
వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన మేడిపల్లి సమ్మవ్వ(సమ్మక్క) కుమారుడు సంపయ్య ఇరవై ఏళ్లక్రితం చనిపోగా, భర్త అయి లయ్య ఏడాది క్రితం అనారో గ్యంతో కాలం చేశాడు. దీంతో ఎవరూ లేని ఆమె గ్రామంలో భిక్షాటన చేస్తూ బతుకుతోందని స్థానికులు ఎస్సై నార్లాపురం రాజారాం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ‘ఆమె అనాథ కాదు.. బాగోగులు నేను చూసుకుంటా.. ఉండేందుకు ఇల్లు కటించే బాధ్యత నాదే’’ నని చెప్పి...
అన్నట్టుగానే సొంత డబ్బులతో ఇల్లు కట్టించి సోమవారం గృహప్రవేశం చేయించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఏసీపీ సంపత్‌రావు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం సమ్మవ్వకు ఏసీపీ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు అందించారు. అనాథ అవ్వను దత్తత తీసుకున్న రాజారాంను అందరూ అభినందించారు.
– నల్లబెల్లి
Comments
Please login to add a commentAdd a comment