
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఐదు కేసుల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో చెవిరెడ్డి స్పందిస్తూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కౌంటరిచ్చారు.
ఏపీలో కూటమి పాలనలో పోలీసులు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమాలని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దరవీడు పోలీసులు చెవిరెడ్డికి నోటీసులిచ్చారు. ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారవీడులో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులపై చెవిరెడ్డి స్పందించారు.
అనంతరం, చెవిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వైఎస్సార్‌సీపీ ఉద్యమాల నుంచి పుట్టినపార్టీ. మా నాయకుడు వైఎస్ జగన్ పోరాటాలతో ఎదిగిన వ్యక్తి. ప్రజల మద్దతుతోనే మేము ముందుకు సాగుతాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment