ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మూడవరోజు అప్‌డేట్స్
4:13 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి(మంగళవారం) వాయిదా పడ్డాయి.
4:01 PM
ఏపీ అసెంబ్లీకి ఫోన్ ట్యాపింగ్ హౌస్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అందజేశారు.
3:44 PM
అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని, విద్యా రంగంలో సంస్కరణలతో పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగంలో నాడు-నేడుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నామన్నారు.
2:25PM
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్
గడిచిన మూడేళ్లో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి. బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్‌డ్రగ్స్ పార్క్ సాధించాం. బల్క్‌డ్రగ్ పార్క్ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. గతంలో దివీస్ ఫార్మా వచ్చినపుడు చంద్రబాబుకు పొల్యూషన్ గుర్తురాలేదా?.
2:18PM
సభను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు: సీఎం
2:15PM
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రగడ
సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నం
సభను అడ్డుకోవడం సరికాదు: స్పీకర్ తమ్మినేని
సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు: స్పీకర్
2:00PM
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రగడ
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
12:31PM
డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. నాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు: కోలగట్ల
12:28PM
కోలగట్ల రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్‌గా కూర్చోబెట్టడం సంతోషంగా ఉంది. పదవుల ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం: సీఎం జగన్
12:10PM
నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి కోలగట్ల వీరభద్రస్వామి: పుష్ప శ్రీవాణి
డిప్యూటీ స్నీకర్‌గా ఎన్నికైన కోలగట్లకు అభినందనలు: మంత్రి ధర్మాన
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తరాంధ్రకు చెందిన వారే: మంత్రి ధర్మాన
12:00PM
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
కోలగట్లకు సీఎం జగన్, సభ్యుల అభినందనలు
సభాస్థానం వద్దకు తోడ్కొనివెళ్లిన సీఎం జగన్
స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన స్పీకర్ తమ్మినేని, సీఎం జగన్
11: 28AM
శాసన మండలిలోనూ టీడీపీ సభ్యుల రగడ
సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నం
పెద్దల సభకు టీడీపీ సభ్యులు గౌరవమివ్వాలన్న మంత్రి అంబటి
9:59AM
పోలవరంపై చెప్పిన దానికి జీవో కూడా ఇచ్చాం. ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ. 6.86 లక్షలు ఇస్తే, అధికారంలోకి వచ్చాక రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పాం. దీనిపై జీవో కూడా జారీ చేశాం.. పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 14,110 మంది నిర్వాసితులుకు రూ. 19, 060 కోట్లతో పునరావాసం. మేం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే. మొదట స్పిల్‌వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉంది. చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్ : సీఎం జగన్
9:43AM
పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేశాం. టీడీపీ సభ్యులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారు: అంబటి రాంబాబు
9:10AM
►రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరం.రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం కల్పించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు. పంట నష్టం జరిగితే రైతులకు ఆ సీజన్‌లోనే పరిహారం. ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది: కిలారి రోశయ్య
►రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అద్భుతం. విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకూ రైతులకు అండగా ఉంటుంది. రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి: గొల్ల బాబూరావు
09:05AM
►ఏపీ అసెంబ్లీలో మూడవ రోజు సమావేశాలు ప్రారంభం.. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది. అంతేకాదు.. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చతో పాటు సభలో నేడు 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment