అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది.
‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్‌లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’
రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment