
అమరావతి: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రూ. 20 వేలు ఇవ్వకుండా ఇప్పుడు మాట మార్చడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపే అనడం కచ్చితంగా రైతును మోసం చేయడమేని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.
ఈ రోజు(మంగళవారం) శాసనమండలిలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కల్గించాయి. పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు కేంద్ర సాయంతో కలిపి రూ. 20 వేలు అంటున్నారు. మండలి సాక్షిగా రైతుకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. అన్నమో రామచంద్రా అనే పరిస్థితిని రైతుకు తీసుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది.
కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ప్రభుత్వం పాలనలో నాణ్యమైన విత్తనాలు అందించారు. కూటమి పాలనలో నాణ్యమైన విత్తనాలే దొరకలేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. కరువు సాయం లేదు.. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మిర్చికి గతంలో రూ. 21 వేలకు పైగా మద్దతు ధర ఉంది. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ ను సందర్శించే వరకూ ఈ ప్రభుత్వంలో కదిలిక రాలేదు. కూటమి ప్రభుత్వం చేసే సమీక్షలు రైతుకి మేలు చేయడానికా?.. కాలక్షేపానికా?’ అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. రూ. 8కి టమోటా కొంటామని చెప్పారు.. ఇప్పటివరకూ ఒక్క కిలో టమోటా అయినా ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment