Varudhu Kalyani
-
చిన్నారిపై ఇదేం సైకోయిజం బాబు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy)పై ఐటీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థిని దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరిస్తున్నారు.దేవికను మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి.దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో వైఎస్ జగన్వల్లే తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థినిపై అదే తరహాలో సైకోల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళల ప్రాణాలకు, మానాలకు రక్షణ లేకుండా పోయింది
-
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం:యువతిపై ప్రేమోన్మాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు కళ్యాణి శుక్రవారం(ఫిబ్రవరి14) మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. యువతిపై యాసిడ్ దాడి చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.యాసిడ్ బాధిత మహిళకు ప్రభుత్వం అండగా నిలబడాలి.యువతకు మెరుగైన వైద్యం అందించాలి.రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికి వదిలేశారు.జనసేన నేత కిరణ్ రాయల్ వలన మహిళకు అన్యాయం జరిగితే తిరిగి అదే మహిళ మీద కేసు పెట్టారు’అని కళ్యాణి గుర్తుచేశారు. -
జనసేన కిరణ్ రాయల్‌పై చర్యలేవి?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళల వేదన అరణ్య రోదనగా మారిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లా విశాఖలోనే ఇప్పటి వరకు 20 మందిపై అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళా భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందని అన్నారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆమెకు చీమకుట్టినట్టయినా లేదు. మహిళలకు అన్యాయం చేస్తే తాటతీస్తా, తొక్కి పెట్టి నార తీస్తానన్న కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆడబిడ్డకు అన్యాయం చేస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు మహిళల భద్రత గురించి ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు.ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమైందనే విషయం సాక్షాత్తు సీఎం పోలీస్ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 20 శాఖల మీద సీఎం చంద్రబాబు నిర్వహించిన సర్వేలో పోలీస్ శాఖ 18వ స్థానానికి పడిపోయిందంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? దీన్ని బట్టి శాంతి భద్రతల విభాగాన్ని చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ విఫలమైనట్టే. పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వాడుకోవడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొంది.తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వేధింపులకు లక్ష్మి అనే మహిళ బలైంది. తనను మోసగించడంతో పాటు కోటిన్నర నగదు, 25 తులాల బంగారం తీసుకుని ఇవ్వకుండా వేధించాడని గోడును వెళ్లబోసుకున్నా కూటమి నాయకులు ఆమెకు న్యాయం చేయలేదు. ఆమె ధైర్యం చేసి కేసు పెట్టినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, విచారణ లేదు. పైగా ఆమెపైనే కేసులు పెట్టి జైలు పాలుజేశారు. ఎక్కడైనా బాధితులు కేసులు పెడితే నిందితుల మీద చర్యలు తీసుకుంటారు.కానీ ఏపీలో మాత్రం పూర్తి విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన నడుస్తోంది. బాధితులపైన నిందితులే కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను వేధిస్తే.. ఇక్కడ న్యాయం జరగదని భావించి కర్నాటకలో కేసు నమోదు చేసింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌ను దారుణంగా దూషించారు. ఈ వరుస ఘటనల్లో నో పోలీస్...నో కేస్... ఏ ఒక్కరికీ శిక్షపడకుండా బాధితులనే వేధించడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి, హోంమంత్రి అనితకి రాష్ట్రంలో మహిళలంటే ఇంత చులకనభావనా అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. -
‘తాట తీస్తానన్న పవన్ ఎక్కడ?’
సాక్షి,విశాఖ : రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) తాట తీస్తానని అన్నారు. కిరణ్ రాయల్(Kiran Royal )తాట ఎంత వరకు తీశారు’ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (varudu kalyani) ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతలు చేస్తున్న దారుణాలపై వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రతి రోజు మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. జనసేన నేత కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగింది. లక్ష్మికి న్యాయం జరిగిందా. మహిళకు అన్యాయం జరిగితే తాట తీస్తామని పవన్ చెప్పారు. లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగితే ఏమి చేశారు. తిరిగి బాధితులు మీద కేసులు పెడుతున్నారు.ఎమ్మెల్యే అదిమూలం మహిళను వేధిస్తే పక్క రాష్ట్రం వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎల్ఏ కొలికిపూడి శ్రీనివాస్ రావు వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మహిళలు తమ మానాలను పణంగా పెడితేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోం మంత్రి జిల్లాలో మహిళకు రక్షణ లేదు. సీఎం చంద్రబాబు మహిళా రక్షణ కోసం కనీసం ఒక సమీక్ష నిర్వహించారా?ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని మీ సొంత సర్వేలోనే తేలింది’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : జనసేన కిరణ్ రాయల్‌కు షాక్ -
హోంమంత్రి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
బాబు దావోస్ టూర్ పై వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
ప్రభుత్వ సదన్ బాలికల ఒంటిపై గాయాలు.. మత్తుమందు ఇచ్చి.. వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
మత్తుమందు ఇస్తున్నారు.. మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదు..!
విశాఖ : తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ(Visakha) వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహం(Girls Hostel)లోని బాలికలు నిరసనకు దిగారు. తమకు నిద్రమాత్రలు ఇచ్చి మానసికంగా రోగులుగా మారుస్తునన్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇంటికి పంపించేయాలంటూ మరోసారి హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు.అయితే ఈరోజు(గురువారం)మరోసారి హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టిన బాలికల్నిజజ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani) పరామర్శించారు. బాలికలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాలికల శరీరంపై ఉన్న గాయాలు చూసి వివరాలు తెలుసుకున్నారు.తమకు మూడు రోజుల నుంచి భోజనం పెట్టడం లేదని ఆ బాలికలు.. వరుదు కళ్యాణకి తెలిపారు. అంతే కాకుండా మత్తు మందు ఇస్తున్నారని బాధిత బాలికలు స్పష్టం చేశారు.బాలికకు మత్తుమందు ఇవ్వడం దుర్మార్గం: వరుదు కళ్యాణిఈ ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘బాలికలకు మత్తు మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో మహిళలకు రక్షణ లేదని, బాలికల సదన్ ఘటనపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.ఐదుగురు బాలికల ఆందోళనకాగా, జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. -
బెల్ట్ షాప్స్ తొలగించండి.. లేదంటే మహిళలు రంగంలోకి దిగాల్సి వస్తుంది
-
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్షాప్లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. -
చంద్రబాబు చేసిన పాపం.. BR నాయుడు రాజీనామా చేయలి
-
‘సెంట్రల్ జైలులో గంజాయి మొక్కా.. ఇంతకంటే దారుణం ఉంటుందా?’
విశాఖ: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగావైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి(Varudu Kalyani) విమర్శించారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. ఒక సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడం దారణమన్నారు వరుదు కళ్యాణి. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు.సాక్షి టీవీతో ఆదివారం మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి(Ganja) సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్(Crime Rate) పెరిగింది. మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలోగంజాయిని అరికట్టాల్సిందే’ అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.రెండు రోజుల క్రితం విశాఖలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.వైఎస్సార్సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు.ఇది చదవండి: బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి -
తల్లికి వందనం పేరుతో బాబు వెన్నుపోటు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.వైఎస్సార్సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. -
2024ను వెన్నుపోటు నామ సంవత్సరంగా కూటమి ప్రభుత్వం మార్చింది
-
‘రిచెస్ట్ సీఎం.. వరస్ట్ పాలన’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు నెలల పాలన.. ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి నేతల మోసాలకు ప్రజలు బలైపోయారని అన్నారు. చంద్రబాబు ప్రజలను ఫుల్స్‌ను చేశారని ఘాటు విమర్శలు చేశారుఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజినీల పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఫుల్స్ చేశారు. చంద్రబాబు ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉంది. ఎలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలుపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. దేశంలో వరస్ట్ పాలన చేసే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలపై టీడీపీతో నేను బహిరంగ చర్చకు సిద్ధం. గతంలో మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తీసివేస్తే.. నేడు ఆలోచనల్లో నుంచే మేనిఫెస్టోను చంద్రబాబు తీసివేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు మోసానికి బలైపోయారు. కూటమికి ఓటు ఓటేస్తే లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు. -
బాబు బాదుడికి బ్రాండ్ అంబాసిడర్
-
చంద్రబాబు ప్రభుత్వంపై వరుదు కళ్యాణి ఫైర్
-
రైతులకు పంగనామాలు పెట్టిన బాబు.. ప్రజా కూటమి కాదు కాలకేయ కూటమి..
-
బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. కొండనాలిక మందేస్తే ఉన్న ఉన్న నాలుక ఊడినట్లు ప్రజల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకోం. ప్రజల తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం మోపడం దుర్మార్గం. సంపద సృష్టిస్తామని చెప్పి విద్యుత్ చార్జీలు పెంచి సంపద సృష్టిస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు కరెంట్ చార్జీల పేరుతో రూ.15 వేల కోట్ల రూపాయలను ప్రజలపై భారం మోపారు’ అని మండిపడ్డారు. -
తిరుమలలో సందడి చేసిన RK రోజా, వరుదు కళ్యాణి
-
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు
-
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
మంత్రి టీజీ భరత్ కు వరుదు కళ్యాణి కౌంటర్
-
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
మహిళల భద్రత పట్టించుకోరా?: కూటమి సర్కార్‌పై వరుదు కల్యాణి ఫైర్
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, 108, 104, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరుదు కల్యాణి.. నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నిన్న బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్దీ రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప.. మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదు.’’ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలిలో మంత్రులు అబద్దాలు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, మండలిలో మంత్రులు, టీడీపీ శాసన మండలి సభ్యులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. రుషి కొండ భవనాలను వైఎస్ జగన్ జగన్ వ్యక్తిగత భవనాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రుషి కొండ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రే మండలిలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పరిశీలనలో కూడా అత్యుద్భుతం గా ఉన్నాయని చెప్పారు. రుషి కొండ భవనం ప్రభుత్వ భవనంగా ఉంటుందే తప్ప వైఎస్ జగన్ భవనం కాదు...రుషి కొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. 2017లో నిర్మించిన అసెంబ్లీ ఎస్ఎఫ్టీ 14000తో నిర్మించారు. కనీసం మంత్రుల రూమ్‌లో వాష్ రూమ్ కూడా లేదు.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. అబద్దాలతో కాలక్షేపం చేయడం కాకుండా వాస్తవాలపై చర్చకు రండి.. చర్చిద్దాం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు. -
కూటమి అధికారంలోకి వచ్చాకే మహిళలపై అత్యాచారాలు పెరిగాయి
-
పవన్, చంద్రబాబుపై వరుదు కళ్యాణి ఫైర్
-
వాలంటీర్లకు బాబు,పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి: వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు మాయమయ్యారని ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘వాలంటీర్ల ద్వారా 30 వేలకు పైగా మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ అబద్ధాలు చెప్పారు.ఇప్పుడేమో అసెంబ్లీ వేదికగా 34 మంది మహిళలే మిస్ అయ్యారని చెప్పారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాటలు అసత్యమని అసెంబ్లీ వేదికగా తేలిపోయింది. వాలంటిర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. హిందూస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలాటు. ఫేక్ అకౌంట్స్ సృష్టించి విజయమ్మ,షర్మిళపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీనే. పవన్ కల్యాణ్ అమ్మపైన టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. తన తల్లిపై లోకేష్ తప్పడు ప్రచారం చేయిస్తున్నారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలి.కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పోలీసుల తీరు అమానుషం.. గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత -
నా ప్రశ్నలకు సమాధానం లేదు..
-
ప్రశ్నలతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేసిన వరుదు కళ్యాణి
-
కూటమి సర్కార్‌కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. -
వరుదు కళ్యాణి మాస్ వార్నింగ్.. టీడీపీ నేతలు సైలెంట్..
-
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై వరుదు కళ్యాణి కౌంటర్
-
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయంతో బతకాల్సిన పరిస్థితి
-
షర్మిల... చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రా...
-
చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్ కుమార్తెల లేవని విమర్శించారు.సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని దుయ్యబట్టారు.చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారని అన్నారు వరుదు కళ్యాణి. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్పారు. నాడు కేసుల్లో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని.. అయితే ఆనాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్సార్ పేరును తొలగించారని ప్రస్తావించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారని, షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఆయన కోర్టుకు వెళ్లారని స్పష్టం చేశారు.చదవండి:షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్‌బాబు‘జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా? రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్సార్ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి’ అని వరుదు కళ్యాణి తెలిపారు. -
వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలు.. వరుదు కళ్యాణి అదిరిపోయే కౌంటర్
-
ఈ చేతకాని ప్రభుత్వంలో ఆడపిల్లలు బ్రతకలేని పరిస్థితి
-
హిందూపురం ఘటనను ఖండించిన వరుదు కళ్యాణి
-
చంద్రబాబుపై వరుదు కళ్యాణి ఫైర్
-
రెడ్‌బుక్ రాజ్యాంగం.. పోలీసు ఫ్యామిలీకే రక్షణ కరువు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖ: ఏపీలో టీడీపీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, రాష్ట్రంలో పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సీఎం అయ్యాకే అన్ని ధరలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండుగ రాష్ట్రంలో వెలవెలబోతోంది. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కుదేలు అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఉల్లి కొయ్యకుండానే కన్నీరు తెప్పిస్తుంది. పప్పుల ధరలు నిప్పుల్లా మండిపోతున్నాయి. దేశ సగటులో ఏపీలో ధరలు ఎక్కువ. చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.400ల అమ్ముతున్నారు. ఇలా అన్ని నిత్యవసర ధరలు పెరిగిపోతుంటే పేద వారు ఎలా బ్రతుకుతారు.రాష్ట్రంలో పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి. హోం మంత్రి మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు. 16ఏళ్ల బాలికను టీడీపీ నేత హత్య చేస్తే హోమ్ మంత్రి వెళ్లి పరామర్శించరా?. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతుంటే చంద్రబాబు కాపాడుతారనే ధైర్యం వారిలో ఉంది. అందుకే పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.ఇది కూడా చదవండి: ‘అమ్మాయిలపై అఘాయిత్యాలు.. పిఠాపురంలో జానీలు పేట్రేగిపోతున్నారు’ -
పుంగనూరుకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌కు టెన్షన్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వంద రోజుల కూటమి పాలనలో ప్రతీరోజు మహిళల హత్యలు, హత్యాచారాలే జరుగుతున్నాయన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో పుంగనూరుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిసి హోంమంత్రి అనిత ఈరోజు బాలిక కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో ముస్లిం బాలిక హత్య జరిగి వారం రోజులు అవుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలియడంతో ఈరోజు మాత్రం హోంమంత్రి అనిత పుంగనూరు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. హత్య జరిగిన వారం రోజులు గడిచినా.. ఇన్ని రోజులు చంద్రబాబు, మంత్రులు ఏం చేశారు?. ఆగమేఘాల మీద ఇప్పుడు ఎందుకు వెళ్లారు?. వైఎస్ జగన్ బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని తెలిసి మంత్రులు రాజకీయం చేస్తున్నారు.హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా చంపితే ఎందుకు పరామర్శించలేదు. గుడ్లవల్లేరు దారుణ ఘటనలో విద్యార్థులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో కూటమి వంద రోజుల పాలనలో రోజూ మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహిళల కోసం వైఎస్ జగన్ దిశా చట్టాన్ని, యాప్ ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
పవన్ కళ్యాణ్ పై వరుదు కళ్యాణి ఫైర్
-
‘ఎన్టీఆర్ మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు’
తాడేపల్లి, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు.‘‘ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీజయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు?. మహిళల పసుపు, కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామంటున్నారు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడమని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా?. షాపింగ్ కాంప్లెక్స్ లాగా లిక్కర్ కాంప్లెక్సులు తేవటం ఏంటి?. జగన్ హయాంలో మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అందుకే ఎలాంటి సమస్యా ఆనాడు రాలేదు. ఇప్పుడు తన మనుషులకు ఆదాయం సమకూర్చేందుకు చంద్రబాబు మద్యం షాపులు ఇస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు. తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వటం దారుణం. ఈ మద్యం పాలసీని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. వీటన్నిటిపై మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం’ అని అన్నారామె.చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?: వరుదు కళ్యాణి సూటి ప్రశ్న
సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి లడ్డూ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్ చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేకుండా హోం మంత్రి అనితా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెపుతున్నారని తెలిపారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. చదవండి: బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జలగతంలో సీఎంగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళారని, అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు. గతంలో ప్రధాని, హోం మంత్రితో, జగన్ తిరుపతి వెళ్లారని.. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని, ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదని విమర్శించారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు. -
రుషికొండలో గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు..
-
కోవెలకుంట్ల ఘటన దారుణం: వరుదు కల్యాణి
-
హోం మినిష్టర్ గా అనిత విఫలమయ్యారు
-
అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. అలాగే, అనితా ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా? అని ప్రశ్నించారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘హోంమంత్రిగా అనిత విఫలమయ్యారు. తాను ఎప్పుడూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా?. ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా?. అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది.మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా?. పపేర్లు కున్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా?. అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. అనిత ఓ అసమర్థ హోంమంత్రి. కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్‌పై విమర్శలు పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుంది. ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు’ అంటూ విమర్శించారు. -
నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చిన జగనన్నకు ధన్యవాదాలు
-
కాంగ్రెస్ అధ్యక్షురాలు కాదు... చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలు
-
షర్మిల.. పచ్చ కళ్లద్దాలు తీసి మాట్లాడు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. పచ్చ కళ్లద్దాలు తీసి షర్మిల వాస్తవాలు మాట్లాడాలి అంటూ హితవు పలికారు. ఆరోగ్యశ్రీపై నిజాలు తెలుసుకొని మాట్లాడాలని చురకలంటించారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అభిమాన సంఘం అధ్యక్షురాలిగా షర్మిల వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఆరోగ్య శ్రీపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును షర్మిల చదువుతున్నారు. వైఎస్ జగన్ 32వేల కోట్లు వైద్య రంగానికి ఖర్చు చేశారు. ఆరోగ్య శ్రీ పరిధిని 25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీకి ఖర్చు చేసింది ఎంత?. వైఎస్ జగన్ సుమారు 15వేల కోట్లు ఖర్చు చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం షర్మిలకు కనిపించడం లేదా?. చంద్రబాబు పాలనలో ఆరోగ్య శ్రీలో 1000 వ్యాధులకు మాత్రమే వైద్యం చేసేవారు. వైఎస్ జగన్ పాలనలో మూడు వేలకుపైగా వ్యాధులకు వైద్యం అందించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. పచ్చ కళ్లద్దాలు తీసి షర్మిల వాస్తవాలు మాట్లాడాలి. చంద్రబాబు సీఎంగా దిగిపోయే సమయానికి ఆరోగ్య శ్రీలో ఉన్న 700 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారు’ అని గుర్తు చేశారు. -
అంబేద్కర్ ఘటనపై టీడీపీకి వరుదు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమి ప్రభుత్వ అరాచకాలు.. ఢిల్లీలో ధర్నా
-
టీడీపీ ప్రభుత్వంపై వరుదు కళ్యాణి ఫైర్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న MLC వరుదు కల్యాణి
-
వంగలపూడి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
బాబు, పవన్.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్ లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. అలాగే, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహన్ని ఇంకా కనిపెట్టకపోవడం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. నిన్న కేబినెట్ సమావేశంలో ఈ ఘటనలపై ఎందుకు చర్చించలేదు.రాంబిల్లి మైనర్ బాలిక దర్శిని ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.హోం మంత్రి అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ బాధిత కుటుంబాలను పరామర్శించడంపై లేదు. హోం మంత్రి చర్యలు దారుణంగా ఉన్నాయి. బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న ఈ ప్రభుత్వం ఆ బుల్డోజర్లను ఆకాతాయిలపై ప్రయోగించాలి. దిశ చట్టంతో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించారు. 2700 మంది మహిళలను దిశ యాప్ రక్షించింది. దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదని హోం మంత్రి పదే పదే చెప్పారు. అందుకే దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ‘దిశ’ అనే ఆయుధాన్ని ఆక్టివ్ చెయ్యండి.కేంద్రంలో ‘దిశ’ చట్టం పెండింగ్‌లో ఉంది. చట్టం అమలులోకి వచ్చేలా చూడాలి. కూటమిలో ఉన్న మీరు దిశ చట్టంపై బాధ్యత తీసుకోవాలి. దర్శిని కుటుంబానికి కనీసం ఆర్ధిక సహాయం కూడా ప్రకటించలేదు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. హోం మంత్రి పక్క నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమెకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి లేదంటే వైఎస్సార్సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం పని చెయ్యాలి. దిశ చట్టాన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వం చూడాలి’ అంటూ హితవు పలికారు. -
బాబు, పవన్.. ముచ్చుమర్రి బాధితులను కలిసే టైమ్ లేదా?: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అంబానీ పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. ముచ్చుమర్రిలో బాధితులను పరామర్శించేందుకు టైమ్ లేదన్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని కామెంట్స్ చేశారు.కాగా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. సీఎం చంద్రబాబు, పవన్‌కు అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. బాధితులను పరామర్శించేందుకు సమయం లేదు.రాష్ట్ర హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే బాలిక హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఏపీలో మహిళలపై దాడులు అరికట్టకపోతే వైఎస్సార్సీపీ ప్రజా పోరాటలకు సిద్ధమవుతుంది అని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. -
వైఎస్ జగన్ పై కేసు.. వరుదు కళ్యాణి రియాక్షన్
-
తల్లికి వందనం.. మహిళలకు బాబు పంగనామం
-
మంత్రి అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
మహిళల రక్షణ ఇలాగేనా!?: వరుదు కల్యాణి
అచ్యుతాపురం: పదమూడేళ్ల బాలిక దర్శినిని దారుణంగా హత్యచేసిన నిందితుడు సురేష్‌ను వెంటనే పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారిరువురు రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలోని దర్శిని ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన లేఖను డీఎస్పీకి అందజేశారు. పోలీసుల వైఫల్యం కాదా.. అనంతరం.. కళ్యాణి, సుభద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత జిల్లాకు చెందిన బాలికను హత్యచేసి ఐదురోజులైనా నిందితుడ్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బెయిల్‌పై ఉన్న నిందితుడు సురేష్ నుంచి ప్రాణహాని ఉందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా బాలికను రక్షించలేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా చట్టాలు, మహిళల రక్షణ గురించి మాట్లాడిన అనిత ఇప్పుడేం చేస్తున్నారని.. మహిళల రక్షణ ఇలాగేనా అని వారు ప్రశ్నించారు. ఇప్పటివరకూ బాలిక కుటుంబీకుల్ని పరామర్శించేందుకు హోంమంత్రి రాకపోవడం దారుణమన్నారు. దిశ యాప్, దిశ పోలీస్స్టేషన్లను మార్చడంలో ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో ఎందుకు లేదన్నారు. మృతురాలి కుటుంబీకులకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలిక హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై వరుదు కళ్యాణి ప్రశ్నల వర్షం
-
జగన్ సైనికులుగా మా పోరాటం: YSRCP ఎమ్మెల్సీలు
సాక్షి, గుంటూరు: శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారని ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ నిర్వహించారు. వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ వరదు కల్యాణి మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజలు కోసం పోరాటం చేస్తాం. మొన్నటి ఫలితాలు కొంత ఇబ్బంది కలిగించినా మాట వాస్తవమే. ఎక్కడ పొరపాట్లు జరిగాయో పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు అండతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలి.ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి. వైఎస్ జగన్ సైనికులుగా మేము పని చేస్తాం. ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేస్తాం’అని అన్నారు.మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతాం: తోట త్రిమూర్తులుశాసన మండలిలో వైఎస్సార్సీపీకే మెజార్టీ ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజలకు మేలు కలిగే అంశాలను సమర్ధిస్తామని అన్నారు. -
మళ్లీ సీఎం జగన్ ప్రభంజనం
-
రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..
-
జూన్ 4న జగన్ ప్రభంజనం..
-
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖపై కూటమి కుట్ర..
-
టీడీపీది ప్రజాగళం కాదు ‘యమ’గళం: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు.కాగా, వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ ‘మాయా’నిఫెస్టో ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవీ అని.. చెప్పే దమ్ము టీడీపీకి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే.. చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం ఐదు హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని.. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబును జనం నమ్మరు. మీ మేనిఫెస్టోను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. టీడీపీ మేనిఫెస్టో చూసి ఓటు వేస్తే ప్రజలు నిండా మునిగిపోతారు. అమ్మ ఒడి, గోరుముద్ద, స్కూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వద్దనుకుంటే టీడీపీకి ఓటెయ్యాలి. టీడీపీకి ఓటు వేస్తే నాడు-నేడు, ఆరోగ్య శ్రీ కొనసాగే పరిస్థితి లేదు. బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా. టీడీపీది ప్రజాగళం కాదు.. యమగళం.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. మూలపేటలో పోర్ట్.. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయి. సీఎం జగన్ అభివృద్ధి పనులతో ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఉపాధి అవకాశాలు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు. -
మళ్లీ జగనే సీఎం...వరుదు కళ్యాణి
-
సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశారు: వరుదు కళ్యాణి
-
బాబు దొంగ హామీలు...వరుదు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్
-
వాలంటీర్లను చూసి వణికిపోతున్న..చంద్రబాబు గ్యాంగ్
-
టీడీపీ నేతను సస్పెండ్ చెయ్యాలని బాబుకు వాలెంటీర్ల వార్నింగ్
-
‘మసాలా దట్టించి పాత హామీలనే బయటకు తీసిన బాబు’
తాడేపల్లి: బీసీ వ్యతిరేకి చంద్రబాబు అంటూ మండిపడ్డారు ఎమ్మెల్పీ వరుదు కల్యాణి. ఎన్నికల సమయంలో బాబు చెబుతున్న బీసీ డిక్లరేషన్ అంటే బాబు చీటింగ్ డిక్లరేషన్ అని ధ్వజమెత్తారు వరుదు కల్యాణి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు హామీలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. మసాలా దట్టించి పాత హామీలనే బాబు బయటకు తీశారన్నారు. గత హామీలను తుంగలో తొక్కిన బాబుకు సిగ్గునిపించడం లేదా అని ప్రశ్నించారు వరుదు కల్యాణి. వరుదు కల్యాణి ఏమన్నారంటే.. మసాలా దట్టించి పాత హామీలను బయటకు తీసిన బాబు: పాత హామీలన్నిటికీ మసాలా దట్టించి మళ్లీ బీసీలను మోసం చేయడానికి ఇస్తున్న డిక్లరేషన్ అది. అది బీసీ డిక్లరేషన్ కాదు..బాబు చీటింగ్ డిక్లరేషన్. బీసీలకు బాంధవుడు జగనన్న అయితే..బీసీలకు రాబంధువు చంద్రబాబు. బీసీలకు వెన్నెముక జగనన్న అయితే..వెన్నుపోటు చ్రందబాబు. బీసీల ఆత్మగౌరవం జగనన్న అయితే..వారిని అణగదొక్కేసింది చంద్రబాబు. అప్పు ఎగ్గొట్టే వాడు ఎంత వడ్డీనైనా కడతాను అంటాడు. అలానే చెప్పింది చేయడు కాబట్టి చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. చంద్రబాబు నాయుడు పది హామీలు ఇచ్చారు. దానికి ముందు గతంలో మీరిచ్చిన 143 హామీలను కూడా రాసి, ఎన్ని నెరవేర్చారో చెప్తే బాగుండేది. కానీ పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి గత హామీలను తుంగలో తొక్కారు. ఈ ఆంద్రప్రదేశ్‌లో చీటింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు. అబద్దానికి ఆధార్ కార్డు. మోసానికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబే. మీరు ఏమి చెప్పినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో బీసీల ద్రోహి చంద్రబాబు. మీ ఐదేళ్లలో బీసీలకు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగ్గొట్టిన ద్రోహి మీరు కాదా? బీసీ కమిషన్ అని చెప్పి ఆ ఊసే లేకుండా చేసిన ద్రోహి మీరు కాదా? బీసీలు జడ్జిలుగా పనికి రారని కేంద్రానికి లేఖ రాసింది మీరు కాదా? ఏటా పదివేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.19వేల కోట్లు కూడా ఖర్చు చేయని బీసీ ద్రోహి మీరు కాదా? ఆదరణ పేరుతో మీ ఐదేళ్లలో నిధులు స్వాహా చేసింది మీరు కాదా? బీసీల తోకలు కత్తిరిస్తాను, అంతు చూస్తానని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీ ప్రధాన మంత్రిని వ్యక్తిగతంగా దూషించి, అతని తల్లిని, భార్యను కూడా దూషించిన బీసీ వ్యతిరేకి చంద్రబాబు. బాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్..!: చంద్రబాబు తన ‘బీసీలకు మాత్రం న్యాయం చేశారు. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్. పదవులిచ్చినా, కాంట్రాక్టులిచ్చినా వారి సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు. ఆయనకు సేమ్ క్యాస్ట్ (ఎస్సీ)కు కూడా మేలు చేసుకున్నాడు. రాజ్యసభకు మా బీసీలను ఒక్కరినైనా పంపావా చంద్రబాబూ..? మా జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సాధికారత కల్పించారు. బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ గారు నిలిచారు. బీసీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్సీగా సగర్వంగా తెలుపుతున్నా. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు మోసం జరిగిందని అంటున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా? మా జగనన్న పాలనలో బీసీలకు ఏం జరిగింది..మీ పరిపాలనలో బీసీలకు ఏం జరిగిందో చర్చించడానికి మేం సిద్ధం. ఎక్కడకు వెళ్దామో చెప్పండి..అక్కడికే వచ్చి చర్చిద్దాం. మీరు చెప్పుకోడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితిలో మీరు బతుకుతున్నారు. ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాలకు పంపితే..అందులో రూ.1.22 లక్షల కోట్లు కేవలం బీసీలకే చేరింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ కూటమిలో ఎవరికైనా ఉందా? నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే బీసీలకు రూ.1.73 లక్షల కోట్లు బీసీలకు అందింది. మీ 14 ఏళ్ల పరిపాలనలోనైనా ఇంత మేలు బీసీలకు చేశారా? ఏమీ చేయకుండా మీరు బీసీలను ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతున్నారా? బీసీ డిక్లరేషన్ అనే పేరుతో ప్రజల ముందుకు రావడానికి మీకు కనీసం సిగ్గుందా? జగన్ గారు ఏం మోసం చేశాడో చెప్పాలి. 124 సార్లు బటన్ నొక్కి బీసీల ఖాతాల్లో డబ్బు వేయడం మోసమా? శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జగన్ గారు చేసిన మోసమా? బీసీ కులగణన కూడా మా జగనన్న సారధ్యంలోనే చేపట్టారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలు, గృహాల్లో మెజార్టీ బీసీలకే దక్కాయి. స్పీకర్‌గా మా బీసీనే చేశారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారు. 54 వేల మందికి శాశ్విత ఉద్యోగాలు వచ్చాయి. 2.14లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇస్తే దానిలో అందులో 60 శాతం అవకాశం బీసీలకే దక్కింది. ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో బీసీలకే అగ్రతాంబూలం వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్. మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగనన్న పాలనలో బీసీలు బాద్షాలు..! కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణం ద్వారా కొట్టేసిన అచ్చెన్నాయుడు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నాడు. బీసీలకు విలువ ఇవ్వని చంద్రబాబును కనీసం ప్రశ్నించే సాహసం చేయలేని మీరు మమ్మల్ని అనడానికి అర్హతే లేదు. పదవుల కోసం మీరు చంద్రబాబు కాళ్ల కింద చెప్పుల్లా మీరు బతుకుతున్నారు. ఆనాడు బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నప్పుడు ఈ అచ్చెన్నాయుడు లాంటి నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు? జగనన్న పాలనలో బీసీలు బాద్షాలుగా బతుకుతున్నాం. 2019 డిసెంబర్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం జగన్మోహన్రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు. ఆ జీవోపై తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితో చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఆపించిన వ్యక్తి. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 33 శాతం రిజర్వేషన్ ఇస్తానని అంటున్నారు..? బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జగనన్న ఏకంగా పార్లమెంటులో ప్రైవేటు బిల్లునే ప్రవేశపెట్టిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్. బీసీలకు 30 పథకాల మాట దెవుడెరుగు..కనీసం 3 పథకాలైనా బీసీలకు ఇచ్చారా? నిజంగా మీరు 30 పథకాలు ఇచ్చి ఉంటే 2019లో మీరు ప్రజలు కనీసం 30 సీట్లైనా ఇచ్చి ఉండేవారు కదా? మీరు ప్రతి స్కీమ్‌ని స్కామ్‌గా మార్చి దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటీ చేయలేదు. మళ్లీ ప్రజలను మభ్యపెట్టడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో అర్ధం కావడం లేదు. బీసీలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెక్కిన వ్యక్తి చంద్రబాబు. గతంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలి. కానీ బాబు ప్రజలంతా మర్చిపోతారన్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచే తీసేసిన ఘనుడు చంద్రబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసే 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చారు. అవేవీ నెరవేర్చకుండా మళ్లీ తప్పుడు హామీలతో ఇద్దరూ ప్రజల వద్దకు వస్తున్నారు. ఆ హామీలు అమలు చేయనందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత హామీలివ్వండి. ఇంత మేలు చేసిన జగనన్నకు ప్రజలంతా మళ్లీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీలు అత్యంత దారుణంగా అవమానం పాలైంది..అణచివేతకు గురైంది చంద్రబాబు పాలనలోనే.