం శివారులోని ఎస్సీరెస్పీ కాల్వలో కృష్ణాతేజ మృతదేహం లభ్యమైంది. -
విరిగిన స్టీరింగ్ రాడ్..
చెన్నారావుపేట: వరంగల్ జిల్లాలో స్టీరింగ్ రాడ్ విరగడంతో ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. నర్సంపేట డిపో నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మండల పరిధిలోని బోజేర్వు గ్రామానికి వెళ్లింది. అక్కడి నుంచి 30 మంది ప్రయాణికులతో నర్సంపేటకు వస్తున్న క్రమంలో తిమ్మరాయినిపహాడ్ శివారుకు రాగానే బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో బురద ఉండటంతో బస్సు కూరుకుపోయి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి క్షతగాత్రులను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. -
చిత్రకళకు కొండంత చిరునామా
ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి. వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు. కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్ అయి, ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ’శాంతినికేతన్’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్లో, కలర్ గ్రాన్యూల్స్ మ్యూరల్ పెయింటింగ్స్‌లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్ పేట్ దగ్గర మైత్రి భవన్ హుడా కాంప్లెక్స్ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు. ‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు. ‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. – డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు (నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .) -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దే హవా
-
ఓరుగల్లు.. పోటీ ఫుల్లు!
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల తీర్పుపై తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓరుగల్లు జనంనాడిపై అందరి దృష్టి ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ బలపడి నువ్వానేనా అన్నట్టు పోటీలో ఉంది. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ అభ్యర్థులపై అసంతృప్తికి తోడుగా తమ గ్యారంటీల మేనిఫెస్టోకు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బీజేపీ బలంగా చెబుతోంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎన్నికల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ తూర్పు: ఉదయించేది ఎవరో? గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా రెండున్నరేళ్ల అనుభవం, ఆ తర్వాత ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నన్నపునేని నరేందర్ బీఆర్ఎస్ తరపున మరోమారు అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఈ సెగ్మెంట్‌నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ తరపున, మంత్రి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. గత రెండేళ్లుగా భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని కుదిపేయడంతో స్థానికంగా ప్రజల్లో ఆగ్రహం ఉంది. అయితే వరద నివారణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, దీనికితోడు కేడర్‌ను పట్టించుకోడనే ప్రచారం ఉండడం, కిందిస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే భావనలో బీఆర్ఎస్ ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడాన్ని కొండా సురేఖ అనుకూలంగా మార్చుకుని విజయం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో బలమైన నేతగా పేరున్న బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సైతం ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు సైతం ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్డడంతో పోటీ త్రిముఖంగా ఉంది. పరకాల: గెలుపుపై ’చల్లా’రని ఆశలు అధికార పార్టీ నుంచి చల్లా ధర్మారెడ్డి పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి కాళీప్రసాద్ పోటీలో ఉన్నారు. అభ్యర్థి స్థానికంగా పట్టున్న నేత కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దఫా గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం, నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్: గెలుపు కూత ఎటు? బీఆర్ఎస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి ఇందిర, బీజేపీ తరపున విజయరామారావు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు బదులుగా కడియంకు టికెట్ ఇవ్వడం పట్ల కేడర్‌లో కొంత అసంతృప్తులు బయటపడ్డాయి. పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ రాజయ్య వర్గం కడియం గెలుపు కోసం ఏమేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఇందిర మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఆమెకు కలిసి వస్తుందని భావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు బీజేపీ సైతం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. డోర్నకల్: ఏ ’నాయక్’ నిలిచేనో గిరిజనుల ప్రభావమున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్, కాంగ్రెస్ నుంచి జాటోత్ రామచంద్రునాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత పోటీలో ఉన్నారు. 1989 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2009 ఎన్నిక మినహా మిగతా ఆరుసార్లు రెడ్యానాయక్ గెలుపొందారు. ఏడోసారి గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమాతో ఆయనున్నారు. అయితే ప్రభుత్వం, ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని, దీంతో గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి, పార్టీలో రెబల్స్ లేకుండా ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితులు గట్టెక్కిస్తాయనే భావన కాంగ్రెస్‌లో ఉంది. బీఆర్ఎస్లో ఉన్న సంగీత చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీలో ఉన్నారు. పాలకుర్తి: ‘దయ’ ఉంటుందా? మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికార బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా, అత్యంత పిన్న వయసు్కరాలైన యశస్వినిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి రామ్మోహన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టున్న వ్యక్తిగా పేరుండడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం దయాకర్‌రావుకు కలిసొచ్చే అంశం. ఏళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో ఉండే వ్యతిరేకత, దీనికి తోడు ప్రభుత్వంపై ఉండే అసంతృప్తి పాటు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండడం తనకు కలిసివస్తుందని యశస్వినిరెడ్డి భావిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న రామ్మోహన్‌రెడ్డి స్థానిక మంత్రాన్ని జపిస్తున్నారు. మహబూబాబాద్: త్రిముఖ పోటీ అధికార పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శంకర్‌నాయక్ మూడోసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటుండగా, స్థానికంగా వైద్యుడిగా మంచిపేరు పొందిన మురళీనాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. బీజేపీ తరపున హుస్సేన్‌నాయక్ పోటీలో ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యే కావడంతో ఉండే వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటుండడం, కిందిస్థాయి నాయకుల్లో అసంతృప్తి అధికార పార్టీ అభ్యర్థికి ప్రతికూలాంశాలు. మురళీనాయక్ స్థానికంగా కలుపుగోలు వ్యక్తి కావడంతో గెలుపు పట్ల ధీమా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 35వేల ఓట్లు సాధించిన హుస్సేన్‌నాయక్ ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తుండడగా సానుభూతి కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. నర్సంపేట: ఇద్దరి మధ్యే హోరాహోరీ బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి రెండోసారి గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ నుంచి పుల్లారావు పోటీలో ఉన్నారు. ప్రధానంగా అధికారపార్టీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఉద్యమనేపథ్యం ఉండడం, ప్రతి గ్రామంలో మంచి పరిచయాలుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న దొంతి మాధవరెడ్డి సైతం క్షేత్రస్థాయిలో మంచి పరిచయాలు కలిగి ఉండి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ముమ్మరంగా కష్టపడుతున్నారు. జనగామ: ఎవరికి జై కొడుతుందో? అధికార బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ తరపున ఆరుట్ల దశమంతరెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బదులుగా పల్లాను బరిలోకి దింపడంతో కలిసివస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు గతంలో పీసీసీ చీఫ్‌గా చేసిన మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో గెలుపు పట్ల ధీమాగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం సహకారం, పొన్నాల బలం ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి గతంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ కేడర్ సైతం గట్టిపోటీ ఇచ్చేందుకు శ్రమిస్తోంది. ములుగు: సీతక్క ముందు నిలిచేనా బీఆర్ఎస్ అభ్యర్థిగా ములుగు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ సీతక్క, బీజేపీ తరపున మాజీమంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ పోటీ పడుతున్నారు. నాగజ్యోతి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగిన అనుభవం, మావోయిస్టు నేపథ్యమున్న కుటుంబం కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన వ్యక్తి కావడం, స్థానికంగా ప్రతి తండాలోనూ కలుపుగోలుగా ఉండడం కలిసొచ్చే అంశం. ఈసారి రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఆదివాసీ తెగకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలక ఎలా ఉంటుందనేది చూడాలి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ లంబాడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను పూర్తిగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో గెలుపు ఎటువైపు ఉంటుందో చూడాలి. భూపాలపల్లి: ’బాస్’ ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ చేరిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ బలంగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం అధికారపార్టీ అభ్యర్థికి ఏమేరకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆయన ఆధారపడ్డారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్థానికంగా ఓటర్లను ఆకట్టుకున్న సత్యనారాయణ ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసివస్తుందని భావిస్తుండగా, బీజేపీ తరపున రెండోసారి పోటీలో ఉన్న కీర్తిరెడ్డి సైతం గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ: ఫలితమెటో.. వరంగల్ వెస్ట్ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి రాజేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రావు పద్మారెడ్డి పోటీలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా గెలిచిన వినయ్ భాస్కర్ ఈసారి విజయం దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, బలమైన బీఆర్ఎస్ కేడర్‌తో గట్టెక్కుతాననే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడిగా, ఎన్ఎస్యూఐ నేతగా పనిచేసిన రాజేందర్‌రెడ్డికి ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వడంతో విజయం కోసం ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, వరద నివారణ చర్యలు పూర్తికాకపోవడం లాంటి అంశాలు, సుదీర్ఘ కాలంగా ఒకే వ్యక్తి ఉండడంతో వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుండగా... బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, ప్రతి బస్తీలో పరిచయమున్న నేతగా కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారంలో పద్మ దూసుకుపోతున్నారు. ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి. వర్ధ్దన్నపేట: విజయం ఎవరిని వరించేను? అత్యధిక మెజారిటీతో రెండుసార్లు విజయం సాధించిన ఆరూరి రమేశ్ మూడోసారి కూడా బీఆర్ఎస్ తరపున పోటీ పడుతుండగా, మాజీ పోలీసు అధికారి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ తరపున, బీజేపీ తరపున కొండేటి శ్రీధర్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు కిందస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం, కేడర్‌ను పట్టించుకోకపోవడం, నాయకులకు అందుబాటులో ఉండకపోవడం లాంటివి ప్రతికూలాంశం. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నతహోదా నుంచి వచ్చిన వ్యక్తి కావడం, స్థానికంగా మంచి పేరుండడం, కాంగ్రెస్ కేడర్ బలపడడం అనుకూలాంశాలు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కొండేటి శ్రీధర్ 2009 ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యం ఉండడంతో ఆయన సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయం కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తామని చెప్పి చివరకు ప్రకటనలకే పరిమితం చేయడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ పడ్డారు. టీచర్ పోస్టులతో పాటు గ్రూప్ ఉద్యోగాలకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సిద్ధమైనా, పరీక్షలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగాలు మానేసి పరీక్షలకు సిద్ధమైన నాలాంటి అభ్యర్థులు మానసికంగా ఆందోళనలో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటూ ఊదరగొట్టడమే కాకుండా ఉపాధి కల్పనపైన దృష్టి సారించాలి. – షేక్ నాజీమ్ బాబా, నిరుద్యోగి, ఏటూరునాగారం వరదల నుంచి నగరాన్ని కాపాడాలి రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో నగరం విలవిలలాడింది. పట్టణమంతా నీటిలో మునిగింది. పేదలే తీవ్రంగా నష్టపోయారు. మునకకు ప్రధాన కారణం నాలాల ఆక్రమణలు. వరదల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆక్రమణలు, నాల ఎఫ్టీఎల్లో నిర్మాణాల తొలగింపు చేపట్టాలి. – తిరుణహరి శేషు, వరంగల్ -
ఉమ్మడి వరంగల్‌లో నామినేషన్ దాఖలుకు ముమ్మర ఏర్పాట్లు
-
వరంగల్ లో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం
-
నీ మాట, పనులు బోగస్ అంటూ మండిపడుతున్న వైఎస్సార్
-
నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో
సాక్షి, వరంగల్: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్‌కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు. దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌కు వెళ్లిపోయాడు. చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్