మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి | YSRCP MLC Varudu Kalyani Condemns Kutami Govt Women Protection Report | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి

Published Wed, Mar 19 2025 2:05 PM | Last Updated on Wed, Mar 19 2025 3:30 PM

YSRCP MLC Varudu Kalyani Condemns Kutami Govt Women Protection Report

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. 

‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత(Home Minister Anita) అబద్ధాలు చెప్పారు.  ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై  70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు  దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్‌గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె.  

.. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్‌ను తెచ్చారు. దిశా యాప్ పైన  ఇదే మంత్రి  గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు.  మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది.

.. కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్‌లో ఉండేది. సెబ్‌ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

మహిళల భద్రతపై మండలిలో  కూటమిని రఫ్ఫాడించిన వరుదు కళ్యాణి

కేంద్రం వద్ద దిశ చట్టం(Disha Act) పెండింగ్ లో ఉంది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయించొచ్చు కదా అని అనితను ఉద్దేశించి కల్యాణి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మభ్యపెట్టే మాటలు మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి వరుదు కల్యాణి హితవు పలికారు.

ఇదే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే మహిళా పోలీసుల పై దాడులు జరుగుతున్నాయన్న ఆమె.. శక్తి యాప్ కూడా దిశా యాప్ మాదిరిగానే పనిచేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement