Sub Inspector of Police (SI)
-
కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.ఈ కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్‌లో ఏముందో..బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.శ్రుతి, నిఖిల్ వాట్సాప్(Whatsapp) మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
కానిస్టేబుల్ తో ఎస్సై వివాహేతర సంబంధం.. న్యాయం కావాలంటూ భార్య ఆందోళన
-
'నూతన' వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్ఐ గోపాల్
సాక్షి, నిడమనూరు (నల్గొండ జిల్లా): ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని నిడమనూరు ఎస్ఐ గోపాల్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి బండి నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో డీజేలు, సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాప్‌లకు రాత్రి 12.00 గంటల వరకు.. బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1.00 గంట వరకు మాత్రమే ప్రభుత్వo అనుమతించింది. సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామన్నారు. -
కామారెడ్డి పోలీసుల కేసులో విచారణ వేగవంతం
-
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్‌లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్‌లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్‌గా మారింది. -
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్
ములుగు: ఎస్సై హరీశ్, ఆ యువతి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఓ రిసార్టులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హరీశ్ ఆత్మహత్యకు సూర్యాపేట జిల్లాలోని దుగ్యాతండాకు చెందిన ఓ యువతిపై పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా..అబద్ధమా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ ఆడియోలో ఏంముందంటే...: ‘మనం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేయాలి. పలువురిని ఆకర్షించేలా చేస్తేనే మన ప్రేమ విషయం బయటకు వస్తుంది.. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. విషయం బయట కు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకోని పక్షంలో నా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుందాం.’ – ఎస్సై హరీశ్‘నేను కాళ్లు పట్టుకుంటాను కానీ.. మా అమ్మా నాన్న పట్టుకోరు.. నేను కొందరిపై కేసులు పెట్టినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన ఇద్దరిపై కేసులు పెట్టాను. ఈ విషయం హరీశ్‌కు ముందుగానే తెలిపాను. ఆయన మంచి మనసుతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి డబ్బు చర్చలు రాలేదు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా బ్యాంకు ఖాతాలను చూస్తే ఆ విష యం తెలుస్తుంది. నాపై కావాలనే చిలుకూరులోని కొందరు కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలు వచ్చేలా చేశారు’. – సదరు యువతిఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?
ములుగు : వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను పోలీసులు ఇప్పటి వరకూ వెల్లడించలేకపోతున్నారు. ఎస్సై ఆత్మహత్య రోజు ఏమి జరిగిందనే అంశం మిస్టరీగా మారుతోంది. నల్లగొండ జిల్లా చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తండాకు చెందిన యువతి బ్లాక్ మెయిలింగ్ కారణంగానే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతోపాటు మరేమైన బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు యంత్రాంగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సదరు యువతి ఈ నెల 1వ తేదీన ఎస్సై హరీశ్ కోసం వచ్చినట్లు ఆధారాలతో పూర్తి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఫెరిడోస్ రిసార్ట్‌లోని ఓ గదిలో ఎస్సై ఆత్మహత్య అనంతరం సదరు యువతిని పోలీస్ శాఖతో పాటు ఇతరులు గమనించారు. దీంతో ఎస్సై హరీశ్ ఆత్మహత్య ఘటనలో ఆమె ప్రధాన కారణమా లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హరీశ్ చనిపోక ముందు రోజు యువతితో మాట్లాడే క్రమంలో ఒత్తిడికి లోనై స్నేహితులకు ఫోన్ చేశారు. దీంతో ఓ స్నేహితుడు రిసార్ట్‌కు చేరుకుని యువతితో మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. సమస్య సద్దుమనిగినట్లు భావించిన ఎస్సై హరీశ్ స్నేహితుడిని వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అతను అక్కడి నుంచి బయలుదేరి ములుగు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన సదరు యువతి.. ఎస్సైతో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన హరీశ్ ఫోన్ ద్వారా స్నేహితుడిని సంప్రదించాడు. అప్రమత్తమైన స్నేహితుడు ములుగు నుంచి బయలుదేరి వాజేడుకు చేరుకోకముందే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు?వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న సదరు యువతి ఈనెల 1వ తేదీ వాజేడు స్టేషన్ ముందు నుంచి ఎస్సై హరీశ్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ వెహికిల్ ద్వారా ఆమెను రిసార్ట్‌కు పంపించారు. అయితే ఈ వాహనాన్ని నడిపిన వాజేడు పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఎవరు అనే అంశం ఇప్పటికీ తెలియడం లేదు. చివరికి ఆ యువతిని రిసార్ట్‌లో డ్రాప్ చేసిన అనంతరం రెండు, మూడు సార్లు సదరు వ్యక్తి ప్రైవేట్ వాహనంలో కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ఎస్సై హరీశ్ విషయంలో కీలక ఆధారాలు అతని వద్దే? -
కీలక ఆధారాలు అతని వద్దే?
ములుగు: ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ అనుమానాస్పద ఆత్మహత్యపై పలు రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న గన్‌మన్ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కేసును ఛేదించేందుకు వెంకటాపురం(కె) సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాజేడు కేంద్రంగా పూర్తి స్థాయి సమాచారం రాబట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆత్మహత్య అనంతరం సంఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ సభ్యులు ఎస్సై హరీశ్‌కు సంబంధించిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన సూర్యాపేట జిల్లా పరిధి చిలుకూరు మండలానికి చెందిన యువతి ఫోన్‌కాల్ లిస్టుపైన మదింపు జరుగుతున్న ట్లుగా సమాచారం. ఇదంతా పోలీసు శాఖ పరిధిలో సాఫీగానే జరుగుతున్నా.. వాజేడు ఎస్సైగా హరీశ్ బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి అతను ఆత్మహత్య చేసుకునే వరకు ఎస్ఐతో ఉన్న గన్‌మన్ మరుసటి రోజు నుంచి అందుబాటులో లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.సంచలనంగా మారిన ఈ కీలక కేసులో గన్‌మన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు సెలవు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. వివాదాస్పద కేసు వివరాలను బయట పెడతాడని అధికారులు అతడిని సెలవుపై పంపించారా? లేక అతడిని కూడా విచారిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ తరఫున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం గమనార్హం.రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య -
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
-
వట్‌పల్లికి ఎస్ఐ కావలెను
వట్పల్లి(అందోల్): వట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ పోస్టు నెల రోజులుగా ఖాళీగా ఉంటోంది. గతనెల 8వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ లక్ష్మణ్‌తో పాటు సిబ్బంది ఓ పార్టీ నాయకుడి బర్త్‌డే వేడుకలు నిర్వహించడంతో ఎస్ఐపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆ తర్వాత అతని స్థానంలో మరో ఎస్ఐని నియమించకుండా ఏఎస్ఐ విఠల్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జోగిపేట సర్కిల్లో వట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువ. ఈ మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనికి తోడు వట్పల్లి మీదుగా కర్నాటక, మహారాష్ట్ర, బీదర్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గుట్కా, తంబాకు వంటివి అక్రమంగా రవాణా అవుతుంటాయి. వరంగల్, బీదర్, కర్నాటక ప్రాంతాల నుంచి గుట్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నెలలో ఒకటి రెండు కేసులు నమోదు కావడం పరిపాటి. మండలంలో పేకాట పెద్ద ఎత్తున సాగుతోంది. పూర్తిస్థాయి ఎస్ఐ లేకపోవడంతో కొందరూ సిబ్బంది సైతం విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. త్వరితగతిన ఎస్ఐని నియమించి శాంతి భద్రతలకు కృషి చేయాలని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
ఎస్సై శ్వేత సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం -
వెంబడిస్తున్న టీఎస్ఐని కారుతో ఢీకొట్టి..
ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(టీఎస్ఐ)ను కారుతో బలంగా ఢికొట్టి, తీవ్రంగా గాయపరిచిన ఉదంతం వెలుగు చూసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జై ప్రకాష్ సింగ్ నోయిడాలోని రజనీగంధా కూడలిలో విధులు నిర్వహిస్తుండగా, అతనికి అనుమానాస్పద వాహనం గురించిన సమాచారం అందింది. వెంటనే ఆయన ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని డ్రైవర్ కారును అత్యంత వేగంగా పోనిచ్చాడు.వెంటనే జై ప్రకాష్ సింగ్ ఒక స్కూటీ లిఫ్ట్ తీసుకొని కారును వెంబడించి, అట్టా రెడ్ లైట్ దగ్గర ఓవర్టేక్ చేసి కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ఆ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టి, జై ప్రకాష్ సింగ్‌ను తీవ్రంగా గాయపరిచి, కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. టీఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
బదిలీ, ఘన వీడ్కోలు.. అంతలోనే కన్నుమూత
రాయచూరు రూరల్: యాదగిరి నగర పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం (29) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేశారు. వివరాలు... యాదగిరి ఎస్ఐగా పనిచేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాత్రి ఆయనకు అందరూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లి నిద్రించిన ఆయన నిద్రలోనే చనిపోయారు. మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ సంగీత ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.ఎమ్మెల్యేకు రూ. 30 లక్షలు ఇచ్చాం: భార్యపరశురాం భార్య శ్వేత మీడియాతో మాట్లాడారు. తన భర్త పరశురాం బదిలీ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల క్రితం రూ. 30 లక్షలు ఇస్తే యాదగిరి పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు ముగిశాక తిరిగి యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నట్లు శ్వేత చెప్పారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఇదిలా ఉంటే ఎస్ఐ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.మరణంపై విచారణ: హోంమంత్రిశివాజీనగర: యాదగిరి ఎస్ఐ పరశురాం మరణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనిఖీ చేపట్టాలని సూచించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎస్ఐ సతీమణి శ్వేతా ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఐ బదిలీ గురించి స్థానిక ఎమ్మెల్యే ఒకరిపై ఆమె ఆరోపించారు. పరశురాం మరణం సహజమైనది. ఆత్మహత్య కాదు. ఎలాంటి డెత్ నోట్లు లభించలేదని అన్నారు. బదిలీ కావడంతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని తోసిపుచ్చబోమన్నారు. కాగా, బీజేపీ– జేడీఎస్ పాదయాత్రకు షరతులను విధించడమైనది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగరాదు. ప్రజలకు ఇబ్బంది కారాదని హోంమంత్రి తెలిపారు. వారు కోర్టుకు వెళ్లేలోపు తామే పాదయాత్రకు అనుమతి ఇచ్చామని తెలిపారు. -
భట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు
భట్టిప్రోలు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. మరోవైపు తమ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపైనా దౌర్జన్యానికి దిగుతున్నారు. పోలీసు అధికారులపై సైతం దౌర్జన్యం చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే మీ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం, దుర్భాషలాడటం ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యకర్త ఏకంగా ఎస్ఐ చొక్కాపట్టుకుని నెట్టివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విన్నవించినా వినకుండా ఎస్ఐపై దౌర్జన్యంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాలు నియోజకవర్గంలో పేకాట, కోడిపందాల నిర్వహణపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై శనివారం బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు భట్టిప్రోలులో సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను వారించి తమకు సహకరించాలని కోరారు. అయినా సాయిబాబా పట్టించుకోకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డకున్నారు. దీంతో సాయిబాబా అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సాయిబాబా అనుచరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టారు. అధికార పార్టీ కార్యకర్త కావడంతో ఎస్ఐ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే బయటకు రావడం... అది చూసిన పలువురు రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండాపోయిందని, సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన వ్యక్తంచేశారు. -
గుండెపోటుతో అయోధ్య ఎస్ఐ కన్నుమూత
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ గుండెపోటుతో కన్నుమూశారు. సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది(59) పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద కొందరితో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యారు.వెంటనే అతనిని శ్రీరామ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సురేంద్ర నాథ్ త్రివేది హర్దోయ్ జిల్లా నివాసి. సురేంద్ర నాథ్ 2023, డిసెంబరు 16న అయోధ్య పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1983లో పోలీసు శాఖలో చేరారు. -
మహిళపై కన్ను.. వీఆర్‌కు శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్
సాక్షి, నల్గొండ జిల్లా: శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ మహిళ మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేధింపుల ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే నీతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడు’’ అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
నారక్కపేటలో విషాదం
నల్లబెల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(31) కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. అశ్వరావుపే ట ఎస్సై శ్రీనుపై కొంతకాలంగా సీఐ జితేందర్ రెడ్డితో పాటు సిబ్బంది మానసిక వేధింపులకు పాల్ప డుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పైగా సీఐ జితేందర్ రెడ్డితో పాటు సిబ్బంది వేధింపులు మరింత పెరిగాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను గత నెల 30న మహబుబాబాద్ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సికింద్రా బాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు.. శ్రీను మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా తమ స్వగ్రామం నారక్కపేటకు తరలించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని పోలీసు అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీను అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.ఐదు నెలల క్రితం అశ్వరావుపేటకు బదిలీ ..2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై శ్రీను.. భద్రాది కొత్తగూడెంలో జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం త్రీ టౌన్, బోడు, చుంచుపల్లి, డీసీఆర్బీ భద్రాది కొత్తగూడెం, మణుగూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఐదు నెలల క్రితం అశ్వరావుపేట కు బదిలీ అయ్యాడు. అయితే ఇక్కడి పోలీసుస్టేషన్లో అధికారుల వేధింపులకు బలయ్యాడని కుటుంబ సభ్యులు రోదించారు. కాగా, శ్రీను మృతి వార్త వినగానే అతడి మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది.పలువురి సంతాపంశ్రీను మృతి పట్ల భద్రాది కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు, డీసీపీ రవీందర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, భద్రాది కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్‌తో పాటు ఇతర అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మండల అధ్యక్షులు బానోత్ సారంగపాణి, చిట్యాల తిరుపతి రెడ్డి పరామర్శించారు.భారీగా మోహరించిన పోలీసులు..ఎస్సై శ్రీను ఆత్మహత్య బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు నారక్కపేటలో ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రాజగోపాల్ పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది భారీగా చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే బందోబస్తులో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
అశ్వారావుపేట ఎస్సె శ్రీరాముల శ్రీనివాస్ మృతి
-
ఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి వెనుక కారణాలు ఏంటి?
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వివాదానికి కేంద్రబిందువైంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11.30 గంటల వరకు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థాయిలో ఏం జరిగింది? అసలు దీనికి కారణాలు ఏమిటి? ఉన్నతాధికారుల మౌనం దేనికనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.వేధింపులు, ఫిర్యాదులే కారణమా?పార్లమెంట్ ఎన్నికల బదిలీల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేటకు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఎస్ఐ అదృశ్యం, ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బంది వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులే కారణమని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ.. తన సన్నిహితులతో వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కొద్దిరోజులుగా పోలీస్‌స్టేషన్‌లో పని చేసే నలుగురు సిబ్బందికి ఎస్ఐకి మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్ఐపై అవినీతి ఆరోపణలు రాగా, ఇదే అదునుగా సదరు సిబ్బంది కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ఏఎస్ఐ తనను తీవ్రంగా దూషించాడని ఎస్పీకి నేరుగా చెప్పడంతో.. ఉన్నతాధికారులు ఎస్ఐని సున్నితంగా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు సిబ్బంది కలిసి ఒక వర్గంగా మారి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని పాల్వంచ డీఎస్పీకి చెప్పగా.. ఆయన ఎస్ఐపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఒక వర్గంగా మారి ఎస్ఐకి సహకరించడం లేదని, ఏదైనా ఆదేశాలిచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని, స్థానిక సీఐ ఐదు నెలల వ్యవధిలో నాలుగు మెమోలు ఇచ్చారనే ప్రచారం కుడా సాగుతోంది. దీంతోనే ఎస్ఐ శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురై, పురుగులమందు తాగాడని మరో వర్గం సిబ్బంది చెబుతున్నారు.పరిస్థితి విషమంగానే..పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాస్‌ను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం అపస్మారకస్థితి నుంచి బయటకు రాగా, కొద్దిసేపు కుటుంబీకులు, బంధువులతో మాట్లాడినట్లు తెలిసింది. కాగా, ప్రమాదకరమైన గడ్డి మందు కావడంతో మందు ప్రభావం లివర్, కిడ్నీలపై పడిందని, కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ అందిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే కానీ భరోసా చెప్పలేమని వైద్యులు అంటున్నట్లు తెలిసింది. కాగా, ఎస్ఐ శ్రీనివాస్‌ను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బంధువులు, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం
-
అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేటరూరల్/మహబూబాబాద్‌రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమయాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.పురుగుల మందు తాగి.. 108కు ఫోన్అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై.. స్వయంగా 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావుతోపాటు 108 సిబ్బంది చేరుకుని ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్సై పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటలకు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా...’అని ఎస్సై అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ మహిళ ఎస్సై నల్లగొండ సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసింది. ‘నా భర్త విషయంలో నేను ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. మళ్లీ ఫిర్యాదు చేయాలని ఏప్రిల్ 16న స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై క్యాబిన్లో నన్ను రెండు గంటలపాటు ఉంచి అసభ్యకరంగా వ్యవహరించారు. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు.. భర్తకు దూ రంగా ఉంటున్నావు కదా. నీకు పిల్లలు ఎప్పుడు, ఎలా పుట్టారు.. నీకు ఇప్పుడు భర్తతో ఉండాలనే కోరిక కలగడం లేదా? నాతో మంచిగా ఉండు. నీ ఫోన్‌నంబరు నాకు ఇవ్వు. నా పర్సనల్ నంబరు నువ్వు తీసుకో. నేను నీకు అన్నివిధాలా సహకరిస్తాను. నీ ప్రతి అక్కర తీరుస్తాను.. నీకు వంట వచ్చా.. వస్తే నాకు చేపలు వండుకు రా.. మరొక రోజు మేక మాంసం వండుకురా అని వేధించడమే కాకుండా నాతో బలవంతంగా గ్రీన్ టీ పెట్టించుకొని తాగారు. స్టేషన్‌కు ఇలా అప్పుడప్పుడు వచ్చి నేను నడుచుకొమ్మన్నట్లు నడుచుకో. నీకు అన్నివిధాలా మంచిది. ఈ సంభాషణ మన మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పవద్దు.ఒకవేళ చెబితే మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి అక్రమ కేసులు బనాయిస్తా. అంటూనే నీకంటే మీ అమ్మ ఇంకా బాగుంది అని అన్నాడు. నేను భయపడి ఈ విషయాలు రెండు వారాల పాటు ఎవరితో పంచుకోలేదు. మీరే తగిన చర్యలు చేపట్టండి..’. అని ఎస్పీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్కారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. -
మహిళా కానిస్టేబుల్స్ పై SI లైంగిక వేధింపులు..
-
పోలీస్ ఇన్స్పెక్టర్ రాసలీలలు?
హసన్‌పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు. యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్ఐబీ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయితే, మంగళవారం సదరు ఇన్స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.