Janmabhoomi Committee
-
మారిన ‘కూటమి’ గాత్రం.. ఇంతకీ ప్రజలకు మేలా? కీడా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి.. దేనికైనా ఏభై శాతం విరాళం చెల్లించవలసిందే. అలా చేయకపోతే రాష్ట్ర ద్రోహులుగా ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా సిద్దం అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటి నుంచి బండ్ల ద్వారా చెత్త సేకరించడానికి ఏభై రూపాయలు వసూలు చేస్తే చెత్త ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు విమర్శించేవారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ మద్దతు ఇచ్చేవి. ఇంకేముంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై రూపాయల చెత్తపన్ను ద్వారా దోపిడీ చేస్తున్నారని నానా చెత్తంతా ప్రచారం చేసేవి.ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అంటే అందరి గాత్రం మారిపోయింది. యథా ప్రకారం చంద్రబాబుకు జన్మభూమి పథకం గుర్తుకు వచ్చింది. ఈనాడు మీడియాకు జన్మభూమి అంటే తల్లిపాల రుణం తీర్చుకోవడం అని రాగం అలాపించడం ఆరంభించింది. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలపై తీవ్ర స్థాయిలో దూషించిన పవన్ కల్యాణ్ నోట ప్రస్తుతం మాట రావడం లేదు. కాలం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఎదుటివారు అధికారంలో ఉంటే ఏ రకంగా విమర్శలు చేస్తారు.. అదే తమకు అధికారం దక్కగానే ఎలా మారిపోతారో అనడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.జన్మభూమి పథకం అంటే, గ్రామంలో లేదా, పట్టణంలోని వార్డులో ఏదైనా పని జరగాలంటే ప్రజలు తమ వంతుగా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ప్రకారం విరాళం చెల్లించాలి. లేకుంటే రోడ్డు పడదు. కాల్వల నిర్మాణం జరగదు. అసలు పనులే సాగవు. 2004కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనుల కోసం ఏభై శాతం విరాళాలు వసూలు చేసేవారు. అది గొప్ప కార్యక్రమంగా ఈనాడు వంటి మీడియా ప్రచారం చేసేది. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ లేదా, ఆ తర్వాత కాలంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, వెంటనే ఈనాడు మీడియా స్వరం మార్చేసి, చిన్న పన్ను వేసినా జనంపై తెగబాదుతున్నారు అంటూ నీచంగా కథనాలు ఇస్తుంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజల నుంచి ఎలాంటి విరాళాలు తీసుకోకుండానే వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయినా ఈనాడు మీడిమా ఆయనపై ఉన్నవి, లేనివి కల్పించి మరీ రాసింది. 2019-24 టరమ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు మీడియా చేసినంత దుష్ప్రచారం బహుశా ప్రపంచంలోనే మరే ప్రభుత్వంపై ఇంకే మీడియా చేసి ఉండదు. పచ్చి అబద్ధాలను రాసింది. ప్రస్తుతం ఏబైవ వార్షికోత్సవం జరుపుకుంటే చాలా ప్రజాసేవ చేశానని చెప్పుకుంటు ఈనాడు ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా, గత ఐదేళ్లలో మాత్రం దారుణాతిదారుణంగా వ్యవహరించింది. జర్నలిజం కనీస సూత్రాలను తుంగలో తొక్కి, బట్టలూడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడలేదు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీని భుజాన వేసుకుని మోస్తూ ఇదే జర్నలిజం అని ప్రజలను మోసం చేసే యత్నం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోయాక మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. జన్మభూమి స్కీమ్ మళ్లీ వస్తోందని పరవశంతో వార్తలు ఇస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు గిరిజన దినోత్సవం సందర్బంగా ఉపన్యాసం చేశారు. దానికి ఈనాడు పత్రిక పెట్టిన హెడింగ్.. అభివృద్ది మోత మోగాలి.. అని. అదే టైమ్‌లో చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఆయన తరచు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు మీదకాని, హామీల అమలును ఎలా ఎగవేయాలా అని చూస్తున్న ధోరణి గురించి కాని ఒక్క ముక్క రాస్తే ఒట్టు.ఏభై వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు మీడియా ఆత్మ విమర్శ చేసుకుని వాస్తవ కథనాలు ఇవ్వాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబుతో అంతగా కలగలిసిపోయాయన్నమాట. మరో సంగతి చెప్పాలి. జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని, ఇసుక మొదలు అన్నిటిలో అరాచకంగా వ్యవహరిస్తున్నాయని ఆ రోజుల్లో పవన్ కల్యాణ్ విమర్శించేవారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ వారు జన్మభూమి కమిటీల గురించి చర్చిస్తున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నది ఆయన అభిమానుల బాధగా ఉంది.నిజంగానే జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు ఇన్నీ, అన్నీ కావు. వారి అవినీతికి అంతే లేదు. ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇలా ఏ అవసరం ఉన్నా టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే జన్మభూమి కమిటీలవారి చుట్టూ తిరగవలసిందే. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న జన్మభూమిని మళ్లీ తీసుకురావాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నదంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలకు ఒక సంపాదన మార్గం ఏర్పాటు చేయడమే అని భావించాలి. మళ్లీ యధేచ్చగా ప్రజలపై పడి దోచుకోవడానికే అనే భావన కలుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చాక ఇలాంటి అరాచకాలకు పుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, మొత్తం కొత్త వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చారు.వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్లకే సేవలు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని పనులు చకచకా జరిగేలా చేశారు. అదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండడంతో దానిని ఎలాగైనా తొలగించే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను ఏదో రకంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటి స్థానే జన్మభూమి కమిటీలను ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లా? కీడు చేస్తున్నట్లా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ వారు చెప్పినవారికే పనులు చేస్తామని చెప్పేవారు. ఇప్పుడు అందులో భాగంగానే జన్మభూమి కమిటీలు ప్రవేశపెడుతున్నారని భావించవచ్చు. ప్రజలు వీటిని రిసీవ్ చేసుకుంటారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
లంచాలకు అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి : మంత్రి అంబటి రాంబాబు
-
టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పథకం పనులు చేసేందుకు జన్మభూమి కమిటీల సభ్యులు, నీటిసంఘం అధ్యక్ష, కార్యదర్శులు, టీడీపీ సర్పంచ్‌లు కాంట్రాక్టర్లుగా, కాంట్రాక్టర్లకు బినామీలుగా అవతామరమెత్తారు. పెద్దల అండదండలతో ప్రజాధనాన్ని కైంకర్యం చేశారు. పథకం లక్ష్యాన్ని పక్కనపెట్టేశారు. ఫలితం.. చెరువులు బాగుపడలేదు. చెక్‌డ్యామ్‌లు చెదిరిపోతున్నాయి. కాలువలు పూడుకుపోయాయి. చెరువుగట్లు పటిష్టం కావడం మాటెలా ఉన్నా ఉన్న గట్లే పాడైపోయాయి. దీనికి బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన పనులే ఓ నిదర్శనం. ►బొబ్బిలి మండలంలోని ఓ పంచాయతీ పరిధి లోని చెరువు పనులను బీజేపీ నాయకుడి సోదరుడికి అప్పగించారు. మరో పంచాయతీ పరిధిలో రూ.50 లక్షల పనులను 10 శాతం కమీషన్‌కు అమ్మేసి పట్టణంలోని ఓ టీడీపీ నాయకుడి అక్రమ నిర్మాణాలకు గ్రావెల్ తరలించారు. బొబ్బిలి పట్టణంలో మల్లమ్మపేటకు చెందిన ఓ టీడీపీ నాయకుడు రామన్నదొరవలస వద్ద 30 ట్రాక్టర్లతో గ్రావెల్ తవ్వేసి గ్రోత్‌సెంటర్‌కు అమ్మేశాడు. అప్పటి ఓ టీడీపీ కౌన్సిలర్ మేనల్లుడు నేరుగా అధికారుల పేరుచెప్పి నీరు–చెట్టు పనులు చేయకపోయినా ఆ పేరుతో చెరువులో గ్రా వెల్ తవ్వేçస్తూ అక్రమార్జన చేశాడు. సీతయ్యపేటలో నీరు–చెట్టు కింద రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను అప్పటి గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు స్వయంగా ప్రారంభించారు. ఆ చెక్‌డ్యామ్ ఎంత నాణ్యతలోపాలతో నిర్మించారో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. గతంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పిరిడి సీతారామసాగరం, అలజంగి దాలెందర చెరువు పనులను మళ్లీ నీరు– చెట్టుకింద చేసి నిధులు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.3 కోట్లు హాంఫట్... 2014–15 సంవత్సరంలో మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రామభద్రపురం మండలంలో దాదాపు రూ.6 కోట్లతో చెక్‌డ్యాంలు, మదుములు, చప్టాలు ఇలా 102 నిర్మాణ పనులు చేశారు. వాటిలో సుమారుగా రూ.3 కోట్లకు పైబడి అక్రమాలు జరి గినట్లు సోషల్ ఆడిట్లో వెలుగుచూసింది. రెండు నెలల పాటు పరిశీలించిన విజిలెన్స్ అధికారులు ఆ అక్రమాలను నిర్ధారించారు. రావివలస పంచాయతీ మినహా దాదాపు అన్నిచోట్లా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తెర్లాంలో నాణ్యత డొల్ల... తెర్లాం మండలంలో నీరు–చెట్టు పనుల ఫలితంగా చెరువు గట్లు దెబ్బతిన్నాయి. నందిగాం చౌదరిచెరువులో పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. పనులు జరగకముందు రెండు నాటు బళ్లు గట్టుపై నుంచి వెళ్లిపోయేవి. తీరా పనిచేసిన తరువాత ఒక్క నాటుబండి కూడా వెళ్లడం కష్టంగా ఉందని రైతులు అంటున్నారు. చెరువులోనుంచి తీసిన మట్టిని సైతం అమ్మేశారంటే దోపిడీని ఊహించవచ్చు. తెర్లాం మండలంలో పలు పనులను అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో నందిగాం, కుసుమూరు, తెర్లాం గ్రామా ల్లోని చౌదరి చెరువు, గురివినాయుడు చెరువు, గుర్రమ్మ చెరువుల అభివృద్ధికి రూ.35 లక్షల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు అంతంతమాత్రంగానే చేసి బిల్లులు పూర్తిస్థాయిలో చేసుకోవడం గమనార్హం. చదవండి: రైలు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం -
అప్రజాస్వామిక కమిటీలు
సాక్షి, వెంకటగిరి: ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేసేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమ సొంత పార్టీ మనుషులకే అందేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఐదేళ్లుగా రాజకీయ రాక్షస మూకల కమిటీలుగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులు, ఎన్నో కఠిన పరీక్షల్లో పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చాయి. జన్మభూమి కమిటీల పెత్తనాన్ని ప్రశ్నించలేక జనం సైతం బాధితులుగా మిగిలిపోయారు. ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో పాలన సాగించింది జన్మభూమి కమిటీలే. అధికారుల సాయంతో ప్రజాప్రతినిధులు పాలన సాగించాల్సి ఉండగా గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీ సభ్యులు వ్యవస్థలో రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోయారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. పటిష్టంగా వ్యవహరించాల్సిన అధికార వ్యవస్థ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జన్మభూమి కమిటీలకు దాసోహం అయిందని స్థానికులు చెబుతున్నారు. వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీలదే పెత్తనం కావడంతో ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేసేలా బాబు వ్యవహరించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటయిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేవలం అధికారపార్టీ వారికే పథకాలను అందిస్తూ మిగిలిన వారికి తీవ్రంగా అన్యాయం జరిగింది. సబ్సిడీ రుణం మంజూరు కావాలన్నా, పింఛన్‌కు అర్హత సాధించాలన్నా, చివరికి రేషన్‌కార్డు మంజూరు కావాలన్నా క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతకు బీజం పడింది. అధికారులు సైతం జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించారు. అర్హులైన బాధితులు అధికారులను నేరుగా సంప్రదించి తమ గోడు విన్నవించుకున్నా స్పందించని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు అని తెలిస్తే చాటు ప్రభుత్వ పథకాలకు అర్హులు కాదని తేల్చిచెబుతూ ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్లు నిలిపివేసిన వైనం సర్వత్రా విమర్శలు పాల్జేసింది. అనేక సార్లు వారు అధికారులకు తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులయిన వారికి పింఛన్ మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా జన్మభూమి కమిటీ సిఫార్సు లేనిదే ఏమి చేయలేని పరిస్థితిని కల్పించారు. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగింది. జన్మభూమి కమిటీల పెత్తనం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి వెంటనే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి. నిరంకుశత్వంతో కూడిన అప్రజాస్వామిక విధానాలకు భిన్నంగా పారదర్శకతతో నిండిన ప్రజాస్వామిక చర్యలను చేపట్టాలి. దీనికి అస్మదీయుల ప్రయోజనాలే కీలకమని భావిస్తే బాధిత ప్రజానీకం తమ సమయం వచ్చినప్పుడు చెప్పే గుణపాఠానికి నాయకులు సిద్ధపడాలని ప్రజలంటున్నారు. అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బొమ్మిరెడ్డి కాంతమ్మ. రాపూరు మండలం సిద్ధవరానికి చెందిన ఆమెకు 69 సంవత్సరాల వయసు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ వస్తుండేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె అందిస్తున్న పింఛన్ రద్దు చేశారు. పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం మూలంగానే తనకు వస్తున్న పింఛన్‌ను నిలుపదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారి జన్మభూమి కమిటీలు రద్దు అయితే తప్ప తనకు పింఛన్ అందదని ఆమె చెపుతున్నారు. గూడు చెదిరినా.. గుండె కరగలేదు ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పి.ఈశ్వరమ్మ, మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు వీవర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంటిలో కుమారుడు, పిల్లలతో కలసి నివాసం ఉంటుంది. ఆమె జీవనం సాగిస్తున్న ఇళ్లు చిన్నపాటి వర్షం పడితేచాలు ఇళ్లు అంతా ఉరిసి తడిసిపోతుంది. దీంతో తమకు పక్కా గృహం మంజూరుచేయాలని పలు మార్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులకు విన్నవించుకుంది. అయినప్పటికీ జన్మభూమి కమిటీ సభ్యులయిన టీడీపీ నాయకుల ఆమోదం పొందిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తున్నారు తప్ప ఇళ్లు మంజూరుకు అన్నివిదాల అర్హత ఉన్న పేదలకు ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో వి«ధిలేక పలిగిన రేకుల ఇంటిలోనే గాలం వెలదీస్తున్నామని వాపోయారు. శాపంగా మారిన జన్మభూమి కమిటీలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి డక్కిలి మండలం మార్లగుంట గ్రామానికి చెందిన ఈగ లక్ష్మయ్య. భార్యా భర్తలు ఇద్దరు 70 ఏళ్లకుపై బడిన వయోవృద్ధులు. ఒక్కరికైనా పింఛన్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెటుకున్నా, జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నాకు పింఛన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు అడ్డుచెపుతున్నారని అంటున్నారు. గిరిజనులమనే కనికరం కూడా లేకుండా ప్రభుత్వ పథకాల్లోనూ రాజకీయం చేస్తున్న జన్మభూమి కమిటీలే శాపంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రుణాల్లోనూ రాజకీయమే ఈ ఫొటోలో కనబడుతున్న మహిళ పేరు పి.శ్రీదేవి. మున్సిపాలిటీ పరిధిలోని ఉపాధ్యాయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా మంజూరుచేస్తున్న సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా ఆమె పేరుతో అర్హుల జాబితా తొలగించారు. రుణం పొందేందుకు అర్హత ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులు అవతారమెత్తిన టీడీపీ నాయకుల అరచకాలకు ఆమె లబ్ధి పోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. -
మానవత్వానికి వికలత్వం!
అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆపై వారిది పేద కుటుంబం. ఇదే అతని జీవితానికి శాపంగా పరిణమించింది. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు నిర్దయగా వ్యవహరించారు. ఆ దివ్యాంగుడి జీవితాన్ని చూస్తే ఏ మనిషిలోనైనా మానవత్వం పెల్లుబికుతుంది. కానీ అధికార పార్టీ నేతలు, అధికారుల్లో పిసరంత కూడా మానవత్వం కానరావడం లేదు. ఏళ్లకు ఏళ్లుగా ఆ దివ్యాంగుడి బతుక్కి పింఛన్ సాయం కోసం తల్లిదండ్రులు తిరగని గడప లేదు. ఎక్కని మెట్లు లేవు. అతని దయనీయ స్థితిని గుర్తించలేని ఏలికల ‘మానత్వానికి వికలత్వం’ నిదర్శనంగా నిలుస్తోంది. నెల్లూరు(పొగతోట): అధికారులు, అధికార పార్టీ నేతలు మానవత్వాన్ని మరుస్తున్నారు. అధికార పార్టీ వారైతే అనర్హులకు కూడా జన్మభూమి కమిటీలు పింఛన్లు మంజూరు చేస్తున్నారు. పేదవాడికి అండగా నిలవాల్సిన అధికారులు జన్మభూమి కమిటీల ఒత్తిడికి తలొగ్గి నైతిక బాధ్యతలకు తిలోదకాలు వదులుతున్నారు. నాయుడుపేట మండలం లోతగుంటకు చెందిన రంగనాథం, చెంగమ్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలు. ఇద్దరూ దివ్యాంగ బిడ్డలే. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి అన్నీ తానై సేవలు చేస్తూ కష్టపడుతోంది. పెద్ద కుమారుడు కొద్ది రోజుల క్రితం మరణించాడు. రెండో కుమారుడు శ్రీరాములు (22)కు పుట్టుకతోనే అంగవైకల్యం.. బుద్ధిమాంద్యమే కాదు.. శరీరంలో అన్ని సమస్యలే. కదల్లేడు.. మాట్లాడలేడు. మల, ముత్రాలు అన్ని తల్లే శుభ్రం చేయాలి. అసలే పేద కుటుంబం. రెక్కాడితే కానీ.. డొక్కాడని కుటుంబం. బిడ్డలను చూసుకునేందుకు తల్లి కూలి పనులకు వెళ్లడం మానుకుంది. తండ్రి కష్టంతో ఆ కుటుంబం జీవనం కష్టంగా నడుస్తోంది. దివ్యాంగుడు శ్రీరాములకు వికలాంగుల పింఛన్ వస్తే కొంత ఆదరువుగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు పింఛన్ మంజూరు కోసం అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయారు. ఇతని పరిస్థితి చూసి మానవత్వం స్పందించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. ఆధార్ లేదని పింఛన్ మంజూరు చేయలేదు శ్రీరాములకు చేతి వేళ్లు, కళ్లు సరిగా లేని కారణంగా ఆధార్ రాలేదు. అతనికి అధార్ లేని అధికారులు పింఛన్ మంజూరుకు కొర్రీ పెట్టారు. తల్లిదండ్రులు అతనికి ఆధార్ కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా ఆధార్ మంజూరు కాలేదు. కుటుంబానికి రేషన్‌కార్డు ఉంది. శ్రీరాములకు దివ్యాంగుల పింఛన్ కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేశారు. ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. సోమవారం తల్లి శ్రీరాములును భుజనా వేసుకుని కలెక్టరేట్‌కు తీసుకు వచ్చింది. పింఛన్ మంజూరు చేయలంటూ అధికారులను వేడుకుంది. అతని పరిస్థితిని చూసి స్పందించిన డీఆర్ఓ చంద్రశేఖర్‌రెడ్డి డీఆర్డీఏ అధికారులను పిలిచి మాట్లాడారు. ఆధార్ లేకుండా ప్రత్యేక కేసు కింద పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పిలిచి సదరం సర్టిఫికెట్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్ మంజూరు చేయించమని డీఆర్ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచిస్తే వారు.. వీరిని పక్కకు తీసుకెళ్లి మీరు పోయి తెచ్చుకోమని పంపించేశారు. ఇప్పుడు కూడా కింది స్థాయి అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించకపోవడం శోచనీయమని వీరిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పర్యాయాలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అధికారులను సంప్రదిస్తే ఇదే విధంగా సమాధానం చెబుతున్నారని శ్రీరాములు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. -
బాబు భజన సభల్లో.. పింఛన్‌దారులకు చుక్కలు
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/సాక్షి ప్రతినిధి, ఏలూరు /సదుం : ఊళ్లో సభ జరుగుతున్న రోజే పింఛన్లిస్తాం.. అప్పుడు తీసుకోకుంటే పింఛనే రద్దవుతుంది.. అంటూ జన్మభూమి కమిటీ సభ్యులు ప్రచారం చేస్తుండటంతో కృష్ణా జిల్లా నిడమోలుకు చెందిన 70 ఏళ్ల వెంకటేశ్వర్లు రాజమండ్రిలో ఉంటున్న తన కుమారుడి ఇంటి నుంచి హడావుడిగా సొంతూరికి బయలుదేరాడు. కొడుకు ఇంట్లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా.. పింఛన్ రద్దువుతుందని అన్ని పనులూ మానుకుని మరీ వచ్చాడు. అయితే ఊళ్లో సభ ఈ రోజు కాదు.. నాలుగో తేదీ.. ఆ రోజే పింఛన్ల డబ్బులిస్తారని చెప్పడంతో పనులన్నీ వదిలి మరో రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతి నెలా మాదిరి ఒకటి నుంచి ఐదో తేదీల మధ్య ఐదు రోజుల పాటు పింఛన్ల పంపిణీని ఆపేసి, ఈ సారి కేవలం ఒకే రోజు.. అదీ రెండు మూడు గంటలే పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో తీసుకోకుంటే రద్దవుతాయని జన్మభూమి కమిటీ సభ్యులు బెదిరించడంతో వృద్ధులు పింఛన్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సీఎం చంద్రబాబు పొగడ్తల సభల కోసం.. పింఛన్లు పంపిణీ చేసేందుకు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భజన సభలు వృద్ధులకు చుక్కలు చూపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ డబ్బులతో ఊరూరా ఈ సభలను నిర్వహిస్తున్న కొందరు ఉన్నతాధికారులు.. ఇందుకోసం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో వారికి చుక్కలు చూపుతున్నారు. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీల మధ్య రోజూ ప్రతి గ్రామంలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ నిబంధనలను.. బాబు పొగడ్తల సభల కోసం తాత్కాలికంగా మార్చేశారు. ప్రతి గ్రామం, పట్టణ వార్డుల్లోనూ శని, ఆది, సోమవారాల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించి.. ఆ రోజు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఆ రోజు పింఛన్ తీసుకోకుంటే ఇక భవిష్యత్తులో పింఛన్ రాదని గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బెదిరిస్తున్నాయి. అధికారులు మాత్రం.. ఆ రోజు తీసుకోకుంటే ఇంక ఆ నెలకు పింఛన్ పంపిణీ ఉండదని చెబుతున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో కృష్ణమోహన్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామంలో సభ జరిగే రోజే ఆ ఊరిలో పింఛనుదారులందరూ సభకు హాజరయ్యేలా చూసుకోవాలని సెర్ప్ సీఈవో జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఒక్కో మండలంలో దాదాపు పది గ్రామాల్లోని సభలకు అధికారులు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒకట్రెండు గంటలే సభ నిర్వహించి, ఆ సమయంలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో వృద్ధులు సభల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 11 వేల చోట్ల మొదలు కాని పంపిణీ రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలు, 3,600కు పైగా పట్టణ వార్డుల్లో ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ మొదలు కావాల్సి ఉంది. రెండో తేదీ రాత్రి వరకు దాదాపు 11 వేల చోట్ల అసలు పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదని అధికార వర్గాల సమాచారం. ఐదో తేదీకల్లా పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు 54.15 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయగా.. శనివారం రాత్రి వరకు కేవలం 11 లక్షల మందికే పింఛన్లు అందాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పింఛన్‌దారుల నుంచి అధికారులు ఫోన్ నంబర్లతో పాటు ఓటు ఉందా లేదా తదితర వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ పంపిణీ చేసే అధికారి రిజిస్టర్లో లబ్ధిదారుడి ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోవాలని ఆదేశాలున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడలో చేపట్టిన పసుపు–కుంకుమ చెక్కులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసింది. పేరు పేరునా పిలిచి పింఛన్, పసుపు–కుంకుమ చెక్కులు ఇవ్వడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. టెంట్లు లేక మండుటెండలోనే భోజనాలు చేశారు. పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీలో కొంతమంది సభ్యుల పేర్లు లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది. ముగ్గురి ఉసురు తీసిన బాబు ప్రచారార్భాటం పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరి మృతి పింఛన్ల పెంపు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రచారార్భాటం ముగ్గురు వృద్ధుల ఉసురు తీసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీని వేడుకగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులంతా పంచాయతీ కార్యాలయాల వద్దకు హాజరుకావాలంటూ అధికారులు టాంటాం వేశారు. టెంట్లోనే కుప్పకూలి.. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(75) పింఛన్ కోసం ఉదయం ఏడు గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. పంచాయతీ సిబ్బంది వృద్ధులు, వికలాంగుల వేలిముద్రలను తీసుకున్నారు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే చేతులు మీదుగా పింఛన్ సొమ్ము అందజేస్తాం.. అని చెప్పడంతో కొంతమంది వెళ్లిపోగా, మరికొందరు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లో కుర్చీలో కూర్చుండిపోయాడు. పదిగంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పంచాయతీ అధికారులు వెంకటరెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి సమాచారం తెలపడంతో ఆయన వచ్చి వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రోడ్డుమీదే కూలబడ్డాడు.. తాడేపల్లిగూడెం మూడో వార్డుకు చెందిన గొర్ల కొండయ్య (80) పింఛన్ తీసుకునేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే నిరీక్షించి, నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడి వారు లేపి మంచినీళ్లిచ్చారు. పింఛన్‌తో ఇంటికెళ్తూ రోడ్డుపై మరోసారి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతతో.. పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డలో జరిగింది. షరీపాబీ (75) నడిగడ్డలోని కుమార్తె మస్తానీ వద్ద కొద్ది రోజులు, సదుంలోని కుమారుల ఇంట కొద్ది రోజులు ఉంటోంది. శనివారం ఉదయం నడిగడ్డకు వచ్చిన షరీపాబీ రేషన్ సరుకులు తీసుకుంది. అనంతరం పింఛన్ కోసం బయలుదేరింది. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికులు ఆమెను సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రభుత్వం ప్రచారం కోసం పింఛన్లు పంపిణీ చేయకుండా వారిని గంటల తరబడి కూర్చోబెట్టడం వల్లే వృద్ధుల ప్రాణాలు పోయాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు
లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..? – కాకినాడ జన్మభూమిలో తనను అడ్డుకున్న మహిళలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)/కాకినాడ: ‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు జాగ్రత్త’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను అడ్డుకున్న మహిళలను హెచ్చరించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీని సమర్థిస్తారా అంటూ ధ్వజమెత్తారు. నినాదాలు చేస్తే ప్రజలు కొడతారంటూ హెచ్చరించారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్నతో ముఖ్యమంత్రి వాగ్వాదానికి దిగారు. మోదీ ఇచ్చిన నిధుల వివరాలు సీఎంకు ఆమె వివరించే ప్రయత్నం చేస్తుండగా.. ఆయన వినకుండా బస్సు ఎక్కేశారు. కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న వైపు వేలు చూపిస్తూ మర్యాదగా ఉండాలంటూ హెచ్చరించారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసి సర్పవరం స్టేషన్‌కు తరలించారు. మోదీ అడ్రస్ గల్లంతు కావడం తథ్యం: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్రస్ గల్లంతు కావడం తథ్యమని, బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. కాకినాడ జేఎన్టీయూ మైదానంలో జరిగిన ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. బీజేపీ పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. నాలుగు ఉత్తమ నగరాల్లో ఒకటిగా చేస్తా రాష్ట్రంలోని నాలుగు ఉత్తమ నగరాల్లో కాకినాడను ఒకటిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే కాకినాడను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేశారు. సీబీఐకి భయపడి జగన్ పార్టీ కేంద్రానికి ఊడిగం చేసేందుకు కూడా వెనుకాడటంలేదని దూషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జగన్ జపం చేస్తున్నారని అక్కడ జరిగిన ఎన్నికల్లో పంపిణీ చేయగా మిగిలిపోయిన వాటిని ఇక్కడకు పంపుతున్నారని విమర్శించారు. పవన్ పోరాడాలి.. మోదీ, జగన్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంపై పోరాడాలని కోరారు. పవన్ నిజనిర్ధారణ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.75 వేల కోట్ల సహాయం అవసరమని ప్రకటించారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నందున ఆ దిశగా ఆయన పోరాటం చేయాలని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అధికారులు పాల్గొన్నారు. బాబు ప్రసంగం.. వెళ్లిపోయిన జనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సభికులు వెళ్లిపోయారు. వందల సంఖ్యలో విద్యార్థుల్ని సభకు తరలించారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభం కావల్సిన సభ మధ్యాహ్నం 1.05కు సీఎం వచ్చిన తర్వాత ప్రారంభమైంది. కానీ, కాసేపటికి జనాలు వెళ్లిపోవడం ప్రారంభించారు. వారిని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం దాదాపు ఖాళీ అయిపోయింది. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైయ్యారని, జన సమీకరణలో విఫలమయ్యారని నేతలపై రుసరుసలాడారని తెలిసింది. ఎంపీల సస్పెన్షన్ దారుణం సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులపై జరిగిన లాఠీచార్జిని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ఎంపీల సస్పెన్షన్ దారుణమన్నారు. రెండురోజుల్లో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదని, మంద మెజారిటీతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. -
కుప్పానికి వరాలేవీ
చిత్తూరు, సాక్షి: కుప్పంలో గురువారం నిర్వహించిన జన్మభూమి సభ ఎన్నికల ప్రచార సభను తలపించింది. సీఎం చంద్రబాబు మాటిమాటికీ తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రావాల్సిన సీఎం చంద్రబాబు గంటన్నర ఆలస్యంగా కుప్పం చేరుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆలస్యంగా నడిచింది. సమయాభావం వల్ల కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సభ కోసం జిల్లా నలుమూలల నుంచి తరలించిన మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సభ 1.30 ప్రారంభమైంది. 3 గంటల వరకు సాగింది. 11 గంటలకే మహిళలను సభాప్రాంగణంలోకి తరలించడంతో ఆకలితో అలమటించారు. చివరి సభలోనూ నిరాశే.. సీఎంగా చంద్రబాబు నిర్వహించే చివరి సభ ఇదే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతోసొంత నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. ఎలాంటి వరాలజల్లు కురిపించకపోవడంతో నిరాశకు గురయ్యారు. కుప్పం పట్టణ ప్రధాన రహదారి విస్తరణపై కనీస ప్రకటన కూడా చేకపోవడాన్ని తప్పు పడుతున్నారు. రూ.1 కోటితో నిర్మించిన నూతన పీహెచ్సీ భవనాలను ప్రారంభిస్తారని ఆశించినా భంగపాటు ఎదురైంది. మోడల్ కాలనీలో ఎన్టీయార్ గృహ ప్రవేశానికి హాజరవుతారని అనుకున్నా..చివరి నిమిషంలో సీఎం మనసు మార్చుకోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. డబ్బు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా... అధికారులు ఇళ్లు అప్పగించలేదని లబ్ధిదారులు సాక్షితో వాపోయారు. ఆ పంచాయతీ పరిధిలో వైఎస్సార్సీపీ జెండాలు అధికంగా కనపడటంతోనే అధికారులు సీఎం కార్యక్రమాన్ని తొలగించారని తెలుస్తోంది. డిగ్రీ కళాశాల భవనాలు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా రాత్రి 7 గంటలకు సీఎం అక్కడికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం వచ్చే వరకు విద్యార్థులకు అధికారులు కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు. వడ్డెపల్లిలో వైస్సార్సీపీ జెండాల తొలగింపు.. వడ్డెపల్లిలో గురువారం విలేజ్ వాక్ తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ జెండాలన్నీ తొలగించారు. అధికారులు వేడుకోవడంతో ప్రజలు సహకరించారు. అప్పటికీ కొన్ని ఇళ్లపై వైఎస్సార్సీపీ జెండాలు కనపడటంతో సీఎం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి సభలో వడ్డెపల్లిని 8 స్టార్ గ్రామంగా అభివర్ణించడంపై స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల నుంచి గ్రామంలో తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని.. రాత్రికి రాత్రి కుళాయిలు నిర్మించి గొప్పలు చెప్పుకుంటున్నారని అక్కడి ప్రజలు అన్నారు. ఫైబర్ గ్రిడ్ అనే పదమే గ్రామంలో తెలీదన్నారు. కానీ సీఎం మాత్రం వడ్డెపల్లి గ్రామాన్ని ఫైబర్ గ్రిడ్ పల్లెగా చెప్పుకున్నారు. 500 బస్సులతో తరలింపు.. జన్మభూమి సభ కోసం జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలించారు. వారికి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. పర్యటన ఆలస్యం అవడంతో తాగేందుకు మంచి నీళ్లను కూడా అధికారులు ఇవ్వలేదని వాపోయారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చి విద్యార్థులను కూడా సభకు రప్చించారు.కుప్పం– పర్చూరు రోడ్డులోని రూ.1880 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఆర్వోబీని, రూ.105 లక్షలతో నిర్మించిన కడా కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.5.8 కోట్లతో మిట్టపల్లిలో మంజలమడుగు చెక్ డ్యాంకు శంకు స్థాపన చేశారు. రూ.20 కోట్లతో వెనుకబడిన తర గతుల గురుకుల పాఠశాల, కళాశాలకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.512 కోట్ల ఆస్తులు, పనిముట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కుప్పం ఇంజనీరింగ్ కళాశాల వద్ద సీఎంకు పలువురు టీడీపీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. -
జన్మభూమి కూలీలుగా సర్కార్ బడి విద్యార్థులు!
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో అధికారులు.. సర్కార్ బడి పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకోవాల్సిన వాళ్లను ఎండలో తిప్పుతూ జన్మభూమి ప్లెక్సీలు కట్టిస్తున్నారు. తరగతి గదిలో ఉండాల్సిన వాళ్లతో బండచాకిరీ చేయిస్తూ.. జన్మభూమి కూలీలుగా, టీడీపీ కార్యకర్తలుగా మారుస్తున్న వైనం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో ఆరో జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ఉపాధ్యాయులు జన్మభూమి కార్యక్రమ పనులు చేయించారు. వారితో పలుచోట్ల ప్లెక్సీలు కట్టించారు. ముఖ్యమంత్రి మెప్పుపొందడానికి బడిపిల్లలను ఇబ్బందులకు గురిచేయడం పలువురిని విస్మయం పరుస్తోంది. సీఎం చంద్రబాబు ఒకవైపు బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి.. అంటుంటే, ఆయన అధికారులు మాత్రం బడిపిల్లలతో అధికార కార్యక్రమాల్లో చాకిరీ చేయిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. -
మాయమాటలతో మోసగించడమేనా!
శ్రీకాకుళం , వీరఘట్టం: జన్మభూమి–మాఊరు గ్రామసభల ద్వారా మరోసారి మాయమాటలతో ప్రజలను మోసగించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. స్వగ్రామం వండువలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఐదు విడతల్లో చేపట్టిన జన్మభూమి–మాఊరు గ్రామ సభల్లో ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని అన్నారు. టీడీపీ ప్రచారం కోసం ప్రజాధనం వృథా చేస్తోందన్నారు. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీలు పక్షపాత ధోరణిలో పచ్చ చొక్కాలకే కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో అధికార యంత్రాంగం కూడా విఫలమైందని, పూర్తిగా పచ్చచొక్కాలకే దాసోహమంటూ ఊడిగం చేయడం భావ్యంకాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి పథకంలో ఇంటింటా సర్వే చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇంటిలోనే ఉండి అధికారులు సర్వేల పేరుతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా చేయడం పద్ధతిగా లేదని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు మాయమాటలు చెప్పి రూ.10 వేలు రుణమాఫీ చేస్తామని చెప్పి దానిని విడతల వారీగా వారి ఖాతాల్లోకి మళ్లీస్తామన్నారు. ఇంతవరకు ఎంతమందికి రుణమాఫీ వర్తించిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు మరోసారి గారఢీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకే జన్మభూమి అంటూ టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. -
సాయం.. మాయం!
తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో గుండె చెదిరిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలను ఆదుకుని అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు ఈ విపత్తును కూడా సొమ్ము చేసుకొనే దుర్మార్గానికి తెర తీశారు. ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు దక్కాల్సిన నష్ట పరిహారాన్ని రాబందుల్లా తన్నుకుపోతున్నారు. ఏకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి బంధువులతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్లను పరిహారం జాబితాలో పెద్ద ఎత్తున చేర్చారు. అర్హులైన వారికి మాత్రం మొండిచేయి చూపారు. అర్హుల పేర్లు గల్లంతు తిత్లీ తుపాను అక్టోబర్ 10న శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. కోనసీమను తలపించే పచ్చటి ఉద్దానం కకావికలమైంది. పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి తోటలు నేలకొరిగాయి. చిన్నాచితకా బడ్డీ కొట్ల నుంచి నివాస గృహాల వరకూ అంతా ధ్వంసమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4.72 లక్షల మంది నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో నకిలీ పేర్లే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అధికా రులు దాదాపు 81,000 మందిని పరిహారం జాబితా నుంచి తొలగించారు. 3.91 లక్షల మంది మాత్రమే అసలైన బాధితులని తేల్చారు. అయితే అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీలు ఒత్తిడితో నిజమైన బాధితులను తొలగించి టీడీపీ సానుభూతిపరులను నష్టపరిహారం జాబితాలో చేర్చారు. లేని తోటలు కూలిపోయాయట! రెంటికోట పీహెచ్సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, టీడీపీ మండల అధ్యక్షుడు తమ్మినాన గంగారాం అక్రమంగా నష్టపరిహారం పొందాడు. పలాస మండలం రాజగోపాలపురానికి చెందిన గంగారాం అధికారులకు భయపెట్టి తన ఖాతాలోకి సొమ్ము జమ చేసుకున్నాడు. పల్లపు ప్రాంతంలోని భూముల్లో వరి మాత్రమే పండేచోట తుపాను వల్ల కొబ్బరి, జీడి మామిడి చెట్లను కోల్పోయినట్లు రాయించుకోవడం గమనార్హం. రాజగోపాలపురం పరిసరాల్లో రెవెన్యూ రికార్డుల్లో లేని 68/7, 15/2 సర్వే నంబర్లలో తన తండ్రికి జీడి తోటలు ఉన్నట్లు చూపించి కాశీబుగ్గ విశాఖ గ్రామీణ బ్యాంకులో రూ.15,782 పరిహారం పొందాడు. తమ్మినాన గంగారం పేరుమీద ఎస్బీఐలో రూ.75,000, మరో ఖాతాలో గ్రామీణ బ్యాంకులో రూ.5,585 మేరకు పరిహారం ఇచ్చినట్లు నమోదైంది. ప్రభుత్వ భూమినీ వదల్లేదు... పలాస–మందస మండలాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను కూడా టీడీపీ నేతలు బినామీ పేర్లతో పరిహారం కోసం రాయించుకున్నారు. ఇక్కడ 1,100 ఎకరాల్లో మెండు జీడితోటలున్నాయి. ‘మెండితోట’గా పిలిచే ఈ ప్రాంతంలో బినామీ పేర్లతో టీడీపీ నేతలు సాగు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అక్రమంగా క్రయ విక్రయాలు సాగిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. తాజాగా ఇందులో 30 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో టీడీపీ నేతలు రాయించుకున్నారు. కొబ్బరి చెట్ల లెక్కలు పెరిగాయి... తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాలో వరి 2.30 లక్షల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. అయితే చివరి అంచనాలు పూర్తయ్యేసరికి దీన్ని 1.59 లక్షల హెక్టార్లుగా నమోదు చేశారు. నిజంగానే నష్టపోయినా కావాలనే కొందరి పేర్లు తొలగించడంతో నష్టపోయిన వరి విస్తీర్ణాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. ఇక అరటి, కొబ్బరి లాంటి ఉద్యాన పంటలు 43 వేల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు తొలుత పేర్కొనగా ఇప్పుడు దీన్ని 28 వేల హెక్టార్లకు కుదించారు. అయితే కొబ్బరి చెట్ల విషయంలో లెక్కలు పెరిగాయి. తొలుత 3.10 లక్షల కొబ్బరి చెట్లే నేల కూలినట్లు పేర్కొనగా ఇప్పుడు దీన్ని 4,54,303కు పెంచారు. చిచ్చు రేపిన స్వార్థం! ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లిన ఉద్దానం ప్రాంతానికి కష్టకాలంలో అండగా నిలవాల్సిన పాలకులు స్వార్థంతో అన్నదమ్ముల్లా జీవించే ప్రజల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. పరిహారం జాబితాలో పేర్లు లేనివారు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రం యథేచ్ఛగా పందేరం చేయడంపై ఆక్రోశిస్తున్నారు. కట్టుబాట్లకు విలువ ఇచ్చే ఉద్దానంలో అంతా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏకమవుతారు. అలాంటి చోట టీడీపీ నేతల చర్యలతో విబేధాలు తలెత్తుతున్నాయి. పరిహారం విషయంలో తమ పక్కనే ఉన్న పొలం రైతు పట్ల ఒకలా, తమ పట్ల మరోలా వ్యవహరిస్తుంటే తట్టుకోలేక అధికారులను నిలదీస్తున్నారు. కొందరికి అధికంగా పరిహారం ఇస్తున్నారని, మరి కొందరికి అసలు భూమే లేకున్నా జాబితాలో పేర్లు చేర్చడంపై ఘర్షణలకు దిగుతున్నారు. టీడీపీ నేతల బినామీ పేర్లతో పరిహారం పొందిన మెండుతోట ఇదిగో... ఇలా కాజేశారు! - వజ్రపుకొత్తూరులో మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్యకు ఐదు ఎకరాలుంటే 10 ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటూ రికార్డుల్లో రాయించుకున్నారు. - గండుపల్లి పోలయ్య, బోటు లేకున్నా నష్టపోయినట్లు రూ.4 లక్షలు పరిహారం రాయించుకుని ఇప్పటికే రూ.లక్ష కాజేశాడు. - టీడీపీ నాయకులు కాశ మాధవరావు, తమ్మినాన రంగారావు, కంబాల దానేసు, పిరియా శివప్రసాద్, మరడ ధుర్యోధన బినామీ పేర్లతోనూ, బంధువుల పేర్లతోనూ పరిహారం కాజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. - సంతబొమ్మాళిలో టీడీపీ నేత ఒకరు రొయ్యల చెరువులు లేకున్నా పరిహారం జాబితాలో పేరు నమోదు చేయించుకున్నాడు. - బహాడపల్లిలో సారా దుర్వాసులు, అతడి భార్య లక్ష్మికి అసలు భూమే లేకున్నా వారికి రూ.1.15 లక్షల చొప్పున నష్టపరిహారం దక్కింది. - బహాడపల్లికి చెందిన మట్ట నాగమణికి 75 సెంట్లు, మట్ట తులసీదాసుకు 4.50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వారి పేర్లను జాబితాలో చేర్చారు. నిజానికి వీరికి ఎలాంటి భూమి లేదు. ఇదే గ్రామంలో బొడ్డు ఉదయకుమార్, లక్ష్మీనారాయణ, శాంతిప్రియలకు భూములు లేకపోయినా జాబితాలో పేర్లు నమోదు చేశారు. - టెక్కలి మండలం పోలవరం గ్రామానికి సంబంధించి పరిహారం కోసం రూపొందించిన బాధితుల జాబితాలో అన్నెపు పున్నయ్య పేరు ఉంది. వాస్తవానికి అతడి పేరుతో 70 సెంట్ల భూమి మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో మాత్రం 3.04 ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. - పోలవరం గ్రామంలో బి.జయరామ్‌కు ఎకరం పొలం మాత్రమే ఉంది. కానీ పరిహారం జాబితాలో 3.89 ఎకరాల్లో వరి నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.ఆదినారాయణకు 50 సెంట్ల పొలం ఉంది. కానీ పరిహారం జాబితాలో అది 1.55 ఎకరాలకు పెరిగిపోయింది. - బి.గణపతిరావుకు పొలమే లేకున్నా లేదు. కానీ పరిహారం జాబితాలో అతని పేరుతో 1.09 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.నీలకంఠం పేరున 70 సెంట్ల పొలం మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో ఏకంగా 2.35 ఎకరాల్లో వరి పొలం తిత్లీ తుపానుకు దెబ్బ తిన్నట్లు చూపించారు. - డి.హరిప్రసాద్‌కు 70 సెంట్ల భూమి ఉండగా 2.40 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రికార్డుల్లో నమోదైంది. - డి.లక్ష్మీకి అసలు భూమే లేదు. కానీ పరిహారం జాబితాలో ఆమె 3.89 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. ఆత్మహత్యలే శరణ్యం.... తిత్లీ తుపాన్‌తో ఉద్దానం ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రజలు జీవనాధారం కోల్పోయారు. మళ్లీ పంట చేతికి రావాలంటే ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. కూలిన చెట్లను తొలగించడానికే వేలాది రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదు. ఒక రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయినా పరిహారం మాత్రం 5 ఎకరాలకే ఇస్తామంటున్నారు. ఇక మేం కూడా పత్తిరైతుల్లా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. –మామిడి మాధవరావు (ఉద్దానం రైతాంగ కమిటీ అధ్యక్షుడు) రెవెన్యూ రికార్డులు చూడరా? మందస గ్రామంలో 18 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. నిజానికి అక్కడ ఉన్నవి 14 వేల ఎకరాలే. తర్వాత ఈ విషయాన్ని గుర్తించామంటూ తగ్గిస్తున్నారు. ఇలా పెంచి తగ్గించడం వల్ల రైతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరికి ఎంత భూమి ఉందనేది రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. వాటిని పరిశీలించి జాబితాలు తయారు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – డొక్కర దానయ్య (బహాడపల్లి) నచ్చినట్లు ఇస్తున్నారు... ఎకరా పంట నష్టం జరిగిన వారికి మూడెకరాలు కోల్పోయినట్లు పరిహారం ఇచ్చారు. మాకు ఎనిమిది ఎకరాలు దెబ్బతింటే ఐదెకరాలకే ఇస్తామంటున్నారు. ఇంతవరకూ అదికూడా ఇవ్వలేదు. ఇల్లు కూలిపోతే పరిహారం ఇవ్వ లేదు. ఇదేం అన్యాయమని అడిగితే మా గ్రామంలో ఉన్న భూమి కంటే జాబితాలో ఎక్కువగా నమోదైందని, అందువల్ల పరిహారాన్ని సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. గుడ్డిభద్ర రైతులు దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. –శేషగిరిరావు (లొహరబంద) ‘కింజరాపు’ అని ఉంటే చాలు..లక్షల్లో లబ్ధి.. తిత్లీ తుపాను బాధితుల జాబితాను ఏకపక్షంగా రూపొందించారు. జన్మభూమి కమిటీలు ఇచ్చిన పేర్లను జాబితాలో చేర్చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటిపేరే ఏకైక అర్హతగా జాబితాలు తయారయ్యాయి. కింజరాపు అని ఉంటే చాలు కళ్లు మూసుకుని వారికసలు భూమి ఉందా? లేదా? అని కూడా చూడకుండా పరిహారానికి అర్హులుగా నిర్ధారిం చేశారు. మంత్రికి స్వయానా వదిన అయిన మహిళ పేరును కూడా రికార్డుల్లో చేర్చారు. ఇలా చిన్నబమ్మిడి, హరిశ్చంద్రపురం, నిమ్మాడ గ్రామాల్లో కింజరాపు అని ఇంటిపేరు ఉన్న దాదాపు 80 మంది రూ.9.72 లక్షల దాకా పరిహారం పొందారు. కుటుంబమంతా రోడ్డున పడ్డాం.. తిత్లీ తుపాను మా ఇళ్లను నేల కూల్చడంతో నలుగురు పిల్లలతో సహా మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కర్రలకు బరకా కట్టి అందులోనే తలదాచుకుంటున్నాం. ఇంత వరకూ ఒక్కరైనా మా దగ్గరకు వచ్చి ఎలా బతుకుతున్నారని చూడలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. -
పేదల పింఛన్లపై జన్మభూమి ట్యాక్స్
అనంతపురం జిల్లా రాయదుర్గం 12వ వార్డుకు చెందిన బీఆర్ దుర్గయ్యకు గతంలో పింఛన్ వచ్చేది. ఆయన 2015 జనవరి 10న మరణించటంతో డెత్ సర్టిఫికెట్‌తోపాటు తన ఆధార్, రేషన్‌కార్డు జతచేస్తూ దుర్గయ్య భార్య లక్ష్మి పింఛన్ కోసం దరఖాస్తు చేసు కుంది. 38 నెలలుగా పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో అధికారులకు మొరపెట్టుకుంది. అయితే ఆమెకు పింఛన్ వస్తోందని వారు వెల్లడిం చటంతో బండారం బయటప డింది. 38 నెలలుగా ఆమెకు పింఛన్ ఇస్తున్నట్లు రికార్డుల్లో నమోదైంది. పింఛన్ కాజేసిన విషయం బట్టబయలు కావటంతో చివరకు రూ.10 వేలు ఇచ్చి మొత్తం ఇచ్చినట్లు సంతకం చేయించుకున్నారు. సాక్షి, అమరావతి: రెక్కాడితేకానీ డొక్కాడని వెంకాయమ్మ భర్తను కోల్పోయి 68 ఏళ్ల వయసులో కూలి పనికి వెళ్లి పొట్ట పోసుకుంటోంది. దివ్యాం గుడైన కుమారుడిని పోషించే భారం కూడా ఆమెపైనే పడింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవటం, కుటుంబ పోషణ భారం కావటంతో పింఛన్ కోసం ఇప్పటివరకు 20 సార్లు దరఖాస్తు చేసుకున్నా సర్కారు కనికరించలేదు. ఆమె కుటుంబం వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తోందనే కక్షతో దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయి. ఈ దీనావస్థ కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామానికి చెందిన బలంతు వెంకాయమ్మ ఒక్కరిదే కాదు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు పొందేవారందరికీ ఇలాంటి నిస్సహాయ పరిస్థితులే నెలకొన్నాయి. పింఛన్ పంపిణీ ప్రాంతాల్లో కమిటీల తిష్ట.. ఏ ఆసరా లేక ప్రభుత్వం నుంచి ప్రతి నెలా అందే పింఛనుపైనే ఆధారపడి బతికే పేదలను జన్మభూమి కమిటీలు, అధికార పార్టీ నేతలు డబ్బుల కోసం పీక్కు తింటున్నాయి. జన్మభూమి కమిటీలు పింఛన్‌దారుల నుంచి ప్రతి నెలా దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు లంచాల రూపంలో గుంజుతున్నాయి. జన్మభూమి కమిటీ సభ్యులు ఒకటో తేదీ నుంచి ఐదారు తేదీల మధ్య గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో తిష్టవేసి ఒక్కో లబ్ధిదారుడి నుంచి వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వీరిని చూసి పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నెలనెలా మామూళ్లు ఇవ్వకుంటే ఏరివేత.. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే జన్మభూమి కమిటీలను నియమించాకే ఈ అరాచకాలకు తెరలేచింది. కమిటీ సభ్యులకు నెలనెలా లంచాలు ఇవ్వకుంటే పింఛన్లు తొలగిస్తారనే భయంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో పేదలు మామూళ్లు సమర్పించుకుంటున్నారు. దీర్ఘకాలంగా పింఛన్ పొందుతున్న వారిని సైతం అర్హులా? కాదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు టీడీపీ సర్కారు ప్రతి గ్రామంలో ఏడుగురు సభ్యులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏకంగా జీవో 135 తెచ్చింది. ఈ ఏడుగురిలో నలుగురు టీడీపీ వారే కావటం గమనార్హం. ఈ జీవో వచ్చాక ఒకే నెలలో ఏకంగా నాలుగు లక్షల మందికిపైగా పింఛన్లకు కోత పడింది. మళ్లీ ఇవ్వాలన్నా డబ్బులిస్తేనే.. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుడు కూలి పనులు తదితర కారణలతో వేరే ప్రాంతానికి వలస వెళ్లి రెండు మూడు నెలలపాటు పింఛను తీసుకోని పక్షంలో తాత్కాలికంగా తొలగించడం ప్రారంభించారు. మళ్లీ పింఛను మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కమిటీలకు అసాధారణ అధికారాలు కట్టబెట్టడంతో పేదలను జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. లంచం ఇస్తేనే పింఛన్.. పింఛన్లు పొందుతున్న ప్రతి ముగ్గురులో ఒకరు నెలనెలా లంచాలు ఇచ్చుకోక తప్పుడంలేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఈమేరకు ఇటీవల నవంబరు 1 – 6వ తేదీల మధ్య నిర్వహించిన అభిప్రాయ సేకరణలో జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు అడుగుతున్నారని 28.39 శాతం మంది వెల్లడించారు. అక్టోబరులో ఇది 28.17 శాతంగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ లంచం అడుగుతున్నట్లు 23 శాతం మంది తెలిపారు. పింఛను ఇచ్చే సమయంలో లంచం అడుగుతున్నారని చెబుతున్న వారి సంఖ్య ప్రతి నెలా 23–29 శాతం మధ్య ఉంటోంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మంది నుంచి 14 లక్షల మంది దాకా లంచాల బారిన పడుతుండొచ్చని అధికారుల అంచనా. ఇలా ఒకొక్కరి నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసే మొత్తం ప్రతి నెలా రూ.10 కోట్ల నుంచి 14 కోట్ల వరకు ఉంటోంది. చర్యలకు జంకుతున్న సర్కారు పింఛన్‌దారుల నుంచి జన్మభూమి కమిటీ సభ్యులు ప్రతి నెలా కోట్ల రూపాయలు లంచంగా వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. గ్రామాల్లో టీడీపీ పెద్దలు పిలుపునిచ్చే కార్యక్రమాలన్నీ జన్మభూమి కమిటీ సభ్యుల చేతుల మీదుగా జరుగుతుండడంతో చర్యలు తీసుకోవడానికి జంకుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నెల్లూరుకు ఔటర్ రింగ్‌రోడ్డు
నెల్లూరు రూరల్: నెల్లూరు నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిం చారు. నెల్లూరు మండలంలోని కోడూరుపాడులో శనివారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో సీఎం మాట్లాడారు. నెల్లూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్‌రోడ్డు ప్రతిపాదనను తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా వెంకటగిరి పట్టణానికి ఎక్స్‌ప్రెస్ వే వేస్తున్నట్లు తెలిపారు. కోడూరుపాడు నూతన లేవుట్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జాతీయ రహదారి నుంచి కోడూరుపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో దగదర్తి విమానాశ్రయం పనులను 2019 మార్చి కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణపట్నం ప్రాంతంలో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నెల్లూరు నుంచి చెన్నై వరకు ఇండ్రస్టియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్టా జిల్లాలో మూడు ఎయిర్‌పోర్టులను తీసుకొస్తామన్నారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు బకింగ్‌హోం కెనాల్‌ను ద్వారా జలరవాణాను అభివృద్ధి చేస్తామన్నారు. జన్మభూమి–మా ఊరు ప్రాధాన్యత, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.149కే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. బలిజపాళెం అంగన్వాడీ కేంద్రం చిన్నారులను సీఎం చంద్రబాబు పలు ప్రశ్నలు అడగ్గా చిన్నారులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌కు ఏమి కావాలో అంగన్వాడీ కార్యకర్తను కోరుకోమనడంతో నూతన భవనం కావాలని అడిగారు. వెంటనేనూతన భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తూ, కార్యకర్తకు రూ.25వేలు ఇన్సెంటివ్ ప్రకటించారు. మున్సిపల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ తాము డాక్టర్ చదవాలని సీఎంను కోరగా వారి చదువు కోసం ఒక్కొక్కరికి రూ.50వేలు వంతున డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు. తొలుత హెలిప్యాడ్ వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ.6 కోట్ల రుణాల చెక్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్(గ్రామీణ్), ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ, డ్వామా, ఐసీడీఎస్, మెప్మా, హౌసింగ్ శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. గర్భిణులకు సీమంతాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అమర్నా«థ్‌రెడ్డి, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యేలు, బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, పరసారత్నం, కంభం విజయరామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, స్థానిక కార్పొరేటర్ లేబూరు పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
సిగ్గు చేటు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల బలోపేతం కోసం తొలి సంతకం పెడతా.. స్థానిక సంస్థలకు అధికారాలన్నీ బదలాయిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇదే అంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వాలు, అధికారాల బదలాయింపు పక్కన పెట్టి ఉన్న అధికారాలను తీసేసారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలగా మార్చేసి తమ అనుచరగణంతో కూడి జన్మభూమి కమిటీలతో పెత్తనం చెలాయిస్తున్నారు. కొత్తవి ఇవ్వలేదు సరికదా ఉన్నవి లాక్కున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడీ పరిస్థితుల్లో స్థానిక అధికారాల బదలాయింపు విజయోత్సవాలంటూ వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడా ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఐఏఎస్ అధికారి ఎ.ఎన్.నారాయణన్ శుక్రవారం జిల్లా కొస్తున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో జరగనున్న వివిధ గ్రామ సభల్లో పాల్గోనున్నారు. ఇప్పుడా అధికారి వాస్తవ పరిస్థితులనలు తెలుసుకుని కేంద్రానికి నివేదిస్తే స్థానిక సంస్థలకు కాసింతైనా మేలు జరుగుతుందేమోనని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. స్థానిక సంస్థలే పునాది.. గ్రామ స్వరాజ్యం జాతిపిత కల. ప్రజా స్వామ్యానికి స్థానిక సంస్థలే పునాదులు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైతే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మగాంధీ పిలుపునిచ్చారు. అతని ఆశయాన్ని కార్యరూపం దాల్చేందుకు ఎంతో మంది నేతలు కృషి చేశారు. అందులో భాగంగా 1993లో నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 73వ రాజ్యాంగ సవరణ చేశారు. 243(జీ11వ) షెడ్యూల్ ప్రకారం 29 శాఖల అధికారాలను బదలాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సవరణ చేసి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం పంచాయతీరాజ్ వారోత్సవాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. జిల్లాలో ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఒక్క అధికారమూ బదలాయించలేదు వాస్తవానికైతే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 శాఖల అధికారాల్లో ఒక్కటీ కూడా మన స్థానిక సంస్థలకు బదలాయింపు కాలేదు. నిధులు, అధికారాలు, సిబ్బంది, ప్రణాళికలు లెక్కన అధికారాల బదలాయింపుల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా మన రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల్లో కొన్నైనా అమలైనా ఇక్కడ బదలాయింపు ఊసేలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 అధికారాలు బదలాయింపు జరిగాయి. వాటికి ఇప్పుడు తూట్లు పొడిచేసి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. జన్మభూమి కమిటీలతో నాశనం చేసేస్తున్నారు. పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక- పంపిణీ, ఇళ్లు మంజూరు, రుణ లబ్ధిదారుల ఎంపిక, నీరు - చెట్టు పనుల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పథకం పనులు...ఇలా అన్ని రకాల అధికారాలను జన్మభూమి కమిటీలు పూర్తిగా హైజాక్ చేసేసాయి. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ స్థానిక సంస్థల ప్రతినిధుల్ని జీరో చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ వారోత్సవాలు అంటూ గ్రామసభలు నిర్వహించడంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పంచాయతీరాజ్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఐఏఎస్ అధికారి ఎ.ఎన్.నారాయణన్ జిల్లాకు వస్తున్నారు. ఈనెల 22న బొబ్బిలి మండలం మెట్టవలసలో , డెంకాడ మండలం పెదతాడివాడ, 23న కురుపాం మండలం మొండెంఖల్లు, నెల్లిమర్ల మండలం దాసన్నపేటలో జరిగే గ్రామసభల్లో పాల్గొంటారు. ఏదో వచ్చి వెళ్లేదాని కన్నా అధికారాల బదలాయింపు నిజంగా జరిగిందా లేదా అన్నది పరిశీలించి, కేంద్రానికి నివేదిస్తే స్థానిక సంస్థలు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. -
‘నీరు-చెట్టు’కు పురిటి కష్టాలు
► ఆదిలోనే పథకానికి అడ్డంకులు ► 311కుగాను 37 చెరువుల్లోనే పనులు ► ఇంజినీర్లపై ఒత్తిడి పెంచుతున్న కలెక్టర్ ► సెలవుల్లో వెళ్లే యోచనలో అధికారులు ► ఇద్దరు ఈఈలు ఇప్పటికే సెలవు బాట చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి వాటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి పురిటి కష్టాలు పీడిస్తున్నాయి. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే పనులు మొదలు పెట్టకుండానే ఇక్కట్లు చుట్టుముట్టాయి. వంద ఎకరాలకుపైగా ఆయకట్టున్న చెరువుల్లో నీటి వినియోగదారుల సంఘాలు, ఆ లోపు ఆయకట్టున్న చెరువుల్లో జన్మభూమి కమిటీలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 311 చిన్ననీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖల చెరువులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించాలని భావిస్తున్న కలెక్టర్ ఆ మేరకు అధికారులను పరుగులు పెడుతుండగా అంతతొందరెందుకంటూ అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు సతమతమవుతున్నారు. మరోవైపు ఇంజినీర్ల కొరత, పంచాయతీరాజ్ శాఖ చెరువుల్లో పూడికతీత పనులకు జన్మభూమి సభ్యుల పోటాపోటీ కారణంగా వివాదాలు ముదురుతున్నాయి. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె మండలాల్లో ఒక్క చెరువు పని కూడా మొదలు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇదే సమయంలో యంత్రాల కొరత, పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం కూడా ఇందుకు పనులు ప్రారంభం కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా 311 చెరువులకు గాను గురువారం వరకు 37 చె రువుల్లో మాత్రమే పనులు ప్రారంభం కావడం గమనార్హం. యంత్రాల ఏర్పాటుపై వివాదం.. పూడికతీత పనులకు చాలా చోట్ల ప్రొక్లెయిన్ల కొరత వేధిస్తుండడంతో వాటిని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో పనులు ప్రారంభించాలంటూ ఏఈఈలు నీటి సంఘాల అధ్యక్షులపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే యంత్రాలను తామే ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నా పట్టించుకోరేంటని ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతలు ఇంజినీర్లపై మండిపడుతున్నారు. పనులు ప్రారంభించాలని ఓ వైపు కలెక్టర్ ఒత్తిడి పెంచుతుండగా అధికారపార్టీ నేతల నిర్వాకంతో జాప్యం తప్పడం లేదు. మరోవైపు కరువు కారణంగా చాలా మంది పశ్చిమ ప్రాంతాల చిన్న, సన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పూడిక మట్టిని పొలాలకు తరలించుకునే వారు కరువయ్యారు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఇంజినీర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయడం లేదని తెలుస్తోంది. కలెక్టర్ మాత్రం పనులు చేయించాలని వెంటపడుతుండడంతో చాలా మంది ఇంజినీర్లు అనారోగ్య కారణాలు చూపి సెలవుల్లో వెళ్లే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీ కాల్వ ఈఈ కొండారెడ్డి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. మైనర్ ఇరిగేషన్ కర్నూలు డివిజన్ ఈఈ శ్రీనివాసులు బుధవారం నుంచి ఇదే బాట పట్టినట్లు తెలిసింది.