council
-
నేను బీఆర్ఎస్ చైర్మన్‌ను కాదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్ -
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
శివమొగ్గ: అవినీతిని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న వాల్మీకి అభివృద్ధి పాలక మండలి అధికారి చంద్రశేఖర్ భార్య కవిత శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు అవుతూ నీరసంగా ఉండడంతో కవితాను ఆటోలో ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. చంద్రశేఖర్ ఆకస్మిక మరణంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది. పదే పదే భర్తను తలుచుకుంటూ విలపిస్తోంది. సరిగ్గా భోజనం చేయలేదని, దీంతో అనారోగ్యం బారిన పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. పరామర్శల వెల్లువ మరోవైపు అధికారి ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు, నాయకులు చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటివరకు మృతుని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందించలేదు. ఎంతో మంది నేతలు ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలిపి రిక్త హస్తాలతో తిరిగి వెళుతున్నారు. మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మూడు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా మృతుని కుటుంబానికి అందించారు. -
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా
Updates.. 01:10PM ►ఏపీ అసెంబ్లీ, శాసనమండలి రేపటికి వాయిదా ►రెండోసారి మండలి వాయిదా ►మండలి చైర్మన్ పోడియం వద్ద టీడీపీ నేతల రౌడీయిజం ►ఫ్లకార్డులతో టీడీపీ సభ్యుల నినాదాలు ►ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులు ►సభా మర్యాద పాటించాలని కోరిన చైర్మన్ ►చైర్మన్ విజ్ఞప్తి చేసినా తీరు మార్చుకోని టీడీపీ ► టీడీపీ సభ్యుల ఆందోళనతో రెండోసారి మండలిని వాయిదా వేసిన చైర్మన్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ►స్పీకర్ పట్ల టీడీపీ నేతలు అమర్యాదగా వ్యవహరించారు ►బాబును ఎందుకు అరెస్ట్ చేశారో తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ►టీడీపీ నేతలు మాత్రం చర్చ అంటే పారిపోతున్నారు ►బాబు తప్పు చేయలేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ►కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చిస్తాం ►వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు ►బాబు అవినీతిపై చర్చించేందుకు రమ్మంటే టీడీపీ నేతలు భయపడుతున్నారు ►దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రండి ►బాబు తప్పు చేసింది వాస్తవం అవునా.. కాదా? ►ఎక్కడ దొరికిపోతామోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు ►టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ విచారణ కోరలేకపోతున్నారు 12:23PM ►విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ ► బీఏసీ సమావేశం ముగిసింది. ►ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి ఆర్కే రోజా.. ►బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేస్తున్నాడు ►సభాపతి పై టీడీపీ నేతలు ఫైల్స్ బాటిల్స్ విసిరి నానా హంగామా ►సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది ►బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు ►హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా? ►చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. ►తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు. ►చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తాం. ►దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ►ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం 11:22AM ►ఏపీ అసెంబ్లీ వాయిదా 11:10AM ►అసెంబ్లీలో మారని టీడీపీ సభ్యుల తీరు ►మళ్లీ స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన ► టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం ► సభా నియమాలను పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి ► స్పీకర్ విజ్ఞప్తిని పట్టించుకోని టీడీపీ సభ్యులు ►ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్‌లు సస్పెన్షన్ ► ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ శ్రీధర్‌రెడ్డి, అనగాని, పయ్యావుల సస్పెన్షన్ ►మిగిలిన టీడీపీ సభ్యులందరూ ఒక్కరోజు సస్పెన్షన్ ► టీడీపీ సభ్యులతో పాటు ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ 11:07AM బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని హెచ్చరిక ►మీసాలు తిప్పడం వంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదు ►బాలకృష్ణ మొదటి తప్పిదంగా భావించి హెచ్చరిస్తున్నాం ►సభలో టీడీపీ సభ్యుల తీరు సరైనది కాదు 11:05AM ►వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ 10:16AM ►ఏపీ శాసనమండలి వాయిదా ►టీడీపీ, పీడీఎఫ్ సభ్యుల ఆందోళనలతో వాయిదా వేసిన చైర్మన్ ►ఐదు నిమిషాల పాటు మండలి వాయిదా 10:00AM ►ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం ►శాసనమండలిలోనూ మారని టీడీపీ సభ్యుల తీరు ►మండలిలోనూ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు ►చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం తిరస్కరణ ►చైర్మన్ సర్దిచెప్పినా వినకుండా టీడీపీ సభ్యుల నినాదాలు ►ఏ అంశంపైనైనా చర్చించడానికి సిద్ధం: మంత్రి బొత్స 9:32AM ►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రౌడీయిజం ►స్పీకర్ పోడియంపైకి ఫైళ్లు విసిరేసిన టీడీపీ సభ్యులు ►స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ► స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు ఓవరాక్షన్. ►అసెంబ్లీ వాయిదా. 9:23AM ►టీడీపీ సభ్యుల తీరుతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం: మంత్రి అంబటి ►టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా: మంత్రి అంబటి ►టీడీపీ సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారు: మంత్రి అంబటి ►టీడీపీ సభ్యులు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు ►బస్పీకర్పై దౌర్జన్యానికి దిగడం సరికాదు ►టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు ►టీడీపీ సభ్యులు.. వైఎస్సార్సీపీ సభ్యలను రెచ్చగొడుతున్నారు ►బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారు: మంత్రి అంబటి బాలకృష్ణ తీరుపై సభలో రభస సభలో మీసాలు తిప్పిన బాలకృష్ణ 9:20AM ►టీడీపీ అర్థం లేని నోటీసులు ఇస్తున్నారు: మంత్రి బుగ్గన ►చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్ధం: మంత్రి బుగ్గన ►బీఏసీలో దీనిపై చర్చిద్దాం.. చర్చకు రండి: మంత్రి బుగ్గన 9:18AM ►ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు ►స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు 9:10AM ►టీడీపీ ఆందోళనల మధ్య కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు ►స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల ఆందోళన 9:05AM ►ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు ►చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వాయిదా తీర్మానం 9:00AM ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.00 గంటలకు ఆంధ్రప్రదేశ్ శానససభ సమావేశాలు ప్రారంభం కాగా,. మండలి సమావేశాలు 10.00 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత శాసన సభా వ్యవహారాలు సలహా కమిటీ సమావేశం కానుంది. ►సభ ఎన్ని రోజుల నిర్వహించాలనే దానిపై ఈ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. దాంతో పాటు ఏ అంశాలపై చర్చించాలనే దానిపై కూడా అజెండా ఖరారు చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ►సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ►పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశాలు. అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్న టీడీఎల్పీ సభ్యులు ►వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీఎల్పీ సభ్యులు.. టీడీఎల్పీ సభ్యుల పాదయాత్ర ►సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ►తెదేపా నిరసనల్లో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి ►కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి -
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాస
-
చెన్నైలో డీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్
-
ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22 మందితో తాత్కాలిక కమిటీ నియమించింది. 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: సీఎం జగన్‌తో భేటీ.. సజ్జల ఏమన్నారంటే..? -
TS: రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా గుత్తా!
హైదరాబాద్: టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం గుత్తా నామినేషన్ దాఖలు చేశారు. సుఖేందర్‌రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే అయ్యింది. గుత్తా నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు,దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కృతజ్ఞతలు రెండోసారి శాసనమండలి చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు గుత్తా కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఏకగ్రీవానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు గుత్తా. గతంలో మాదిరిగానే సభను హుందాతనంగా నడిపించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని గుత్తా తెలిపారు. -
డ్రగ్స్ కేసులో బడా‘బాబులు’
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాల ఆరోపణలపై హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్న సంపన్న కుటుంబాలకు చెందిన ఏడుగురి గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో కొందరికి గతంలో పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ టోనీసహా నిందితుల్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కీలకాంశాలివీ... ♦ నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్ కుమార్ జైన్‌కు కొన్నాళ్ళ క్రితం ముంబైలోని ఓ పబ్‌లో టోనీతో పరిచయమైంది. అప్పటి నుంచి 30 సార్లు డ్రగ్స్ కొనడంతోపాటు మరికొందరు స్నేహితులకు అలవాటు చేశాడు. నిరంజన్ కుటుంబం ఏటా రూ.600 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతోంది. నగరంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల్లో అనేకం వీరు చేపట్టినవే. ♦ మరో నిందితుడైన బంజారాహిల్స్ నివాసి శాశ్వత్ జైన్‌ది కూడా కన్స్ట్రక్షన్ వ్యాపారమే. రూ.1,000 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఈ కుటుంబం నగర శివార్లలో ప్రముఖ డిటర్జెంట్ సబ్బుల కంపెనీ నిర్వహిస్తోంది. సీఎస్సార్ కింద ఏటా 400 మంది పేదలకు ఉచితంగా కిడ్నీ తదితర ఆపరేషన్లు చేయిస్తోంది. వీరి కుటుంబ సభ్యుడి పేరుతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఓ పెవిలియన్ కూడా ఉంది. 2011లో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముంబైకి చెందిన అర్వింద్ అనే డ్రగ్ పెడ్లర్ కస్టమర్ల జాబితాలో శాశ్వత్ పేరు ఉండటంతో కౌన్సెలింగ్ చేసినా అతడితో మార్పు రాలేదు. ♦ గౌలిపురకు చెందిన యజ్ఞానంద్ అగర్వాల్ కుటుంబం మసాలా దినుసుల వ్యాపారంలో ఉంది. ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్‌లున్నాయి. మరో నిందితుడు ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్‌రెడ్డి కీలక నిందితుడు నిరంజన్‌కు స్నేహితుడు. ♦ ఇంకో నిందితుడు బండి భార్గవ్ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాడు. వెంకట్ చలసాని అనే నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారి. భార్గవ్ ఇతడి వ్యాపార భాగస్వామి. ♦ నిందితుల్లో కొందరు చిన్నస్థాయి పెడ్లర్లుగానూ వ్యవహరిస్తున్నారు. వీళ్ల అరెస్టు విషయం తెలియగానే స్నేహితులు, పరిచయస్తులైన 200 మంది నగరం నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఎవరెవరికీ డ్రగ్స్ అమ్మారు? ఎక్కడెక్కడ రేవ్ పార్టీలు నిర్వహించారు? తదితర అంశాలను సేకరించాలని నిర్ణయించారు. -
సిమెంట్ పరిశ్రమ పురోభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: సిమెంట్ పరిశ్రమ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాల్మియా భారత్ గ్రూప్ సీఎండీ పునీత్ దాల్మియా నేతృత్వంలో 25 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఒక మండలిని (డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ–డీసీసీఐ) ఏర్పాటు చేసింది. ఈ మండలి కాలపరిమితి రెండేళ్లని అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి శాఖ (డీపీఐఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. దృష్టి సారించే అంశాలు.. పరిశ్రమలో వ్యర్థాల నివారణ, గరిష్ట ఉత్పత్తి సాధన, నాణ్యత పెంపు, వ్యయాల తగ్గింపు, ఉత్పిత్తి ప్రమాణాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ మండలి తగిన సిఫారసులు చేస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వ్యవస్థాపక సామర్థ్యం పూర్తి వినియోగం, పరిశ్రమ పనితీరు మెరుగుదల, అంతగా సామర్థ్యంలేని కర్మాగారాలకు సంబంధించి నిర్ణయాలు– సిఫారసులు, ఈ రంగంలో మానవ వనరులకు ప్రత్యేక శిక్షణ, అలాగే శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన, కార్మికులకు భద్రతా ప్రమాణాలు, కొత్త పరికరాలు, విధానాల అభివృద్ధి, అత్యుత్తమ పని పరిస్థితుల కల్పన వంటి అంశాలపై కూడా మండలి దృష్టి సారిస్తుంది. అకౌంటింగ్, కాస్టింగ్ అంశాల్లో ప్రమాణాల స్థిరీకరణకు కృషి చేస్తుంది. సభ్యుల్లో కొందరు... ప్రకటన ప్రకారం కమిటీ సభ్యుల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఎండీ కేసీ జన్వార్, శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్, ఇండియా సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాకేశ్ సింగ్; బిర్లా కార్పొరేషన్ సీఈఓ ప్రచేతా మజుందార్; జేకే సిమెంట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మాధవకృష్ణ సింఘానియా, జెఎస్‌డబ్లు్య సిమెంట్ సీఈఓ నీలేష్ నార్వేకర్‌లు ఉన్నారు. -
అంబానీ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై : ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న అంబానీ తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా , అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ ఏర్పాటు ఉద్దేశం 1973లో రియలన్స్ ను స్థాపించిన ధీరూబాయ్ అంబానీ మరణానంతరం ఇద్దరు సోదరుల (ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ) మధ్య విబేధాల కారణంగా కంపెనీ చీలిపోయింది. తండ్రి ఆశయాలకు విరుద్దంగా రెండు ముక్కలు కావడం, తదనంతర పరిణామల నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అంబానీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకుల అంచనా. తద్వారా విస్తారమైన రిలయన్స్ సంక్షోభంలో పడకుండా కాపాడటంతోపాటు, తండ్రిగా, కుటుంబ పెద్దగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా వారసుల విభేదాలకు సంబంధించి హిస్టరీ రిపీట్ కాకూడదనే ప్రధాన ఆశయంతో అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల సంతానం ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించినవారే. వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నవారే. ఈ క్రమంలోనే 2014 అక్టోబర్‌లో ఇషా, అనంత్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లో డైరెక్టర్లుగా చేరారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో కూడా వారు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వారసుల్లో చిన్నవాడు అనంత్ ఇటీవల మార్చిలో జియో ఫ్లాట్ ఫాంలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వగా, రిలయన్స్ జియో ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో డైరెక్టర్‌గా ఇషా అంబానీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారు
-
ఆ నిప్పుకు తుప్పు పట్టింది..!
సాక్షి, అమరావతి: రెండు వేల కోట్ల బాగోతం బయటపడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారని.. దీని వెనుక అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నిప్పు లాంటి వాడినని చంద్రబాబు చెప్పుకుంటారని.. ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!) దేశమంతా కోడై కూసింది.. ‘గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అక్రమాలపై దేశమంతా కోడై కూసిందని.. ఇవాళ ఆ బండారం అంతా బయటపడిందని’ ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బయటపడిన అక్రమాలు చాలా తక్కువని ముఖ్యమైన వారిపై దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ఓటుకు నోటు కేసు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆ విషయంపై ఆలోచన చేస్తాం.. వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేది ఆలోచన చేస్తామని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్‌కు పంపలేదని చెప్పారు. ‘టీడీపీ తన వాదనలను వినిపిస్తోంది.. మేం మా వాదనలను వినిపిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దామని’ ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు. (చంద్రబాబు అవినీతి బట్టబయలు) ధిక్కారం ఎలా అవుతుంది..? అసెంబ్లీని ప్రొరోగ్ చేసినా బిల్లులు లైవ్‌లోనే ఉంటాయని తెలిపారు. తన ఆదేశాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటానని మండలి ఛైర్మన్ షరీఫ్ సెక్రటరీకి లేఖ రాశారని వెల్లడించారు. సభలో నిర్ణయం తీసుకునే సమయంలో విధిగా ఓటింగ్ జరపాలని ఆర్టికల్ 189/1 ప్రకారం రాజ్యాంగం చెబుతోందని వివరించారు. తప్పులు జరుగుతుంటే.. సరి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లదని చెబితే ధిక్కారం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్టు రుజువు అవుతుందనే మండలి ఛైర్మన్ సభ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఏపీలో భగ్గుమన్న నిరసన జ్వాలలు
‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లా: విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో మహిళలు నల్ల చీరలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ’ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, మళ్ల విజయప్రసాద్, రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ విగ్రహం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ టౌన్ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలిలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. తన స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబుకు హితవుపలికారు. శాసనమండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ నాయకులు తప్పుబట్టారు. విశాఖ నార్త్‌లో: శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ నార్త్ కన్వీనర్ కేకే రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ నుంచి నల్ల వస్త్రాలు ధరించిన మహిళలు నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు అండ్ కో పై కేకే రాజు మండిపడ్డారు. ఎన్ఏడీ జంక్షన్లో: వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ తీరుకు నిరసనగా విశాఖ ఎన్ఏడీ జంక్షన్లో విశాఖ వాసులు మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ విశాఖ వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సంఘీభావం తెలిపారు. విశాఖ నార్త్ కన్వీనర్ కేకేరాజు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల ఓట్లతో పరువు నిలబెట్టుకున్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ద్రోహానికి పాల్పడ్డారన్నారు. విజయప్రసాద్ మాట్లాడుతూ.. శాసనమండలి చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పదవులు, బినామీ ఆస్తుల కోసం చంద్రబాబు ఎంతటి మోసానికైనా ఒడిగడతారన్నారు. పశ్చిమగోదావరిలో: శాసనమండలి టీడీపీ వైఖరికి నిరసనగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు విశాల్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులు,కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమ ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేశాడంటూ న్యాయవాదులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయం ముట్టడి మండలిలో టీడీపీ వైఖరికి నిరసనగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నేతలు ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకుని కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్‌కు మద్దతు పలకాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జేఏసీ నేతలు.. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు అనంతపురం జిల్లా: ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ తీరుకు నిరసనగా గుత్తిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. కల్యాణదుర్గంలో.. వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడాన్ని నిరసనగా కల్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఆంధ్రుల ద్రోహి చంద్రబాబు అని, శాసనమండలి బిల్లులను అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా తిరుపతి ఎస్వీయూలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మండలి వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. రియల్ హీరో వైఎస్ జగన్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన నేత ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
బిల్లులకు వ్యతిరేకం కాదంటూనే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ కమిషన్ బిల్లులపై శాసన మండలిలో మంగళవారం వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులను స్వాగతిస్తున్నామంటూనే.. విపక్ష సభ్యులు సవరణలు ప్రతిపాదించి ఓటింగ్‌కు పట్టుబట్టారు. దీంతో ఇంగ్లిష్ మీడియం బిల్లులో తెలుగు మీడియం ఆప్షన్ పెట్టాలని, ఎస్సీ కమిషన్ బిల్లులో వర్గీకరణ అంశాన్ని పెట్టాలన్న సవరణలతో బిల్లును మండలిలో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982కు సవరణ తెస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు మంత్రి ఆదిమూలపు సురేష్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై చర్చలో పాల్గొన్న పి. అశోక్‌కుమార్(టీడీపీ), మాధవ్ (బీజేపీ), విఠపు బాలసుబ్రహ్మణ్యం(పీడీఎఫ్) ఇంగ్లిష్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థులకు తెలుగు మాధ్యమం కూడా ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని సవరణను ప్రతిపాదించారు. దీనిపై మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పేదలు ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కుతూ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. టీడీపీకి అనుకూలమైన నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకించని ప్రతిపక్షాలు.. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం పెడితే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగును తాము నిర్లక్ష్యం చేయడంలేదని, తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామని వివరించారు. దార్శనికుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు బంగారు భవిత ఇవ్వబోతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సవరణకు పట్టుబట్టడంతో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. విపక్ష సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో వారు ప్రతిపాదించినట్లు తెలుగు మాధ్యమం ఉండాలనే సవరణతో బిల్లును ఆమోదించారు. ఎస్సీ కమిషన్ బిల్లుకు వర్గీకరణ మెలికపెట్టిన టీడీపీ ఎస్టీ కమిషన్ బిల్లుకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆమోదం తెలిపిన టీడీపీ సభ్యులు, ఎస్సీ కమిషన్ బిల్లులో మాత్రం వర్గీకరణ అంశాన్ని మెలికపెట్టారు. తమ ప్రతిపాదనను బిల్లులో చేర్చాలని టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్, పలువురు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ సుప్రీం కోర్టు రద్దు చేసిందని, అటువంటి అంశాన్ని ఎస్సీ కమిషన్ బిల్లుకు ముడిపెట్టి అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సరికాదని ఉప ముఖ్యమంత్రులు కె.నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, మంత్రి పినిపే విశ్వరూప్, సభ్యులు జంగా కృష్ణమూర్తి, చల్లా రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. అయినా విపక్షం ఓటింగ్‌కు పట్టుబట్టడంతో వర్గీకరణ అంశాన్ని చేర్చి సవరణతో బిల్లును ఆమోదించారు. అసెంబ్లీ ఆమోదించిన 16 బిల్లుల్లో సవరణలు ప్రతిపాదించిన రెండు బిల్లులు మినహా మిగిలిన 14 బిల్లులను మండలి ఆమోదించింది. ఒక పార్టీకి రెండు వైఖరులా? ఒక పార్టీకి ఎక్కడైనా ఒకే విధానం ఉండటం చూశానని, కానీ టీడీపీకి శాసనసభలో ఒక మాట, శాసన మండలిలో మరొక మాట చెబుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. ఎస్సీ కమిషన్, ఇంగ్లిష్ మీడియం బిల్లులపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆమోదిస్తే.. ఆ పార్టీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ కమిషన్ బిల్లుతో పేదలకు మేలు చేసే కార్యక్రమానికి, విద్యా చట్టం సవరణ బిల్లుతో పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులను బొత్స కోరారు. -
‘బయో ఆసియా’లో స్విట్జర్లాండ్
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రపంచంలో ప్రముఖ కేంద్రంగా మారుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి సాగుతున్న నిరంతర కృషితో ఇది సాధ్యమైందని చెప్పారు. సుమారు వంద దేశాల నుంచి లైఫ్ సైన్సెస్ దిగ్గజాలను ఆకర్షించడంలో ‘బయో ఆసియా 2020’సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. ఆవిష్కరణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్.. ప్రముఖ ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలైన నోవార్టిస్, రోచ్, ఫెర్రింగ్ ఫార్మా వంటి వాటికి చిరునామాగా ఉందన్నారు. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకోవడం మంచి పరిణామం అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యాఖ్యానించారు. హెల్త్ టెక్నాలజీ రంగంలో భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నామని స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వానా రెంగ్లి ఫ్రే ఆకాంక్షించారు. -
కాంగ్రెస్‌లో జోష్
సాక్షి, శంషాబాద్: కనీస ఆదాయ వాగ్దాన సభ విజయవంతం కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలు మూడు రోజులుగా శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్‌లో ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఎల్బీనగర్, మహేశ్వరం నుంచి కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. శంషాబాద్ పట్టణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సభావేదికపై రాహుల్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు శ్రద్ధగా వింటూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. కనీస ఆదాయం పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామన్న ఆయన హామీపై పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. వీఐపీలకు తిప్పలు వేదికకు ఎదురుగా ఉన్న స్థలంలో వీఐపీలకు కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్ ఉన్న వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా వీఐపీ గ్యాలరీకి అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నాయకులు వారి నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో వీఐపీ పాస్‌లు ఉన్నవారిని అనుమతించాలంటూ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ మైకుల్లో పోలీసులకు పదేపదే సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద సభ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే ధీమాతో కనిపించారు. -
కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్... శాసనమండలిలో పూర్తిస్థాయి ఆధిక్యం దిశగా వేసిన రాజకీయ వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్‌కు చెందిన మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయించుకోవడంతో ఒక్క రోజులోనే శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు టీఆర్ఎస్ వైపు రావడంతో అధికార పార్టీ వెంటనే వ్యూహం సిద్ధం చేసింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనమండలికి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ కార్యాలయానికి రాగానే ఆయ నను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. ‘శాసనమండలి ఆవరణలో మేము నలుగురం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకున్నాం. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని నాలుగో పేరా ప్రకారం మా వినతిని పరిశీలించగలరు’అని కోరుతూ నలుగురు ఎమ్మెల్సీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ఒక పార్టీ తరఫునన గెలిచిన చట్టసభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వారు వేరే పార్టీలో విలీనం అయితే వారిపై అనర్హత వేటు పడదనే నిబంధన ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగో పేరా పేర్కొంటోందని వివరించారు. అనంతరం నలుగురు ఎమ్మెల్సీల లేఖను శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్ పరిశీలించారు. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలిపక్షంలో విలీనం చేస్తూ సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్, కె. దామోదర్‌రెడ్డిలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యలు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున మహమ్మద్ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మిలిగారు. ఇద్దరు సభ్యులే ఉండటంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఎమ్మెల్యేలూ జంప్ చేస్తే మండలిలో కాంగ్రెస్ సున్నాయే... శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. తాజా పరిణామాల అనంతరం టీఆర్ఎస్కు 31 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు... మజ్లిస్, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి రాజీనామాలతో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. దైవార్షిక ఎన్నికల్లో భాగంగా వచ్చే ఫిబ్రవరి, మార్చిలో శాసనమండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలో దాదాపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె. యాదవరెడ్డిపై వేటు వేస్తే ఈ సంఖ్య ఏడుకు చేరుతుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుంది. అయితే ఎన్నికల నాటికి సమీకరణలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యలో మార్పులు జరిగితే ఆ ఒక్క సీటూ హస్తం పార్టీకి దక్కే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే శాసనమండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం సైతం లేకుండా పోయే పరిస్థితి ఉండనుంది. రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం: ఎం.ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. నలుగురం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావాలని ముందుకొచ్చాం. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండోవంతు మంది సభ్యులు ఇలా నిర్ణయం తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కాంగ్రెస్‌లో మాకు ఎన్నో అవమానాలు జరిగాయి. టీడీపీతో పొత్తు ముంచింది: టి. సంతోష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కొంపముంచింది. మా ఎవరితో చెప్పకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు? కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఉంది. అందుకే టీఆర్ఎస్లో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రజల వైపు: ఆకుల లలిత మేము ప్రజలవైపు ఉండాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. నేడు కొండా మురళీ రాజీనామా... ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శనివారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారమే మురళీ రాజీనామా చేయాల్సి ఉంది. అయితే శానసమండలి చైర్మన్ కార్యాలయం శనివారం సమయం ఇచ్చినందున మురళీ రాజీనామా నిర్ణయం వాయిదా పడినట్లు తెలిసింది. కొండా మురళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. -
ప్రపంచ స్థాయి ప్రమాణాల కోసమే....
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలున్నవిద్యావకాశాల కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లు’ను శాసన మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ యువతకు విద్యావకాశాలు విస్తృతం చేయడం కోసమే ప్రైవేట్ యూనివర్సీటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం తెలంగాణ వాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ యూనివర్సిటీలు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్సష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అత్యధిక ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవసరానికి మించిన కాలేజీలు ఉన్నాయని, వాటిని నియంత్రిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే 1016 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. -
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
-
నేడు అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
- ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, 10.15 గంటలకు మండలి సమావేశం - జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం భేటీ సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగానే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. -
సొమ్ము ఒకరిది... పేరు మరొకరిది..!
– పర్యాటకం అభివృద్ధికి ‘అఖండ గోదావరి’ ప్రకటించిన ప్రభుత్వం – రూ. 100 కోట్లు కేటాయించిన చంద్రబాబు సర్కారు – ఇప్పటి వరకు మొదటి దఫాగా రూ.32 కోట్లు ఖర్చు – నగరంలో నదీతీర అభివృద్ధికి నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలు – రూ.20 కోట్లతో కౌన్సిల్ అజెండాలో చేర్చిన వైనం – రాష్ట్ర ప్రభుత్వం పనిని నెత్తికెత్తుకుంటున్న అధికారులు – నగరంలో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం – నేడు కౌన్సిల్ సాధారణ సమావేశం సాక్షి, రాజమహేంద్రవరం: ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికి ఎక్కుతాన¯¯¯న్న చందంగా ఉంది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిపాలన తీరు. నగరం నడిబొడ్డున, ÐÔశివారు ప్రాంతాలలో ఇప్పటికీ అనేక చోట్ల రోడ్డు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సిన పాలకులు, యంత్రాంగం అది మరచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులను నెత్తికెత్తుకుంటోంది. ఇందుకోసం ప్రజల డబ్బు రూ.20 కోట్లు ఖర్చు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల అనంతరం సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అఖండ గోదావరి పేరుతో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధుల ద్వారా కాటన్ బ్యారేజీ నుంచి ఎగువన నగరంలోని కోటిలింగాలఘాట్ వరకు అనువైన గోదావరి తీరం, లంకలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. కేటయించిన రూ.100 కోట్లను మూడు దఫాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దఫాగా ఇప్పటికే రూ.18 కోట్లతో కాటన్ బ్యారేజి వద్ద ఉన్న పిచ్చుకలంకను చదును చేశారు. మరో రూ.13 కోట్లను హెవలాక్ బ్రిడ్జి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు. రూ.1 కోటితో రోడ్డు కం రైల్ బ్రిడ్జిని సుందరీకరిచారు. ఇలా ఇప్పటి వరకు రూ.32 కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయితే తాజాగా అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులను నగరపాలక సంస్థ చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది. గోదావరి గట్టున సర్వసతీ ఘాట్ నుంచి గౌతమీఘాట్ వరకు నదీ ముఖ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాజమండ్రి రైజింగ్, ఐడియాస్ ఫర్ రాజమండ్రి డెవలెప్మెంట్ ద్వారా ప్రజలు సూచించారని పేర్కొంటూ కౌన్సిల్ ఆమోదానికి యంత్రాంగం అజెండాలో చేర్చింది. దీనికోసం రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాల ద్వారా నగర పాలక సంస్థకు వచ్చిన ఆదాయం నుంచి కేటాయించాలని, పరిపాలన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు ఆమోదించాలని కోరింది. నిద్దురపోతున్న పాలక మండలి... నగరంలో కనీసం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం ఉన్నా వాటి అభివృద్ధిని పట్టించుకోని పాలక మండలి, యంత్రాంగం ఇలా రాష్ట్ర ప్రభుత్వ పనులను నెత్తికెత్తుకుని రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాంగం ఇలా ప్రతిపాదించడం వెంటనే మండలి అజెండాలో చేర్చడంపై నగరవాసులు పాలకమండలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం పనులకు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. యంత్రాంగం ఇలా చేస్తుంటే పాలక మండలి నిద్దురపోతోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. యంత్రాంగం ప్రతిపాదన సోమవారం జరిగే పాలక మండలి సాధారణ సమావేశంలో చర్చకు రానుంది. దీనిపై పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోన్న ఉత్కంఠ నగర వాసుల్లో నెలకొంది. -
విద్యా వ్యాపారంపై శాసనమండలిలో చర్చిస్తా
అనంతపురం రూరల్ : కార్పొరేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న విద్యా వ్యాపారంపై శాసన మండలిలో చర్చించి, ఫీజు నియంత్రణ చట్టం అమలు కోసం కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పరశురాం అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరుస కరువులతో రైతులు ఉపాధి కోసం వలస పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్య సంస్థలు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి లక్షలాది రూపాయాలు డొనేషన్ల పేరిట వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు తరహాలో 1వ తరగతి నుంచి 10 వరకు ప్రభుత్వ సెక్టార్లోనే విద్యాభ్యాసం అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇక్కడి నుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపు నిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 996 పాఠశాలలతోపాటు 56 వసతి గృహాలను మూసివేసిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. అయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్య వ్యాపారం సాగిస్తున్న పాఠశాలలపై ఐక్య ఉద్యమం చేపట్టాలన్నారు. జిల్లాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి 50 శాతం ఫీజులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాల వద్ద తరగతుల వారీగా ఫీజుల వివరాలతో కూడిన నోటీస్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ ఫీజు నియంత్రణ కోసం కలెక్టర్ ప్రత్యేక చోరవ చూపాలన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సాకే నరేష్, మల్లికార్జున నాయక్, ఆంజనేయులు, జనార్థనరెడ్డి, రాచానపల్లి గోపి, తోపాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మండలిలో ఐదు నిమిషాల్లోనే..
- బిల్లును ఆమోదించాలని చైర్మన్‌ను కోరిన మంత్రి హరీశ్ - ఆమోదం పొందినట్టు ప్రకటించిన చైర్మన్.. సభ నిరవధిక వాయిదా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఐదు నిమిషాల్లోనే ఆమోదం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మండలి ప్రారంభమైంది. ఆకుపచ్చ కండువాలతో వచ్చిన కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్.. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇదే సమయంలో సభలో భూసేకరణ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. బిల్లుపై మాట్లాడాల్సిందిగా విపక్ష నేత షబ్బీర్ అలీని చైర్మన్ కె,.స్వామిగౌడ్ కోరారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ షబ్బీర్ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో చైర్మన్... ఎంఐఎం సభ్యుడు జాఫ్రీకి మాట్లాడే అవకాశం ఇచ్చారు. బిల్లుకు తాము పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల నుంచి ముందుకెళ్లకుండా మార్షల్స్ అడ్డుగా నిలిచారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకొని.. కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడటం ఇష్టం లేదని బిల్లును ఆమోదించాల్సిందిగా చైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలు కొనసాగుతుండగానే బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్ ప్రకటించారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. అనారోగ్యం కారణంగా బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు సభకు హాజరు కాలేదు. -
స్వపక్షంలో విపక్షం
పారిపాలన తీరుపై వాదోపవాదాలు – తీర్మానాల అమలు ఆలస్యంపై వాగ్వాదం – మేయర్‌పై ధ్వజమెత్తిన టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులు – నిరసనగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్ – సభలో ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగం *‘‘నాకు మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్ లేరు. ఇప్పటి వరకు నియమించిన వారు సరిగా పనిచేయడం లేదు. నా అభీష్టం మేరకు కంప్యూటర్ను నియమించకపోతే ఎలా? ప్రెస్నోట్లు, కమిషనర్‌కు నోట్లు ఎలా ఇవ్వాలి’’ : కౌన్సిల్ సాక్షిగా మేయర్ ఆవేదన ఇది.. * ‘‘పాలకవర్గం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి కుంటుపడుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదు.’’ : పాలక పక్షం ఆగ్రహం * ‘‘ఇకపై తాను సభలోకి రాకపోవచ్చు. సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలి. పదవులు శాశ్వతం కాదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి’’ : ఎమ్మెల్యే గోరంట్ల నిర్వేదం. * ‘‘ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలి. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారు’’ : ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల హెచ్చరిక ఇలా ఎన్నో విషయాలు, మరెన్నో సమస్యల ప్రస్తావనకు వేదికగా నిలిచింది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సెలింగ్ సమావేశం. నగరపాలక సంస్థ బడ్జెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈ సర్వసభ్య సమావేశంలో కార్పొరేషన్ పరిపాలన తీరుపై చర్చసాగింది. పాలక మండలి, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి ఏవిధంగా కుంటుపడుతోంది? కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందకపోవడం, తదితర విషయాలపై సభ్యులు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. - సాక్షి రాజమహేంద్రవరం క్రొవిడి లింగరాజు సభా మందిరంలో శుక్రవారం నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన జరిగింది. నగరంలో ఇప్పటి వరకు జరిగిన, ఇకపై జరగబోయే అభివృద్ధి విషయాలను మేయర్ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సమావేశంలో బడ్జెట్‌పై చర్చించాలని, ఈ నెలలోనే మరో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాసమస్యలు, ప్రశ్నోత్తాలు, ఇతర సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించినా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పట్టుబట్టారు. అసలు తప్పు ఎవరిదో చెప్పాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జోక్యం చేసుకుని తీర్మానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. నాడు ఏం చేశారు? ఇదే విషయమై గతంలో మేయర్‌కు మద్దతుగా నిలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు సఖ్యత చెడడంతో మేయర్‌ను నిలదీస్తున్నారా? అనిÐð వైఎస్సార్సీపీ చీఫ్ విప్, 19వ డివిజన్ కార్పొరేటర్ మింది నాగేంద్ర టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల వల్ల చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. 2017–18 బడ్జెట్‌పై సభ్యుల సూచనలు... * బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అందులోని లోపాలను ఎత్తి చూపుతూ సలహాలు, సూచనలు చేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది రెవెన్యూ రాబడులు ఎందుకు తగ్గాయో అధికారులు చెప్పాలని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఆశీలు ఒక్కసారిగా నాలుగురెట్లు పెంచడం సరికాదని, అధికారులు పునరాలోచన చేయాలని కోరారు. 2002 నుంచి ఆశీలు పెంచకపోవడం వల్ల ఈ ఏడాది నాలుగు రెట్లు పెంచామని కమిషనర్ వి.విజయరామరాజు చెప్పారు. గత ఏడాది ఆశీలు వల్ల రూ.51 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది పెంచిన రేట్ల వల్ల రూ.1.6కోట్లు రానుందని చెప్పారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత బీపీఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో ప్రజలను అధికారులు చెక్‌లిస్ట్ తేవాలని ఇబ్బందులు పెడుతున్నారని 23 డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి సభ దృష్టికి తీసుకొచ్చారు. బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని 12వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్ వ్యాఖ్యానించారు. మోరంపూడి–స్టేడియం రోడ్డు 100 అడుగులని మాస్టర్‌ప్లాన్‌లో పెట్టామని ఆరోడ్డు వెడల్పు వంద అడుగులో, లేక 80 అడుగులో చెప్పాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్... నగరపాలక సంస్థ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పాలక మండలి ఆమోదించింది. మొత్తం బడ్జెట్ విలువ రూ.304 కోట్ల 25లక్షల 35 వేలుగా పేర్కొన్నారు. ఇందులో గత ఏడాది ప్రారంభ నిల్వ రూ.74కోట్ల 63 లక్షలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.229 కోట్ల62 లక్షల 30 వేలు వివిధ విభాగాల నుంచి ఆదాయం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు, గ్రాంట్ల రూపంలో రానుందని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్ ఖర్చులు రూ. 283 కోట్ల 34 లక్షలుగా చూపారు. ఇక రూ.20 కోట్ల 91 లక్షల 35 వేలను మిగులుగా చూపారు. సభలో గోరంట్ల ఉద్వేగం... టంగుటూరి, ఏబీ నాగేశ్వరరావు, ఏసీవై రెడ్డి లాంటి మహానుభావులెందరో నగర అభివృద్ధికి కృషి చేశారని, ఆ అవకాశం 35 ఏళ్లుగా తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని చెబుతూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగానికి లోనయ్యారు. ఇకపై తాను సభలోకి రాకపోవచ్చని, సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. సభ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్ ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలని ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల విజ్ఞప్తి చేశారు. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. మేయర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే ఆకుల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. మేయర్‌కు వెంటనే కంప్యూటర్ ఆపరేటర్‌ను ఇస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. -
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
-
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
అమరావతి: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు నారా లోకేష్, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, బీటెక్‌రవి(మారెడ్డి రవీంధ్రనాథరెడ్డి), జీ దీపక్ రెడ్డి బచ్చుల అర్జునుడు గురువారం ఉదయం శాసనసమండలిలో ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణస్వీకారం చేయించారు. -
సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేసన్–ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హిప్నో కమలాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక రాజవిహార్ సమీపంలోని అమృత సైకాలజీ కౌన్సిలింగ్ అండ్ హెచ్ఆర్డీ సెంటర్లో జరిగిన సైకాలజిస్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సైకాలజిస్టులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కౌన్సిలింగ్ సైకాలజీకి వృత్తిపరంగా స్పష్టత, భద్రత లేకపోవడంతో ఆ కోర్సులు చదివిన వారు వేరే ఉద్యోగాలు, వృత్తులవైపు మళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.19,2010 ప్రకారం ప్రతి విద్యాలయం సైకాలజిస్టుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ సైకాలజిస్టులను వైద్యులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎస్. బాలాజీరావు, ఎ. వెంకటసుబ్బయ్య, ఎస్. సురేంద్రబాపూజి, ప్రధాన కార్యదర్శిగా టి. పుల్లయ్య, సహాయ కార్యదర్శులుగా బి. సంధ్యాజ్యోతి, కె. విజయకుమార్, కోశాధికారిగా ఎన్సీ మహాదేవి ఎన్నికయ్యారు. -
రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం
రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం 8 నాలుగింతలు పెరగనున్న విస్తీర్ణం 8 రేపు పాలకమండలి ముందుకు మాస్టర్ ప్లాన్ 8 ఆమోదం లాంఛనప్రాయమే 8 13 పంచాయతీల విలీనంతో మారనున్న నగర రూపురేఖలు సాక్షి, రాజమహేంద్రవరం : పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్న రాజమహేంద్రవరం నగరానికి రాజయోగం పట్టనుంది. నాలుగు దశాబ్దాల తర్వాత నగరపాలక సంస్థలో నూతన మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. 1975లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం అమలులో ఉంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజమహేం ద్రవరం నగర జనాభాకు అనుగుణంగా నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ ముసాయిదాను రూపొందించింది. దీనిపై నగర ప్రజల అభిప్రాయాలు సేకరించి, సవరించిన ప్రణాళికను ప్రభుత్వానికి పంపింది. అప్పటి నుంచి నూతన ప్రణాళికకు ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ శుక్రవారం జరిగే నగరపాలక మండలి సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం లాంఛనమే కావడంతో మాస్టర్ ప్లాన్ అమలులోకి రానుంది. 2031 నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో నగర రూపురేఖలు మారనున్నాయి. నాలుగు రెట్లు పెరగనున్న విస్తీర్ణం నూతన మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే నగర పరిధి 162.83 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 1975 మాస్టర్ ప్లాన్ ప్రకారం నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం నగరం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. దీని ప్రకారం 111.33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రూరల్ నియోజకవర్గంలో ఉన్న 13 పంచాయతీలు నగరంలో విలీనం కానున్నాయి. కాతేరు, తొర్రేడు, కోలమూరు–కొంతమూరు, గాడాల, పాలచర్ల, లాలాచెరువు, దివాన్ చెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ–మోరంపూడి, బొమ్మూరు, ధవళేశ్వరం, మధురపూడి పంచాయతీలు నగరంలో కలవనున్నాయి. ఈ ప్రాంతాలు కలుస్తుండడంతో రాజమహేంద్రవరం నగర విస్తీర్ణం 44.5 చ.కి.మీటర్ల నుంచి 162.83 చ.కి.మీటర్ల మేర నాలుగు రెట్లు పెరగనుంది. జనాభా దాదాపు రెట్టింపు కానుంది. ప్రస్తుతం 3.41 లక్షలుగా ఉన్న జనాభా 13 పంచాయతీలు కలుస్తుండడంతో 5.92 లక్షలకు పెరగనుంది. తీరనున్న సమస్యలు పురాతన రాజమహేంద్రవరం నగరంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ ఆధారం. వ్యాపార, విద్య, ఉపాధి అవకాశాలు పెరగడంతో నగర జనాభా గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2011 లెక్కల ప్రకారం నగరంలో జనాభా 3.41 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి అనుగుణంగా డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వర్షం వచ్చిందంటే డ్రైనేజీలు పొంగి రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఇరుకు రోడ్లతో మెయిన్‌బజారు, తాడితోట, శ్యామలా సెంటర్, దేవీచౌక్ తదితర ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. గోదావరి చెంత ఉన్నా తాగునీటికి తిప్పలు తప్పడంలేదు. ఆవ చానల్, నల్లా చానల్ ద్వారా గోదావరిలోకి మురుగునీరు కలుస్తుండడంతో నది కలుషితమవుతోంది. మాస్టర్ ప్లాన్ అమలులోకి వస్తే ఈ సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. -
ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ విజయసారథి
గుంటూరు మెడికల్ : ఏపీ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ గడ్డం విజయసారథి ఏకగీవ్రంగా ఎంపికయ్యారు. గురువారం విజయవాడలో మెడికల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సభ్యుడుగా కొనసాగుతున్న డాక్టర్ విజయసారథిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. గుంటూరు వైద్య కళాశాల జనరల్ సర్జరీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ విజయసారథి పనిచేస్తున్నారు. వైద్య విద్యను బలోపేతంచేసేందుకు నూతనంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిరంతర వైద్య విద్య కార్యక్రమాలను మరింత మెరుగుపరిచేందుకు సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు. తనను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావుకు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ రవిరాజుకు కతజ్ఞతలు తెలిపారు. -
ఆర్బీఎస్కే రాష్ట్ర నూతన కార్యవర్గం
పోచమ్మమైదాన్ : రాషీ్ట్రయ బాల స్వస్తీయా కార్యక్రమం (ఆర్బీఎస్కే) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. వరంగల్‌లోని అనంతలక్ష్మీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో రాష్రీ్టయ బాల స్వస్తీయ కార్యక్రమ వైద్యుల సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ వలుబోజు మోహన్‌రావు, అధ్యక్షుడిగా డాక్టర్ గుండా రవీందర్, ఉపాధ్యక్షులుగా రమేష్, చం ద్రశేఖర్, హుస్సేన్, కార్యదర్శిగా కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రవికుమార్, కోశాధికారిగా మాధవి, సహాయ కార్యదర్శిగా మిసియెుద్దీన్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
వరంగల్ అర్బన్ : బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర నూతన కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల ఎ న్నికను బుధవారం నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ట్లు ఎన్నికల అధికారి వారణాసి పవన్‌కుమార్ వెల్లడించారు. సమితి గౌరవాధ్యక్షులుగా ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి, సముద్రాల వేణుగోపాలచారి, గంగు ఉపేంద్రశర్మలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నిట్టూరి సతీష్‌శర్మ(కరీంనగర్) ప్రధాన కార్యదర్శిగా కోటి రామేశ్వర్రావు(మెదక్), ఉపాధ్యక్షులుగా భాస్కరభట్ల రామశర్మ(హైదరాబాద్), కార్యదర్శిగా కొండపాక సత్యనారాయణ చార్యులు(కరీంనగర్), కోశాధికారిగా అనిల్ కుమార్(నిజామాబాద్) ఎన్నికయ్యా రు. సేవా సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గంగు రజితాశర్మ(వరంగల్), ప్రధాన కార్యదర్శిగా కొండూరి నాగరాణి(కరీంనగర్)లను ఎన్నుకున్నారు. పది జిల్లాల అధ్యక్షులను కూడా ఎన్నుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అ ధ్యక్షుడిగా ఆరుట్ల కరుణాకరాచార్యులు, రం గారెడ్డి జిల్లా అధ్యక్షుyì గా కులకర్ని మంగేశ్ శర్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఐనవోలు వెంకట సత్యమోహన్, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా వల్లూరి పవన్‌కుమార్, అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సంఘంబట్ల నరహరిశర్మ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పచ్చ శ్రీనివాస్‌రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా మంగు రాధాకిషన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రెంజల్కర్ దివాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రవీందర్రావును ఎన్నుకున్నట్లు పవన్‌కుమార్ వెల్లడించారు. అనంతరం బ్రాహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో16 లక్షల బ్రాహ్మణ కు టుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. బ్రాహ్మణయిజంపై ఇటీవల ప్రొఫెసర్ కంచె ఐలయ్య అర్థం లేని విమర్శలు చేస్తున్నారని, అతడిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
మండలిలో ప్రశ్నల వివాదం
సభ్యుల లంబా స్పీచ్‌లతో కాలాతీతమవుతోంది: స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కో ప్రశ్నపై సభ్యులు పలు ఉప ప్రశ్నలు వేయడంతో అది లఘు చర్చకు దారితీస్తోందనీ, అందువల్ల మూడు ప్రశ్నల అనంతరం ప్రత్యేక ప్రస్తావన చేపడతానని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. దీంతో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములునాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు తమ ప్రశ్నలను యథాతథంగా కొనసాగించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ దశలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రశ్న సంక్షిప్తంగా ఉంటే తమ సమాధానం సంక్షిప్తంగానే ఉంటుందని, పార్టీకి ఒకరికి అవకాశమిస్తే సరిపోతుందని సూచించారు. లేదంటే రోజుకు 2,3 ప్రశ్నల కంటే ఎక్కువరావని, చైర్మన్ ఆ దిశలో ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. చైర్‌ను మంత్రి డిక్టేట్ చేసే పద్ధతి సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భానుప్రసాద్, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధరగౌడ్ తమ స్థానాల్లో నిలబడి అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి, ఎం.రంగారెడ్డి, కె.రాజగోపాల్‌రెడ్డి కూడా తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. ఈ క్రమంలో పొంగులేటి-పాతూరిల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ తమకు చైర్‌పై అత్యంత గౌరవముందని, సభను ఎట్లా నడపాలో సూచనలు, విజ్ఞప్తులు మాత్రమే చేయగలమనీ, చైర్‌ను డెరైక్ట్ చేసే అధికారం లేదన్నారు. సభ్యులు ‘లంబా లంబా స్పీచ్లిస్తుండడంతో కాలాతీతమవుతోందనీ, కొందరు సభ్యులు అనుబంధ ప్రశ్నలు వేస్తున్నారే తప్ప ఇంట్లో కూర్చుని ప్రశ్నలు రాయలేకపోతున్నారని చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇకపై ప్రశ్నపై సంతకం చేసిన వారికే పరిమితమవుదామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని మళ్లీ ప్రారంభించి అన్ని ప్రశ్నలు పూర్తిచేశారు. -
'దోచుకో- దాచుకో అన్నట్లు ప్రభుత్వ విధానం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, మేకా శేషుబాబు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలసీ 'దోచుకో- దాచుకో' అన్న చందంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా ఇసుక వ్యాపారం నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముందుగా చినబాబు, ఆ వెనుకాలే పెదబాబు విదేశాలకు వెళ్తున్నారని, ఈ విదేశీ పర్యటనల వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని ఎమ్మెల్సీలు మండలిలో ప్రశ్నించారు. -
ఎప్పుడూ కేసీఆర్ కాలమే నడవదు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ‘నాలుగు ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన ఎప్పుడూ కేసీఆర్ కాలమే నడుస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం, ఆపై శీతాకాలం లాగా.. కాలభ్రమణం తప్పదని తెలుసుకుంటే మంచిది’ అని అధికార పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు. ఆదివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షం తరపున పొంగులేటి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మధ్యలో ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్సీలు జోక్యం చేసుకోవడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, తాగునీటి కష్టాలు వంటి కీలకమైన సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.3,500 కోట్లు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తనవాటా (10శాతం) కింద రూ.350 కోట్లు విడుదల చేయలేదని పొంగులేటి విమర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో కుంభకోణాలకు పాల్పడి బ్లాక్ లిస్ట్‌లో చేరిన కాంట్రాక్టర్లకే ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు అప్పగించిందని దుయ్యబట్టారు. -
30 శాతం మంది నకిలీ లాయర్లే!
దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు కనీసం 30 శాతం మందికి నకిలీ డిగ్రీలున్న విషయం బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నకిలీ లాయర్లను వెతికి పట్టుకునేందుకు బీసీఐ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకప్పుడు న్యాయవాద వృతిని చేపట్టాలనుకున్నవారు బీసీఐ సర్టిఫికెట్తో రిజిస్టర్ అయితే సరిపోయేది. కానీ తాజాగా అమల్లోకి తెచ్చిన పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ సమయానికి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారంతా బీసీఐ సర్టిఫికెట్తో పాటు పదోతరగతి, బోర్డు సర్టిఫికెట్లను, ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్లో తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీఐ ఛైర్మన్ చెప్పారు. లాయర్లు సమర్పించిన సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ సదరు విశ్వవిద్యాలయాలు, బోర్డుల సహాయంతో 2016 సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందని మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. బీసీఐ రిజిస్ట్రేషన్ ఉండి ఐదేళ్లుగా ప్రాక్టీస్‌లో లేని న్యాయవాదులను పరిశీలనలో భాగంగా లాయర్లుగా గుర్తించినా.. తిరిగి ప్రాక్టీస్ కు మాత్రం అనుమతించే అవకాశం లేదన్నారు. ఈ నూతన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బార్ కౌన్సిల్... వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదుల అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాదికీ అకాడమీ సర్టిఫికెట్ తప్పనిసరి అని, దాంతో ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందని మిశ్రా చెప్పారు. దేశంలో 20 శాతం లాయర్లు సరైన 'లా' డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీఐ ఛైర్మన్ గతేడాది చెప్పారు. అకాడమీలను ప్రారంభించి, నకిలీ న్యాయవాదులను నిర్మూలించేందుకు సహకరించాలని అప్పట్లో కేంద్రాన్ని నిధుల కోసం ఆశ్రయించారు. అయితే అప్పటికే న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చే జ్యుడీషియల్ అకాడమీలను పొడిగిస్తూ, న్యాయవాదులకు, న్యాయవ్యవస్థలో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ ఆఫీసర్ల వంటి వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, న్యాయ శాఖ బీసీఐకి హామీ ఇచ్చింది. -
ఆ గ్రామానికి అంతా మహిళలే..!
గుజరాత్ మహిళలు నారీభేరిని మోగిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్ల నిర్మాణం, సౌరదీపాల్లాంటి మౌలిక సదుపాయాల రూపకల్పనకు నాందిపలికారు. 21-26 మధ్య వయసున్న యువతులంతా చేతులు కలిపి గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు. నర్సింగ్ గ్రాడ్యుయేట్ హినాల్ పటేల్, ఇంజనీరింగ్ చదివిన రాధా పటేట్, మోటార్ బైక్ షోరూమ్ లో మేనేజర్ గా చేస్తున్న నిషా పటేల్, ఫార్మసీ చదువుతున్న విరాల్బెన్ సర్వయాలు తమ ఉద్యోగాలు, అధ్యయనాల్లో బిజీగా ఉంటూనే గ్రామసేవకు అంకితమయ్యారు. ప్రతివారం హినాల్ ఇంట్లో సమావేశమై గ్రామంలోని తీవ్ర సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ ఆనంద్ జిల్లాలోని శిశ్వగ్రామ పంచాయతీ మహిళాసభ్యులు... ఇప్పడు ప్రతి పంచాయతీకి స్ఫూర్తిదాయకంగా మారారు. మంచి విద్యార్హతలతో పాటు, 12 మంది యువ సర్పంచ్ లు హినాల్ పటేల్ నాయకత్వంలో గత నాలుగేళ్ళుగా గ్రామాభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నారు. శిశ్వ గ్రామం.. గుజరాత్ లోని వేల గ్రామాల్లో ఒకటి. అయితేనేం.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమర పథకానికి ఈ గ్రామం ఎంపికైంది. ఇలా ఎంపికైన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. 2011 లో ఈ పథకానికి శిశ్వ సర్పంచ్ గా హినాల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సమయంలో ఆమెకు వయసు 22 ఏళ్లు. గ్రామాభివృద్ధిపై మక్కువ చూపుతున్న ఆమెకు... ఎన్నికల సమయంలో తండ్రి ప్రోత్సాహం అందించారు. హినాల్ సహా మహిళా సభ్యులంతా ఒక్కోరు ఒక్కో రంగాన్ని ఎంచుకొని ఆ దిశగా అభివృద్ధికి దారులు వేశారు. ఆల్ ఉమెన్ పంచాయితీగా పేరొందిన శిశ్వ గ్రామంలో మహిళలు... ఆర్వో నీటి పథకంతోపాటు, సోలార్ లైట్లు, చెత్తడబ్బాలు వంటి అనేక మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వీరి అభివృద్ధికి తార్కాణంగా శిశ్వ గ్రామం నిర్మల్ గ్రామంగా ఎంపికై, రాష్ట్రపతి అవార్డును అందుకుంది. ఈ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించి శిశ్వ గ్రామాన్ని 'ఈ' గ్రామంగా మార్చారు. ఆన్ లైన్ లోనే గ్రామ ప్రజలకు అనేక సౌకర్యాలను అందిస్తున్నారు. అదే స్ఫూర్తితో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఈ విలేజ్ ను ఏర్పాటు చేసి, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే విద్యాలయాలనూ నిర్మించాలన్నది ప్రస్తుతం ఈ మహిళామణులు కల. అది కూడా త్వరలోనే సాకారమౌతుందని ఆశిస్తున్నారు. ఈ మహిళా సర్పంచుల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న శిశ్వ గ్రామాన్ని నేడు.. రాష్ట్రంలోని అనేక గ్రామాలు రోల్ మోడల్ గా మార్చుకుంటున్నాయి. -
ప్రతిపక్షంపై ఎదురుదాడి చేద్దాం
హైదరాబాద్: ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయటం ద్వారా శాసనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ, మండలి వ్యూహ కమిటీ సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సమావేశం శనివారం రాత్రి జరిగింది. ప్రతిపక్షం ఏ అంశం ప్రస్తావించేందుకు ప్రయత్నించినా ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత విమర్శలు చేయటం ద్వారా ఆ అంశాన్ని పక్కదారి పట్టించి చర్చకు రాకుండా చూడాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ప్రధానంగా ఇసుక అమ్మకాల్లో అక్రమాలు, కల్తీమద్యం, కాల్‌మనీ వ్యవహారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతివష్టి, కొన్ని జిల్లాల్లో అనావష్టి, ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి,భద్రతలు తదితర అంశాలను ప్రస్తావిస్తుందని అన్ని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో, ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్ది హయాంలో జరిగిన విధానాన్ని ప్రస్తావించి ఎదురుదాడి చేయటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయాలని నిర్ణయించారు. ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే అవసరమైతే ఒకరిద్దరు సభ్యులపై చర్య తీసుకోవటం ద్వారా భయపెట్టి నియంత్రించి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఇసుక, బాక్సెట్, నీటిపారుదల రంగాలపై శ్వేతపత్రం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయించారు. శాసనసభ బీఏసీ సమావేశం తొలిరోజు ప్రశ్నోత్తరాల తరువాత నిర్వహిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తరువాత చేపట్టే అంశంపై కూడా చర్చించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకష్ణుడు, కె.అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, చీఫ్‌విప్, విప్‌లు కాలవ శ్రీనివాసులు, యామినీబాల, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గాలి ముద్దుకష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
'తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశపర్చండి'
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపన పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని దీనిని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి, దానం మాట్లాడారు. తెలంగాణలో కరవుపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం ఢిల్లీ టూర్ రాష్ట్రప్రయోజనాల కోసం కాకుండా సొంత అజెండాలా మారిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. సీఎం, సంబంధిత మంత్రులు కాకుండా మంత్రి కేటీఆర్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తారని.. దీనిపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. గ్రేటర్లో ఓట్ల కోసమే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగడం లేదని నాయకులు చెప్పారు. -
డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఎన్నికకు సంబంధించి 5వ తేదీన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండగా, 6 వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. -
మూడు గంటలకో రైతు బలి
- రుణమాఫీని నాలుగేళ్లు సాగదీయడం వల్లే బలవన్మరణాలు - శాసనమండలిలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు - రైతు ఆత్మహత్యలపై సర్కారు లెక్కలన్నీ తప్పుల తడకలే - 60 ఏళ్ల పాపాల్ని గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామన్న అధికార పక్షం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సగటున మూడు గంటలకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని.. అయినా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని శాసనమండలిలో విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొన్నా... కరువు మండలాల జాబితాను ఇంకా కేంద్రానికి ఎందుకు పంపలేదని నిలదీశాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై మంగళవారం శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. మరణించిన రైతుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలంటూ సభ ప్రారంభంలోనే కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. చర్చ జరిగాకే సంతాపాలకు అనుమతించాలని అధికారపక్షం కోరింది. అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై వ్యవ సాయ మంత్రి ప్రకటనను ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో చదివారు. అనంతరం విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 15 నెలల్లో రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమవద్ద లెక్కలున్నాయన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి మూడు గంటలకు ఒకరైతు చొప్పున పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొం దని... ఇప్పుడు మాఫీ పేరుతో నాలుగేళ్ల పాటు రైతుల చేతులకు బేడీలు వేసిందని మండిపడ్డారు. రుణాలు మాఫీకాక తాకట్టులో ఉన్న పాస్ పుస్తకాలు, బంగారాన్ని బ్యాంకులు తిరిగివ్వడం లేదని.. ఈ కారణంగా మరొక చోట అప్పు తీసుకునే అవకాశం కూడా లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. రైతుల రుణాలన్నిం టికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తాకట్టులో ఉన్న డాక్యుమెంట్లు, బంగారం వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు తక్షణం కమిటీని వేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు రప్పించే విషయంలో అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4 బడా విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు. విపక్షాలది రాజకీయం 60 ఏళ్లుగా జరిగిన పాపాలను గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ఆత్మహత్యలు నివారించేం దుకు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌కు సిద్ధపడితే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించడంపై స్వామినాథన్, జయతీ ఘోష్ కమిటీలు ఇచ్చి న నివేదికలను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని పల్లారాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. -
రాష్ట్రానికి ప్రత్యేక 'హోదా'కల్పించాలి
♦ కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి ఏకగ్రీవ తీర్మానం ♦ కేంద్రం నుంచి రావాల్సిన రాయితీల్ని పొందేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా: సీఎం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి గురువారం ఏకగ్రీవంగా తీర్మానిం చింది. 'హోదా'అంశంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని, పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరచిన అన్నిఅంశాల్నీ అమలుచేయాలని, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర పారిశ్రామిక , ఆర్థికాభివృద్ధికోసం పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధు ల విడుదల, 13వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, మౌలిక వసతుల కల్పన, సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని హామీల్నీ అమ లు చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం ప్రతి పాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిం చినట్టు మండలి చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు: సీఎం అంతకుముందు జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. ప్రత్యేకహోదా రాద ని అధైర్యపడి ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని, ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన ఆరోపించారు. అఖిలపక్ష భేటీ అవసరం: ఉమ్మారెడ్డి అంతకుముందు చర్చలో వైఎస్సార్సీపీ మం డలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడు తూ.. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయన్న సంకేతాలిస్తేనే కేంద్రంనుంచి మన డిమాండ్‌ను సునాయాసంగా సాధించడానికి వీలుంటుందన్నారు. అందుకోసం ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా మాత్రమే కావాలని... ప్యాకేజీ వద్దనే సెంటిమెంట్ ప్రజల్లో నాటుకుపోయిందని గుర్తుచేస్తూ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా సీఎం చంద్రబాబు.. ప్రధానమంత్రి మోదీని ఏమి అడిగారనే విషయం ఇప్పటికీ బయటకు రావట్లేదన్నారు. సీపీఐ సభ్యుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం చేసిన తీర్మానాలు... తీర్మానాల మాదిరిగాక అభ్యర్థన కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ఉందన్నారు. -
రచ్చరచ్చ
హోరెత్తిన కౌన్సిల్ సమావేశం గద్దె డెరైక్షన్‌లో రసవత్తరంగా నడిచిన కనకదుర్గ లేఅవుట్ కథ ప్రతిపక్షాలను తోసిపుచ్చి ‘పచ్చ’జెండా ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్ అరుపులు.. కేకలు.. తోపులాటలతో బుధవారం కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా సాగింది. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ ఆమోదం కౌన్సిల్‌ను కుదిపేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చర్చకు పట్టుబట్టినా టీడీపీ మొండిగా వ్యవహరించింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డెరైక్షన్‌లో కథంతా రసవత్తరంగా సాగింది. ఇదేంటని ప్రశ్నించిన తొమ్మిది మంది వైఎస్సార్ సీపీ సభ్యుల్ని సభ నుంచి బహిష్కరించారు. లేఅవుట్ ఆమోదంలో ఎలాంటి తప్పు లేదంటూ కొందరు టీడీపీ కార్పొరేటర్లు చప్పుట్లు చరుచుకున్నా.. తప్పు జరిగిందంటూ మూడు నెలల కిందట గగ్గోలు పెట్టిన మరికొందరు పెద్దల హుకుంతో నోరు మెదపలేదు. విజయవాడ సెంట్రల్ : శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్‌ను కౌన్సిల్ ఆమోదించడం పెనుదుమారాన్నే రేపింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10.50 గంటలకు సభ ప్రారంభమైంది. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తుండగా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అభ్యంతరం చెప్పారు. గత కౌన్సిల్లో ఆమోదించిన శ్రీకనకదుర్గ లేఅవుట్ ధ్రువీకరణను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమోదాన్ని రద్దు చేయాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించారు. అక్కడ ఏ తప్పు జరగలేదన్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారన్నారు. టీడీపీ అంటించుకున్న అవినీతి బురదను తాము అంటించుకోలేమని పుణ్యశీల ఎద్దేవా చేశారు. సెక్షన్ 679 ప్రకారం అధికారాన్ని అధిగమించి నిర్ణయాలు తీసుకుంటే మేయర్ పదవిపోతుందని హెచ్చరించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. దొంగలు మీరంటే మీరు టీడీపీ కార్పొరేటర్ ఆతుకూరి రవికుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ దొంగల పార్టీ అన్నారు. దీనిని వైఎస్సార్ సీపీ సభ్యుడు బుల్లా విజయ్ తీవ్రంగా ఖండించి ప్రతిఘటించారు. ‘ఓటుకు కోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడిన రేవంత్‌రెడ్డి మీ పార్టీలోనే ఉన్నాడు. మీదే దొంగల పార్టీ..’ అన్నారు. ఈక్రమంలో రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో సభను 11.45కు పదినిమిషాల పాటు వాయిదా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరంగేట్రం చేశాక 12.10 గంటలకు సభ ప్రారంభమైంది. చర్చ జరపాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ ససేమిరా అన్నారు. దీంతో ఇరుపార్టీల సభ్యులు ఆరోపణలతో హోరెత్తించారు. టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. మధ్యాహ్నం 12.20కు మళ్లీ సభను వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్ మేయర్ చాంబర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ ఫ్లోర్‌లీడర్లు పుణ్యశీల, ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీతో చర్చలు జరిపారు. లేఅవుట్ ఆమోదానికి సహకరించాల్సిందిగా కోరారు. పుణ్యశీల ససేమిరా అన్నారు. సుమారు గంటన్నర సేపు చర్చలు జరిపినప్పటికీ ప్రతిపక్షాలు మెత్తపడలేదు. వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి మేయర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మేయర్ సభను ప్రారంభించారు. పోడియం వదిలి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. చర్చ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, సభ్యులు ఆసిఫ్, బుల్లా విజయ్, బి.బహుదూర్, అవుతు శ్రీశైలజ, కరీమున్నీసా, బి.సంధ్యారాణి, జె.పూర్ణమ్మ, పి.సుభాషిణి లను సస్పెండ్ చేశారు. శ్రీకనకదుర్గ లేఅవుట్పై వైఎస్సార్ సీపీ, సీపీఎం ఇచ్చిన సవ రణ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. లేఅవుట్ ఆమోదానికి అడ్డగోలుగా ‘పచ్చ’జెండా ఊపారు. -
