సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు సంక్షేమ బిల్లులపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో పెన్షన్లపై అసత్యాలు ప్రస్తావించడంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పెన్షన్ల పంపిణీపై టీడీపీ సభ్యులు చేసిన అసత్యాలను కొట్టిపారేశారు. ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై చర్చను తాను సిద్ధమన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని, ప్రతి ఒక్కరి నోటిలో నుంచి వచ్చేది రూ.1000 అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రూ.2250 పెన్షన్ అందిస్తున్నామని సభలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో నాలుగు సంవత్సరాల 10 నెలల పాటు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్ ఇస్తూ, ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం పెన్షన్ రూ.2 వేలు చేశారని విమర్శించారు. (చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్!)
ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు, (అక్టోబరు 2018) వరకు రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లు 44 లక్షలు మాత్రమేననీ, తమ ప్రభుత్వంలో 61.94 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ బిల్లు రూ.500 కోట్లు కూడా లేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వంలో నెలకు 1500 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతలు ఓ పద్ధతి ప్రకారం అబద్ధాలు చెబుతూ.. మోసాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికలకు ముందు ఏం చెప్పామన్నది మేనిఫెస్టోలో రాశామని, ఆ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తాం అని కూడా చెప్పామన్నారు. (సభలో కుట్ర.. సీఎం జగన్ ఆగ్రహం)
సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్ మండిపడ్డారు. ఆయన రామానాయుడు కాదు. డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment