
సాక్షి, అనకాపల్లి జిల్లా: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలతో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన లారీని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పనులు జరగవని హొంమంత్రి ప్రకటించిన మరుసటి రోజే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్‌ని అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న బల్క్‌డ్రగ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మత్స్య కారులు ఆందోళన చేపట్టారు. అయితే, దీనిపై చర్చిచేందుకు హోంమంత్రి నిన్న (సెప్టెంబర్ 29, సోమవారం) గ్రామానికి వచ్చారు. పనులు నిలిపివేస్తున్నట్టు హోం మంత్రి ప్రకటించారు. కానీ ఇవాళ లారీలో ఇసుక రావడంతో మత్స్యకారులు మండిపడ్డారు.
