ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై శాసనమండలిలో రగడ జరిగింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, కౌన్సిల్ ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మధ్య మంగళవారం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటుందని, సభలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని యనమల కౌన్సిల్లో అన్నారు. దీనిపై సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాజధాని అంశంపై కౌన్సిల్లో చర్చిద్దామని ప్రభుత్వం మాటిచ్చిందని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాగానే చర్చ చేపడదామని మంత్రి నారాయణ...కౌన్సిల్ ఛైర్మన్కు మాటిచ్చారని గుర్తు చేశారు. కౌన్సిల్కు విలువే లేదా అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఈ అంశాన్ని రాద్దాంతం చేయటమేమిటని యనమల వ్యాఖ్యానించారు. దీంతో రామచంద్రయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు చర్చ జరపమంటే రాద్దాంతం అనడమేంటని మండిపడ్డారు.
Published Tue, Sep 2 2014 11:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement