సీఐని ఏకవచనంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు.
టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ
ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment