చంద్రబాబు అంకెల గారడీ: కాకాణి | Ex Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu Drama Titled Vision 2047 | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అంకెల గారడీ: కాకాణి

Published Fri, Jan 17 2025 4:51 PM | Last Updated on Fri, Jan 17 2025 5:56 PM

Ex Minister Kakani Govardhan Reddy Comments On Chandrababu Drama Titled Vision 2047

సాక్షి, తాడేపల్లి: విజన్‌-2047 పేరుతో చంద్రబాబు(Chandrababu) డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకి ఇలాంటి తొండాట ఆడటం కొత్తేమీకాదన్నారు. ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తాడు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను పక్కన పెట్టేస్తాడు’’ అని మండిపడ్డారు.

‘‘రంగురంగుల మేనిఫెస్టోలు, కలర్ పేజీల డాక్యుమెంట్లతో జనాన్ని మభ్యపెట్టటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమీ చేయకపోయినా చేసినట్టు ఎల్లోమీడియాలో బాకాలు ఊదుకుంటారు. ఐదేళ్ల అబద్దాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారు. వైఎస్‌ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, వృద్దిరేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదు. మాటల గారడీ చేసే చంద్రబాబు ఈసారి అంకెల గారడీ కూడా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.

‘‘రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా జీఎస్డీపీ ఎలా పెరిగిందో చంద్రబాబుకే తెలియాలి. ప్రభుత్వ ఆదాయం 1.15 శాతం తగ్గితే మరి జీఎస్డీపీ ఎలా పెరిగింది?. తాను ఏం చెప్పినా జనం నమ్ముతారనుకోవటం చంద్రబాబు భ్రమ. వాస్తవాలను దాచి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు పెరగాలని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థాయిలో వృద్దిరేటు ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. బిల్‌క్లింటన్ వచ్చినప్పుడు బిచ్చగాళ్లని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేశారు. తద్వారా తమ రాష్ట్రంలో పేదరికం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు: Kakani

..చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే వృద్దిరేటు పెరిగిందని కేంద్ర సంస్థలే చెప్పాయి. పారిశ్రామిక నికర ఉత్పత్తి 11వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి వచ్చింది. అంటే జగన్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పెరిగింది. తలసరి ఆదాయాల విషయంలో కూడా చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. ఇంటర్మీడియట్ తప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబులాగా మాట్లాడితే మా దేశంలో జైలులో పెడతారని గతంలోనే స్విట్జర్లాండ్ మంత్రి అన్నారు

..చంద్రబాబు హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా జనాన్ని ఊరిస్తూనే ఉన్నారు. చెప్పినవి చేయకుండా జనాన్ని నిలువునా మోసం చేశారు. గతంలో జగన్ పేదలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని తన మనుషులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదు’’ అని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement