
సాక్షి, నెల్లూరు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. ‘‘విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య స్నేహం ఉంది. స్నేహం లేకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు ఇల్లు అద్దెకు ఇచ్చారు’’ అని కాకాణి ప్రశ్నించారు.
‘‘వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు. జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు’’ అని కాకాణి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది. తెలిసే ఇదంతా చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలుగుతోంది’’ అని కాకాణి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment