గీసుకొండ: తన భర్తను అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కుట్రలు పన్నుతున్నారని అందుకే ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని కొండా సురేఖ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ కొండామురళీ బయోపిక్ ‘కొండా’ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొం డా సురేఖ మాట్లాడుతూ..గతంలో టీడీపీలో చేరాలని తమను చంద్రబాబు ఆహ్వానిస్తే ఎర్ర బెల్లి దయాకర్ ఉండటంతో చేరలేదని గుర్తు చేశారు.
తాము టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా పార్టీలో చేరి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఒక తండ్రికే పుట్టానని టీడీపీని వదిలిపెట్టబోనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేశారని, మరి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఎంతమంది తండ్రులకు పుట్టా రో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయాల్లో గాడ్‌ఫాదర్ లేకుండా ఎదిగి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కొండా మురళి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment