
గుంటూరు, సాక్షి: అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంపై స్పందించారు.
ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం కాబట్టి మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో మాకు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం. అందుకే ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.
‘‘అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొస్తాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ.. ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను’’ అని అన్నారాయన.
