nimmala ramanaidu
-
‘నిమ్మల’మైన అబద్ధాలు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టుపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వక్రీకరణలతో అవాస్తవాలు మాట్లాడారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని.. దీనికోసం రూ.4 వేల కోట్లు అవసరమని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 4.50 లక్షల ఎకరాలకు సాగు, 25 లక్షల మందికి తాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులను ఏవీ గత ప్రభుత్వం పూర్తి చేయలేదని, రైతులను గృహనిర్బంధం చేసి బందోబస్తు మధ్య ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. మొదటి సొరంగంలో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును, రెండో సొరంగంలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉందని వీటిని చేయడానికి 9 నెలలు పడుతుందన్నారు. రెండో సొరంగంలో 6.8 కి.మీ. లైనింగ్ చేయాలని.. భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కూడా ఉందని, దానిని తొలగించేందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. 21.8 కి.మీ. ఫీడర్ కెనాల్ పనుల పటిష్ఠతను తేల్చాల్సి ఉందన్నారు. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టుకు భూమి పూజ చేసి.. 2014–19లో పనులకు రూ.1,319 కోట్లు ఖర్చు చేశారని నిమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులకు రూ.647 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. వాస్తవం ఇదీ.. 2014–19 మధ్య వెలిగొండ జంట సొరంగాలను పూర్తి చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కానీ, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ జంట సొరంగాలను 2019–24 మధ్య అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. మొదటి సొరంగం లైనింగ్ పూర్తిగా, రెండో సొరంగంలో 12 కి.మీ. పొడవునా లైనింగ్ పూర్తయింది. రెండు సొరంగాలను 2024, మార్చి 6న సీఎం హోదాలో జగన్ జాతికి అంకితం చేశారు. రెండో సొరంగం లైనింగ్ పూర్తి చేసి.. నల్లమల సాగర్ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తే శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు 2024 జూన్‌లో నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. రెండో సొరంగం లైనింగ్ పూర్తి చేయలేకపోయినా కనీసం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే, 2024 ఆగస్టులోనే నల్లమలసాగర్‌కు శ్రీశైలం నుంచి నీటిని తరలించే అవకాశం ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి నిమ్మల వాస్తవాలను వక్రీకరిస్తుండడంపై వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్‌కళ్యాణ్‌గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్‌కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్‌లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్‌సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ.. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్ఫోన్లకు ఈ ఆడియోను రింగ్టోన్లుగా పెట్టేసుకున్నారు.ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. -
పక్కా.. అది బ్యారేజే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. -
కాపు నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం
-
బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం?
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం. అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి. జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు. దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలి: అంబటి విమర్శలు
సాక్షి, గుంటూరు: ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు.పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఏదైనా దశలవారీగా పూర్తిచేస్తారని తెలిపారుప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పు వైఎస్సార్సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చదవండి: బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు‘చంద్రబాబు తప్పిదాలు చేస్తే వైఎస్జగన్ వచ్చాక వాటిని సరిచేశారు. బాబు తప్పిదాల వల్లే ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. చంద్రబాబు వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టుకు ఆయన ఉరి వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ ప్రాజెక్టును ఆనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. బాబు స్వార్థం వల్ల ప్రాజెక్టు కుంటుపడింది. నేను చెప్పిన ప్రతి అంశం సత్య శోధనకు నిలబడింది. డయాఫ్రం వాల్ నిర్మాణం చంద్రబాబు చేసిన తప్పిదమే. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టును పూర్తిచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వమే లాలూచీ పడింది. ఇంత ఘోరం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీపై ఉంది. రాష్ట్ర ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.పోలవరం సెకండ్ ఫేజ్‌ను నాశనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. డబ్బు కాజేయాలనే దురుద్దేశంతోనే ప్రాజెక్టును మీరు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏం చేశారు? పోలవరం కోసం ఇచ్చిన డబ్బునుడైవర్ట్ చేశారు. ఆ నింద వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని వల్ల జీవనాడికి తీవ్ర అన్యాయం. పోలవరంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికైనా చేసిన తప్పులను చంద్రబాబు సరిచేసుకోవాలి. తెలుగుజాతికి ద్రోహం చేయొద్దు.’ అని అంబటి పేర్కొన్నారు. -
పోలవరంపై ‘సాక్షి’ ప్రశ్న.. మంత్రి నిమ్మల బుకాయింపు!
సాక్షి, విజయవాడ: పోలవరంపై సాక్షి అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర కేబినెట్ నోట్లో ఫేజ్ 1 ప్రస్తావన ఉందా..? అంటూ ప్రశ్నించగా తెల్లమొహం వేశారు. పోలవరం ఎత్తు తగించేందుకు అంగీకరించడంపై ప్రశ్నించగా.. కేంద్ర కేబినెట్ నోట్ చూపించకుండానే వెళ్లిపోయారు. 41.15 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలిపినట్టు ప్రకటించిన మంత్రి నిమ్మల.. ఫేజ్ 2 తర్వాత నిధులు వస్తాయంటూ బుకాయించారు.పోలవరంపై చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది.కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు.ఇదీ చదవండి: పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం! -
మంత్రి నిమ్మల పర్యటనకు టీడీపీ నేతలు దూరం
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పర్యటనలో టీడీపీ నేతల వర్గ విభేదాలు బయటపడ్డాయి. మల్యాలలోని హంద్రీనీవా సృజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు జయసూర్య, కేఈ శ్యాంబాబు పరిశీలించారు.అయితే, మంత్రి రామానాయుడు పర్యటనకు టీడీపీ నాయకులు ఎంపీ బైరెడ్డి శబరి,టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ దూరంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసుమరోవైపు, ‘సాక్షి’పై మంత్రి నిమ్మల అక్కసు వెళ్లగక్కారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చి వంద రోజులే అయ్యిందని, మమ్మల్ని ప్రశ్నించే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేశారో చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.జగన్ తరఫున సాక్షి పత్రికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట వంద రోజుల పాలన పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. ‘సాక్షి’ పేపర్ చదవొద్దని చెప్పారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామన్నారు. మహిళల నుంచి స్పందన నిల్.. రాష్ట్రంలో వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టామని.. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నిమ్మల వివరించగా కార్యక్రమానికి హాజరైన మహిళల్లో ఒక్కరు కూడా హర్షధ్వానాలు తెలుపకపోవడం మంత్రితో పాటు టీడీపీ నాయకులను విస్మయానికి గురిచేసింది.అంతకుముందు మాట్లాడిన జనసేన నేత యు.ప్రేమ్‌కుమార్ మంత్రి గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు స్పందించలేదు. దీంతో ప్రేమ్‌కుమార్.. అమ్మా మీరు చప్పట్లు కొడితే మంత్రిగారిని అభినందించినట్లు అవుతుందని అనగా.. కొద్దిమంది మాత్రమే మొక్కుబడిగా స్పందించారు. -
నిమ్మల పై గోపిరెడ్డి సెటైర్లు
-
నిమ్మల రామానాయుడుపై అంబటి మాస్ ర్యాగింగ్
-
"నీకు, నీకు, నీకు.. భలే కామెడీగా చెప్పారు.." నిమ్మలపై అంబటి సెటైర్లు
-
Palakollu: నిమ్మలకు హ్యాట్రిక్ గండం
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని హ్యాట్రిక్ గండం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపికి లభిస్తున్న జనాదరణ, కూటమిలోని అసమ్మతి సెగలు, వరుసగా మూడోసారి పట్టం కట్టని పాలకొల్లు ప్రజల నాడి ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లోనూ చరిత్రే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్ర పాలకొల్లు శాసనసభ నియోజకవర్గానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1955 నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 1985 అలాగే 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అల్లు వెంకటసత్యనారాయణ గెలుపొందారు. అయితే వరుసగా మూడోసారి పోటీచేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ను ఓడించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందుతూ వచ్చిన రామానాయుడు ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఏ అభ్యరి్థకీ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ప్రజలు పట్టం కట్టడం పాలకొల్లు చరిత్రలో లేదు. ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ప్రచార ఆర్భాటంలో తప్ప అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకోలేకపోయారు. చెప్పుకోదగిన స్థాయిలో ప్రజాసమస్యలను పరిష్కరించలేకపోయారు. అయితే సీఎం జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ లబ్ధిని చేకూర్చడంతో పాటు అభివృద్ధి పనుల్లోనూ పాలకొల్లుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పాలకొల్లు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.1,440 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా 6.84 లక్షల మంది లబి్ధదారులకు రూ.619 కోట్ల లబ్ధి చేకూరింది. మెడి‘కల’ సాకారం పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 150 మంది విద్యార్థులు కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించనున్నారు. వంద పడకల ఆస్పత్రికి నిధుల మంజూరు లేకుండానే గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే నిమ్మల ప్రజలను నమ్మిచేందుకు బోగస్ శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. కాగా సీఎం జగన్ పాలనలో రూ.16.60 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తిచేయడం గమనార్హం. రూ.15 కోట్లతో పాలకొల్లులో తాగునీటి ఫిల్టర్ బెడ్ నిర్మించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రచారాస్త్రంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అసమ్మతి సెగలు ఎమ్మెల్యే నిమ్మల వైఖరిపై కూటమి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతహాగా కిందిస్థాయి కేడర్‌ను ఎదగనివ్వరని ఆయనకు పేరుంది. కూటమిలోని జనసేన, బీజేపీ నేతల విషయంలోను అదే వైఖరిని అవలంబిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామగ్రిని అభ్యర్థి సమకూరుస్తుంటారు. కాగా ప్రచారంలో పాల్గొనే కూటమి నాయకులను ఎవరి పార్టీ జెండాలు వారే తెచ్చుకోవాలని సూచిస్తుండటంతో పాటు ప్రచారం చేసే సమయంలో తనను దాటుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదని ఆయన చెబుతున్నారంట. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారు జెండా ఖర్చులు భరించుకుంటారని, మద్దతు తెలుపుతున్న తమపై ఖర్చులు రుద్దుతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సరిగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న జనసేన పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ బన్నీ వాసు ప్రెస్మీట్లకే తప్ప ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చిన సందర్భంలో బన్నీవాసును వేదికపైకి రాకుండా అడ్డుకోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురై వెళ్లిపోవడంతో మరుసటిరోజు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ అవమానభారంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీ నేతలకు కూడా నిమ్మల వ్యవహారశైలి మింగుడు పడటం లేదు.ప్రజలతో గోపి మమేకం ఓ పక్క ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలతో మమేకమవుతుంటే.. ఓటర్లను ఆకట్టుకునే విన్యాసాలే తప్ప చెప్పుకోవడానికి చేసిందేమీ లేదన్నట్టుగా నిమ్మల ప్రచారం సాగుతోందని సొంతగూటి నేతలే చెప్పుకుంటున్నారు. ఒక పక్క అధికార పక్షం జోరు, మరోపక్క పాల కొల్లు సెంటిమెంట్‌తో చరిత్ర పునరావృతమవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. -
టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం
యలమంచిలి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. కొబ్బరి కాయల్ని నిల్వ ఉంచే కురిడీ కొట్ల సమీపంలో పాదయాత్ర సాగుతుండగా.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చారు. కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజువ్వలు వేయొద్దని వేడుకుంటున్నా టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. గాలిలోకి వదిలిన తారాజువ్వల వల్ల ఆర్యపేటలోని కొడవటి వెంకటేశ్వరరావు (కొండయ్య) అనే వ్యాపారికి చెందిన మూడంతస్తుల కొబ్బరి గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో ఉద్ధృతమై గోడౌన్లో ఉన్న 10 లక్షల కురిడీ కొబ్బరి కాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటితో పాటు గోడౌన్ కూడా దగ్ధమైంది. దగ్ధమైన కొబ్బరి కాయల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, దగ్ధమైన గోడౌన్ విలువ మరో రూ.కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓవరాక్షన్
-
టిడ్కో లబ్ధిదారులను తప్పుదోవ పట్టించడానికి నిమ్మల యత్నాలు
-
భయంతో వణికిపోతున్న టీడీపీ..బయటపడ్డ నిమ్మల రామా నాయుడు చిల్లర వేషాలు..
-
టీడీపీ నిమ్మల రామానాయుడు చిల్లర రాజకీయాలు..
-
‘నిమ్మల’ నాటకాలు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకవైపు పనులు జరగకుండా అడ్డుకోవడం.. మరోవైపు ఆగిపోయాయంటూ యాగీ చేయడం.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరు ఇదీ.. సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డదారుల్లో అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు మండలం దగ్గులూరులో 58.33 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో నూతన మెడికల్ కళాశాలకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. 27 మీటర్ల లోతులో ఆరు బోర్లు తవ్వారు. 1.7 మీటర్ల ఎత్తు వరకూ ఫ్లోర్ కాంక్రీట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న మెగా సంస్థను యలమంచిలి మండలం వేల్పూరులంకలో ఇసుక తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతించింది. ఎమ్మెల్యే నిమ్మల ఈ పనులను అడ్డుకునేందుకు అనుచరులతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీంతో ఐదు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పనులను కొనసాగిస్తున్నారు. పాలకొల్లులో సోమవారం టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నాయకులతో పొలాల్లో సెల్ఫీ దిగిన నిమ్మల రామానాయుడు ఇదే మెడికల్ కాలేజీ.. అసలు పనులే జరగడం లేదని బురద చల్లేందుకు ప్రయతి్నంచారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: దళితుల పేరిట కుట్ర రాజకీయాలు
-
వికటించిన టీడీపీ పచ్చ డ్రామా.. బాబు ప్లాన్ అట్టర్ ప్లాప్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజల సంక్షేమం పట్టకుండా.. దేన్నైనా రాజకీయం చేయడమే అలవాటుగా మార్చుకున్న టీడీపీ నేతలు మరోసారి పచ్చ డ్రామాకు తెరతీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఇరగవరంల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని తడిసిన ధాన్యంతో హడావుడి చేయాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలతో చేపట్టిన ఈ పచ్చ డ్రామాను పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు పర్యటించే తణుకు, ఇరగవరం మండలాల్లో ప్రతి 30 అడుగుల దూరంలో నలుగురు రైతులను టీడీపీ నేతలు ఉంచారు. వారందరికీ తలొక ఐదు కిలోలు తడిసిన ధాన్యాన్ని ఇచ్చారు. చంద్రబాబు వచి్చనప్పుడు ఆ ధాన్యం చూపించి పూర్తిగా నష్టపోయామని కన్నీరు పెట్టుకుని చెప్పాలని వారికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. తడిసిన ధాన్యంపై ఎండుగడ్డి కప్పి.. చంద్రబాబు పర్యటించిన తణుకు, ఇరగవరంల్లో తడిసిన ధాన్యం లేకపోవడంతో పాలకొల్లు, దువ్వ మండలాల్లో సేకరించడానికి టీడీపీ గుర్తుతో ఉన్న ఒక ట్రాక్టర్‌ను ఆ పార్టీ నేతలు నాలుగు గ్రామాల్లో తిప్పారు. అక్కడ కొంత తడిసిన ధాన్యాన్ని పోగు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా దానిపై ఎండుగండి కప్పి తణుకు మీదుగా ఇరగవరానికి ట్రాక్టర్‌ను తరలించారు. చంద్రబాబు శుక్రవారం ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్లు పర్యటించి తణుకు బహిరంగ సభలో ప్రసంగించేలా టూర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త మైగాపుల నాగేశ్వరరావు అలియాస్ నాగయ్యకు చెందిన ట్రాక్టర్లో తడిసిన ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఇరగవరం మండలం నుంచి తణుకులో చంద్రబాబు ప్రవేశించే రోడ్డుపై ముందస్తుగా కుప్పపోసి పెట్టారు. తణుకు పోలీసులు చంద్రబాబు భద్రతలో భాగంగా ఆ రోడ్డును తనిఖీ చేశారు. ఈ క్రమంలో ‘తణుకు రూరల్ మండలంలో తడిసిన ధాన్యం లేదు కదా ఇదంతా ఏంటి’ అని ట్రాక్టర్ యజమానిని పోలీసులు ప్రశి్నంచారు. టీడీపీ నేత రాధాకృష్ణ సూచనల మేరకు దువ్వ, ఇతర ప్రాంతాల నుంచి తడిసిన ధాన్యాన్ని తెచ్చామని ట్రాక్టర్ యజమాని చెప్పాడు. తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన ధాన్యం కాకపోవడంతో పోలీసులు, అక్కడే ఉన్న రైతులు ఇది సరికాదని ట్రాక్టర్ యజమానిని హెచ్చరించారు. దీంతో రోడ్డుపై పోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లోకి టీడీపీ నేతలు లోడ్ చేశారు. ట్రాక్టర్‌కు పరి్మట్, లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు వాహనాన్ని రవాణా శాఖాధికారులకు అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సరికొత్త డ్రామా.. పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నప్పుడు అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులపై దౌర్జన్యం చేస్తారా అంటూ పోలీసులపై చిందులు తొక్కారు. ఇది ఇక్కడి ధాన్యం కాదని, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ కుప్పలు పోయడం సరికాదని పోలీసులు రామానాయుడికి గట్టిగా చెప్పారు. దీంతో నిమ్మల అక్కడ నుంచి జారుకున్నారు. రైతుల నుంచి స్పందన కరువు బాబు యాత్రకు రైతుల నుంచి స్పందన కరువైంది. జనాలను తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నా ఫ్లాప్ షోగానే మిగిలింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు కనిపించలేదు. గోటేరులో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులతో మాట్లాడించారు. వారిలో కూడా ఒక రైతు ‘ఎవరొచ్చినా మాకేం ఉపయోగంలేదు.. అని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం -
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకొల్లులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం సీఐ, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అనుమతిలేని కార్యక్రమాలు నిర్వహించరాదని అడ్డుకున్న సీఐని ఏకవచనంతో సంబోధించడమేగాక మా ఇష్టం వచ్చింది చేసుకుంటామంటూ మాట్లాడారు. రైతుల సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న చెట్టు కొమ్మలను విరగ్గొట్టి రైతుకు ఉరి అనే నినాదంతో రెండు కర్రలను ఏర్పాటు చేసి చెట్టుకు కట్టారు. ప్లకార్డులు, ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు సిద్ధపడ్డారు. దీన్ని పట్టణ సీఐ డి.రాంబాబు అడ్డుకున్నారు. వినతిపత్రం ఇస్తామని అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే నిమ్మల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఐ రాంబాబునుద్దేశించి.. నీకు సంబంధం ఏమిటి? మా ఇష్టం వచ్చింది చేసుకుంటాం. రోడ్డుపై ఏది చేసుకున్నా నీకు అనవసరం. నీ తహసీల్దార్ కార్యాలయంలో చేస్తే నువ్వు ప్రశ్నించు.. అంటూ మాట్లాడారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. సార్ నేను గౌరవంగా మాట్లాడుతున్నాను.. మీరు మర్యాదగా మాట్లాడండి.. అని సూచించారు. దీంతో మీ మంత్రి రైతులను ఉద్దేశించి ఎర్రిపప్ప అన్న మాటలకు మాకు బాధేసింది అంటూ ఎమ్మెల్యే టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఉరితాళ్లను తొలగించారు. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడున్న ఆర్డీవో దాసి రాజుకు వినతిపత్రం అందజేశారు. -
జగన్ పథకాలు భేష్ అన్న టీడీపీ ఎమ్మెల్యే
-
అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకాన్ని టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం చాలా మంచిది అంటూ కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని ప్రశంసించారు. అమ్మ ఒడి పథకం చాలా మంచిది. దీన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకే నగదు జమ అవుతుందన్నార. దీని ద్వారా ఏ స్కూల్ బాగుంటుందో చూసుకుని చదివించుకొనే అవకాశం ఉందన్నారు. -
బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు!
పాలకొల్లు అర్బన్/పోడూరు: ఆర్టీసీ బస్సులో మహిళలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలకొల్లు నుంచి పెనుగొండ వరకు ఆదివారం అమరావతి పాదయాత్ర సాగింది. ఈ మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు ఎక్కిన ‘నిమ్మల’.. ప్రయాణికులతో మాటామంతీ కలుపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైన బురదజల్లే ప్రయత్నం చేయబోయారు. దీంతో ఆ మహిళలు.. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, ఇంటి స్థలాలు ఇస్తున్నారని వాదించడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని ఒక మహిళ వీడియో తీసింది. దీంతో, రెచ్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు ఆ మహిళ చేతిలోని సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. ఆ దృశ్యాలను తీసేస్తాను తన సెల్‌ఫోన్ తనకు ఇవ్వాలని ఆ మహిళ ప్రాథేయపడుతున్నా ఎమ్మెల్యే వినకుండా సెల్‌ఫోన్‌ను పక్కనే ఉన్న మరో టీడీపీ నేతకు ఇవ్వడం.. ఆ మహిళ ఎమ్మెల్యే మెడలోని పచ్చకండువాను, చొక్కాను లాగడం.. ఎమ్మెల్యే కేకలు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆయన మహిళల ముందు అభాసుపాలయ్యారని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పితాని, నిమ్మలకు ఝలక్.. మరోవైపు.. ఇదే జిల్లా పోడూరు మండలం కవిటం లాకుల వద్ద కూడా బస్సు ప్రయాణికుల నుంచి పాదయాత్రలోని మాజీమంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్ తగిలింది. పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు బలప్రదర్శనకు దిగడం.. ట్రాఫిక్ స్తంభించడంతో ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు వారిపై మండిపడ్డాడు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఆ ప్రభుత్వం చేసిన మోసం చాలదా? ఇప్పుడు రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కంగుతిన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతామని ప్రయాణికులు తెగేసి చెప్పారు. -
మహిళపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం
-
సైకిల్ యాత్రలో అపశృతి.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుండుకొలను సమీపంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే నిమ్మల సైకిల్‌పై నుంచి జారిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయనను పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నిమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. చదవండి: (జేసీ అనుచరుల ఆగడాలు.. ప్రభాకర్‌రెడ్డి అన్న చెప్పాడంటూ) -
ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రలో అపశ్రుతి
-
తెలుగు యువత దళిత నేతను కొట్టిన ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడిపై దాడి చేశారు. సోమవారం ఉదయం సత్యాగ్రహ దీక్షలో భాగంగా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా దీక్షకు రంగం సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని పట్టణ సీఐ అఖిల్ కోరారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే వెనుక ఉన్న నాయకులను పక్కకు ఉండాలని సీఐ హెచ్చరించారు. ఈ సమయంలో తీవ్ర అసహనానికి గురైన రామానాయుడు తన వెనుక ఉన్న తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు కె.నరేష్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై చేయిచేసుకున్నారు. పార్టీకే చెందిన తెలుగుయువత నేతపై ఎమ్మెల్యే దాడిచేయడం అక్కడున్న వారందరినీ భయభ్రాంతుల్ని చేసింది. ఊహించని ఘటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా వెళ్లిపోయారు. పబ్లిసిటీకి తానే ముందుండాలనుకునే రామానాయుడు ఎవరు ముందున్నా ఒప్పుకోరు. కానీ తన వెనుక నిలబడిన యువ దళిత నాయకుడిని ఇష్టానుసారం కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పబ్లిసిటీ యావ పరాకాష్టకు చేరుకుందని, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అచ్చెన్న, నిమ్మల.. సభను తప్పుదోవ పట్టించారు
-
నిరసన పేరుతో టీడీపీ హైడ్రామా
ఆకివీడు: నిరసన దీక్ష పేరుతో టీడీపీ నేతలు ఆడిన డ్రామా ప్రజలు, మీడియా సాక్షిగా బట్టబయలైంది. వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో రహదారులకు గుంతలు పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా గుంతల్లో పడిపోయి గాయపడ్డారంటూ కట్లు కట్టుకున్న వారిని ఎమ్మెల్యేలు మీడియాకు చూపించారు. యువకుల తలలు, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం ఆయా గుంతల వద్ద వరి నాట్లు వేస్తూ, చేప పిల్లల్ని వదిలి నిరసన వ్యక్తం చేశారు. నిరసన దీక్ష పూర్తయ్యాక గాయపడ్డారని చెబుతున్న యువకులు పక్కకు వెళ్లి కట్లను ఊడదీసుకుని నిరసన ప్రాంతానికి వచ్చారు. గాయాలైన యువకులు సాధారణ వ్యక్తులుగా ప్రత్యక్షమవ్వడంతో అక్కడే ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారు. టీడీపీ నేతల హైడ్రామా సినీ ఫక్కీలో ఉందని ముక్కున వేలేసుకున్నారు. దీక్ష అనంతరం కట్లు ఊడదీసి ఇలా రోడ్డెక్కిన దృశ్యం -
ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా
సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్: ‘ పోలీసులకు బుర్ర లేదు. ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. అన్నీ నోట్ చేసుకుంటున్నాం. రిటైర్డ్ అయినా కూడా ఎవరినీ వదలం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో గురువారం అలిపిరి వద్ద టీడీపీ నేతలు రచ్చ చేశారు. పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకోవాలని కోరినా పట్టించుకోకపోవడంతో.. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లె, చంద్రగిరి పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు టౌన్‌క్లబ్ సర్కిల్ వద్ద బహిరంగసభ నిర్వహించడానికి బయల్దేరుతున్న అచ్చెన్నాయుడును తిరుచానూరు సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి: అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు) అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించి తీరుతామన్నారు. సంతబొమ్మాళిలో ఏం జరిగిందో చర్చించేందుకు రావాలని వైఎస్సార్సీపీకి సవాల్ విసిరారు. ఆలయంలో నంది విగ్రహం ఖాళీగా ఉంటే.. తీసుకొచ్చి దిమ్మెపై పెట్టారన్నారు. దీనికే ఆలయంలో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ కూడా యాత్ర చేస్తుంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. తమది స్వచ్ఛమైన యాత్ర అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. కాగా, టీటీడీ నిబంధనలను పట్టించుకోకుండా.. అలిపిరి వద్ద పసుపు జెండాలు కట్టి టీడీపీ నేతలు రాజకీయ ప్రచారం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం) ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా తిరుచానూరు సమీపంలోని హోటల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ దీపిక పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కాలును తొక్కడమే కాకుండా.. ‘ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా..’ అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళా ఎస్ఐ దీపిక కన్నీరుపెట్టుకున్నారు. మాదంతా ఖాకీ కులం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని, తమకు కులమతాలు ఉండవని, తమదంతా ఖాకీ కులమని డీఐజీ, ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్ పాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం డీజీపీ డి.గౌతమ్‌సవాంగ్ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబుతో కలిసి పాలరాజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను దిగజార్చేలా రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఆపదలో ఆలయాలు అంటూ రాజకీయ నేతలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. వాస్తవంగా 2015 నుంచి 2021 వరకు నమోదైన కేసులను గమనిస్తే 2020–21లో ఆలయ ఘటనలు పెరగలేదన్నారు. ఈ ఏడాది 44 కేసుల్లో 29 కేసులు నిగ్గు తేల్చి దోషులను అరెస్టుచేసినట్లు ఆయన చెప్పారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేపథ్యం కలిగిన వారున్నారన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ఉల్లఘించినందుకే టీడీపీ తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిని రద్దుచేసినట్లు శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు చెప్పారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు సంక్షేమ బిల్లులపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో పెన్షన్లపై అసత్యాలు ప్రస్తావించడంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెన్షన్ల పంపిణీపై టీడీపీ సభ్యులు చేసిన అసత్యాలను కొట్టిపారేశారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై చర్చను తాను సిద్ధమన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని, ప్రతి ఒక్కరి నోటిలో నుంచి వచ్చేది రూ.1000 అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రూ.2250 పెన్షన్ అందిస్తున్నామని సభలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్ ఇస్తూ, ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం పెన్షన్ రూ.2 వేలు చేశారని విమర్శించారు. (చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్!) ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు, (అక్టోబరు 2018) వరకు రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లు 44 లక్షలు మాత్రమేననీ, తమ ప్రభుత్వంలో 61.94 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఓ పద్ధతి ప్రకారం అబద్ధాలు చెబుతూ.. మోసాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామన్నది మేనిఫెస్టోలో రాశామని, ఆ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తాం అని కూడా చెప్పామన్నారు. (సభలో కుట్ర.. సీఎం జగన్ ఆగ్రహం) సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్ మండిపడ్డారు. ఆయన రామానాయుడు కాదు. డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్ తెలిపారు. -
ఎమ్మెల్యే రామానాయుడికి ఆనందప్రకాష్ కౌంటర్
పాలకొల్లు అర్బన్: సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వక్రీకరిస్తూ మేనిఫెస్టోలో లేని అంశాలు ప్రస్తావించి డ్వాక్రా మహిళలను తప్పుదారి పట్టించబోయిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనంద ప్రకాష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా పాలకొల్లు రూరల్ పంచాయతీ సబ్బేవారిపేట గ్రామ సంఘంలో సోమవారం సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ అమ్మ ఒడి పథకాన్ని వక్రీకరిస్తూ తల్లికి ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నా కేవలం ఒకరికే పథకం అమలు చేస్తున్నారని అన్నారు. ఇంతలో ఆనంద ప్రకాష్ జోక్యం చేసుకుని అమ్మఒడి పథకంలో బిడ్డల సంరక్షణ కోసం తల్లి ఖాతాలో రూ.15వేలు జమ చేస్తున్నారని, అంతేకాని ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తానని చెప్పలేదంటూ మేనిఫెస్టోని చదివి వినిపించారు. (అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు) సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిందే చేస్తారని, చంద్రబాబునాయుడిలా సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేయరన్నారు. మద్యపానం విషయంలోనూ డ్వాక్రా మహిళలను తప్పుదారి పట్టించబోయిన ఎమ్మెల్యేకి గట్టిగా బదులిచ్చారు. టీడీపీ హయాంలో 40 వేల బెల్ట్షాపులుండేవని, వాటిని రద్దు చేసి ప్రభుత్వమే మద్యం విక్రయించే పాలసీ తీసుకుందని సమాధానం ఇచ్చారు. అనంతరం సీఎం జగన్‌కి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలని డ్వాక్రా మహిళలు కోరినా ఎమ్మెల్యే నిమ్మల జారుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నక్కా ఇర్మియారాజు, సబ్బే శ్రీను, పుల్లూరి నరేష్, ఏపీఎం పి.సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి) -
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ప.గో(యలమంచిలి): ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్ పాడైపోవడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. యలమంచిలి మండలం బాడవ వరద ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి వైపు చెట్టుకు లంగర్ వేసి పడవను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అదుపు చేసింది. ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు వెళ్లేటప్పుడు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కాపాడగలిగామన్నారు. -
బీఏసీ సాక్షిగా బయటపడ్డ టీడీపీ డ్రామాలు
సాక్షి, అమరావతి : బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి : లైవ్ అప్డేట్స్: ఏపీ వ్యవసాయ బడ్జెట్) ‘మేం చేసిన కార్యాక్రమాలను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా 42 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాం. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. బయట పరిస్థితులు అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే మాకు అభ్యంతరం లేదు. ఎన్ని రోజులు నడపాలో అడగండి.. నిర్వహిస్తాం. కాకపోతే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదు. దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోయారు. (చదవండి : ఏపీ బడ్జెట్ హైలైట్స్) -
నిమ్మల, అనురాధలకు లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు తమ కంపెనీకి దురుద్దేశాలు అంటగడుతూ చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రముఖ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్ డిమాండ్ చేసింది. తమపై చేసిన నిందారోపణలు దురుద్దేశపూరితమని, ఇవి తమ కంపెనీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నందున క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధలకు లీగల్ నోటీసులు పంపింది. (చదవండి: మిమ్మల్ని ఫినిష్ చేసే రోజు వస్తుంది) -
‘ఎమ్మెల్యే రామానాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో యలమంచిలి మండలంలోని ఇసుక ర్యాంపులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పోత్తూరి బుచ్చిరాజు, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెం ఆనంద ప్రకేష్‌లు సోమవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక ర్యాంపులపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుకపై పర్సంటేజీలు తీసుకుని 100ల కోట్లు దోచుకున్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇసుక కొరత ఏర్పడిన విషయం వాస్తవమని అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఇసుక నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్లైన్లో ఇసుక పాలసీని ప్రారంభించామని ఆయన తెలిపారు. -
‘పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు’
సాక్షి, పాలకొల్లు: జల దీక్షలంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యదరి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ మండిపడ్డారు. దీక్ష పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అసత్యాలు ప్రచారం చేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ముంపు బాధితులకు అండగా ఉంటాం: వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయితీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ అన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే నిమ్మల అనుచరులు తినేయడంతో.. మళ్లి వండించి బాధితులకు పెట్టామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. -
ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి,నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుపై స్పీకర్ సస్పెషన్ వేటు వేశారు. ఈ సెషన్ ముగిసే వరకు సభకు రావొద్దని ఆ ముగ్గురిని స్పీకర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తూ వస్తున్నారు. స్పీకర్ సూచనలు పట్టించుకోకుండా పోడియం వద్దకు దూసుకొచ్చారు. స్పీకర్ మైకును లాగేందుకు యత్నించారు. దీంతో ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎన్నికల హామీపై స్పష్టతకు టీడీపీ సభ్యుడు రామానాయుడు డిమాండ్ చేశారు. అయితే అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శింస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. స్పీకర్ ఆదేశాలను పాటించకుండా పోడియం వైపు దూసుకొచ్చారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఈ సమావేశాలు ముగిసేవరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ దీనిని ఆమోదించారు. అయినప్పటీ ఆ ముగ్గురు సభ్యులు సభలోనే ఉంటూ నినాదాలు చేయడంతో మార్షల్స్ వచ్చి వారిని తీసుకెళ్లారు. -
ప్రచారానికి రాకపోతే పసుపు కుంకుమ రానివ్వం
సాక్షి, యలమంచిలి: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆయన సతీమణి సూర్యకుమారి చేస్తున్న ఎన్నికల ప్రచారం డ్వాక్రా మహిళలకు కొత్త చిక్కులు తెచ్చింది. ఎమ్మెల్యే నిమ్మల ఆదేశాలతో స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారానికి రాకపోతే మీకు వచ్చే పసుపు కుంకుమ సొమ్ములు, డ్వాక్రా రుణాలు, రాయితీలు, కుట్టుమిషన్లు రానివ్వబోమని డ్వాక్రా లీడర్లను, అంగన్వాడీ టీచర్లను, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లను భయపెడుతున్నారు. ప్రచారానికి మీరు రావడమే కాదు డ్వాక్రా సంఘాల్లోని మహిళలను కూడా తీసుకురావాలని లీడర్లను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం లీడర్ల బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడుతున్న డ్వాక్రా లీడర్లు మహిళల వద్దకు వెళ్లి నయానో భయానో వారిని ఎన్నికల ప్రచారానికి తరలిస్తున్నారు. ఎండలు మండిపోతుండుటతో మహిళలు ప్రచారంలో తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రచారానికి వెళ్లకపోతే పసుపు కుంకుమ సొమ్ములు పడవని తమ డాక్రా లీడర్ భయపెడుతోందని మహిళలు వాపోతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున డ్వాక్రా సీఎలు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన పథకం వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదు. అధికార పార్టీ నాయకులకు ఇవేమీ పట్టడం లేదు. ఎన్నికల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. -
దాసరి విగ్రహావిష్కరణలో వివాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎంపీల పేర్లు లేకుండా అన్నీ తానై నడిపించినట్టుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించడంతో మాజీ మంత్రి హరిరామజోగయ్య తదితరులు మనస్తాపం చెందారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పోస్టర్లా ఉందంటూ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన అందరివాడు.. మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడుతూ.. ‘దర్శకరత్న దాసరి అందరివాడు. ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారు. పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించాం. స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరాం. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్లా ఉంది. అందరికి సంబంధించినదిలా కనపడడం లేదు. వాళ్ల తాలూకు మంత్రులు, ఎంపీలు, కాబోయే ఎంపీల పేర్లున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. -
ఎమ్మెల్యే నిమ్మలపై సీఎంకు ఫిర్యాదు
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చే స్తానని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌రావు ప్రకటించడం టీడీపీ, బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పూలపల్లి బైపాస్ రోడ్డులో జరిగిన గౌడ, శెట్టిబలిజ కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంగర హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 ఏళ్లుగా టీడీపీలో పలు పదవులను చేపట్టానని, అయితే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తాను ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తొలగించేలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఫ్లెక్సీ పెట్టే అర్హత లేనప్పుడు తాను పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటేనని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. టీడీపీకి తానెప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని స్పష్టం చేశారు. వనసమారాధనకు శాసనమండలి ఇన్చార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. బీసీలను అణగదొక్కితే ఊరుకోం ఏ పార్టీ అయినా, నాయకులైనా బీసీ నాయకులను అవమానిస్తే సహించేది లేదని గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు వేండ్ర వెంకటస్వామి హెచ్చరించారు. బీసీల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని నాయకులు గుర్తించుకోవాలని హితవు పలికారు. -
టీడీపీలో అంతర్గత పోరు
తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ సీటు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు విభేదాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కాళ్ల జెడ్పీటీసీ పార్టీకి రాజీనామా చేశారు. నెల క్రితం పెరవలి జెడ్పీటీసీ కూడా పార్టీని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్ మధ్య వివాదం నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలోని ఆగర్రులో శనివారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ అంగరతోపాటు జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అన్న క్యాంటిన్ వద్ద జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే రామానాయుడు చేస్తున్న అవినీతి అక్రమాలపై అంగర రామమోహన్ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వలేదని వారిపై కేసులు నమోదు చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించిన వైనంపై కూడా ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ ఏ కాంట్రాక్టర్ వద్ద ఎంతెంత వసూలు చేశారన్న విషయాన్ని కూడా అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పెట్టినట్లు సమాచారం. కాళ్ల జెడ్పీటీసీ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారతారనే అనుమానంతో పాత కేసులు బయటకు తీసి జెడ్పీటీసీ భర్తను నల్లజర్ల పోలీసులు అరెస్టు చేయడం, జెడ్పీటీసీ అక్కడ ధర్నా చేయడం తెలిసిందే. తన భర్త అక్రమ అరెస్టు వెనుక జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు ఉన్నారని ఆరోపిస్తు కాళ్ల జెడ్పీటీసీ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్ పర్యటన సమయంలో పెరవలి జెడ్పీటీసీ తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. నియోజకవర్గాల్లో కూడా గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలనే విషయంపై దృష్టి పెట్టి పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వాల నమోదును కూడా పక్కన పెట్టేశారు. జిల్లాలో ఎనిమిది లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 2లక్షలు మాత్రమే అయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతుంది. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, భీమవరం ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు. చింతలపూడి ఏఎంసీ వ్యవహారంలో తమను పక్కన పెట్టి ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడంపై ఎమ్మెల్యే పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాలపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి చింతమనేని దూరంగా ఉన్నట్లు తెలిసింది. అక్రమార్కులకు అండగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి చోటా ఎమ్మెల్యేలు, వారి అనుచరులే ఈ ఇసుక దందాలో ప్రత్యక్షంగా ఉంటున్నారు. వీటిపై అడపాదడపా విజిలెన్స్ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు మళ్లీ వెనక్కి ఇచ్చేయాలని సమన్వయ కమిటీలో నిర్ణయించారు. పోలీసులు సీజ్ చేసిన ట్రాక్టర్లన్నీ అధికార పక్షానికి చెందిన వారివే కావడంతో ట్రాక్టర్లు యజమానుల్లో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ వారు ఉన్నారన్న సాకు చూపించి వాటిని యజమానులకు అప్పగించడానికి తీర్మానించారు. -
‘సాక్షి’పై నిమ్మల అక్కసు
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి ,ఏలూరు: నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా? సాక్షి పత్రిక, సాక్షి చానల్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే వాటిపై చర్యలు తీసుకుంటానంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బెదిరింపులకు దిగారు. తాను ఎక్కడా కాంట్రాక్టర్‌ను డబ్బులు ఇవ్వమని బెదిరించలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఏలూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ అనుకూల మీడియాను మాత్రమే పిలిచారు. మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి విలేకరుల సమావేశం ఉందంటూ సాక్షి పత్రిక, చానల్‌కు ఫోన్లు చేశారు. అయితే కొద్దిసేపటికే పార్టీ కార్యాలయ కార్యదర్శి ‘సాక్షి’కి మాత్రమే ఫోన్ చేసి విలేకరుల సమావేశం రద్దు అయ్యిందని చెప్పారు. కానీ యథాతథంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సాక్షి విలేకరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ‘సాక్షి’కి తప్పుడు సమాచారం ఇచ్చారు. పొంతన లేని మాటలు : ఈ సమావేశంలో కూడాఎమ్మెల్యే చెప్పిన విషయాలకు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. దమ్మయ్యపత్తి డ్రెయిన్ పనులు ఆగిపోవడం వల్ల గోతులు పడి ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు పిలిస్తే కాంట్రాక్టర్, డీఈ వెళ్లారని ఎమ్మెల్యే చెబుతున్నారు. అసలు అభివృద్ధి పనులపై పోలీసులు పంచాయితీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఫిర్యాదు వస్తే అసలు కాంట్రాక్టర్‌ను కాకుండా సబ్‌కాంట్రాక్టర్‌ను ఎందుకు పిలవాల్సి వచ్చింది? పనులు పూర్తి చేయాలని నోటీసులు ఇచ్చామని, పనులు పూర్తి కాకపోతే వేరే కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తామని ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు వివరణ ఇచ్చాక కూడా సబ్‌కాంట్రాక్టర్‌ను కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లనీయకుండా స్టేషన్లో నిర్బంధించాల్సిన అవసరం పాలకొల్లు సీఐకి ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే నుంచి ఆదేశాలు వచ్చే వరకూ నిన్ను పంపడం కుదరదని సీఐ చెప్పడం వెనుక ఎవరున్నారు? మాట్లాడటానికి పిలిచిన వ్యక్తిని రాత్రి 12 గంటల వరకూ ఎందుకు ఉంచాల్సి వచ్చింది? విషయం తెలుసుకుని వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు గట్టిగా నిలదీసిన తర్వాతే ఎందుకు పంపారు? ఫిర్యాదు నిజమైతే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? అసలు కాంట్రాక్టు గడువు పూర్తి కాకుండా ఎలా చర్యలు తీసుకుంటారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయాలపై ప్రశ్నించినందుకే కాంట్రాక్టర్ వైఎస్సార్ సీపీ రిమోట్ కంట్రోల్లో ఉన్నారంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై ‘సాక్షి’ స్పందించడం తప్పెలా అవుతుందో ఎమ్మెల్యేనే చెప్పాలి. ఈ ప్రశ్నలకు బదులేదీ? ఈ–టెండర్ వేసిన పనులకు కమీషన్లు ఎలా అడుగుతామని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ కాంట్రాక్టు నిబంధనల్లో చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకోవచ్చన్న నిబంధనను ఎందుకు ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు? పనులు ఆలస్యంగా చేస్తున్నారన్న కారణంతో చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఆపాల్సిన అవసరం ఏమిటీ? ఎమ్మెల్యేని కలిస్తేగాని బిల్లులు రావని ఇరిగేషన్ అధికారులు ఎందుకు చెప్పారు? డిసెంబర్లో పెట్టిన బిల్లులు ఇప్పటి వరకూ రాకపోతే కాంట్రాక్టర్ పనులు ఎలా చేస్తాడు? చేసిన పనులకే డబ్బులు ఇవ్వకపోతే మొత్తం పనులు చేశాక డబ్బులు వస్తాయన్న నమ్మకం కాంట్రాక్టర్‌కు ఎలా ఉంటుంది? తనకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఇంకో రూ.86 లక్షల పెట్టుబడి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఎలా సాహసిస్తాడు? తాను అప్పుల పాలు అయ్యానని బిల్లులు చెల్లిస్తే మిగిలిన పనులు చేస్తానని సబ్‌కాంట్రాక్టర్ పృథ్వీ ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, మీ కార్యాలయం చుట్టూ తిరిగినది వాస్తవం కాదా? అర్ధరాత్రి మీరు పృథ్వీ తండ్రికి ఫోన్ చేసి బెదిరించింది నిజం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సాక్షిపై చర్యలు తీసుకుంటానని బెదిరిస్తే ఎలా? రంగంలోకి టీడీపీ నేతలు ఈ వివాదంతో పార్టీ పరువు పోతుం దన్న ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు చేసిన సబ్ కాంట్రాక్టర్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ దమ్మయ్యపత్తికోడు పనుల కాంట్రాక్టర్ మాధవరావును తెలుగుదేశం నాయకులు ఇరిగేషన్ కార్యాలయానికి పిలిపించి మీడియాతో మాట్లాడించారు. అయితే అతను కూడా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు 50 శాతం వరకూ పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు కూడా సకాలంలో చేయిస్తానని ఆయన చెప్పారు. అయితే ఎమ్మెల్యే తనను డబ్బులు ఇమ్మని డిమాండ్ చేయలేదంటూ కాంట్రాక్టర్‌తో చెప్పించే ప్రయత్నం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే తీరుతో కాంట్రాక్టర్లు బెంబేలు
-
పాలకొల్లులో పైసలిస్తేనే పనులు!
కాంట్రాక్టర్లు తనను కలిసేలా అధికారుల ద్వారా ఒత్తిడి తేవడం ఆయన స్టైల్. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డెల్టా ఆధునికీకరణ పనులు జరుగుతున్నా పాలకొల్లులో మాత్రం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి సదరు ఎమ్మెల్యే వైఖరే కారణమనే విమర్శలున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడిగినంత కమీషన్లు చెల్లించలేదనే ఆగ్రహంతో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బిల్లులు మంజూరు కాకుండా అడ్డుకోవడంతోపాటు తనపై తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా వేధిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఆరోపించారు. పాలకొల్లు సీఐ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనను బెదిరించినట్లు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఇదీ జరిగింది.... డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా పాలకొల్లులో మురుగునీటి కాల్వ (దమ్మయ్యపత్తి కోడు) కాంక్రీట్ గోడల నిర్మాణ టెండర్లను పీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ గత నవంబర్‌లో దక్కించుకుంది. సబ్‌కాంట్రాక్టర్ పృథ్వీరాజ్ డిసెంబర్ నెలాఖరు నాటికి 210 మీటర్లకుగాను 95 మీటర్ల పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేసి రూ.60 లక్షల బిల్లు పెట్టారు. అయితే ఎన్ని నెలలు గడిచినా బిల్లులు రాలేదు. ఇరిగేషన్ ఉన్నతాధికారుల సలహా మేరకు ఆయన ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా టెండర్ అంచనా మొత్తంపై కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ, టీడీఎస్ మినహాయించి కాంట్రాక్టు విలువపై ఐదు శాతం కమీషన్ ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. తాను ఇప్పటికే నష్టాల్లో ఉన్నానని బిల్లులు వస్తే తప్ప పనులు చేయలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే వేధింపులు మొదలయ్యాయని, తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. కాంట్రాక్టు ప్రకారం పనులు పూర్తి చేయడానికి ఇంకా పది నెలల గడువు ఉన్నా ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుతో ఫిర్యాదు చేయించి పోలీస్‌స్టేషన్‌కు పిలిచారని తెలిపారు. స్టేషన్‌కి పిలిచి బెదిరింపులు పాలకొల్లు టౌన్ సీఐ కృష్ణకుమార్ ఎమ్మెల్యే రామానాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్‌ను శనివారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే చెప్పేవరకూ వదలొద్దంటూ సిబ్బందిని ఆదేశించారు. 20 రోజుల క్రితం కాలికి ఆపరేషన్ చేయించుకున్న కాంట్రాక్టర్ పృథ్వీరాజ్‌ను కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఈ విషయాన్ని మీడియాతోపాటు పాలకొల్లు మున్సిపాలిటీలో ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వైఎస్సార్ సీపీ నేత గుణ్ణం నాగబాబుతో కలసి స్టేషన్‌కు వచ్చి గట్టిగా నిలదీయడంతో పోలీసులు కాంట్రాక్టర్‌ను పంపించారు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫిర్యాదు చేశానని డీఈ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. న్యాయం కోసం పోరాడతా కమీషన్ ఇవ్వలేదని బిల్లులు అడ్డుకోవడంతోపాటు తనపై ఫిర్యాదు చేసి వేధించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు వ్యతిరేకంగా పోరాడతానని కాంట్రాక్టర్ పృ«థ్వీరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్భలంతో సీఐ కృష్ణకుమార్ తనను వేధించారని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సోమవారం సాయంత్రం ఆయన ఫిర్యాదు చేశారు. అవినీతికి మార్కులు వేస్తున్న చంద్రబాబు ఎవరైనా అభివృద్ధి చేయడంలో మార్కులు వేస్తారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అవినీతికి మార్కులు వేసే దుస్థితికి దిగజారారు. పార్టీ ఎమ్మెల్యే రామానాయుడుకు టీడీపీ మొదటి ర్యాంకు ఇవ్వడంతో కమీషన్లలో 10 శాతం లోకేష్‌కు అందజేస్తున్నారు. కాంట్రాక్టర్లు తనను కలవాలంటూ ఎమ్మెల్యే అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. కమీషన్ ఇవ్వకుంటే కేసులు పెట్టి పోలీసుల ద్వారా రాబట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే రామానాయుడి అవినీతిపై విచారణ జరిపించాలి. – గుణ్ణం నాగబాబు, వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ వివాదానికి కారణమైన పాలకొల్లు దమ్మయ్యపత్తి కోడు డ్రెయిన్ -
‘రామానాయుడు బెదిరించారు’
సాక్షి, పాలకొల్లు: ఇరిగేషన్ పనుల్లో 20 శాతం కమీషన్ ఇవ్వలేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనను బెదిరించి తనపై తప్పుడు కేసు పెట్టించారని కాంట్రాక్టర్ పృథ్విరాజ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రామానాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి ఎమ్మెల్యే రామానాయుడు, సీఐ కృష్ణకుమార్‌పై పృథ్విరాజ్ ఫిర్యాదు చేశారు. కమీషన్ ఇవ్వటంలేదని తన బిల్లులు నిలుపుదల చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చేస్తానని బెదిరించడంతో పాటు తనపై తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఆరు నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తనను పిలిపించి సీఐ కృష్ణకుమార్ తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి తన తండ్రికి కూడా ఫోన్లు చేసి హెచ్చరించారని వాపోయారు. తనను బెరిరించిన ఎమ్మెల్యే రామానాయుడు, తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ కృష్ణకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నరసాపురం డీఎస్పీని కలవాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేస్తానని ఎస్పీ హామీయిచ్చినట్టు పృథ్విరాజ్ తెలిపారు. -
కమీషన్ కోసం టీడీపీ ఎమ్మెల్యే వేదిస్తున్నారు
-
పాలకొల్లులో ఉద్రిక్తత
-
పాలకొల్లులో ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికార జులుం ప్రదర్శించారు. రబీ పంట నీటి కోసం గురువారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతో పాటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అయితే ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలొచ్చాయని శేషుబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిమ్మల రామానాయుడు ఆగ్రహంతో ఊగిపోయి రైతుల తరఫున ధర్నా చేస్తున్న మేకా శేషుబాబును పోలీసుల సాయంతో దౌర్జన్యంగా గెంటివేయించారు. ఈ సంఘటనపై స్పందిస్తూ.. రైతులకు సాగునీరు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని మేకా శేషుబాబు పేర్కొన్నారు. అధికారంతో నిమ్మల రామానాయుడు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ఆయన అహంకారానికి ప్రజలే బుద్ధి చేబుతారని శేషుబాబు అన్నారు.