కౌన్సిల్‌కు రె‘ఢీ’
- నేడు కౌన్సిల్ - కనకదుర్గ లేఅవుట్పైనే కీలక చర్చ - యుద్ధానికి సిద్ధ మవుతున్న పాలకపక్షం - అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వైఎస్సార్ సీపీ - ఎత్తుకు పైఎత్తులు - కనకదుర్గ లే అవుట్‌పై మాట్లాడొద్దని హుకుం - టీడీపీ కార్పొరేటర్లకు క్లాస్ - దుమ్మురేపుతామంటున్న వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ : పాలక, ప్రతిపక్ష పార్టీలు కౌన్సిల్ సమావేశానికి రె‘ఢీ’ అవుతున్నాయి. బుధవారం ఉదయం 10.30 గంటలకు మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 88 అంశాలతో అజెండా రూపొందించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం టీడీపీ, వైఎస్సార్ సీపీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. ఎంపీ కేశినేని నాని భవన్లో టీడీపీ సభ్యులు భేటీ కాగా, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థలోని తమ చాంబర్లో సమావేశమయ్యారు. మూడు నెలల క్రితం కౌన్సిల్ జరిగింది. శ్రీ కనకదుర్గ సొసైటీ లే అవుట్‌ను ఆమోదించడంతో అధికారపార్టీ అవినీతి మకిలిని అంటించుకుంది. సొంతపార్టీ కార్పొరేటర్లే మేయర్ తీరును తప్పుబట్టడంతో రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసమ్మతి కార్పొరేటర్లకు దారికి తెచ్చే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. ‘బొండా’ హుకుం! బొండా ఉమా సెంట్రల్ నియోజక వర్గంలోని టీడీపీ కార్పొరేటర్లతో సోమవారం రాత్రే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్ట కాపాడాలని హితబోధ చేశారు. శ్రీ కనకదుర్గ సొసైటీ వ్యవహారంపై ఎవ్వరూ సభలో మాట్లాడవద్దంటూ తనదైన శైలిలో చెప్పారు. దీంతో కార్పొరేటర్లు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కేశినేని భవన్లో జరిగిన భేటీకి 32 మంది టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మొక్కుబడిగా సంతకాలు చేసి సగం మంది వెళ్లిపోయిన ట్లు సమాచారం. పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరికి కొందరు కార్పొరేటర్లు మనస్తాపం చెందుతున్నట్లు భోగట్టా. గతంలో లే అవుట్ ఆమోదాన్ని తప్పుబట్టిన కార్పొరేటర్ల స్వరం మారుతోంది. అప్పట్లో అవగాహన లేక అలా మాట్లాడాం. ఇప్పుడు అంతా అర్థమైంది అంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు లే అవుట్‌ను ఆమోదించి తీరాల్సిందేనన్న నిర్ణయానికి టీడీపీ కార్పొరేటర్లు వచ్చినట్లు సమాచారం. తలొగ్గేది లేదు : శ్రీ కనకదుర్గ లే అవుట్ ఆమోదాన్ని రద్దు చేయాలని సభలో పట్టుబట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. నగరపాలక సంస్థకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ వ్యవహారంలో తలొగ్గేది లేదని ఫ్లోర్ లీడర్ బి.ఎన్.పుణ్యశీల విలేకరుల వద్ద స్పష్టం చేశారు. ఇందులో అనేక లోపాలు ఉన్నాయన్నారు. భారీగా ముడుపులు ముట్టడం వల్లే అధికార పక్షం అడ్డగోలుగా తీర్మానం చేసిందని దుయ్యబట్టారు. ఇన్నాళ్ళు నీతి కథలు చెబుతున్న టీడీపీ అసలు రంగు బయటపడుతోందనారు. స్మార్ట్‌సిటీ పేరుతో కౌన్సిల్ అధికారాలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎల్ఈడీ బల్బులు వెలుగులు చిమ్మడం లేదన్నారు. నిబంధనల ప్రకారం ప్రధాన అజెండా ఏడు రోజులు, సప్లిమెంటరీ మూడు రోజుల ముందు అందించాల్సి ఉన్నప్పటికీ అండదం లేదన్నారు. నీటి, డ్రెయినేజిచార్జీలను తగ్గిస్తామని చెప్పి అడ్డగోలుగా పెంచేశారన్నారు. వీటన్నింటిపై పాలకపక్షాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. -
రెండో స్థానమెవరికో?
ఎస్టీలకు కేటాయించేందుకే అధిష్టానం మొగ్గు రేసులో మణికుమారి, కాంతమ్మ, రవిబాబు రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రెండో రోజు నామినేషన్లు నిల్ విశాఖపట్నం: శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ బరిలో నిలిచే రెండో కృష్ణుడిపై టీడీపీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒక స్థానానికి ఇప్పటికే పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావు పేరును ఖరారుచేసిన అధిష్టానం రెండోస్థానం కోసం ముమ్మర కసరత్తు చేస్తోంది. సింగిల్ బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయన్న భావనతో పార్టీకి దక్కే ఆ ఒక్కస్థానానికి పప్పలను ఖరారు చేశారు. రెండో స్థానం నుంచి స్వతంత్రునికి మద్దతు ఇచ్చి..అతను గెలిస్తే ఆ తర్వాత పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనను తొలుత అధినాయకత్వం చేసింది. కానీ రెండుస్థానాలకు వేర్వేరు బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించడం...మెజార్టీ ఓటర్లు తమ పార్టీకి చెందిన వారే ఉండడంతో రెండోస్థానం కూడా తమ ఖాతాలోనే పడుతుందన్న ధీమా ఆ పార్టీలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బయటవ్యక్తులను మద్దతిచ్చేకంటే పార్టీలోని వారికే కట్ట బెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ రూరల్ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామా నాయుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబులతో పాటు పలుపురు పార్టీనేతలు కూడా ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తిని ఈ స్థానం నుంచి పోటీకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరిగింది. ఏజెన్సీలో పార్టీకి బలం లేనందున రెండో స్థానం ఎస్టీలకు కేటాయించడమే మేలన్న వాదనతో గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన మాజీ మంత్రి మణి కుమారికి ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోజెడ్పీమాజీ చైర్‌పర్శన్ వంజంగి కాంతమ్మ, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మణి కుమారి, కాాంతమ్మ, రవిబాబులతో పాటు గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించిన అరకు, పాడేరు ప్రాంతాలకు చెందిన ద్వితీయశ్రేణినాయకులు కూడా ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారు. ఎవరికి వారు పార్టీ అధినాయకత్వం వద్ద పైరవీలు సాగిస్తున్నారు. అయితే ప్రధానంగా పోటీమాత్రం మణికుమారి, కాంతమ్మ, రవిబాబుల మధ్యే ఉందంటున్నారు. ఒకటి రెండ్రోజుల్లో రెండో అభ్యర్థి ఎవరనేది తేలనుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాగా రెండో రోజుకూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. -
అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్
హైదరాబాద్: శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకోసం జరుగుతున్న ఎన్నికలకు అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటో తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 5 గంటలకు మొదలవుతుందని ఆయన వెల్లడించారు. -
మండలి’ ఓటుకూ మకిలేనా!
డేట్లైన్ హైదరాబాద్ ఈ ఐదుగురు అభ్యర్థుల పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చి, శాసన సభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినప్పటికీ, ఐదు స్థానాలూ అధికార పక్షమే గెలుస్తుందని ఘంటాపథంగా అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే! మండలి ఎన్నికలలో పడే ఓట్ల మతలబు ఏమిటో త్వరలోనే వెల్లడవుతుంది. అసెంబ్లీ సభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికలు జూన్ ఒక టిన జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు సాఫీగానే సాగిపోయా యి. నాలుగు స్థానాలకు (వైఎస్ఆర్సీపీ-1, తెలుగుదేశం-3) ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి సందులేకపోవడంవల్ల కాబోలు అక్కడ అధి కార పార్టీ ఎలాంటి తొండీ పెట్టకుండా ప్రక్రియను సాగనిచ్చింది. నిజానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీ యాలు ఆడడానికి వెనుకాడరు. తెలంగాణలో మాత్రం ఈ తొండి తప్పేటట్టు లేదు. శాసనసభ సభ్యుల కోటా నుంచి ఆరు ‘మండలి’ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్యను ఆరుతో భాగిస్తే వచ్చే సంఖ్యతో సమంగా ఒక్కొక్క అభ్యర్థికి ఓట్లు రావాలి. కానీ ఆరు స్థానాల కోసం ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఐదో స్థానం గెలుపు ధీమా ఎక్కడిది? ఒకసారి లెక్కలు చూద్దాం. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119. నామినే టెడ్ సభ్యునితో కలిపి 120. శాసనసభ కార్యదర్శి (పదవీకాలం పొడిగిం చారు) రాజా సదారామ్ చెబుతున్నట్టు, రాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికలలో ఓటు అర్హతలేని నామినేటెడ్ సభ్యునికి, మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఇస్తే మాత్రమే ఆ సంఖ్యను 120గా పరిగణించాలి. అయితే రాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి అర్హత లేని సభ్యుల ఓటు శాసన మండలి ఎన్ని కలలో మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందో ఎన్నికల సంఘం స్పష్టం చేయా లి. నిజానికి కరీంనగర్ జిల్లా, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ ఓటు హక్కు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయన ఎన్నడో జర్మనీ పౌరస త్వం తీసుకున్నారు. ద్వంద్వ పౌరసత్వం వల్ల ఆయనకు ఈ ఎన్నికలలో ఓటు వేసే హక్కు లేదని తెలుగుదేశం సభ్యుల వాదన. అయితే రమేశ్ ఇప్పటికి ఉప ఎన్నికలతో కలిపి మూడు నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికవు తూనే ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావడానికి లేని అభ్యంతరం, మండలి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించడం దగ్గర ఎందుకు చెల్లుబాటు కాదో కూడా ఎన్నికల సంఘం వివరించాలి. ఎన్నికల సంఘం ఆ ఇద్దరికీ అనుమతి ఇస్తుందని అనుకుంటే, శాసనసభ్యుల సంఖ్య 120. లేకుంటే 118. శాసన సభలో టీఆర్ఎస్ బలం 65 స్థానాలు. అంటే మూడు స్థానాలు మాత్రమే (ఒక్కొక్క అభ్యర్థికి 20 వంతున ఓట్లు పడితే) ఆ పార్టీకి దక్కుతాయి. పోగా కొద్ది ఓట్లు మాత్రం మిగులుతాయి. శాసనసభలో ఎంఐఎంకు ఏడు ఓట్లు ఉన్నాయి. మొదటి నుంచి నిజాం నవాబు మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్న కారణంగానూ, మజ్లిస్‌తో ఉన్న సఖ్యత కారణంగానూ వారి ఓట్లు కూడా తమకే వస్తాయని టీఆర్ఎస్ భావిస్తే, ఆ రెండు పార్టీల ఓట్ల సంఖ్య 72కు చేరుతుంది. అప్పుడు 20తో (ఒక్కొక్క అభ్యర్థికి రావలసిన ఓట్లు) భాగించినా అధికార పార్టీకి దక్కేవి ఆ మూడు స్థానాలే. అంటే, మిగిలి పోయే ఓట్లు కొద్దిగా పెరగడం మినహా, వచ్చే సీట్ల సంఖ్యలో మార్పేమీ లేదు. ఇక ‘బం గారు తెలంగాణ బ్యాచ్’ (బీటీ బ్యాచ్) అని అంతా ముద్దుగా పిలు చుకుం టున్న టీడీపీ, కాంగ్రెస్ వలస సభ్యులు - తొమ్మండుగురిని కూడా కలుపు కుంటే, అధికార పార్టీ బలం 81కి చేరుకుంటుంది. ఈ సంఖ్య ప్రకా రమైతే నాలుగు మండలి స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోగలదు. 21 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు ఒక మండలి స్థానం; బీజేపీ-5, తెలుగుదేశం-15 మంది సభ్యులతో ఆ కూటమికి ఒక స్థానం తప్పక చెందవలసిందే. మరి అధికార పార్టీ ఏ ధీమాతో ఐదో స్థానానికి ఆశపడుతున్నట్టు? ఎవరి వైఖరి ఏమిటి? మాకు గొప్ప వ్యూహం ఉందని మంత్రులు చెబుతున్నదంతా డంబాచార మేనా? ‘మేం ఐదు స్థానాలూ గెలుస్తాం, అందుకు చర్చలు జరుపుతున్నాం’ అని సాక్షాత్తు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గత వారమే ప్రకటిం చారు. అంటే శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసే, కొనుగోలు చేసే కార్య క్రమం మరోసారి జరగబోతున్నదన్నమాట. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదే జరిగితే తగిన జవాబు చెబుతారు కూడా. ప్రతి అవాంఛనీయ కార్య క్రమానికి బంగారు తెలంగాణ భవిష్యత్తు అంటూ ఒక ముద్రవేసి, వ్యతి రేకించే వారి మీద రంకెలు వేసే అధికార పక్షం ఈ సంగతి గుర్తించాలి. ఇంతకీ శాసనమండలి ఎన్నికలలో మజ్లిస్ వైఖరి ఏమిటి? అది ఇంకా స్పష్టం కాలేదు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ సంవత్సరాంతంలో గ్రేటర్ మున్సి పల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపవలసిందేనని న్యాయస్థానాలు చెప్పే శాయి. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికలలో మజ్లిస్ మద్దతును బహిరంగంగా తీసుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధపడుతుందా? పట్టభద్రుల నియోజకవర్గ ఎన్ని కలలో ఉద్యమవీరుడు దేవీప్రసాద్‌కు ఎదురైన ఓటమి అనుభవం నుంచి అధి కార పక్షం పాఠాలు నేర్చుకుని ఉంటే, అందుకు సిద్ధపడదు. నిజానికి టీడీపీ, బీజేపీ కూటమి బలోపేతం కావడానికి ఆ పరిణామం ఉపకరిస్తుంది. మజ్లిస్ కూడా టీఆర్ఎస్తో దోస్తీకి ఆసక్తి చూపించకపోవచ్చు. కొద్దిమాసాల క్రితం మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిద ర్శనం. కారు (టీఆర్ఎస్)తో దోస్తీ విషయం గురించి విలేకరులు అడిగితే, ‘స్టీరింగ్ మా చేతులలోనే ఉంది’ అని ఆయన అన్నారు. ఆ తరువాత పరిస్థి తులు మారాయి. ఆలేరు దగ్గర జరిగిన వికారుద్దీన్ ముఠా బూటకపు ఎన్ కౌంటర్‌తో మజ్లిస్ మిత్రులు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. వీటికి తోడు ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మోదీతో సెల్ఫీలు తీసుకోవడం, ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వంలో చేరే విష యం ఆలోచిస్తామనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ సభ్యుల మద్దతు టీఆర్ఎస్ అభ్యర్థులకు లభిస్తుందా? ఇప్పటికీ అదే చిరునామా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంఎల్ఏలూ, వారి పార్టీల వివరాలతో శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన జాబితాను కూడా పరిశీలించాలి. 120 మంది సభ్యుల ఆ జాబితాలో అధికార పక్షంలోకి వలసపోయిన ఐదుగురు తెలుగుదేశం, నలుగురు కాంగ్రెస్ సభ్యుల పేర్లు ఆయా పార్టీల పరిధిలోనే ఉన్నాయి. ఆ జాబితా ప్రకారం అధికార టీఆర్ఎస్ బలం 65 మంది సభ్యులే. మరి తొమ్మిది మంది ‘బీటీ బ్యాచ్’ అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు ఎలా వేస్తారు? ‘ఇది రహస్య బ్యాలెట్ బాబూ!’ అని మేధావి, మంత్రి జగదీశ్‌రెడ్డి నవ్వవచ్చు. కానీ జాబితాలూ, ఆ లెక్కలూ మారవు కదా! ఏమో గుర్రం ఎగరావచ్చునంటారా? సరే చూద్దాం! అభ్యర్థుల సంగతి ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆకుల లలితను అభ్యర్థిగా ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ మైనస్ పాయింట్లేమీ లేని నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. కానీ టీఆర్ఎస్ ఎంపిక చేసుకున్న ఐదుగురు అభ్యర్థులతో ఇబ్బందులకు గుర య్యే అవకాశమే ఎక్కువ. ఈ ఐదుగురు ప్రత్యేక రాష్ట్రం విషయంలో చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ వ్యతిరేకులే. ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి కడి యం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయించిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యట నకు వస్తే, ప్రతిఘటించిన ఉద్యమకారులను పోలీసులతో చావగొట్టించిన ఘనత కూడా ఆయనదే. ఇప్పుడు ఆయన వరంగల్ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభకు ఇంకా ఎందుకు రాజీనామా చేయరు? అని అడిగితే జవాబు లేదు. ఇక్కడ గెలుపు ధీమా లేకనో, అక్కడ ఉప ఎన్నిక నల్లేరు మీద నడక కాదని నమ్మడం వల్లనో మరి? మరో అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తేలాక జరిగిన ఎన్నికలలో కూడా తెలుగు దేశం అభ్యర్థిగానే పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయి, తరువాత టీఆర్ ఎస్‌లో చేరారు. పైగా శ్రీహరి, తుమ్మల- ఈ ఇద్దరినీ కూడా మంత్రివర్గంలో చేర్చుకోవడం గురించి అసంతృప్తితో ఉన్న శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువేమీకాదు. ఇక మిగిలిన ముగ్గురి గురించి. నేతి విద్యాసాగర్, తెలం గాణ శాసనమండలి ఆధిపత్యం టీఆర్ఎస్కు అప్పగించినందుకు ప్రతిఫలం గా ఈ అభ్యర్థిత్వం దక్కింది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన యాదవరెడ్డి నరనరాన రాజకీయ గురువు సూదిని జైపాల్‌రెడ్డి ఆలోచనలే ప్రవహిస్తూ ఉంటాయి. ఐదో అభ్యర్థి బోడకుంట్ల వెంకటేశ్వర్లు- ఆయన టీడీపీ నుంచి వచ్చినవారే. తెలంగాణ సాధన కోసం ఎన్నడూ పనిచేసిన వారు కాదు. ఈ ఐదుగురి పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగివచ్చి, శాసనసభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలె ట్ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినా, ఐదు స్థానాలూ అధికార పక్షం గెలుస్తుందని అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే! datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోవిందరెడ్డి
అధికారికంగా ప్రకటించిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి హైదరాబాద్: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జూన్ ఒకటిన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిం చింది. ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో పార్టీకి దక్కే అవకాశమున్న ఒక్క స్థానానికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే దేవసాని చిన్న గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులతో చర్చించిన తరువాత అభ్యర్థి పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన పాత్రే.. ఎంటెక్ పూర్తి చేసిన గోవిందరెడ్డి రోడ్డు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా 2001 వరకు పనిచేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004-09 మధ్యకాలంలో బద్వేలు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచీ పార్టీ లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో పార్టీ పరిశీలకునిగా పనిచేశారు. -
కౌన్సిల్ గరంగరం...
పాలక, ప్రతిపక్ష సభ్యుల మాటల తూటాలు వైఎస్సార్ సీపీ సభ్యుడు సస్పెన్షన్ అధికారులే టార్గెట్‌గా సమావేశం విజయవాడ సెంట్రల్ : ⇒ ఏమ్మా.. మేయర్ కూర్చోమంటే కూర్చోవాలి. ⇒ సార్.. కూర్చోవాల్సింది మీరు. మేం కాదు. సభ్యులు నిలబడి మాట్లాడటం సభా సంప్రదాయం. ⇒ ఇది రోడ్డు కాదమ్మా.. ⇒ చర్చించేందుకే ఇక్కడికి వచ్చాం సార్. సభ్యుల్ని మాట్లాడనివ్వండి.. అంటూ మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మధ్య మాటల తూటాలు పేలాయి. వీరికి పాలక, ప్రతిపక్ష సభ్యులు గొంతు కలపడంతో కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా సాగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం జరిగింది. సెక్రటరీ సెల్ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పుణ్యశీల ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే ప్రశ్నకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. దీంతో సభలో వాగ్వాదం చెలరేగింది. ఒకరికొకరు వాగ్యుద్ధం నగరంలో తాగునీటి సమస్యపై అధికారులు సమాధానం చెప్పలేదని వైఎస్సార్ సీపీ సభ్యుడు బహుదూర్ ఆరోపించారు. సభ నిర్వహించడం మేయర్‌కు చేతకావడం లేదన్నారు. సోది మాటలతో నడిపేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నీ లాంటి సభ్యుడు సభకు రావడం దురదృష్టకరం’ అన్నారు. దీంతో పాలక, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం మొదలైంది. బహుదూర్‌ను కూర్చోవాల్సిందిగా మేయర్ ఆదేశించారు. సమాధానం చెబితేనే కూర్చుంటాననడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. 22 ప్రశ్నలకు ఏడు ప్రశ్నలతోనే చర్చ ముగిసింది. అధికారులపై ముప్పేట దాడి అధికారుల తీరుపై పాలక, ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. పెంచిన ఏడుశాతం నీటి చార్జీలను తగ్గించమని ఆరు నెలల కిందట తీర్మానం చేసినా ఎందుకు తగ్గించలేదని టీడీపీ సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు, జాస్తి సాంబశివరావు కో-ఆప్షన్ సభ్యుడు సిద్ధెం నాగేంద్రరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని సీఈ ఎంఏ షుకూర్ సమాధానమిచ్చారు. కార్పొరేటర్లకు ఏం అధికారాలు ఉన్నాయో చెప్పకుండా ఎందుకు మభ్యపెడుతున్నారని బీజేపీ సభ్యుడు ఉత్తమ్‌చంద్ బండారీ నిలదీశారు. ప్రశాంతి ఆస్పత్రి సమీపంలో నిర్మిస్తున్న ఒక భవనం ఖాళీ స్థలం పన్ను కోటి రూపాయల బకాయి ఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతిచ్చారని వైఎస్సార్ సీపీ సభ్యురాలు పి.సుభాషిణి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని కమిషనర్ వీరపాండియన్ బదులిచ్చారు. సర్కిల్-1 పరిధిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని డివిజన్లలో వసూళ్ల దందా చెలాయిస్తున్నారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు సభ దృష్టికి తెచ్చారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మేయర్ చురకలు అంటించారు. కుక్కల బెడద తీర్చండి : కుక్కల బెడదకు శాశ్వత పరి ష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం సభ్యు లు డిమాండ్ చేశారు. గోశాల తరహాలోనే కుక్కల పెంప కానికి కొంత స్థలాన్ని కేటాయించి, దాని నిర్వహణ బాధ్యతను జీవకారుణ్య సంస్థకు అప్పగించాలని పుణ్యశీల సూచి ంచారు. కమిషనర్ మాట్లాడుతూ కుక్కల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. త్వరలో ఎల్ఈడీ లైట్లు : వీధి దీపాల నిర్వహణ నగరంలో అధ్వానంగా మారిందని వైఎస్సార్ సీపీ సభ్యురాలు అవుతు శ్రీశైలజ ఆరోపించారు. రియల్ ఎనర్జీ సంస్థ నిర్వాహకులు సక్రమంగా పనిచేయడం లేదని సభ్యులు ఆరోపించారు. దీనికి కమిషనర్ సమాధానమిస్తూ పదివారాల్లో నగరంలో 30వేల ఎల్ఈడీ లైట్లు అమర్చనున్నట్లు చెప్పారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌కు ఆ కాంట్రాక్ట్ అప్పగించామని చెప్పారు. రోల్‌బ్యాక్ పింఛన్లు ఏడు నెలలు రావాల్సి ఉండగా, ఒక్కనెలే ఇవ్వడంపై లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ సభ్యుడు చందన సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు. బారికేడ్లు తొలగించండి బారికేడ్ల ఏర్పాటు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పుణ్యశీల ఆరోపించారు. బందరురోడ్డులో బారికేడ్లు ఏర్పాటుచేయడం సరికాదన్నారు. టీడీపీ సభ్యుడు సీహెచ్ గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరగాల్సి ఉండగా, సీపీ ఆఫీసులో సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఔట్‌గోయింగ్ కట్ : నగరపాలక సంస్థలో ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఔట్ గోయింగ్ కట్ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది అందరికీ సెల్ఫోన్లు ఉం డగా రూ.5 లక్షల ల్యాండ్‌లైన్ బిల్లు రావడంతో దుబారా పెరుగుతోందన్నారు. అనంతరం భూకంప మృతులు, పర్వతారోహుడు మస్తాన్‌బాబు, జింఖానా స్విమ్మింగ్ పూల్‌లో మృతిచెందిన మనీష్‌కు కౌన్సిల్ సంతాపం తెలిపింది. -
మార్కెట్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు
మార్కెట్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో దశలవారీగా ఆన్లైన్ విధానాన్ని తీసుకురానున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ల కాలపరిమితిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గిస్తూ, కొత్తగా 40మార్కెట్ యార్డుల ఏర్పాటుపై శుక్రవారం ఆయన ప్రతిపాదించిన సవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది. వరంగల్ పోలీసు బిల్లుకు ఆమోదం కమిషనరేట్‌కు సంబంధించి వరంగల్ (మహానగర ప్రాంత) పోలీసు బిల్లు, 2015 శాసనమండలి ఆమోదం పొందింది. ఈ కమిషనరేట్‌ను వరంగల్, హన్మకొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఖాజీపేట, వర్ధన్నపేటలను కలిపి ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం కౌన్సిల్లో ఈ బిల్లును ప్రతిపాదిస్తూ చెప్పారు. వ్యాట్ సవరణ బిల్లుకు కూడా.. తెలంగాణ విలువ ఆధారిత పన్ను (సవరణ) బిల్లు, 2015కు శాసనమండలి ఆమోదం తెలిపింది. 2005లో తెచ్చిన ఈ చట్టాన్ని కొంతమేర సవరించి ప్రభుత్వానికి తగిన రాబడి వచ్చేలా మార్పులు ప్రతిపాదించినట్లు బిల్లును ప్రవేశపెడుతూ వాణిజ్యశాఖ మంత్రి తలసాని తెలిపారు. ఖాళీ మద్యం బాటిళ్లను తిరిగి కొనుగోలు చేసే విధానంలో చిల్లర వర్తకుల నుంచి కాకుండా బెవరేజస్, డిస్టిలరీలు నేరుగా పన్ను చెల్లించేలా సవరణలు తెస్తున్నట్లు చెప్పారు. రైతు యూనిట్‌గా పంటల బీమా పథకం పంటల బీమా పథకాల కింద గ్రామాన్ని, మండలాన్ని, జిల్లా యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకోవాలని, రైస్‌మిల్ లెవీని 25 శాతంగా ఇకముందు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రైతులకు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైస్లెవీని 25 శాతంగా ఇకముందు కూడా కొనసాగించాలనే తీర్మానాన్ని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా రైతును ఒక యూనిట్ ప్రాతిపదికన వ్యవసాయ బీమా పథకాన్ని అమలుచేయాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది. తలసాని మంత్రిగా ఎలా ఉంటారు?: షబ్బీర్ తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా కొనసాగుతారని శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులు 65 మంది (ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు కలుపుకొని), టీడీపీ 15 మంది, కాంగ్రెస్ 25మంది సభ్యులున్నట్లు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి విడుదల చేసిన జాబితాను బట్టి స్పష్టమవుతోందన్నారు. టీడీపీ సభ్యుడిగా ఉన్న ఆయన మంత్రిగా ఎలా ఉంటారని షబ్బీర్ అలీ ప్రస్తావించారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఇది అసెంబ్లీ స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఇక్కడ చర్చించలేమన్నారు. స్పీకర్‌పై అదృశ్యశక్తుల ఒత్తిడి: భట్టి శాసనసభ స్పీకర్‌పై అదృశ్యశక్తులు ఒత్తిడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సీఎల్పీ ఉపనాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై, ఆచరణ సాధ్యంకాని హామీలపై ప్రశ్నించాలని ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే రాలేదన్నారు. అధికారపక్షం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని భట్టి విమర్శించారు. ప్రతిపక్షాలపై వివక్ష : ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షను చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువుల మంజూరులో అధికారపార్టీకి చెందిన వారికి ఎక్కువగా కేటాయించారని, ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై వివక్షను చూపించారని ఆరోపించారు. బీసీలకు సముచిత కేటాయింపులు లేవు బీసీలకు బడ్జెట్లో సముచితమైన కేటాయింపులు చేయలేదని, వారికి సరైన పథకాలు పెట్టలేదని కౌన్సిల్లో విపక్షనేత డి.శ్రీనివాస్ విమర్శించారు. బీసీల జనాభాపై స్పష్టత తెచ్చి రాష్ర్టంలో 51శాతం బీసీలున్నారని తేల్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడారు. -
గొప్పలకు పోతే.. అసలుకే ఎసరు
కౌన్సిల్లో బడ్జెట్‌పై చర్చలో కాంగ్రెస్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సర్వజన హితం కోసం అన్నట్లు కాకుండా, కొంతమంది సుఖం కోసం అన్నట్లుగా ఉందని శాసనమండలిలో కాంగ్రెస్ దుయ్యబట్టింది. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న భద్రాద్రి రాముని కోసం గుడి నిర్మించి, ఆభరణాలు కూడా చేయించాడని, ముఖ్యమంత్రి మాత్రం భద్రాద్రి రాముని సంగతే మరిచిపోయారని అన్నారు. యాదగిరిగుట్టకు రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ధనిక రాష్ట్రమని తెలంగాణ ప్రభుత్వం గొప్పలకుపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని సుధాక ర్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.61,711 కోట్ల అప్పులు ఉన్నాయన్న సంగతిని గుర్తు చేశారు. రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు అంతడబ్బు ఎక్కడ్నుంచి తెస్తుందో మాత్రం వివరించలేదన్నారు. సుధాకర్ వర్సెస్ సుధాకర్: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా.. ప్రతిపక్షం తరఫున ప్రసంగిస్తున్న పొంగులేటిని, పాతూరి పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల ఎంతో శ్రమించి బడ్జెట్‌ను రూపొం దిచారని, ఇది జనరంజక బడ్జెట్ అని పాతూరి చెప్పుకొచ్చారు. దీంతో పాతూరి తాను ఎమ్మెల్సీని మాత్రమేనన్న విషయాన్ని మరిచి, తనను తాను ప్రభుత్వ ప్రతి నిధిగా ఫీలవుతున్నారని పొంగులేటి చురక అంటించారు. పాతూరి తీరుపట్ల ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ కూడా తీవ్ర అభ్యంతరం చెప్పడంతో.. ఆయన మిన్నకుండిపోయారు. -
మండలి నోటీసులు బేఖాతరు
హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లోని బీ కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలపై సంజాయిషీ ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి జారీ చేసిన తాఖీదుల్ని ప్రైవేటు కళాశాలలు గాలికొదిలేశాయి. మొత్తం 165 కళాశాలలకు నోటీసులు పంపగా అందులో సమాధానమిచ్చింది 25 కళాశాలలే. కొన్ని పొరపాటును అంగీకరించినా,. మరికొన్ని మాత్రం సక్రమంగానే యాజమాన్య కోటాను భర్తీ చేశామంటూ బుకాయించాయి. ఈ అక్రమాలపై లోతుగా విచారించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చే యాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆయా కళాశాలల తప్పుల స్థాయినిబట్టి యాజమాన్యకోటా భర్తీని తిరస్కరించడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ భర్తీపై విధివిధానాలను నిర్దేశిసూ ఉన్నత విద్యాశాఖ 2012, సెప్టెంబర్ 3న 66, 67 జీఓలతోపాటు 2011 జులై 28న 74 జీఓను విడుదల చేసింది. ప్రైవేటు కళాశాలలు వీటిని పట్టించుకోకుండా కోటా సీట్లను భర్తీ చేశాయి. ఈ సీట్లను 2014 సెప్టెంబర్ 15వ తేదీలోగా భర్తీచేయాలి. సెప్టెంబర్ 30 నాటికి ఆ వివరాలను మండలి వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర వివరాల హార్డ్ కాపీలు, సీడీలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. ఈ విధానాన్ని అనేక కళాశాలలు పట్టించుకోలేదు.మొక్కుబడి ఓ జాబితాను మండలికి పంపించి చేతులు దులుపుకుంటున్నాయి. అయితే నోటీసులు అందుతుండడంతో అడ్మిషన్లకు ఆమోదం తెలపాలంటూ కొన్ని కాలేజీలు మండలికి హార్డ్ కాపీలు, సీడీలను ఇప్పుడు పంపుతున్నాయి. కొన్ని కాలేజీలు రాష్ట్ర విద్యార్ధులకు కాకుండా బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యార్ధులను చేర్చుకున్నాయి. మరికొన్ని కాలేజీలు ఇతర రాష్ట్రాల విద్యార్ధుల ధ్రువపత్రాలను తీసుకొని వారితో సీట్లు భర్తీచేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా వాస్తవానికి వాటిల్లో పిల్లలు లేరనే సమాచారం కూడా మండలికి వచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ కాలేజీలో బీహార్ విద్యార్ధులను చేర్చుకున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి... ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదుచేశారు. ఇలాంటి ఆరోపణలతో ఉన్నత విద్యామండలి పరిశీలన చేపట్టగా 104 ఇంజనీరింగ్, 34 బీ ఫార్మసీ, 27 డీఫార్మసీ కళాశాలలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. నిబంధనల ఉల్లంఘనపై 10 రోజుల్లో సమాధానమివ్వాలని ఫిబ్రవరి 26న మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి నోటీసులు జారీచేశారు. త్వరలోనే ఓ కమిటీని వేసి చర్యలకు ఉపక్రమించ నున్నారు. -
మండలిలో గందరగోళం
హైదరాబాద్: శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు శనివారం చిన్నపాటి గందరగోళం నెలకొంది. తొలుత ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత మండలి ప్రత్యేకంగా సమావేశమై సభ్యునిగా ఉంటూ మరణించిన కాంగ్రెస్ నేత పాలడుగు వెంకటరావు మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎజెండాలో పొందుపరచి మండలి కార్యాలయం సభ్యులకు పంపిణీ చేసింది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న నిబంధనను పలువురు సభ్యులు చైర్మన్ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా చైర్మన్ చాంబర్లో జరిగిన ఇష్టాగోష్టిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా సభ నిర్వహించకూడదన్న అభిప్రాయానికి రావడంతో సంతాప తీర్మానాన్ని సోమవారానికి వాయిదా వేశారు. మళ్లీ సమావేశమై సభ నిర్వహణపై చర్చిద్దామని చైర్మన్ చక్రపాణి వెల్లడించారు. -
కౌన్సిల్లో ఆమె
59 మంది కార్పొరేటర్లలో 29 మంది మహిళలే.. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలి అవకాశం దక్కించుకున్న పుణ్యశీల ఏవారంతా మహిళా కార్పొరేటర్లు. అధ్యక్షా.. అంటూ సభను అదరగొడతారు. మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా సమస్యలపై అనర్గళంగా ప్రసంగిస్తారు. మగమహారాజులకు తీసిపోమని కౌన్సిల్లో నారీభేరి మోగిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. నగరపాలక సంస్థలో మొత్తం 59 డివిజన్లు ఉండగా, 29 మంది మహిళా కార్పొరేటర్లు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులుగా మహిళలే ఉన్నారు. ఇందులో టీడీపీ నుంచి 17 మంది ఎన్నికవగా, వైఎస్సార్ సీపీ నుంచి 11 మంది, సీపీఎం నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా పుణ్యశీల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతిపక్ష నేతగా బండి నాగేంద్ర పుణ్యశీల కొనసాగుతున్నారు. బీఏ పట్టభద్రురాలైన ఈమెకు రాజకీయ అనుభవం లేనప్పటికీ కార్పొరేషన్ రాజకీయాల్లో సమర్థవంతంగా ‘రాణి’స్తున్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పలు సమస్యలపై అధికార పార్టీని ఎండగట్టారు. కౌన్సిల్ రాజకీయాలను అవపోసన పట్టిన టీడీపీ సీనియర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. అరుదైన అవకాశం 1981లో విజయవాడ నగరపాలక సంస్థ ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఓ మహిళ వ్యవహరించడం ఇదే ప్రథమం. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న పుణ్యశీలను మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించగా తన మనోభావాలను ఇలా వెల్లడించారు. ‘రాజకీయాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నా భర్త ప్రోత్సాహంతోనే వచ్చా. అధిష్టానం ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగిస్తోందని కలలో కూడా ఊహించలేదు. నాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషిచేస్తున్నా..’ అన్నారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆదిలక్ష్మి సీపీఎం నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆమె గాదె ఆదిలక్ష్మి. సభలో ఒక్కరే ఉన్నా సమస్యలపై పాలక పక్షాన్ని ఎండగట్టడంతో ఆమె స్టైలే వేరు. ఒంటరిని.. అనే బెరుకు లేకుండా ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీ సభ్యురాళ్లుగా టీడీపీ నుంచి ఎన్నికైన గుర్రం కనకదుర్గ, సుకాశి సరిత వ్యవహరిస్తున్నారు. కో-ఆప్షన్ సభ్యులిగా వ్యవహరిస్తున్న సీహెచ్ ఉషారాణి నిర్మొహమాటంగా మాట్లాడి సభలో తన వాణి వినిపిస్తారు. -
ఐదు మండలి స్థానాలకు 27న ఎన్నిక
హైదరాబాద్ / న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనమండలిలోని ఐదు ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఈనెల 27న ద్వైవార్షిక ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. సభ్యులు రుద్రరాజు పద్మరాజు, సింగం బసవపున్నయ్య, గుండుమల తిప్పేస్వామి, నన్నపనేని రాజకుమారిల పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలతో పాటు, ఏపీ శాసనమండలికి మరో ఎమ్మెల్సీ స్థానాన్ని అదనంగా కేటాయిస్తూ.. మొత్తం ఐదు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. పోలింగ్ అనంతరం ఓట్ల కౌంటింగ్ కూడా ఈ నెల 27న జరగనుంది. శాసనమండలిలోని మొత్తం 90 స్థానాలను రెండు రాష్ట్రాలకు విభజించినప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఏపీకి 17, తెలంగాణకు 14 కేటాయిస్తూ చట్టంలో చేర్చారు. అయితే సభలో ఏపీకి చెందినవారు ఒకరు తక్కువగా 16 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణలో 14 మందికి గాను ఒకరు ఎక్కువగా 15 మంది ఉన్నారు. ప్రస్తుతం నాలుగు స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు రావడంతో ఏపీకి తక్కువగా ఉన్న ఒక స్థానాన్ని కూడా కలిపి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలోనే ఎన్నికైన సీనియర్ నేత పాలడుగు వెంకటరావు జనవరి 19న మరణించారు. ఆయన పదవీకాలం 2017 మార్చి ఆఖరువరకు ఉంది. ఖాళీ అయిన ఈ స్థానం గురించి శాసనమండలి ఎన్నికల సంఘానికి నివేదించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో చేర్చలేదు. రాష్ట్ర ఎన్నికల అధికారులు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సంప్రదింపులు జరిపారు. అయితే ఎలాంటి స్పందన రాలేదు. ఐదు స్థానాలకు ఇప్పటికే షెడ్యూలు వెలువడినందున ఇక పాలడుగు మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇందులో చేర్చడానికి అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. -
దద్దరిల్లిన కౌన్సిల్
సర్వేపై పేలిన మాటల తూటాలు దర్గా భూములపై వెనక్కి తగ్గిన టీడీపీ 238 అంశాలపై చర్చ ఒక్కరోజులోనే పూర్తయిన సమావేశం మున్సిపల్ కమిషనర్ లేకుండానే కొనసాగిన కౌన్సిల్ విజయవాడ సెంట్రల్ : రెవెన్యూ సర్వే, దర్గా భూముల వ్యవహారంపై కౌన్సిల్లో పాలక, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. పురాతన భవనాలు, పింఛన్ల పంపిణీపై వాడీవేడిగా చర్చ సాగింది. యూసీడీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందంటూ అన్ని పార్టీల సభ్యులు మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. సర్వే పేరుతో ప్రజల నెత్తిన భారాలు వేస్తే సహించమంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు ధ్వజమెత్తారు. ‘తాము పన్నులు పెంచడం లేదని, మీరు కలలు కంటే నేనేం చేయలేను..’ అంటూ మేయర్ ఎదురుదాడికి దిగారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సోమవారం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్హాల్లో జరిగింది. ఉదయం 10.35కు సభ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి 4 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ 6.20 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 7 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 8.15కు ముగిసింది. మొత్తం 238 అంశాలపై చర్చించారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈసారి మాత్రమే ఒక్కరోజులో సభ ముగిసింది. కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.వీరపాండ్యన్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లడంతో కౌన్సిల్‌కు హాజరుకాలేకపోయారు. సర్వేపై రసవత్తర చర్చ ఆస్తిపన్నులో తేడాలు, నీటి, డ్రెయినేజీ, ట్రేడ్ లెసైన్స్‌ల ఫీజుల వసూళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కాంప్రహెన్సివ్ రెవెన్యూ సర్వే నిర్వహించాలని అంజెండాలో కమిషనర్ జి.వీరపాండ్యన్ చేసిన ప్రతిపాద నపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య రసవత్తర చర్చ సాగింది. ప్రజలపై పన్ను భారాలు మోపేందుకే సర్వే అస్త్రం ప్రయోగిస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చందన సరేష్, గాదె ఆదిలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వారు సవరణ తీర్మానం ఇచ్చారు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ‘పన్నులు పెంచుతున్నారని మీకు ఎవరు చెప్పారు. పన్నులు ఎగ్గొట్టేవాళ్లకు మీరు(ప్రతిపక్షాలు) కొమ్ము కాస్తున్నారు..’ అంటూ మేయర్ ఆరోపించారు. కమ్యూనిస్టుల పాలనలో 1995లో సర్వే చేసి పన్నులు పెంచలేదా.. అని ప్రశ్నించారు. ఆదాయం వస్తే నగరం ఎక్కడ బాగుపడుతోందోనని ప్రతిపక్షాలు బాధ పడుతున్నాయని విమర్శించారు. మూడు డివిజన్లలో సర్వే నిర్వహిస్తే రూ.74 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.600 కోట్లు టార్గెట్ పెట్టి సర్వే చేస్తామంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చందన సురేష్ అన్నారు. ఓటింగ్ నిర్వహించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన సవరణ తీర్మానం సక్రమంగా లేదని, అందువల్ల ఓటింగ్ అవసరం లేదన్నారు. నగరంలో సమగ్ర సర్వే నిర్వహించే అధికారాన్ని కమిషనర్‌కు అప్పగిస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది. దర్గా భూములపై వెనక్కి తగ్గిన పాలకపక్షం దర్గా భూముల్లో గృహనిర్మాణాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన విషయంలో పాలకపక్షం వెనక్కి తగ్గింది. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ఈ విషయమై అధికార పార్టీని గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్ద విచారణ పెండింగ్‌లో ఉండగా, గృహ నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దర్గా భూముల్లో అనుమతులు నిలుపుదల చేసే అధికారం కౌన్సిల్‌కు లేదంటూ వింతవాదన వినిపించారు. అదే పార్టీ సభ్యుడు జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దంటూ కౌంటర్ వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు అనుమతులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని మేయర్ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. దర్గా భూముల వ్యవహరంలో ఆచితూచి వ్యవహరించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే పాలకపక్షం వెనకడుగు వేసిందని సమాచారం. -
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ తీరుపై చర్చించాలని శాసనమండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది. అయితే ఆ అంశం తన పరిశీలనలో ఉందని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. -
'ఆంధ్రజ్యోతి పేపర్ మమ్మల్ని కించపరిచింది'
హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్ ఆరోపించారు. అమరులకు అన్యాయం చేస్తూ తమ జీతాలు పెంచారంటా తప్పుడు వార్త ప్రచురించిందని వారు శనివారమిక్కడ అన్నారు. ఎమ్మెల్సీలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కాగా తనకు నోటీసు అందిన తర్వాత పరిశీస్తానని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. -
మండలిలో నాగేశ్వర్.. జగదీష్ రెడ్డి వాగ్వాదం
హైదరాబాద్ : శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణపై ప్రశోత్తరాల్లో ఎమ్మెల్సీ నాగేశ్వర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సంవాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని...కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. తాము దర్పాన్ని ప్రదర్శించటానికి సభలకు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ కంటే శాసనమండలిలోనే సరైన చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. మీడియాలో మండలికి సరైన కవరేజ్ రావటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతలను ప్రజల ముందు పెట్టామని కేటీఆర్ తెలిపారు. -
శాసనమండలి రేసులో ప్రముఖులు
*జనవరిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక *స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అప్పుడే! *ప్రయత్నాల్లో రాజకీయ పార్టీల నేతలు *టీఆర్ఎస్లో ఆశావహులు అధికం * బీజేపీలో 'కపిలవాయి' తంటా సాక్షి ప్రతినిధి, వరంగల్ : శాసన మండలి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రాడ్యుయేట్స్ ప్రస్తుత ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పదవీకాలం 2015 మార్చి తో ముగియనుంది. జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పోటీ కోసం సన్నద్ధమవుతున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని నేతలు ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టిసారిం చారు. మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార టీఆర్ఎస్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండనుంది. శాసనసభ మళ్లీ ఏర్పాటైనప్పటి నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో టీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా దిలీప్‌కుమార్ గెలుపొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ కావడంతో మూడు జిల్లాల్లోని టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆశావహులు వీరే..! వరంగల్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు టి.రవీందర్రావు, నాయకడు నాగుర్ల వెంకటేశ్వర్లు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ గ్రాడ్యుయే ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదవరెడ్డి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చిన వారికి మళ్లీ అవకాశం ఉండే పరిస్థితి లేదని టీఆర్ఎస్ వర్గాల అంచనా. ఈ నిబంధన లేకుం టే.. పరకాలలో పోటీ చేసి ఓడిపోయి న ముద్దసాని సహోదర్‌రెడ్డి ప్రయత్నించే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పెద్దగా ప్రభావం చూపిన సందర్భాలు లేవు. నల్లగొండ, ఖమ్మం జిల్లా లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పోటీ చేసే అవకాశముందని హస్తం నేతలు చెబుతున్నారు. జిల్లా కు చెందిన కాంగ్రెస్ నేత బండా ప్రకాశ్ పేరు వినిపిస్తోంది. బీజేపీ తరఫున ఎడ్ల అశోక్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రయత్ని స్తే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు అన్యా యం జరుగుతుందని కమలనాథులు వాపోతున్నారు. వామపక్ష పార్టీలు బరిలో దిగితే పొరుగున ఉన్న ఖమ్మం, నల్లగొండ నేతలకే అభ్యర్థిత్వం దక్కనుంది. 'గ్రాడ్యుయేట్'తోపాటే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక! స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి ఎన్నిక కూడా జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సం స్థల ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. శాసనమండలి ఆరంభమైన మొదట్లో జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గండ్ర వెంకటరమణారెడ్డి గెలి చారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లు జిల్లాలో 929 మంది ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లు మినహాయిస్తే.. మిగిలిన 871 స్థానాలకు ప్రస్తుతం ప్రతినిధులు ఉన్నారు. బల్దియాను గ్రేటర్ వరంగల్‌గా మార్చే అంశం ప్రభుత్వ పెండింగ్‌లో ఉంది. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలు ఎప్పు డు నిర్వహిస్తారనే అంశంలో స్పష్టత రావడంలేదు. ప్రస్తు తం 53 డివిజన్లుగా ఉన్న కార్పొరేషన్ పరిధిని పునర్విభజనతో 58 డివిజన్లకు విస్తరిస్తూ మున్సిపల్ శాఖకు వరంగల్ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇంకా ఆమోదం రాలేదు. ఇక రెండు నెలలు సందడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో 70 శాతం మంది ఉంటే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేకుంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకేసారి జరిగితే పోటీ చేసే నాయకులు పెరుగుతారు. టీఆర్ఎస్కు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవకాశం దక్కని నేతలు స్థానిక సంస్థల కోటా కోసం ప్రయత్నించనున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేసిన టీఆర్ఎస్ నేత కొండా మురళీధర్‌రావు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సీనియర్ నేత జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు బరిలో ఉండే అవకాశం తక్కువగానే ఉంది. రెండు ఎమ్మెల్సీల ఎన్నికలు కలిసి నిర్వహిస్తే రెండు నెలలపాటు రాజకీయ సందడి నెలకొంటుంది. -
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే అదే సమయంలో శాసనమండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. ఈనెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నం కావడంతో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ముందుగానే వివిధ శాఖాధిపతులతో విస్తృతంగా చర్చించి, ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడికి సమాయత్నం అవుతున్నాయి. -
జూపూడి, చెంగల మధ్య ముగిసిన వివాదం
హైదరాబాద్ : ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, జూపూడి ప్రభాకరరావుల మధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశంపై శాసనమండలిలో మాట్లాడుతున్న తనను చెంగల్రాయుడు దూషించి అవమానపరిచారంటూ శుక్రవారం ఉదయం జూపూడి ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో తన వ్యాఖ్యలు జూపూడికి బాధకలిగించి ఉంటే ఉపసంహరించుకుంటున్నట్లు చెంగల్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చెంగల్రాయుడు వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లలేదన్నారు. మరోవైపు చెంగల్రాయుడిపై జూపూడి సభా హక్కుల నోటీసు ఇచ్చారు. -
యనమల వర్సెస్ సి.రామచంద్రయ్య
-
యనమల వర్సెస్ సి.రామచంద్రయ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై శాసనమండలిలో రగడ జరిగింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, కౌన్సిల్ ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మధ్య మంగళవారం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటుందని, సభలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని యనమల కౌన్సిల్లో అన్నారు. దీనిపై సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాజధాని అంశంపై కౌన్సిల్లో చర్చిద్దామని ప్రభుత్వం మాటిచ్చిందని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాగానే చర్చ చేపడదామని మంత్రి నారాయణ...కౌన్సిల్ ఛైర్మన్‌కు మాటిచ్చారని గుర్తు చేశారు. కౌన్సిల్‌కు విలువే లేదా అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఈ అంశాన్ని రాద్దాంతం చేయటమేమిటని యనమల వ్యాఖ్యానించారు. దీంతో రామచంద్రయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు చర్చ జరపమంటే రాద్దాంతం అనడమేంటని మండిపడ్డారు. -
రాజధాని విషయంలో వృధా ఖర్చులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం వృథా ఖర్చులకు పోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని అడిగారు. రైతుల రుణమాఫీ ఏమైందని ఆదిరెడ్డి అప్పారావు సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదని ఆయన అన్నారు. వ్యవసాయ బడ్జెట్‌కు గవర్నర్ అనుమతి ఉందా, లేదా అని ప్రశ్నించారు. -
'ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టడమే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ 2014 బడ్జెట్‌పై శుక్రవారం శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగలరాయుడు మాట్లాడుతూ బడ్జెట్ గందరగోళంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చట్టంలో లేని బెల్ట్ షాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేస్తామనటం ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమేనన్నారు. చిత్త శుద్ధి ఉంటే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ మాదిరే మద్యం షాపులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ చర్చ అనంతరం కౌన్సిల్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. -
ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?
హైదరాబాద్ : రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని.. అన్నదాతల ఆత్మహత్యలు మొదలయాయ్యని ఆయన శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించారు. తాను ప్రభుత్వంపై నిందలు వేయడానికి చెప్పడం లేదని.. వాస్తవ పరిస్థితి సభ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. దేవుడి కంటే రైతే ఎక్కువ అన్న వ్యవసాయ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలను రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఎద్దు వెనుక కాదు.. శవాల వెనుక ఈ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. -
బెజవాడ కౌన్సిల్ సమావేశం గోలగోల
-
చప్రాసిగా ఉన్న నన్ను చైర్మన్‌ను చేసింది..
-
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
-
'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'
-
'గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అడుగుతా'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని శాసనమండలి కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి ఫరూక్ హుస్సేన్ అన్నారు. పార్టీ ఎమ్మెల్సీలంతా పార్టీకి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కాంగ్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఫరూక్ హుస్సేన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మచ్చలేని మైనార్టీ నేత అని, చైర్మన్‌గా తన విజయానికి కృషి చేయాలని అన్ని పార్టీల ఎమ్మెల్సీల ఇళ్లకు వెళ్లి స్వయంగా విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశామన్నారు. అదే అనుబంధంతో కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు చెప్పారు. కాగా టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చైర్మన్ పదవి మాదే!
-
నేటి నుంచి పిజీమెడికల్ కౌన్సిలింగ్
-
సీఎం కేసీఆర్‌కు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధించి సీఎం అయిన కేసీఆర్‌కు మండలి సభ్యులు అభినందనలు తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం సభ్యులు మాట్లాడారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగంపై విపక్షాల సందేహాలకు సమాధానం ఇచ్చారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ సహా పలువురు సభ్యులు గవర్నర్ ప్రసంగంలో తప్పొప్పులను విమర్శిస్తూనే కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. తాను ఒక్కడినే తెలంగాణ సాధించలేదనీ ఇందులో తెలంగాణ యావత్తూ పాలుపంచుకుందని కేసీఆర్ అన్నారు. కాగా, తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా డి.శ్రీనివాస్, ఉప నాయకుడిగా షబ్బీర్ అలీని గుర్తిస్తూ మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు సభలో ప్రకటన చేశారు. -
టీఆర్ఎస్ మేనిఫెస్టోపై మండలిలో వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పంట రుణాలు అంటూ మాట మారుస్తున్నారని శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుడు అరికెల నర్సారెడ్డి తప్పు పట్టారు. శుక్రవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో నర్సారెడ్డి మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ అనలేదంటే తాను ఉరేసుకుంటానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యుడు పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పని అంశాలను సభ్యులు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. డి.శ్రీనివాస్, రిజ్వీ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల మధ్య బాధ్యతల స్వీకారం
{పాంతీయ వివాదం సుడిలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలి చైర్మన్, సభ్యులను అడ్డుకున్న తెలంగాణ నాయకులు హైదరాబాద్, న్యూస్‌లైన్: మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలి నియామకం ప్రాంతీయ వివాదానికి దారి తీసింది. బుధవారం మండలి చైర్మన్, సభ్యులు బాధ్యతల స్వీకరణ కోసం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కార్పొరేషన్ కార్యాలయానికి రాగా, వారిని తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో కార్పొరేషన్ ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. తదనంతరం కార్యాలయంలో మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ఏ షుకూర్ చేతుల మీదుగా చైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం బాధ్యతల స్వీకార కార్యక్రమంలోనూ వివాదం చెలరేగడంతో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అనంతరం బుధవారం న్యాయ సలహా తీసుకున్నాక నియామకానికి పచ్చజెండా ఊపారు. పాలకమండలి ఇదే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్: మహ్మద్ హిదాయత్ అలీ (గుంటూరు). సభ్యులు: సయ్యద్ హమీద్ హుస్సేన్ జాఫ్రీ (హైదరాబాద్), మహ్మద్ గులాం గౌస్ (మహబూబ్‌నగర్), షేక్ నజీర్ అహ్మద్ (కడప), మహ్మద్ వహీద్ ఖాన్ (సిద్దిపేట్), షేక్ అన్వర్ బాష (గుంటూరు), మహ్మద్ జమీర్ ఖాన్ (చిత్తూరు), రియాజ్ (అనంతపురం), షేక్ ఫజ్లే ఇలాహి (రాయచోటి), పఠాన్ ఆశ్వాక్ రహీం ఖాన్ (కర్నూల్), షేక్ ముక్తార్ (విజయవాడ), నాగూర్ మహ్మద్ ముస్తాఫా (చిత్తూరు)లతో పాటు ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్లు సభ్యులుగా ఉన్నారు. -
అత్తారింటికి దారేది అంటున్న పెద్దల సభ
-
కౌన్సిల్లో శైలజానాథ్ Vs డిస్
-
కలిసుండాలో, వద్దో సభలే తేల్చాలి
విభజనను అడ్డుకుంటానన్న వ్యాఖ్యకు కట్టుబడ్డా: సీఎం కిరణ్ స్పష్టీకరణ సమైక్యానికి టీ నేతలను ఒప్పించే బాధ్యత సీమాంధ్రులదే సవరణ పేరుతో విభజన బిల్లుపై ఓటింగ్ కోరవచ్చు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కలసి ఉండాలా, వద్దా అనే విషయాన్ని శాసనసభ, శాసనమండలి మాత్రమే తేల్చాల ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విభజన వద్దంటూ తెలంగాణ నేతలను ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న సీమాంధ్రులపైనే ఉందన్నారు. విభజన తుపానును అడ్డుకుంటానంటూ గతం లో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో విపక్ష నేతల సర్టిఫికెట్లు తనకు అక్కర్లేదన్నారు. అసెంబ్లీ జనవరి 3కు వాయిదా పడ్డాక గురువారం కిరణ్ అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... చర్చపై డిప్యూటీ స్పీకరే చెప్పాలి ‘‘విభజన బిల్లు పత్రాలను ప్రస్తుతం సభలో టేబుల్ చేశారు. ప్రొసీజర్స్ సిద్ధం చేశాక చర్చ మొదలవుతుంది. అసలు ప్రొసీజర్సే సిద్ధం కాన ప్పుడు చర్చ ప్రారంభమైందని ఎలా అంటారు? ఆ రోజు సభను నడిపించిన డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రే దీనికి సమాధానం చెప్పాలి. ఓటింగ్ ఉండదని ఎవరు చెప్పారు? బిల్లుపై ఓటింగుండదని ఎవరు చెప్పారు? అసలు అభిప్రాయాలంటే ఏమిటనుకుంటున్నారు? 10 మంది ఒక అభిప్రాయం చెబితే 284 మంది మరో అభిప్రాయం చెప్పారనుకోండి. వాటిని ఏ రూపంలో చెబుతారు? ఓటింగ్ రూపంలోనే కదా! విభజన బిల్లు సహా మరే ఇతర బిల్లుపై అయినా సవరణల పేర ఓటింగ్ కోరవచ్చు. విభజన బిల్లు అందు కు అతీతం కాదు. ఈ విషయంలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు మన ముందున్నాయి. 3 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలే రాష్ట్రపతి బిల్లును ప్రవేశపెట్టి, సవరణలు ప్రతిపాదించి ఓటింగ్ కూడా నిర్వహించాయి. బీహార్‌లోనైతే 1998లో రాష్ట్రపతి బిల్లును తిరస్కరించారు. బిల్లుపై కేంద్రానికి లేఖ రాస్తున్నా రాష్ర్టపతి పంపిన విభజన బిల్లు సమగ్రంగా లేదు. చాలా అంశాల్లో స్పష్టత కొరవడింది. ప్రతిపక్షాలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరముంది. అందుకే సాధ్యమైన తొందర్లో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తాం. అయినా దీనిపై జనవరి 3 దాకా సమయమున్నందున తొందర పడాల్సిన అవసరం లేదు. విభజన బిల్లును అడ్డుకునేందుకే నేనిలా వ్యవహరిస్తున్నాననడం సరికాదు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచాలని కోరే ఆలోచన కూడా బాగుంది. ఒప్పించే బాధ్యత సీమాంధ్ర నేతలదే తెలంగాణ వాళ్లు ప్రత్యేక రాష్ర్టం కావాలంటున్నారు. సమైక్యం కోరుకుంటున్న సీమాంధ్ర నేతలు వాళ్లను నొప్పించకుండా మాట్లాడాలి. ఫలానా కారణాల వల్ల రాష్ట్రం సమైక్యంగా కొనసాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ తెలంగాణ వారిని ఒప్పించాలే తప్ప వారి మనసులను గాయపర్చేలా వ్యవహరించొద్దు. నేను మారను: తుపానును ఆపలేకపోయినా విభజనను ఆపుతాననే మాటకు ఈ రోజుకూ కట్టబడి ఉన్నాను. ఈ విషయంలో చివరి వరకు పోరాటాన్ని ఆపను. నేను ఫైటర్‌ను. నా ఆరోగ్యం బాగోలేక, లేవలేని పరిస్థితుల్లో ఉన్నందున ఆ రోజు సభకు రాలేకపోయాను. ఈ విషయంలో నా సిన్సియారిటీని విభజనపై అనుకూల లేఖలిచ్చిన వాళ్లు ప్రశ్నించనక్కర్లేదు. విభజన ఆగుతుందా, లేదా అనేది మరికొద్ది నెలల్లో మీరే చూస్తారు కదా! విభజన వల్ల నష్టం జరుగుతుందనే విషయంలో ఇప్పటికి నేను 25 శాతం మాత్రమే చెప్పాను. మిగతాదంతా రేపు అసెంబ్లీలో చెబుతా. అసలు ఈ రాష్ట్రం కలిసుండాలా, వద్దా అనేది మండలి, అసెంబ్లీలే తేల్చాలి. మిగులు జలాలపై వైఎస్ లేఖ రాయలేదు మిగులు జలాలపై హక్కు కోరబోమంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి లేఖ రాశారంటూ తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే వాటికి సంబంధించి వైఎస్ అసలు లేఖ రాయనే లేదు. సంబంధిత శాఖాధికారులు మాత్రమే ఆనాడు లేఖ రాశారు. అంతెందుకు.. 1997లో కూడా అప్పటి ప్రభుత్వం అదే విధంగా లేఖ రాసింది. అందులో కొన్ని పదాలు వేరైనా సారాంశం మాత్రం ఒక్కటే. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగబోతున్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరేందుకే శుక్రవారం ప్రధానిని కలవబోతున్నాం. మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలనడంపై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం’’. -
విభజన బిల్లుపై సభలో పెదవి విప్పిన సీఎం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజన బిల్లుపై తొలిసారిగా చట్టసభలో మాట్లాడారు. గురువారం ఆయన శాసనమండలి సమావేశంలో బిల్లుపై పెదవి విప్పారు. విభజన సున్నితమైన సమస్య అని, ఎవరినీ నొప్పించకుండా చర్చ జరగాలన్నారు. సున్నితమైన సమస్యపై చర్చలో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావని అన్నారు. వేరేచోట్ల విభజన ఎలా చేశారన్నది కూడా అందరూ అధ్యయనం చేయచాలన్నారు. అవసరం అయితే మళ్లీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ ఎలా జరగాలన్నది సభాపతులు స్పష్టం చేయలేదని సీఎం మండలిలో అన్నారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని, చర్చపై సభ్యులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ అర్థం అయ్యేందుకే అన్ని విషయాలు చెబుతున్నానని సీఎం అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంప్రదాయాలను పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులపై ఎలా చర్చించాలో తెలుసుకోవాలన్నారు. ముందుగా విధానం చెప్పి అనంతరం చర్చ ప్రారంభించాలన్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. సీఎం అప్పీల్లో స్పష్టత లేదని, సున్నితమైన అంశంపై చర్చ ఎప్పుడు, ఎంత సమయం జరుగుతుందో స్పష్టం ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు