Vision 2047
-
డిసెంబర్ నాటికి రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047
-
చంద్రస్వామి తాయెత్తు విజన్!
తర్కంతో కొట్టలేనప్పుడు తాయెత్తుల మహిమను చూపాలి. పేదలు, బాధితులు, దగాపడిన తమ్ముళ్ల కంటిపాపల్లో కాంతి కిరణం మెరిసినప్పుడల్లా పెత్తందారీ హేతువులోంచి ఓ బేతాళుడు నిద్రలేస్తాడు. ఓం హ్రీం అంటూ ఆవులిస్తాడు. నయా పెత్తందారీవర్గపు ఉంపుడు సిద్ధాంతకర్త నారా చంద్రబాబు నాయుడులోంచి తాజా తేనెపూత విజన్తోపాటు ఓ బేతాళుడు కూడా బయటికొచ్చాడు. మహిళా లోకంపై మంత్ర ప్రయోగం మొదలుపెట్టాడు. ఆడబిడ్డలందరికీ ఆయన మంత్రించిన రాఖీలు ఇస్తాడట! వాటిని 45 రోజులు పూజగదిలో పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబును తలుచుకోవాలట! అనంతరంచేతికి కట్టుకోవాలి. అప్పుడు వారికి అష్టసిరులు ఒనగూరు తాయట! మంత్రదండం సాయంతో నారా చంద్రస్వామి ఈ రకంగా మహిళా సాధికారత సాధిస్తారన్న మాట.. నిత్యానంద స్వామి కైలాసాన్ని సృష్టించినట్టు! ఆగస్టు పదిహేనో తేదీనాడు చంద్రబాబు ‘విజన్– 2047’ పేరుతో విశాఖపట్టణంలో ఒక కాగితాల కట్టను విడుదల చేశారు. దాన్ని తన ఆలోచనగా చెప్పుకున్నారు. మామూలుగా పంద్రాగస్టు కార్యక్రమాలను కవర్ చేసేటప్పుడు తొలి ప్రాధా న్యాన్ని ప్రధానమంత్రికిస్తూ అదే స్థాయిలో రెండో ప్రాధాన్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికివ్వడం ప్రాంతీయ మీడియాలో ఒక సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ యెల్లో మీడియా మాత్రం ముఖ్య మంత్రిని పక్కకునెట్టి చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌కు అగ్ర స్థానాన్ని ఇచ్చింది. ఇంతకూ ఇందులో ఏమంది? 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు నిండు తాయి. అప్పటికి దేశం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఏడాది కింద కేంద్ర ప్రభుత్వం ‘విజన్ – 2047’ను రూపొందించింది. ఆ ఏడాది కిందటి ఆలోచనలోంచి ఓ పిడికెడు మాదాకబళాన్ని తీసుకొచ్చి కొంచెం వెచ్చచేసి బాబు వడ్డించారు. పోనీ దాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తూ అనుసృజన చేసినా బాగుండేది. కానీ, ‘దేశ్ కీ నేతా’ హోదాకు ఇంచు కూడా తగ్గేందుకు బాబు సిద్ధ పడలేదు. బహుశా ‘రాజ్య్ (రాష్ట్ర) కీ నేతా’ హోదా మరోసారి దక్కే అవకాశం లేదని గట్టిగా నమ్మారేమో! ఇంకో పాతికేళ్లలో దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని చెప్పుకున్నారు. ఏ హోదాతోనో చెప్పలేదు. ‘ఆప్ కౌన్ హై’ అని అడిగే అవసరం ఎవరికీ లేదు. తనకు యాభై అయిదేళ్లు నిండకముందే నాలుగు శతాబ్దాల పైచిలుకు వయసుతో హైదరాబాద్‌ను సృష్టించిన వ్యక్తికి ఏదైనా సాధ్యమేనని సరిపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ పవర్, రోబోటిక్స్ వగైరా తాజా పదజాలాన్ని ఆయన విజన్‌లో విరివిగా ఉపయోగించారు. అబ్బో మా బాబుగారికి చాలా విషయాలు తెలుసునని అనుయాయులు మురిసిపోవడానికి తప్ప సామా జిక చింతన ఏ కోశానా అందులో లేదు. ఇంటర్లో బైపీసీ చదివితే ఉత్తమ ఇంజనీర్లుగా ఎదగవచ్చనే ఒక గొప్ప ఉప దేశాన్ని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అనుగ్రహించారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న విజన్‌కు తాను కూడా ఇలా కోరస్ పాడితే ఆయన మెప్పు పొందవచ్చన్న తహతహ ఒక కారణం కావచ్చు. తనను గొప్ప విజనరీగా భజన చేస్తున్న యెల్లో మీడియాలో ఆత్మవిశ్వాసం నింపడం మరో కారణం కావచ్చు. ఈ రెండు అవసరాల కోసం చంద్రబాబు పంద్రాగస్టు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆయనకు పెద్దగా విశ్వాసం లేదు. ఎందుకంటే తన మొదటి విజన్ (2020) ఆర్థికంగా తనకు లబ్ధి చేకూర్చినా, రాజకీయంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక తెలుగు సమాజానికైతే ఆ విజన్ సృష్టించిన విధ్వంసం మరిచిపోలేని ఒక మహా విషాదం. చంద్రబాబు తన ‘విజన్–2020’ సారాంశంతో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రచురించారు. తెలుగులో దాని పేరు ‘మనసులో మాట’. దాని పేరును బట్టే ఆ పుస్తకంలోని అభిప్రాయాలు చంద్రబాబుకు స్వాభావికమైన విగా, ఆయన నమ్మకాలుగా భావించాలి. ఉచిత పథకాలను ఈ పుస్తకంలో ఈసడించుకున్నారు. ఉచిత విద్యుత్‌ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు బుద్ధిగా మసలుకోవాలని (అప్పు డాయన అధికారంలో ఉన్నారు), ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరే కించకూడదని సుద్దులు చెప్పారు. ఉద్యోగాలు పర్మనెంటయితే వారికి బాధ్యత ఉండదని, అందువల్ల కాంట్రాక్టు పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పద్ధతికి శ్రీకారం కూడా చుట్టారు. విద్య, వైద్యం ఏదీ ఉచితంగా అందుబాటులో ఉంచకూడదని గట్టిగా వాదించారు. ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీల వసూలు ప్రారంభించారు. పేదవాడికి జ్వరం వచ్చినా డబ్బులు చెల్లించనిదే మందుబిళ్ల కూడా దొరకని దుర్మార్గ పరిస్థితి ఏర్పడింది. సర్కారు బడులను పాడుబెట్టి చదువు‘కొనలేని’ ఒక తరాన్ని మొత్తం విద్యకు దూరం చేశారు. మధ్యతరగతి ప్రజలు సైతం చదువుల ఖర్చులు భరించలేక అప్పుల ఊబిలోకి దిగబడిపోయారు. వ్యవసాయం దండగ అనే సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రైతాంగంలో అదే అభిప్రాయం వ్యాప్తి చెందేలా చేశారు. రైతు కూలీలు భూబంధం నుంచి బయటపడితేనే సంపన్నుల పనులకు చౌకగా శ్రమశక్తి లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయన కోరుకున్న ట్టుగానే లక్షలాది రైతు కూలీలు పొలం బంధాన్ని తెంచు కున్నారు. పొట్టకూటి కోసం వలస బాటలు పట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూలీ తల్లులు చంటిబిడ్డల నోటికి పాలపీకలు పెట్టిన కల్లు సీసాలను అందించారు. కల్లు మత్తులో ఆ బిడ్డ నిద్రపోయి తల్లి కోసం ఏడ్వదని వారు అలా తల పోసేవారు. మాటలకందని ఆ మహాదైన్యం అప్పుడు ఎక్కడ చూసినా కనిపించేది. వలసబాట పట్టకుండా మొండికేసి వ్యవసాయం చేసిన వారు బాబు విధానాల ఫలితంగా అప్పుల పాలై ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. బిడ్డలు వలసపోగా మిగిలిన అవ్వాతాతలు అంబలి కేంద్రాల దగ్గర బారులు తీరి నిలబడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తే! ఈ దుఃస్థితికే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అనే పాటలో అద్దంపట్టిన సంగతి తెలిసిందే. ఈ కన్నీటికి కారణం చంద్రబాబు విజన్. ఆ కన్నీటిపై ఐటీ పన్నీరు చల్లి ‘ఇదీ చంద్రబాబు విజన్’ అని ఆయన అనుకూలవర్గం ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. తాను ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడం వల్లనే ఐటీ నిపుణులు పెరిగారని ఆయన ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ అంతకంటే ఐదేళ్లు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రకటిస్తే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. హైటెక్ సిటీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రణాళిక సిద్ధమైందని చంద్రబాబే స్వయంగా ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. రెడీగా ఉన్న ప్రణాళికను అమలు చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఆయన ఆలస్యం చేశారు. ఇదీ జరిగిన వాస్తవం. ఈ వాస్తవాలను యెల్లో మీడియా మసిపూసి మారేడుకాయలు చేసింది. ఒక సామాజిక విధ్వంస కుడికి విజనరీ ముసుగువేసి చరిత్రలో నిలబెట్టింది. ఇది చరిత్రలో జరిగిన ఒక ద్రోహం. బాబు విజన్‌తో కన్నీరు పెట్టిన పల్లెసీమలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మళ్లీ చిగురించడం మొదలైంది. రైతు మళ్లీ నాగలి పట్టాడు. వైద్యం పేదలకు చేరువైంది. జన సంక్షేమ విజన్‌కు ప్రాధాన్యం లభించింది. పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ – పవన్ పొత్తులతో వెంట్రుకవాసి విజయాన్ని సాధించగలిగాడు. ఈ గెలుపు కోసం తన మనసులోని మాటను దాచిపెట్టాడు. సంక్షేమ ఎజెండాను ఎత్తుకోవడమే కాదు అలవిగాని హామీలతో తన ఎన్నికల మేని ఫెస్టోను నింపేశారు. గెలిచిన తర్వాత రాజధాని పేరుతో భూదోపిడీకి, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడేందుకు పరిమిత మయ్యారు. అదిగో అల్లదిగో అంటూ రాజధాని గ్రాఫిక్స్‌ను ప్రచారంలో పెడితే, ‘ఇది కదా విజన్’ అంటూ యెల్లో మీడియా పరవశించిపోయింది. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎటువంటి తడ బాటూ, శషభిషలూ లేని స్పష్టమైన పేదల అనుకూల ఎజెండాను తలకెత్తుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల పురోగతి కోసం, అన్ని వర్గాల్లోని మహిళల సాధికారత కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, అధికార వికేంద్రీ కరణ కోసం ఒక ఉద్యమాన్నే ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అడ్డువస్తున్న పెత్తందారీ వ్యవస్థపై జగన్ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. వ్యవస్థలోని అన్ని పార్శా్వల్లో ఈ పెత్తందారీ వ్యవస్థ ఊడలు దించి బలోపేతమై ఉన్నది. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆ వ్యవస్థపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించడానికి సాహసించలేదు. పెత్తందారీ వ్యవస్థతో తలపడటం, ఓడించడం ద్వారానే పేదల విముక్తి సాధ్యమని నమ్మిన జగన్ ప్రభుత్వం అందుకు బరిగీసి నిలబడి ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ తన సహస్ర బాహువులతో జగన్ ప్రభుత్వంపై విషం చల్లుతున్నది. దశకంఠాలతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. తమ ఎన్నికల మేనిఫెస్టోను గడప గడపకూ పంపిణీ చేస్తూ తాము ఎన్ని హామీలను నెరవేర్చామో పరిశీలించి పరిపాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ సర్కార్. ఎన్నికల మేనిఫెస్టోను కనబడకుండా మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? మేనిఫెస్టోకు పటంకట్టి ఊరేగిస్తూ ‘మేం చేయని పనేమిటో చెప్పండ’ని పిలుపునిస్తున్న జగన్ ప్రభుత్వం ఎక్కడ? ప్రజాక్షేత్రంలో ద్వంద్వ యుద్ధానికి తలపడటం సాధ్య మయ్యే పనేనా? కాదు కనుకనే మాయోపాయాలు, దుష్ప్రచారాలు, కుతంత్రాలు వేయి పడగలెత్తి బుసకొడుతున్నాయి. బాబుకు వేసిన విజనరీ ముసుగు జారిపోకుండా మొన్న ప్రకటించిన ఎంగిలి విజన్ ఒక పడగ. తాయెత్తు మహిమలు ప్రచారం చేయడం, మూఢనమ్మకాలను వ్యాపింపజేయడం ఇంకో పడగ. భారత రాజ్యాంగం 51వ అధికరణం ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడం పౌరుల ప్రా«థమిక విధి. అందుకు విరుద్ధంగా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడే మూఢ నమ్మకాలను రెచ్చగొట్టడం రాజ్యాంగ ద్రోహమవుతుంది. పైగా వాటికి ఆయన రాఖీలని పేరు పెట్టారు. మంత్రించి ఇచ్చేవి తాయెత్తులవుతాయి గానీ రాఖీలెట్లా అవు తాయి? అయినా తమ సాధికారతకు కట్టుబడిన వాళ్లకు, తమకు రక్షణగా నిలబడిన వాళ్లకు మహిళలే స్వయంగా రక్షాబంధనాలు కడతారు తప్ప మంత్రగాళ్లకు కాదు గదా! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఫేక్ బాబు..ఫేక్ విజన్
-
బైపీసీతో ఇంజినీరింగ్.. బాబుపై పేలుతున్న మీమ్స్
ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చేయాలంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్జానాన్ని ప్రదర్శించి పరువును దిగజార్చుకోవడంతో ఇదెక్కడి విజనరీ బాబు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇదేనా మీ విజనరీ పాఠాలు అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు.. ఇంటర్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలెట్ అయ్యారు. ప్రసంగాల్లో నేతలు తడబడటం సహజమే కానీ, మరీ ఇలా విజన్ -2047 అంటూ దేశానికే దిశా నిర్దేశం చేసేలా ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఇంటర్లో ఇంజినీరింగ్ అంటూ బుక్కయిపోవడం మాత్రం విశేషం. కాగా ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన విజన్ గురించి వివరించే సమయంలో.. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి.. ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్మీయట్‌లో బైపీసీ చేయాలి.. అని వివరిస్తూ పప్పులో కాలేశారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ సోషల్ మీడియాలో చంద్రబాబుపై పేలుతున్న మీమ్స్ ఇవే... ⬇️ -
‘మోసం, దగా.. ఇవే చంద్రబాబు విజన్’
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసం విజన్-2047 పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు ఎర వేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) విమర్శించారు. ఓట్ల కోసం ముసలి పూతన వేషంలో వస్తున్న చంద్రబాబు పట్ల ప్రజలు చిన్నికృష్ణుడిలా వ్యవహరిస్తూ తమ పని తాము చేసుకుని పోతారన్నారు. ముసలి పూతన వేషంలో ప్రజల ముందుకు వచ్చినా, శకటాసురిడిలా జగన్ మీదకు వచ్చినా చంద్రబాబుకు తగిన శాస్తి ఖాయమని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్-2047పై నిప్పులు చెరిగారు. మోసం, దగా.. ఇవే చంద్రబాబు విజన్ అంటూ దుయ్యబట్టారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఐదేళ్లలో వారికి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చామనేది నాయకుడిగా విజన్ ఉండాలని.. మాయా విజన్లు, కాలజ్ఞానాలు, చిలకజోస్యాలు పనికి రావనేది చంద్రబాబు గ్రహించాలని సూచించారు. 14 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజలను ఇలాంటి విజన్ డాక్యుమెంట్లతో నయవంచన చేయడం ధర్మం కాదని హితవు పలికారు. కరెంట్ తీలపై బట్టలారేసుకోవాల్సిందేనన్న విజనరీ విజన్-2047 అనే కాగితాల కట్టలను ప్రజలపై చిమ్మి.. తద్వారా తెలుగు ప్రజలను ప్రపంచ పటంలో నిలపడమే తన లక్ష్యమని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీకి అధికారం ఇస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెబుతున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. విద్యుత్ చార్జీలు తగ్గించమని కోరితే హైదరాబాద్ నడిబొడ్డున ముగ్గురిని పిట్టలు కాల్చినట్లు కాల్చి చంపారు. అలాంటి విజనరీ విద్యుత్ చార్జీలు తగ్గిస్తానంటే జనం నమ్మాలా? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చెబితే.. కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన విజనరీ చంద్రబాబు. ► విద్యుత్ శాఖపై 2014లో ఉన్న రూ.20 వేల కోట్ల అప్పును రూ.80 వేల కోట్లకు తీసుకెళ్లిన చంద్రబాబు.. 2019 నాటికి విద్యుత్ కొనుగోళ్ల బకాయిలు రూ.22 వేల కోట్లను ప్రజలపై మోపారు. ► మాట్లాడితే తనది 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పే చంద్రబాబు, నాడు ఆర్భాటంగా ప్రకటించిన విజన్-2020తో పొడిచేసిందేంటి? 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, సీఎం పదవిని లాక్కున్నాక మెకన్సీ అనే వారితో ఒక పుస్తకం రాయించి.. దాన్నే విజన్-2020 డాక్యుమెంటుగా విడుదల చేశాడు. వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలను వేరే రంగాల్లోకి మళ్లించాలని, వారి సంఖ్య తగ్గించాలని విజన్- 2020లో చెప్పాడు. రాష్ట్రంలో ఈ రోజుకీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 63 శాతం ఉంటే ఏం తగ్గించినట్లు? ► చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడంటే చినబాబుకు కోపం వస్తుంది. ఆధారం ఏమిటి అంటున్నాడు. మీ తండ్రి ఇచ్చిన విజన్-2020 డాక్యుమెంటే దానికి ఆధారం లోకేష్. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వారిని తగ్గించాలంటే దాని అర్థం వ్యవసాయం దండగనే. నేటికీ భారతదేశంలో, ఏపీలో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారితం. మన రాష్ట్రం భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అంటారు. అలాంటి రాష్ట్రంలో వ్యవసాయం దండగన్నారు చంద్రబాబు. 14 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టావా? ► చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. రాష్ట్రంలో డిజైన్ చేసి, పనులు ప్రారంభించి.. పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? చివరకు నీ సొంత నియోజకవర్గం కుప్పానికి అయినా నీళ్లిచ్చావా? గాలేరు-నగరిని గాలికి వదిలేసింది నువ్వు కాదా? చిత్తూరుకే దిక్కు లేదు. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టాడు. విజన్-2020 అయిపోయింది. ఇప్పుడు విజన్-2047 అట. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్టుంది చంద్రబాబు తీరు. ► ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఇప్పుడు ఆయన విజన్-2047 అంటున్నాడు. అప్పటికి ఆయన విజన్ ఉంటుందా? జయంతి, వర్ధంతులు ఉంటాయా.. అనేది భగవంతుడికే తెలియాలి. ప్రజలు నవ్వుకుంటారని కూడా గుర్తించకుండా ఇలాంటివన్నీ చెబుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న నీవు.. నీకంటూ చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్క పథకాన్ని అయినా అమలు చేశావా? చంద్రబాబు విజన్ కేవలం పబ్లిసిటీ మాత్రమే. నారావారిపల్లెలోనైనా పాఠశాలను బాగు చేశావా? ► విద్యా వ్యవస్థలో మీ దార్శనికత ఎక్కుడుంది చంద్రబాబూ? ఏనాడైనా కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్‌ను అయినా బాగు చేద్దామని ఆలోచించావా? చివరికి నారావారిపల్లెలోనైనా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని అనుకున్నావా? ► నారాయణ, చైతన్య స్కూళ్ల ఎదుగుదల చూసి మురిసిపోయావుగానీ, ఒక్క ప్రభుత్వ స్కూల్ వైపైనా చూశావా? ఇదా విజనంటే? చివరికి ప్రభుత్వ స్కూళ్లలో ఎలా పాఠాలు చెప్పాలో కూడా పర్యవేక్షణ నారాయణ సంస్థలకు అప్పజెప్పావు. ఇది దిక్కుమాలిన విజన్ కాదా? విజన్-2020 పూర్తయ్యేసరికి అక్షరాస్యతలో రాష్ట్రానిది చివరి స్థానం. స్కూల్ డ్రాపవుట్స్‌లో నంబర్ వన్. ► ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు వైద్యం చేరువ చేయాల్సింది పోయి.. చంద్రబాబు యూజర్ చార్జీల మోత మోగించాడు. పేదలు మందులు కొనుగోలు చేయాలన్నా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిందే. అది దివాళా కోరు విజన్ కాదా? ఇదీ విజన్ అంటే.. ► 108.. 104.. ఆరోగ్యశ్రీ.. అవన్నీ డాక్టర్ వైఎస్ విజన్. కాకిలాగా ఎన్నాళ్లు బతికితే ఏం ఉపయోగం చంద్రబాబూ? 2047 వరకూ బతకాలా? 2014-19లో 108 అంబులెన్స్‌లను షెడ్లలో పెట్టాడు. ఇది చంద్రబాబు మార్కు విజన్. 1,540 కొత్త అంబులెన్స్‌లను కొని ప్రజలకు అందించడం వైఎస్ కుమారుడు సీఎం జగన్ విజన్. ► కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయ్యే సరికి ఆరోగ్యశ్రీ కింద వెయ్యి జబ్బులు ఉంటే చంద్రబాబు ఒక్క జబ్బు కూడా పెంచలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక 3,600 జబ్బులకు వైద్యం చేయించేందుకు ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2019లో జనం చీ కొట్టి నిన్ను ఇంటికి పంపేనాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.900 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. ఇది ది గ్రేట్ చంద్రబాబునాయుడు విజన్. ► 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు. యువ ముఖ్యమంత్రి జగన్ మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టి.. ఈ ఏడాది నుంచి 5 కాలేజీల్లో బోధన మొదలు పెడుతున్నారు. వైద్యం పేదవానికి ఉచితంగా అందాలని డాక్టర్ల సంఖ్యను, ఆస్పత్రుల బెడ్ల సంఖ్యను పెంచారు. 53 వేల మంది సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖలో నియమించారు. ఇదీ విజన్ అంటే. ఆడబిడ్డల బంగారం వేలంలో బాబు నంబర్ వన్ ► మహిళా సాధికారత కోసం విజన్-2047లో తన విధానమేంటో చంద్రబాబు చెప్పలేదు. 2014లో అధికారం కోసం మహిళలకు సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. బాబు వస్తే అప్పులు తీరిపోతాయి.. బ్యాంకుల్లో బంగారం కూడా విడిపిస్తాడంటూ ప్రచారం చేసుకున్నాడు. చివరికి దేశంలో 2014-18 మధ్య అతి ఎక్కువగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ► 2047లో నంబర్ వన్ కాదు.. ఇప్పటికే చాలా విషయాల్లో నంబర్ వన్‌గా నిలిపాడు. బ్యాంకుల్లో బంగారం వేలం వేయడంలో, డ్రాపవుట్స్‌లో నంబర్ వన్. 2019 నాటికి సకాలంలో చెల్లింపుల ద్వారా కేవలం 19 శాతం డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ, బీ గ్రేడుల్లో ఉన్నాయి. చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల డ్వాక్రా మహిళలు అప్పులు కట్టకుండా వడ్డీలకు చక్రవడ్డీలై దారుణంగా మోసపోయారు. నేడు జగన్ వచ్చాక 91 శాతం డ్వాక్రా సంఘాలు ఏ, బీ గ్రేడ్ లలో ఉన్నాయి. నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావ్? ► ప్రభుత్వ ఉద్యోగులను గణనీయంగా తగ్గించాలి.. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలనేది చంద్రబాబు విజన్-2020. 1995 - 2019 మధ్య 14 ఏళ్ల పాటు నిరుద్యోగ యువతకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు బాబూ? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ ఇన్వ్యాలిడేషన్ అక్కర్లేదు అన్న విజన్ చంద్రబాబుదే. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కారుణ్య నియాకం వద్దన్న విజన్ కూడా ఆయనదే. ► కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే విజన్ కూడా చంద్రబాబుకు లేదు. 2014లో రాష్ట్రం విడిపోతే తెలంగాణను కాపీ కొట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమిటి? కేసీఆర్ ముఖ్యమంత్రి.. నేను ముఖ్యమంత్రి అన్నావ్.. కేసీఆర్ కొడుక్కి మంత్రి పదవి ఇచ్చాడు.. ఈయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. తెలంగాణలో జిల్లాల విభజన జరిగితే మన రాష్ట్రంలో వికేంద్రీకరణ ఎందుకు చేయలేదు? ► వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు నడిబజార్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. దాన్ని పరిష్కరించే విజన్ ఏమైపోయింది బాబూ? చిన్న చిన్న సర్టిఫికెట్ల కోసం కూడా మండల కేంద్రాలకు వెళ్లి పడిగాపులు పడాల్సిన దుస్థితిపై విజన్ ఎందుకు లేదు? ఈ పబ్లిసిటీ విజనరీ చివరికి కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేయమని అడుక్కునే దుస్థితి. మన చుట్టూ ఉన్న ఆర్తులను చూడలేని, చూసినా ఉద్దరించలేని విజన్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అది విజన్ కాదు.. అంధత్వం అవుతుంది. ఒక పాలకుడికి అది గుడ్డితనమే. అధికారం ఉంటే ఇక్కడ.. లేదంటే ప్రవాసం ► రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. వారి చేతిలో పనిముట్లు.. వారి ఓట్లు మనకు అన్నదే చంద్రబాబు విజన్. అణాగారిన వర్గాల ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్ది.. పేదరికం నుంచి గట్టెక్కిద్దామనే ఆలోచన ఏనాడూ చంద్రబాబు చేయలేదు. ► వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అనేది డాక్టర్ వైఎస్ విజన్. ఉచిత విద్య భవిష్యత్తుపై పెట్టుబడి అనేది నేటి సీఎం జగన్ విజన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది.. పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టారు. ► 2014లో అధికారం కోసం బీసీలకు చంద్రబాబు 143 హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఫొటోల్లో మాత్రం పక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండాలి. ఐదేళ్లలో ఒక ఎస్టీ వర్గానికి మంత్రి లేడు.. ఒక మైనార్టీలకు మంత్రి లేడు.. వారు మనుషులు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? వారికి అధికారం ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు. ► ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోగానే పారిపోయే నీకు ఈ రాష్ట్రం పట్ల ఏం విజన్ ఉందో చెప్పాలి. అధికారం ఉంటే ఇక్కడ నివాసం.. అధికారం పోతే ప్రవాసం.. ఇదే చంద్రబాబు విజన్. కొల్లేరు, పులికాట్లో సీజనల్‌గా వచ్చే విదేశీ పక్షులకు.. అవసరం ఉన్నప్పుడు వచ్చే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు తేడా ఏమీ లేదు. బాబు మోసగాడు.. పవన్ గజ మోసగాడు ► చంద్రబాబు మామూలు మోసగాడైతే.. పవన్ కల్యాణ్ గజమోసగాడు. సినిమా డైలాగులతో కవులు రాసిస్తే దాన్ని సభల్లో ప్రజలకు అప్పచెబుతుంటాడు. సుత్తి కబుర్లు ఆపి చిత్తశుద్ధితో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఏం చేశాడో చెప్పాలి? 2019 నుంచి బీజేపీతో ఉంటున్నాడు కదా.. ఈ రాష్ట్రానికి ఏం చేశాడు? ప్రజాకోర్టు అంటూ సినిమా టైటిళ్లు బాగానే ఉంటాయి.. ముందు వీటికి సమాధానం చెప్పు పవన్? ► 2014లో చంద్రబాబుకు ఓటేయండని పవన్ అడిగాడు. ప్రజలకు క్షవరం అయ్యింది. మళ్లీ రేపు అదే చెప్తాడు. కచ్చితంగా పవన్ కల్యాణ్ అనే రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు. తేల్చీ తేల్చనట్లు.. ఖుషీ సినిమా తరహాలో వ్యవహరిస్తాడు. కాసేపు మన ప్రభుత్వం.. నేను ముఖ్యమంత్రి అంటాడు. కాసేపు సంకీర్ణ ప్రభుత్వం అంటాడు.. మళ్లీ మనకు సీట్లు, ఓట్లు ఎక్కడ? మనం ముఖ్యమంత్రి ఏంటి అంటాడు. ► దమ్ముంటే.. నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను అని చెప్పు పవన్.. లేదా మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ► నీ కులపోడి కోసమే ‘ఈనాడు’లో అబద్ధాలను అచ్చేస్తున్నావన్నది ప్రజలందరికీ తెలుసు రామోజీ? మార్గదర్శి చిట్స్‌లో మీరు తప్పు చేశారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పగలవా? నిజాయితీగా దానిపై ఒక్క వార్త రాయలేని మీదీ జర్నలిజమా? అని పేర్ని నాని నిలదీశారు. ఇదీ చదవండి:జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది -
సూపర్ పవర్
-
ఇద్దరి విజన్ ఒక్కటే..తోడుదొంగలు దొరికిపోయారు
-
ప్రపంచ శక్తిగా భారత్ ఎదగాలంటే...
కేంద్ర ప్రభుత్వం తన విజన్ ఇండియా 2047 లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తులుగా గుర్తించింది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచ ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సారానికి దాన్ని 5 శాతం పెంచేందుకు తప్పకుండా సన్నద్ధం కావాలి. ► స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మనదేశం గ్లోబల్ ఇన్నో వేషన్ లీడర్ కావాలనేది నా విజన్. ఆరోగ్యరంగం, విద్య, నిలకడైన జీవితాన్ని సమానంగా అందుకుంటూ ఒక సురక్షిత వాతావరణంలో ప్రతి ఒక్కరూ సౌభాగ్యానికి నోచుకునే సమ్మిశ్రితమైన ఆర్థిక వృద్ధిపై దేశం అప్పటికి దృష్టి పెట్టివుంటుంది. మౌలిక భావనలపై మదుపు చేయడం ద్వారా, వ్యవస్థాపకతను ఆర్థిక వృద్ధి నమూనాగా చేయడం ద్వారా భారతదేశం తన పౌరులందరికీ ఉన్నత జీవితానికి హామీ ఇస్తుంది. టెక్నాలజీతో కూడిన పరిశోధన, సృజనాత్మకతలు పెను గంతుతో కూడిన ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల 2047 నాటికి భారత్ ప్రపంచంలోని మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబడటమే కాదు, అభివృద్ధి చెందిన దేశపు హోదాకు దగ్గరవుతుంది. ► కేంద్ర ప్రభుత్వం తన ‘విజన్ ఇండియా 2047’ లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తు లుగా గుర్తించింది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారు తుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి భారీ పారిశ్రామిక కార్య కలాపాలవైపు ఎదిగేలా ‘టెక్నోప్రెన్యూర్ల’ను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లకు భారత సృజనాత్మక భావనలను తీసుకుపోయే అవకాశా లను సృష్టించగలుగుతుంది. 2047 నాటికి గ్లోబల్ ఇన్నో వేషన్ ఇండెక్స్‌లో టాప్ 20 దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలబట్టే లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ► సరసమైన ధరలకు లభించే ఇంటర్నెట్తో కూడిన డిజిటల్, డేటా మద్దతు కలిగిన సృజనాత్మక ఆలోచనలు భవిష్యత్తులో వేగంగా ఎదిగే డిజటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడతాయి. భారత్ దేశా నికి ఉన్న శాస్త్రీయ ప్రతిభ ద్వారా ఆరోగ్యరంగంలో ఉత్పాదకతను, నాణ్యతను ప్రోత్సహించగలదు. ఆ విధంగా సరసమైన ధరలకు ఆరోగ్య సేవలను అందించడం, ముందస్తు వ్యాధి నివారక విధానా లను అమలు చేయడం సాధ్యపడటమే కాకుండా, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు నిజమైన విలువను తీసుకొస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే, వ్యవస్థీకృతంగా, జవాబుదారీ తనంతో ఉండే, సరసమైన ధరలతో, స్వావలంబనతో కూడిన జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో ఇది తోడ్పడుతుంది. ► భారత్‌లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి క్రమబద్ధీకరణలను మరింత సరళం చేస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను మనం అభినందించాలి. అదే సమయంలో, మహమ్మారి వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చింది. డాక్టర్లను ‘టెక్ సావీ’లుగా మార్చడమే కాదు, యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ సొల్యూషన్లపై ఆరోగ్య సంరక్షణ రంగం మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఈ పరిణామాలన్నీ తక్కువ వ్యయంతో కూడిన, టెక్నాలజీ ఆధారిత సృజనాత్మక ఆవిష్కరణలను సరసమైన ధరలకు అందించే ఒక ఫలప్రదమైన వాతావరణాన్ని కల్పించాయి. ► ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్ చొరబాటుకు సంబంధిం చిన పూర్తి ప్రయోజనాలను అందించేందుకు భారత్ విధానాల రూప కల్పననూ, నిధులనూ ఒక సమన్వయంతో అమలు చేయవలసిన అవసరం ఉంది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రామాణీకరించబడిన, నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సానికి మన జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని 5 శాతం పెంచేందుకు భారత్ తప్పకుండా సన్నద్ధం కావాలి. ► భారత ఔషధ పరిశ్రమ ఇప్పటికే ‘ప్రపంచ ఫార్మసీ’గా వెలు గొందుతోంది. ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే మూడో ర్యాంకులో నిలబడుతోంది. రాగల 25 సంవత్సరాల్లో ఫార్మా స్యూటికల్ వాల్యూ చెయిన్‌లో మరింత వాటాను సంగ్రహించగల గాలి. దీనికోసం, వినూత్నమైన బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్, జీన్ థెరపీలు, హై ఎండ్ కాంట్రాక్ట్ రీసెర్చ్ , తయారీ సేవల్లో ఆవిర్భవిస్తున్న అవకాశాలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ‘ఎంఆర్ఎన్ఏ’తో పాటు ఇతర నూతన తరం టీకాలు, ‘ఆర్ఫన్ డ్రగ్స్’, విలువైన మందులు, మోలిక్యులార్ డయాగ్నసిస్ వంటి అంశాలపై కూడా మనం దృష్టి సారించాల్సి ఉంది. సరైన విధానాలతో భారత ఔషధ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్లనుంచి 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగి, ప్రపంచంలోని టాప్ అయిదు దేశాల సరసన నిలబడుతుంది. ఇక ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాం. ► ఫార్మా రంగంలో 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించే రోడ్ మ్యాప్‌లో అధునాతన పరిశోధన, సృజనాత్మకతలను స్వీక రించడం, గ్లోబల్ స్థాయి ఆపరేషన్లను నిర్వహించడం, నాణ్యమైన క్రమబద్ధీకరణ వ్యవస్థను రూపొందించడం ఉంటాయి. పరిశోధనతో సంబంధ ప్రోత్సాహకాలు ఫార్మారంగంలో పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను పెంచుతాయి. అలాగే మరింత మెరుగైన పరిశ్రమ– అకెడమిక్ భాగస్వామ్యాలను పెంచుతాయి. ► 2047 నాటికి అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా మారడానికి, భారత దేశం తన మహిళా శక్తికి సాధికారత కల్పించాలి. ఒక దేశంగా ఆర్థిక ప్రధాన స్రవంతిలో మహిళలకు అవకాశాలను కల్పించడమే కాకుండా, ఉత్పాదక కృషిలో స్వేచ్ఛగా పనిచేసే వీలు కల్పించాలి. వేతనం లేని శ్రమ శృంఖలాల నుంచి వారిని విముక్తి చేయాల్సి ఉంది. ► భారతదేశ నియత కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 24 శాతంగా మాత్రమే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ శాతంగానే చెప్పాలి. అనియత రంగంలో పనిచేస్తున్న భారత మహిళల్లో చాలా మందికి సామాజిక రక్షణ తక్కువ. పైగా వేతనాలు కూడా తక్కువగా ఉంటు న్నాయి. మహిళలను నియత ఆర్థిక వ్యవస్థలోకి పురుషుల భాగ స్వామ్యంతో సమానంగా తీసుకురాగలిగితే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరో 60 శాతం వృద్ధి చెందగలదని అంచనా. అంటే ఆర్థిక వ్యవస్థకు 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయం జమవుతుంది. రెండంకెల వృద్ధిని సాధించాలంటే, మన ‘టాలెంట్ పూల్’లో సగ భాగంగా ఉన్న మహిళల శక్తిని విస్మరించలేము. విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, ప్రాథమిక హక్కుల వంటి అంశాల్లో మహిళా కేంద్రక కార్యక్రమాలను చేపట్టాలి. 2047 నాటికి నియత రంగంలో 50 శాతం మహిళా భాగస్వామ్యాన్ని తప్పక పెంచాల్సి ఉంటుంది. ► 2047 నాటికి, పునరుద్ధరణీయ శక్తివనరులపై దృష్టి పెట్టాలి. వ్యర్థాలను, ఉద్గారాలను తగ్గిస్తూ, వినిమయ సంస్కృతిని తగ్గించాలి. రీసైకిలింగ్, రీయూజ్ వంటి విధానాలను ప్రవేశ పెట్టాలి. దీనికోసం, భారత్ తన వృద్ధి నమూనాల్లో సంపూర్ణంగా సమగ్ర పర్యావరణ స్వావలంబనను చొప్పించాల్సిన అవసరం ఉంది. ఒక దేశంగా మన విద్యుత్ అవసరాల్లో 80 శాతాన్ని 2047 నాటికి పునర్వినియోగ శక్తి వనరుల ద్వారా తీర్చుకోవడం మన లక్ష్యం కావాలి. పారదర్శకమైన, సమర్థవంతమైన, ఆర్థికంగా సమ్మిశ్రిత రూపంలో ఉండే డిజిటల్ సాధికారిక సమాజాన్ని, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం ద్వారా నూరవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించగలదు. అలాగే నిజమైన గ్లోబల్ శక్తిగా కూడా నిలబడగలదు. కిరణ్ మజుందార్ షా, వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
విజన్ 2047కు ప్రణాళికలు సిద్ధం చేయండి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం.జానకి నెల్లూరు సిటీ : విజన్ 2047లో భాగంగా నెల్లూరు నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం. జానకి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాలచెరువు, సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హడ్కో రుణంతో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్రం వచ్చి 2047కి 100 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా నెల్లూరును అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలన్నారు. నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచిం చారు. ఈ సమీక్ష జరుగుతున్న మందిరంలోకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో జన ఆర్గనైజేషన్ సభ్యులు స్వాతిరామనాథన్, డీఎంఏ కన్నబాబు, కార్పొరేషన్ కమిషనర్ ఢిల్లీరావు, పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ మోహన్, డీటీసీ శివరామప్రసాద్, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట కమిషనర్లు శ్రీనివాసులు, నరేంద్ర, సూళ్లూరుపేట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.