AP Politics
-
‘చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది’
సాక్షి, కడప: రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదంకు సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్‌సభలో టీడీపీ, జనసేనల వైఖరితో ముస్లింలను వంచించారన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్ధతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయి. మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆ రెండు పార్టీలు వాడుకున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన నిజస్వరూపం బయటపడింది. 1995లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు, 2004లో ఓడిపోయిన తర్వాత `నా జీవితంలో చారిత్రాత్మక తప్పిదం చేశానని మైనారిటీలకు క్షమాపణలు చెప్పాడు.ముస్లిం వ్యతిరేక బీజేపీతో భవిష్యత్తులో కలిసేది లేదని బహిరంగ సభలో ప్రకటించారు. కానీ 2014లో అవసరం కొద్దీ అదే ముస్లిం వ్యతిరేక బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చి ఒక్క మైనారిటీకి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదు. రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర చంద్రబాబుది. మళ్లీ 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు మైనారిటీల ఓట్ల కోసం ఎన్ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేసిన మోసగాడు చంద్రబాబు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన చంద్రబాబు, మళ్లీ అధికారం కోసం 2024లో బీజేపీతో జతకట్టాడు.ఇప్పుడు ముస్లింల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతిచ్చి మైనారిటీలకు వెన్నుపోటు పొడిచాడు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుని కలిసినప్పుడు వారికి అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా చూస్తానని నమ్మించాడు. ఆఖరుకి పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఇప్తార్ విందులోనూ మైనారిటీలకు అన్యాయం జరగనివ్వనని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపూరిత హామీ ఇచ్చాడు.తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్టు నేషనల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించుకున్నాడు. తీరా చూస్తే ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారు. టీడీపీ సపోర్టుతో నడిచే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు తలచుకుంటే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశమే ఉండేది కాదు. అయినా చంద్రబాబు ముస్లింల మనోభావాలను కాలరాసేలా తన ఎంపీలతో బిల్లుకు మద్దతు పలికారు.మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేదుఈ బిల్లు మైనార్టీలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. మౌజన్లు, ఇమామ్‌లకు ఇవ్వాల్సిన 6 నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో పెట్టాడు. 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పింఛన్లు ఇస్తానని చెప్పాడు. దుల్హన్ పథకం కింద పెళ్లి కుమార్తెకు రూ.లక్ష సాయం చేస్తానని చెప్పాడు.మైనారిటీలకు రూ.5 లక్షల రుణాలు ఇప్పిస్తానని చెప్పాడు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ. లక్ష ఇస్తామని చెప్పాడు. వీటిలో ఏ ఒక్క హామీని కూడా ఈ పది నెలల్లో చంద్రబాబు అమలు చేసిన పాపాన పోలేదు. 2024లో హజ్ యాత్రకు వెళ్లిన ఏ ఒక్కరికీ రూపాయి కూడా సాయం చేయకపోగా విజయవాడ గన్నవరం ఎంబార్కేషన్ సెంటర్ రద్దు చేసేలా చర్యలు తీసుకున్నాడు. మసీదుల నిర్వహణకు నెలకు రూ. 5 వేలు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.మైనార్టీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీరాష్ట్రంలో మైనారిటీలకు న్యాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత మహానేత వైఎస్సార్, ఆ తరువాత అదే ఒరవడిని కొనసాగించిన వైఎస్ జగన్ జగన్ మాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలను రాజకీయంగా ప్రోత్సహించింది. నలుగుర్ని ఎమ్మెల్యేలుగా మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత వైఎస్ జగన్‌దే. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిని మైనారిటీలకు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడూ మండలిలో నలుగురు మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు.జకియా ఖానంను శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. అనేకమందికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా గత ఐదేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. జగన్ హయాంలో మైనారిటీలకు జరిగినంత రాజకీయ లబ్ధి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలి. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లింల గొంతు కోసిన టీడీపీలో కొనసాగితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముస్లిం సమాజం వెలివేస్తుందన్ని హెచ్చరిస్తున్నా.. -
కొత్త నాటకానికి తెరతీసిన బాబు అండ్ కో!
వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది మరింత బాగా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఖాయం చేసిన డైలాగు ‘2029 నాటికి జీరో పావర్టీ’ అంటే మరో నాలుగేళ్లలో ఏపీలో పేదరికం ఉండదన్న మాట. ఇందుకోసం ఆయన పీ-4 అనే విధానాన్ని తెస్తారట. దీని ప్రకారం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది ధనికులు పేదలను దత్తత తీసుకుని పైకి తీసుకురావాలట. అది సాధ్యమా? కాదా? ఇందుకు ఎన్ని వేల కోట్లు లేదా లక్షల కోట్లు వ్యయం చేయాలి? అన్నది పక్కనబెడితే, ఇదేదో కొత్త ఆలోచన అనుకున్న వారికి దీంతో బుర్ర తిరిగి పోవాల్సిందే.ఇలాంటి దత్తత కార్యక్రమాలు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టు దానధర్మాలు చేస్తుంటారు. మరి కొందరు తమకు తెలిసిన పేదల కుటుంబాలలోని పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తుంటారు. మరికొందరు అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు. దీనికి పీ-4 అని పేరు తగిలించి, వీటన్నింటినీ తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకోసం రాత్రిళ్లు నిద్ర కూడా పోకుండా ఆలోచించానని చంద్రబాబు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? ఆయనకు నిద్రలేమి సమస్య ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది.పీ-4 కార్యక్రమం కింద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనికులు, వ్యాపారవేత్తలు, అంతా ముందుకు వచ్చి తమ ఆస్తిలో పేదలకు వాటా ఇస్తారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా చేసి మార్గదర్శులు అవుతారు అనుకున్న వారూ లేకపోలేదు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఆస్తి సుమారు రూ.900 కోట్లు అని ఏడీఆర్ ప్రకటించింది. దాంట్లో కొంత ఉంచుకుని మిగిలింది పేద కుటుంబాలకు ఇచ్చి వారిని కోటీశ్వరులను చేస్తారని అనుకుంటే ఆ ఊసే ఎత్తలేదని వైఎస్సార్సీపీ నేతలు ఎత్తి పొడుస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొంతకాలం క్రితం బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ తమ హెరిటేజ్ సంస్థ వాటాల్లో రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. అందులో ఏమైనా పేదలకు వాటాలిచ్చి స్థితిమంతులుగా చేస్తారేమో అని కొందరు విశ్లేషకులు ఊహించారు. అవేమీ జరగలేదు.టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సరిపెట్టారు. అది కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకే కదా!. ఎంతమంది పేదలను ఆ ట్రస్టు ద్వారా కోటీశ్వరులను చేశామని చెప్పగలిగి ఉంటే దానికి ఒక అర్థం ఉండేది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ పీ-4 కార్యక్రమం చంద్రబాబు చేస్తున్న మరో మోసం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య ఎనిమిది లక్షలుగా ఉందని, 90 శాతం మంది వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, ఇవేవి తెలియకుండా చంద్రబాబు ప్రజలను తన సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్న మెఘా సంస్థ అధినేత పీవీ.కృష్ణారెడ్డి పీ-4 సభా వేదికపై ఉన్నారు. ఆయన తన సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచుతారేమోనని మరికొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఒక విద్యార్ధికి వైద్య విద్య అభ్యసించడానికి సాయం చేస్తారట. ఆయన సొంత మండలం గుడ్లవల్లేరును దత్తత తీసుకుంటారట. అక్కడ ఏ కార్యక్రమాలు చేపడతారో తెలియదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాలను లాక్కున్నారని ఒక అబద్దం చెబుతూ, తమ ప్రభుత్వంలో ప్రజలకు వాటాలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిజంగా స్వచ్చందంగా వేదిక మీద ఉన్న చంద్రబాబు, పవన్‌లతో సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా తమ ఆస్తులలో పేదలకు వాటాలు కల్పిస్తామని ప్రకటించి ఉంటే ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు వచ్చేదేమో!. కానీ, వారెవరూ ఆ పని చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ పేదలకు వాటాలు ఇస్తున్నామని సినిమా డైలాగులు చెప్పారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి అమెరికా ప్రముఖులు తమ ఆదాయంలో కొంత వాటాను విరాళాలుగా ఇచ్చేస్తుంటారు. మరో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ అయిన చలమలశెట్టి సునీల్ కూడా ఇలాగే మరో విద్యార్ధిని దత్తత తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికలలో ఈయన వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు.వైఎస్ జగన్ పాలన సమయంలో గ్రీన్ కో కంపెనీకి భూమి కేటాయించి, విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే, తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు ఎన్ని వ్యతిరేక వార్తలు రాసిందో తెలిసిందే. వైఎస్సార్సీపీ వారికి ఏమీ చేయవద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సునీల్ సేవలను తీసుకోవడం విశేషం. ఒక విద్యార్ధిని మెడికల్ సీట్ ను ఆశిస్తోంది. ఆమెకు ప్రభుత్వ కాలేజీలో సీటు వస్తే దాతతో పెద్దగా పని ఉండదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన 750 సీట్లను వదలుకుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ రంగంలో వైద్య కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే, కూటమి సర్కార్ వాటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోంది. ఇది కూడా పీ-4లో భాగమేమో తెలియదు. ఒకవేళ ప్రైవేటు కాలేజీలో చదివించాల్సి వస్తే ఆ విద్యార్ధినికి దాత రెండో, మూడో కోట్ల రూపాయల డొనేషన్ కట్టడానికి సిద్దపడతారా? అన్నది ఒక డౌటు. చంద్రబాబు నాయుడు ఏ రోజుకారోజు ఏదో ఒక కొత్త డైలాగు తెరపైకి తెస్తుంటారు. తద్వారా అంతకుముందు తాను చెప్పిన డైలాగుల్ని జనం మర్చిపోయేలా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఎటూ ఆయన భాజ భజంత్రీలు వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ పీ-4ను వీరంతా కలిసి ఊదరగొడతారు. ఆ తర్వాత సడెన్‌గా ఏపీలో పేదలు ఎవరూ లేరని ప్రకటించేసినా ఆశ్చర్యం లేదు. లేకుంటే 2029 నాటికి జీరో పావర్టీగా ఉండాలని చంద్రబాబు చెబితే అది అయ్యే పనో, కాదో అందరికీ తెలుసు.నిజానికి చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతి కాదు. ఆయన 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, వేలాది మంది ఉద్యోగులను ఊడపీకడం చేశారు. రైతులు విద్యుత్ భారంతో అల్లాడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానిపై పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైమ్ లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దానిని చంద్రబాబు హేళన చేసి మాట్లాడే వారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని అనేవారు. అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు ఇస్తానని కబుర్లు చెప్పేవారు. కానీ, ఆ సంస్కరణల వల్ల పేద, మద్య తరగతి వారికి ఒరిగిందీ లేదు. చంద్రబాబు వారికి సాయం చేసింది లేదు.2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించి చూపించారు. ఎన్టీ రామారావు పేదలకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటిని మార్చేశారు. అధికారం లేనప్పుడు, ఎన్నికల ప్రచారాలలో మాత్రం పేదలకు అవి చేస్తా, ఇవి చేస్తానని చెబుతూంటారు ఈయన. వీటిని నమ్మి ఓట్లు వేసి మోసపోయిన ఘట్టాలు ఎక్కువే. 2014లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా వందల హామీలు ఇచ్చిన బాబు పవర్ లోకి వచ్చాక అరకొరగా అమలు చేసి రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాలైతే రద్దే చేయలేదు.తాజాగా 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ ప్రచారం హోరెత్తించారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు ఇలా పలు హామీలు ఇచ్చారు. పదవిలోకి వచ్చిన తరువాత మాత్రం బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోందని హామీలకు మంగళం పాడేశారు. అప్పులు చేసి సంక్షేమం చేయలేమని ఒకసారి, తాను ఎన్నికలకు ముందు ఒకరకంగా అనుకున్నానని, ఇప్పుడు పరిస్థితి అలా లేదని ఇంకోసారి చెప్పడం ఆరంభించారు. అంటే చిత్తశుద్ది లేకుండా కేవలం అధికారమే ఏకైక లక్ష్యంగా ఏ అబద్దాన్ని అయినా ఆడవచ్చన్నది ఆయన నమ్ముతున్నారన్నమాట.ఇప్పుడు ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే దానికి ప్రతిగా పీ-4 అమలు చేస్తున్నాం కదా! అని దబాయిస్తారు. ఎవరినైనా ధనికుడిని మీరే వెతుక్కోండి అని పేదలకు చెప్పినా చెప్పవచ్చేమో. పేదల పిల్లలు వెళ్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని ఎవరైనా అన్నారనుకోండి. పీ-4 తెచ్చాం కదా! ప్రైవేటు స్కూళ్లలో చదువుకోండి అని చెబుతారేమో!. గతంలో విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు అని చంద్రబాబు అన్నారు. వలంటీర్లు ఎంత పేదలో అందరికీ తెలుసు. వారి సేవలను కంటిన్యూ చేస్తామని, వేతనం రూ.10వేలు చేస్తామని ఉగాది పర్వదినం రోజున ఊరించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆ వ్యవస్థనే తీసి వేశారు. ఈసారి ఉగాది నాడు కొత్తగా పీ-4 అన్న నాటకంలో మొదటి అంకం ప్రారంభించారు. ఇందులో ఎన్ని ప్రహసనాలు ఉంటాయో చెప్పజాలం.ఉగాది కల్లా మహిళలకు ప్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని రవాణా మంత్రి రామ్ ప్రసాదరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఉగాది వెళ్లిపోయింది. ప్రస్తుతం బస్‌లలో ప్రయాణించే వారిలో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి వారేనన్న సంగతి తెలిసిందే. నిజంగానే వీరికి చెప్పిన హామీలు అమలు చేయాలన్న నిజాయితీ ఉంటే, పేదలకు ఉపకరించే ఈ స్కీములను ఈ ఏడాదంతా ఎగవేసి, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తారా?.మరో సంగతి చెప్పాలి.. చంద్రబాబు 2014 టర్మ్‌లో ఐదేళ్ల పాలన తర్వాత ఏపీలో నిరుపేదల శాతం 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని, అదే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా నిరుపేదల శాతం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని నీతి అయోగ్ నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఉంటుంది చంద్రబాబు పాలన తీరు. వైఎస్ జగన్ తన పాలనలో పేదలకు, ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చితే చంద్రబాబు కూటమి మాత్రం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మిగిలిన దాదాపు అన్నిటికి తిలోదకాలు ఇచ్చేసింది. అమరావతిలో వ్యాపారుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్ యాభై వేల మంది పేదల ఇళ్ల స్థలాలు వెనక్కి లాగేసుకుంటోంది. దీనిని బట్టే పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది.చంద్రబాబు అమరావతికి కూడా ఇలాగే విరాళాలు ఇవ్వండి. ఇటుకలు ఇవ్వండి అంటూ కొంతకాలం తిరిగారు. ఇప్పుడేమో అప్పులు ఇవ్వండని ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. ఏతావాతా పీ-4 కార్యక్రమాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్, సభలో పాల్గొన్న ధనికులను చంద్రబాబు, తిరిగి ఆ బడాబాబులు చంద్రబాబును పొగుడుకోవడానికి మాత్రం బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఉపన్యాసాల సోది భరించలేక జనం మధ్యలోనే తిరుగు ముఖం పట్టారు. దీన్ని అర్థం చేసుకోలేని సీఎం యథా ప్రకారం ఆ పేద, బడుగు వర్గాలను అవమానిస్తూ వారిని తప్పుపట్టారు. దీన్ని బట్టే ఈ పీ-4 ఎంత విజయవంతం అయ్యేది అర్థం చేసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్ అన్నారు. -
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బలవంతపు వాంగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు: పర్వతరెడ్డి
సాక్షి, నెల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు, కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రమ్మనడం అత్యంత హేయమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:నెల్లూరులో ఎప్పుడూ చూడని వికృత రాజకీయం:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని కూటమి ప్రభుత్వం ఈ వికృత రాజకీయాలకు పాల్పడుతోంది.డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, వారి ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే ఓర్చుకోలేక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాకాణి గోవర్దన్‌రెడ్డి కుటుంబం దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాల్లో ఉంటోంది. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.మూడు నెలలుగా ప్రయత్నం:పొదలకూరు మండలంలో క్వార్ట్›్జ మైనింగ్‌లో మాజీ మంత్రి కాకాణిని ఎలాగైనా ఇరికించి జైల్లో నిర్బంధించాలనే కుట్రతో మూడు నెలలుగా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. వారం క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని ఆధారంగా కాకాణిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు బెయిల్ రాకుండా ఉండేందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీనిపై కాకాణి గోవర్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో, ఆయన వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ఉన్న నేపథ్యంలో ఎక్కడ క్వాష్ అవుతుందోననే భయంతో ఆయనపై ఈరోజు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఇంకోపక్క గోవర్ధన్‌రెడ్డి రోజూ పార్టీ ఆఫీసుకే వసున్నా, పరారైపోయారని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఏరోజుకారోజు ఈరోజే అరెస్ట్ చేస్తారని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.దురుద్దేశంతోనే నోటీసుల ప్రహసనం:ఉగాది పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, కావాలనే పండగ రోజు, ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్లారు. నోటీస్ ఇచ్చే నెపంతో తాళాలు పగలగొట్టి, ఇంటి గోడలు దూకే ప్రయత్నం చేశారు. చివరికి ఇంటి గోడలకు నోటీస్ అంటించి, మర్నాడు (సోమవారం) ఉదయం విచారణకు హాజరు కావాలని అందులో నిర్దేశించారు.నిజానికి శనివారం వరకు ఆయన ఇక్కడే ఉన్నా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులకు తీరిక లేదు. కావాలని పండగ రోజు ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే హడావుడి చేసి వెళ్లారు. కాకాణి పారిపోయాడని ప్రచారం చేసుకుంటున్న కూటమి నాయకుల నోళ్లు మూయించడానికి ఆయన హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటున్న ఫొటోలను 7.30 గంటలకు అన్ని మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన పోలీసులతో బుధవారం తనకి వేర్వేరు పనులున్నాయని, గురువారం వస్తానని చెప్పినా వినుకోకుండా 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు.నోటీసులు గురించి కాకాణిగారితో మాట్లాడినప్పుడు బుధవారం సాయంత్రానికి లేదా గురువారం ఉదయం కల్లా నెల్లూరులో అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు. కావాలంటే పోలీసులు గురువారం నెల్లూరు రావొచ్చని చెప్పారు. ఇలా అక్రమ కేసులు బనాయించి వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవాలని చూడటం అవివేకమే అవుతుంది. కాగా, తాము ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
సంపద సృష్టించడం అంటే అబద్ధాలు చెప్పడమేనా బాబూ?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రతినెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక పబ్లిసిటీ ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా అదే పనిగా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు. అప్పులపైనా, మెగా డీఎస్సీపైనా, స్టీల్‌ప్లాంట్‌పైనా చంద్రబాబు చెప్పిన, మాట్లాడిన అబద్ధాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని జూపూడి అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:ఈవెంట్‌కు.. డీబీటీకి పోలికా!సీఎం చంద్రబాబు ఈనెల పెన్షన్ల కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గంలోని ఒక ఇంట్లో ప్రారంభించారు. నెలనెలా ఏదో ఒక ఊరికి వెళ్ళడం.. పెన్షన్లు పంచుతూ సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. ఒక కుటుంబానికి ఇల్లు కట్టిస్తారు. ఒకరికి ఆటో కొనిపెడతారు. వాటిని చూపుతూ రాష్ట్రం అంతా అలాగే ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుంది. తన వల్లే మొత్తం రాష్ట్రంలోనే పేదల జీవితాలు బాగుపడిపోతున్నాయన్నట్లుగా బిల్డప్ ఇస్తారు.ఈ రోజు చంద్రబాబు దాదాపు గంటన్నర ప్రసంగంలో అన్నీ అబద్ధాలు, తనను తాను పొగుడుకోవడమే. జగన్‌గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కన్నా, తాను పంపిణీ చేస్తున్న పెన్షన్లు ఎక్కువంటూ చులకన చేశారు. ‘అయ్యా, చంద్రబాబుగారూ, తన 5 ఏళ్ల పాలనలో జగన్‌గారు బటన్ నొక్కి అంటే, డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాలకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.72 లక్షల కోట్లు. కానీ, ఆయన ఏనాడూ మీ మాదిరిగా ఇలా పబ్లిసిటీ ఈవెంట్స్ నిర్వహించలేదు. ప్రచార ఆర్భాటం అంతకన్నా చేసుకోలేదు. ప్రతి ఇంటికి తెల్లవారుజామునే వెళ్ళి వృద్దులకు పెన్షన్‌ను అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యవస్థనూ నీరుగార్చారు. అయినా మీరు, పెన్షన్ల పంపిణీ ఈవెంట్‌ను, డీబీటీతో ఎలా పోలుస్తున్నారో అర్థం కావడం లేదు’.పండుటాకులపై చంద్రబాబు పగ:ఇప్పుడే కాదు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో వృద్థుల పట్ల ఆయన ఏనాడూ మానవత్వంతో వ్యవహరించలేదు. ఆనాడు చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు నెలకు కేవలం రూ.1000 చొప్పున మాత్రమే పెన్షన్ ఇచ్చారు. అప్పుడు పెన్షన్ల కోసం నెలకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు మాత్రమే. ఆ 5 ఏళ్లలో, టీడీపీ పాలనలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం రూ.27,687 కోట్లు మాత్రమే. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్సార్ సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచాం. అందుకోసం నెలకు సగటున దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇవన్నీ వాస్తవాలు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెన్షనర్ల కోసం ఏదో చేస్తున్నాను అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు.ఇప్పటికే 3 లక్షల పెన్షన్ల తొలగింపు:వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో ఇచ్చిన మొత్తం పెన్షన్లు 66,34,742. కూటమి ప్రభుత్వం ఈ నెల పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు. అంటే మూడు లక్షల పెన్షన్లను తొలగించారని అర్థమవుతూనే ఉంది. పెన్షన్ల కోసం 2025–26 ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున, ఏడాదికి రూ.32,634 కోట్లు చెల్లించాలి. కానీ బడ్జెట్లో పింఛన్లకు ఈప్రభుత్వం కేటాయించింది రూ.27,518 కోట్లు మాత్రమే. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5 వేల కోట్లు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దివ్యాంగ పింఛన్ల పైన కూడా ప్రభుత్వం కక్ష కట్టింది. ఈ తొమ్మిది నెలల్లోనే 15 వేల పెన్షన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. జీవిత చరమాంకంలో ఉన్న పండుటాకులపై చంద్రబాబుకు ఎందుకు ఇంత పగ ఉందో అర్థం కావడం లేదు.స్టీల్‌ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటి బాబూ?:విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గాడిలోపెట్టానని చంద్రబాబు చెబుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో 40వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 5వేల మంది సీనియర్ ఇంజనీరింగ్ అధికారులను బలవంతంగా బదిలీ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి మాట్లాడుతూ కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనమిక్స్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని సిఫార్సు చేసిందని ప్రకటించారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు దీనిని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఒకవైపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహకరణ అని చెబుతుంటే తాను గాడిలో పెట్టానని ఎలా అబద్దాలు చెప్పగలుగుతున్నారు?మెగా డీఎస్సీ అంటూ మరోసారి పచ్చి మోసం:మెగా డీఎస్సీ పై తొలిసంతకం అంటూ గతంలో నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు మరోసారి కొత్త నాటకం ప్రారంభించారు. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్‌లో ఇచ్చి, మే నెలలో పరీక్ష, జూన్ నెలలో ఫలితాలు విడుదల చేస్తానని ప్రకటించారు. ఏ నమ్మకంతో చంద్రబాబు చెప్పిన మాటలను నిరుద్యోగులు పరిగణలోకి తీసుకోవాలి. తొమ్మిది నెలల కిందట డీఎస్సీపై పెట్టిన తొలి సంతకానికే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇప్పుడు నోటిఫికేషన్ అంటూ చంద్రబాబు చెప్పే మాటలు ఆచరణకు సాధ్యమేనా? నిరుద్యోగులను మోసం చేయడానికే, వారిని ఆశపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు. హామీలు అమలు చేయలేక అప్పులంటున్నారు:ఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు.మరి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్ సిక్స్‌ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు:చంద్రబాబుకు ఒక యువకుడు ఏదో చెప్పుకునేందుకు ముందుకు వస్తే అతడిపై బెదిరింపులకు పాల్పడ్డారు. తాను చెప్పే అబద్దాలను అందరూ వినాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రశ్నించే వారి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులనే విషయాన్ని మరిచిపోకూడదు. కూటమి ప్రభుత్వం చెప్పే అబద్దాలను ప్రజలు స్వీకరించడానికి సిద్దంగా లేరు. పెన్షన్ల పంపిణీలో డిప్యూటీ సీఎం ఎమయ్యారు? నిత్యం చంద్రబాబును పొగిడే పవన్ ఎందుకు కనిపించడం లేదు? చంద్రబాబు అబద్దాలను ప్రశ్నించలేక ముఖం చాటేస్తున్నారా?. అని జూపూడి ప్రభాకర్‌రావు నిలదీశారు. -
లింగమయ్య హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, అనంతపురం: కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు రమేష్, అనుచరులపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం మండలం రేఖల చేనులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయపడిన ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. వినాయకస్వామి ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త లీలా ప్రకాష్ దేవుడు భజన చేస్తుంటే అడ్డుకోవడంతో స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్త భూపతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అడ్డుకున్న భూపతి రెడ్డిని ఇంటి వద్ద నిద్రిస్తుంటే కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రామచంద్రపురం మండలంలో రౌడి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భగా తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వచ్చే వారం తానే స్వయంగా వస్తానని ఆయన చెప్పారు.అంతకు ముందు.. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకే బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు (TDP) పొట్టనపెట్టుకున్నారని వైఎస్ జగన్ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. -
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!
అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు. -
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం -
ఇదేం రాజకీయం?.. ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
అనంతపురం, సాక్షి: రాజకీయ ఆధిపత్యం కోసం కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలకు తెగ బడుతోంది. ఈ క్రమంలోనే.. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య(Kuruba Lingamaiah) దారుణహత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబానికి పరామర్శ కోసం వెళ్లిన టీడీపీ ఎంపీ బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు హత్య చేయించి.. మరోవైపు పరామర్శకు వస్తారా?. టీడీపీ ప్రభుత్వం(TDP Government)లో బీసీలకు రక్షణ లేదా? అంటూ లింగమయ్య కొడుకు మనోహర్ ఎంపీ పార్థసారథి(Bk Parthasarathi)ని నిలదీశారు. దీంతో ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. పరిటాల సునీత నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకెళ్లాడాయన. అంతకు ముందు.. ‘‘టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) సోదరులే మా నాన్నను హత్య చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్నందుకే చంపారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాము రాజకీయంగా ఎదగ కూడదనే హత్య చేశారు’’ అని లింగమయ్య కొడుకులు మనోహర్, శ్రీనివాసులు మీడియా ముందు వాపోయారు.రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పూట ఘోరం జరిగింది. గుడికి వెళ్లి వస్తుండగా లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పరిటాల సునీత బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ హత్యా రాజకీయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీలో లింగమయ్య కీలకంగా ఉన్నందుకే ఈ హత్య చేయించారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు పరామర్శ కోసం వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనపై గోరంట్ల మండిపడ్డారు. ఇదీ చదవండి: జగన్ హయాంలో హింసా రాజకీయాలెక్కడివి? -
Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!
తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. -
విర్రవీగుతున్నావా లోకేష్ రాజా?.. రెడ్‌బుక్‌పై అంబటి సెటైర్లు
సాక్షి, గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఇంకా అంబటి రాంబాబు ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు.దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్టరెడ్బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజాచంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్‌బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా.జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్‌బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్‌బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు.దోపిడీనే చంద్రబాబు నైజంతాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ.కాంట్రాక్టర్ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయడం.. భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు. -
ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్ సిక్స్‌ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. -
అయినను రాజకీయ భక్తులు నోరు విప్పరేం?
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్‌ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు. 👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీలడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు. చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది. గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు. 👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి. ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు. గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్‌లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు. అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి. పాపనాశనం రిజర్వాయిర్‌లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ముగిసిన కొలికపూడి డెడ్‌లైన్.. బోసుబొమ్మ సెంటర్లో హైటెన్షన్
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్లతో వేడెక్కిన తిరువూరు టీడీపీ రాజకీయం.. ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చిన డెడ్‌లైన్ శనివారం ముగిసిపోయింది. దీంతో తర్వాత ఏం జరగనుందా? అనే చర్చ నడుస్తోంది. టీడీపీ నేత, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ అధిష్టానానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారాయన. శనివారం ఆ గడువు కాస్త ముగిసిపోయింది. దీంతో రాజీనామా చేస్తారా? అనేది చూడాలి. మరోవైపు.. రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి తనను టార్గెట్ చేశాడని రమేష్ రెడ్డి ఆరోపించడం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచే కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం.. ప్రత్యేకంగా పార్టీ కేడర్ ద్వారా తిరువూరు నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై వేటు పడవచ్చనే చర్చా నడుస్తోంది. దీంతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బహిరంగ చర్చకు రావాలంటూ ప్రత్యర్థులకు కొలికపూడి సవాల్ విసరగా.. పార్టీ కేడర్ అందుకు ధీటుగా స్పందించింది. తాడే పేడో తేల్చుకుందాం రమ్మంటూ.. బోసుబొమ్మ సెంటర్లో చర్చకు కొలికపూడిని ఆహ్వానించింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ కేడర్ సవాళ్ల నేపథ్యంలో.. బోసుబొమ్మ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే.. సవాల్ విసిరిన కంచెపోగు ప్రసాద్ , డేవిడ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. -
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
Chittoor: ఎమ్మెల్యే గురజాల అనుచరుల వీరంగం
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు. -
సామాన్యులపైనా ‘రెడ్‌బుక్’ వేధింపులు.. లెక్చరర్‌పై తప్పుడు కేసు
చిత్తూరు జిల్లా: తల్లికి వందనం ఏదీ..? ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ...? పేద విద్యార్థులకు ఎందుకీ కష్టాలు...? అంటూ ఓ ప్రైవేట్ కాలేజీ అధ్యాపకుడు తన ఆవేదనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే... అతనిపై పోలీసులు నాటుసారా తరలిస్తున్నారని కేసు కట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు అత్యంత దారుణంగా అధ్యాపకుడిపై నాటుసారా తరలిస్తున్నారని కేసు నమోదు చేశారని విద్యార్థులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు... చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకానికి చెందిన జ్యోతికుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన 15 రోజుల కిందట విద్యా సంవత్సరం ముగుస్తున్నా విద్యార్థులకు తల్లికి వందనం అందలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాలేదని, విద్యాదీవెన వంటి సాయం అందలేదని పిల్లల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. విద్యార్థులు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ హయాంలోనే బాగా పని చేశారని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ వీడియో వైరల్‌గా మారడం... జ్యోతికుమార్ ప్రశ్నలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. అతనిపై పగపట్టారు. అతనిపై ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో కాణిపాకం పోలీసులు గురువారం ఉదయం జ్యోతికుమార్‌ను తన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు తవణంపల్లి, ఐరాల, కాణిపాకం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ అతని గురించి ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. చివరికి రాత్రి సమయానికి నాటు సారా తీసుకొస్తుంటే పట్టుకున్నామని కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటీకి కక్షపూరితంగానే చేశారని గ్రామస్తులు, విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది. సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టుప్రెస్మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
కొలికపూడి డ్రామా.. కేశినేని చిన్ని రివర్స్ డ్రామా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో కమీషన్ల పంచాయతీ రచ్చ రచ్చగా మారింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో లెక్కలు బట్టబయలయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమీషన్ల పంచాయితీ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా, ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి వాటాల్లో తేడా వచ్చింది. దీంతో ఎంపీ కేశినేని చిన్నిని కొలికపూడి పరోక్షంగా టార్గెట్‌గా చేశారు. చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హడావుడి సృష్టించారు.ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. తనను కాపాడేందుకు రమేష్‌రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిషోర్‌కు నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షల నగదు ఇచ్చాడంటూ కొలికపూడి ఆరోపించారు.కాగా, కొలికపూడి డ్రామాకు ఎంపీ కేశినేని చిన్ని రివర్స్ డ్రామా నడిపారు. తమకు లోన్లు ఇప్పిస్తామంటే వచ్చామని కొలికపూడి ఇంటి వద్ద ధర్నా చేసిన గిరిజన మహిళలు అన్నారు. లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయలు కూలీకి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్నారు. మరో వైపు, తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ అనుచరుడు రమేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.కొలికపూడికి ఎన్నికల సమయంలో 50 లక్షల ఆర్థిక సహాయం చేశానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను రెండు కోట్లు అడిగారని.. మండలంలో కాంట్రాక్టులన్నీ తాననే చేసుకోమన్నారంటూ ఎంపీ అనుచరుడు ఆలవాల రమేష్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్ పనుల్లో 10 శాతం కమిషన్ ఇస్తే చాలన్నారు. నేను రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు. మహిళలను లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయల కూలీకి తీసుకొచ్చి ధర్నా చేయించారు’’అని రమేష్‌రెడ్డి ఆరోపించారు. -
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025 -
జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
అనంతపురం:టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిబలం లేకపోయినా రామగిరి ఎంపీపీ ఎన్నిక లో పోటీకి దిగారుపేరూరు ఎమ్పీటీసీ భారతిని కిడ్నాప్ చేశారుకొందరు సీఐలు, ఎస్సైలు పరిటాల సునీత కు తొత్తుగా వ్యవహరిస్తున్నారువందలాది మంది టీడీపీ గూండాలను రామగిరి లోకి ఎలా అనుమతించారు?పరిటాల హింసా రాజకీయాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం విజయనగరం జిల్లాభోగాపురం మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంవైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పచ్చిపాల నాగలక్ష్మిని వైస్ ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి. చిత్తూరు జిల్లా:కుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: ఎమ్మెల్సీ భరత్ఎంపీటీసీ లను ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారుపోలీసులు నామమాత్రంగా బందోబస్తు నిర్వహించారుమా ఎంపీటీసీ వెళ్తున్న బస్సును అడుగు అడుగునా అడ్డగించారుపోలీసులు సెక్యూరిటీ ఉన్నా చోద్యం చూస్తున్నారుటిడిపి సీనియర్ నేతలు గంజాయి కేసులు పెడతాము అని ఎంపీటీసీలు ను బెదిరించారురాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోంది అని చెప్తున్న చంద్రబాబు కుప్పం లో ఏం జరుగుతుందో అందరు చూశారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లను భయబ్రాంతులకు గురి చేశారుఈ రోజు మా పై దాడి కూడా చేయాలని కుట్ర చేశారుఈ ఎన్నికలు పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం,కోరం లేకుండా ఎంపిపి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..గోవింధప్ప శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ప్రజాస్వామ్య వాదులు కుప్పం వైపు ఒకసారి చూడండి..ఇక్కడ ఏం జరుగుతుందో..కోరం లేకుండా రామకుప్పం ఎంపిపి ఎన్నికలు నిర్వహించారుటిడిపి నాయకులతో కుమ్మక్కు రాజకీయం చేశారుకుప్పం నియోజకవర్గం లో ప్రజాస్వామ్యం ను ఖూనీ చేశారుఅధికారులు చేసిన తీరుపై హైకోర్టు లో ఈ కేసు సూటిగా తీసుకోవాలిటిడిపి కు కుట్ర రాజకీయాలు చేస్తోంది కుందనందన రెడ్డి, రామకుప్పం ఎంపీటీసీఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడు జరగ లేదుసిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ఒక ఆదర్శంగా ఉండాలివైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపిటిసి అందరినీ తప్పుడు కేసులు పెడతామని బెదిరించడంమా పై కేసులు పెడతాం అని బెదిరించారురామకుప్పం వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ అందరినీ బెదిరించారుదీనిపై న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం ఏలూరు: కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూక👉ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో అత్తిలిలో తీవ్ర ఉద్రిక్తత👉కూటమికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో👉గెలుపు కోసం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి👉మాజీ మంత్రి కారుమూరి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు👉ఎన్నికకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారుమూరి ఇంటిని ముట్టడించిన పచ్చమూకవైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉పల్నాడు జిల్లా: నరసరావుపేట రూరల్ మండలం వైస్ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ దారుణాలకు ఒడిగట్టింది: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి👉పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తోంది👉రెండు రోజుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు👉పోలీసులతో కేసులు పెడతావని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ భర్తను రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు👉పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని పోలీసులు తీసుకువెళ్లారు👉పోలీసులే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు👉టీడీపీ నాయకులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం👉వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేయరు👉లోకేష్ పోలీసులను అడ్డంపెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడుకుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం👉కుప్పం మెయిన్ రోడ్డు అన్నవరం క్రాస్ వద్ద ఎంపీటీసీలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించిన టీడీపీ శ్రేణులు👉రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తం👉ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవని రామకుప్పం మండలంలో ఎంపీపీ ఎన్నిక కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలుటీడీపీ అరాచకం.. ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీతూర్పుగోదావరి: అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ స్థానాన్ని అడ్డగోలుగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ👉బిక్కవోలు మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేని టీడీపీ👉బెదిరింపులు, ప్రలోభాలు చూపి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను తమ వైపుకు తిప్పుకున్న టీడీపీ నేతలు👉టీడీపీ వ్యవహార శైలితో ఎంపీపీ ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులుచిత్తూరు జిల్లా: వి.కోట మండలం పట్రపల్లి గ్రామం జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నివాసం నుంచి పోలీస్ భద్రత నడుమ వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను రామకుప్పం ఎంపీడీవో కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో వి.కోట వద్ద టీడీపీ శ్రేణులు అడ్డగించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హైకోర్టు ఆదేశాలతో బందోబస్తుతో తరలిస్తుండగా.. పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు.తాడేపల్లి: జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెరతీసింది. బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు భారీఎత్తున ప్రలోభాలకు పాల్పడుతోంది. తమ దారికి రాకుంటే కిడ్నాప్‌లు, బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం చేస్తూ.. నిన్నటి నుంచే అనేకచోట్ల టీడీపీ నేతలు భీతావాహ వాతావరణం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో టీడీపికి ఎస్టీ అభ్యర్థి లేకపోవడంతో ఎంపీటీసీ, ఆమె భర్త కిడ్నాప్ చేశారు.తూర్పు గోదావరి జిల్లా జిక్కవోలు ఎంపీటీసీలకు రూ.3 లక్షల చొప్పున ఎర వేశారు. ముగ్గురు ఎంపీటీసీలున్న కాకినాడ రూరల్ ఎంపీపీ పదవి కోసం జనసేన బరితెగించింది. ఒకే సభ్యుడు ఉన్న వైఎస్సార్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. టీడీపీ, జనసేన అరాచకాలను చూసి ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.👉శ్రీ సత్యసాయి జిల్లా: ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు. బలం లేకపోయినా ఎంపీపీ స్ధానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసిన పరిటాల వర్గీయులు.. వైఎస్సార్ సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు.👉వైఎస్సార్సీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. కదిరి వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు కిడ్నాప్ కేసులు నమోద చేయగా, తాము సురక్షితంగా ఉన్నామని చామలగొంది, కటారుపల్లి ఎంపీటీసీలు సెల్ఫీ విడియో విడుదల చేశారు. అయినప్పటికీ కదిరి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సహా ఆరుగురిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.👉చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయం బి. ఫార్మ్ తీసుకునేందుకు వెళ్లిన మురుగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.👉ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌ను పోలీలసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏ స్టేషన్‌కు తీసుకువెళ్లారో కూడా పోలీసులు చెప్పలేదు. మురుగేశ్తో పాటు సర్పంచ్‌లు మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మురుగేష్, సర్పంచ్ మోహన్ నాయక్, భాస్కర్ నాయక్‌లను పోలీసులు విడిచి పెట్టారు.👉ఏలూరు జిల్లా: నేడు కైకలూరు మండలం వైస్ ఎంపీపీ-2 ఎన్నిక జరగనుంది. వైఎస్ ఎంపీపీ-2 ఎన్నికకు సైతం అధికారి ప్రలోభాలకు తెరతీసింది. బలం లేకపోయినా ప్రలోభాలతో వైస్ ఎంపీపీ- 2 స్థానాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఉదయం 11 గంటలకు కైకలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.👉కృష్ణా జిల్లా: రామవరప్పాడు ఉపసర్పంచ్‌కు ఎన్నిక ఇవాళ జరగనుంది. వార్డు సభ్యురాలు రాజీనామా చేయడంతో ఉపసర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉప సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ చీప్ పాలిటిక్స్ తెరతీసింది. 11వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌కు వైఎస్సార్సీపీ వార్డు సభ్యుల మద్దతు, ఆరో వార్డు సభ్యుడు అద్దెపల్లి సాంబశివనాగరాజుకు కూటమి మద్దతు ఉంది. కత్తుల శ్రీనివాస్‌కే మెజారిటీ మద్దతు ఉంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.👉వైఎస్సార్ జిల్లా: నేడు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మూడు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. రాయచోటి, ఖాజీపేట, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీలను పాలకవర్గాలు ఎన్నుకోనున్నాయి. పూర్తి స్థాయి బలం ఉండటంతో మూడు చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశం ఉంది. పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.👉తిరుపతి జిల్లా: తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. పటిష్ట బందోబస్తు నడుమ తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం ముందుగానే వైఎస్సార్‌షీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల క్యాంప్ నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.విమానాశ్రయం నుంచి తుమ్మలగుంట వరకు ఎంపీటీసీల బస్సులను భారీ భద్రత నడుమ పోలీసులు తరలించారు. మరి కాసేపట్లో తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలు పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థిగా పేరూరు-1 ఎంపీటీసీ మూలం చంద్రమోహన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేనందున పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సుమాచారం. వైఎస్సార్సీపీకి వన్ సైడ్ మెజారిటీ ఉండటంతో సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి.టీడీపీ ద్వంద్వనీతి👉 వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.👉జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.👉బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?
అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో టాప్-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్ డిస్క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. -
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బెదిరిది లేదు.. వెనక్కి తగ్గిదిలేదని స్పష్టం చేశారు. మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి.. తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు. ఈ క్రమంలో నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..‘మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు. సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని.. నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. 16 విచారణలు జరుగుతున్నాయి. ఎనిమిది అక్రమ కేసులు నాపై నమోదు చేశారు. రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కావాలనే క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తాము తప్పా.. రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్‌కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్‌లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్‌ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది. కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాటిపర్తిలో క్వార్జ్ అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో కేసు నమోదైంది. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు.‘‘ఉడత బెదిరింపులకు భయపడను. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను. ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు. -
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు. -
చంద్రబాబు కొత్త రాగం.. ఆత్మవంచన ఇంకెంత కాలం?
పూటకో రకంగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అసెంబ్లీలో కానీ.. మరో చోట కానీ.. నిన్న చేసిన ప్రసంగానికి, నేటికి అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు చేసే ప్రసంగాలు ఒకలా ఉంటే.. ఆ తరువాత ఇంకోలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాగ్దాన భంగాల గురించి ఆయన ఆచరించే పద్ధతులు ఒక పరిశోధన అంశం అవుతుందేమో!.కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్-2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అన్న ఆయన అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. చెవిలో అయినా చెప్పాలని వ్యాఖ్యానించారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తాం అంటున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ, ఏపీని అప్పుల కుప్పగా మరుస్తుండటం మాత్రం స్పష్టం. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే రూ.ఏభై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్డడానికి సిద్దం అవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడా బాబులకు ఉపయోగపడుతున్నదా? లేక పేదలను ఉద్ధరించడానికా? అన్నది తెలిసిపోతుంది.అమరావతిలో భూములు కొన్నవారి ప్రయోజనాల కోసం ఇంత భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మాత్రం పాతరేసింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లు పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ, శాసనసభలో, బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టేయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండపై ప్రభుత్వానికి ఉపయోగపడేలా మంచి భవనాలు నిర్మిస్తే, అవేవో ఆయన సొంతమైనట్లు ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్‌లను మాత్రం ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు.అమరావతి గ్రామాలలోనే ఇన్ని వేల కోట్ల వ్యయం చేస్తే అక్కడి వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సంపదవుతుంది?. ప్రభుత్వాన్ని సమతులంగా నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్-2047 అని, పీ-4 అని ఏవో కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్త కూడదన్నది వారి వ్యూహం. ఇది ప్రజస్వామ్య వ్యవస్థను కూడా మోసం చేస్తున్నట్లు అన్న సంగతి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం 18వేల డాలర్లుగా ఉండాలని భావిస్తుంటే ఏపీలో అది 42వేల డాలర్లుగా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఒక డాలర్ విలువ వంద రూపాయలు ఉందనుకుంటే ఏపీ ప్రజలు ఏడాదికి నలభై రెండు లక్షల మేర తలసరి ఆదాయం కలిగి ఉంటారన్నమాట. నిజానికి ఇంకో పాతికేళ్ల తర్వాత డాలర్ విలువ ఇంకా ఎక్కువే కావచ్చు. అది వేరే సంగతి. అంటే ఇలాంటి అంకెల గురించి ప్రజలకు అంత తేలికగా అర్థం కావు. అందువల్ల వారిని భ్రమింప చేయడానికి ఈ అంకెల గందరగోళం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.చంద్రబాబు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్-2020 అంటూ ఒక కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు.. ఇవేమి లక్ష్యాలు.. అంటూ ఆశ్చర్యం చెందారు. అప్పట్లో ఒకసారి ఏపీకి వచ్చిన స్విస్ మంత్రి ఒకరికి జీడీపీపై, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ఇలాంటి లెక్కలు చెప్పబోతే, తమ దేశంలో అయితే ఇలా చెబితే వారిని మతి ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఒకట్రెండు పదాలు ఆయన వాడటం చంద్రబాబుకు అప్రతిష్టగా మారడంతో ఆ మాటలపై వివరణ ఇప్పించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏవో లెక్కలు చెబితే ప్రజలు నమ్మకపోతారా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.సూపర్ సిక్స్ హామీలు కాని, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కాని అమలు చేయడం అసాధ్యం వాటికి రూ.లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము చేసి చూపిస్తామని అనేవారు. తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు బడాయి కబుర్లు చెబితే, అవునవును అని పవన్ కళ్యాణ్ బాజా వాయించే వారు. అప్పటికే జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి.నారా లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరూ పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తారట. ప్రతిరోజూ చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతానని అదే తమ విధానం అని చంద్రబాబు అన్నారు. మరి ఈ మాటే ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? పేదల తక్షణావసరాలు తీర్చడం అంటే ఒక ఏడాదిపాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా?. వలంటీర్లకు నెలకు పది వేలు ఇస్తామని చెప్పి అసలుకు మంగళం పాడడమా? ఇప్పటికీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవశాలి ఎంతమందికి సంపద సృష్టించారు? ఎంత మందికి నేర్పారు? ఇప్పుడు కొత్తగా నేర్పుతానని అంటే జనం చెవిలో పూలు పెట్టడం కాదా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.అలాగే వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం అన్ని స్థాయిలలో పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. నియోజకవర్గాల విజన్ ఎజెండా పెట్టి స్వర్ణాంధ్ర సాకారం చేస్తారట. అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేక పోయానని వాపోయారు. పది నెలల పాలన తర్వాత వీధులలో చెత్త ఎత్తడానికి సీఎం, మంత్రులు ఆయా చోట్ల తిరుగుతున్నారు. అలా ఉంటుందన్నమాట విజన్ అంటే!.పరిస్థితి ఇలా ఉంటే స్వర్ణాంధ్ర అని, మరొకటని కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడమేమిటో అర్థం కాదు. అదేమంటే పేదలను ధనికులు దత్తత తీసుకోవాలట. అప్పుడు వారికి సంపద సృష్టించడం నేర్పనక్కర్లేదా!. ఉగాది నాడు ఆ కార్యక్రమం ఆరంభిస్తారట. అది ఎంత చక్కదనంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రతీ కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా?. వైఎస్ జగన్ టైమ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేటు పరం చేస్తూ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాం అని అంటున్నారు. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలా మంది పనిచేయడం లేదని చెప్పడమే అవుతుంది కదా! పనుల సంగతి దేవుడెరుగు! కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కనుక, తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ లేదు, కొన్ని వార్డులలో మట్టి రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. ఒక్క గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లలో తనను ఎవరూ ఓడించలేదని, అభివృద్ది చేసే క్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయలేక పోయినందువల్ల ఓడిపోయామని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ది చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేక పోతున్నారన్నమాట.జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడిన సంగతిని విస్మరిస్తున్నారు అన్నమాట. ఇది ఆత్మవంచన కాదా! పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడీ, బురిడీ మాటలు కాకుండా చిత్తశుద్దితో పనిచేసి, ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
‘రెడ్ బుక్’ రచయిత ఫోన్ కాల్ వలనే పోసాని విడుదల ఆలస్యం’
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన
తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన కల్యాణ్‌లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి... తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్ పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు ఆ ట్రస్ట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్ రిపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు. -
AP or TS.. రెండింటిలో ‘సోది బడ్జెట్’ ఏది?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మీడియాలో చాలా హడావుడి ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రికి తగిన ప్రాధాన్యమూ దక్కుతూంటుంది. ఆయా శాఖలకు కేటాయించిన నిధుల మొత్తం, తదితర వివరాలతో పత్రికలు పేజీలకు, పేజీలు వార్తలు, కథనాలు నింపేస్తుంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ బడ్జెట్ గురించి కాని, తదుపరి ఆయా శాఖలు పెడుతున్న ఖర్చుల గురించి కాని పెద్దగా ఎవరూ పట్టించుకోరు!. కొన్ని రాష్ట్రాలు అసలు ఆచరణ సాధ్యం కాని పద్దులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఆ స్థాయిలో జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నించినట్లు కనబడదు. ఉన్నంతలో తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొంతమేర అయినా నిధులు కేటాయించాలన్న ఉద్దేశంతో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారనే భావన కలుగుతోంది.👉ప్రజాకర్షక స్కీములు ఏ స్థాయిలో అమలు చేయాలన్న దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. అది వేరే సంగతి. కానీ ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ ను పెట్టకపోతే అది మోసం చేసినట్లు అవుతుంది. లేదా అరకొర నిధులు కేటాయించి సరిపెడితే ప్రజలను మభ్య పెట్టడానికి అని అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్‌ను యథాతథంగా అమలు చేయడం. ఎక్కువ సందర్భాలలో బడ్జెట్ లో పేర్కొన్న విధంగా ఖర్చు చేయలేకపోతున్నాయి. దానికి కారణం అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడమే. బడ్జెట్ అంచనాలు ఒకరకంగా ఉంటే.. వాస్తవం ఇంకోలా అన్నమాట. ఉదాహరణకు తెలంగాణ బడ్జెట్లో గత ఏడాది రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ అందులో ఆశించిన ఆదాయం కన్నా రూ.70 వేల కోట్లు తక్కువగా వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా చెబుతున్నారు. అలాంటప్పుడు మళ్లీ గత బడ్జెట్ కన్నా ఐదు శాతం అధికంగా రూ.3.04 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఎలా పెట్టారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. 👉ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు మాత్రమే సుమారు రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయించవలసి ఉండగా, కేవలం రూ.17 వేల కోట్లే కేటాయించారు. తెలంగాణ బడ్జెట్లో వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సుమారు రూ.56 వేల కోట్లు, మిగిలిన హామీలకు రూ.34 వేల కోట్లు పెట్టారు. ఇవన్ని అమలు అవవుతాయా? లేదా? అన్న చర్చ కూడా ఉంటుంది. అయినప్పటికీ కనీసం భట్టి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేయడం ద్వారా తమకు చిత్తశుద్ది ఉందనిపించుకునే యత్నం చేశారు. అయినా మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ వంటి వాటిని బడ్జెట్లో పెట్టలేకపోయారు. అలాగే వృద్దాప్య ఫించన్ రూ.నాలుగు వేలు చేస్తామన్న హామీ గురించి కూడా చెప్పలేదు. సహజంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు వీటిని ఎత్తి చూపాయి. కాగా ఆరు గ్యారంటీలలో రైతు భరోసా కింద రూ.18 వేల కోట్లు, మహాలక్ష్మి స్కీమ్‌కు రూ.4300 కోట్లు, గృహజ్యోతి, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వంటి వాటికి నిధులు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇప్పటికే నెరవేరిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా కూటమి సర్కార్ ఈ ఉచిత బస్ హామీ ఇచ్చింది కానీ బడ్జెట్లో దాని ఊసేలేదు. 👉తెలంగాణలో గత ఏడాది సంక్షేమ పథకాలకు రూ. 47 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి మరో రూ.ఎనిమిది వేల కోట్లు అదనంగా ఇస్తామని చెబుతున్నారు. అప్పులపై రెండు రాష్ట్రాలు గత ప్రభుత్వాలపై ఆరోపణలు గుప్పిస్తూనే అప్పటికన్నా అధికంగా అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 70 వేల కోట్ల అప్పులకు ప్రతిపాదిస్తే ఏపీ ఏకంగా రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని యోచిస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు చేస్తోందని అంకెలు చెబుతున్నాయి. ఇక ద్రవ్య లోటు రూ. 54 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో సంక్షేమానికి 34 శాతం పైగా నిధులు కేటాయించారు. ఇక ఆదాయానికి సంబంధించి ప్రభుత్వ భూముల అమ్మకం, మద్యం అమ్మకాలపై వచ్చే పన్నులు, భూముల రెగ్యులరైజేషన్ స్కీమ్ వంటివాటి ద్వారా అధిక మొత్తాలను రాబట్టుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.20 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.👉గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా భూముల వేలం పాటలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్లక తప్పలేదు. హైదరాబాద్ అభివృద్దికి రూ. పదివేల కోట్లు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఇతరత్రా సాగునీటి పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించడం బాగానే ఉంది. అయితే ఆ నిధులను ప్రభుత్వం అదే రీతిలో ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు రాబట్టగలిగితేనే ఉపయోగం. ఫ్యూచర్ సిటీపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సిటీని రూపొందించడానికి రూ.200 కోట్లు కేటాయించడం కూడా బాగానే ఉంది. 👉ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ స్పీచ్‌లో రాయడం బాగోలేదు. ఏమి విధ్వంసమో చెప్పకుండా, కేవలం డైలాగుల కోసం ప్రభుత్వాలు ఇలా రాస్తున్నట్లు అనిపిస్తుంది. పోనీ అది విధ్వంసం అయితే గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ హామీలు ఎలా ఇచ్చారో చెప్పాలి. అలాగే అప్పటి కన్నా ఇంకా ఎక్కువ అప్పులు తీసుకు రావడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్థం కాదు. ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత ఆయా వర్గాలను సంతృప్తిపరచడానికి యత్నించినట్లు కనిపిస్తుంది. అయినా ఈసారి కూడా అంచనాలకు, వాస్తవ గణాంకాలకు ఎంతవరకు పొంతన ఉంటుందన్నది సందేహమే.ఒకప్పుడు బడ్జెట్ పత్రాలను ఎంతో పవిత్రంగా పరిగణించేవారు. కాని రానురాను అవి అంకెల గారడీ పత్రాలుగా మారిపోతున్నాయి. ఏపీ బడ్జెట్ అయితే మరీ సోది పత్రంగా కనిపించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ ఏపీ కన్నా కొంత బెటర్‌గా ఉంది. ఒక కుటుంబమైనా, రాష్ట్రమైనా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెట్టాలి?ఎంత రుణం తీసుకోవాలి? మొదలైన వాటిపై ఒక అవగాహనతో ఉండాలి. కుటుంబంలో యజమాని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల పాలైపోవడమో, లేక వృథా వ్యయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్దతిగా వ్యవహరించకపోతే దాని ప్రభావం ప్రజలందరిపై పడుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీడియా విశ్లేషిస్తే బాగుంటుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్‌కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
మర్రి రాజశేఖర్‌ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్‌ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్‌కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. -
లిక్కర్ స్కాం పేరుతో 'కూటమి' భారీ కుట్ర: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపులో భాగంగా లేని లిక్కర్ స్కాంను ఒక పథకం ప్రకారం సృష్టించిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టి, వైఎస్సార్సీపీ నేతలను దానికి బాధ్యులుగా చూపించేందుకు దుర్మార్గమైన ప్రణాళికను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఈ స్కాం పేరుతో జరుగుతున్న హంగామాను పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తోందో తెలుస్తుందన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను తప్పుడు కేసులు బనాయించి వేధించిన ప్రభుత్వం, తాజా మరో భారీ కుట్రకు తెరతీసింది. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.4వేల కోట్ల లిక్కర్‌స్కాం జరిగిందంటూ ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ కుట్రను అమలు చేస్తోంది. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. డెబ్బైశాతం బ్రాండ్లను ఎంపిక చేసిన నాలుగు కంపెనీలకే ఇచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తగ్గించాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అధికారులపై వత్తిడి తెచ్చి ఆ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను పక్కకు పెట్టేయించారు. ఈ కేసుల్లోంచి ఇప్పుడు బయటపడేందుకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎదురుకేసులు నమోదు చేయించేందుకు కూటమి ప్రభుత్వం తెగబడిందికూటమి పెద్దల డైరెక్షన్లోనే ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం పేరుతో కేసులు నమోదు చేసి కక్షసాధించేందుకు కూటమి పెద్దల డైరెక్షన్లోనే శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 9.9.2024న వై.వెంకటేశ్వర శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఈ వ్యక్తి తన లేఖలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ పాలసీలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా పెద్ద స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారో, ఈ వ్యక్తికి ఉన్న విశ్వసనీతయ ఏమిటో కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.ఈ లేఖను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆగమేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఒక మెమోను జారీ చేశారు. తొమ్మిది రోజుల్లోనే ఈ మెమోను ఆధారం చేసుకుని బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి వచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ, దీనిపై విచారణ జరపాలంటూ ముఖేష్ కుమార్ మీనా 20.9.2024న సీఐడీకి ఫిర్యాదు చేశారు.వెంటనే సీఐడీ అధికారులు దీనిపై 23.09.2024న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే దీనిలో ఎవరిని విచారించారు, ఏ అంశాలను పరిశీలించారు, ఎటువంటి ఫైళ్ళను తనిఖీ చేశారు అనే కనీస సమాచారం కూడా లేదు. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నెం.21/2024లోని కాలమ్ నెంబర్ 7లో ముద్దాయిలు అని ఉన్న చోట 'గుర్తు తెలియని వ్యక్తులు' అని కోట్ చేశారు. అలాగే మొత్తం రూ.4000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇంత మొత్తం ఎలా అవినీతి జరిగిందో దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు.తెలుగుదేశం వీర విధేయులతో సిట్ ఏర్పాటుసాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్‌లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం, రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుంది. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్‌లో నియమించారు.సిట్‌ను నియమించే సందర్బంలో సుప్రీంకోర్టు సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు. సిట్‌కు సంబంధించిన పోలీస్‌స్టేషన్‌ను పేర్కొనలేదు. అందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, స్టేట్మెంట్లు రికార్డు చేసే సమయంలో దానిని చిత్రీకరించాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. బేవరేజెస్ కార్పోరేషన్‌కు సంబంధించిన ఫైళ్ల రూటింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. కార్పోరేషన్ ఉద్యోగులను బెదిరించి, భయపట్టి సిట్ తాము రాసుకున్న స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంది. తాము చెప్పినట్లు కొందరి పేర్లు లిక్కర్ స్కాంలో ఉన్నాయని చెప్పకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందంటూ బెదిరించారు. సంతకాలు పెట్టిన ఉద్యోగులు తాము సాక్ష్యులమా, లేక ముద్దాయిలమా అని భయాందోళనలు చెందుతున్నారు. అలాగే డిస్టలరీ కంపెనీలను సిట్ అధికారులు బెదిరించి తమకు అనుకూలమైన స్టేట్మెంట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.ముందు బురదచల్లడం... తరువాత ముద్దాయిలుగా చూపడంలిక్కర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్‌లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోంది.లిక్కర్ పాలసీ ప్రకారమే బేవరేజెస్ కార్పోరేషన్ పనిచేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతులు పొందిన డిస్టలరీల నుంచే కొనుగోళ్ళు చేసింది. మద్యంను నియంత్రించేందుకు ఒక పారదర్శక విధానాన్ని అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మద్యంపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
ఎవరు దొంగలు? ఎవరు అలా వ్యవహరించారు?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో దొంగలు అంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్లు. వేలంపాటలో ప్రజా ప్రతినిధులను, సభ్యులను కొనుక్కున్నవాళ్లు. వైస్రాయ్ హోటల్లో క్యాంప్‌లు నిర్వహించిన వాళ్లు. స్పీకర్‌ను అడ్డు పెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచిన వాళ్లు. జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్లు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. అలాగే ఆయన ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.‘మేమేమీ గోడలు దూకి అర్ధరాత్రులు, అపరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట, అందరి సమక్షంలో ఉండే రిజిస్టర్లో, అందరి ముందే సంతకం పెట్టాం తప్ప, అందుకోసం దొంగల్లా రాలేదు. ఎవరూ చూడకుండా సంతకం చేయలేదు. మేమేమీ దొంగలం కాదు, అలా వ్యవహరించడానికి!’.‘విపక్షంలో ఉన్నా, మా బాధ్యత మరవడం లేదు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. కానీ, మాకు ఆ అవకాశం దక్కకూడదని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించలేదు. తగినంత సభ్యులు లేకపోతే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించవద్దని, ఎక్కడా లేకపోయినా, ఆ సాకు చూపి, మా పార్టీ వైయస్సార్సీపీని మీరు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు. అందుకే మా హక్కు కోసం కోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం’.‘ఇంకా సభకు హాజరు కాకున్నా, ప్రజా సమస్యలు ప్రతి వేదిక మీద లేవనెత్తుతూనే ఉన్నాం. ప్రభుత్వ అక్రమాలు, అవినీతి చర్యలను ఎండగడుతూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం. అలా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడూ మర్చిపోలేదు. అందుకే దొంగల్లా కాకుండా, దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం. ప్రశ్నలు సంధిస్తున్నాం. నియమానుసారం అందరి ముందే రిజిస్టర్లో సంతకం చేస్తున్నాం’.‘నిజం చెప్పాలంటే, సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది నోరెత్తడం లేదు. వారి నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించడం లేదు. అక్కడి ప్రజలను అస్సలు పట్టించుకోవడం లేదు. సభలో ఉండి కూడా అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వారి కంటే, మేము చాలా బాగా పని చేస్తున్నాం. వారు సభకు హాజరై, సభలో ఉన్నా, వారితో ప్రజలకు ఏ ప్రయోజనం లేదు. కానీ, మేము సభకు హాజరు కాకున్నా, మా నియోజకవర్గాలు, ప్రజా సమస్యలు ప్రశ్నల రూపంలో సభలో ప్రస్తావించి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. దీన్ని కాదంటారా?’.‘బహుజన శాసనసభ్యులను దొంగలుగా సంబోధించడం హేయం. మరి గత అసెంబ్లీలో అప్పటి విపక్షనేత చంద్రబాబు రెండున్నర ఏళ్లు సభకు హాజరు కాలేదు. మమ్మల్ని దొంగలు అన్న మీరు, మీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుని ఏమంటారు? సభకు హాజరు కాకున్నా, కనీసం రిజిస్టర్లో సంతకం కూడా చేయకున్నా, శాసనసభ్యుడిగా, విపక్షనేతగా, ఆ హోదాలో అంతకాలం పాటు, అన్నీ పొందిన మీ పార్టీ అధినేతను ఏమనాలి? మమ్మల్ని ఉద్దేశించి అన్న దాని కంటే ఇంకా ఎక్కువ పదం వాడతారా?’‘అయినా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం. ఆయన ఎలా మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా సరే.. వాటన్నింటినీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’.. అని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. -
కృష్ణా జిల్లాలో జనసేన దౌర్జన్యం.. దుకాణాలు కూల్చివేత
సాక్షి, కృష్ణాజిల్లా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో జనసేన నేతల కక్ష సాధింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై ఘంటసాల మండలం పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కుమార్ దాష్టీకానికి పాల్పడ్డాడు. మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పవన్ కుమార్.. అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ సానుభూతి పరుల దుకాణాలు తొలగించారు. సామాన్లు తీసుకుంటామన్నా వినకుండా జేసీబీలు తెచ్చి దుకాణాలను కూల్చివేయించారు. కరకట్ట రహదారికి ఆనుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు.కేవలం వైఎస్సార్సీపీ సానుభూతి పరులు అనే కారణంతో రెండు దుకాణాలను మాత్రమే తొలగించిన అధికారులు.. విలువైన సామాగ్రి ధ్వంసం చేశారు. దుకాణాలను కూల్చిన ప్రదేశాన్ని ఫెన్సింగ్ వేసి జనసేన నాయకులు ఆక్రమించుకున్నారు. జనసేన నాయకులపై బాధిత మహిళలు మండిపడ్డారు. ఐదేళ్లుగా ఇక్కడే పాక ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారం చేసుకుంటున్నామని.. సామాన్లు తీసుకుంటామన్నా అధికారులు ఒప్పుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలమని కూడా చూడకుండా మాపై జనసేన నాయకుడు పవన్ కుమార్ దౌర్జన్యం చేశారని.. కాళ్లమీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితులు వాపోయారు. లక్షల విలువైన మా సామాన్లను ధ్వంసం చేసేశారు. వైఎస్సార్సీపీ వాళ్లను బతకనివ్వమని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ల మీదకు వెళ్లమని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడా? అంటూ బాధిత మహిళలు ప్రశ్నించారు. -
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్‌పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్‌ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్‌ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
May Be.. బాబుగారికి ఆయనంటే ఎంతో స్పెషల్!
నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవరూ గొప్పగా వాడలేరు అనేది మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్. అదే.. అధికారులను వాడకం మొదలు పెడితే నా కన్నా గొప్పగా ఎవరూ వాడలేరు అనేది ఇప్పటికే చంద్రబాబు ఎన్నోసార్లు రుజువు చేశారు. పోలీసుల మొదలు.. రాజకీయ నాయకులు, న్యాయాధికారులు.. ఇలా ఒకరేమిటి చంద్రబాబు తలచుకుంటే ఎవరినైనా వాడేయగలరు. ఆ వాడకం తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తూ రుణం తీర్చుకోగలరు... తాజాగా ఏపీ ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించించుకుంది. వారిలో గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీని నియమించారు. వీరికి కేబినెట్ హోదా కల్పిస్తూ వాహనం.. ఆఫీసు.. అదే స్థాయిలో వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. అయితే ఇందులో మొదటి ముగ్గురు సంగతి పక్కన పెడితే నాలుగో వ్యక్తి అయిన కేపీసీ గాంధీ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫోన్లో బేరాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసునుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డ్ అప్పట్లో రాజకీయ సంచలనం అయింది. ఆఘటన తరువాత రాత్రికి రాత్రి ఆయన ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేశారు. ఆయన ఊరు వదిలి వచ్చేసినా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసులు మాత్రం వదలలేదు. ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్ రికార్డర్‌ను ఫోరెన్సీక్ లాబరేటరీ పంపించారు. అందులో ఉన్న గొంతు చంద్రబాబుదా కాదా అన్నది తేల్చడం ఆ ల్యాబ్ బాధ్యత. అదిగో ఆ టైంలో ఆ ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు కేపీసీ గాంధీ. ‘‘ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పలేం. మిమిక్రీ కూడా కావొచ్చు’’ అని ఓ రిపోర్ట్ రాసి పడేశారాయన. దీంతో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. కట్ చేస్తే.. గాంధీ 2014-19 మధ్య కూడా ప్రభుత్వంలో సలహాదారు పాత్ర ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోలేదని అనుకున్నారో ఏమో.. ఇప్పుడు కూడా ఆయన్ని గౌరవ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. మునుముందు ఫోరెన్సిక్ సంబంధ అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారట. ఆ సలహాలు ఎవరికి పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్నార్థకం. అన్నట్లు.. గతంలో అధికారంలో ఉన్నపుడు తను డీజీపీ స్థాయి అధికారిని అనే సంగతి కూడా మరిచిపోయి టీడీపీకి ఏబీ వెంకటేశ్వర రావు ఊడిగం చేశారనే చర్చ నడిచింది. అయితే.. మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడిని విజిలెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమించారు. ఇలా ఎంతోమంది అనుయాయులను అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చి సొంత పనులు..రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు కేపీసీ గాంధీ నియామకం కూడా అదే కోవలోకి వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.:::సిమ్మాదిరప్పన్న -
దావోస్ జస్ట్ ఒక వేదిక అంతే!: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘‘ఏపీకి పెట్టుబడులను వెల్లువలా తీసుకురాబోతున్నాం’’ ఈ ఏడాది జనవరిలో దావోస్‌కు వెళ్లడానికి ముందు కూటమి ప్రభుత్వం (Kutami Prabhutvam)చెప్పిన మాట. ‘‘పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం.. సుమారు 15 కంపెనీల అధిపతులతో సమావేశమయ్యాం..’’ ఇది దావోస్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతున్న టైంలో చెప్పిన మాట. ఇప్పుడేమో.. దావోస్ వెళ్లింది ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాదంటూ అసెంబ్లీ సాక్షిగా ఇంకో మాట చెప్పేసింది. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారనేది తెలిసిందే. అయితే ఆ పర్యటనపై మండలి సాక్షి గా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెప్పింది. దావోస్ పర్యటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్‌లు ప్రశ్న సంధించారు. అయితే తమ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది ఎంవోయూలు చేసుకోవడానికి కాదని సమాధానం కూటమి ఇచ్చింది. అది కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే.. మేం అక్కడికి వెళ్లింది ఎలాంటి పెట్టుబడులు చేసుకోవడానికి కాదు’’ అని సమాధానం విడుదల చేసింది. -
అపరిచితుడికి నెక్ట్స్ లెవల్లో జనసేనాని!
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్‌సింగ్‌లోని డైలాగ్ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్‌ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్‌ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా? 👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్‌కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్. 👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు. జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. 👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి. 👉వైఎస్ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే.. అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్‌కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. ‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత(Home Minister Anita) అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై 70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్‌గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె. .. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్‌ను తెచ్చారు. దిశా యాప్ పైన ఇదే మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు. మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది... కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్లో ఉండేది. సెబ్‌ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.కేంద్రం వద్ద దిశ చట్టం(Disha Act) పెండింగ్ లో ఉంది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయించొచ్చు కదా అని అనితను ఉద్దేశించి కల్యాణి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మభ్యపెట్టే మాటలు మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి వరుదు కల్యాణి హితవు పలికారు.ఇదే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే మహిళా పోలీసుల పై దాడులు జరుగుతున్నాయన్న ఆమె.. శక్తి యాప్ కూడా దిశా యాప్ మాదిరిగానే పనిచేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
ప్చ్.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్‌తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్‌కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండిదీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం. -
APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి. -
ఆ రెండేళ్ల కథ ఏంది రేవంత్?
ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుకోవడానికి రెండేళ్లు పడుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ఆయనకు పెద్దగా ఉపకరించేదిగా కనిపించడం లేదు. పైగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుళ్ల పాలన గురించి అనవసరంగా ప్రస్తావించారు. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించి ఉండాల్సింది. బీఆర్ఎస్ పాలనను(BRS Party Rule) తుప్పుతో వర్ణించిన రేవంత్ వదిలిచేందుకు పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్లు పడుతుందని, వైఎస్సార్, చంద్రబాబుల పాలనల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే రేవంత్ చంద్రబాబుకు సన్నిహితుడన్న ముద్ర కలిగి ఉండటం. కాబట్టి ఆయన ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించాలని అనుకుని వైఎస్సార్ పేరును కలిపారా? అనే ప్రశ్న తలెత్తకమానదు. 👉చంద్రబాబు నాయుడు 1994లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి. ఆ తరువాత ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎం అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్‌కు రెండేళ్లు పట్టిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పదలిచారా?. చంద్రబాబు పాలన అంత అధ్వాన్నంగా ఉందని బహిరంగంగా చెప్పడానికి ఆయన ఇష్టపడతారా?. ముఖ్యమంత్రలు తమ అధికార అవధిలో కొన్ని కొన్ని విధానాలు పాటించడం సహజం. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనో, లేక మరో రకంగానో వైఎస్ పాలన సాగలేదు. వైఎస్ అధికారం దక్కిన వెంటనే చంద్రబాబు పట్టించుకోని జలయజ్ఞం పనులు చేపటారు. హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తోసహా పలు అభివృద్ది పనులు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు అందులో అత్యంత కీలకమైంది. అంతేతప్ప చంద్రబాబు ప్రభుత్వ తీరుతెన్నులపై మాట్లాడుతూ కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ సాధ్యపడదని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేవారు. రాజశేఖరరెడ్డి మాత్రం సీఎం అయిన వెంటనే అమలు చేసి చూపించారు. 👉గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వ్యవస్థ ఎటూ టేకప్ చేస్తుంటుంది. అది వేరే విషయం. వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekar Reddy) టైమ్‌లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఎక్కువగా ఇచ్చింది. దాని వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. దానివల్లే 2009లో కూడా ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే ఆయన అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. వీరెప్పుడూ వైఎస్ పాలనను తప్పు పట్టలేదు. ఈలోగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, దాని వల్ల ఎదురైన పరిణామాలు ప్రధానంగా రాజకీయాలను ఆక్రమించాయి. 2014లో విభజన జరిగిపోయింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యారు. విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 👉కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అప్పట్లో అనేవారు. కేసీఆర్ కూడా అరవై ఏళ్ల సమైక్య పాలనలో లోపాలు అంటూ ఎత్తి చూపుతుండేవారు. వీరిద్దరూ ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఎక్కువ వాటిని అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అందువల్ల ఆయన రెండోసారి పెద్దగా ఇబ్బంది లేకుండా గెలవగలిగారు. ఏపీలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన రెండేళ్లు ఏమిఖర్మ.. ఐదేళ్లపాటు అదే పాట పాడేవారు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్‌ను తిట్టడానికి ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ఇంతలో ఓటుకు నోటు కేసు రావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదలి హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోయారు. అది అప్పటి కథ. చంద్రబాబు హామీలు నెరవేర్చక పోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైనా ఒకటి, రెండు సందర్భాలలో గత ప్రభుత్వం అంటూ మాట్లాడారేమో కాని, ఎక్కువ భాగం తను ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకోవల్సిన చర్యలపైనే దృష్టిపెట్టారు. తద్వారా ఆరు నెలలలోనే అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారు. వాగ్దానాలు అమలుకు రెండేళ్లు తీసుకోలేదు. మధ్యలో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ ఏపీని నిలబెట్టారు. కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులకు రెండో టర్మ్‌లో పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది పనులు చేశారు. ఈ ప్రభుత్వాలలో ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని వాటిని సరిదిద్దడానికి రెండేళ్లు పడుతుందని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. కేసీఆర్ రెండో టర్మ్ కూడా గెలిచి 2023లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నిటిని ఏడాది లోపు అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, రైతు బంధు, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి వంటివి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర అమలు చేసే యత్నం చేశారు.. ఇంకా అనేకం పెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలకు ఏడాదికి రూ.2500, స్కూటీల పంపిణీ, పెన్షన్‌ను రూ.నాలుగు వేలు చేయడం, దళితులకు రూ.పది లక్షల స్కీమ్ మదలైనవి ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి నిధులు అవసరం. మరీ ఎక్కువగా హమీలు ఇచ్చామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తుప్పు వదలించుకోవడానికి పదేళ్లు పడుతుందని చెప్పడం ద్వారా సమస్యను డైవర్ట్ చేయడం ఒక లక్ష్యం అయితే, మరో టర్మ్ కూడా తనను ఎన్నుకోవాలని చెప్పడం మరో లక్ష్యంగా కనిపిస్తుంంది. 👉2024లో ఎన్నికైన చంద్రబాబు కూడా నిత్యం జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతుండడం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెబితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్(Super Six Promises) అంటూ ఊదరగొట్టింది. వాటిని అమలు చేయకుండా ఏవేవో కథలు చెబుతూ, జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను వాస్తవాల నుంచి మళ్లించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని రేవంత్ చెప్పడం లేదు. ఇందులో చంద్రబాబు కూడా కష్టపడుతున్నారని చెప్పదలిచారో, లేక రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం చేయదలిచారో తెలియదు. పరిపాలనపై పట్టు రావడానికి ఇంకా సమయం కావాలని రేవంత్ చెబుతున్నారు. పదిహేను నెలల పాలన తర్వాత ఆయన ఆ మాట అనడం ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అసలు సమస్య పాలనపై పట్టు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోవడం, నిధులు లేకపోవడం , ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వస్తున్నదేమోనన్న భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన వాగ్దానాలకు ఎగనామం పెడుతూ, వాటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అంటూ అరాచకాలు సృష్టించడానికి, గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విద్వంసకర పాత్ర పోషిస్తోంది. హామీల అమలు యత్నంలో చంద్రబాబు కన్నా రేవంత్ కాస్త బెటర్. కానీ ఇద్దరూ గతం తవ్వుతూ కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్‌కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్‌కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. -
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
పవన్ కల్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. అమలు చేయమంటే నిధులు లేవంటూ చెబుతున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమయంలో చెప్పినట్లు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని నిలదీశారు.‘‘గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దళితులు, గిరిజనుల భూములను పెద్దలు కొట్టేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పరిపాలన గాలికి వదిలేశాడు. సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇలా తిరగడానికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?. పవన్ కల్యాణ్‌కి దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. చంద్రబాబు ఆలోచించాలి’’ అంటూ రామకృష్ణ చురకలు అంటించారు.చంద్రబాబుపై సీపీఎం ఫైర్నెల్లూరు: సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల మాత్రం మురికి కుపాలలో దోమలతో జీవనం సాగిస్తున్నారన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నారు’’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. -
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్‌కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్‌కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
బాలినేని.. జగన్ గురించి మాట్లాడే స్థాయేనా నీది?
ప్రకాశం, సాక్షి: జనసేన ఆవిర్భావ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. వైఎస్సార్సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే.. అడ్డగోలుగా అకమార్జనకు పాల్పడ్డారని, పైగా కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైఎస్సార్సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాలినేని.. నీ మంత్రి పదవి త్యాగం చేశావా?. కనబడ్డ భూమి అంతా కబ్జా చేశావ్. ఒంగోలులో బ్రాహ్మణుల భూమి కాజేశావు. వేల కోట్ల రూపాయలతో సామ్రాజ్యం నిర్మించుకున్నావ్. నీ చరిత్ర ఏంటో మొత్తం ప్రకాశం జిల్లాకి తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ద్వారానే కదా నువ్వు వైఎస్సార్‌కు బంధువైంది. అలాంటిది జగన్ వెంట నడవడానికే నెలల తరబడి ఆలోచించావు కదా?. నువ్వు ఆస్తులు అమ్ముకున్నావా?. మీ నాన్న ఆస్తి ఎంత ఉంది.. ఎక్కడ అమ్మావు?. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రష్యా వెళ్తావు. కాసినోకు వెళ్తా అని నువ్వే చెప్పావు.. బహుశా ఆస్తి అంతా అక్కడే పోగొట్టావా?. మొదటి నుండి నువ్వొక టీడీపీ కోవర్టువి. ఆ పార్టీలో కుదరక పోవడంతోనే జనసేనలో చేరావ్. నీలాంటి వాడికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) గురించి మాట్లాడే స్థాయి ఉందా?’’ అంటూ వైస్సార్సీపీ ఒంగోలు ఇంచార్జ్ కామెంట్స్ చుండూరి రవి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఓటమికి బాలినేనే కారణమని మాజీ పీడీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య ఆరోపించారు. బాలినేని గ్రూపులు చేసి పార్టీని భ్రష్టుపట్టించారు. ఇక్కడి విషయాలు జగన్ దాకా చేరకుండా అడ్డం పడ్డారు. ఇప్పుడు ఆయన పార్టీని వీడాక స్వేచ్ఛగా ఉంది. అధికారం అనుభవించి కోట్లు పోగేసుకున్న బాలినేని.. ఇప్పుడు ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారాయన. -
ఇప్పటికైనా మించిపోయింది లేదు! ఇకనైనా..
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది. చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు. 👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్‌అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్‌ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్‌లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్‌గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
‘సకల శాఖ మంత్రి నారా లోకేష్’: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్‌తో ఆలోచించారా? అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్‌కు కానరాలేదా?. కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్శిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా?. మేము తెచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగన్ తెచ్చిన మార్పులను చూసి ఇతర రాష్ట్రాలే మెచ్చుకున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేశారా?. ఇంగ్లీషు మీడియం, టెక్నాలజీ అభివృద్ధి, పిల్లలకు యూనిఫాం, షూస్ కూడా ఎందుకు ఇవ్వలేక పోయారు?..పిల్లల పుస్తకాలు, రేషన్ సరుకులు, కుట్టు మిషన్లు, సైకిళ్లు, శ్మశానాలతో పాటు అప్పడాలు మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేశారు. యూనివర్సిటీలో క్వాలిటీ చదువులు చెప్పించాం. అలాంటి యూనివర్సిటీలోని 17 మంది వైస్ ఛైర్మన్లను బెదిరించి రాజీనామాలు చేయించారు. 9 నెలలపాటు వీసీలు లేకుండానే యూనివర్సిటీలను నడిపిన నీచ చరిత్ర ఈ ప్రభుత్వానిది. టీడీపీ నేతల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిన నీచ చరిత్ర చంద్రబాబుది. చివరికి క్లాసు రూముల్లో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన నీచ చరిత్ర టీడీపీది. మీ అవసరాలకు యూనివర్సిటీలను వాడుకున్నారేగానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ మంచి ఐనా చేశారా?. ఇప్పటికైనా జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించాలి’’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. -
జనసేన టీడీపీ మధ్య ఇసుక వేస్తే భగ్గుమనేలా..!
కృష్ణా, సాక్షి: ఏపీలో కూటమి నేతల మధ్య ‘ఇసుక మాఫియా’ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ విషయంలోనూ టీడీపీనే పైచేయి సాధిస్తోంది. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఇసుక పంచాయతీ కొట్టుకునేదాకా తీసుకెళ్లింది. ఆ వీడియోలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడాలేకుండా ఇసుక తరలిస్తూ.. పార్టీకి చెందిన వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన తరఫు వాళ్లకు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసి రేటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేనవాళ్లను అసభ్యంగా తిట్టడంతో అది బాహాబాహీకి దారి తీసింది. ఇరు పార్టీల వాళ్లు అర్ధరాత్రి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్ వైజర్ అఖిల్‌కు గాయాలయ్యాయి. అనంతరం గొడవ.. ఘంటసాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు కాంప్రమైజ్‌కు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి లారీ, జేసీబీని సీజ్ చేశారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు , అల్లుడు రంగంలోకి దిగారు. కేసు లేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
విపక్ష సభ్యులను కించపరచడమే కూటమి నేతల పనా?: బొత్స
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్‌లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు’’ అని బొత్స ధ్వజమెత్తారు.‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
బాబుగారూ.. భయపడుతున్నారా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చెప్పిన విషయాలు గమనించదగినవే. తన సీనియారిటీని కూడా పక్కనబెట్టి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి ఎన్నికలకు ఎలాగోలా కష్టపడి మోదీని, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. బీజేపీ వారి వద్ద భయం, భయంగా గడపాల్సిన పరిస్థితిలో బాబు ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాలలో కలుగుతోంది. .. బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను తానే నిర్ణయిస్తాననే దశ నుంచి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఎంపికను మౌనంగా ఆమోదించే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని సొంత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోదీని పొగడడం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పలువురు భావిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది తెలుసు. 1996, 1998 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఈయన. ఆ రోజుల్లో వామపక్షాలతో పొత్తులో ఉన్నారు. 1998 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి సరిగ్గా 12 సీట్లు తక్కువ అవడం, బీజేపీ వారు ఈయన్ని సంప్రదించడం, వెంటనే కనీసం మిత్రపక్షాలతో కూడా చెప్పకుండా ఎగిరి గంతేసినట్లు మద్దతు ఇచ్చేశారు. దాంతో 1999లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. ఇక.. కార్గిల్ యుద్ద వాతావరణం, వాజ్‌పేయిపై ఏర్పడిన సానుభూతి చంద్రబాబుకు కలిసి వచ్చాయి. 👉తదుపరి ఒక దశలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్దమైనట్లు కనిపించారు. గుజరాత్ మారణకాండ, మత హింసకు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు భావించారు. బీజేపీ నాయకత్వం మోదీని తప్పిస్తోందన్న సమాచారాన్ని నమ్మి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మోదీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకునేసరికి ఈయన ఇరకాటంలో పడ్డారు. బీజేపీని వదలుకోవడానికి సిద్ద పడలేదు. పార్లమెంటులో ఓటింగ్ సమయానికి టీడీపీ ఎంపీలు లేకుండా వెళ్లిపోయారు. 2004లో బీజేపీతో కలిసి పోటీచేసినా ఓటమి చెందారు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు. 👉కట్ చేస్తే.. 2009లో వామపక్షాలతోపాటు బీీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంథా మార్చుకుని 2014 నాటికి మోదీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆరోజుల్లో వైఎస్సార్సీపీతో పొత్తుకు బీజేపీ యత్నించినా, జగన్ ఒప్పుకోకపోవడం కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతుఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి బీజేపీతో మళ్లీ విబేధించారు. 👉 2019 ఎన్నికలలో బీజేపీ గెలవకపోవచ్చని, మోదీ మళ్లీ ప్రధాని కారని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీపైన, మోడీపైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోదీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ మోదీ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఏపీలో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మోదీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారని అంటారు. 👉పవన్ తొలుత బీజేపీకి దగ్గరై, తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు.ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకు వచ్చినా, జగన్ సిద్దపడలేదు.అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ సిక్స్ హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా, గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు. 👉ఒకప్పుడు తానే మోదీకన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోదీ వరసగా గెలుస్తూ వస్తూ అధికారం నిలబెట్టుకున్నారట. గతంలో సీబీఐ, ఈడి వంటి వాటిని మోదీ ప్రయోగిస్తున్నారని ఆరోపించే వారు. బహుశా దాని ద్వారానే మోదీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలకు సరిగా చెప్పాలని ఆయన అంటున్నారు. 1995 నుంచి చంద్రబాబు వాడుకుంటున్న విధంగా మీడియాను మరెవరైనా వాడుకోగలిగారా? అయినా తను ఓడిపోయినప్పుడు ప్రచారం సరిగా లేదని అంటున్నారు. చంద్రబాబు ప్రజలకు విపరీతమైన హామీలు ఇవ్వడంతో పాటు పొత్తుల వ్యూహాలలో సఫలం అయినప్పుడు గెలిచారు. హామీలు నెరవేర్చక ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఆ విషయం చెప్పరు. 2004, 2019లలో ఓటమికి ప్రచార లోపమే కారణం అంటున్న చంద్రబాబు 2009లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో చెప్పలేదు. 👉2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బాగా పనిచేయబట్టి,ఆయన ప్రజలకు బాగా చెప్పగలిగినందువల్లే గెలిచారని అనుకోవాలా? 2024లో జగన్ ఓటమికి కూడా అదే కారణం అని ఎందుకకు అనుకోరాదు? పైగా టీడీపీ జగన్ టైమ్ లో చెప్పినన్ని అబద్దాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన అసత్య ప్రచారాలు, వదంతులు అన్ని చూస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుందేమో! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎగనామం పెట్టడం జరుగుతుంటున్నది సర్వత్రా ఉన్న భావన. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహారు రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పనిచేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. 👉కొత్త డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికి ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. వైసీపీ సభ్యులొకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా, లోకేష్ జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే.. బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్ని సంకేతాలు అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పెద్ద ఎత్తున చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వైఖరి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నదో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వాగ్దానాల అమలుకన్నా, ప్రత్యర్ధులను వేధించి, జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్లను వాళ్లను కప్పేసి ఉంటుంది కనుక ఆ హితోక్తి వారి చెవికి ఎక్కకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
విశాఖపట్నం, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ ఇప్పటిదాకా కాలేదు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ అన్నారు. -
టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం
నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్చల్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
లోకేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకే ఇదంతా: పోసాని
సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. ‘‘విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య స్నేహం ఉంది. స్నేహం లేకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు ఇల్లు అద్దెకు ఇచ్చారు’’ అని కాకాణి ప్రశ్నించారు.‘‘వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు. జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు’’ అని కాకాణి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది. తెలిసే ఇదంతా చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలుగుతోంది’’ అని కాకాణి అన్నారు. -
యువత పోరు విజయవంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొదలైంది
సాక్షి, తాడేపల్లి: విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత పోరు' విజయవంతం అయ్యిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన 15 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతోంది. అందుకే వైఎస్సార్సీపీ పక్షాన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా వైఎస్ జగన్ పాలన, పార్టీ విధానాలతో ఏకీభవించి ఎంతోమంది మేధావులు మాకు అండగా నిలుస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటం చేస్తున్నాం.ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులు యువత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపైన పోరాటానికి ముందడుగేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత తరలిరావడం చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలికూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను ప్రభుత్వం గాలికొదిలేసింది. పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యాదీవెన, వసతి దీవెనకు గాను గతేడాదికి సంబంధించి రూ. 3,200 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మరో రూ. 3,900 కోట్లు చెల్లించాలి. మొత్తంగా రూ. 7,100 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ. 2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ. 3 వేలు చెల్లిస్తామని చెప్పి యువత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాది బడ్జెట్లో సైతం పథకం ఊసెత్తలేదు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారుగత ప్రభుత్వంలో పేదవారికి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన వైఎస్ జగన్, ఐదేళ్లలోనే 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ఇచ్చారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటుండగా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో పక్కన పెట్టారు. కేంద్రం సీట్లు ఇస్తామని ముందుకొస్తే వద్దని ఐఎంఏకి లేఖలు రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఆ విధంగా మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థులను కలను చంద్రబాబు నాశనం చేశాడు. కమీషన్ల కోసం కార్పొరేట్లకు మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసే కార్యక్రమానికి తెరలేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు 9 నెలలకే ప్రజా స్పందన ఈ స్థాయిలో ఉందంటే, హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఏ స్థాయికి పెరుగుతుందో కూటమి నాయకులే అంచనా వేసుకోవాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ తరఫున రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమం చేశాం. ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశాం. సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం భయపడిపోతోంది. నిరసన కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు.వారం రోజుల నుంచే నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులను అనుమతి కోరుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేశారు. అడుగడుగునా నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని నిర్బంధాలను దాటుకుని ఈ రోజున యువత పోరు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా హామీల అమలుపై దృష్టిసారించాలి. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్‌కి పేరొస్తుందనే ఆలోచన వీడాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి. తక్షణం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్‌తో టైం పాస్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విద్యార్థులు, యువత పక్షాన నిలబడి వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. -
‘రఘురామకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఎందుకిచ్చారు?
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి ఆరోపణలు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారు?. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైఎస్సార్సీపీ ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా?’’ అంటూ సుధాకర్ బాబు నిలదీశారు.‘‘రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు?. రఘు రామ కృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు?. అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు?. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. ఆయనే స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది?. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.‘‘మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు?. కేసులకు, వైఎస్సార్సీపీ నేతలకు లింకు పెట్టవద్దు’’ అంటూ సాయిరెడ్డికి సుధాకర్‌బాబు హితవు పలికారు. -
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025 -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయటంలేదని దుయ్యబట్టారు.‘‘ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశ పెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగింటి ఆడపిల్లలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్‌ని కాపీ కొట్టి.. శక్తియాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘జగన్ మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారు. మహిళాభ్యుదయం జగన్ వలనే సాధ్యమైంది. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు చెప్పకుండా జగన్ గురించి విమర్శలు చేయటం బాధాకరం. చంద్రబాబు తన ఆస్తిలో చెల్లెళ్లకు ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి. తల్లికి ఏం ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖలో తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేయగా.. 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కిందటి ఏడాది నవంబర్‌లో విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. -
కూటమి కుట్ర.. ఐదు కేసుల్లో చెవిరెడ్డికి నోటీసులు
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఐదు కేసుల్లో వైఎస్సార్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో చెవిరెడ్డి స్పందిస్తూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కౌంటరిచ్చారు.ఏపీలో కూటమి పాలనలో పోలీసులు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమాలని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దరవీడు పోలీసులు చెవిరెడ్డికి నోటీసులిచ్చారు. ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారవీడులో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులపై చెవిరెడ్డి స్పందించారు.అనంతరం, చెవిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వైఎస్సార్సీపీ ఉద్యమాల నుంచి పుట్టినపార్టీ. మా నాయకుడు వైఎస్ జగన్ పోరాటాలతో ఎదిగిన వ్యక్తి. ప్రజల మద్దతుతోనే మేము ముందుకు సాగుతాం’ అని అన్నారు. -
పోసాని లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ
అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం. పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా.. ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది. ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందింది. ఈ ఉదయం కర్నూల్ జిల్లా జైలుకు పీటీ వారెంట్‌తో చేరుకుంది. ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్‌ను సవాల్ చేసింది. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం.. కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్‌ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.— Subramanian Swamy (@Swamy39) March 12, 2025అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాతో నడుస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం(YSRCP 15th Formation Day) సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారాయన.‘‘నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్(YSR) గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. .. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది.క్లిక్ చేయండి: జనం జెండా.. ఈ చిత్రాలు చూశారా?.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల చిత్రాలను షేర్ చేశారాయన.ఇదీ చదవండి: 3-4 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే! -
ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి.. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?. మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?. పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా. -
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
ఎవరికి చెక్ పెట్టేందుకు.. గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి..
రాజాం : టీడీపీని నమ్ముకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి భంగపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూతురుకు నిరాశే మిగిలింది. తల్లీకూతుల్లిద్దరు ఇంటిముఖం పట్టేశారని అందరూ అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇంతలోనే కుమార్తెకు నామినేటెడ్ పదవి ఇచ్చి కొంతమేర ఉపశమనం. ఆ పదవి కూడా రాకుండా అడ్డుకున్న మరో వర్గానికి మరో షాక్ తగిలేలా ఎమ్మెల్సీ పదవి ఆమెకు లభించింది. ఆమె రాజాం నియోజకవర్గంలో సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ. ఈమె తల్లి కావలి ప్రతిభా భారతి సీనియర్ టీడీపీ నాయకురాలు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా పని చేశారు. 27 ఏళ్లకే ఎన్టీఆర్ మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గాల విభజన తరువాత వరుసగా రాజాం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి కోండ్రు మురళీమోహన్ టీడీపీలోకి వచ్చి ప్రతిభా భారతికి 2019లో టిక్కెట్ దక్కకుండా చేశారు. 2024లో ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం ప్రయత్నించగా, ఆమెకు కూడా టిక్కెట్ రాకుండా అడ్డుకట్టు వేసి టిక్కెట్ తాను దక్కించుకోవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు సిట్టింగ్ అభ్యర్థి, సీనియర్ నాయకురాలైన కావలి ప్రతిభాభారతి కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా చేశారు. దీంతో అటు ప్రతిభాభారతితో పాటు ఆమె కుమార్తె గ్రీష్మ విశాఖపట్నంకు పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలకు సొంత ఆస్తులు తగలబెట్టడమే కాకుండా అధికార పార్టీపై ఇష్టానుసారం మాటలిసిరిన కావలి గ్రీష్మకు నిరాశే మిగిలింది. అనంతరం జరిగిన పరిణామాల్లో గ్రీష్మకు టీడీపీ ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీగా టిక్కెట్ లభించింది. ఆశావహులకు చెక్ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు, సీనియర్ నేతలు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల నిమిత్తం ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, బొబ్బిలి చిరంజీవులు, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు, తెంటు లక్షున్నాయుడు తదితరులు ఉన్నారు. కావలి గ్రీష్మకు మూడు నెలలు క్రితమే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో ఆమె పేరు ఎవరూ ఊహించలేదు. కిమిడి నాగార్జున, గొంప కృష్ణ, కొల్ల అప్పలనాయుడు, కేఏ నాయుడులాంటి నేతల పేర్లు తప్పించి, గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి రావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవి వెనుక రాజాం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత హస్తం ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరికి చెక్ పెట్టేందుకు.. రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా కోండ్రు గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించారు. కనీసం విప్‌గా అవకాశం వస్తుందని చూశారు. ఈ రెండు లేకపోయేసరికి ఆయన వర్గంలో అలజడి ప్రారంభం అయ్యింది. కోండ్రు కూడా పెద్దగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, ఇక్కడ ఉండడం లేదనే గుసగుసలు ఉన్నాయి. అతని సోదరుడు జగదీష్ కనుసన్నల్లోనే మొత్తం తంతు జరుగుతోంది. దీంతో కావలి ప్రతిభాభారతి వర్గీయులతో పాటు కిమిడి కళావెంకటరావు వర్గీయులు, ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని అధిష్టానానికి చేరవేశారని తెలుస్తుంది. ఫలితంగా కావలి గ్రీష్మకు ఎన్ఫోర్స్మెంట్ చైర్మన్ పదవి ఇచ్చి తెరమీదకు తెచ్చినా ఆమెకు ఎమ్మెల్యే వర్గం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో టీడీపీ పాత వర్గానికి లోకేష్ టీం జీవం పోసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళీమోహన్‌తో సమానంగా కావలి గ్రీష్మకు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, కార్యక్రమంలో కుర్చీ వేయాల్సి ఉంటుందని, కోండ్రుకు చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇంకో వైపు సంతకవిటి మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా ఈ ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆయనకు ఈ పదవి ఇవ్వకపోవడంతో సంతకవిటి మండలంలో కొల్ల వర్గీయులు టీడీపీ తీరును తప్పుపడుతున్నారు. అడ్రస్ లేని ఆ నేతలు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా, జిల్లాకు పెద్ద దిక్కు గా కిమిడి నాగార్జున వ్యవహరించారు. 2024లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆయనకు దక్కకుండా పార్టీ వ్యవహరించింది. కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డ ఆయనకు నిరాశే మిగిలింది. ఆయన పేరు ఈ నామినేటెడ్ పదవుల్లో అడ్రస్ లేకుండా పోయింది. గొంప కృష్ణ, కేఏ నాయుడు, కొల్ల అప్పలనాయుడు తదితర నేతల పరిస్థితి కూడా ఇదే మా దిరిగా మారింది. వీరిప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని కక్కలేని, మింగలేని పరిస్థితిలో ఉన్నారు. -
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
ఏంటి సీనియర్ మరీ ఇలా చేశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ చివరి అభ్యర్థి పేరును ప్రకటించారు. బీజేపీ తరఫున పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేశారు. తద్వారా గత ఎన్నికల టైం నుంచి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలకు అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో.. చంద్రబాబు తన మార్క్ రాజకీయం నడిపించారు. ఒరిజినల్ బీజేపీ నేతలకు సీట్లు దక్కకపోవడంతో సంఘ్‌పరివార్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. ఎమ్మెల్యే, ఎంపీ సీటు దక్కుతుందని ఆయన ఆశించినా.. అది నెరవేరలేదు. సామాజిక సమీకరణాలను కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ అధిష్టానం తప్పు చేసిందనే చర్చ విపరీతంగా నడిచింది. అయితే ఆ తప్పును వీర్రాజు ఎంపిక ద్వారా అధిష్టానం ఇప్పుడు సరిద్దుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ప్రచారంలో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సినియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పవర్ బ్యాలెన్స్ చేసేందుకు ఆయన సామాజిక వర్గాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. మూడు టీడీపీ తీసుకుంది. ఒకటి జనసేన(కొణిదెల నాగబాబు), మరొకటి బీజేపీకి కేటాయించింది. -
‘యువతను నమ్మించి దగా చేసిన చంద్రబాబు సర్కార్’
సాక్షి, విజయవాడ: ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. విద్యార్థులకు అండగా ఉండాలని ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని అవినాష్ మండిపడ్డారు.‘‘జగన్ హయాంలో ఉన్నత విద్యను అందించి పథకాలు అమలు చేసింది. కూటమి ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలను నాశనం చేసింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను నాశనం చేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 12వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కార్యక్రమాలు చేపడతాం’’ అని అవినాష్ తెలిపారు.కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం: స్వామిదాస్మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ‘‘విద్యతోనే సముల మార్పు సాధ్యం.. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జగన్ పిలుపు మేరకు 12వ తేదీన ఫీజు పోరు చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను అమ్ముకొని కార్పొరేట్లకు ఊడిగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తప్పులు సరిచేసుకోవాలి. సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలు మాయం చేశారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాలు ఒప్పుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారు: మొండితోక జగన్మోహన్రావుమాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్సార్, జగన్ హయంలో పేద ప్రజలు ధీమాగా ఉండేవారు. చదువు విషయంలో బెంగ పడేవారు కాదు. జగన్ మంచి చేస్తారనే నమ్మకం వారిలో ఉండేది. మెడికల్ కాలేజీలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తప్పులు బయటపడతాయని వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని జగన్మోహన్రావు హెచ్చరించారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ ద్రోహం: భూమన
సాక్షి, తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
ఆగని ‘కూటమి’ వేధింపులు.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్!
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్‌కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
అలా జరుగుంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని: కిరణ్ అబ్బవరం
తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతడు.. గతేడాది రిలీజైన 'క' మూవీ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు 'దిల్ రుబా'తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కిరణ్ అబ్బవరం ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవాడు అని యాంకర్ అడగ్గా.. 'రాజకీయాలంటే నాకు ఎంతో ఇష్టం. ఒకవేళ యాక్టర్ కాకపోయుంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టేవాడ్ని. ప్రజలతో మమేకం కావడం నాకు నచ్చుతుంది. నాది రాయలసీమ కావడంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలని దగ్గరి నుంచి చూశాను. బహుశా అందువల్లే నాకు వాటిపై ఆసక్తి పెరిగింది అనుకుంటా.'(ఇదీ చదవండి: 'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!)'నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు.. చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడి ఏడ్చేశాను' అని కిరణ్ చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని అన్నాడు.ఇకపోతే భవిష్యత్తులో వ్యాపార చేయాలనుకుంటున్నాను. ఫుడ్ బిజినెస్‌లో రాణించాలనేది నా ఇంట్రెస్ట్. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాను' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.'దిల్ రుబా' సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది. ప్రేమకథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ థిల్లాన్ హీరోయిన్.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
అబద్ధాల్లో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
మహిళలకు టోకరా.. ఉచిత బస్సుపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి, విజయవాడ: మహిళ దినోత్సవం ముందే మహిళలకు కూటమి సర్కార్ టోకరా వేసేసింది. ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాసన మండలి సాక్షిగా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుంచైనా ఉచిత బస్ ప్రయాణం అంటూ ప్రకటనలు హోరెత్తించారు. ప్రతి సభలో ఎక్కడ నుండి ఎక్కడవరకైనా ఉచితం అంటూ చంద్రబాబు ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చేసింది. దీంతో సోషల్ మీడియాలో మహిళలు తీవ్రంగా మండి పడుతున్నారు.ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని ప్రదర్శించిన చంద్రబాబు తాను బురిడీ బాబునని మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.. చివరికి జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెలవిచ్చారు. -
ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్ తెలిపారు. -
అఫీషియల్: జగన్ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!
అమరావతి, సాక్షి: వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.2014 జూన్ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి 2023-24.. జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇదిపబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.అప్పులపై బాబు అబద్ధాలుచంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది. -
కూటమి పెద్దలు.. ష్.. గప్‌చుప్..!
ఏపీలో అధికార కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన పక్షం.. విపక్ష వైఎస్సార్సీపీ ఆత్మస్థైర్యంతో సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు సైతం చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల తరపున వేస్తున్న ప్రశ్నలకు కూటమి పెద్దలు గుటకలు మింగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలను ప్రజల ముందు ఉంచడంలో జగన్ సఫలమయ్యారు. జగన్ తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ల అసత్యాల చిట్టాను బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్‌లు ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి వచ్చిన అబద్దాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. జగన్ మాటలు వింటే వీరిద్దరు అపరాధ భావనతో కుంగిపోవాలి. అబద్దాలతో ప్రజలను మోసం చేశామన్న సంగతి తెలిసిపోతుందే అని సిగ్గుపడాలి. అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటివాటిని పట్టించు కోకపోవచ్చు!. అయితే..ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది, టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్లకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాలలోను, సామాజిక, ఆర్ధిక సర్వేలోను ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై నోరు మెదపలేకపోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక మాదిరి అవుతోందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేశాయి. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు బాగా అర్ధమైంది. ఇక.. తెలుగుదేశం తన వెబ్సైట్లో జగన్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ ,లోకేష్‌లు పది నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన అంకెలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్లందరిని పోగు చేసి విష ప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు. 👉ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తి అయ్యేనాటికి అప్పు రూ.4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు సుమారు రెండు లక్షల కోట్లు, విభజన నాటికి ఉన్న అప్పు రూ.95 వేల కోట్లు కూడా ఉంది. అంటే జగన్ టైమ్ లో రెండు లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కాని ఈనాడు 2023 ఫిబ్రవరి 14న ఒక కథనాన్ని ఇస్తూ పార్లమెంటులో అప్పటికి రూ.4.24 లక్షల కోట్ల అప్పే అని చెప్పినా, ఏపీ అప్పు రూ.9.25 లక్షల కోట్లు అని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చి వాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది కదా! ఆ రహస్య అప్పులేవో బయటపెట్టి ఉండవచ్చు కదా! అంటే అప్పుడు కావాలని అబద్దాలు ప్రచారం చేసి పాఠకులను ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మోసం చేసినట్లే కదా! 👉ఈ విషయంపై జగన్ కాగ్, ఆర్థిక సర్వేలలోని అంకెలను చూపుతూ ప్రశ్నించారు. దానికి అటు టీడీపీ నుంచి కాని, ఇటు ఎల్లో మీడియా నుంచి కాని సౌండ్ లేదు. అంతేకాదు... ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా, అప్పుడే చంద్రబాబు సర్కార్ రూ.70 వేల కోట్ల అప్పు చేయగా, మరో రూ.డెబ్బైవేల కోట్ల అప్పు సమీకరిస్తోంంది. ఇక సూపర్ సిక్స్‌కు గుండుసున్నా అంటూ కూటమి ఇచ్చిన ఒక్కో హామీని చదివి వినిపిస్తూ జగన్ అస్త్రాలు సంధించారు. అయినా కూటమి నేతలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేదు.ఇవే కాకుండా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన 143 వాగ్దానాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. సూపర్ సిక్స్ హామీలకే రూ.79179 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ.17,179 కోట్లు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆర్ధిక మంత్రి కేశవ్ వివరణ ఇవ్వలేకపోయారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఇప్పటికే బాకీ పడ్డారని, వచ్చే ఏడాది కూడా ఇవ్వడం లేదని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని, దాంతో అది రూ.36 వేలు అయిందని ఆయన చెప్పారు. అలాగే నిరుద్యోగులకు కూడా అదే ప్రకారం రూ.72 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున బాకీ పడ్డారని అంటూ ఆయా స్కీముల పరిస్థితి, ప్రజలు ఏ మేర కూటమి చేతిలో మోసపోయింది ఆయన విశ్లేషించి చెప్పారు. ఫించన్వెయ్యి రూపాయలు పెంచినా నాలుగు లక్షల పెన్షన్లలో కోత పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైందని అడిగారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ చిన్నదే అయినా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆయన కడుతున్న అమరావతిని రాయలసీమ నుంచి కూడా ఉచిత బస్‌లలో వచ్చి చూద్దామనుకున్న మహిళలకు నిరాశ మిగిల్చారని జగన్ ఎద్దేవ చేయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక, వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కాని అందులో కూడా అబద్దాలు చెప్పడం ఏమిటని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు, అప్పుల కింద రూ.31 వేల కోట్లు ఎలా తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కాని, మున్సిపల్ మంత్రి నారాయణ కాని నోరు విప్పడం లేదు. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట. తనకు చంద్రబాబుతో వైరం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అన్నారు. మరో వైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ఎలా చెబుతున్నారు. చివరికి వైఎస్సార్సీపీ వారికి టీడీపీ వారు ఎవరైనా బంధువులు ఉన్నా, వారు కలుసుకున్నా పార్టీలో ఒప్పుకోవడం లేదట. చంద్రబాబు, దగ్గుబాటి కలవవచ్చు కాని, వేర్వేరు పార్టీలలో ఉన్న బంధువులు కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ ఈ పరిణామాన్ని గుర్తించి, వైఎస్సార్సీపీలో లేదా ఇతర పార్టీలలో ఉన్న తమ బంధువులతో గొడవలు పడవద్దని సలహా ఇవ్వాలి. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న డైలాగును జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని విడమరిచి చెప్పగలిగారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్తోసహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కూటమి సర్కార్ ప్రతిష్ట దెబ్బతింటుండడంతో ఎర్రబుక్ పేరుతో వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్ర దండం లేదని చెబుతూ, చంద్రబాబు బ్రాండ్ ఉందని అన్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్దాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు, పవన్ ,లోకేష్ లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
అన్నదమ్ముల మధ్య ముదిరిన వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తొమ్మిదేళ్లుగా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలను ఈ దఫా ఒంగోలు నగరంలో నిర్వహించడం చర్చనీయంగా మారింది. తన సోదరుడు, ఎమ్మెల్యే జనార్దన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా సత్య నగర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్, సత్యల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం రాజుకోవడంతో సత్య తన పుట్టిన రోజు వేడుకలను పట్టుబట్టి ఒంగోలు నగరంలో నిర్వహించుకున్నారు.భాగ్యనగర్‌లో జరుపుకున్న ఈ వేడుకలకు కొండపి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనార్దన్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఇకనుంచి ఒంగోలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందిని ఈ వేడుకలకు ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. అసెంబ్లీ జరుగుతుందన్న సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన ఒంగోలులో టీడీపీకి ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఒకటి భాగ్యనగర్‌లో ఉండగా, గుంటూరు రోడ్డులో జనార్దన్ ఆధ్వర్యంలోని మరో కార్యాలయం ఉంది. తాజాగా సత్య రంగ ప్రవేశంతో మూడో కార్యాలయం సిద్ధమవుతోంది. -
విద్యాశాఖ మంత్రి.. విడ్డూర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) కార్పొరేట్ కళాశాలలపై తన ప్రేమను ప్రదర్శించారు. ఈ క్రమంలో విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన. విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై శాసన మండలిలో గురువారం చర్చ జరగ్గా.. ఇందుకు తల్లిదండ్రుల ధోరణినే కారణమనే రీతిలో మాట్లాడారాయన.మండలిలో విద్యార్ధుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఏపీలో రైతుల ఆత్మహత్యల కంటే విద్యార్ధుల ఆత్మహత్యలే(Students Suicides) ఎక్కువ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. ఇటీవల ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. .. తీవ్రమైన ఒత్తిడితోనే విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. చక్రపాణి కమిటీని బయటపెట్టాలి. విద్యార్ధుల ఆత్మహత్యలను నియంత్రించాలి’’ అని అన్నారాయన.దీనికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(AP Education Minister Nara lokesh) బదులిచ్చారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. కాదనడం లేదు. కానీ, కార్పొరేట్ కళాశాలల్లో మాత్రమే కాదు యూనివర్శిటీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొంత మంది తల్లిదండ్రులు ఫీజులు కట్టేస్తున్నాం.. ఇంక మీదే బాధ్యత అనేలా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులకూ బాధ్యత ఉంటుందని అన్నారాయన.రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాల్లో యాజమాన్యాల వేధింపులతో విద్యార్థులు బలవన్మరణాలు పాల్పడుతుంది చూస్తున్నాం. అయితే ఈ అంశాన్ని సొంత పార్టీ వాళ్లే లేవనెత్తితే.. యూనివర్సిటీల్లోనూ జరుగుతున్నాయంటూ చెప్పడం విడ్డూరం. -
AP High Court: పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
తమ్ముడికి శుభాకాంక్షలు.. పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025 -
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్‌కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
Nara Lokesh: నారా లోకేష్ వింత వ్యాఖ్యలు
కందకు లేని దురద కత్తిపీటకు రావడం.. గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు రావడం అంటే ఇదే కావచ్చు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లకు.. రావాల్సిన వారి నుంచి స్పందన రాలేదు. కానీ మంత్రి నారా లోకేష్ బాబు మాత్రం సత్వరమే స్పందించారు. అంతేకాకుండా ఎవరు ఎవర్ని విమర్శించాలన్నదాని మీద ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎవరికీ తక్కువ మెజారిటీ ఉంటె వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్లను విమర్శించరాదని కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చారు. బుధవారం జగన్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘‘రెండు చోట్లా ఓడిపోయి .. దిక్కూదివాణం లేక మూడు పార్టీల పొత్తుతో గెలిచాడు.. అయన కార్పొరేటరుకు ఎక్కువ .. ఎమ్మెల్యేకు తక్కువ’’ అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ నుంచి ఎలాంటి సమాధానం.. కౌంటర్ రాలేదు.. కానీ ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్‌ను డిఫెండ్ చేస్తూ ఏదో రిప్లై ఇచ్చారు. ఇక జనసేన కన్నా ఎక్కువగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో లోకేష్ ఏకంగా పవన్ కాళ్లకు నమస్కారం చేసారు. పవన్ లేకుంటే.. బీజేపీ మద్దతు లేకుంటే తమకు ఈ అధికారం దక్కేది కాదని తెలుగుదేశంలో అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఓ వైపు పవన్‌ను కంట్రోల్ చేస్తూ ఆయనకు స్వేచ్ఛ లేకుండా నియంత్రిస్తూనే మరోవైపు పవన్‌ను డిఫెండ్ చేయడం కూడా తమదే బాధ్యత అన్నట్లుగా లోకేష్ పెద్దరికం తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఏయ్ జగన్.. నీ మెజారిటీ ఎంత.. పవన్ మెజారిటీ ఎంత.. నీకన్నా పవన్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అలాంటి నువ్వు ఆయన్ను విమర్శిస్తావా? అన్నారు. రాజకీయ విమర్శలకు మెజారిటీతో ముడిపెట్టి మాట్లాడడం సరికొత్త కాన్సెప్ట్.. లోకేష్ చెప్పినదానిప్రకారం పవన్ మెజారిటీ 70,279. కాగా జగన్ మెజారిటీ 61,687.. ఇక్కడ జగన్ కు పవన్ కన్నా తక్కువ మెజారిటీ కాబట్టి అయన పవన్‌ను విమర్శించకూడదు.. మరి ఈలెక్కన చంద్రబాబు 48,000 మెజారిటీతో గెలిచారు.. ఇది జగన్ కన్నా తక్కువే మెజారిటీ .. ఇప్పుడు లోకేష్ కొత్త కాన్సెప్ట్ ప్రకారం చంద్రబాబు కూడా తనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన జగన్‌ను విమర్శించడం.. అవహేళన చేయడం కూడా తగదు కదా!.. ఇంకా లెక్కవేస్తే గతంలో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచినా మెజారిటీ ఒక రికార్డ్.. కడప ఎంపీ స్థానానికి 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,43,053 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్. తెలుగుదేశంలో ఎవరూ ఇంత భారీ ప్రజామద్దతు పొందలేదు. తన అద్దె అన్నయ్యను కాపాడుకోవడం.. మద్దతు ఇవ్వడం ద్వారా అభిమానాన్ని పొందాలన్న దుగ్ధతో లోకేష్ కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన రూలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్ ఆఫ్ ద హౌజ్‌కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్ అన్నారు. జనసేన ఉండగా.. వైఎస్సార్సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. -
అదేమైనా మీ బాబుగారి సొమ్మా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?. జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు. -
పవన్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయ్: లక్ష్మి
తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal) తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి(Laxmi) అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె.. కాంప్రమైజ్‌కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారామె. కిరణ్ రాయల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా.. నా పిల్లలు వద్దని చెప్పినా.న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. నేను విడుదల చేసిన వీడియోలు,ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నింటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో.. కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కలవాలని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పీఏ దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ, నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లవద్దని అనుకుంటున్న అని లక్ష్మి చెబుతున్నారు. -
తల్లికి వందనంపై పచ్చి దగా.. అడ్డంగా దొరికిపోయిన లోకేష్
అమరావతి, సాక్షి: బడి పిల్లలను, వాళ్ల తల్లులను భరోసా పేరిట వంచించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం.. శాసన మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనం(Thalliki Vandanam)పై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడడం లేదు. పైగా కిందటి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా.. అమలు మాత్రం చేయలేదు. విచిత్రంగా.. ఈ ఏడాది మే నెల నుంచి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ.. ‘‘ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు?’’ అని విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే.. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్.. నిధుల లెక్కలు చూపించాలంటూ అధికారులను పురమాయించారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు. అందులో రూ.9,400 కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు. కానీ, ఇది వచ్చే ఏడాది పథకం తాలుకా నిధుల లెక్కకు సంబంధించింది. ఏపీలో పేద విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించింది. అయితే.. అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కూటమి నేతలైన పవన్, నారా లోకేష్ కూడా ఈ విషయాన్నేన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు. పైగా ఇంట్లో ఎంత మంది ఉంటే(విద్యార్థులు) .. అంత మందికీ వర్తింజేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. తీరా అధికారంలోకి వచ్చాక.. మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా విదిల్చింది లేదు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో.. 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనానికి ఎగనామం పెడుతూ .. 80 లక్షల పిల్లలు, వారి తల్లులను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మోసం చేసినట్లయ్యింది. -
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో ఇలాగే ఉంటుంది మరి!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?. ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే. అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు. సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్‌ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్‌ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్‌లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది. 2014-19 టర్మ్‌లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట. టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దోపిడీ జరిగిందన్నారు.. మరి బిల్లులెందుకు చెల్లించారు?: బొత్స
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు. రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన. అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన. -
వైఎస్ జగన్ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్‌కు మండలి లైవ్ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. -
అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్‌లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్‌లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబూ.. ఇంత బరితెగింపా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని.. విషం చిమ్మే నాయకుడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎందుకింత కక్ష అంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు చేసింది విద్వేషపూరిత వ్యాఖ్యలు.. మేం తలుచుకుంటే వైఎస్సార్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి మాట్లాడుతున్నారు’’ అని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా?. పచ్చబిళ్ల పెట్టుకున్న వాళ్ల పనులు చేసిపెట్టమన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు కొనసాగింపే చంద్రబాబు వ్యాఖ్యలు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా.. లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.‘‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. కులం, మతం చూడకుండా జగన్ పాలన చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతా వివక్షే. రెడ్డి సామాజికవర్గంపై కక్ష సాధిస్తున్నారు. దళిత ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతున్నారు. తన వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్, కేంద్రం స్పందించాలి’’ అని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.‘‘గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడే పశ్చిమ ప్రకాశంపై ఎందుకు మీకింత పగ?. వెలిగొండ ప్రాజెక్ట్‌పై నిజాలు మాట్లాడే దమ్ముందా?. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌కు నిధులు కేటాయించకుండా మాటలు చెబుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నాం. ఎర్రగొండపాలెనికి మీ శాఖ ద్వారా ఏం చేశారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వెలిగొండను సందర్శించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలి’’ అని చంద్రశేఖర్ హితవు పలికారు. -
ఏపీ బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30,000 కోట్ల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్ లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్లో దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. గతంలో వైఎస్ జగన్ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు.ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్క నెలలో మాత్రమే దానిని కార్యరూపంలో చూపించారు. గత ఎనిమిది నెలల నుంచి ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ, డీఏ ఎరియర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సకాలంలో ఇవ్వాల్సని బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.తాత్కాలిక ఉద్యోగులను మోసం చేశారుఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీని నేటికీ నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మా ప్రభుత్వం రాగానే అయిదు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింద పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకువచ్చారు. వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సీ ఉంది. గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి, వారిలో మూడు వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏడు వేల మందికి ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామసచివాలయాల్లో పదిహేను వేలు, రైతుభరోసా కేంద్రాల్లో ఆరువేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం.మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వ దగాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మెగా డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫైల్‌గా దీనిపైనే సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్ షెడ్యూల్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఇవ్వేవీ చేయకుండా బడ్జెట్లో డీఎస్సీ కింద 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే వచ్చే అయిదేళ్ల పాటు ఇదే చెప్పుకుంటూ పోతారా? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పారు.అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తున్నామంటూ బడ్జెట్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే అమలు జరిగిపోతోందోని చెప్పడం ఎంత వరకు సమంజసం? పోలీస్ విభాగంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.920 కోట్లు ఉంటే, దానిలో రూ.250 కోట్లు చెల్లించామని చెప్పుకున్నారు. మిగిలిన బకాయిల విషయం ఏమిటనే దానిపై స్పష్టత లేదు.ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు డీఏలు బకాయి పెట్టారు. ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే డీఏ ఇస్తుంటారు. దానిని కూడా మూడు విడతలు బకాయి పెట్టడం దారుణం. నిరుద్యోగభృతి అమలుకు కేటాయింపులు లేవు. కొత్త ఉద్యోగాల భర్తీకి గానూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదీ? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకు గత ప్రభుత్వం అప్కాస్ ను తీసుకువచ్చింది. దానిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం దళారీల వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు సంబంధించిన హెల్త్ కార్డ్ లకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటాను వారు చెల్లిస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోలీసులను ఒక్కటే అడుగుతున్న.. వల్లభనేని వంశీ భార్య ఎమోషనల్
-
వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేస్తున్నారు: పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినపుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు.‘‘ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు కాదా?. వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా. వంశీని ఇబ్బందులు పడుతున్నారు’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.చంద్రబాబు కుటిల రాజకీయం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్ ఉండి, ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో వంశీని ప్రథమ ముద్దాయిగా పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతిఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు?. 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్‌ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుందిహోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా?. జబర్దస్త్ నటులతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..?.కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్‌ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలి, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారు. వంశీకి వైఎస్సార్‌షీపీ పార్టీ అండగా ఉంటుంది. వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. -
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..
సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.దీపం పథకానికి భారీగా కోత దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు టోకరాడ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్లో చూపించలేకపోయింది.అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతేఅన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్‌ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు.. -
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే! -
కూటమి కక్ష.. పోసాని కృష్ణమురళీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి.కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబుఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు. -
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్ నిరంకుశ వైఖరి’
సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. -
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్సగవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్‌పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం. వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్‌తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు. -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వాల్సిందే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన కోసం కాదని.. అసెంబ్లీలో ప్రజల తరఫున పోరాటం చేయడానికి తగిన సమయం కోసం అడుగుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను నమ్మడం వల్లే ప్రజలు వారికి పట్టం కట్టారని.. చంద్రబాబు అబద్ధాలు నమ్మడం లేదని పవన్‌తో పచ్చి అబద్ధాలు మాట్లాడించారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటున్న పవన్ కళ్యాణ్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పోషిస్తాడా..?. ప్రజల తరఫున పోరాటం చేస్తావా..?. నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల నువ్వు చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నావా..?. నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకో. పవన్, షర్మిలను వినియోగించుకుని చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు. సమర్థమైన చర్చలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎలా జరుగుతాయి..?’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.‘‘మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ప్రజలు సమర్థించరు. సభ్యత్వం పోతోందంటున్నారు. సోనియాపై పోరాటం చేసిన చరిత్ర జగన్‌ది. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే 5.46 లక్షల ఓట్లతో ఆనాడు ఎంపీగా గెలిచిన వైఎస్ జగన్ ముందు మీరు ఫ్లూట్ ఊదుతున్నారా..?. మీరు కోర్టుకు ఇంతవరకూ ఎందుకు అఫిడవిట్ వేయడం లేదు..?. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జరిగే నష్టం ప్రజలకే. అధికారపక్షంతో పాటు ప్రతిపక్షం ముఖ్యమే. జగన్ చరిష్మా, సామర్థ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. ఆయన అడుగు బయటపెడితే జనం ప్రభంజనంగా వస్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడవద్దు.. జన ప్రభంజనంలో కొట్టుకుపోతారు. నువ్వు హామీగా నిలబడ్డ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. పవన్ కళ్యాణ్.. ఇప్పటీకైన మేలుకో.. లేదంటే చంద్రబాబు నిన్ను ముంచేస్తాడు. షర్మిల.. మీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన పార్టీలతో పోరాడుతున్నారా? లేక వ్యక్తిగత ఎజెండా అమలు చేస్తున్నావా..?’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు. -
పిఠాపురం జనసేనలో ‘కోడ్ చిచ్చు’
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్ వైశాలి వివరణతో మరింత ముదిరింది. పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్చల్ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updatesమంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స ఆగ్రహం👉వీసీలను ఒకేసారి రాజీనామా చేయించారు👉బలవంతంగా చేయించకపోతే దాని మీద లోకేష్ విచారణ కు సిద్ధమా👉విచారణ జరిపిస్తే.. మేము నిరూపిస్తాం👉విచారణ వేయడానికి ఎందుకు భయ పడుతున్నారుశాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదుఏపీ శాసన మండలి:వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.👉రైతులను మోసం చేశారు👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు👉సాఫ్ట్వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?👉వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలుప్రారంభమైన శాసన మండలి సమావేశాలు👉వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశంఅసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్‌తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. -
చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది!
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి. సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు. 👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు. వైఎస్ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం. ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట. 👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది. 👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది. ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారుఅసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే.. ⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది. ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా! ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ(YSRCP) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ఆ హోదా దక్కేది.ఓట్ల శాతం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్ అవ్వండి’’ అని పవన్ వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు.ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం!