vangalapudi anitha
-
మహిళల రక్షణ చాల దారుణం.. ఏకిపారేసిన పుష్పశ్రీ వాణి
-
అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి అనిత తమను పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వెళ్లగా.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కారు కూడా దిగకుండా.. మంత్రిగారూ.. ఇదేం తీరు!కర్నూలు: మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ కనీసం ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడటం లేదు.పింఛన్ రావడం లేదని సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధురాలి మంత్రి పట్టించుకోలేదు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. టీజీ భరత్ కారు కూడా దిగలేదు. తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పించాలంటూ మంత్రిని వృద్ధురాలు కోరింది. కొత్త పింఛన్లు వస్తే ఇస్తామంటూ మాట దాటేశారు. సమస్యలను వినాల్సిన మంత్రి.. కారు కూడా దిగకుండానే ప్రజలు సమస్యలను ఏసీ కారులో కూర్చోని విన్నారు. మంత్రి తీరుపై స్థానికులు మండిపడ్డారు. -
అనితమ్మా.. సిగ్గు.. సిగ్గు..
పసి పాపలు.. అభం శుభం తెలీని బాలికలు.. ప్రతిఘటించలేని దివ్యాంగులు.. ఎందరెందరో చిన్నారులను చిదిమేశారు. లైంగిక దాడితో తీరని గాయం చేశారు.. కొందరి ప్రాణాలు కూడా తీశారు.. జిల్లాలో మహిళలపై అత్యాచారాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా పోక్సో కేసులు( ఎక్కువయ్యాయి. పట్టపగలు నడి రోడ్డుపై నడిచేందుకు కూడా జడవాల్సిన దుస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేటి వరకు జిల్లావ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దిశ పోలీస్ స్టేషన్లు(Disha Police Station) మూసేశారు. దిశ యాప్‌కు మంగళం పాడారు. ఆఖరికి లైంగిక దాడుల కేసులను త్వరగా తేల్చడానికి ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా వద్దనుకున్నారు. అందుకే మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు సైతం కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆమె సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇది ఆమెకే సిగ్గుచేటు. సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల భద్రతకు కరువైంది. ఒక మహిళా హోంమంత్రి(Anitha Vangalapudi) సొంత జిల్లాలోనే బాలికలకు, మహిళలకు భద్రత లేకపోతే .. రాష్ట్రంలో అతివల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల యలమంచిలి మండల పరిధిలో రెండు మూడు వారాల వ్యవధిలోనే ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో మహిళా భద్రతకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను, దిశ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టులను నిర్వహించారు. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడాలన్నా.. అఘాయిత్యం చేయాలన్నా భయపడేలా ఉండేది. అంతేకాకుండా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్షలు కూడా పడేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోక్సో కేసులు పెరిగాయి. వీటిలో రోలుగుంట మండలంలో జేసీ అగ్రహారంలో దివ్యాంగ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులోనే ముద్దాయికి శిక్ష పడింది. మిగతా అన్ని కేసులు దర్యాప్తులో ఉన్నాయి. యలమంచిలిలో 8వ తరగతి విద్యారి్థనిపై స్వయాన బావే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనకాపల్లి టౌన్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న ఆ బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించినరు. ఇలా ఒకటి కాదు జిల్లాలో 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలపై కఠిన శిక్షలు విధించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని పసిపాపలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలకు కఠిన శిక్షలు విధిస్తే మరొకరు చేయడానికి భయపడతారంటూ మహిళా సంఘాల నేతలు సూచిస్తున్నారు. వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షించాలి. లేదంటే వారు మరింత విజృంభిస్తారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల భద్రతపై ఫోకస్ పెట్టి దిశ యాప్‌ను, దిశ పోలీస్స్టేషన్లను మళ్లీ పునరుద్ధరించాలి. జిల్లాలో గత ఏడాది జూన్ 4 తరువాత నుంచి నమోదైన పోక్సో కేసుల్లో ప్రధానమైనవి..జూలై 6: రోలుగుంట మండలం జేసీ అగ్రహారానికి చెందిన 16 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై అదే ప్రాంతానికి చెందిన మోటార్ మెకానిక్ దాసు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో కేసు నమోదు చేయగా.. కోర్టు దాసుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జూలై 7: రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 14 ఏళ్ల మైనర్ బాలికను సురేష్ అనే యువకుడు ప్రేమోన్మాదం పేరిట అత్యాచారం చేసి హత్య చేశాడు. మరుసటిరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్టోబర్ 15: యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లైన్కొత్తూరులో గల న్యూలైఫ్ హాస్టల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై హాస్టల్ కేర్‌టేకర్(వార్డెన్) రావాడ శ్రీను వేధింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 19: అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో కుమారపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అదే గ్రామానికి చెందిన రెడ్డి అశోక్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్టోబర్ 22: యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8వ తరగతి బాలికపై బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 25: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆర్.శివ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 29: యలమంచిలి పట్టణం రామ్‌నగర్‌లో ఒక వివాహిత తనకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేశారని ఫిర్యాదు చేయగా భర్తపై పోక్సో కేసు పెట్టారు. అక్టోబర్ 30: అర్ధరాత్రి అనకాపల్లి గవరపాలెంలో సంతోషిమాత ఆలయ రహదారి సమీపంలో అమ్మమ్మ ఇంటి వద్ద నిద్రిస్తున్న 12 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల యల్లపు శ్రీరామ్మూర్తి అత్యాచారం చేసేందుకు యత్నంచాడు. జనవరి 28: యలయంచిలిలో 13 ఏళ్ల బాలికను హాకీ కోచ్ రూపేష్ అత్యాచారం చేశాడు. బాలికలకు కోచ్‌గా ఉంటూ హాకీ నేర్పస్తామని లైంగిక దాడికి పాల్పడ్డాడు. జనవరి 11: ఏటికొప్పాకలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. భయపడకుండా ఫిర్యాదు చేయాలి.. గంజాయి, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిసై బాలికలపై లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భయపడకుండా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే వారికి శిక్ష పడుతోంది. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోలీసులు అవగాహన కల్పించాలి. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడితే వారికి పడే శిక్షలపై ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించా. – కరణం కృష్ణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, విశాఖ పోక్సో కోర్టువిద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు జిల్లాలో ప్రతి పాఠశాల, కళాశాలల్లో సంకల్పం పేరిట విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే వేసే శిక్షల గురించి వివరిస్తున్నాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై కూడా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నేరాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో ఈ ఏడాదిలో నమోదైన పోక్సో కేసుల్లో ధర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. మైనర్ బాలికలపై, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్లో లేదా సచివాలయంలో ఉన్న మహిళ కానిస్టేబుల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే నేరుగా 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. – తుహిన్ సిన్హా, జిల్లా ఎస్పీముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి -
హోంమంత్రి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
రీల్స్ చూడటానికి తప్ప... అనితకు గుడివాడ అమర్నాథ్ దిమ్మతిరిగే కౌంటర్
-
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు: Varudu Kalyani
-
Varudu Kalyani: కోడి పందేలుపై ఉన్న శ్రద్ధ - మహిళల ప్రాణాలపై లేవా..?
-
నారా లోకేష్ కు మద్దతు ప్రకటించని హోంమంత్రి అనిత
-
ఆస్పత్రుల వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు
-
నీకింత.. నాకింత.. వంగలపూడి అనిత పీఏ సెటిల్మెంట్లు
-
హోంమంత్రి అనిత పీఏ అవినీతి దందా
సాక్షి, అనకాపల్లి: ఏపీలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా కొనసాగుతోంది. మంత్రి అనిత అండతో పీఏ జగదీష్ అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో, జగదీష్ అంశం చర్చనీయాంశంగా మారింది.ఏపీ హోం మంత్రి అనిత పీఏ జగదీష్ అవినీతి దందా బయటపడింది. అనిత అండతో జగదీష్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ నేతలే ఫిర్యాదులు చేయడం గమనార్హం. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా జగదీష్ అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి.అలాగే, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి తేవడం. ఉద్యోగుల బదిలీల్లో లక్షల వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలనే తప్పుడు కేసుల్లో జగదీష్ ఇరికించినట్టు తెలుస్తోంది. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారని సమాచారం. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. -
పరిహారమివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు?
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గంలోని రాజయ్యపేటలో మత్య్సకారుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజయ్యపేట, పెదతీనార్ల, దొండ వాక గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో హెటిరో కంపెనీ చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి వచ్చిన మంత్రికి మత్య్సకారులు ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ రాజయ్యపేటలో పలువురు మత్య్సకారులు హోం మంత్రితో వాగ్వాదానికి దిగారు.రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్‌పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారని హోం మంత్రి ప్రశ్నించగా.. మీరే కదా పలు సందర్భాల్లో నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్‌ప్లాంట్ రాబోతున్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు అని గుర్తు చేయడంతో ఆమె కంగుతిన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పొక్లెయిన్లతో పనులు ప్రారంభించారని, నిర్వాసితులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. మంత్రిగా మీరు మత్య్సకారులకు అండగా ఉండాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద జిరయితీ భూముల్లో ఇళ్లు కోల్పోతున్న వారికి రూ.25లక్షలు, ఐదుసెంట్ల ఇంటి స్థలం, భూములు స్వా«దీనం చేసుకున్న నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఉపాధి నిమిత్తం రూ.15 లక్షల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి పునరావాసం ఎక్కడ కల్పిస్తారో చెప్పాలని డిమాండ్‌చేశారు. గతంలో వీటికి ప్రభుత్వం అంగీకరిస్తేనే భూములు ఇచ్చామని, తీరా ఇప్పుడు ఈ ప్యాకేజీల విషయం మాట్లాడకుండా భూములు స్వా«దీనం చేసుకుని ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించకుండా పనులు ప్రారంభించడానికి వీల్లేదన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ ఏపీఐఐసీ భూముల్లో ఏ కంపెనీలు ఏర్పాటు చేసినా ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేకుండా ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే కంపెనీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుందిఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
వంగలపూడి అనిత చేసిన నిర్వాకం.. సంచలన విషయాలు..
-
ప్రెస్ మీట్ లో తిట్టడానికా నీకు మంత్రి పదవి... అనితను ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
మంత్రి వంగలపూడి అనితకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
వారి చుట్టూ తిరిగే ఓపికలేకే రాజీపడ్డా
సాక్షి, అమరావతి: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు, తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తనపై విశాఖపట్నం 7వ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏం రాజీ కుదిరిందో చెప్పకుండా, రాజీ కుదిరిందని చెప్పేస్తే సరిపోదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా హైకోర్టు, అనిత తన డబ్బు తీసుకుని ఎగవేసిందంటూ కింది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన వేగి శ్రీనివాసరావుతో స్వయంగా మాట్లాడింది. మీ మధ్య రాజీ కుదిరిందని అనిత పిటిషన్ దాఖలు చేశారని, రాజీ కుదిరిందా? మీరు తప్పుడు కేసు వేశారని వారు చెబుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించింది. అనిత తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తారని అనుకుంటున్నానని శ్రీనివాసరావు బదులిచ్చారు. తనకు వారి చుట్టూ తిరిగే ఓపిక లేదన్నారు. అందుకే రాజీ అంటే సరేనన్నానని తెలిపారు. రాజీ ఏం కుదిరిందని న్యాయస్థానం ప్రశ్నించగా, అనిత తరఫు న్యాయవాది సతీష్ స్పందిస్తూ.. కుదిరిన రాజీ ప్రకారం వేగి శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసును కొనసాగించడానికి వీల్లేదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదని తెలిపారు. న్యాయస్థానం స్పందిస్తూ, ఇది రాజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది. రాజీలో ఇరుపక్షాల మధ్య ఏం ఒప్పందం కుదిరింది, సమస్యకు ఏం పరిష్కారం చూపారు, శ్రీనివాసరావుకు ఇవ్వాల్సిన దాంట్లో ఏం ఇచ్చారు.. తదితర వివరాలు ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. రాజీ కుదిరిపోయిందని, దానిని రికార్డ్ చేసేయాలంటే కుదరదని తేల్చిచెప్పింది. రాజీని రికార్డ్ చేసేందుకు అవసరమైన అన్నీ వివరాలను తమ ముందుంచాలని అనితను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
మీ పాలన ఎలాంటిదో అనిత మాట్లాడే మాటలే ఉదాహరణ
-
హోంమంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు వేలం పాట
-
అనిత ఇలాకాలో బెల్టు షాపులకు వేలం పాట.. దండోరా వేసి మరి..
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో బెల్టు షాపుల దందా కొనసాగుతోంది. ఏకంగా హోం మంత్రి అనిత ఇలాకాలోనే బెల్టు షాపులకు బహిరంగ వేలం పాటకు దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అసమర్థత తీరుకు ఇది నిదర్శమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఏపీ హోం మంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం పాట ప్రకటించారు. ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురంలో బహిరంగ వేలం పాట నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. బెల్టు షాపు వేలంపాట కోసం ముందు రోజు రాత్రి గ్రామంలో దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు వేలం పాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే, రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి అనిత అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా అంటూ ప్రకటన కూడా చేశారు. మరోవైపు.. తనిఖీల్లో బెల్టు షాపు నిర్వాహకులు దొరికినా ఎటువంటి జరిమానా విధించడం లేదు ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఒకటి.. గ్రౌండ్ లెవల్ జరుగుతున్నది మరొకటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. -
మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. మంత్రి వంగలపూడి అనితకు కౌంటర్..
-
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని పవనే అన్నారు
-
మంత్రి అనితపై మండలి చైర్మన్ సీరియస్
-
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
హోంమంత్రి అనిత ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి సాగు
-
విశాఖ నగరంలో గంజాయి కలకలం
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హోమ్ మంత్రి అనిత నియోజకవర్గంలో బెల్ట్ షాపుల దందా!
-
డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు, పవన్ పాట్లు
-
బలవంతంగా నవ్వించిన చంద్రబాబు!
విజయవాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడ్డట్లున్నారు. ఈ క్రమంలోనే పవన్-అనితలను పక్కపక్కనే ఉంచి.. బలవంతంగా నవ్వించి మరీ ఆ ఫొటోలను బయటకు వదిలారు.సూపర్ సిక్స్‌ను అటకెక్కించి మరీ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్న చంద్రబాబు.. అందుకోసం పవన్‌ను ఏ రేంజ్లో వాడుకుంటున్నారో చూస్తున్నాం. మూడు రోజుల కిందట పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే..లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై చంద్రబాబును ఏమీ అనకుండా.. హోం మంత్రి అనితను తిట్టారు. పైగా దళిత మహిళామంత్రిని ఒకవైపు కించపరుస్తూనే.. మరోవైపు తానే హోం మంత్రి తీసుకుంటానంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. పవన్ ఓపెన్ స్టేట్మెంట్ను అర్థం చేసుకోగలనంటూ మాట్లాడిన అనిత.. లోలోపల ఫీలైనట్లున్నారు. అందుకే చంద్రబాబు దగ్గర పంచాయితీ పెట్టారు. అనితపై పవన్ వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి ఇవాళ భేటీ జరిపారు కూటమి నేత చంద్రబాబు. చర్చలో అసలేం జరిగిందో తెలియదుగానీ.. వివాదం సద్దుమణిగిందంటూ ప్రచారం చేయాలని ఎల్లో మీడియాను ఆదేశించినట్లున్నారు. ఈ క్రమంలోనే ఇలా నవ్వులు చిందిస్తూ ఇద్దరి ఫొటోలను బయటకు రిలీజ్ చేయించారు. వీటిని పట్టుకుని ఎలివేషన్లతో కథనాలు ఇచ్చేస్తున్నాయవి. గిల్లి గిచ్చి మరీ జోల పాడడం అంటే ఇదేనేమో!. -
'నా భర్తకు ఏదైనా జరిగితే అనితదే బాధ్యత: కల్యాణి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీకే దిన్నె పోలీసు స్టేషన్‌కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు పరామర్శించారు.అక్రమంగా తమను నిర్బంధించారని రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఆరోపించారు. తన భర్త ఆచూకీ తెలుపమంటే పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారన్న కల్యాణి.. తన ఆరోగ్యం బాగా లేక పడిపోతే కనీసం డాక్టర్‌ను కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే హోం మంత్రి అనితదే బాధ్యత అని కల్యాణి అన్నారు.వైఎస్సార్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(బుధవారం) ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన పోలీసులు.. వారిని తొలుత వేముల పోలీస్ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు తెలిపారు. చివరికి స్టేషన్‌కు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వారిని వదిలేశారు. -
చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు
-
హోమ్ మంత్రి అనితపై పవన్ వ్యాఖ్యలు..కారణం ఇదే!
-
అనిత.. ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు?: ఆర్కే రోజా
సాక్షి, నగరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలో పదోతరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంలో అనిత చేసిన వ్యాఖ్యలపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారికి కోరారు.మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా.. హోంమంత్రి అనిత, ఎస్పీ ఒక్కసారి మీరు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి.. ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని తన బిడ్డకి న్యాయం చేయాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఆ తండ్రి బాధ మీకు కనిపించలేదా? ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు? వాస్తవాలు దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి..!! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌరవ హోమ్ మంత్రి @Anitha_TDP గారు మరియు ఎస్పి గారు ఒక్కసారి మీరు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి... ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని తన బిడ్డకి న్యాయం చెయ్యాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఆ తండ్రి బాధ మీకు… https://t.co/usp79BbeNx pic.twitter.com/pwsB98JSrm— Roja Selvamani (@RojaSelvamaniRK) November 6, 2024ఇది కూడా చదవండి: బాధిత బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిళ్లు! -
ఔను.. మేం ఫెయిల్ అయ్యాం
-
పవన్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
విజయవాడ: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమంటూనే, మాదిగ మహిళ అనితను అవమానించినట్లే కదా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని పవన్‌ను హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ.ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ‘ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలా వుంటుంది. పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో.. మాకు కాదు. జనసేనకు కేటాయించిన బిసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో సీటు ఎందుకు ఇవ్వలేదు. జనసేన అందరి పార్టీనా కాదా?, కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారు. రిజర్వేషన్ మూడు సీట్లు మాలలకు ఇచ్చారు. పవన్ కల్యాన్‌ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా వుంటుంది. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల మేము మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సీఎం చంద్రబాబుని అన్నట్లు కాదా? అంటూ ధ్వజమెత్తారు మంద కృష్ణ మాదిగ.ఇవీ చదవండి: నేను హోం మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఇది కదా జగన్ మార్క్ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్ ఆశ్చర్యం! -
మంత్రిగా అనిత డమ్మీ.. లోకేష్ ఫెయిల్: రోజా
తిరుపతి, సాక్షి: పోలీసు శాఖపై నేరస్తుల్లో భయం పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రోజాను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ చంద్రగిరి ఎమ్మెల్యే నాని భార్యను ఆస్పత్రి లోపలికి అనుమతిస్తారు. మాకు ఎందుకు ఇవ్వరు? బిహార్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు జరిగేవి, ఈరోజు ఏపీలో రోజు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులుపై ఒత్తిడి చేశారు. అమ్మాయి తల్లిదండ్రులుపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఉదయానికి మాట మార్చారు. పోలీసు ఉన్నతాధికారులుపై ఎంత ఒత్తిడి చేస్తున్నారో అర్థం చేసుకోగలం. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది... మహిళలపై దాడులు చూస్తుంటే బాధేస్తోందని తెలిపారు. 120 రోజుల్లో 110కిపైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారు?. అధికారులతో పని చేయించుకోవటం రాకపోతే రాజీనామా చేయండి. మంచి అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అనిత డమ్మీ హోం మంత్రి.. వైఎస్ జగన్‌ను తిట్టడానికే పదవి ఇచ్చారు. పవన్ కల్యాణ్ అధికార పక్షంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? సమాధానం చెప్పకుండా పవన్ తప్పించుకుంటున్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని హోం మంత్రే చెబుతున్నారు. బెల్ట్ షాపుల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. సరస్వతి భూముల పరిశీలనకు ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ముందు బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాలకు న్యాయం చేయండి.మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించటం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరు కలిసి పోలీసులను బదిలీలు చేయించారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకునే వాళ్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. పని చేయడానికి శాఖతో పనిలేదు. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు. వాళ్లను ప్రైవేటు వెహికిల్స్‌లో ఇంటికి పంపించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఫెయిల్ అయ్యారు. సరస్వతి భూములు ఎక్కడికి పోవు, ఋషికొండకు ఎందుకు వెళ్లాలి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు...ప్రధాని మోదీకి చేతులు జోడించి చెప్తున్నాం. ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు(బీజేపీ) కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగ్‌లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనపై కనీసం ఇప్పటి వరకు ఎవ్వరూ పరామర్శించలేదు’’ అని అన్నారు. -
..అలా అయితే మీరు చాలా శాఖలు తీసుకోవాల్సి వస్తుంది సార్!
-
ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే వాటిని అదుపు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్నా.. రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడ పిల్లలైనా బయట అడుగుపెడితే భద్రతగా ఇంటికి వస్తారనే గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా? అని ప్రశ్నించారు.నిందితులకు వెన్నులో వణుకు పుట్టాలిదాదాపు 100 మంది ఆడపిల్లల మానాలు, ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కూటమి నేతలకు మాత్రం దున్నపోతుపై వానపడ్డట్లుంది.. ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయితే ప్రభుత్వం ఎంత సీరియస్‌గా స్పందించాలి..? నిజంగా అంత సీరియస్‌గా ఈ ప్రభుత్వం స్పందించి ఉంటే వంద సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ప్రారంభంలోనే వెన్నులో వణుకు పుట్టించి ఉంటే ఇలా జరిగేది కాదు.కూటి ప్రభుత్వంది పేరు గొప్ప.. ఊరు దిబ్బఈ నేతలు కేవలం మాటలకు మాత్రమే పరిమితి.. చేతలు శూన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వాటిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. నిత్యం వైఎస్ జగన్‌ను నిందించడం..టీడీపీ గొప్పలు చెప్పకోవడం తప్ప చేసిందేమీ లేదు. సెల్ ఫోన్ మేమే కనిపెట్టాం..హైదరాబాద్‌కు బీచ్ తెచ్చాం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వీరు చేసిందేమీ లేదు. కనీసం చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని కూడా కనిపెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది.మా కులం, మా పార్టీ అని నేరానికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏమో కానీ దేవుడి వద్ద మాత్రం మీకు శిక్ష తప్పదు. మూడేళ్ల చిన్నారిపై దారుణం జరిగితే నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలి. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు. వాళ్లకు ఓటు వేసిన ప్రతి తల్లి, చెల్లి కూటమి నేతలను చూసి సిగ్గు పడుతున్నారు.ప్రభుత్వ అసమర్ధతను పవన్ అంగీకరించారుపవన్ కల్యాణ్ జరిగిన తప్పును, వారి అసమర్ధతను కనీసం ఒప్పుకున్నారు. మా హోం మంత్రి శాంతిభద్రతల విషయంలో విఫలమయ్యిందని అంగీకరించారు. పవన్..పరోక్షంగా సీఎం చంద్రబాబునే అన్నారు. నేరుగా చంద్రబాబును అనే ధైర్యం లేక హోం మంత్రిపై పెట్టి అన్నారు. శాంతిభద్రతలు దెబ్బతింటుంటే క్యాబినెట్‌కు బాద్యత లేదా..? ఈ ప్రభుత్వం బాధ్యత వహించదా?. మీకు మానం, మర్యాద ఉంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి..అధికారంలో కొనసాగే అర్హతే మీకు లేదు. పైపెచ్చు పోలీసులపై నిందలు వేస్తున్నారు. పోలీసులకు మీరు స్వతంత్య్రం ఇచ్చారా..? ఈ ఎస్పీలు, ఇంటిలిజెన్స్ అధికారులు మొదటి నుంచీ ఉన్నారు..గతంలో ఇలా జరగలేదేం..?.ఇలా జరగడానికి కారణం నేరం చేసే వారి ఆలోచనలు పెచ్చురిల్లిపోతున్నాయి...చిన్నపిల్లల్ని సైతం వదలడం లేదు.ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు దానికి తోడు విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్ధాలు..నేరస్థుడికి ఇవి ఊతం ఇస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మద్యం, గంజాయి దొరికితే నేరస్థులు రాక్షసులు కారా..? పోలీసుల విధి నిర్వహణకు మీరు మోకాలడ్డుతున్నారు కాబట్టే పరిస్థితి ఇలా ఉంది. మీరు పోలీసులకు స్వేచ్ఛనిస్తే ..వారు కఠినంగా వ్యవహరించే వారు. మీరు తప్పు చేసి పోలీసులపై నింద వేస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మీ ఆత్మన్యూనత భావంతో పోలీసులను విమర్శిస్తున్నారు.డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీరేం చేశారు?దిశా చట్టాన్ని పదును పెట్టండి. పోలీసులకు స్వేచ్చనివ్వండి..నేరం జరుగుతుందా?. తాను తప్పించుకోగలను..అనే ధైర్యం నేరస్థుడిలో రాబట్టే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఓ బిడ్డ జరిగిన అన్యాయాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఎన్నిసార్లు పగిలిపోయి ఉంటుంది?. ఇలా ఎంత మంది తల్లిదండ్రుల ఉసురు పోసుకుంటారు..? వీటన్నిటినీ పక్కదోవ పట్టించేందుకు వైఎస్ జగన్‌పై డైవర్షన్ పాలిటిక్స్ రోజుకొకటి చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ రాష్ట్రంలో ఏముంది..? ఏ అబివృద్ధి లేకపోయినా పర్వాలేదు..కనీసం మా ఆడబిడ్డలకు రక్షణనైనా కల్పించండి.తల్లీ.. అనిత..? పవన్ నిన్ను పొగడలేదుపవన్ కల్యాణ్ నిన్ను పొగిడాడా తల్లీ..అనిత..?హోం శాఖ నేను తీసుకుంటాను అంటుంటే అర్ధం మీరు పూర్తిగా విఫలం అయ్యారనే అర్థం. ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ మీరే మిమ్మల్ని సమర్ధించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి కూడా బాద్యత వహించాలి. మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదు. మా బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడమని కోరితే అది కూడా మీరు చేయలేకపోతున్నారు.పిల్లల మానాలు, ప్రాణాలు కాపాడలేని నువ్వు..2047కి ఏదో చేస్తానంటున్నావు. ఎప్పుడో ఏదో చేసేది కాదు..ముందు మా బిడ్డలకు రక్షణ కల్పించండి. ఇలాంటి సంఘటన జరిగితే ప్రొద్దుటూరులో పెద్ద స్థాయిలో దీక్షకు దిగుతా’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
ఏపీలో అఘాయిత్యాలు పెరిగాయి.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు పోలీసులకు దొరక్కుండా అప్ డేట్ అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్‌ను పటిష్ఠం చేయాలి. మా ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాల్లో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నామని అనిత అన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి’’ అని చెప్పారాయనఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్ ఆ సభలో డిమాండ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు బాధ్యత బాబుదే కదా..! హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
అయ్యో అనిత.. పవన్ విమర్శలు అందుకేనేమో!!
-
కూటమిలో కలకలం పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రి నారాయణ..
-
చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలం: వరుదు కళ్యాణి ఫైర్
విశాఖపట్నం, సాక్షి: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి కారణమని వైఎస్సార్సీపీ మొదట్నుంచీ చెప్తోంది. ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంతవరకు దొరకలేదు. ఏపీలో రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయి. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగింది. కనీసం హోంమంత్రి బాధితురాళ్లను పరామర్శించటం లేదు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. కానీ, హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు.తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేశారు. పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే.. పవన్ భరోసా ఎందకివ్వలేదు? పంతం నానాజీ అనుచరుల వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. మరి ఆ బాధితులకు పవన్ ఎందుకు భరోసా ఇవ్వ లేదు?’’అని నిలదీశారు. -
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రి నారాయణ!
విజయవాడ, సాక్షి: హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నారాయణ ఏకీభవించారు.హోంమంత్రిగా అనిత విఫలమైందన్న పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా మంత్రి నారాయణ సమర్థించారు. ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం, డీప్యూటీ సీఎం స్పందిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కూడా అదే చేశారని తెలిపారు. ‘‘పవన్ ఏం కామెంట్ చేశారు. ఏం చేయలేదు. సిరియస్‌గా తీసుకుని పనిచేయమన్నారు. డిప్యూటి సీఎంగా అక్కడ జరిగిన దానిని బేస్ చేసుకుని మాట్లాడారు. దానికి తగ్గట్లుగా హోం మినిస్టర్ చర్యలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ..సీఎం, డిప్యూటీ సీఎం వేరే డిపార్టుమెంట్ సరిగ్గా పనిచేయకుంటే కామెంట్స్ చేస్తారు. లీగల్‌గా పోలీసులు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉండోచ్చు. దాని వల్ల ఒకోసారి అలస్యం కావచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్పీడ్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. సీఎం అన్ని కో ఆర్డినేట్ చేస్తారు’’అని అన్నారు. -
పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై రోజా సెటైర్లు
-
మంత్రి వంగలపూడి అనితకి పవన్ కళ్యాణ్ వార్నింగ్
-
అనితకు పవన్ వార్నింగ్.. ‘ఇప్పటికైనా మార్చాలి’
గుంటూరు, సాక్షి: చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 5 నెలల్లోనే మహిళలపై వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయని మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హోమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వవన్ కల్యాణే చెబుతున్నారు. మేం కూడా మొదట్నుంచీ అనిత తీరును ఎండగడుతూనే ఉన్నాం. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ అనిత రాజీనామా చేయాలి. అనితతో పాటు చంద్రబాబు సైతం సీఎంగా రాజీనామా చేయాలి’’ అన్నారు.‘పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమనాలి’హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇప్పటికైనా హోం మంత్రిని మార్చాలి. వైఎస్ జగన్‌ను తిట్టడానికే అనితకు హోం మంత్రి పదవి ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సోమవారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘హోంమంత్రి అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి అక్రమాలపై పశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ తీరు మార్చుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలైమంది. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమని చెప్పాలి’’ అని అన్నారు. -
Dy CM సంచలన కామెంట్స్ పవన్ మనసులో ఏముంది?
-
హోమ్ మంత్రి అనితపై పవన్ ఫైర్
-
నేను హోం మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై, పోలీస్ శాఖపైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని అన్నారాయాన. ‘‘పోలీసులు మరిచిపోకండి. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా కీలకం. పదే పదే ఈ విషయాన్ని మాతో చెప్పించుకోకూడదు. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెబుతోంది?. ఏదైనా తెగే వరకు లాగకూడదు. బయటకు వస్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారు. డీజీపీ దీనికి బాధ్యత తీసుకోవాలి. .. ఆడపిల్లలను రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది?. అత్యాచార నిందితుల అరెస్టుకు కులం అడ్డొస్తుందా?. క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది?. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. ఈ విషయాన్ని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో ఎందుకు రేప్‌లు జరగవు?. అక్కడ మాట్లాడాలంటే భయపడతారు. .. హోం మంత్రి అనిత జరుగుతున్న అఘాయిత్యాలపై రివ్యూ జరపాలి. మంత్రిగా బాధత్య తీసుకోవాలి. విమర్శలను పట్టించుకోకపోతే.. చేతకాకపోతే హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఒకవేళ.. నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది. పదవి ఇవాళ ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు ఐ డోంట్ కేర్.. అని పవన్ అన్నారు.ఇదీ చదవండి: ఇంతకీ ఆ జనసేన ఎమ్మెల్యే ఎక్కడ? -
వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలు.. వరుదు కళ్యాణి అదిరిపోయే కౌంటర్
-
సహానా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: రోజా
సాక్షి, నగరి: టీడీపీ రౌడీ షీటర్ చేతిలో తీవ్రంగా గాయపడిన సహానా మృతి చెందడం బాధాకరమని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సహానా మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.మాజీ ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా.. ‘గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహానా మృతి చెందడం బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానాను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలి. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానాకి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను ఆదేశించకపోవడం అమానవీయం. ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారు..?టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. సహానాను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. రియాలిటీ షోకి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహానా తల్లి కన్నీటికి ఏం సమాధానం చెప్తారు?. సహానా ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహన మృతి చెందడం బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి @ncbn చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానా ను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 22, 2024 అమ్మా.. హోంమంత్రి @Anitha_TDP మీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు @ysjagan గారిని తిట్టే బదులు..అక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరం లో గుంటూరు ఆస్పత్రి లో మీ @JaiTDP కార్యకర్త నవీన్ ఎత్తుకెళ్లి హత్యాయత్నం చేసిన దళిత యువతి సహాన అత్యంత విషమంగా మృత్యువుతో పోరాడుతోంది.…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 22, 2024 -
కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి
-
శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది
-
భద్రతపై హోమ్ మంత్రి అనిత వెటకారం.. ఎంపీ అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్
-
పరువుగల కుటుంబాలు అత్యాచార కేసులు పెట్టడం లేదు!
సాక్షి, అమరావతి: ‘మీకు తెలుసు కదా పెద్ద పెద్ద కుటుంబాలు, పరువుగల కుటుంబాల్లో అత్యాచారాలు జరిగినా కేసులు పెట్టడం లేదు. కేసులు నమోదుకాని అత్యాచారాలు ఎక్కువే జరుగుతున్నాయి’అని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించి కచ్చితంగా శిక్షిస్తామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. వారిలో మైనర్లు ఉన్నారని చెప్పారు. అత్యాచార కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించాలని హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాయనుందని మంత్రి అనిత చెప్పారు. ప్రైవేటు సంస్థలు, ప్రాంగణాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసు శాఖతో అనుసంధానిస్తే నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఇవేం వ్యాఖ్యలు మంత్రిగారూ.. అత్యాచారాలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బాధితులను విస్మయానికి గురి చేశాయి. ‘అంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న అత్యాచార బాధితులంతా పరువులేని కుటుంబాలకు చెందినవారా’అని పరిశీలకులు మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అత్యాచార బాధితులపై సానుభూతి చూపాల్సిన మంత్రి అనిత అందుకు విరుద్ధంగా వారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం విభ్రాంతికి గురిచేస్తోందని విమర్శిస్తున్నారు. అత్యాచారం వంటి దురదృష్టకర ఘటనలు జరిగితే బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయండి... వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోమ్ మంత్రిగా, అందులోనూ మహిళగా ఆమె కోరాలి. అందుకు విరుద్ధంగా అత్యాచారాలపై ఫిర్యాదులు చేసేవారు పరువుగల కుటుంబాలకు చెందినవారు కాదనే అర్థం వచ్చేలా మాట్లాడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బాలకృష్ణ నిద్ర పోతున్నావా... దసరా రోజున ఇలాంటి ఘటన దారుణం
-
వంగలపూడి అనితకు వెల్లంపల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
పుంగనూరుకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌కు టెన్షన్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వంద రోజుల కూటమి పాలనలో ప్రతీరోజు మహిళల హత్యలు, హత్యాచారాలే జరుగుతున్నాయన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో పుంగనూరుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిసి హోంమంత్రి అనిత ఈరోజు బాలిక కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో ముస్లిం బాలిక హత్య జరిగి వారం రోజులు అవుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలియడంతో ఈరోజు మాత్రం హోంమంత్రి అనిత పుంగనూరు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. హత్య జరిగిన వారం రోజులు గడిచినా.. ఇన్ని రోజులు చంద్రబాబు, మంత్రులు ఏం చేశారు?. ఆగమేఘాల మీద ఇప్పుడు ఎందుకు వెళ్లారు?. వైఎస్ జగన్ బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని తెలిసి మంత్రులు రాజకీయం చేస్తున్నారు.హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా చంపితే ఎందుకు పరామర్శించలేదు. గుడ్లవల్లేరు దారుణ ఘటనలో విద్యార్థులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో కూటమి వంద రోజుల పాలనలో రోజూ మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహిళల కోసం వైఎస్ జగన్ దిశా చట్టాన్ని, యాప్ ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?: వరుదు కళ్యాణి సూటి ప్రశ్న
సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి లడ్డూ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్ చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేకుండా హోం మంత్రి అనితా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెపుతున్నారని తెలిపారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. చదవండి: బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జలగతంలో సీఎంగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళారని, అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు. గతంలో ప్రధాని, హోం మంత్రితో, జగన్ తిరుపతి వెళ్లారని.. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని, ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదని విమర్శించారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు. -
వంగలపూడి అనితకు గూబ పగిలే కౌంటర్
-
వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య సవాల్
సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! చంద్రబాబు సర్కార్ కుతంత్రం..కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. -
హోంమంత్రి అనితా.. అధికారం శాశ్వతం కాదు: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై మేరుగు నాగార్జున స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోం మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపైన మాత్రం ఆమె మాట్లాడటం లేదు.అధికారం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు, విధ్వంసాలు చేసి భయపెడదాం అనుకుంటే కుదరదు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగటం చాలా దారుణం. మా కార్యకర్తలను కొడుతున్నారని శంకర్రావు ఎస్పీకి ఫోన్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మీ కార్యకర్తలు ఎందుకు అంత మంది వచ్చారని అడుగుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వందల మంది కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తే వాళ్లని ఎందుకు ప్రశ్నించడం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు -
హోంమంత్రి అనిత మాటలు పచ్చి అబద్ధం: హీరోయిన్ మాధవీలత
ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత వినాయక విగ్రహాల చలాన్లపై పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కేవలం మండపాలకే మాత్రమే రుసుములు ఉండేవని తెలిపారు. విగ్రహాల అడుగుల ఎత్తు, ఎకో గణేశా పేరిట ప్రత్యేకంగా ఎలాంటి చలాన్లు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ అని వెల్లడించారు. అయితే పది రోజుల క్రితం హోంమంత్రి అనిత ప్రెస్మీట్లో ఈ రూల్స్ ప్రకటించడం అక్షర సత్యమన్నారు. కొత్తగా తెచ్చిన రూల్స్ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా? అని మాధవీలత ప్రశ్నించారు. మేము కాషాయ కండువాలు మోసే వాళ్లమని..డబ్బులతో నన్ను ఎవరూ కొనలేరని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్)మాధవీలతపై నెటిజన్ల ప్రశంసలు..ఆమె వీడియో చూసిన నెటిజన్స్ మాధవీలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును ధైర్యంగా ప్రశ్నించారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు నిజాయితీగా ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపారని.. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలంటూ మాధవీలతను ప్రశంసిస్తున్నారు. కాగా.. అంతకుముందు వినాయక విగ్రహాలకు ఇష్టారీతిన చలాన్లు విధించండంపై హీరోయిన్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక చవితి సందర్భంగా చలాన్లపై ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని ఆమె మండిపడ్డారు. డబ్బులు కావాలంటే దానం చేస్తాం.. అంతే కానీ ఇలా మండపాల దగ్గర చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ హోంమంత్రిని ప్రశ్నించారు. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని హోంమంత్రిని మాధవీలత నిలదీశారు. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
వినాయక మండపాలకు చార్జీలా.. హవ్వ!
సాక్షి, అమరావతి: హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం విభ్రాంతి కలిగిస్తోంది. వినాయక మండపాలను ఆదాయ వనరుగా చేసుకునేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది. సీఎం చంద్రబాబు చెప్పారని సింగిల్ విండో విధానం పేరిట స్వయంగా హోం మంత్రి వంగలపూడి అనిత వినాయక మండపాలకు అనుమతుల కోసం భారీ చార్జీలను నిర్ణయించడం వివాదాస్పదమైంది. వినాయక మండపాల ఏర్పాటుకు భారీ ఫీజులు చెల్లించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వం విధానంపై హిందువులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాంతో తోకముడిచిన చంద్రబాబు ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు యతి్నంచి అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... జగన్ సర్కారుపై నెపం నెట్టేందుకు కుట్ర వినాయక మండపాలకు అనుమతుల పేరిట భారీగా చార్జీలు వసూలు చేయడం పట్ల రాష్ట్రంలోని హిందువులు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దాంతో బెంబేలెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం తోకముడిచింది. సీఎం చంద్రబాబు హోం మంత్రి అనితను పిలిపించి మాట్లాడి ఈ అంశాన్ని పక్కదారి పట్టించమని ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఆమె వినాయక మండపాలకు అనుమతుల కోసం నిర్ణయించిన చార్జీల విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఆదివారం ప్రకటించారు.అంతేకాదు.. వాస్తవాలను కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు మంత్రి అనిత యతి్నంచడం గమనార్హం. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచి్చన జీవో గురించే తనకు అధికారులు చెప్పారని.. ఆ జీవోలోని అంశాలనే తాను వెల్లడించానని చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదనే విషయాన్ని గణేశ్ ఉత్సవాల నిర్వహణ కమిటీలు గుర్తు చేశాయి. మొదటిసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే వినాయక మండపాల్లో మైకులు, విగ్రహాలు ఏర్పాటుకు చార్జీలు చెల్లించామని కూడా స్పష్టం చేశాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైకి నెపం నెట్టేసేందుకు హోంమంత్రి అనిత ప్రయతి్నంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఏడు సంక్షేమ పథకాలైన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.మంత్రి అనిత వెల్లడించిన ఫీజులు ఇవీ మైక్ సెట్ కోసం రోజుకు రూ.100 చొప్పున, 3 అడుగులలోపు విగ్రహం పెడితే.. రూ.350, 6 అడుగులలోపు విగ్రహమైతే రూ.700 చొప్పున వసూలు చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం గణేశ్ నవరాత్రుల నిర్వహణకు రోజుకు రూ.100 చొప్పున 9 రోజులకు రూ.900 చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది వినాయక మండపాలు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వం కేవలం మైక్ సెట్ అనుమతుల పేరిట కోట్లాది రూపాయలు బలవంతంగా వసూలు చేసేందుకు పన్నాగం పన్నింది.ఇక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వినాయక మండపాల్లో విగ్రహానికి రూ.350 నుంచి రూ.700 చొప్పున వసూలు చేస్తూ కూడా కోట్లాది రూపాయలు ఆదాయంగా రాబట్టేందుకు కుతంత్రం పన్నింది. ఏకంగా హోం మంత్రి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు మైక్ సెట్, విగ్రహం ఏర్పాటు కోసం రుసుములు చెల్లించారు. ఆ మేరకు చార్జీలు చెల్లించిన రశీదులు చూపించిన అనంతరమే వినాయక మండపాలకు స్థానిక అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీ చార్జీలు చెల్లించే శనివారం వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు. -
అనితపై మాధవీ లత ఫైర్
-
గణేశుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా?.. అనితపై గణేష్ ఉత్సవ కమిటీ ఫైర్
సాక్షి, కర్నూలు: హోంమంత్రి వంగలపూడి అనితపై కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినాయక విగ్రహాల మండపాల నుంచి డబ్బులు వసూలు చేయాలని హోం మంత్రి చెప్పడం చాలా బాధాకరమని.. దేవుని విగ్రహానికి లెక్క కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆనాడు బ్రిటిష్ పాలనలో రుసుము చెల్లించే విధానం ఉండేందని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారంటూ మండిపడ్డారు.‘‘దేశంలో ఎక్కడ లేని విధానాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడం ఏంటి?. వినాయకుడిని పూజించాలంటే డబ్బులు చెల్లించాలా?. మత స్వేచ్ఛను భంగపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు సిగ్గుచేటు. వినాయక మండపాల నుండి రుసుము వసూలు చేయడం అనాలోచితమైన నిర్ణయం. హోంమంత్రి శాంతిభద్రతలు కాపాడాలి డబ్బులు వసూలు చేసే రెవెన్యూ బాధ్యతను తీసుకోకూడదంటూ కమిటీ సభ్యులు హితవు పలికారు.ప్రభుత్వం తీసుకున్న మూర్ఖమైన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హెచ్చరించారు.ఇదీ చదవండి: అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్ -
అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు. మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు?
(విజయవాడ వరద ప్రాంతం నుంచి ‘సాక్షి’ బృందం) ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కండ్రిక, రాజీవ్‌నగర్ కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు సంధ్యారాణి, వంగలపూడి అనితలకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారిని చూడగానే ముంపు బాధితులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మూడ్రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం తాగునీరు, భోజన వసతులు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నామని విరుచుకుపడ్డారు. రాజీవ్ నగర్, కండ్రిక, గుణదల వంద అడుగుల రోడ్డు, గుణదల ఫ్లిప్‌కార్ట్ గోదాము, బ్రిటానియా గోదాములతో పాటు గుణదల రోడ్డు వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తీరికలేనప్పుడు రావడమెందుకు? మంత్రి సంధ్యారాణితో వచ్చిన ఆహార పొట్లాల వాహనాన్ని ఆమె చేతుల మీదుగా ఇప్పించేందుకు టీడీపీ శ్రేణులు యతి్నంచారు. అయితే, బాధితులు అప్పటికి భోజనంలేక మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతుండటంతో ఆహార పొట్లాల వాహనం వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దీంతో టీడీపీ వారు ఆహార పొట్లాలను గాలిలోకి ఎగరేయడంతో తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇలా మంత్రులు కొద్దిదూరం ట్రాక్టర్‌పై వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగారు. -
హోం మినిష్టర్ గా అనిత విఫలమయ్యారు
-
అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. అలాగే, అనితా ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా? అని ప్రశ్నించారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు. తాను ఎప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా?. ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా?. అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది.మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా?. పపేర్లు కున్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా?. అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. అనిత ఓ అసమర్థ హోంమంత్రి. కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై విమర్శలు పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుంది. ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు’ అంటూ విమర్శించారు. -
అక్కడ ప్రాణాలు పోతుంటే ప్రెస్ మీట్లు పెట్టి...వైఎస్ జగన్ ఫైర్
-
అసలు నువ్వు మంత్రివేనా? టీడీపీ హత్య కేసులో అసలు నిజం
-
AP: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
సాక్షి,ఏలూరు జిల్లా: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఆదివారం(ఆగస్టు11) ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటన తర్వాత మంత్రి అక్కడినుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. -
వంగలపూడి అనితకు కొండా రాజీవ్ కౌంటర్
-
పవన్, అనితలకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితలకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధమని తేల్చింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలతోనే ఆ బండారమంతా బయటపడింది. గతంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో పవన్ కల్యాణ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అందరినీ రెచ్చగొట్టారు. కూటమి అధికారంకి వచ్చాక సైతం పవన్ వాళ్లను వెనక్కి రప్పిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే వంగలపూడి అనిత సైతం అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారాయన. -
వాళ్ళు వేసిన సెటైర్లకు నవ్వుల పాలయ్యారు.. మంత్రి వంగలపూడి అనితకు దిమ్మతిరిగే కౌంటర్
-
పోలీసులపై పిడిగుద్దులు అర్ధరాత్రి కిక్ బాక్సింగ్
-
KSR Live Show: అనితకు హోమ్ మంత్రి పదవి.. బాబు చేసిన పెద్ద తప్పు
-
నీ మాటలకు మహిళలు తల దించుకుంటున్నారు.. హోం మంత్రి అనితపై ఫైర్
-
నారా లోకేష్, వంగలపూడి అనితపై అంబటి ఫైర్
-
వంగలపూడి అనిత మాటలు హాస్యాస్పదం: తానేటి వనిత ఫైర్
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను స్వేచ్చగా పనిచేసుకోవానివ్వాలని కామెంట్స్ చేశారు.కాగా, తానేటి వనిత ఆదివారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హోంమంత్రి అనిత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆమె మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి అయ్యారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యేనే.హోంమంత్రి అనిత మాట్లాడే మాటలకు మహిళలు తలదించుకుంటున్నారు. పోలీసులను స్వేచ్చను ఇచ్చి.. వారిని సక్రమంగా పనిచేసుకోనివ్వాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే మా పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలు
తిరుపతి(అలిపిరి)/తిరుమల: రాష్ట్రంలో గంజాయి మత్తులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. ఈ పరిణామాలు చూసి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, బాలికలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే పట్టుకుంటున్నట్టు తెలిపారు. తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని చెప్పారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నేతలు పాకులాడుతున్నారని, గత ప్రభుత్వం కారణంగానే చిన్నపిల్లల సంచుల్లోకి గంజాయి చేరుతోందని ఆరోపించారు. గంజాయిని రాష్ట్ర పంటగా పండించింది వైఎస్సార్సీపీ నేతలేనని.. లిక్కర్‌పైన పెట్టిన దృష్టి గంజాయిపై ఎందుకు పెట్టలేదన్నారు. పోలీసుల్ని కాపలాకు ఉపయోగించుకున్న గత ప్రభుత్వంలోనే వందలాది మంది బాలికలు కనిపించకుండా పోయారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, కాలినడక మార్గంలోనే శ్రీవారి దర్శనం టికెట్లు జారీచేయాలని హోం మంత్రి అనిత కోరారు. అలిపిరి కాలినడక మార్గాన నడుచుకుంటూ ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అనిత చెప్పారు. -
దాడులు ఆగటానికి ఇంకాస్తా సమయం పడుతుంది
-
హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతాభావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నించిన మీడియాపై ఆమె అసహనం ప్రదర్శించారు. ‘మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘నన్నేం చేయమంటారు?. నేనే లాఠీ పట్టాలా..? గన్ పట్టాలా?. దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా. దేనికైనా టైం పడుతుంది’’ అని అన్నారామె. ఇక.. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. హత్యలు, వేధింపుల పర్వాలు, చిన్నారులతో సహా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. -
వంగలపూడి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై పీడిక రాజన్న అదిరిపోయే కౌంటర్
-
‘అఘాయిత్యాలపై స్పందన.. ఇంత ఆలస్యమా అనితమ్మా?’
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా ఏవో కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక చించేస్తాం.. పొడిచేస్తాం అన్నారు. తీరా అధికారంలో కొలువుదీరి నెల తిరిగేసరికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. ఒకవైపు రాజకీయ ప్రతీకార చర్యలతో పాటు మరోవైపు హత్యలు, హత్యాచారాలు, మిస్సింగులు పెరిగిపోయాయి. అయితే వీటిపై ఇటు చంద్రబాబు ప్రభుత్వంగానీ, ఈ తరహా ఘటనలపై గతంలో ఊగిపోయి మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌నుగానీ సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపించాయి. ఈ తరుణంలో.. నంద్యాల ముచ్చుమర్రి దారుణ ఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హోం మంత్రి అనితను ముచ్చుమర్రి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆమె ఆ గ్రామానికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగి పది రోజులు కావొస్తోంది. గత ఆరు రోజులుగా అధికార యంత్రాంగం ఎడతెరిపి లేకుండా బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది. హోం మంత్రి పదవిలో ఉండి కూడా అనిత ఆలస్యంగా స్పందించడం.. తాజాగా ఇవాళ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌పైనా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించిందక్కడ. తాజాగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘‘ముచ్చుమర్రిలో చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. చిన్నారి కోసం ఎన్డీఆర్ బృందాలు వెతికినా మృతదేహాం లభించలేదు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాం. మరోవైపు.. విజయనగరంలో ఆరు నెలల పనికందుపై అత్యాచారం చేశారు. తాగిన మైకంలో వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఎం చంద్రబాబు ఈ ఘటనలపై సమీక్ష నిర్వహించారు. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు. ముచ్చుమర్రి ఘటన, విజయనగరం ఘటనపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు. ముచ్చుమర్రి ఘటన జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా సీఎం చంద్రబాబు స్పందించింది లేదు. డిప్యూటీ సీఎం పవన్ స్పందించినా అది సరైన రీతిలో లేదనే చర్చా సోషల్ మీడియాలో నడిచింది. మరోవైపు ఒక్క ఎమ్మెల్యే, మంత్రి కానీ అటువైపు కూడా చూడలేదు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించి హోం మంత్రిని ముచ్చుమర్రికి వెళ్లాలని ఆదేశించారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రభుత్వంపై విసుర్లు విసిరిన ఆమె.. ఇప్పుడు అధికారంలో హోం మంత్రిగా మొక్కుబడిగా ఏదో ప్రకటన చేశారు. మరోవైపు.. ముచ్చమర్రి మైనర్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. బాలిక అదృశ్యం కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిజాన్ని నీళ్లలో ముంచి దర్యాప్తు దారి మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్, జాలర్లతో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వంగలపూడి అనితపై ఎమ్మెల్యే విరూపాక్షి ఫైర్
-
మంత్రి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
మహిళల రక్షణ ఇలాగేనా!?: వరుదు కల్యాణి
అచ్యుతాపురం: పదమూడేళ్ల బాలిక దర్శినిని దారుణంగా హత్యచేసిన నిందితుడు సురేష్‌ను వెంటనే పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారిరువురు రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలోని దర్శిని ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన లేఖను డీఎస్పీకి అందజేశారు. పోలీసుల వైఫల్యం కాదా.. అనంతరం.. కళ్యాణి, సుభద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత జిల్లాకు చెందిన బాలికను హత్యచేసి ఐదురోజులైనా నిందితుడ్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బెయిల్‌పై ఉన్న నిందితుడు సురేష్ నుంచి ప్రాణహాని ఉందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా బాలికను రక్షించలేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా చట్టాలు, మహిళల రక్షణ గురించి మాట్లాడిన అనిత ఇప్పుడేం చేస్తున్నారని.. మహిళల రక్షణ ఇలాగేనా అని వారు ప్రశ్నించారు. ఇప్పటివరకూ బాలిక కుటుంబీకుల్ని పరామర్శించేందుకు హోంమంత్రి రాకపోవడం దారుణమన్నారు. దిశ యాప్, దిశ పోలీస్స్టేషన్లను మార్చడంలో ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో ఎందుకు లేదన్నారు. మృతురాలి కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలిక హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణ లేదు... న్యాయం ఇంకెంత ఆలస్యం
-
హోం మంత్రి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్లో తెలుగు తమ్ముళ్లు విధ్వంసానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రియల్టర్, ఇద్దరు హేచరీల నిర్వాహకులు కలిసి పొరుగున అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్‌కు ఇటీవల వచ్చారు. రెస్టారెంట్లో ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోవడంపై రెస్టారెంట్ నిర్వాహకులు ప్రశి్నంచారు.కస్టమర్లు వస్తున్నారు, వ్యాపారం దెబ్బతింటున్నదని టేబుల్ ఖాళీ చేయాలని రెస్టారెంట్ సిబ్బంది వారికి సూచించడంతో ఒక్కసారిగా వారు రెచి్చపోయారు. హోంమంత్రి తాలూకా తమనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమంటావా, ఖాళీ చేయిస్తావా అంటూ రెస్టారెంట్లో నానా రాద్ధాంతం సృష్టించారు. నిర్వాహకులు సర్దిచెబుతున్నా లెక్క చేయకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తావో చూస్తామంటూ బెదిరించి కురీ్చలు తన్నేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అదే రోజు సాయంత్రం సుమారు 20 మంది అనుచరులతో గుంపుగా మరోసారి వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నిర్వాహకులతో గొడవకు దిగారు.మంత్రి తాలూకా అంటూ బిల్లు ఇచ్చేది లేదని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ కురీ్చలు తన్నేసి నానా గొడవ సృష్టించి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులే కావడంతో.. విషయాన్ని సిబ్బంది విదేశాల్లో ఉన్న హోటల్ నిర్వాహకునికి తెలియజేశారు. దీంతో ఆయన తన ఆతీ్మయుడైన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్‌చేసి మంత్రి పేరు చెప్పి గలాటా సృష్టిస్తున్నారని వారిని కట్టడి చేసి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రెస్టారెంట్లో కురీ్చలు గిరాటేసి దాడులకు పాల్పడ్డ గలాటా తాలూకా వీడియోలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.మంత్రి పేరు చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతలో గలాటా సృష్టించిన తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వివాదంపై రెస్టారెంట్ నిర్వాహకులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయతి్నస్తూ కేసు లేకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై అన్నవరం సబ్ ఇనస్పెక్టర్ కిశోర్‌బాబును సంప్రదించగా రెస్టారెంట్లో స్వల్ప వివాదం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే గొడవ విషయంపై తమకు నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
తీరిక లేదా అనితమ్మా!?
సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలికను బోడాబత్తుల సురేష్ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించకపోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దొరకని నిందితుని ఆచూకీ..ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంటపడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు. -
హోంమంత్రి అనిత Vs ఎమ్మెల్యే బాలకృష్ణ.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య ‘వన్’ రెస్టారెంట్ దాడి వ్యవహారం చిచ్చురేపింది. మూడు రోజుల క్రితం అన్నవరంలో వన్ రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై దాడి జరిగింది. రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై హోంమంత్రి అనిత అనుచరులు దాడికి పాల్పడ్డారు.ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా టీడీపీ నేతలు గంటల తరబడి హోటల్లో కూర్చున్నారు. పీక్ అవర్‌లో ఎక్కువ సేపు కూర్చుంటే నష్టపోతామని హెటల్ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో.. హోటల్ మేనేజర్, సిబ్బందితో టీడీపీ నేతలు ఘర్షణకు దిగి.. దాడికి పాల్పడ్డారు.ఈ గొడవ విషయాన్ని హోటల్ సిబ్బంది అమెరికాలోని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే దాడి విషయాన్ని నందమూరి బాలకృష్ణ దృష్టికి హోటల్ యాజమాని తీసుకెళ్లారు. దీంతో హోంమంత్రి వంగలపూడి అనితకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేసిన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమణగపోవడంతో పంచాయితీ సీఎం పేషీకి చేరింది. అనంతరం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా? హోంమంత్రి అనుచరులు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారా? అనే చర్చ నడుస్తోంది. -
‘జగన్‌ను అడ్డుకోవాలని అన్నివిధాలా ప్రయత్నించారు’
నెల్లూరు, సాక్షి: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్న హోం మంత్రి అనిత ప్రకటనలో ఎలాంటి నిజం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. పైగా ఆయన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నించిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ ములాఖత్ అయిన క్రమంలో ఎక్కడా నియమ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు. అంతా రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం. పైగా నిర్ణీత టైం కంటే ముందే ములాఖత్ ముగిసింది. అయితే జగన్‌కు ములాఖత్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించామని హోం మంత్రి అనిత చెప్పారు. ఉదారంగా కాదు.. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ పర్యటిస్తే వేల మంది వస్తారని వాళ్లకు తెలుసు. అలా వస్తే వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ బయటపడుతుందని భయపడ్డారు. అందుకే పోలీసుల ద్వారా జగన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు. పర్యటనకు అనుమతులు ఇవ్వకుండా చివరిదాకా ఇబ్బందులు పెట్టారు. ఒకానొక టైంలో ములాఖత్ రద్దు చేస్తున్నామని చెప్పారు. అయితే పర్యటనకు ముందు రోజూ రాత్రి కనుపర్తిపాడుకి అనుమతి ఇచ్చారు. జగన్ నెల్లూరుకు వచ్చే 20 నిమిషాల ముందు కూడా జైలు వద్దకు వేలమంది వచ్చారని, ములాఖత్ రద్దు చేశామని జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. జగన్ పర్యటనకు నామ మాత్రపు భద్రత ఇచ్చారు. అందుకే జనాలు హెలిప్యాడ్‌లోకి దూసుకురాగలిగారు. పిన్నెల్లి వ్యవహారంలోనూ కక్షపూరితంగా వ్యవహరించారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తికి మద్దతు పలకడానికి జగన్ వచ్చారా? అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. ఆమె అసలు జగన్ ఏం మాట్లాడారో పూర్తిగా విన్నారా? లేదంటే అనుకూల మీడియా ఎడిటింగ్లు చేసిన వీడియోలు చూసి అలా మాట్లాడారా? అర్థం కావడం లేదు. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, ఇది అన్యాయమని మాత్రమే జగన్ అన్నారు. అలాగే.. 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయిన ఘటనలు జరిగాయని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల్లిపైనే కేసు ఎందుకు పెట్టారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదా? అని కాకాణి ప్రశ్నించారు. -
జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు
ఆరిలోవ (విశాఖ తూర్పు): మత్తు పదార్థాలకు అలవాటుపడి ఖైదు అనుభవిస్తున్నవారి కోసం జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఆమెకు జైలు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్, అదనపు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఆమె జైలు లోపల పర్యవేక్షించారు. ఖైదీలు ఉండే బేరక్లను పరిశీలించారు. అనంతరం జైలు బయట ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. జైలు గంజాయి ముద్దాయిలతో నిండిపోయిందన్నారు. వారిలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో 20 నుంచి 30 పడకలతో కూడిన డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుపై దృష్టి పెడతామని చెప్పారు. అసలైన గంజాయి సరఫరా చేయించిన వారిని వదిలేసి అమాయక గిరిజనులను పోలీసులు పట్టుకుని జైళ్లలో పెట్టారన్నారు. గంజాయి ముద్దాయిలకు బెయిల్ మంజూరులో ఆటంకంగా నిలిచిన షూరిటీ గురించి లీగల్‌గా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తానన్నారు. జైలు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జోనల్ ట్రాన్స్ఫర్లకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగేటట్లు చర్యలు చేపడతామన్నారు. ఖైదీలకు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా క్షమాభిక్ష ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది ఖైదీలకు క్షమాభిక్ష కలి్పస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యంపై మరింత దృష్టిపెడతామని, ఆరోగ్యశ్రీ సక్రమంగా వర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టిన వారిపైన, ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిపైన దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. -
దుశ్శాసనపర్వంపై హోం మంత్రి చర్యలేవి?
సాక్షి, అనకాపల్లి: హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోని కోటవురట్లలో చేనేత కారి్మకులైన ఇద్దరు మహిళలపై టీడీపీ మూకలు దాడిచేస్తే వారిపై చర్యల్లేవని.. దీనిపై అనిత సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆమె సోమవారం కోటవురట్లలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసిందే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేశారంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న వెంటనే కోటవురట్ల మండలంలో ఇద్దరు మహిళల మీద తెలుగుదేశం కార్యకర్తలు దారుణంగా దాడిచేయడమే కాకుండా వాళ్ల బట్టలు చించి బండబూతులు తిట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.. మహిళలపై ఎవరైనా చేయివేస్తే వారి తాటతీస్తామని ప్రగల్భాలు పలికిన హోం మంత్రికి ఈ దాడి కనిపించలేదా? అని ప్రశ్నించారు.మీది మాటల ప్రభుత్వమేనా.. చేతల ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేసిన పరిస్థితులు చూశామని, మళ్లీ అదే దుశ్శాసన ప్రభుత్వం వచ్చిందని మహిళలంతా భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనపై, మహిళల రక్షణపై దృష్టి సారించాలని.. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలను ఎలా కూల్చేయాలి? వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలా దాడిచేయాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. బాలికపై లైంగిక దాడి కేసులో అలసత్వం బీచ్‌రోడ్డు (విశాఖ): విశాఖ మధురవాడలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆ కేసును నీరుగార్చే విధంగా విచారణ చాలా నెమ్మదిగా సాగుతోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ఆమె సోమవారం విశాఖపట్నంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే చర్యలు వేగంగా తీసుకోవాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఆరి్థక సహాయాన్ని తక్షణమే అందించాలని ఆమె డిమాండ్ చేశారు. -
నేనంటే లెక్కలేదా..?
ఎస్.రాయవరం: గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి తాను వస్తుంటే మండలస్థాయి అధికారులు ఎందుకు హాజరుకాలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె సోమవారం అనకాపల్లి జిల్లా పెదగుమ్ములూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబి్ధదారులకు పింఛను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వేదికపై ఉన్న అధికారులను చూసి మండలస్థాయి అధికారులు ఎవరు హాజరయ్యారని అడిగారు.ముందుకొచి్చన ఎంపీడీవో సత్యనారాయణతో.. మండలంలో అధికారులు ఎక్కడ ఉన్నారు? హోం మంత్రి వస్తే తహసీల్దార్, ఇతర శాఖల అధికారులు రావాల్సిన అవసరం లేదా.. అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పింఛన్ల పంపిణీకి అధికారులు రావలసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.అధికారుల తీరు మారలేదని, ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గ్రామంలోకి వస్తే అనేక సమస్యల్ని ప్రజలు తనకు చెప్పారని, ఆ ఫిర్యాదులను తాను ఆఫీస్‌కు పంపించుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి హుటాహుటిన మండల కార్యాలయం నుంచి వేదిక వద్దకు వచ్చారు. -
వంగలపూడి అనితకి కేఏ పాల్ కౌంటర్
-
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు పోలీసులు మార్చ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనిత తొలుత మార్చ్‌లో పాల్గొన్న వెయ్యి మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు యువత సహకారం అవసరమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువశక్తి ని ర్వీర్యం దేశాభివృద్ధిలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, అయితే మాదకద్రవ్యాల వినియోగం వలన ఆ యువశక్తిలో కొంత నిర్వీర్యం కావడం బాధాకరమని రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ వాడకం విద్యార్థులకు ఒక ఫ్యాషన్‌గా మారుతుందని, అది వారి జీవితాన్ని కబళించి వేస్తుందని గ్రహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విక్రయాలు, వాడకాన్ని నిర్మూలించేందుకు వంద రోజుల ప్రణాళిక రెడీ అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో డ్రగ్స్ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
చీరాలలో హత్యాచారం!
చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి ముఠా పనే! సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు. 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో నార్కోటెక్ సెల్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు. -
ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిత
-
అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు
కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీనియర్లకు షాక్ ఇచ్చింది. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పలుదఫాలుగా మంత్రులు పనిచేసిన గంటా, అయ్యన్నతో పాటు మూడో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి ఆశలపైనా నీళ్లు చల్లారు. మరోవైపు జనసేన నాయకులకూ ఇదే పరాభవం ఎదురైంది. గ్లాస్ కోటాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నాయకుడు కొణతాల ఆశలూ గల్లంతయ్యాయి.సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మాత్రమే చోటు లభించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుండగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ప్రాధాన్యమివ్వడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.అయ్యన్న, గంటాకు చెక్ !టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఒకసారి ఎంపీగా, ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారీ మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్న అయ్యన్నకు బాబు తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంపై అయ్యన్న కినుక వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒకసారి ఎంపీగా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు రిక్తహస్తాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటాకు చంద్రబాబు చెక్ పెట్టారు. అదేవిధంగా.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశించిన వెలగపూడి రామకృష్ణబాబుకు పరాభవం ఎదురైంది. పలుమార్లు పార్టీ కోసం త్యాగాలు చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం కోటాలో పల్లాకు రావాల్సిన మంత్రి పదవి కొలుసు పార్థసారధికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయ్యన్నకు ఇవ్వాలా.. అచ్చెన్నకు ఇవ్వాలా అనే లెక్కల్లో చంద్రబాబు అచ్చెన్న వైపే మొగ్గు చూపడంతో అయ్యన్నపాత్రుడి వర్గం అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉంది. మరోవైపు.. ఒకసారి మంత్రిగానూ, ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు సత్యనారాయణమూర్తిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. మూడోసారి గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు మొండిచెయ్యి చూపించారు. పార్టీ కోసం విధేయంగా ఉన్న వారితోపాటు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విశాఖ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాలజనసేనలోనూ అదే అసంతృప్తి కనిపిస్తోంది. సీనియర్లుగా ఉన్నవారికి కాకుండా కొత్తగా ఎంపికై న వారికి ప్రాధాన్యమివ్వడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నలుగురిలో ఒక్కరికై నా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఒక్కరికి ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతునివ్వాలని భావించారు. కానీ.. నలుగురికీ చంద్రబాబు, పవన్ ద్వయం మొండి చెయ్యి చూపించింది. సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు, పంచకర్ల రమేష్బాబులో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని భావించారు. కానీ.. వారిద్దరికీ అవకాశం కల్పించలేదు.అదేవిధంగా ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా రాజీనామాతో త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొత్తంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విశాఖ జిల్లాను విస్మరించడంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కాపులతో వ్యవహరించిన తీరును... కాపు నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చెప్పుతో కొట్టి కేసులు పెట్టి వేధించిన అనిత... ఇప్పుడు ఓట్లు కావాలంటూ పైరవీలు చేస్తుండటం విమర్శలపాలవుతోంది. తమ సొంత సామాజికవర్గాన్ని వేధించిన అనితకు మద్దతుగా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అనితను వ్యతిరేకించినందుకు ఏకంగా పార్టీ నుంచి కొద్దిమంది నేతలు సస్పెండ్ అయ్యారు.తమ వెనుక ఉండి నడిపించిన గంటా... తీరా తన సీటు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మళ్లీ అనితకు మద్దతివ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చి మరీ చెప్పడాన్ని కాపులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గంటా కాపు కాదని కాపునాడు తీవ్రంగా విమర్శలు చేసింది. కాపు సామాజికవర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకే తమ మద్దతని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంగా తమ సామాజికవర్గాన్ని తీవ్రంగా అవమానించిన అనితతోపాటు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన గంటాకూ తమ దెబ్బ రుచి చూపిస్తామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిత బాధితులెందరో...! ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత నియోజకవర్గంలోని నేతలందరిపైనా అధికారం చెలాయించారు. కాపు నేతలపై మరింత కక్షపూరితంగా వ్యవహరించారు. ఏకంగా కాపు నేతలను చెప్పుతో కొట్టడమే కాకుండా కేసులు బనాయించి మరీ వేధించారు. కాపుల మద్దతుతో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత మంగవరం గ్రామానికి చెందిన ఒక కాపు యువకుడ్ని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారు. తనపై తప్పుగా వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహంతో చెప్పుతో కొట్టి కాపు జాతిని ఘోరంగా అవమానించారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పే కానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ సామాజిక వర్గం పెద్దల సమక్షంలో మందలించడం దీనికి పరిష్కారం. ఇవేమీ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో వ్యవహరించారు.చెప్పుతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అదే విధంగా ఆనాడు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జిపై అత్యాచారం కేసు పెట్టించింది. అతన్ని అరెస్టు చేయించడానికి తన అధికారాన్ని అంతా ఉపయోగించింది. బుజ్జికి చెందిన భూములపై సిట్‌కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బుజ్జికి అండగా నిలబడటంతో ఆయన అరెస్టు నుంచి బయటపడ్డారు. తన గెలుపునకు సహకరించిన మరో కాపు నేత తోట నగేష్ పట్ల కూడా ఆమె నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో ఇద్దరు కాపు టీడీపీ నాయకులు గొర్లె రాజబాబు, మజ్జూరి నారాయణరావుల పట్ల కూడా అనిత కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఈ ఇద్దరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం, వారు వేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంగా వారిద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది.గంటా మధ్యవర్తిత్వంపై కాపుల్లో ఆగ్రహం అనిత చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న గెడ్డం బుజ్జి పలుసార్లు జనసేన సమావేశాలు ఏర్పాటు చేసి అనితకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, ఓడించి తీరుతామంటూ గతంలో ప్రకటనలు చేశారు. కాపులను చెప్పుతో కొట్టి... తమ నేతపై రేప్ కేసు పెట్టిందని పదే పదే బుజ్జి అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. బుజ్జి మెత్తబడడాన్ని కూడా ఆయన అనుచరులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తోట నగేష్ జనసేనలో చేరి అనితకు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటివరకు గంటా వర్గంగా ముద్రపడి... అనితను తీవ్రంగా వ్యతిరేకించిన గొర్లె రాజబాబు, నారాయణరావులు ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.అయితే గంటా వీరి మధ్య రాజీ కుదిర్చారు. ‘నీకు సీటు ఇవ్వాలంటే పాయకరావుపేటలో నీ వర్గాన్ని అనితకు మద్దతు ఇచ్చేలా చేయాల్సిందే’నంటూ చంద్రబాబు నుంచి గంటాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వారి మనోభావాలను సైతం పట్టించుకోకుండా గంటా వ్యవహరించాడంటూ ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గంటాది అసలు కాపు సామాజికవర్గమేనా అని కాపునాడు నేతలు నేరుగా ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అత్యధిక సీట్లను కేటాయించిన వైఎస్సార్సీపీకి మద్దతిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. -
వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు
-
Vangalapudi Anitha: అవినీతి అనకొండ వంగలపూడి అనిత
సాక్షి, అనకాపల్లి: అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ వంగలపూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా భారీ అవినీతి, భూఆక్రమణలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పులతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న (2014–19) ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె చేసిన అక్రమాలు అన్ని ఇన్నీ కావు. వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం చేయడమే కాదు.. కోట్ల విలువైన అభివృద్ధి పనులను నామినేషన్ పద్ధతిలో పంచేసుకుని సొమ్ముచేసుకున్నారు. ఇసుకను దోచేశారు. మట్టిని కాజేశారు. మరుగుదొడ్లలో మెక్కేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి దోచుకున్నారు. నీరు–చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. చెరువు తవ్వకాల్లో వచి్చన మట్టిని రియల్ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించడం, తాండవ, వరాహ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి కంపెనీలకు విక్రయించడం, భూరికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు పుట్టించి పాసు పుస్తకాల్లో నమోదు చేయించుకోవడం, ఈ భూములకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు పరిహారం పొందేందుకు స్కెచ్ వేయడం ఇలా అక్రమాల చిట్టా చాలానే ఉంది. జన్మభూమి కమిటీలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను అర్హులైన వారికి కేటాయించకుండా లక్షలాది రూపాయలకు అమ్మేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. రేషన్ డిపోలు, అంగన్వాడీ ఆయా, కార్యకర్తల పోస్టులు కూడా ఇలాగే అమ్మేసుకున్నారు. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలులో కూడా లబి్ధదారులనుంచి వేలాది రూపాయలు గుంజేశారు. మట్టి విక్రయాల్లో రూ.25 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నీరుచెట్లు పథకం కింద పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగేళ్లలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిలో రూ.6 కోట్లు వరకూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అనిత బొక్కేశారు. ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇలా నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. కోటవురట్లలో ఊరచెరువు, జల్లూరులో నాగన్న చెరువు, ఎస్.రాయవరం మండలం రామయ్యపట్నంలో జగ్గరాజు చెరువు, పెదగుమ్ములూరులో రాతి చెరువు, పెద ఉప్పలం చెరువు అప్పలరాజు చెరువులలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపించి మోసం చేశారు. మట్టి విక్రయాల ద్వారా మరో రూ.25 కోట్లు వెనకేసుకున్నారు. రూ.50 కోట్ల ఇసుక తరలింపు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు చూసుకుని టీడీపీ నాయకులు ఇసుక నుంచి కోట్లు పిండేశారు. తాండవ, వరాహ నదుల్లో దార్లపూడి, పందూరు, గొట్టివాడ, గుమ్ములూరు, పెదఉప్పలం, పెనుగొల్లు, ధర్మవరం, సోముదేవుపల్లి సత్యవరం, పెంటకోట, మాసయ్యపేట, అరట్లకోట తదితర ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారు. సుమారు రూ.50 కోట్లు విలువైన ఇసుకను కొల్లగొట్టడం ద్వారా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సుమారు రూ.20 కోట్ల మేర లాభాలు ఆర్జించారు. మరుగుదొడ్లలో 15 కోట్లు.. టీడీపీ ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు నిరి్మంచారు. ఆరి్థక సంఘం నిధులు దాదాపుగా సుమారు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ముఖ్య నాయకులే చేపట్టారు. నాణ్యతా లోపంతో పనులు చేసి రూ.50 కోట్ల వరకు స్వాహా చేశారు. అలాగే నియోజకవర్గానికి 25 వేల మరుగుదొడ్లు మంజూరైతే..వాటికి రూ.37 కోట్లు విడుదల చేశారు. ఒక్కో దానికి రూ.15 వేలు కేటాయించారు. వీటిని నిరి్మంచే బాధ్యత తెలుగుతమ్ముళ్లే తీసుకున్నారు. వీటిలో సగం మరుగుదొడ్లు బినామీలకే మంజూరు చేశారు. ఇలా మరుగుదొడ్లలో రూ.15 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలిసింది. 600 ఎకరాల్లో భూ కుంభకోణాలు అప్పట్లో అనిత నేతృత్వంలో నియోజకవర్గంలో సుమారు 600 ఎకరాల్లో భూకుంభకోణాలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పుల పేరిట.. భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సబ్‌డివిజన్–2లో సుమారు రూ.10 కోట్ల విలువైన 4.40 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీగా పేర్కొంటూ మరో ముగ్గురి పేరున ఒన్ బీ, ఆన్లైన్లో నమోదు చేశారు. ల్యాండ్ సీలింగ్ పేరిట టీడీపీ నాయకులు భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారు. అమలాపురంలో 105 ఎకరాల భూముల్లో రూ.22 కోట్లు, రాజయ్యపేటలో 19 ఎకరాల్లో రూ.5 కోట్లు, నెల్లిపూడిలో 42 ఎకరాల్లో రూ.15 కోట్లు, గుర్రాజుపేటలో 10 ఎకరాల్లో రూ.3 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు. -
లోకేష్ పాదయాత్రలో వంగలపూడి అనిత పరువు తీసిన టీడీపీ కార్యకర్తలు
-
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వంగల పూడి అనితపై అసమ్మతి నేతలు ఆగ్రహం
-
టీడీపీ నేత పై మండి పడ్డ ఎమ్ఎల్సి వరుడు కళ్యాణి...
-
టీడీపీ అంటే తెలుగు డర్టీ పార్టీ
-
మాకు కూడా చెప్పులు ఉన్నాయి జాగ్రత్త... అనితకు వరుదు కళ్యాణి కౌంటర్
-
పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం...
అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఓటమి చెందడానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లే కారణమంటూ బస్సు యాత్రలో టీడీపీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించడం పట్ల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, కాపునేత గెడ్డం బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుంటపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వయంకృతాపరాధాలే టీడీపీ ఓటమికి కారణమన్నారు. 2009లో చిరంజీవి వల్ల, 2019లో పవన్‌కల్యాణ్ కల్యాణ్ వల్ల పాయకరావుపేటలో టీడీపీ ఓడిపోయిందని బండారు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. 2014లో జనసేన పార్టీ మద్దతు వల్లే పాయకరావు పేట నియోజకవర్గంలో వంగల పూడి అనిత ఎమ్మెల్యేగా గెలుపొందారన్నా రు. గెలిచిన నెలరోజులకే జనసేన నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తనపై కేసులు పెట్టారన్నారు. 2014లో జనసేన మద్దతు ఇవ్వకపోతే పాయకరావుపేటలో టీడీపీ అభ్యర్థి అనిత ఘోరంగా ఓటమి పాలయ్యేవారన్నారు. 2024 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మళ్లీ గెలుపొందాలని వంగలపూడి అనిత ప్రయత్నిస్తున్నారని, ఆమె పాయకరావుపేటలో ఎలా గెలుస్తారో తాము చూస్తామన్నారు. ఆమె ఓటమే మా ధ్యేయమని చెప్పారు.అనితకు టికెట్ ఇస్తే పాయకరావుపేటలో ఓడిపోవడం ఖాయమని ఈ విషయాన్ని బండారు తోపాటు, టీడీపీ పెద్దలు గ్రహించాలన్నారు. -
అనితకు టికెట్ ఇవ్వొద్దు జనసేన బిగ్ షాక్..!
-
పొత్తు పొడవకముందే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు
అనకాపల్లి: ఆ సీటు మాదే అంటే మాదే అంటున్నారు టీడీపీ-జనసేన నేతలు. ఇంకా పొత్తు పొడవకముందే సీట్ల పంపకం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేతలు సమావేశం కాగా, అక్కడ సీటు తమకే కేటాయించాలని జనసేన స్వరం పెంచింది. అక్కడ టీడీపీకి సీటు ఇస్తే తాము సహకరించమని తేల్చిచెబుతున్నారు జనసేన నేతలు. అనితకి సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించమని తెగేసి చెబుతున్నారు జనసేన నేతలు. గతంలో అనితను ఎమ్మెల్యేని చేస్తే తమపై తప్పుడు కేసులు బనాయించారని జనసేన నేతలు కుండ బద్ధలు కొట్టారు. దాంతో అనితకు సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్తోనూ టీడీపీ సహకరించమని అంటున్నారు. అనితకు సీటు ఇస్తే ఓడించే తీరుతామని ప్రతిన పూనారు జనసేన నేతలు.. అందుకు సంబంధంచి తీర్మానం కూడా చేశారు. -
అసలు విషయం బట్టబయలు.. వంగలపూడి అనిత ఏం చేసింది?
పాయకరావుపేట సీటు దక్కదనే అపనమ్మకం ఆమెలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనకు మొండి చేయి చూపిస్తుందని భావిస్తున్నారా? సీటును కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబునే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ కార్యకర్తల మెడలో కండువాలు వేసి వారంతా వైసీపీ కార్యకర్తలేనని పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి పైన పల్లకి మోతా.. ఇంట్లో ఈగల మోతలా తయారయిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది.. ఎందుకంటే పాయకరావుపేట నియోజక వర్గంలో ఆమెకు ఎదురువుతున్న పరిస్థితులే అందుకు కారణమని తెలుస్తోంది.. వంగలపూడి అనిత పేరుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకుంటుంది కానీ.. ఆమెకు మాత్రం నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి ఇప్పటికి అదే విధంగా ఉంది అంటే ఆమె నాయకత్వంపట్ల నియోజవర్గంలో ఎలాంటి విశ్వసనీయత వుందో సులువుగా అర్థమవుతుంది. ఆమెకు ఈ సారి ఎన్నికల్లో పాయకరావుపేట సీటు ఇస్తే వచ్చే ఓడించి తీరుతామని అనిత వ్యతిరేక వర్గీయులు శపథం చేస్తున్నారు.. టీడీపీ ముద్దు.. అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిరసనలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. ఎన్నికల తర్వాత అనిత మళ్లి పాయకరావుపేటకు వచ్చారు.. వంగలపూడి అనిత మీద పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమెను మరొకసారి.. ఈ వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.. లేదా టీడీపీ జనసేన పొత్తు ఉంటే పోత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. చదవండి: అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..? ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అనిత. అయితే ఇందుకోసం ఆమె అనుసరిస్తున్న మార్గమే విమర్శలపాలవుతోంది.. పార్టీ క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తాను బలంగా ఉన్నానని ఆమె చెప్పుకుంటే పరవాలేదు.. కానీ ఆమె అలా చేయడంలేదు.. వంగలపూడి అనిత ఈ మధ్యకాలంలో చేసిన ఒక కార్యక్రమం పట్ల సొంత పార్టీ నేతలే చీత్కరించుకుంటున్నారు. ఇంతకీ అనిత చేసిన ఆ పని ఏమిటో ఒకసారి చూద్దాం.. తెలుగుదేశం పార్టీలో ఉన్న పదిమందిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని నమ్మబలికింది. వారి మెడలో కండువాలు వేసి వారంతా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే టీడీపీలో చేరుతున్నారంటూ సభ ఏర్పాటు చేసింది.. వాస్తవంగా వారంతా తెలుగుదేశం పార్టీలో వున్నవారే.. వారు మొన్నటిమొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వారిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంటూ అటు టీడీపీ అధిష్టానాన్ని ఇటు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వనిత. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..! అనిత చేసిన మోసం ఎంతో కాలం నిలవలేదు. సాక్ష్యాలతో సహా వైఎస్సార్సీపీ నాయకులు బట్టబయలు చేశారు. భాస్కర్ చౌదరి అనే టీడీపీ నాయకునితో పాటు కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యనే టీడీపీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు.. ఓ పదిమంది టీడీపీ నేతలను తీసుకువచ్చి వారందరికీ కండువాలు వేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రజా సేవ చేసి ప్రజల మనసు గెలవాలి గాని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కండువా లేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా చిత్రీకరించడం తగదంటూ వంగలపూడి అనితకు హితవు పలికారు. వంగలపూడి అనిత ప్లాన్ చేసిన ఈ నిర్వాకాన్ని ముందుగానే గ్రహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, యనమల కృష్ణుడు ఆమె నిర్వహించిన బహిరంగ సభకు రాకుండా గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయట పడడంతో అనిత నవ్వుల పాలయ్యారు. -
ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ ఆమె కథేంటి?
పార్టీ ఏదైనా..తమ నేతను గెలిపిస్తాం అని కేడర్ చెబుతుంది. కానీ ఒక చోట టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు మాత్రం ఆ అభ్యర్థి అయితే ఓడించడం ఖాయం అంటున్నారట. తమ అభ్యంతరాలు కాదని ఆమెకే సీటిస్తే ఓటమి తథ్యమని ముందే ప్రకటించేశారట. ఇంతకీ ఆ కథేంటో మీరే చదవండి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలోని నేతలతో ఆమెకు ఉన్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యే కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించేశారని ఆమెపై తీవ్ర ఆరోపణలున్నాయి. అనిత అవినీతిని వ్యతిరేకించిన నాయకులుపై కక్ష సాధింపు చర్యలకు దిగారని స్థానిక పార్టీ నేతలే చెబుతారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో నచ్చని నేతలపై తప్పుడు కేసులు పెట్టించారట. అనిత తప్పుడు కేసులతో విసిగిపోయిన టీడీపీ నేతలు గతంలోనే ఆమెపై తిరుగుబాటు చేశారు. 2019 ఎన్నికలకు ముందు అనిత వద్దు.. టీడీపీ ముద్దు అంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు. పాయకరావుపేటలో అనితకు సీటు ఇస్తే ఓడిస్తామని పార్టీ అధినేతకే నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలోనే తనకున్న వ్యతిరేకతను తట్టుకోలేక అనిత పాయకరావుపేటని వదిలి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలవడంతో మళ్లీ పాయకరావుపేటకు మకాం మార్చారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పరాయిచోటుకు వెళ్ళి ఓడిపోయి.. తిరిగి సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు చేరుకున్న అనిత తన పాత లక్షణాలను ఏమాత్రం వదులుకోలేదు. స్థానిక టీడీపీ నేతలపై వేధింపులు పర్వం కొనసాగిస్తున్నారు. గతంలో తనపై వ్యతిరేక గళం వినిపించిన నాయకులను ఒక్కొక్కరిని పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పోస్టర్స్ వేయించారు. ఆ పోస్టర్స్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలు మినహా ఎక్కడా అనిత ఫోటోలు లేవు. ఈ పోస్టర్ల వెనక మాజీ మంత్రి గంటా హస్తం ఉందని అనిత అనుమానిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొంతమంది కాపు నేతలను గంటా ప్రోత్సహిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో గంటాతో సన్నిహితంగా మెలిగే కాపు నాయకులను గుర్తించిన ఆమె వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. గతంలో అనిత వద్దు.. టీడీపీ ముద్దు అని ఎవరైతే తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారో ఇప్పుడు ఈ పోస్టర్ల వెనక వారే ఉన్నారని అనిత భావిస్తున్నారు. ఈ పోస్టర్ల వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి అనిత తీసుకెళ్ళారు. తన వ్యతిరేకులుగా భావించిన ఇద్దరిని పార్టీ నుంచి అనిత సస్పెండ్ చేయించారు. అనిత సస్పెండ్ చేయించిన ఆ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు పాయకరావుపేట టీడీపీ రాజకీయం మరింత వేడెక్కింది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది కాపు సామాజిక వర్గ నాయకులే. ఇప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేయించడంతో అనిత మీద ఆగ్రహంతో ఉన్న కాపు సామాజిక వర్గ టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అనితను ఓడించడమే కాకుండా మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ అనితకు ఇస్తే ఊరూరు తిరిగి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామంటూ సవాళ్ళు విసురుతున్నారు. స్థానిక పార్టీ నేతల హెచ్చరికల నేపథ్యంలో అనితకు పాయకరావుపేటలో మళ్లీ సీటు ఇస్తారో లేక గతంలో మాదిరిగా మరో చోటకు మార్చుతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ -
మనసులో మాట బయటపెట్టిన టీడీపీ అనిత
-
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీలో ముసలం!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. అలాగే తన తనయుడు విజయ్‌కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్‌పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
టీడీపీ నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): రూ.82 లక్షలు రుణం తీసుకుని చెల్లించని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కర్ణాటక బ్యాంకు నోటీసులు జారీ చేసింది. రూ.82 లక్షలను 60 రోజుల్లో చెల్లించాలని లేదా తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించింది. ఈ మేరకు బ్యాంకు ఇచ్చిన పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత 2015లో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో లోక్రిష్ గోకుల్ లేఔట్లో తన పేరుతో ఉన్న స్థలాలను విశాఖపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.82 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో చెల్లించకపోవడంతో కర్ణాటక బ్యాంకు ఈ నెల ఒకటో తేదీన పత్రికా ప్రకటనతోపాటు వంగలపూడి అనితకు నోటీసులు జారీ చేసింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 60 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. -
తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే?
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ జిల్లా మహిళా నేతల మధ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సాక్షిగా విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మద్యపాన నిషేధంపై శనివారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత.. విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ర్యాలీలో తనకు చోటు కల్పించకుండా ఎందుకు పక్కకు నెడుతున్నారంటూ అనంతక్ష్మిని నిలదీశారు. దీంతో వివాదం మొదలైంది. చదవండి: బాబూ.. తిట్టేశాం! చంద్రబాబుకు చెప్పుకున్న తిరుపతి టీడీపీ నేతలు కార్యక్రమాలు మేం నిర్వహిస్తున్నామంటూ అనంతలక్ష్మి బదులియ్యడంతో.. పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసనీ.. పదవి వచ్చిన తర్వాత.. ఇష్టం వచ్చినట్లు ఎవరుపడితే వాళ్ల దగ్గర నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సుజాత అన్నారు. ఎవరికి పదవి ఎలా వచ్చిందో తమకు తెలుసనీ.. సభ్యతగా మాట్లాడాలని అనంతలక్ష్మికి ఆమె సూచించారు. సామాజిక వర్గాన్ని తక్కువ చేసి నోరుజారి మాట్లాడితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుజాత హెచ్చరించారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుతుండటంతో అనిత కలుగజేసుకుని మీడియా ఉన్న దగ్గర గొడవలు వద్దని సర్ది చెప్పారు. ఇలా తెలుగు మహిళల మధ్య మొదలైన ప్రోటోకాల్ వివాదం.. వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. అనంతలక్ష్మి వ్యవహారంపై టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సుజాత ఫిర్యాదు చేశారు. -
‘చంద్రబాబు జీవితంలో మళ్లీ సీఎం కాలేరు’
సాక్షి, విశాఖపట్నం: జీవితంలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళా పక్షపాతిగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జనం.. టీడీపీ మహిళా నేత అనిత పేరు చెబితే అబద్ధాల అనిత ...అబండాల అనిత అంటారంటూ ఆమె దుయ్యబట్టారు. ఐరన్ లెగ్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు ‘‘వైఎస్ భారతి కాలి గోటికి కూడా టీడీపీ మహిళా నేత అనిత సరిపోదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిన దశలో మనో నిబ్బరంతో కుటుంబాన్ని వైఎస్ భారతమ్మ నడిపారు. ఆమె ఓ మంచి తల్లి.. భార్య.. బిజినెస్ విమెన్‌గా మా అందరికీ ఆదర్శమని కల్యాణి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుమార్తె డిస్టింక్షన్లో పాసైతే చంద్రబాబు అసూయతో విమర్శలు చేశారు. భారతమ్మ సూట్ కేసులు మోశారన్నారు.. మరి భువనేశ్వరీ దేవి ఎన్ని సూట్ కేసులు మోశారు’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. ‘‘ఇంట్లో ఆడవాళ్లని కూడా బయటకు లాగే నైజం చంద్రబాబు పార్టీది. జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా దోచుకున్నాయి. జగనన్న పాలనలో చేసిన అప్పులు జనం కోసం చేస్తే.. టీడీపీ హయాంలో అప్పులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. జగనన్న పాలనలో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. సీఎం జగన్ మూడేళ్ల పాలనలో ప్రధాని నుంచి.. అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారని’’ కల్యాణి అన్నారు. చంద్రబాబుకి మహిళలను కలుపు మొక్కలుగా తీసి పారేయడం అలవాటు. అనితకు కూడా అదే పరిస్థితి దాపురిస్తోంది జాగ్రత్త. దివ్యవాణి కూడా అలాగే నష్టపోయింది. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్తాం. కానీ సభ్యత మరిచి విమర్శలు చేస్తే ఉపేక్షించం’’ అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
చెక్కు బౌన్స్ కేసులో కోర్టుకు టీడీపీ నేత అనిత
విశాఖ లీగల్: బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధుల్లేకుండా చెక్కులు జారీ చేసిన (చెక్ బౌన్స్) కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నగరంలోని 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వంగలపూడి అనిత ఎన్నికలు, వ్యక్తిగత ఖర్చుల కోసం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు వద్ద 2015 అక్టోబర్ 1న రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చారు. 18 శాతం వడ్డీ చెల్లించడానికి కూడా అంగీకరించారు. మూడేళ్లు గడిచినా ఒక్క రూపాయి తిరిగివ్వలేదు. శ్రీనివాసరావు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె 2018 జూలై 30న రూ.70 లక్షలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెక్కు ఇచ్చారు. దానిని శ్రీనివాసరావు 2018 ఆగస్టు 13న ఐసీఐసీఐ బ్యాంక్‌లోని తన ఖాతాలో జమ చేశారు. అది నిరాదరణకు గురైంది. చెక్‌ను ఇతర కారణాల వల్ల నిలిపివేసినట్లు బ్యాంక్ అధికారులు మెమో జారీ చేశారు. ఎంతకీ సొమ్ము ఇవ్వకపోవడంతో 2019లో శ్రీనివాసరావు నగరంలోని 1వ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన న్యాయవాది పంపిన లీగల్ నోటీస్‌ను అనిత తిరస్కరించారు. అనంతరం కేసు 7వ ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయింది. ఇటీవల బ్యాంక్ అధికారులు తమ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. అందులో బ్యాంక్ ఖాతాలో తగినన్ని నిధులు లేని కారణంగా చెక్ నిరాదరణకు గురైనట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అనిత సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. మధ్యలోనే కోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో కేసును మేజిస్ట్రేట్ ఈనెల 4వ తేదీకి వాయిదా వేశారు. -
చెక్ బౌన్స్ కేసులో విశాఖ జిల్లా కోర్టుకు టీడీపీ నేత అనిత
సాక్షి, విశాఖపట్నం: చెక్ బౌన్స్ కేసులో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2015 వేగి శ్రీనివాసరావు అనే టీడీపీ నేత నుంచి అనిత రూ. 70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే తీసుకున్న డబ్బుకు 2018 సంవత్సరంలో అనిత చెక్ ఇచ్చారు. కాగా చెక్ బౌన్స్ కావడంతో 2019లో శ్రీనివాస్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణకు రావడంతో అనిత కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్ని సార్లు డబ్బులు అడిగినా అనిత ఏదో ఒక వంక పెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. అవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సొంత పార్టీ నేతలే మోసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని అన్నారు. టీడీపీలో ఉన్నత స్థానంలో ఉన్న అనిత ఇలా చేయడం దుర్మార్గమని వాపోయారు. ఇప్పటికైనా అనిత తన డబ్బులు ఇచ్చేస్తే కోర్టులో ఉన్న కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పారు. చదవండి: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు -
చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు. మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు. అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఆమె చాంబర్లో వాసిరెడ్డి పద్మతో టీడీపీ మహిళా నేతలు వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేశారు. -
వైన్ వీర ‘అనితా’... మాటలు జాగ్రత్త...! : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. తండ్రి సమానుడైన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని... బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలంతా కత్తితో నీ నాలుక చీరేస్తారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎంవీపీ కాలనీలో గల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సజ్జల కష్టపడి తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగారని, అలాంటి వ్యక్తిని బ్రోకర్ అని సంబోధిస్తావా..? అసలు పవిత్రమైన టీచర్‌గా పనిచేసిన నీవు పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగావో నియోజకవర్గ ప్రజలను అడిగితే చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్యం బ్రాండ్లు మంచివి కాదని చెబుతున్న వైన్ వీర వనితకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. ఏలేరు కాలువ అవకతవకల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. కాపు కులస్తులపై కపటప్రేమ ఇటీవల చంద్రబాబు, వైన్ వీర ‘అనిత’ కాపు కులస్తులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కాపు కులస్తుడైన తన భర్తను పోలీస్‌స్టేషన్‌లో చెప్పుతో కొట్టడమే కాకుండా... జైలుకు పంపించిన ఘనత ఈ వీర వనితదని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు అయితే కాపు నాయకుడు వంగవీటి మోహన్‌రంగాను హత్య చేయించారన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడైన వంగవీటి రాధను చంపాలని కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. తండ్రిని హతమార్చినట్టే.. అమాయకుడైన వంగవీటి రాధని హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నాడన్నారు. ఈ కుట్రపై సీఐడీ విచారణ చేయించాలని సీఎం జగన్మోహన్రెడ్డిని కోరతానన్నారు. అప్పుడే వీరి కుట్ర బయటపడుతుందన్నారు. చదవండి: Crime: పగలు రెక్కీ.. రాత్రికి చోరీ! తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా.. -
దళితుల వల్లనే దరిద్రం..
-
నోరు పారేసుకున్న నన్నపనేని
సాక్షి, అమరావతి: ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. కాగా, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. (చదవండి: మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం) -
రోడ్‌షోలో ఎమ్మెల్యే అనితకు చంద్రబాబు షాక్..
నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేటలో ఆది వారం నిర్వహించిన చంద్రబాబు రోడ్‌షోలో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితను వ్యతిరేకించిన వర్గాన్నే అందల మెక్కించారు. ఆమె వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆద్యంతం వ్యతిరేక వర్గీయులే రోడ్‌షోలో హడావుడి చేశారు. దీంతో అనిత వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైకి చెప్పుకోలేనప్పటికీ లోలోపన కుమిలిపోయారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పదవుల్లో ఉండి, ఎమ్మెల్యేకు తిరిగి రెండో సారి టికెట్ ఇవ్వాలని కోరడమే మేం చేసిన నేరమా అంటూ వారు మదనపడుతున్నారు. వ్యతిరేక వర్గానిదే పెత్తనం పాయకరావుపేట చిత్రమందిర్ సెంటర్లో ఆదివారం జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు గంటసేపు ప్రసంగించారు. వేదికకు ఉపయోగించిన బస్సుపైకి ఎక్కే అవకాశం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను వ్యతిరేకించిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణకు మాత్రమే కల్పించారు. మిగిలిన నేతలెవరికి అవకాశం కల్పించలేదు. నాలుగు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, సమన్వయకమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు వచ్చినప్పటికీ వారికి ప్రాధాన్యమివ్వలేదు. సీఎం రోడ్‌షోలో అన్నీతానై వ్యవహరిస్తున్న అసమ్మతి నేత తోట నగేష్ కొనసాగుతున్న గ్రూపులు పాయకరావుపేట టికెట్ వ్యవహారంలో పార్టీలో రెండు గ్రూపులుగా చీలిపోయి సీఎం వద్ద బలప్రదర్శనకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వకుండా కేజీహెచ్ వైద్యుడు బంగారయ్యను ఎంపిక చేశారు. కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వర్గాలన్నీ కలిసి పనిచేస్తాయని అందరూ భావించినా గ్రూపులు మాత్రం యధావిధిగానే కొనసాగుతున్నాయి. అసమ్మతి వర్గం గుప్పిట్లో బంగారయ్య చంద్రబాబు వచ్చిన త ర్వాత అన్నీ సమసిపో యి, బంగారయ్య అందరిని కలుపుకొని పోతాడని ఆయన నోటి వెంట ఏదైనా మాట వస్తుందా అనే ఆశతో సమ్మతి నాయకులు ఎదురుచూశారు. కానీ చంద్రబాబు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. కొత్త అభ్యర్థి బంగారయ్యను కూడా అసమ్మతి వర్గం తన గుప్పెట్లోకి తెచ్చుకుందన్న ప్రచారం జరుగుతోంది. నామినేషన్ దాఖలు మొదలుకుని చంద్రబాబు రోడ్‌షో వరకు జనసమీకరణ అసమ్మతి వర్గీయులదే పై చేయిగా కనిపించడంతో అనిత వర్గం రగిలిపోతున్నారు. అసమ్మతి వర్గీయుల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూపులతో వేగలేకపోతున్నా:బాబుకు బంగారయ్య మొర? నియోజకవర్గ టీడీపీలో ఉన్న గ్రూపులతో తాను వేగలేకపోతున్నానంటూ అభ్యర్థి బంగారయ్య అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకున్నట్లు తెలిసింది. పాయకరావుపేట రోడ్‌షో ముగించుకుని తిరుగు ప్రయాణంలో విశాఖ వెళ్తున్న చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద కొద్దిసేపు బస్సులో నియోజకవర్గానికి చెందిన తోటనగేష్, పెదిరెడ్డి చిట్టిబాబు, రెడ్డిరామకృష్ణతో మాట్లాడారు. జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొంటూ అభ్యర్థిని గెలిపించే బాద్యత నీదేనంటూ జిల్లాగ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్కు అప్పగించినట్లు భోగట్టా. దీంతో అనిత వర్గీయులు డీలా పడ్డారు. అలాగే నియోజకవర్గానికి ఇన్చార్జ్గా నియమించిన మాజీ ఎమ్మెల్యే గండిబాజ్జిని తిరిగి పెందుర్తి నియోజకవర్గానికి వెళ్లిపోయి అక్కడ పార్టీ గెలుపుకోసం పనిచేయాలని సూచించినట్లు సమాచారం. సీఎం రోడ్‌షోకు స్పందన కరువు నక్కపల్లి/పాయకరావుపేట: అత్మస్తుతి, పరనిందతోనే సీఎం చంద్రబాబు రోడ్‌షో ముగిసింది. ఆయన ప్రసంగం ప్రజలకు విసుగు పుట్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్షనేత జగన్‌ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. జగన్‌ను విమర్శించే సమయంలో రోడ్‌షోకు హా జరైన వారినుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. జగన్ ఒక సారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు ఇద్దామా తమ్ముళ్లు ఎందుకు ఇవ్వాలి తమ్ము ళ్లు అంటూ పదే పదే సమాధానం రాబట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చెప్పండి తమ్ము ళ్లు అవకాశం ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలంటూ పదే పదే అడగడం విసుగు పుట్టించింది. ఎంతసేపు తాను అది చేశాను, ఇది చేశాను ఇంకా చేస్తాను అంటూ సొంత బాకా ఊదుకున్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో నిర్మిం చిన ఔటర్ రింగురోడ్డు నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పడంతో పలువురు ముక్కున వేలేసు కున్నారు. స్థానిక సమస్యలపై కప్పదాట్లు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు, నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచుతామని నియోజకవర్గంలో మూడుసార్లు పర్యటించినప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. నెలరోజుల్లో నెరవేరుస్తామంటూ ప్రకటించా రు. కానీ అధికారంలోకి ఉండగా నెరవేర్చలేదని మళ్లీ ఎన్నికలు వచ్చేశాయని, మళ్లీ గెలిపిస్తే ఇవన్నీ మంజూ రు చేస్తానని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒత్తిడి తెచ్చినా.. చంద్రబాబు రోడ్‌కు జనాన్ని తరలించేందుకు అధికార పార్టీ నేతలు అన్నిరకాలుగా ప్రయత్నించారు. రోడ్‌షోకు రాకపోతే చెక్కులు, సెల్ఫోన్లు, పసుపు కుంకుమ నిధులు ఆగిపోతాయని డ్వాక్రా మహిళలను మభ్యపెట్టారు. అయినప్పటికీ జనాన్ని సమీకరించలేకపోయారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనందకుమార్ మాత్రం వేలాది విశాఖ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లను రోడ్‌షోకు వచ్చిన వారికి ఉచితంగా పంచిపెట్టారు. ఇలా కోడ్ ఉల్లంఘనకు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. -
మాకొద్దీ దిగుమతి
సాక్షి, అమరావతి: దిగుమతి అభ్యర్థులతో టీడీపీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. పక్క నియోజకవర్గం, పక్క జిల్లా, ప్రాంతం నుంచి ఆ ప్రాంత ప్రజలకు తెలియని, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చంద్రబాబు అభ్యర్థిగా పెట్టడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. సమీకరణలు, పరిస్థితుల పేరు చెప్పి పలుచోట్ల స్థానిక నాయకులకు షాకిచ్చి కనీసం జిల్లాకు సంబంధం లేని నేతలను అభ్యర్థులుగా పెట్టడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌ను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు. కొవ్వూరులో ఆయనపై ప్రజల్లో, ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇలా చేశారు. కొవ్వూరు ప్రజలు వద్దనుకున్న నేత తమకెందుకని టీడీపీ శ్రేణులు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వంగలపూడి అనితను రెండు జిల్లాలు దాటించి కొవ్వూరుకు తరలించారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీరామ్ మాల్యాద్రికి ఈసారి అదే జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే సీటు కేటాయించారు. వాస్తవానికి మాల్యాద్రిది నెల్లూరు జిల్లా. ఆయన గతంలో గెలిచాక నియోజకవర్గంలో ఆయన పట్టుమని పది సార్లు కూడా పర్యటించలేదు. దీంతో ఈ దిగుమతి సరుకుని ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవాలని అక్కడి నాయకులు ఒత్తిడి తేవడంతో జిల్లాలోని రాజధాని ప్రాంత నియోజకవర్గానికి మార్చారు. ఏడాదికోసారీ దక్కని గల్లా దర్శనం గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి గల్లా జయదేవ్‌ను గుంటూరుకు దిగుమతి చేశారు. గెలిచాక ఆయన ఒక సెలబ్రిటీలా సంవత్సరానికోసారి కూడా అక్కడి నేతలకు దర్శనం ఇవ్వలేదు. తమ కష్టాలు చెప్పుకునేందుకు గల్లా అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మళ్లీ రెండోసారి కూడా ఆయనకే గుంటూరు సీటు ఇవ్వడంతో స్థానిక నాయకులకు ఏం చేయాలో తెలియక వెర్రిచూపులు చూస్తున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను మాల్యాద్రి స్థానంలో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎగుమతి చేశారు.తమ ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వకుండా మరో కొత్త నేతను అంటగట్టడంతో బాపట్ల క్యాడర్ నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇక తిరుపతి స్థానంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పనబాకి లక్ష్మిని పంపుతున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ స్థానికేతర ముద్రతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి గ్రహించి తానే పక్కకు తప్పుకున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోను అదే పరిస్థితి గతంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదే జిల్లాలోని పత్తిపాడు అభ్యర్థిగా ఎంపిక చేశారు. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్‌ను గుడివాడ స్థానం నుంచి పోటీకి దింపారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరణం బలరామకృష్ణమూర్తిని చీరాలకు పంపారు. ఇంకా పలుచోట్ల దిగుమతి అభ్యర్థుల్ని టీడీపీ బరిలో దింపగా వారు తమకొద్దని టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. గెలిచిన తర్వాత అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ సమస్యలు, పార్టీ వ్యవహారాలపై ఎవరిని కలవాలో తెలియడంలేదని వాపోతున్నాయి. స్థానికేతరులు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఉంటోందని, వారి వల్ల తమ ప్రాంతానికి మేలు జరగదని నమ్ముతున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. -
అంత కథ నడిచిందా..
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గురించి ప్రజలు, ప్రతిపక్షాలు కాదు.. స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు గొంతుక చించి అరిచే మాటలవి. ఆమెకు టికెట్ వద్దంటూ ఏకంగా వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టారంటే పాయకరావుపేటలో ఆమె ఎంతటి వ్యతిరేకత మూట కట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తమ డిమాండ్ కాదని ఆమెకు సీటు ఇస్తే 30 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని స్వయంగా టీడీపీ నేతలు శపథం కూడా చేశారు. అలాంటి అనితను ఇప్పుడు జిల్లాలు దాటించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించడం వెనుక చాలా పెద్ద కథ నడిచిందని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత అనతికాలంలోనే లెక్కలేనంత అపకీర్తి సొంతం చేసుకున్నారు. ఎన్నికల వేళ వచ్చేసరికి ఇక టికెట్ దక్కదన్న సంకేతాలు ఆమెకు అందాయి. దీంతో ఆమె సరిగ్గా సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన ఇద్దరిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఓ మీడియా అధిపతితో పాటు కేంద్ర మాజీ మంత్రి వకాల్తా పుచ్చుకుని అనితకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ సీటివ్వాలని బాబుపై ఒత్తిడి చేసినట్టు చెబుతున్నారు. పాయకరావుపేటలో ఆమె కనీస పోటీ ఇవ్వలేరని చంద్రబాబు చెప్పినప్పటికీ అనిత విషయంలో ఆ లెక్కలేమీ చూడొద్దని ఆ ఇద్దరు పెద్దలూ స్పష్టం చేశారట. దీంతో తలపట్టుకున్న చంద్రబాబు.. అనితకు అక్కడే ఇస్తే చాలా బ్యాడ్ అయిపోతాం.. వేరే జిల్లాకు పంపిస్తానని మధ్యేమార్గంగా చెప్పడంతో అనిత వకాల్తాదారులు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఆ మేరకే రాష్ట్రంలోని అన్ని ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు వెతికి చివరికి మంత్రి జవహర్ స్థానానికి ఎర్త్ పెట్టినట్టు చెబుతున్నారు. కేవలం అనిత కోసమే కొవ్వూరు నుంచి జవహర్‌ను కృష్ణా జిల్లాలో మారుమూల నియోజకవర్గం తిరువూరుకు పంపించారనేది నిర్వివాదాంశం. వాస్తవానికి కొవ్వూరులో జవహర్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ వర్గ నేతలు రెచ్చిపోయినా.. ప్రతిపక్ష నేతను నోటికొచ్చినట్టు తిట్టే జవహర్‌నే ఈసారికి పోటీ చేయిద్దామని చంద్రబాబు భావించారట. కానీ అనితను తరలించడం అనివార్యం కావడంతో జవహర్‌ను పదిహేనేళ్లుగా టీడీపీకి ప్రాతినిధ్యం లేని కృష్ణా జిల్లాలో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన తిరువూరుకి తరలించేశారు. కొసమెరుపు ఏమిటంటే.. టీడీపీ తమదే అని భావించే ‘వర్గ’ పెద్దల ప్రాబల్యంతో జిల్లాలు దాటి అనిత టికెట్ తెచ్చుకోగా.. పశ్చిమగోదావరి జిల్లాకే చెందిన దళిత ఎమ్మెల్యే పీతల సుజాత ఆ జిల్లా నేతలు మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ అరాచకాలను ప్రశ్నించి టికెట్ సాధించలేక పోయారు. 2004లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయిన పీతల సుజాత 2009లో పునర్విభజన నేపథ్యంలో టికెట్ దక్కకపోయినా.. చంద్రబాబునే నమ్ముకుని ఉండిపోయారు. 2014లో చివరి నిమిషంలో చింతలపూడి స్థానానికి ఎవ్వరూ దొరక్కపోవడంతో డెల్టా నుంచి పీతల సుజాతను దిగుమతి చేసినా గెలిచి చూపించారు. కానీ ఈ ఎన్నికలకు మాత్రం ఆమె పనికి రాదని టికెట్ నిరాకరించిన చంద్రబాబు ఆ పెద్దల ఒత్తిడికి తలొగ్గి వంగలపూడి అనితను మాత్రం ఏకంగా జిల్లాలు దాటించారు. తెలుగుదేశంలో వర్గ నేతల ప్రాబల్యానికి ‘అనితకు మళ్లీ టికెట్’ కంటే ఏం కావాలని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖ -
అనితను ఓడిస్తామని హెచ్చరిక..
-
సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా.. అసంతృప్తుల పోరు..
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఓ వైపు డేటా చోరీ ఆరోపణలు.. మరోవైపు సొంత పార్టీలో విభేదాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతుండటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందుకోసం అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. అనితను ఓడిస్తామని హెచ్చరిక.. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పాయకరావుపేట టీడీపీ సమీక్షా సమావేశంలో అనిత అవినీతిపై నిలదీయడానికి అసంతృప్త నేతలు సిద్దమవుతున్నారు. టీడీపీకి రాజీనామా యోచనలో మాజీ ఎంపీ.. సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురం ఎమ్మెల్యే టికెట్ తిరిగి ప్రభాకర్ చౌదరికి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి అనంతపురం బయలుదేరిన సైఫుల్లా వర్గం నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. సైఫుల్లాతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ నూరమ్ మహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, జకీవుల్లా, లక్ష్మీపతి, 15 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. -
ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు..
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. ఇటీవలి కాలంలో పార్టీ నుంచి నేతల వలసలతో విలవిల్లాడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీని ఇంటిపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతలు సెగలు కక్కుతున్నారు. ‘ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు.. మళ్లీ వారికే టికెట్లు ఇస్తే ఓడిస్తాం’.. అంటూ రోడ్డెక్కి మరీ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడంతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న పార్టీ అధినేతకు ఈ అసమ్మతి కుంపట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పాయకరావుపేటలో ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా వందలాది టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. ఈ ఎమ్మెల్యే మాకొద్దని నినదించారు. విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు కూడా అయిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ పార్టీ మైనారిటీ, మహిళా విభాగాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టి డిమాండ్ చేశారు. ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై అక్కడి టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఎదురుతిరిగారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోతే వారే పార్టీ అభ్యర్థులను ఓడిస్తారని.. తాను కూడా పోటీలో ఉంటానని అల్టిమేటం జారీ చేశారు. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాజుకుంటోంది. నిన్న గాక మొన్న మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుని తీరు పట్ల మంత్రి సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావుపై అసంతృప్తితో భీమిలి నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మాడుగులలో పార్టీ ఇన్చార్జి గవిరెడ్డి రామానాయుడుపై సొంత పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే గ్రూపుకట్టి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాజాగా ఒకే రోజు ముగ్గురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రెస్మీట్లు పెట్టి మరీ పార్టీ అదిష్టానానికి అల్టిమేటంఇవ్వడమే కాదు.. ర్యాలీలు, ధర్నాలతో రోడ్డెక్కడం సిట్టింగులపై ఏ స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికుతుందో తేటతెల్లమవుతోంది. అనితపై ఆగ్రహజ్వాలలు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై గత కొన్ని రోజులుగా అసమ్మతి రాజుకుంటోంది. ఇన్నాళ్లూ ఆమె అవినీతికి వ్యతిరేకంగా పార్టీ సమావేశాల్లో గళం విప్పిన నేతలు ఇప్పుడు రోడ్లెక్కారు. రానున్న ఎన్నికల్లో అనితకు టిక్కెట్ ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే ఓడిస్తామంటూ పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో పార్టీ నేతలు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన, నక్కపల్లి కోఆప్షన్ జడ్పీటీసీ కొప్పిశెట్టి కొండబాబు తదితరులు అనిత విజయానికి పనిచేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె తీరు మారిపోవడంతో.. ఒక్కొక్కరుగా ఆమెకు దూరమయ్యారు. రెండేళ్ల పాటు గుంభనంగా ఉన్న వారంతా ఎన్నికల ముంగిట అసమ్మతి గళమెత్తారు. గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటనగేష్, విశాఖ డెయిరీ డైరెక్టర్ రెడ్డి రామకృష్ణ, నక్కపల్లి మాజీ ఎంపీపీ బొల్లం బాబ్జి, మరో మాజీ ఎంపీపీ, అతని బందువులు, ఎస్‌రాయవరం పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షుడు దండు గణపతిరాజు, పాయకరావుపేట మాజీ వైస్ ఎంపీపీ గొర్లె రాజబాబు, సీనియర్ నేతలు దేవవరపు వెంకటరమణ, చింతకాయల రాంబాబు, కోటవురట్ల మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వర చంద్రమూర్తి, సీనియర్ నాయకుడు వేగి శ్రీనివాసరావు తదితరులు ఇప్పటికే అనితపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. రెండునెలల క్రితం తోటనగేష్ తన వర్గీయులతో రహస్య సమావేశం నిర్వహించి వారి మద్దతు కూడగట్టారు. ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు అలాగే నెలరోజుల క్రితం నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వారితో మరో సమావేశం నిర్వహించి అసమ్మతి కార్యకలాపాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. తాజాగా పదిరోజుల క్రితం కోటవుటర్లలో నియోజకవర్గంలోనాలుగు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో మరో సమావేశం నిర్వహించి బాహటంగానే అనితపై విమర్శనాస్త్రాలు సంధించారు. అనితకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని, ఆ ప్రభావం అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విజయావకాశాలపై కూడా పడుతుందని హెచ్చరించారు. తాజాగా పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు కూడా అసమ్మతి గూటికి చేరారు. అనిత అవినీతిలో కూరుకుపోయింందంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబుతోపాటు, పార్టీ సీనియర్ నేతలు కళావెంకటరావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడులను కలుస్తూ తనకు లేదా తన కుమార్తె వెంకటలక్ష్మికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ పెద్దల నుంచి ఆ మేరకు హమీ లభించిందని చెప్పుకుంటూ అసమ్మతి నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆయన రంగప్రవేశం చేసినప్పటి నుంచి పార్టీలో అసమ్మతి ఊపందుకుంది. వాసుపల్లిపై అసంతృప్తి సెగలు విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత పార్టీలో అసంతృప్తి ఎగసిపడుతోంది. గతేడాది వాసుపల్లి తీరుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన దళిత నేతలు పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. తాజాగా వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ అర్బన్ టీడీపీ మైనార్టీ వింగ్ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాదిక్, మాజీ కార్పొరేటర్ చెన్నా రామారావు, తెలుగు మహిళ మాజీ ఉపాధ్యక్షురాలు గొర్ల అప్పలనర్సమ్మ తదితరులు బుధవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రశ్నించిననేతలపై ఎమ్మెల్యే స్వయంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు మండిపడ్డారు. తన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులతో బెదిరింపులకు దిగుతున్నారని, ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తున్నారంటూ.. ఇంకా పలు ఆరోపణలు చేశారు. పల్లాకు పాకిన సెగలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారికి మళ్లీ టికెట్ ఇస్తే కార్యకర్తలే ఓడిస్తారని మాజీ కార్పొరేటర్, టీడీపీ సీనియర్ నేత లేళ్ల కోటేశ్వరరావు హెచ్చరించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకే అంటూనే.. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను పక్కన పెట్టిన వారికి టికెట్లు ఇస్తే గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా లేరంటూ ఎమ్మెల్యే పల్లానుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరు వల్లే మాజీ కార్పొరేటర్ కోన తాతారావు, వార్డు అధ్యక్షులు చిత్తా కనకరాజు, కరణం కనకారావు తదితరులు పార్టీని వీడారని గుర్తు చేశారు. మళ్లీ పల్లాకు టికెట్ ఇస్తే చాలా మంది పార్టీని వీడతారంటూ హెచ్చరించారు. -
టీటీడీ బోర్డు నుంచి అనిత ఔట్
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అనిత నియామకంపై అటు ప్రజల్లో, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. గతంలో అనిత ఓ ప్రవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సైతం బయటకు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా బోర్డ్ మెంబెర్ గా తొలగించినట్లు సర్కార్ పేర్కొంది. మంత్రి పదవికోసం ఆశించిన అనితకు రెండుసార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆశాభంగం ఎదురైంది. దీంతో అనిత గత కొద్దికాలం పార్టీ కార్యక్రామాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయంపై పలుసార్లు ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 20న జీవో జారీ చేసింది. అయితే అనిత నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనిత నియామకాన్ని సమర్ధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంతేకాకుండా గతంలో ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని సైతం నెట్‌జన్లు బయటపెట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో స్వచ్చందంగా తప్పుకోవాలంటూ అధిస్టానం ఇచ్చిన సూచన మేరకు అనిత తనను పాలకమండలి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అనిత సభ్యత్వం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీటీడీ వివాదంలో కొత్త మలుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెనక్కి తగ్గారు. టీటీడీ పాలకమండలిలో తనను సభ్యురాలిగా నియమించడం వివాదానికి దారి తీసిందని భావించిన అనిత.. బోర్డు నుంచి తనను తప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాశారని సమాచారం. టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అనిత విషయంలో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
చంద్రబాబు చెంపదెబ్బలు వేసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. హిందువులు, దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో హిందువులందరూ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన టీటీడీ బోర్డులో తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనితను సభ్యురాలిగా నియమించడం హిందువులను అవమానించడం కాదా? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇది వేరే మతాల వాళ్ల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా చెప్పకతప్పదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనిత స్వయంగా ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం హిందువులు, దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకుని, దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ తప్పిదం మళ్లీ చేయనని ప్రజలకు చెప్పాలి..’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘ఇది ధర్మపోరాటం అని చెప్పి కోట్లలో డబ్బులు ఖర్చు చేయడం తప్ప వారు చేసిందేమీ లేదు. మానసిక ఒత్తిళ్లకు.. రకరకాల భయాందోళనలకు సీఎం గురయ్యారు. నిన్న జరిగిన తంతు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకున్నారు తప్పితే ఒక మర్యాద కలిగిన పార్టీ, ఒక హోదా ఉన్న వ్యక్తులు చేసే వ్యవహారంలా లేదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కుటుంబ ప్రతిష్టను, ఎన్టీయార్ పేరును, తెలుగు ప్రజల గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. -
టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. అనిత వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన వీడియోను ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండానిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ పాలక మండలిని నియమించడానికి ముందుగానే ప్రభుత్వం సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. బొండా ఉమా హిట్లర్.. అతడు అనర్హుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు విజయవాడ బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం బ్రాహ్మణ సంఘాలే. కానీ గెలిచినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. బొండా ఉమాకు ఆలయ వైదిక ధర్మాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి టీటీడీ పదవులు కట్టబెట్టడం బ్రాహ్మణులను కించపరచడమే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొండా ఉమా ఒక హిట్లర్ అని.. ఆయనకు అన్ని పదవులు కట్టబెట్టడం దుర్మార్గమని బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను... బోర్డు సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమా సహా మరికొందరిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు
♦ చేయని వ్యాఖ్యలకు బాధపడితే... వాటిని ఉపసంహరించుకుంటా ♦ సభా హక్కుల సంఘం ముందు ఎమ్మెల్యే రోజా వివరణ ♦ అసెంబ్లీలో తప్పుగా మాట్లాడలేదని స్పష్టీకరణ ♦ ఎమ్మెల్యే అనితను అడ్డం పెట్టుకొని తనను వేధిస్తున్నారని అనుమానం సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చెప్పారు. చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా భావించి బాధపడితే, వాటిని ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు. ఆమె బుధవారం అసెంబ్లీలో సభా హక్కుల సంఘం(ప్రివిలేజెస్ కమిటీ) ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. తనపై రోజా డిసెంబర్ 18న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభా హక్కుల సంఘాన్ని ఆదేశించారు. ఏడాదిపాటు సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన రోజాను గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజెస్ కమిటీ మూడుసార్లు విచారణకు పిలవగా ఆమె అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. బుధవారం కమిటీ ముందు హాజరైన రోజా గంటకు పైగా సుదీర్ఘంగా తన వివరణ ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.... అనిత అంటే ద్వేషం లేదు భగవద్గీత సాక్షిగా తాను అసెంబ్లీలో ఏ తప్పూ చేయలేదని రోజా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనితను అగౌరవపర్చలేదని, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తాను మరో మహిళను ఎలా కించపరుస్తానని అన్నారు. అనిత అంటే తనకు ద్వేషం లేదని కమిటీకి నివేదించారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్‌మనీ వ్యవహారంపై పోరాటం చేస్తున్న తనను కొందరు వ్యక్తులు అనితను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని కమిటీ ముందు రోజా అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత చోటుచేసుకున్న సంఘటనల వీడియో క్లిప్పింగ్‌లు ఎలా లీకయ్యాయి? సోషల్ మీడియాలో ఎలా వచ్చాయి? అని అసెంబ్లీ కార్యదర్శిని ఆమె గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. నేను తప్పు మాట్లాడినట్లు సంకేతాలు పంపారు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రోజా సవివరంగా, నిబంధనల సహితంగా సభ్యుల ముందు వివరణ ఇచ్చారు. తాను తప్పు మాట్లాడకపోయినా ఏదో తప్పు మాట్లాడినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి వైఖరిని ఆమె ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుకు తిరుగుతూ ఉన్నప్పుడే సభా సంఘం ముందు హాజరు కావాలని లేఖలు ఎలా పంపుతారని అన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో బలవుతున్నది ఇద్దరు మహిళలేనని వాపోయారు. తాను అనని మాటలను అన్నట్లుగా అనిత బాధపడి ఉంటే ఉపసంహరించుకుంటానని పేర్కొన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు సభలో తమను ఉద్దేశించి పదేపదే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రోజా ప్రస్తావించారు. ‘పాతేస్తాం’ అంటూ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సభా హక్కుల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. వంగలపూడి అనిత ఇచ్చిన సభా హక్కుల నోటీసుకు సంబంధించి మాత్రమే దర్యాప్తు చేయాలని స్పీకర్ తమను ఆదేశించారని, అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమ పరిధిలోకి రావని రోజాకు కమిటీ సభ్యులు వివరించినట్లు తెలిసింది. తాను తప్పు చేయలేదనడానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ రోజా హక్కుల సంఘం ముందుంచారు. వారంలోగా నివేదిక ఇస్తాం: గొల్లపల్లి ఎమ్మెల్యే రోజా ఇచ్చిన వివరణను పూర్తిగా రికార్డు చేశామని, వారంలోగా స్పీకర్‌కు నివేదిస్తామని సభా హక్కుల సంఘం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మీడియాతో చెప్పారు. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. స్పీకర్ సూచనల ప్రకారం తాము ఈ దర్యాప్తును చేపట్టామన్నారు. గతంలో కూడా రోజాను కమిటీ ముందుకు రావాల్సిందిగా కోరితే అనివార్య కారణాల వల్ల రాలేకపోయానంటూ వివరణ ఇచ్చారని తెలిపారు. కమిటీ ముందు గంటకు పైగా ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించామని, మరోమారు సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.వివాదం సమసినట్లేనా? అని విలేకరులు ప్రశ్నించగా... స్పీకర్‌కు సమర్పించాక నివేదిక శాసనసభకు వెళుతుందని, అప్పుడు నిర్ణయం జరుగుతుందని గొల్లపల్లి పేర్కొన్నారు. సంఘం సభ్యులు కె.రామకృష్ణ, బీసీ జనార్దన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా బుధవారం సభా హక్కుల కమిటీ ఎదుట హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ రోజాకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అనిత చేసిన ఫిర్యాదులపై రోజా వివరణ ఇవ్వనున్నారు. కాగా ప్రివిలేజ్ కమిటీ గతంలో ఇదే అంశంపై ఎమ్మెల్యే రోజాకు రెండుసార్లు నోటీసు ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల విచారణఖు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి రోజాకు నోటీసులు ఇవ్వటంతో ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు. -
వంగలపూడి అనిత తీరుపై అసమ్మతి
పాయకరావుపేట(విశాఖపట్టణం జిల్లా): విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీరుపై నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గంలోని సుమారు 200మంది ముఖ్యనాయకులు పాయకరావుపేటలో సమావేశమాయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసిన వారిని ఆమె గుర్తించడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని..వారికే పదవులు కట్టబెడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పని తీరును ముందుగా ఎమ్మెల్సీ పప్పుల చలపతిరావు దృష్టికి తీసుకువెళ్లి.. ఆయన ద్వారా ఈ నెల 14న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు తెలిపారు. -
టీచర్ టు ఎమ్మెల్యే!
సాక్షి, విశాఖపట్నం : బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తి వారిది. తమ పరిధిలో రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఇతోదికంగా కృషి చేశారు. తమ సేవా పరిధిని మరింత పెంచుకోవాలనుకున్నారు. జీతంపై భరోసా ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో రాటుదేలిన ఉద్దండ నాయకులకు ఎదురొడ్డారు. విజయంతో రాజకీయ యవనికపై తమదైన ముద్రవేశారు. వారే పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, పాయకరావుపేటలో విజయం సాధించిన వంగలపూడి అనిత. మాజీ మంత్రిని మట్టి కరిపించారు గిడ్డి ఈశ్వరి ఏజెన్సీలోని పాడేరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏజెన్సీలో కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావంతో జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, టీడీపీ/బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకుల గాంధీతో గిడ్డి ఈశ్వరి ఢీకొట్టారు. ఇక్కడ వామపక్ష పార్టీ సీపీఐ అభ్యర్థి దేముడుబలమైన వ్యక్తే. వీరందరి మధ్య ఆడ సింహంలా ఓట్లు కోసం వేటాడారు. సీపీఐ మినహా, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా దక్కనీయలేదు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి గొడ్డేటి దేముడుపై ఏకంగా 25,948 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈశ్వరికి దక్కిన మెజార్టీ ఓట్లు కూడా మాజీ మంత్రి బాలరాజుకు రాని పరిస్థితి. అసాధ్యురాలు అనిత వంగలపూడి అనిత.. నర్సీపట్నం జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా కంటే.. జిల్లా విద్యాశాఖలో ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్‌గా సుపరిచితురాలు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదే.. ఓపెన్ స్కూల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. పట్టువీడకుండా.. టీడీపీ తరఫున పాయకరావుపేట నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావు టీడీపీలో ఉన్నంత వరకు ఆమెకు ఆశల్లేకపోయినా.. ఆయన పార్టీ మారాక తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరికి రాజకీయ భవిష్యత్ కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్నీ వదులుకున్నారు. తుదిపోరులో ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థి చెంగలపై 2,819 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.